Lalu
-
లాలూ కోసం తేజ్ ప్రతాప్ భాగవత కథా గానం
పట్నా: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తరచూ ఏదో ఒకవిషయమై వార్తల్లో కనిపిస్తుంటారు. ఒక్కోసారి ఆయన తన భక్తిప్రపత్తులను ఘనంగా ప్రకటిస్తుంటారు. తాజాగా తేజ్ ప్రతాప్ తన తండ్రి కోసం భాగవత కథా గానాన్ని ఆలపించారు. తేజ్ ప్రతాప్ ఇంటిలోనే ఈ కార్యక్రమం జరిగింది. తన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరి శ్రేయస్సును కోరుతూ తాను భాగవత కథా గానాన్ని చేశానని ఆయన తెలిపారు.తాను ఈ కథాగానాన్ని నాలుగోసారి నిర్వహిస్తున్నానని, ఈ కార్యక్రమానికి సీఎం నితీష్‌ని కూడా ఆహ్వానించానన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం తేజ్ ప్రతాప్ యాదవ్ శివలింగానికి జలాభిషేకం చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. జలాభిషేక సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్ శివలింగానికి అతుక్కుని కూర్చున్నట్లు కనిపించారు. దీనికి ముందు తేజ్ ప్రతాప్ కృష్ణుడు, శివుడు గెటప్‌లలో కనిపించారు. #WATCH | Patna, Bihar: RJD chief Lalu Prasad Yadav participated in Shrimad Bhagwat Katha at the residence of RJD leader Tej Pratap Yadav (04.09) pic.twitter.com/7lfaGPjmTz— ANI (@ANI) September 5, 2024 -
నితీశ్, లాలూ పీడ వదిలించడమే ఎజెండా: ప్రశాంత్‌కిశోర్
పట్నా: తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీ ప్రాథమిక ఎజెండాను రాజకీయ వ్యూవహకర్త ప్రశాంత్‌కిశోర్ ఆదివారం(ఆగస్టు4) ప్రకటించారు. బిహార్ నుంచి యువత వలసలు ఆపడానికి, బిహార్‌ను నితీశ్, లాలూల నుంచి విముక్తి చేయడమే తన పార్టీ ప్రధాన ఎజెండా అని చెప్పారు. అక్టోబర్ 2న కోటి మంది బిహారీలు సమావేశమై తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకుంటారన్నారు.‘అక్టోబర్ 2న ప్రశాంత్‌కిశోర్ పార్టీ ప్రారంభించడం లేదు. బిహార్ ప్రజలు కొత్త పార్టీ ప్రారంభించుకుంటున్నారు. నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్‌లను వదిలించుకుని తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు. గతంలో నేను రాజకీయ పార్టీల గెలుపు కోసం పనిచేశాను. ఇప్పుడు మాత్రం బిహార్ ప్రజలకు వ్యూహకర్తగా పనిచేయబోతున్నాను’అని చెప్పారు. కాగా,ప్రశాంత్‌కిశోర్ జన్‌సురాజ్ పేరుతో బిహార్‌లో పాదయాత్ర చేశారు. జనసురాజ్‌ను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా ప్రకటించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్ పోటీ చేయనుంది. -
లాలూకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గత రాత్రి(మంగళవారం) ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగానే ఉంది. దీంతో వైద్యులు ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.లాలూ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడి వైద్యుల ఆయనకు చికిత్స అందించారు. తరువాత అతని ఆరోగ్యం పరిస్థితి కుదుటపడింది. లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు రాత్రంతా ఆసుపత్రిలో ఉన్నారని సమాచారం.లాలూ ప్రసాద్ యాదవ్‌కు బీపీ పెరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు రాకేష్ యాదవ్ తెలిపారు. 2022లో లాలూకు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆయన చాలా కాలంగా మధుమేహం, అధిక రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత లాలూ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్‌గా మారి, ఎన్నికల సమయంలో వేదికపై నుంచి ప్రసంగాలు కూడా చేశారు. -
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో పోరు ఆసక్తికరంగా మారింది. బీహార్‌లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి మధ్య పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు మీసా భారతి, రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు. దీంతో వీరి గురించిన చర్చలు సోషల్ మీడియాలో విరివిగా సాగుతున్నాయి. వీరికి ఈ పేర్లను లాలూ యాదవ్ ఎందుకు పెట్టారని పలువురు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు.అది.. 1976.. దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నాటి ప్రభుత్వం పలువురు నేతలను జైల్లో పెట్టింది. వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన నేతలను, కార్యకర్తలను జైలులో పెట్టే చట్టాన్ని అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) అని పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య రబ్రీదేవి కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో తానున్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ లాలూ తన తొలి కుమార్తెకు ‘మీసా భారతి’ అని పేరు పెట్టారు.ఇక రోహణి ఆచార్యకు ఆ పేరు ఎలా వచ్చిందన్న విషయానికొస్తే.. లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి 1979లో మరోసారి తల్లి అయ్యారు. ఆమెకు డెలివరీకి ముందు తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ గురించి తెలియగానే అప్పట్లో లాలూ యాదవ్ భయపడ్డారట. పట్నాకు చెందిన నాటి ప్రముఖ మహిళా వైద్యురాలు కమలా ఆచార్య.. లాలూ భార్య రబ్రీ దేవికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు.అయితే ఆమె ఆపరేషన్‌కు అయిన ఖర్చును లాలూ నుంచి తీసుకునేందుకు నిరాకరించాట. లాలూ యాదవ్‌కు రెండో కుమార్తె పుట్టిన సమయంలో రోహిణి నక్షత్రం ఉందట. దీంతో లాలూ తన కుమార్తెకు రోహిణి ఆచార్య అని పేరు పెట్టారు. అంటే కుమార్తె పేరుకు వైద్యురాలి పేరును జత చేశారన్నమాట. ప్రస్తుతం మిసా భారతి పాటలీపుత్ర నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. రోహిణి ఆచార్య బీహార్‌లోని సారణ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్‌పై పోటీ చేస్తున్నారు. -
సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ ముగిసింది. ఇంతలో బీహార్ రాజకీయాల్లో మరో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. లాలూ యాదవ్‌ను ఒకసారి ఓడించిన జేడీయూ అధినేత ఇప్పుడు ఆర్జేడీలో చేరబోతున్నారని సమాచారం. ఇది సీఎం నితీష్ కుమార్‌కు పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రబ్రీ దేవి నివాసంలో లాలూ సమక్షంలో రంజన్ ఆర్జేడీలో చేరనున్నారని తెలుస్తోంది.లాలూ యాదవ్‌కు రంజన్ యాదవ్ అత్యంత సన్నిహితుడు. ఒకానొక సమయంలో రంజన్ యాదవ్ కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో లాలూకు అండగా ఉన్నారు. రంజన్ యాదవ్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. జనతాదళ్ అతనికి ఈ అవకాశాన్ని కల్పించింది. రంజన్ 1990 నుంచి 1996 వరకు ఆర్జేడీలో ఉన్నారు. ఆ తర్వాత ఆర్జేడీని వీడి జేడీయూలో చేరారు.2009లో పాటలీపుత్ర పార్లమెంటరీ స్థానం నుండి లాలూ యాదవ్‌పై పోటీకి జేడీయూ రంజన్‌ను నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో రంజన్ యాదవ్ లాలూను ఓడించారు. తరువాత రంజన్ బీజేపీలో చేరారు. దీనికి ముందు ఆయన రాష్ట్రీయ జనతాదళ్ (నేషనలిస్ట్) పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. ఇప్పుడు రంజన్ యాదవ్ మరోసారి బీహార్ రాజకీయాల్లో పునరాగమనం చేయనున్నారు. రంజన్ యాదవ్ రాకతో లాలూ పార్టీకి మరింత సత్తా వస్తుందని పలువురు భావిస్తున్నారు. -
నితీష్‌కు వ్యతిరేకంగా తేజస్వి ఇంటిలో ఏం జరుగుతోంది?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్యెల్యేలంతా ఆ పార్టీ నేత తేజస్వి నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. వారంతా తమకు కావాల్సిన దుప్పట్లు, మందులను శనివారం సాయంత్రమే తెప్పించుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం తేజస్వి నివాసం బయట సందడి నెలకొంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తేజస్వీ యాదవ్ స్వయంగా సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వి నివాసంలోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అంటే సోమవారం అసెంబ్లీలో జరిగే నితీష్ బలపరీక్షకు వీరంతా నేరుగా హాజరుకానున్నారు. తేజస్వి నివాసంతో 76 మంది ఎమ్మెల్యేలున్నారని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదని సమాచారం. #WATCH | Bihar: RJD MLAs and MLAs of Mahagathbandhan at the residence of former Deputy CM and RJD leader Tejashwi Yadav in Patna ahead of the Floor Test scheduled to take place tomorrow. pic.twitter.com/5FXnvGH8Gp — ANI (@ANI) February 11, 2024 -
లోక్‌సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె?
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో ఉత్సాహం కూడా పెరుగుతోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇంతలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కు చెందిన ఒక ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ రెండవ కుమార్తె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రోహిణి ఇటీవల తన అత్తా మామల ఇంటికి బీహార్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కారాకాట్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఆమె ఎంపీగా ఎన్నికైతే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వారంటున్నారు. తొలుత ఆమె ఈ వినతిని తిరస్కరించినా తాను తల్లిదండ్రులు మాటకు కట్టుబడి ఉంటానని మీడియాకు తెలియజేశారు. కారాకాట్ ప్రజలు తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకంటే తనకు అభ్యంతరం చెప్పలేనని అమె అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ సంతానమైన తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, మిసా భారతి ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రోహిణి ఆచార్య.. సోషల్ మీడియాలో బీహార్ రాజకీయాలు, ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. రోహిణి తన కిడ్నీలో ఒకదానిని తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు దానం చేయడంతో అందరి దృష్టిలో పడ్డారు. ఆమె ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే ఇంజనీర్ సమేష్‌ని వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె భర్త, కుటుంబంతో కలిసి సింగపూర్‌లో ఉంటున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీని కబళించిన చలి పులి.. పొగమంచుతో తగ్గిన విజిబులిటీ! -
లాలుకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తయిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూకి తరలించినట్లు బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేశారు. శస్త్ర చికిత్స తర్వాత ఆమె సైతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు తేజస్వీ యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి సమయంలో ఆయన సన్నిహితుడు భోలా యాదవ్, కుమారుడు తేజస్వీ యాదవ్, రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, పెద్ద కుమార్తే మిసా భారతిలు సింగపూర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. 74 ఏళ్ల లాలూ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైద్యం కోసం తన కూతురితో కలిసి సింగపూర్ వెళ్లారు. ఈ క్రమంలో తన తండ్రికి కిడ్నీ ఇచ్చి కొత్త జీవితాన్ని ఇవ్వాలి ఆయన కుమార్తె రోహిణి నిర్ణయం తీసుకున్నారు. पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया। डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2 — Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022 ఇదీ చదవండి: ‘పాక్ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోండి’: కాంగ్రెస్ -
‘నితీష్ కోటా వ్యతిరేకి’
సాక్షి,పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ అన్నారు. దళిత కోటాపై పాలక జేడీ(యూ) నేతలు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా లాలూ సమర్ధించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి, మాజీ మంత్రి శ్యామ్ రజక్‌లు రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టారు. ప్రమోషన్లలో కోటాను రద్దు చేశారని, ఎస్సీ,ఎస్ట్ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వీరు ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం కొరవడిందని విమర్శించారు. జేడీ(యూ) నేతల అభిప్రాయంతో లాలూ ప్రసాద్ ఏకీభవించారు. ఉదయ్, శ్యామ్ రజక్‌లు చెప్పింది నూరు శాతం నిజమని లాలూ సమర్ధించారు. దళితుల కోటాపై భిన్న పార్శ్వాల నుంచి దాడి జరుగుతోందని, దీనిపై జేడీ(యూ) చీఫ్ మౌనంగా ఉండటం తనను ఆశ్చర్యానికి లోను చేసిందని లాలూ అన్నారు. నితీష్ ఎప్పుడూ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారని తనకు తెలుసునన్నారు. మధ్యనిషేధం లోపభూయిష్టంగా మారిందని లాలూ ధ్వజమెత్తారు. కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో డోర్ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు. -
లాలూపై ఈడీ కేసు నమోదు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ, అతని కుటుంబ సభ్యుల మీద ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నగదు అక్రమ చలామణి కేసును నమోదు చేసింది. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ రైల్వే హోటళ్ల కేటాయింపుల్లో అవకతవకల కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. కేసులో వారిని నిందితులుగా చేర్చింది. జూలై 5న లాలూ, అతని కుటుంబ సభ్యులపై సీబీఐ క్రిమినల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి ఇళ్లలపై పలు సోదాలు చేసింది. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్ రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల మెయింటెనెన్స్‌ను లంచం తీసుకుని ఒక కంపెనీకి అప్పగించినట్లు ఎఫ్ఐఆర్లో సీబీఐ నమోదుచేసింది. -
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై విచారణ జరపాలి: లాలు
పట్నా: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ ఆదివారం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో బంధవ్గర్, అతర్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది చాల ముఖ్యమైన విషయమని, ఈవీఎంల ట్యాంపరింగ్‌లపై వెంటనే విచారణ చెపట్టాలన్నారు. ఈవీఎంల పేపర్ ఆడిట్ ట్రయల్‌ను ఆయన తప్పుబట్టారు. గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసిన బీజేపీకి వెళ్లినట్లు ప్రింట్లు వచ్చాయని, ఇతర పార్టీలకు పడ్డ ఓట్ల ప్రింట్లు ఎందుకు చూపించలేదని ప్రశ్నించాడు. బీజేపీ ప్రభుత్వం గోవధ నిషేద చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడ అమలు చేయాలని లాలూఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
లాలూకి కొడుకుల బెడద ఉందా?
తండ్రి ములాయంకు చెక్ పెడుతూ కొడుకు అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తున్న వైఖరి ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌కు 'సన్' స్ట్రోక్ కు సంకేతాలుగా మారుతున్నాయట. ఆయన కొడుకులు కూడా ఇదే మాదిరి రాజకీయ సంక్షోభం లేవనెత్తుతారేమోనని లాలూ ఆందోళన చెందాల్సినవసరం ఉందని బీజేపి సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు తేజస్వి ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు. సమాజ్‌వాద్ పార్టీలో నెలకొన్న వివాదంతో లాలూకు కూడా కొడుకుల బెడద ఉందని తనకు అనిపిస్తున్నట్టు సుశీల్ కుమార్ మోదీ తన నివాసంలో నిర్వహించిన జనతా దర్బార్‌లో వ్యక్తంచేశారు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో సమాజ్‌వాద్ పార్టీలో ముదురుతున్న రాజకీయ సంక్షోభంపై లాలూ ఇప్పటికే మధ్యవర్తిత్వంగా బంధువుడి హోదాలో ములాయం సింగ్‌కు, అఖిలేష్‌కు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. సఖ్యతగా ఉండకపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందే అవకాశముందని లాలూ హెచ్చరించారు. కానీ ఆయనకు కూడా మంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు కొడుకులతో ముప్పు పొంచి ఉందని బీజేపీ సీనియర్ నేత అన్నారు. అఖిలేష్ వ్యవహరించిన తీరే దీనికి సంకేతమన్నారు. పార్టీ నాయకత్వం తీసుకోవడానికి ఆర్జేడీ సుప్రీం కొడుకులు కూడా తండ్రి ఛాయల నుంచి బయటికి రావాల్సి ఉందని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. -
కందిచేనులో గంజాయి సాగు
మెదక్: జహీరాబాద్ మండలంలోని సజ్జారావుపేట తండాలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి పంటను అధికారులు దహనం చేశారు. తండాకు చెందిన ఓ రైతు కందిచేను మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో హూటా హుటిని అక్కడికి చేరుకున్న అధికారులు కంది చేనులో ఉన్న గంజాయి మొక్కలను గుర్తించారు. దాదాపు 200 గంజాయి మొక్కలను పెరికేసిన ఇరు శాఖల సిబ్బంది వాటిని తగులబెట్టారు. అనంతరం చేను యజమాని లాలూను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. -
లాలూ 'మూడో' రాగం
కోల్ కతా: ఆర్ జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మూడో కూటమి ఏర్పడటం ప్రస్తుత తరుణంలో అత్యావశ్యకమని పేర్కొన్నారు. బీజేపీ, సంఘ్ కూటమి దేశాన్ని ముక్కులు చేయడానికి ప్రయత్నం చేస్తోందని, లౌకిక పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన లాలూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో కలిసి ఈ వ్యాఖ్యలు చేశారు. లౌకికి పార్టీలన్నీ ఒక్కటి కాకుంటే బీజేపీ, సంఘ్ శక్తులు దేశాన్ని ముక్కులు చేస్తాయాన్నారు. పశ్చిమ బెంగాల్లో దీదీ విజయం సెక్యులర్ పార్టీలకు కొత్త బలాన ఇచ్చిందన్నారు. కాగా మూడో కూటమికి మమత నాయకత్వం వహించనున్నారా అని ప్రశ్నించగా కూటమికి నాయకత్వం వహించగల నాయకులు ప్రాంతీయ పార్టీల్లో చాలామంది ఉన్నారని ఫరూక్ పేర్కొన్నారు. వ్యక్తుల కోసం కాదని దేశ ప్రజలకోసం మూడో కూటమని ఫరూక్ తెలిపారు. -
'మహారాష్ట్ర నీ అయ్య జాగీర్ కాదు'
పట్నా: విద్వేషపూరిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు లాలూ తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర ఎవరి అయ్య జాగీర్ కాదని విషయాన్ని రాజ్ ఠాక్రే గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. మహారాష్ట్రలో రాష్ట్రేతరులు ఆటోరిక్షా పర్మిట్ తీసుకుంటే.. వారి ఆటోలను తగలబెట్టాలని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఠాక్రే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన తేజస్వి 'మహారాష్ట్రకానీ, ఈ దేశం కానీ ఎవడి అబ్బ సొత్తు కాదు. రాజ్ ఠాక్రే ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఠాక్రేకు వ్యతిరేకంగా వెంటనే చర్య తీసుకోవాలి' అని అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడిన తేజస్వి.. గతంలోనూ బిహారీలకు వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేశారని, అయినా ఆయనపై బీజేపీ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆటోరిక్షాల అనుమతులు మరాఠేతరులకే అధికంగా ఇస్తున్నారని రాజ్ ఠాక్రే ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 70శాతం ఆటో పర్మిట్లు మరాఠేతరులకే ఉన్నాయని , అలాంటి ఆటోలు రోడ్లపై కనిపిస్తే తన కార్యకర్తలు వాటికి నిప్పుపెట్టడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. -
చిగురించిన కుటుంబ వారసత్వం
సందర్భం నితీశ్ ప్రభుత్వంలో ఎక్కువమంది మహిళలను మంత్రులుగా నియమించే విషయంలో పట్టుపట్టని లాలూ తన కుమారులిద్దరికీ మంత్రి పదవులు సాధించడంలో ఘన విజయమే సాధించారు. ప్రజాజీవితం పేరిట కుటుంబంలో కొత్త వారసత్వం మొలకెత్తింది. శిశుమరణాలు అధికంగా ఉన్న రోజుల్లో కుటుంబ సంరక్షణ కోసం సమర్ధనగా విడి కుటుంబాల్లో పలువురు పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కుటుంబాన్ని పైకి తీసుకురావ డానికి మరిన్ని చేతులు అద నంగా ఉంటే బాగుంటుందని కూడా సమర్థించుకునేవారు. అయితే వాస్తవానికి పేదలు ఎక్కువమంది పిల్లల్ని కనేవారు కానీ ఆ పెద్ద కుటుంబాలు ఆ పిల్లల్ని పేదరికం లోనే ఉంచేవనేది మరో విషయం. లాలూకు తొమ్మిదిమంది పిల్లలు. ఇంత మంది సంతానాన్ని కని, పెంచడానికి రబ్రీదేవికి ఎంత సాహస ముండాలి అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసే వారు. చాలా మంది ఈ విషయంలో లాలూను పరిహ సించేవారు. అయితే అదనపు చేతుల సహాయం అవస రం కావడానికి లాలూ పేదవాడేం కాదు. ఆయన విద్యా వంతుడు. ప్రజాసేవ చేయాలని ఉందని చెప్పుకుం టూనే బతకడానికి రాజకీయాల్లో స్వయం ఉపాధిని వెతుక్కుంటున్న నేతలలో లాలూ ఒకరు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, లాలూ కుటుంబ సభ్యులిద్దరు ఆయన మంత్రివర్గంలో చేరారు. ఆ వెంటనే లాలూ కుటుంబం తమ మూలపురుషుడితో కలిసి గ్రూప్ ఫొటోకు దిగింది. రాజకీయాల్లో కొనసాగుతానని ఈ కుటుంబం స్పష్టంగా తన ఉద్దేశాలను వ్యక్తపరిచాక -ఒక కుమారుడు రాజకీయాల కోసం క్రికెట్‌నే త్యజించాడు- ఇప్పటికి లాలూ కుటుంబం రాజకీయంగా విస్తృతరూపాన్ని సంతరించుకున్నట్లయింది. అయితే నా మనసులో కుటుంబ పరిమాణానికి ప్రముఖ స్థానం లేదు. ఇద్దరు కుమారులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం అందులోనూ ఒకరు నేరుగా ఉప ముఖ్యమంత్రి కావడంతో ఒక నూతన రాజ కీయ కుటుంబం ఇప్పుడు ఎంత పటిష్టంగా తన స్థానాన్ని నెలకొల్పుకున్నది అన్నదే నా ఆలోచన. మేం అయిదుగురం- మా తల్లిదండ్రులు, నా ఇద్దరు సోద రులు, నేను రాజకీయాల్లో ఉన్నామని లాలూ కుమార్తె మీసా యాదవ్ టీవీల ముందునిల్చుని చెప్పారు. కుల రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబ పెద్ద.. దాణా కుంభ కోణంలో ఇరుక్కుని జైలుకెళ్లినప్పుడు లాలూ కుటుంబం పార్టీని ఎలా నడపగలదనిపించింది. కాని ఈ విషయం పెద్దగా వివాదాస్పదం కాలేదు. అవినీతి కేసులో శిక్షపడిన కారణంగా ఎన్నికల్లో పాల్గొనడం, ఓటేయడం చేయలేకపోయిన ఆర్జేడీ పార్టీ అధినేత నూతన ప్రభుత్వంలో ఎక్కువమంది మహిళ లను మంత్రులుగా నియమించే విషయంలో పట్టుపట్ట డంకానీ, నితీశ్‌ను ఒప్పించడంకాని చేయకపోగా, తన కుమారులిద్దరికీ మంత్రి పదవులు సాధించడంపైనే దృష్టిపెట్టారు. ఈసారి బిహార్ శాసనసభ కు 22 మంది మహిళలు ఎంపికయ్యారు. రాజకీయాలకు బొత్తిగా కొత్త వాడైన ఒక పుత్రుడేమో ఏకంగా ఉపముఖ్యమంత్రి అయిపోయాడు. మరొకరేమో, రెండుసార్లు సవరణ చెప్పించుకుంటేగానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ లేని అవిద్యావంతుడు. కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని మోదీ తగినంతగా మహిళలకు స్థానం కల్పించలేదని పలు ఆరోపణలు గుప్పించిన నితీశ్ కుమార్ తన మంత్రివర్గంలో ఎక్కువ మంది మహిళలను చేర్చుకుంటారని భావించడం మరీ ఎక్కువ ఆశించడమే అవుతుందని కొందరు మిత్రులు సూచించారు. లాలాకు ఏడుగురు కుమార్తెలున్నప్పటికీ నిర్ణయాధికారంలో వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారానే మహిళలకు సాధికారత లభిస్తుందని లాలూకు తట్టినట్లు లేదు. మహిళలను సమానులుగా చూడడంలో లేదా వారిని సమానులుగా చేయడంలో తాను ప్రద ర్శించిన వ్యతిరేకతను పార్లమెంటులో మహిళల కోటా పట్ల లాలూ వ్యక్తంచేసిన అభ్యంతరంలో చూడొచ్చు. ప్రభుత్వం కంటే కుటుంబం ముందు అనే వైఖరి పూర్తిగా వ్యతిరేకించదగినది. అందుకే ఈ వ్యాసం మొద ట్లోనే సంతానం అనే పదం వాడాను. రాజకీయాల్లో ఉంటున్న ఇతర కుటుంబాలతో వివాహ సంబంధాలు కుదుర్చుకోవడం ద్వారా లాలూ కుటుంబం విస్తరిస్తోం ది. నేను గతంలో సూచించినట్లుగా, లాలూ చిన్న కూతు రు సమాజ్‌వాదీపార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మునిమనవడు, ఎంపీ అయిన తేజ్ ప్రతాప్ సింగ్ భార్య అయింది. ఇక లాలూ నాలుగో కూతురు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి గెంతేసిన ఎమ్మెల్యే జితేంద్రయాదవ్ కుమారుడు రాహుల్‌యాదవ్ భార్య. ఇక చిన్నకూతురు హేమ మరొక రాజకీయ కుటుంబానికి చెందిన వినీత్ యాద వ్ని పెళ్లాడింది. ఆరవ కూతురు ధను, చిరంజీవరా వును పెళ్లాడింది. ఈయన తండ్రి ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు చెందిన రావ్ అజిత్‌సింగ్. ఈయన హరియా ణాలో ఒకసారి విద్యుత్ మంత్రిగా పనిచేశారు కూడా. ఇక్కడ చిన్న గమనిక: లాలూ ఏడుగురు కుమా ర్తెల్లో ముగ్గురు రాజకీయవర్గాలకు చెందని వ్యక్తులను పెళ్లాడారు. అయినంతమాత్రాన లాలూ కుటుంబం రాజకీయాలకు తక్కువ అని చెప్పలేం. ఏమాత్రం అను భవం లేని కుమారులను పెద్ద పదవుల్లో నియ మింప చేయడమే రాజకీయం. పైగా లాలూ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా కాదు. ఆర్జెడీ పార్టీకి ఇప్పుడు ఒక ఉపాధ్యక్షులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ లాలు ఇప్పుడెంత ప్రభావం చూపుతున్నారంటే, మన ప్రజా జీవితంలోని ప్రమాణాల ప్రకారం చూస్తే కొత్త రాజ కీయ వారసత్వం ఎంతో సహజమనిపిస్తోంది. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్ mvijapurkar@gmail.com) -
ఆ అయిదు కీలక అంశాలు
పట్న: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమికి బిహార్ రాష్ట్ర ప్రజల అనూహ్య మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానంగా యాదవులు, ముస్లింల ఓట్లే మహాకూటమి గెలుసును నిర్దేశించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటితో పాటు అయిదు ప్రధాన అంశాలను అటు మహాకూటమి విజయానికి, ఇటు ఎన్డీయే కూటమి ఘోర పరాజయానికి కీలకమైనవి భావిస్తున్నారు. ముందుగా మహాకూటమి అద్భుత విజయానికి గల కారణాలను పరిశీలిస్తే.. 1. రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబడిన తరగతుల కు చెందిన కలాల ఓటర్లను మహాకూటమి ప్రభావితం చేయగలిగింది. ప్రధానంగా యాదవులు, ముస్లిం, కుర్మి తదిరత సామాజిక వర్గాలను తన వైపు తిప్పు కోవడంలో కూటమి నాయకత్వం విజయం సాధించింది. 2. ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని ఎండగట్టడంలో మహాకూటమి సక్సెస్ అయింది. రిజర్వేషన్ల విషయంలో ఆయా వర్గాల ప్రజలకు లాలూ ప్రసాద్ లాంటి అగ్రనేతలు మద్దతుగా నిలిచారు. 3. తమ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ముందుగానే ప్రకటించి తమ కూటమి విశ్వసనీయతను పెంచారు. 4. మత విద్వేషాలను, మత రాజకీయాలను ఎండగట్టడంలో మహాకూటమి చాలా ధృఢంగా వ్యవహరించింది. ఆ మేరకు ప్రజల్లో ప్రజాస్వామ్య భావాలను పాదుకొల్పగలిగింది. 5. ఈ బిగ్ ఫైట్ లో కీలక మైన అంశాలను గెలుపు గుర్రాలను ఎంపిక. ఈ విషయంలోపార్టీల నేతల చేసిన కసరత్తు మంచి ఫలితాలనిచ్చింది. ఎన్డీయే కూటమికి ఎలా ప్రతికూలంగా అంశాలను పరిశీలిస్తే.. 1. బిహార్ రాజకీయ దిగ్గజాలు లాలూ, నితీష్ ల కరిష్మాను, వారి స్థాయిని అంచనా వేయడంలో ఎన్డీయే కూటమి విఫలమైంది. వారి శక్తి సామర్ధ్యాలను, రాష్ట్ర ప్రజల్లో వారికున్నపునాదిని లైట్ తీసుకోవడం కొంపముంచింది. 2. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీజేపీ నేతల వైఖరి, వ్యాఖ్యనాలు ప్రధానంగా బీజేపి ఇమేజ్ ను దెబ్బతీశాయి. వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యనాలు పార్టీ విజయాన్ని సుదూరం నెట్టివేశాయని అంచనా. 3. బీజేపీ కూటిమికి ముసలం తెచ్చిపెట్టిన మరో కీలక అంశం ఆర్ ఎస్ ఎ స్ అధినేత మోహన భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు అవసరం లేదన్న భగవత్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇవి ఆయా వర్గాల ప్రజల్లోతీవ్ర అసంతృప్తిని రాజేశాయని పరిశీలకుల భావన. 4. ఇక మరో ప్రధాన అంశంగా చెప్పుకోవాల్సింది. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు. టిక్కెట్ల కేటాయింపులో రగిలిన అసంతృప్తులు మహాకూటమి విజయాన్ని సానుకూలం చేశాయి. 5. చివరిది అతి కీలకమైన అంశం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో పూర్తిగా వైఫ్యలం చెందడం ఎన్డీయేకి ప్రతికూలంగా మారిపోయింది. ఈ విషయంలో సాధించని ఏకాభిప్రాయం కూటమిలోని విభేదాలు చెప్పకనే చెప్పింది. -
సహనమే గెలిచింది...
కోల్ కతా: బిహార్ ఎన్నికల ఫలితాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఫలితాలు అసహనంపై సహనంసాధించిన విజయానికి తార్కాణమని వ్యాఖ్యానించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలుపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో దీదీ సోషల్ మీడియాలో స్పందించారు. నితిష్, లాలుతో కూడిన మహాకూటమికి దీదీ అభినందనలు తెలిపారు. సహనానికి గెలుపు, అసహనానికి ఓటమి అంటూ ట్వీట్ చేశారు. బిహార్ లోని నా సోదర సోదరమణులకు అభినందనలంటూ ట్వీట్ చేశారు. -
నితీష్ ఫేసు.. లాలూ బేసు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు అధినేతల ఫేసు, బేసు మహాకూటమికి మహావిజయాన్ని అందించాయని జేడీయూ నేత నావల్ శర్మ వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు మరెవ్వరో కాదు. ఒకరు జేడీయూ అధినేత నితీష్ కుమార్, రెండోవారు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్. ఇది ప్రజల విజయమని వ్యాఖ్యానించిన ఆయన.. నితీష్ మెరిసిపోయే ముఖం, రాష్ట్రంలో లాలుకున్న పటిష్టమైన పునాదే తమకు ఇన్ని స్థానాలను సాధించి పెట్టాయన్నారు. రాష్ట్రప్రజలకు తాము చేసిన సేవలే తమకు ఇంతటి అపూర్వమైన విజయాన్ని అందించాయన్నారు. బీజీపీ కుట్రపూరిత ఎత్తుగడలే వారిని ఓడించాయన్నారు. దాద్రి, పాకిస్తాన్, ఆవు, బీఫ్ లాంటి అంశాలేవీ బీజేపీ కాపాడలేకపోయాయన్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మహాకూటమి ఇప్పటికే 161 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులు వేస్తోంది. అటు బీజేపీ కూటమికి ఓటమిని అంగీకరించినట్టే. -
బిహార్ దిశానిర్దేశం
త్రికాలమ్ బిహార్ దేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి? పద్దెనిమిది మాసాల కిందట లోక్‌సభ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి అట్టహాసంగా హస్తినలో అధికారదండం చేతబట్టిన నరేంద్రమోదీ ఎందుకు బిహార్ ఎన్నికలపైన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరిస్తున్నారు? ప్రధానిగా నరేంద్రమోదీ వ్యవహరణ తీరును ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశించబోతున్నాయి. రాజ్యసభలో ఎన్డీఏకి మెజారిటీ ఎప్పుడు లభించేదీ సూచించబోతున్నాయి. ఒక రాజకీయ నాయకుడుగా నితీశ్‌కుమార్ భవిష్య త్తును తేల్చబోతున్నాయి. పాతికేళ్ల కిందటే 'సామాజిక న్యాయం' నినాదాన్ని ఎన్నికలలో ప్రయోగించి చరిత్ర సృష్టించిన లాలూప్రసాద్ యాదవ్ పదేళ్ల అరణ్యవాసం తర్వాత బిహార్ రాజకీయాలలో తిరిగి ఒక శక్తిగా కోలుకుంటారో లేదో కూడా ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్‌గాంధీ కానీ పెద్దగా చర్చలో లేనట్టే లెక్క. ఇది రెండు కూటముల మధ్య పోరాటం. ప్రధానంగా ఇద్దరు నాయకుల మధ్య బ్యాలట్ యుద్ధం. ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, రెండో వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. బీజేపీ, దాని మిత్రపక్షాలు (నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్- ఎన్డీఏ) గెలిస్తే లోక్‌సభ నాటి హవా కొనసాగినట్టూ, మోదీ కత్తికి ఎదురు లేనట్టూ ప్రజలు అర్థం చేసుకుంటారు. లాలూతో స్నేహం వల్ల నితీశ్ దెబ్బతిన్నాడని తీర్మానిస్తారు. జనతాదళ్-యూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌లతో కూడిన మహా ఘట్బంధన్ విజయం సాధిస్తే 2019 నాటి లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోదీకి నితీశ్‌కుమార్ ఒక లౌకిక ప్రత్యామ్నాయంగా ఎదుగుతారు. విభిన్న మైన అభివృద్ధి నమూనాకు ప్రతినిధిగా నిలబడతారు. ఇద్దరి అభి వృద్ధి నమూనాలలో వ్యత్యాసం ఏమిటో పరిశీలిద్దాం. మహాకూటమికే మొగ్గు? ఇప్పటికి మూడు ఘట్టాల పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు ఘట్టాలు మిగిలి ఉన్నాయి. నాలుగో విడత పోలింగ్ ఈ రోజు. చివరి ఘట్టం నవంబర్ 5న. నవంబర్ 8 న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. మొదటి రెండు దశల పోలింగ్ మహాకూటమికి అనుకూలంగా సాగినట్టూ, మూడో దశలో చెరిసగం ఆధిక్యం ఉన్నట్టూ రాజకీయ పరిశీలకుల అంచనా. చివరి రెండు దశలలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో ముస్లింల జనాభా గణనీయం. మొత్తంమీద మహాకూటమి (మహా ఘట్బంధన్)కి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతా యాదవుల ఓట్లు కూర్మీ అభ్యర్థులకూ, కూర్మీల ఓట్లు యాదవ అభ్యర్థులకూ పడతాయా లేదా అన్నదానిపైన ఆధారపడి ఉంటుంది. లోక్‌సభ ఎన్ని కలలో మొత్తం 40 స్థానాలకు 32 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాబల్యం అంతలోనే క్షీణించిందా? లోక్‌సభ ఎన్నికలలో బిహార్ ప్రజలు యూపీఏను శిక్షించాలనే లక్ష్యంతో బీజేపీకీ, దాని మిత్రపక్షాలకు ఓట్లు వేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పట్నాలో ఎవరికి పట్టం కట్టాలనే విషయం తేల్చడానికి. ముఖ్యమంత్రిగా 2005 నుంచి ఇప్పటి వరకూ (మధ్యలో మాంఝీ హయాంను మినహాయిస్తే) నితీశ్‌కుమార్ చేసిన మంచి పనులను ప్రజలు మరచిపోలేదు. ముఖ్యంగా మహిళా సాధికారికత విషయంలో బిహార్ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ విజయాలు సాధించింది. 2010 నాటి ఎన్నికల నుంచి మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కు వినియోగిం చుకోవడం ఇందుకు నిదర్శనం. ఉన్నత కులంగా చలామణి అవుతున్న భూమిహార్ ప్రజలలో సైతం మగవారు బీజేపీని సమర్థిస్తుంటే ఆడవారు జనతా దళ్-యూని బలపర్చుతున్నారు. మహా ఘట్బంధన్ తరఫున నితీశ్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రచారం చేస్తు న్నారు. ఎన్డీఏ అభ్యర్థుల పక్షాన మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , ఎందరో కేంద్రమంతులు, మిత్రపక్షాల నాయకులైన మాంఝీ, రాంవిలాస్ పాశ్వాన్, తదితరులు ఓటర్లను ప్రభావితులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధాని ర్యాలీలకే జనసమీకరణ భారీగా జరుగుతోంది. ఆయన ప్రసం గాలనే జాతీయ టెలివిజన్ చానళ్లు సంపూర్ణంగా ప్రసారం చేస్తున్నాయి. మోదీ ప్రచారం ప్రభావవంతంగా ఉంది. ముప్పయ్ అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో, పాతికేళ్ల లాలూ, నితీశ్ ఏలుబడితో బిహార్‌కి ఒరిగింది శూన్య మంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు. నితీశ్‌తో పాటు తొమ్మిదేళ్లకు పైగా బీజేపీ అధికారం పంచుకున్న వైనాన్ని విస్మరిస్తున్నారు. బిహార్‌కి మేలు జరగనే లేదంటూ నొక్కి చెబుతున్నారు. ఇక లాలూపైన జంగిల్‌రాజ్ అంటూ ధ్వజ మెత్తారు. లాలూతో పొత్తుపెట్టుకోవడం నితీశ్ అవకాశవాద రాజకీయానికి నిదర్శనమంటూ ఎండగట్టారు. ఎన్నికల ప్రచారంలో మోదీ శైలి తెలిసిందే. మోదీ-నితీశ్ వైరం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని నియమించినప్పుడు ఆ నిర్ణయాన్ని నితీశ్‌కుమార్ స్వాగతించి ఉంటే ఇప్పుడు ఎన్నికల పోరులో ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేవారు. లాలూ, సోనియాల కూటమి పేలవంగా తేలిపోయేది. ఎన్నికల రంగం ఇంతటి రసవత్తరంగా ఉండేది కాదు. నరేంద్రమోదీ పట్ల వ్యక్తిగత, విధానపరమైన వ్యతిరేకత ఉన్న కారణంగానే ఎన్డీఏ నుంచి నితీశ్ వైదొలిగారు. లోక్‌సభ ఎన్నికలలో ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పు కొని తన స్థానంలో మాంఝీని కూర్చోబెట్టారు. ఏకులాగా వచ్చిన మాంఝీ మేకులాగా తయారై బీజేపీతో జతకట్టడంతో మాంఝీని తోసిరాజని ముఖ్య మంత్రిగా నితీశ్ తిరిగి బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. మోదీ హయాంలో గుజరాత్ గణనీయంగా అభివృద్ధి చెందినట్టు చెప్పడం, దేశమంతా గుజరాత్ అభివృద్ధి నమూనాను అమలు చేయాలని ప్రచారం చేయడం రెండేళ్లుగా చూస్తున్నాం. నిజానికి మోదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి పూర్వమే గుజరాత్ అభివృద్ధిపథంలో ఉన్నది. దాదాపు రెండు శతాబ్దాలుగా గుజరాతీయులలో వ్యాపారదక్షత పెరుగుతూ వచ్చింది. ధీరూ భాయ్ అంబానీ, గౌతమ్ అదానీ, కర్సన్భాయ్ పటేల్ వంటి దిగ్గజాలు మోదీ రావడానికి ముందే వ్యాపారరంగంలో తమ ముద్రను వేశారు. మాధవ్ సింగ్సోలంకీ ముఖ్యమంత్రిగా ఉండగా (1984) దేశంలో రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన వంద జిల్లాల జాబితా తయారు చేస్తే అందులో పాతిక జిల్లాలు గుజరాత్ రాష్ట్రంలోనివే. ఒక్క భారూచ్ జిల్లాలో పెట్టు బడులే జాబితాలోని తక్కిన అన్ని జిల్లాల పెట్టుబడులకంటే అధికం. అప్పుడు మోదీ ఎక్కడున్నారు? వాస్తవం ఏమిటంటే గుజరాత్లో చాలాకాలంగా సాగు తున్న అభివృద్ధి నమూనానే మోదీ కొనసాగించారు. బీజేపీ సర్కార్‌కు సుస్థిరత ప్రసాదించడం మూలంగా కొన్ని రంగాలలో అభివృద్ధి కొట్టవచ్చినట్టు కనిపిస్తు న్నది. మోదీ అభివృద్ధి నమూనా విపణి చోదకమైనది. కొన్ని రంగాలలో కొన్ని సంస్థలకే అభివృద్ధి ఫలాలు అందాయి. సామాజిక న్యాయం ఆశించినంత జరగ లేదు. దేశంలోని అతిసంపన్నవంతమైన రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, అక్షరాస్యతలో, శిశుమరణాలలో, పేదరికంలో, ఇతర అభివృద్ధి సూచీలలో గుజరాత్ చాలా వెనుకబడి ఉన్నది. బిహార్ ఇందుకు భిన్నం. ‘బీమారూ’ రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ సరసన ఉండిన బిహార్ పదేళ్లలో గణనీయమైన అభి వృద్ధి సాధించింది. నితీశ్‌కుమార్ అనుసరించిన నమూనా ఫలితంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను కొంతమేరకు పేదరికం నుంచి బయట పడవేయడం, తరతరాలుగా అణచివేతకు గురవుతూ వచ్చిన మహిళలకు అధికారం అప్పగించడం వంటి ప్రగతి సాధ్యమైంది. మానవ వికాసానికి అవసరమైన అభివృద్ధి అందుబాటులోకి వచ్చింది. 2001 నుంచి 2011 వరకూ అక్షరాస్యత 16.8 శాతం పెరిగింది. మహిళల అక్షరాస్యత 20 శాతం పెరిగింది. మూడు అంతస్తుల పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50 శాతం స్థానాలు ప్రత్యేకించడమే కాకుండా 20 శాతం బడుగు కులాలవారికీ, పది శాతం దళితులకూ కేటాయించడం ద్వారా గ్రామీణ వ్యవస్థపైన శతాబ్దాలుగా కొన సాగిన భూస్వాముల ఆధిపత్యాన్ని అంతం చేయడం నితీశ్‌కుమార్ సాధించిన అద్భుతమైన సామాజిక విప్లవం. పంచాయతీరాజ్ వ్యవస్థలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మహిళా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం విశేషం. అతి బడుగు వర్గాలకు చేయూతనివ్వడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంలో కూడా నితీశ్ కృతకృత్యుడైనారు. సామాజిక న్యాయం, సామా జికార్థిక అభివృద్ధి, ప్రాథమిక వనరుల కల్పన అనే మూడు అంశాలకు ప్రాధాన్యమిస్తూ సాగిన నితీశ్ అభివృద్ధి నమూనా సమాజంలో అంతరాలు తగ్గించడానికీ, బడుగువర్గాల అభ్యున్నతికీ దోహదం చేసింది. భూసంస్కరణలు అమలు చేయగలిగి ఉండే సామాజిక న్యాయ సాధన ఇంకా వేగవంతమై ఉండేది. భూసంస్కరణలను సూచించడం కోసం బందోపాధ్యాయ కమిటీని నియమించినప్పటికీ కమిటీ సూచనలను అమలు చేయడంలో నితీశ్ కుమార్ విఫలమైనారు. ఈసారి ఎన్నికలలో గెలిస్తే నితీశ్, లాలూ ప్రసాద్ నిర్మాణాత్మ కంగా పనిచేసి భూసంస్కరణలు అమలు చేసి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయగలిగితే బిహార్ సమాజంలో అంతరాలు మరింతగా తగ్గిపోతాయి. ఇంత కాలం దేశానికి ముడి ఖనిజం అందిస్తున్న బిహార్ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహిస్తే సంపద పెంచుకొని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన చేరుతుంది. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష సంఘటనకు ప్రజలు అధి కారం ఇచ్చినప్పటికీ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించడంలో విఫలమైనారు. బిహార్‌లో నితీశ్‌కుమార్ కొంత వరకైనా సాధించి చూపించారు. అందుకే, మూడో టరమ్ ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం బిహార్ ప్రజలు నితీశ్‌కుమార్‌కి ఇచ్చినట్లయితే, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ప్రశాం తంగా పని చేసుకునే వీలు లాలూప్రసాద్ కల్పించినట్లయితే, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఫలితాలు సాధించేందుకు ఇంకొంత సమయం లభిస్తుంది. ఎన్డీఏ విజయం సాధిస్తే ఢిల్లీలో, గాంధీనగర్‌లో అమలు జరుగుతున్న మార్కెట్ నమూనానే బిహార్‌లోనూ అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. నితీశ్ ప్రయోగం ఆగిపోతుంది. అందుకు బిహార్ ఎన్నికలంటే కేవలం కులాల పోరాటం లేదా రాజకీయ నాయకుల ఆరాటం మాత్రమే కాదు. బిహారీ లేదా బాహరీ కాదు. రెండు అభివృద్ధి నమూనాల మధ్య పోటీ. -
పునరాలోచించండి
ములాయంకు లాలూ, శరద్ యాదవ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపంకంపై విభేదాలతో లౌకిక కూటమి నుంచి తప్పుకున్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్‌ను దారిలోకి తెచ్చుకోవడానికి జనతా పరివార్ తిప్పలు పడుతోంది. ములాయంను బుజ్జగించడానికి జేయూడీ చీఫ్ శరద్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు శుక్రవారమిక్కడ ములాయం ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు. ఎస్పీ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. అయితే ఎస్పీ అధినేత వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. లాలూ రెండు గంటలు ములాయంతో భేటీ అయ్యారు. ఆ సయయంలో శరద్ కూడా అక్కడే ఉన్నారు. భేటీ తర్వాత శరద్, లాలూ మీడియాతో మాట్లాడుతూ కూటమి కొనసాగింపుపై ధీమా వ్యక్తం చేశారు. 'బిహార్‌లో సోషలిస్టు, లౌకిక ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎస్పీ నిర్ణయంపై పునరాలోంచాలని నేతాజీ(ములాయం)ను కోరాం. చర్చలు సాగుతున్నాయి. మొత్తం 200 సీట్లు(ఆర్జేడీకి కేటాయించిన 100, జేడీయూ కేటాయించిన 100) నేతాజీ, ఎస్పీవే. ములాయం మా సంరక్షుడు. కూటమి కొనసాగింపు బాధ్యత అందరికంటే ఆయనపైనే ఎక్కువ. ఏవో కొన్ని కారణాలతో ఆయన కలతచెంది, కూటమి నుంచి బయటికి రావాలనుకున్నారు. ఈ ఎన్నికలు బిహార్‌కే కాకుండా మొత్తం దేశానికి కీలకం' అని లాలూ అన్నారు. ములాయంతో సీట్ల పంపకంపై చర్చించలేదని, ఒకటి రెండు రోజుల్లో శుభవార్త వింటారని శరద్ అన్నారు. సమస్యలు పరిష్కారమవుతాయని బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ పట్నాలో అన్నారు. సీట్ల పంపకంలో తమను సంప్రదించకుండా, తమకు 5 సీట్లే కేటాయించారని, కూటమి నుంచి తప్పుకుని ఒంటరిగా పోటీ చేస్తామని ఎస్పీ గురువారం ప్రకటించడం తెలిసిందే. కాగా, ఉత్తరప్రదేశ్‌లో తమకు శత్రువైన కాంగ్రెస్‌తో బిహార్ ఎన్నికల్లో కలసి కనిపించడం ములాయంకు అసౌకర్యంగా ఉందని ఎస్పీ వర్గాలు చెప్పాయి. -
రాష్ట్రాన్ని వేలం వేశారా!?
ప్రధానిపై నితీశ్ ధ్వజం ప్యాకేజీ కాదు.. ప్రత్యేక హోదా కావాలి: లాలూ పట్నా: బిహార్‌కు మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని, ఆ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరును బిహార్ సీఎం నితిశ్ కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధానికి బిహారంటే, కేంద్రం నుంచి నిధులు కోరే రాష్ట్రాలంటే చులకనభావం ఉన్నట్లుందని మండిపడ్డారు. ప్యాకేజీని ప్రకటించిన తీరు బిహార్‌ను వేలంపాట వేస్తున్నట్లుగా ఉందన్నారు. ‘ఇదేనా మీరు ముప్పొద్దులా చెప్పే సహకారాత్మక సమాఖ్య విధానం’ అని ధ్వజమెత్తారు. ‘ఒకవైపు నన్ను కేంద్రం నుంచి నిధులు అడుక్కుంటున్న యాచకుడు అంటున్నారు. మరోవైపు, నాది అహంకార వైఖరి అని విమర్శిస్తున్నారు. ఇవి పరస్పర విరుద్ధంగా లేవా?’ అని మోదీని ప్రశ్నించారు. బిహార్ కోసం కేంద్రం ముందు చేతులు చాచేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనన్నారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజీలోని ప్రాజెక్టుల్లో కొత్తవేం లేవని అన్నారు. తాము కోరుతోంది నిధులు కాదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నది తమ డిమాండని స్పష్టం చేశారు. బిహార్‌ను ప్రధాని బీమారు రాష్ట్రాల్లో ఒకటని అనడాన్ని నితీశ్ మండిపడ్డారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన రాష్ట్రాలన్నీ బీమారువేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో ముందుకుపోతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించడానికి బదులుగా పరిహాసం చేయడం తగదన్నారు. వాజ్‌పేయి హయాంలో బిహార్‌కు ప్రకటించిన రూ. 10 వేల కోట్లు, యూపీఏ ఇచ్చిన రూ. 12 వేల కోట్లను రాష్ట్రం ఖర్చు చేయలేదన్న విమర్శలపై స్పందిస్తూ.. ఆ నిధులను ఖర్చు చేయాల్సింది కేంద్రమేనన్న విషయం ప్రధానికి తెలియదేమోనన్నారు. బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కాకుండా, ప్రత్యేక హోదా కావాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. -
జంగిల్ రాజ్ కాదు మండల్ రాజ్!
-
'భార్యాబిడ్డలు ఓడిపోయినా బుద్ధి రాలేదు'
పాట్నా: 'సార్వత్రిక ఎన్నికల్లో ఆయన భార్య, కూతుర్లు చిత్తుగా ఓడిపోయారు. బొటాబొటి ఓట్లతో డిపాడిట్ మాత్రమే దక్కించుకోగలిగారు. అయినా సరే ఆ నేతకు బుద్ధి రాలేదు. ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యుల్ని చట్టసభలో కూర్చోబెడదామా అని ఆలోచిస్తూ ఉంటాడు' అంటూ ఆర్ జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్. ఆదివారం పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. లాలూ సహా బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎన్నికల్లో లాలూ సతీమణి రబ్రిదేవి, కుమార్తె మీసా భారతిలు ఇద్దరూ ఓటమి చెందిన విషయం తెలిసిందే. 'బీహార్ లో ఇద్దరు పొగరుమోతు నాయకులున్నారు. ఒకరికేమో తన కుటుంబ ఉన్నతి తప్ప మరేదీ పట్టదు. ఇంకొకాయన తాను సమర్థుడినని ప్రచారం చేసుకోవడంతప్ప పనేమీ చేయరు' అంటూ లాలూ, నితీశ్ లను దాస్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల మాదిరే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్ ఓటర్లు జేడీయూ, ఆర్ జేడీలను పాతిపెట్టి.. బీజేపీకి విజయాన్ని అందించాలని కోరారు. -
మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు
పట్నా: తమను విడదీసేందుకు ప్రయత్నిస్తున్న నరేంద్రమోదీ ఎత్తులు సాగవని ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలు ప్రసాద్ స్పష్టంచేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ప్రశంసలు కురిపించి, తనపై దాడి చేసి తమ మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బీహార్ అభివృద్ధి చెందకపోవడంపై తనను, కాంగ్రెస్ పార్టీని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. తమలో ఒకడైన నితీష్‌ను పొగిడి, తమ కూటమి మధ్య విభేదాలు సృష్టించడానికి చూస్తున్న మోదీ దుష్టపన్నాగం తమకు తెలుసన్నారు. ఈ విషయంలో ఆయన ఎప్పటికీ విజయం సాధించలేరన్నారు లాలు. ఎన్నికల ప్రచారం కోసం బీహార్‌లో ఒకరోజు పర్యటనకు వెళ్లిన ప్రధాని, పట్నాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం నితీష్, పీఎం మోదీ ఒకే వేదికపై ఆసీనులయ్యారు. బహిరంగ సభలో మోదీ.. నితీష్‌పై ఒకింత సానుభూతిని, ఓ మోస్తరు ప్రశంసలను గుప్పించారు. ఈ నేపథ్యంలోనే లాలు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్జేడీ, ఎల్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడ్డాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో ఈ కూటమి ముందుకు సాగుతోంది. -
బిహార్‌లో కమల వికాసం
విశ్లేషణ బిహార్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమి గెలుపొందుతుందని భావించారు. లౌకిక కూటమి సంబరాలు మొదలెట్టేసింది. బీజేపీ కూటమి 15 స్థానాలను, లౌకిక కూటమి 9 స్థానాలను చేజిక్కించుకోవడం ప్రకంపనలు సృష్టించింది. బిహార్‌లో 24 ఎంఎల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలను జూలై 11న ప్రకటించారు. అనూహ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి 15 స్థానాలు గెల్చుకోగా, కాంగ్రెస్, లాలూ, నితీష్ కుమార్ (లౌకిక) కూటమి 9 స్థానాలు మాత్రమే గెల్చు కుంది. పైగా లౌకిక కూటమి నుంచి ఒక్క మైనారిటీ ముస్లిం అభ్యర్థి మాత్రమే గెలుపొందారు. ఢిల్లీలో ఈ ఫలితాలు ప్రకంపనలు సృష్టించాయి. బిహార్‌లో అనూహ్యంగా బీజేపీ మానసిక విజయం సాధించింది. గత రెండు నెలలుగా కాంగ్రెస్ ఎలా మాట్లాడుతూ వచ్చిందంటే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో ప్రకటించినట్లు, బీజేపీ ఓడిపోయి నట్లు వ్యవహరించింది. నితీష్ కుమార్ సైతం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి తాను మళ్లీ ముఖ్యమంత్రి అయినట్లు నమ్మసాగారు. ఇక లాలూ ముగ్గురు కుమారులూ ఇప్పటికే తమను తాము మంత్రులుగా ఊహించుకోసాగారు. బిహార్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ గత 22 ఏళ్లుగా బద్ధ శత్రువులుగా ఉన్నారు. లాలూను జైలుకు పంపడానికి, ఎన్నికలలో పోటీకి అనర్హుడిని చేయడా నికి మూలకారకుడు నితీష్. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, నితీష్ 1989 నుంచి బిహార్ ముఖ్యమంత్రులుగా ఆధిపత్యం చలాయిస్తూ వచ్చారు. బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించగానే నితీష్ 2013లో ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నారు. అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నితీష్ ఘోరంగా దెబ్బతిన్నారు. అలాగే బిహార్‌లో లాలూ కూడా దెబ్బతిన్నారు. దీంతో మనుగడ కోసం కలసి పోరాడాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. బీజేపీని అడ్డుకోవడానికి తాను విషం తాగడానికైనా సిద్ధమేనని లాలూ జూన్ 7న ప్రకటించారు. ఇద్దరి మధ్య సయోధ్య అప్పుడే కుదిరింది. తమ కూటమి తరపున ముఖ్య మంత్రిగా నితీష్‌కు లాలూ మద్దతు పలికారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, లాలూ, నితీష్లకు కలిపి దాదాపు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 38 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. విడిగా కాకుండా లౌకిక పార్టీలు ఒక్కటైతే బీజేపీని ఓడించవచ్చని వీరు లక్ష్యం పెట్టుకున్నారు. ఇది ఒక అద్భుత గణితమే కానీ రాజకీయాలు గణిత శాస్త్రం కాదు. 2014 ఆగస్టు 24న బిహార్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, లాలూ, నితీష్ కూటమి వాటిలో ఆరింటిని గెలుచుకుంది. నితీష్ కుమార్‌ను కూటమి తరపున ఉమ్మడి సీఎంగా ఈ సంవత్సరం జూన్ 7న ప్రకటించగానే నరేంద్రమోదీ ఓడిపో యారనే రీతిలో కాంగ్రెస్ వ్యవహరించింది. మోదీ అంతానికి ఇదే నాంది అనీ కాంగ్రెస్ కలగనింది. 2019లో బీజేపీ ఓడిపోతుందని భారత పాలకవర్గాలు అంచనావేస్తే, ప్రజలలో అధిక సంఖ్యాకులు మోదీకి మద్దతివ్వడం నిలిపివేస్తారని కాంగ్రెస్‌కు తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో తాను గెలవ లేనని కాంగ్రెస్‌కు తెలుసు. కానీ, తను బీజేపీని నిలువరించి నట్లయితే, అది కూటమికి దారితీసి మళ్లీ లేచినిలబడవచ్చు. అధికారం లేకుంటే కాంగ్రెస్ సర్వనాశనమవుతుంది. అందుచేత 2019 ఎన్నికల్లో ఏవిధంగానైనా సరే బీజేపీని కాంగ్రెస్ నిలువరించాలి లేదా పదేళ్లపాటు అధికారానికి దూరమైన స్థితిలో కాంగ్రెస్ కుప్పకూలిపోతుంది. బీజేపీని నిలువరించే క్రమంలో బిహార్ ఎన్నికలు తొలి దశ. బీజేపీ గనుక బిహార్‌లో ఓడిపోయినట్లయితే 2019 ఎన్ని కల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఇక మోదీకి మద్దతు ఉపసం హరించుకోవడం మంచిదంటూ భారత పాలక వర్గాలకు, కులీ నవర్గాలకు కాంగ్రెస్ పార్టీ సందేశం పంపగలుగుతుంది. అప్పు డు సంపన్న వ్యాపార వర్గం, రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌తో మళ్లీ అధికారం పంచుకోవాలని కోరుకుంటారు. ఈ వ్యూహం లో భాగంగానే బిహార్ తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ భావిస్తూ వచ్చింది. బద్ధశత్రువులైన నితీష్, లాలూ ఇద్దరూ పొత్తు కుదుర్చుకోవడమే గొప్ప విజయ సూచకం మరి. బిహార్‌లో ముస్లింల జనాభాయే ఎక్కువ. బీజేపీకి వ్యతి రేకంగా ఏ పార్టీనయినా వారు బలపరుస్తారు. ఇది కూడా లౌకిక పార్టీలకు అనుకూలమే. నితీష్‌కు మంచి గుర్తింపు ఉంది కానీ ఓట్లు లేవు. లాలూకు చెడ్డ గుర్తింపు ఉంది కానీ కొన్ని ఓట్లే ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఏ ఓట్లూ లేవు కానీ జాతీయ గుర్తింపు ఉంది. ఈ ముగ్గురి మనుగడకు గెలుపు అవసరం. బీజేపీ ఇటీవల అనేక వివాదాల్లో కూరుకుపోయింది. ప్రతిపక్షానికి ఇది ఊతమిచ్చింది. సుష్మాస్వరాజ్ వంటి కేంద్ర మంత్రులూ, రాజస్తాన్ సీఎం వసుంధరారాజే వంటి వారిని వివాదాలు చుట్టుముట్టాయి. బీజేపీకి చెందిన పలువురు మంత్రులు తమ విధులను పేలవంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలువురు మంత్రులు అసమర్థులే కాకుండా వివాదాల్లో చిక్కుకున్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఆర్థిక ఫలితాలను అందివ్వడానికి సమయం తీసుకుంటోంది. భూ చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తూ మోదీ ప్రభుత్వం వివాదాలను కొని తెచ్చుకుంటోంది. బీజేపీ గనుక బిహార్‌లో ఓటమి పాలయితే, మీడియాలో కాంగ్రెస్ తన దాడిని పెంచగలుగుతుంది. ఈ రోజుల్లో మీడియానే సర్వస్వం కదా. బిహార్‌లో 24 ఎంఎల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని భావించారు. ఫలితాలు ప్రకటించకముందే లౌకిక కూటమి సంబరాలు మొదలెట్టేసింది. రాహుల్ గాంధీ, నితీష్ కుమార్, లాలూ సాహస ప్రకటనలు ఇవ్వడంలో పోటీ పడ్డారు. బిహార్ లో లౌకిక పార్టీలకు విజయం తప్పదన్న అంచనా ఢిల్లీలోనూ, బిహార్‌లోనూ బీజేపీని మరింతగా దిగజారుస్తుంది. కానీ 24 ఎంఎల్సీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 15 స్థానాల ను, బీజేపీ వ్యతిరేక కూటమి కేవలం 9 స్థానాలను చేజిక్కించు కోవడం ప్రకంపనలు సృష్టించింది. ఫలితాలు బీజేపీకి గొప్ప ప్రోత్సాహం ఇవ్వగా బీజేపీ వ్యతిరేక కూటమి కుప్పకూలి పోయింది. కొన్ని సార్లు ఒకే ఒక్క స్థానం సైతం ప్రకంపనలు సృష్టిస్తుంది. బీజీపే ఎంఎల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొంద డానికి కారణాలు బోలెడు. బీజేపీ మంత్రులు, సీఎంల వ్యవ హారం ఎలా ఉన్నప్పటికీ మోదీకి ప్రజాదరణ వెనుకపట్టు పట్ట లేదు. బీజేపీ బిహార్‌లో ఎన్నడూ అధికారంలో లేదు. గత 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న లాలూ, నితీష్లకు పెద్ద ఎత్తున ఏర్పడిన వ్యక్తిగత శత్రువులు గంపగుత్తగా బీజేపీ ని బలపర్చా రు. లౌకిక కూటమికి, మైనారిటీలకు వ్యతిరేకంగా ముస్లిమేత రులను కూడగట్టడంలో బీజేపీ సఫలమైంది. లాలూ కుటుం బం మొత్తం అధికార స్థానాలు కైవసం చేసుకునేందుకు వెంప ర్లాడటంతో ప్రజలకు ఏవగింపు కలిగింది. దీంతో ఒక్కరోజులో బిహార్ రాజకీయ ముఖచిత్రం పెనుమార్పుకు గురయింది. ఒక వారం క్రితం బీజేపీకి పరాజయం తప్పదనిపించిన చోట ఇప్పుడు బీజేపీయే గెలుస్తుందన్న భావం బలపడిపోయింది. నోబెల్ గ్రహీత, రచయిత రాబర్ట్ స్టెయిన్బెక్ ఒకమాటం టారు. మనుషుల పథకాలు ఎల్లవేళలా విఫలమవుతుంటాయి అని. కోరికలే గుర్రాలయితే ఊహలకు రెక్కలొస్తాయని తెలుగు సామెత. ఏదేమైనా బిహార్ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తికరం గానూ, ఆశ్చర్యకరంగానూ మారాయి. గతవారం కంటే బీజేపీ లో మరింత ఆశాభావం ఏర్పడింది. అయితే ఇదంతా తన ప్రజాదరణ ప్రభావమని మోదీ భావించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇది బీజేపీ ప్రత్యర్థులైన లాలూ, నితీష్ వంటి వారి అప్రతిష్టే ఈ అనూహ్య పరిణామానికి కారణం. పెంటపాటి పుల్లరావు (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈమెయిల్: Drpullarao1948@gmail.com) -
జయ, లాలు బాటలోనే బాబూ నడవాలి
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే రాజీనామా చేయాలని టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినపుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బీహార్ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ తమ తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా వారి బాటలోనే నడవాలని, పదవి నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని నోముల విమర్శించారు. గవర్నర్ తప్పుకోవాలంటూ టీ-టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. -
బిహార్ సీఎం అభ్యర్థి నితీశ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూల సయోధ్య * జేడీయూ నేత అభ్యర్థిత్వానికి లాలూ ఓకే న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూల మధ్య పొత్తుపై అనిశ్చితి తొలగింది. పొత్తుకు ప్రధాన అడ్డంకిగా మారిన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అంగీకారం కుదిరింది. జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తానసలు పోటీ చేయబోవడం లేదని లాలూ ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీల కూటమి తరఫున నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు సోమవారం లాలూ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ల సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. ‘నితీశ్ పేరును లాలూజీనే ప్రతిపాదించారు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు’ అని ములాయం పేర్కొన్నారు. ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ.. ‘మతతత్వం అనే విషనాగును అంతం చేసేందుకు ఏ విషాన్నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. మేమంతా కలసి ఆ విషనాగును అంతం చేస్తాం. బిహార్ నుంచి బీజేపీని తుడిచిపెట్టేస్తాం’ అని ప్రతిన బూనారు. ‘నేనీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. నా కుటుంబం నుంచి కానీ, పార్టీ నుంచి కానీ సీఎం పదవికి పోటీ లేదు. నా భార్యాపిల్లలకు ఆ పదవిపై ఆసక్తి లేదు’ అని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలోనూ సామరస్యపూర్వక నిర్ణయాలుంటాయన్నారు. నితీశ్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. ‘నితీశ్, నేను ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాం. పోరాటాలు చేసుకున్నాం. అయినా, రాజ్యసభ ఎన్నికల సమయంలో జేడీయూలో విభేదాలు వచ్చినప్పుడు బీజేపీ లబ్ధి పొందకుండా ఆ పార్టీకి మద్దతిచ్చాను’ అని వివరించారు. బిహార్ మాజీ సీఎం, నితీశ్ రాజకీయ శత్రువు మాంఝీతో సంబంధాలపై వివరణ ఇస్తూ.. ‘నితీశ్‌ను గద్దె దించితే.. నా నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు.నేను వారి వలలో పడలేదు’ అన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సహా పలువురు ఆర్జేడీ నేతలు నితీశ్ సీఎం అభ్యర్థిత్వంపై విముఖత వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. ‘వారి అభిప్రాయాలు వారికుండొచ్చు.. కానీ నిర్ణయం తీసేసుకున్నాం’ అన్నారు. ఎన్డీయే బలోపేతం కావడం వల్లనే.. బిహార్‌లో ఎన్డీయే బలోపేతం కావడం వల్లనే ఆర్జేడీ, జేడీయూలు ఒక్కటయ్యాయని బీజేపీ పేర్కొంది. మునిగిపోతున్నవారు కనిపించిన చిన్న కొమ్మనైనా పట్టుకుని బయటపడాలనుకున్నట్లుగా వారి పొత్తు ఉందని పార్టీ ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ తేల్చి చెప్పారు. -
బరిలో దూకేది మా వాడే
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి ఏకమైన ఆరుపార్టీల కూటమి ఇపుడు మరో అడుగు ముందుకేసింది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ స్వగృహంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పాల్గొన్న ఈ భేటీలో లాలూ చేసిన ఈ ప్రతిపాదనకు నేతలు తమ ఆమోదం తెలిపారు. తనను అభ్యర్థిగా ప్రతిపాదించిన లాలూకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం నితీష్, ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి అడ్డుకోవడం తమ ప్రధాన లక్ష్యమని ఆర్జేడీ అధినేత లాలూ తెలిపారు. ఆర్జేడీ నుంచి ముఖ్యమంత్రి పోటీకి ఎవరూ ఆసక్తిగా లేరని ప్రకటించారు. తమ పార్టీ నుంచి గానీ, తన కుటుంబం నుంచి గానీ ఎవరూ పోటీకి సిద్ధంగా లేరు కాబట్టే తాను నితీష్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. జేడీ (యూ) కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఇతర పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు గతంలోనే జేడీయూ నేత శరద్ యాదవ్ వెల్లడించారు. కాగా ఎన్డీఎ ప్రభుత్వానికి దీటుగా ఆరు పార్టీలు ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, ఎస్‌జెపి, జేడీ(ఎస్), ఐఎన్‌ఎల్‌డిల నేతలు జనతా పరివార్‌గా ఆవిర్భవించిన విషయం తెలిసిందే -
ఎన్నికల హామీలేమయ్యాయి?
కేంద్రంపై ‘జనతా పరివార్’ నేతల ధ్వజం ఢిల్లీలో మహాధర్నా చేతులు కలిపిన ములాయం, లాలూ, నితీశ్, శరద్‌యాదవ్ సాక్షి, న్యూఢిల్లీ: పాత మిత్రులు ఏకమయ్యారు.. విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపై కొలువుదీరారు.. గతంలో ‘జనతా పరివార్’లో కీలక భూమిక పోషించిన ఆరు పార్టీలు సోమవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించాయి. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆ పార్టీ ముఖ్యనేత నితీశ్ కుమార్, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ, ఐఎన్ఎల్డీ నాయకుడు దుష్యంత్ చౌతాలా, ఎన్సీపీ నేతలు తారిక్ అన్వర్, డీపీ త్రిపాఠిలతోపాటు సమాజ్‌వాదీ జనతాపార్టీ(ఎస్జేపీ) నాయకుడు కమల్ మొరార్కా తదితరులు పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన మద్దతును తెలుపుతూ పార్టీ నేత డెరిక్ ఓబ్రీన్ ద్వారా ఒక లేఖను పంపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో గుప్పించిన హామీలను విస్మరించి విభజన రాజకీయాలకు పాల్పడతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. సర్కారును దీటుగా ఎదుర్కోవాలంటే ఒక్కతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్ని పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. కేంద్రంపై విమర్శల జడి: విభేదాలను పక్కనపెట్టి బలమైన ప్రతిపక్షంగా ఏర్పడేందుకు ఇతర పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉందని జేడీయూ నేత నితీశ్ కుమార్ అన్నారు. ‘‘మనమంతా ఒకే పార్టీగా ఏర్పడాలి. ఇందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ములాయంసింగ్ విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. ఇతర పార్టీలనూ కలుపుకొని పోదాం.’’ అని అన్నారు. లాలూ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘నల్లధనాన్ని వెనక్కి తెస్తే ఒక్కో పేదవాడికి రూ.15 లక్షలు ఇవ్వొచ్చని వీరు చెప్పారు. ఆ హామీ ఎటు పోయిందో అడగండి.’’ అంటూ మండిపడ్డారు. శరద్ యాదవ్ మత మార్పిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి ఒక్కరూ ఒకే మతాన్ని ఆచరించాలని అనుకుంటే దానిపైనే మళ్లీ ఎన్నికలకు రావాలంటూ మోదీకి సవాలు విసిరారు. గతంలో రెండుసార్లు ఆరు పార్టీల నేతలు సమావేశమై కొత్త కూటమికి పెట్టాల్సిన పేరు, జెండాపై చర్చించారు. ‘సమాజ్‌వాది జనతాదళ్’గా నామకరణం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
లాలు కుమార్తెతో ములాయం మనుమడి నిశ్చతార్థం
-
'ఏదో ఒక రోజు ప్రధానినవుతా'