పాట్నా: బీహార్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ను వీడి సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్‌పై కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరితో వివాహం.. మరొకరితో సంబంధం కలిగి ఉండటం నితీష్‌కి బాగా అలవాటుగా మారిందని విమర్శించారు.
"ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకరితో వివాహం మరొకరితో సంబంధం. ఇది నితీష్ కుమార్ స్వభావంగా మారింది" అని ట్వీట్టర్‌లో కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ పేర్కొన్నారు.
నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్‌బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. మళ్లీ మహా కూటమిని విడిచి ఎన్డీఏ కూటమిలో చేరారు.
ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్
Comments
Please login to add a commentAdd a comment