రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ పగ్గాలు మారబోతున్నట్లు వస్తున్న కథనాలపై ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అలాంటి వార్తల్ని ప్రసారం చేసేవాళ్లను మూర్ఖులుగా ఆయన అభివర్ణించారు.
ఆర్జేడీ జాతీయాధ్యక్షుడిగా లాలూ దిగిపోతున్నారని.. ఆ స్థానే చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్‌కు త్వరలో పగ్గాలు అప్పగించబోతున్నట్లు కొన్ని మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై లాలూను వివరణ కోరగా.. ఆయన స్పందించారు. ‘అలాంటి వార్తలు ఇచ్చేవాళ్లు మూర్ఖులు. పిచ్చోళ్లే అలాంటివి ప్రచారం చేస్తారు. ఏమైనా ఉంటే మేం చెప్తాం కదా’ అని న్యూఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే తేజస్విని పార్టీ ప్రెసిడెంట్ చేయబోతున్నట్లు వస్తున్న కథనాలపై పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్ కూడా స్పందించాడు. ఆ కథనాల్ని కొట్టిపారేస్తూ.. తండ్రి లాలూనే పార్టీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు లాలూ సతీమణి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్, పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే తేజస్విని పార్టీ చీఫ్‌గా ప్రకటిస్తారనే కథనాలు మొదలయ్యాయి.
#WATCH | Delhi: "Those who run such news reports are fools. We will get to know whatever happens," says RJD chief Lalu Prasad Yadav when asked if Tejashwi Yadav will be made the national president of the party. (04.02.2022) pic.twitter.com/NYC5YiLzVm
— ANI (@ANI) February 5, 2022
Comments
Please login to add a commentAdd a comment