JDU
-
రెండు జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల డేటా విశ్లేషణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఢిల్లీ ఓటర్లు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలైన బీఎస్పీ, సీపీఎం కంటే నోటా (నాన్ ఆఫ్ ది ఎబవ్)ఆప్షన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారని తేలింది. మొత్తం పోలైన ఓట్లలో నోటా ఆప్షన్‌కు 0.57 శాతం ఓట్లు పడగా బీఎస్పీకి 0.55 శాతం, సీపీఎంకు 0.01శాతం మంది మాత్రమే ఓటేయడం గమనార్హం. ఈ రెండు పార్టీలకు దక్కిన ఓట్ల కంటే నోటా ఓట్ల శాతమే ఎక్కువ. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.01, జేడీయూకు 0.53 శాతం ఓట్లు పడ్డాయి. -
బీజేపీకి షాక్.. కూటమికి సీఎం నితీష్ కుమార్ గుడ్‌బై.. ఎక్కడంటే?
ఇంఫాల్ : బీహార్ సీఎం నితిష్ కుమార్ (cm nitish kumar) బీజేపీకి ఝలక్ ఇచ్చారు. మణిపూర్ (manipur) బీజేపీ (bjp) నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జనతా దళ్ (యునైటెడ్) తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీయూ యూనిట్ అధినేత కాష్ బీరెన్ సింగ్ రాష్ట్ర అధికార బీజేపీకి మద్దతు ఉప సంహరించుకుంటున్నట్లు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బహ్లాకు లేఖ రాశారు. ప్రతిపక్ష బాధ్యత వహిస్తారని సూచించారు.మణిపూర్‌లో తమపార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నసీర్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో సీటును కేటాయించాలని కోరారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీకి జేడీయూ మద్దతు ఉండబోదని, అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని లేఖలో పేర్కొన్నారు. గతంలో బీజేపీకి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. తాజాగా, జేడీయూ సైతం కమలానికి గుడ్ బై చెప్పడం మణిపూర్ రాష్ట్ర రాజకీయాలు చర్చాంశనీయంగా మారాయి. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదురుగు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్‌లో అభివృద్ది ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టి పారేస్తున్నారు. కేంద్ర ఎన్డీఏ కూటమిలో జేడీయూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాదు కూడదు అంటే .. అది బీజేపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. -
జేడీయూలో చేరిన క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి
టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీహార్‌కు చెందిన ప్రణవ్ స్థానిక అధికార పార్టీ అయిన జనతాదల్ యునైటెడ్‌లో (జేడీయూ) చేరారు. జేడీయూ చీఫ్‌గా నితీశ్‌కుమార్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చున్నూగానూ పిలువబడే ప్రణవ్ను జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఝా పార్టీలోకి ఆహ్వానించారు. పట్నాలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రణవ్ జేడీయూ తీర్థం పుచ్చుకున్నారు. ప్రణవ్ పాండేకు ఇషాన్ కిషన్ తండ్రిగానే కాకుండా స్థానికంగా ప్రముఖ బిల్డర్‌గా మంచి పేరుంది. బిల్డర్‌గా ఉంటూనే ప్రణవ్ మెడికల్ స్టోర్ వ్యాపారంలోనూ ఉన్నారు. జేడీయూలో చేరిక సందర్భంగా ప్రణవ్ ఇలా అన్నారు. పార్టీ కోసం నమ్మకమైన సైనికుడిగా పని చేస్తానని తెలిపాడు. ఇదే సందర్భంగా జేడీయూ ఎంపీ సంజయ్ ఝా మాట్లాడుతూ.. సీఎం నితీశ్‌కుమార్ చేస్తున్న అభివృద్దిని చూసి ప్రణవ్ పార్టీలో చేరారన్నారు. ప్రణవ్ చేరిక మగద్ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తుందని తెలిపారు.కాగా, ఇషాన్ కిషన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత-ఏ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇషాన్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీల్లో ఇషాన్ పరుగుల వరద పారించాడు. తిరిగి జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా ఇషాన్ ముందుకు కదులుతున్నాడు. -
నితీశ్‌కుమార్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: జనతాదళ్(యునైటెడ్)పార్టీ అధ్యక్షుడిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 29(గురువారం) ఈ ఫిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. జేడీయూ మాజీ సభ్యుడు గోవింద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని, అంతర్గత పార్టీ మార్పులపై కోర్టు జోక్యం చేసుకోవడానికి బలమైన కారణం లేదని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ అన్నారు. ‘‘ఈ పిటీషన్‌ను విచారించే మెరిట్ లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 అధికార పరిధికి సంబంధం లేకుండా ఉంది.పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో పాటు రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’’ అని ఢిల్లీ కోర్టు పేర్కొంది. 2016, 2019, 2022 సంవత్సరాల్లో జేడీయూ నిర్వహించిన పార్టీ అంతర్గత ఎన్నికలు పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని ప్రకటించాలని గోవింద్ యాదవ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ జేడీయూ పార్టీలోని ఒక వర్గం లేవనెత్తగా.. 2017లో ఎన్నికల సంఘం నితీశ్‌కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిందని హైకోర్టు పరిశీలించింది. -
మరోసారి సహనం కోల్పోయిన నితీష్.. మహిళా నేతపై అరిచిన సీఎం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తమ ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మహిళా నేతపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యాలపై ప్రతిపక్ష ఆర్జేడీ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా బుధవారం నితీష్ కుమార్ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.. రిజర్వేషన్లు, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆయన ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ‘ నితీష్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.దీనిపై నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సహనం కోల్పోయిన సీఎం.. ఓ మహిళా నేతపై విరుచుకపడ్డారు. నువ్వు మహిళవే కదా? నీకేమైనా తెలుసా? తాను ఎలా మాట్లాడుతుందో చూడండి. .మీరు మహిళల కోసం ఏమైనా చేశారా? లేదు కదా. మేము మాట్లాడతాం మీరు నిశబ్దంగా వినండి..వినకపోతే అది మీ తప్పు.’అంటూ మడిపడ్డారు.సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే సమయంలో నితీష్ కుమార్ అలవాటు పడిన నేరస్థుడిగా ప్రవర్తిస్తారని విమర్శలు గుప్పించారు. 2నువ్వు స్త్రీవి, నీకు ఏమైనా తెలుసా?’ అంటూ మహిళలపై చౌకబారు, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే.ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత నెల జూన్‌లో సంచలన తీర్పు వెలువరించింది. ఇక తాజాగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితిష్ కుమార్.. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో జేడీయూకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
బిహార్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేం.. తేల్చిచెప్పిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న బిహార్ అధికార పార్టీ జేడీయూకి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని కేంద్రం పార్లమెంట్ వేదికగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్సీపీ, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ, అలాగే ఒడిశా కోసం బీజేడీ డిమాండ్ చేశాయి.The Special Category Status for plan assistance was granted in the past by the National Development Council (NDC) to some States that were characterized by a number of features necessitating special consideration. The decision was taken based on an integrated consideration of… pic.twitter.com/PbPDiJjLyz— ANI (@ANI) July 22, 2024అయితే సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పార్లమెంట్లో స్పందించింది. ఈ సందర్భంగా బిహార్‌కు స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం స్పందిస్తూ అధికారికంగా ఓ నోట్‌ను విడుదల చేసింది. అందులో లోక్‌సభలో బిహార్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.అందులో 2012లో ఇంటర్ మినిస్ట్రీ రియల్ గ్రూప్ బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించింది. అయితే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలలో బిహార్ అర్హత సాధించలేదని స్పష్టం చేసింది. దీంతో బిహార్‌కు ఇక ప్రత్యేక హోదా దక్కదేమోనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.ఇక పంజక్ చౌదరి.. లిఖిత పూర్వక సమాధానంలో ప్రత్యేక హోదా సాధించాలంటే కావాల్సిన అర్హతల గురించి ప్రస్తావించారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే..👉పర్వత ప్రాంత రాష్ట్రం అయి ఉండాలి.👉తక్కువ జనాభా,ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఉండాలి.👉అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండాలి 👉ఆర్థిక మౌలిక వసతుల లేమి కలిగిన రాష్ట్రమై ఉండాలి 👉అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు అర్హులని తెలిపింది. -
‘బీజేపీతో పొత్తుపై పునరాలోచించండి’.. సీఎం నితీష్‌కు పార్టీ నేత విజ్ఞప్తి
శ్రీనగర్: బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కకపోవటంతో మిత్రపక్షం సహకారంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో బిహార్ సీఎం నితీష్‌కుమార్ జేడీయూ పార్టీ కీలకంగా వ్యవహారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర జేడీ(యూ) జనరల్ సెక్రటరీ వివేక్ బాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా జేడీ(యూ) పార్టీ ఉండటంపై పునరాలోచించాలని ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.‘‘జమ్ము కశ్మీర్ బీజేపీ నేతలు చేస్తున్నట్లు చర్యలు కారణంగా మా పార్టీ చీఫ్ నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై పునరాలోచించాలని కోరుతున్నాం. మేము ఇస్లామిక్ స్కాలర్లను తిరిగి సమాజంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. వారు దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. అందుకే వారిని మేము వదిలిపెట్టాలని అనుకోవటం లేదు. అయితే మా ప్రయత్నాలను మాత్రం బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది’’ అని వివేక్ బాలి తెలిపారు. ఇక.. లోక్ సభఎన్నికల్లో బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీ (యూ) 12 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ.. మిత్రపక్షాల సాయంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ కీలకంగా మారారు. -
వాడివేడిగా అఖిలపక్ష భేటీ.. ‘నీట్’పై నిలదీసిన విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం(జులై 21) అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ కొనసాగుతోంది. జులై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చిస్తోంది. బడ్జెట్‌తో పాటు సభ ముందుకు రానున్న పలు బిల్లుల జాబితాను వారికి వివరిస్తోంది. నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత అంశాలపై అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ ఈ సమావేశాల్లో కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, కె.సురేశ్, జేడీయూ, ఆప్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆరు బిల్లులను తీసుకురానుంది. -
నవీన్ పట్నాయక్ పొలిటికల్ ప్లాన్.. ‘షాడో కేబినెట్’ సభ్యులు వీరే..
భువనేశ్వర్: దేశంలో ఒడిశా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒడిశాలో తొలిసారి ఏర్పాటైన బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సరికొత్తగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలతో ‘షాడో కేబినెట్’ను ఏర్పాటు చేశారు. దీంతో ఒడిశా రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.కాగా, ఒడిశాలో సీఎం మోహన్ మాంఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు నవీన్ పట్నాయక్ షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు తాజాగా పలు శాఖలను కేటాయించారు. షాడో మంత్రివర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వును బీజేడీ జారీ చేసింది. దీంతో, మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్, మాజీ మంత్రి నిరంజన్ పూజారి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తారు. ବିରୋଧୀ ଦଳ ହେଉଛି ଜନସାଧାରଣଙ୍କ ସ୍ୱାର୍ଥର ଜାଗ୍ରତ ପ୍ରହରୀ। ବିଜୁ ଜନତା ଦଳ ବିରୋଧୀ ଦଳ ଭାବେ ରାଜ୍ୟ ସରକାରଙ୍କ ବିଭିନ୍ନ ବିଭାଗର କାର୍ଯ୍ୟ କଳାପ ଉପରେ ତୀକ୍ଷ୍ଣ ନଜର ରଖିବ। ଏଥିପାଇଁ ବିରୋଧୀ ଦଳ ନେତା ଶ୍ରୀ @Naveen_Odisha ବିଜୁ ଜନତା ଦଳର ୫୦ ଜଣ ନିର୍ବାଚିତ ସଦସ୍ୟଙ୍କୁ ନିମ୍ନ ସୂଚୀ ଅନୁଯାୟୀ ଦାୟିତ୍ୱ ପ୍ରଦାନ କରିଛନ୍ତି।… pic.twitter.com/uCnpIuxMj7— Biju Janata Dal (@bjd_odisha) July 17, 2024 ఇక, ఒడిశాలో జూలై 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతను ఈ షాడో మంత్రివర్గానికి అప్పగించారు. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించే బీజేడీ ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులను ఎదుర్కొంటారు. వారిని ప్రశ్నలు అడగడానికి, వారి అడిగే ప్రశ్నలకు సమాధానాలను కూడా షాడో కేబినెట్ ఇస్తుంది. అయితే, నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన ఈ షాడో కేబినెట్ ప్రభుత్వ అధికారిక సంస్థ. కేవలం బీజేడీకి చెందిన తాత్కాలిక వ్యవస్థ వంటిది.ఇదిలా ఉండగా.. మన దేశంలో ఇలా షాడో కేబినెట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అయితే.. బ్రిటన్, కెనడా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రతిపక్ష పార్టీలకు షాడో కేబినెట్ మాదిరిగానే కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక, కెనడాలో షాడో మంత్రి పదవులు కలిగిన వారిని ‘ప్రతిపక్ష విమర్శకుడు’గా వ్యవహరిస్తారు. మరోవైపు.. బ్రిటన్‌లోని షాడో క్యాబినెట్లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. -
'నీట్ పేపర్ లీక్‌తో.. తేజస్వి అనుచరుడికి సంబంధం'
పాట్నా: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న వెలువడిన నీట్ యూజీ ఫలితాల్లో ఏకంగా 67 మందికి 720 మార్కులు రావడం, వీరిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్లో పరీక్ష రాయడం సందేహాలకు దారి తీసింది. దీంతో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని.. మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్ధులు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో కొనసాగుతోంది. మరోవైపు కేసులో బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు.తాజాగా నీట్ పేపర్ వ్యవహారంపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. పేపర్ లీక్‌తో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ బిహార్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ (ఆర్సీడీ) ఉద్యోగి ప్రదీప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సికందర్ ప్రసాద్ యాదవెందు అనే ఇంజినీర్ కోసం ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్‌లో రూమ్ బుక్ చేయమని చెప్పాడని ఆరోపించారు.పరీక్ష జరగడానికి నాలుగురోజుల ముందు ఈ కాల్ వెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారికి అధికారం లేకపోయినా.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. పట్నాలోని ఎన్హెచ్ఏఐ గెస్ట్‌హౌస్‌లో ఆ రూమ్ బుక్ చేసిన ఆర్సీడీ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు సిన్హా చెప్పారు.మరోవైపు నీట్ నిందితులు తమ గెస్ట్ హాస్‌లో బస చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఎన్హెచ్ఏఐ ఖండించింది. పాట్నాలో తమకు గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని ప్రకటించింది. -
‘స్పీకర్ పదవి తీసుకోండి.. లేదంటే మీ పని అంతే!’
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించలేకపోయింది. దీంతో కేంద్రంలో భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి తెలుగుదేశం(టీడీపీ), జేడీ (యూ)లు కీలకంగా వ్యవహరించి మద్దతు పలికాయి.టీడీపీ, జేడీ(యూ) పార్టీల మద్దతుతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడానికి మద్దతు పలికిన టీడీపీ, జేడీ(యూ) భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలని శివసేన (యూబీటీ) వర్గం నేత ఆదిత్య ఠాక్రే హెచ్చరించారు.If TDP and JDU want to save their party, they should keep Loksabha speaker post with them otherwise BJP will break their parties for sure. — Aditya Thackeray pic.twitter.com/vopynhKkVp— Shantanu (@shaandelhite) June 10, 2024 ‘టీడీపీ, జేడీ(యూ) పార్టీలు.. తమ పార్టీను రక్షించుకోవాలి. అందుకోసం బీజేపీ నుంచి లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేసి తీసుకోండి. లేదంటే త్వరలోనే మీ పార్టీలను బీజేపీ చీల్చివేస్తుంది’ అని ఆదిత్య ఠాక్రే ‘ఎక్స్’ వేదికగా అన్నారు.మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్డీయే కూటమి ఇంకా లోక్‌సభ స్పీకర్ పదవిని ఎవరికీ కేటాయించలేదు. భాగస్వామ్య పార్టీలు స్పీకర్ పదవిని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే వారి డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకోవటం లేదని ఎన్డీయే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
మోదీ 3.0.. స్పీకర్ పీఠం ఎవరికి?
న్యూఢిల్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 30 మందికి క్యాబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటైన నరేంద్ర మోదీ క్యాబినెట్ తొలి సమావేశం సోమవారం జరగనునంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో క్యాబినెట్ సమావేశం ఉంటుంది.కాగా ఇటీవల వెలువడిన లోక్‌షభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలైన టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి మూడోసారి ప్రధానిగా పదవీ స్వీకరించారు మోదీ. ఫలితాలు వెలువడిన నాలుగు రోజులకే మోదీతో సహా 72 మంది మంత్రులతో కూడిన పూర్తిస్థాయి మంత్రివర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది.కీలక మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలకు రెండు మంత్రి పదవులు (ఒక కేబినెట్ ర్యాంకు, ఒక రాష్ట్ర మంత్రి) దక్కాయి. అయితే మరో కీలక పదవి అయిన లోక్‌సభ స్పీకర్ ఎవరికి దక్కుతుందే ప్రశ్న ఇంకా ఉత్కంఠగానే మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌గా అవతరించిన టీడీపీ, జేడీయూలు ఈ పోస్టుపై కన్నేసిన్నప్పటికీ.. దానిని వదులుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపడం లేదు.అయితే రాజ్యాంగం ప్రకారం, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ మొదటిసారి సమావేశమయ్యే ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. హౌస్‌లోని సీనియర్ సభ్యుల నుంచి రాష్ట్రపతి .. ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నిమిస్తారు. ఈ ప్రొటెం స్పీకర్ కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సాధారణ మెజారిటీతో హౌస్ సభ్యుల నుంచి ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు.లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికవ్వడానికి నిర్దిష్ట ప్రమాణాలు, ప్రత్యేక నియమాలేవి లేకపోయినా... రాజ్యాంగం, పార్లమెంటరీ నియమాలపై అవగాహన కలిగి ఉండటం అవసంరం. గత రెండు పర్యాయాలలో లోక్‌షభలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో సుమిత్రా మహాజన్, ఓం బిర్లా స్పీకర్లుగా ఎన్నికయ్యారు.కాగా లోక్‌సభ స్పీకర్ పదవనేది కీలక పదవి. ఫిరాయింపు కారణంగా సభ్యులపై అనర్హత వేటు వేయడానికి సంబంధించిన కేసులను నిర్ణయించడంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్‌కు సంపూర్ణ అధికారం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల్లో ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. పార్టీలో తిరుగుబాటు చేయడం ద్వారా పార్టీ చీలికలకు దారి తీసి ప్రభుత్వాన్నే పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి వాటికి చోటివ్వకుండా ఉండేందుకు టీడీపీ, జేడీయూ ఈ పదవిని కోరుకుంటోంది. మరి చూడాలి ఎవరిని స్పీకర్ పదవి వరిస్తుంది. -
నితీశ్‌కు ప్రధాని పదవి ఆఫర్ చేసిన ఇండియా కూటమి!
పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్‌లోని నితీష్‌కుమార్ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్‌కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్‌గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకే నితీష్ వాళ్ల ఆఫర్‌ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్ కూటమికి లేకపోవటంతో నితీష్ కుమార్‌పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్‌తమ పార్టీ చీఫ్‌కు నితీశ్‌కుమార్‌కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
మోదీ 3.0 మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఎవరికి ఏ పదవులు?
Updateప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూకి రెండు శాఖలు లభించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జేడీయూ సీనియర్ నేతలు లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాగూర్ పేర్లను పార్టీ ప్రతిపాదించింది. కాగా లాలన్ సింగ్ బిహార్‌ళోని ముంగేర్ నుంచి లోక్ సభకు ఎన్నికవ్వగా.. రామ్ నాథ్ ఠాగూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రామ్ నాథ్ ఠాగూర్ భారతరత్న అవా గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు.న్యూఢిల్లీ: మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో మోదీతో పాటు ఆయన క్యాబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది.ఈ క్రమంలో అమిత్ షా నివాసంలో శనివారం ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి జేపీ నడ్డా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవులు వరించనున్నాయనే అంశంపై సర్వత్రా చర్చనీయాంగా మారింది. అయితే ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూలు కీలక పదవులు కోరుతూ తమతమ డిమాండ్లను మోదీ ముందు పెట్టినట్లు తెలుస్తోంది.అయితే కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలు బీజేపీ తనవద్దనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. అటు టీడీపీ మూడు మంత్రు పదవులతోపాటు, రెండు సహాయ మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. కాగా టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కూడా ఉంది. ఇక మూడు మంత్రి పదవులతోపాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు శివసేన, ఎన్సీపీ, ఆర్ ఎల్జేపీ ఒక్కొక్క మంత్రి పదవి కోరుతున్నట్లు సమాచారం.ఇక శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో కూటమి పక్షనేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోవడంలో చంద్రబాబు, నితీశ్‌లు కీలకంగా వ్యవహరించారు.ఇండియా కూటమితో ఇరువురూ సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలకు తెరదించుతూ లిఖితపూర్వకంగా మోదీకి మద్దతు తెలిపారు. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీకి దీటుగా ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. ప్రతిపక్ష కూటమి 232 సీట్లను గెలుచుకుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ 328 స్థానాల్లో పోటీచేసి 99 సీట్లను గెలుచుకుంది.2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 242 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రాకపోవడంతో.. ఎన్టీయే మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎన్డీయేలో భాగమైన టీడీపీి 16 స్థానాలు, నితీష్‌కుమార్‌కు చెందిన జేడీయూ 14, ఏక్నాథ్ షిండే నేత!త్వంలోని శివసేన 7, లోక్‌జనశక్తి రామ్ విలాస్ 3 చోట్ల విజయం సాధించింది. దీంతో మొత్తం 290 స్థానాల్లో ఎన్డీయే గెలుపొందింది. -
‘మోదీ 1/3 పీఎం మాత్రమే’.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ నష్టాన్ని మూటగట్టుకుందని అన్నారు. నరేంద్ర మోదీ ఇక నుంచి ఒకటిలో మూడో వంతు ప్రధాని (1/3 పీఎం)గా కొనసాగుతారని ఎద్దేవా చేశారు. కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్కుమారు, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కలిసి మోదీ ‘1/3 పీఎం’ అవుతారని అన్నారు.బీజేపీ ప్రజాస్వామ్యం కంటే పదవుల కుర్చినే ఎక్కువగా నమ్ముతుందని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి ఎక్కువ కాలం ఉండలేదని అన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ.. ఎప్పటికైనా ఎన్డీయే కూటమి నుంచి బయటకువెళ్లే వ్యక్తులేనని అన్నారు.లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సొంతంగా పూర్తి మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంకోసం ఎన్డీయే కూటమి పార్టీల మద్దతు తీసుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో జేడీ(యూ) నితీష్ కుమార్, టీడీపీ చంద్రబాబు కీలకంగా మారారు. బీజేపీ సొంతంగా 240 సీట్లు మత్రామే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 272. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం ఎంపీల సంఖ్య 293గా ఉంది. -
కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఆ శాఖలన్నీ బీజేపీ వద్దనే!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. ఎన్డీయే కూటమిలో భాగాస్వామ్యమైన, టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్), శివసేన(ఏక్నాథ్ షిండే) సహాకారంతో మూడోసారి ప్రధానిగా మోదీ జూన్ 9 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి వర్గం కూడా కొలువుదీరనుంది.ప్రమాణ స్వీకారానికి తేదీ దగ్గరపడుతుండటంతో కేంద్ర మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది. బీజేపీ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర పదవుల కోసం ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ బేరసారాలు ప్రారంభించాయి ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్లుగా అవతరించిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కేంద్ర మంత్రి పదవుల్లో కీలక శాఖలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దనే ఉండే అవకాశం ఉంది. మిత్రపక్షమైన టీడీపీ లోక్‌సభ స్పీకర్ పదవిని కోరగా..దీనిని ఇచ్చే ప్రస్తకే లేదని కాషాయ పార్టీ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు జేడీయూకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక హోంశాఖ, రక్షణ, విదేశాంగ ,ఆర్ధిక,రోడ్లు , రైల్వే.. వంటి నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తమ వద్దనే ఉంచుకోనుంది. వీటిని మిత్ర పక్షాలకు ఇచ్చేందుకు కాషాయపార్టీ విముఖత వ్యక్తం చేస్తోంది. అంతేగాక రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణాభివృద్ధి శాఖ, పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి దక్కే అవకాశం ఉంది.గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖలు జేడీయూకి ఇచ్చే అవకాశం ఉంది. భారీ పరిశ్రమల శాఖ శివసేనకు, వ్యవసాయ శాఖ జేడీఎస్‌కు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి, ఏపీ బీజేపీ నుంచి పురందేశ్వరికి మంత్రి పదవులు వరించనున్నట్లు సమాచారం. ఆహార ప్రాసెసింగ్, భారీ పరిశ్రమలు, టూరిజం, స్కిల్ డెవెలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ వంటి తక్కు ప్రాధాన్యత కలిగిన పోర్ట్‌ఫోలియోలను మిత్రపక్షాలకు అప్పగించేందుకు బీజేపీ యోచిస్తోంది. వీటితోపాటు ఆర్థిక, రక్షణ వంటి పెద్ద- మంత్రిత్వ శాఖలలో రాష్ట్ర మంత్రి పదవులు కట్టబెట్టాలని చూస్తోంది. -
ఎన్డీయే సర్కార్‌కు ‘అగ్ని’పరీక్ష తప్పదా?
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇంకా కొలువు దీరలేదు. ఈలోపే మిత్రపక్షాల నుంచి డిమాండ్లు మొదలవుతున్నాయి. అయితే అవి కేబినెట్ కూర్పు విషయంలోనే కాదులేండి.దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎన్డీయే మిత్రపక్షం జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) ఇప్పుడు కోరుతోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ ఈ స్వరం వినిపించారు. ’’అగ్నిపథ్ పథకం మీద దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ పథకం తెచ్చినప్పుడు సైన్యం వర్గాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. .. వాళ్ల కుటుంబాలు కూడా రోడ్డెక్కి పోరాటం చేశాయి. ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. కాబట్టి, దానిని కచ్చితంగా సమీక్షించాల్సిందే. ఈ పధకంపై ప్రజలు లేవనెత్తిన లోటుపాట్లను వివరంగా చర్చించి వాటిని చక్కదిద్దాలని మా పార్టీ కోరుకుంటోందని చెప్పారు.‘‘ అని కేసీ త్యాగి అన్నారు.ఇక.. ఉమ్మడి పౌరస్మృతిపై పార్టీ అధ్యక్షుడి హోదాలో బిహార్ సీఎం నితీష్ కుమార్ లా కమిషన్ చీఫ్‌కు లేఖ రాసిన సందర్భాన్ని కూడా త్యాగి గుర్తుచేశారు. తాము ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకం కాదని, అయితే యూసీసీపై ప్రభావితమయ్యే అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఓ పరిష్కారం అన్వేషించాలని త్యాగి పేర్కొన్నారు.రెండేళ్ల కిందట.. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం గత ఎన్డీయే హయాంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ‘అగ్నిపథ్’. అయితే నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసు అంశంపై ఆ సమయంలోనే తీవ్ర దుమారం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబిక్కాయి. మరోవైపు ప్రతిఏపక్షాలు సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ.. అగ్నివీర్ పథకం ద్వారా అగ్నీవీర్‌లను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా.. ఇండియా కూటమిలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాల్సిందేననే గళం బలంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆ తప్పిదాన్ని ఒప్పుకుని.. వెంటనే దానిని రద్దు చేయాలని కోరుతున్నారాయన. కిందటి నెలలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ పథకానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో ఒక ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇది ఎన్నికల జిమ్మిక్కు అంటూ మండిపడింది. -
మోదీ 3.0లో 3 పదవులపై నితీష్ కన్ను?
దేశంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ మిత్రపక్షం అయిన జేడీయూ బీహార్‌లో 12 సీట్లు గెలుచుకుంది. ఇవి ఎన్డీఏకు చాలా కీలకం.ఈ నేపధ్యంలో జేడీయే నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ నుంచి మూడు మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేసినట్లు సమాచారం. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాతో పాటు నలుగురు ఎంపీలకు ఒక మంత్రిత్వ శాఖ అనే ఫార్ములాను ప్రధాని మోదీ ముందు ఉంచారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. నితీష్ కుమార్ రైల్వే, వ్యవసాయం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కోరుకుంటున్నారని తెలుస్తోంది. దీనిలో రైల్వే మంత్రిత్వ శాఖపై పట్టుపడతారని అంటున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుని, మెజారిటీకి దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 12 సీట్లు గెలిచిన నితీష్ కుమార్(జేడీయూ), 16 సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు(టీడీపీ) ఎన్డీఏకు కీలకంగా మారారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఇద్దరు నేతల అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. -
మళ్లీ సంకీర్ణ యుగంలోకి కేంద్ర సర్కారు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దేశాన్ని మరోసారి సంకీర్ణ రాజకీయాల యుగంలోకి తీసుకెళ్లాయి. పదేళ్ల తర్వాత ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా తీర్పు చెప్పారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈసారి ఓటర్లు బీజేపీకి 240 సీట్లే కట్టబెట్టడంతో కొంత నిరాశ ఎదురైనా ఎన్డీఏకు మెజారిటీ రావడంతో కమలనాథులు సంతృప్తి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ సొంతంగా 272 సీట్ల మెజారిటీకి మార్క్ చేరుకోలేకపోయినా, ఎన్డీఏ కూటమిగా 292 సీట్లు సాధించింది. దాంతో సునాయాసంగా కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయబోతోంది. అయితే 2014, 2019 ప్రభుత్వాలకు భిన్నంగా నరేంద్రమోడీ తన పాలనలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా మారిన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, షిండే శివసేన, ఎన్సీపీ తదితర పార్టీల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాన్ని నడపాల్సిందే. అయితే బీజేపీకి మెజారిటీ మార్క్ దాటకపోవడానికి గల కారణాలపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా యూపీలో ఠాకూర్లు, గుజ్జర్లు బీజేపీకి అండగా నిలబడలేదని తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మారుస్తారనే విపక్షాల ప్రచారం ఠాకూర్లకు ఆగ్రహం తెప్పించడం వల్లే బీజేపీకి సీట్లు తగ్గాయని అంటున్నారు. అలాగే మహారాష్ట్రలో శివసేన, న్సీపీ పార్టీలను చీల్చడ మహారాష్ట్ర ఓటర్లకు ఆగ్రహన్ని తెప్పించాయి. దాని ఫలితంగా బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. వీటికి తోడు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి చేసిన ప్రచారం దెబ్బ హిందీ రాష్ట్రాలలో బిజెపి స్ట్రయిక్ రేటును తగ్గించింది.ఇటు ఇండియా కూటమి అనూహ్యాంగా పుంజుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇండియాకు 234 సీట్లు తెచ్చుకుని మెజారిటీ మార్క్‌కు దూరంగా ఆగిపోయింది. అయితే విపక్షంలో ఉండాలా? అధికారం కోసం ప్రయత్నించాలా అన్న దానిపై ఆ పార్టీలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షంలో కూర్చుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించకపోవడంతో, ఆ కూటమి అధికారం కోసం ప్రయత్నిస్తుందనే చర్చ జరుగుతోంది. మెజారిటీకి 38 సీట్లు తక్కువగా ఉండడంతో నితీష్, చంద్రబాబు మద్దతు కోసం ఇండియా కూటమి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఏ పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రింగా ఇప్పటివరకు పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నడిపారు. తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించబోతున్న నరేంద్రమోదీ ఆ దిశగా పట్టువిడుపులతో, భాగస్వాముల ఆకాంక్షలను సంతృప్తి పరుస్తూ పాలనను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జేడీయూ నేతపై దాడి.. వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్
పట్నా: జనతా దళ్యునైటెడ్ (జేడీయూ) నేత రాజ్‌దీప్ అలియాస్ రాజ్ యాదవ్‌పై శనివారం భాగల్పూర్లో గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేశారు. పర్బాతీ చౌక్ వద్ద ఉన్న మార్కెట్లోకి రాజ్‌యాదవ్‌ను లాక్కెళ్లి దుండగులు కర్రలు, రాడ్లతో విక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా దాడి చేసిన అనంతరం తమ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని దుండగులు రాజ్‌యాదవ్‌ను బలవంతపెట్టారు.VIDEO | Bihar: A local JD(U) leader Raja Yadav was thrashed by miscreants over an alleged land dispute matter in Bhagalpur on Saturday. CCTV visuals of the incident. (Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/lQftoVCXov— Press Trust of India (@PTI_News) June 2, 2024 ఈ ఘటనను రికార్డు చేసిన దుండగులు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేవారు. దీంతో దాడికి సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారింది. తీవ్ర గాయాల పాలైన రాజ్‌యాదవ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుల్లో ఒకడైన చందర్ యాదవ్ అనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
లోక్‌సభ పోరు.. ఫైనల్ పంచ్ ఎవరిదో!
బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. 40 సీట్లకు గాను ఆరు విడతల్లో 32 చోట్ల ఎన్నికలు ముగిశాయి. చివరిదైన ఏడో దశలో 8 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. వీటిలో బీజేపీ 5 సిట్టింగ్ స్థానాలు. 2 జేడీ(యూ), 1 రాష్ట్రీయ లోక్ మోర్చా చేతిలో ఉన్నాయి. ఎన్డీఏకు ఈసారి రెబల్స్‌తో పాటు ఇండియా కూటమి నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కీలక స్థానాలపై ఫోకస్... నలంద... జేడీయూ కంచుకోట అలనాటి విఖ్యాత నలంద విశ్వవిద్యాలయ చరిత్రకు సాక్ష్యంగా నిలిచే నియోజకవర్గం. సారవంతమైన గంగా పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. ఇది జేడీయూ కంచుకోట. బీజేపీ ఇక్కడ ఖాతాయే తెరవలేదు. గత ఎన్నికల్లో కౌసలేంద్ర కుమార్ జేడీ(యూ) నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి సందీప్ సౌరవ్ పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టులు గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచారు.ఆరా... రైట్ వర్సెస్ లెఫ్ట్ మొదట్లో దీని పేరు షాబాద్. 1977లో ఆరాగా మారింది. ఆర్కే సింగ్ 2014లో తొలిసారి ఇక్కడ కాషాయ జెండా ఎగరేశారు. 2019లోనూ నెగ్గిన ఆయన ఈసారి హ్యాట్రిక్ కోసం ఉవి్వళ్లూరుతున్నారు. ఇండియా కూటమి తరఫున సీపీఎం (ఎంఎల్) అభ్యర్థి సుధామా ప్రసాద్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్)కు ఇక్కడ 4 లక్షల పైగా ఓట్లొచ్చాయి! రైట్, లెఫ్ట్ పారీ్టల వార్ ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది.పట్నా సాహిబ్... రవిశంకర్‌కు సవాల్ సిక్కుల మత గురువు గురు గోవింద్‌సింగ్ జన్మస్థలం. 2008లో ఏర్పాటైంది. 2009, 2014ల్లో బాలీవుడ్ షాట్‌గన్ శత్రుఘ్న సిన్హా బీజేపీ తరఫున గెలిచారు. 2019లో ఎన్నికల ముందు శత్రుఘ్న బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో దిగారు. దాంతో 20 ఏళ్లుగా రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్‌ను బీజేపీ బరిలో దించింది. శత్రుఘ్నను ఆయన 2.8 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఈసారి కూడా బీజేపీ నుంచి ఆయనే బరిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్షుల్ అవిజిత్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలకు మంచి ఓటు బ్యాంకు ఉండటంతో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. పాటలీపుత్ర... లాలుకు ప్రతిష్టాత్మకం గత రెండు ఎన్నికల్లోనూ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిని బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ ఓడించారు. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూశారు. లాలుకు ఒకప్పటి నమ్మినబంటు రాంకృపాల్ బీజేపీ అభ్యరి్థగా ఉన్నారు. బీజేపీ తరఫున రెండుసార్లు వరుసగా గెలిచిన ఆయన 2004లో ఇక్కడ ఆర్జేడీ అభ్యరి్థగా బీజేపీని ఓడించడం విశేషం. ఆర్జేడీ నుంచి మీసా భారతి మళ్లీ పోటీ చేస్తున్నారు. కుమార్తెను ఎలాగైనా లోక్‌సభకు పంపాలని కలలుగంటున్న లాలుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ దన్ను ఆర్జేడీకి కలిసొచ్చే అంశం. కరాకట్.. బీజేపీకి పవన్ గండం ఇక్కడ కుష్వాహా (కోయెరి) సామాజికవర్గానిదే ఆధిపత్యం. గత మూడు ఎన్నికల్లోనూ ఆ వర్గం నేతలే గెలుస్తున్నారు. కుషా్వహాలు, రాజ్‌పుత్‌లు, యాదవులు ఇక్కడ రెండేసి లక్షల చొప్పున ఉంటారు. గతేడాది బీజేపీలో చేరిన భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ ఇప్పుడు పారీ్టకి కొరకరాని కొయ్యగా మారారు. ఇక్కడ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ (ఎంఎల్) నుంచి రాజారాం సింగ్ కుషా్వహా బరిలో ఉన్నారు. ఎన్డీయే నుంచి రా్రïÙ్టయ లోక్ మోర్చా వ్యవస్థాపకుడు ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. పవన్ సింగ్ నామినేషన్‌కు జనం భారీగా వచ్చారు. త్రిముఖ పోటీలో ఎన్డీఏ ఎదురీదుతోంది.జహానాబాద్... జేడీయూ వర్సెస్ ఆర్జేడీ ‘రెడ్ కారిడార్’లో అత్యంత సున్నితమైన నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గం. కమ్యూనిస్టులకు కంచుకోట. 1998 నుంచీ ఆర్జేడీ, జేడీయూ మధ్య చేతులు మారుతోంది. 2014లో రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ నెగ్గింది. 2019లో జేడీ(యూ) నేత చందేశ్వర్ ప్రసాద్ కేవలం 1,751 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి సురేంద్ర ప్రసాద్ యాదవ్‌ను ఓడించారు. ఈసారి కూడా వారిద్దరే బరిలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సమస్తిపూర్ కుస్తీ.. మంత్రుల వారసుల ఫైట్
పాట్నా: బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు నెలకొంది. రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల వారసులు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.సమస్తిపూర్ ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఈ నియోజకవర్గం దివంగత సోషలిస్ట్ నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జన్మస్థలం. సోషల్ ఇంజనీరింగ్ మాస్టర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కర్పూరి ఠాకూర్‌కు భారత ప్రభుత్వం ఇటీవలే భారతరత్న అవార్డును ప్రకటించింది. ఠాకూర్ 1977లో సమస్తిపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.బీహార్ గ్రామీణ పనుల శాఖ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె 25 ఏళ్ల శాంభవి చౌదరి లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్) -LJP (RV) నామినేషన్‌పై ఎన్డీఏ అభ్యర్థిగా సమస్తిపూర్ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషియాలజీలో ఎంఏ పట్టా పొందిన శాంభవి.. ఈసారి పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థుల్లో ఈమే అత్యంత పిన్న వయస్కురాలు.ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా 33 ఏళ్ల సన్నీ హజారీ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా నితీష్ కుమార్ ప్రభుత్వంలో సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా ఉన్న మహేశ్వర్ హజారీ కుమారుడు. ఎన్ఐటీ పాట్నా నుంచి బీటెక్ పూర్తి చేసిన సన్నీ సమస్తిపూర్‌లో సొంత వ్యాపారాన్ని నడుపుతున్నారు.అభ్యర్థులిద్దరూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రోడ్‌షోలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తన కూతురి గెలుపు కోసం శాంభవి తండ్రి, రాష్ట్ర మంత్రి అశోక్ చౌదరి శ్రమిస్తుండగా సన్నీ తండ్రి, బీహార్ మంత్రి మహేశ్వర్ హజారీ ఇంకా తన కుమారుడికి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. సమస్తీపూర్ నియోజకవర్గంలో మే 13న పోలింగ్ జరగనుంది. -
Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు
కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్ జపాంగ్‌లకు పెట్టింది పేరైన బిహార్‌లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో లోక్‌సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తున్న ఈ తూర్పు రాష్ట్రానిది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచీ కీలక పాత్రే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మొదలు జగ్జీవన్‌రాం, నుంచి లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్ దాకా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండ నేతలకు పుట్టిల్లు బిహార్. అధికారం కోసం ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు, వర్గ పోరు, పవర్ పాలిటిక్స్ ఇక్కడ సర్వసాధారణం. స్టేట్ స్కాన్ రాజకీయంగా చైతన్యవంతమైన బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ), లోక్ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను ఒడిసిపట్టింది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీ(యూ) 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాకూటమి మహా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోగా ఆర్జేడీ 19 స్థానాల్లో తలపడినా సున్నా చుట్టింది. మిగతా పార్టీలదీ అదే పరిస్థితి. కేంద్రంలో మోదీ 2.0 బలమైన సర్కారు ఏర్పాటులో బిహార్ ఘనవిజయానిది ప్రధాన పాత్ర. ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది. బిహార్‌లో 40 స్థానాల్లో ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు. నితీశ్ పిల్లిమొగ్గలు... బిహార్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన లాలు అవినీతి కేసుల్లో జైలుపాలైన నాటి నుంచీ రాష్ట్రంపై నితీశ్ కుమార్ పట్టుబిగించారు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో 15 ఏళ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్‌వాదీ, జేడీ(ఎస్), కాంగ్రెస్ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్‌ర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీశ్ సీఎం పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. అదే జోరులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. జేడీ(యూ) (43) కంటే బీజేపీ (74)కే ఎక్కువ సీట్లు దక్కినా నితీశ్ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవడం విశేషం. రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చేశారు. మహాకూటమి దన్నుతో మళ్లీ సీఎం అయ్యారు! ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి గెంతి మహాకూటమికి, ఇండియా కూటమికీ కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీకి కలిసొస్తుందా...? నితీశ్‌తో కలిసి 2019 ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కానీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీశ్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 5, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. కులగణన ఎవరికి ప్లస్! బిహార్ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13%) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీశ్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలున్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు. దాదాపు 17 శాతం మంది ముస్లింలున్నారు. మహాకూటమి యాదవులు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాల ని డిమాండ్ చేస్తోంది. అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలనూ ఆకర్షించేలా బీజేపీ, జేడీయూ పావులు కదుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా? ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీశ్‌కు గుణపాఠం నేర్పాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి. ఇది దేశానికి ఎక్స్‌రే వంటిదని, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ దోపిడీ తదితరాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 6 న్యాయాలు 25 గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ఊరూవాడా ప్రచారం చేస్తోంది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26, కాంగ్రెస్ 9కి, లెఫ్ట్ పార్టీలకు 5 సీట్లు దక్కాయి. ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్ సాహ్ని సారథ్యంలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది. అబ్బాయ్–బాబాయ్ పోరు బిహార్‌లో అబ్బాయ్–బాబాయ్ అమీతుమీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ హోరాహోరీ తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్ చేజిక్కించుకున్నారు. చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్), పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్‌కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాశ్వాన్ల కంచుకోట అయిన హాజీపూర్‌ను సాధించుకున్నారు. అక్కడ బాబాయ్ పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతుండటం విశేషం! సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. యూపీఏ హయాంలో భారత్‌ను బలహీన దేశంగా చూసేవారు. చిన్నాచితకా దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మనపై దాడులకు తెగబడేవారు. కాంగ్రెసేమో చేతకానితనంతో వేరే దేశాలకు ఫిర్యాదు చేస్తుండేది. నేటి భారత్ అలాకాదు, అవసరమైతే ఉగ్రవాదుల ఇళ్లలో దూరి మరీ అంతం చేస్తుంది. – బిహార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ మహాకూటమి దెబ్బకు బీజేపీ, ఎన్డీఏ కంగుతిన్నాయి. అందుకే మోదీతో సహా అగ్ర నేతలంతా బిహార్‌లోనే తిరుగుతున్నారు. విపక్షాలపై కత్తిగట్టి ఈడీ, సీబీఐ కూడా ఇక్కడే మరింత ఫోకస్ చేస్తున్నాయి. పేదరికం, ఉపాధి, బిహార్ చిరకాల కోరికైన ప్రత్యేక హోదా గురించి మోదీ మాట్లాడాలి. – ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
జేడీయూ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్
పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను బిహార్‌లో అధికార పార్టీ జేడీయూ ఆదివారం(మార్చ్ 24) విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 16 సీట్లలో జేడీయూ పోటీ చేస్తోంది. పార్టీ మాజీ చీఫ్ రాజీవ్ రంజన్(లలన్) సింగ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈయన ముంగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్లు నిరాకరించారు. ఇద్దరు కొత్తవారికి పోటీ చేసే అవకాశం కల్పించారు. పార్టీలో చేరిన మరుసటిరోజే విజయ లక్ష్మి కుషావహాకు టికెట్ కేటాయించారు. ఆర్జేడీ నుంచి ఇటీవలే జేడీయూలోకి వచ్చిన లవ్లీ ఆనంద్ కూడా ఈసారి పార్టీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాగా, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఇటీవలే ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలిగి బీజేపీతో కలిసి బిహార్‌లో మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె -
జేడీయూ సిట్టింగ్ ఎంపీలకు మొండిచెయ్యి?
లోక్‌సభ ఎన్నికలకు బీహార్‌లోని జనతాదళ్యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల పేర్లు ఇవేనంటూ కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. వీటి ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో జేడీయూ పాతవారికి చెక్ పెట్టి, కొత్తవారికి అవకాశం కల్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారని సమాచారం. సీట్ల పంపకంలో జేడీయూ తమ సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లకు కోతపెట్టి, వాటిని మిత్ర పక్షాలకు కట్టబెట్టినట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం సీట్ల పంపకంలో కరకట్ ఎంపీ మహాబలి సింగ్, గయ ఎంపీ విజయ్ మాంఝీ, సివాన్ ఎంపీ కవితా సింగ్, సీతామర్హి ఎంపీ సునీల్ కుమార్ పింటూలకు టిక్కెట్లు దక్కలేదని తెలుస్తోంది. అయితే శివహార్ నుంచి లవ్లీ ఆనంద్, సీతామర్హి నుంచి దేవేశ్ చంద్ర ఠాకూర్, శివన్ నుంచి రాజలక్ష్మి కుష్వాహా, కిషన్‌గంజ్ నుంచి మాస్టర్ ముజాహిద్ పేర్లను జేడీయూ ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీహార్‌లో జేడీయూకు 16 సీట్లు దక్కాయి. వాల్మీకినగర్ నుండి సునీల్ కుమార్, భాగల్పూర్ నుండి అజయ్ మండల్, మాధేపురా నుండి దినేష్ చంద్ర యాదవ్, ఝంఝార్పూర్ నుండి రాంప్రీత్ మండల్, సుపాల్ నుండి దిలేశ్వర్ కామత్, జెహానాబాద్ నుండి చండేశ్వర్ చంద్రవంశీ తదితరులు జేడీయూ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
Bihar: డీల్ కుదిరింది! బీజేపీ 17, జేడీయూ 16..
పాట్నా: బిహార్‌లో అధికార ఎన్డీయే కూటమిలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. మొత్తం 40 లోక్ సభ స్థానాలున్న బీహార్‌లో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనుంది. దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) 5 స్థానాల్లో పోటీ చేయనుంది. చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని బీహార్ ఎల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ రాజు తివారీ తెలిపారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర కుష్వాహా, జితన్ రామ్ మాంఝీ హిందుస్థానీ అవామ్ మోర్చాతో సహా ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు చెరొక్క సీటును పంచుకున్నాయి. అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కలిసి 39 సీట్లు, 53 శాతానికి పైగా ఓట్లు సాధించాయి. కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాగా ఆర్జేడీ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలుపొందలేకపోయింది. NDA's seat-sharing in Bihar: BJP to contest 17 Lok Sabha seats, JD(U) 16, LJP(Ram Vilas) five, two other parties one each — Press Trust of India (@PTI_News) March 18, 2024 -
Bihar: నితీశ్ జోకులు.. ప్రధాని నవ్వులు
పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ తన మాటలతో ప్రధాని మోదీని నవ్వించారు. రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో శనివారం జరిగిన రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ, నితీశ్‌కుమార్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ ‘ఇంతకుముందు మీరు వస్తే నేను మాయమయ్యేవాడిని. కానీ ఇప్పుడు మీతోనే ఉన్నాను. ఇక నేను అటు ఇటు వెళ్లను మీతోనే ఉంటానని మాటిస్తున్నాను’అని అనడంతో మోదీ నవ్వారు. బీజేపీ, జేడీయూ కలిసి పూర్తి ఐదేళ్లు లేకున్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సంకీర్ణ ప్రభుత్వాన్ని వదిలి పెట్టిన నితీశ్ ఎన్డీఏతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామం తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ తొలి పర్యటనకు వచ్చినపుడు నితీశ్‌కుమార్ తన మాటలతో పండించిన హాస్యం ఆసక్తికరంగా మారింది. #WATCH | Bihar CM Nitish Kumar says, "...You (PM Modi) had come earlier as well, 'par idhar hum gayab ho gaye the. Hum phir aapke saath hai.' I assure you that I will not go here and there. 'Hum rahenge aap hi ke saath'..." pic.twitter.com/itLbLBS5rg — ANI (@ANI) March 2, 2024 ఇదీ చదవండి.. వారణాసి నుంచే మళ్లీ మోదీ -
మీ మేనల్లుడు మోదీని అడ్డుకుంటాడు: తేజస్వీ యాదవ్
బిహార్‌లో జేడీ(యూ).. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు(సోమవారం) నితీష్ కుమార్ జేడీయూ ప్రభుత్వం బలపరీక్ష ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. నితీష్ కుమార్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. బిహార్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వరంలోని బీజేపీని తాము ఎదుర్కొంటామని అన్నారు. ఒక టర్మ్‌లో మూడుసార్లు సీఎం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మిగిలిపోతారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ‘నితీష్ కుమార్ విషయంలో జేడీయూ ఎమ్మెల్యేలు బాధ పడతారు. ఎందుకంటే వారు ప్రజల్లోకి వెళ్లితే.. ప్రజల నుంచి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ నాయకుడు మూడు సార్లు సీఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారంటే ఏం చెబుతారు?. గతంలో బీజేపీని తిట్టి.. ఇప్పుడు అదే పార్టీపై పొగడ్తలు కురిపిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారు?’ అని జేడీ(యూ) ఎమ్మెల్యేలను తేజస్వీ ప్రశ్నించారు. ‘నేను సీఎం నితీష్ కుమర్‌కు ఓ కుటుంబ సభ్యుడిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మాదంతా సమాజ్‌వాదీ కుటుంబం.దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకున్నేందు మీరు(నితీష్‌కుమార్) ఎగురవేసిన జెండాను మీ మేనల్లుడు(తేజస్వీ యాదవ్) కొనసాగిస్తాడు. బిహార్‌లో మోదీని అడ్డుకుంటాం’ అని తేజస్వీ అన్నారు. నితీష్‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తరచూ ‘మామా’ అని ఆప్యాయంగా పిలుస్తారన్న విషయం తెలిసిందే. బీజేపీ దివంగత సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వటం సంతోషమన్న తేజస్వీ.. ఒక రాజకీయ ఒప్పదం ప్రకారమే ఇచ్చిందని మండిపడ్డారు. ఆ క్రమంలో బిహార్‌లోని మహాఘట్బంధన్ను బీజేపీ చీల్చిందని దుయ్యబట్టారు తేజస్వీ యాదవ్. చదవండి: బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ -
జేడీ(యూ) ఎల్పీ భేటీకీ ఎమ్మెల్యేలు డుమ్మా
పాట్నా: సీఎం నితీశ్ కుమార్ సర్కారుపై అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అధికార జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. శనివారం సీఎం నితీశ్ ఇచ్చిన విందుకు కొందరు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఆదివారం మంత్రి విజయ్ కుమార్ చౌదరి అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభా పక్షం భేటీకి సైతం కొందరు గైర్హాజరవడం కలకలం రేపింది. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో గైర్హాజరయ్యారని చౌదరి చెప్పారు. తొలుత ఆర్జేడీకి చెందిన స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం, అనంతరం ప్రభుత్వంపై విశ్వాస పరీక్షలో వారంతా ఓటేస్తారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ జేడీయూ ఎల్పీ భేటీలో పాల్గొనడం విశేషం. సోమవారం వామపక్ష సభ్యులతో కలిసి ఆర్జేడీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారని తెలిసింది. వారం రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం పటా్న చేరారు. -
నితీష్ పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది?
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతోంది. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్‌సింగ్ కుష్వాహ ప్రకటించడం విశేషం. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు పూరిగా నిరాధారమన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రతిపక్షం రాజకీయ నిరుద్యోగిగా మారింది. నితీష్ కుమార్ పార్టీ(జేడీయూ)ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు నిరాధారమైన, అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. గందరగోళ పరిచే రాజకీయాలు ఎప్పటికీ ఫలించవు. చివరికి ‘వారికి’ నిరాశే మిగులుతుంది. రాష్ట్రంలో ఎన్డీఏకి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మెజారిటీ కంటే ఆరు ఎక్కువ. ఈ లెక్కలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. దీనికి భయపడే కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించింది. ఎదుటివారి ఇళ్లను ధ్వంసం చేసేందుకు కుట్ర చేసే ముందు ప్రతిపక్షాలు సొంత ఇంటి గురించి ఆలోచించాలని ఉమేష్‌సింగ్ కుష్వాహ సూచించారు. బీహార్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున అంటే సోమవారం(ఫిబ్రవరి 12) బలపరీక్ష జరగనుంది. దీనికి ముందు శనివారం పట్నాలో జేడీయూకి చెందిన మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలిన జేడీయూ ఆహ్వానించింది. ఈ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఆదివారం మంత్రి విజయ్ చౌదరి నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేల విందు కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. -
బిహార్ స్పీకర్ రేసులో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
పట్నా: బిహార్‌లో బీజేపీ మద్దతుతో జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుంచి రాష్ట్ర స్పీకర్ పదవిపై బీజేపీ, జేడీయూ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. బిహార్‌్ స్పీకర్ పదవి కోసం ఐదుగురు ఆశావహులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రస్తుత స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధి బిహారీ స్థానంలో బీజేపీ నేతకు అవకాశం ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచే ఐదుగురు స్పీకర్ పదవి కోసం పోటీపడటం గమనార్హం. బీజేపీ పార్టీలోని నందకిషోర్ యాదవ్, నితీష్ మిశ్రా, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి, సంజయ్ సరోగి, జానక్ సింగ్ స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ఫైనల్ నిర్ణయం మాత్రం కేంద్రంలోని బీజేపీ అధిష్టానం చేతిలో ఉందని చర్చ నడుస్తోంది. నందకిషోర్ యాదవ్: బీసీ సామాజిక వర్గానికి చెందిన నందకిషోర్ గతంలో పలు మంత్రి పదవులను స్వీకరించారు. ఆయన పట్నా సాహిబ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ మేధామిగా.. పార్లమెంటరీ ప్రొసిడింగ్స్పైన పట్టు ఉన్న వ్యక్తిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. నితీష్ మిశ్రా: మాజీ సీఎం డా. జగన్నాథ్ మిశ్రా కుమారుడు. ఈయనకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్‌పై పట్టు ఉందనే గుర్తింపు ఉంది. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నితీష్ మిశ్రా.. ఝంఝర్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సంజయ్ సరోగి: దర్బంగా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయనకు స్పీకర్ పదవి ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగోతంది. మాస్ లీడర్‌గా పేరున్న ఈయన ఉన్నతమైన విద్యార్హతలు కలిగి ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా సంజయ్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈయన బనియా(వ్యాపార) సామాజకవర్గానికి చెందిన వ్యకి. బీజేపీకి ఈయన సమాజిక వర్గం నుంచి బలమైన ఓటు బ్యాంక్ ఉండటం గమనార్హం. జానక్ సింగ్: తారణ్య అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఈయన అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి. ఈయినకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్ మంచి పట్టు ఉంది. రాజ్‌పుత్ వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ పదవి కేటాయించాలని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. రేణు దేవి: మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి స్పీకర్ పదవిపై కన్నేశారు. వెనబడిన నోనియా సామాజికవర్గానికి చెందిన ఆమెకు సామాజిక సమీకరణాల దృష్ట్యా స్పీకర్ పదవిని కేటాయిస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఇక.. ప్రస్తుత ఆర్జేడీ పార్టీకి చెందిన అవధ్ బిహారి ఇప్పటికీ స్పీకర్ పదవికి రాజీనామా చేయలేదు. బీజేపీ పార్టీ అతనిపై అవిశాస్వ తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానం ద్వారా స్పీకర్ పదవి కోల్పోతే.. బిహార్ చరిత్రలో స్పీకర్ పదవి కోల్పోయిన మొదటి వ్యక్తిగా అవధ్ బిహారి నిలుస్తారు. -
Bihar: బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం.. 24 గంటల్లోనే కీలక నిర్ణయం
పట్నా: బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు గుడ్‌బై చెప్పిన సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి తొమ్మిదోసారి బిహార్ సీఎంగా అవతరించారు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన మరుసటి రోజే ప్రతిపక్షాలపై చర్యలను ప్రారంభించింది ఎన్డీయే సర్కార్. ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తన పదవి నుంచి తొలగించాలంటూ అసెంబ్లీ సెక్రటరికీ బీజేపీ, ఆర్డేడీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందించారు. బీజేపీ నేతలు నంద కిషోర్ యాదవ్, తార్కిషోర్ ప్రసాద్(మాజీ డిప్యూటీ సీఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా అధినేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, జేడీయూకు చెందిన వినయ్ కుమార్ చౌదరి, రత్నేష్ సదా, ఎన్డీయే కూటమికి చెందిన ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తొలగించాలంటూ నోటీసులు ఇచ్చారు. చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ కాగా బిహార్ సీఎం నితీష్ కుమార్ హమాఘట్ బంధన్ సంకీర్ణం నుంచి తప్పుకొని మరోసారి బీజేపీ సార్ధంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఆదివారం ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి.. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో 72 ఏళ్ల నితీష్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ నుంచి ఇద్దరు (సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పార్టీలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల నిష్క్రమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ
పాట్నా: బిహార్‌లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం సోమవారం తన తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు. అడ్వకేట్ జనరల్ నామినేషన్‌పై తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశం ఏర్పాట్లపై కూడా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. బిహార్‌లో మహాఘట్బంధన్కు నితీష్ కుమార్ ఆదివారం భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమిని వదిలి ఎన్డీఏలో చేరారు. సీఎం నితీష్ కుమార్ ఆదివారం రాజీనామా చేశారు. అదే రోజు సాయంత్రం ఎన్డీఏ భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. సీఎం నితీశ్ కుమార్, బీజేపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటు జేడీయూ నుంచి చెందిన ప్రేమ్ కుమార్, విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, విజేంద్ర యాదవ్, హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నేత సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో రెండు రోజుల్లో కేబినెట్ విస్తరణ చేపడతామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. బీహార్ కేబినెట్లో గరిష్టంగా 35 మంది మంత్రులకు అవకాశం ఉంది. నితీష్ కుమార్ మినహా మొత్తం ఎనిమిది మంది మంత్రులు ఆదివారం ప్రమాణం చేశారు. నూతన కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నారు. అటు ఓబీసీలను ప్రసన్నం చేసుకోవడమే ఎన్డీఏ లక్ష్యంగా కనిపిస్తోంది. కొత్త కేబినెట్లో భూమిహార్ కమ్యూనిటీ నుండి విజయ్ చౌదరి, విజయ్ సిన్హా, రాజ్‌పుత్ కమ్యూనిటీ నుండి సుమిత్ కుమార్ సింగ్ (స్వతంత్ర) సహా ముగ్గురు అగ్రవర్ణాల మంత్రులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సహా కుర్మీ కులానికి చెందిన జేడీయూ నాయకుడు శ్రవణ్‌కుమార్, మహాదళిత్ సామాజికవర్గానికి చెందిన సంతోష్ కుమార్ సుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్‌లో ఇటీవలి కులాల సర్వే ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో కుర్మీలు 2.8 శాతం ఉన్నారు. ఇదీ చదవండి: Jharkhand: బీహార్‌లో ‘ఆట ముగిసింది’.. జార్ఖండ్‌లో మొదలైంది? -
ఊసరవెల్లితో నితీష్ పోటీ పడుతున్నారు.. కాంగ్రెస్ చురకలు
పాట్నా: మహాకూటమిని వీడి బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏతో కలిశారు. ఈ పరిణామంతో సీఎం నితీష్ కుమార్‌పై కాంగ్రెస్ మండిపడింది. నితీష్ కుమార్ ఊసరవెళ్లితో పోటిపడుతున్నారని ఎద్దేవా చేసింది. ' నిత్యం రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్న నితీష్ కుమార్ ఊసరవెళ్లికి పోటీ ఇస్తున్నారు' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. ప్రజల మనోభావాలను నితీష్ దెబ్బతీశారని అన్నారు. ఈ మోసానికి నితీష్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ, జేడీయూ సహా ఇతర పార్టీల సహకారంతో నితీష్ కుమార్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సీఎంగా నితీష్ ఈ రోజు సాయంత్రం మళ్లీ ప్రమాణం చేయనున్నారు. बार-बार राजनीतिक साझेदार बदलने वाले नीतीश कुमार रंग बदलने में गिरगिटों को कड़ी टक्कर दे रहे हैं। इस विश्वासघात के विशेषज्ञ और उन्हें इशारों पर नचाने वालों को बिहार की जनता माफ़ नहीं करेगी। बिलकुल साफ़ है की भारत जोड़ो न्याय यात्रा से प्रधानमंत्री और भाजपा घबराए हुए हैं और उससे… https://t.co/v47tQ8ykaw — Jairam Ramesh (@Jairam_Ramesh) January 28, 2024 బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. మళ్లీ మహా కూటమిని విడిచి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
నితీష్‌పై కాంగ్రెస్ ఫైర్
పాట్నా: బీహార్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ను వీడి సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్‌పై కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరితో వివాహం.. మరొకరితో సంబంధం కలిగి ఉండటం నితీష్‌కి బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. "ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకరితో వివాహం మరొకరితో సంబంధం. ఇది నితీష్ కుమార్ స్వభావంగా మారింది" అని ట్వీట్టర్లో కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ పేర్కొన్నారు. నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. మళ్లీ మహా కూటమిని విడిచి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్
పాట్నా: మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవని.. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నరగా మహా కూటమి ప్రభుత్వం సరిగ్గా ముందుకు వెళ్ళలేక పోయిందని నితీష్ కుమార్ అన్నారు. గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితో వెళ్లాలని అనుకుంటున్నామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నితీష్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. బీజేపీతో చేతులు కలిపి నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అటు.. బీజేపీ ఇటు జేడీయూలు తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. ఇదీ చదవండి: Bihar political crisis: ఇలా రాజీనామా, అలా ప్రమాణం! -
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
అప్డేట్స్.. ► బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్ కుమార్ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇద్దరు బీజేపీ పార్టీకి చెందిన నేతలు విజయ్ సిన్హా, సామ్రాట్ చౌదరీ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేస్తారు. వీరితో పాటు ఓబీసీ-ఈబీసీ సమీకరణాల్లో భాగంగా మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ► బిహార్ రాజకీయాలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వీరు ముగ్గురు బిహార్ ప్రజలకు ద్రోహం చేశారు. మరీ ముఖ్యంగా నితీష్ కుమార్ అయితే పలు సార్లు బిహార్ ప్రజలను మోసం చేశారు. రాజకీయ ఆవకాశవాదంలో నితీష్ రికార్డులు బద్దలు కొట్టారు. #WATCH | Hyderabad: On JDU President Nitish Kumar's resignation as Bihar CM, AIMIM chief Asaduddin Owaisi says, "Nitish Kumar, Tesjaswi Yadav, PM Modi should apologise to the people of Bihar... All three have betrayed the people of Bihar, especially Nitish Kumar... The term… pic.twitter.com/7mOeAokcCK — ANI (@ANI) January 28, 2024 ► బీజేపీతో నితీష్ కుమార్ చేతులు కలిపి ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు వేడుక చేసుకుంటున్నాయి. కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. #WATCH | BJP workers celebrate in Bihar's Patna after Nitish Kumar & BJP stake claim to form the govt in the state#BiharPolitics pic.twitter.com/KXhk41r2Hd — ANI (@ANI) January 28, 2024 ► సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ కూటమిలో చేరనున్నందుకు అభినందనలు తెలిపారు. ► బిహార్‌లో రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి మాట్లాడారు. తన జీవిత కాలంలో సాధించిన అరుదైన సందర్భంగా అభివర్ణించారు. #WATCH | Patna | After being elected as the Leader of the Legislative Party, state BJP chief Samrat Chaudhary says, "BJP did a historic thing for my life...This is an emotional moment for me to have been elected as the Leader of the Legislative Party to be a part of the… pic.twitter.com/NYq6GKp8Ht — ANI (@ANI) January 28, 2024 ► బీజేపీ, జేడీయూలతో కలిపి బిహార్‌లో ఎన్జీడే ప్రభుత్వం ఏర్పడటానికి రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. #WATCH | Patna | Bihar MLAs unanimously passed the proposal to form the NDA government in the state with BJP, JD(U) and other allies. Samrat Chaudhary has been elected as the Leader of the legislative party, Vijay Sinha elected as the Deputy Leader. pic.twitter.com/N9kFWHkYYz — ANI (@ANI) January 28, 2024 ► నితీష్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇది జరుగుతుందని తనకు ముందే తెలుసని అన్నారు. "Knew it would happen," says Mallikarjun Kharge on Nitish Kumar's exit from Mahagathbandhan Read @ANI Story | https://t.co/dPQbzR6iHf#MallikarjunKharge #NitishKumar #INDIAAlliance pic.twitter.com/OS1uIyP2MZ — ANI Digital (@ani_digital) January 28, 2024 ► మహాకూటమిలో పరిస్థితిలు సరిగా లేవని నితీష్ కుమార్ చెప్పారు. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని అన్నారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. గవర్నర్‌కు లేఖ సమర్పించానని స్పష్టం చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. #WATCH | Patna | Bihar outgoing CM and JD(U) president Nitish Kumar says, "Today, I have resigned as the Chief Minister and I have also told the Governor to dissolve the government in the state. This situation came because not everything was alright...I was getting views from… pic.twitter.com/wOVGFJSKKH — ANI (@ANI) January 28, 2024 ► బీహార్, పాట్నాలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. #UPDATE | The BJP legislative party meeting in Patna, Bihar concludes. — ANI (@ANI) January 28, 2024 ► బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్చించారు. దీంతో జేడీయూ - ఆర్జేడీ ప్రభుత్వం కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ-జేడీయూ నేతృత్వంలో సీఎంగా నితీష్ మళ్లీ ప్రమాణం చేయనున్నారు. Nitish Kumar tendered his resignation as the Chief Minister of Bihar to Governor Rajendra Arlekar. The Governor accepted the resignation and deputed him as the Acting CM. pic.twitter.com/uaDXROe6PA — ANI (@ANI) January 28, 2024 ► బిహార్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీల పెద్దలు తమ వర్గం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పెద్దలు సమావేశం ప్రారంభించారు. #WATCH | A meeting of Bihar BJP MLAs and leaders of the party is underway at the party office in Patna, amid political developments in the state. The legislative party meeting is underway here pic.twitter.com/LoRdSg0ojL — ANI (@ANI) January 28, 2024 ► పార్టీ ఎమ్మెల్యేలతో నేడు పాట్నాలో జరగనున్న సమావేశానికి బిహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి హాజరయ్యారు. #WATCH | BJP Bihar President Samrat Chaudhary arrives at the party office in Patna for a meeting of the party MLAs. pic.twitter.com/dGK51tU2UM — ANI (@ANI) January 28, 2024 ► పాట్నాలోని పార్టీ కార్యాలయానికి బిహార్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ హాజరయ్యారు. #WATCH | Former Bihar BJP president Sanjay Jaiswal arrives at the party office in Patna, for a meeting of party leaders here. On speculations around Nitish Kumar, he says, "...The most important goal of the state working committee is to line up the preparations for the next one… pic.twitter.com/6TiiflXzKk — ANI (@ANI) January 28, 2024 ► సీఎం నితీష్ కుమార్ ఇంటికి జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ వచ్చారు. కేవలం తమను రమ్మని మాత్రమే పిలిచినట్లు ఆయన చెప్పారు. తదుపరి పరిణామాలు తెలియదని అన్నారు. #WATCH | Patna, Bihar | JD(U) MP Kaushalendra Kumar arrives at the residence of CM Nitish Kumar; he says, "...We have been called, so we have come here..."#BiharPolitics pic.twitter.com/kFfPCWn99I — ANI (@ANI) January 28, 2024 ► బిహార్‌లో రాజకీయ మార్పులు రసవత్తరంగా ఉన్నాయి. పాట్నాలో పార్టీ కార్యాలయానికి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ నిత్యానంద రాయ్ బయలుదేరారు. #WATCH | Bihar | Union Minister and BJP MP Nityanand Rai arrives at the state party office in Patna for a meeting, amid political developments in the state. pic.twitter.com/DlN3rFF2tk — ANI (@ANI) January 28, 2024 ► పాట్నాలోని పార్టీ కార్యాలయానికి బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ బయలుదేరారు. #WATCH | Bihar | BJP MP Ravi Shankar Prasad arrives at the state party office in Patna for a meeting, amid political developments in the state. pic.twitter.com/9h2MUApSvg — ANI (@ANI) January 28, 2024 ►పార్టీ శాసనసభ్యుల భేటీకి హాజరవుతున్నట్లు బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే తార్కిషోర్ ప్రసాద్ తెలిపారు. అజెండా పూర్తిగా తనకు తెలియదని చెప్పారు. రావాలని చెప్పారు.. కాబట్టి తాము వస్తున్నట్లు చెప్పారు. #WATCH | Patna | Former Bihar Deputy CM and BJP MLA Tarkishore Prasad says, "A legislative party meeting has been called and we have come here for that. The agenda is not clear. We have been told to come, so we have come..." On political developments in the state, he says, "The… pic.twitter.com/AVUbdtiYeg — ANI (@ANI) January 28, 2024 ►బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు రాజీనామా చేయనున్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కనిపిస్తోంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్‌లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే -
ఇండియా కూటమి నేతల ఫోన్లకు స్పందించని నితీష్ కుమార్
పట్నా: ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఇక.. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి నితీస్ కుమారు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బిహార్ సీఎం నితీష్‌కుమార్‌పై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’నుంచి నితీష్ జేడి(యూ) పార్టీ వైదులుగుతుందన్న కచ్చితమైన సమాచారం లేదన్నారు. ఇక.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటు అయిన ‘ఇండియా కూటమి’లో జేడీ (యూ) ఓ కీలకమైన పార్టీ జేడీ(యూ) అని తెలిపారు. ‘నాకు నితీష్ కుమార్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయం నేను లేఖ కూడా రాశారు. వారితో మాట్లాడుదామని ప్రయత్నం చేశాను. కానీ, నితీష్ కుమార్ మనసులో ఏం ఉందో నాకు తెలియదు’ అని ఖర్గే పేర్కొన్నారు. రేపు( ఆదివారం) ఢిల్లీ వెళ్లి బిహార్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ అనిశ్చితిపై పూర్తి సమాచారం తెలుసుకుంటానని.. ఈ వ్యవహారంపై చర్చ జరుపుతామని అన్నారు. నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్న విషయం తనకు తెలియదని, గవర్నర్‌ను కలుస్తారన్న దానిపై కూడా తనకు స్పష్టత లేదని అన్నారు. ఇక.. ఈ విషయంపై ప్రస్తుతం అధికారికంగా మాట్లాడలేనని అన్నారు. రేపటి వరకు ఏం జరుగుతుందో చూస్తామని ఖర్గే తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ సంబంధించిన నేతల ఫోన్లకు నితీష్ కుమార్ స్పందించకపోవటం గమనార్హం. సోనియా గాంధీ కాల్ చేసినా.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే మూడుసార్లు ఫోన్ చేసినా నితీష్ కుమార్ స్పందించలేదు. మరోవైపు.. లాలూప్రసాద్ యాదవ్ ఐదుసార్లు ఫోన్ చేసినా నితీష్ లిఫ్ట్ చేయకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చదవండి: Bihar Politics: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా నేడు? -
బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో నితీష్ మళ్లీ సీఎం?
పాట్నా: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. జనవరి 28న బీజేపీ-జేడీయూ నేతృత్వంలో నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మార్పుల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ను నితీష్ నేడు కలిశారు. జేడీయూ, బీజేపీలు తమ ఎమ్మెల్యేలందర్ని ఇప్పటికే పాట్నాకు పిలిపించాయి. బీజేపీ నేత సుషీల్ కుమార్ మోదీ ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారని సమాచారం. జేడీయూ,ఆర్జేడీ విభేదాలతో ఆర్జేడీ నేత లాలూ యాదవ్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పరిచే ప్రయత్నంలో పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగేందుకు 122 సీట్ల మార్కును చేరుకునేందుకు లాలూ యాదవ్ పావులు కదుపుతున్నారు. మహాకూటమి నుంచి నితీష్ కుమార్ ఉపసంహరించుకున్న సందర్భంలో ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఆర్జేడీకి ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతుంది. దీంతో జితన్‌రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ మాంఝీని మాహా కూటమిలో చేర్చే ప్రయత్నం చేశారు లాలూ. ఇందుకు సంతోష్ మాంఝీకి లోక్‌సభ స్థానాలతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ ఇచ్చారని సమాచారం. ఇందుకు నో చెప్పినట్లు మాంఝీ వెల్లడించారు. బిహార్‌లో కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీల సహా స్థానిక పార్టీలతో ఏర్పడిన మహాకూటమికి జేడీయూ నేత నితీష్ కుమార్‌కు స్వస్తి పలకనున్నారని రెండు రోజులుగా రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో భగవంత్ మాన్ తర్వాత కీలక నేత నితీష్ తప్పుకోనున్నారు. మాహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి మళ్లీ సీఎంగా పదవి చేపట్టనున్నారని సమాచారం. ఈ అనుమానాలను నిజం చేస్తూ అటు.. రాహుల్ చేపట్టే న్యాయ్ యాత్రకు కూడా బిహార్‌లో హాజరుకాబోమని నితీష్ వర్గాలు తెలిపాయి. కర్పూరీ ఠాకూర్‌కి కేంద్రం భారత రత్న ప్రకటించిన అనంతరం జేడీయూ, ఆర్జేడీ మధ్య ఇటీవల విభేదాలు తారాస్థాయికి చేరాయి. బిహార్‌లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. ఇదీ చదవండి: Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు! -
Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట యూ టర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్‌లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్‌బంధన్‌తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్ నేతలతో నితీశ్ ఇంట్లో, ఘట్‌బంధన్‌లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీశ్ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు! లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్‌లో ఆప్‌దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ఆదినుంచీ కలహాల కాపురమే... బిహార్‌లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది. నితీశ్ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్‌లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్‌పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి. గిరిరాజ్ చెణుకులు పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్‌కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్‌సింగ్ విసిరిన చెణుకులు గురువారం వైరల్‌గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్ అని పాడుతూ లాలును నితీశ్ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్ స్పందించారు. గోడదూకుళ్లలో ఘనాపాఠి రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్‌కుమార్ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్‌గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్‌పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి. ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్‌బై చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిహార్ సీఎంగా తప్పుకుని జితిన్‌రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాఘట్‌బంధన్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్‌కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్‌బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్బంధన్ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది! తెరపైకి మెజారిటీ లెక్కలు... నితీశ్ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్బంధన్ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
నితీష్ కుమార్‌పై లాలూ కూతురు ఫైర్
పాట్నా: బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వంశపారంపర్య రాజకీయాలపై సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషికి గాను కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ప్రభుత్వ చర్యను స్వాగతించిన నితీష్ కుమార్.. కర్పూరి ఠాకూర్ తన కుటుంబ సభ్యులను పార్టీలో ఎన్నడూ తీసుకురాలేదని చెప్పారు. దివంగత నేత చూపిన బాటలోనే తమ పార్టీ పయనించిందని నితీష్ కుమార్ అన్నారు. జేడీయూ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. బీహార్‌లోని మహాకూటమి (మహాగత్బంధన్) ప్రభుత్వంలో జేడీయూకి మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీని ఉద్దేశించి పరోక్షంగా నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆర్జేడీ నేత లాలూ కుమార్తె ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నితీష్ కుమార్ పేరును ప్రస్తావించనప్పటికీ.. అర్హత లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏం ప్రయోజనం? ఒకరి ఉద్దేశ్యంలో మోసం ఉన్నప్పుడు ఆ పద్ధతిని ఎవరు ప్రశ్నించగలరు? అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. ఇదీ చదవండి: అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ -
క్రెడిట్ కోసం మోదీ ప్రయత్నం.. నితీష్ కుమార్ విమర్శలు
పట్నా: స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గుర్తింపుగా ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని బిహార్ సీఎం నితీష్‌కుమార్ విమర్శించారు. కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించటంపై మోదీ తనకే పూర్తి క్రెడిట్ దక్కాలని భావిస్తున్నారని అన్నారు. దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటిస్తున్నట్లుగా ఆయన కూమారుడు, జేడి(యూ) నేత రామ్మత్ ఠాకూర్‌కు ప్రధాని మోదీ సమాచారం అదించారని తెలిపారు. ప్రధాన మంత్రి ఫోన్ చేసినట్లు రమ్మత్ ఠాకూర్ తనకు చెప్పారని అన్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం తనకు ఈ విషయాన్ని తెలియజేయలేదని చెప్పారు. అయితే తనకే పూర్తి క్రెడిట్ దక్కాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. ఏదేమైనా తమ పార్టీ సుదీర్ఘంగా చేసిన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చిందని కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పలుసార్లు తమ జేడీ(యూ) పార్టీ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. తమ సంకల్పానికి దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ ప్రేరణ అని అన్నారు. ఆయన వెనకబడిన, బలహీన వర్గ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఠాకూర్ స్పూర్తీతోనే తాము బిహార్‌లో కులగణన చేపట్టామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఇక.. ‘ఇన్నాళ్లకు దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ కపటత్వం బయటపడింది. ఇప్పటికైనా జన నాయకుడు ఠాకూర్‌కు భరత రత్న ప్రకటించటాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది’ అని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: ‘కాంగ్రెస్ పనికి రాని పార్టీ.. కూటమి అసహజమైంది’ -
Lalan Singh: ‘బిహార్‌లో బీజేపీ, మోదీకి వీడ్కోలే’
పట్నా: తాను హిందువునని, కానీ బీజేపీ వాళ్లవలే రాజకీయ ప్రయోజనాల కోసం బహిరంగా ప్రదర్శించనని జనతా దల్(యునైటెడ్) సీనియర్ నేత రాంజన్ సింగ్ అలియాస్(లలన్ సింగ్) మండిపడ్డారు.ఆయన జేడీయూ పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత మొదటిసారి ముంగేర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో లలన్ సింగ్ మాట్లాడారు. మతం, దేవుడిపై విశ్వాసం అనేని రాజకీయ ప్రయోజనాల కోసం బహిరంగంగా ప్రదరర్శిల్సిన అవసరం లేదన్నారు. తాను కూడా పవిత్రమైన హిందువునని, దేవుడిపై అధికమైన విశ్వాసం కలవాడినిని తెలిపారు. కానీ, బీజేపీ నేతలవలే తాను మతాన్ని బయటకు ప్రదర్శించని మండిపడ్డారు. ఆధ్యాత్మీక ప్రదేశాలు.. ప్రదర్శన వస్తువులు కాదని దుయ్యబట్టారు.బీజేపీ వాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. దీనికి తోడు మీడియా సైతం స్పాన్సర్ చేయబడిన వార్తలవలే ప్రజల్లోకి వ్యాప్తి చేస్తోందని అన్నారు. బిహార్ ప్రభుత్వం, జేడీయూ మధ్య చీలికలు వచ్చాయన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అటువంటి వదంతులు అన్ని సత్యదూరమని స్పష్టం చేశారు. బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం చాలా స్ధిరంగా ఉందన్నారు. రాబోయో సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పోరుకు దిగుతామని అన్నారు. బిహార్‌లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీకి వీడ్కోలు పలుకుతామని అన్నారు. ప్రజలు కూడా బీజేపీ వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే లలన్ సింగ్‌ను జేడీయూ అధ్యక్ష పదవి నుంచి కావాలనే తొలగించిందని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జేడీయూ పార్టీకి నితీష్ కుమార్.. మొదటిగా ఆర్సీపీ సింగ్‌ను అధ్యక్షుడిగా చేసి, తర్వాత లలన్‌సింగ్ చీఫ్‌గా చేసి.. ఇప్పుడు మాత్రం తనే పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చున్నారని బిహార్ బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఎద్దేవా చేశారు. అయితే తాను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో సన్నిహితంగా ఉండటం వల్లనే సీఎం నితీష్ కుమార్ తనను జేడీయూ అధ్యక్ష పదవి నుంచి తప్పించాడని వార్తలు రాసిన మీడియాపై దావా వేస్తానని అన్నారు. కొన్ని పత్రికలు, టీవీ చానెల్స్ తనపై అసత్య వార్తలు ప్రచురించి పరువుకు నష్టం కలిగించాయని లలన్ సింగ్ మండిపడ్డారు. చదవండి: ‘పీహెచ్డీ సబ్జీవాలా’: ఉద్యోగం కంటే.. కూరగాయల అమ్మకంతోనే.. -
హ్యాపీ న్యూ ఇయర్!
హ్యాపీ న్యూ ఇయర్! -
డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో అధికార కూటమి భాగస్వామి అయిన జేడీ(యూ)లో తెర వెనక ‘తిరుగుబాటు’కు ఎట్టకేలకు తెర పడింది. పారీ్టలో అధ్యక్ష మార్పు తప్పదన్న ఊహాగానాలే నిజమయ్యాయి. మీడియా కథనాలను నిజం చేస్తూ లలన్సింగ్ను తప్పించి పార్టీ అధ్యక్ష పగ్గాలను సీఎం నితీశ్‌కుమార్ లాంఛనంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ భేటీ ఇందుకు వేదికైంది. పార్టీ అధ్యక్షునిగా నితీశ్ పేరును సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థించారు. ఆ వెంటనే లలన్ రాజీనామా, అధ్యక్షునిగా నితీశ్ బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పరిణామం వెనక నిజానికి చాలా పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. లలన్ తిరుగుబాటు యత్నమే దీనంతటికీ కారణమని సమాచారం. నితీశ్ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లలన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి ఆయన ఉద్వాసనకు దారితీసినట్ చెబుతున్నారు! కొద్ది నెలల క్రితం నుంచే... ఆర్జేడీతో, ఆ పార్టీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్‌తో లలన్‌సింగ్ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. నితీశ్ కూడా దీన్ని చూసీ చూడనట్టే పోయేవారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... లాలు కుమారుడు తేజస్వికి సీఎం పదవి అప్పగించి నితీశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటూ కొద్దికాలం క్రితం లలన్ ప్రతిపాదించారు. 18 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎం పదవిలో కొనసాగినందున అధికార మహాఘట్బంధన్ సంకీర్ణంలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి సీఎం అవకాశమిస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని నితీశ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. లాలు–లలన్ ప్లాన్ నితీశ్ నిరాకరించినా తేజస్విని ఎలాగైనా సీఎం చేసేందుకు లాలు, లలన్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా జేడీ(యూ)ను చీల్చి కనీసం ఒక డజను మంది ఎమ్మెల్యేలను ఆర్జేడీలోకి పంపేందుకు లలన్ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్‌లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని ఆయనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తేజస్వికి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలు. కానీ 45 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో డజను మందే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఈ ముప్పు తప్పించేలా లలన్ ఎత్తే వేశారు. అందులో భాగంగా వారిని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేస్తారు. అప్పుడిక వారికి అనర్హత నిబంధన వర్తించదు. ఆనక 12 మంది ఎమ్మెల్యేలూ ఆర్జేడీకి మద్దతు పలికేలా, నితీశ్ సర్కారు కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన జరిగింది. ఈ మేరకు 12 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వారందరికీ మంత్రి పదవులు ఆశ చూపారు. ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరి ఇందుకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేల్లో తన వీర విధేయుడైన సభ్యుడొకరు దీనిపై ఉప్పందించడంతో నితీశ్ అప్రమత్తమయ్యారు. సైలెంట్‌గా వారం క్రితం ‘ఆపరేషన్ లాలన్’కు తెర తీశారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరితోనూ విడివిడిగా మాట్లాడి వారంతా తనకే విధేయులుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలా పావులు కదుపుతూ శుక్రవారం కథను క్లైమాక్స్‌కు తెచ్చారు. విషయం అర్థమైన లాలన్‌సింగ్ అస్త్రసన్యాసం చేశారు. అధ్యక్ష పదవికి తానే నితీశ్ పేరును సూచించి తప్పుకున్నారు! -
జేడీయూలో ట్విస్ట్..!
-
జేడీయూ చీఫ్ పదవికి లలన్ సింగ్ రాజీనామా
పట్నా: జనతా దళ్(యునైటెడ్) పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన జేడీయూ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ కుమార్ పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. నితీష్ కుమార్ ఎన్నికకు ముందు లలన్ సింగ్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసి.. నితీష్ కుమార్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. మరో వైపు లలన్ గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అతనిపై అసంతృప్తితో ఉన్న సీఎం నితీశ్ కుమార్.. ఆయన్ని పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. ఇక.. జనతా దళ్ యునైటెడ్ ఏర్పడిన తొలినాళ్లలో శరద్ యాదవ్ వ్యవస్థాప అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై నితీశ్ కుమార్ 2016 నుంచి 2020 దాకా, 2020-21 మధ్య రామచంద్ర ప్రసాద్ సింగ్, లలన్ సింగ్ 2021 నుంచి జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను నితీశ్ కుమార్ చేపట్టడం గమనార్హం. -
JDU: జేడీయూ అధినేతగా మళ్లీ నితీశ్!
పాట్నా: బీహార్ అధికార పార్టీ జనతా దళ్(యునైటెడ్) పగ్గాల్ని మళ్లీ ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందుకోబోతున్నారా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మరో వారంలోగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జేడీయూ చీఫ్‌గా రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ ఉన్నారు. అయితే తప్పించే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నితీశ్ కుమార్‌నే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు సీనియర్లు కోరుతున్నారట. ఈ క్రమంలో.. ఢిల్లీలో డిసెంబర్ 29వ తేదీన జరగబోయే పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాలన్ సింగ్ తొలగింపు ఎందుకంటే.. జేడీయూ చీఫ్‌గా లాలన్ సింగ్‌ను తొలగించేందుకు కారణం లేకపోలేదు. లాలన్ గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామంపై అసంతృప్తితో రగిలిపోతున్న నితీశ్.. ఆయన్ని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. జనతా దళ్ యునైటెడ్ ఏర్పడిన తొలినాళ్లలో శరద్ యాదవ్ వ్యవస్థాప అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై నితీశ్ కుమార్ 2016 నుంచి 2020 దాకా, 2020-21 మధ్య రామచంద్ర ప్రసాద్ సింగ్, లాలన్ సింగ్ 2021 నుంచి జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఆర్జేడీతో వైరం.. మైత్రి.. గ్యాప్ జనతా పార్టీ చీలికతో.. ఒకవైపు కర్ణాటకలో హెచ్డీ దేవె గౌడ జనతా దళ్(సెక్యులర్), నార్త్ బెల్ట్‌లో బీహార్ నుంచి శరద్ యాదవ్ నేతృత్వంలో జనతా దళ్(యునైటెడ్) ఏర్పాడ్డాయి. అప్పటికే జార్జి ఫెర్నాండేజ్, నితీశ్ కుమార్‌లు సమతా పార్టీని స్థాపించారు. సమతా పార్టీని 2003 అక్టోబర్ 30న జనతా దళ్‌లో విలీనం చేశారు. మరో పార్టీ లోక్ శక్తి కూడా ఇందులో చేరింది. అప్పుడు అధికారంలో రాష్ట్రీయ జనతా దళ్ ఉండగా.. ప్రతిపక్ష కూటమిగా జేడీయూ కొనసాగింది. అయితే.. బీజేపీతో కటీఫ్ ప్రకటించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎంతో పొత్తుగా వెళ్లింది జేడీయూ. నలభై సీట్లలో కేవలం రెండే సీట్లు నెగ్గింది. ఓటమికి నైతిక బాధత్య వహిస్తూ నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జతిన్ రామ్ మాంఝీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ టైంలో బీజేపీ అధికార పక్షాన్ని బలపరీక్షకు ఆహ్వానించగా.. ఆర్జేడీ సాయంతోనే జేడీయూ ప్రభుత్వం నెగ్గడం గమనార్హం. ఆ తర్వాత 2015లో జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు కూటమిగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకున్నప్పటికీ.. ఎస్పీ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో పొత్తుగా వెళ్లి ఎన్నికల్లో నెగ్గాయి. బీజేపీతో జేడీయూ దోస్తీ-కటీఫ్ల నడుమ.. జేడీయూ-ఆర్జేడీల మైత్రి కూడా పడుతూ లేస్తూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా విజయం సాధించి ప్రభుత్వంలో ఆర్జేడీ కూడా భాగమైంది. అయితే.. మధ్య మధ్యలో కీలక నేతల నడుమ లుకలుకలు బయటపడుతూనే వస్తున్నాయి. ఇండియా కూటమి సమావేశాలు కొనసాగుతున్న వేళ.. జేడీయూ-ఆర్జేడీల మధ్య ఆగాథం మరింత పెరుగుతూ వస్తోంది. -
ప్రధాని అభ్యర్థిగా ఖర్గేనే.. నితీష్‌కు రాహుల్ ఫోన్
ఢిల్లీ: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేసే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టతనిచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా మద్దతునిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఫోన్ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ఖర్గే పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దేశానికి తొలి దళిత వ్యక్తిని పీఎంగా ప్రకటించిన ఘనత కూడా దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనను ఎమ్‌డీఎమ్‌కే నేత వైకోతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు మద్దతు పలికారు. ఫోన్ కాల్ సందర్భంగా ఇండియా కూటమి బలాబలాలపై రాహుల్, నితీష్ కుమార్ చర్చించుకున్నారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రస్తావన తనకు తెలియదని నితీష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదే క్రమంలో బిహార్ కేబినెట్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్యను పెంచుతానని నితీష్ హామీ ఇచ్చారు. కాగా.. 2024 లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులను అతి త్వరలో నిర్ణయిస్తామని కాంగ్రెస్ గురువారం తెలిపింది. ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చింది. రాహుల్ భారత్ జోడో యాత్ర 2.0(తూర్పు-పశ్చిమం) చేయాలని ఈ సమావేశంలోనే నేతలు కోరారు. ఈ భేటీలో పాల్గొన్న 76 మంది నేతలు దేశంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై చర్చించారు. ఇదీ చదవండి: ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు -
మోదీపై ప్రశంస.. రాజీనామా చేయాలంటూ డిమాండ్!
పట్నా: రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్.. ఈ మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో తాము మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జనతా దళ్ యునైటెట్(జేడీయూ)చెందిన లోక్‌సభ ఎంపీ సునీల్ కుమార్ పింటూ.. మోదీని ప్రశంసిస్తూ చేసిన స్లోగన్ వివాదాస్పదంగా మారింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ‘గెలుపు మోదీతో సాధ్యమవుతుంది’అనే బీజేపీ నేతలు, కార్యకర్తలు పలికే స్లోగన్‌ను ఆయన కూడా అంటూ మోదీని ప్రశంసించారు. దీంతో జేడియూ పార్టీ నేతలు పింటూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి, బీజేపీకి అనుకూలంగా ప్రశంసలు కురిపించినందుకు పింటూ.. లోక్ సభ సత్వానికి రాజీనామా చేయాలని జేడియూ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ డిమాండ్ చేశారు. పింటూ మోదీ పట్ల ప్రభావితం అయ్యారని అగ్రహించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ, మోదీకి అనుకూలమైన స్లోగన్లు చేయటం సరికాదన్నారు . అతి తర్వరలో లోక్‌సభ సభ్యత్వ రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే పింటూ చేసిన మోదీ అనుకూల స్లోగన్‌పై బీజేపీ అధికార ప్రతినిధి కుంతల్ కృష్ణా స్పందిస్తూ.. పింటూ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని తెలిపారు. గతేడాది జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకుని.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదికూడా చదవండి: ‘ఫ్యామిలీలో మరణం’ అయినా.. పార్టీ గెలుపు కోసం కృషి: మోదీ -
Vedio: 'బస్సు కింద పడి చచ్చిపో..' బైకర్పై దేవెగౌడ కోడలు ఆగ్రహం
బెంగళూరు: కర్ణాటకకు చెందిన మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ్ కోడలు ఓ బైకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ఢీకొట్టిన ద్విచక్రవాహనదారునిపై కోపంతో రంకెలు వేశారు. కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే పేర్కొంటూ బైకర్ని చివాట్లు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేవెగౌడ కోడలు భవాని రేవణ్ణ స్వగ్రామం ఉడిపిలోని సాలిగ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఓ బైకర్ ఆమె కారును ఓవర్‌టేర్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రేవణ్ణ కారు టొయేటా వెల్‌ఫైర్‌ను బైకర్ ఢీకొట్టాడు. దీంతో భవాని రేవన్న అతనిపై కోపంతో ఊగిపోయారు. తన కారు విలువ రూ.1.5 కోట్లు.. రిపేర్‌కు రూ.50 లక్షలు ఇవ్వగలవా? అని అతనిపై రంకెలు వేశారు. చనిపోవాలనుకుంటే.. ఏ బస్సు కిందో పడి చావొచ్చుగా? రాంగ్ సైడ్‌లో ఎందుకు డ్రైవ్ చేస్తున్నావని అతనిపై మండిపడ్డారు. A video shows former prime minister #HDDeveGowda’s daughter-in-law & #JDS leader #BhavaniRevanna yelling at villagers after a two-wheeler allegedly damaged her pricey Toyota Vellfire.#Karnataka #Mysuru #RoadAccident #HDRevanna pic.twitter.com/I4GRvgoGVQ — Hate Detector 🔍 (@HateDetectors) December 4, 2023 బైకర్ని తిట్టే క్రమంలో భవాని రేవణ్ణ కారు విలువ రూ.1.5 కోట్లు అని పదే పదే చెప్పారు. దీనిపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవానీ రేవన్నకు మరికొందరు మద్దతు కూడా తెలుతున్నారు. రైడర్ రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేయడం తప్పుకదా? అని ప్రశ్నిస్తున్నారు. భవానీ రేవన్న భర్త హెచ్డీ రేవన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆమె కుమారులు ప్రజ్వాల్, సూరజ్ రేవన్న ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ చేసిన తప్పు అదేనా? -
బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేదంటే!: కేంద్రానికి నితీష్ హెచ్చరిక
పాట్నా: కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్ సీఎం నితీష్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. బిహార్‌కు అతి త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. అలా జరగని నేపథ్యంలో కేంద్రంపై వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రకటించారు. కాగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ గత కొన్నేళ్లుగా బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ డిమండ్‌ను మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. హోదా విషయంలో ముందుకు సాగాలంటే ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం త్వరగా బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మూలమూలన ప్రత్యేక హోదా కోసం డిమాండ్ వినిపిస్తుందని పేర్కొన్నారు. ఎవరైతే ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు ఇవ్వరో.. వారికి రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకున్న వారే అవుతారని సీఎం విమర్శించారు. కులాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపు బిల్లును ఇటీవలే బిహార్ అసెంబ్లీ ఆమోదించిన విషయాన్ని నితీష్ ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్సీ, ఈబీసీ, ఓబీలకు ఉన్న రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన ఆధారంగా మొత్తం రిజర్వేషన్లను 75 శాతానికి తీసుకువెళ్లామని వెల్లడించారు. చదవండి: కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు! సమాజంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, దీనికోసం బీహార్ వంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. వాటిని అయిదేళ్లలో ఖర్చు చేస్తామని చెప్పారు. అయితే బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే వచ్చే రెండున్నరేళ్లలో ప్రజలకు ఆ సదుపాయాలను అందించగలుగుతామని చెప్పారు. అందుకే బీహార్‌కు తక్షణమే హోదా అవసరమని తెలిపారు. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర అసెంబ్లీ, మండలిలో ఏకగ్రీవంగా ఆమోదించిన రిజర్వేషన్‌కు సంబంధించిన రెండు బిల్లులను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆమోదం కోసం పంపినట్లు నితీష్ తెలిపారు. రెండు బిల్లులపై గవర్నర్ త్వరలో సంతకం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం అనంతరం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం దీనిని అమలు చేస్తామని చెప్పారు. -
నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్‌ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్‌పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్‌ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు -
‘నితీష్ ప్రధాని అవుతారు, ఆయన్ను మించిన సమర్థుడు లేడు’
బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధానమంత్రి అవుతారని జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో నితీష్ కుమార్ ప్రధాపి అభ్యర్థిగా ఉంటారని బిహార్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ పేర్కొన్నారు. నితీష్‌కు మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని అన్నారు. నితీషే ప్రధానమంత్రి అభ్యర్థనే విషయాన్ని ఇండియా కూటమి తర్వలోనే ప్రకటిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 లోకసభ ఎన్నికలకుముందు పార్టీ సన్నద్ధత గురించి ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్లో ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు, లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి పేరును ఎప్పుడు ప్రకటించినా.. అది నితీష్ కుమార్ పేరే అయి ఉంటుందని తెలిపారు. దేశంలో రామ్మనోహర్ లోహియా తర్వాత మహోన్నతమైన సోషలిస్టు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ కుమార్ జీ అని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో వ్యాఖ్యానించారని, నితీష్ కుమార్ 5 సార్లు కేంద్రంలో మంత్రిగా 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె! కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని కూటమి నేతలు చెప్తున్నప్పటికీ.. మమతాబెనర్జీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ఇలా పలువురు నాయకులు ప్రధాని అభ్యర్థి బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ హజారీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ మాత్రం తనకు ప్రధాని పదవిపై ఎలాంటి ఆశలు లేవని ఇదివరకే అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఏకమై ముందుకు సాగాలన్నదే తన కోరిక అని తెలిపారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తానని చాలాసార్లు చెప్పారు. చదవండి: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం, బీజేపీకి సర్ప్రైజ్!: రాహుల్ గాంధీ -
ఇక బిహార్ వంతు...? మహారాష్ట్ర తరహాలో ఆపరేషన్ కమలం!
బిహార్‌లోనూ మహారాష్ట్ర తరహా రసవత్తర రాజకీయ క్రీడకు తెర లేవనుందా? తద్వారా ఉత్తరాదిన కొరకరాని కొయ్యగా మారిన ఏకైక రాష్ట్రాన్నీ బీజేపీ గుప్పిట పట్టజూస్తోందా? అందుకోసం నితీశ్ పార్టీ జేడీ(యూ)ను చీల్చి నిర్వీర్యం దిశగా పావులు కదుపుతోందా...? పరిస్థితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది... మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఆశ్చర్యకరమేమీ కాదు. అనుకోనిది అసలే కాదు. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలతో కలిసి అధికార బీజేపీ–శివసేన (షిండే) కూటమికి జై కొట్టి షాకిచ్చారు. గాలివాటును బట్టి రాజకీయ వైఖరి మార్చడంలో చిన్నాన్న కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకున్నారు. ఏడాది క్రితమే ఏక్నాథ్ షిండే ద్వారా శివసేనను బీజేపీ నిలువునా చీల్చి బలహీనపరచడం తెలిసిందే. అందుకు బదులుగా షిండేకు సీఎం పీఠం దక్కితే తాజాగా ఎన్సీపీని చీలి్చనందుకు అజిత్‌కు డిప్యూటీ సీఎం పోస్టు దక్కింది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికో, తదనంతరమో ఈ రెండు చీలిక వర్గాలూ కమల దళంలో విలీనమైపోతాయని భావిస్తున్నారు. తద్వారా శివసేన, ఎన్సీపీలను నామమాత్రంగా మార్చేసి బలమైన విపక్షమన్నదే లేకుండా చేసుకోవడం బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీకి మించిన బలమున్నా ఎన్సీపీని చీల్చడం ఆసక్తికరమైన పరిణామమే. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో కొంతకాలంగా కీలకంగా వ్యవహరిస్తున్న శరద్ పవార్‌కు ఈ రూపంలో కమలనాథులు కోలుకోలేని షాకిచ్చినట్టు కనిపిస్తోంది. పిలవడమే తడవుగా రెక్కలు కట్టుకుని తన గూటిలోకి వచ్చి వాలేందుకు అజిత్ ఎప్పట్నుంచో సిద్ధంగా ఉన్నా పనిగట్టుకుని ఇప్పుడే ఎన్సీపీని బీజేపీ దెబ్బ కొట్టడం వెనక ఇదే ప్రధాన కారణమన్నది పరిశీలకుల అభిప్రాయం. పవార్ ప్రస్తుతం విపక్ష నేతల సానుభూతి వెల్లువలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు! నాలుగేళ్ల నాడు ఇలాగే శివసేనతో జట్టు కట్టిన అజిత్‌ను అతికష్టమ్మీద దారికి తెచ్చుకోగలిగిన ఆయనకు తాజా దెబ్బ నుంచి కోలుకోవడం పవార్‌కు కష్టమే కావచ్చు. ఆయనకు నమ్మినబంటైన ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వంటి నేతలు కూడా అజిత్ పంచన చేరడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. పవార్ కూతురు సుప్రియా సులే సమర్థురాలే అయినా ఎన్సీపీకి ఉద్దవ్ పార్టీ గతి పట్టకుండా కాచుకోవడం శక్తిని మించిన పనేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం ఇతర విపక్షాలనూ ఆలోచనలో పడేసింది. జూలై 13–14 తేదీల్లో బెంగళూరులో తలపెట్టిన తదుపరి మేధోమథన భేటీ కూడా నాలుగు రోజుల పాటు వాయిదా పడింది! ఇలా బీజేపీ ఒకే దెబ్బతో ఒకటికి మించిన లక్ష్యాలను తాత్కాలికంగానైనా సాధించినట్టేనన్న భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్–ఆప్ విభేదాలతో ఇప్పటికే డీలా పడ్డ విపక్షాల ఐక్యతా యత్నాలకు ఈ పరిణామం గట్టి దెబ్బేనంటున్నారు. తదుపరి టార్గెట్ నితీశే...! మహారాష్ట్ర అనంతరం ఇప్పుడిక బీజేపీ దృష్టి బిహార్పైకి మళ్లినట్టు కని్పస్తోంది. అందుకు కారణాలూ లేకపోలేదు. తొమ్మిదేళ్లుగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు, పలు రాష్ట్రాల్లో స్థానిక విపక్షాలకు చుక్కలు చూపుతున్న బీజేపీకి ఉత్తరాదిన బిహార్ మాత్రం ఓ పట్టాన కొరుకుడు పడటం లేదు. నిజానికి ఏడాది క్రితం షిండే శివసేనను చీలి్చనప్పుడే బిహార్‌లోనూ అలాంటిదేదో జరుగుతుందని చాలామంది ఊహించారు. ఒకరకంగా దానికి భయపడే బీజేపీకి అవకాశమివ్వకుండా అప్పట్లో నితీశ్ కుమార్ తానే తొలి ఎత్తు వేశారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు తదితరాలన్నింటినీ కలుపుకోవడం ద్వారా అధికారాన్ని నిలుపుకుని రాజకీయ చతురత ప్రదర్శించారు. కానీ బీజేపీ మాత్రం ప్రయత్నాలు మానలేదు. జేడీ(యూ) బలాన్ని కొద్దికొద్దిగా తగ్గిస్తూ వస్తోంది. నితీశ్‌కు నమ్మకస్తుడైన ఉపేంద్ర కుషా్వహా జేడీ(యూ)కు గుడ్‌బై చెప్పి సొంత కుంపటి పెట్టుకోవడం, జితిన్‌రామ్ మాంఝీ సారథ్యంలోని హిందూస్తానీ అవామ్ మోర్చా అధికార కూటమిని వీడటం వంటివన్నీ దాని ఫలితమేనంటారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. జేడీ(యూ)కూ సేన, ఎన్సీపీ గతి తప్పదంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ వంటివారు ఇప్పటికే మాటల దాడికి దిగుతున్నారు. ఇదంతా బీజేపీ మైండ్‌గేమ్‌లో భాగమేనని భావిస్తున్నారు. నితీశ్ కరిష్మా క్రమంగా తగ్గుతుండటం, ప్రధాని మోదీ మేనియా నానాటికీ విస్తరిస్తుండటం జేడీ(యూ) నేతలు, ఎమ్మెల్యేల్లో చాలామందిని ‘ఆలోచన’లో పడేస్తోందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఏళ్ల తరబడి బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిన జేడీ(యూ) ప్రభ తగ్గుతూ వస్తోంది. ఇలాంటప్పుడే ఆ పార్టీని వీలైనంత గట్టి దెబ్బ తీస్తే మరో కీలక రాష్ట్రమూ చిక్కినట్టేనన్నది కమలనాథుల వైఖరిగా కని్పస్తోంది. ఈ తాజా దాడిని కాచుకునేందుకు నితీశ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. పార్టీ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవడం తదితరాల ద్వారా వారి విధేయత సడలకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎత్తులూ పై ఎత్తులతో రంజుగా సాగుతున్న బిహార్ రాజకీయ చదరంగంలో చివరికి ఎవరిది పై చేయి అవుతుందన్నది ఆసక్తికరం. -
బీఆర్ఎస్తో భేటీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేలా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్న బిహార్ సీఎం నితీశ్‌కుమార్.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీకావడంపై సందిగ్ధం నెలకొంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందే కేసీఆర్‌తో నితీశ్ భేటీ ఉంటుందని జేడీయూ నేతలు ప్రకటించినా ఇంతవరకు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే కేసీఆర్‌తో భేటీకి నితీశ్ వెనక్కి తగ్గారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుసగా కీలక నేతలతో భేటీలు బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో దేశంలోని ప్రధాన పార్టీల అధినేతలను నితీశ్‌కుమార్ కలుస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ముందు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియకు మరింత పదునుపెట్టారు. శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నేతలతోపాటు జేఎంఎం నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లతో సమావేశమయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌తో మరోమారు భేటీ అయ్యారు. తాజాగా సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో నితీశ్ సమావేశమయ్యారు. ఈ భేటీల సందర్భంగా విపక్ష పార్టీల ఐక్యత, బీజే పీని ఎదుర్కొనే వ్యూహాలు, పొత్తులు, ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అయితే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొన్నట్టుగానే బీఆర్ఎస్ను కూడా కలుపుకొని పోవాలని నితీశ్ భావిస్తున్నా.. కాంగ్రెస్ పెద్దలు దీనికి సానుకూలంగా లేరని సమాచారం. ఎన్నికల తర్వాత ఆలోచిద్దాం! బీఆర్ఎస్ను కలుపుకొనిపోయే విషయంలో రాహుల్ గాంధీ అంత సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)ను విలీనం చేస్తామని మాట ఇచ్చి తప్పారని.. అలాంటి బీఆర్ఎస్ను రాష్ట్రంలో అధికారంలోంచి దింపేందుకు కాంగ్రెస్ శ్రేణులు బలంగా పనిచేస్తున్నాయని నితీశ్‌కు రాహుల్ స్పష్టం చేశారని అంటున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనమవుతూ, కాంగ్రెస్ బలపడుతున్న దృష్ట్యా.. ఆ పార్టీని కలుపుకొంటే తమకు నష్టం వస్తుందని రాహుల్ పేర్కొన్నట్టు వివరిస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు సంకేతం అన్నట్టుగానే కర్ణాటక సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి 17 విపక్షాలను పిలిచినా బీఆర్ఎస్ను ఆహ్వానించలేదని సమాచారం. ఒకవేళ బీఆర్ఎస్ను కలుపుకోవాలని అన్ని పార్టీలు కోరితే.. ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక, లోక్‌సభ ఎన్నికలకు ముందుగానీ, ఎన్నికల తర్వాతగానీ ఆలోచిద్దామని ఏఐసీసీ పెద్దలు నితీశ్‌కు తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో భేటీపై నితీశ్ ఊగిసలాడుతున్నారని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. వారం, పది రోజుల్లో బిహార్‌లోని పట్నాలో విపక్షాల ఉమ్మడి భేటీ నిర్వహించాలని నితీశ్ యోచిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పిలిచే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
సోరెన్‌తో నితీశ్ భేటీ
రాంచీ: సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేయడంపైనే ప్రధానంగా చర్చించామని జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ చీఫ్ హేమంత్ సోరెన్‌తో భేటీ తర్వాత జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రకటించారు. బుధవారం రాంచీకి చేరుకున్న నితీశ్.. ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‌తోపాటు సోరెన్‌తో చర్చలు జరిపారు. ‘ బీజేపీని ఓడించడం, విపక్షాలను ఏకతాటి మీదకు తేవడంపైనే చర్చించాం. ఈ సంప్రదింపుల ఫలితం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. చరిత్రను తిరగరాయాలన్న బీజేపీ సర్కార్ కుతంత్రాలను మేం తిప్పికొడతాం. హిందూ–ముస్లిం ఐక్యతను మళ్లీ పునఃప్రతిష్టిస్తాం ’ అని నితీశ్ మీడియాతో అన్నారు. ఎన్డీఏయేతర పార్టీలను ఏకంచేసే క్రమంలో విపక్ష పార్టీల అగ్రనేతలతో వరసగా భేటీలను నితీశ్ కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. మంగళవారం ఒడిశాకు వెళ్లిన నితీశ్ అక్కడ బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో గంటకుపైగా మంతనాలు జరిపారు. ఇటీవల ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లనూ కలిశారు. ఏప్రిల్‌లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేనూ నితీశ్ కలిశారు. అంతకుముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆప్ అధినేత కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులతోనూ భేటీ అయ్యారు. -
సీఎం నవీన్‌తో నితీష్ కుమార్ భేటీ
భువనేశ్వర్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఝాతో కలిసి రాష్ట్రానికి విచ్చేశారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నితీష్‌కుమార్ నేరుగా నవీన్ నివాస్‌కు చేరుకున్నారు. ఇరువురి మధ్య దాదాపు గంటకు పైగా సుదీర్ఘ చర్చ సాగింది. భేటీ అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడారు. నితీష్ జీ భువనేశ్వర్ వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మేము పాత స్నేహితులం. అనేక విషయాలను చర్చించామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. బీహార్ నుంచి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులు బస చేయడానికి పూరీలో ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణపు స్థలాన్ని బీహార్ ప్రభుత్వానికి గెస్ట్ హౌస్ కోసం ఉచితంగా మంజూరు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని నవీన పట్నాయక్ ఉద్ఘాటించారు. అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తన పాత స్నేహితుడిని కలవడానికి వచ్చినట్లు వెల్లడించారు. చాలా రోజుల తర్వాత కలవడం సంతోషంగా ఉందన్నారు. మహా ప్రతిపక్ష కూటమి లక్ష్యంగా..? బీజేపీకి వ్యతిరేకంగా మహా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు, ప్రతిపక్ష నేతలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కృషి చేస్తున్నట్లు జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంది. ఎన్డీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే ఆయన లక్ష్యంగా తెలుస్తోంది. అయితే బీజేపీ మరియు కాంగ్రెస్ వర్గాలతో బీజేడీ సమాన దూరాన్ని కొనసాగిస్తోంది. తృతీయ కూటమి ఏర్పాటు నేపథ్యంలో బీజేడీ ఆది నుంచి ఇదే వైఖరి ప్రదర్శించి, 2019 సంవత్సరం నుంచి వరుసగా ఏర్పాటైన అన్ని సమావేశాల్లో దాటవేత వైఖరితో తప్పించుకుని చలామణి అవుతోంది. తృతీయ కూటమి ఆవిర్భావంలో నవీన్ విభిన్నమైన నానుడితో దాటవేస్తున్నారు. లోగడ అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెసు నుంచి సమాన దూరంలో ఉంటున్నందున తృతీయ కూటమిపై ఆసక్తి లేనట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల బీజేపీ, బీజేడీ మధ్య వైరిభావాలు దాదాపు తారాస్థాయికి చేరాయి. అయినప్పటికీ ఆయన వైఖరి ఆంతర్యం బయట పడనీయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. స్థలం కేటాయింపునకే చర్చలా..! తృతీయ కూటమి వారధులుగా చలామణి అవుతున్న నితీష్ కుమార్, మమత బెనర్జీలు ఇటీవల సీఎం నవీన్ పట్నాయక్‌తో కలిసిన సందర్భంగా పూరీ శ్రీజగన్నాథుని క్షేత్రంలో పశ్చిమ బెంగాలు, బీహారు ప్రాంతాల నుంచి విచ్చేసే యాత్రికులు, పర్యాటకులు బస చేసేందుకు ప్రత్యేక భవనాల కోసం స్థలం కేటాయింపు కోసం చర్చలు పరిమితం అయినట్లు ప్రకటించారు. ఈ ఏడాది మార్చి నెలలో మమతా బెనర్జీ, తాజాగా నితీష్ కుమార్ పర్యటన పురస్కరించుకొని ఆయా రాష్ట్రాల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు ప్రకటించడంతో చర్చలు ముగిసినట్లు ప్రకటించడం విశేషం. ఈ వైఖరితో ఇరుగు, పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాలు, బీహారు రాష్ట్రాలతో మైత్రి బంధం బలపడుతుందని నవీన్ పట్నాయక్ అంటున్నారు. కానీ రానున్న ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుపైనే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ కీలక నిర్ణయం.. సమైక్యంగా ఎన్నికలకు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ఏడాదే ఉన్న నేపథ్యంలో విపక్షాల ఐక్యత దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. బిహార్‌లో అధికారంలో ఉన్న మహాఘట్బంధన్ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్య నేతల మధ్య బుధవారం కీలక సమావేశం జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీని కలసికట్టుగా ఎదుర్కోవడంతో పాటు పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. అనంతరం నేతలంతా సంయుక్తంగా మీడియా ముందుకొచ్చారు. విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న మీడియా ప్రశ్నలకు మాత్రం నేతలు సమాధానం దాటవేశారు.మోదీ మేజిక్‌ను ఎదర్కోవడానికి ఒక ఉమ్మడి నాయకున్ని ప్రకటించే ఎన్నికల బరిలో దిగడం మేలని విపక్ష నేతల్లో కొందరంటుండగా అది అంతిమంగా తమకే చేటు చేయవచ్చని మరికొందరు భావిస్తుండటమే దీనికి కారణమని చెబుతున్నారు. కీలక ముందడుగు: రాహుల్ తమ భేటీని చరిత్రాత్మక సమావేశంగా రాహుల్ అభివర్ణించారు. ‘‘ఈ భేటీ విపక్షాల ఐక్యత దిశగా కీలక ముందడుగు. ఎన్నో అంశాలపై చర్చించుకున్నాం. అన్ని పార్టీలనూ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి లోక్‌సభ ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పట్నుంచే అందరమూ ఆ దిశగా పని చేస్తాం. మాది సైద్ధాంతిక పోరాటం. విపక్షాల ఉమ్మడి విజన్‌ను త్వరలో ప్రజల ముందుంచనున్నాం’’ అని వెల్లడించారు. ఎన్ని విపక్షాలు కలిసి రానున్నాయని ప్రశ్నించగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలింకా కొనసాగుతున్నాయని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఒక్కటిగా నిలబడ్డాం. దేశం కోసం ఒక్కటిగా పోరాడతాం’’ అంటూ అనంతరం ట్వీట్ చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశానికి నూతన దిశానిర్దేశం చేసేందుకు కలసికట్టుగా సాగుతామని ఖర్గే ప్రకటించారు. నితీశ్, తేజస్వి తదితరులతో భేటీ చాలా బాగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది తొలి సమావేశం. ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్‌సింగ్, బిహార్పీసీసీ చీఫ్ అఖిలేశ్ ప్రసాద్‌సింగ్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా మున్ముందు మరిన్ని విపక్షాలతో ఖర్గే భేటీ కానున్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తదితరులతో ఇటీవలే ఆయన సమావేశమై చర్చించారు. ఇటీవలే ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో 19 విపక్షాలు సమైక్యంగా నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనడం తెలిసిందే. పార్టీలన్నింటినీ కలుపుకుంటాం: నితీశ్ దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుని పోయేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామని నితీశ్ ప్రకటించారు. ‘‘అంతా కలిసి పని చేయాలని భేటీలో నిర్ణయం తీసుకున్నాం. అందుకోసం అందరమూ కూర్చుని మాట్లాడుకుంటాం. భావి కార్యాచరణను నిర్ణయించుకుంటాం. అది త్వరలోనే జరుగుతుంది. ఆ దిశగా ముందుకు సాగనున్నాం’’ అని వెల్లడించారు. విపక్షాల ఐక్యతను సాధించే కీలక శక్తిగా నితీశ్ నిలవనున్నారంటూ జేడీ(యూ) ట్వీట్ చేసింది. నితీశ్‌కు పూర్తి మద్దతు: కేజ్రీవాల్ కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం నితీశ్, తేజస్వీ బుధవారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తర్వాత కేజ్రీ మీడియాతో మాట్లాడారు. విపక్షాల సమీకరణకు నితీశ్ ప్రయత్నాలను ప్రశంసించారు. వాటికి తన పూర్తి మద్దతుంటుందని ప్రకటించారు. ‘‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కేంద్రంలో ప్రస్తుతమున్నది బహుశా దేశ చరిత్రలోనే అత్యంత అవినీతిమయ ప్రభుత్వం! దాని దెబ్బకు సామాన్యుని బతుకు దుర్భరంగా మారింది. బీజేపీ సర్కారుపై విపక్షాలన్నీ సమైక్యంగా పోరాడి దాన్ని కూలదోయడం అత్యవసరం’’ అని అభిప్రాయపడ్డారు. నితీశ్‌ను ప్రధాని అభ్యరి్థగా భావిస్తున్నారా అని ప్రశ్నించగా, కేవలం ఒక్క భేటీతో ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేమని కేజ్రీవాల్ అన్నారు. గురు, శుక్రవారాల్లో మరికొందరు విపక్ష నేతలతో కూడా నితీశ్ భేటీ అవుతారని సమాచారం. మంగళవారం ఆయన ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్‌తోనూ సమావేశమయ్యారు. బందిపోట్ల కూటమి: బీజేపీ కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ నేతల భేటీని రాజకీయ గిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. ‘‘అదో బందిపోట్ల కూటమి. నిండా అవినీతిలో కూరుకుపోయిన వాళ్లంతా చట్టం బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలివి. ఇలాంటి విన్యాసాలతో వారి అవినీతి దాగబోదు’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. 2014, 2019 ఎన్నికల్లో వారిని ప్రజలు వరుసగా తిరస్కరించారన్నారు. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని, మోదీ సారథ్యంలో బీజేపీ ఘనవిజయం ఖాయమని జోస్యం చెప్పారు VIDEO | Bihar CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav meet Congress leader Rahul Gandhi at party president Mallikarjun Kharge's residence in Delhi pic.twitter.com/11bSWF2A5J — Press Trust of India (@PTI_News) April 12, 2023 -
రాహుల్ అనర్హతపై ట్విస్ట్ ఇచ్చిన సీఎం నితీష్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ అంశంపై తాను మాట్లాడేందుకు సిద్ధంగా లేనంటూ ముక్కుసూటిగా చెప్పేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా నితీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయితే, నితీష్ కుమార్ పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులు చేతులు కలిపారు అని ప్రధాని చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్య ప్రతిపక్షం అవసరమని అన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసి లేనిది ఉన్నట్టుగా చెబుతారు అని ఆరోపణలు చేశారు. అలాగే, ప్రధాని.. అవినీతి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తులతో పొత్తులు పెట్టుకుంటున్నారో వీడియో రికార్డులు చేసుకోవాలని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ అనర్హత వేటుపై నితీష్ స్పందిస్తూ.. కోర్డు ఆర్డర్‌కు సంబంధించిన ఏ విషయంపైనా కూడా నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఈ అంశంపై పార్టీ ఒక క్లారిటీతో ఉంది. దీనిపై మాట్లాడేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఇదే విషయమై సుప్రీంకోర్టులో సవాల్ చేయడంపై మాట్లాడుతూ.. కోర్టును ఆశ్రయించడం ప్రతీ వ్యక్తికి ఉన్న హక్కు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందని తాను ఇప్పటికే చెప్పినట్టు స్పష్టం చేశారు. -
జేడీయూ నుంచి వైదొలిగిన ఉపేంద్ర కుష్వాహ
పట్నా: జేడీయూ అసంతృప్త నేత ఉపేంద్ర కుష్వాహ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ జనతా దళ్ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బిహార్ మహాఘఠ్‌బంధన్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు లభిస్తున్న ప్రాముఖ్యంపై అసంతృప్తితో ఉన్న కుష్వాహ గత కొంత కాలంగా జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆయన రాజీనామాపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ స్పందించారు. ‘జేడీయూ నుంచి వెళ్లిపోయి సొంతంగా రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ పెట్టుకున్న కుష్వాహను 2021లో తిరిగి పార్టీలోకి కేవలం సీఎం నితీశ్ కుమార్ జోక్యంతోనే తీసుకున్నాం. స్థాయికి మించిన ఆశలు ఆయనకున్నాయి. అందుకే వెళ్లిపోతున్నారు’అని పేర్కొన్నారు. -
చావనైనా చస్తా.. కానీ బీజేపీతో మాత్రం చేతులు కలపను..
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తా గానీ, మరోసారి బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వాళ్లది బోగస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తేజస్వీ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై కేసు పెట్టి కమలం పార్టీ ఏం సాధించిందని నీతిశ్ నిలదీశారు. 'మేం అటల్ బిహారీ వాజ్‌పేయీ ఫాలోవర్లం. ఆయనతో అంతా బాగుండేది. 2017లో బీజేపీతో జట్టుకట్టాం. తర్వాత విడిపోయాం. నేను సీఎం కావాలనుకోలేదు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి వాళ్లనే సీఎం పదవి చేపట్టమన్నా. కానీ నన్ను బలవంతంగా ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో మేం ఎలా ఓడిపోయామో మా పార్టీ నేతలు వివరించారు. మా ప్రజల ఓట్లతో వాళ్లు గెలిచారు. మళ్లీ ఎన్నికలు జరిగితే అప్పుడు బీహార్ ప్రజలంటే ఏంటో వాళ్లకు తెలుస్తుంది.' అని నితీశ్ అన్నారు. '2005లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఎన్ని సీట్లు గెలిచింది. 2010లో ఎన్ని గెలిచింది. అప్పుడు ముస్లిం ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు వేశారు. 2015లో మాతో విడిపోయాక ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది? ఈసారి మా ఓట్లు వేయించుకుని మమ్మల్నే ఓడించింది.' అని నితీశ్ పేర్కొన్నారు. తమకు అటల్ జీ, అద్వానీ అంటే అభిమానమేనని, కానీ ఇప్పుడున్న బీజేపీ పూర్తిగా వేరు అని నితీశ్ వివరించారు. ఈ నాయకులు వచ్చాక మొత్తం మారిందన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన వారిని మర్చిపోవడం తగునా? అని నితీశ్ వ్యాఖ్యానించారు. 2024లో బిహార్‌లో 34 ఎంపీ సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నితీశ్ జోస్యం చెప్పారు. మరోవైపు తాము మరోసారి జేడీయూతో పొత్తు పెట్టకోవద్దని బిహార్ బీజేపీ తీర్మానించింది. నితీశ్‌కు మరోసారి మోసం చేసే అవకాశం ఇవ్వమని చెప్పింది. చదవండి: భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. మంచులోనే రాహుల్ ప్రసంగం -
కుమారస్వామి తనయుడికి జేడీయూ అసెంబ్లీ టికెట్
రామనగర: కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కొడుకు, జేడీయూ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిఖిల్‌ను దేవెగౌడ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రామనగర స్థానం నుంచి నిలబెట్టనున్నట్లు జేడీయూ అధిష్టానం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు అభ్యరి్థని ప్రకటించిన మొదటి రాజకీయ పార్టీగా జేడీయూ నిలిచింది. కుమారస్వామి భార్య అనిత ప్రస్తుతం రామనగర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదీ చదవండి: మహా వికాస్ అఘాడీ భారీ నిరసన ర్యాలీ -
బీజేపీతో సంబంధాలపై నితీశ్‌కు పీకే ఛాలెంజ్
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒకప్పుడు మంచి మిత్రులు. ఇద్దరు జేడీయూలో కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు మాత్రం బద్దశత్రువులుగా మారారు. తరచూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నితీశ్ మహాఘట్బంధన్లో చేరినప్పటికీ ఇంకా బీజేపీతో టచ్‌లోనే ఉన్నారని పీకే ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే నితీశ్ తనదైన శైలిలో వీటిని తిప్పికొట్టారు. ఆయన పబ్లిసిటీ కోసం ఏమైనా మాట్లాడరతారని సెటైర్లు వేశారు. తాజాగా నితీశ్‌కు మరో సవాల్ విసిరారు పీకే. నిజంగా ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి జేడీయూ వైదొలిగినప్పుడు ఆయన మాత్రం ఎందుకు పదవి నుంచి తప్పుకోలేదని ట్వీట్ చేశారు. ఎప్పుడూ రెండు దారులు ఉండవు నితీశ్ జీ అంటూ సెటైర్లు వేశారు. #NitishKumar ji if you have nothing to do with BJP / NDA then ask your MP to quit the post of Deputy Chairman of Rajya Sabha. You can’t have both ways all the time. — Prashant Kishor (@PrashantKishor) October 22, 2022 నితీశ్ కుమార్ మహాఘట్బంధన్లో చేరినప్పటికీ బీజేపీకి తలుపులు తెరిచే ఉంచారని పీకే అన్నారు. రాజ్యడిప్యూటీ ఛైర్మనే అందుకు నిదర్శనమన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తానని నితీశ్ చెబుతున్నపటికీ ఆయనను నమ్మలేమని పేర్కొన్నారు. నితీశ్ 17 ఏళ్లు బిహార్ సీఎంగా ఉంటే.. అందులో 14 ఏళ్లు బీజేపీతోనే ప్రభుత్వాన్నిఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చదవండి: మత విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు సీరియస్ -
‘కులం’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ
పాట్నా: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు, బిహార్ ఎంపీ లలన్ సింగ్.. ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన తరగతికి(బీసీ) చెందిన వ్యక్తి అని అన్నారు. అయితే గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని ఈబీసీలో విలీనం చేశారని ఆరోపించారు. ఆయన డూప్లికేట్ వ్యక్తి అని తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కానీ దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రధాని ఏనాడూ నోరువిప్పలేదని ధ్వజమెత్తారు. అలాగే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని లలన్ సింగ్ ఆరోపించారు. అందుకే కుల ఆధారిత జనగణనను ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. అలా జరిగితే వాళ్ల నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తుందని బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. జేడీయూ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు లలన్ సింగ్ మాట్లాడారు. బీజేపీ కౌంటర్ అయితే లలన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడింది. లలన్ సింగ్, నితీశ్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుని, మోదీ ఫోటోతోనే గెలిచారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆ పార్టీ నేత రవి శంకర్ ప్రసాద్ అన్నారు. రాజకీయ ప్రమాణాలు దిగజారవద్దని హితవు పలికారు. చిన్న చితకా నాయకులు ఏం మాట్లాడినా తాము పట్టించుకోమని కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. చదవండి: కశ్మీరీ పండిట్లపై మళ్లీ పేలిన తూటా.. ఒకరు మృతి -
నితీశ్‌కు వయసుమీదపడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు
జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ప్రశాంత్ కిశోర్ గతంలో తనకు సలహా ఇచ్చాడని బిహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నితీశ్‌కు వయసు మీదపడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. ఏదో మాట్లాడబోయి, ఇంకేదో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. ఆయన ఇప్పుడు భ్రమలో ఉన్నారని, ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. అందుకే రాజకీయంగా ఏకాకి అయ్యాననే బాధతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. 'నితీశ్ మొదట నేను బీజేపీ కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత జేడీయూను కాంగ్రెస్‌ను విలీనం చేయమని సలహా ఇచ్చానని అంటున్నారు. ఒకవేళ నేను బీజేపీ కోసం పనిచేస్తే జేడీయూను కాంగ్రెస్‌లో విలీనం చేయమని ఎందుకు చెప్తా?. ఆ పార్టీని ఎందుకు బలోపేతం చేస్తా? ఈ రెండు ఎలా సాధ్యమవుతాయి? నితీశ్ కుమార్ చెప్పిన రెండు విషయాలకు పొంతన లేదు. మీడియాతో ఒకటి చెప్పబోయి ఇంకేదో చెబుతున్నారు. ఆయన చుట్టూ విశ్వాసపాత్రులు ఎవరూ లేరు. అందుకే భ్రమలో ఉన్నారు.' అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. చదవండి: మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలట -
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసి రాజీనామా చేసిన మంత్రి
పాట్నా: బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయం రంగంలో అవినీతిపై ప్రశ్నించారు. బీజేపీ-జేడీయూ పాలనలో జరిగినట్లే ఇప్పుడూ జరిగితే తాను సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన అగ్రికల్చర్ రోడ్ మ్యాప్ లక్ష్యాలను దారిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయామని సుధాకర్ అన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే రాజీనామా చేశారు. సుధాకర్ సింగ్ రాజీనామాను ఆయన తండ్రి, బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ధ్రువీకరించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వాళ్ల పక్షాన ఒకరు నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మండీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. 2006లో ఎన్డీఏ హయాంలో సీఎంగా నితీశ్ కుమార్ ఉన్నప్పుడే ఈ చట్టాన్ని రద్దు చేయడం గమనార్హం. సుధాకర్ సింగ్ తరచూ తన శాఖలో జరుగుతున్న అవినీతిని బహిరంగంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. అక్రమాలు జరిగితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడా రైతు సమస్యలను తీర్చలేకపోతే ఈ పదవి ఎందుకని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేశారు. చదవండి: అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా -
నా పర్యటనతో లాలూ, నితీశ్‌కు కడుపులో నొప్పి.. అమిత్ షా విమర్శలు
పాట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో ప్రధాని కావాలనే లక్ష్యంతో ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచి లాలూ ప్రసాద్ యాదవ్ ఒళ్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు. నితీశ్ తెగదెంపులు చేసుకోవడంతో బిహార్‌లో ఎన్డీఏ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చారు అమిత్ షా. రెండు రోజుల పర్యటనలో భాగంగా సరిహద్దు జిల్లా పూర్ణియాలో ర్యాలీలో ప్రసంగించారు. నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. 'నేను ఈవాళ సరిహద్దు జిల్లాల్లో పర్యటించడం చూసి లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్ కుమార్‌లకు కడుపునొప్పి వస్తోంది. వాళ్లు అశాంతి కోరుకుంటున్నారు. నేను ఇక్కుడకు వస్తే అశాంతి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు. నితీశ్ కుమార్ లాలూ ఒళ్లో కూర్చుకున్నారు. ప్రజలేం ఆందోళన చెందవద్దు. సరిహద్దు జిల్లాలు భారత్‌లో భాగమే. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మనకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఏదో ఒకరోజు ప్రధాని కావాలనే ఆశతో నితీశ్ లాలూ చెంతకు చేరారు. వాళ్లు బిహార్ ప్రజల తీర్పుకు విరుద్ధంగా ద్రోహం చేశారు. సీమాంతర ప్రజలు నితీశ్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. కూటములు మార్చి నితీశ్ ప్రధాని కాగలరా?' అని అమిత్ షా ప్రశ్నించారు. నితీశ్‌కు సీఎం పదవి ఇస్తామని ప్రధాని మోదీ మాటిచ్చినందు వల్లే బీజీపే అందుకు కట్టుబడి ఉండి ఆయనకు బాధ్యతలు అప్పగించిందని అమిత్ షా చెప్పారు. కానీ నితీశ్ మాత్రం ద్రోహం చేసి ప్లేటు పిరాయించారని దుయ్యబట్టారు. ర్యాలీ అనంతరం కిషన్‌గంజ్‌కు వెళ్తారు అమిత్ షా. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, పార్టీ కార్యాలయాల బాధ్యులతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తారు. చదవండి: అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం! -
బీజేపీ అడ్డాలో పోటీకి నితీశ్ సై.. అఖిలేశ్ యాదవ్ మద్దతు!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్. అయితే ఆ పార్టీ వర్గాల్లో మాత్రం ఓ విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో నితీశ్ కుమార్ స్వయంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఫూల్పుర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రతిపక్షనేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్.. నితీశ్ కుమార్‌కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూపీలో ఎక్కడి నుంచి పోటీ చేసినా నితీశ్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతునిస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. నితీశ్ ఫూల్పుర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగాలని జేడీయూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ కూడా ఈ విషయంపై ఇప్పటికే హింట్ ఇచ్చారు. నితీశ్ కుమార్ 2024 లోకసభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయవచ్చన్నారు. ఫూల్పుర్తో పాటు అంబేడ్కర్ నగర్, మిర్జాపూర్ లోక్‌సభ స్థానాల నుంచి కూడా ఆయనకు ఆఫర్ ఉన్నట్లు చెప్పారు. అయితే నితీశ్ పోటీ చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. 80 స్థానాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 80 ఎంపీ స్థానాలున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రాష్ట్రమే ఎంతో కీలకం. యూపీలో ప్రస్తుతం బీజేపీకి 65 మంది ఎంపీలున్నారు. అందుకే ఇక్కడ ఆ పార్టీని దెబ్బతీసేందుకు నితీశ్ వ్యూహా రచన చేస్తున్నట్లు సమాచారం. అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని ఇక్కడి నుంచి పోటీ చేస్తే బీజేపీకి 15-20 స్థానాలకే పరిమితం చేయవచ్చని లలన్ సింగ్ చెబుతున్నారు. అలబాహాద్లోని ఫూల్పుర్ నియోజకవర్గం ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. మోదీని ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్న నితీశ్.. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో ఎక్కువ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. లేకపోతే మోదీని సవాల్ చేయడం అంత సులభం కాదని అంటున్నారు. చదవండి: బీజేపీ హర్ట్ అయింది -
నితీశ్ కుమార్‌తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: బిహీర్ సీఎం నితీశ్ కుమార్‌తో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్. ఆయనతో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమే అని స్పష్టం చేశారు. కానీ ఒక్క షరతు విధించారు. నితీశ్ సర్కార్ బిహార్‌లో ఒక్క ఏడాదిలో 10 లక్షల ముందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అలా అయితేనే మహాఘట్బంధన్లో తాను కూడా చేరతానని చెప్పారు. అంతేకాదు రెండో రోజుల క్రితం నితీశ్‌తో తాను భేటీ అయినట్లు ప్రశాంత్ కిశోర్ ధ్రువీకరించారు. ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయినట్లు నితీశ్ బుధవారమే వెల్లడించారు. అయితే ఏ విషయాలపై మాట్లాడారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సాధారణంగానే సమావేశమైనట్లు పేర్కొన్నారు. వీరిద్దరి భేటీని జేడీయూ మాజీ నేత పవన్ వర్మ ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రశాంత్ కిశోర్‌తో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని, పాత స్నేహితుడే అని నితీశ్ వ్యాఖ్యానించడం మళ్లీ వీరిద్దరూ జతకడతారా? అనే ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పుడు పీకే రియాక్షన్ చూస్తుంటే ఇది వాస్తవరూపం దాల్చే సూచనలే కన్పిస్తున్నాయి. నెల రోజుల క్రితం ఏన్డీఏతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో బిహార్‌లో మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్రంలో బీజేపీని ఓడిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటను వెళ్లి కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడే పీకేతో భేటీ కావడం చూస్తుంటే.. నితీశ్ పెద్ద ప్లాన్‌తోనే ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. చదవండి: ఆ వీడియో నిజమైతే నన్ను అరెస్టు చేయండి.. బీజేపీకి సిసోడియా సవాల్ -
థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్.. 2024లో సరికొత్త చరిత్ర
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో సోమవారం నుంచి ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు బిహార్ సీఏం నితీశ్ కమార్. ఇందులో భాగంగనే బుధవారం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు మాత్రమే తాను ప్రయత్నిస్తున్నాని, ప్రధాని అభ్యర్థి కావాలనే ఆలోచన లేదని నితీశ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పారు. అందుకే అన్ని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మెయిన్ ఫ్రంట్.. తాము థర్డ్ ఫ్రంట్ కోసం కాదు మెయిన్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు నితీశ్ వ్యాఖ్యానించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలతో తాను జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏకపక్షంగా జరుగుతున్న ఎన్నికలు 2024లో భిన్నంగా ఉంటాయన్నారు. ప్రధాని మోదీకి పోటీగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారని మీడియా ప్రశ్నించగా.. నితీశ్ స్పందించారు. ప్రకటనలు, పేర్లు మార్చడం తప్ప బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నితీశ్ సన్నిహిత వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతానికి విపక్షాలను ఏకం చేయడంపైనే ఆయన దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే బీజేపీకి కలిసొచ్చిందని ఆయన భావిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారనే విషయంపై ఇప్పటివరకైతే పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ పేర్లను పరిశీలించే అవకాశాలు కన్పిస్తున్నాయి. నితీశ్ కుమార్ పేరును కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. చదవండి: భారత్ జోడో యాత్ర షురూ -
‘ప్రధాని’ ఆసక్తి లేదు: నితీశ్
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ మంగళవారం ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాంలతో భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన సోమవారం దేశ రాజధానికి చేరుకోవడం తెలిసిందే. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే వారితో సమావేశమైనట్టు అనంతరం నితీశ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై విపక్షాల సమష్టి శక్తిని చాటాల్సిన సమయం వచ్చిందన్నారు. అనంతరం సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్ యాదవ్, పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఐఎన్ఎల్డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా తదితరులను కూడా నితీశ్ కలిశారు. తనకు ప్రధాని కావాలని ఉందన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘‘ఆ పదవికి నేను పోటీదారు కాను. దానిపై నాకు ఆసక్తీ లేదు’’ అని చెప్పుకొచ్చారు. విపక్షాలన్నింటినీ ఏకం చేయడమే తమ తొలి అజెండా తప్ప ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం కాదని ఏచూరి చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది సమయం వచ్చినప్పుడు తేలుతుందన్నారు. బీజేపీపై పోరులో నితీశ్ కలిసి రావడం దేశ రాజకీయాలకు గొప్ప శుభ సంకేతమని అభిప్రాయపడ్డారు. నితీశ్, కేజ్రీవాల్ భేటీ గంటన్నర పాటు సాగింది. విద్య, వైద్యం తదితర అంశాలతో పాటు ఆపరేషన్ లోటస్, విపక్షాల ఎమ్మెల్యేల కొనుగోలు తదితరాలపై చర్చించినట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం బీజేపీపై పోరాటానికి వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని రాజా అన్నారు. సోమవారం రాహుల్‌గాంధీతోనూ నితీశ్ భేటీ కావడం తెలిసిందే. 25న ‘బల ప్రదర్శన’ ర్యాలీ నితీశ్, కేసీఆర్, మమత హాజరు! సెప్టెంబర్ 25న హరియాణాలో ఐఎన్ఎల్డీ తలపెట్టిన ర్యాలీని విపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మార్చాలని నితీశ్ భావిస్తున్నారు. దానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, అఖిలేశ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, అకాలీదళ్ నేత ప్రకాశ్‌సింగ్ బాదల్ తదితరులను ఐఎన్ఎల్డీ ఆహ్వానించింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తదితరులకు కూడా ఆహ్వానాలు పంపుతామని పేర్కొంది. ఈ ర్యాలీలో విపక్ష నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పలు అంశాలపై లోతుగా చర్చిస్తారని చెప్పుకొచ్చింది. బీజేపీతో జనం విసిగిపోయారని చౌతాలా అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా కన్పిస్తోందని చెప్పారు. -
‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’
పాట్నా: బిహార్‌లో ఎన్డీయే కూటమికి టాటా చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనతా దళ్ యునైటెడ్(జేడీయూ). రెండు రోజుల్లోనే నితీశ్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్). బిహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకేనన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో బిహార్‌లోని మొత్తం 40 పార్లమెంటరీ స్థానాల్లో జేడీయూ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. బీజేపీ ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభమైందని, భవిష్యత్తులో తిరిగి మళ్లీ అదే స్థాయికి పడిపోతుందని జోస్యం చెప్పారు. మరోవైపు.. బీజేపీకి 2024 ఎన్నికల్లో 50 సీట్లు మాత్రమే వస్తాయని శనివారం ఓ సమావేశం వేదికగా అంచనా వేశారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. విపక్ష పార్టీలు కలిసి పని చేస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశం అనంతరం మరోమారు విపక్షాల ఐక్యతపై మాట్లాడారు నితీశ్ కుమార్. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే విజయం తథ్యమన్నారు. కానీ, తాము ఎన్ని సీట్లు సాధిస్తామనేదానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదీ చదవండి: రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై రాహుల్ ఫైర్ -
‘అదే జరిగితే 2024లో పిక్చర్ వేరేలా ఉంటుంది’
పాట్నా: మణిపూర్‌లో జేడీయూకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఈ క్రమంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ప్రతిపక్షాలు ఏకమైతే 2024లో పరిస్థితులు మరోస్థాయిలో ఉంటాయన్నారు. శనివారం సాయంత్రం తలపెట్టిన జేడీయూ రాష్ట్ర ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యేందుకు మణిపుర్ జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని, అయితే, ఆకస్మికంగా ఆ మరుసటి రోజునే బీజేపీలో చేరటం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ‘ఇది రాజ్యాంగబద్ధమేనా? కొద్ది నెలల క్రితం వారంతా బిహార్‌కు వచ్చారు. బీజేపీ ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. వారు అనుసరించిన తీరు ఎలాంటిది? దానర్థం ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుంటున్నారు. ’ అని ఆరోపించారు. మరోవైపు.. జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్ సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్వభావం మరోమారు బయపడిందన్నారు. ‘వారితో మేము కలిసి ఉన్నప్పటికీ అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే చేశారు. ఇప్పుడు మేము కూటమి నుంచి బయటకి వచ్చేశాం. మరోమారు అలాగే చేశారు. 2024లోనే వారికి సరైన గుణపాఠం లభిస్తుంది. 2024 ఎన్నికలపై భయంతోనే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారు. కానీ, ప్రజలు వారిని గమనిస్తూనే ఉన్నారు. బిహార్‌లోనూ ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ’అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: నితీశ్‌కు ఊహించని షాక్.. బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు.. -
నితీశ్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకీ ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు
ఇంఫాల్: మణిపూర్‌లో మొత్తం ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. స్పీకర్ ఆమోదంతో శుక్రవారం అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తయింది. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న వారాల వ్యవధిలోనే ఈ పరిణామం జరగడం బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు షాకే అని చెప్పాలి. ఎమ్మెల్యేల చేరిక అనంతరం బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ.. నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లు జేడీయూ ముక్త్ రాష్ట్రాలుగా అవతరించాయని పేర్కొన్నారు. బిహార్ రాజధాని పాట్నాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం గమనార్హం. నితీశ్ కుమార్‌కు బీజేపీకి షాక్ ఇవ్వడం తొమ్మిదో రోజుల్లో ఇది రెండోసారి. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏకైక జేడీయూ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి కమలం గూటికి వెళ్లారు. జేపీ నడ్డా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రాష్ట్రాల్లో జేడీయూకు ఉనికి కోల్పేయే పరిస్థితి రావడం నిజంగా నితీశ్‌కు దెబ్బెే అని విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూ 7 స్థానాల్లో గెలిచింది. అయితే ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లారు. మిగిలిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆగస్టు 25న బీజేపీ గూటికి చేరారు. దీంతో రాష్ట్రంలో జేడీయూ ఖాళీ అయింది. చదవండి: ఆప్‌కు అధికారమిస్తే.. గుజరాతీలకు బంపరాఫర్ -
అందుకే సీట్లు తక్కువొచ్చినా సీఎం పదవి: నితీశ్ కుమార్
పాట్నా: బిహార్‌లో బీజేపీకి టాటా చెప్పి తన పాత స్నేహితులతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. ఈ క్రమంలో బీజేపీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నితీశ్ కుమార్ అసలు సీఎం పదవికి తగిన వ్యక్తి కాదంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో 2020లో బీజేపీతో పోలిస్తే తనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం వెనుకున్న కారణాలను బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ వేదికగా వెల్లడించారు నితీశ్ కుమార్. విపక్ష నేతలతో చేతులు కలిపి నితీశ్ ద్రోహం చేశారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ‘ 2020 ఎన్నికల్లో బీజేపీతో పోలిస్తే తక్కువ సీట్లు వచ్చినా.. నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాను. కానీ, సీఎం పదవిలో కొనసాగేందుకు నాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. నేనే ముఖ్యమంత్రినని వారు చెప్పారు. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పాను. మీరు ఎక్కువ సీట్లు గెలిచారు.. మీ పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఉండాలని సూచించాను. చివరకు అంగీకరించాను. కానీ, ఆ పదవిని ఒత్తిడిలో చేపట్టాను. నంద్ కిషోర్ యాదవ్‌ను స్పీకర్‌గా చేస్తారని నాకు చెప్పారు. పాత మిత్రుడని.. బావుంటుందని చెప్పాను. కానీ, అతను కాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఓ వ్యక్తిని కింది స్థాయి నుంచి తీసుకొచ్చి కేంద్రంలోకి పంపిస్తే నాకే ద్రోహం చేశాడు.’ అని పేర్కొన్నారు నితీశ్. ముఖ్యమంత్రి రేసులో ఉన్న బీజేపీ నేతలు సుశీల్ కుమార్ మోదీ, ప్రేమ్ కుమార్ పేర్లను సైతం వెల్లడించారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటంపై బీజేపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు నితీశ్ కుమార్. 2017లో ఆర్జేడీని వీడి బీజేపీతో చేతులు కలిపిన అంశాన్ని లేవనెత్తుతూ విమర్శలు చేయటంపై స్పష్టత ఇచ్చారు. ‘2017లో వారి నుంచి విడిపోయాను. మీరు చాలా ఆరోపణలు చేశారు. కానీ ఐదేళ్ల గడిచినా వారికి వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదు.’ అని స్పష్టం చేశారు నితీశ్. ఇదీ చదవండి: Bihar Floor Test: బల పరీక్షలో నెగ్గిన నితీష్ ప్రభుత్వం.. బీజేపీపై అటాక్ -
బిహార్ సీఎం పై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్ పై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ ఎంపీగా పదివి చేపట్టక మునుపు తాను బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిస్తున్న సమయంలో జేడీయు నాయకులు తన వద్దకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టారని అన్నారు. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లితే మీరు ముఖ్యమంత్రి అవుతారంటూ అదే జేడీయే నాయకులు ఒక పథకంతో తనను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే నితీష్ కుమార్ తనకు ఆ ఉద్దేశం లేదని కొట్టిపారేశారు. కేవలం తాను బీజేపీ వ్యూహం నుంచి తన పార్టీని రక్షించుకునే నిమిత్తం ఇలా చేశానని చెప్పుకొచ్చారు. పైగా తాను గత నెలన్నర కాలం నుంచి మీడియాకి దూరంగా ఉన్నానని అన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ నితీష్ ఈ రోజు బీజేపీ ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. బిహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని చూసి నమ్మి ఓటు వేస్తే ఇలా వెన్నుపోటు పొడిచే రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు. తాను ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో ఉన్న కొత్త బిహార్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తానంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లోపే ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. అయినా నితీష్ కుమార్ మహారాష్ట్రలా బిహార్ అవుతుందని భయపడ్డానని చెబుతున్నారు. కానీ బీజేపీ ఏమీ శివసేనను విభజించడానికి ప్రయత్నించలేదని చెప్పారు. అంతేకాదు లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని ఆర్జేడియూని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఐతే ఈ విషయమే జేడీయూ లేదా ఆర్జేడియూ ఇంకా స్పందించలేదు. (చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి) -
బీజేపీకి బైబై.. ఆర్జేడీతో నితీశ్ దోస్తీ..
పట్నా: హై వోల్టేజీ రాజకీయ డ్రామాకు బిహార్ వేదికగా మారింది. ఊహించినట్టుగానే జనతాదళ్(యునైటెడ్) చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ (71) బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమితో ఐదేళ్ల సంకీర్ణ బంధానికి గుడ్‌బై చెప్పారు. మహారాష్ట్ర మార్కు వ్యూహంతో తన సీఎం పీఠానికి బీజేపీ ఎసరు పెడుతోందన్న అనుమానంతో తానే ముందుగా చకచకా పావులు కదిపారు. సీఎం పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలో రెండేళ్ల బీజేపీ–జేడీ(యూ) సంకీర్ణ పాలనకు తెర దించడమే గాక వెనువెంటనే ఆర్జేడీ నేతృత్వంలోని మహా ఘట్బంధన్లో చేరి మళ్లీ సీఎం పీఠమెక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు! బుధవారం మధ్యాహ్నం రెండింటికి రాజ్‌భవన్‌లో సాదాసీదాగా జరిగే కార్యక్రమంలో సీఎంగా నితీశ్ మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. కొత్త మంత్రివర్గంలో జేడీ(యూ), ఆర్జేడీతో పాటు కాంగ్రెస్‌కు కూడా స్థానం దక్కుతుందని చెబుతున్నారు. వామపక్షాలు బయటినుంచి మద్దతిస్తాయని తెలుస్తోంది. బిహార్ సీఎం పదవి చేపట్టనుండటం నితీశ్‌కు ఇది ఏకంగా ఎనిమిదోసారి కావడం విశేషం! కాగా బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం గత తొమ్మిదేళ్లలో ఇది రెండోసారి. ఈ పరిణామాలపై బీజేపీ మండిపడగా కాంగ్రెస్ తదితర విపక్షాలు హర్షం వెలిబుచ్చాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ ప్రజలిచ్చిన తీర్పును నితీశ్ అపహాస్యం చేశారంటూ బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ దుయ్యబట్టారు. ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నారు. తాను పల్టూ రామ్ (పార్టీలు మార్చే వ్యక్తి)నని నితీశ్ మరోసారి రుజువు చేసుకున్నారని కేంద్ర మంత్రి అశ్వనీ చౌబే విమర్శించారు. ఆయన అహంకారంతో మిడిసిపడుతున్నారన్నారు. జేడీ(యూ)కు బిహార్‌లో బీజేపీ కంటే తక్కువ సీట్లున్నా సంకీర్ణ ధర్మాన్ని గౌరవిస్తూ నితీశ్‌ను సీఎంను చేశామని గుర్తు చేశారు. లౌకిక శక్తులను బలోపేతం చేసేందుకే బిహార్‌లో నితీశ్‌కు మద్దతిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో మెజారిటీకి 122 స్థానాలు అవసరం. జేడీ(యూ)కు 45, ఆర్జేడీకి 79 మంది, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 77 మంది ఉన్నారు. బిహార్‌లో మంగళవారం రోజంతా ఏం జరిగిందంటే... ఉదయం 11 : నితీశ్ నివాసంలో జేడీ(యూ) ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ. మధ్యాహ్నం 1 : మహా ఘట్బంధన్ నేతల భేటీ. నితీశ్‌కు మద్దతు లేఖపై ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ తదితర పార్టీల ఎమ్మెల్యేల సంతకం. మధ్యాహ్నం 2 : మళ్లీ జేడీ(యూ) భేటీ. కొత్త సంకీర్ణానికి ఎమ్మెల్యేల మద్దతు. సాయంత్రం 4 : ‘ఎన్డీఏ’ సీఎం పదవికి రాజీనామా లేఖ గవర్నర్‌కు అందజేత 4.45 : రబ్రీ నివాసంలో తేజస్వి, ఇతర నేతలతో నితీశ్ మంతనాలు. 5.20 : నేతలందరితో కలిసి రాజ్‌భవన్ బయల్దేరిన నితీశ్. 6:00 : 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ గవర్నర్‌కు సమర్పణ. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి. రోజంతా రాజకీయ వేడి బిహార్‌లో జేడీ(యూ), బీజేపీ సంబంధాలు చాలాకాలంగా క్షీణిస్తూ వస్తున్నాయి. బీజేపీ ఆధిపత్య ధోరణిపై నితీశ్ చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. దాంతో ఎన్డీఏతో ఆయన మరోసారి తెగదెంపులు చేసుకోవడం ఖాయమంటూ కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం జేడీ(యూ) సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తదితరులతో నితీశ్ భేటీ అయ్యారు. సంకీర్ణ ధర్మానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. తమకు వెన్నుపోటు పొడవాలని చూస్తోందంటూ ధ్వజమెత్తారు. జేడీ(యూ) సీనియర్ నేత ఆర్సీపీ సింగ్ ద్వారా పార్టీలో తిరుగుబాటుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. భేటీ నుంచి నితీశ్ నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా లేఖ ఇచ్చారు. ‘‘ఎన్డీఏ సంకీర్ణాన్ని వీడాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ‘ఎన్డీఏ’సీఎం పదవికి రాజీనామా చేశా’నని మీడియాకు చెప్పి వెనుదిరిగారు. అనంతరం శరవేగంగా పావులు కదిపారు. తేజస్వీ తల్లి, మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో ఆర్జేడీ తేజస్వీ యాదవ్‌తో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, హిందూస్తానీ అవామ్ మోర్చా నాయకుడు జితన్‌రాం మాంఝీ తదితర మహా ఘట్బంధన్ నేతలతో అరగంట పాటు మంతనాలు జరిపారు. వారందరితో కలిసి గంటసేపటికే మరోసారి గవర్నర్‌ను కలిశారు. ఏడు పార్టీలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కూడిన మహా ఘట్బంధన్ తమ నేతగా తనను ఎన్నుకుందని వివరించారు. కనుక ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త సంకీర్ణానికి అవకాశమివ్వాల్సిందిగా కోరారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను అందజేసినట్టు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నితీశ్ చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ముఖ్య నేత రాహుల్‌గాంధీలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. తనకు మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోకెల్లా అత్యంత అనుభవజ్ఞుడైన సీఎంగా నితీశ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ తేజస్వీ కొనియాడారు. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలే నితీశ్ తాజా నిర్ణయానికి ప్రధాన కారణమని సీపీఎంఎల్ఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అంతకుముందు తేజస్వి తదితరులతో రబ్రీ నివాసంలో నితీశ్ మంతనాలు జరుపుతుండగానే ‘మహా ఘట్బంధన్ సీఎంగా నితీశ్‌కు శుభాకాంక్షలు’అంటూ జేడీ(యూ) సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహా ట్వీట్ చేశారు! చదవండి: మాది సంకీర్ణ ధర్మం- నితీశ్దేమో..: బీజేపీ -
కలహాల కాపురానికి ఫుల్స్టాప్: నితీశ్ చాణక్యం
జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ (71) దేశ రాజకీయాల్లో మరోసారి కలకలం సృష్టించారు. ఎన్డీఏతో కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టడమే గాక బిహార్‌లో రెండేళ్ల క్రితం బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలువునా కూల్చేసి ఆ పార్టీకి గట్టి షాకే ఇచ్చారు. అదే వేగంతో ఆర్జేడీ సారథ్యంలోని మహా ఘట్బంధన్ కూటమిలో చేరి సీఎం పీఠాన్ని కాపాడుకున్నారు. రాజకీయ భాగస్వాములను, తద్వారా ప్రభుత్వాలను మంచినీళ్లప్రాయంగా మార్చడంలో తనకు తానే సాటి అని మరోసారి రుజువు చేసుకున్నారు. ఒకవైపు ఒక్కో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను బీజేపీ పథకం ప్రకారం వరుసబెట్టి కూలుస్తూ వస్తుంటే, బిహార్‌లో ఆ పార్టీనే అధికారానికి దూరం చేసి ఔరా అన్పించారు. అంతటితో ఆగలేదు. మహారాష్ట్రలో మాదిరిగా జేడీ(యూ) అసమ్మతి నేత ఆర్సీపీ సింగ్ సాయంతో పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని గట్టి ఆరోపణలు చేసి కాషాయ పార్టీని ఒకవిధంగా ఆత్మరక్షణలో పడేశారు. అందుకే ఎన్డీఏను వీడాల్సి వచ్చిందంటూ తన చర్యను సమర్థించుకున్నారు. నిజానికి బిహార్‌లో బీజేపీ ఇలాంటి ప్రయత్నం చేస్తోందని కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది కూడా. దాంతో రంగంలోకి దిగిన నితీశ్ బీజేపీ కంటే ముందు తనే పావులు కదిపి అధికార పీఠాన్ని కాపాడుకున్నారు. తద్వారా ఒక సిద్ధాంతమంటూ లేని రాజకీయ అవకాశవాదిగా ఆయనపై ఉన్న ముద్రకు మరింత బలం చేకూరింన్నది పరిశీలకుల అభిప్రాయం. కాకపోతే నానా రకాలుగా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల ఉసురు తీస్తూ వస్తున్న బీజేపీనే దెబ్బ కొట్టిన హీరోగా కూడా నిలిచారని వారంటున్నారు. వెన్నతో పెట్టిన విద్యే పార్టీలను, కూటములను మార్చడం నితీశ్‌కు కొత్తేమీ కాదు. గత తొమ్మిదేళ్లలో ఆయన ఎన్డీఏకు దూరమవడం ఇది రెండోసారి. బీజేపీ–జేడీ(యూ) 2005లోనే బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. 2010లో బంపర్ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. కానీ నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుంచి 2013లో నితీశ్ తొలిసారి వైదొలిగారు. తర్వాత 2014లో లోక్‌సభ ఎన్నికల పరాజయానికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహా ఘట్‌బంధన్‌తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అవినీతిని, అధికార లాలసను భరించలేనంటూ 2017లో ఘట్బంధన్కు గుడ్‌బై చెప్పి మళ్లీ ఎన్డీఏతో జట్టు కట్టి సీఎంగా కొనసాగారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేశారు. రాష్ట్రంలో 40 లోక్‌సభ సీట్లకు గాను ఎన్డీఏ ఏకంగా 39 సీట్లు కొల్లగొట్టింది. బీజేపీకి 17, జేడీ(యూ)కు 16, మరో భాగస్వామి ఎల్జేపీకి 6 సీట్లొచ్చాయి. కానీ ఎక్కువ ఎమ్మెల్యేల బలంతో ఎన్డీఏ సంకీర్ణంలో ఎప్పుడూ పెద్దన్నగానే ఉన్న జేడీ(యూ) గత పదేళ్లుగా క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు రాగా జేడీ(యూ) 43 స్థానాలకు పరిమితమైంది. అయినా ముందే ప్రకటించినట్టుగా నితీశ్‌నే సీఎంగా బీజేపీ కొనసాగించింది. కానీ పాలనలో పదేపదే వేలు పెడుతూ తనను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నితీశ్ అసంతృప్తికి లోనయ్యారు. దీనికితోడు జేడీ(యూ) ఉనికినే దెబ్బ తీసేందుకు కాషాయ పెద్దలు పథక రచన చేస్తున్నారన్న వార్తలు ఆయన్ను మరింతగా చికాకు పరిచాయి. మహారాష్ట్రలో శివసేన అసంతృప్త నేత ఏక్నాథ్ షిండే సాయంతో ఆ పార్టీ పుట్టి ముంచిన వ్యూహాన్నే తమపైనా బీజేపీ ప్రయోగించనుందని నితీశ్ అనుమానించారు. అందులో భాగంగా జేడీ(యూ) అసంతృప్త నేత ఆర్సీపీ సింగ్ పార్టీలో తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆయన్ను కలవరపరిచాయి. నిజానికి ఆర్సీపీ సింగ్‌తో నితీశ్‌కు చాలాకాలంగా ఉప్పూనిప్పుగానే ఉంది. నితీశ్ అంగీకారం లేకుండానే సింగ్‌కు బీజేపీ కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. ఆ కారణంగానే ఇటీవల సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసినప్పుడు నితీశ్ మళ్లీ అవకాశమివ్వలేదు. దాంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆపై తన మద్దతుదారులతో కలిసి తిరుగుబాటు ప్రయత్నాలను సింగ్ వేగవంతం చేశారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ మరోసారి బీజేపీకి చెయ్యిచ్చి మహా ఘట్బంధన్ గూటికి చేరారు. ఒక్క దెబ్బతో ఇటు తిరుగుబాటు వార్తలకు చెక్ పెట్టడమే గాక బీజేపీకి కూడా షాకిచ్చారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
పిల్లిమొగ్గల రాజకీయం
అనుమానిస్తున్నంతా అయింది. కొద్ది నెలలుగా బీజేపీ పెద్దలతో ఎడముఖం, పెడముఖంగా ఉన్న జనతాదళ్ – యునైటెడ్ (జేడీ–యూ) అధినేత నితీశ్ కుమార్ కాషాయపార్టీతో తెగతెంపులు చేసుకొని, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుంచి మంగళవారం బయటకు వచ్చేశారు. బీహార్ సీఎం పదవికి రాజీనామా ఇచ్చారు. బీజేపీ వినా రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ సహా 7 పార్టీల ‘మహా గఠ్బంధన్ 2.0’తో కొత్త సర్కారు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 2010 నవంబర్ నుంచి ఇప్పటికి 22 ఏళ్ళలో రకరకాల పొత్తులతో, ఏకంగా 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధపడుతూ, కొత్త రికార్డు సృష్టించారు. రాజకీయ వ్యూహాలు, అధికార ఆకాంక్షల నడుమ విలువలకై వెతుకులాడితే వృథాప్రయాసని సామాన్య ఓటర్లకు చెప్పకనే చెప్పారు. పార్టీల తేడా లేకుండా బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ... ఇలా అన్నీ నితీశ్‌ను ఏదో ఒక సందర్భంలో దుయ్యబట్టినవే. పదేపదే అదే బీహారీ బాబుతో చేయి కలిపి, చంకనెక్కించుకున్నవే. ఇన్నిసార్లు దోస్తీలు మార్చి, రాజకీయ ఊసరవెల్లిగా అధికార పీఠాన్ని అట్టిపెట్టుకోవడం నితీశ్ చేసిన విచిత్ర విన్యాసం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులంటూ ఎవరూ ఉండరనే సూత్రాన్ని నితీశ్ ఆపోశన పట్టారు. అసలు సోషలిస్టు సిద్ధాంత నేపథ్యం నుంచి పైకొచ్చిన నితీశ్ ఏ సైద్ధాంతికతతో ఒకప్పుడు బీజేపీకి దగ్గరయ్యారన్నది ఆశ్చర్యమే. ఆ పైన 2013లోనే మోదీ మతతత్వాన్ని వ్యతిరేకించి, 17 ఏళ్ళ బంధాన్ని తెంపుకొని ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన ఆయన తర్వాత మళ్ళీ ఏ విలువల కోసం అదే నాయకుడితో అంటకాగారో అర్థం కాదు. తీరా ఇప్పుడు బలహీనపడుతున్న తన సొంత పార్టీ పునాదులు, లోలోపలి జాతీయ రాజకీయ ఆకాంక్షలతో ఆయన బీజేపీతో దోస్తీకి రామ్ రామ్ చెప్పడమూ భవిష్యత్ అవసరాల కోసం చేసిన రాజకీయమే. బీహార్ రాజకీయాల్లో ‘పల్టీ మాస్టర్’గా పేరు పడ్డ నితీశ్ వేసిన రాజకీయ పిల్లిమొగ్గలు అన్నీ ఇన్నీ కావు. 1994లో లూలూ ప్రసాద్‌తో విభేదించి, జనతాదళ్ నుంచి బయటకొచ్చి, సమతా పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఎన్డీఏతో దోస్తీ కట్టారు. 2013లో మోదీ మతతత్త్వ రాజకీయాల్ని నిరసిస్తూ మహా గఠ్బంధన్తో కలిశారు. 2017లో ఆర్జేడీ అవినీతిమయమైందంటూ గఠ్బంధన్ను వదిలి మళ్ళీ ఎన్డీఏ పంచన చేరారు. ఇప్పుడేమో మళ్ళీ ‘మహా గఠ్బంధన్ 2.0’తో పాతవాళ్ళనే అక్కున చేర్చుకున్నారు. పాట్నాలో ఒకరికొకరు కూతవేటు దూరంలో నివసించే నితీశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పుడు మరింత సన్నిహితం కానున్నారు. పరస్పరం అనుమానించుకుంటూ, తీవ్రంగా దూషించుకొన్న జేడీ(యూ), ఆర్జేడీలు ‘గతం గతః’ అనుకుంటూ, గాఢాలింగనం చేసుకోవడం రాజకీయ వైచిత్రి. ఎనభై ఏళ్ళ క్రితం సరిగ్గా ‘క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన రోజునే తీసుకున్న ఈ మహత్తర నిర్ణయం దేశానికి నూతన ఉషోదయమ’ని తేజస్వి ఉవాచ. దేశం మాటేమో కానీ, అధికారం కోసం ముఖం వాచి, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా, హోం మంత్రిగా బాధ్యత, సోదరుడికి మరో మంత్రి పదవి... ఇన్నీ ఆశిస్తున్న తేజస్వి అండ్ పార్టీకి ఈ పొత్తుపొడుపు కొత్త పొద్దుపొడుపే. పెద్దన్న లాంటి లాలూతో కలసి నడిచిన నితీశ్... ఇది లాలూ వారసులకిస్తున్న రాజకీయ కానుక. గతంలో నితీశ్ తమను వదిలి బీజేపీ చేయందుకున్నప్పుడు ఆర్జేడీ ఆయనను నిందించింది. ఇప్పుడు అచ్చంగా అవే విమర్శలు బీజేపీ నోట వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కలసి పోటీ చేసి, అధికారంలోకి వచ్చాక పొత్తుధర్మాన్ని విస్మరించి అర్ధంతరంగా వదిలేసిన నితీశ్ వల్ల బాధితులమనీ, రాజకీయ అమరులమనీ రాబోయే ఎన్నికల్లో చెప్పుకోవాలనీ బీజేపీ భావిస్తోంది. కలసి గెలిచినప్పటికీ కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి పదవితో సరిపెట్టి అవమానించడమే కాక, తమను బలహీనపరిచేందుకు కాషాయపార్టీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నందుకే బయటకు రావాల్సి వచ్చిందని జేడీ (యూ) వాదిస్తోంది. పంజాబ్, మహారాష్ట్ర మొదలు ఇప్పుడు బీహార్ దాకా కూటమి మిత్రులను బీజేపీ ఎప్పుడూ బలహీనపరుస్తూనే వస్తోందని జేడీ–యూ పాత కథల పట్టిక చూపిస్తోంది. నిజానికి, నితిన్ గతంలో ఇవే తన ఆఖరి ఎన్నికలన్నారు. తీరా ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశారు. ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆశలను నెరవేర్చుకోవడానికి ఇదే మంచి సమయమని అనుకుంటున్నారు. లెక్కప్రకారం జాతీయ ఎన్నికలు 2024లో, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరగాలి. ఇప్పటి దాకా తన కైవసం చేసుకోలేకపోయిన బీహార్ విషయంలో బీజేపీకి రాబోయేది పెద్ద పరీక్ష. ‘మండల్ వర్సెస్ కమండల్’ పోరాటానికి బహుశా రానున్న బీహార్ ఎన్నికలే రణక్షేత్రం కావచ్చు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 4 శాతం ఉన్న దళిత పాశ్వాన్లు, వారి నేతగా రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడైన చిరాగ్ కీలకం కానున్నారు. వారిని బీజేపీ చేరదీస్తుందని ఓ అంచనా. మరి ఏ ఎన్నికలకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడైన నితీశ్ ఎలాంటి వ్యూహం వేస్తారో చూడాలి. ఇప్పటికైతే బీజేపీని ఎదురుదెబ్బ తీసి, నితీశ్ తమ వైపు రావడం ప్రతిపక్షాలకు ఒకింత ఉత్సాహజనకమే. కానీ, దానివల్ల కలిసొచ్చేది ఎంత? ఇప్పటికే ఉన్న సోనియా పరివారం, మమత, కేజ్రీవాల్‌ల సరసన పీఎం పదవికి నితిన్ రేసులో నిలుస్తారు. ఏక కేంద్రక బీజేపీకి దాని వల్ల మరింత లాభం. ఏమైనా, రెండేళ్ళలో రానున్న జాతీయ ఎన్నికల ఆట రంజుగా మారింది. కానీ, రాజకీయాలంటే వట్టి అంకగణితమే కాదు... పొత్తులోని పార్టీల మధ్య కెమిస్ట్రీ, ప్రజల్లో ఆ పార్టీల విశ్వసనీయత. క్రమంగా విశ్వసనీయత క్షీణిస్తూ, ఢిల్లీ వైపు చూస్తున్న నితీశ్జీకి ఆ సంగతి తెలీదంటారా?