కోల్ కతా: ఆర్ జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మూడో కూటమి ఏర్పడటం ప్రస్తుత తరుణంలో అత్యావశ్యకమని పేర్కొన్నారు. బీజేపీ, సంఘ్ కూటమి దేశాన్ని ముక్కులు చేయడానికి ప్రయత్నం చేస్తోందని, లౌకిక పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన లాలూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతో కలిసి ఈ వ్యాఖ్యలు చేశారు.
లౌకికి పార్టీలన్నీ ఒక్కటి కాకుంటే బీజేపీ, సంఘ్ శక్తులు దేశాన్ని ముక్కులు చేస్తాయాన్నారు. పశ్చిమ బెంగాల్లో దీదీ విజయం సెక్యులర్ పార్టీలకు కొత్త బలాన ఇచ్చిందన్నారు. కాగా మూడో కూటమికి మమత నాయకత్వం వహించనున్నారా అని ప్రశ్నించగా కూటమికి నాయకత్వం వహించగల నాయకులు ప్రాంతీయ పార్టీల్లో చాలామంది ఉన్నారని ఫరూక్ పేర్కొన్నారు. వ్యక్తుల కోసం కాదని దేశ ప్రజలకోసం మూడో కూటమని ఫరూక్ తెలిపారు.