పెళ్లి మూమెంట్‌ : లాలూ కుటుంబానికి ఐటీ షాక్‌ | IT Dept Attached Tej Pratap Yadav Factory Land | Sakshi
Sakshi News home page

పెళ్లి మూమెంట్‌ : లాలూ కుటుంబానికి ఐటీ షాక్‌

Published Fri, Apr 27 2018 12:40 PM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM

IT Dept Attached Tej Pratap Yadav Factory Land - Sakshi

పాట్నా : పెళ్లి పనులతో బిజీబిజీగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. పాట్నాలోని షేక్‌పూర్‌లో 7105 చదరపు అడుగుల భూమిని ఆదాయపు పన్ను శాఖ అటాచ్‌ చేసుకుంది. ఈ భూమి లాలూ కొడుకు తేజ్‌ ప్రసాద్‌ యాదవ్‌ పేరుతో రిజిస్ట్రర్‌ అయి ఉంది. బినామీ ఆస్తుల చట్టం కింద ఈ భూమిని అటాచ్‌ చేసినట్టు ఐటీ అధికారులు చెప్పారు. 

ఇటీవలే తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు, మాజీ మంత్రి చంద్రికా రాయ్ కూతురు ఈ ఐశ్వర్యరాయ్‌ను తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ మే 12న పెళ్లి జరుగబోతోంది. అందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఐటీ శాఖ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ రిజిస్ట్రర్‌ భూమిని ఐటీ శాఖ అటాచ్‌ చేసుకోవడం గమనార్హం. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement