Tej Pratap Yadav
-
హోలీ డ్యాన్స్ చేస్తావా.. సస్పెండ్ చేయించమంటావా?
పాట్న: హోలీ వేడుకల సమయంలో డ్యాన్స్ చేస్తావా లేక సస్పెండ్ చేయించమంటావా అంటూ ఒక పోలీసును ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ బెదిరించడం వివాదం రేపుతోంది. మాజీ సీఎంలు లాలు ప్రసాద్, రబ్డీదేవీల పెద్ద కుమారుడు ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ అధికార నివాసం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రి లాలు మాదిరిగానే హోలీ వేడుక సమయంలో పండగ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మద్దతు దారుల చొక్కాలను తేజ్ ప్రతాప్ చించివేశారు. అనంతరం స్కూటర్‌పై ‘పిల్లిమొగ్గల చిన్నాన్నకు హోలీ శుభాకాంక్షలు’అని పరోక్షంగా సీఎం నితీశ్‌కుమార్‌ను ఉద్దేశించి తన నివాసం చుట్టుపక్కల వీధుల్లో కేకలు వేస్తూ తిరిగారు. అదేవిధంగా, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదికపై సోఫాలో కూర్చుని.. ‘ఏయ్ పోలీస్.. దీపక్..ఇప్పుడు మేమొక పాట వేస్తాం. డ్యాన్స్ చేయాలి. లేదంటే నువ్వు సస్పెండ్ అవుతావ్. ఏమనుకోకు, ఇది హోలీ పండగ’ అని అక్కడే ఉన్న దీపక్ అనే కానిస్టేబుల్నుద్దేశించి అంటున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో, ఆ కానిస్టేబుల్ అక్కడి వారితో కలిసి కొద్దిసేపు డ్యాన్స్ చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. ‘తండ్రి మాదిరిగానే కుమారుడు కూడా. అప్పట్లో సీఎంగా లాలు చట్టాన్ని డ్యాన్స్ చేయించాడు. బిహార్‌ను జంగిల్ రాజ్‌గా మార్చాడు. ఇప్పుడు కుమారుడు అధికారంలో లేకున్నా, చట్టాన్ని, రక్షకులను డ్యాన్స్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి వారికి అధికారం ఇవ్వరాదు’ అని పేర్కొంది. VIDEO | A policeman was seen dancing on the instruction of RJD leader Tej Pratap Yadav during Holi celebration at his residence in Patna. #tejpratapyadav #Holi #Patna pic.twitter.com/oCIP0kL03r— Press Trust of India (@PTI_News) March 15, 2025 -
జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(ఉద్యోగ కుంభకోణం) కేసులో అక్టోబర్ 7న తమ ఎదుట హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విశాల్ గోగ్నే ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ కేసులో నిందితుడిగా లేనటువంటి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలకాగా 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు మార్చి 2023లో బెయిల్ మంజూరు చేసింది. ఇక లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను జూన్‌లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. -
లాలూ కోసం తేజ్ ప్రతాప్ భాగవత కథా గానం
పట్నా: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తరచూ ఏదో ఒకవిషయమై వార్తల్లో కనిపిస్తుంటారు. ఒక్కోసారి ఆయన తన భక్తిప్రపత్తులను ఘనంగా ప్రకటిస్తుంటారు. తాజాగా తేజ్ ప్రతాప్ తన తండ్రి కోసం భాగవత కథా గానాన్ని ఆలపించారు. తేజ్ ప్రతాప్ ఇంటిలోనే ఈ కార్యక్రమం జరిగింది. తన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరి శ్రేయస్సును కోరుతూ తాను భాగవత కథా గానాన్ని చేశానని ఆయన తెలిపారు.తాను ఈ కథాగానాన్ని నాలుగోసారి నిర్వహిస్తున్నానని, ఈ కార్యక్రమానికి సీఎం నితీష్‌ని కూడా ఆహ్వానించానన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం తేజ్ ప్రతాప్ యాదవ్ శివలింగానికి జలాభిషేకం చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. జలాభిషేక సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్ శివలింగానికి అతుక్కుని కూర్చున్నట్లు కనిపించారు. దీనికి ముందు తేజ్ ప్రతాప్ కృష్ణుడు, శివుడు గెటప్‌లలో కనిపించారు. #WATCH | Patna, Bihar: RJD chief Lalu Prasad Yadav participated in Shrimad Bhagwat Katha at the residence of RJD leader Tej Pratap Yadav (04.09) pic.twitter.com/7lfaGPjmTz— ANI (@ANI) September 5, 2024 -
ఆసుపత్రిలో చేరిన ఆర్జేడీ నేత 'తేజ్ ప్రతాప్ యాదవ్'
రాష్ట్రీయ జనతా దళ్ ( RJD ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు 'తేజ్ ప్రతాప్ యాదవ్' శుక్రవారం స్వల్ప అస్వస్థకు గురయ్యారు. లో బీపీ (బ్లడ్ ప్రెషర్) కారణంగా ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజేంద్ర నగర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. ఇంటి వద్ద ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతిలో నొప్పి అని చెప్పడంతో.. అతని సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. తేజ్ ప్రతాప్ ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరడం తొమ్మిది నెలల్లో ఇది రెండోసారి. ఆసుపత్రిలో చేరటానికి ముందు తేజ్ ప్రతాప్ యాదవ్ కృష్ణబ్రహ్మం ప్రాంతంలో జ్ఞాన్ బిందు గ్రంథాలయాన్ని ప్రారంభించి బక్సర్ జిల్లాను సందర్శించారు. ఇప్పటికే పర్యావరణ శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. ప్రస్తుతం ఈయన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. -
రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకి రాడట!
స్వయంగా శ్రీరామచంద్రుడే ఆయన కలలోకి వచ్చాడట!. వచ్చి ఏం చెప్పాడనేగా.. ఏం లేదు ఈ నెల 22వ తేదీన జరగబోయే అయోధ్య రామ్‌లల్లాప్రాణ ప్రతిష్టకు తాను రావట్లేదని చెప్పాడట!. ఎందుకు.. రాముడు ఏమైనా అలిగాడా? అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై పలువురు నేతలు వ్యాఖ్యలు చేస్తుండడం.. వాటిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడం చూస్తున్నాదే. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు. ‘‘ఒక్కసారి ఎన్నికలు అయిపోయాయంటే శ్రీరామచంద్రుడ్ని అంతా మరిచిపోతారు. అలాంటప్పుడు జనవరి 22వ తేదీన రావడం అవసరమా?. నాలుగు శంకరాచార్యులతో పాటు నా కలలోకి శ్రీరాముడు వచ్చారు. అయోధ్యలో కపటనాటకం నడుస్తుంది కాబట్టి తాను రావట్లేదని నాతో చెప్పారు’’ అని ఓ కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 22 तारीख़ को राम जी नहीं आयेंगे हमको भी 4 शंक्राचार्य की तरह सपने में आकर बोले हैं राम जी — तेज प्रताप यादव #ayodhyarammandir #tejpratapyadav pic.twitter.com/rj5oaUAtb0 — Uved Muazzam 🇮🇳 (@mohd_uved) January 14, 2024 వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలపై తేజ్ ప్రతాప్ సోదరుడు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించాల్సింది. మరోవైపు ఈ ఆర్జేడీ యువ నేత వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. -
లాలూ కొడుకు ఇంట చోరీ!
పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ పర్యావరణ, అటవీశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో దొంగతనం జరిగింది. జానపద కళాకారులు తన నివాసంలో ఖరీదైన వస్తువులను దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ సన్నిహితుడు మిసాల్ సిన్హా మార్చి 10న సచివాలయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన కళాకారులు దీపక్ కుమార్, మరో ఐదుగురు కలిసి ఈ దొంగతనం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాట్నాలోని తన ప్రభుత్వ బంగ్లాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనానికి చెందిన జానపద కళాకారులు ప్రదర్శన ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ నెల 9న వారు తిరిగి వెళ్లిన తర్వాత ఇంట్లో రూ. 5 లక్షల విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. అయితే ఈ వస్తువుల గురించి సదరు కళాకారులను అడిగినప్పటికీ ఏమీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే తేజ్ ప్రతాప్ నివాసంలో బృందావనం జానపద కళాకారులు ఏయే వస్తువులు అపహరించారనేది ఇంకా తెలియాలేదని స్టేషన్ ఇంచార్జ్ భగీరథ్ ప్రసాద్ తెలిపారు. -
పార్టీ నాయకుడిపై లాలు యాదవ్ కొడుకు ఫైర్.. సమావేశం మధ్యలోనే...
న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత లాలు యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తరుచు ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఢిల్లీల జరిగిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడి) సమావేశానికి హజరయ్యారు. ఐతే ఆ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రజాక్‌ని దుర్భాషలాడుతూ...సమావేశం మధ్యలోంచే బయటకు వచ్చేశారు. ఈ విషయమై తేజ్ ప్రతాప్‌ని మీడియా ప్రశ్నించగా...ఆయన సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు నిరాకరించారు. తాను బలహీనమైన వ్యక్తిని అని, చాలా ఒత్తిడిలో ఉన్నానని అన్నారు. అదీగాక రెండు రోజుల క్రితమే తన మేనల్లుడు చనిపోయాడని అయినప్పటికీ సమావేశానికి వచ్చానంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. తాను సమావేశం షెడ్యూల్ గురించి అడిగితో కార్యదర్శి శ్యామ్ రజాక్ తన సోదరిని, వ్యక్తిగత సహాయకుడి దుర్భాషలాడరని, ఆడియో రికార్డు కూడా ఉందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇలానే ఇటీవల తన తండ్రి కోసం మధురలో పూజలు చేసే విషయమై వచ్చి నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కి మీడియాలో నిలిచారు. (చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన) -
బావ అధికారిక సమావేశంలో బావమరిది హాజరు...వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం
పాట్న: మరోసారి వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. బిహార్ పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ అధికారిక సమావేశంలో లాలు ప్రసాద్ అల్లుడు హాజరవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి వర్గంలో మంత్రి తేజ్ ప్రతాప్ సంబంధించిన శాఖపరమైన సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆర్జేడీ పై అధికార పార్టీ బీజేపీ విమర్శల దాడి చేసింది. వాస్తవానికి తేజ్ ప్రతాప్ ఆగస్టు 16న మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజున ఆయనకు కేటాయించిన పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల శాఖ బాధ్యతలు చేపట్టారు. ఐతే ఆగస్టు 17న అరణ్య భవన్లో అటవీ వాతావరణ మార్పుల శాఖ సమీక్ష సమావేశానికి తేజ్ ప్రతాప్ అధ్యక్షత వహించారు. అప్పుడు జరిగిన అధికారుల సమావేశానికి లాలు ప్రసాద్ పెద్ద అల్లుడు శైలేష్ కుమార్ కూడా వచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 18న బిహార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో కూడా తేజ్ ప్రతాప్ మరోసారి సమావేశమయ్యారు. ఆ సమావేశానికి కూడా శైలేష్ రావడమే కాకుండా ఆయనతోపాటు కలిసి కూర్చోవడంతో పెద్ద దూమారం రేగింది. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టింది. "తేజ్ ప్రతాప్‌ని ఎవ్వరూ తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే మంత్రులందరిలోనూ ఆర్జేడీ కోటా కుమారుడు శైలేష్ యాదవ్ అత్యంత తెలివైనవాడు అతని ఆశీస్సులు తేజ్ ప్రతాప్‌కు ఉంటే ఉత్తమ మంత్రిగా ఎదుగుతాడు." అని ఎద్దేవా చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి శైలేష్‌ని ఉద్దేశించి విమర్శిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు!) -
లాలూ యాదవ్ కుమారుడి విచిత్రమైన అభ్యర్థన... తిరస్కరించిన పోలీసులు
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ తన తండ్రి ఆరోగం కోసం ప్రార్థించేందుకు మధురకు వచ్చారు. ఐతే అతని విచిత్రమైన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. మధురలోని గిరిరాజ్ మహరాజ్ ఆలయంలో దేవాలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేయడానికి లేదా దర్శనం చేసుకువాడానికి భక్తులను కాలినడకనే అనుమతిస్తారు. అదీగాక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో వాహానాల ప్రవేశాన్ని నిషేధించారు. ఐతే తేజ్ ప్రతాప్ తాను పరిక్రమ(ప్రదక్షిణ) చేయడానికి కారుతో దేవాలయ ప్రాంగణంలోకి వెళ్తానంటూ విచిత్రంగా అభ్యర్థించాడు. పూర్ణిమ సందర్భంగా విచ్చేసిన భక్తుల రద్దీ దృష్ణ్యా అధికారులు తేజ్ప్రతాపప్కి అనుమతి నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన తేజ్‌ప్రతాప్ దేవాలంయంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తన కారుతో సహా దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించేలా అధికారిక అనుమతి కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు కూడా. ఐతే అక్కడ కూడా తేజ్ ప్రతాప్‌కి అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై పోలీస్ అధికారి మాట్లాడుతూ...ముదియ పూర్ణిమ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినందున, ప్రార్థనలు చేసేందుకైనా లేదా ప్రదక్షిణలు చేయడానికైన భక్తులను కాలినడకనే ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తాం. కానీ వాహనంతో సహా లోపలకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. అదీగాక ఆలయ ప్రధాన ద్వారం వద్ద పరిక్రమ(ప్రదక్షిణ) నిర్వహించడం ఇక్కడ ఒక ప్రామాణిక ఆచారం, శ్రీకృష్ణుని భక్తులు దీన్ని పవిత్రంగా భావిస్తారు అని చెప్పారు. (చదవండి: నిలకడగా లాలూ ఆరోగ్యం.. పరామర్శించిన నితీశ్, ఫోన్లో ప్రధాని మోదీ ఆరా) -
మాజీ సీఎం కొడుకు ఇంట్లో చొరబడిన మందుబాబులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సాక్షి, పాట్నా : బిహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంట్లోకి మందుబాబులు చొరబడి హల్ చల్ చేశారు. చంపేస్తానంటూ వార్నింగ్ కూడా ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి, తన స్నేహితులతో కలిసి పాట్నాలోని తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంట్లోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో తేజ ప్రతాప్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో అక్కడ ఉన్న ఆయన సన్నిహితుడు, ఆర్జేడీ యూత్ వైస్ ప్రెసిడెంట్ సృజన్ స్వరాజ్‌ను వారు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే స్వరాజ్ ను చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో వారిని అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయంపై సృజన్ పోలీసులను ఆశ్రయించారు. గౌరవ్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు తెలిపారు. -
తేజస్వికి పార్టీ పగ్గాలపై లాలూ తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ పగ్గాలు మారబోతున్నట్లు వస్తున్న కథనాలపై ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అలాంటి వార్తల్ని ప్రసారం చేసేవాళ్లను మూర్ఖులుగా ఆయన అభివర్ణించారు. ఆర్జేడీ జాతీయాధ్యక్షుడిగా లాలూ దిగిపోతున్నారని.. ఆ స్థానే చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్‌కు త్వరలో పగ్గాలు అప్పగించబోతున్నట్లు కొన్ని మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై లాలూను వివరణ కోరగా.. ఆయన స్పందించారు. ‘అలాంటి వార్తలు ఇచ్చేవాళ్లు మూర్ఖులు. పిచ్చోళ్లే అలాంటివి ప్రచారం చేస్తారు. ఏమైనా ఉంటే మేం చెప్తాం కదా’ అని న్యూఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తేజస్విని పార్టీ ప్రెసిడెంట్ చేయబోతున్నట్లు వస్తున్న కథనాలపై పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్ కూడా స్పందించాడు. ఆ కథనాల్ని కొట్టిపారేస్తూ.. తండ్రి లాలూనే పార్టీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు లాలూ సతీమణి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్, పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే తేజస్విని పార్టీ చీఫ్‌గా ప్రకటిస్తారనే కథనాలు మొదలయ్యాయి. #WATCH | Delhi: "Those who run such news reports are fools. We will get to know whatever happens," says RJD chief Lalu Prasad Yadav when asked if Tejashwi Yadav will be made the national president of the party. (04.02.2022) pic.twitter.com/NYC5YiLzVm — ANI (@ANI) February 5, 2022 -
‘తేజస్వీ బర్త్‌డే గిఫ్ట్‌గా సీఎం పీఠం’
పట్నా: బిహార్ రాజకీయాల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మరో సారి నితీష్ సర్కార్ అని ఎన్డీఏ కూటమి భావిస్తుండగా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) యువ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కు అధికారం ఖాయమని అంచాన వేస్తున్నాయి. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోదరుడు తేజస్వీ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి పీఠం బర్త్‌డే గిఫ్ట్‌గా దక్కనుంది అని తెలిపారు. నవంబర్ 9న తేజస్వీ యాదవ్ పుట్టిన రోజు. దాంతో ఆర్జేడీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ ఎంతో ఘనంగా తేజస్వీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇక తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో బిహార్ ప్రజలు నితీష్ కుమార్‌ను తిరస్కరించారు. ఉపాధి కల్పన వంటి అంశాల్లో జేడీయూ ప్రభుత్వం ఘోరంగా పరాజయం అయ్యింది. అంతేకాక నితీష్ పాలనలో ఎన్నో స్కాములు జరిగాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఈ సారి మహాఘట్ బంధన్‌కు ఓటేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పక్కన పెట్టండి. మాకు బిహారీల పట్ల నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ని మాకు ఇస్తారని నమ్ముతున్నాం’ అన్నారు. (చదవండి: ఆర్జేడీ కూటమికే జై) కాంగ్రెస్ నాయకుడు కృతి జా అజాద్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ‘పుట్టిన రోజు కానుకగా ముఖ్యమంత్రి పీఠాన్ని గెలుచుకోబోతున్న తేజస్వీ యాదవ్‌కు అభినందనలు. ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది’ అన్నారు జా. ఒకవేళ తేజస్వీ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబం ఓ రికార్డు సృష్టిస్తుంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు సీఎంలు అయ్యారనే ఘనత దక్కుతుంది. తేజస్వీ కుటుంబంలో ఇప్పటికే ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, తల్లీ రబ్రీదేవిలు ముఖ్యమంత్రులుగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్ప్ మహాఘట్బంధన్ భారీ విజయం సాధించబోతుందని అంచాన వేశాయి. ఇక ఇప్పటికే 38 జిల్లాలోని 55 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. మరి కొన్ని గంటల్లో ఎవరి భవిష్యత్తు ఏంటనే విషయం బయటపడనుంది. -
బిహార్ ఎన్నికలు.. ఆర్జేడీకి భారీ షాక్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లపై హత్యకేసు నమోదైంది. వీరితో పాటు ఆర్జేడీ నేతలు అనిల్ కుమార్ సాధు, కలో పాస్వాన్లతో పాటు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్జేడీ ముఖ్య నేతలపై హత్యారోపణలు రావడం ఆ పార్టీవర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 4న (నిన్న) బిహార్ లోని పూర్నియా జిల్లాలోని మాలిక్ (37) ఇంట్లోకి చొరబడిన దుండగులు అతన్ని కాల్చి చంపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మాలిక్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఉదంతం వెనుక కుట్రకోణం దాగుందని, దీన్ని రాజకీయ హత్యగా మాలిక్ భార్య ఆరోపించారు. ఇంతకుముందు ఆర్జేడీ నుంచి మాలిక్‌ను సస్పెండ్ చేసిన కారణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. (బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్) పార్టీ టికెట్ కేటాయించడానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్లు కొన్ని రోజులక్రితం మాలిక్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనను కులం పేరిట తేజశ్వి యాదవ్ దూషించినట్లు సైతం మాలిక్ వీడియోలో వెల్లడించారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని అనుకున్న తురణంలోనే ఇలా హత్యకు గురికావడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. మాలిక్ హత్యకేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ విశాల్ శర్మ తెలిపారు. మాలిక్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయని, సంఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా బిహార్ ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి యాదవ్ తన అసలు రంగు బయటపెట్టాడని జేడీ(యు) ఆరోపించింది. (బిహార్ ఎన్డీఏ నుంచి ఎల్జేపీ ఔట్) -
కరోనా: సీఎం బుద్ధి మారాలని యాగం!
పట్నా: బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ ప్రసాద్ యాద్ కొడుకు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఆదివారం ఓ యాగం తలపెట్టారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బుద్ధి మారాలంటూ ఆయన సద్బుద్ధి మహాయజ్ఞం నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న బిహార్ ప్రజలు, విద్యార్థులను తిరిగి స్వస్థలాలకు తీసుకొచ్చే విధంగా సీఎం నితీశ్ కుమార్ మనసు మారాలనే ఈ యజ్ఞం నిర్వహించినట్లు తేజ్‌ప్రతాప్ వెల్లడించారు. ముఖానికి మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించినప్పటికీ యజ్ఞయాగాదులపై నిషేధం ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 251 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇద్దరు మరణించారు. 46 మంది కోలుకున్నారు. (చదవండి: వివక్ష వద్దు.. 130 కోట్ల జనం మనోళ్లే!) -
లాలూకు షాకిచ్చిన ‘వియ్యంకుడు’!
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుటుంబంతో అన్ని బంధాలు తెగిపోయినట్లేనని ఆయన వియ్యంకుడు, పార్టీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ అన్నారు. అదే విధంగా ఆర్జేడీలో ఆత్మగౌరవంతో జీవించే వాళ్లకు చోటు లేదని.. పార్టీలో ఎవరికీ స్వేచ్చగా వ్యవహరించే హక్కు లేదని పేర్కొన్నారు. చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యా రాయ్ వివాహం.. లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌తో జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెళ్లైన కొన్నిరోజులకే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తనకు విడాకులు కావాలంటూ తేజ్‌ప్రతాప్ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన కుమార్తె ఐశ్వర్యను లాలూ భార్య రబ్రీదేవి సహా ఇతర కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేశారంటూ చంద్రికా రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. (‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’) ఈ క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రికా రాయ్.. ఆర్జేడీని వీడి జేడీయూలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆర్జేడీ నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరించిన చంద్రికా రాయ్.. గురువారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో రహస్యంగా భేటీ కావడం బిహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంతో సమావేశమైన అనంతరం చంద్రికా రాయ్ మీడియాతో మాట్లాడుతూ... ఆర్జేడీ తీరుపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా... నితీశ్ కుమార్ దార్శినికత గల ముఖ్యమంత్రి అని, ఆయన హయాంలో బిహార్ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు.(మేం తీసుకోం.. పబ్లిసిటీ కోసం చిల్లర చేష్టలు) కాగా పార్సా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రికా రాయ్ ఆర్జేడీని వీడినట్లయితే యాదవ్ సామాజిక ఓట్లు భారీగానే చీలిపోతాయంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక చంద్రికా రాయ్ గతంలో నితీశ్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ఆర్జేడీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా... జేడీయూ ఉపాధ్యక్షుడిగా పనిచేసి బహిష్కరణకు గురైన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫిబ్రవరి 18న తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలపడంతో బిహార్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. -
ప్రశాంత్ కిషోర్‌కు మరో ఆఫర్..
పట్నా : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎపిసోడ్ ముగియక ముందే ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్‌ను కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు తమవైపుకు తప్పికునేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ ఆహ్వానం పంపింది. ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. పలువురు ఆర్జేడీ నేతలూ ఆయన్ని సంప్రదించేందుకు మంతనాలు చేస్తున్నారని సమాచారం. ఇదిలావుండగా.. తేజ్ ప్రతాప్ ప్రకటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (ప్రశాంత్ కిషోర్, నితీష్ మధ్య బయటపడ్డ విభేదాలు..!) మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో ఆయన చేరతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఇప్పటికిప్పుడు తానేమీ మాట్లాడనని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11న పట్నాలో జరిగే సమావేశంలో తన ప్రణాళికలు గురించి వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా నితీష్, ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో.. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్డీయేలో జేడీయూ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశాంత్ వ్యవరిస్తున్నారు. బిహార్ అసెంబ్లీకి సమయం దగ్గర పడుతుండంతో ఇరుపార్టీల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందని భావించిన ఇరు పార్టీల నేతలు ముందస్తు జాగ్రత్తగా ఆయన్ని తప్పించినట్లు తెలుస్తోంది. (పీకే బహిష్కరణ.. మీరు మళ్లీ సీఎం కావాలి!) -
మేం తీసుకోం.. పబ్లిసిటీ కోసం చిల్లర చేష్టలు
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్యారాయ్ తండ్రి, ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ లాలూ కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెట్టేందుకు ఇంటికి బాంబులు పంపించేరేమో అని వియ్యంకుల తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐశ్వర్య అత్తింటి నుంచి వచ్చిన వస్తువులను తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ క్రమంలో అత్తింటి వారు తనను తీవ్రంగా హింసించి ఇంటి నుంచి గెంటివేశారని ఐశ్వర్యారాయ్ తన అత్త రబ్రీదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పెళ్లి సమయంలో తమ కూతురికి ఇచ్చిన ఖరీదైన కానుకలు, వస్తువులు తిరిగి ఇచ్చేయాలంటూ ఐశ్వర్య తల్లి పూర్ణిమా దేవి... వుమన్ హెల్్పలైన్ ద్వారా వియ్యంపురాలు రబ్రీదేవికి నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో లాలూ నివాసం నుంచి రెండు వ్యాన్లు సామాన్లతో గురువారం ఐశ్వర్య పుట్టింటికి చేరుకున్నాయి. అయితే ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ మాత్రం వాటిని అన్లోడ్ చేయనివ్వలేదు. దీంతో రెండు వాహనాలు రాత్రంతా అక్కడే ఉండిపోయాయి.(‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’) ఈ విషయం గురించి చంద్రికా రాయ్ మాట్లాడుతూ... ‘చట్ట ప్రకారం మెజిస్ట్రేట్, పోలీసుల ముందు ఆ సామాన్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అలా వాళ్లకు వాళ్లే పంపిస్తే వాటిని నేనెందుకు స్వీకరించాలి. మాకు హాని చేసేందుకు అందులో మద్యం బాటిళ్లు, పేలుడు పదార్థాలు పెట్టారేమో అని లాలూ కుటుంబంపై సందేహం వ్యక్తం చేశారు. ఇక చంద్రికా రాయ్ వ్యాఖ్యలపై లాలూ కుమార్తె, ఎంపీ మిసా భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారమే తాము సామాన్లను వెనక్కి పంపామని.. అయితే చంద్రికా రాయ్ మాత్రం పబ్లిసిటీ కోసం చిల్లరగా ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో గతేడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనతికాలంలోనే వీరి కాపురంలో కలతలు చెలరేగడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తండ్రి చంద్రికా రాయ్‌తో ఐశ్వర్యా రాయ్(ఫైల్ ఫొటో) -
‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీపై కేసు నమోదైంది. రబ్రీదేవీ తనను హింసించారని ఆరోపిస్తూ.. లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు విచారణలో భాగంగా తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య... తేజ్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయి తనను వేధించేవాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తేజ్ కుటుంబ సభ్యులు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో భర్తతో సహా తన అత్త రబ్రీదేవి సైతం తనను వేధింపులకు గురిచేశారని ఐశ్వర్యరాయ్ పోలీసులను ఆశ్రయించారు. తేజ్‌ప్రతాప్ విడాకులకు పట్టుబట్టడంతో రబ్రీదేవి తనను తీవ్రంగా కొట్టి బయటకు నెట్టివేశారని పేర్కొన్నారు. మెసేజ్ రావడంతో కిందకు వచ్చాను... ‘నేను నా గదిలో టీవీ చూస్తున్న సమయంలో నా ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. నన్ను, నా కుటుంబ సభ్యులను కించపరుస్తూ తేజ్ మద్దతుదారులు పట్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో పోస్టర్లు అతికించారని తెలిసింది. వెంటనే కిందకు దిగి ఈ విషయం గురించి మా అత్తగారిని నిలదీశాను. నా తల్లిదండ్రుల పరువు తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాను. వెంటనే తను నన్ను అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టారు. నా జుట్టు పట్టుకుని లాగుతూ.. కిందపడేశారు. తల, మోకాళ్లు, పాదాలపై కర్రతో కొట్టారు. బంగ్లా నుంచి గెంటివేసే ముందు చెప్పులు కూడా తొడుక్కోనివ్వలేదు. నా ఫోన్, ఇతర వస్తువులు లాక్కొన్నారు’ అంటూ సర్కులర్ రోడ్డు నివాసం బయట ఏడుస్తూ ఐశ్వర్య విలేకరులతో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో తన తండ్రి చంద్రికారాయ్ సహా ఇతర కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రబ్రీ దేవిపై కేసు నమోదు చేశారు. ఇక బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో గతేడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ఆటోను ఢీకొన్న యువనేత బీఎండబ్ల్యూ..
లక్నో : ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పేరిట నమోదైన బీఎండబ్ల్యూ కారు యూపీలోని వారణాసిలో ఓ ఆటోను ఢీ కొట్టింది. వారణాసిలోని రోహిన్య ప్రాంతంలో గురువారం ఉదయం బీఎండబ్ల్యూ కారు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు బంపర్ దెబ్బతిందని స్ధానికులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్ కారులో లేరు. తేజ్ ప్రతాప్‌ను రిసీవ్ చేసుకునేందుకు తాము ఢిల్లీ వెళుతున్నామని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలైన సమాచారం ఇప్పటివరకూ రాలేదని అధికారులు తెలిపారు. -
ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు
పట్నా: నాటకీయ పరిణామాల మధ్య బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇంటిలోనికి అనుమతించారు. కోడలి నిరసనతో రబ్రీ దేవి దిగివచ్చారు. వివాహమైన కొద్ది నెలలకే తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాక భార్యతో విడాకులు ఇప్పిస్తేనే ఇంటికి వస్తానంటూ.. వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భర్త డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్యర్య మొదటి సారి అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అత్త రబ్రీ దేవి, ఆడపడుచు మీసా భారతి తనకు ఆహారం కూడా పెట్టకుండా వేధించడమే కాక ఇంట్లో నుంచి గెంటేశారని తెలిపారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాల్సిందిగా అత్తింటి బయట కూర్చుని నిరసన తెలిపారు ఐశ్వర్య. ఆమె తండ్రి చంద్రికా రాయ్ కూడా ఐశ్వర్యతో పాటు కూర్చుని.. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా మరికొందరు కలిసి రబ్రీ దేవి ఇంటి ముందు ధర్నాకు దిగారు. లాలూ, రబ్రీ దేవిలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దాంతో రంగంలోకి దిగిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే వివాదాన్ని పరిష్కరించడంతో సోమవారం మధ్యాహ్నం ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు. రబ్రీ దేవి, మీసా భారతి తనను వేధిస్తున్నారని.. తిండి కూడా పెట్టడం లేదని ఐశ్వర్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మీసా భారతి మూలంగానే తనకు, తన భర్తకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని ఐశ్వర్య ఆరోపించారు. రబ్రీదేవి సమక్షంలోనే మీసా భారతి తనను ఇంటి నుంచి గెంటేశారని వాపోయిన సంగతి తెలిసిందే. -
తిండి కూడా పెట్టకుండా వేధించారు
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ అత్తింటి వారిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తన అత్త రబ్రీదేవి తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆడపడుచు మిసా భారతి తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని, తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి భారతి ప్రయత్నిస్తున్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. రబ్రీ దేవి తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఐశ్వర్య తండ్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రిక రాయ్ ఆరోపించారు. దీనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించిన ఆయన తన కుమార్తెకు అత్తగారి ఇంట్లో అన్ని హక్కులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. (ఆదివారం సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు) మరోవైపు రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి ఐశ్వర్యా రాయ్ ఆరోపణలను ఖండించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున్న తాను ఆమెను ఎలా వేధించగలను అని ప్రశ్నించారు. తానెపుడు ఆమెను సోదరిలా భావించానంటూ ఐశ్యర్య ఆరోపణలు నిరాధారమైనవనీ కొట్టిపారేశారు. తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఇదంతా చేస్తోందనీ, తద్వారా తన ఆరోపణలకు మరింత బలం చేకూరాలని భావిస్తోందన్నారు. కాగా 2018, మే నెలలో అంగరంగ వైభవంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే, కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్వర్య గృహ హింస నుంచి తనను కాపాడాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో తేజ్ ప్రతాప్ విడాకుల కోసం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆమె తండ్రి చదవండి : కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య.. -
కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య...
-
కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య..
పట్నా : విడాకుల కేసుకు సంబంధించి కోర్టుకు బదులిచ్చిన నెలరోజుల తర్వాత బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్య రాయ్ మెట్టినింటిని వీడారు. తండ్రి చంద్రికారాయ్ వాహనంలో ఆమె అత్త రబ్రీ దేవి నివాసం నుంచి కన్నీటితో వెనుదిరిగారు. గత ఏడాది మేలో ఆర్భాటంగా వీరి వివాహం జరగ్గా అప్పటి నుంచి తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య అత్తవారింట్లోనే ఉన్నారు. పెళ్లయిన కొద్ది నెలలకే వీరి మధ్య కలతలు చెలరేగాయి. తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఐశ్వర్యా రాయ్ గత నెలలో ఆరోపించారు. గృహ హింస నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఆమె సెక్షన్ 26 కింద ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిసగా మారాడని గుర్తించానని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన అత్తమామలకు ఈ విషయం తెలిపినా వారు పట్టించుకోలేదని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆయన తనను తాను శివుడి అవతారంగా చెప్పుకొనేవాడని ఆమె పేర్కొన్నారు. ‘తేజ్ శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతను దేవతలుగా, దేవుళ్లుగా దుస్తులు ధరిస్తాడని తెలుసుకొని షాక్ అయ్యాను. ఒకసారి డ్రగ్స్ మత్తులో అతను గాగ్రా, చోలీ ధరించి.. మేకప్ వేసుకొని, విగ్గు పెట్టుకొని రాధగా తయారయ్యాడు’ అని ఐశ్వర్య వెల్లడించారు. పెళ్లయిన కొద్ది నెలలకే వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. -
నేనింతే: కృష్ణుడిగా మరోసారి...!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా ఆయన మురళీధరుడి వేషం ధరించారు. అనంతరం తన నివాసంలో మరికొంత మంది నటులతో కలిసి శ్రీకృష్ణుడి లీలామృతాన్ని ప్రదర్శిస్తూ.. వేణుగానం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. తేజ్ ప్రతాప్ ఇలాంటి వేషాలు ధరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన శివుడు, కృష్ణుడి వేషధారణలో అనేకమార్లు కనిపించారు. కాగా కొన్ని రోజుల క్రితం విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన భార్య ఐశ్యర్యారాయ్‌తో కలిసి ఉండలేనని, తామిద్దరం ఉత్తరదక్షిణ ధృవాల వంటి వాళ్లమని తెలిపారు. విడాకుల విషయంలో తన కుటుంబ సభ్యులే తనకు వ్యతిరేకంగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేసి కొన్నాళ్లు అఙ్ఞాతంలోకి కూడా వెళ్లారు. ఈ క్రమంలో పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు విచారణలో భాగంగా తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య... ఆయనకు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయి తనను వేధించేవాడని సంచలన విషయాలు తెలిపారు. భర్త మత్తుకు బానిస అన్న విషయం పెళ్లయిన కొత్తలోనే తనకు తెలిసిందని, డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆయన తనను తాను శివుడి అవతారంగా చెప్పుకొనేవాడని ఆమె పేర్కొన్నారు. ‘తేజ్ శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతను దేవతలుగా, దేవుళ్లుగా దుస్తులు ధరిస్తాడని తెలుసుకొని షాక్ అయ్యాను. ఒకసారి డ్రగ్స్ మత్తులో అతను గాగ్రా, చోలీ ధరించి.. మేకప్ వేసుకొని, విగ్గు పెట్టుకొని రాధగా తయారయ్యాడు’ అని ఐశ్వర్య వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహిళలపై గృహ నిరోధ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టులో ఆమె అభ్యర్థన దాఖలు చేశారు. అయినప్పటికీ తేజ్ ప్రతాప్ మాత్రం తనదైన శైలిలో మరోసారి కృష్ణుడి వేషం ధరించి..నాటకం ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక జైళ్లో ఉన్న లాలూకు తేజ్ వ్యవహారం తలనొప్పిగా మారింది. అంతేగాకుండా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర ఓటమి పాలవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. -
గంజాయ్ తాగేవాడు.. గాగ్రా, చోలీ వేసేవాడు!
పట్నా: బిహార్ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయిన ఆయన నిత్యం తనను వేధించేవాడని అతని భార్య ఐశ్వర్య రాయ్ తెలిపారు. భర్తకు డ్రగ్స్ అలవాటు ఉందని పెళ్లయిన కొత్తలోనే తనకు తెలిసిందని, డ్రగ్స్ మత్తులో అతను శివుడి అవతారంగా చెప్పుకొనేవాడని ఆమె వెల్లడించారు. ఈ మేరకు పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసులో ఆమె సమాధానం ఇచ్చారు. మహిళలపై గృహ నిరోధ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టులో ఆమె అభ్యర్థన దాఖలు చేశారు. ‘తేజ్ శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతను దేవతలుగా, దేవుళ్లుగా దుస్తులు ధరిస్తాడని తెలుసుకొని షాక్ అయ్యాను. ఒకసారి డ్రగ్స్ మత్తులో అతను గాగ్రా, చోలీ ధరించి.. మేకప్ వేసుకొని, విగ్గు పెట్టుకొని రాధగా తయారయ్యాడు’ అని ఆమె తెలిపారు. 2018 మేలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల తనయుడైన తేజ్ ప్రతాప్ సింగ్, ఐశ్వర్యరాయ్ పెళ్లయింది. గత ఏడాది నవంబర్‌లో భార్య నుంచి తనకు విడాకులు కావాలని తేజ్ కోర్టులో కేసు వేశాడు. ‘తేజ్ ప్రవర్తన గురించి తన అత్తకు, ఆడపడుచులకు చెప్పేదాన్ని.. వాళ్లు విని ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాదని చెప్పేవాళ్లు. కానీ తేజ్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు ఉండకపోయేది. గంజాయి భోలేబాబాకు ప్రసాదమని, దానిని ఎలా మానాలని ఒకసారి తేజ్ నాతో చెప్పాడు’ అని ఆమె వివరించారు. తనకు పెద్దగా చదువులేదని, వండిపెట్టి.. పిల్లల్ని కనడమే తన బాధ్యత అని తేజ్ తనను వేధించేవాడని ఆమె తెలిపారు. తేజ్, అతని కుటుంబసభ్యులు తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నా.. తానింకా అత్తవారింటిలో వారితో కలిసే ఉంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. -
ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి..
పట్నా: ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి.. ఇంతకు ఎవరాయనంటే.. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. కొన్ని రోజుల క్రితం విడాకులు కావాలంటూ వార్తల్లోకెక్కిన తేజ్ ప్రతాప్.. తాజాగా మంగళవారం శివుని వేషధారణలో పాట్నాలోని ఒక ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆయనకు అలాంటి వేషాలు ధరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా కృష్ణుడి వేషధారణలో, మహాభారతంలో కృష్ణుడు పోషించిన పాత్రనే తాను ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పోషించబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలై, 2018 లో పాట్నాలోని ఒక శివాలయంలో ప్రార్థనలు చేయటానికి తేజ్ ప్రతాప్ శివుని రూపంలో దుస్తులు ధరించి హాజరయ్యారు. శివుని పవిత్ర నివాసాలలో ఒకటైన దేయోఘర్ బాబా బైద్యనాథ్ ధామ్ బయలుదేరే ముందు తేజ్ ప్రతాప్ ప్రార్థనలు చేశారు. -
రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ ప్రతాప్
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా వస్తున్న కారు ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో తేజ్ ప్రతాప్ కాలుకు గాయమవ్వగా.. అతని సహాయకులు తీవ్రంగా గాయపడ్డారు. తేజ్ ప్రతాప్ తన ఇంటి నుంచి పార్టీ కార్యాలయం వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని పారస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. -
‘నా తమ్ముడికి అండగా ఉంటా’
పట్నా : తన తమ్ముడు తేజస్వీ యాదవ్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానమైనా దక్కించుకోగా.. స్థానిక పార్టీ అయిన ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలు చేపట్టిన తేజస్వీ రాజీనామా చేయాలంటూ ముజఫర్‌పూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్ సహా మరికొంత మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తే తమ కొంప ముంచిందని.. ఇటువంటి నిర్ణయం తీసుకుని తేజస్వీ తప్పు చేశారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన తేజ్ ప్రతాప్ యాదవ్..‘ తేజస్వీ నాయకత్వాన్ని ఇష్టపడని వారెవరైనా పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు. మహాఘట్బంధన్, ఆర్జేడీ నేతలైనా సరే మీ ఇష్టం వచ్చినట్లు నడచుకోండి. కానీ నేను ఎల్లప్పుడూ తేజస్వీకి అండగా ఉంటాను. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత నా ప్రియమైన సోదరుడికి లేఖ రాశాను. గెలుపోటములు సహజమని చెప్పాను. అయితే బాధ్యతల నుంచి తప్పించుకోవడం ఏ సమస్యను పరిష్కరించదు. ఓటమిపై విచారిస్తూ కూర్చుంటే సరిపోదు. ఇంట్లోనే ఉన్న మన శత్రువులను లాగిపడేద్దాం. ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేసింది. ఓటర్లెలా మోసపోయారన్న విషయాలపై నేను, తేజస్వీ అందరికీ వివరిస్తాం. కృష్ణుడిలా ఎల్లప్పుడూ నా తమ్ముడి పక్కనే నిల్చుంటా’అని వ్యాఖ్యానించారు. కాగా గత కొంత కాలంగా తేజ్ ప్రతాప్, తేజస్వీల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ఇటీవలే ఆర్జేడీ విద్యార్థి విభాగం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా లాలూ- రబ్రీ మోర్చా పేరిట సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. భార్య ఐశ్వర్యా రాయ్‌తో విడాకుల విషయంలో కూడా కుటుంబ సభ్యులతో తేజ్ ప్రతాప్ విభేదించారు. ఇక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్న కొడుకు తేజస్వీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. -
తేజ్ ప్రతాప్ బౌన్సర్ వీరంగం
-
తేజ్ ప్రతాప్ బౌన్సర్ వీరంగం
పట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యక్తిగత సిబ్బంది ఒకరు వీరంగం సృష్టించాడు. ఏడో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా తేజ్ ప్రతాప్ ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఓ ఫోటోగ్రాఫర్... కారు అద్దాలు ధ్వంసం చేశాడంటూ తేజ్‌ప్రతాప్ బౌన్సర్ దౌర్జన్యం చేసి, అతడిపై చేయి చేసుకుంటూ కెమెరాను ధ్వంసం చేశాడు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే ఇంత జరిగినా తేజ్ ప్రతాప్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. అంతేకాకుండా తమ బౌన్సర్ల తప్పేమీ లేదంటూ ఆ చర్యను ఆయన సమర్థించుకున్నారు. తాను ఓటు వేసి వెళుతున్న సందర్భంగా తన కారు అద్దాలను ఓ ఫోటోగ్రాఫర్ ధ్వంసం చేశాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు. ఇదంతా చూస్తుంటే తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు ఉందని ఆయన ఆరోపణలు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మిస్ యూ నాన్నా..నువ్వు లేనందు వల్లే
పట్నా : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం దొరకని కారణంగా తండ్రిని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. బిహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి మహాఘట్ బంధన్ పేరిట కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాహుల్ గాంధీ తమ పార్టీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాతో కలిసి పాటలీపుత్రలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ కూడా హాజరయ్యారు. అయితే తేజ్ ప్రతాప్‌కు మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన తేజ్ ప్రతాప్.. ‘ మా నాన్న గారు నాతో పాటు లేకపోవడం వల్ల ఈరోజు మాట్లాడేందుకు నాకు అవకాశం దొరకలేదు. మిస్ యూ పప్పా’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం గురించి తేజస్వీని ప్రశ్నించగా తనకు తెలియదన్నారు. సమయం లేకపోవడం వల్లే బహుశా తన సోదరుడికి అవకాశం రాకపోయి ఉండవచ్చునన్నారు. కాగా గత కొంత కాలంగా తేజ్ ప్రతాప్, తేజస్వీల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ఇటీవలే ఆర్జేడీ విద్యార్థి విభాగం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా లాలూ- రబ్రీ మోర్చా పేరిట సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. భార్య ఐశ్వర్యా రాయ్‌తో విడాకుల విషయంలో కూడా కుటుంబ సభ్యులతో తేజ్ ప్రతాప్ విభేదించారు. ఇక లాలూ ప్రసాద్ ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. मेरे आदरणीय पिता के अनुपस्थिति की वजह से मुझे आज बोलने नहीँ दिया गया।#IMissYouPapa😭😭 pic.twitter.com/w5F6uIzckb — Tej Pratap Yadav (@TejYadav14) May 16, 2019 -
‘బిహార్‌కి రెండో లాలూని నేనే’
పట్నా : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆఖరిదశకు చేరుకుంటున్న నేపథ్యంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుల మధ్య విభేదాలు ఒక్కోటిగా బయట పడుతున్నాయి. గత కొద్ది కాలంగా లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెహానాబాద్‌లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా చంద్ర ప్రకాశ్‌ను బరిలో దింపాడు. అతని తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ‘లాలూ ప్రసాద్ యాదవ్ చాలా శక్తివంతుడు. ఆయన రోజుకు 10 - 12 కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. కానీ ఇప్పటి నాయకులు రోజుకు 2, 3 కార్యక్రమాల్లో పాల్గొనగానే అస్వస్థతకు గురవుతున్నారం’టూ పరోక్షంగా సోదరుడు తేజస్విని విమర్శించారు. అనారోగ్య కారణాల దృష్ట్యా కొద్ది రోజులుగా తేజస్వి యాదవ్ పలు ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని తేజ్ ప్రతాప్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘లాలూ ప్రసాద్ యాదవే మాకు ఆదర్శం.. ఆయన నాకు గురువు కూడా. ఆయన రక్తాన్ని పంచుకుపుట్టిన నేనే బిహార్‌కు మరో లాలూని’ అని పేర్కొన్నారు. అంతేకాక ప్రస్తుతం పార్టీ రోజు వారీ కార్యక్రమాలు చూస్తున్న వ్యక్తి.. అనర్హులకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. తన అభ్యర్థి చంద్ర ప్రకాశ్ భారీ మెజార్టీతో గెలుస్తాడని తేజ్ ప్రతాప్ ధీమా వ్యక్తం చేశాడు. వివాహ బంధంలో వచ్చిన విబేధాల కారణంగా కొద్ది నెలలుగా తేజ్ ప్రతాప్ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. -
‘జరిగింది చాలు.. తిరిగొచ్చేయ్’
పట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి ఉద్వేగానికి లోనయ్యారు. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఇప్పటి వరకూ జరిగింది చాలు.. ఇంటికి వచ్చేయ్’ అంటూ అభ్యర్థించారు. లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. భార్య ఐశ్వర్యతో పొసగడం లేదు.. విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జైలులో ఉన్న తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూడా తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి తేజ్ ప్రతాప్ ఇంటికి వెళ్లకుండా వేరుగా ఉంటున్నాడు. (చదవండి : బాబాయ్ నాకు ఇల్లు కావాలి) ఈ నేపథ్యంలో తొలిసారి రబ్రీ దేవి మీడియా ముందు తన కుమారుని గురించి మాట్లాడారు. ‘నా కొడుకులిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా శత్రువులైన బీజేపీ, జేడీయూ మనుషులు నా కొడుకును తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రస్తుతం నా భర్త మాతో లేకపోవడం కూడా వారికి బాగా కలసివచ్చింది. మేం కూడా లాలూజీని చాలా మిస్ అవుతున్నాం. ఆయన లేకపోతే ప్రతీది నిరుపయోగమే. ఆయన త్వరలోనే వస్తాడు.. సమస్యలన్ని పరిష్కారమవుతాయ’ని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక తాను ప్రతి రోజు తన కుమారునితో ఫోన్లో మాట్లాడుతున్నానని రబ్రీ దేవి తెలిపారు. -
ఎన్నికల వేళ.. తేజ్‌ప్రతాప్ సంచలన నిర్ణయం
పట్నా: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీ విద్యార్థి విభాగం అధ్యక్ష పదవికి గురువారం ఆయన రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తేజ్‌ప్రతాప్ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే రాజీనామాకు గల కారణాలు తెలియలేదు. ఎవరి పేరు ప్రస్తావించకుండా ‘అమాయకులే నన్ను అమాయకుడని అనుకుంటారు. కానీ గ్రౌండ్ లెవల్లో అందరి గురించి, అన్ని విషయాలు తెలుసు’అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: ‘విడాకుల యుద్ధం.. భారతం కన్నా పెద్దది’) దాణా కుంభకోణంలో లాలూ జైలులో ఉండటంతో ప్రస్తుతం తేజ్‌ప్రతాప్ సోదరుడు తేజస్వీ యాదవ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. గతంలో పార్టీ నాయకులు తనను పట్టించుకోవడం లేదని తేజ్‌ప్రతాప్ యాదవ్ బాహాటంగానే ప్రకటించారు కూడా. ఇలా చెబుతూనే తన సోదరుడికి తనకు ఎలాంటి విబేధాలు లేవని తన తమ్ముడు తన హృదయానికి దగ్గరగా ఉంటారని చెప్పారు. తేజస్వీ యాదవ్ కూడా తన అన్నే తనకు మార్గదర్శకుడని తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్న తేజ్‌ప్రతాప్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. (‘ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించండి’) -
ఆర్జేడీ ఆఫీస్‌లో ‘దంగల్’
పట్నా : ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా పార్టీ కార్యాలయాన్ని రెజ్లింగ్ రింగ్‌గా మార్చారు. ఈనెల 26న పట్నాలోని పార్టీ కార్యాలయంలో తేజ్ ప్రతాప్, ఆయన సన్నిహితులు దంగల్ (కుస్తీ పోటీ)ను నిర్వహించారు. కుస్తీ పోటీల సంగతి బయటకు పొక్కడంతో స్ధానిక రెజ్లర్లు సైతం ఆయనను కలిసేందుకు ఆర్జేడీ కార్యాలయానికి చేరుకున్నారు. తేజ్‌ప్రతాప్ కోరిక మేరకు ఆయన మద్దతుదారులు పార్టీ కార్యాలయంలో అప్పటికప్పుడు కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పోటీల సందర్భంగా ఐదుగురు స్ధానిక రెజ్లర్లు ఒకరి తర్వాత మరొకరు కుస్తీలో తమ నైపుణ్యాలను ఆర్జేడీ నేత ఎదుట ప్రదర్శించారు. రెజ్లర్స్‌తో తలపడాలని ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ తన మద్దతుదారులను, ఆర్జేడీ కార్యకర్తలను కోరడం విశేషం. అయితే స్ధానిక రెజ్లర్ల సవాల్‌ను స్వీకరించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. రెజ్లర్ల దంగల్ను ఆసాంతం ఆస్వాదించిన తేజ్ ప్రతాప్ వారిని రూ 5000 నగదు బహుమతితో సత్కరించారు. రెజ్లర్లు తమ కుటుంబాలను పోషించుకునేందుకు వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. భార్య ఐశ్వర్యా రాయ్‌తో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన తేజ్ ప్రతాప్ గతంలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించడంతో పాటు పట్నా వీధుల్లో సైకిల్‌పై సవారీ చేస్తూ కెమెరామెన్ల కంటపడ్డారు. -
‘ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించండి’
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ జేడీయూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని చెప్పారు. తనకు ప్రాణ భయం ఉందనీ, రక్షణ కల్పించాలని నితీష్ ప్రభుత్వాన్ని కోరారు. ‘రోజు హత్యలు, అల్లర్లతో పరిస్థితులు భయానకంగా మారాయి. ఎవరు ఎవరినైనా చంపొచ్చు. నాకు ప్రాణ భయం ఉంది. రక్షణ కల్పించండి’అని మీడియా సమావేశంలో జేడీయూ ప్రభుత్వాన్ని కోరారు. సెక్యురిటీగా బాడీగార్డులు ఉన్నా ప్రాణలకు గ్యారంటీ లేదని అన్నారు. అంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. (నాయకుడి హత్య... నిందితుడి కొడుకు బలి) ఇక మంగళవారం రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి చెందిన ఇందాల్ పాశ్వాన్ అనే నాయకుడి హత్య నలందాలో అల్లర్లకు కారణమైంది. గడిచిన వారం రోజుల్లో ఇటువంటి మూడు ఘటనలు చోటుచేసుకోవడంతో నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఇందాల్ మృతికి కారకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఇంటికి బుధవారం కొందరు నిప్పంటించారు. అంతేకాకుండా అతడి కొడుకు (13)ను తీవ్రంగా కొట్టడంతో ఆ బాలుడు మృతిచెందాడు. దీంతో నలందాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, గత ఆదివారం బిహార్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిని కాల్చిచంపడంతో పాటు నాలుగు బస్సులను తగులబెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని పేర్కొంటూ రాజధాని పట్నాలో విపక్షాలు నిరసనలు చేపట్టాయి. -
‘విడాకుల యుద్ధం.. భారతం కన్నా పెద్దది’
పట్నా : విడాకుల యుద్ధం మహాభారత యుద్ధం కంటే పెద్దదంటున్నారు బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. తాజాగా విడాకుల విషయంలో తేజ్ ప్రతాప్ వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేల్చేశారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ సందర్భంగా తల్లి రబ్రీ దేవితో విడాకుల గురించి చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. విడాకుల విషయంలో నేను ఇప్పటికి నా అభిప్రాయానికే కట్టుబడి ఉన్నాను. ఈ నెల 8న విడాకులకు సంబంధించిన లీగల్ అంశాల విచారణ ప్రారంభం అవుతుంది. అయితే ఈ విడాకుల అంశం అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేలా లేదు. విడాకులు పొందడం కోసం మహాభారతం కంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోందన్నారు. ‘ఈ విషయంలో మా అమ్మ నాకు పూర్తి మద్దతు తెలుపుతోంది. నా భార్యతో, ఆమె కుటుంబ సభ్యులతో ఇక ఎలాంటి సంబంధం ఉండాలని నేను కోరుకోవడం లేదు. ఐశ్వర్య కుటుంబంతో ఉన్న అన్ని బంధాలను తెంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ సందర్భంగా యాదవ కమ్యూనిటీకంతటికి ఒక విషయం విన్న విస్తున్నాను. నాకు, ఐశ్వర్యకు మధ్య ఎలాంటి బంధం ఉందో మీకు నిజంగా తెలీదు. ఈ విషయాల గురించి మీకు తెలిసిన రోజు మీరు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారని తెలిపాడు. ఈ ఎన్నికల్లో తాను తన తమ్ముడు తేజస్వి యాదవ్ కోసం పని చేస్తానని తెలపాడు. తేజస్వీనే కాబోయే సీఎం. అతనికి నా ఆశీర్వాదాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. -
‘బాబాయ్ నాకు ఇళ్లు కావాలి’
పట్నా : విడాకులు కావాలంటూ రచ్చకెక్కిన బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. ఆ తరువాత వేరు కుంపటి పెడతానంటూ మరోసారి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. అయితే తేజ్ ప్రతాప్‌కు ఇంటిని వెతికి పెట్టడంలో ‘చాచా’ నితీష్ కుమార్ సాయం చేసారంట. అది కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పర్మిషన్తో. విడాకుల విషయంలో కుటుంబ సభ్యులతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో వేరే ఇంటికి మారాలనుకున్నారు తేజ్ ప్రతాప్ యాదవ్. ఆ ప్రయత్నాల్లో భాగంగా తనకు కొత్త ఇంటిని కేటాయించాలంటూ భవన నిర్మణాల శాఖ మంత్రికి లేఖ రాశాడు తేజ్ ప్రతాప్. కానీ వారు సరిగా స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఫోన్ చేశారు. ‘బాబాయి నాకు ఇళ్లు దొరకడం లేదు సాయం చేయండం’టూ కోరారని సమాచారం. దాంతో నితీష్ కుమార్ ఈ విషయం గురించి లాలూ ప్రసాద్‌కు తెలియజేశారు. భార్యభర్తల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగాలంటే.. కొన్నాళ్ల పాటు ఇద్దరూ వేరుగా ఉంటే మంచిదని భావించిన లాలూ.. అందుకు ఒప్పుకున్నారని సమాచారం. లాలూ కూడా ఒప్పుకోవడంతో గతంలో తాను నివసించిన 7 ఎం స్ట్రాండ్ రోడ్‌లోని ఇంటిని తేజ్ ప్రతాప్ కోసం కేటాయించారు నితీష్ కుమార్. ప్రభుత్వం ది 10, సర్క్యూలర్ రోడ్డులోని ఇంటిని మాజీ సీఎం, లాలూ భార్య రబ్రీదేవికి కేటాయించారు. ప్రస్తుతం లాలూ కుటుంబం ఇక్కడే ఉంటున్నారు. బీజేపీతో పొత్తు కంటే ముందు నితీష్ కుమార్ మహాకుటమిలో భాగంగా ఆర్జేడీ పార్టీతో పొత్తు పెట్టుకుని బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ కొన్ని రోజుల తరువాత మహాకూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. . -
‘నేను కృష్ణున్ని.. తను అర్జునుడు’
పట్నా : ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి, వ్యాపారంలోకి. ఇంతకు ఎవరాయన అంటే.. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్. కొన్ని రోజుల క్రితం విడాకులు కావాలంటూ వార్తల్లోకెక్కిన తేజ్ ప్రతాప్.. ఇళ్లు వదిలి ఆలయ సందర్శన ప్రారంభించిన సంగతి తెలిసిందే. తీర్ధయాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకున్న తేజ్ ప్రతాప్ ఇక మీదట పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిడానికి సిద్ధమయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా సంతోషం కల్గించిందని తెలిపారు. ఈ గెలుపులో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారన్నారు. బీజేపీ - ఆర్ఎస్ఎస్ కూటమే బిహార్‌లో తన ప్రథమ ప్రత్యర్థిగా చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ తీర్థయాత్ర సమయంలో తాను కృష్ణ భగవానుని ఆశీర్వాదాలు పొంది బిహార్ తిరిగి వచ్చానని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో తన శత్రువులైన బీజేపీ - ఆర్ఎస్ఎస్ కూటమిని తన సుదర్శన చక్రంతో వధిస్తానని శపథం చేశారు. అయితే విలేకరులు ఐశ్వర్యతో విడాకుల విషయం గురించి ప్రస్తావించగా.. తేజ్ ప్రతాప్ జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నారు. అనంతరం సోదరుడు తేజస్వితో గల విబేధాల గురించి ప్రశ్నించగా.. తేజస్వి అర్జునుడు.. నేను కృష్ణున్ని అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక మహాభారతంలో కృష్ణుడు పోషించిన పాత్రనే తాను ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో పోషించబోతున్నట్లు తెలిపాడు. -
విడాకులపై వెనక్కు తగ్గిన తేజ్ ప్రతాప్
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తన విడాకుల నిర్ణయానికి ఆమోదం తెలిపితేనే ఇంటికి వస్తానంటూ కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోయి షాక్ ఇచ్చిన తేజ్ ప్రతాప్.. తాజాగా తన విడాకుల పిటిషన్‌ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి తేజ్ ప్రతాప్ నుంచి ఇంతవరకూ ఎటువంటి అధికారిక ప్రటన వెలువడలేదు. విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తేజ్ ప్రతాప్ యాదవ్ తన మనసులోని బాధను తెలియజేసేలా .. ఓ కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా 16వ శతాబ్దానికి చెందిన ఓ ప్రముఖ కవి రాసిన పంక్తులను ఆయన ప్రస్తావించారు. ‘ఒకసారి ప్రేమ ముక్కలైతే అది అతుక్కోదు. దాన్ని మళ్లీ కలపాలని ప్రయత్నించడం వృధా’ అనే భావం వచ్చేలా ఉన్న కవితను పోస్ట్ చేశారు. విడాకుల నిర్ణయం పట్ల ఎవరి మాటా విననంటూ తేల్చి చెప్పిన తేజ్ ప్రతాప్ ఇంత సడెన్‌గా తన నిర్ణయాన్ని మార్చుకోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే 2019 ఎన్నికల నేపథ్యంలోనే తేజ్ ప్రతాప్ తన విడాకుల విషయంలో వెనక్కు తగ్గినట్లు సమాచారం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోడం కోసం ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో తేజ్ ప్రతాప్ విడాకులు తీసుకుంటే సీట్ల సర్దుబాటు అంశంలో విబేధాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు సన్నిహితులు. కాగా ఈ ఏడాది మే 12న తేజ్ ప్రతాప్, ఐశ్వర్యా రాయ్‌ల వివాహం అత్యంత ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ప్రతాప్ యాదవ్ (లాలూ పెద్ద కొడుకు) రాయని డైరీ
హరిద్వార్‌లో ఉన్నాను. మనసుకు ప్రశాంతంగా ఉంది. దీపావళికి వింధ్యాచల్‌లో, ముందురోజు వారణాసిలో ఉన్నాను. శుక్రవారం తమ్ముడు తేజస్వి బర్త్‌డే. వాడి కోసం ఢిల్లీ వెళ్లి, తిరిగి హరిద్వార్ వచ్చేశాను. మూడేళ్లుగా తేజస్వి ఢిల్లీలోనే ఉంటున్నాడు. ‘‘చాలా సంతోషంగా ఉన్నావురా’’ అన్నాను. ‘‘నువ్వూ సంతోషంగా ఉన్నావు అన్నయ్యా. పక్కన వదిన కూడా ఉంటే బాగుండేది’’ అన్నాడు. ‘వదిన, సంతోషం.. పక్కపక్కనే ఉండలేవురా తేజూ..’ అని వాడితో చెప్పలేకపోయాను. ‘‘నాన్న ఆరోగ్యం బాగోలేదు. రాంచీ హాస్పిటల్లో నిన్నే కలవరిస్తున్నాడు. అమ్మ బెంగ పెట్టుకుంది. ‘మా అబ్బాయిని ఎక్కడైనా చూశారా?’ అని పట్నాలో బంధువులందరికీ ఫోన్ చేసి అడుగుతోంది. అక్క కోపంగా ఉంది. ‘ఎవరికి చెప్పి ఈ పని చేశాడు?’ అంటోంది. పాపం.. వదిన. తను షాక్‌లో ఉంది. వెళ్లన్నయ్యా. కనీసం అమ్మనీ, నాన్ననైనా చూసిరా’’ అన్నాడు. నాన్నను చూడ్డానికి వెళితే నాన్న ఏమంటాడో నాకు తెలుసు. చేతిలోకి చెయ్యి తీసుకుని ‘విడాకులు వెనక్కు తీసుకుంటానని మాట ఇవ్వురా ప్రతాప్’ అంటాడు. అమ్మను చూడ్డానికి వెళితే అమ్మ ఏమంటుందో నాకు తెలుసు. ‘బంగారంలాంటి పిల్లరా.. అన్యాయం అవకు’ అంటుంది. భర్త విడాకులిస్తే ఎక్కడైనా భార్య అన్యాయం అవుతుంది. మా ఇంట్లో మాత్రం భర్త అన్యాయం అవుతాడు! ‘‘లేదురా.. నేను మళ్లీ పట్నా వెళ్లడం.. విడాకులు తీసుకోడానికే’’ అని గట్టిగా చెప్పాను. బాధగా ముఖం పెట్టాడు వాడు. ‘‘ఏంట్రా!’’ అన్నాను. ‘‘పాపం వదిన అన్నయ్యా’’ అన్నాడు!! ఐశ్వర్య అడుగు పెట్టినప్పటి నుంచి ఐదు నెలలుగా ఇల్లంతా ఐశ్వర్య చుట్టూనే తిరుగుతోంది. కుర్చీ వేస్తారు. ‘కూర్చోమ్మా’ అంటారు. ‘తిన్నావామ్మా? తినకుంటే ఆకలేస్తుంది’ అంటారు! టీవీ పెడతారు. ఐశ్వర్య ముఖం చూస్తూ కూర్చుంటారు. ఐశ్వర్య ఆవలిస్తుంటే ‘నిద్ర వస్తోందా తల్లీ’ అంటారు. ఐశ్వర్య ఆలోచిస్తుంటే ‘అమ్మా నాన్న గుర్తొస్తున్నారామ్మా’ అని అడుగుతారు. ‘అదేం లేదత్తయ్యా’ అంటున్నా వినకుండా ఐశ్వర్య అమ్మనీ నాన్ననీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నారు! ఐశ్వర్యకు ఒక భర్త ఉన్నాడూ.. ఆ భర్తకు తన భార్యను ఆదేశించాలని, అదుపులో ఉంచుకోవాలని, బయటి నుంచి తను ఇంట్లోకి రాగానే తన భార్య ఎంత మందిలో ఉన్నా భయంతో లేచి నిలబడి, తలచుట్టూ కొంగు కప్పుకునే అపురూపమైన దృశ్యం చూడాలని ఆశగా ఉంటుందని ఎందుకనుకోరు? మొదటే అన్నాను ‘నాకీ పెళ్లి వద్దమ్మా’ అని. అమ్మ వినలేదు. ‘పెళ్లి వద్దని అంటే అన్నావు కానీ, ఈ పెళ్లి వద్దని మాత్రం అనకురా..’ అంది. ‘అంత చదువుకున్న పిల్ల నాకొద్దమ్మా’ అన్నాను. ‘అందంగా ఉందిరా’ అంది. ‘అంత అందమైన పిల్ల నాకొద్దమ్మా’ అన్నాను. ‘గుణంగల పిల్లరా..’ అంది. ‘ఎవరికి లేని గుణం అమ్మా..’ అన్నాను. అమ్మ వినలేదు. నాన్న వినలేదు. అక్క వినలేదు. ఇప్పుడూ వినిపించుకోవడం లేదు! హరిద్వార్ వచ్చి పది రోజులైంది. ఈ ప్రశాంతత ఇక్కడి వాతావరణం వల్ల వచ్చిందా, లేక.. పక్కనే రూపవతి, గుణవతి, విద్యావతి అయిన భార్య లేకపోవడం వల్ల వచ్చిందా అర్థం కావడం లేదు. ఇటువైపు పుణ్యక్షేత్రాలన్నీ అయిపోయాక, అటువైపు దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్లాలి. భాష తెలియకపోవడం సమస్య కాకపోవచ్చు. అంత తెలిసిన భాషలో ఐశ్వర్య నన్నెంత అర్థం చేసుకుందని?! -
‘విడాకులకు ఒప్పుకుంటేనే ఇంటికొస్తా’
పట్నా: విడాకుల విషయంలో కుటుంబసభ్యులు తన నిర్ణయానికి మద్దతు పలికే వరకు ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ తేల్చి చెప్పారు. శుక్రవారం తేజ్ ప్రతాప్ స్థానిక న్యూస్ చానెల్‌తో ఫోన్లో మాట్లాడుతూ..తాను ప్రస్తుతం హరిద్వార్‌లో ఉన్నానని తెలిపారు. ఐశ్వర్య, తనకు మధ్య విభేధాలకు దగ్గర బంధువులూ కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోయే ఆస్కారమే లేదని..ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు పెళ్లికి ముందే చెప్పానని స్పష్టం చేశారు. అయితే వారు తన మాట విన లేదని చెప్పారు. తన మాటను అంగీకరించనప్పుడు ఇంటికి తిరిగి ఎలా వెళ్తానని ప్రశ్నించారు. -
‘విడాకుల విషయం తేల్చిన తర్వాతే ఇంటికొస్తా’
పాట్నా : పెళ్లై కనీసం ఆరు నెలలు కూడా పూర్తి కాకమునుపే విడాకులు కావాలంటూ రచ్చ కెక్కారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ క్రమంలో విడాకుల విషయం గురించి తండ్రి లాలూకి కూడా సమాచారం అందించారు. అనంతరం హరిద్వార్ వెళ్లిన తేజ్ ప్రతాప్ విడాకుల విషయంలో కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా నిలబడితేనే ఇంటికి వస్తాను లేదంటే ఇలానే దేశ సంచారం చేస్తుంటానంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో సోదరుడు తేజస్వీ యాదవ్ పుట్టిన రోజు వేడకలకు కూడా హాజరు కాలేదు. ఫోన్లో ఒక లోకల్ మీడియాతో మాట్లాడుతూ.. నా సోదరునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సారి తనే ముఖ్యమంత్రి అవుతాడు. నేను తన పక్కనే ఉంటూ తోడుగా నిలుస్తాను అని చెప్పుకొచ్చారు. మహాభారతంలో అర్జునుడికి, కృష్ణుడు ఎలానో.. నేను నా సోదరునితో అలానే ఉంటానని తెలిపారు. ఈ ఏడాది మే 12 న తేజ్ ప్రతాప్ యాదవ్‌కు, బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలు ఐశ్వర్యరాయ్‌కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పైళ్లైన నాటి నుంచి తాను ఒక్క రోజు కూడా సంతోషంగా లేనని.. అసలు పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టం లేదని వాపోయారు తేజ్ ప్రతాప్. తానేమో చాలా సింపుల్‌గా ఉంటానని.. ఐశ్వర్య మెట్రో నగరాలలో పెరిగిన యువతి కావడంతో ఆమెకు, తనకు సెట్ అవ్వడంలేదని తెలిపారు తేజ్ ప్రతాప్. -
పెద్ద కొడుకు వ్యవహారం లాలూను ఏం చేస్తుందో..!
రాంచి : పెళ్లై ఆర్నెళ్లయినా కాకుండానే విడాకులు తీసుకుంటామంటూ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకొడుకు తేజ్‌ప్రతాప్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలు ఐశ్వర్యరాయ్, తేజ్ ప్రతాప్‌ల వివాహం మే 12వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ‘మేమిద్దరం ఉత్తర, దక్షిణ ధ్రువాల లాంటి వాళ్లం. మాకు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయాలు లేవు’ అని తేజ్ వెల్లడించారు. ఏదేమైనా విడాకులు తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై లాలూ ప్రసాద్‌తో వారం క్రితం తేజ్ భేటీ అయ్యారు. (వద్దన్నా.. ఆమెతో పెళ్లి చేశారు) కాగా, విడాకులు తీసుకోవద్దని తేజ్‌కు లాలూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోలేదని సమాచారం. దీంతో డెబ్బై ఏళ్ల లాలూ తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యాడని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) వైద్యులు తెలిపారు. ఇప్పటికే షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారనీ, ఇప్పుడు కుటుంబ వివాదాలు లాలూను తీవ్రంగా బాధిస్తున్నాయని అన్నారు. తేజ్‌ను కలిసినప్పటి నుంచి ఆయన నిద్రలేమితో బాధపడుతున్నారని చెప్పారు. ఇవన్నీ ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రొవిజనల్ బెయిల్‌పై బయటికొచ్చిన లాలూ.. దాణా కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు 2013లో అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో కూడా మరో రెండు దాణా కుంభకోణం కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా.. వైద్యం కోసం ప్రొవిజనల్ బెయిల్‌పై గత మే నెలలో బయటికొచిన లాలూ తిరిగి ఆగస్టు 30న సరెండర్ కావాలని రాంచి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన బిర్సా ముండా సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అయితే, పలు ఆనారోగ్య కారణాలతో అదే రోజున ఆయన రిమ్స్‌లో చేరారు. దాదాపు 950 కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో లాలూ దోషిగా ఉన్నారు. -
అఙ్ఞాతంలోకి తేజ్ ప్రతాప్ యాదవ్!
పట్నా : భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనను విరమించుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అఙ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లయి ఆరు నెలలైనా గడవక ముందే భార్య నుంచి విడాకులు కోరుతూ తేజ్ ప్రతాప్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఆధునిక భావాలున్న ఐశ్వర్యతో తనకు పొసగడం లేదని.. పెళ్లి తర్వాత జీవితం చాలా కష్టంగా గడుస్తోందంటూ విడాకుల దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు లాలూ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కోపంతో తేజ్ ప్రతాప్ అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. (ఐశ్వర్యకే మద్దతు.. నా వాళ్లే కుట్రపన్నారు!) బోధ్ గయ నుంచి బృందావనం వరకు.. గత రెండు రోజులుగా బోధ్ గయలోని ఓ హోటల్లో బస చేసిన తేజ్ ప్రతాప్ యాదవ్ సోమవారం మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో ఫోన్లో టచ్‌లోనే ఉన్నారు. కాగా తమతో మాట్లాడిన అనంతరం తేజ్ ప్రతాప్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారని అతడి భద్రతా సిబ్బంది తెలిపారు. ఎంతసేపటికి ఆయన తలుపు తెరవకపోవడంతో తమ వద్ద ఉన్న వేరొక కీతో రూం తెరచి చూడగా.. వెనుక డోర్ నుంచి ఆయన వెళ్లిపోయారని పేర్కొన్నారు. అక్కడ నుంచి 900 కిలోమీటర్ల దూరంలో గల బృందావనం చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంపై లాలూ కుటుంబ సభ్యులు ఇంతవరకు స్పందించలేదు. కాగా బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. -
ఐశ్వర్యకే మద్దతు.. నా వాళ్లే కుట్రపన్నారు!
పట్నా : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లయి ఆరు నెలలైనా గడవక ముందే భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఆధునిక భావాలున్న ఐశ్వర్యతో తనకు సఖ్యత లేదని.. పెళ్లి తర్వాత జీవితం చాలా కష్టంగా గడుస్తోందంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చటానికి ప్రయత్నిస్తున్న తన కుటుంబ సభ్యులపై తేజ్ ప్రతాప్ తీవ్ర ఆరోపణలు చేశారు. (వద్దన్నా.. ఆమెతో పెళ్లి చేశారు) ‘నేను రెండు నెలలుగా ఆమెతో మాట్లాడటం మానేశాను. తనతో కలిసి ఉండటం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాను. అయినప్పటికీ ఆమె నా కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి ఏం చెబుతుందో తెలియదు కానీ వారు పూర్తిగా ఆమెకే మద్దతు తెలుపుతున్నారు. ఐశ్వర్యను సపోర్టు చేయడం వెనుక ఏదో పెద్ద కుట్రే దాగి ఉంది. ఇందులో నా కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రధాన సూత్రధారిగా ఉన్నారని అన్పిస్తోంది. నా వాళ్లే నాపై కుట్రపన్నడం బాధగా ఉందంటూ’ తేజ్ ప్రతాప్ ఆరోపించారు. కాగా బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో మరోసారి ఆధిపత్య పోరు మొదలైనట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీని వీడనున్నారని.. అదే సమయంలో ఆయన భార్య ఐశ్వర్యరాయ్ రాజకీయ అరంగేట్రం చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్.. ఐశ్వర్యరాయ్ నుంచి విడాకులు కోరడం, కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
వద్దన్నా.. ఆమెతో పెళ్లి చేశారు
పట్నా: భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన వైవాహిక జీవితంపై పెదవి విప్పారు. తన ఇష్టం లేకుండానే ఉన్నత విద్యావంతురాలైన ఐశ్వర్యరాయ్‌ను పెళ్లాడానని, అప్పటి నుంచి జీవితం చాలా కష్టంగా సాగిందని అన్నారు. ‘అప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదని అమ్మానాన్నలకు స్పష్టంగా చెప్పినా ఎవరూ వినలేదు. ఐశ్వర్య నాకు తగిన జోడీ కాదు. నావి సాదాసీదా అలవాట్లు. నేను చాలా సాధారణ వ్యక్తిని. కానీ ఐశ్వర్య ఆధునిక భావాలున్న యువతి. ఢిల్లీలో చదువుకుంది. మెట్రో నగరాల జీవితానికి అలవాటుపడింది. పెళ్లి తరువాత ఆమెతో జీవితం చాలా కష్టంగా గడిచింది. ఇంకెంత కాలం ఇలా ఉండాలి?’ అని తేజ్ ప్రతాప్ మీడియాతో అన్నారు. విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. రెండు నెలల నుంచి భార్యతో మాట్లాడటంలేదని తెలిపారు. ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కుమార్తె అయిన ఐశ్వర్యరాయ్‌ను తేజ్ ప్రతాప్ ఈ ఏడాది మే 12న వివాహమాడారు. -
‘సీఎం అయినా.. పీఎం అయినా వదిలేది లేదు’
పాట్నా : కుటుంబ విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే సీఎం అయినా పీఎం అయినా క్షమించేది లేదంటున్నారు ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్. లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తేజస్వీ తొలిసారి మీడియా ముందు ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం బిహార్‌లో ట్రైనీ మహిళా కానిస్టేబుల్ మృతికి నిరసనగా మిగతా ట్రైనీ కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల మీద, కమాండెంట్ మీద దాడి చేసిన సంగతిని రిపోర్టర్ల దగ్గర ఉటంకిస్తూ ‘నిన్న ఉదయం అంతా ఇంత ముఖ్యమైన విషయాన్ని టెలికాస్ట్ చేసిన మీడియా సాయంత్రం అయ్యే సరికి హెడ్డింగ్స్ మార్చేసింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అరే.. వీళ్ల కుటుంబంలో ఏం జరుగుతుంది అంటూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఒకవేళ ఎవరైనా మా వ్యక్తిగత విషయాల గురించి కానీ, కుటుంబ విషయాల గురించి కానీ మాట్లాడితే సహించేది లేదు. ఆఖరికి అది సీఎం అయినా సరే.. పీఎం అయినా సరే’ అంటూ హెచ్చరించారు. -
‘మేమిద్దరం ఉత్తర, దక్షిణ ధ్రువాల లాంటి వాళ్లం’
పాట్నా : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. పెళ్లైన ఆర్నెళ్లకే విడాకులు కోరటం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ విషయం గురించి తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. ‘ఇది నిజం.. నేను నా భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నాను. మా ఇద్దరి అభిప్రాయాలు ఏమాత్రం కలవలేదు. ఆలోచనల్లోను, అభిరుచుల్లోనూ మేము ఇద్దరం ఉత్తర, దక్షిణ ధృవాల వంటి వాళ్లం. మేం కలిసుండటం అసాధ్యం. మేం చాలాసార్లు మా తల్లిదండ్రుల ముందే గొడవపడ్డాము. ప్రతి చిన్న విషయానికి గొడవపడటం తప్ప ఈ ఆర్నెళ్ల జీవితంలో మేం సంతోషంగా గడిపిన క్షణాలు లేవు. కలిసి ఉంటూ బాధపడే కంటే.. విడిపోయి సంతోషంగా ఉండటం మంచిదనిపించింది. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి హిస్టరి గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రికా రాయ్ కుమార్తె. ఈ ఏడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ - ఐశ్యర్యల వివాహమైంది. అయితే విడాకుల విషయం గురించి ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
లాలూ కొడుకు విడాకుల దరఖాస్తు
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లయి ఆరునెలలైనా కాకమునుపే భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యా రాయ్‌తో మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహమైంది. భార్యతో సఖ్యత లేని కారణంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్–13 ప్రకారం తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతున్నారని ఆయన లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ తెలిపారు. స్థానిక సివిల్ కోర్టులో ఈ మేరకు ఆయన కేసు వేశారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల కుటుంబాలు ఇష్టపడటం లేదు. -
బ్రేకప్ : ఐశ్వర్యా రాయ్‌కు తేజ్ ప్రతాప్ విడాకులు..?
పట్నా : ఈ ఏడాది మే 12న బిహార్ మాజీ సీఎం దుర్గా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యా రాయ్‌ను వివాహం చేసుకున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆమెతో తెగతెంపులకు సిద్ధమయ్యారు. పట్నా కోర్టులో విడాకులు కోరుతూ తేజ్ ప్రతాప్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. అయితే భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారనే వార్తలను ఆయన ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. బిహార్‌లోని చాప్రా నుంచి ఆర్జేడి టికెట్‌పై ఐశ్వర్యా రాయ్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తన భార్య రాజకీయాల్లో అడుగుపెట్టరని తేజ్ ప్రతాప్ స్పష్టం చేసినా పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం రోజున ఆమె ఫోటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. ఆర్జేడీ కార్యకర్త వాసీం అక్రం ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది మే 12న తేజ్ ప్రతాప్, ఐశ్వర్యా రాయ్‌ల వివాహం అత్యంత ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే. పశుగ్రాస కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ తన కుమారుడి వివాహానికి పెరోల్‌పై హాజరయ్యారు. -
‘మా సోదరుల మధ్య విబేధాలున్నది నిజమే’
పాట్నా : చేతికి ఉన్న ఐదు వేళ్లు మాదిరిగానే.. కుటుంబంలోని వారంతా కూడా ఒకేలా ఉండరు. అందరి ఇళ్లలో మాదిరే తమ ఇంట్లో కూడా సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయన్నారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి. పాట్నాలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మిసా ఈ సందర్భంగా తమ సోదరుల గురించి మాట్లాడారు. ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విబేధాలు ఉన్నట్లే తమ సోదరుల మధ్య కూడా చిన్న చిన్న పొరపొచ్చలున్నాయన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సర్వ సాధరణమని తెలిపారు. కానీ ఆ విబేధాలు అన్ని ఇంటికే పరిమితమని.. పార్టీ కోసం మాత్రం అందరూ కలసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అన్నదమ్ములిద్దరు గొడవపడటం వల్ల కార్యకర్తల మీద కూడా ఆ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పార్టీలోని ప్రతి ఒక్కరు అందరిని కలుపుకుపోతూ పార్టీకోసం పని చేయాలని మిసా భారతి కోరారు. ప్రస్తుతం లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్విల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాలూ తన కుమారులిద్దరిని గొడవలు మాని.. కలిసిమేలసి ఉండలాని, పార్టీకి కోసం పని చేయాలని సూచించినట్లు సమాచారం. -
‘నన్నెవరూ పార్టీ నుంచి తప్పించలేరు’
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ కుటుంబంలో విభేదాలు చోటుచేసుకున్నాయనే వార్తలను ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఖండించారు. 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై చర్చించడానికి మంగళవారం బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో జరిగిన పార్టీ సమావేశానికి తేజ్ ప్రతాప్ హాజరు కాలేదు. దీంతో తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో విభేదాల కారణంగానే ఆయన సమావేశంలో పాల్గొనలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తేజ్ ప్రతాప్ స్పందిస్తూ.. తేజస్వీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లనే పార్టీ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. తన తండ్రి ఉన్నంతకాలం తనను ఆర్జేడీ పార్టీ నుంచి ఎవరు తొలగించలేరని పేర్కొన్నారు. తమ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లతోపాటు తమ పార్టీలోని కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని తేజ్ ప్రతాప్ విమర్శించారు. పార్టీలో అధికారం కోసం తేజస్వీతో పోటీ లేదని వెల్లడించారు. తన తమ్ముడు తేజస్వీని బిహార్ సీఎంగా చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇద్దరు అన్నదమ్ములం కలిసి పనిచేస్తామని.. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటామని పేర్కొన్నారు. కాగా, గత కొంతకాలంగా తేజస్వీ, తేజ్ ప్రతాప్‌ల మధ్య విభేదాలు ఉన్నట్టు తరచు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
‘బీజేపీ, ఆరెస్సెస్‌లు నన్ను చంపాలని కుట్రపన్నాయి’
పట్నా: బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిసి తనను చంపడానికి కుట్రపన్నాయని లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడు, ఆర్జేడీ యువనేత తేజ్‌ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ నుంచి తనకు ప్రాణ హాని ఉందన్నారు. బుధవారం ఆయన మహుయా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా తనను కలుసుకునేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు గుంపులుగా తరలి వచ్చారు. గుంపులో ఓ వ్యక్తి ఆయుధంతో ప్రతాప్ దగ్గరకు వచ్చారు. ఇది గమనించిన భద్రతాసిబ్బంది ఆ వ్యక్తిని దూరంగానెట్టి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసుకు అప్పజెప్పారు. కాగా బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిని తనను చంపాడానికే ఆవ్యక్తిని పంపారని తేజ్‌ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులకే రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనను చంపడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లు మరికొంత మందిని పంపుతారని, భయపడేది లేదని పేర్కొన్నారు. గతంలో బీజేపీ, సీఎం నితీష్ కుమార్ కలిసి తన ఫేస్‌బుక్‌ను హాక్ చేశారనితేజ్‌ప్రతాప్ ఆరోపించారు. -
మరోసారి శివుడిగా దర్శనమిచ్చిన మాజీ మంత్రి
పట్నా : రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నాయకుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ యువ నేత తన వివాహ సందర్భంగా ఆదిదంపతులు శివపార్వతుల రూపంలో తన ఫోటోలను ప్రింట్ చేయించుకుని హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తేజ్ మరోసారి శివుడి అవతారాన్ని ధరించారు. శివాలయంలో పూజలు నిర్వహించడానికి తేజ్ ప్రతాప్, ఏకంగా శంకరుని వేషధారణలో ఆలయానికి బయలు దేరారు. ఒంటి మీద పులిచర్మం, చేతిలో త్రిశూలం ధరించి డియోఘడ్‌లో ఉన్న బైద్యనాథ్ ధామ్ ఆలయానికి వెళ్లారు. గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఢమరుకం మోగిస్తూ, హారతి సమయంలో శంఖాన్ని ఊదుతూ పూజ కొనసాగించారు. ఈమధ్య తేజ్ ప్రతాప్.. ఓ సైకిల్ యాత్ర చేశారు. అయితే సైకిల్ యాత్ర సందర్భంగా ఆయన పట్టు తప్పి కింద పడిపోయారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ఆయన సైకిల్ యాత్రను చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలసి యాత్రను ప్రారంభించిన ఆయన ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. దాంతో పట్టు కోల్పోయి కింద పడ్డారు. -
సైకిల్ తొక్కుతూ కింద పడ్డ తేజ్
-
సైకిల్ మీద నుంచి పడిపోయిన తేజ్
బిహార్ : బిహార్ రాష్ట్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్ తొక్కుతూ పట్టుకోల్పోయి కింద పడిపోయారు. ఈ ఘటన గురువారం పాట్నాలో చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటాన్ని నిరసిస్తూ ఆయన సైకిల్ యాత్రను చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలసి యాత్రను ప్రారంభించిన ఆయన ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. తేజ్ ప్రతాప్ వేగంగా సైకిల్‌ను తొక్కడంతో కార్యకర్తలు, భద్రతా సిబ్బంది కూడా ఆయన్ను అనుసరించేందుకు యత్నించారు. ఈ లోగా ఎదురుగా వచ్చిన టర్న్ వద్ద సైకిల్‌ను అదుపు చేయలేక తేజ్ ప్రతాప్ కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను లేవదీశారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న పలువురు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మళ్లీ సైకిల్‌ను తీసుకున్న తేజ్ ప్రతాప్ యాత్రను కొనసాగించారు. సైకిల్ యాత్రపై మాట్లాడుతూ.. పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడం వల్ల దగ్గరి ప్రయాణాలకు ప్రజలు సైకిల్‌ను వినియోగించాలని కోరారు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. -
రియాక్షన్.. ‘ఇంక ఫోన్‌కాల్స్ చెయ్యను’
ఎన్డీయేపై అసంతృప్తితో తిరిగి మహాకూటమితో జత కడదామనుకుంటున్న తరుణంలో జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లాలూ కొడుకులు విముఖత వ్యక్తం చేయటంతోపాటు తీవ్ర వ్యాఖ్యలు చేయటం నితీశ్‌కు కోపం తెప్పించింది. పట్నా: లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకొడుకు, ఆర్జేడీ యువనేత తేజ్‌ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నితీశ్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఒకరితో వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నప్పుడు.. వారి ఆరోగ్యం గురించి వాకబు చేయటంలో తప్పేంటి. అతని(తేజ్‌ను ఉద్దేశించి) వ్యాఖ్యలు సబబు కాదు. ఎవరెలా బాధపడుతున్నా పట్టించుకోరనేది వారి మాటల ద్వారా అర్థమైంది. లాలూ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. కానీ, ఇంక వాళ్లకు ఫోన్ చేసి లాలూ ఆరోగ్యంపై ఆరా తీయను. న్యూస్ పేపర్ల ద్వారానే తెలుసుకుంటా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ఏషియన్ హార్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే లాలూ ఆరోగ్యంపై నితీశ్ పదే పదే వాకబు చేస్తుండటంతో తిరిగి ఆర్జేడీకి లాలూ దగ్గరవుతున్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో స్పందించిన తేజ్ ప్రతాప్ యాదవ్... ‘కూటమిలోకి కాదు.. ఇంట్లోకి కూడా రానివ్వం. మా ఇంట్లోకే నితీశ్ చాచాకు అనుమతిలేదని బోర్డు పెట్టాలనుకున్న మేము.. మహాకూటమిలోకి ఎలా ఆహ్వానిస్తామనుకుంటున్నారు?’ అని మీడియానే తేజ్ ఎదురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నితీశ్ ఇలా స్పందించాల్సి వచ్చింది. -
ఐశ్వర్య ఎంట్రీ.. భర్త రాజీనామా కలకలం!
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో మరోసారి ఆధిపత్య పోరు మొదలైనట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీని వీడనున్నట్లు వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ మరోసారి పార్టీలో కలకలం రేపింది. మరోవైపు తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్యరాయ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్న సమయంలో ఇలాంటి వదంతులు ప్రచారం కావడం లాలూ కుటుంబంతో పాటు పార్టీలో ఏం జరుగుతుందోనని ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అసలేమైందంటే.. ఆర్జేడీ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించాలని పార్టీ భావించింది. ఈ క్రమంలో కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యుల పేర్లలో లాలూ పెద్ద కుమారుడు తేజప్రతాప్ పేరు లేకపోవడం గమనార్హం. తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్యను పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఆహ్వానించి ఆమెకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ ఫ్లెక్సీల్లో ఆమెకు కీలక స్థానం కల్పించారు. కానీ వ్యవస్థాపక దినోత్సవానికి తనను ఆహ్వానించకుండా అవమానించారని, పార్టీ నుంచి తాను వైదొలగుతున్నట్లు తేజ్ ప్రతాప్ సోషల్ మీడియా ఖాతా నుంచి చేసిన పోస్ట్ బుధవారం వైరల్‌గా మారింది. దీనిపై పట్నాలో జాతీయ మీడియా ఏఎన్ఐతో తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. కుటుంబ ఒత్తిడి కారణంగా పార్టీనుంచి వైదొలుగుతున్నట్లు (ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా) వచ్చిన ప్రకటనలు అవాస్తవాలని చెప్పారు. తన ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి ఎవరో ఇలాంటి పోస్టులు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చుకున్నారు. బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చునని ఆరోపించారు. అయినా పార్టీ ఫ్లెక్సీల్లో తన ఫొటో, పేరు ఉందని.. పార్టీ కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో నేతలందరి పేర్లు చేర్చడం అన్ని సందర్భాల్లో వీలు కాదని తేజ్ ప్రతాప్ అభిప్రాయపడ్డారు. -
‘నా ఫేస్‌బుక్‌ను సీఎం హ్యాక్ చేశారు’
పట్నా : తన ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారని ఆర్జేడీ ఛీప్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ తెలిపారు. సీఎం నితీష్ కుమార్, బీజేపీ కలిసి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని తన తల్లి, మాజీ సీఎం రబ్రీదేవి తనను ఆదేశించినట్లు తన ఖాతాలో తప్పుడు పోస్ట్‌లు చేస్తున్నారని తెలిపారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక తమ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని జేడీయూ-బీజేపీపై మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలని తమ కుటుంబంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, తామంతా ఐక్యంగానే ఉన్నామన్నారు. తన సోదరుడు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కి తనకు ఎలాంటి విభేదాలు లేవని, నా బలం తేజస్వీ అని పేర్కొన్నారు. జేడీయూ-బీజేపీ ఎన్నికుట్రలు చేసినా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని దీమా వ్యక్తం చేశారు. కాగా తేజ్‌ప్రతాప్ రాజకీయల నుంచి తప్పుకుని సినిమా రంగంలోకి వెళ్తున్నారని గతకొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. -
నితీశ్‌పై విషం కక్కిన లాలూ తనయుడు
పట్నా : ఎన్డీఏ కూటమిలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంతోషంగా లేరని, ఆయనను మహాకూటమిలోకి కొందరు కాంగ్రెస్ నేతలు పదే పదే ఆహ్వానిస్తున్నారని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సీఎం నితీశ్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మా ఇంట్లోకి నితీశ్ చాచాకు అనుమతిలేదని బోర్డు పెట్టాలనుకున్న మేం మహా కూటమిలోకి బిహార్ సీఎంను ఎలా ఆహ్వానిస్తామనుకుంటున్నారని ప్రశ్నించారు. పట్నాలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ది 10, సర్క్యూలర్ రోడ్డులో ఉన్న తమ ఇంట్లోకి నితీశ్‌ను అడుగు పెట్టనిచ్చేది లేదన్నారు. మాజీ సీఎం, లాలూ భార్య రబ్రీదేవికి కేటాయించిన ఆ ఇంట్లో కుటుంబం మొత్తం నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. మహాకూటమిలోకి నితీశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి చేర్చుకునేది లేదని లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ఇటీవల స్పష్టం చేయగా.. తేజ్ ప్రతాప్ సైతం అదే మాటపై ఉన్నారు. సీఎం నితీశ్ మహాకూటమిలో చేరాలనుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని జూన్ 17న ఏఐసీసీ బిహార్ కార్యదర్శి శక్తి సింగ్ గోహిల్ వ్యాఖ్యానించారు. మహాకూటమిలోకి నితీశ్ తిరిగి రానున్నారన్న వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో లాలూ తనయులు అందుకు ససేమిరా అంటున్నారు. కాగా, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, హిందూస్తానీ ఆవామ్ మోర్చా(సెక్యూలర్)ల కూటమి అధికారంలోకి వచ్చింది. గతేడాది జూలై మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీశ్ బీజేపీతో జతకట్టి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. -
లాలూ తనయుడి బాలీవుడ్ ఎంట్రీ!
పట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను తేజ్ ట్విటర్లో షేర్ చేశారు. ‘రుద్ర’ ది అవతార్ పేరుతో ఉన్న పోస్టర్‌ను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్లో హిందీ ఫిల్మ్.. కమింగ్ సూన్ అంటూ పేర్కొన్నారు. ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తేజ్ ఈ నిర్ణయంతో అందరిని ఆశ్చర్యపరిచారు. గతంలో కూడా తేజ్ ఓ భోజ్‌పురి చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ వైరల్‌గా మారింది. లాలూ అభిమానులు ఇప్పుడే సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత నెలలో ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను తేజ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత తేజ్ ఎక్కువగా అధ్యాత్మిక ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల లాలూ తనయుల మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరగగా లాలూ చిన్నకుమారుడు తేజస్వీ యాదవ్ వాటిని ఖండించారు. కాగా కొద్ది కాలంగా ఆర్జేడీలో కీలకంగా వ్యవహరిస్తున్న తేజస్వీనే రాజకీయాల్లో లాలూకు వారసుడంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఒక్క మాటతో వదంతులకు చెక్ పెట్టిన తేజస్వీ..
పట్నా, బిహార్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయంటూ వచ్చిన వార్తలపై ఆయన చిన్న కుమారుడు, బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘మా అన్నయ్య(తేజ్ ప్రతాప్ యాదవ్) నా మార్గదర్శి. 2019 లోక్‌సభ, 2020లో బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. తేజస్వీ దమ్మున్నవాడని ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన నా సోదరుడు, గైడ్ కూడా’ అంటూ తేజస్వీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బిహార్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్న తేజస్వి.. వాటి నుంచి ప్రజల దృష్టి మరలించడానికే కొంతమంది ఇలాంటి చౌకబారు వదంతులు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 మార్కులకు 38 మార్కులు రావడం, 44 మంది మహిళలపై అత్యాచారాలు జరగడం ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. విద్యావ్యవస్థ ఏ విధంగా నాశనమౌతోందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారన్నారు. ఇలాంటి అంశాలను తేలికగా తీసుకుంటే రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తేజస్వీ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రెండు రోజుల క్రితం తేజ్ ప్రతాప్.. మహాభారత పర్వాన్ని ఉటంకిస్తూ.. ‘అర్జుడిని రాజు చేశాక.. ద్వారక వెళ్లాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ కొంతమందికి నన్ను కింగ్‌మేకర్ అనడం అస్సలు ఇష్టం లేనట్లుందంటూ’ ట్వీట్ చేశారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన తర్వాత తేజస్వీ యాదవ్ అంతా తానై పార్టీని ముందుండి నడిపిస్తూ ఉండడంతో తేజ్‌ప్రతాప్ ఈవిధంగా అక్కసు వెళ్లగక్కారంటూ వదంతులు ప్రచారమయ్యాయి. -
ఆర్జేడీలో అన్నదమ్ముల పోరు?
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చిన్న విషయాన్ని భూతద్దంలో చూడవద్దని చిన్న కొడుకు తేజస్వీయాదవ్ పార్టీ శ్రేణులను కోరినప్పటికీ ఇద్దరి మధ్య అంతరం పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. ‘అర్జునుడిని హస్తినాపురం సింహాసనంపై కూర్చోబెట్టి ద్వారకకు తిరిగెళ్లిన కృష్ణుడిలా ఉండాలనుకుంటున్నా’ అని తేజ్ ప్రతాప్ ట్వీట్ చేశారు. దాంతో ఎన్నికల అనంతరం సోదరుడు తేజస్వీయాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేసి, ఆ తరువాత ఆయన రాజకీయాల నుంచి రిటైర్ కానున్నారనే వార్తలు ఆర్జేడీ వర్గాల్లో వ్యాపించాయి. అనంతరం తేజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పార్టీలోనే కొనసాగుతా. ఆర్జేడీని స్థాపించిన మా తండ్రి, ఈ స్థాయికి తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. కొందరు లోపలి వ్యక్తుల కారణంగా పార్టీకి హాని కలుగుతోంది. అవి సంఘ వ్యతిరేక శక్తులు. వాళ్లు మా తల్లిదండ్రులు, తేజస్వీ, మిసా(సోదరి, రాజ్యసభ ఎంపీ), నా పేరు వాడుకుని స్వార్థం కోసం పార్టీని నాశనం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. దీనిపై తేజస్వీ స్పందిస్తూ..‘మా అన్నతో నాకు అభిప్రాయ భేదాలున్న మాట అవాస్తవం. తేజ్‌ప్రతాప్ నాకు సోదరుడు, మార్గదర్శకుడు. చిన్న విషయాలను పెద్దగా చూడొద్దు’ అని అన్నారు. -
ఎన్నికల బరిలోకి తేజ్‌ప్రతాప్ యాదవ్ సతీమణి
-
ఎన్నికల బరిలోకి లాలూ కోడలు..!
పట్నా : ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్వర్యరాయ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అంటే కథనాలు ఔననే అంటున్నాయి. బిహార్‌లోని ఛాప్రా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే, పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్, బిహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్ ఈ నెల 12న జరిగిన సంగతి తెలిసిందే. ఆమె ఛాప్రాకు చెందిన వ్యక్తి కావడంతో.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఛాప్రా ఆడబిడ్డ అయిన ఐశ్వర్య ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే బాగుంటుందని, ఈ విషయంలో లాలూ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ నేత రాహుల్ తివారీ పేర్కొన్నారు. మరోవైపు ఐశ్వర్య ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న వార్త అధికారికంగా ధ్రువీకరించకముందే.. అధికార జేడీయూ ఆర్జేడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఆర్జేడీ కోసం కార్యకర్తలు ఎంత కష్టపడినా.. ఎన్నికల్లో టికెట్లు మాత్రం లాలూ కుటుంబానికే దక్కుతాయని జేడీయూ నేతలు విమర్శిస్తున్నారు. -
సైకిల్‌పై తేజ్ ప్రతాప్, ఐశ్వర్యరాయ్.. వైరల్
పట్నా : ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి ఈ నెల 12న పట్నాలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్‌తో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ నవదంపతులు కలిసి దిగిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఐశ్వర్యను ముందు కుర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతున్న ఫొటోను తేజ్ ప్రతాప్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. అలాగే పెళ్లిలో లాలు కుటుంబ సభ్యులు కలిసి చేసిన డ్యాన్స్ వీడియోలు బయటికి వచ్చాయి. పెళ్లి తర్వాత నూతన దంపతులను తేజ్ ప్రతాప్ యాదవ్ తల్లి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబరీ దేవి గుడికి కూడా తీసుకువెళ్లారు. ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ పెళ్లి ఫోటోలను, వీడియోలను బిహార మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. పెళ్లికి వచ్చి వధువరులను ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పెళ్లికి లక్షల్లో జనాలు వస్తారని ముందే అంచనా వేసి గాంధీ మైదానం లాంటి ప్రదేశంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయినా ఏమైన అసౌకర్యం కలిగి ఉంటే క్షమించమంటూ కూడా పోస్ట్ చేశారు. -
కోడలు వచ్చిన వేళా విశేషం..
పట్నా : కొత్త కోడలు ఐశ్వర్య రాయ్‌పై బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి పొగడ్తల వర్షం కురిపించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య రాయ్‌ల వివాహం శనివారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ఈ పెళ్లి కోసం మూడు రోజుల పెరోలుపై బయటకు వచ్చారు. సోమవారం కొత్త దంపతులతో కలసి విష్ణు ఆలయానకి వెళ్లిన రబ్రీదేవి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాలు ముగించుకుని వస్తుండగా రబ్రీదేవిని మీడియా ప్రతినిధులు కోడలి గురించి ప్రశ్నించగా ఆమె చాలా ఆనందం వ్యక్తం చేశారు. రబ్రీదేవి మాట్లాడుతూ.. ‘నా కోడలు చాలా అదృష్టవంతురాలు. ఐశ్వర్య మా ఇంటి లక్ష్మీ.. ఆమె రాకతో మా కుటుంబంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది ఒక శుభ శకునం’ అని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకి ఆరు వారాల తాత్కాలిక బెయిల్ లభించడం.. గత నెలలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన రబ్రీదేవి తాజాగా శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడంతో ఆమె ఇలా స్పందించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సోమవారం పెరోల్ గడువు ముగియడంతో లాలూ రాంచీ జైలుకు వెళ్లిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా లాలూకు లభించిన బెయిల్ మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో లాలూ ఈ రోజు సాయంత్రం పట్నాకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి వేడుకలో స్టెప్పులేసిన మాజీ సీఎం
-
లాలూ కుమారుడి పెళ్లి.. అపశృతి
పట్నా : లాలూ కొడుకు తేజ్ పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఆర్జేడీ నేతలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం ఆర్జేడీ సీనియర్ నేత చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌తో శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కిషన్‌గంజ్ ఆర్జేడీ జిల్లా అధ్యక్షుడు అలమ్, మాజీ మంత్రి ఇస్లాముద్దీన్ బాగీ కుమారుడు ఇక్రాముల్ హక్, దిగల్‌బంక్ ఆర్జేడీ నేత పప్పు పాల్గొన్నారు. వేడుక అనంతరం పట్నా నుంచి కిషన్‌గంజ్‌కు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనం పొతీయా సమీపంలో ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో వీరితో పాటు కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. ఐడీ కార్డుల సహాయంతో వీరిని ఆర్జేడీ నేతలుగా గుర్తించారు. కాగా ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
పెళ్లి వేడుకలో మాజీ సీఎం స్టెప్పులు
పాట్నా: బీహర్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యరాయ్‌ల వివాహం శనివారం కన్నులపండువగా జరిగింది. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు... రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌లతో పాటు... ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ తదితరులు హాజరయ్యారు. వేదికపై ఆశీనులైన నీతీశ్ నవ దంపతులను ఆశీర్వదించారు. దాణా కుంభకోణంలో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ.. తన కుమారుడి వివాహం నిమిత్తం మూడు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత లాలూ ఇంటా పెళ్లి భాజాలు మోగడంతో అంతా ఆనందంతో ఆడి పాడారు. వివాహ వేడుకల్లో భాగంగా ఓ భోజ్ పురి పాటకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు కుమార్తె మీసా భారతి, కొడుకు తేజస్వీ యాదవ్ లు, నవ దంపతులు స్టెప్పులేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ లగావెలు జాబ్ లిప్‌స్టిక్’ అనే భోజ్‌పురి పాటతో పాటు పలు హిందీ పాటలకు రబ్రీదేవి నృత్యం చేశారు. ఈ వివాహం కోసం ప్రత్యేకంగా సాంగ్స్ కంపోజ్ చేయించగా, వాటికి కూడా అందరూ డ్యాన్స్ చేశారు. -
తేజ్ ప్రతాప్ పెళ్లిలో రసాభాస
పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి వేడుకలో రసాభాస చోటుచేసుకుంది. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన కొందరు దుండగులు చేతి వాటం ప్రదర్శించారు. తినే ప్లేట్లు, ఆహార పదార్థాలు.. ఇలా కంటికి కనిపించిన వస్తువునల్లా దొంగిలించుకుపోయారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. శనివారం రాత్రి పట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో లాలూ పెద్ద కొడుకు తేజ్- ఆర్జేడీ సీనియర్ నేత చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. వధువరులు దండలు మార్చుకుంటున్న సమయంలో ఆర్జేడీ కార్యకర్తలమంటూ కొందరు.. వీఐపీ, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హాలులోకి లోపలికి ప్రవేశించారు. టపాసులతోపాటు, ప్లేట్లు, భోజనం, అతిథుల కోసం ప్యాకింగ్ చేసిన గిఫ్ట్‌లను పట్టుకుని పారిపోయారు. వారిని గమనించిన కార్యకర్తలు వెంబడించి అడ్డుకునే యత్నం చేశారు. కానీ, అప్పటికే వారు చాలా దూరం వెళ్లిపోయారు. ఈ పరిణామాల నడుమ తమపై దాడి జరిగిందని, కెమెరాలు ధ్వంసం అయ్యాయని కొందరు మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఆర్జేడీ నేతల జోక్యంతో అంతా శాంతించారు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇది జరిగినట్లు ఆర్జేడీ నేత ఒకరు తెలిపారు. 200 స్టాళ్ల ద్వారా సుమారు 7 వేల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయగా.. ఊహించని రీతిలో జనాలు హాజరయ్యారు. మరోవైపు భోజనాల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఇంకోవైపు ప్రాంగణమంతా చెత్త చెదారంతో నిండిపోయింది. బాహుబలి తరహా సెట్స్ .. భారీ వ్యయంతో ఈ వివాహవేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలని యత్నించినప్పటికీ చివరకు గందరగోళ పరిస్థితుల్లో వేడుక ముగిసింది. లాలూకి నితీశ్ కౌగిలింత.. కూటమితో విడిపోయాక తొలిసారి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లాలూలు ఒకే వేదికపై సందడి చేశారు. తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన నితీశ్.. లాలూను ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరు కాసేపు ముచ్చటించుకోగా.. నవ దంపతులు తేజ్ ప్రతాప్-ఐశ్వర్యలను నితీశ్ ఆశీర్వదించారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. -
శివుడిగా తేజ్.. పార్వతిగా ఐశ్వర్య..!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను తేజ్ శనివారం పెళ్లి చేసుకోబోతున్నారు. దాణా కుంభకోణం కేసుల్లో జైలులో ఉన్న లాలూ.. కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికు వచ్చారు. ఈ పెళ్లి కోసం లాలూ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అటు ఆర్జేడీ అభిమానులు, కార్యకర్తల కోలాహలం కూడా పెద్దస్థాయిలో ఉంది. పెళ్లి చేసుకోబోతున్న తేజ్ ప్రతాప్ కటౌట్లు, పోస్టర్లు పెద్ద ఎత్తున ఆర్జేడీ కార్యకర్తలు నిలబెట్టారు. ఇందులో లాలూ నివాసం వద్ద ఏర్పాటుచేసిన ఓ కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి కొడుకు తేజ్‌ప్రతాప్‌ను శివుడిగా, పెళ్లికూతురు ఐశ్వర్యను పార్వతిగా చిత్రీకరించిన ఈ కటౌట్‌ను కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్నాలోని వెటినరీ కాలేజీ కాంపౌండ్‌లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు రామ్ చంద్ర పూర్వే చెప్పారు. -
లాలూ ఇంట..ఘనంగా పెళ్లి సంబరాలు
-
గానా బజానా.. ఘనంగా తేజ్ పెళ్లి వేడుక
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి చాలా కాలానికి పెళ్లి భాజాలు మోగుతున్నాయి. నేడు ఆయన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను నేడు(శనివారం) తేజ్ ప్రతాప్ మనువాడబోతున్నారు. దాణా కుంభకోణ కేసుల్లో ఇన్ని రోజులు జైలులో ఉన్న లాలూ, కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికి విడుదలయ్యారు. నిశ్చితార్థపు వేడుకలను మిస్ అయిన లాలూకు, ఆ లోటు లేకుండా పెళ్లికి ముందు జరిగే అన్ని వేడుకలను ఆ ఫ్యామిలీ ఘనంగా చేస్తోంది. తేజ్‌కు పసుపు రాసే వేడుక నుంచి అన్ని వేడుకలను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది. తేజ్‌కు జరిగే అన్ని వేడుకలను తల్లి రబ్రీదేవీ దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. లాలూ సైతం ఈ వేడుకలను ఎంతో సంతోషంతో ఆస్వాదిస్తున్నారు. ఎంతో కాలానికి లాలూ ఇంట్లో ఈ పెళ్లి వేడుక జరుగుతుండటంతో, ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వరకే చాలామంది అతిథులు లాలూ ఇంటికి వచ్చేశారు. లాలూ ఇంటికి, పెళ్లి కూతురు ఐశ్వర్య రాయ్ బంగ్లాకు కేవలం 200 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో, ఆ మార్గమంతా పూలతో, గ్రీన్ చిల్లీస్, లెమన్లతో సర్వాంగ సుందరంగా అలకరించారు. అన్న పెళ్లి వేడుకల్లో భాగంగా తేజస్వి స్టెపులతో అదరగొట్టారు. పలు బాలీవుడ్ సాంగ్‌లకు డ్యాన్స్‌లు వేస్తూ దుమ్మురేపారు. యాదవ్‌ల మాన్షన్‌లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు రామ్ చంద్ర పూర్వే చెప్పారు. కాగ, పాట్నాలోని వెటిరినరీ కాలేజీ కాంపౌండ్‌లో వీరి వివాహం జరుగబోతోంది. లాలూ ఇంట..ఘనంగా పెళ్లి సంబరాలు -
లాలూ కొడుకు పెళ్లికి రాహుల్
రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా హాజరు కానున్నారు. పెళ్లికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితరులను ఆహ్వానించారు. తేజ్ ప్రతాప్æ వివాహం ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యతో శనివారం జరగనుంది. లాలూకు 6 వారాల బెయిల్ దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు 6 వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. మూడు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన లాలూ గురువారం సాయంత్రం పట్నా చేరుకున్నారు. లాలూకు రాందేవ్ ఆరోగ్య సూచనలు బిహార్‌లోని నలంద, గయా జిల్లాల్లో మంగళవారం నుంచి యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న యోగా గురువు బాబా రాందేవ్ శుక్రవారం లాలూ నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు నిత్యం యోగా చేయాలని లాలూకు సూచించారు. -
లాలూకు మూడు రోజుల పెరోల్
రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడు రోజుల పాటు పెరోల్ మంజూరైంది. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ బిహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యరాయ్‌ను ఈ నెల 12న పట్నాలో వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాలూ కోరారు. అయితే ఆంక్షలతో కూడిన మూడు రోజుల పెరోల్ మాత్రమే మంజూరు చేసినట్టు జార్ఖండ్ జైళ్ల శాఖ ఐజీ హర్‡్ష మంగ్లా మీడియాకు తెలిపారు. అయితే పెరోల్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది స్పష్టంగా చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఆయన ప్రయాణం చేసే సమయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోరని తెలిపారు. పెరోల్ నేపథ్యంలో లాలూకు పలు ఆంక్షలు విధించారు. ఆయన బయట ఉన్న మూడు రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు. పార్టీ నేతలతో కానీ, కార్యకర్తలతో కానీ కలవకూడదు. ఎలాంటి రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొన కూడదు. ఆయన చేసే ప్రతీ పని వీడియోలో రికార్డు అవుతుంది. కాగా, పెరోల్‌పై గురువారం విడుదలైన వెంటనే పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు పట్నా వెళ్లారు. విమానాశ్రయంలో కుమార్తె మీసా భారతి, కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాంచీ నుంచి పట్నా వరకు లాలూ వెంట ఆర్జేడీ జనరల్ సెక్రెటరీ బోలా యాదవ్ ఉన్నారు. పెరోల్ ముగిసిన తరువాత మే 14న లాలూ తిరిగి రాంచీకి వెళ్తారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
మరో పెద్దింటి పెళ్లి
దాంపత్య జీవితానికి బందీ కాబోతున్న పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్‌ను ఆశీర్వదించేందుకు రాంచీ జైల్లో బందీగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం పెరోల్‌పై విడుదల అయ్యారు. పెళ్లి జరిగే మే 12వ తేదీకి అటు ఇటు కలిపి ఐదురోజుల పాటు ఆయన స్వేచ్ఛా వాయువులు పీలుస్తారు. అయితే జైలు నుంచి లభించిన తాత్కాలిక విముక్తి కారణంగా అది ఆయనకు లభించిన స్వేచ్ఛ కాదు. ఎంతకీ పెళ్లి కాని కొడుకులపై చింతతో బెంగపెట్టుకున్న లాలూకి.. ఎట్టకేలకు పెద్ద కొడుకు ఒకింటివాడు కాబోతుండటంతో ఆ బెంగ నుంచి లభించిన స్వేచ్ఛ అది! పెళ్లి కూతురు పేరు ఐశ్వర్యారాయ్! తేజ్‌ప్రతాప్‌కీ, ఐశ్వర్యకు గత నెల 18న పట్నాలోని మౌర్య హోటల్లో ఎంగేజ్మెంట్ అయింది. ఎవరీ ఐశ్వర్య! ఐశ్వర్య బిహార్ మాజీ ముఖ్యమంతి దరోగా ప్రసాద్ రాయ్ మనుమరాలు. 1970 ఫిబ్రవరి 16 నుంచి డిసెంబర్ 22 వరకు ఆయన బిహార్ సీఎంగా ఉన్నారు. ఐశ్వర్య తండ్రి చంద్రికా ప్రసాద్ రాయ్ బిహార్ మంత్రిగా పనిచేశారు. విశేషం ఏంటంటే.. ఇంతవరకు ఆయన తన కూతురి పెళ్లిని నిర్ధారించకపోవడం! ఐశ్వర్య ముద్దు పేరు ఝిప్సీ. వయసు 25. ముగ్గురు పిల్లల్లో ఆమే పెద్ద. చెల్లెలు ఆయుషి, తమ్ముడు అపూర్వ, అమ్మ, నాన్న.. ఇదీ ఆమె ఫ్యామిలీ. ఐశ్వర్య పట్నాలోని నోటర్ డేమ్ అకాడమీలో చదివారు. ఢిల్లీ యూనివర్శిటీ మిరిండా హౌస్ నుంచి చరిత్రలో పట్టభద్రులయ్యారు. అమిటీ విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఎ. చేశారు. లాలూ ఇంట్లో 2014 తర్వాత ఇంకో పెళ్లి జరగలేదు. ఆ ఏడాది ఆఖరి కూతురు రాజ్యలక్ష్మి పెళ్లి జరిగింది. అప్పట్నుంచి ఇద్దరు కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్విల పెళ్లి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా తగిన వధువు దొరకకో, ఈ అన్నదమ్ములు తగిన వరులు కాదనో.. పెళ్లి ఘడియలు రాలేదు. తేజస్వికి పెళ్లి సంబంధాలు పుష్కలంగా వస్తున్నప్పటికీ, అన్నయ్య పెళ్లయ్యాకే చేసుకుంటానని భీష్మించుకుని కూర్చోవడంతో అతడి పెళ్లి కూడా అలస్యం అవుతూ వచ్చింది. లాలూ దంపతులకు 9 మంది సంతానం. అందరికన్నా పెద్దవాడు ఇప్పుడు పెళ్లవుతున్న పిల్లవాడు. రెండో సంతానం తేజస్వి. మూడు మిసా భారతి. నాలుగు రోహిణి. ఐదు చందన. ఆరు రాగిణి. ఏడు హేమ. ఎనిమిది అనుష్క. తొమ్మిది రాజ్యలక్ష్మి. మొత్తం ఏడుగురు కూతుళ్లకూ పెళ్లిళ్లయిపోయాయి. ఇక మిగిలింది ఈ ఇద్దరు అబ్బాయిలు. వీళ్ల కోసం గతంలో లాలూ భార్య రబ్రీదేవి స్వయంవరం కూడా జరిపించారు. అయితే వచ్చే కోడళ్లకు ఆమె కొన్ని ‘సంప్రదాయ నిబంధనలు’ విధించడంతో ఎవరూ ముందుకు రాలేదు. పెద్దల్ని గౌరవించడం; అణకువగా, ఒద్దికగా ఉండటం; సినిమాలు, షాపింగులకు దూరంగా ఉండటం.. ఇంకా ఇలాంటివేవో ఆ నిబంధనల్లో ఉన్నాయి! ఇప్పుడీ కొత్త కోడలు అత్తకు నచ్చిన ఉత్తమురాలు అనే అనుకోవాలి. ఎందుకంటే.. రబ్రీ ఎస్ అన్నాకే.. ఎంగేజ్మెంట్ అయింది. అయితే పెళ్లికి మాత్రం ఐశ్వర్య తండ్రి మనస్ఫూర్తిగా ‘ఎస్’ అన్నట్లు ఇప్పటికైతే ఒక్క వార్తా రాలేదు! -
తేజ్ ప్రతాప్‌కు మెహందీ వేడుక..!
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మరో రెండు రోజుల్లో జరుగబోతోంది. ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను ఆయన మనువాడబోతున్నారు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా బుధవారం రాత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మెహందీ వేడుక నిర్వహించారు. సాధారణంగా అమ్మాయిలకు నిర్వహించే ఈ మెహందీ వేడుకను, తేజ్ ప్రతాప్‌కు నిర్వహించడం విశేషం. ఈ ఇరువురి వివాహం మే 12న పాట్నా వెటరినరీ కాలేజీ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరుగనుంది. కొడుకు పెళ్లి కోసం ప్రస్తుతం జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదు రోజుల పెరోల్ లభించింది. గతం వారం క్రితమే లాలూ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, రాంచి జైలుకి వెళ్లారు. గత నెల 19న తేజ్, ఐశ్వర్యల నిశ్చితార్థం మౌర్య హోటల్లో సుమారు 200 మంది అతిథుల మధ్య ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి లాలూ జైలులోనే ఉన్నారు. మే 12న జరుగబోతున్న ఈ వివాహానికి వందల మంది వీవీఐపీలు హాజరు కాబోతున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన మంత్రి వర్గ సభ్యులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్టు సన్నిహిత వర్గాలు చెప్పాయి. తేజ్‌ను మనువాడబోతోన్న ఐశ్వర్య బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు. ఆమె తండ్రి చంద్రికా రాయ్, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. పాట్నాలోనే హైస్కూల్ వరకు చదువుకున్న ఐశ్వర్య.. తర్వాత ఉన్నత చదువులు మొత్తం ఢిల్లీలో పూర్తి చేసింది. అయితే తేజ్ ప్రతాప్ 12వ తరగతి చదివారు. -
కొడుకు పెళ్లికి జైలులోనే లాలూ..?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మాజీ మంత్రి చంద్రిక రాయ్ కూడా ఐశ్వర్య రాయ్ కూతురితో మే12న అంగరంగ వైభవంగా జరుగబోతోంది. పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో ఈ వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకకు కూడా లాలూ హాజరవుతారో లేదో ఇంకా క్లారిటీ లేదు. దాణా కుంభకోణ కేసులో ప్రస్తుతం రాంచి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు నిశ్చితార్థానికి కూడా రాలేకపోయారు. డయాబెటీస్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో రాంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇటీవలే చికిత్స తీసుకున్న లాలూ... తక్షణ చికిత్స కోసం తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసుకున్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణను జార్ఖాండ్ హైకోర్టు మే 11కు వాయిదా వేసింది. మే 11నే తేజ్ ప్రతాప్ పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ మే 11న కోర్టు బెయిల్ మంజూరు చేసిన రాంచి నుంచి పాట్నాకు ఒక్క రోజులో రావడం కొంచెం కష్టమే అంటున్నారు సన్నిహిత వర్గాలు. లాలూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిన్ననే జార్ఖాండ్ హైకోర్టు విచారించాల్సి ఉంది. కానీ న్యాయవాదుల బంద్‌తో ఈ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు. అయితే త్వరగా ఈ బెయిల్ పిటిషన్ విచారించాల్సిందిగా లాలూ వర్గాలు కోరుతున్నాయి. వచ్చే శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించాలని సీబీఐ వాదిస్తుందని, అయితే తమకు అనుకూలంగానే ఆదేశాలు వస్తాయని ఆర్జేడీ ఎంపీ, లాలూ సన్నిహితుడు జై ప్రకాశ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న లాలూను రాజకీయ కుట్రతో సోమవారం రాంచి జైలుకు తరలించారని ఆరోపించారు. లాలూ అనారోగ్యంగా ఉండటంతో, తాము పెరోల్‌కు దరఖాస్తు చేయలేదని ఆర్జేడీ అధినేత న్యాయ వ్యవహారాలు చూసుకున్న వ్యక్తి చెప్పారు. తక్షణ చికిత్స కోసం బెయిల్‌ను కోరినట్టు తెలిపారు. సాధారణంగా పెరోల్‌ను పెళ్లి వేడుకలకు కానీ, అంత్యక్రియలకు కానీ దరఖాస్తు చేసుకుంటారు. 2014 తర్వాత లాలూ కుటుంబంలో జరుగబోయే అతిపెద్ద వేడుక తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లినే. ఆర్జేడీ చిన్న కూతురు రాజ్ లక్ష్మి పెళ్లి తర్వాత, ఇప్పుడు ఆ ఇంట్లో తేజ్ పెళ్లి జరుగుతోంది. -
‘కట్నం లేకుంటేనే ఆ పెళ్లికి హాజరవుతా’
సాక్షి, పాట్నా : బిహార్ మాజీ సీఎం దుర్గా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యా రాయ్‌తో తన వివాహానికి ఆహ్వాన పత్రికలను పంచేందుకు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సిద్ధమయ్యారు. బిహార్ రాజకీయాల్లో దిగ్గజాలందరికీ స్వయంగా తేజ్ ప్రతాప్ పెళ్లిపత్రికలను అందచేస్తున్నారు. అయితే తేజ్ ప్రతాప్ కట్నం తీసుకోకుండా ఉంటేనే తాను ఈ పెళ్లికి హాజరవుతానని జేడీ(యూ) ఎంఎల్సీ నీరజ్ కుమార్ షరతు విధించారు. ఎలాంటి కట్న ప్రసక్తి లేకుండానే ఐశ్వర్యా రాయ్‌తో తన వివాహం జరుగుతోందని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించాలని ఆయన కోరారు. అప్పుడే తాను ఈ వివాహానికి హాజరవుతానని మెలిక పెట్టారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా తన పెళ్లి వేడుక జరుగుతుందని కూడా తేజ్ ప్రతాప్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జేడీ(యూ) ఎంఎల్సీ షరతులపై ఆర్జేడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను ఆర్జేడీ టార్గెట్ చేస్తూ ముందుగా నితీష్ పార్టీ కట్నానికి, మద్యానికి దూరంగా ఉందా అన్నది స్పష్టం చేయాలని కోరింది. తేజ్ ప్రతాప్, ఐశ్వర్యారాయ్‌ల వివాహ నిశ్చితార్థం ఈనెల 18న పాట్నాలోని హోటల్ మౌర్యలో జరిగిన విషయం తెలిసిందే. మేలో వీరింద్దరి వివాహం అత్యంత ఆర్భాటంగా జరగనుంది. -
పెళ్లి మూమెంట్ : లాలూ కుటుంబానికి ఐటీ షాక్
పాట్నా : పెళ్లి పనులతో బిజీబిజీగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. పాట్నాలోని షేక్‌పూర్‌లో 7105 చదరపు అడుగుల భూమిని ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసుకుంది. ఈ భూమి లాలూ కొడుకు తేజ్ ప్రసాద్ యాదవ్ పేరుతో రిజిస్ట్రర్ అయి ఉంది. బినామీ ఆస్తుల చట్టం కింద ఈ భూమిని అటాచ్ చేసినట్టు ఐటీ అధికారులు చెప్పారు. ఇటీవలే తేజ్ ప్రతాప్ యాదవ్‌కు పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు, మాజీ మంత్రి చంద్రికా రాయ్ కూతురు ఈ ఐశ్వర్యరాయ్‌ను తేజ్ ప్రతాప్ యాదవ్ మే 12న పెళ్లి జరుగబోతోంది. అందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఐటీ శాఖ తేజ్ ప్రతాప్ యాదవ్ రిజిస్ట్రర్ భూమిని ఐటీ శాఖ అటాచ్ చేసుకోవడం గమనార్హం. -
అట్టహాసంగా ఐశ్వర్య, తేజ్ ఎంగేజ్మెంట్
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు, ఐశ్వర్య రాయ్‌కి నిశ్చితార్థం అయింది. పాట్నాలోని మౌర్య హోటల్లో వీరిద్దరి నిశ్చితార్థం బుధవారం జరిగింది. దాణా కుంభకోణ కేసుల్లో ప్రస్తుతం జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, తన కొడుకు నిశ్చితార్థానికి రాలేకపోయారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లాలూ సోదరీమణులు ఈ నిశ్చితార్థం కోసం ప్రత్యేకంగా సిటీకి విచ్చేశారు. తేజ్ ప్రతాప్, ఐశ్వర్య రాయ్ రింగులు మార్చుకునే ఈ ఘట్టానికి సుమారు 200 మంది అతిథులు హాజరైనట్టు తెలిసింది. ఈ నిశ్చితార్థం కోసం మౌర్య హోటల్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. ఢిల్లీ, కోల్కత్తా, బెంగళూరు, పుణే నుంచి తీసుకొచ్చిన పువ్వులతో ఈ హోటల్‌ను అట్టహాసంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కూతురు ప్రియాంక గాంధీని కూడా ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినట్టు తెలిసింది. కానీ ఆమె ఈ ఈవెంట్‌కు హాజరయ్యారో లేదో తెలియరాలేదు. పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో భాగమైనట్టు తెలిసింది. వీరిద్దరి వివాహం వచ్చే నెల 12వ తేదీన పాట్నాలోని వెటిరినరీ కాలేజీ కాంపౌండ్‌లో జరుగనుంది. తేజ్‌ను మనువాడబోతోన్న ఐశ్వర్య బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు. ఆమె తండ్రి చంద్రికా రాయ్, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. పాట్నాలోనే హైస్కూల్ వరకు చదువుకున్న ఐశ్వర్య.. తర్వాత ఉన్నత చదువులు మొత్తం ఢిల్లీలో పూర్తి చేసింది. అయితే తేజ్ ప్రతాప్ 12వ తరగతి చదివారు. -
తేజ్‌ను కలిసిన ఐశ్వర్య, ఫోటో వైరల్
పట్నా : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి సందడి మొదలుకాబోతోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనుమరాలు, ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని ఐశ్వర్యా రాయ్‌తో తేజ్ ప్రతాప్ పెళ్లి త్వరలో జరగబోతోంది. ఏప్రిల్ 18న నిశ్చితార్థం, వచ్చే నెలలో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించినట్లు సన్నిహితులు తెలిపారు. త్వరలో మనువాడబోతున్న తేజ్-ఐశ్వర్యలు ఆదివారం పట్నా ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న తన తండ్రి లాలూను కలిసి న్యూఢిల్లీ నుంచి పట్నాకు వస్తున్న తేజ్, ఐశ్వర్యను కలిసినట్టు తెలిసింది. ఈ ఇద్దరు కలిసి కొద్ది సేపు ఎయిర్‌పోర్టులో మాట్లాడుకున్న అనంతరం, ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్యతో పాటు ఆమె బంధువులు కూడా వారితో పాటు ఉన్నారు. తేజ్‌ను కలిసిన అనంతరం ఐశ్వర్య పెళ్లి షాపింగ్ కోసం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగా.. తేజ్ ఇంటికి చేరుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఏప్రిల్ 18న జరుగుతుండగా.. పెళ్లి మే 12న పట్నా వెటర్నిటీ కాలేజీ గ్రౌండ్లో జరగబోతోంది. వందల మంది వీవీఐపీల ఈ పెళ్లి వేడుకకు హాజరు కాబోతున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన మంత్రి వర్గ సభ్యులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారని సన్నిహిత వర్గాలు చెప్పాయి. -
ఐశ్వర్య రాయ్‌తో తేజూ పెళ్లి: వైరల్
పట్నా : తేజ్ ప్రతాప్ యాదవ్- ఐశ్వర్య రాయ్‌ల పెళ్లి వార్త దేశమంతటా ఆసక్తి రేపుతున్నది. లక్షల మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహుర్తం ఖరారైంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనుమరాలు, ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని ఐశ్వర్యా రాయ్‌తో తేజ్ ప్రతాప్ పెళ్లి ఫిక్స్ అయినట్లు యాదవ్ పరివారం వెల్లడించింది. ఏప్రిల్ 18న నిశ్చితార్థం, వచ్చే నెలలో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించినట్లు సన్నిహితులు తెలిపారు. పట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌లో పెళ్లి వేడుకలు జరుగుతాయని సమాచారం. ఐశ్వర్యదీ పెద్ద కుటుంబమే: లాలూ ఇంటి కోడలిగా రానున్న ఐశ్వర్యరాయ్దీ పెద్ద కుటుంబమే. ఆమె తాత దరోగా ప్రసాద్ రాయ్ బీహర్‌లో యాదవ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి. ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ బిహార్ మంత్రిగానూ పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించిన ఐశ్వర్యకు ఎన్నో సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించినప్పటికీ తిరస్కరించిందని ఆమె బంధువులు తెలిపారు. పెళ్లి ఖరారు కావడంతో లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి ‘కోడళ్ల అన్వేషణ’ సగం ఫలించినట్లైంది. తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వీ యాదవ్‌కు ఇప్పటికే 40వేల పెండ్లి ప్రపోజల్స్ వచ్చాయి. చిన్న కొడుకు పెళ్లి కూడా చేసేస్తే తన అన్వేషణ పూర్తవుతుందని రబ్రీ పలు మార్లు చమత్కరించిన సంగతి తెలిసిందే. గతంలో ‘పెద్దవాళ్లను గౌరవిస్తూ, ఇంటిని చక్కగా నడిపించే కోడలు దొరికితే చాలు’ అంటూ రబ్రీ దేవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ‘సంస్కారమున్న కోడలు అంటే గృహిణిగా ఉండటమే కాదని.. ప్రేమ, ఆప్యాయతలు కురిపించి కుటుంబాన్ని తీర్చిదిద్దే లక్షణాలున్న గృహిణి అయినా, ఉద్యోగస్తురాలైనా కావచ్చు’ అంటూ లాలూ ట్వీట్ చేశారు. -
లాలూ కుమారుడికి ఊరట
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బిహార్‌లో సంచలనం సృష్టించిన జర్నలిస్టు హత్యకు సంబంధించిన కేసులో ఆయనపై తదుపరి విచారణ అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న తేజ్ ప్రతాప్ యాదవ్, మహ్మద్ కైఫ్, మహ్మద్ జావేద్‌లకు సంబంధించి.. పత్రికల్లో వచ్చిన ఫొటోలు, వీడియోల నుంచి ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అన్న కోణంలో విచారించారా అని సీబీఐని కోర్టు ప్రశ్నించింది. ఇందుకు తగిన ఆధారాలు సంపాదించలేకపోయామని సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణకు తేజ్‌ప్రతాప్ రావాల్సిన అవసరంలేదని గురువారం స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో మహ్మద్ కైఫ్, మహ్మద్ జావేద్ ఇంకా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. అసలు ఏం జరిగింది... బిహార్ ప్రాంతీయ దినపత్రికకు చెందిన రాజ్దేవ్ రాజన్ సివాన్ పట్టణంలో 2016,మే 13న హత్యకు గురయ్యారు. జైలు పాలైన ఆర్జేడీ నేతకు చెందిన గన్మెన్లు ఈ హత్య చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రాజ్దేవ్ భార్య కూడా తేజ్‌ప్రతాప్‌ను విచారించాలని కోరడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. బిహార్‌లో అప్పట్లో సంచలనం సృష్టించిన చంద్రకేశ్వర్ ప్రసాద్ కుమారుల హత్యకేసుకు సంబంధించి రాజ్దేవ్ వార్తలు రాశారు. ఈ విషయమై తేజ్‌ప్రతాప్.. రాజ్‌దేవ్‌ను బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజ్దేవ్ హత్య కేసులో ఆర్జేడీ నేత, గ్యాంగ్‌స్టర్ షహబుద్దీన్ కీలక సూత్రధారి అని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించినా ఎఫ్ఐఆర్లో ఆయన పేరును పోలీసులు చేర్చలేదు. షహబుద్దీన్‌కు మరో కేసులో కోర్టు ఇప్పటికే జీవిత ఖైదు విధించింది. -
‘బీజేపీ-ఆరెస్సెస్ దోస్తీ అప్పుడు కటీఫ్’
సాక్షి, నలంద: వివాదాస్పద అయోధ్య అంశంపై బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఆర్జేడీ గానీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గానీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించలేవని తేజ్ ప్రతాప్ అభిప్రాయపడ్డారు. రామాలయాన్ని కేవలం హిందువులే కాదు.. ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, దళితులు, ఇతర అన్ని మతాలవారు కలిసి నిర్మిస్తారని ఆకాంక్షించారు. పార్టీలకు, మతాలకు అతీతంగా అందరూ కలిసి మందిరం ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నలందలో తేజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడారు. అన్ని మతాల వాళ్లు అయోధ్యకు చేరుకుని ఇటుక మీద ఇటుక పేరుస్తూ రామాలయ నిర్మాణం చేపడతారని చెప్పారు. ఏ రోజైతే రామ మందిర నిర్మాణం పూర్తవుతుందో ఆరోజు బీజేపీ-ఆరెస్సెస్‌ల బంధం ముగుస్తుందని తేజ్ ప్రతాప్ జోస్యం చెప్పారు. ఆ సమయంలో వారికి ఎలాంటి అజెండాలు వదులుకుని నడుచుకుంటారని అయోధ్య వివాదం, బీజేపీ-ఆరెస్సెస్ దోస్తీపై లాలూ ప్రసాద్ తనయుడు స్పందించారు. -
దెయ్యాలను వదిలారు.. అందుకే ఖాళీ చేశా!
పట్నా : ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విచిత్రమైన వాదనను వినిపిస్తున్నాడు. ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయనే ఖాళీ చేశామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలు నన్ను భవనం ఖాళీ చేయించటానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అందుకే వాళ్లు అందులోకి దెయ్యాలను వదిలారు’ అంటూ తేజ్ పేర్కొన్నాడు. గతంలో నితీశ్ హయాంలో తేజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఈ బంగ్లాను కేటాయించారు. దేశ్‌రత్న మార్గ్‌లో ఉన్న ఈ భవనానికి వాస్తు దోషం మూలంగా అప్పుడు తేజ్ మార్పులు కూడా చేయించాడు. అయితే మహాకూటమితో విడిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలంటూ తేజ్‌కు నితీశ్ ప్రభుత్వం నోటీసులు పంపింది. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తల్లి రబ్రీదేవి ఇదే భవనాన్ని ఉపయోగించటం.. అది సెంటిమెంట్‌గా భావించి తేజ్ ఖాళీ చేయలేదు. ఇంతలో ఆర్జేడీ నేతలు ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది. విచారణ పెండింగ్‌లో ఉండగానే ఇలా ఉన్నపళంగా దెయ్యాలున్నాయంటూ భవనాన్ని ఖాళీ చేసేశాడు. అయితే ఇదంతా అతను చేస్తున్న జిమిక్కుగా జేడీయూ అభివర్ణిస్తోంది. అతని సోదరుడు తేజస్వి యాదవ్ ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్నాడు. అందుకే మీడియా దృష్టిని తనవైపు మళ్లించుకోవటానికే దెయ్యాలంటూ తేజ్ ప్రతాప్ నాటకాలు ఆడుతున్నాడు అంటూ జేడీయూ నేతలు మండిపడుతున్నారు. -
భయం లేకుండా పెళ్లి చేసుకోండి..
పాట్న : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నుంచి వచ్చిన బెదిరింపులతో బీజేపీ నేత సుశిల్ మోదీ తన కొడుకు పెళ్లి వేదికను మార్చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పెళ్లి వేదికను మారుస్తున్నట్టు తెలిపారు. సుశిల్ మోదీ తనను పెళ్లికి ఆహ్వానించారని, ఒకవేళ తాను అక్కడకు వెళ్తే తనను బహిర్గతం చేస్తానంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. తేజ్ ప్రతాప్ యాదవ్ కేవలం నిరాశతో ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని సుశిల్ మోదీ అన్నారు. తేజ్ ప్రతాప్ ఎలాంటి అతనో తనకు తెలసునని, దీంతో వేదిక మార్చాలని నిర్ణయించినట్టు మోదీ తెలిపారు. పెళ్లి కూతురి కుటుంబాన్ని రాజకీయాల ముప్పు, అనవసరపు హింస, బెదిరింపుల నుంచి కాపాడే బాధ్యత తమదని చెప్పారు. ప్రస్తుతం మోదీ పెళ్లి వేదికలను రాజేంద్ర నగర్ శఖా మైదాన్ నుంచి వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌కు మార్చారు. లాలూ ప్రసాద్ ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం గమనార్హంగా ఉంది. పెళ్లి మండపాన్ని మారుస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంపై తేజ్ ప్రతాప్ కూడా స్పందించారు. సుశిల్ మోదీ తన కొడుకు పెళ్లిని ఎలాంటి భయం బెరుకు లేకుండా చేసుకోవచ్చన్నారు. తాను క్రిమినల్ని లేదా టెర్రరిస్టును కాదని పేర్కొన్నారు. మోదీ చాలా భయగ్రస్తులైన డిప్యూటీ సీఎం అని, డిప్యూటీ సీఎం భయపడితే ఇక ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందంటూ లాలూ కామెంట్లు చేశారు. కాగ, పలువురు కేంద్ర మంత్రులు, నాలుగు రాష్ట్రాల గవర్నర్లు ఈ వేడకకు హాజరు కానున్నట్టు ధృవీకరణ అయింది. -
తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు ఇవే...
-
లాలూ కొడుకుపై కోటి నజరానా
పట్న : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పై బీజేపీ నేత ఒకరు నజరానా ప్రకటించారు. తేజ్ చెంప పగలకొట్టిన వారికి కోటి రూపాయలు ఇస్తానని అనిల్ సాహ్ని శుక్రవారం ఓ ప్రకటన జారీచేశారు. తేజ్ ఈ మధ్య బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ(బీజేపీ) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆయన అక్రమాలను బయటపెడతానని.. ప్రజల ముందే చెంప పగలకొడతానని చెప్పాడు. ఈ నేపథ్యంలో పట్నా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ అయిన సాహ్ని ఈ కొత్త ఆఫర్ ప్రకటించాడు. ‘‘మోదీపై దాడి చేస్తానని తేజ్ చెప్పాడు.. అంతకంటే ముందే ఎవరైతే తేజ్‌పైనే దాడి చేస్తారో వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాం’’ అని ప్రకటించాడు. అంతేకాదు తేజ్ చేత క్షమాపణలు చెప్పేదాకా లాలూ ఇంటి ముందు ధర్నా చేపడతామని హెచ్చరించాడు. సాహ్ని వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయన ప్రకటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పటికే వివరణ కోరామని... అది సహేతుకంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమని పేర్కొంది. లాలూ తన కొడుకులను అదుపులో పెట్టుకోవాలని సూచించింది కూడా. కాగా, ఔరంగాబాద్‌లో తేజ్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ... డిసెంబర్ 3న జరగబోయే సుశీల్ కొడుకు ఉత్కర్ష్ పెళ్లి ఆహ్వానం తనకు అందిందని.. ఒకవేళ తాను అక్కడికి వెళ్తే మాత్రం రచ్చ చేయటం ఖాయమని హెచ్చరికలు చేశాడు. -
లాలూ కుమారుడికి మరో ఝలక్
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి మరో సారి ఎదురు దెబ్బ తగిలింది. లాలూ కుమారుడు, బిహార్ ఆరోగ్య శాఖామంత్రి తేజ్ ప్రతాప్‌యాదవ్‌కు ప్రభుత్వం రంగ ఆయిల్ సంస్థ ఝలక్ ఇచ్చింది. ఆయన పెట్రోల్ పంపు లైసెన్సును బీపీసీఎల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31న కంపెనీ పంపించిన నోటీసులకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కేటాయించిన పెట్రోల్ పంపు లైసెన్సును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రద్దు చేసింది. దీనికి సంబంధించి ఆయనకు కేటాయించిన పెట్రోల్ పంప్ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని కోరుతూ ఒక షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. 15 రోజులలోపు సమాధానం ఇవ్వాల్సింది కోరింది. బిపిసిఎల్ టెరిటరీ మేనేజర్ (రిటైల్), పాట్నా, మనీష్ కుమార్ పేరుతో ఈ నోటీసులు అందాయి. దీని ప్రకారం, అసిసాబాడ్ బైపాస్ రహదారిలో ఉన్న పెట్రోల్ పంప్‌ను యాదవ్ అక్రమంగా లీజుకు తీసుకున్నట్టు ఫిర్యాదు చేసింది. 2012 లో పెట్రోల్ పంప్ కోసం యాదవ్ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరి 27న మంత్రి పేరుతో రిజిస్టర్ అయింది. M / S లారా ఆటోమొబైల్స్‌కు రిటైల్ అవుట్ లెటకు దీన్ని అప్పగించారు. అయితే ఇది M / S చెల్లదని ఇన్ఫోసిస్టెమ్స్ ఫిర్యాదు చేసిందని బీపీసీఎల్ ఆ నోటీసులో పేర్కొంది. బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి, తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, త్వరలోనే వివరాలు తెలియజేస్తామన్నారు. ఏక పక్షంగా వ్యవహిరిస్తున్నారనీ, త్వరలోనే వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. కాగా యూపీఏ పాలనలో తేజ్ ప్రతాప్‌కు పెట్రోల్ పంప్ ను అక్రమంటా కేటాయించారనీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే -
‘సినిమాలకు, మాల్స్‌కు వెళ్లే కోడలొద్దు’
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి...కోడలు కోసం వెతుకులాటలో బిజీబిజీగా ఉన్నారు. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ కు సరిజోడిగా సంప్రదాయబద్ధమైన వధువు కోసం లాలూ దంపతులు సంబంధాలు చూస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి కట్నకానుకలు లేకుండా హోమ్లీగా ఉండి, తమతో చక్కగా కలిసిపోయే అమ్మాయి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. లాలూ పుట్టినరోజు సందర్భంగా రబ్రీదేవీతో కొడుకు పెళ్లి గురించి పలువురు విలేకర్లు అడగగా, తమకు పద్ధతైన, ఇంటిని చక్కదిద్దుకునే అమ్మాయి కోడలుగా కావాలే కానీ, సినిమాలకు, షాపింగ్ మాల్స్ కు తిరిగే అమ్మాయిలు వద్దని అన్నారు. తాము చాలా సంబంధాలు చూసామని, అలాగే చాలా పెళ్లి ప్రదిపాదనలు వచ్చినట్లు తెలిపారు. అయితే తేజ్ ప్రతాప్ కు సరైన జోడీ ఇంకా దొరకలేదన్నారు. ఇదే విషయంపై లాలూ మాట్లాడుతూ ..తమ ఇంటికి వచ్చే కోడలు..దేశంలోని ఏ ప్రాంతంవారైనా కావచ్చని, అంతేకాకుండా తాము పైసా కట్నం తీసుకోమని ఆయన తెలిపారు. అయితే ఓ ఆవుకు మాత్రం మినహాయింపు ఉందని తెలిపారు. కాగా తన కుమారుడికి కాబోయే భార్యను లాలూ యూపీలోని రాజకీయ కుటుంబం నుంచే ఎంపిక చేయనున్నట్లు సమాచారం. లాలూ ప్రసాద్‌కు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరిలో తేజ్ ప్రతాప్‌ర్ ప్రస్తుతం ఆర్యోగ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. లాలూ నాలుగో కుమార్తె రజినీ... ఎస్పీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర యాదవ్ కుమారుడు రాహుల్ యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. అలాగే ఆయన చివరి కుమార్తె రాజ్ లక్ష్మీని యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మనవడు, ఎంపీ తేజ్ ప్రతాప్ సింగ్‌తో వివాహం జరిపించారు. ఇక లాలూ పెద్ద కుమార్తె మీసా భారతి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. -
కొడుకు పుణ్యమా అని వివాదంలో లాలూ
న్యూఢిల్లీ: చాలాకాలం తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన కుమారుడు చేసిన నిర్వాకం కారణంగా భిన్న ప్రశ్నలతో సతమతమవుతున్నారు. అయితే, ఆ వ్యవహారం లాలూకు తెలిసే జరిగిందని మీడియా చెబుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్నా శివారు ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్‌లో ప్రస్తుతం ఓ పెద్ద వాణిజ్య భవన సముదాయం నిర్మిస్తున్నారు. ఓ ప్రైవేటు సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ క్రమంలో భవన నిర్మాణం కోసం భారీ తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో బయటకు తీసిన మట్టి మొత్తాన్ని కనీసం ఎలాంటి టెండర్ కూడా పిలవకుండా దాదాపు రూ.90లక్షలకు పాట్నా జూపార్క్‌కు విక్రయించారు. ఇదంతా కూడా ప్రభుత్వంలో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ ఆధ్వర్యంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అతడు అటవీ శాఖను నిర్వహిస్తున్నాడు. సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలకు టెండర్స్ పిలుస్తుంటారు. కానీ, అలాంటిది లేకుండానే కేవలం లాలూకు సంబంధించి భూమిలో నుంచి మట్టిని నేరుగా జూపార్క్‌కు కేటాయించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ధుమారం రేగుతోంది. దీనిపై సమాధానం చెప్పాల్సిందేనంటూ తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. -
ఆర్ఎస్సెస్కు పోటీగా డీఎస్సెస్
పట్నా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్సెస్)కు వ్యతిరేఖంగా బీహార్ వైద్యశాఖ మంత్రి, ఆర్జేడీ నేత లాలుప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ ధర్మనిర్పేక్ష సేవక్ సంఘ్ (డీఎస్సెస్) ను ఏర్పాటు చేశారు. ఆర్ఎస్సెస్ మతతత్వాన్ని,దేశ విభజన భావాజలాన్ని ప్రోతాహిస్తుందని, దీన్ని డీఎస్సెస్ అడ్డుకుంటందని తేజ్‌ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు. సోమవారం పట్నాలో తన మద్దతుదారులతో చేపట్టిన డీఎస్సెస్ ర్యాలీలో పాల్గొన్న తేజ్ ప్రతాప్ డీఎస్సెస్ గురించి మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాధ్ హిందూ యువవాహిని పేరుతో హిందూత్వ భావజాలన్ని బీహార్‌లోకి ప్రవేపెట్టాలనుకుంటున్నారని దీన్ని డీఎస్సెస్ సమర్దవంతంగా అడ్డుకుంటదని తెలిపారు. దేశంలో శాంతి, స్నేహపూర్వక వాతవరణాన్ని నెలకొల్పడమే డీఎస్సెస్ ముఖ్య ఉద్దేశ్యమని యాదవ్ చెప్పాడు. డీఎస్సెస్ ఏర్పాటు చేసేముందు తేజ్‌ప్రతాప్ ఆర్స్సెస్లో చేరి ఒక సంవత్సరం పాటు పని చేయాలని సీనియర్ బీజేపీ నాయకుడు సుశీల్‌కుమార్ మోదీ సలహాఇచ్చాడు. ప్రతాప్ స్థాపించిన డీఎస్సెస్ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని సుశీల్ తెలిపాడు. కానీ కొంత అనుభవం అవసరమని దానికి ఆర్స్సెస్లో చేరి హాఫ్ ప్యాంట్లతో ‘భారత్ మతాకి జై ’అని జపం చేస్తే వస్తుందన్నాడు. దీనిపై స్సందించిన తేజ్‌ప్రతాప్ హాఫ్ ప్యాంట్లు వేసుకునే వారంతా హాఫ్ మైండ్గాళ్లని సుశీల్‌కు కౌంటర్ ఇచ్చాడు. -
లాలు కుమారుడిపై జోకు విసిరిన మోదీ
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్నకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్(28)పై ప్రధాని నరేంద్రమోదీ జోక్ పేల్చారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న సందర్భంలో 'అయితే నువ్వు ఇప్పుడు కృష్ణుడివన్నమాట' అని మోదీ అనగానే అక్కడ నవ్వులు విరిసాయి. అదేంటి లాలు కుమారుడిని మోదీ కృష్ణుడు అనడమేమిటని అనుకున్నారా.. మరేంలేదు.. బిహార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఆదివారం నూతన సంవత్సర వేడుకలను వెరైటీగా జరుపుకొన్నారు. ఆయన కృష్ణుడిలా వస్త్రాధరణ చేసుకొని, పిల్లనగ్రోవి వాయిస్తూ కెమెరా కంటికి చిక్కారు. చదవండి..(లాలు కుమారుడి స్టైలే వేరు!) ఇదేమి విచిత్రం అని ప్రశ్నించగా తనకు శ్రీకృష్ణుడి భక్తుడు ఒకరు ఈ దుస్తులు, ఫ్లూట్ ఇచ్చారని తేజ్ ప్రతాప్ చెప్పాడు. అందుకే ఈ దుస్తులు వేసుకుని, ఫ్లూట్ వాయించి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నానని చెప్పారు. ఆయన ఫోటో కూడా సోషల్ మీడియాలో పరుగులు పెట్టింది. ఈ ఫొటో చూసిన మోదీ ఆ సమయంలో నవ్వుకున్నారేమో.. గురువారం బిహార్‌లో గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ సీఎం నితీశ్, లాలుతో కలిసి భోజనం చేసిన మోదీ ఆ సమయంలో ఈ జోకు పేల్చారు. 'నువ్వు ఇప్పుడు మెల్లగా కృష్ణభగవానుడిగా మారిపోతున్నావన్నమాట' అంటూ తేజ్ ను మోదీ అంటు ముసిగా నవ్వారు. -
లాలు కుమారుడి స్టైలే వేరు!
పట్నా: బిహార్ రాజకీయాల్లో లాలు ప్రసాద్ యాదవ్ స్టైలే వేరు. ప్రస్తుతం అధికార పదవులకు దూరంగా లాలు తన ఇద్దరు కొడుకులను మంత్రులను చేశారు. ఒకరు బిహార్ ఉప ముఖ్యమంత్రి కాగా, మరొకరు ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రి. లాలు పుత్రరత్నం, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆదివారం నూతన సంవత్సర వేడుకలను వెరైటీగా జరుపుకొన్నారు. కృష్ణుడిలా డ్రెస్ వేసుకుని, ఫ్లూట్ వాయించారు. శ్రీకృష్ణుడి భక్తుడు ఒకరు తనకు కానుకగా ఈ దుస్తులు, ఫ్లూట్ ఇచ్చారని తేజ్ ప్రతాప్ చెప్పారు. ఈ దుస్తులు వేసుకుని, ఫ్లూట్ వాయిస్తూ నూతన సంవత్సర వేడుకలను చేసుకున్నానని తెలిపారు. -
లాలు కొడుకుతో పెళ్లి వార్తలు అబద్ధం
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కుటుంబంతో పెళ్లిసంబంధం విషయం మాట్లాడినట్టు వచ్చిన వార్తలను ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ తోసిపుచ్చారు. లాలు పెద్ద కొడుకు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు తన మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయనున్నట్టు వచ్చిన కథనాలు అవాస్తవమని రాందేవ్ చెప్పారు. ఓ వర్గానికి చెందిన మీడియా ఈ కట్టుకథల్ని ప్రచారం చేసిందని విమర్శించారు. గురువారం రాత్రి పట్నా వచ్చిన రాందేవ్.. లాలుతో సమావేశమయ్యారు. దీనిపై రాందేవ్ మాట్లాడుతూ.. లాలుకు అస్వస్థతగా ఉందని తెలియడంతో ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లానని చెప్పారు. అంతేకాని పెళ్లి సంబంధం లేదా పెద్ద నోట్ల రద్దుపై రాజకీయాల గురించి తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. లాలు దేశ సంపదని, ఆయన ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని రాందేవ్ అన్నారు. -
లాలూ కుమారుడికి కోర్టు ఝలక్
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు షాక్ ఇచ్చింది. శివాన్ జర్నలిస్ట్ రాజదేవ్ రంజన్ హత్య కేసులో లాలూ కుమారుడు, బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఆయనతో పాటు ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ కు కూడా నోటీసు ఇచ్చింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. ఇదే కేసులో షహబుద్దీన్ అనుచరుడు షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ బుధవారం శివాన్ కోర్టులో లొంగిపోయాడు. అతడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జంట హత్యల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న షహబుద్దీన్ ఇటీవల బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు. షహబుద్దీన్ విడుదల బిహార్ లో రాజకీయంగా దుమారం రేగింది. ఆయన బయటకు రావడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. -
జర్నలిస్టులతో మంత్రిగారి పేచీ
తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి లాలు పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్.. ఎవరితో ఎలా ఉండాలో మాత్రం ఇంకా నేర్చుకోలేకపోయాడు. దాంతో ఎప్పుడూ కొడుకు బదులు తాను వెళ్లే లాలు.. ఈసారి కూడా ముందుకు రాక తప్పలేదు. విషయం ఏమిటంటే, తేజ్ ప్రతాప్ యాదవ్ జర్నలిస్టులతో పేచీ పెట్టుకున్నాడు. కేసు పెడతానంటూ బెదిరించడంతో వాళ్లంతా బయటకు వెళ్లిపోతామన్నారు. చివరకు లాలు రంగప్రవేశం చేసి, జర్నలిస్టులను బుజ్జగించాల్సి వచ్చింది. ఆర్జేడీ 20వ వార్షికోత్సవం సందర్భంగా పట్నాలో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. దానికి లాలు తన కొడుకులిద్దరూ.. ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లతో వెళ్లారు. వేదిక మీద ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ జర్నలిస్టు వద్ద ఉన్న కెమెరా తీసుకుని సరదాగా ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. మరో జర్నలిస్టు ఈ దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. దాంతో మంత్రిగారికి కోపం వచ్చింది. వెంటనే ఫోన్లోంచి ఆ వీడియో తీసేయాలని చెప్పాడు. కానీ అందుకు ఆ జర్నలిస్టు నిరాకరించడంతో పరువునష్టం దావా వేస్తానని బెదిరించాడు. దాంతో మీడియా వాళ్లకు కోపం వచ్చి, మొత్తం కార్యక్రమాన్ని అంతా కలిసి బహిష్కరిస్తామన్నారు. విషయం శ్రుతి మించుతోందని గమనించిన లాలు.. వెంటనే రంగప్రవేశం చేసి జర్నలిస్టులను బుజ్జగించారు. -
బిహార్ సీఎంగా లాలూ కొడుకు!!
పాట్నా: అక్కడ రోడ్డుపై వందల సంఖ్యలో జనం ఆందోళన చేస్తున్నారు. ఇంతలో కుర్తాపైజామా ధరించిన ముఖ్యమంత్రి ఎస్యూవీ వాహనంలో అక్కడికి వచ్చారు. ఆందోళన చేస్తున్నవారి దగ్గరికి వెళ్లి సర్దిచెప్పారు. దోషులకు శిక్ష వేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆందోళనకారులు శాంతించారు. ఇలా బిహార్ సీఎంగా కనిపించి ఆందోళనకారులను శాంతింపజేసింది ఎవరో కాదు.. లాలూ ప్రసాద్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్. ప్రస్తుతం బిహార్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారని ఆశ్చర్యపోకండి. ఇదంతా సినిమా కోసమే. 'అపహరణ్ ఉద్యోగ్' (కిడ్నాప్ ఇండస్ట్రి) పేరిట రూపొందుతున్న ఓ సినిమాలో లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్ బిహార్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు. 1990లో బిహార్‌లో సంభవించిన కిడ్నాప్‌లు నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో బిహార్ సీఎం లాలూ ఉన్నారు. అంధకారంలో ఉన్న బిహార్‌ను వెలుగులోకి తీసుకొచ్చే చక్కని కథతో రూపొందిన సినిమా కావడంతో తాను నటించానని, ఇందులో ఓ పాత్రలో లాలూ యాదవ్ కూడా కనిపిస్తారని షూటింగ్ అనంతరం తేజ్‌ప్రతాప్ తెలిపారు. తేజ్ తమ్ముడు తేజస్వి డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండగా, ఆయన మాత్రం ఆరోగ్యశాఖను గాలికి వదిలేసి సినిమాలు, షూటింగ్‌లు అంటూ తిరుగుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
జీన్సు వేసి.. గుర్రమెక్కి.. మంత్రిగారి హల్చల్
బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నట్టుండి హల్చల్ చేశారు. రాష్ట్ర రాజధాని పట్నా నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ జామ్ బాగా ఎక్కువైపోయాని, వాటిని అరికట్టాలంటే కార్ల వాడకం తగ్గించాలని భావించారు. తలచిందే తడవుగా.. బిహార్ పోలీసు శాఖలోని అశ్వికదళానికి చెందిన ఓ గుర్రాన్ని తెప్పించి, దాన్ని నడుపుకొంటూ నగర వీధుల్లో తిరిగారు. జీన్సు ప్యాంటు వేసుకుని, దానిపై లాల్చీ ధరించి.. గుర్రపుస్వారీ మొదలుపెట్టారు. గతంలో జేడీ(యూ)కు చెందిన మాజీ ఎమ్మెల్యే అనంత సింగ్ ఎక్కువగా గుర్రపుబండిలో తిరుగుతూ పట్నాలో కనిపించేవారు. నగరంలో వాహనాలు బాగా ఎక్కువైపోయి కాలుష్యం, ట్రాఫిక్ జామ్ పెరిగాయని, వాటికి పరిష్కారం గుర్రపు స్వారీయేనని ఆయన తెలిపారు. అయితే, ఎంతైనా మంత్రిగారు కాబట్టి సెక్యూరిటీ కూడా అవసరమే కదా.. సెక్యూరిటీ సిబ్బందిలో కొంతమంది గుర్రాల మీద, మరికొందరు కాలినడకన తేజ్‌ప్రతాప్‌ను ఫాలో అయ్యారట. -
పెద్దోడి కన్నా చిన్నోడే బెటర్!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనయులు తేజస్వి, తేజ్‌ప్రతాప్ యాదవ్ నితీశ్‌కుమార్ కేబినెట్లో టాప్ రెండు, మూడు స్థానాలను అలంకరించడం.. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. పెద్దగా అనుభవంలేని వారికి కీలక శాఖలు అప్పగించడంపై విమర్శకులు మండిపడ్డారు. ఇప్పుడు వారు పదవుల్లోకి చేరి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో వయస్సులో చిన్నవాడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన తేజస్వి తన పనితీరుతో ఆకట్టుకుంటుండగా.. అన్న తేజ్‌ప్రతాప్ మాత్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవి చేపట్టిన తేజస్వి పరిణతి గల రాజకీయ నాయకుడి ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అప్పగించిన శాఖలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ప్రయత్నం తేజస్వి చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదే అన్న తేజ్‌ప్రతాప్ విషయానికొస్తే ఆయనకు 'పాస్' మార్కులు ఇవ్వడానికి ఇప్పటికీ పరిశీలకులు వెనుకాముందాడుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా తేజ్‌ప్రతాప్ ఇంకా చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన కొంత సిగ్గుపడుతూ, నెర్వస్‌కు గురవుతున్నట్టు కనిపిస్తున్నది. అయితే తేజ్‌ప్రతాప్ కూడా అధికారులతో దృఢంగా వ్యవహరిస్తూ.. శాఖను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. 'తేజస్వి శాంతస్వభావం కనబరుస్తున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన వివిధ రాజకీయ అంశాలపై సమర్థంగా మాట్లాడి.. విమర్శకుల నోళ్లు మూయించారు. లాలూ రాజకీయ వారసుడు తేజస్వినేనని ప్రతిపక్ష నేతలు సైతం ఇప్పుడు అంగీకరిస్తున్నారు' అని ఆర్జేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనోజ్ యాదవ్ పేర్కొన్నారు. -
'మోదీ ప్రధానిగా మళ్లీ ప్రమాణం చేయాలి'
పట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి పదవీ ప్రమాణం చేయాలంటూ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఓ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. బిహార్ మంత్రిగా లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ ప్రమాణం చేస్తూ తడబడటంతో ఆయనను మరోసారి ప్రమాణం స్వీకరించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ గత ఏడాది మేలో ప్రధాని మోదీ ప్రమాణం చేసిన వీడియో లింకును ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రమాణంలో భాగంగా మోదీ భారత సార్వభౌమాధికారం, సమగ్రతను నిలబెడతానని చెప్పాల్సిండగా.. ఆయన హిందీలో 'అక్షున్' (నిలబెట్టడం)కు బదులు 'అక్షాన్' అన్నారని లాలూ తెలిపారు. 'ఆయన 'అక్షున్' అనలేదంటే.. ప్రమాణం అర్థం లేనిది అవుతుంది. కాబట్టి ప్రధాని మరోసారి ప్రమాణం చేయాల్సిందే. అక్షాన్ పదానికి హిందీలో ఎలాంటి అర్థం లేదు' అని ఆయన చెప్పారు. 'ప్రధాని అజెండా దేశాన్ని విడగొట్టడమే. అందుకే ఆయన దేశ సమగ్రతను నిలబెడతానని ప్రమాణం చేయలేదు' అని లాలూ విమర్శించారు. గత శుక్రవారం లాలూ కొడుకు తేజ్‌ప్రతాప్ ప్రమాణంలో 'ఆపేక్షిత్' (అంచనా) పదానికి బదులుగా 'ఉపేక్షిత్' (ఉపేక్షించడం) అనడంతో ఆయనను మరోసారి ప్రమాణం చేయాల్సిందిగా గవర్నర్ రామ్‌నాథ్ గోవింద్ సూచించారు. రెండోసారి ప్రమాణంలో కూడా తేజ్‌ప్రతాప్ తడబడ్డారు. లాలూ రెండు కొడుకు తేజస్వి బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. -
పెద్దోడికి 25.. చిన్నోడికి 26 ఏళ్లు
పాట్నా: పెద్దోడి వయసు 25 ఏళ్లు.. చిన్నోడు వయసు 26 ఏళ్లు. ఇదేలా సాధ్యమని ఆశ్చర్యంగా ఉందా? ఈ విషయం బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ సుప్రీం లాలు ప్రసాద్ యాదవ్ పుత్రరత్నాలకే తెలియాలి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ పోటీచేస్తున్నారు. అన్న తేజ్ ప్రతాప్ వయసు 25, తమ్ముడు తేజస్వి వయసు 26 ఏళ్లని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వైశాలి జిల్లాలోని మహు నియోజకవర్గం నుంచి తేజ్ ప్రతాప్, రఘోపూర్ నుంచి తేజస్వి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో వయసును తప్పుగా రాయడంపై లాలు కానీ ఆయన కుమారులు కానీ స్పందించలేదు. లాలు కుటుంబ సన్నిహితుల ప్రకారం తేజస్వి వయసు అఫిడవిట్లో పేర్కొన్నట్టుగా 26 ఏళ్లే. తేజ్ ప్రతాప్‌కు 28 ఏళ్లు ఉంటాయని చెప్పారు. అయితే అఫిడవిట్లో తేజ్ ప్రతాప్ తన వయసును ఎందుకు తప్పుగా రాశాడో? -
ములాయం మనవడి వివాహ కార్యక్రమానికి ప్రధాని
సైఫై: సమాజ్ వాదీ పార్టీనేత ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ తిలక్ వివాహ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హాజరు కానున్నారు. ములాయం సొంత గ్రామమైన సైఫైలో పెళ్లి వేడుక జరుగుతోంది. జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రాజ్యలక్ష్మి, తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్ళి ఫిబ్రవరి 26 న ఢిల్లీలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరువుతారని సమాచారం. ముఖ్యంగా ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ రాక సందర్భంగా అన్ని భద్రతా ఏర్పాట్లు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.