పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది.
పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్‌లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు.
నితీష్ కుమార్‌ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్‌పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు.
ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్‌ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు.
ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు
Comments
Please login to add a commentAdd a comment