RJD
-
వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు
గుండె పోటు అంటే బీపీ, సుగర్ లాంటి వ్యాధులున్నవారిలో, అధిక బరువు ఉన్నవారిలోమాత్రమే వస్తుంది అని భ్రమపడేవారు. కానీ ప్రస్తుతం గుండెపోటు తీరు మారింది. నిరంతరం వ్యాయామం చేస్తూఆరోగ్యంగా ఉన్నవారినికూడా గుండె పోటు బలి తీసుకుంటోంది. తాజాగా ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వైనం పలువుర్ని విస్మయ పర్చింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఆదివారం ఉదయం నడకకు వెళుతుండగా 28 ఏళ్ల అనుమానాస్పదంగా కుప్పకూలి మరణించాడు. బాధితుడిని రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి, అతని భుజం తట్టి వెళ్ళిపోయిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో రికార్డైనాయి. ఆ తరువాత అతను అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనాడు.. తీవ్ర ఇబ్బందికి గురైన అతను ఇంటి ఎదురుగా ఉన్న గోడను ఆసరా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలోని ఇంటి వెలుపల గుండెపోటుతో మరణించాడు. చౌదరి కుప్పకూలిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు. చౌదరి మరణానికి డెపోటే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అని భావిస్తున్నారు.⚠️ Trigger Warning : Sensitive Visual⚠️जिंदगी–मौत का कुछ नहीं पता। इस Video को देखिए। 20 सेकेंड पहले तक जो इंसान एकदम फिट दिखाई दे रहा है, वो अचानक से मर जाता है।📍बुलंदशहर, यूपी pic.twitter.com/9jiDgbC2ay— Sachin Gupta (@SachinGuptaUP) March 22, 2025 చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?గుండెపోటుఎందుకు వస్తుంది?గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్న మాట. గుండె నొప్పి లక్షణాలు:గుండె నొప్పి (ఛాతీ నొప్పి) తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బరువుగా, టైట్‌గా అనిపించిడం, నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చల్లని చెమటలు, ఎడమ చేయి లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి.ఇంకా తలనొప్పి, ఎడమ చేయి, మెడ, దవడ లేదా రెండు చేతుల్లో నొప్పి, బలహీనంగా, అనీజిగా అనిపించడం, చర్మం పాలిపోవడంలాంటి లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి. ఇంతకు ముందే గుండె సమస్యలున్నా, కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలున్నా మరింత అప్రమత్తంగా ఉండాలి. -
వింత చేష్టలు.. సీఎం నితీష్‌కు ఏమైంది?
పాట్నా: బీహార్ సీఎం నితిష్ కుమార్ (Bihar Cm Nitish Kumar) వివాదంలో చిక్కుకున్నారు.గురువారం పాట్నాలో జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్‌కు హాజరైనవారందరూ జాతీయ గీతం (National Anthem) ఆలాపన చేస్తుంటే సీఎం నితీష్ వింతగా ప్రవర్తించారు. పక్కన ఉన్న వారిని కదిలిస్తూ, వారితో మాట కలుపుతూ, అభివాదం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం, ఆ ఘటన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మన ముఖ్యమంత్రికి ఏమైంది? ఆయన బాగానే ఉన్నారు కదా? బాగుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని బీహార్ ప్రజలు ప్రశ్నిస్తుంటే.. నెటిజన్లు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకి ఏమైందంటే?మార్చి 20 నుండి 25 వరకు పాట్నాలోని పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సెపక్ తక్రా ప్రపంచ కప్ -2025 (SepakTakraw World Cup 2025)పోటీలు ప్రారంభమయ్యాయి. గురువారం ఈ పోటీల్ని సీఎం నితీష్ కుమార్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయన చేసిన చేష్టలతో ప్రతిపక్షాల నుంచే కాదు,రాష్ట్ర ప్రజల నుంచి విమర్శలు చేయించుకునేలా ప్రవర్తించారు.कम से कम कृपया राष्ट्र गान का तो अपमान मत करिए मा॰ मुख्यमंत्री जी।युवा, छात्र, महिला और बुजुर्गों को तो आप प्रतिदिन अपमानित करते ही है।कभी महात्मा गांधी जी के शहादत दिवस पर ताली बजा उनकी शहादत का मखौल उड़ाते है तो कभी राष्ट्रगान का!PS: आपको याद दिला दें कि आप एक बड़े प्रदेश… pic.twitter.com/rFDXcGxRdV— Tejashwi Yadav (@yadavtejashwi) March 20, 2025 అసలేమైందంటే?సెపక్ తక్రా ప్రపంచ కప్ - 2025 ప్రారంభ వేడుకల్లో జాతీయ గీత ఆలాపన కార్యక్రమం జరిగింది. అందరూ జాతీయ గీతం ఆలపిస్తుంటే వేదికపై ఉన్న సీఎం నితీష్ మాత్రం తన పక్కనే జాతీయ గీతం ఆలాపన చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీఎం నితీష్‌కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ దీపక్ కుమార్‌ను కదిలించారు. దీంతో ఐఏఎస్ దీపక్ కుమార్.. నితీష్‌ను వద్దని వారించే ప్రయత్నించారు. బదులుగా ఇక చాలు.. చాలు అని సంజ్ఞలు చేస్తూ కనిపించారు.మీరు ముఖ్యమంత్రన్న విషయం మరిచిపోకండిఈ ఘటనపై ఆర్జేడీ నేత,మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం సార్ మీరు ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రన్న విషయం మరిచిపోకండి. మానసికంగా, శారీరకంగా స్థిరంగా లేరు. ఈ స్థితిలో ఉండటం రాష్ట్రానికి చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలా పదే పదే బీహార్‌ను అవమానించకండి. దయచేసి జాతీయగీతాన్నైనా గౌరవించండి. మీరు ప్రతిరోజూ యువత, విద్యార్థులు, మహిళలు, వృద్ధులను అవమానిస్తారు. కొన్నిసార్లు మహాత్మా గాంధీ అమరవీరుల దినోత్సవం నాడు చప్పట్లు కొడతారు. అమరవీరులను అపహాస్యం చేస్తారు.కొన్నిసార్లు మీరు జాతీయ గీతంపై చప్పట్లు కొడతారు’అని దుయ్యబట్టారు. -
Bihar: ‘టైగర్ జిందా హై’.. రబ్రీ ఇంటి ముందు హోర్డింగ్ కలకలం
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్(RJD chief Lalu Yadav) మరోమారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. ఈ సమయంలో వందలాందిమంది ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఈడీ కార్యాలయం ముందు లాలూ విచారణకు నిరసనగా ఆందోళన చేపట్టారు. #WATCH | Bihar | Posters in support of RJD chief and former Bihar CM Lalu Yadav put up outside his residence in Patna The posters read, "Na jhuka hun, na jhukunga, Tiger abhi Zinda hai." pic.twitter.com/r3I9WJICd9— ANI (@ANI) March 20, 2025ఇదిలావుంటే ఇప్పుడు ఒక హోర్డింగ్(Hoarding) కలకలం సృష్టిస్తోంది. ఇది ఈడీ అధికారులను ప్రశ్నించేదిగా ఉందని పలువురు అంటున్నారు. ఈ హోర్డింగ్‌ను లాలూ యాదవ్ భార్య రబ్రీదేవి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఈ హోర్టింగ్పై ‘టైగర్ జిందా హై’(టైగర్ బతికేవుంది) అని రాసివుంది. అలాగే ‘నా ఝుకాహూ, నా ఝుకూంగా’ (తగ్గేదే లే) అని ఉంది. ఈ హోర్డింగ్‌లో ఒకవైపు లాలూ యాదవ్ ఫొటో ఉంది. మరోవైపు ఒక వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి కొందరు లాగుతున్నట్లు ఫొటోవుంది. ఆ ఫొటోలో వ్యక్తి లాలూ అని, అతనిని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో పాటు పీఎంఓ, ఆర్ఎస్ఎస్లు తాళ్లతో లాగుతున్నాయని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. లాలూ యాదవ్‌కు సంబంధించిన ఈ పోస్టర్‌ను ఆర్జేడీ నేతలు నిషాంత్ మండల్, రాజూ కోహ్లీ రూపొందించారు. ఈ హోర్డింగ్‌లో బీజేపీ దిగ్గజ నేతలను పోలిన చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లాలూ యాదవ్ ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో ఈ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా చదవండి: రూ. 200కి మనుమడిని అమ్మేసిన నాన్నమ్మ -
రికార్డింగ్ డ్యాన్సర్‌కు ముద్దు.. బూతు పాటతో ఎమ్మెల్యే రచ్చ
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్‌పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు. అలాంటిది ఒక ప్రజాప్రతినిధే బహిరంగంగా అశ్లీల నృత్యాలను ప్రొత్సహించడం.. అందునా ఆయనే అసభ్యంగా ప్రవర్తించడం.. పైగా వేదిక మీదే బూతు పాట పాడడంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని పలువురు నెట్టింట ప్రశ్నలు గుప్పిస్తున్నారు.బీహార్ జనతా దల్(యునైటెడ్) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భగల్పూర్ జిల్లా నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.వేదిక మీద ఉన్న నృత్యకారిణి దగ్గరకు వెళ్లి.. ఆమె పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కరెన్సీ నోటును ఆమె చెంపకు అతికించాడు. అక్కడితో ఆగకుండా.. నేను డ్యాన్స్ మాత్రమే చేయలేదు.. ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నా అంటూ మైకులో ప్రకటించారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. రాత్రి సయమంలో జరిగిన వేడుకల్లోనూ ఆయన పాల్గొన్నారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో చిందులేశారు. ఆపై మైక్ అందుకుని బూతు పాటలు పాడి అక్కడున్నవాళ్లను హుషారెత్తించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆర్జేడీ భగ్గుమంది. ఇలాంటి వాళ్లపై కేసులు నమోదు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులపై కూడా న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేయాలని పలువురు కోరుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.होली मिलन समारोह में जदयू विधायक गोपाल मंडल ने महिला डांसर के गाल पर नोट चिपकाया और साथ में मंच पर लगाए ठुमके।#Gopalmandal #Bihar #BiharNews #Bhagalpur #Holi2025 pic.twitter.com/ZBNs32uQz1— FirstBiharJharkhand (@firstbiharnews) March 10, 2025JDU विधायक गोपाल मंडल#gopalmandal @Jduonline @RJDforIndia #BiharNews #bhagalpur pic.twitter.com/1nikGeTmWV— Shri Dhiraj Sharma (Journalist) (@ShriDhiraj) March 11, 2025గోపాల్ మండల్ వార్తల్లోకి ఎక్కడం తొలిసారేం కాదు. గతంలో ఆయన అండర్వేర్పై రైలులో తిరిగి వైరల్ అయ్యారు. కొందరు ప్రయాణికులు ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ టైంలోనూ ఆయనపై విమర్శలు రాగా.. కంపార్ట్మెంట్లో మహిళలు లేరని, బాత్రూం వెళ్లాల్సి రావడంతో అలా వెళ్లానని అప్పుడు తన చర్యను సమర్థించుకున్నారాయన. -
ShameOnNitish: మహిళల వస్త్రధారణ వ్యాఖ్యలపై దుమారం
పాట్నా: మహిళల వస్త్రధారణపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను అధికారం చేపట్టిన 20ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని మహిళల వస్త్రధారణ మెరుగుపడిందంటూ వ్యాఖ్యానించారాయన. దీనిపై అన్నివైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నితీష్ సర్కార్ ప్రస్తుతం రాష్ట్రమంతటా ‘ప్రగతి యాత్ర’ ( Pragati Yatra)ను నిర్వహిస్తుంది. బెగుసరాయ్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో నితీష్ కుమార్ మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత,మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఘాటుగా స్పందించారు. సీఎం నితీష్ కుమార్ ఫ్యాషన్ డిజైనర్ కాదని, ఆ మాటలు ఆయన వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అయితే, సీఎం నితీష్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎక్స్‌లో "ShameOnNitish" వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ‘అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బాగా మాట్లాడతారు. చక్కని దుస్తులు ధరిస్తారు. వారు ఇంతకు ముందు ఇంత మంచి బట్టలు ధరించడం మనం చూశామా?అని ప్రశ్నిస్తూనే.. ‘ఇంతకు ముందు బీహార్ కుమార్తెలు మంచి దుస్తులు ధరించలేదని కాదు. వారు తమను తాము ఆత్మగౌరవం, స్వావలంబనతో కప్పుకున్నారు’ అంటూ సీఎం నితిష్ వ్యాఖ్యల్ని ఖండించారు. సీఎంగారు.. మీరు మహిళల కోసం ఫ్యాషన్ డిజైనర్‌గా మారడానికి ప్రయత్నించవద్దు. మీ ఆలోచనలు వికృతంగా ఉన్నాయి. మీ ప్రకటన రాష్ట్ర మహిళల్ని అవమానించేలా ఉన్నాయని’ ధ్వజమెత్తారు. पहले बिहार की बेटियां कपड़े ही नहीं, स्वाभिमान, स्वावलंबन और सम्मान भी पहनती थीं नीतीश कुमार जी।‘स्त्री परिधान वैज्ञानिक' मत बनिए’! आप 𝐂𝐌 है 𝐖𝐨𝐦𝐞𝐧 𝐅𝐚𝐬𝐡𝐢𝐨𝐧 𝐃𝐞𝐬𝐢𝐠𝐧𝐞𝐫 नहीं। 'स्त्री परिधान विशेषज्ञ' बनकर अपनी घटिया सोच का प्रदर्शन बंद कीजिए। ये बयान नहीं,… pic.twitter.com/9DPrOqbTjS— Tejashwi Yadav (@yadavtejashwi) January 18, 2025 -
డీజీపీని చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం.. ఎందుకంటే?
పాట్నా: బీహార్ పోలీస్ కార్యక్రమంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్‌ను చేతులు జోడించి అభ్యర్థించారు.సోమవారం బీహార్‌లో కొత్తగా నియమితులైన 1,239 మంది పోలీసు అధికారులకు అపాయింట్మెంట్ లెటర్లను అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్ తన ప్రసంగం మధ్యలో చేతులు జోడించి బీహార్ డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి త్వరలో మరిన్ని రిక్రూట్మెంట్లు జరిగేలా చూస్తారా? అని అడిగారు. సీఎం నితిష్ కుమార్ విజ్ఞప్తితో డీజీపీ అలోక్ రాజ్ మెరుపు వేగంతో స్పందించారు. వేదికపై కూర్చొన్న డీజీపీ ఒక్కసారి లేచి సెల్యూట్ చేశారు. వెంటనే నితీష్ కుమార్ లేదు ముందు మీరు పోలీస్ రిక్రూట్మెంట్ త్వరగా చేస్తారా? అని మరోసారి అడిగారు. అందుకు డీజీపీ స్పందిస్తూ.. సీఎం నితీష్ ఆదేశాలను అమలు చేసేందుకు బీహార్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. త్వరలో పోలీసు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తాం’ అని అన్నారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలువచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతవారం బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగనన్ని దారుణాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. కానీ చర్యలు లేవు. ఫిర్యాదు చేస్తే విచారణ శూన్యం. ప్రజలకు న్యాయం జరగదు. ఇకపై సీఎం నితీష్ కుమార్ బీహార్‌ను నడపలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం నితీష్ కుమార్ డీజీపీ అలోక్ రాజ్ పోలీస్ రిక్రూట్ మెంట్ జరిగేలా చూడాలని కోరుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
భూ కుంభకోణం కేసులో లాలూ కుటుంబానికి భారీ ఊరట
న్యూఢిల్లీ : ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జేడీ చీఫ్, మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు షరతులతో కూడిన బెయిల్ లభించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు జస్టిస్ విశాల్ గోగ్నే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పూచీకత్తు కింద రూ.1లక్ష చెల్లించడంతో పాటు, వారి ముగ్గురి పాస్‌పోర్ట్‌లను సరెండర్ చేయాలని ఆదేశించారు. కేసు విచారణ సమయంలో వారిని అరెస్టు చేయకూడదని పేర్కొంది. -
ఆర్జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం
ముంగేర్: బీహార్‌లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సీనియర్ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంకజ్ యాదవ్‌పై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంకజ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్పోర్ట్ గ్రౌండ్స్‌లో పంకజ్ యాదవ్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. వెంటనే పంకజ్‌యాదవ్ కింద పడిపోయారు. స్థానికులు అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పంకజ్‌యాదవ్ ఛాతీ దగ్గర బుల్లెట్ తగిలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కుటుంబసభ్యులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు అన్నిప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ, ముంగేర్ ఘటన బాధాకరమని, దోషులను తప్పకుండా పట్టుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.ఇది కూడా చదవండి: బహ్రాయిచ్‌లో పట్టుబడిన చిరుత -
మరోసారి సహనం కోల్పోయిన నితీష్.. మహిళా నేతపై అరిచిన సీఎం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తమ ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మహిళా నేతపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యాలపై ప్రతిపక్ష ఆర్జేడీ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా బుధవారం నితీష్ కుమార్ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.. రిజర్వేషన్లు, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆయన ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ‘ నితీష్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.దీనిపై నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సహనం కోల్పోయిన సీఎం.. ఓ మహిళా నేతపై విరుచుకపడ్డారు. నువ్వు మహిళవే కదా? నీకేమైనా తెలుసా? తాను ఎలా మాట్లాడుతుందో చూడండి. .మీరు మహిళల కోసం ఏమైనా చేశారా? లేదు కదా. మేము మాట్లాడతాం మీరు నిశబ్దంగా వినండి..వినకపోతే అది మీ తప్పు.’అంటూ మడిపడ్డారు.సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే సమయంలో నితీష్ కుమార్ అలవాటు పడిన నేరస్థుడిగా ప్రవర్తిస్తారని విమర్శలు గుప్పించారు. 2నువ్వు స్త్రీవి, నీకు ఏమైనా తెలుసా?’ అంటూ మహిళలపై చౌకబారు, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే.ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత నెల జూన్‌లో సంచలన తీర్పు వెలువరించింది. ఇక తాజాగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితిష్ కుమార్.. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో జేడీయూకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
ఆర్జేడీతో పొత్తు వద్దు.. మీరే గెలుస్తారు: కాంగ్రెస్‌కు సూచన
ఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల స్థానాల్లో ఇండియా కూటమి 10 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీయే కూటమి రెండు చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటులో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేత, స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ఆర్జేడీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలని కోరారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా వచ్చాయి. వచ్చే జార్ఖండ్, మహారాష్ట్ర, హార్యానా ఎన్నికల్లో కూడా ఇదే విధమైన ఫలితాలను ఇండియా కూటమి సొంతం చేసుకుంటుంది. అయితే బిహార్‌లో ప్రజలంతా.. జేడి(యూ) , ఆర్జేడీపై చాలా కొపంతో ఉన్నారు. దీంతో రాష్ట్రం రాజకీయంలో కొత్త పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ఆర్జేడీతో కూటమిపై కాంగ్రెస్ పునరాలోచించాలి. నేను, కాంగ్రెస్ పార్టీ కలిసి బిహార్‌లో కొత్త కూటమిల ఏర్పాటు చేస్తాం’’ అని పప్పూ యాదవ్ అన్నారు.పప్పూ యాదవ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. పూర్ణియీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థి బీమా భారతిపై విజయం సాధించారు. -
'నీట్ పేపర్ లీక్‌తో.. తేజస్వి అనుచరుడికి సంబంధం'
పాట్నా: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న వెలువడిన నీట్ యూజీ ఫలితాల్లో ఏకంగా 67 మందికి 720 మార్కులు రావడం, వీరిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్లో పరీక్ష రాయడం సందేహాలకు దారి తీసింది. దీంతో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని.. మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్ధులు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో కొనసాగుతోంది. మరోవైపు కేసులో బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు.తాజాగా నీట్ పేపర్ వ్యవహారంపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. పేపర్ లీక్‌తో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ బిహార్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ (ఆర్సీడీ) ఉద్యోగి ప్రదీప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సికందర్ ప్రసాద్ యాదవెందు అనే ఇంజినీర్ కోసం ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్‌లో రూమ్ బుక్ చేయమని చెప్పాడని ఆరోపించారు.పరీక్ష జరగడానికి నాలుగురోజుల ముందు ఈ కాల్ వెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారికి అధికారం లేకపోయినా.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. పట్నాలోని ఎన్హెచ్ఏఐ గెస్ట్‌హౌస్‌లో ఆ రూమ్ బుక్ చేసిన ఆర్సీడీ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు సిన్హా చెప్పారు.మరోవైపు నీట్ నిందితులు తమ గెస్ట్ హాస్‌లో బస చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఎన్హెచ్ఏఐ ఖండించింది. పాట్నాలో తమకు గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని ప్రకటించింది. -
అంతా 77 మయం.. లాలూ బర్త్‌డే స్పెషల్
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు(జూన్ 11) తన77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాలూ యాదవ్ కుటుంబసభ్యులు 77 కిలోల కేక్‌ను కట్ చేశారు. ఆర్జేడీ కార్యకర్తలు 77 కిలోల లడ్డూలను రబ్రీ నివాసానికి తీసుకువచ్చారు. ఈ వేడుకల్లో రబ్రీదేవి, కుమార్తె రోహణి ఆచార్య పాల్గొన్నారు.దీనికి ముందు లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన తల్లి, సోదరితో కలిసి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ సమక్షంలో కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. తన 'ఎక్స్' ఖాతాలో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘సాన్నిహిత్యం, వినయం, సరళత కలగలసిన వ్యక్తి’ అంటూ తన తండ్రిని కొనియాడారు. ఈ ఫొటోలలో లాలూ యాదవ్, రోహిణి ఆచార్య కూడా కనిపిస్తున్నారు.లాలూ ప్రసాద్‌కు బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘకాలం జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ కుమార్తెలు మిసా భారతి, రోహిణి ఆచార్య లు పట్నాలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఆర్జేడీ కార్యాలయంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. To the person who is a perfect blend of affinity, humility and simplicity.THE MAN who leads by example.A leader who nurtures leaders.Happiest birthday my papa ♥️Love you infinity ♾️ @laluprasadrjd @yadavtejashwi @RJDforIndia @RahulGandhi @yadavakhilesh @RabriDeviRJD pic.twitter.com/XmpsZV30Ju— Tej Pratap Yadav (@TejYadav14) June 10, 2024 -
లోక్‌సభ ఎలక్షన్స్.. నామినేషన్ దాఖలు చేసిన మిసా భారతి
పాట్నా: భారతదేశంలో నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలు తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి 'మిసా భారతి' సోమవారం లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.'మిసా భారతి' లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేసిన సమయంలో.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీహార్‌కు ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారు. కానీ ప్రజలకు చేసినేమీ లేదు. మోదీ దేశం కోసం ఏదైనా చేసి ఉంటే.. ఇప్పుడు రోడ్‌షో నిర్వహించాల్సిన అవసరం లేదని మిసా భారతి అన్నారు. మోదీ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారో జాబితా చేసి చెప్పాలని ఆమె కోరారు.మిసా భారతి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్‌పై పోటీ చేయనున్నారు. ఇక్కడ జూన్ 1న ఓటింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. మిసా భారతి 2014, 2019 ఎన్నికల్లో రామ్ కృపాల్ యాదవ్ చేతిలో పాటలీపుత్ర నియోజకవర్గంలో ఓటమి చవి చూసారు. 2014కు ముందు రామ్ కృపాల్ యాదవ్.. లాలూ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. -
సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ ముగిసింది. ఇంతలో బీహార్ రాజకీయాల్లో మరో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. లాలూ యాదవ్‌ను ఒకసారి ఓడించిన జేడీయూ అధినేత ఇప్పుడు ఆర్జేడీలో చేరబోతున్నారని సమాచారం. ఇది సీఎం నితీష్ కుమార్‌కు పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రబ్రీ దేవి నివాసంలో లాలూ సమక్షంలో రంజన్ ఆర్జేడీలో చేరనున్నారని తెలుస్తోంది.లాలూ యాదవ్‌కు రంజన్ యాదవ్ అత్యంత సన్నిహితుడు. ఒకానొక సమయంలో రంజన్ యాదవ్ కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో లాలూకు అండగా ఉన్నారు. రంజన్ యాదవ్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. జనతాదళ్ అతనికి ఈ అవకాశాన్ని కల్పించింది. రంజన్ 1990 నుంచి 1996 వరకు ఆర్జేడీలో ఉన్నారు. ఆ తర్వాత ఆర్జేడీని వీడి జేడీయూలో చేరారు.2009లో పాటలీపుత్ర పార్లమెంటరీ స్థానం నుండి లాలూ యాదవ్‌పై పోటీకి జేడీయూ రంజన్‌ను నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో రంజన్ యాదవ్ లాలూను ఓడించారు. తరువాత రంజన్ బీజేపీలో చేరారు. దీనికి ముందు ఆయన రాష్ట్రీయ జనతాదళ్ (నేషనలిస్ట్) పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. ఇప్పుడు రంజన్ యాదవ్ మరోసారి బీహార్ రాజకీయాల్లో పునరాగమనం చేయనున్నారు. రంజన్ యాదవ్ రాకతో లాలూ పార్టీకి మరింత సత్తా వస్తుందని పలువురు భావిస్తున్నారు. -
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
పాట్నా: ఆర్జేడీ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతుండటం తెలిసిందే. బిహార్‌లోని సరన్ నియోజకవర్గం ఆమె పోటీ చేస్తున్నారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అక్కడి నుంచే ఆమెపై పోటీ పడుతున్నారు! తండ్రీ కూతుళ్లు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఏమిటా అని అవాక్కవుతున్నారా? వాళ్లిద్దరూ సరన్ నుంచి పోటీ చేస్తున్నది నిజమే గానీ సదరు లాలు ప్రసాద్ యాదవ్ ఆమె తండ్రి కాదు. ఆ పేరుతోనే ఉన్న ఓ రైతు! రాష్రీ్టయ జన సంభావనా పార్టీ (ఆర్జేపీ) అభ్యరి్థగా నామినేషన్ వేశారాయన. ఈ లాలు ప్రసాద్ యాదవ్‌కు గతంలో పంచాయతీ మొదలుకుని ప్రెసిడెంట్ ఎన్నికల దాకా పోటీ చేసిన అనుభవముంది. అంతే కాదు, 2017, 2022ల్లో రెండుసార్లు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ పడ్డారు. రెండుసార్లూ ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవడం వేరే సంగతి! సరన్ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేయడం ఇది తొలిసారేమీ కాదు. చాలాకాలంగా బరిలో నిలుస్తూనే వస్తున్నారు. లాలు భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవిపై కూడా పోటీ చేశారు. ఇప్పుడు వారి కుమార్తెపై బరిలో దిగారు. గత ఎన్నికల విషయం ఎలా ఉన్నా ఈసారి మాత్రం భారీ మెజారిటీతో గెలుస్తానని ఈ లాలు అంటుండటం విశేషం! ‘‘జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుంటున్నా, నిత్యం సామాజిక సేవలో నిమగ్నమయ్యే ఉన్నా. కనుక ఈసారి సరన్ ప్రజలు నా వెంట ఉన్నారు’’ అంటున్నారు. రోహిణి ఓట్లను చీల్చేందుకే ఆయన బరిలో ఉన్నారని ఆరోపణలున్నాయి. పట్టించుకోనంటున్నాడు. అఫిడవిట్ ప్రకారం ఈ లాలు దగ్గర రూ.5 లక్షల నగదు, భార్య వద్ద 2 లక్షల నగదు, ఆయన పేరిటరూ.17.6 లక్షలు, భార్య పేరిట రూ.5.20 లక్షల చరాస్తులున్నాయి. -
సీఎం నితీష్ కుమార్ జీ మీరెక్కడా? బీజేపీ ప్రచారంపై తేజస్వీ ప్రశ్నల వర్షం
బీహార్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీ ఎన్నికల ర్యాలీలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గైర్హాజరవుతున్నారు. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ గయా, పూర్ణియాలో చేపట్టిన ర్యాలీలకు జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ హాజరుకాకపోవడాన్ని తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. సీఎం నితీష్ కుమార్జీ మీరెక్కడా? ఎన్నికల ర్యాలీలకు బీజేపీ ఆయనను ఎందుకు ఆహ్వానించడం లేదు? మంగళవారం జరిగిన ప్రధాని మోదీ ర్యాలీలో కూడా ఆయన ఎందుకు కనిపించలేదంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగానికి సంబంధించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని చేసిన ఆరోపణలపై తేజస్వీ యాదవ్ స్పందించారు. మోదీ మూడవసారి అధికారంలోకి రాగానే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కమలం నేతలే చెబుతున్నారు. వారిపై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, యువతకు ఉపాధి కల్పించడం, పేదరికాన్ని తగ్గించడం, నల్లధనాన్ని భారతదేశానికి వెనక్కి తీసుకురావడం గురించి ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు? అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నొక్కాణించారు. -
‘కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. మహిళలకు లక్ష రూపాయలు’
పాట్నా: బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) మేనిఫెస్టోను ప్రకటించింది. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ శనివారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్జేడీ సీనియర్ నేతల సమక్షంలో 'పరివర్తన్ పత్ర' (మేనిఫెస్టో) విడుదల చేసిన తేజస్వీ యాదవ్, తమ పార్టీ దేశంతోపాటు బిహార్ ప్రజలకు 24 వాగ్దానాలు చేస్తోందని చెప్పారు. ‘2024 కోసం 24 'జన్ వచన్' (ప్రజా వాగ్దానాలు) తెచ్చాం. ఈ 24 'జన్ వచన్'లు నెరవేరుస్తాం’ అన్నారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మెరుగైన కనెక్టివిటీ కోసం బిహార్‌లో ఐదు కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని తేజస్వి యాదవ్ చెప్పారు. పూర్నియా, భాగల్పూర్, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, రక్సాల్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓపీఎస్ (పాత పెన్షన్ స్కీం)ను అమలు చేస్తామని, బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. ఏటా రక్షా బంధన్ నాడు పేదింటి మహిళలకు రూ.1 లక్ష అందిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ అధినేత హామీ ఇచ్చారు. ‘మా భారత కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం.. ప్రస్తుతం నిరుద్యోగం మనకు పెద్ద శత్రువు. బీజేపీ వాళ్లు దీని గురించి మాట్లాడరు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ మాత్రమే ఇచ్చారు. కానీ మేము చెప్పింది చేస్తాం” అన్నారాయన. -
‘హలో ఫ్రెండ్స్.. హెలికాప్టర్లో ఆరంజ్ పార్టీ’ ఇప్పుడేమంటారో..
పాట్నా: హెలికాప్టర్లో ‘ఫిష్ పార్టీ’ వీడియో వివాదం తర్వాత మరో వీడియోను షేర్ చేశారు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్. హెలికాప్టర్లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సాహ్నితో కలిసి ఫిష్ పార్టీ వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా తేజస్వి యాదవ్ గురువారం మరో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వీరిద్దరూ బత్తాయి పండ్లను ఆస్వాదించడాన్ని చూడవచ్చు. "హలో ఫ్రెండ్స్, ఈ రోజు హెలికాప్టర్లో ఆరెంజ్ పార్టీ జరుగుతోంది. వారు (బీజేపీ నేతలు) ఆరెంజ్ రంగుపై వివాదం చేయరు కదా?" అంటూ బీజేపీకి చురకలు అంటిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాసుకొచ్చారు. ఇంతకు ముందు షేర్ చేసిన వీడియోలో తేజస్వి యాదవ్ చేపలు తింటూ కనిపించడంపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నవరాత్రుల వేళ మాంసాహార భోజనమా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. హెలికాప్టర్ లోపల చిత్రీకరించిన ఈ వీడియోలో వీఐపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి తేజస్వి యాదవ్ భోజనం చేస్తూ కనిపించారు. బీజేపీ విమర్శలపై తేజస్వి యాదవ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో నవరాత్రి ఉత్సవాలకు ముందు రికార్డ్ చేసిందని, తనను విమర్శించేవారికి "తక్కువ ఐక్యూ" ఉందని ఆరోపించారు. हैलो फ्रैंड्स, आज हेलीकॉप्टर में नारंगी पार्टी हुई। Orange के रंग से तो वो नहीं ना चिढ़ेंगे? #TejashwiYadav #Trending #Viral pic.twitter.com/FlhuyMhM6f — Tejashwi Yadav (@yadavtejashwi) April 10, 2024 -
26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ: తేజస్వి యాదవ్
సార్వత్రిక ఎన్నికలకు దేశంలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ పార్టీ బీహార్‌లో 26 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తుందని.. మా కోటా నుంచి ముఖేష్ సాహ్నీకి 3 సీట్లు (గోపాల్‌గంజ్, ఝంఝర్పూర్ & మోతిహారి) ఇవ్వాలని నిర్ణయించినట్లు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వికాశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సాహ్ని మాట్లాడుతూ.. మేము లాలూ ప్రసాద్ యాదవ్ సిద్ధాంతాలను విశ్వసించే వ్యక్తులం. బీజేపీ మా నాయకులను వేటాడేందుకు ప్రయత్నించింది. మా పార్టీని అంతం చేయడానికి ప్రయత్నించిందని అన్నారు. బీహార్ మాజీ మంత్రి ముఖేష్ సాహ్ని శుక్రవారం రాష్ట్రంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘటబంధన్‌లో చేరారు. వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి సారథ్యం వహిస్తున్న బాలీవుడ్ సెట్ డిజైనర్, రాజకీయ నాయకురాలు సాహ్నితో పాటు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది. #WATCH | Vikassheel Insaan Party's Mukesh Sahni says, "...We are people who believe in the ideology of Lalu Prasad Yadav...BJP tried to poach our leaders & tried to finish our party..." pic.twitter.com/TN3kc6Rt8L — ANI (@ANI) April 5, 2024 -
Lok sabha elections 2024: ఆర్జేడీకి 26.. కాంగ్రెస్‌కు 9
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు గాను బిహార్‌లో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘఠ్‌బంధన్‌లో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను దాదాపు మూడింట రెండొంతుల సీట్లలో లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ పోటీ చేయనుంది. మిగతా వాటిని కాంగ్రెస్, మూడు వామపక్ష పార్టీలు పంచుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటూ దక్కించుకోలేకపోయినప్పటికీ ఈసారి 26 చోట్ల పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారీ 9 చోట్ల పోటీ చేయనుంది. ఆ తర్వాత సీపీఐ ఎంఎల్ లిబరేషన్ మూడు, సీపీఐ, సీపీఎంలు చెరో చోట బరిలోకి దిగనున్నాయి. బిహార్‌లో ఆర్జేడీ ఇప్పటికే నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒక సీటును కాంగ్రెస్ ఆశిస్తోంది. కాంగ్రెస్ పోటీ చేయాలని ఆశిస్తున్న పుర్నియా స్థానానికి లాలూ ప్రసాద్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేశారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్) కూడా బెగుసరాయ్, ఖరారియా సీట్లకు అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. -
India Alliance: బిహార్‌లో కాంగ్రెస్ పోటీ చేసే సీట్లు ఎన్నంటే..
పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఇండియా కూటమి సీట్ షేరింగ్ ఫైనల్ అయింది. పొత్తులో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ 26 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో వామపక్షాలు 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని కూటమి పార్టీలు శుక్రవారం(మార్చ్ 29) వెల్లడించాయి. బీహార్‌లో మొత్తం 40 సీట్లకు గాను ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుండగా జూన్ 1న ఏడవ విడత పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అటు ఎన్డీఏ కూటమిలో బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16, జితన్ రామ్ మాంజీ పార్టీ హెచ్ఏఎమ్ ఒక సీటు, ఆర్ఎల్ఎస్పీ ఒక సీటు, చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి 24.1 శాతం ఓట్లు రాగా జేడీయూకు 22.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 7.9 శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. అయినా ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఆర్జేడీ 9 సీట్లు ఇవ్వడం విశేషం. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ -
‘మహాఘట్ బంధన్’లో సీట్ల చిచ్చు.. కోరుకున్న స్థానాలపై లాలూ పేచీ
సాక్షి, పాట్నా: త్వరలో జరగనున్న బీహార్‌లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల సీట్ల కేటాయింపుల్లో మహాఘటబంధన్ కూటమిలో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), లెఫ్ట్ పార్టీలు పోత్తు కుదుర్చుకున్నాయి. ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. అయితే, లోక్‌సభ సీట్లను కేటాయించినట్లుగా అసెంబ్లీ స్థానాల అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయానికి రావడం లేదని, ఫలితంగా నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ నియోజవర్గాలైన ఔరంగాబాద్, బెగుసరాయ్, కతిహార్, పూర్ణియా, శివన్ స్థానాల్లో కూటమి పార్టీల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఔరంగాబాద్‌తో పాటు బెగుసరాయ్ సీటులోనూ కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య వివాదం నెలకొంది. ఇటీవల సీపీఐ సీట్ల కేటాయింపులో కూటమిలోని పార్టీ పెద్దల్ని సంప్రదించ కుండానే ఔరంగాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా అవదేశ్ రాయ్‌ను ప్రకటించింది. శివన్ బీహార్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అవద్ బిహారీ చౌదరికి టికెట్ ఇవ్వాలని లాలూ ప్రసాద్ ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. సీపీఐ, సీపీఐ(ఎంఎల్)లు కూడా శివన్ సీటు కోసం ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కతిహార్ నియోజకవర్గం నుంచి తారిఖ్ అన్వర్‌ను పోటీకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంటే.. అదే సీటు తమకే కావాలంటూ ఆర్జేడీ పట్టుబడుతుంది. దీంతో అసెంబ్లీ సీట్ల కోసం అయా పార్టీల నేతల సిగపట్లతో కార్యకర్తలు విస్తుపోతున్నారు. -
ఆ మాజీ సీఎం చెప్పారనే.. 60 ఏళ్ల వయసులో పెళ్లి!
‘‘లాలూజీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. ఆ భార్యాభర్తలు మనస్పూర్తిగా ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు.. అది చాలూ..’’ అంటూ సంతోషంగా మీడియా ముందు మాట్లాడారు 60 ఏళ్ల అశోక్ మహతో. ఈ వయసులో పెళ్లా.. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి దిగ్గజ నేత ఆశీర్వాదం ఎందుకు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. అందుకేనట! నవాదా జిల్లాకు చెందిన అశోక్ మహతో.. మాజీ గ్యాంగ్‌స్టర్. సంచలన కేసుల్లో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరాడు. అందుకోసం ముంగేర్ స్థానం ఎంచుకున్నాడు. ఇదే స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ, జేడీయూ నేత లాలన్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఎలాగూ.. ఆర్జేడీ మద్దతు ఉంది. టికెట్ దక్కే అవకాశం లేకపోలేదు. కానీ.. అన్నేళ్లు జైలు శిక్ష అనుభవించి రావడం, కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో చట్టపరంగా సాధ్యం కావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ఇక్కడే లాలూ తన మార్క్ రాజకీయం చూపించారు. ‘వివాహం చేసుకుని నీ భార్యను పోటీ చేయించు’ అని లాలూ సలహా ఇచ్చారు. అంతే.. ఢిల్లీకి చెందిన కుమారి అనిత(46) అనే మహిళను మంగళవారం రాత్రి పాట్నా శివారులో ఉన్న ఓ గుడిలో కుటుంబ సభ్యులు, తన మద్దతుదారుల మధ్య పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆ నవవధువు, వరుడు లాలూ ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం జంట లాలూ-రబ్రీదేవీల ఆశీర్వాదం తీసుకున్నారు. బయటకు వచ్చిన ఆయన వాహనాన్ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. ఆర్జేడీ టికెట్ ఇస్తుందా? లాలూ హామీ ఇచ్చారా? మీ భార్యను ఎన్నికల బరిలో దింపబోతున్నారా?.. హడావిడిగా వివాహం చేసుకోవడానికి కారణాలేంటి?.. ఇలా ప్రశ్నలతో ఆ పెళ్లి కొడుకును ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే అశోక్ మాత్రం తెలివిగా ‘ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆర్జేడీ నుంచి పోటీ చేస్తాం’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ब्याह रचाने के बाद नई नवेली दुल्हन के साथ लालू का आशीर्वाद लेने पहुंचे कुख्यात अशोक महतो, टिकट के लिए 62 की उम्र में खरमास में रचाई है शादी#ASHOKMAHTO #BiharPolitics #Bihar #BiharNews pic.twitter.com/VqrEn1zeSb — FirstBiharJharkhand (@firstbiharnews) March 20, 2024 VIDEO Credits: FirstBiharJharkhand షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతోపాటు నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా అశోక్ మహతో 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు. ఇక.. 1997లో దాణా కుంభకోణంలో లాలూ రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు తన భార్య రబ్రీదేవిని బీహార్‌కు ముఖ్యమంత్రిని చేసింది తెలిసిందే. -
లాలూతో పప్పు యాదవ్ భేటీ.. మాధేపురా సీటుకు వినతి!
బీహార్‌కు చెందిన మాజీ ఎంపీ పప్పు యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, తేజస్వి యాదవ్‌లను కలుసుకున్నారు. ఆయన రాష్ట్రీయ జనతాదళ్ టిక్కెట్‌పై మాధేపురా నుండి పోటీచేయాలనే అభిలాషను వారి ముందు వ్యక్తం చేసినట్లు సమాచారం. పప్పు యాదవ్ 2014లో ఆర్జేడీ టిక్కెట్‌పై మాధేపురా నుంచి గెలుపొందారు. అందుకే ఈసారి కూడా పప్పు యాదవ్‌ను ఆర్జేడీ మాధేపురా అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయి. కాగా సింగపూర్‌లో ఉంటున్న లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్యకు సారణ్ సీటు ఇచ్చే విషయమై పార్టీ పరిశీలిస్తోందని వినికిడి. లాలూ గతంలో సారణ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్-రాష్ట్రీయ జనతాదళ్‌ల ‘మహాకూటమి’ సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌తో పొత్తు పెట్టుకుని ఎన్డీఏకు గట్టి సవాల్ విసిరింది. అయితే రెండు నెలల క్రితం నితీష్ కుమార్ హఠాత్తుగా ఎన్డీఏలోకి రావడంతో ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19, జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరగనున్నాయి. -
ఇండియా కూటమితో టచ్‌లో పశుపతి పరాస్!
రాష్ట్రీయ లోక్‌జనశక్తి (ఆర్ఎల్జేపీ) పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్.. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తనకు అన్యాయం జరగటంతో ఎన్డీయే కూటమితో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపక్షాల ఇండియా కూటమికి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. పశుపతి పరాస్ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన వెంటనే ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. బిహార్‌లోని ప్రతిపక్ష కూటమికి ఆహ్వానించారు. ‘ఒకవేళ పశుపతి పరాస్ బీహార్ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. రాజీనామా చేసిన పరాస్‌ను బీజేపీ ఏం చేయలేదు’ అని అన్నారు. అయితే పరాస్.. పలు లోక్‌సభ స్థానాలతో పాటు హాజీపూర్ సెగ్మెంట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో కీలకమైన హాజీపూర్ స్థానంలో కచ్చితంగా పోటీ చేస్తానని.. అవసరమైతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్దమేని ఇటీవల పరాస్ ప్రకటించారు. అయితే సోమవారం బీజేపీ.. పరాస్‌ను పక్కనబెట్టి జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)తో సీట్ల పంపకం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పశుపతి పరాస్ ఎన్డీయే నుంచి తప్పుకున్నారు. మరోవైపు పరాస్‌కు కంచుకోట అయిన హాజీపూర్‌లో బీజేపీ.. లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) పార్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించటం గమనార్హం. ఒకవేళ పరాస్ ఇండియా కూటమిలో చేరితే ఆయనకు హాజీపూర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి. -
తండ్రికి కిడ్నీదానం.. రాజకీయాల్లోకి మాజీ సీఎం కూతురు?
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె 'రోహిణి ఆచార్య' రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని సరన్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. యాదవ్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరుగాంచిన బీహార్ శాసన మండలి సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత శ్రీమతి ఆచార్య రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేయబోతున్నారని చెబుతున్నారు. డాక్టర్ రోహిణి ఆచార్య తన తండ్రి పట్ల చూపించే ప్రేమ, భక్తి, అంకితభావానికి దాదాపు అందరికి తెలుసు. సరన్ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలు అందరూ ఆమెను సరన్‌కు పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల ప్రారంభంలో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఆర్జేడీ ర్యాలీలో ఆచార్య కూడా పాల్గొన్నారు. సరన్ లోక్‌సభ స్థానం ప్రస్తుతం బీజేపీకి చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఉంది. దీనికి గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. రోహిణి ఆచార్య ఎవరు? రోహిణి ఆచార్య వృత్తి రీత్యా ఎంబీబీఎస్ డాక్టర్. ఈమె 2002లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సమేష్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఇతడు లాలూ యాదవ్ స్నేహితుడైన.. రాయ్ రణవిజయ్ సింగ్ కుమారుడు. గత రెండు దశాబ్దాలుగా, శ్రీమతి ఆచార్య, ఆమె భర్త విదేశాల్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీమతి ఆచార్య.. 2022లో అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి కిడ్నీ దానం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఆచార్య చేసిన పనికి ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశంసించాయి. అంతకుముందు 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఊహించారు. కానీ అది జరగలేదు. -
బీహార్ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి: తేజస్వీ యాదవ్
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి 'తేజస్వి యాదవ్' విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఆర్జేడీ మంచి ఫలితాన్ని సాధిస్తుందనే విశ్వాసం తమకు ఉందని అన్నారు. మా పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసు. గత 10 సంవత్సరాల్లో బీహార్ కోసం ప్రధాని మోదీ ఏమి చేశారు? బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఏమీ రాలేదు. ద్రవ్యోల్బణం, రైతుల సమస్య ఇప్పటికీ అలాగే ఉందని తేజస్వి యాదవ్ అన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ తెలిపారు. మరి కొన్ని రోజుల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందని విషయం తెలుస్తుంది. -
ఆసుపత్రిలో చేరిన ఆర్జేడీ నేత 'తేజ్ ప్రతాప్ యాదవ్'
రాష్ట్రీయ జనతా దళ్ ( RJD ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు 'తేజ్ ప్రతాప్ యాదవ్' శుక్రవారం స్వల్ప అస్వస్థకు గురయ్యారు. లో బీపీ (బ్లడ్ ప్రెషర్) కారణంగా ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజేంద్ర నగర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. ఇంటి వద్ద ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతిలో నొప్పి అని చెప్పడంతో.. అతని సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. తేజ్ ప్రతాప్ ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరడం తొమ్మిది నెలల్లో ఇది రెండోసారి. ఆసుపత్రిలో చేరటానికి ముందు తేజ్ ప్రతాప్ యాదవ్ కృష్ణబ్రహ్మం ప్రాంతంలో జ్ఞాన్ బిందు గ్రంథాలయాన్ని ప్రారంభించి బక్సర్ జిల్లాను సందర్శించారు. ఇప్పటికే పర్యావరణ శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. ప్రస్తుతం ఈయన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. -
లోక్‌సభ ఎన్నికల వేళ.. బిహార్‌లో ఈడీ దాడుల కలకలం
పాట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల కలకలం రేగింది. మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ సన్నిహితుడు, ఇసుక మైనింగ్ కింగ్ సుభాష్‌యాయాదవ్ ఇళ్లు, ఆఫీసులపై శనివారం ఉదయం ఈడీ సోదాలు ప్రారంభించింది. రాజధాని పాట్నా శివార్లతో పాటు దానాపూర్‌లోని పన్నెండు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో సుభాష్ యాదవ్ ఆర్జేడీ టికెట్‌పై జార్ఖండ్‌లోని ఛాత్రా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. పాట్నాలోని గాంధీమైదాన్‌లో ఈ మార్చి 3న జరిగిన మహాబంధన్ జనవిశ్వాస మహా ర్యాలీలో సుభాష్ యాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఇటీవలే ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీదాడులు చర్చనీయాంశమయ్యాయి. ఇదీ చదవండి.. నేడు బీజేపీలోకి కాంగ్రెస్ దిగ్గజ నేత -
పరివార్.. ప్రధానిపై లాలూ విమర్శలతో రాజకీయ రగడ
న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ నేత లాలూప్రసాద్ విమర్శలు పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. దేశవ్యాప్తంగా మంటలు రాజేశా యి. మోదీకి కుటుంబమూ లేదు, సంతానమూ లేరంటూ ఆదివారం పట్నా జన్సందేశ్ ర్యాలీలో లాలూ ఎద్దేవా చేశారు. ఆయనసలు హిందువే కాదంటూ ఆక్షేపించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన విపక్ష నేతల సమక్షంలో లాలూ చేసిన ఈ వ్యాఖ్యలకు మోదీ సోమవారం గట్టిగా కౌంటరిచ్చారు. దేశం కోసమే జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. భారతదేశం, 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని పునరుద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలంతా వెంటనే అందిపుచ్చుకున్నారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మొదలుకుని రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జి.కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్ మేఘ్వాల్ తదితర కేంద్ర మంత్రులు, నేతలంతా ఈ మేరకు ప్రకటనలు చేశారు. మోదీపై లాలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. విపక్షాలపై పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ప్రధానికి బాసటగా నిలిచారు. అంతేగాక సోషల్ మీడియా అకౌంట్లలో తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అంటూ జోడించుకున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు కూడా ఇదే బాటపట్టి ‘మోదీ కా పరివార్’ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. చివరికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా తన ఎక్స్ ప్రొఫైల్‌కు ‘మోదీ కా పరివార్’ అని చేర్చుకున్నట్టు ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి! విపక్షాలు మరోసారి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి చేజేతులా పదునైన నినాదమే అందించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిల్లర వ్యాఖ్యలు: బీజేపీ మోదీపై వ్యక్తిగత విమర్శలు విపక్షాలకు కొత్తేమీ కాదంటూ బీజేపీ ఆగ్రహం వెలిబుచి్చంది. ‘‘17 ఏళ్లుగా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా బాధాకరం’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. విపక్షాల రాజకీయ దురహంకారానికి దేశ ప్రజలు తగిన విధంగా బదులు చెబుతారన్నారు. ‘‘మొత్తం దేశాన్నే తన కుటుంబంగా మార్చుకున్నారు మోదీ. అందుకే ఎంత పని చేసినా ఆయనకు అలుపే రాదు. గత పదేళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు’’ అని చెప్పారు. మోదీకి సంతానం లేదన్న లాలు వ్యాఖ్యలను కూడా సుధాన్షు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘హిందూ మతం గురించి లాలుకేం తెలుసు? అసలు విపక్ష ఇండియా కూటమిలో ఒక్కరు కూడా హిందువు లేదు! సనాతన ధర్మంలో భక్తికే పెద్దపీట తప్ప కుమారునికి కాదు. భారత్‌లో గురుశిష్య సంప్రదాయముంది తప్ప తండ్రీ కొడుకుల సంప్రదాయం లేదు. రామ భక్తుడైన హనుమంతునికే ఊరూరా గుళ్లున్నాయి. రాముని కుమారులు లవకుశులకు ఎక్కడైనా ఆలయముందా?’’ అని ప్రశ్నించారు. ‘‘మోదీ నాయకత్వంలో 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం మోదీ లక్ష్యమైతే ఎలాగైనా అధికారం సాధించి 2047 దాకా కూడా దాన్ని తమ కుటుంబాల గుప్పెట్లోనే ఉంచుకోవడం విపక్షాల లక్ష్యం’’ అంటూ దుయ్యబట్టారు. వీలైనంత భారీగా అవినీతికి పాల్పడి, తద్వారా తాము, తమ కుటుంబాలు మాత్రమే తరతరాలకు సరిపడా సంపద పోగేసుకోవాలన్నది విపక్షాల ఉద్దేశమని ఆరోపించారు. నేరగాళ్లే మోదీ పరివారం: కాంగ్రెస్ ఇండియా కూటమి నానాటికీ బలోపేతమవుతుండటం చూసి అధికార బీజేపీలో అక్కసు పెరిగిపోతోందని కాంగ్రెస్ ఆరోపించింది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘మోదీ కా పరివార్’ పేరిట కొత్త డ్రామాకు తెర తీసిందని మండిపడింది. ‘‘రైతులను కార్లతో తొక్కించి చంపిన నేరగాడి తండ్రయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌సింగ్ వంటి బీజేపీ నేతలే నిజమైన మోదీ కుటుంబం. అదే ‘మోదీ కా అస్లీ పరివార్’’ అంటూ ఎద్దేవా చేసింది. ‘‘మణిపూర్ హింసాకాండకు బలైన మహిళలకు మోదీ కుటుంబంలో చోటేది? ఢిల్లీ శివార్లలో నిరసన గళమెత్తుతున్న రైతులను తన కుటుంబంగా చెప్పుకోగలరా? ఉపాధి లేక నిత్యం ఆత్మహత్యల బాట పడుతున్న నిరుద్యోగ యువతను తన కుటుంబమని చెప్పుకోరేం? బీజేపీ సర్కారు కేవలం క్రూరమైన నేరగాళ్లు, మోదీ సన్నిహిత పెట్టుబడిదారుల కోసం మాత్రమే పని చేస్తోంది’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ‘‘రైతుల హత్య, మహిళలపై అత్యాచారాలు... ఇదే నిజమైన మోదీ కుటుంబం’’ అంటూ కాంగ్రెస్ నేతలంతా విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్, అజయ్ మిశ్రా తదితరులు తమ సోషల్ హ్యాండిల్స్‌కు ‘మోదీ కా పరివార్’ అని జోడించుకోవడాన్ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. సంఘ్ పరివార్ కాస్తా చివరికి మోదీ పరివార్‌గా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. 2019లో ‘మై భీ చౌకీదార్’ సాక్షి, న్యూఢిల్లీ: మోదీపై విపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది తొలిసారి కాదు. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీపై ‘మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి)’ అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మత అల్లర్లకు కారకుడనే అర్థంలో ఆమె చేసిన విమర్శలు వివాదానికి దారి తీశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బాగా నష్టం చేశాయి. అనంతరం 2018లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారే దొంగ) అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. తాను దేశానికి చౌకీదార్‌లా ఉంటానన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ ఎక్కుపెట్టిన ఆ విమర్శలూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నింటికీ తీవ్రంగా చేటు చేశాయి. ఆ వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుని ఘనవిజయం సాధించింది. మోదీ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో ‘నరేంద్ర మోదీ చౌకీదార్’ అని చేర్చుకున్నారు. బీజేపీ నేతలు కూడా ‘మై భీ చౌకీదార్’ అని ప్రొఫైల్స్‌లో చేర్చుకున్నారు. ‘‘నువ్వేమీ మరీ అంత పెద్దవాడివి కాదు. మాట్లాడితే కుటుంబ రాజకీయాలంటూ మాపై పదేపదే దాడికి దిగుతున్నావ్! కుటుంబాల గురించి నీకెందుకు? నీకు సంతానం ఎందుకు లేదో చెప్పు. కుటుంబమే లేదు నీకు. అయోధ్యలో రామాలయం కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటావు. కానీ నువ్వసలు హిందువువే కాదు. అమ్మ మరణిస్తే ప్రతి హిందువూ శిరోముండనం చేయించుకుంటాడు. నువ్వు మాత్రం చేయించుకోలేదు. కారణమేంటో చెప్పు! దేశమంతటా విద్వేష వ్యాప్తి చేస్తున్నావ్!’’ – పట్నా ర్యాలీలో మోదీపై లాలూ విమర్శలు ‘‘ఇండియా కూటమిలోని విపక్ష నేతలంతా అవినీతి, వారసత్వ, సంతుస్టీకరణ రాజకీయాల్లో పీకల్లోతున కూరుకుపోయారు. పార్టీ ఏదైనా ఝూట్–లూట్ (అబద్ధాలు, దోపిడీ) అన్నదే వాళ్లందరి నైజం. దీనిపై ప్రశి్నస్తే నాకు కుటుంబమే లేదంటూ ఆక్షేపిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం. నా భారతదేశమే నా కుటుంబం. ఒక సేవకునిలా ప్రజా క్షేమానికే నా జీవితాన్ని అంకితం చేశా. దేశసేవ చేయాలనే కలను నిజం చేసుకోవడానికి చిన్న వయసులోనే ఇల్లు వీడా. నా జీవితమంతా తెరిచిన పుస్తకం. ప్రతి భారతీయునికీ ఆ విషయం తెలుసు’’ – ఆదిలాబాద్ సభలో మోదీ -
Modi ka parivaar: ట్రెండింగ్‌లోకి ‘మోదీ పరివార్’
ఆదిలాబాద్/తెలంగాణ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబమే లేదన్న లాలూ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే.. లాలూ వ్యాఖ్యలపై ఇవాళ తెలంగాణ ఆదిలాబాద్ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ‘నా జీవితం తెరిచిన పుస్తకం.. నా జీవితం దేశం కోసం అంకితం. వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తే నన్ను దూషిస్తున్నారు. దేశ ప్రజలే నా బంధువులు’ అని మోదీ అన్నారు. ఎవరూ లేనివారికి మోదీనే కుటుంబమన్న ప్రధాని మోదీ.. ‘నేనే మోదీ కుటంబం’(మై హూ మోదీ పరివార్) Modi ka parivaar అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మోదీ పిలుపుతో బీజేపీ అగ్రనేతలు సోషల్‌మీడియా ఖాతాల్లో తమ బయో మార్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ‘మోదీ పరివార్’ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెటిజన్లు ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ‘ జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. మోదీ అసలు హిందువే కాదని.. ఆయన తన తల్లి మరణించిన సమయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం శిరోముండనం తెలిపారు. అలాగే.. ఎక్కువ సంతానం ఉన్నవాళ్లను సైతం మోదీ తరచూ విమర్శిస్తుంటారని లాలూ ఆరోపించారు. -
మీ మేనల్లుడు మోదీని అడ్డుకుంటాడు: తేజస్వీ యాదవ్
బిహార్‌లో జేడీ(యూ).. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు(సోమవారం) నితీష్ కుమార్ జేడీయూ ప్రభుత్వం బలపరీక్ష ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. నితీష్ కుమార్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. బిహార్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వరంలోని బీజేపీని తాము ఎదుర్కొంటామని అన్నారు. ఒక టర్మ్‌లో మూడుసార్లు సీఎం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మిగిలిపోతారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ‘నితీష్ కుమార్ విషయంలో జేడీయూ ఎమ్మెల్యేలు బాధ పడతారు. ఎందుకంటే వారు ప్రజల్లోకి వెళ్లితే.. ప్రజల నుంచి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ నాయకుడు మూడు సార్లు సీఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారంటే ఏం చెబుతారు?. గతంలో బీజేపీని తిట్టి.. ఇప్పుడు అదే పార్టీపై పొగడ్తలు కురిపిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారు?’ అని జేడీ(యూ) ఎమ్మెల్యేలను తేజస్వీ ప్రశ్నించారు. ‘నేను సీఎం నితీష్ కుమర్‌కు ఓ కుటుంబ సభ్యుడిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మాదంతా సమాజ్‌వాదీ కుటుంబం.దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకున్నేందు మీరు(నితీష్‌కుమార్) ఎగురవేసిన జెండాను మీ మేనల్లుడు(తేజస్వీ యాదవ్) కొనసాగిస్తాడు. బిహార్‌లో మోదీని అడ్డుకుంటాం’ అని తేజస్వీ అన్నారు. నితీష్‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తరచూ ‘మామా’ అని ఆప్యాయంగా పిలుస్తారన్న విషయం తెలిసిందే. బీజేపీ దివంగత సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వటం సంతోషమన్న తేజస్వీ.. ఒక రాజకీయ ఒప్పదం ప్రకారమే ఇచ్చిందని మండిపడ్డారు. ఆ క్రమంలో బిహార్‌లోని మహాఘట్బంధన్ను బీజేపీ చీల్చిందని దుయ్యబట్టారు తేజస్వీ యాదవ్. చదవండి: బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ -
బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్
బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ సీఎం నితీష్‌కుమార్‌కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు బిహార్‌లో మొత్తం 243 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 122 శాసన సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్ నితీష్ కుమార్‌కు అనుకూలంగా ఓటేసిన ఐదుగురు విపక్ష సభ్యులు బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం నితీష్ కుమార్ నితీష్ కుమార్‌పై తేజస్వీ యాదవ్ ఘాటు విమర్శలు బీహార్‌లో ఏ ఒక్కరికీ నితీష్ కుమార్‌పై నమ్మకం లేదు నీతీష్ మళ్లీ జంప్ చేయరని మోదీ గ్యారంటీ ఇవ్వగలరా? బిహార్ అసెంబ్లీ స్పీకర్‌పై నెగ్గిన అవిశ్వాసం అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు ప్రస్తుత బిహార్ స్పీకర్‌గా ఆర్జేడీ నేత బిహారీ చౌదరి నితీష్‌కు అనుకూలంగా ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు బిహార్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. కొత్తగా కొలువుదీరిన జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్- బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనుంది. ఈ బల పరీక్షలో ఎన్డీయే సర్కార్ సులువుగా నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధాన విపక్షమైన ఆర్జేడీ తన బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బిహార్ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాసం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 113 ఓట్లు వచ్చాయి. అయితే నితీష్‌కు అనుకూలంగా ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఓటేయ్యడం గమనార్హం. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఆర్జేడీ నేత బిహారీ చౌదరి ఉన్నారు. #WATCH | Bihar Governor Rajendra Arlekar addresses the State Assembly Floor Test of CM Nitish Kumar's government to prove their majority will be held today. pic.twitter.com/uE1jWBIdmr — ANI (@ANI) February 12, 2024 అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. BIG BREAKING: Tejashwi Yadav reaches the Bihar assembly for the floor test. The wait is over, 'Khela' begins now 🔥#BiharFloorTest pic.twitter.com/lVhoJ8qBqg — Ankit Mayank (@mr_mayank) February 12, 2024 బిహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తర్వాత గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని(ఆర్జేడీ నేత) తొలగించాలంటూ ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన వెంటనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత బల పరీక్ష జరగనుంది. #BiharFloorTest | Bihar CM and JDU national president #NitishKumar arrives at the #Bihar Assembly in Patna ahead of the floor test of his government today.#Bihar #JDU #BiharFloorTest #NitishKumar #BiharPoliticalCrisis #TejashwiYadav #तेजस्वी_ज़रूरी_है #Patna #ElvishYadav… pic.twitter.com/l2TjHuhzkJ — Neha Bisht (@neha_bisht12) February 12, 2024 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం బీజేపీ-జేడీయూ కూటమికీ 128 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 78, నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి 45, జితిన్ రామ్ మంఝీకి చెందిన ఆవామ్ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు, ఒకరు స్వతంత్ర్య ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష కూటమికి 114 ఎమ్మెల్యేల బలం ఉంది. ఆర్జేడీ-79, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-12, సీపీఎం-2, సీపీఐ-2, ఇతరులు-1, ఏఐఎంఐఎం-1..కూటమికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. చదవండి: Bihar Assembly Floor Test: నేడు బీహార్‌లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత? కాగా జనవరి 28న రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు కూటములు తమ ఎమ్మెల్యేలు గీత దాటకుండా క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. ప్రతిపక్ష 'మహాఘట్బంధన్'కు చెందిన 79 మంది శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నివాసంలో మకాం వేశారు. ఇటు కాంగ్రెస్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు బిహార్‌కు బయలుదేరారు. మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్‌ను హౌస్ అరెస్టు చేశారని ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఆయన ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
నితీష్‌కు వ్యతిరేకంగా తేజస్వి ఇంటిలో ఏం జరుగుతోంది?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్యెల్యేలంతా ఆ పార్టీ నేత తేజస్వి నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. వారంతా తమకు కావాల్సిన దుప్పట్లు, మందులను శనివారం సాయంత్రమే తెప్పించుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం తేజస్వి నివాసం బయట సందడి నెలకొంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తేజస్వీ యాదవ్ స్వయంగా సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వి నివాసంలోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అంటే సోమవారం అసెంబ్లీలో జరిగే నితీష్ బలపరీక్షకు వీరంతా నేరుగా హాజరుకానున్నారు. తేజస్వి నివాసంతో 76 మంది ఎమ్మెల్యేలున్నారని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదని సమాచారం. #WATCH | Bihar: RJD MLAs and MLAs of Mahagathbandhan at the residence of former Deputy CM and RJD leader Tejashwi Yadav in Patna ahead of the Floor Test scheduled to take place tomorrow. pic.twitter.com/5FXnvGH8Gp — ANI (@ANI) February 11, 2024 -
విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ సర్కారు
రాంచీ: జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపయ్ సొరెన్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. హేమంత్ సొరెన్ అరెస్టు అనంతరం జార్ఖండ్‌లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయ్ సొరెన్ ప్రభుత్వానికి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. CM Champai Soren led Jharkhand government wins floor test after 47 MLAs support him 29 MLAs in opposition. #JharkhandPolitics pic.twitter.com/30BBXMjaak — ANI (@ANI) February 5, 2024 జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుతం కూటమి బలపరీక్షలో విజయం సాధించింది. ఇదీ చదవండి: రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష -
నా అరెస్టులో రాజ్‌భవన్ ప్రమేయం ఉంది: హేమంత్ సొరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ తనను అరెస్టు చేయడంలో గవర్నర్ ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. చంపయ్ సొరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ బలపరీక్షలో పాల్గొనడానికి హేమంత్ సొరెన్‌కు కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన అరెస్టును భారత ప్రజాస్వామ్యంలో నల్ల అధ్యాయం అని అన్నారు. భూ కుంభకోణంతో తనకు సంబంధం ఉందని నిరూపించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు హేమంత్ సొరెన్ సవాలు విసిరారు. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎలాగో వారి నుండి నేర్చుకోవాలని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. నేరం రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తన అరెస్టుకు 2022 నుంచి కుట్ర చేస్తున్నారని చెప్పారు. "మేము ఇంకా ఓటమిని అంగీకరించలేదు. నన్ను కటకటాల వెనక్కి నెట్టి విజయం సాధించగలమని భావిస్తే, జార్ఖండ్‌లో ప్రతి మూలలో గిరిజనులు, దళితులు తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు." అని హేమంత్ సోరెన్ అన్నారు. 'కేంద్రం 2019 తర్వాత స్కామ్‌లను మాత్రమే చూస్తోంది. 2000లలో జరిగిన స్కామ్‌లను చూడలేరు. గిరిజనులు రాష్ట్రాలకు చీఫ్లుగా, IAS లేదా IPS కావాలని కేంద్రం కోరుకోవడం లేదు. గిరిజన నాయకుల ప్రభుత్వాల కాలవ్యవధిని శాంతియుతంగా పూర్తి చేయనివ్వరు. నాకు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది' అని హేమంత్ సొరెన్ అన్నారు. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ కూటమి తరుపున హేమంత్ సొరెన్ సన్నిహితుడు చంపయ్ సొరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఉందని నేడు అసెంబ్లీలో బలప్రదర్శన జరుగుతోంది. ఇదీ చదవండి:రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష -
జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. బలనిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో రానున్నారు. మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంపయ్ సోరెన్ 1956 నవంబర్‌లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. హేమంత్ సొరెన్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. చంపయ్‌ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రవాణా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. #WATCH | JMM vice president Champai Soren takes oath as the Chief Minister of Jharkhand, at the Raj Bhavan in Ranchi. This comes two days after Hemant Soren's resignation as the CM and his arrest by the ED. pic.twitter.com/WEECELBegr — ANI (@ANI) February 2, 2024 రాష్ట్ర మాజీ హేమంత్ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ -
ఈడీ ముందుకు లాలూ కొడుకు
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ హాజరయ్యారు. పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు ఆర్జేడీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ ఇంట్లోనూ ఈడీ దాడులు జరిపింది. నిన్న లాలూని 9 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తమ ఆరోపణలు నిజమేనని స్పష్టం చేసింది. అక్రమంగా రైల్వే ఉద్యోగాలు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ భార్య రబ్రి దేవి గోశాలలో పనిచేసే వ్యక్తి పేరుపై మొదట రైల్వే ఉద్యోగుల నుంచి లంచాలు పుచ్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ ఆస్తుల్ని లాలూ కూతురు హేమా యాదవ్‌కు బదిలీ చేశారని వెల్లడైంది. ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ షెల్ కంపెనీలకు నిధుల్ని బదిలీ చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీల షేర్లు లాలూ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. అమిత్ కత్యాల్ అనే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ఈ కంపెనీలను నిర్వహించాడని ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఇదీ చదవండి: Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? -
ఈడీ ఎదుటకు లాలూ
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిషా భారతి, ఆయన కుమార్తె కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. పెద్ద సంఖ్యలో ఆర్జేడీ కార్యకర్తలు కూడా ఈడీ కార్యాలయం వెలుపల గుమిగూడారు. కార్యాలయం బయట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనవరి 19న లాలూ యాదవ్ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. పాట్నాలోని లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి నివాసానికి ఈడీ నోటీసును అందజేసింది. జనవరి 29, 30 తేదీల్లో తమ ఎదుట హాజరు కావాలని కోరింది. ఈడీ చర్యను ఆర్జేడీ నాయకత్వం విమర్శించింది. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. 'ఇది కొత్త విషయం కాదు.. తమతో సహకరించని పార్టీలకు కేంద్రం ఈడీ సమన్లను పంపిస్తుంది. ఎక్కడికి వెళ్లైనా ఈడీకి సహకరించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం' అని మిసా భారతి తెలిపారు. 'ఇది ఈడీ సమన్ కాదు, బీజేపీ సమన్.. ఇది 2024 వరకు కొనసాగుతుంది. అప్పటి వరకు దయచేసి దీనిని ఈడీ సమన్లు అని పిలవకండి.. మేమెందుకు భయపడాలి?' అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఆరోపించారు. ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ -
Bihar: బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం.. 24 గంటల్లోనే కీలక నిర్ణయం
పట్నా: బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు గుడ్‌బై చెప్పిన సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి తొమ్మిదోసారి బిహార్ సీఎంగా అవతరించారు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన మరుసటి రోజే ప్రతిపక్షాలపై చర్యలను ప్రారంభించింది ఎన్డీయే సర్కార్. ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తన పదవి నుంచి తొలగించాలంటూ అసెంబ్లీ సెక్రటరికీ బీజేపీ, ఆర్డేడీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందించారు. బీజేపీ నేతలు నంద కిషోర్ యాదవ్, తార్కిషోర్ ప్రసాద్(మాజీ డిప్యూటీ సీఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా అధినేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, జేడీయూకు చెందిన వినయ్ కుమార్ చౌదరి, రత్నేష్ సదా, ఎన్డీయే కూటమికి చెందిన ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తొలగించాలంటూ నోటీసులు ఇచ్చారు. చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ కాగా బిహార్ సీఎం నితీష్ కుమార్ హమాఘట్ బంధన్ సంకీర్ణం నుంచి తప్పుకొని మరోసారి బీజేపీ సార్ధంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఆదివారం ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి.. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో 72 ఏళ్ల నితీష్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ నుంచి ఇద్దరు (సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పార్టీలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల నిష్క్రమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ
పాట్నా: బిహార్‌లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం సోమవారం తన తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు. అడ్వకేట్ జనరల్ నామినేషన్‌పై తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశం ఏర్పాట్లపై కూడా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. బిహార్‌లో మహాఘట్బంధన్కు నితీష్ కుమార్ ఆదివారం భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమిని వదిలి ఎన్డీఏలో చేరారు. సీఎం నితీష్ కుమార్ ఆదివారం రాజీనామా చేశారు. అదే రోజు సాయంత్రం ఎన్డీఏ భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. సీఎం నితీశ్ కుమార్, బీజేపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటు జేడీయూ నుంచి చెందిన ప్రేమ్ కుమార్, విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, విజేంద్ర యాదవ్, హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నేత సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో రెండు రోజుల్లో కేబినెట్ విస్తరణ చేపడతామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. బీహార్ కేబినెట్లో గరిష్టంగా 35 మంది మంత్రులకు అవకాశం ఉంది. నితీష్ కుమార్ మినహా మొత్తం ఎనిమిది మంది మంత్రులు ఆదివారం ప్రమాణం చేశారు. నూతన కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నారు. అటు ఓబీసీలను ప్రసన్నం చేసుకోవడమే ఎన్డీఏ లక్ష్యంగా కనిపిస్తోంది. కొత్త కేబినెట్లో భూమిహార్ కమ్యూనిటీ నుండి విజయ్ చౌదరి, విజయ్ సిన్హా, రాజ్‌పుత్ కమ్యూనిటీ నుండి సుమిత్ కుమార్ సింగ్ (స్వతంత్ర) సహా ముగ్గురు అగ్రవర్ణాల మంత్రులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సహా కుర్మీ కులానికి చెందిన జేడీయూ నాయకుడు శ్రవణ్‌కుమార్, మహాదళిత్ సామాజికవర్గానికి చెందిన సంతోష్ కుమార్ సుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్‌లో ఇటీవలి కులాల సర్వే ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో కుర్మీలు 2.8 శాతం ఉన్నారు. ఇదీ చదవండి: Jharkhand: బీహార్‌లో ‘ఆట ముగిసింది’.. జార్ఖండ్‌లో మొదలైంది? -
బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది: తేజస్వీ యాదవ్
పట్నా: బిహార్‌లోని మహా కూటమి నుంచి బయటకు వచ్చి సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ మద్దతుతో మరోసారి బిహార్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. మహాకూటమిలో కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నితీష్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. బీజేపీ-జేడీ(యూ) కూటమి ఏర్పాటుపై తాను మాత్రమే బీజేపీకి శుభాకాంక్షలు తెలుపగలనని అన్నారు. జేడీయూను బీజేపీ కూటమిలో కలుపుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని అన్నారు. నితీష్ కుమార్ అలసిపోయారని.. ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో ఆర్జేడీ పార్టీ అన్ని రకాలకు సహకరించిందని గుర్తుచేశారు. నితీష్‌పై ప్రస్తుతం తాను వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఏం చేయనని అన్నారు. ప్రస్తుతం నితీష్ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో జేడీ(యూ) పూర్తిగా పట్టు కోల్పోవటం ఖాయమని అన్నారు. నితీష్ చేసిన పనికి బిహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. వారు(జేడీయూ) ఏం చేసినా బిహార్ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తేజస్వీ తెలిపారు. చదవండి: ‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’ -
ఊసరవెల్లితో నితీష్ పోటీ పడుతున్నారు.. కాంగ్రెస్ చురకలు
పాట్నా: మహాకూటమిని వీడి బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏతో కలిశారు. ఈ పరిణామంతో సీఎం నితీష్ కుమార్‌పై కాంగ్రెస్ మండిపడింది. నితీష్ కుమార్ ఊసరవెళ్లితో పోటిపడుతున్నారని ఎద్దేవా చేసింది. ' నిత్యం రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్న నితీష్ కుమార్ ఊసరవెళ్లికి పోటీ ఇస్తున్నారు' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. ప్రజల మనోభావాలను నితీష్ దెబ్బతీశారని అన్నారు. ఈ మోసానికి నితీష్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ, జేడీయూ సహా ఇతర పార్టీల సహకారంతో నితీష్ కుమార్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సీఎంగా నితీష్ ఈ రోజు సాయంత్రం మళ్లీ ప్రమాణం చేయనున్నారు. बार-बार राजनीतिक साझेदार बदलने वाले नीतीश कुमार रंग बदलने में गिरगिटों को कड़ी टक्कर दे रहे हैं। इस विश्वासघात के विशेषज्ञ और उन्हें इशारों पर नचाने वालों को बिहार की जनता माफ़ नहीं करेगी। बिलकुल साफ़ है की भारत जोड़ो न्याय यात्रा से प्रधानमंत्री और भाजपा घबराए हुए हैं और उससे… https://t.co/v47tQ8ykaw — Jairam Ramesh (@Jairam_Ramesh) January 28, 2024 బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. మళ్లీ మహా కూటమిని విడిచి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
నితీష్‌పై కాంగ్రెస్ ఫైర్
పాట్నా: బీహార్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ను వీడి సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్‌పై కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరితో వివాహం.. మరొకరితో సంబంధం కలిగి ఉండటం నితీష్‌కి బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. "ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకరితో వివాహం మరొకరితో సంబంధం. ఇది నితీష్ కుమార్ స్వభావంగా మారింది" అని ట్వీట్టర్లో కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ పేర్కొన్నారు. నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. మళ్లీ మహా కూటమిని విడిచి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్
పాట్నా: మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవని.. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నరగా మహా కూటమి ప్రభుత్వం సరిగ్గా ముందుకు వెళ్ళలేక పోయిందని నితీష్ కుమార్ అన్నారు. గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితో వెళ్లాలని అనుకుంటున్నామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నితీష్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. బీజేపీతో చేతులు కలిపి నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అటు.. బీజేపీ ఇటు జేడీయూలు తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. ఇదీ చదవండి: Bihar political crisis: ఇలా రాజీనామా, అలా ప్రమాణం! -
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
అప్డేట్స్.. ► బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్ కుమార్ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇద్దరు బీజేపీ పార్టీకి చెందిన నేతలు విజయ్ సిన్హా, సామ్రాట్ చౌదరీ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేస్తారు. వీరితో పాటు ఓబీసీ-ఈబీసీ సమీకరణాల్లో భాగంగా మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ► బిహార్ రాజకీయాలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వీరు ముగ్గురు బిహార్ ప్రజలకు ద్రోహం చేశారు. మరీ ముఖ్యంగా నితీష్ కుమార్ అయితే పలు సార్లు బిహార్ ప్రజలను మోసం చేశారు. రాజకీయ ఆవకాశవాదంలో నితీష్ రికార్డులు బద్దలు కొట్టారు. #WATCH | Hyderabad: On JDU President Nitish Kumar's resignation as Bihar CM, AIMIM chief Asaduddin Owaisi says, "Nitish Kumar, Tesjaswi Yadav, PM Modi should apologise to the people of Bihar... All three have betrayed the people of Bihar, especially Nitish Kumar... The term… pic.twitter.com/7mOeAokcCK — ANI (@ANI) January 28, 2024 ► బీజేపీతో నితీష్ కుమార్ చేతులు కలిపి ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు వేడుక చేసుకుంటున్నాయి. కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. #WATCH | BJP workers celebrate in Bihar's Patna after Nitish Kumar & BJP stake claim to form the govt in the state#BiharPolitics pic.twitter.com/KXhk41r2Hd — ANI (@ANI) January 28, 2024 ► సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ కూటమిలో చేరనున్నందుకు అభినందనలు తెలిపారు. ► బిహార్‌లో రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి మాట్లాడారు. తన జీవిత కాలంలో సాధించిన అరుదైన సందర్భంగా అభివర్ణించారు. #WATCH | Patna | After being elected as the Leader of the Legislative Party, state BJP chief Samrat Chaudhary says, "BJP did a historic thing for my life...This is an emotional moment for me to have been elected as the Leader of the Legislative Party to be a part of the… pic.twitter.com/NYq6GKp8Ht — ANI (@ANI) January 28, 2024 ► బీజేపీ, జేడీయూలతో కలిపి బిహార్‌లో ఎన్జీడే ప్రభుత్వం ఏర్పడటానికి రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. #WATCH | Patna | Bihar MLAs unanimously passed the proposal to form the NDA government in the state with BJP, JD(U) and other allies. Samrat Chaudhary has been elected as the Leader of the legislative party, Vijay Sinha elected as the Deputy Leader. pic.twitter.com/N9kFWHkYYz — ANI (@ANI) January 28, 2024 ► నితీష్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇది జరుగుతుందని తనకు ముందే తెలుసని అన్నారు. "Knew it would happen," says Mallikarjun Kharge on Nitish Kumar's exit from Mahagathbandhan Read @ANI Story | https://t.co/dPQbzR6iHf#MallikarjunKharge #NitishKumar #INDIAAlliance pic.twitter.com/OS1uIyP2MZ — ANI Digital (@ani_digital) January 28, 2024 ► మహాకూటమిలో పరిస్థితిలు సరిగా లేవని నితీష్ కుమార్ చెప్పారు. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని అన్నారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. గవర్నర్‌కు లేఖ సమర్పించానని స్పష్టం చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. #WATCH | Patna | Bihar outgoing CM and JD(U) president Nitish Kumar says, "Today, I have resigned as the Chief Minister and I have also told the Governor to dissolve the government in the state. This situation came because not everything was alright...I was getting views from… pic.twitter.com/wOVGFJSKKH — ANI (@ANI) January 28, 2024 ► బీహార్, పాట్నాలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. #UPDATE | The BJP legislative party meeting in Patna, Bihar concludes. — ANI (@ANI) January 28, 2024 ► బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్చించారు. దీంతో జేడీయూ - ఆర్జేడీ ప్రభుత్వం కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ-జేడీయూ నేతృత్వంలో సీఎంగా నితీష్ మళ్లీ ప్రమాణం చేయనున్నారు. Nitish Kumar tendered his resignation as the Chief Minister of Bihar to Governor Rajendra Arlekar. The Governor accepted the resignation and deputed him as the Acting CM. pic.twitter.com/uaDXROe6PA — ANI (@ANI) January 28, 2024 ► బిహార్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీల పెద్దలు తమ వర్గం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పెద్దలు సమావేశం ప్రారంభించారు. #WATCH | A meeting of Bihar BJP MLAs and leaders of the party is underway at the party office in Patna, amid political developments in the state. The legislative party meeting is underway here pic.twitter.com/LoRdSg0ojL — ANI (@ANI) January 28, 2024 ► పార్టీ ఎమ్మెల్యేలతో నేడు పాట్నాలో జరగనున్న సమావేశానికి బిహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి హాజరయ్యారు. #WATCH | BJP Bihar President Samrat Chaudhary arrives at the party office in Patna for a meeting of the party MLAs. pic.twitter.com/dGK51tU2UM — ANI (@ANI) January 28, 2024 ► పాట్నాలోని పార్టీ కార్యాలయానికి బిహార్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ హాజరయ్యారు. #WATCH | Former Bihar BJP president Sanjay Jaiswal arrives at the party office in Patna, for a meeting of party leaders here. On speculations around Nitish Kumar, he says, "...The most important goal of the state working committee is to line up the preparations for the next one… pic.twitter.com/6TiiflXzKk — ANI (@ANI) January 28, 2024 ► సీఎం నితీష్ కుమార్ ఇంటికి జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ వచ్చారు. కేవలం తమను రమ్మని మాత్రమే పిలిచినట్లు ఆయన చెప్పారు. తదుపరి పరిణామాలు తెలియదని అన్నారు. #WATCH | Patna, Bihar | JD(U) MP Kaushalendra Kumar arrives at the residence of CM Nitish Kumar; he says, "...We have been called, so we have come here..."#BiharPolitics pic.twitter.com/kFfPCWn99I — ANI (@ANI) January 28, 2024 ► బిహార్‌లో రాజకీయ మార్పులు రసవత్తరంగా ఉన్నాయి. పాట్నాలో పార్టీ కార్యాలయానికి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ నిత్యానంద రాయ్ బయలుదేరారు. #WATCH | Bihar | Union Minister and BJP MP Nityanand Rai arrives at the state party office in Patna for a meeting, amid political developments in the state. pic.twitter.com/DlN3rFF2tk — ANI (@ANI) January 28, 2024 ► పాట్నాలోని పార్టీ కార్యాలయానికి బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ బయలుదేరారు. #WATCH | Bihar | BJP MP Ravi Shankar Prasad arrives at the state party office in Patna for a meeting, amid political developments in the state. pic.twitter.com/9h2MUApSvg — ANI (@ANI) January 28, 2024 ►పార్టీ శాసనసభ్యుల భేటీకి హాజరవుతున్నట్లు బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే తార్కిషోర్ ప్రసాద్ తెలిపారు. అజెండా పూర్తిగా తనకు తెలియదని చెప్పారు. రావాలని చెప్పారు.. కాబట్టి తాము వస్తున్నట్లు చెప్పారు. #WATCH | Patna | Former Bihar Deputy CM and BJP MLA Tarkishore Prasad says, "A legislative party meeting has been called and we have come here for that. The agenda is not clear. We have been told to come, so we have come..." On political developments in the state, he says, "The… pic.twitter.com/AVUbdtiYeg — ANI (@ANI) January 28, 2024 ►బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు రాజీనామా చేయనున్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కనిపిస్తోంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్‌లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే -
బిహార్‌లో ఆసక్తికరంగా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
పట్నా: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహా కూటమి నుంచి వైదొలిగి బీజేపీలో చేరి.. మళ్లీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి బిహార్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా జేడీ(యూ), ఆర్జేడీ పార్టీల్లో జరగుతున్న చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు నితీష కుమార్ పార్టీ జేడీ(యూ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మందితో జేడీయూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో 13 మందిని లాగేందుకు ఆర్జేడీ అధినేత లాలూ సైతం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా పట్నాలో అందుబాటులో ఉండాలని లాలూ ఆదేశించారు. నితీష్ కుమార్ మహా కూటమిని మారే సమయంలో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శనివారం రాత్రి 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ చర్చలు జరపనున్నారు. అయితే ఈ రాత్రికి నితీష్ సీఎంగా రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ మద్దతుతో రేపు(ఆదివారం) మరోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలో పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు బిహార్ వెళ్లనున్నారు. ఆదివారం పట్నాలో బీజేపీ ఎమ్మెల్యేలతో వారు సమావేశం కానున్నారు. చదవండి: ‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’ -
Bihar Politics: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా నేడు?
పాట్నా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడేక్కాయి. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీ వైపు జేడీయూ అధినేత నితీష్ కుమార్ అడుగులు వేయన్నుట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. నేడు సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసే అవకాశం ఉంది. జేడీయూ నిష్క్రమణతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణ కూటమి కుప్పలిపోయే సూచనలు కనిపిస్తన్నాయి. ఇప్పటికే నితీష్ కోసం అవసరమైతే తలుపులు తెరుస్తామని బీజేపీ నేతలు వెల్లడించారు. ఆదివారమే సీఎం.. గవర్నర్‌ను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీతో కలిసి నితీష్ ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయనే సీఎంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోసారి సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోదీ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే చాన్స్ ఉంది. జేడీయూ నేతలతో నితీష్ భేటీ తాజా పరిణామాల నేపథ్యంలో నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానున్నారు. ఇటు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఆర్జేడీ కీలక నేతలు సమావేశం కానున్నారు. అదే సమయంలో పూర్ణియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్‌కుమార్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో నేడు జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడం, పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీష్‌కు సోనియా ఫోన్.. నితీష్ బీజేపీతో చేతులు కలిపితే విపక్ష ‘ఇండియా’ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ఊహాగానాల వేళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నితీశ్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో మాట్లాడేందుకు సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఈ నెల 30న బిహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనాలని సోనియా గాంధీ శుక్రవారం ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆ కాల్స్‌ను సీఎం పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చదవండి: Nitish Kumar: నితీశ్ కొత్త అవతారం! -
బిహార్ పాలిటిక్స్.. నితీశ్ సర్కారు కీలక నిర్ణయం
పాట్నా: బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారిన వేళ నితీశ్‌కుమార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఆల్ ఇండియా సర్వీసు అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రాబోతోందని స్పష్టమైన సంకేతాలిచ్చినట్లయింది. రాష్ట్రంలో మొత్తం 22 మంది ఐఏఎస్, 79 మంది ఐపీఎస్, 45 మంది గ్రూప్ 1 స్థాయి అధికారులను నితీశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో అయిదుగురు జిల్లా కలెక్టర్లుండగా 17 మంది జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)లు ఉన్నారు. పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను సీఎంవో స్పెషల్ సెక్రటరీగా నియమించారు. కాగా, జనతాదళ్ యునైటెడ్ చీఫ్, సీఎం నితీశ్‌కుమార్ ఆర్జేడీని వదిలి బీజేపీతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నితీశ్ తన సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కూటమి కట్టి తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు జరగడం నితీశ్ కూటమి మార్చడం ఖాయమన్న వాదనకు ఊతమిస్తోంది. ఇదీచదవండి.. నితీశ్ కొత్త అవతారం -
బిహార్‌లో పతనం దిశగా మహాకూటమి సర్కార్
పాట్నా: బిహార్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం నితీష్ కుమార్ ఉన్నారని సమాచారం. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో నితీష్ కుమార్ తీరుపై లాలూ కుమార్తె రోహిణి ఫైర్ అయ్యారు. నితీష్ కుమార్ పచ్చి అవకాశవాది అంటూ ట్వీట్ చేశారు. దీంతో మాహా కూటమిలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు బయటకొచ్చాయి. బిహార్ రాజకీయ క్షేత్రంలో కీలక మలుపులు చోటుచేసుకోబోతున్నాయి. బిహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి బీజేపీతో కలిసిపోనున్నారని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మహాకూటమి(మహాగత్బంధన్) నుంచి వైదొలగనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇండియా కూటమికి అతిపెద్ద షాక్ తగలనుంది. నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. అనుమానాలకు ఆజ్యం.. దివంగత సీఎం కర్పూరీ రాకూర్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారత రత్న ప్రకటించడాన్ని నితీష్ ప్రభుత్వం స్వాగతించింది. అంతేకాకుండా వంశపారంపర్య రాజకీయాలను ఎత్తిచూపుతూ ఆర్జేడీ టార్గెట్‌గా నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్పూరీ ఠాకూర్ చూపిన మార్గంలోనే తమ పార్టీ పయనిస్తోందని నితీష్ పేర్కొన్నారు. కొన్ని పార్టీలు తమ వారసులకు రాజకీయ భవిష్యత్ కోసం పోరాడుతారని విమర్శించారు. నితీష్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత లాలూ కుమార్ కుమార్తె రోహిణీ ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈ పరిణామాలు బీజేపీ వైపు నితీష్ కుమార్ అడుగులు పడుతున్నాయనడానికి అనుమానాలను పెంచుతున్నాయి. జోడో యాత్రలో జాయిన్ కాము.. అటు.. జనవరి 30న బిహార్‌లో ప్రవేశించే కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో నితీష్ కుమార్ హాజరుకాబోరని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ ద్వారా నిన్న సాయంత్రం ఆహ్వానం అందిందని.. అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల చర్చల్లో జాప్యం జరగడంతో నితీష్ కుమార్ కలత చెందారని వెల్లడించాయి. ఇదీ చదవండి: నితీష్ కుమార్‌పై లాలూ కూతురు ఫైర్ -
నితీష్ కుమార్‌పై లాలూ కూతురు ఫైర్
పాట్నా: బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వంశపారంపర్య రాజకీయాలపై సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషికి గాను కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ప్రభుత్వ చర్యను స్వాగతించిన నితీష్ కుమార్.. కర్పూరి ఠాకూర్ తన కుటుంబ సభ్యులను పార్టీలో ఎన్నడూ తీసుకురాలేదని చెప్పారు. దివంగత నేత చూపిన బాటలోనే తమ పార్టీ పయనించిందని నితీష్ కుమార్ అన్నారు. జేడీయూ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. బీహార్‌లోని మహాకూటమి (మహాగత్బంధన్) ప్రభుత్వంలో జేడీయూకి మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీని ఉద్దేశించి పరోక్షంగా నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆర్జేడీ నేత లాలూ కుమార్తె ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నితీష్ కుమార్ పేరును ప్రస్తావించనప్పటికీ.. అర్హత లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏం ప్రయోజనం? ఒకరి ఉద్దేశ్యంలో మోసం ఉన్నప్పుడు ఆ పద్ధతిని ఎవరు ప్రశ్నించగలరు? అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. ఇదీ చదవండి: అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ -
‘ఆ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షలు’
హిందూ దేవుళ్లపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్‌లో కలకలం రేపాయి. ఈ నేపధ్యంలో శివ భవానీ సేన అనే హిందూ సంస్థ సదరు ఆర్జేడీ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షల రివార్డును అందజేస్తామంటూ పోస్టర్లను అతికించింది. పాట్నాలోని బీహార్ శాసనసభ సభ్యుల ఫ్లాట్ల దగ్గర ‘శివ భవానీ సేన’ ఆర్జేడీ ఎమ్మెల్యేకు సంబంధించిన పోస్టర్‌ను అతికించింది. అందులో ఈ రివార్డ్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బహదూర్ సింగ్ స్పందిస్తూ ‘శివ భవానీ సేన’పై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటన చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాశానని తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ పేరుతో పలు గోడలపై కొన్ని చోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేను చెప్పిన మాటను ఉదహరిస్తూ.. ‘ఆలయం అంటే మానసిక బానిసత్వానికి మార్గం, పాఠశాల అంటే జీవితంలో వెలుగుల మార్గం’ అని రాసివుంది. ఇది గుడి గంట మోగిస్తే మనం మూఢనమ్మకాలు, మూర్ఖత్వం, అజ్ఞానం వైపు పయనిస్తున్నామని, బడి గంట మోగిస్తే హేతుబద్ధమైన జ్ఞానం, శాస్త్రీయత, వెలుగుల వైపు పయనిస్తున్నామనే సందేశం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకోండి’ అని దానిలో రాసివుంది. కాగా ఆ పోస్టర్లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఫొటోలు ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ గురించి పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హిందూ శివ భవానీ సేన ఈ ప్రకటనను తప్పుబట్టింది. ఆ సంస్థ అధ్యక్షుడు లవ్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ వ్యాఖ్యలు చేశారని, అతని నాలుకను తెగ్గోసినవారికి రూ. 10 లక్షలు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు. ఫతే బహదూర్ సింగ్ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. -
తేజస్వీకి ఈడీ తాజా సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నకాలంలో కొందరి భూములు రాయించుకుని వారికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు పాత్ర ఉందంటూ ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. జనవరి ఐదో తేదీన తమ ఆఫీస్‌కు రావాలని తేజస్వీకి సూచించింది. డిసెంబర్ 22వ తేదీనే రావాలని గతంలో సమన్లు జారీచేయగా ఆయన రాలేదు. దీంతో మళ్లీ సమన్లు ఇచ్చారు. ఇదే కేసులో డిసెంబర్ 27వ తేదీన హాజరుకావాలని లాలూకు సైతం ఈడీ సమన్లు పంపడం తెల్సిందే. ‘ సమన్లలో కొత్తదనం ఏదీలేదు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈడీ ఆఫీస్కెళ్లాను. ఇదో రోటీన్ పనిలా తయారైంది’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు. యూపీఏ–1 హయాంలో 2004– 2009 కాలంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో కొందరికి వేర్వేరు రైల్వేజోన్లలో గ్రూప్–డీ ఉద్యోగాలిచ్చి, లాలూ కుటుంబసభ్యుల, వారికి చెందిన ఏకే ఇన్ఫోసిస్టమ్స్ సంస్థ పేరు మీదకు ఆ లబ్దిదారుల భూములను బదలాయించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న అమిత్ కాత్యాల్‌ను ఈడీ ఇటీవల అరెస్ట్‌చేసింది. ఈ సంస్థ రిజి్రస్టేషన్ అడ్రస్‌లో ఉన్న ఇల్లు లాలూదేనని ఈడీ పేర్కొంది. లబి్ధదారుల భూముల బదలాయింపు సంస్థలోకి జరిగాక ఆ వాటాలను 2014 ఏడాదిలో లాలూ కుటుంబసభ్యుల పేరు మీదకు బదిలీచేశారని ఈడీ చెబుతోంది. ఈ ఉదంతంపై గతంలో సీబీఐ నమోదుచేసిన కేసును ఆధారంగా చేసుకుని ఈడీ కొత్తగా కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తోంది. -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ విలీనం!
జనతాదళ్ యునైటెడ్ జేడీ(యూ), రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీలు త్వరలో విలీనం అవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(యూ)అధినేత, సీఎం నితీష్ కుమార్.. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల పంపిణీపై పట్టబడుతున్నారన్న మీడియా ప్రశ్నకు కేంద్రమంత్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పలు వ్యక్తిగత సమీకరణాలు పంచుకున్నా. ఆయన కూడా చాలా విషయాలు నాకు చెప్పారు. అయితే వాటిని మీడియా ముందు ప్రజలకు వెల్లడించడం సరికాదు. కానీ, మీకు నేను ఒకటి చెప్పగలను. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయి. అప్పడు ఇండియా కూటమిలో సీట్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు’ అని అన్నారు. అయితే గురవారం పార్లమెంట్ సమావేశాలు ముగించుకొని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఇడియా కూటమి సమావేశం అనంతరం లలూ ప్రసాద్ ఇరువురు ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పట్నాకు ప్రయాణం చేశారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎం ఉన్న తన కుమారు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసే సమయం ఆసన్నమైందని లాలూప్రసాద్.. తనతో చెప్పాడని కేంద్ర మంత్రి గిరిరాజ్ అన్నారు. కేంద్ర మంత్రి ‘విలీనం’ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అసాధారణమైన వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకి ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని ఉంటుంది. ఆయన్ను ఎవరు గుర్తించరు కావును అసాధారణ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’ అని మండిపడ్డారు. చదవండి: Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్ -
JDU: జేడీయూ అధినేతగా మళ్లీ నితీశ్!
పాట్నా: బీహార్ అధికార పార్టీ జనతా దళ్(యునైటెడ్) పగ్గాల్ని మళ్లీ ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందుకోబోతున్నారా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మరో వారంలోగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జేడీయూ చీఫ్‌గా రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ ఉన్నారు. అయితే తప్పించే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నితీశ్ కుమార్‌నే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు సీనియర్లు కోరుతున్నారట. ఈ క్రమంలో.. ఢిల్లీలో డిసెంబర్ 29వ తేదీన జరగబోయే పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాలన్ సింగ్ తొలగింపు ఎందుకంటే.. జేడీయూ చీఫ్‌గా లాలన్ సింగ్‌ను తొలగించేందుకు కారణం లేకపోలేదు. లాలన్ గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామంపై అసంతృప్తితో రగిలిపోతున్న నితీశ్.. ఆయన్ని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. జనతా దళ్ యునైటెడ్ ఏర్పడిన తొలినాళ్లలో శరద్ యాదవ్ వ్యవస్థాప అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై నితీశ్ కుమార్ 2016 నుంచి 2020 దాకా, 2020-21 మధ్య రామచంద్ర ప్రసాద్ సింగ్, లాలన్ సింగ్ 2021 నుంచి జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఆర్జేడీతో వైరం.. మైత్రి.. గ్యాప్ జనతా పార్టీ చీలికతో.. ఒకవైపు కర్ణాటకలో హెచ్డీ దేవె గౌడ జనతా దళ్(సెక్యులర్), నార్త్ బెల్ట్‌లో బీహార్ నుంచి శరద్ యాదవ్ నేతృత్వంలో జనతా దళ్(యునైటెడ్) ఏర్పాడ్డాయి. అప్పటికే జార్జి ఫెర్నాండేజ్, నితీశ్ కుమార్‌లు సమతా పార్టీని స్థాపించారు. సమతా పార్టీని 2003 అక్టోబర్ 30న జనతా దళ్‌లో విలీనం చేశారు. మరో పార్టీ లోక్ శక్తి కూడా ఇందులో చేరింది. అప్పుడు అధికారంలో రాష్ట్రీయ జనతా దళ్ ఉండగా.. ప్రతిపక్ష కూటమిగా జేడీయూ కొనసాగింది. అయితే.. బీజేపీతో కటీఫ్ ప్రకటించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎంతో పొత్తుగా వెళ్లింది జేడీయూ. నలభై సీట్లలో కేవలం రెండే సీట్లు నెగ్గింది. ఓటమికి నైతిక బాధత్య వహిస్తూ నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జతిన్ రామ్ మాంఝీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ టైంలో బీజేపీ అధికార పక్షాన్ని బలపరీక్షకు ఆహ్వానించగా.. ఆర్జేడీ సాయంతోనే జేడీయూ ప్రభుత్వం నెగ్గడం గమనార్హం. ఆ తర్వాత 2015లో జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు కూటమిగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకున్నప్పటికీ.. ఎస్పీ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో పొత్తుగా వెళ్లి ఎన్నికల్లో నెగ్గాయి. బీజేపీతో జేడీయూ దోస్తీ-కటీఫ్ల నడుమ.. జేడీయూ-ఆర్జేడీల మైత్రి కూడా పడుతూ లేస్తూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా విజయం సాధించి ప్రభుత్వంలో ఆర్జేడీ కూడా భాగమైంది. అయితే.. మధ్య మధ్యలో కీలక నేతల నడుమ లుకలుకలు బయటపడుతూనే వస్తున్నాయి. ఇండియా కూటమి సమావేశాలు కొనసాగుతున్న వేళ.. జేడీయూ-ఆర్జేడీల మధ్య ఆగాథం మరింత పెరుగుతూ వస్తోంది. -
నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్‌ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్‌పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్‌ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు -
నియంతృత్వ శక్తులను ఓడిద్దాం: తేజస్వీ యాదవ్
పట్నా: దేశంలోని నియంతృత్వ శక్తులను ఓడిద్దామని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పరోక్షంగా విమర్శించారు. పట్నాలో శుక్రవారం విపక్ష పార్టీల భేటీపై శనివారం బిహార్ డెప్యూటీ సీఎం అయిన తేజస్వీ స్పందించారు. ‘ కన్యాకుమారి నుంచి కశీ్మర్దాకా నేతలంతా నియంతృత్వ శక్తులను ఓడిద్దామని విపక్షాలభేటీలో ప్రతినబూనారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోదీ గురించో మరే ఇతర వ్యక్తి గురించో కాదు. ప్రజా సంక్షేమం గురించి. విపక్షాల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై వచ్చేనెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ తొలి అడుగు పడింది. గతంలో చరిత్రాత్మక చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాలు బిహార్ నుంచే మొదలయ్యాయి ’ అని అన్నారు. ‘ సమావేశంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రతీ అంశాన్ని సామరస్యపూర్వక పరిష్కారం కోసమే స్వీకరించి చర్చించాం’ అని చెప్పారు. ఢిల్లీలో పరిపాలన సేవలపై కేంద్రం తెచి్చన ఆర్డినెన్స్‌లో కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిరాకరిస్తుండటంతో శుక్రవారం భేటీ తర్వాత సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొనకుండానే కేజ్రీవాల్ ఢిల్లీకి వెనుతిరిగారు. ఈ విషయంపైనే తేజస్వీపైవిధంగా స్పందించారు. విపక్షాల భేటీని బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫొటో సెషన్‌గా పేర్కొంటూ విమర్శించడంపై తేజస్వీ స్పందించారు. ‘ ఫొటో సెషన్ అంటే ఏమిటో వారికే బాగా తెలుసునన్నారు. -
రామాయణంపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ సీరియస్
పాట్నా: రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాపై ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని.. హిందువులకు పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ హిందూసేన అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉండగా.. రామాయణంపై ఆర్జేడీ ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాయణాన్ని మసీదులో రాశారని దనపూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే యాదవ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా దుమారం రేపుతున్నాయి. ఇక, యాదవ్ వ్యాఖ్యలపై జేడీ(యూ) స్పందించింది. యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని భాగస్వామ్య పార్టీ జేడీ(యూ) పేర్కొంది. యాదవ్ అంతటితో ఆగకుండా 11 ఏండ్ల ముస్లిం బాలిక భగవద్గీతను పఠించి మెడల్‌ను గెలుచుకున్నప్పుడు హిందుత్వవాదులు నోరుమెదపలేదని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలెవరూ ఎందుకు ప్రస్తావించలేదని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. మరోవైపు.. యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. रामचरित मानस मस्जिद में लिखी गई थी, इतिहास उठाकर देखिए," RJD के विधायक रीतलाल यादव का बयान। #RitlalYadav #Ramcharitmanas pic.twitter.com/Cl1JxDlDjK — The Hint News (@TheHintNews) June 16, 2023 ఇది కూడా చదవండి: పొలిటికల్ స్టంట్.. కాంగ్రెస్‌కు బిగ్ ఆఫరిచ్చిన ఆప్ -
కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ మండిపాటు
-
పార్లమెంట్ భవనంపై ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్.. మండిపడ్డ ఓవైసీ
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్‌పై మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లీమీన్ (ఎమ్ఐఎమ్)నేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడాన్ని తప్పుబట్టారు. ఈ రకమైన పోలికలు అవసరమా అని ప్రశ్నించారు. ప్రధాని కాకుండా స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగుంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. 'ఆర్జేడీకి నిర్దిష్టమైన అభిప్రాయమే ఉండదు. సెక్యులరిజమ్ గురించి మాట్లాడుతుంది.. బీజేపీతో స్నేహం చేసి బయటికి వచ్చిన నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేస్తుంది. పాత పార్లమెంట్‌కు కనీసం అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు కూడా లేవు. అలాంటప్పుడు కొత్త పార్లమెంట్‌ను సమాదితో ఎందుకు పోల్చుతారు. ఈ రకమైన పోలికలు అవసరమా' అని ఆర్జేడీపై ఓవైసీ ఫైరయ్యారు. పీఎం ప్రధాని నరేంద్ర మోదీ తప్ప ఇంకా ఎవరూ ఈ పని చేయలేరన్నట్లు ప్రవర్తిస్తారని ఓవైసీ విమర్శించారు. 2014కు ముందు దేశంలో ఏం జరగనట్లు.. ప్రస్తుతం మాత్రమే అంతా జరుగుతున్నట్లు ప్రధాని ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తారని ఆరోపించారు. ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్: పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. ఇదీ చదవండి:పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం.. ఇది నిజంగా అప్రతిష్ట: రాహుల్ -
కొత్త పార్లమెంట్ భవనంపై ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్
-
కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంపై పెను రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు బైకాట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే సరిగ్గా పార్లమెంట్ ప్రారంభోత్సవ వేళ.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలు యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చేసిన ట్వీట్ పెను వివాదాని దారితీసింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆర్జేడీ. ఈ భవనం శవపేటిక మాదిరిగా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ ఆర్జేడీ పార్టీ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేసింది. వాస్తవానికి పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, చర్చల వేదిక కానీ దాన్ని బీజేపీ అవమానపర్చిలే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది ఆర్జేడీ. దీంతో ఈ ట్వీట్‌పై స్పందించిన బీజేపీ నేత సుశీల్ మోదీ ఇలా పార్లమెంట్ కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలంటూ మండిపడ్డారు. మరో బీజేపీ నేత దుష్యంత్ గౌతమ్ ఇలాంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అన్నారు. కొత్త పార్లమెంట్‌ని శవపేటికతో పోల్చారు, పాత భవనాన్ని జీరోతో పోల్చారా? ఎందుకంటే మనం అప్పుడూ జీరోలానే కూర్చొన్నాం కదా అని చురకలంటించారు. ఇదిలా ఉండగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో అవమానకరంగా లిఖించబుడుతుందని విమర్శించారు. కాగా, ఈ పరిణామాలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయా నాయకులెవరూ ఆ కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టకుండా రాజీనామే చేయడమే ఉత్తమమని గట్టి కౌంటరిచ్చింది. ये क्या है? pic.twitter.com/9NF9iSqh4L — Rashtriya Janata Dal (@RJDforIndia) May 28, 2023 (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ కీలక నిర్ణయం.. సమైక్యంగా ఎన్నికలకు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ఏడాదే ఉన్న నేపథ్యంలో విపక్షాల ఐక్యత దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. బిహార్‌లో అధికారంలో ఉన్న మహాఘట్బంధన్ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్య నేతల మధ్య బుధవారం కీలక సమావేశం జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీని కలసికట్టుగా ఎదుర్కోవడంతో పాటు పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. అనంతరం నేతలంతా సంయుక్తంగా మీడియా ముందుకొచ్చారు. విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న మీడియా ప్రశ్నలకు మాత్రం నేతలు సమాధానం దాటవేశారు.మోదీ మేజిక్‌ను ఎదర్కోవడానికి ఒక ఉమ్మడి నాయకున్ని ప్రకటించే ఎన్నికల బరిలో దిగడం మేలని విపక్ష నేతల్లో కొందరంటుండగా అది అంతిమంగా తమకే చేటు చేయవచ్చని మరికొందరు భావిస్తుండటమే దీనికి కారణమని చెబుతున్నారు. కీలక ముందడుగు: రాహుల్ తమ భేటీని చరిత్రాత్మక సమావేశంగా రాహుల్ అభివర్ణించారు. ‘‘ఈ భేటీ విపక్షాల ఐక్యత దిశగా కీలక ముందడుగు. ఎన్నో అంశాలపై చర్చించుకున్నాం. అన్ని పార్టీలనూ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి లోక్‌సభ ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పట్నుంచే అందరమూ ఆ దిశగా పని చేస్తాం. మాది సైద్ధాంతిక పోరాటం. విపక్షాల ఉమ్మడి విజన్‌ను త్వరలో ప్రజల ముందుంచనున్నాం’’ అని వెల్లడించారు. ఎన్ని విపక్షాలు కలిసి రానున్నాయని ప్రశ్నించగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలింకా కొనసాగుతున్నాయని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఒక్కటిగా నిలబడ్డాం. దేశం కోసం ఒక్కటిగా పోరాడతాం’’ అంటూ అనంతరం ట్వీట్ చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశానికి నూతన దిశానిర్దేశం చేసేందుకు కలసికట్టుగా సాగుతామని ఖర్గే ప్రకటించారు. నితీశ్, తేజస్వి తదితరులతో భేటీ చాలా బాగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది తొలి సమావేశం. ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్‌సింగ్, బిహార్పీసీసీ చీఫ్ అఖిలేశ్ ప్రసాద్‌సింగ్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా మున్ముందు మరిన్ని విపక్షాలతో ఖర్గే భేటీ కానున్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తదితరులతో ఇటీవలే ఆయన సమావేశమై చర్చించారు. ఇటీవలే ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో 19 విపక్షాలు సమైక్యంగా నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనడం తెలిసిందే. పార్టీలన్నింటినీ కలుపుకుంటాం: నితీశ్ దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుని పోయేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామని నితీశ్ ప్రకటించారు. ‘‘అంతా కలిసి పని చేయాలని భేటీలో నిర్ణయం తీసుకున్నాం. అందుకోసం అందరమూ కూర్చుని మాట్లాడుకుంటాం. భావి కార్యాచరణను నిర్ణయించుకుంటాం. అది త్వరలోనే జరుగుతుంది. ఆ దిశగా ముందుకు సాగనున్నాం’’ అని వెల్లడించారు. విపక్షాల ఐక్యతను సాధించే కీలక శక్తిగా నితీశ్ నిలవనున్నారంటూ జేడీ(యూ) ట్వీట్ చేసింది. నితీశ్‌కు పూర్తి మద్దతు: కేజ్రీవాల్ కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం నితీశ్, తేజస్వీ బుధవారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తర్వాత కేజ్రీ మీడియాతో మాట్లాడారు. విపక్షాల సమీకరణకు నితీశ్ ప్రయత్నాలను ప్రశంసించారు. వాటికి తన పూర్తి మద్దతుంటుందని ప్రకటించారు. ‘‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కేంద్రంలో ప్రస్తుతమున్నది బహుశా దేశ చరిత్రలోనే అత్యంత అవినీతిమయ ప్రభుత్వం! దాని దెబ్బకు సామాన్యుని బతుకు దుర్భరంగా మారింది. బీజేపీ సర్కారుపై విపక్షాలన్నీ సమైక్యంగా పోరాడి దాన్ని కూలదోయడం అత్యవసరం’’ అని అభిప్రాయపడ్డారు. నితీశ్‌ను ప్రధాని అభ్యరి్థగా భావిస్తున్నారా అని ప్రశ్నించగా, కేవలం ఒక్క భేటీతో ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేమని కేజ్రీవాల్ అన్నారు. గురు, శుక్రవారాల్లో మరికొందరు విపక్ష నేతలతో కూడా నితీశ్ భేటీ అవుతారని సమాచారం. మంగళవారం ఆయన ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్‌తోనూ సమావేశమయ్యారు. బందిపోట్ల కూటమి: బీజేపీ కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ నేతల భేటీని రాజకీయ గిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. ‘‘అదో బందిపోట్ల కూటమి. నిండా అవినీతిలో కూరుకుపోయిన వాళ్లంతా చట్టం బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలివి. ఇలాంటి విన్యాసాలతో వారి అవినీతి దాగబోదు’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. 2014, 2019 ఎన్నికల్లో వారిని ప్రజలు వరుసగా తిరస్కరించారన్నారు. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని, మోదీ సారథ్యంలో బీజేపీ ఘనవిజయం ఖాయమని జోస్యం చెప్పారు VIDEO | Bihar CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav meet Congress leader Rahul Gandhi at party president Mallikarjun Kharge's residence in Delhi pic.twitter.com/11bSWF2A5J — Press Trust of India (@PTI_News) April 12, 2023 -
ఈడీ ఎదుట విచారణకు హాజరైన తేజస్వీ యాదవ్..
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను అధికారులు ప్రశ్నించారు. ఊదయం 10:45 గంటల సమయంలో తేజస్వీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ కూడా తేజస్విని గత నెలలోనే ప్రశ్నించింది. తనను అరెస్టు చేయబోమని సీబీఐ ఢిల్లీ కోర్టుకు చెప్పడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ కుటుంబసభ్యులను కూడా ఈడీ విచారించింది. మార్చి 25న తేజస్వీ సోదరి, ఎంపీ మిసా భారతిని కూడా ప్రశ్నించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కొందరి వద్ద భూములు తీసుకొని రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. దీన్నే జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంగా పిలుస్తున్నారు. ఈ స్కాం ద్వారా పొందిన ఆస్తుల విలువ ఇప్పుడు రూ.600 కోట్లకుపైనే ఉందని ఈడీ చెబుతోంది. మరోవైపు తేజస్వీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. చదవండి: సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్‌కు షాక్.. తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి లైన్ క్లియర్.. -
'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్‌ను మార్చుకోండి'
పాట్నా: జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు చేసిన ముడు రోజలు తర్వాత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల నగదు, బంగారు ఆభరణాలు సీజ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ స్కాం ద్వారా పొందిన రూ.600 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు ఈడీ చేసిన ప్రకటన పచ్చి అబద్దమన్నారు. ఈడీ అధికారులు తన ఢిల్లీ నివాసంలో అరగంటలోనే సోదాలు పూర్తి చేశారని తేజస్వీ చెప్పారు. ఈ సమయంలో తన సోదరీమణులు ధరించి ఉన్న నగలను తీసి పక్కకు పెట్టమని చెప్పారని, వాటినే ఫోటోలు తీసి సీజ్ చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2017లో కూడా తమ పార్టీ రూ.8,000కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడిందని చెప్పి దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. ముందు వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీలా తమది ఫేక్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ కాదని తేజస్వీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా క్రోనాలజీ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. తమది నిజమైన సోషలిస్టు కుటుంబం అని పేర్కొన్నారు. బిహార్‌లో బీజేపీని అధికారానికి దూరం చేసినందుకే తమపై దాడులు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసునని తేజస్వీ అన్నారు. కమలం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈడీ సోదాల్లో ఏం సీజ్ చేశారో అధికారికంగా ప్రకటన విడదల చేయాలని, లేదంటే తానే నిజాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేయాలని బహుశా అమిత్‌షానే డైరెక్షన్ ఇచ్చి ఉంటారని తేజస్వీ ఆరోపించారు. ప్రతిసారి ఇలానే చేస్తే వర్కవుట్ కాదని.. వాళ్లు స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్లను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? -
దూకుడు పెంచిన ఈడీ.. బిహార్ డిప్యూటి సీఎంకు షాక్!
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచుతోంది. ఇప్పటికే కేసులు, స్కాంలో చిక్కుకున్న పలు నేతల ఇళ్లలో సోదాలు, విచారణలో చేపడుతున్న ఈడీ తాజాగా బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ నివాసంలో సోదాలు చేపట్టింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో ఈడీ తనిఖీలు జరుపుతోంది. దేశ రాజధానిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న ఆర్జేడీ నాయకుడి నివాసంతో పాటు ముంబై, యూపీ, బిహార్‌లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆయా కేసులకు సంబంధించి సాక్ష్యాలను సేకరణ కోసం మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ రంగంలోకి దిగిందని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని సమాజ్‌వాదీ పార్టీ నేత జితేంద్ర యాదవ్ నివాసానికి కూడా ఈడీ అధికారులు చేరుకున్నారు. జితేంద్ర యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రాగిణి భర్త. బీహార్‌లోని పాట్నాలో ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ సహాయకుడు అబు దోజానా ఇంట్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. కాగా కొన్ని రోజుల క్రితమే ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. -
ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిపై టీడీపీ, సీపీఐ నేతల దాడి
సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏకంగా అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు.. పాఠశాలల్లో నాడు - నేడు పనులు పర్యవేక్షణలో భాగంగా ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై అనంతపురంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించటం తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి భర్త, విద్యాశాఖ కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డి పై దాడికి యత్నించారు. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులతో మాట్లాడుతుండగా.. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాల నేతలు ఒక్కసారిగా దౌర్జన్యం చేశారు. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయ సంఘాల నేతలు దుండగులను అడ్డుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిపై దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారని.. పలువురు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారం తో బయటపడ్డానని కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. తనపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని.. ఇలా దౌర్జన్యానికి దిగటం అప్రజాస్వామికం అన్నారాయన. ప్రతాప్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చదవండి: టీడీపీ స్కెచ్.. ‘నీ పంట దున్నెయ్.. లీడర్ని చేస్తాం..’ -
మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతికి రాహుల్ నివాళి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆ ప్రముఖ రాజకీయవేత్త నుంచి చాలా విషాయాలు నేర్చుకున్నానని చెప్పారు. సీనియర్ రాజకీయవేత్త, లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) నేత 75 ఏళ్ల శరద్ యాదవ్ గురుగ్రామ్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సోషలిస్ట్ నాయకుడు శరద్ యాదవ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ శరద్ యాదవ్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి వివరించారు. యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా నానమ్మ ఇందిరా గాంధీతో రాజకీయ పోరాటం చేశారని, వీరిద్దరూ గౌరవం, ఆప్యాయతలతో మెలిగేవారిని గుర్తు చేసుకున్నారు. అంతేగాదు యాదవ్ ఎప్పుడూ ఇతరుల గౌరవాన్ని కోల్పోలేదని, ఇది రాజకీయాలలో అతి గొప్ప విషయమని అన్నారు. శరద్ యాదవ్ సోషలిజం నాయకుడిగా ఉండటమే గాక వినయశీలి. తాను ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని, దేశానికి ఆయన చేసిన కృషి, సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రో ఉన్న రాహుల్ శుక్రవారం యాత్రకు విరామం ఇచ్చి మరీ పంజాబ్ నుంచి ఢిల్లీ చేరుకుని శరద్‌యాదవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. (చదవండి: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత) -
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
సీనియర్ రాజకీయవేత్త, లోక్తాంత్రిక్ జనతా దళ్(ఎల్జేడీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల శరద్ యాదవ్ గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి ట్విటర్ ద్వారా ధ్రువీకరించారు. అనారోగ్యం పాలై అపస్మారక స్థితికి చేరుకున్న యాదవ్‌ను తమ ఆసుపత్రికి తీసుకొచ్చారని, ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స ప్రారంభించామని, నాడి పనిచేయలేదని, రక్తపోటు రికార్డు కాలేదని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. రాత్రి 10.19 గంటలకు మరణించారని తెలియజేసింది. శరద్ యాదవ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శరద్ యాదవ్ మొత్తం పదిసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1970వ దశకంలో జయప్రకాశ్ నారాయణ్ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సోషలిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జనతాదళ్ నుంచి బయటకు వచ్చి 1997లో జేడీ(యూ)ను స్థాపించారు. జేడీ(యూ) నితీశ్ వర్గానికే చెందుతుందని 2017లో ఈసీ ప్రకటించింది. 2018లో తాను స్థాపించిన ఎల్జేడీని శరద్ యాదవ్ ఇటీవలే జేడీ(యూ)లో విలీనం చేశారు. శరద్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. पापा नहीं रहे 😭 — Subhashini Sharad Yadav (@Subhashini_12b) January 12, 2023 -
నితీష్ కుమార్ రాజకీయ వారసుడు అతడే! హింట్ ఇచ్చిన బిహార్ సీఎం
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ వారసుడు ఎవరో సూత్రప్రాయంగా తెలిపారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని ముందుండి నడిపిస్తారని స్పష్టం చేశారు. అధికార ఎమ్మెల్యేలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈమేరకు వ్యాఖ్యానించారు. నేను ప్రధాని అభ్యర్థిని కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థినీ కాదు. బీజేపీని ఓడించడమే నా లక్ష్యం. అని నితీశ్ అన్నారు. తేజస్వీ యాదవ్‌ను ప్రోత్సహించాలని అధికార కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. సోమవారం కూడా నితీశ్ ఈ విషయంపై పలుమార్లు హింట్ ఇచ్చారు. తేజస్వీ యాదవ్‌తో కలిసి నలందలో డెంటల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం చాలా చేస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉంటే వాటిని తేజస్వీ యాదవ్ పూర్తి చేస్తారు. మమ్మల్ని విడదీయాలనుకుంటున్న వారు ఆ ప్రయత్నాలు మానుకోండి. మేం కలిసే ఉంటాం. ఎలాంటి విభేదాలు ఉండవు. అని వ్యాఖ్యానించారు. దీంతో తేజస్వీ యాదవ్‌ను నితీశ్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారని ప్రచారం ఊపందుకుంది. ఆ మరునాడే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో నితీశ్ మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది నితీశ్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే అని, ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. చదవండి: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపులు.. మళ్లీ అతడే..! -
By-poll Results 2022: ఏడింట్లో నాలుగు బీజేపీకి...
న్యూఢిల్లీ: ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఇందులో నాలుగు బీజేపీ గెలుచుకోగా, ఆర్జేడీ, శివసేన ఠాక్రే వర్గం, టీఆర్ఎస్ తలొకటి దక్కించుకున్నాయి. యూపీలోని గోలా గోరఖ్‌నాథ్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. పార్టీకి చెందిన అమన్ గిరి సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని 34 వేల ఓట్ల తేడాతో ఓడించారు. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో బీజేపీకి చెందిన కుసుమ్ దేవి సమీప ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మోహన్ గుప్తాపై 68 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. ఇదే రాష్ట్రంలోని మొకామాలో ఆర్జేడీ అభ్యర్థిని నీలం దేవి 16వేల ఓట్ల మెజారిటీ గెలిచారు. ఒడిశాలోని ధామ్‌నగర్‌లో బీజేడీకి చెందిన అవంతిదాస్‌పై బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 4,845 ఓట్ల మెజారిటీ సాధించారు. తెలంగాణలోని మునుగోడు నుంచి టీఆర్ఎస్కు చెందిన కె.ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ముంబైలోని అంధేరి (వెస్ట్)నియోజకవర్గం నుంచి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన రుతుజా లట్కే విజయం సాధించారు. ఎమ్మెల్యే రమేశ్ లట్కే గత మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రమేశ్ భార్య రుతుజకు పోటీగా బీజేపీ సహా ప్రధానపార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. రెండో స్థానంలో 14.79 శాతం మంది నోటాకు ఓటేశారు. భజన్‌లాల్ మనవడి విజయం హరియాణాలోని ఆదంపూర్‌లో బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన జై ప్రకాశ్‌పై 16 వేల మెజారిటీ సాధించారు. మాజీ సీఎం భజన్‌లాల్ కుటుంబానికి 1968 నుంచి ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. భజన్‌లాల్ 9 సార్లు, ఆయన భార్య ఒక పర్యాయం, కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ 4 సార్లు ఇక్కడ విజయం సాధించారు. భజన్‌లాల్ మనవడే భవ్య బిష్ణోయ్. కుల్దీప్ బిష్ణోయ్ ఆగస్ట్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. -
పార్టీ నాయకుడిపై లాలు యాదవ్ కొడుకు ఫైర్.. సమావేశం మధ్యలోనే...
న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత లాలు యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తరుచు ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మేరకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఢిల్లీల జరిగిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడి) సమావేశానికి హజరయ్యారు. ఐతే ఆ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్ రజాక్‌ని దుర్భాషలాడుతూ...సమావేశం మధ్యలోంచే బయటకు వచ్చేశారు. ఈ విషయమై తేజ్ ప్రతాప్‌ని మీడియా ప్రశ్నించగా...ఆయన సమావేశంలో ఏం జరిగిందో చెప్పేందుకు నిరాకరించారు. తాను బలహీనమైన వ్యక్తిని అని, చాలా ఒత్తిడిలో ఉన్నానని అన్నారు. అదీగాక రెండు రోజుల క్రితమే తన మేనల్లుడు చనిపోయాడని అయినప్పటికీ సమావేశానికి వచ్చానంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. తాను సమావేశం షెడ్యూల్ గురించి అడిగితో కార్యదర్శి శ్యామ్ రజాక్ తన సోదరిని, వ్యక్తిగత సహాయకుడి దుర్భాషలాడరని, ఆడియో రికార్డు కూడా ఉందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇలానే ఇటీవల తన తండ్రి కోసం మధురలో పూజలు చేసే విషయమై వచ్చి నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కి మీడియాలో నిలిచారు. (చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన) -
సీబీఐ తర్వాత.. ఇక ఈడీ వంతు: తేజస్వీ
న్యూఢిల్లీ/పట్నా: రైల్వే కుంభకోణంలో తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిల పేర్లను చేరుస్తూ సీబీఐ చార్జిషీటు వేయడంపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇందులో కొత్తేమీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ దెబ్బతిన్నప్పుడల్లా ఇవి జరగడం మామూలేనని పేర్కొన్నారు. ‘బిహార్‌లో అధికారం కోల్పోవడంతో బీజేపీకి మాతో సమస్యలు ఏర్పడుతున్నాయి. మరో వైపు, బీజేపీకి దీటుగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాఘఠ్ బంధన్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పరిణామాలతోనే దర్యాప్తు సంస్థలను మాపైకి ఉసి గొలుపుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఈ డ్రామా 2024 ఎన్నికల దాకా సాగుతుందన్న విషయం పిల్లల్ని అడిగినా చెబుతారు’అని కేంద్రాన్ని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ తర్వాత ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీలు తన నివాసంలో కార్యాలయాలు తెరవాలని కోరారు. చదవండి: షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్! -
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసి రాజీనామా చేసిన మంత్రి
పాట్నా: బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయం రంగంలో అవినీతిపై ప్రశ్నించారు. బీజేపీ-జేడీయూ పాలనలో జరిగినట్లే ఇప్పుడూ జరిగితే తాను సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ లక్ష్యాలను దారిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామని సుధాకర్ అన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే రాజీనామా చేశారు. సుధాకర్ సింగ్ రాజీనామాను ఆయన తండ్రి, బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ధ్రువీకరించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వాళ్ల పక్షాన ఒకరు నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. 2006లో ఎన్డీఏ హయాంలో సీఎంగా నితీశ్ కుమార్ ఉన్నప్పుడే ఈ చట్టాన్ని రద్దు చేయడం గమనార్హం. సుధాకర్ సింగ్ తరచూ తన శాఖలో జరుగుతున్న అవినీతిని బహిరంగంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అక్రమాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా రైతు సమస్యలను తీర్చలేకపోతే ఈ పదవి ఎందుకని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు. చదవండి: అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా -
బీజేపీ ఓటమి ఖాయం: లాలూ
పాట్నా: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బుద్ధి లేదంటూ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ శనివారం విరుచుకుపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. బిహార్‌లో జంగిల్‌రాజ్ అంటూ అమిత్ షా పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి గుజరాత్లో అమిత్ షా ఉన్నప్పుడే జంగిల్‌రాజ్ రాజ్యమేలిందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. లాలూప్రసాద్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ‘ప్రతిపక్షాల ఐక్యతే’ ప్రధాన అజెండా అని లాలూ తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరోవైపు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ర్యాలీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హాజరయ్యే అవకాశం ఉంది. మరికొందరు ప్రతిక్ష నేతలు ఈ ర్యాలీలో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. -
నా పర్యటనతో లాలూ, నితీశ్‌కు కడుపులో నొప్పి.. అమిత్ షా విమర్శలు
పాట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో ప్రధాని కావాలనే లక్ష్యంతో ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచి లాలూ ప్రసాద్ యాదవ్ ఒళ్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు. నితీశ్ తెగదెంపులు చేసుకోవడంతో బిహార్‌లో ఎన్డీఏ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చారు అమిత్ షా. రెండు రోజుల పర్యటనలో భాగంగా సరిహద్దు జిల్లా పూర్ణియాలో ర్యాలీలో ప్రసంగించారు. నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. 'నేను ఈవాళ సరిహద్దు జిల్లాల్లో పర్యటించడం చూసి లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్ కుమార్‌లకు కడుపునొప్పి వస్తోంది. వాళ్లు అశాంతి కోరుకుంటున్నారు. నేను ఇక్కుడకు వస్తే అశాంతి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు. నితీశ్ కుమార్ లాలూ ఒళ్లో కూర్చుకున్నారు. ప్రజలేం ఆందోళన చెందవద్దు. సరిహద్దు జిల్లాలు భారత్‌లో భాగమే. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మనకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఏదో ఒకరోజు ప్రధాని కావాలనే ఆశతో నితీశ్ లాలూ చెంతకు చేరారు. వాళ్లు బిహార్ ప్రజల తీర్పుకు విరుద్ధంగా ద్రోహం చేశారు. సీమాంతర ప్రజలు నితీశ్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. కూటములు మార్చి నితీశ్ ప్రధాని కాగలరా?' అని అమిత్ షా ప్రశ్నించారు. నితీశ్‌కు సీఎం పదవి ఇస్తామని ప్రధాని మోదీ మాటిచ్చినందు వల్లే బీజీపే అందుకు కట్టుబడి ఉండి ఆయనకు బాధ్యతలు అప్పగించిందని అమిత్ షా చెప్పారు. కానీ నితీశ్ మాత్రం ద్రోహం చేసి ప్లేటు పిరాయించారని దుయ్యబట్టారు. ర్యాలీ అనంతరం కిషన్‌గంజ్‌కు వెళ్తారు అమిత్ షా. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, పార్టీ కార్యాలయాల బాధ్యులతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తారు. చదవండి: అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం! -
అత్యాచారం జరిగితే.. అది మీ సీఎం చేసినట్టా? బీజేపీపై తేజస్వీ ఫైర్
పాట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇటీవల బెగూసరాయ్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సీఎం నితీశ్ కుమారే బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా సీఎంనే నిదించడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజూ ఎన్నో నేరాలు జరుగుతున్నాయని వాటికి బాధ్యత ఆయా సీఎంలదేనా? అని తేజస్వీ ప్రశ్నించారు. ఒకవేళ అక్కడ రేప్ జరిగితే అది వాళ్ల సీఎం చేసినట్లా? అని అడిగారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రేదశ్‌లో ప్రతి రోజు నేరాలు జరుగుతూనే ఉన్నాయని, రామరాజ్యమంటే అదేనా అని తేజస్వీ ధ్వజమెత్తారు. 'బెగూసరాయ్ కాల్పుల ఘటనకు కొత్త కోణం ఇవ్వాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. బీహార్‌లో ఉంది ప్రజా ప్రభుత్వం. బీజేపీ అంటేనే అతిపెద్ద అబద్దాల పార్టీ. వారు ఎప్పుడూ చెప్పింది చేయరు. ప్రజలను విభజించి సమాజంలో విషం నింపాలని చూస్తారు' అని తేజస్వీ తీవ్ర విమర్శలు చేశారు. బెగూసరాయ్‌లో మంగళవారం కాల్పుల ఘటన జరిగింది. ఇద్దరు నిందుతులు బైక్‌పై ప్రయాణించి పలు చోట్లు అరగంటపాటు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. దీనిపై స్పందిస్తూ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్.. నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్‌లో మహాఘట్బంధన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ప్రతిసారి ఆటవిక రాజ్యమే వస్తుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే స్పందిస్తూ తేజస్వీ బీజేపీపై మండిపడ్డారు. చదవండి: ఆటోలో ప్రయాణించి కేజ్రీవాల్ హల్చల్.. ఊహించని గిప్ట్ ఇచ్చిన బీజేపీ -
శాఖ మార్చిన కాసేపటికే.. బిహార్ మంత్రి రాజీనామా
పాట్నా: కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ నేత, బిహార్ న్యాయశాఖ మంత్రి కార్తీక్ కుమార్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కార్తీక్ కుమార్ తన రాజీనామాను గవర్నర్‌కు పంపగా.. ఆయన ఆమోదించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కాగా 2014లో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో మంత్రి నిందితుడిగా ఉండటంతో విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేశాయి. ఈ నిరసనల నేపథ్యంలో కార్తీక్ కుమార్‌ను.. బిహార్ సీఎం నితిష్ కుమార్ న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి.. ఆయనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన చెరుకు శాఖను అప్పగించారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో కొత్త శాఖను కేటాయించిన గంటల వ్యవధిలోనే కార్తీక్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కార్తీక్ కుమార్ రాజీనామాతో.. రెవెన్యూశాఖ మంత్రి అలోక్ కుమార్ మెహతాకు చెరుకు శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బిహార్‌లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన జేడీయూ అధినేత నితీష్ కుమార్.. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు కార్తీక్ కుమార్. బిహార్‌లో రాజకీయంగా శక్తివంతమైన భూమిహార్ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. చదవండి: భారత్‌లో కొత్తగా 7 వేల కరోనా కేసులు -
బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కూమార్ నేతృత్వంలోని మహా గట్బంధన్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్ నేతల ఇళ్లపై దాడులు జరగటం సంచలనంగా మారింది. ముగ్గురు సీనియర్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూప్రసాద్ ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ నివాసం సహా ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్ఫాఖ్ కరీమ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ‘ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందులో ఎలాంటి అర్థం లేదు. భయంతో మా ఎమ్మెల్యేలు వారితో చేరతారనే కారణంగా చేస్తున్నారు.’అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సునీల్ సింగ్. ముందే ట్వీట్.. దాడులకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ అధికార ప్రతినిధి సీబీఐ దాడులపై ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్‌లో అధికారం కోల్పోవటంపై బీజేపీ కోపంగా ఉందని, అందుకే సీబీఐ, కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. బుధవారం కీలకమైన రోజుగా ఆయన పేర్కొనటం గమనార్హం. ఇదీ చదవండి: అవిశ్వాస తీర్మానం పెట్టినా.. రాజీనామా చెయ్యను! బీహార్ స్పీకర్ మొండిపట్టు -
మీరేం చెప్పారో.. వాళ్లేం అర్థం చేసుకున్నారో తెలియడం లేద్సార్!
మీరేం చెప్పారో.. వాళ్లేం అర్థం చేసుకున్నారో తెలియడం లేద్సార్! -
కొత్త కార్లు వద్దు! అందర్నీ నమస్తే! అదాబ్ అని పలకరించండి!
పట్నా: బిహార్‌లో మహాఘట్ బంధన్ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఆర్జేడీ నుంచే అధిక సంఖ్యలో 31 మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తన పార్టీలోని మంత్రులకు కొన్ని సూచనలు జారీ చేశారు. కొత్త కారులను కొనుగోలు చేయవద్దని, అందరిని నమస్తే, అదాబ్ వంటి పదాలతో పలకరించే సంప్రదాయాన్ని పాటించాలని చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలని, పేద ప్రజలతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, కులానికి ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించారు. అలాగే బోకేలు లేదా పువ్వులను బహుమతులుగా ఇచ్చే బదులు పెన్లు లేదా పుస్తకాలు ఇచ్చుకోవాలని సూచించారు. మంత్రులెవరూ కూడా తమ శ్రేయోభిలాషులు, మద్దతుదారులు, కార్మికులను తమ పాదాలను తాకేందుకు అనుమతించకూడదని గట్టిగా నొక్కి చెప్పారు. పైగా మంత్రులు ఆయా శాఖలను బాధ్యతయుతంగా నిర్వర్తిస్తూ, పారదర్శకంగా వ్యవహరిచాలని కోరారు. అంతేగాక మంత్రులు తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం వల్ల ప్రజలకు మీరు ఏం చేస్తున్నారో తెలస్తుందని చెప్పారు. మరోవైపు బీజేపీ జంగిల్ రాజా మళ్లీ వచ్చాడు, ఆ పార్టీ మంత్రులంతా నేరచరిత్ర కలిగినవాళ్లు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ తరుణంలో తేజస్వీ యాదవ్ తన మంత్రులంతా సత్ప్రవర్తనతో, పారదర్శకంగా పరిపాలన సాగించాలంటూ కొత్త మార్గదర్శకాలను సూచించారు. (చదవండి: లాలూ అల్లుడి రగడ.. నితీశ్‌కు కొత్త తలనొప్పి) -
బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్??
రాంచీ: బీహార్‌లోనూ మహారాష్ట్ర పరిస్థితులు పునరావృతం కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగి.. తిరిగి పాత మిత్రులతో జత కట్టిన నితీశ్ కుమార్.. ఇప్పటికే కేబినెట్ కూర్పును ఓ కొలిక్కి తెచ్చారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే.. ఇక్కడ కూడా మహారాష్ట్ర తరహా పరిస్థితులే కనిపించబోతున్నాయా? అనే చర్చ జోరందుకుంది. బీహార్ సీఎం నితీశ్ ఇవాళ కేబినెట్‌ను విస్తరించబోతున్నారు. మొత్తం బీహార్ కేబినెట్లో 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో తేజస్వియాదవ్ జేడీయూకు 16, నితీశ్ కుమార్ జేడీయూకు 12 స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంఝీకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు దాదాపుగా ఖరారు అయ్యాయి. కానీ, కీలకమైన విభాగాలు మాత్రం ఆర్జేడీ, ఇతరులకు తరలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోనూ బీజేపీ కీలకమైన శాఖలన్నీ ఉంచేసుకుని.. షిండే వర్గానికి మిగిలిన పోస్టులను మిగిల్చింది. గతంలో ఈ శాఖలు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అనుభవించాయి. ఇప్పుడు.. బీహార్‌లోనూ మిత్రపక్షాల కోసం జేడీయూ అదే తరహా త్యాగం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తేజస్వి యాదవ్.. హోం లేదంటే ఆర్థిక శాఖను చేజిక్కించుకోవచ్చనే ప్రచారం నడుస్తోంది. ఇంతకు ముందు హోం శాఖను నితీశ్ కుమారే స్వయంగా పర్యవేక్షించడం విశేషం. అంతేకాదు తన పేషీలోని కీలకమైన, సీనియర్ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ తేజస్వి యాదవ్.. ముఖ్యమైన పోస్టులు అప్పజెప్పబోతున్నారనే ప్రచారం అక్కడి స్థానిక మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతకు ముందు బీజేపీకి జేడీయూ కేటాయించిన ఆరోగ్యం, ఆర్థికం, రోడ్లు భవనాల శాఖల మీదే ఆర్జేడీ ఫోకస్ చేసిందని.. వాటి కోసమే పట్టుబడుతోందన్నది ఆ కథనాల సారాంశం. ఇదిలా ఉంటే.. మహాకూటమి నేతృత్వంలోని నితీశ్ సర్కార్ వచ్చే వారం.. అసెంబ్లీలో బలనిరూపణకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మీ రాజకీయాల కోసం.. చరిత్రను వక్రీకరించకండి: సోనియా గాంధీ -
సాక్షి కార్టూన్ 13-08-2022
సాక్షి కార్టూన్ -
స్కూల్లోనే ఆమెను ప్రేమించాను.. లవ్‌స్టోరి సీక్రెట్ చెప్పిన తేజస్వీ
Tejashwi Yadav's Comments On Wife Rachel Godinho.. బీహార్‌లో అనూహ్య పరిస్థితుల మధ్య నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం, సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తేజస్వీ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన భార్య.. రాచెల్ గొడిన్హో(రాజ్ శ్రీ)తో ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తమది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన లవ్ ట్రాక్ గురించి తేజస్వీ యాదవ్.. తన తండ్రి లాలూ ప్రసాద్‌కు..‘ఈ(రాచెల్) అమ్మాయితో నేను డేటింగ్ చేస్తున్నాను. ఈమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాచెల్.. క్రిస్టియన్’ అని చెప్పాను. ఆ సమయంలో మా నాన్న(లాలూ ప్రసాద్) ఓకే, నో ప్రాబ్లమ్ అన్నట్టుగా తమ పెళ్లికి ఆమోదం తెలిపారంటూ తేజస్వీ చెప్పుకొచ్చారు. అలాగే.. తన భార్య రాచెల్ వివరాలు చెబుతూ.. హర్యానాలోని రేవారి జిల్లాకు చెందిన ఆమె.. తాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో క్లాస్ మేట్ అని.. ఇద్దరి మధ్య ఏడేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిచిందన్నారు. ఇక, తమ పెళ్లి తర్వాత రాచెల్ హిందుత్వంలోకి మారిందని.. అప్పుడే తన పేరును రాజ్ శ్రీగా మార్చుకుందని జాతీయ మీడియాలో కథనాల్లో పేర్కొన్నారు. కాగా, లాలు, రబ్రీదేవి దంపతులకు తొమ్మిది మంది సంతానం ఉన్నారు. వారిలో తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్ అబ్బాయిలు కాగా, ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరందరిలో చిన్నవాడు తేజస్వీ యాదవ్. ఇక, తేజస్వీ యాదవ్ రాజకీయాల్లోకి రాకముందు క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే. -
బీజేపీకి బైబై.. ఆర్జేడీతో నితీశ్ దోస్తీ..
పట్నా: హై వోల్టేజీ రాజకీయ డ్రామాకు బిహార్ వేదికగా మారింది. ఊహించినట్టుగానే జనతాదళ్(యునైటెడ్) చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (71) బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమితో ఐదేళ్ల సంకీర్ణ బంధానికి గుడ్‌బై చెప్పారు. మహారాష్ట్ర మార్కు వ్యూహంతో తన సీఎం పీఠానికి బీజేపీ ఎసరు పెడుతోందన్న అనుమానంతో తానే ముందుగా చకచకా పావులు కదిపారు. సీఎం పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలో రెండేళ్ల బీజేపీ–జేడీ(యూ) సంకీర్ణ పాలనకు తెర దించడమే గాక వెనువెంటనే ఆర్జేడీ నేతృత్వంలోని మహా ఘట్బంధన్లో చేరి మళ్లీ సీఎం పీఠమెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు! బుధవారం మధ్యాహ్నం రెండింటికి రాజ్‌భవన్‌లో సాదాసీదాగా జరిగే కార్యక్రమంలో సీఎంగా నితీశ్ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. కొత్త మంత్రివర్గంలో జేడీ(యూ), ఆర్జేడీతో పాటు కాంగ్రెస్‌కు కూడా స్థానం దక్కుతుందని చెబుతున్నారు. వామపక్షాలు బయటినుంచి మద్దతిస్తాయని తెలుస్తోంది. బిహార్ సీఎం పదవి చేపట్టనుండటం నితీశ్‌కు ఇది ఏకంగా ఎనిమిదోసారి కావడం విశేషం! కాగా బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం గత తొమ్మిదేళ్లలో ఇది రెండోసారి. ఈ పరిణామాలపై బీజేపీ మండిపడగా కాంగ్రెస్ తదితర విపక్షాలు హర్షం వెలిబుచ్చాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ ప్రజలిచ్చిన తీర్పును నితీశ్ అపహాస్యం చేశారంటూ బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ దుయ్యబట్టారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నారు. తాను పల్టూ రామ్ (పార్టీలు మార్చే వ్యక్తి)నని నితీశ్ మరోసారి రుజువు చేసుకున్నారని కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే విమర్శించారు. ఆయన అహంకారంతో మిడిసిపడుతున్నారన్నారు. జేడీ(యూ)కు బిహార్‌లో బీజేపీ కంటే తక్కువ సీట్లున్నా సంకీర్ణ ధర్మాన్ని గౌరవిస్తూ నితీశ్‌ను సీఎంను చేశామని గుర్తు చేశారు. లౌకిక శక్తులను బలోపేతం చేసేందుకే బిహార్‌లో నితీశ్‌కు మద్దతిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో మెజారిటీకి 122 స్థానాలు అవసరం. జేడీ(యూ)కు 45, ఆర్జేడీకి 79 మంది, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 77 మంది ఉన్నారు. బిహార్‌లో మంగళవారం రోజంతా ఏం జరిగిందంటే... ఉదయం 11 : నితీశ్ నివాసంలో జేడీ(యూ) ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ. మధ్యాహ్నం 1 : మహా ఘట్బంధన్ నేతల భేటీ. నితీశ్‌కు మద్దతు లేఖపై ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ తదితర పార్టీల ఎమ్మెల్యేల సంతకం. మధ్యాహ్నం 2 : మళ్లీ జేడీ(యూ) భేటీ. కొత్త సంకీర్ణానికి ఎమ్మెల్యేల మద్దతు. సాయంత్రం 4 : ‘ఎన్డీఏ’ సీఎం పదవికి రాజీనామా లేఖ గవర్నర్‌కు అందజేత 4.45 : రబ్రీ నివాసంలో తేజస్వి, ఇతర నేతలతో నితీశ్ మంతనాలు. 5.20 : నేతలందరితో కలిసి రాజ్‌భవన్ బయల్దేరిన నితీశ్. 6:00 : 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ గవర్నర్‌కు సమర్పణ. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి. రోజంతా రాజకీయ వేడి బిహార్‌లో జేడీ(యూ), బీజేపీ సంబంధాలు చాలాకాలంగా క్షీణిస్తూ వస్తున్నాయి. బీజేపీ ఆధిపత్య ధోరణిపై నితీశ్ చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. దాంతో ఎన్డీఏతో ఆయన మరోసారి తెగదెంపులు చేసుకోవడం ఖాయమంటూ కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం జేడీ(యూ) సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తదితరులతో నితీశ్ భేటీ అయ్యారు. సంకీర్ణ ధర్మానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. తమకు వెన్నుపోటు పొడవాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు. జేడీ(యూ) సీనియర్ నేత ఆర్సీపీ సింగ్ ద్వారా పార్టీలో తిరుగుబాటుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. భేటీ నుంచి నితీశ్ నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా లేఖ ఇచ్చారు. ‘‘ఎన్డీఏ సంకీర్ణాన్ని వీడాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ‘ఎన్డీఏ’సీఎం పదవికి రాజీనామా చేశా’నని మీడియాకు చెప్పి వెనుదిరిగారు. అనంతరం శరవేగంగా పావులు కదిపారు. తేజస్వీ తల్లి, మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో ఆర్జేడీ తేజస్వీ యాదవ్‌తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, హిందూస్తానీ అవామ్ మోర్చా నాయకుడు జితన్‌రాం మాంఝీ తదితర మహా ఘట్బంధన్ నేతలతో అరగంట పాటు మంతనాలు జరిపారు. వారందరితో కలిసి గంటసేపటికే మరోసారి గవర్నర్‌ను కలిశారు. ఏడు పార్టీలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కూడిన మహా ఘట్బంధన్ తమ నేతగా తనను ఎన్నుకుందని వివరించారు. కనుక ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త సంకీర్ణానికి అవకాశమివ్వాల్సిందిగా కోరారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను అందజేసినట్టు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నితీశ్ చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ముఖ్య నేత రాహుల్‌గాంధీలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. తనకు మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోకెల్లా అత్యంత అనుభవజ్ఞుడైన సీఎంగా నితీశ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ తేజస్వీ కొనియాడారు. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలే నితీశ్ తాజా నిర్ణయానికి ప్రధాన కారణమని సీపీఎంఎల్ఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అంతకుముందు తేజస్వి తదితరులతో రబ్రీ నివాసంలో నితీశ్ మంతనాలు జరుపుతుండగానే ‘మహా ఘట్బంధన్ సీఎంగా నితీశ్‌కు శుభాకాంక్షలు’అంటూ జేడీ(యూ) సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహా ట్వీట్ చేశారు! చదవండి: మాది సంకీర్ణ ధర్మం- నితీశ్దేమో..: బీజేపీ -
పిల్లిమొగ్గల రాజకీయం
అనుమానిస్తున్నంతా అయింది. కొద్ది నెలలుగా బీజేపీ పెద్దలతో ఎడముఖం, పెడముఖంగా ఉన్న జనతాదళ్ – యునైటెడ్ (జేడీ–యూ) అధినేత నితీశ్ కుమార్ కాషాయపార్టీతో తెగతెంపులు చేసుకొని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుంచి మంగళవారం బయటకు వచ్చేశారు. బీహార్ సీఎం పదవికి రాజీనామా ఇచ్చారు. బీజేపీ వినా రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ సహా 7 పార్టీల ‘మహా గఠ్బంధన్ 2.0’తో కొత్త సర్కారు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2010 నవంబర్ నుంచి ఇప్పటికి 22 ఏళ్ళలో రకరకాల పొత్తులతో, ఏకంగా 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధపడుతూ, కొత్త రికార్డు సృష్టించారు. రాజకీయ వ్యూహాలు, అధికార ఆకాంక్షల నడుమ విలువలకై వెతుకులాడితే వృథాప్రయాసని సామాన్య ఓటర్లకు చెప్పకనే చెప్పారు. పార్టీల తేడా లేకుండా బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ... ఇలా అన్నీ నితీశ్‌ను ఏదో ఒక సందర్భంలో దుయ్యబట్టినవే. పదేపదే అదే బీహారీ బాబుతో చేయి కలిపి, చంకనెక్కించుకున్నవే. ఇన్నిసార్లు దోస్తీలు మార్చి, రాజకీయ ఊసరవెల్లిగా అధికార పీఠాన్ని అట్టిపెట్టుకోవడం నితీశ్ చేసిన విచిత్ర విన్యాసం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులంటూ ఎవరూ ఉండరనే సూత్రాన్ని నితీశ్ ఆపోశన పట్టారు. అసలు సోషలిస్టు సిద్ధాంత నేపథ్యం నుంచి పైకొచ్చిన నితీశ్ ఏ సైద్ధాంతికతతో ఒకప్పుడు బీజేపీకి దగ్గరయ్యారన్నది ఆశ్చర్యమే. ఆ పైన 2013లోనే మోదీ మతతత్వాన్ని వ్యతిరేకించి, 17 ఏళ్ళ బంధాన్ని తెంపుకొని ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన ఆయన తర్వాత మళ్ళీ ఏ విలువల కోసం అదే నాయకుడితో అంటకాగారో అర్థం కాదు. తీరా ఇప్పుడు బలహీనపడుతున్న తన సొంత పార్టీ పునాదులు, లోలోపలి జాతీయ రాజకీయ ఆకాంక్షలతో ఆయన బీజేపీతో దోస్తీకి రామ్ రామ్ చెప్పడమూ భవిష్యత్ అవసరాల కోసం చేసిన రాజకీయమే. బీహార్ రాజకీయాల్లో ‘పల్టీ మాస్టర్’గా పేరు పడ్డ నితీశ్ వేసిన రాజకీయ పిల్లిమొగ్గలు అన్నీ ఇన్నీ కావు. 1994లో లూలూ ప్రసాద్‌తో విభేదించి, జనతాదళ్ నుంచి బయటకొచ్చి, సమతా పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఎన్డీఏతో దోస్తీ కట్టారు. 2013లో మోదీ మతతత్త్వ రాజకీయాల్ని నిరసిస్తూ మహా గఠ్బంధన్తో కలిశారు. 2017లో ఆర్జేడీ అవినీతిమయమైందంటూ గఠ్బంధన్ను వదిలి మళ్ళీ ఎన్డీఏ పంచన చేరారు. ఇప్పుడేమో మళ్ళీ ‘మహా గఠ్బంధన్ 2.0’తో పాతవాళ్ళనే అక్కున చేర్చుకున్నారు. పాట్నాలో ఒకరికొకరు కూతవేటు దూరంలో నివసించే నితీశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పుడు మరింత సన్నిహితం కానున్నారు. పరస్పరం అనుమానించుకుంటూ, తీవ్రంగా దూషించుకొన్న జేడీ(యూ), ఆర్జేడీలు ‘గతం గతః’ అనుకుంటూ, గాఢాలింగనం చేసుకోవడం రాజకీయ వైచిత్రి. ఎనభై ఏళ్ళ క్రితం సరిగ్గా ‘క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన రోజునే తీసుకున్న ఈ మహత్తర నిర్ణయం దేశానికి నూతన ఉషోదయమ’ని తేజస్వి ఉవాచ. దేశం మాటేమో కానీ, అధికారం కోసం ముఖం వాచి, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా, హోం మంత్రిగా బాధ్యత, సోదరుడికి మరో మంత్రి పదవి... ఇన్నీ ఆశిస్తున్న తేజస్వి అండ్ పార్టీకి ఈ పొత్తుపొడుపు కొత్త పొద్దుపొడుపే. పెద్దన్న లాంటి లాలూతో కలసి నడిచిన నితీశ్... ఇది లాలూ వారసులకిస్తున్న రాజకీయ కానుక. గతంలో నితీశ్ తమను వదిలి బీజేపీ చేయందుకున్నప్పుడు ఆర్జేడీ ఆయనను నిందించింది. ఇప్పుడు అచ్చంగా అవే విమర్శలు బీజేపీ నోట వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కలసి పోటీ చేసి, అధికారంలోకి వచ్చాక పొత్తుధర్మాన్ని విస్మరించి అర్ధంతరంగా వదిలేసిన నితీశ్ వల్ల బాధితులమనీ, రాజకీయ అమరులమనీ రాబోయే ఎన్నికల్లో చెప్పుకోవాలనీ బీజేపీ భావిస్తోంది. కలసి గెలిచినప్పటికీ కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి పదవితో సరిపెట్టి అవమానించడమే కాక, తమను బలహీనపరిచేందుకు కాషాయపార్టీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నందుకే బయటకు రావాల్సి వచ్చిందని జేడీ (యూ) వాదిస్తోంది. పంజాబ్, మహారాష్ట్ర మొదలు ఇప్పుడు బీహార్ దాకా కూటమి మిత్రులను బీజేపీ ఎప్పుడూ బలహీనపరుస్తూనే వస్తోందని జేడీ–యూ పాత కథల పట్టిక చూపిస్తోంది. నిజానికి, నితిన్ గతంలో ఇవే తన ఆఖరి ఎన్నికలన్నారు. తీరా ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారు. ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆశలను నెరవేర్చుకోవడానికి ఇదే మంచి సమయమని అనుకుంటున్నారు. లెక్కప్రకారం జాతీయ ఎన్నికలు 2024లో, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరగాలి. ఇప్పటి దాకా తన కైవసం చేసుకోలేకపోయిన బీహార్ విషయంలో బీజేపీకి రాబోయేది పెద్ద పరీక్ష. ‘మండల్ వర్సెస్ కమండల్’ పోరాటానికి బహుశా రానున్న బీహార్ ఎన్నికలే రణక్షేత్రం కావచ్చు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 4 శాతం ఉన్న దళిత పాశ్వాన్లు, వారి నేతగా రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడైన చిరాగ్ కీలకం కానున్నారు. వారిని బీజేపీ చేరదీస్తుందని ఓ అంచనా. మరి ఏ ఎన్నికలకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడైన నితీశ్ ఎలాంటి వ్యూహం వేస్తారో చూడాలి. ఇప్పటికైతే బీజేపీని ఎదురుదెబ్బ తీసి, నితీశ్ తమ వైపు రావడం ప్రతిపక్షాలకు ఒకింత ఉత్సాహజనకమే. కానీ, దానివల్ల కలిసొచ్చేది ఎంత? ఇప్పటికే ఉన్న సోనియా పరివారం, మమత, కేజ్రీవాల్‌ల సరసన పీఎం పదవికి నితిన్ రేసులో నిలుస్తారు. ఏక కేంద్రక బీజేపీకి దాని వల్ల మరింత లాభం. ఏమైనా, రెండేళ్ళలో రానున్న జాతీయ ఎన్నికల ఆట రంజుగా మారింది. కానీ, రాజకీయాలంటే వట్టి అంకగణితమే కాదు... పొత్తులోని పార్టీల మధ్య కెమిస్ట్రీ, ప్రజల్లో ఆ పార్టీల విశ్వసనీయత. క్రమంగా విశ్వసనీయత క్షీణిస్తూ, ఢిల్లీ వైపు చూస్తున్న నితీశ్జీకి ఆ సంగతి తెలీదంటారా? -
లాలు యాదవ్ కుమార్తె ట్వీట్... బలపడనున్న 'గత బంధం'
పాట్నా: బిహార్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిష్క్రమణతో బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మేరకు జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం తోపాటు మళ్లీ నితీష్ కుమార్ లాలు యాదవ్ భాగస్వామ్యం రానునుంది. అంతేకాదు నితీష్ కుమార్ మంగళవారం సాయంత్ర 4 గం.లకు గవర్నర్ ఫాగు చౌహాన్‌తో సమావేశం అవ్వాలని కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు నితీష్‌కి మద్దతుగా దాదాపు 160 మంది ఎమ్మెల్యేలు అధికార సంకీర్ణానికి విధేయత చూపుతామని ప్రమాణం చేశారు. పైగా మంగళవారం ఉదయమే నితీష్ తన అధికారికి నివాసంలో జేడీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు కూడా. దీంతో నితీష్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లాలు యాదవ్ కుమార్తె రోహిణి యాదవ్ ఆ మాటలకు బలం చేకూరుస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ మేరుకు ఆమె ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ... వెలుగులోకి రావలనుకున్నావారు త్వరపడండి, ఏకగ్రీవంగా సీఎంని ఎన్నుకునేందుకు సిద్దంగా ఉండండి అని ట్వీట్ చేశారు. పైగా నితీష్ లాలుల గత బంధ బలపడునుందని, ఈ మహా గతబంధన్ ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వాస్తవానికి నితీష్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు మహాకూటమి నుంచి వైదొలిగారు. బిహార్‌లో దాదాపు 243 మంది సభ్యుల అసెంబ్లీ ఉంది. ఐతే మొత్తం ఎమ్మెల్యేల్లో బిజేపీకి 77, జేడీయేకి 45 మంది సభ్యులు ఉండగా, ఆర్జేడీ సుమారు 127 మంది సభ్యులతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అదీగాక జేడీయూలో సీనియర్ నాయకుడు ఆర్సీపీ సింగ్ వైదొలగడం, అతనికి మాత్రమే మంత్రి పదవి ఇవ్వడం తదితర కారణాలే బిహార్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడటానికి కారణం. తాను సీఎం అయినప్పటికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తకి లోనైన సీఎం నితీష్ కుమార్ తప్పుకునేందుకు రెడీ అయ్యారు. "राजतिलक की करो तैयारी आ रहे हैं , लालटेन धारी "✌️ pic.twitter.com/R0pYeaU2mN — Rohini Acharya (@RohiniAcharya2) August 9, 2022 (చదవండి: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా? -
సీఎం పదవికి నితిశ్ కుమార్ రాజీనామా..!?
-
బిహార్: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా?
పాట్నా: బిహార్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకోనుందన్న వార్తల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహించాయి. నేడు(మంగళవారం) జేడీయూ ప్రత్యేక సమావేశమైంది. సీఎం నితీష్ కుమార్ అధికారిక నివాసంలో జేడీయూ ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మరోవైపు మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ అయ్యారు. లూలూ తనయుడు తేజస్వీ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతేగాక వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం లాలూ ఇంటికి వెళ్లారు. మరోపక్క ఇదే విషయమై బిహార్‌కు చెందిన బీజేపీ నేతలు డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ నివాసంలో సమావేశమయ్యారు. చదవండి: Bihar Politics: నితీశ్‌లో ఎందుకీ అసంతృప్తి? మూహుర్తం: సాయంత్రం 4 గంటలకా? బిహార్ రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నట్లు సమాచారం. మరోవైపు బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌తో సమావేశానికి బీజేపీ కూడా సమయం కోరింది. రాష్ట్ర కేబినెట్లోని మొత్తం 16 మంది మంత్రులు ఈరోజు గవర్నర్‌కు తమ రాజీనామాలను అందజేయనున్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్‌తో కలిసి నితీష్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. అదే విధంగా బీజేపీ నుంచి బయటకు వస్తే, నితీష్‌ను అక్కున చేర్చుకునేందుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ తెలిపింది. -
బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్!
పట్నా: ఎన్డీఏతో మిత్రపక్షం జేడీయూ తెగదెంపులు చేసుకోనుందా? ఆగస్టు 11కు ముందే బిహార్‌లో జేడీయూ-బీజేపీ సర్కార్ కూలిపోనుందా? నితీశ్ కుమార్ మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సహా జులై 17 తర్వాత కేంద్రం నిర్వహించిన నాలుగు సమావేశాలకు నితీశ్ డుమ్మా కొట్టారు. దీంతో ఎన్డీఏ నుంచి ఆయన విడిపోనున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు నితీశ్ మళ్లీ ఆర్జేడీతో జట్టుకట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలను కూడా కలుపుకొని బిహార్‌లో బీజేపీకి షాక్ ఇస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ఆయా పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వంలో భాగమైన బీజేపీతో విడిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నితీశ్ భావించినా.. అందుకు జేడీయూ ఎమ్మెల్యేలు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆర్జేడీ మద్దతు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు డుమ్మా జులై 17న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించిన సమావేశానికి నితీశ్ హాజరుకాలేదు. రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోతున్న సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి కూడా వెళ్లలేదు. ఆ తర్వాత జులై 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకరానికి కూడా నితీశ్ డుమ్మా కొట్టారు. తాజాగా ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన ఎన్డీఏకు రాంరాం చెప్పడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆర్సీపీ సింగ్‌పై అసంతృప్తి.. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ పార్టీకి శనివారమే రాజీనామా చేశారు. ఆయన కుమార్తెల అక్రమాస్థులకు సంబంధించి సీఎం వివరణ కోరడంతో పార్టీని వీడారు. అయితే ఆర్సీపీ సింగ్‌పై నితీశ్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది మోదీ కేబినెట్‌ను విస్తరించినప్పుడు ఆర్సీపీ సింగ్‌ను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా జరగడంపై నితీశ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అలాగే మోదీ కేబినెట్లో రెండు బెర్తులు కావాలని నితీశ్ అడిగితే కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. అమిత్ షాపై నమ్మకం లేదా? ఇటీవలే పట్నాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే అని అమిత్ షా ప్రకటించారు. అయినా నితీశ్ బీజేపీపై నమ్మకంగా లేరని తెలుస్తోంది. బిహార్‌లో పట్టు సాధించాలని అమిత్‌షా భావించడం, ఆర్సీపీ సింగ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, రాష్ట్రంలో బలపడాలని బీజేపీ చూస్తుండటం వంటి అంశాలు నితీశ్‌ను కాస్త కలవరపాటుకు గురి చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్ర బీజేపీ నాయకులు తనపై బహిరంగంగా విమర్శలు కురిపిస్తుండటం అస్సలు నచ్చడం లేదట. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదని నితీశ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 11లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఆర్జేడీతో చేతులు కలిపితే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే అవుతుంది. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ? -
మోదీ సలహ తదనంతరం... క్రికెట్ ఆడుతున్న తేజస్వీ యాదవ్: వీడియో వైరల్
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి అధికారిక నివాసంలో ఆర్జేడీ నేత బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీ యాదవ్ క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ మేరకు ఆయన తాను క్రికెట్ ఆడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జీవతం అయినా ఆట అయినా ఎల్లప్పుడు గెలుపు కోసం ఆడాల్సిందేనని, చాలా ఏళ్ళు తర్వాత బ్యాటు, బాల్ పట్టుకోవడం ఆనందంగా ఉందంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఆ వీడియోలో తేజస్వీ డ్రైవర్, వంటవాడు, స్వీపర్, గార్డెనర్, కేర్‌టేకర్లతో క్రికెట్ ఆడుతూ సందడి చేశాడు. ఐతే జులై 12న బిహార్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ పాట్నాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తేజస్వీ యాదవ్‌తో కాసేపు ముచ్చటించిన మోదీ...మీరు కాస్త బరువు తగ్గాలంటూ సలహ ఇచ్చారు. ఆ తదనందరం ఆయన క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆడుతూ... కనిపించారు. బహుశా తేజస్వీ దీన్ని సీరియస్‌గా తీసుకుని కాలరీలు తగ్గడం ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తేజస్వీ యాదవ్ తన జూనియర్ క్రికెట్‌ను ఢిల్లీ తరుఫున ఆడాడు. అంతేకాదు 2008-09లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు కూడా. అతను జార్ఖాండ్కి ప్రాతినిధ్యం వహించి అనేక మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత తన తండ్రి లాలుప్రసాద్ యాదవ్‌ని అనుసరించి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ మేరకు తేజస్వీ క్రికెట్ ఆడుతున్న వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. Life or game, one should always play to win. The more you plan in head, the more you perform on field. Pleasure to try hands on bat & ball after ages. It becomes more satisfying when driver, cook, sweeper, gardener & care takers are your playmates and keen to hit & bowl you out. pic.twitter.com/ChvK9evzi2 — Tejashwi Yadav (@yadavtejashwi) July 17, 2022 (చదవండి: నామకరణం వేళ విషాదం.. తండ్రి చేతుల్లోంచి ఎత్తుకెళ్లి చంపిన కోతులు) -
presidential election 2022: జార్ఖండ్‌లోనూ మహా సీనే...!
మహారాష్ట్ర తరహాలో జార్ఖండ్‌లో కూడా ఆపరేషన్ కమలానికి రంగం సిద్ధమవుతోందా? జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ సంకీర్ణ సర్కారుకు నూకలు చెల్లుతున్నాయా? రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జేఎంఎం అధినేత, సీఎం హేమంత్ సోరెన్ జై కొట్టడంతో రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది... జార్ఖండ్ గవర్నర్‌గా 2015–2021 మధ్య పని చేసిన ద్రౌపది ముర్ముకు అదే రాష్ట్రానికి చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు హేమంత్ సోరెన్ కూడా నిన్నామొన్నటిదాకా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వెంటే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం 17 విపక్షాల ఉమ్మడి భేటీలో సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడు కూడా ఆ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాంటిది ఆయన తాజాగా ప్లేటు ఫిరాయించారు. ముగ్గురు జేఎంఎం ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు ముర్ముకే ఓటేయాలని ఆదేశించారు. దాంతో జార్ఖండ్ రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయా అన్న చర్చకు తెర లేచింది. సిన్హా జార్ఖండ్‌కు చెందినవారే అయినా ముర్ము వైపే హేమంత్ మొగ్గు చూపడం వెనుక బీజేపీ వ్యూహం దాగుందంటున్నారు. ముర్ము సంథాల్ తెగకు చెందిన గిరిజన మహిళ. హేమంత్ కూడా అదే తెగకు చెందినవారు. తాను జార్ఖండ్ మట్టి బిడ్డనని చెప్పుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే జేఎంఎం ముర్ముకు ఓటేయనుందని పార్టీలో ఓ వర్గం చెబుతున్నా, హేమంత్ నిర్ణయంతో రాష్ట్రంలో పాలక సంకీర్ణం బీటలు వారుతుందనే చర్చ ఊపందుకుంది. వెంటాడుతున్న మైనింగ్ కేసు హేమంత్‌ను మైనింగ్ లీజ్ కుంభకోణం కేసు వెంటాడుతోంది. ఒక గనిని తనకు తానే కేటాయించుకున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ ఉదంతంలో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల ఢిల్లీలో ఈసీ విచారణకు హాజరైన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను హేమంత్ కలుసుకున్నారు. కేసు నుంచి బయట పడటానికే షాతో భేటీ అయ్యారని ప్రచారమూ జరిగింది. మనీ ల్యాండరింగ్ కేసుల్లో హేమంత్ సహాయకులపై ఈడీ దాడులు, ఆయనకు అత్యంత సన్నిహితురాలైన ఐఏఎస్ పూజా సింఘాల్ అరెస్ట్ వంటివి కూడా సీఎం ఇబ్బందుల్లోకి నెట్టాయి. జేఎంఎంకు దూరంగా కాంగ్రెస్ తాజా పరిణామాల్లో మరో రాష్ట్రం తమ చేజారుతుందన్న ఆందోళనలో కాంగ్రెస్‌లో నెలకొంది. నిజానికి జేఎంఎం బీజేపీతో చేతులు కలుపుతుందనే సందేహాలు ఆ పార్టీని కొద్ది రోజులుగా వేధిస్తున్నాయి. మేలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జార్ఖండ్ నుంచి కాంగ్రెస్ ఒక సీటు డిమాండ్ చేయగా హేమంత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. హేమంత్ సంకీర్ణ ధర్మం పాటించడం లేదంటూ అప్పటికే అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్, తమ నాయకులందరినీ సీఎంకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించినట్టు స్థానిక మీడియా కథనాలు రాసింది. బీజేపీకి ఒరిగేదేమిటి? 2019లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులెవరూ బీజేపీకి మద్దతివ్వలేదు. గిరిజన ప్రాబల్యమున్న 28 అసెంబ్లీ స్థానాల్లో జేఎంఎం–కాంగ్రెస్ కూటమి ఏకంగా 25 నెగ్గింది. బీజేపీ రెండింటికే పరిమితమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను జేఎంఎంకు 30, కాంగ్రెస్‌కు 16, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. జేఎంఎంను చేరదీసి ప్రభుత్వానికి మద్దతిస్తే ‘కాంగ్రెస్ ముక్త భారత్’ లక్ష్యానికి మరింత చేరువ కావడంతో పాటు 2024 ఎన్నికల్లో జేఎంఎంతో కలిసి రాష్ట్రంలో గిరిజన ఓట్లు కొల్లగొట్టవచ్చన్నది కమలనాథుల వ్యూహమంటున్నారు. మోదీపై ప్రశంసలు బీజేపీకి దగ్గరవాలని ప్రయత్నిస్తున్న హేమంత్ ఇటీవల ప్రధాని మోదీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. ఇటీవల జార్ఖండ్‌లో దేవగఢ్ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి మోదీ జరిపిన రాష్ట్ర పర్యటనకు హేమంత్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూశారు. పైగా ఆ కార్యక్రమంలో మోదీ సమర్థతను బహిరంగంగానే ప్రశంసించారు. ‘‘కేంద్రం నుంచి మాకు సహకారముంటే వచ్చే ఐదేళ్లలో జార్ఖండ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెడతాం. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సహకారముంటేనే త్వరితగతిన అభివృద్ధి సాధ్యపడుతుంది’’ అన్నారు. ఆయన కూటమి మార్చేస్తారన్న ఊహాగానాలకు ఇది మరింత ఊతమిచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లాలూకు ప్రమాదం.. మెట్లపై నుంచి జారిపడ్డ ఆర్జేడీ చీఫ్
పట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. ఇంట్లో మెట్లు దిగుతుండగా ఆయన కాలుజారి పడిపోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో లాలూ భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నాయి. వీపుపై కుడా గాయమైనట్లు చెప్పాయి. 'లాలూ భుజంలో ఫ్రాక్చర్ అయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గాయమైన చోట వైద్యులు బ్యాండేజ్ చుట్టారు. కొన్ని మెడిసిన్స్ రాసి వెంటనే ఇంటికి పంపారు’ అని లాలూ కుటుంబంతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. రెండు నెలల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటినుంచి ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలోనే ఉంటున్నారు. లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 16 మంది మృతి లాలూ ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆదివారం అనుకోకుండా ఇంట్లోనే మెట్లపై నుంచి జారిపడి గాయపడ్డారు. వెంటనే కుటుంసభ్యులు లాలూను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. భుజం, వీపుపై కాస్త నొప్పి తప్ప.. లాలూకు ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి -
Bihar-RJD: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం! అసదుద్దీన్‌కు షాక్!
పట్నా: మహారాష్ట్ర పరిణామాలతో ఆసక్తికరంగా మారిన దేశ రాజకీయాల్లో మరింత వేడి పెంచే సంఘటన చోటుచేసుకుంది. బిహార్‌లో ఇప్పటివరకు అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) వెనక్కినెట్టింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి షాకిస్తూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఈమేరకు జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. ఏఐఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మొహమ్మద్ అంజార్ నైమీ, ముహమ్మద్ ఐజర్ అస్ఫీ, సయ్యద్ రుక్నూద్దీన్, షానవాజ్ తమ పార్టీలో చేరినట్టు ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ బుధవారం ప్రకటించారు. కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం బిహార్‌లో 5 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి👉🏻ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు? అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ తాజా చేరికలతో ఆర్జేడీ మరింత బలం పుంజుకుంది. 79 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాతి స్థానంలో 77 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఉంది. 243 సీట్లున్న బిహార్‌లో జేడీ (యూ), బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో జేడీయూ 45 సీట్లు సాధించగా.. బీజేపీ 74 సాధించింది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముగ్గురు కాషాయ పార్టీలో చేరడంతో వారి బలం 77కు పెరిగింది. ఇక కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు, వామపక్ష పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 90 చోట్ల పోటీ చేస్తే ఫలితాలు శూన్యం! 2020 బిహార్ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలుపొంది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఏఐఎంఐఎం పార్టీ... 2021 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. 90 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. ఈనేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తమ భవిష్యత్ అయోమయంలో పడుతుందనే పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా దాదాపు 20 చోట్ల ఆర్జేడీ విజయావకాశాలను అసదుద్దీన్ పార్టీ దెబ్బకొట్టడం గమనార్హం!| చదవండి👉🏻మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్నాథ్ షిండే ప్లాన్ ఇదే! -
అగ్నిపథ్ ఎఫెక్ట్: బీహార్ బంద్.. చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
అగ్నిపథ్ పథకంపై నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా.. విద్యార్థి సంఘాలు శనివారం(జూన్ 18) బీహార్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నేతృత్వంలోని సంస్థలు ఈ పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరాయి. ఇక, విద్యార్థుల సంఘాల పిలుపు మేరకు బంద్‌కు ప్రతిపక్ష ఆర్జేపీ తన మద్దతు ప్రకటించింది. కాగా, అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ పార్టీ కార్యకర్తలతో కలిసి శనివారం గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి మెమోరాండం సమర్పిస్తామని లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాశ్వాన్..‘అగ్నిపథ్ పథకం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని.. యువతలో అసంతృప్తిని రగిల్చుతుందని’ అన్నారు. ఇదే విధమైన ఆందోళనలను లేవనెత్తుతూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పాశ్వాన్ లేఖ రాసినట్టు తెలిపారు. ఇక, బంద్ ఎఫెక్ట్ ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. రైలు, బస్సు సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. మరోవైపు.. బీహార్‌లో బంద్‌కు ప్రతిపక్ష పార్టీ మద్దతు ఇవ్వడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుపుతున్న వారిలో రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు.. బీహార్‌లో జరుగుతున్న నిరసనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆర్జేడీనే కారణమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ప్రజా ఆస్తులను తగలబెట్టే ఆర్జేడీ ఆగ్రహ నిరసనలలో బీహారీలు చనిపోతున్నారు. దీనికి ఆర్జేడీనే సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక శనివారం తలపెట్టిన బీహార్ బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: అగ్నిపథ్‌పై ఆర్మీ రిటైర్డ్ జనరల్స్ సూచనలు ఇవే.. -
లాలూ ప్రసాద్ యాదవ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌లో పలామూ జిల్లాలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటున్న ఆయన గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎలాంటి అపాయం జరగలేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. జార్ఖండ్ పర్యటనలో భాగంగా లాలూ ప్రసాద్.. పలామూకు వెళ్లారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆయన స్థానిక అతిథి గృహంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం.. లాలూ టిఫిస్ చేస్తున్న సమయంలో గదిలోని ఫ్యాన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లాలూను వెంటనే బయటకు తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి.. అనంతరం ఫ్యాన్‌ను తొలగించారు. లాలూకు ప్రమాదమేమీ జరగకపోవడంతో అధికారులు, పార్టీ కార్యకకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. #Ranchi: लालू प्रसाद यादव के कमरे में लगी आग, सर्किट हाउस में हादसे से बाल-बाल बचे RJD सुप्रीमो.@laluprasadrjd @RJDforIndia #RanchiNews #Jharkhand #JharkhandNews #RJD #LaluPrasadYadav pic.twitter.com/qS2N1VtiG4 — India Voice (@indiavoicenews) June 7, 2022 ఇది కూడా చదవండి: ఇక ‘చాన్సలర్’ మమత బెనర్జీ -
తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీకి దూరం కానున్నాడా?
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం(ఏప్రిల్ 30న) ఢిల్లీలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రుల సమావేశానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ డుమ్మా కొట్టనున్నారు. అదీ కావాలనే!. జేడీయూ ఇంకా కేంద్రంలోని బీజేపీకి మిత్రపక్షంగానే ఉందన్న సంగతి తెలిసిందే. అయితే బీహార్ రాజకీయాల్లో బీజేపీ, జేడీయూల మధ్య అంతర్గత వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల తీవ్ర వ్యాఖ్యలకు నితీశ్ కుమార్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య బీహార్‌లో ముఖ్యమంత్రిని మార్చేయాలంటూ కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బీహారీ ఏకంగా.. నితీశ్‌ను గద్దె నుంచి దించేసి.. ఆ స్థానంలో బీజేపీ నేత, డిప్యూటీ సీఎం తారకిషోర్ ప్రసాద్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో బీజేపీ నేతల తీరుపై తన సన్నిహితుల వద్ద సీఎం నితీశ్ కుమార్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనకు బదులుగా.. పూర్ణిమాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఆరంభ కార్యక్రమానికి వెళ్లాలని సీఎం నితీశ్ నిర్ణయించుకున్నారు. అయితే నితీశ్ స్థానంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రిని పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇఫ్తార్ విందు సందర్భంగా ఉపముఖ్యమంత్రి తారకిషోర్ కంటే ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో సన్నిహితంగా ఉన్నారు సీఎం నితీశ్ కుమార్. దీనిపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. కేవలం ఆతిథ్య ఉద్దేశంతోనే నితీశ్ అలా ప్రవర్తించారంటూ జేడీయూ నేతలు ప్రకటించారు. కానీ, గత కొన్నిరోజులుగా బీహార్ రాజకీయ సమీకరణాలు మరోలా సంకేతాలు ఇస్తున్నాయి. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్‌ను ప్రతిపాదిస్తాయనే పుకారు ఒకటి చక్కర్లు కొట్టగా.. మరోవైపు బీజేపీకి దూరమై ఆర్జేడీకి దగ్గరయ్యే ప్రయత్నంలో నితీశ్ కుమార్ ఉన్నట్లు బీజేపీ స్థానిక నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. చదవండి: పూజల పేరుతో ఘర్షణలకు పాల్పడడం ఏంటి?: సీఎం నితీశ్ -
ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికార రహిత రాష్ట్రాలు.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో ఉప ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. చాలాచోట్ల విజయ సంబురాలు జరుగుతున్నప్పటికీ.. ఈసీ అధికారిక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. అసన్సోల్ లోక్‌సభతో పాటు బాలీంగజ్ అసెంబ్లీ స్థానాల్లో.. శతృఘ్నసిన్హా, బాబుల్ సుప్రియోలు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దాదాపు వీళ్ల విజయం ఖాయమైంది. అసన్సోల్.. ఇది వరకు బీజేపీ సీటు. ఈ నేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు విజయోత్సవ సంబురాల్లో మునిగిపోయారు. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. I sincerely thank the electors of the Asansol Parliamentary Constituency and the Ballygunge Assembly Constituency for giving decisive mandate to AITC party candidates. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) April 16, 2022 ► నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో.. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఒకటి టీఎంసీ, రెండు కాంగ్రెస్, ఒకటి ఆర్జేడీ(విజయం) ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ► ఇక బీహార్‌లో లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ బబోచాహన్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఘన విజయం సాధించింది. ఆర్జేడీ అభ్యర్థి అమర్ కుమార్‌పాశ్వాన్ గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. ► ఛత్తీస్‌గఢ్ ఖాయిరాగఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి యశోధ నీలాంబర్ వర్మ ముందజంలో కొనసాగుతున్నారు. ► మహారాష్ట్ర కోల్హాపూర్(నార్త్) అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జైశ్రీ చంద్రకాంత్(అన్నా) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన్ను.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రియాటిన్ లెవల్ పడిపోవడంతో మెరుగైన ఆరోగ్యం కోసం లాలూను మంగళవారం ఎయిమ్స్‌కు తరలించాలని జైలు అధికారులకు రిఫర్ చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు మార్చి 11వ తేదీన కొట్టేసింది. 73 ఏళ్ల లాలూకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఆంబులెన్స్‌లో లాలూను ఎయిమ్స్‌కు తరలించే అవకాశం ఉంది. -
తేజస్వికి పార్టీ పగ్గాలపై లాలూ తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ పగ్గాలు మారబోతున్నట్లు వస్తున్న కథనాలపై ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అలాంటి వార్తల్ని ప్రసారం చేసేవాళ్లను మూర్ఖులుగా ఆయన అభివర్ణించారు. ఆర్జేడీ జాతీయాధ్యక్షుడిగా లాలూ దిగిపోతున్నారని.. ఆ స్థానే చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్‌కు త్వరలో పగ్గాలు అప్పగించబోతున్నట్లు కొన్ని మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై లాలూను వివరణ కోరగా.. ఆయన స్పందించారు. ‘అలాంటి వార్తలు ఇచ్చేవాళ్లు మూర్ఖులు. పిచ్చోళ్లే అలాంటివి ప్రచారం చేస్తారు. ఏమైనా ఉంటే మేం చెప్తాం కదా’ అని న్యూఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తేజస్విని పార్టీ ప్రెసిడెంట్ చేయబోతున్నట్లు వస్తున్న కథనాలపై పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్ కూడా స్పందించాడు. ఆ కథనాల్ని కొట్టిపారేస్తూ.. తండ్రి లాలూనే పార్టీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు లాలూ సతీమణి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్, పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే తేజస్విని పార్టీ చీఫ్‌గా ప్రకటిస్తారనే కథనాలు మొదలయ్యాయి. #WATCH | Delhi: "Those who run such news reports are fools. We will get to know whatever happens," says RJD chief Lalu Prasad Yadav when asked if Tejashwi Yadav will be made the national president of the party. (04.02.2022) pic.twitter.com/NYC5YiLzVm — ANI (@ANI) February 5, 2022 -
Tejashwi Yadav: ఘనంగా తేజస్వి యాదవ్ వివాహం
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం గురువారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు రాజ్శ్రీతో దక్షిణ ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగింది. వివాహ వేడుకకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అతని భార్య డింపుల్, రాజ్యసభ ఎంపీ మీసా భారతి, ఇతర రాజకీయ నాయకులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి తేజస్వీ, రాజ్శ్రీల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కాగా, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు కుటుంబానికి సన్నిహితులు, బంధువులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి) -
లాలు ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత
పట్న: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్‌ను శుక్రవారం ఎయిమ్స్ ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో చేర్పించామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన జ్వరంతో బాధపతున్నారని అయితే ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు చేయగా.. అన్ని పరీక్షల ఫలితాలు పాజిటివ్ రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. -
పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు?
పాట్నా: త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఓ గ్రామంలో పర్యటించాడు. అక్కడి గ్రామస్తులకు రూ.500 నోట్లు ఇస్తూ వీడియోకు చిక్కాడు. ప్రస్తుతం ఆ వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పట్టపగలు నగదు రాజకీయం జరగడంపై అధికార పార్టీ గుర్రుమంది. ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: స్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్‌కుమార్ శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) యువ నాయకుడు, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతూ కనిపించారు. తన కాన్వాయ్‌లో కూర్చుని అక్కడకు వచ్చిన మహిళలకు బహిరంగంగా రూ.500 నోట్లు ఇస్తున్నాడు. ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్’ అని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోపై అధికారులకు అధికార పార్టీ జేడీయూ ఫిర్యాదు చేసింది. దీంతో గోపాల్‌గంజ్ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. బైకుంత్‌పుర్ సమీపంలో తేజస్వి డబ్బులు పంచాడని ఆరోపణలు రావడంతో స్థానిక పోలీసులు, బీడీఓను విచారించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ డబ్బు పంపిణీ అధికార పార్టీ, ఆర్జేడీ మధ్య వాగ్వాదం మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి कोई जानता नहीं-पहचानता नहीं कौन है ये राजकुमार जिसने आंचल में रुपया गिराया है घमंड का खुमार इस कुमार पर इतना छाया, अमीरी-गरीबी का फ़र्क़ बताया कोई पीछे से लालू का लाल है बताता भूत के वर्तमान का हाल दिखाता जाओ बबुआ अपनी पहचान बनाओ आर्थिक लुटेरे होने का दाग़ मिटाओ pic.twitter.com/lUgV3Hxl11 — Neeraj kumar (@neerajkumarmlc) September 10, 2021 -
Bihar: బిహార్‌లో హనీమూన్ ముగిసినట్లేనా?
ఎన్డీయే మద్దతుతో బిహార్‌ని పాలిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక్క పెగసస్పైనే కాకుండా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు. కులాలవారీ జనగణన విషయమై బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌తో నితీశ్ ఈమధ్య సమావేశమై చర్చించడం.. భవిష్యత్తులో ఆర్జేడీ, జేడీయూల మధ్య పొత్తు సాధ్యపడుతుందనే సంకేతాలు పంపింది. ఆర్టికల్ 370 రద్దుకు నితీశ్ తొలినుంచీ అనుకూలం కాదు. రామాలయ నిర్మాణంపై కూడా జాగ్రత్తగా మౌనం పాటిస్తున్నారు. నిజానికి నితీశ్ ప్రతిపక్ష శిబిరంలో చేరితే ఏ ఇతర ప్రాంతీయ నాయకుడి కంటే అది పెద్ద ప్రేరణ కలిగించగలదు. మొత్తం ప్రతిపక్షంపై ఆయన ప్రభావం, పలుకుబడి సామాన్యంగా ఉండవు. 14 పైగా ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఎన్డీయేకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న నేపథ్యంలో బిహార్ సీఎం వైఖరిలో మళ్లీ మార్పు వస్తే ప్రతిపక్షాలకు అది పెద్ద నైతిక బలాన్ని ఇచ్చినట్లే అవుతుంది. పార్లమెంటును, దేశాన్ని చుట్టిముట్టిన పెగసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణంపై విచారణ జరిపించాల్సిందే అంటున్న ప్రతిపక్షంతో బిహార్ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామి నితీశ్ కుమార్ చేతులు కలపడం సంచలనం కలిగించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన జనాభా విధానాలను కూడా నితీశ్ విమర్శించారు. బిహార్‌లో కులాలవారీ జనగణన అంశంపై తేజస్వీ యాదవ్, తదితర ప్రతిపక్షసభ్యులతో నితీశ్ ఇటీవలే భేటీ కావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఆర్టికల్ 370 రద్దుకు నితీశ్ అనుకూలం కాదు. కానీ అయోధ్యలో రామాలయ నిర్మాణంపై మాత్రం నితీశ్ మౌనం పాటిస్తున్నారు. కాగా, వరుసగా జరిగిన ఈ పరిణామాలతో బిహార్‌లో జేడీయూ, బీజేపీ హనీమూన్ ముగిసినట్లేనని సహజంగానే ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఒకవైపున ఇరుపక్షాల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. మరోవైపు జేడీయూ గత నెలలో తొలిసారిగా కేంద్ర మంత్రిమండలిలో చేరింది. జేడీయూ జాతీయ అధ్యక్షుడు రామ్చంద్రప్రసాద్ సింగ్ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి అయ్యారు. మరొక పొత్తు పార్టీ ఎల్జేపీకి చెందిన పశుపతి కుమార్ పరాస్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను దక్కించుకున్నారు. నితీశ్ పలుకుబడి అసామాన్యం... కాకపోతే, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు ప్రత్యేకించి మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి చాలా యుక్తితో తన ప్రధాన మిత్రపక్షానికి హెచ్చరిక సంకేతాలు పంపారు. నిజానికి నితీశ్ కుమార్ ప్రతిపక్ష శిబిరంలో చేరితే ఏ ఇతర ప్రాంతీయ నాయకుడి కంటే అది పెద్ద ప్రేరణ కలిగించగలదు. ఒక దశలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి కూడా నితిశ్ పేరు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మొత్తం ప్రతిపక్షంలో ఆయన ప్రభావం, పరపతి సామాన్యంగా ఉండవు. బిహార్‌లో బీజేపీ దూకుడు జేడీయూను తోసిపుచ్చింది. నిజంగానే, గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే 31 స్థానాలు అధికంగా బీజేపీ సాధించినప్పటికీ రాష్ట్రంలో పాలకకూటమిలో జూనియర్ భాగస్వామిగానే కొనసాగుతోంది. కానీ బీజేపీలోని ఒక సెక్షన్‌తో జేడీయూకి పొసగడం లేదు. అదే సమయంలో బిహార్‌లో అన్నిటికంటే ప్రయోజనం పొందింది బీజేపీనే. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే తక్కువ స్థానాల్లోనే పోటీ చేసిన బీజేపీ ఏకంగా 74 స్థానాలు గెల్చుకుంది. జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. ఒక రకంగా ప్రాంతీయపార్టీగా మాత్రమే ఉన్న జేడీయూను అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ తీసిందనే చెప్పాలి. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బిహార్‌లో ఎన్డీఏ కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత నితీశ్‌కుమార్ పలుకుబడిని దెబ్బతీసిందని బీజేపీ నేతలు భావించారు. నాటి ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ బహిరంగంగానే నితీశ్‌కి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ఎన్డీయే కూటమికి చెందిన చాలామంది తిరుగుబాటుదారులను తన పార్టీలో చేర్చుకున్నారు. జేడీయూను సంఖ్యాపరంగా కుదించివేసి నితీశ్ ముఖ్యమంత్రిత్వాన్నే బీజేపీ పక్కనపెట్టే కుట్ర చేస్తోందని పుకార్లు రేగాయి. అయితే బీజేపీ నిజాయితీగానే ఆ పుకార్లను తోసిపుచ్చింది. తిరుగుబాటుదారులను పార్టీనుంచి తొలగించి 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా నితీశ్‌కుమారే కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పింది. అదే సమయంలో చిరాగ్ జేడీయూని దెబ్బతీయడంలో విజయం పొందారు కానీ ఊహించినంతమేరకు సాధించలేకపోయారు. ఎన్డీయేకి విలువైన పొత్తుదారు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే నితీశ్‌కుమార్ ఎన్డీయేకి చెయ్యి చూపి ఆర్జేడీతోనూ, దాని ప్రధాన భాగస్వాములైన కాంగ్రెస్, సీపీఎంతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తారని అంచనాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 2021 జనవరిలో ఒక జేడీయూ ఎమ్మెల్యే మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో క్లిప్‌లో మరో ఆరునెలల్లో నితీశ్ ఎన్డీయేని వదిలివేస్తారన్న మాటలు బాగా వైరల్ అయ్యాయి. కానీ మహాఘట్ బంధన్‌తో చేదు అనుభవం కారణంగా 2017లో నితీశ్ కుమార్ ఆ కూటమి నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో తిరిగి ఆవైపు వెళ్లే అవకాశాలు లేవని కూడా కొందరు చెబుతున్నారు. ఒక జాతీయ పార్టీగా బీజేపీకి నితీశ్ విలువైన భాగస్వామిగా కొనసాగుతారు. నితీశ్ లేకుండా బిహార్‌లో అధికారం కైవసం చేసుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం తనకు దక్కుతుందనే ఆశ బీజేపీకి లేదు. పైగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ సవాళ్లు చుట్టుముడుతున్నాయి. దీంతో తన కూటమి పార్టీలను, ప్రత్యేకించి నితీశ్‌కుమార్‌ని తన పక్షంలో నిలుపుకోవడం బీజేపీకి కీలకంగా మారింది. ఈ కోణంలోంచి చూస్తే, బిహార్‌లో కులాలవారీ జనగణన అంశంపై తేజస్వితో, ఇతర ప్రతిపక్ష సభ్యులతో నితీశ్‌కుమార్ ఇటీవల సమావేశం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ బీజేపీ కులాలవారీ జనగణనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎందుకంటే, జనాభా గణనలో ఎలాంటి కీలకమైన మార్పు చేసినా దానివల్ల రిజర్వేషన్లను పునర్వ్యవస్థీకరించాలనే డిమాండు పుట్టుకొస్తుంది. పైగా అది భారీ విస్ఫోటనకు దారితీసే సమస్య అవుతుందని బీజేపీ యోచన. అయితే కులాలవారీ జనగణన అంశమే ప్రతిపక్షాలతో చర్చల సందర్భంగా నితీశ్‌కు ఏకైక ఎజెండాగా ఉండిందని జేడీయూ నొక్కి చెబుతున్నప్పటికీ, ఒకప్పుడు మిత్రుడిగా ఉండి ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్న తేజస్వితో సీఎం చర్చలు కాస్త అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. విభేదాల కారణాలు ఉత్తరప్రదేశ్ జనాభా స్థిరీకరణ బిల్లుపై నితీశ్ పరిశీలన ప్రకారం, తన మంత్రిమండలిలోని బీజేపీ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ జనాభా స్థిరీకరణ బిల్లు వంటిది బిహార్‌లో చట్ట రూపంలోకి తీసుకొచ్చే అవకాశం లేదనీ, మహిళా విద్య, సాధికారతను మాత్రమే ముందుకు తీసుకుపోవచ్చని తెలుస్తోంది. నితీశ్ కేబినెట్లో బీజేపీ మంత్రి ఒకరు ఈ అంశంపై మాట్లాడుతూ బిహార్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన ఇప్పటికే అమలులో ఉందని ఎత్తిచూపారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలకు కులగణన, జనాభా బిల్లు మాత్రమే కారణాలు కావు. గతంలోనూ ఆర్టికల్ 370 రద్దు పట్ల నితీశ్ సానుకూలత వ్యక్తపర్చలేదు కానీ ఒకసారి చట్టం రూపొందిన తర్వాత అందరూ దానికి కట్టుబడాల్సిందేనని నితీశ్ వివరణ ఇచ్చారు. అలాగే అయోధ్యలో రామాలయ నిర్మాణం పట్ల కూడా హెచ్చరించారు కానీ ఈ అంశంపై జాగ్రత్తగా మౌనం పాటించారు. ఇక బీజేపీ తనవంతుగా నితీశ్ సామాజిక నిర్మాణం, సంక్షేమవాదాన్ని దాటి, రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగావకాశాలు కల్పించడం వైపుగా దృష్టి సారించాలని కోరుకుంటోంది. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా రాష్ట్రంలో వికాసాన్ని తీసుకురాగల ముఖ్యమంత్రిగా నితీశ్ ఉండాలని కోరుకున్నారు. ఈ అన్ని అంశాలూ కలిసి తన మిత్రకూటమి నుంచి సౌకర్యవంతంగా పనిచేసుకుపోయే అవకాశాలను నితీశ్ కుమార్‌కి తగ్గించివేస్తున్నాయి. 2017లో కూడా మహాఘట్ బంధన్ అలాంటి సౌకర్యాన్ని నితీశ్‌కి కల్పించడంలో విఫలమైంది. బిహార్‌లో అదేవిధమైన తప్పును మరోసారి చేయకుండా బీజేపీ తన సహచరులను కట్టడి చేయాల్సి ఉంది. ఎందుకంటే రాజకీయ అస్థిరత్వం రాష్ట్ర పురోగతిని తోసిపుచ్చుతుంది తప్ప దాంతో ఒరిగే ప్రయోజనం లేదు. వ్యాసకర్త: భవదీప్ కాంగ్ సీనియర్ పాత్రికేయురాలు -
కరోనాతో ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : హత్య కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ కరోనా కారణంగా కన్నుమూశారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రి వర్గాలు, ఢిల్లీలోని తీహార్ జైలు డీజీ సందీప్ గోయెల్ఈ విషయాన్ని ధృవీకరించారు. షాహాబుద్దీన్‌కు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆరోగ్యం విషమించిన షాహాబుద్దీన్‌కు సరైన చికిత్స అందించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని, తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏప్రిల్ 20 న దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బిహార్‌లోని సివాన్‌కు చెందిన షాహాబుద్దీన్ మరణంపై ఆర్జేడీనేత తేజశ్వి యాదవ్ సహా, పప్పు యాదవ్ పలువురు ఇతర నాయకులు ట్విటర్లో నివాళులర్పించారు. ఆయన అకాల మరణం బాధాకరమైన వార్త అని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఆర్జేడీ కుటుంబానికి ఇది విచారకరమైన వార్త అని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. పేద ప్రజల కోసం ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కాగా బిహార్ బాహుబలిగా వ్యవహరించే మహ్మద్ షాహాబుద్దీన్‌పై జీవిత ఖైదు తోపాటో 30 కి పైగా కేసులు నమోదయ్యాయి. బిహార్ నుంచి తిహార్ జైలుకు తీసుకురావాలని సుప్రీంకోర్టు 2018 ఫిబ్రవరి 15 న ఆదేశించింది. తిహార్‌కు ముందు భగల్పూర్, సివాన్ జైలులో కూడా సుదీర్ఘ శిక్ష అనుభవించాడు. 2018 లో బెయిల్ పొంది జైలు నుంచి బయటకువవచ్చినా బెయిల్ రద్దు కారణంగా తిరిగి జైలుకు వెళ్లారు. గతేడాది సెప్టెంబర్‌లో తండ్రి షేక్ మహ్మద్ హసీబుల్లా మరణించిన సమయంలో షాహాబుద్దీన్‌ను పెరోల్‌కు కూడా అనుమతి లభించలేదు. చదవండి : ఘోరం: 14 మంది కోవిడ్ బాధితులు సజీవ దహనం -
రణరంగంగా బిహార్ అసెంబ్లీ.. మగాడివైతే చంపు..
పట్నా: బిహార్ అసెంబ్లీ మంగళవారం రణరంగాన్ని తలపించింది. స్పీకర్‌ను తన స్థానం వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న విపక్ష సభ్యులను నిలువరించే విషయంలో మార్షల్స్‌కు సహకరించేందుకు సభలోకి పోలీసులను పిలవాల్సి వచ్చింది. రాష్ట్రంలోని సాయుధ పోలీసు బలగాలను మరిన్ని అధికారాలను కల్పించే ‘బిహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ బిల్, 2021’ ను అడ్డుకునేందుకు ఐదు పార్టీల విపక్ష కూటమి విఫల యత్నం చేసింది. ఎట్టకేలకు, మంగళవారం సాయంత్రం ప్రతిపక్ష సభ్యులను బయటకు పంపాక బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. వారెంట్ లేకుండా సోదాలు జరిపే, అరెస్ట్ చేసే అధికారం స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్‌లకు కల్పించే ప్రతిపాదనను ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సభలోకొచ్చిన స్పీకర్‌ను తన స్థానం వద్దకు వెళ్లనివ్వకుండా, పోడియంను చుట్టుముట్టిన పలువురు ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. మిగతా విపక్ష సభ్యులు వెల్‌లో, సభలో గందరగోళం సృష్టించారు. కుర్చీలను ధ్వంసం చేశారు. విధాన సభ కార్యదర్శి కుర్చీని విసిరివేశారు. విపక్షసభ్యుల తీరు చూసిన అధికార పక్ష సభ్యుల్లోనూ ఆగ్రహం పెల్లుబికింది. విపక్ష సభ్యుల వీరంగంతో షాక్‌కు గురైన స్పీకర్ విజయ్ సిన్హా చేష్టలుడిగిపోయారు. ఆ సమయంలో, తాత్కాలికంగా స్పీకర్ స్థానంలో కూర్చున్న బీజేపీ సభ్యుడు ప్రేమ్ కుమార్ చేతుల్లో నుంచి కాగితాలను లాక్కుంటున్న ఆర్జేడీ ఎమ్మెల్యేతో మంత్రి అశోక్ చౌధరి బాహాబాహీకి దిగారు. దీంతో స్పీకర్ సభను సాయంత్రం 4.30 వరకు వాయిదా వేశారు. ఆ తరువాత స్పీకర్ చాంబర్‌ను చుట్టుముట్టిన విపక్ష సభ్యులు.. ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో, మార్షల్స్‌కు సహకరించేందుకు విధాన సభలోనికి పోలీసులను పిలిపించారు. పోలీసులు, మార్షల్స్ కలిసి పలువురు ఆర్జేడీ, సీపీఎం ఎమ్మెల్యేలను బయటకు తీసుకువచ్చారు. అక్కడ కొందరు ఎమ్మెల్యేలు సొమ్మసిల్లి పడిపోయారు. తమను పోలీసులు కొట్టారని ఆ తరువాత ఆ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సీఎం నితీశ్ సమక్షంలోనే అధికార పక్ష సభ్యులు తన చేతిని విరగ్గొట్టారని చేతి కట్టుతో వచ్చిన మరో ఆర్జేడీ ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యేలను జుట్టు పట్టుకుని కొడుతూ బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు, మరో మహిళా ఎమ్మెల్యేను పోలీసులు బయటకు లాక్కుని వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. जब विपक्षी विधायकों की हुई पिटाई और सदन से घसीटकर बाहर फेंक दिया गया । Bihar Tak#Bihar_Vidhansabha pic.twitter.com/hEKmDMD0XI — Bihar Tak (@BiharTakChannel) March 23, 2021 మగాడివైతే చంపు.. బిల్లుకు వ్యతిరేకంగా పట్నాలో మంగళవారం ఉదయం నుంచి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. డార్క్ బంగ్లా క్రాసింగ్ వద్ద అసెంబ్లీ వైపు వెళ్తున్న వారి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. వాటర్కెనాన్లు ప్రయోగించారు. పోలీసులపై ఆర్జేడీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కార్యకర్తలు, పోలీసులతో పాటు ఆ ర్యాలీని కవర్ చేస్తున్న జర్నలిస్ట్‌లకు కూడా గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై ఆర్జేడీ నేత తేజీస్వీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీ బయటకు లాక్కుని వస్తున్న పోలీసులను అడ్డుకుంటూ, అక్కడ ఉన్న అదనపు ఎస్పీతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. సీఎం నితీశ్‌ను ఉద్దేశిస్తూ.. ‘నితీశ్ కుమార్.. నీవు మగాడివైతే మమ్మల్ని కొట్టించే బదులు కాల్చి చంపు’ అని ఆ తరువాత ఆగ్రహంగా ట్వీట్ చేశారు. -
మాజీ ముఖ్యమంత్రికి మళ్లీ నిరాశ
రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే బెయిల్ కోసం రాష్ట్రపతికి ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 50 వేల పోస్టుకార్డులు రాసి ‘మానవత దృక్పథంతో నా తండ్రిని విడుదల చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. మళ్లీ రెండు నెలల వరకు లాలుకు బెయిల్ లభించే అవకాశం లేదు. దాణా కుంభకోణం కేసులో అరెస్టయిన లాలు ప్రసాద్ యాదవ్ 2017 డిసెంబర్ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శుక్రవారం ఆయన బెయిల్ పిటిషన్ రాగా హైకోర్టు నిరాకరించింది. రెండు నెలల తర్వాత బెయిల్ పిటిషన్ మళ్లీ వేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ఈ బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నా విడుదల చేసేందుకు న్యాయస్థానం అంగీకరించడం లేదు. అయితే లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న లాలును రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. కిడ్నీ 25 శాతం మాత్రమే పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానవతావాదంలో లాలును విడుదల చేయాలనే విజ్ఞప్తులు భారీగా వస్తున్నాయి. -
కట్టెలు, మట్టి పొయ్యితో అసెంబ్లీకి
పాట్నా: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతోపాటు వాటికి సమానంగా గ్యాస్ ధరలు ఆకాశన్నంటుడుతుండడంతో సామాన్యులతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఊరట లభించకపోవడంతో ప్రజలతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు వినూత్నంగా హాజరయ్యారు. గ్యాస్ ధరల పెంపుతో ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కే అంటూ నిరసన వ్యక్తం చేశారు. బిహార్‌లో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తన వాహనం నుంచి దిగుతూ కట్టెలు, మట్టి పొయ్యిని చేతిలో పట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ధరలు ఎలా పెరుగుతున్నాయో చెప్పేలా ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్యాస్ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రజలు మళ్లీ పాత పద్ధతిలో వంటలు వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వల్లనే ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీ లోపలకు వెళ్లే సమయంలో భద్రతా సిబ్బంది పొయ్యి, కట్టెలను నిరాకరించారు. ఇక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేశ్ రౌశన్ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కారులో కాకుండా అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చి పెట్రోల్ ధరల పెంపుపై ఆందోళన చేశారు. ‘7 గంటలకు సైకిల్‌పై బయల్దేరాను. అసెంబ్లీకి రావడానికి చాలా ఖర్చవుతోంది. దీనిపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’ ఎమ్మెల్యే ముఖేశ్ మీడియాతో చెప్పారు. -
అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే
బీహార్: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండవ రోజు కూడా పెరగడంతో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా బీహార్‌లో బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడంతో అసెంబ్లీ మొదటి రోజున ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన మహువా ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ పాట్నాలోని అసెంబ్లీకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంపై తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశారు. "నేను హాజీపూర్ నుంచి ఉదయం 7గంటలకు సైకిల్ మీద బయలుదేరాను. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో ఏది కొనే పరిస్థితి లేదు, అలాగే బీహార్‌లో నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీటి విషయంపై ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం" అని ముఖేష్ మీడియాకు తెలిపారు. చదవండి: భారీగా పడిపోయిన బంగారం ధరలు -
విషమించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ కురవృద్దుడు ఇప్పటికే రాంచీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గతకొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గత మూడు రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది. జైలు అధికారుల సమాచారం మేరకు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, రబ్రీదేవి శుక్రవారం రాత్రి రాంచీ చేరుకుని ఆయన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి మెరుగైన ఆరోగ్యం అందించాలని తేజస్వీ యాదవ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌ను కోరారు. దీంతో వైద్యుల సూచనల మేరకు శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, మెరగైన వైద్యం కోసం ఢిల్లీ తరలిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లాలూ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనారోగ్య పరిస్థితుల కారణంగా లాలూకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాదులు పట్నా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. -
ఎదురుదెబ్బ: ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆపరేషన్ ఆకర్శ్, మిత్రపక్ష ఒత్తిళ్ళతో బిహార్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ, జీతన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చాలు ఈసారి రాజకీయ దుమారాలకు వేదికగా నిలవనున్నాయి. చాలా మంది ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని జేడీయూ నేతలు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలకు ఒక కాంగ్రెస్ నేత మరింత బలాన్ని చేకూర్చారు. 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధపడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు భరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో ఆరోపణలకు కేంద్రబిందువుగా మారాయి. బిహార్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులున్నాయని కాంగ్రెస్ నేత భరత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత అజిత్ శర్మతో చెప్పానని కూడా ఆయన తెలిపారు. పార్టీ మారేందుకు సిద్ధమైన 11 మంది ఎమ్మెల్యేల పేర్లను సైతం సీఎల్పీ నాయకుడికి ఇచ్చానని, పార్టీని వీడేందుకు సిద్ధమైన వారిలో బిహార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా కూడా ఉన్నారని భరత్ సింగ్ వ్యాఖ్యానించారు. మదన్ మోహన్ ఝా ఇప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చౌదరి బాటలో పయనిస్తున్నారని భరత్ సింగ్ ఆరోపించారు. ఈ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు ఇచ్చి టికెట్ తీసుకొని ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపణలు చేశారు. వీరంతా త్వరలోనే ఎన్డీఏలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. అంతేగాక 2020 అసెంబ్లీ ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన కనబరిచిన తరువాత బిహార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పరస్పర విభేదాలు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. అశోక్ చౌదరి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలుచుకుంది. అప్పుడు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అశోక్ చౌదరి ఆ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన నితీశ్‌తోనే ఉన్నారు. ఆ తరువాత నితీశ్ మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సైతం అశోక్ చౌదరి కాంగ్రెస్ పార్టీని వీడి జేడీయూలో చేరారు. ప్రస్తుతం చౌదరి విద్యా శాఖ మంత్రిగా, జేడీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర కాంగ్రెస్ పూర్తిగా చీలిపోతుందని అందరూ భావించారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో ఊగిసలాడుతున్నారు. ఒకవేళ బీజేపీ, జేడీయూల మధ్య అంతరాలు పెరిగి, ఆర్జేడీ ప్రయత్నాలు విజయవంతమైతే అప్పుడు పార్టీని ఎందుకు వీడామనే పశ్చాత్తాపం ఎదురవుతుందనే భయం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో మంత్రి పదవి కావాలంటున్న మాంఝీ బిహార్ రాజకీయాల్లో రాజకీయ ఒత్తిళ్ళు ఊపందుకుంటున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్యపక్షంగా ఉన్న హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) జాతీయ అధ్యక్షుడు జీతన్ రాం మాంఝీ ఎన్డీఏపై తనదైన శైలిలో ఒత్తిడి పెంచుతున్నారు. త్వరలో శాసన మండలికి నామినేట్ చేయబోయే 12 నుంచి 14 సీట్లలో కనీసం ఒకటైనా తమకు కచ్చితంగా కేటాయించాలని మాంఝీ తెలిపారు. బుధవారం హెచ్ఏఎం జాతీయ కార్యకారిణి సమావేశం అనంతరం మాంఝీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ కేబినెట్ విస్తరణలో ఎలాంటి ప్రతిష్టంభన లేదని, జనవరి 14 తర్వాత జరుగబోయే విస్తరణలో తమ పార్టీకి మరో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో నితీశ్ కుమార్‌ను నమ్ముతున్నామన్న ఆయన, ఎన్నికల్లో ఒకవేళ ఏడు స్థానాల్లోనూ గెలిచి ఉంటే, అధికార పీఠంపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేవారమని వ్యాఖ్యానించారు. -
నితీష్‌కు షాక్: ఎమ్మెల్యేల తిరుగుబాటు!
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌పై తిరుగుబాటు చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారంటూ ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జేడీయూ చెందిన 17 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత శ్యామ్ రాజక్ చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీతో కూటమిగా ఏర్పడి మైనర్ భాగస్వామ్య పక్షంగా నిలిచిన జేడీయూతో కలిసి ఉండేందుకు వారంతా సిద్ధంగా లేరని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆయన అన్నారు. అంతేకాకుండా నితీష్ కుమార్ పేరుకే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుకున్నారని, ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు మొత్తం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే నడుస్తున్నాయని పేర్కొన్నారు. జేడీయూ చెందిన 17 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంలోని కీలక మంత్రి పదవులన్నీ బీజేపీ నేతలకే కట్టబెట్టారని జేడీయూ ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారని ఆయన ఆరోపించారు. రాజక్ ప్రకటనతో నితీష్ ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. (బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలు!) ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విపక్ష గూటికి చేరడం ఇటీవల కాలంలో తరచుగా చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఈ తరుణంలో ఆర్జేడీ నుంచి పొంచి ఉన్న ముప్పును తట్టుకునేందుకు నితీష్ సిద్ధమవుతున్నారు. రాజక్ ప్రకటన అనంతరం పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన నితీష్... ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తేజస్వీ యాదవ్ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలంతా తమ వెంటే ఉంటారని, బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై వారికి విశ్వాసం ఉందని ప్రకటించారు. తిరుగుబాటు అనేదానికి తమ పార్టీలో చోటులేదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ 74 స్థానాల్లో గెలుపొందగా.. ఆర్జేడీ 75 స్థానాలతో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం శాసనసభలో విపక్ష కూటమికి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అధికారపక్షానికి 127 మంది సభ్యులు ఉన్నారు. (బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు) మరోవైపు ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పి తమతో చేతులు కలపాలని ఇటీవల ఆర్జేడీ నితీష్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. తేజస్వీ యాదవ్‌కు బిహార్ సీఎం పగ్గాలు అప్పగిస్తే రానున్న (2024) పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా నితీష్‌ను ఎన్నుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు ఆర్జేడీ సీనియర్ నేత ఉదయ్ నారాయణ్ చౌదరీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నితీష్ కుమార్ ఇంకా బీజేపీ మైనర్ భాగస్వామ్య పక్షంగా ఉండాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరడం ఇరు పార్టీల మధ్య వైరుధ్యానికి దారితీసింది. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మరో రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలపై గాలం వేయడం రాజనీతి కాదని జేడీయూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. -
ఎన్డీయేలో టెన్షన్.. ప్రధాని అభ్యర్థిగా నితీష్!
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో ఏర్పడిన బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలువారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరడం ఇరు పార్టీల మధ్య వైరుధ్యానికి దారితీసింది. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మరో రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలపై గాలం వేయడం రాజనీతి కాదని జేడీయూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిహార్ వేదికగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయ చిత్రంలో కొత్త కూటమికి దారి తీసే విధంగా కనిపిస్తున్నాయి. జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఎన్డీయే కూటమి నుంచి వెనక్కి తీసుకొచ్చేలా ప్రతిపక్ష ఆర్జేడీ ప్రణాళికలు రచిస్తోంది. అపర చాణికుడ్యిని తమ వైపుకు తిప్పకుంటే ఇక తమకు తిరుగేలేదని భావిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బకు భంగపడ్డ నితీష్ కుమార్‌ను చేరదీసేందుకు ఆర్జేడీ నేతలు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే ఆర్జేడీ సీనియర్ నేత ఉదయ్ నారాయణ్ చౌదరీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. (వైదొలిగిన నితీష్.. కొత్త వ్యక్తికి బాధ్యతలు) బీజేపీకి గుడ్‌బై చెప్పి.. తమతో చేతులు కలపాలని సీఎం నితీష్ కుమార్‌కు నారాయణ్ చౌదరీ సలహా ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పీఠం తేజస్వీ యాదవ్‌కు అప్పగిస్తే.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నితీష్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంటామని బంపరాఫర్ ఇచ్చారు. విపక్ష నేతలందరితో చర్చించి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. దానికి ఆర్జేడీ సిద్ధంగా ఉందని, నితీష్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఆర్జేడీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నితీష్ కుమార్‌ఇంకా బీజేపీ మైనర్ భాగస్వామ్య పక్షంగా ఉండాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. (బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు) భవిష్యత్‌లోనూ బీజేపీతో కలిసే ఉండే జేడీయూను పూర్తిగా దెబ్బతీస్తారని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు సీఎం పగ్గాలు అప్పగించాలని కోరారు. కాగా మొన్నటి వరకు జేడీయూ అధ్యక్షుడిగా కొనసాగిన నితీష్.. ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మరో సీనియర్ నేత ఆర్సీపీ సింగ్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే నితీష్ కుమార్ మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి పదవి తనకు అక్కర్లేదన్నారు. తనకు ఈ పదవిపై ఏ మాత్రం వ్యామోహం లేదని.. బీజేపీ నేతల ఒత్తిడి మేరకే సీఎం బాధ్యతలు చేపట్టానని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితీష్ వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమిలో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్జేడీ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆర్జేడీ రాజకీయ వ్యూహాలను బీజేపీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
లాలూ ఆడియో క్లిప్ కలకలం
పట్నా: ఎన్డీఏకు చెందిన ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యత్నిస్తున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన ఆరోపణలు బిహార్‌లో సంచలనం సృష్టించాయి. నితీశ్ కుమార్ నూతన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా లాలూ ఎంఎల్ఏలను ప్రలోభపరుస్తున్నారని చెబుతూ సుశీల్ ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ ఆడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ పిర్పైంటి ఎంఎల్ఏ లలన్ కుమార్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ‘‘నిన్ను బాగా చూసుకుంటాం. స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయేందుకు సాయం చెయ్యి’’ అని లాలూ అంటున్నట్లు ఆడియోలో ఉంది. ఇందుకు ఎంఎల్ఏ బదులిస్తూ ఇందుకు చాలా ఇబ్బందులుంటాయని చెప్పగా, భయపడవద్దని, ఆర్జేడీ స్పీకర్ వస్తారని, ఇందుకుగాను తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి పదవి ఇస్తామని లాలూ చెబుతున్నట్లుంది. సుశీల్‌తో తాను ఉన్నప్పుడే లాలూ కాల్ చేశారని సదరు ఎంఎల్ఏ చెప్పారు. ప్రస్తుతం లాలూ పశుగ్రాసం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని బిహార్ డిప్యుటీ సీఎం తార్ కిశోర్ ప్రసాద్ చెప్పారు. ఈ ఆడియోక్లిప్‌పై ఆర్జేడీ ఏమీ వ్యాఖ్యానించలేదు. కానీ ఆ పార్టీ ఎంఎల్ఏ ముకేశ్ రోషన్ మాత్రం మార్చికల్లా నితీశ్ ప్రభుత్వం పడిపోయి, తేజస్వీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. మరోవైపు బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీఏకి చెందిన విజయ్ సిన్హా ఎన్నికయ్యారు. -
నితీష్ కుమార్‌కు ఆర్జేడీ ఆఫర్
పట్నా : బీజేపీ నామినేటెడ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ తమతో చేతులు కలపాలని ఆర్జేడీ సీనియర్ నేత అమర్నాథ్ గమీ వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సీఎం పీఠంలో నితీష్ కుమార్‌కు కూర్చోబెట్టడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రానున్న కొద్దికాలంలోనే నితీష్ ప్రభుత్వం కూలిపోతుందని తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బందన్ బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్నాలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీదే విజయమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎన్నికైనప్పటికీ అధికారమంతా బీజేపీ నేతల చేతుల్లోనే ఉంటుందన్నారు. ఎలాంటి అధికారాలు లేని సీఎం పీఠంలో నితీష్ ఉండి ఉపయోగంలేదన్నారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి తమతో చేతులు కలపాలని కోరారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ బీజేపీ ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించాలని అమర్నాథ్ సూచించారు. కాగా ఇటీవల వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది. దీనిపై జాతీయ స్థాయిలో వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయిన్పటికీ ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే నితీష్‌ను సీఎంగా ఎన్నుకున్నామని బీజేపీ చెబుతోంది. -
బీజేపీ బలవంతం మేరకే సీఎం..
పట్నా : బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష ఆర్జేడీ మరోసారి వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఆర్జేడీ, బీజేపీ కంటే తక్కువ స్థానాలను గెలుచుకుని సీఎం పీఠంలో కూర్చోడానికి నితీష్ సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనకు ఏమాత్రం ఇష్టంలేకున్నా బీజేపీ నేతల బలవంతం మేరకే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు నితీష్ కుమార్ ఇదివరకే చెప్పారని ఆర్జేడీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. నితీష్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన ఆర్జేడీ ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన ఫలితాలే తమ నిర్ణయానికి కారణమని పార్టీ పేర్కొంది. (కాషాయ గూటికి మాజీ సీఎం కుమారుడు!) ‘నిజానికి మరోసారి సీఎంగా పని చేయడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. జేడీయూ మూడవ స్థానంలో నిలవడం ఊహించలేనిది. సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే ఓపిక ఇక నాకు లేదు.’ అంటూ ఆదివారం ఎన్డీయే పక్షాల సమావేశంలో బీజేపీ నేతలతో నితీష్ కుమార్ చెప్పినట్లు ఆర్జేడీ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. తానే సీఎంగా ఉండాలని బీజేపీ నేతలు ఏడ్చి పట్టుబట్టారని.. వారి అభిప్రాయాన్ని కాదనలేకే సీఎంగా కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నానని నితీష్ చెప్పినట్లు ఆర్జేడీ వ్యంగంగా ట్వీట్ చేసింది. నవంబర్ 10న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి 125 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. 74 స్థానాలతో కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 43 స్థానాలతో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ రెండవ స్థానంలో ఉండగా వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ), హిందుస్తాన్ ఆవాస్ మోర్చా చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఈ ఎన్నికల్లో 75 సీట్లను కైవసం చేసుకుని ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఆరోపిస్తున్నారు. -
‘రాహుల్ ఆ సమయంలో ప్రియాంక ఇంట్లో ఉన్నారు’
పట్నా: బిహార్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్‌లో పరస్పర విమర్శల పర్వం మొదలైంది. కాంగ్రెస్‌తో దోస్తీనే తమను దెబ్బ తీసిందని ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ అన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా మనసుపెట్టి పని చేయలేదని వ్యాఖ్యానించారు. తమ కూటమికి కాంగ్రెస్ ఒక అడ్డంకుగా మారిందని విమర్శించారు. 70 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి కనీసం 70 బహిరంగ సభలను కూడా కాంగ్రెస్ నిర్వహించలేకపోయిందని అన్నారు. రాహుల్ గాంధీ మూడు రోజులు మాత్రమే ర్యాలీల్లో పాల్గొన్నారని, ప్రియాంక గాంధీ అసలు రానేలేదని వాపోయారు. బిహార్‌తో పెద్దగా పరిచయం లేదని ఇలా చేయడం తగదని అన్నారు. తమ దగ్గరే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉందని తివారీ అన్నారు. ఎక్కువ స్థానాల్లో పోటీచేసి తక్కువగా సీట్లను సాధించడంపట్ల ఆ పార్టీ దృష్టి సారించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక ఇంటికి పిక్నిక్కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పార్టీని నడిపే విధానం ఇదేనా అని రాహుల్‌ని తివారం సూటిగా ప్రశ్నించారు. మరోవైపు కూటమిలో సీట్ల పంపకం చాలా ఆలస్యం కావడంతోనే ప్రచారం సరిగా సాగలేదని, ఓటమికి అదే కారణమని కాంగ్రెస్ వాదిస్తోంది. కాగా, 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరగ్గా.. ఎన్డీఏ కూటమి 124 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి తరుఫున ముఖ్యమంత్రిగా జేయూడీ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల కూటమి మహాగఠ్ బంధన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ 111 సీట్లలో విజయం సాధించింది. మహాగఠ్ బంధన్ ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని కూటమి సభ్యులు విమర్శిస్తున్నారు. 70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లలో మాత్రమే గెలుపొందడం దీనికి కారణం. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 27 సీట్లలో గెలుపొందింది. ఇక 76 స్థానాల్లో గెలుపొందిన ఆర్జేడీ బిహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత ఎన్నికల్లో మూడు సీట్లలోనే విజయం సాధించిన లెఫ్ట్ పార్టీలు తాజాగా 16 స్థానాల్లో గెలుపొందాయి. -
ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ ఛీప్ తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల్లో పెద్ద ఎత్తున ఆక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. బిహార్ ఓటర్లు మహా ఘట్‌బందన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల సంఘంతో కుమ్మకై ఫలితాలను తారుమారు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అవకతవకలు జరిగాయన్నారు. గురువారం పట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేకు ఈసీ అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. పోల్ ప్యానల్‌పై సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ ఫలితాలను రీకౌంటింగ్ జరపించాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఫలితాలపై ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహా కూటమి గెలిచిన స్థానాల్లో చాలావరకు వెయ్యిలోపు మెజార్టీ ఉండటంతో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. (బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!) కాగా మంగళవారం విడదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి విజయ సాధించింది. ఆర్జేడీకి 76, బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి 74 స్థానాను సొంతం చేసుకుంది. అయితే ఆర్జేడీ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో ఆ ప్రభావం తేజస్వీపై పడింది. ఏకంగా 70 సీట్లకు పోటీచేసి కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మరోసారి బిహార్ సీఎం పగ్గాలను అందుకునేందుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. మంత్రివర్గ సంప్రదింపుల అనంతరం దిపావళి తరువాత సీఎంగా ప్రమాణం చేయనున్నారు. కేబినెట్లో కీలక శాఖలు తమకే దక్కాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో తేజస్వీ మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు. -
తేజస్వి వైఫల్యానికి ఐదు కారణాలు
పట్నా: తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ అధికారపీఠాన్ని అందుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే అతి చిన్న వయసులో సీఎంగా రికార్డులకెక్కేవారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 200 ర్యాలీల్లో పాల్గొని, ఆర్జేడీ కుల సమీకరణలకు భిన్నంగా పది లక్షల ఉపాధి అవకాశాలపై హామీలిచ్చి, యువతరం మదిని మెప్పించినప్పటికీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. బిహార్ రాజకీయాలను సుదీర్ఘకాలంపాటు శాసించిన రాజకీయ దురంధరుడు లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిల కుమారుడు తేజస్వి. చదువు పెద్దగా అచ్చిరాక, అర్ధంతరంగా 10వ తరగతిలోనే చదువుకి స్వస్తిపలికిన తేజస్వి యిప్పుడు దేశంలోనే అతి తక్కువ వయస్సున్న ప్రతిపక్ష నేత. ఆయన రాజకీయారంగేట్రం 2015లో జరిగింది. 2018 నుంచి ఆర్జేడీ అధినాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ గెలుపుని ఖాయం చేసినా, ఆ పార్టీ అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోయింది. అయితే బిహార్‌లో ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలపగలిగారు. క్షేత్ర స్థాయిలో నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తేజస్వి అనుకూల ఓటుగా మలుచుకోలేకపోయారు. మహాగఠ్ బంధన్ వైఫల్యం తేజస్వి వైఫల్యంగానే చూడాలని నిపుణులు అంటున్నారు. మహాకూటమి ఎందుకు ఓడిందంటే... 1. పేదరికం, ఉపాధి కల్పన, వలస కార్మికుల సంక్షోభం లాంటి విషయాలపై తేజస్వి ఎక్కువ దృష్టిపెట్టి, కులాలకు అతీతంగా ప్రచారం చేశారు. ఈ ఎత్తుగడ కలిసిరాలేదు. 2. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో పోటీపడి 19 మాత్రమే గెలవడం ఓటమికి ప్రధాన కారణమంటున్నారు. 3. ఏఐఎంఐఎం కూడా ముస్లిం ఓటర్ల ప్రాబల్య ప్రాంతాల్లో పోటీచేసి, 5 స్థానాలు పొందడంతో పాటు, మిగిలిన చోట్ల ఓట్లు చీల్చింది. 4. ఆర్జేడీ గెలిస్తే జంగిల్ రాజ్ వస్తుందంటూ బీజేపీ చేసిన ప్రచారం కూడా ఆర్జేడీకి ప్రతికూలంగా మారింది. 5. తేజస్వి క్షేత్ర స్థాయిలో జనంతో మమేకమై ఉంటే ఆర్జేడీ గెలుపు ఖాయమయ్యేదని అంచనా. -
బిహార్‌లో సరికొత్త అడుగులు!
భారత రాజకీయాల్లో ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భావానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజíస్వీ యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపదికన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వీ యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వీ.. యాదవ రాజకీయాల బరువునుంచి పూర్తిగా తప్పుకుని కొత్త పంథాలో నడిచి అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. తన వంటి అతి పిన్నవయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలను ప్రతిబింబిస్తున్న సరికొత్త హీరో తేజస్వీ యాదవ్. చిట్టచివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించింది.. 243 మంది సభ్యులు కల రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 125 స్థానాలు గెల్చుకుని సరిగ్గా ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి సరిపోయేటన్ని సీట్లను సాధించి బతుకుజీవుడా అని బయటపడింది. బీజేపీ నాయకత్వం దేన్నయితే ఆశించిందో సరిగ్గా అలాగే పోలింగ్ సరళి సాగిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ స్వయంగా 74 స్థానాలు గెల్చుకుని 70 శాతం విజయశాతాన్ని సాధించింది. బిహార్ ఎన్నికల్లో అది సాధించిన ఉత్తమ ఫలితాలు ఇవే మరి. నితీశ్ కుమార్‌ని ఆయన జేడీయూని ఈ ఎన్నికల్లో ఒక జూనియర్ భాగస్వామి పాత్రకు కుదించాలని బీజేపీ పన్నిన పథకం బ్రహ్మాండంగా ఫలించింది. ప్రతిపక్ష శ్రేణులను ఎంతగా దెబ్బకొట్టాలో అంతగా దెబ్బకొట్టడమే కాదు.. విజయానికి దాదాపు దగ్గరగా వచ్చేలా ప్రతిపక్షాల ఓట్లను కూడా శాసించి బ్రాండ్ మోడీ ప్రభావం వల్లే ఈ గెలుపు సాధ్యం చేశానని బీజేపీ ఇరుపక్షాల శ్రేణుల ముందు ఘనంగా ప్రదర్శించింది. అయితే అదే సమయంలో భారత రాజకీయాల్లోకి ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భవానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజస్వి యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపది కన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వి యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. గెలిచిన స్థానాలను పరిశీలిస్తే తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ 75 స్థానాలు సాధించి బిహార్‌లో అతిపెద్ద పార్టీగా కొనసాగింది. దాదాపు 30 లక్షల ఓట్లను లేదా 40 శాతాన్ని దక్కించుకున్న ఆర్జేడీకి, 2015 నాటి ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి. ముస్లింలు, యాదవుల ఓటు పునాది కలిగిన పరిమితిని దాటి ఆర్జేడీ తన పలుకుబడిని విస్తృతస్థాయిలో విస్తరించిందని తేటతెల్లమైంది. గుర్తించదగిన విషయం ఏమిటంటే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తన ఓటు షేరును 18.3 శాతం నుంచి 23.1 శాతానికి పెంచుకునే క్రమంలో జేడీయూ పార్టీకి చెందిన ఓట్ల కంటే బీజేపీ కోటాను కొల్లగొట్టడమే. ఈ దెబ్బకు బీజేపీ ఓటు షేర్ గతంలోని 24.4 శాతం నుంచి 19.5 శాతానికి పడిపోయింది. 2015తో పోలిస్తే బీజేపీకి ప్రస్తుతం 10 లక్షల పదివేల ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. అయితే కూట మిలో భాగంగా తక్కువ స్థానాలకు కట్టుబడినందువల్ల కూడా బీజేపీకి ఓట్ల శాతం తక్కువగా వచ్చి ఉండవచ్చు. జేడీయు ఓటు షేర్‌ను దెబ్బకొట్టడంలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించింది. బీజేపీ ఇలా దెబ్బ కొట్టినా ఈదఫా ఎన్నికల్లో జేడీయూకు ఓటు శాతం 16.8 నుంచి 15.8 శాతం మాత్రమే తగ్గింది. ఒకవైపు బీజేపీ అభ్యర్థులు జేడీయూ ఓటర్లను పొందగలిగారు తప్పితే బీజేపీకి చెందిన అగ్రకులాల ఓటర్లు జేడీయూ పోటీ చేసిన స్థానాల్లో తమ ఓటు వేయకుండా జాగ్రత్తపడ్డారు. జేడీయూకు బదులుగా వీరు అటు ఎల్జేపీనుంచి లేదా ఆర్జేడీనుంచి పోటీ చేసిన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులకు, తమ ఓటు గుద్దేశారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు, ప్లూరల్స్ పార్టీ వంటి అతి చిన్న పార్టీల ఖాతాలోకి కూడా వెళ్లిపోయాయి. ముందుండి నడిపించిన సమర యోధుడు గతంలో 2015లో జరిగిన ఎన్నికల్లో మహాగట్ బంధన్ ప్రధాన వ్యూహకర్తగా తలపండిన రాజకీయనేత లాలూ ప్రసాద్ యాదవ్ సర్వం తానై ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. ఈ ప్రచార ముఖ చిత్రంగా నితీశ్ కుమార్ నిలిచి తన పార్టీనీ, పొత్తు పార్టీలను ఒంటిచేత్తో విజయం వైపు తీసుకుపోయారు. పైగా ఆనాడు బిహార్‌లో ప్రతిపక్షం ఎన్నికలకు కొద్ది నెలల ముందువరకు చెల్లాచెదురై ఉండేది. అందుకనే 2015లో సాధించిన 80 సీట్లతో పోలిస్తే ఇప్పుడు 75 స్థానాలు చేజిక్కించుకుని గణనీయమైన విజయం సాధించిన ఘనత పూర్తిగా యువ తేజస్వీ యాదవ్‌కే దక్కుతుంది. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఛాయ నుంచి పూర్తిగా బయటపడిన 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వి యాదవ్ అతి తక్కువ సమయంలో సాధించిన విజయం సాధారణమైనది కాదు. యాదవ రాజకీయాల బరువునుంచి తప్పుకుని కొత్త పంథాలోసాగిన తేజస్వి బిహార్‌లోని అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. అంతకంటే ముఖ్యంగా ఇటీవలి కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా బిహార్‌లో సాగిన ఎన్నికల ప్రచారం సాపేక్షికంగా శాంతియుతంగా, విద్వేష రహితంగా సాగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఈ గొప్ప మార్పునకు పూర్తి ఘనత ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌కే దక్కాల్సి ఉంటుంది. జాతీయ మీడియా కూడా ఈ విషయంలో తేజస్వి విశిష్టతను స్పష్టంగా గుర్తించి ప్రశంసించింది. 2020లో సాగిన ఎన్నికల్లో కూడా బీజేపీ య«థాప్రకారంగా కశ్మీర్, సీఏఏ, రామ్ మందిర్ వంటి అంశాలను పదేపదే ప్రస్తావించి విభజన రాజకీయాలను ప్రేరేపించా లని ప్రయత్నించింది. కానీ దానివల్ల అది సాధించింది పెద్దగా ఏమీలేదు. చివరకు బాలీవుడ్లో కొనసాగుతున్న సాంస్కృతిక తప్పిదాల వల్లే యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుట్ అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని కన్నుమూశాడంటూ చెలరేగిన తీవ్రవివాదాస్పద అంశాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిం చింది. ఇక నితీశ్ తనవంతుగా జంగిల్ రాజ్ అనే పాత ముద్రను ఆర్జేడీపై పదేపదే సంధిస్తూ తేజస్విపై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దాడులకు కూడా ప్రయత్నించినా, అవేవీ పెద్దగా ఫలవంతం కాలేదు. ఈ మొత్తం వ్యతిరేక ప్రచారంలో కూడా తేజస్వి అత్యంత పరిణతిని ప్రదర్శించారు. తన వంటి అతి పిన్న వయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. తనపై సాగుతున్న దాడిలో పొరపాటున కూడా ప్రవేశించకుండా తేజస్వి యాదవ్ మొదటినుంచి చివరివరకూ తాను విశ్వసించినటువంటి.. బిహార్ యువతకు విద్య, ఉద్యోగాలు అనే అంశాలపైన మాత్రమే దృష్టి సారించి ప్రచారం సాగిం చాడు. మహాగట్ బంధన్ బలమైన అధికార కూటమిని ఈ స్థాయిలో ముప్పు తిప్పలు పెట్టిందంటే తేజస్వి అత్యంత ప్రతిభావంతంగా అల్లిన ప్రచార ఎజెండానే కారణమని చెప్పక తప్పదు. ఈ ప్రయాణ క్రమంలో తేజస్వి ఈ దఫా ఎన్నికలకు మాత్రమే కాకుండా, దేశంలో కోవిడ్–19 అనంతర రాజకీయాలకు కూడా అజెండాను నిర్దేశించడంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బిహార్ యువతీయువకులకు పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తానని తేజస్వి ఇచ్చిన ఎన్నికల హామీ బీజేపీని ఎంతగా భీతిల్లజేసిందంటే తమ కూటమిని గెలిపిస్తే 19 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని ఎదురు హామీ ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా కోవిడ్–19 వ్యాక్సిన్‌ని ఉచితంగా అందిస్తానని కూడా హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది మధ్యేవాద వామపక్ష రాజకీయ ఆర్థిక విధానాన్ని ఒక మితవాద పార్టీ ప్రకటించవలసి రావడంగా తప్ప మరోలా దీన్ని చూడలేం. మరోవిధంగా బిహార్‌లో వామపక్షాలు సాగించిన గొప్ప విజ యంలో కూడా ఇది ప్రతిఫలించింది. పోటీ చేసింది 29 స్థానాల్లోనే అయినప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో వామపక్షాలు 16 సీట్లు కొల్లగొట్టి షాక్ తెప్పించాయి. గతంతో పోలిస్తే 50 శాతం విజయాల రేటును పెంచుకున్న వామపక్షాలు ఆర్జేడీతో సమానంగా విజయాలు సాధించడమే కాకుండా కాంగ్రెస్ (30 శాతం), జేడీయూ (40శాతం) కంటే మంచి స్థానంలో నిలబడటం చెప్పుకోదగిన విషయం. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ–జేడీయు కూటమి అత్తెసరి మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ భారతదేశంలో మధ్యేవాద–వామపక్ష రాజకీయాలకు ఏకకాలలో బిహార్ పైకెత్తి నిలిపింది. వచ్చే సంవత్సరం పశ్చిమబెంగాల్, అస్సామ్, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలు కూడా బిహార్ అనుభవాన్ని ప్రతిబింబించినట్లయితే, అప్పడు బిహార్ ప్రజలు అలాంటి మార్గాన్ని చూపించింది మేమే కదా అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలకు సంబంధించిన సరికొత్త హీరో తేజస్వి యాదవ్. వ్యాసకర్త రాజేష్ మహాపాత్ర స్వతంత్ర జర్నలిస్టు -
బిహార్‌లో విజయం సాధించిన ప్రముఖులు
పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ హోరాహోరీ ఎన్నికల పోరులో అధికార ఎన్డీయో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారం చేపట్టనుంది. విపక్ష మహాకూటమి మొత్తంగా 111 స్థానాలకు పరిమితమైంది. బిహార్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నియోజకవర్గాల వారిగా ప్రముఖుల ఫలితాలు: తేజస్వి యాదవ్ (రాఘోపూర్ నియోజకవర్గం): మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి సతీష్ కుమార్‌పై 38,174 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2015లో కూడా తేజస్వి యాదవ్ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో తేజస్వి తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జితాన్ రామ్ మంజి (ఇమామ్ గంజ్ నియోజకవర్గం): బిహార్ మాజీ సీఎం, హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 76 ఏళ్ల జితాన్ ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ నరేన్ చైదరిపై 16,034 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జితాన్ 29,408 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శ్రేయాసి సింగ్ (జముయి నియోజకవర్గం): కామన్ వెల్త్ గేమ్స్-2018 స్వర్ణపతక విజేత, ఎస్ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ అభ్యర్థిగా బిహార్ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన శ్రేయాసి సమీప ఆర్జేడీ అభ్యర్థి విజయ్ ప్రకాష్‌పై 41,049 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె అక్టోబర్ 4న బీజేపీలో చేరి జముయి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచారు. అనంత కుమార్ సింగ్ (మోకామా నియోజకవర్గం): బిహార్‌లో ‘బాహుబలి’ నేతగా పిలువబడే అనంత కుమార్ సింగ్ మోకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 35,750 ఓట్ల మెజార్టీతో సమీప జేడీయూ అభ్యర్థి రాజీవ్ లోచన్ నారాయణ్ సింగ్‌పై గెలుపొందారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితంగా ఉండే అనంత 2015లో ఆర్జేడీలో చేరారు. ఇక ఆయన జేడీయూలో ఉన్నప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?
పట్నా : అతి చిన్న వయసులోనే బిహార్ పీఠం ఎక్కాలన్న ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ కల చెదిరింది. కాంగ్రెస్‌తో జత కట్టడం వల్లే ఆయన కథ మారిపోయిందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పటికీ, కీలకమైన నేతలందరూ పార్టీని వీడినప్పటికీ తేజస్వి యాదవ్ ఈ సారి ఎన్నికల్లో ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. 31 ఏళ్ల వయసున్న తేజస్వి పార్టీ బరువు బాధ్యతల్ని తన భుజం మీద వేసుకొని ఒంటరి పోరాటం చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో తూటాల్లాంటి మాటలతో తేజస్వి చేసిన ప్రసంగాలు, నిరుద్యోగం, వలసవాదుల సమస్యలు, ఆర్థిక సంక్షోభం వంటి విధానపరమైన అంశాలనే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో ముందుకు వెళ్లడంతో అధికార ఎన్డీయేకి ఎదురు దెబ్బ తగులుతుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈ సారి యువతరం తేజస్వికి జై కొడుతుందని అంచనా వేసింది. మహాకూటమిలో భాగస్వామి కాంగ్రెస్‌కు 70 సీట్లు కేటాయించడం ఆర్జేడీ విజయావకాశాలను దెబ్బ తీసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్జేడీకి మద్దతుగా ఉన్న ముస్లిం, యాదవుల ఓటు బ్యాంకులో ముస్లిం ఓటు బ్యాంకుని ఎంఐఎం చీల్చడం ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌కి అత్యధిక సీట్లు కేటాయించారా ? ఈ సారి ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేస్తే, కాంగ్రెస్‌కి 70 స్థానాలు, లెఫ్ట్ పార్టీలకు 23 స్థానాలను కేటాయించారు. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం 20 స్థానాల్లో గెలవకపోవడం కూటమి కొంప ముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాలను గెలుచుకుంది. ఈసారి 20 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల కంటే తక్కువ సీట్లను సాధించి కూటమి విజయావకాశాలను దెబ్బ తీసింది. ఎన్డీయేకున్న అధికార వ్యతిరేకతను తమకి అనుకూలంగా మలుచుకోవడంలోనూ, అగ్రకులాల ఓట్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆ ఓట్లన్నీ చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ దక్కించుకోవడంతో కాంగ్రెస్ కుదేలైంది. కాంగ్రెస్‌ని నమ్మి ఎక్కువ సీట్లు కేటాయించడంతో తేజస్వి ఇరకాటంలో పడిపోయారు. చీలిపోయిన ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ పార్టీలు కలిసి గ్రాండ్ డెమొక్రాటిక్ సెక్యులర్ ఫ్రంట్ (జీడీఎల్‌ఎఫ్)గా ఏర్పడ్డాయి. ఎంఐఎం 5స్థానాలను గెలుచుకుంది. ఆర్జేడీకి మద్దతుగా నిలిచే ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చిందనే చెప్పాలి. మహాఘట్బంధన్ ఓటమి పాలు కావడంలో జీడీఎల్‌ఎఫ్ పాత్ర కూడా ఉంది. -
బీజేపీదే బిహార్
సాక్షి, న్యూఢిల్లీ/ పట్నా: సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు, మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్ ది మ్యాచ్’ గా ఆర్జేడీ నిలిచింది. ఆ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 73 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. కూటముల వారీగా చూస్తే.. అధికార ఎన్డీయేలో.. బీజేపీ 73, జేడీయూ 43, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 4, హెచ్ఏఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది. 2015లో ఆర్జేడీతో కలిసి పోటీచేసి గద్దెనెక్కిన జేడీయూ.. రెండేళ్లకే ఆర్జేడీతో విభేదించి, బీజేపీకి చేరువై, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నితీశ్‌తో విబేధించి, ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, సొంతంగా బరిలో నిలిచిన లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకుంది. కానీ, సుమారు 30 సీట్లలో శత్రు పక్షం జేడీయూ విజయావకాశాలను ఎల్జేపీ దెబ్బతీయగలిగిందని భావిస్తున్నారు. కాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్డీయే కూటమి మేజిక్ మార్క్ అయిన 122కి పైనే ఉన్నప్పటికీ.. సాయంత్రం ఒకదశలో 120కి పరిమితమయ్యేసరికి ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ సమయంలో దాదాపు 20కిపైగా స్థానాల్లో ఆయా పార్టీల ఆధిక్యత వెయ్యి లోపే ఉండడంతో తుదివరకు ఉత్కంఠ కొనసాగింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ మాజీ చీఫ్ అబ్దుల్ బారీ సిద్దిఖీ, లాలు ప్రసాద్ సన్నిహితుడు భోలా యాదవ్ ఓడిపోయారు. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువు, బీజేపీ అభ్యర్థి నీరజ్ సింగ్ బబ్లూ ఛతాపూర్ స్థానం నుంచి గెలుపొందారు. మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ రఘోపూర్ స్థానం నుంచి, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హసన్పూర్ నుంచి గెలుపొందారు. మాజీ షూటర్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన శ్రేయసి సింగ్(బీజేపీ) జముయి నుంచి గెలుపొందారు. హెచ్ఏఎం చీఫ్ జితన్ రామ్ మాంఝీ ఇమామ్‌గంజ్ స్థానంలో విజయం సాధించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌధరిపై ఆయన గెలిచారు. ధమ్దహా స్థానం నుంచి జేడీయూ అభ్యర్థి లేసి సింగ్ గెలుపొందారు. బలం పెంచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 73 స్థానాల్లో విజయం నమోదు చేసింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 157 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం 53 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీచేసి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం విశేషం. అయినప్పటికీ 2010తో పోలిస్తే తక్కువే. 2010లో 102 స్థానాల్లో పోటీచేసి ఏకంగా 91 స్థానాల్లో నెగ్గింది. అప్పుడు కూడా జేడీయూతో పొత్తు ఉంది. జేడీయూతో పొత్తు ఉన్న రెండు సందర్భాల్లోనూ బీజేపీ తన బలం పెంచుకోవడం విశేషం. 2015లో ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ, హిందుస్తాన్ ఆవామ్ మోర్చాతో కలిసి పోటీచేయగా కేవలం 53 స్థానాల్లో మాత్రమే బీజేపీకి విజయం చేకూరింది. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో ఎల్జేపీ వల్ల నష్టం చేకూరకపోవడం, కోవిడ్ లాక్డౌన్ కాలంలో వలస కూలీలకు ఉచితంగా రైళ్లు నడపడం వంటి పరిణామాలు బీజేపీకి సానుకూలంగా మారాయి. నిరుద్యోగిత అంశం నేరుగా నితీష్‌కుమార్‌పై ప్రభావం చూపిన రీతిలో బీజేపీపై చూపలేదు. నితీష్ ఓటు బ్యాంకు ఏమేరకు పనిచేసింది? 2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఇప్పుడు 43 సీట్లకు పరిమితమైంది. నితీష్‌కుమార్‌కు మహా దళితులు, ఎంబీసీలు, మహిళలు అండగా నిలవడం వల్లే 43 సీట్లు అయినా దక్కించుకోగలిగారు. ఎల్జేపీ ఎన్డీయే కూటమిని వీడి విడిగా పోటీచేయడం వంటి కారణాల వల్ల 2015 నాటి స్థాయిలో జేడీయూ సీట్లు గెలుచుకోలేకపోయింది. యాదవ సామాజిక వర్గం మద్దతు సంపూర్ణంగా లాలూప్రసాద్యాదవ్కు ఉన్నట్టుగా.. కుర్మి సామాజిక వర్గం నుంచి సంపూర్ణ మద్దతు నితీష్‌కుమార్‌కు లేదు. అత్యంత వెనకబడిన కులాలు, మహాదళితుల నుంచి నితీశ్‌కు మద్దతు ఉంది. అత్యంత బలహీన తరగతులకు ఓబీసీల్లో ప్రత్యేక గుర్తింపు, మహాదళితులకు ఎస్సీల్లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో వారు నితీష్ వెన్నంటి నిలిచారు. వామపక్షాల ఊపు మహాకూటమిలో భాగంగా ఉన్న వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) జోరు కనబరిచాయి. ఆయా వామపక్షాలు మొత్తం 29 సీట్లలో పోటీ చేసి 16 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో సీపీఐ(ఎంఎల్) 12, సీపీఐ 2, సీపీఎం 2 సీట్లు గెలుచుకున్నాయి. ఒకప్పుడు బిహార్‌లో వామపక్ష పార్టీలు బలమైన శక్తిగా ఉన్నప్పటికీ, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డాయి. 2010లో కేవలం సీపీఐ ఒక సీటు మాత్రమే గెలుచుకోగా.. 2015లో సీపీఐ(ఎంఎల్) మూడు సీట్లు గెలవగలిగింది. ఆర్జేడీ పిలుపునిచ్చిన ‘ఆర్థిక న్యాయం’ నినాదాన్ని వామపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి. కాంగ్రెస్ బేజారు.. 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పోటీ చేసిన సీట్లలో కనీసం మూడో వంతు కూడా గెలవలేకపోయింది. అయితే ఆయా సీట్లన్నీ గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నవేనని, అక్కడ గెలవలేకపోవడంలో ఆశ్చర్యమేదీ లేదని ఆ పార్టీ నాయకులే విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ మరికొన్ని సీట్లు నెగ్గి ఉంటే ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించగలిగేది. ఉనికి చాటుకున్న ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 2015లో ఇక్కడ ప్రస్తానం ప్రారంభించిన పార్టీ ఈ ఎన్నికల్లో తన ఉనికి చాటుకుంది. అమౌర్‌లో జేడీయూపై(గతంలో కాంగ్రెస్ స్థానం), బహదూర్‌గంజ్(గతంలో కాంగ్రెస్ స్థానం)లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీపై, బైసీలో బీజేపీపై(గతంలో ఆర్జేడీ సీటు), జోకిహాట్‌లో ఆర్జేడీపై(గతంలో జేడీయూ), కొచ్చదామన్‌లో జేడీయూ(గతంలోనూ జేడీయూ సీటు)పై ఎంఐఎం గెలిచింది. అంటే మహాకూటమికి చెందిన మూడు స్థానాలను గెల్చింది. రెండు ఎన్డీయే సిట్టింగ్ సీట్లను గెలుచుకుంది. చతికిలపడిన ఎల్జేపీ దివంగత రాంవిలాస్‌పాశ్వాన్ కుమారుడు చిరాగ్‌పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జన్‌శక్తి పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. కింగ్‌మేకర్ కావాలనుకున్న చిరాగ్ పాశ్వాన్ ఆశలు ఆవిరయ్యాయి. కేవలం ఒక్క స్థానంలో గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గొప్పగా ఆశీర్వదించారు : మోదీ వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గొప్పగా ఆశీర్వదించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో చరిత్రాత్మక విజయం దక్కిందన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో గెలుపు బీజేపీకి ప్రత్యేకం అని పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు, బీజేపీ మధ్య ఉన్న బంధం విడదీయరానిదని గుర్తుచేశారు. ఎనిమిది స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వారు తమపై అభిమానం, ఆప్యాయతను చూపించారని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రగతిశీల అజెండా, బీజేపీ రాష్ట్ర శాఖ కఠోరమైన శ్రమతో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించగలిగామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాహిత విధానాలు బీజేపీని ప్రజలకు చేరువ చేశాయని వెల్లడించారు. -
బిహార్ ఫలితాలు : కాషాయ శ్రేణుల్లో కోలాహలం
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిపై ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఢోలక్ మోగించడంతో పాటు రంగులు చల్లుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇక బిహార్‌లో ఎన్డీయే కూటమి 18 స్ధానాల్లో గెలుపొంది 107 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి 9 స్ధానాల్లో గెలుపొంది 97 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2 స్ధానాల్లో, ఇతరులు 10 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 243 స్ధానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే అవసరమైన మేజిక్ ఫిగర్ 122 స్ధానాలను దక్కించుకునే దిశగా ఎన్డీయే కూటమి సాగుతోంది. మరోవైపు బిహార్‌లో అర్ధరాత్రి దాటేవరకూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో పూర్తి ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. -
‘తేజస్వీ బర్త్‌డే గిఫ్ట్‌గా సీఎం పీఠం’
పట్నా: బిహార్ రాజకీయాల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. మరో సారి నితీష్ సర్కార్ అని ఎన్డీఏ కూటమి భావిస్తుండగా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) యువ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కు అధికారం ఖాయమని అంచాన వేస్తున్నాయి. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోదరుడు తేజస్వీ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి పీఠం బర్త్‌డే గిఫ్ట్‌గా దక్కనుంది అని తెలిపారు. నవంబర్ 9న తేజస్వీ యాదవ్ పుట్టిన రోజు. దాంతో ఆర్జేడీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ ఎంతో ఘనంగా తేజస్వీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఇక తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో బిహార్ ప్రజలు నితీష్ కుమార్‌ను తిరస్కరించారు. ఉపాధి కల్పన వంటి అంశాల్లో జేడీయూ ప్రభుత్వం ఘోరంగా పరాజయం అయ్యింది. అంతేకాక నితీష్ పాలనలో ఎన్నో స్కాములు జరిగాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఈ సారి మహాఘట్ బంధన్‌కు ఓటేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పక్కన పెట్టండి. మాకు బిహారీల పట్ల నమ్మకం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ని మాకు ఇస్తారని నమ్ముతున్నాం’ అన్నారు. (చదవండి: ఆర్జేడీ కూటమికే జై) కాంగ్రెస్ నాయకుడు కృతి జా అజాద్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ‘పుట్టిన రోజు కానుకగా ముఖ్యమంత్రి పీఠాన్ని గెలుచుకోబోతున్న తేజస్వీ యాదవ్‌కు అభినందనలు. ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది’ అన్నారు జా. ఒకవేళ తేజస్వీ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబం ఓ రికార్డు సృష్టిస్తుంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు సీఎంలు అయ్యారనే ఘనత దక్కుతుంది. తేజస్వీ కుటుంబంలో ఇప్పటికే ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, తల్లీ రబ్రీదేవిలు ముఖ్యమంత్రులుగా పని చేసిన సంగతి తెలిసిందే. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్ప్ మహాఘట్బంధన్ భారీ విజయం సాధించబోతుందని అంచాన వేశాయి. ఇక ఇప్పటికే 38 జిల్లాలోని 55 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. మరి కొన్ని గంటల్లో ఎవరి భవిష్యత్తు ఏంటనే విషయం బయటపడనుంది. -
రేపే బిహార్ ఫలితాలు.. క్షీణించిన లాలూ ఆరోగ్యం
పట్నా : ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. రేపు(నవంబర్ 10) బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు వైద్యులు తెలిపారు. లాలూకు డయాలసిస్ కొనసాగుతుందని చెప్పారు. ఈ మేరకు సోమవారం లాలూ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నానని, అయినప్పటీకి ఇప్పటివరకు ఆయనకు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని వైద్యులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్ చేస్తున్నట్లు రిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల ప్రచారంలో లాలూ ప్రసాద్ పాల్గొననప్పటికీ, ప్రతి రోజు పార్టీ కార్యక్రమాలు, ప్రజల అభిప్రాయాలను టీవీ చానళ్లు, వార్త పత్రికల ద్వారా సమీక్షించేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ఆయన పరిశీలించారని చెప్పారు. రేపే ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, అందుకే ఆరోగ్యం క్షీణించిందని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. కాగా, 243 అసెంబ్లీ స్థానాలకు ఉన్న బిహార్‌లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ-కాంగ్రెస్- కూటమికే జైకొట్టాయి. -
కార్యకర్తలను హెచ్చరించిన తేజస్వీ యాదవ్
పట్నా: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ-కాంగ్రెస్- కూటమికే జైకొట్టిన వేళ తేజస్వి యాదవ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. ఓట్ల కౌంటింగ్ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని, క్రమ శిక్షణగా మెలగాలని చెప్పారు. తుది ఫలితాలు ఎలా ఉన్నా సహనం పాటించాలని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. బాణాసంచా కాల్చడం, రంగులు పూసుకోవడం, ప్రతిపక్ష పార్టీ వారితో రౌడీ చేష్టలు పనికిరావని అన్నారు. ఇక ఫలితాలు ఎలా ఉన్నా సంయమనం పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పూనుకోవద్దని ఆర్జేడీ ట్విటర్ వేదికగా కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్- రబ్రీ దేవి పాలనలో బిహార్‌లో రౌడీ రాజ్యం నడిచిందనే అవపవాదు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తేజస్వీ పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ హెచ్చరికలు చేశారు. కాగా, బిహార్ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. మంగళవారం (నవంబర్ 10) ఓట్ల లెక్కింపు జరుగనుంది. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి (మహా ఘటన్ బంధన్) విజయం సాధిస్తే తేజస్వి యాదవ్ బిహార్ సీఎం పదవి చేపట్టనునన్నారు. ఇక బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు గాను మహా ఘటన్ బంధన్ 128 సీట్లు, ఎన్డీఏ కూటమి 99 సీట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 6 స్థానాలు గెలవొచ్చని తెలిపాయి. బిహార్‌లో మేజిక్ ఫిగర్ 122 సీట్లు. మరోవైపు క్షేత్ర స్థాయిలో తమకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే ఎక్కువగానే సీట్లు సాధిస్తామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారి చెప్తున్నారు. -
బిహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటితో ముగిసింది. ఇందుకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ తాజాగా విడుదలయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో మహాగట్ బంధన్ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బిహార్‌లోని మొత్తం 243 సీట్లకు జరిగిన మూడు విడతల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85- 95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయని సర్వే పేర్కొంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీకి 65-75 సీట్లు దక్కే అవకాశం ఉండగా, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం కానున్నట్లు వెల్లడించింది. కాగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాగట్ బంధన్ మరిన్ని ఎక్కువ సీట్లు సాధించే అవకాశమున్నట్లు సర్వేలో వెల్లడైంది. పట్నా,నలందాతోపాటు వాయువ్య భోజ్‌పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని సర్వేలో వెల్లడైంది. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 305 పోలింగ్ స్టేషన్లలో పీపుల్స్ పల్స్ – పీఎస్జీ సంయుక్తంగా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇక బిహార్ లోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఖ్య 25 శాతం. లింగ నిష్పత్తితోపాటు కుల,మత, వయస్సుల వారీ సమాన ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించింది.(చదవండి: జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు) పీపుల్స్ పల్స్- పీఎస్జీ సర్వే: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్-2020 ముఖ్యాంశాలు బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ వైపు 36 శాతం, నితీష్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు ఎన్నికల్లో అత్యధిక ప్రభావం చూపిన సమస్యలు నిరుద్యోగం (31%), ధరల పెరుగుదల (28%), వలసలు (19%), వరదలు (12%), ఎంఎస్పీ (9%) మరియు ఇతర సమస్యలు (1%) తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. 10 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ యువతను ఆకట్టుకుంది. ముస్లిం, యాదవ సామాజికవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఆర్జేడీ వైపే మొగ్గు చూపారు. భూమిహార్ల సామాజికవర్గంసహా ఉన్నత కులాల ఓటర్లు సైతం గణనీయమైన సంఖ్యలో జేడీ (యూ)కి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో పెద్దగా పని చేయని దివంగత రాం విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ప్రభావం. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించింది. పాట్నా, నలందాతోపాటు వాయువ్య భోజ్‌పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం. పలు చోట్ల ఎన్డీయే కూటమి ఓట్లకు గండి కొట్టిన తిరుగుబాటు, స్వతంత్ర్య అభ్యర్ధులు. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు- ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పీపుల్స్ పల్స్: మహాగట్ బంధన్‌కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం పీపుల్స్ పల్స్: జేడీయూ+ 90-110 ఆర్జేడీ+ 100-115 ఎల్జేపీ 3-5 ఇతరులు 8-18 టైమ్స్ నౌ - సీ ఓటర్ : ఆర్జేడీ కూటమికే మొగ్గు ఎన్డీఏ 116 మహాకూటమి 120 ఎల్జేపీ 1 ఇతరులు 0 ఇండియా టుడే సర్వే: మధ్యప్రదేశ్ ఉపఎన్నికలు మధ్యప్రదేశ్: బీజేపీ 16-18, కాంగ్రెస్ 10-12, బీఎస్పీ 0-1 మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీకి 46శాతం సీట్లు కాంగ్రెస్‌కు 43 శాతం, బీఎస్పీకి 6 శాతం సీట్లు ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో 7 స్థానాలకు- బీజేపీ 5-6, ఎస్పీ 0-1, బీఎస్పీ 0-1 బిహార్ 2015 ఫలితాలు ఆర్జేడీ- 80, జేడీయూ- 71, బీజేపీ- 53 2015లో అధికారంలోకి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమి ఏడాదిన్నర తర్వాత కూటమి నుంచి బయటికొచ్చిన నితీష్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చివరదశ పోలింగ్ నేడు జరుగుతుంది. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. జేడీయూకి ఓటు వేసినందుకుగాను ఆర్జేడీ కార్యకర్తలు ఓ మధ్యవయసు వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఓ వీడియోను షేర్ చేశారు. దీనిలో ఓ వ్యక్తి జేడీయూకు ఓటు వేసినందుకు ఆర్జేడీ కార్యకర్తలు తనపై దాడి చేశారని చెప్పడం చూడవచ్చు. ఈ సంఘటన మాధేపూరలో చోటు చేసుకుంది. వీడియోలోని పెద్దాయన తాను బాణం గుర్తుకు ఓటు వేశానని చెప్పడంతో ఆర్జేడీ కార్యకర్తలు తనని చితకబాదారని తెలిపాడు. ‘ఆర్జేడీ అంటే బిహార్‌లో గూండారాజ్యం అని అర్థం’ అంటూ వీడియోని ట్వీట్ చేశారు అమిత్ మాల్వియా. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఇక కొద్ది రోజుల క్రితం ఆర్జేడీ ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ ఓటర్లకు డబ్బు పంచుతున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘బిహార్‌లో ఓడిపోతానని బీజేపీకి అర్థమయ్యింది. అందుకే డబ్బులు పంచుతుంది. కానీ ఇది బిహార్ సార్. మీరు డబ్బుతో బిహారీలను కొనలేరు’ అంటూ వీడియోని ట్వీట్ చేసింది. (చదవండి: ‘నితీష్‌కు ముందే ఆ విషయం అర్థమైంది’) ఇక బిహార్‌లో నేడు చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు 2.35 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజలు రికార్డు స్థాయిలో ఓటు వేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నవంబర్ 10న ఫలితాలు వెల్లడవుతాయి. ఇక కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో మొదటి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు. -
నితీష్‌కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్
పట్నా : బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరిగింది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలే పోలింగ్ ముగిసింది. సున్నితమైన ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరించారు. నేటి పోలింగ్‌లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, కోవిడ్ లక్షణాలున్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ జరుగుతోంది. లైవ్ అప్డేట్స్ గుజరాత్లో 8 స్థానాలకు కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్ ఉదయం 10గంటల వరకు 11.52 శాతం పోలింగ్ నమోదు ఎల్జేపీ చీఫ్ చిగార్ పాశ్వాన్ తన ఓటు హక్కును వినిమోగించుకున్నారు నితీష్‌కు ఇదే చివరి ఎన్నిక, మరోసారి ఆయన సీఎం కాలేరు : చిరాగ్ పాట్నా రాజేంద్రనగర్‌లో ఓటేసిన డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ పాట్నాలో ఓటుహక్కు వినియోగించుకున్న తేజస్వీ యాదవ్, రబ్రీదేవి మధ్యప్రదేశ్‌లో ఉదయం 9 గంటల వరకు 10.81 శాతం పోలింగ్ నమోదు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిఘాలో ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రాజధాని పట్నాలో ఉదయం 9.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రోసిరా పరిధిలోని 133,134 పోలింగ్ స్టేషన్లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా నేతలు పట్టించుకోవడంలేదని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బిహార్‌తో పాటు 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ -28 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్ -8, ఉత్తరప్రదేశ్ -7 స్థానాలకు ఉపఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఒడిశా, నాగాలాండ్, కర్ణాటక, జార్ఖండ్‌లో రెండేసి స్థానాలకు, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (దుబ్బాక), హర్యానాలో ఒక్కో స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. -
‘పది లక్షల ఉద్యోగాల కల్పనపైనే తొలి సంతకం’
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే తన ప్రాధాన్యతా కార్యక్రమమని స్పష్టం చేశారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పది లక్షల ఉద్యోగాలను కల్పించే ఫైల్‌పై తొలి సంతకం చేస్తామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తొలగిస్తూ తమ ప్రభుత్వం బిహార్ అసెంబ్లీలో తీర్మానం చేపడుతుందని చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అంశాలవారీగా ప్రచారపర్వంలో ముందుకెళతామని మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ తెలిపారు. పలు నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్ధులకు డిపాజిట్లు దక్కవని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. నవంబర్ 10న బిహార్‌లో నూతన చరిత్ర ఆవిష్కృతమవుతుందన్నారు. నితీష్ కుమార్ 15 ఏళ్ల పాలనలో ఉపాధి, విద్య, వైద్య రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఈ రంగాలను తాము పునరుద్ధరిస్తామని అన్నారు. ఇక అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : బిహార్ ‘చాణక్యుడు’ ఏకాకి అయినట్లేనా? -
'అభివృద్ధి డబుల్ రైల్ ఇంజన్‌లా పరిగెడుతోంది'
పట్నా: ప్రధాని నరేంద్రమోదీ ఎన్డీయే కూటమి తరపున బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం నాడు సాసరమ్‌లో జరిగిన తొలి ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న సమయంలో నితీష్ కుమార్ ప్రభుత్వం శరవేగంగా స్పందించి ప్రజలకు అండగా నిలిచింది. ఆ సమయంలో నిర్లక్ష్యం వహించే ఉంటే అనూహ్యమైన కల్లోలం జరిగుండేది. అయితే నేడు బీహార్ ప్రజలు కోవిడ్‌పై పోరాడి, ప్రజాస్వామ్య పండుగను జరుపుకుంటున్నారు. (ఉచితంగా కోవిడ్ టీకా) 2014 తర్వాత బిహార్‌లో అభివృద్ధి డబుల్ రైల్ ఇంజన్‌లా పరిగెడుతోంది. కరోనా కాలంలో పేదల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేశాం. ఈ మధ్య కాలంలో మరణించిన బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్‌విలాస్ పాశ్వాన్, రఘువంశ్ ప్రసాద్ సింగ్‌కు నివాళులర్పించారు. గాల్వన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు పాదాభివందనం' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి మొత్తం 12 సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243 పోలింగ్ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 ఓట్ల లెక్కింపు : నవంబర్ 10 -
ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!
పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. కాగా ఈనెల 28న రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో 1064 మంది ఎన్నికల బరిలో నిలిచారు. 16 జిల్లాల్లోని 71 శాసన సభ స్థానాలకు జరుగుతున్న మొదటి దశ పోలింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) సంపన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ 1064 మందిలో 375 మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడించింది. మూడింట ఒక వంతు అభ్యర్థులు రూ. కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. (చదవండి: బిహార్ 2020: ప్రధాన మహిళా అభ్యర్థులు) అత్యధికంగా ఆర్జేడీ నుంచి ఏడీఆర్ నివేదిక ప్రకారం, ఆర్జేడీ నుంచి పోటీపడుతున్న 41 మంది అభ్యర్థులో 39 మంది, జేడీయూ నుంచి బరిలో దిగిన 35 మందిలో 31 మంది, బీజేపీకి చెందిన 29 మందిలో 24 మంది, ఎల్జేపీ 30(41), బీఎస్పీ 12(26), 14(21) మంది అభ్యర్థులు కోటి రూపాయల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. అదే విధంగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్‌లో బరిలోకి దిగిన ఒక్కో అభ్యర్థి సగటున 1.99 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారని ఏడీఆర్ వెల్లడించింది. (తొలిసారి నాన్న లేకుండానే: చిరాగ్) ఆయనే సంపన్న అభ్యర్థి ఇక వీరందరితో పోలిస్తే ఆర్జేడీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అనంత్ కుమార్ 68 కోట్ల రూపాయల సంపదతో సంపన్న అభ్యర్థిగా నిలిచినట్లు ఏడీఆర్ పేర్కొంది. కాగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడిన ఆయన, ప్రస్తుతం మొకామా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ గుర్తు మీద రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన గజానంద్ షాహి(షేక్‌పురా) రూ. 61 కోట్ల ఆస్తి కలిగి ఉండి రెండోస్థానాన్ని ఆక్రమించారు. వీరిద్దరి తర్వాత మనోరమా దేవి(జేడీయూ) రూ. 50 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఐదుగురు అభ్యర్థులు మాత్రం తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. -
నా చెల్లెలు వంటిది, గెలిపించండి: చిరాగ్
పట్నా: విమర్శలు, ప్రతివిమర్శల దాడితో బిహార్‌లో రాజకీయం మరింతగా వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, ఆర్జేడీ కీలక నాయకుడైన తేజస్వీ యాదవ్ వంటి యువ నేతలు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈనెల 28న రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ క్రమంలో మొత్తంగా వెయ్యి మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వీరిలో 113 మంది మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులే కావడం గమనార్హం. ఇక ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మొదటి దశ పోలింగ్‌లో(71 సీట్లు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారి సంఖ్య 27. (చదవండి: నా గుండె చీల్చి చూడండి: చిరాగ్ పాశ్వాన్) తొలి దశలో.. అధికార ఎన్డీయే కూటమిలోని మిత్రపక్షాలైన బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేస్తుండగా, జేడీయూ 122 సీట్లలో పోటీ చేసేందుకు ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్యనిషేధ హామీతో మహిళా ఓటర్ల అభిమానం చూరగొన్న జనతాదళ్(జేడీ(యూ)) అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఈసారి మొత్తంగా 22 మంది మహిళా అభ్యర్థులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చి ప్రత్యేకతను చాటుకున్నారు. మరే ఇతర పార్టీ ఈస్థాయిలో స్త్రీలకు సీట్లు కేటాయించలేదు. రాష్ట్రీయ జనతాదళ్ నుంచి మొదటి దశలో 10 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ తొలి దశలో ఐదుగురు చొప్పున మహిళా అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ పార్టీ, హెచ్ఏఎమ్-ఎస్ ఒక్కో మహిళకు అవకాశమిచ్చాయి. వీరిలో కొంతమంది ప్రముఖుల గురించి తెలుసుకుందాం. డైనమిక్ ప్రియ బిహార్ రాజకీయాల్లోకి మెరుపువేగంతో దూసుకువచ్చింది పుష్పం ప్రియా చౌదరి. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది.‘ప్లూరల్స్’ అనే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగింది. అంతేకాదు తానే సీఎం అభ్యర్థిని అని కూడా ప్రకటించుకుంది. అధికార జెడీ(యు) నాయకుడు వినోద్ చౌదరి కూతురు ఆమె. తండ్రి అండతో ఆ పార్టీలో పైకి ఎదిగే అవకాశాలు ఉన్నా.. సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో.. ‘లవ్ బిహార్, హేట్ పాలిటిక్స్’ అనే నినాదంతో తొలుత సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. బిహార్‌లోని దర్భంగాలో జన్మించిన ప్రియా, ఉన్నత విద్యకోసం లండన్ వెళ్లింది. డెవలప్మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. బిస్ఫీ, బంకీపూర్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచింది. శ్రేయాసి సింగ్ ప్రముఖ షూటర్, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్‌మెడలిస్ట్, అర్జున అవార్డు గ్రహీత శ్రేయాసి సింగ్ బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేడీయూ మాజీ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన ఆమె, జమాయ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇక ఇప్పటికే బీజేపీకి మద్దతుగా పలుచోట్ల పోటీని విరమించుకున్న చిరాగ్ పాశ్వాన్, శ్రేయాసీ సింగ్ తరఫున ప్రచారం చేయడం గమనార్హం. జమాయ్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన, శ్రేయాసీ తన చెల్లెలు వంటిదని, ఆమెకు ఓటు వేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తున్నారు. మంజు వర్మ నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోం లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడితో, తన భర్తకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ నేపథ్యంలో మంజు వర్మ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు అక్రమంగా మందు గుండు సామాగ్రిని ఇంట్లో నిల్వ చేసిన కారణంగా సీబీఐ ఆమె ఇంటిపై దాడి చేసి, భార్యాభర్తలపై కేసు నమోదు చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ జేడీయూ మరోసారి ఆమెకు టికెట్ ఇవ్వడం విశేషం. బెగుసరాయ్ జిల్లాలోని చెరియా బరియార్పూర్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మనోరమా దేవి గయా జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె భర్త, దివంగత బిందేశ్వరి ప్రసాద్ యాదవ్ కండలవీరుడిగా గుర్తింపు పొందారు. తన కుమారుడు సృష్టించిన ఓ వివాదం కారణంగా మనోరమా దేవిని జేడీయూ నుంచి బహిష్కరించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి, ఆట్రీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. అంజుమ్ అరా బక్సర్ జిల్లాలోని దుమరాన్ నుంచి పోటీకి దిగుతున్నారు. జేడీయూ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమెకు ఈసారి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్‌ను ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దదాన్ సింగ్ పెహల్వాన్‌ను కాదని, క్లీన్ ఇమేజ్ ఉన్న మహిళా యువనేతకే పెద్దపీట వేసింది. సుషుమాలత కుశ్వాహ జేడీయూ తరఫున భోజ్‌పూర్ జిల్లాలోని జగదీష్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యువ నేత. ఇటీవలే ఆమె రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అయిన వెంటనే ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా, ఎన్నికల ప్రచారంలోదిగి తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి ర్యాలీలో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆడబిడ్డ రాక ఎంతో శుభప్రదమని, ఎన్నికల్లో విజయం మీదేనంటూ విశ్వాసం నింపారు. ప్రస్తుతం ఆమె భోజ్‌పూర్ గ్రామ పంచాయతి పెద్దగా ఉన్నారు. ఇక వీరితో పాటు మరికొంత మహిళా అభ్యర్థులు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. అప్పటితో పోలిస్తే తక్కువే 243 సీట్లు ఉన్న బిహార్ అసెంబ్లీకి 2010లో ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 34. అయితే ఐదేళ్ల తర్వాత అంటే 2015లో ఈ సంఖ్య 28కి పడిపోయింది. వీరిలో 10 మంది ఆర్జేడీకి చెందినవారు కాగా, 9 మంది జేడీయూ నుంచి గెలిచారు. బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకరు స్వతంత్రంగా పోటీచేసి విజయం సాధించారు. -
10 లక్షల ఉద్యోగాలు : తేజస్వీ యాదవ్
సాక్షి, పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధానంగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)నేత, బిహార్ ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ కేంద్రం, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి రావాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ కూటమి మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు హామీలను గుప్పించారు. ముఖ్యంగా తమ కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాను స్వచ్ఛమైన బిహారీని అని తన డీఎన్ఏ స్వచ్ఛమైందని తేజస్వీ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల గ్రాండ్ అలయన్స్ మ్యానిఫెస్టోను తేజస్వీ యాదవ్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నితీష్ ప్రభుత్వంపై తన దాడిని ఎక్కుపెట్టారు. నితీశ్ ది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని, గత15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా, ప్రయోజనమేమీలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమంపై దృష్టి లేదంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఫారాలు ఉచితం చేస్తా మన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. అలాగే బడ్జెట్ లో 12 శాతం విద్యకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని ఆరోపించారు. మోతియారి షుగర్ మిల్లులో కప్పు టీ తాగుతానని చెప్పిన ప్రధాని, రాష్ట్రంలో వరుసగా చక్కెర మిల్లులు, జనపనార మిల్లులు, పేపర్‌మిల్లులు, రైస్ మిల్లులను మూసివేసారని దుయ్యబట్టారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 60 స్కాంలు జరిగాయని, నేరాలు పెరిగి పోయాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలలో అతి ముఖ్యమైన అంశం నిరుద్యోగమని పేర్కొన్న తేజస్వి ఉపాధి,ఉద్యోగాలు కోల్పోయిలన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. వ్యాపారాలు నాశనమై పోయినా, వరదలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు దెబ్బతింటే, ఇప్పటి వరకూ కేంద్రం పర్యటించిన పాపాన పోలేదని తేజస్వీ మండి పడ్డారు. అంతేకాదు ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, మాధ్యమిక పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారని ప్రకటించారు. దీంతోపాటు, ‘స్మార్ట్ గ్రామ యోజన’ కింద ప్రతి పంచాయతీలో డాక్టర్, నర్సులతో క్లినిక్స్, దీంతోపాటు ప్రాన్ హమారా, సంకల్ప్ బద్లావ్ కా లాంటి పథకాలను మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు రణదీప్ సురేజ్వాలా, శక్తిసింహ్ గోహిల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా 243 సీట్ల రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో ఎన్నిలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
బిహార్ ఎన్నికలు.. మరక మంచిదే
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కనీసం 22 మందిపై హత్య, దోపిడీ వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. కానీ దీని గురించి పార్టీ ఎలాంటి ఆందోళన చెందలేదు. ఇక ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ఆర్జేడీ తన అభ్యర్థులు ఎదుర్కొంటున్న నేరారోపణలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా, ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటించింది. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అభ్యర్థులలో అనంత్ సింగ్ కూడా ఉన్నారు. అతను 38 తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీ అతన్ని మోకామా నుంచి బరిలో నిలుపుతుంది. సోషల్ మీడియాలో ఆర్జేడీ సమర్పించిన అతని నేర చరిత్ర కథనం ప్రకారం, అనంత్ సింగ్‌పై మొత్తం హత్యా నేరం సహా మొత్తం 38 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసు పెండింగ్‌లో ఉంది. (చదవండి: వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం) అయినప్పటికీ, ఆర్జేడీ అనంత్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. ఇతర అభ్యర్థుల కంటే అనంత్ సింగ్ చాలా ఫేమస్ అని వాదిస్తుంది. పైగా అతను పేద, అణగారిన వర్గాలకు సాయం చేస్తాడు కాబట్టే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అని పార్టీ సమర్థించింది. అనంత్ సింగ్ మోకామా నుంచి గెలిచే అవకాశం ఉందని, ఇది అతన్ని ఆదర్శ అభ్యర్థిగా మారుస్తుందని పార్టీ పేర్కొంది. ఇక క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న ఇతర ఆర్జేడీ అభ్యర్థులు బెలగంజ్ నుంచి పోటీ చేస్తున్న సురేంద్ర యాదవ్, షాపూర్ నుంచి రాహుల్ తివారీ, జాముయి నుంచి విజయ్ ప్రకాష్, నోఖా నుంచి అనితా దేవి, డెహ్రీ నుంచి ఫతే బహదూర్ సింగ్, ఫతుహా నుంచి రామానంద్ యాదవ్, రాజౌలి నుంచి రెజాజుల్, షెర్ఘాటి దినారా నుంచి కుమార్ మండల్, భాబువా నుంచి భరత్ బింద్, షాపూర్ నుంచి రాహుల్ తివారీ, బెల్హార్ నుంచి రామ్‌దేవ్ యాదవ్, సూర్యగర నుంచి ప్రహ్లాద్ యాదవ్, సందేష్ నుంచి కిరణ్ దేవి, మఖ్దంపూర్ నుంచి సతీష్ కుమార్, జముయి నుంచి విజయ్ ప్రకాష్, ఝాజ నుంచి రాజేంద్ర ప్రసాద్, సీతామార్హి నుండి రఫీగంజ్ మొహమ్మద్ నిహలుద్దీన్, మీనాపూర్ నుంచి సునీల్ కుమార్, మీనాపూర్ నుంచి రాజీవ్ కుమార్, మహువా నుంచి ముఖేష్ కుమార్ రోషన్, దర్భంగా రూరల్ నుంచి లలిత్ కుమార్ యాదవ్, అత్రి నుండి అజయ్ యాదవ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరందరిపై దోపిడీ, మోసం, దాడి మొదలైన నేరారోపణలు ఉన్నాయి. (చదవండి: జేడీ(యు)లో చేరిన ఆర్జేడీ నేత కుమారుడు) ఈ క్రమంలో జనతా దళ్ (యునైటెడ్) ప్రతినిధి రాజీవ్ రంజన్ ఆర్జేడీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ తీరు మారదని దుయ్యబ్టటారు. ‘ఆర్జేడీ ఇచ్చిన సమాచారం చూస్తే.. ఇక అది తన వైఖరిని ఎన్నటికి మార్చుకోదని స్పష్టం అవుతుంది. హత్య, దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది, ఎందుకంటే వారు పాపులర్, తప్పక గెలుస్తారని. బిహార్ అభివృద్ధి చెందుతుంది.. కానీ ఆర్జేడీ కాదని ఇప్పుడు స్పష్టమైంది’ అన్నారు. జేడీ (యూ) ఆరోపణలను ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఖండించారు. తన పార్టీని సమర్థిస్తూ.. "మేము బాహుబలి, నేరస్థులకు టికెట్లు ఇచ్చామని మా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒక నాయకుడు బీజేపీ, జేడీ (యూ)లో ఉన్నంత కాలం, అతను ఒక ప్రవక్త, హరిశ్చంద్ర. కానీ అతను ఆర్జేడీలోకి వస్తే అతను క్రిమినల్, రేపిస్ట్, బాహుబలి అవుతాడు. ఆశ్రయం గృహ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంజు వర్మకు టికెట్ ఇచ్చినందున జేడీ (యూ)కు మాపై ఆరోపణలు చేసే హక్కు లేదు" అన్నారు. -
బిహార్ పోరు రసవత్తరం
ఇన్నాళ్లూ ముఖాముఖి పోరు అనుకున్నారు.. హఠాత్తుగా ముక్కోణపు పోటీకి తెరలేచింది.. దళిత నేత రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కల్ని మారుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌ని నమ్ముకొని ఎన్డీయే.. యువ శక్తిపై విశ్వాసం ఉంచి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి.. సానుభూతి పవనాలను నమ్ముకొని చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ.. బిహార్ ఎన్నికల బరిని వేడెక్కిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి.. నితీశ్ వరసగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఎన్నికలివి. లాలూ ప్రచారం చేయకుండా జరిగే మొట్టమొదటి ఎన్నికలు కూడా ఇవే. కేంద్రంలో అధికార బీజేపీ వరసగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. హ్యాట్రిక్ సీఎం నితీశ్ కుమార్‌కి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలాంటివి. అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి నాలుగోసారి సత్తా చాటడం అంత సులభం కాదు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే రాష్ట్రంలో దళిత దిగ్గజ నేత, లోక్‌జనశక్తి పార్టీ అధినాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందడంతో రాజకీయం రంగులు మార్చుకుంటోంది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో పాటు జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్జేపీని బరిలోకి దింపనున్నారు. బీజేపీతో స్నేహాన్ని కొనసాగిస్తూనే నితీశ్ కుమార్‌ని ఢీ కొడుతున్నారు. అయిదు జిల్లాల్లో పాశ్వాన్ ప్రభావం నితీశ్ జేడీ(యూ)ని దెబ్బ కొడుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ కూటమి సీఎం అభ్యర్థి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ యువకుడు. తండ్రి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ యువతరం ఓట్లను కొల్లగొట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వలసలు, వరదలు, నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మోదీకే ప్రతిష్టాత్మకం ఈసారి బిహార్ ఎన్నికల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నితీశ్ కుమార్ అధికార వ్యతిరేకతకు తన చరిష్మాతో చెక్ పెట్టడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని ప్రాజెక్టులు బిహార్ బాట పట్టించారు. దర్భాంగాలో ఎయిమ్స్ ఏర్పాటు, రూ.541 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మూడు పెట్రోలియం ప్రాజెక్టులు, దేశంలో తొలి కిసాన్ రైలు వంటివెన్నో ఉదారంగా రాష్ట్రానికి ఇచ్చేశారు. నితీశ్ సీఎం అభ్యర్థిగా ముందు ఉన్నప్పటికీ ఎన్డీయేకి తిరిగి అధికారంలోకి వచ్చే బాధ్యతని మోదీ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ‘‘బిహార్ ఎన్నికలు ప్రధాని మోదీకే ఎక్కువ ముఖ్యమైనవి. ఒక రకంగా చెప్పాలంటే లాక్‌డౌన్‌కి రిఫరెండంలాంటివి. అందుకే ఎలాగైనా ఈ ఎన్నికల్లో నెగ్గాలని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు’’అని బిహార్ ఎన్నికల విశ్లేషకుడు సౌరర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు ► బిహార్‌లో పారిశ్రామికీకరణ జరగకపోవడంతో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం 10.2 శాతానికి చేరుకుంది. ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్ మహాగuŠ‡బంధన్ తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ► కోవిడ్ సంక్షోభం ఈ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కరోనాని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నాయో ఈ ఎన్నికల ఫలితాలు తేలుస్తా యని ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది ► దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత ఎక్కడా ఉపాధి అవకాశాల్లేక 30 లక్షల మంది వలస కార్మికులు తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం అందరికీ పని కల్పించే పరిస్థితులు లేవు. ఈ సారి కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి వలసల అంశానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ► వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఎన్నికల అంశంగా మారా యి. అయితే పంజాబ్, హరియాణాల మాదిరిగా రైతు సంఘాలు ఎక్కువగా రాష్ట్రంలో లేవు. ఈ చట్టాలు రైతులకు బేరమాడే శక్తిని పెంచుతాయన్న ఎన్డీయే వాదనని అన్నదాతలు ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. ► బిహార్ ఓటర్లలో 16శాతం మంది ఉన్న దళితులు ఈసారి ప్రధానపాత్ర పోషిస్తారు. దళిత నాయకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి పవనాలు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఎంతవరకు కలిసొస్తాయా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243 పోలింగ్ తేదీలు : మూడు దశల్లో ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 ఓట్ల లెక్కింపు : నవంబర్ 10 2015 ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ 80 జేడీ (యూ) 71 బీజేపీ 53 కాంగ్రెస్ 27 ఇతరులు 8 స్వతంత్రులు 4 -
జేడీ(యు)లో చేరిన ఆర్జేడీ నేత కుమారుడు
పాట్నా: ఆర్జేడీ సీనియర్ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ కుమారుడు సత్యప్రకాష్ సింగ్ గురువారం జేడీ(యు) పార్టీలో చేరారు. వైశాలి జిల్లా మన్హర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించి ఆయన భంగపడ్డారు. త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్జేడీ పార్టీ సభ్యుడు, డాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన రామా సింగ్ భార్యకు లాలు ప్రసాద్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఆమెకు టికెట్ ఇచ్చిన మరుసటి రోజే సత్య ప్రకాష్ సింగ్ జేడీ(యు)లో చేరడం చర్చనీయాంశం మారింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు జేడీ(యు) రాష్ట్ర అధ్యక్షుడు బసిస్తా నారాయణ్ సింగ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బసిస్తా మాట్లాడుతూ.. తన తండ్రి కలను తనయుడిగా ప్రకాష్ నేరవేరుస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సత్యప్రకాష్ సింగ్ మాట్లాడుతూ... ఇటీవల తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టానని చెప్పారు. తన తండ్రి రఘువంశ్ కలలను తాను పూర్తి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన తండ్రి సోషల్‌లిస్టు భావాలను నమ్మె వ్యక్తి అని అందుకే రాజకీయాల్లో ఒక కుటుంబం నుంచి ఒక్కరూ ఇద్దరూ సభ్యులు మాత్రమే ఉండాలని ఆయన బలంగా నమ్ముతారని చెప్పారు. సోషలిస్ట్ నాయకుడైన కార్పూరి ఠాకూర్ తన జీవితకాలంలో దీనిని ఆచరించారని, అలాగే తన తండ్రి కూడా అదే విశ్వసించారని చెప్పారు. పార్టీని తమ కుటుంబాన్ని కాదని మరొకరికి ఆర్జేడీ టిక్కెట్ ఇవ్వడాన్ని ఆయన విమర్శించారు. ఆర్జేడీ పార్టీ ప్రతినిధి తివారీ స్పందిస్తూ.. విజయావకాశాలు ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు. 2014లో వైశాలి నియోజవర్గం నుంచి రామా సింగ్ లోకసభ ఎన్నికలకు ఆర్జేడీ పార్టీ నుంచి పోటీ చేయడంపై రఘువంశ్ సింగ్ వ్యతిరేకించారు. గత నెలలో రఘువంశ్ సింగ్ కన్నుమూశారు. లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించిన ఆయన చనిపోవడానికి నాలుగు రోజుల ముందు ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు. -
ఆర్జేడీ తొలి జాబితా విడుదల.. ఇద్దరికి దక్కని చోటు
పట్నా : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహా కూటమితో పొత్తు అనంతరం తమ పార్టీ నుంచి మొదటి విడుత అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తొలి దశలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన జాబితాను మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ విడుదల చేసింది. ఈ లిస్టులో అత్యాచార ఆరోపణలు ఎదర్కొంటున్న ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్లను ఆర్జేడీ నిరాకరించింది. వారి స్థానంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారి భార్యలను నామినేట్ చేసింది. చదవండి : బిహార్ ఎన్నికలు.. ఆర్జేడీకి భారీ షాక్ మైనర్ బాలికపై అఘాయిత్సానికి పాల్పడిన నేరంలో రాజ్ బల్లాబ్ యాదవ్ ప్రస్తుతం జైలులో ఉండటంతో ఆయన భార్య విభ దేవి.. నావాడా అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. మరో ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ యాదవ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉండి సంవత్సరం నుంచి పరారీలో ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి కిరణ్ దేవి భోజ్‌పూర్ జిల్లాలోని సందేశ్ అసెంట్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. మహా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ఆర్జేడీ 144, కాంగ్రెస్70, సీపీఐఎంఎల్ 19, సీపీఎం 4 చోట్ల పోటీ చేయబోతుంది. చదవండి : సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ -
బిహార్ ఎన్నికలు.. ఆర్జేడీకి భారీ షాక్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లపై హత్యకేసు నమోదైంది. వీరితో పాటు ఆర్జేడీ నేతలు అనిల్ కుమార్ సాధు, కలో పాస్వాన్లతో పాటు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్జేడీ ముఖ్య నేతలపై హత్యారోపణలు రావడం ఆ పార్టీవర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 4న (నిన్న) బిహార్ లోని పూర్నియా జిల్లాలోని మాలిక్ (37) ఇంట్లోకి చొరబడిన దుండగులు అతన్ని కాల్చి చంపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మాలిక్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఉదంతం వెనుక కుట్రకోణం దాగుందని, దీన్ని రాజకీయ హత్యగా మాలిక్ భార్య ఆరోపించారు. ఇంతకుముందు ఆర్జేడీ నుంచి మాలిక్‌ను సస్పెండ్ చేసిన కారణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. (బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్) పార్టీ టికెట్ కేటాయించడానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్లు కొన్ని రోజులక్రితం మాలిక్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనను కులం పేరిట తేజశ్వి యాదవ్ దూషించినట్లు సైతం మాలిక్ వీడియోలో వెల్లడించారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని అనుకున్న తురణంలోనే ఇలా హత్యకు గురికావడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. మాలిక్ హత్యకేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ విశాల్ శర్మ తెలిపారు. మాలిక్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయని, సంఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా బిహార్ ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి యాదవ్ తన అసలు రంగు బయటపెట్టాడని జేడీ(యు) ఆరోపించింది. (బిహార్ ఎన్డీఏ నుంచి ఎల్జేపీ ఔట్) -
బిహార్ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులు వీరే..
పట్నా: బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీల నేతృత్వంలోని మహాకూటమి జోరు పెంచింది. ఎన్డీఏ కూటమి ఇంకా సీట్ల సర్దుబాటులోనే తలమునకలై ఉండగా మహాకూటమి మాత్రం అభ్యర్థులను ప్రకటించేస్తోంది. మహాకూటమి సీట్ల పంపకాల్లో భాగంగా ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, సీపీఐఎంఎల్ 19, సీపీఐ 6, సీపీఎం 4 చోట్ల పోటీ చేయబోతోంది. ఈక్రమంలో తమ పార్టీ తరఫున పోటీ చేయబోతున్న నలుగురు అభ్యర్థుల పేర్లను సీపీఎం ప్రకటించింది. మతిహనీ, పిప్రా, బిభుటిపూర్, మాఝీ స్థానాల నుంచి రాజేంద్రప్రసాద్, రాజ్‌మంగళ్‌ప్రసాద్, అజయ్‌కుమార్, సతేంద్రయాదవ్‌ల అభ్యర్థిత్వాలను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక.. బాఖ్రీ, తెగ్రా, బచ్వారా, హర్లాఖీ, ఝంఝర్పూర్, రూపౌలీ స్థానాల నుంచి సీపీఐ పోటీ చేస్తోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాండేకి హర్లాఖీ టికెట్ లభించగా, సిట్టింగ్ ఎమ్మెల్యే అవదేష్‌కుమార్ రాయ్ మరోసారి బచ్వారా స్థానం నుంచే పోటీకి దిగుతున్నారు. 2015 ఎన్నికల్లో తెగ్రా, బాఖ్రీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్‌రతన్‌సింగ్, సూర్యకాంత్ పాశ్వాన్లు మరోసారి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రూపౌలీ నుంచి వికాస్‌చంద్రమండల్, ఝంఝర్పూర్ నుంచి నారాయణ్‌యాదవ్ బరిలోకి దిగుతున్నారు. (చదవండి: ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం) -
బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్
-
బిహార్: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ బిహార్‌లో ప్రతిపక్ష కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవహరించనున్నారు. మహాకూటమిలో చర్చల అనంతరం రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో 243 సీట్లకు గాను 144 సీట్లను ఆర్జేడీకి కేటాయించారు. కాంగ్రెస్ పార్టీకి 70, లెఫ్ట్ పార్టీలకు 29, జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఆర్జేడీ కోటా నుంచి సీట్లు కేటాయించామని కూటమి శనివారం ప్రకటించింది. అయితే ఈ విభజనతో కలత చెందిన చిన్న పార్టీలలో ఒకటైన వీఐపీ పార్టీ కూటమి నుంచి వైదొలింగి. తాము మోసపోయామని ఆ పార్టీ నేతలు విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, ఇది ప్రజలకు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మధ్య పోరాటమని పేర్కొన్నారు. ఇక కరోనా సమయంలో దేశంలో అతి పెద్ద బీహార్ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా అక్టోబర్ 8తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. బీహార్‌లో అక్టోబర్ 28, నవంబర్ 3, 7వ తేదీలలో పోలింగ్ జరగనుంది. కాగా ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నితీశ్‌కుమార్ ప్రభుత్వం నాలుగవసారి కూడా తాము అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమాగా ఉంది. ఇక వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ఆర్జేడీ వ్యూహం రచిస్తోంది. దానితో పాటు కరోనాను ఎదుర్కోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేయాలని కూడా ప్రతిపక్షం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా సమయంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓటు వేసే సమయాలను కూడా మార్పు చేసింది. చదవండి: బిహార్‌లో ఎల్జీపీ దూకుడు.. కీలక భేటీ -
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్ 28న తొలివిడత పోలింగ్, నవంబర్ 3న రెండో విడత , మూడో విడత నవంబర్ 7న జరుగనుంది. నవంబర్ 10 ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను ప్రకటించనుంది. శుక్రవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్ అరోరా ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 29తో ముగియనుంది. దేశంలో కరోనా విజృంభణ అనంతరం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఈసీ ప్రత్యేక మార్గదర్శకాల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని సైతం కల్పించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు అరోరా తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 15 రాష్ట్రాల్లో 64 స్థానాలకు ఉప ఎన్నికలకు సైతం షెడ్యూల్‌ను ప్రకటించింది. (చాణిక్యుడి చతురత.. వృద్ధ నేత వ్యూహాలు) షెడ్యూల్ వివరాలు.. మొత్తం అసెంబ్లీ స్థానాలు : 243 మొదటి విడత పోలింగ్ తేదీ - అక్టోబర్ 28 రెండవ విడత పోలింగ్ తేదీ - నవంబర్ 3 చివరి విడత పోలింగ్ తేదీ - నవంబర్ 7 ఓట్ల లెక్కింపు - నవంబర్ 10 71 స్థానాలకు పోలింగ్ తొలి దశలో పోలింగ్ రెండో విడతలో 94 స్థానాలకు ఎన్నికలు మూడో విడతలో 78 స్థానాలకు ఎన్నికలు నామినేషన్ల ప్రారంభ తేదీ: అక్టోబర్ 1 నామినేషన్లకు చివరి తేదీ - అక్టోబర్ 8 పోలింగ్ కేంద్రాలు : లక్షకు పైగా భారీ ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి లేదు పోలింగ్ సమయాన్ని గంట సమయం పెంచిన ఈసీ ఆన్లైన్ ద్వారా కూడా నామినేషన్ల స్వీకరణ చివరి గంటలో కరోనా పేషంట్లకు ఓటు వేసేందుకు అనుమతి పోలింగ్ కేంద్రాల వద్ద భౌతికదూరం పాటించడం తప్పనిసరి.. ఒక్కో పోలింగ్ బూత్‌లో 1000 మంది ఓటర్లు పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంచుతాం: ఈసీ ప్రధాన పార్టీలు : బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, ఎల్జేపీ, -
ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే
దేశంలో మరో ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నా బిహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో విడత పోలింగ్ అనంతరం నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనుంది. దీంతో ఎన్నికల రణరంగంలోని దిగేందుకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. పొత్తులు, ప్రత్యర్థిపై ఎత్తులు వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీలై బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీలో సీట్ల పంపకాలపై చర్చలు వేగవంతం చేశాయి. విజయలక్ష్యంగా అభ్యర్థుల వేటను ఆరంభించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు బిహార్‌లో బలమైన పునాదులు ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ అంతా జేడీయూ, ఆర్జేడీ మధ్య ఉండే అవకాశం ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న అతిపెద్ద ఎన్నికల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకటికావడం గమనార్హం. (మోగిన బిహార్ ఎన్నికల నగారా) వెబ్‌స్పెషల్ : కరోనా లాంటి క్లిష్ట సమయంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాజకీయాల్లో ఆరితేరిన నేతలున్న బిహార్‌లో.. కేంద్ర ఎన్నికలు సంఘం ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది. ఆనాటి మౌర్యసామ్రాజ్యానికి రాజధాని వెలసిల్లిన పాటలీపుత్ర నగరం నేడు రాజకీయ వ్యహాలకు, ఎత్తుల పైఎత్తులకు కేంద్రంగా మారింది. దేశంలో తలపండిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న పోటీ కావడంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ (లోక్‌జన శక్తి పార్టీ) ఉమ్మడిగా బరిలోకి దిగుతుండగా.. గత మిత్రులు కాంగ్రెస్-ఆర్జేడీ మరోసారి జట్టుకట్టాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోవడంతో పాటు దాదాపు రెండు దశాబ్ధాల పాటు బిహార్ రాజకీయాలను ఏలిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం జైల్లో ఉండటం ఎన్డీయేకూటమికి కలిసొచ్చే అంశం. ఇక నితీష్ కుమార్ పాలనపై ప్రజల్లో నమ్మకం, జాతీయ స్థాయిలో ఆయనకున్న పలుకుబడితో పాటు బీజేపీ మద్దతు జేడీయూ మరింత బలం చేకూరుస్తోంది. లాలూ జైలు పాలవ్వడంతో పార్టీ బాధ్యతల్నిభుజానకెత్తుకున్న తేజస్వీ యాదవ్ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవడంలో తేజస్వీ విఫలమయ్యారు. అంతేకాకుండా ఇద్దరు అన్నదవమ్ములు (తేజస్వీ-తేజ్ ప్రతాప్యాదవ్)ల మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. గత ఐదేళ్ల కాలంలో నితీష్ చేసిన అభివృద్ధి, బీజేపీతో ఉన్న సత్సంబంధాలు ఎన్డీయే కూటమికి దోహదపడే అవకాశం ఉంది. (రంగు మారిన పవన్ రాజకీయం) ఎన్డీయేకు సవాలే.. నితీష్‌కు కఠిన పరీక్ష మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోవడం, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం, నిరుద్యోగుల ఆక్రోశం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉన్నఫళంగా విధించిన లాక్డౌన్ కోట్లాదిమంది కార్మికులను నడిరోడ్డుపై నిలబెట్టింది. వేసవికాలంలో పొట్టచేతపట్టుకుని వేల కిలోమిటర్లు కార్మికులు నడిచిన తీరు దేశమంతా చూసింది. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం సైతం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర పోలీసులను తప్పుదోవ పట్టించి, బిహార్ పోలీసుల చేత విచారణ జరిపిస్తోందన్న విమర్శలూ వ్యక్తం అయ్యాయి. మరోవైపు సరిహద్దుల్లో గత మూడు నెలలుగా చైనా అక్రమణకు దిగుతోంది. గల్వాన్‌లోయలో 20 మంది సైనికులను పొట్టనబెట్టుకుంది. అయితే చైనాపై భారత పాలకులు సరైన రీతిలో స్పందించడంలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంతకుమించి బీజేపీ-ఆర్జేడీ-ఎల్జేపీ మధ్య కోల్డ్‌వార్ నేతలకు తలనొప్పిగా మారింది. ఎల్జేపీ చీప్ రామ్‌విలాస్ పాశ్వాన్ నితీష్‌పై పీకల్లోతు కోపంతో మండిపోతున్నారు. తమను కనీస భాగస్వామ్య పార్టీగా నితీష్ గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూడు పార్టీల నడుమ సీట్ల పంపకం అనేది తేలని పంచాయితీగానే మిగిలిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్డీయే కూటమి ఈ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఏడాది చివరన జరిగే ఎన్నికల్లో సీఎం నితీష్ కూడా ఈ ఎన్నికలు కఠిన పరీక్షలాంటివని చెప్పకతప్పదు. (కేసీఆర్ తరువాత టీఆర్ఎస్ బాస్ ఎవరు..?) మోదీ, అమిత్ షాతో నితీష్ బంధం... 2003లో మరోసీనియర్ నేత శరద్ యాదవ్‌తో కలిసి నితీష్ కుమార్ జనతాదల్ (యూనైటెడ్) పార్టీని నెలకొల్పాడు. అయితే అప్పటి నుంచీ అది బీజేపీ మిత్రపక్షంగానే కొనసాగుతోంది. బీజేపీ మద్దతుతోనే నితీష్ సైతం సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. గతంతో పోలీస్తే నితీష్ సీఎం అయ్యాక బిహర్ రూపురేఖలు మారాయనే చెప్పొచు. ముఖ్యంగా నిరుద్యోగం, ఆకలి, అక్షరాస్యత, తాగునీరు వంటి అంశాల్లో రాష్ట్రం కొంత మెరుగుపడింది. వెనుకబడిన రాష్టంగా ముద్రపడ్డ బిహార్‌లో నితీష్ నాయకత్వం పరిశ్రమలకు పెద్ద పీఠ వేసింది. పదేళ్ల ఆర్జేడీ పాలనతో విసిగిన బిహార్ ప్రజలకు జేడీయూ పాలన కొత్త రుచులను చూపించింది. దీంతో నితీష్ నాయకత్వంపై ప్రజలకు ఓ బలమైన విశ్వాసం కలిగింది. బిహార్ రాజకీయాల్లో ఇక తమకు తిరుగులేదనే స్థాయికి బీజేపీ-జేడీయూ కూటమి చేరుకుంది. అంతేకాకుండా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరుఫున తానే ప్రధాని అభ్యర్థి అనేంతగా నితీష్ జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు. అయితే తమ సొంత పార్టీ అభ్యర్థిని కాదని భాగస్వామ్య పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని భావించిన కాషాయ దళ పెద్దలు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రే మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పరిణామం ఆ పార్టీ కురువృద్దుడు ఎల్కే అద్వానీతో పాటు మరికొంత మంది సీనియర్లుకు ఏమాత్రం రుచించలేదు. ఈ ప్రభావం జేడీయూ-బీజేపీ 17 ఏళ్ల స్నేహంపైనా పడింది. మోదీ అభ్యర్థిత్వాన్ని నితీష్ కుమార్ బహిరంగంగా వ్యతిరేకించారు. గోద్రా అల్లర్లతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఏంటని నిలదీశారు. మోదీని ముస్లింల నరహంతకుడిగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎన్డీయే కూటమి నుంచి వైదులుగుతున్నట్లు ప్రకటించారు. మా స్నేహం మూనాళ్ల ముచ్చటే.. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం 73 స్థానాలున్న అర్జేడీ ప్రతిపక్షంలో కూర్చింది. జేడీయూ(69), బీజేపీ (54), ఎల్జేపీ (2) మద్దతులో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏళ్ల నాటి బంధాన్ని వదులుకుని నితీష్ కుమార్ చిరకాల శత్రువు లాలూ ప్రసాద్ యాదవ్‌తో దొస్తీ కట్టారు. మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్-ఆర్జేడీ-జేడీయూ కలిసి పోటీచేసి విజయాన్ని అందుకున్నాయి. అయితే నితీష్-లాలూల స్నేహం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. డిప్యూటీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తేజ్ ప్రతావ్ యాదవ్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో మహాకూటమితో నితీష్ తెగదెంపలు చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతో తాను ప్రభుత్వాన్ని నడపలేనంటూ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన 24 గంటల్లోనే బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం ఎక్కారు. అయితే ఇదంతా బీజేపీ, జేడీయూ ఆడిన నాటకమని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శించాయి. నితీష్ తీరుపై అప్పట్లో జాతీయ స్థాయిలోనూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజా ఎన్నికల్లో మరోసారి పాత స్నేహం (బీజేపీ)తో నితీష్ బరిలో నిలిచారు. ధీటైన విపక్షం లేకపోవడంతో విజయవకాశాలు దాదాపు ఎన్డీయే కూటమికే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్జేడీ కొంతమేర పోటీ ఇచ్చినా.. కాంగ్రెస్ మాత్రం కేవలం ఉనికి కోసం కొట్లాడే పరిస్థితి కనిపిస్తోంది. 29 ఏళ్లకే లోక్‌సభకు ఎన్నిక లాలూ ప్రసాద్ యాదవ్ భారత కేంద్ర ప్రభుత్వములో ప్రస్తుత (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) రైల్వే శాఖా మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ ఆధ్యక్షుడు. యాదవ్ ఏడు సంవత్సరముల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. గడచిన రెండు దశాబ్దాలలో బిహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభలమైన వ్యక్తి. లాలూ రాజకీయ జీవితానికి తొలి మెట్టు పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడము. జయ ప్రకాష్ నారాయణ్ వల్ల ప్రభావితమైన విద్యార్థుల ఉద్యమానికి 1970లో లాలూ నాయకత్వము వహించారు. ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఒక వినతి శాసనాన్ని అందించిన ధీశాలిగా నిలిచారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హా (ఛోటే సాబ్) 1977లో లాలూను లోక్‌సభ స్థానానికి పోటీ చేయించి, లాలూ తరపున ప్రచారము చేశాడు. ఫలితంగా 29 ఏళ్ల పిన్న వయస్సులోనే 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేవలము 10 సంవత్సరముల వ్యవధిలోనే లాలూ, బిహార్‌లో ఒక ఉజ్జ్వల శక్తిగా ఎదిగారు. 1989లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో లాలూ నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయపథాన నడిపించారు. 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు. జాతీయ నేత జైలు పాలు.. 1996లో బిహర్లో బయటపడిన రూ.950 కోట్ల పశుగ్రాస కుంభకోణం లాలూ రాజకీయ జీవితాన్ని మార్చివేసింది. పశుగ్రాస కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల వల్ల లాలూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన స్థానములో సతీమణి రబ్రీ దేవిని ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే అయితే ఈ దర్యాప్తును లాలూనే స్వయంగా విచారణకు ఆదేశించడము విశేషం. 1997లో లాలూ, జనతా దళ్ నుంచి విడిపోయి రాష్ట్రీయ జనతా దళ్ అనే సొంత పార్టీని స్థాపించారు. కేంద్ర మంత్రి అయిన తరువాత నష్టాల్లో నడుస్తున్న భారతీయ రైల్వేలను లాభాల దిశగా నడిపించిచటంలో ఉపయోగించిన విన్నూత యాజమాన్య పద్ధతులకు జాతీయ స్థాయిలో లాలూ ఖ్యాతిగడించారు. ఆసియా టైమ్స్ ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ లాలూ "ప్రపంచములోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఒక ఆవుల కాపరి కొడుకు ఇంతటి స్థాయికి ఎలా చేరుకోగలిగాడు అని ఆశ్చర్యమును, ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఉత్సుకత భారత ప్రజాస్వామ్య విజయానికి చిహ్నము" అని అన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత: నితీష్ దాదాపు 34 ఏళ్ల రాజకీయ జీవితం, అవినీతి మచ్చలేని మనిషి. పార్టీలు మారినా ప్రజల్లో తనకున్న ఫాలోయింగ్‌లో మాత్రం మార్పు రాలేదు. ఉన్నత కులాలకే ఉన్నత పదవులు అన్న మాటల్ని తిరగరాసి ఉన్నతమైన భావాలున్నవారందరికి అనిపించాడు. రౌడీలు రాజ్యమేలుతున్న బిహర్‌కు ఓ రాథోడ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కరెక్టుగా తెలిసిన రాజకీయ నాయకుడు నితిష్‌కుమార్. నితీష్‌పై జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన 1971లో రాజకీయ రంగప్రవేశం చేసి, రామ్మనోహర్ లోహియా పార్టీ సంజీవాది యువజన్ సభలో చేరారు. 1974-1977 వరకు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.1977లో తన (కుర్మీ) సామాజిక వర్గం బలంగా ఉన్న హర్నాత్ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఆ ఎన్నికల ద్వారా ఆయన ఓ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1987 యువలోక్ దల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. రెండు సంవత్సరాల అనంతరం జనతా దల్ పార్టీ సెక్రటరీ జనరల్ ఎన్నికయ్యారు. 1994లో సమతా పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. జనతాదల్ యునైటెడ్ ప్రారంభమైన తర్వాత సమతా పార్టీని అందులో విలీనం చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉండగా1998-1999 మధ్య కాలం కేంద్ర మంత్రిగా రైల్వేశాఖ, వ్యవసాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో మొదటి సారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ఒక వారంలో నితీష్ తన పదవి కోల్పోవడం గమనార్హం. 2005లో బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2015లో లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌తో మహాకూటమి ఏర్పాటు చేశారు. 2016లో మహాకూటమితో తెగదింపెలు చేసుకుని పాత మిత్రుడైన బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ సహాయంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నితీష్ కుమార్ మొత్తం 13 ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1973లో మంజుకుమారీ సిన్హాన అనే ఉపాధ్యాయురాలిని వివాహమాడారు. వారికి నిశాంత్ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2007 సంవత్సరంలో నితిష్ తన భార్యను కోల్పోయారు. తను కుమారుడిని మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంచడం గమనార్హం. ఇక తాజా ఎన్నికల్లో చాణిక్యుడి చతురత.. వృద్ధనేత వ్యూహాలు ముందు ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో వేచిచూడాలి. -
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
బిహార్: కేంద్ర మాజీ మంత్రి రుఘువంశ్ ప్రసాద్ సింగ్ (74) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల కరోనాబారినపడ్డ ఆయన కోలుకున్నారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కాగా, ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్ గురువారమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. (చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి భారీ షాక్) -
అసెంబ్లీ ఎన్నికలు : ఆర్జేడీకి భారీ షాక్
పట్నా : అసెంబ్లీ ఎన్నికల ముందు బిహార్‌లో ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ రాజీనామా చేశారు. గురువారం ఆయన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు పంపారు. అయితే రాజీనామాకు మాత్రం సరైన కారణాలు వెల్లడించలేదు. ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌తో ఆయనకు ఉన్న విభేదాల కారణంగానే పార్టీ నుంచి వైదొలిగనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్ నేత రాజీనామా ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రఘువంశ్ ప్రసాద్ గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్జేడీలో లాలూ ప్రసాద్ యాదవ్ తరువాత అత్యంత సీనియర్ నేతగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా గుర్తింపుపొందారు. కాగా ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. (దేశంలో మరో ఎన్నికల సమరం) -
‘ఇప్పటికైనా మోదీ మాట విన్నారు.. ధన్యవాదాలు’
పట్నా : బీహార్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలకు బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. ‘బిహార్ జనసంవాద్’ పేరిట ఆదివారం వర్చువల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, దీనికి బీహార్ ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కరోనాపై పోరు కోసం ప్రజలందరిని మమేకం చేయడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హయంలో గత ఆరేళ్లలో సాధించిన ఘనతలను వివరించారు. (చదవండి : ‘భారత్ ఏ దేశం ముందూ తలవంచదు’) ‘ఇది ఎన్నికల ర్యాలీ కాదు. కరోనాపై పోరు కోసం ప్రజలందరిని మమేకం చేయడమే దీని ఉద్దేశం. కరోనా వారియర్స్‌కి చేతులెత్తి మొక్కుతున్నా. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి కోవిడ్-19పై పోరాడం చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇలాంటి సభలను మరిన్నిటిని నిర్వహిస్తాం. లాక్‌డౌన్‌పై ప్రధాని చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు ధిక్కరించినప్పటికీ.. ప్రజలు పాటించారు. వలస కార్మికులను తరలించడానికి ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేశాం. గత ఆరేళ్లలో ప్రధాని మోదీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సీఏఏను అమల్లోకి తేవడంతోపాటు, పేదలకు విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేయడం, మరుగు దొడ్ల నిర్మాణం, పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేయడం, ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి ఎన్నో సాహసోపేత నిర్ణయాలను బీజేపీ ప్రభుత్వం తీసుకుంది’ అని అమిత్ షా వివరించారు. ఇప్పటికైనా మోదీ మాట విన్నారు బీజేపీ నిర్వహించిన ర్యాలీని వ్యతిరేకిస్తూ ఆదివారం ప్రతిపక్ష ఆర్జేడీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ‘గరీబ్ అధికార్ దివస్’ పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆర్జేడీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌తో మరికొందరు నేతలు ప్లేట్లు వాయిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనిపై అమిత్‌షా తనదైన శైలీలో చురకలు అంటించారు. ఆర్జేడీ పేరు కానీ, తేజస్వీ పేరు కానీ ప్రస్తావించకుండా నేరుగా వారిపై విమర్శలు గుప్పించారు. ‘కొంత మంది వ్యక్తులు ఈరోజు చప్పట్లు కొడుతూ కనిపించారు. కోవిడ్-19పై పోరాడుతున్న వారి పట్ల కృతజ్ఞతాభావంతో చప్పట్లు కొట్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును ఎట్టకేలకు స్వాగతించినందుకు ధన్యవాదాలు’అని వీడియో అమిత్ షా అన్నారు. -
దేశంలో మరో ఎన్నికల సమరం
పాట్నా: బిహార్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తంగా ఆదివారం రాష్ట్రంలో వర్చువల్ ర్యాలీని బీజేపీ తలపెట్టింది. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీని ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ర్యాలీకి సుమారు లక్ష మందికిపైగా హాజరయ్యేలా చూడాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగానే తలపెట్టిన ఈ వర్చువల్ ర్యాలీ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లేనని బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ తెలిపారు. అయితే దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కాగా.. వర్చువల్ ర్యాలీపై ఇప్పటికే కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దేశం మొత్తం కరోనా మహమ్మారి బారినపడి దిక్కుతోచని స్థితిలో ఉంటే బీజేపీ ఎన్నికల కోసం ఆరాటపడుతోందని విమర్శిస్తున్నారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నితీష్ కుమార్‌తో కలిసి మరోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవిళ్లూరుతోంది. కాగా.. బిహార్‌లో బీజేపీని మొదటి నుంచి అంటిపెట్టుకొని ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేఎస్పీ) కూడా వలస కూలీల విషయంలో సీఎం నితీష్ పనితీరును బాహాటంగానే విమర్శించింది. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌షా చేపట్టిన వర్చువల్ ర్యాలీ తమ కూటమి ఐక్యతను చాటిచెప్పేందుకేనని తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాయి. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జేడీయూ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
థాంక్యూ సోమచ్ కమిషనర్: తేజశ్వి యాదవ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని వివిధ హోటల్స్‌లో చిక్కుకున్న బిహార్‌కి చెందిన ఇంటర్ విద్యార్థులను సురక్షితంగా కళాశాల హాస్టల్స్‌కి పంపించినందుకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజనకు బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఓ ప్రైవేట్ కళాశాలలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు లాక్డౌన్ నేపథ్యంలో కాలేజీ హాస్టల్ నుంచి బయలుదేరి బిహార్ రాలేక నగరంలోని పలు హోటల్స్‌లో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. Thank you so much https://t.co/1om5Z2twCL — Tejashwi Yadav (@yadavtejashwi) March 28, 2020 దీంతో బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ట్విట్టర్ ద్వారా కమిషనర్ సృజనకి విషయాన్ని తెలియజేశారు. కమిషనర్ వెంటనే స్పందించి నగరంలోని హోటల్స్‌లో జల్లెడపట్టగా 17 మంది విద్యార్థుల ఆచూకీ గుర్తించి వైద్య పరీక్షల అనంతరం కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి తిరిగి హాస్టల్‌కి పంపించారు. ఈ విషయాన్ని తేజశ్వికి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో కమిషనర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు.