
పట్నా: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తరచూ ఏదో ఒకవిషయమై వార్తల్లో కనిపిస్తుంటారు. ఒక్కోసారి ఆయన తన భక్తిప్రపత్తులను ఘనంగా ప్రకటిస్తుంటారు. తాజాగా తేజ్ ప్రతాప్ తన తండ్రి కోసం భాగవత కథా గానాన్ని ఆలపించారు. తేజ్ ప్రతాప్ ఇంటిలోనే ఈ కార్యక్రమం జరిగింది. తన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరి శ్రేయస్సును కోరుతూ తాను భాగవత కథా గానాన్ని చేశానని ఆయన తెలిపారు.
తాను ఈ కథాగానాన్ని నాలుగోసారి నిర్వహిస్తున్నానని, ఈ కార్యక్రమానికి సీఎం నితీష్‌ని కూడా ఆహ్వానించానన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం తేజ్ ప్రతాప్ యాదవ్ శివలింగానికి జలాభిషేకం చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. జలాభిషేక సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్ శివలింగానికి అతుక్కుని కూర్చున్నట్లు కనిపించారు. దీనికి ముందు తేజ్ ప్రతాప్ కృష్ణుడు, శివుడు గెటప్‌లలో కనిపించారు.
#WATCH | Patna, Bihar: RJD chief Lalu Prasad Yadav participated in Shrimad Bhagwat Katha at the residence of RJD leader Tej Pratap Yadav (04.09) pic.twitter.com/7lfaGPjmTz
— ANI (@ANI) September 5, 2024