nitish kumar
-
నువ్వు కూర్చో.. పార్టీ మీ ఆయనది
పట్నా: బిహార్ శాసన మండలిలో మంగళవారం సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీదేవి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్సీలు పచ్చ రంగు బ్యాడ్జీలు ధరించి సభలోకి రావడం, ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో సీఎం నితీశ్ కోపంతో ఊగిపోయారు. ఎమ్మెల్సీల బ్యాడ్జీలను మీడియాకు చూపుతూ ఆయన..ఇలాంటివి ఆర్జేడీలోనే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు.ఆ పార్టీ నేత, మాజీ సీఎం రబ్డీదేవి జోక్యం చేసుకునేందుకు యత్నించగా నితీశ్ బిహారీ యాసలో..‘నువ్వు కూర్చో..నీకేమీ తెలియదు. ఆర్జేడీ నీదికాదు, నీ భర్తది. ఈ విషయంలో నీ జోక్యం వద్దు’అంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగక.. ‘ఈమెకు ఏమీ తెలియదు. కష్టాల్లో చిక్కుకు న్నప్పుడు భర్త(లాలూ)ఈమెను సీఎంను చేశాడు’అని పేర్కొన్నారు. 1997లో సీఎంగా ఉన్న లాలు ప్రసాద్ దాణా కుంభకోణంలో ఇరుక్కుని, సీఎం కుర్చీపై భార్య రబ్డీని కూర్చోబెట్టడం తెల్సిందే.ఇటీవలి కాలంలో రబ్డీదేవి, నితీశ్ మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతోంది. గంజాయి మత్తులో సభకు వచ్చిన సీఎం నితీశ్, నాతోపాటు మహిళలను సైతం అవమానిస్తూ మాట్లాడారు’అంటూ రబ్డీదేవి ఆరో పించారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన నితీశ్ జాతీయ గీతాలాపనను పట్టించుకోకుండా పక్కనున్న వారి తో సరదాగా మాట్లాడుతూ కన్పించడంతో ‘మానసికంగా అనర్హుడు’ అంటూ రబ్డీదేవి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. -
Bihar: ఆగని పోస్టర్ వార్.. సీఎం నితీష్ టార్గెట్
పట్నా: రాబోయే అక్టోబర్-నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజాగా వివిధ రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందులు నిర్వహించాయి. ఈ విందులలోనూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా బీహార్‌లో పోస్టర్ వార్ జరుగుతోంది. పోస్టర్ల రూపంలో అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ మహిళా నేత రబ్రీ దేవి(Rabri Devi) నివాసం వెలుపల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుంటూ పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లో ‘నువ్వు మోసగాడివి, హామీ ఇచ్చిన తరువాత ఎన్ఆర్సీ అన్నావు. మేము నీకు మద్దతు ఇవ్వబోము’ అని రాసి ఉంది. తాము నితీష్‌కు మద్దతు ఇవ్వబోమని వక్ఫ్ ఈ పోస్టర్లో స్పష్టం చేసింది. దీనికి ముందు కూడా పలు పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇటీవల లాలూ యాదవ్ నివాసం వెలుపల ఒక పోస్టర్ కనిపించింది. ఆ పోస్టర్లో ‘నేను తగ్గేదే లే.. టైగర్ ఇంకా బతికే ఉంది’ అని రాసి ఉంది. ఈ పోస్టర్‌ను ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో లాలూ యాదవ్,మీసా భారతికి ఈడీ నోటీసులు పంపినప్పుడు ఏర్పాటు చేశారు. నాడు ఈడీ విచారణకు లాలూ యాదవ్ తన కుమార్తె మిసా భారతితో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దీనిపై లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ స్పందిస్తూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారి యంత్రాంగాన్ని తమపై ప్రయోగిస్తోందని ఆరోపించారు. #WATCH | Patna, Bihar: Posters targeting Chief Minister Nitish Kumar on Waqf and NRC installed outside the residence of former CM and RJD leader Rabri Devi pic.twitter.com/rOZT9HQFLe— ANI (@ANI) March 25, 2025లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) 2004 నుండి 2009 వరకు యూపీఏ- 1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ కాలంలో రైల్వేలలో గ్రూప్ డీ నియామకాలు జరిగాయి. ఈ నియామకంలో లాలూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. లాలూ యాదవ్ ఉద్యోగాలు కల్పించినందుకు ప్రతిగా భూమిని లంచంగా తీసుకున్నారనే వాదన వినిపించింది. ఈడీ ఛార్జిషీట్ ప్రకారం లాలూ కుటుంబానికి ఏడు చోట్ల భూమి ఉంది. ఇండియా టీవీ కథనం ప్రకారం వీరి కుటుంబంపై రూ.600 కోట్ల మేరకు మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ సందర్భంగా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని తేలింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుటుంబంలోని ఇతర సభ్యులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రకటన జారీ చేయకుండానే, రైల్వేలలో గ్రూప్ డి ఉద్యోగాలలో పలువురిని నియమించారనే ఆరోపణలున్నాయి. ఇది కూడా చదవండి: నాడు శివసేన-బీజేపీకి అందుకే చెడింది: ఫడ్నవీస్ -
‘నాయక్ నహీ.. ఖల్నాయక్ హూ మై’.. రబ్రీ ఇంటి ముందు సీఎం నితీష్ పోస్టర్
పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడు నెలలకు పైగా సమయం ఉంది. అయితే రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. కొన్ని రోజుల క్రితం సీఎం నితీష్ కుమార్ వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మౌనంగా ఉండకుండా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ఆర్జేడీ నేతలు సీఎం నితీష్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. #WATCH | Bihar: Amid CM Nitish Kumar's National Anthem controversy, a poster targeting the Chief Minister comes up outside the residence of former Chief Minister and RJD leader Rabri Devi in Patna. The poster addresses him as "The Non Serious Chief Minister." pic.twitter.com/t6I5Sr1PPh— ANI (@ANI) March 23, 2025ఇప్పుడు పట్నాలోని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి ఇంటి వెలుపల సీఎం నితీష్‌కు సంబంధించి ఒక పోస్టర్ ప్రత్యక్షమైంది. ఈ పోస్టర్లో నితీష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రాశారు. ఈ పోస్టర్లో ‘నాయక్ నహీ.. ఖల్నాయక్ హూ మై’(నేను హీరోని కాదు విలన్‌ను’ అని రాసి ఉంది. అలాగే ఈ పోస్టర్లో నితీష్ కుమార్ మహిళలను, మహాత్మా గాంధీని, జాతీయ గీతాన్ని అవమానించారని కూడా ఆరోపించారు.ఇటీవల వెలుగు చూసిన సీఎం నితీష్ కుమార్ వీడియోను దృష్టిలో పెట్టుకుని శాసనసభ, శాసన మండలిలో ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రి జాతీయ గీతాన్ని అవమానించారంటూ గందరగోళం సృష్టించాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీరు దేశంలోని ప్రజల మనోభావాలను అపహాస్యం చేసినట్లుందని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అసెంబ్లీలో విమర్శించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
రికార్డింగ్ డ్యాన్సర్‌కు ముద్దు.. బూతు పాటతో ఎమ్మెల్యే రచ్చ
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్‌పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు. అలాంటిది ఒక ప్రజాప్రతినిధే బహిరంగంగా అశ్లీల నృత్యాలను ప్రొత్సహించడం.. అందునా ఆయనే అసభ్యంగా ప్రవర్తించడం.. పైగా వేదిక మీదే బూతు పాట పాడడంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని పలువురు నెట్టింట ప్రశ్నలు గుప్పిస్తున్నారు.బీహార్ జనతా దల్(యునైటెడ్) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భగల్పూర్ జిల్లా నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.వేదిక మీద ఉన్న నృత్యకారిణి దగ్గరకు వెళ్లి.. ఆమె పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కరెన్సీ నోటును ఆమె చెంపకు అతికించాడు. అక్కడితో ఆగకుండా.. నేను డ్యాన్స్ మాత్రమే చేయలేదు.. ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నా అంటూ మైకులో ప్రకటించారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. రాత్రి సయమంలో జరిగిన వేడుకల్లోనూ ఆయన పాల్గొన్నారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో చిందులేశారు. ఆపై మైక్ అందుకుని బూతు పాటలు పాడి అక్కడున్నవాళ్లను హుషారెత్తించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆర్జేడీ భగ్గుమంది. ఇలాంటి వాళ్లపై కేసులు నమోదు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులపై కూడా న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేయాలని పలువురు కోరుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.होली मिलन समारोह में जदयू विधायक गोपाल मंडल ने महिला डांसर के गाल पर नोट चिपकाया और साथ में मंच पर लगाए ठुमके।#Gopalmandal #Bihar #BiharNews #Bhagalpur #Holi2025 pic.twitter.com/ZBNs32uQz1— FirstBiharJharkhand (@firstbiharnews) March 10, 2025JDU विधायक गोपाल मंडल#gopalmandal @Jduonline @RJDforIndia #BiharNews #bhagalpur pic.twitter.com/1nikGeTmWV— Shri Dhiraj Sharma (Journalist) (@ShriDhiraj) March 11, 2025గోపాల్ మండల్ వార్తల్లోకి ఎక్కడం తొలిసారేం కాదు. గతంలో ఆయన అండర్వేర్పై రైలులో తిరిగి వైరల్ అయ్యారు. కొందరు ప్రయాణికులు ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ టైంలోనూ ఆయనపై విమర్శలు రాగా.. కంపార్ట్మెంట్లో మహిళలు లేరని, బాత్రూం వెళ్లాల్సి రావడంతో అలా వెళ్లానని అప్పుడు తన చర్యను సమర్థించుకున్నారాయన. -
సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?
పాట్నా: ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జేడీయూ ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉంది. ‘నేను గొప్ప అంటే నేను గొప్పు’ అనే రీతిలో వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. అటు అసెంబ్లీ మొదలుకొని ఇటు మీడియా ముందు కూడా వీరి ఎక్కడా తగ్గడం లేదు.ఈ రోజు(ఆదివారం) జరిగిన ప్రెస్ మీట్ లో సైతం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై తనదైన శైలిలో రెచ్చిపోయారు. ‘ మీరు నితీష్ ను మీ పాలిటికల్ క్యాంప్ లోకి తీసుకునేందుకు ఏదో ఆఫర్ చేశారంట కదా’ అంటూ తేజస్వీ యాదవ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దానికి అంతే స్ట్రాంగ్ బదులిచ్చిన తేజస్వీ యాదవ్.. ‘ అదంతా నాన్సెస్. అయినా మీకు ఇటువంటి ఐడియాలు ఎవరిస్తారు. మేముందుకు ఆయన్ను ఆహ్వానిస్తాం. ఆఫర్, గీఫర్ ఏం లేదు. అటువంటి నాన్సెస్ గురించి మాట్లాడకండి. మీ పార్టీ నుంచి ఎవరికైనా ఆఫర్ చేస్తే.. అది నేను కానీ, మా తండ్రి(లాలూ ప్రసాద్ యాదవ్) లు మాత్రమే చేస్తాం. మేం ఎవరికీ ఎటువంటి ఆఫర్ చేయలేదు’ అని బదులిచ్చారు తేజస్వీ యాదవ్.2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్బంధన్ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్ చెప్పి మళ్లీ మహాఘట్బంధన్లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్ జట్టు కట్టారు.రెండుసార్లు సీఎంను చేశా.. అది మరిచిపోకండిమీ నాన్నను అడుగు.. నేనేం చేశానో? -
రెండుసార్లు మిమ్మల్ని సీఎంను చేశా.. అది మర్చిపోకండి
తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) రాజకీయాల్లో ఎదిగారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. తన వల్లే జేడీయూ ఇవాళ మనుగడలో ఉందని.. నితీశ్ రెండుసార్లు సీఎం కాగలిగారని లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు..తన వల్లే లాలూ సీఎం కాగలిగారని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. కానీ, ఒకసారి ఆయన గతం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన(నితీశ్) కంటే ముందే నా తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా నెగ్గారు. ఎంతో మందిని ప్రధానులుగా చేయడంలో నా తండ్రిదే కీలక పాత్ర. అంతేకాదు..నితీశ్ కుమార్ రెండుసార్లు సీఎం కావడంలో నేను ముఖ్యపాత్ర పోషించా. ఆయన పార్టీని కాపాడా.. ఈ సంగతులేవీ మరిచిపోవద్దు ’’ అని పాట్నాలో జరిగిన ఓ ర్యాలీలో నితీశ్‌ను ఉద్దేశించి తేజస్వి యాదవ్ అన్నారు.2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్బంధన్ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్ చెప్పి మళ్లీ మహాఘట్బంధన్లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్ జట్టు కట్టారు.నితీశ్ ఏమన్నారంటే..బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తేజస్విపై సీఎం నితీశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బిహార్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదని, తన హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు.‘‘గతంలో బిహార్‌లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? సాయంత్రం అయ్యిందంటే ఎవ్వరూ బయటకు వచ్చేవారు కాదు. అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. ఒకసారి వెళ్లి ప్రజలను అడుగు. మీ నాన్న ఈ స్థాయిలో ఉన్నాడంటే అది నా వల్లే. లాలూకు ఎందుకు అండగా నిలుస్తున్నారని మీ సొంత మనుషులే అడిగారు. అయినప్పటికీ.. మద్దతు ఇచ్చా’ అని నితీశ్ అన్నారు. -
‘మీ నాన్నను అడుగు.. నేను ఏం చేశానో?
పాట్నా: బీహార్ రాష్ట్రంలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ హవా నడిస్తే.. ఇప్పుడు నితీష్ కుమార్ దే శాసనం. అటు ఇండియా కూటమిలో ఉండాలన్నా, అంతే త్వరగా దానికి ఎండ్ కార్డ్ వేసి ఎన్డీయే కూటమిలో చేరాలన్నా ఆయనకే చెల్లింది. ఆయన ఏ కూటమితో జట్టు కట్టినా తన సీఎం పదవికి ఢోకా లేకుండా చూసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు నితీష్ కుమార్. అయితే ఇదే అంశాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన ఆర్జేడీ నాయకుడు, తేజస్వీ యాదవ్.. అసెంబ్లీ వేదికగా లేవనెత్తారు. బీహార్ లో నితీష్ పాలన ‘పొలిటికల్ షిప్ట్స్’ మాదిరిగా ఉంది అంటూ విమర్శించారు.ఈరోజు(మంగళవారం) బీహార్ అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి గురించి సీఎం నితీష్ మాట్లాడే సమయంలో తేజస్వీ యాదవ్ అడ్డుకున్నారు. ఎన్డీఏ నేతృత్వంలోని మన ప్రభుత్వం బీహార్ ను అభివృద్ధి పధంలో తీసుకెళుతోందని నితీష్ వ్యాఖ్యానించగా, అందుకు తేజస్వీ యాదవ్ అడ్డుతగిలారు. అసలు బీహార్ కు ఏం చేశారో చెప్పండి అంటూ నిలదీశారు. అందుకు తీవ్రంగా స్పందించిన సీఎం నితీష్.. అంతకుముందు బీహార్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే రీతిలో సమాధానమిచ్చారు. ‘ నేను ఏం చేశానో మీ తండ్రి లాలూను అడుగు. మీ తండ్రి రాజకీయంగా ఎదగడానికి నేనే కారణం. మీ నాన్న పొలిటికల్ కెరీర్ ఎదిగింది అంటే అందులో నాది ప్రధాన పాత్ర. మీ నాన్నకు సపోర్ట్ చేయడాన్ని మీ కులంలోని వాళ్లే వ్యతిరేకించే వారు. ఎందుకు అలా చేస్తున్నావ్ అంటూ నన్ను అడిగే వారు. కానీ మీ నాన్నను తయారు చేసింది నేనే. ఇప్పటికీ మీ నాన్నకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను’ అని రిప్లై ఇచ్చారు నితీష్.దీనికి తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ప్రస్తుత బీహార్ పరిస్థితి గురించి అడిగితే.. 2005 కు ముందు బీహార్ చరిత్ర చెబుతారు నితీష్ అంటూ ఎద్దేవా చేశారు. నితీష్ చెప్పేదానిని బట్టి.. 2005కు ముందు బీహార్ ఉనికే లేదంటారా? అంటూ ప్రశ్నించారు తేజస్వీ. ఈ ప్రభుత్వం ప్రస్తుతం కన్ ఫ్యూజన్ లో ఉందని, రిక్రూట్ మెంట్ కు సంబంధించి గత హామీలనే మళ్లీ రిపీట్ చేస్తున్నారు అంటూ తేజస్వీ విమర్శించారు. -
చట్టసభలకూ పరిమితులు!
నిబద్ధత, సచ్ఛీలత, నిబంధనలపట్ల సంపూర్ణ అవగాహన కలిగినవారి సారథ్యంలో చట్టసభలుంటే అలాంటిచోట ఆరోగ్యవంతమైన చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యానికి ఆ సభ తలమానికమవు తుంది. కానీ అధికార పక్షానికి వంతపాడేవారు, వారి ఇష్టారాజ్యానికి పక్కతాళం వేసేవారు అధ్యక్ష స్థానాల్లో కూర్చుంటున్నారు. తాము ఎవరికీ జవాబుదారీ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అలాంటి బాపతు నేతలకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు. తనను బిహార్ శాసనమండలి నుంచి బహిష్కరించటాన్ని సవాలుచేస్తూ ఆర్జేడీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరిస్తూ ఆయన్ను తక్షణం సభలోకి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సభ్యుల అనుచిత ప్రవర్తనకు తగిన శిక్ష ఉండాలితప్ప మితిమీరకూడదని తేల్చిచెప్పింది. నిరుడు మార్చిలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ, ఆ తర్వాత ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంలోనూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సునీల్ కుమార్ సింగ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నది అభియోగం. పాము కుబుసం విడిచినట్టు తరచు రాజకీయ అభిప్రాయాలు మార్చుకోవటం నితీశ్‌కు అలవాటని, ఇప్పటికి తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేగా ప్రజలనుంచి ఎన్నిక కాలేదని సునీల్‌కుమార్ సింగ్ విమర్శించారు. అధికారమే పరమావధిగా ఒకసారి యూపీఏ, మరోసారి ఎన్డీయే కూటములతో చెలిమి చేయటాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన్ను ‘పాల్తూరామ్’ అని హేళన చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి నివేదించారు. సునీల్ తప్పు చేశారని ఎథిక్స్ కమిటీ నిర్ధారించి సభా బహిష్కారానికి సిఫార్సుచేసింది. శాసనమండలి దీన్ని ఆమోదించి ఆయన్ను బహిష్కరిస్తూ తీర్మానించింది. మన రాజ్యాంగం కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన చేసింది. చట్టసభలకు ప్రత్యేక హక్కులుంటాయని, వాటి కార్యకలాపాల్లో లేదా నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని సభాధ్యక్షులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఫిరాయింపులపై వచ్చే ఫిర్యాదుల్ని ఎటూ తేల్చకుండా వదిలేస్తూ తమను ప్రశ్నించరాదంటున్నారు. చిన్న చిన్న కారణాలకు కూడా విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటం, బహిష్కరణ వేటు వేయటం వంటివి రివాజయ్యాయి. కేవలం పాలకపక్ష ప్రయోజనాలను నెరవేర్చటం కోసమే స్పీకర్లు ఇలా ఇష్టాను సారం ప్రవర్తిస్తున్నారు. నిజమే... రాజ్యాంగంలోని 212(1) అధికరణ ప్రకారం చట్టసభల కార్యకలా పాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణతో ఆ కార్యకలాపాల చెల్లుబాటును న్యాయ స్థానాల్లో సవాలు చేయటానికి వీల్లేదు. నిర్వహణ సంబంధమైన అంశాల్లో న్యాయస్థానాల జోక్యంనుంచి చట్టసభలకు ఇది రక్షణనిస్తుంది. అయితే ఆ కార్యకలాపాల్లో భాగంగా తీసుకునే నిర్ణయాల్లో రాజ్యాంగ విరుద్ధత కనబడినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందన్నది నిపుణుల వాదన. తాజా కేసులో జరిగింది ఇదే. సునీల్ కుమార్ సింగ్ పిటిషన్‌కు అసలు విచార ణార్హత లేదని, 212(1) అధికరణ న్యాయవ్యవస్థ జోక్యాన్నుంచి తమకు రక్షణనిస్తున్నదని శాసన మండలి తరఫు న్యాయవాది వాదించారు. సర్వోన్నత న్యాయస్థానం దీన్ని అంగీకరించలేదు. చట్ట సభల కార్యకలాపాలు వేరు, అందులో తీసుకునే నిర్ణయాలు వేరు అని స్పష్టం చేసింది. చట్టసభల నిర్ణయాలు వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని ప్రభావితం చేసినప్పుడు వాటిని సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని తెలిపింది. అంతేకాదు... సునీల్‌కుమార్ సింగ్‌ను బహిష్కరిస్తూ తీసు కున్న ఎథిక్స్ కమిటీ నిర్ణయం పాలనాపరమైన చర్యే తప్ప శాసనవ్యవస్థ కార్యకలాపంగా పరిగణించలేమని తేల్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభ నియంత పోకడలు పోకూడదు. మెజారిటీ ఉందన్న సాకుతో విపక్ష సభ్యుల గొంతు నొక్కడానికీ, వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించటానికీ ప్రయత్నించకూడదు. ఆ పరిస్థితులు తలెత్తితే న్యాయస్థానాలుమౌనంగా ఊరుకోబోవని తాజా తీర్పు తేటతెల్లం చేసింది. చట్టసభ కార్యకలాపాలు సాఫీగా సాగటానికి అనువైన నిబంధనలు రూపొందించుకొనేందుకు రాజ్యాంగంలోని 208వ అధికరణ అధికారమిస్తోంది. సభ క్రమశిక్షణగా నడవటానికి ఎలాంటి నిబంధనలుండాలో, వాటిని ఉల్లంఘించినప్పుడు ఏయే చర్యలు తీసుకోవాలో ఈ నిబంధనలు నిర్దే శిస్తాయి. అయితే నిబంధనల అమలు పర్యవేక్షణకు ఏర్పడిన కమిటీలు తీసుకునే నిర్ణయాలు పాలనాసంబంధ పరిధిలోకి వస్తాయని గుర్తించటం తప్పనిసరని తాజా తీర్పు చెబుతోంది. ఆ నిర్ణయాలకు మెజారిటీ ఆమోదం ఉందా లేదా అనే అంశంతో దీనికి సంబంధం లేదు. ఒక చర్యకు ప్రతిగా తీసుకునే ఏ నిర్ణయమైనా హేతుబద్ధతకూ, తార్కికతకూ లోబడివుండటం అవసరం. పిచ్చు కపై బ్రహ్మాస్త్రం తరహాలో అధికారం ఉంది కదా అని ఏమైనా చేస్తామంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. చట్టసభలు ఇష్టానుసారం వ్యవహరించే రోజులు పోయాయి. సభానిర్వహణ సవ్యంగా జర గటం, క్రమశిక్షణ కట్టుతప్పకుండా చూడటం అవసరమే. కానీ అందుకోసం అమలుచేసే చర్యలు అతిగా ఉండకూడదు. సభ్యులు పరిధి మీరారని భావించినప్పుడు అభిశంసించడం, మందలించడం, నిర్దిష్ట కాలానికి సభనుంచి సస్పెండ్ చేయడంవంటి అవకాశాలున్నాయి. కానీ విచక్షణ మరిచి నేరుగా బహిష్కరణ వేటు వేయటం అతిగా వ్యవహరించటమే అవుతుంది. ఎథిక్స్ కమిటీల నిర్ణ యాలు పాలనానిర్వహణ కిందికే వస్తాయని, వాటిపై న్యాయసమీక్ష తప్పదని సుప్రీంకోర్టు నిర్ణయించటం హర్షించదగ్గది. నియంతృత్వ పోకడలు పోయే పాలకపక్షాలకు ఈ తీర్పు చెంపపెట్టు. -
ఆర్జేడీ పాలనలో జంగిల్‌రాజ్
భాగల్పూర్: బిహార్‌లో విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తోపాటు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆర్జేడీ పాలనలో బిహార్‌లో ఆటవిక రాజ్యం నడిచిందని, పశువుల దాణాను కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని ధ్వజమెత్తారు. బిహార్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాని మోదీ సోమవారం బిహార్‌లోని భాగల్పూర్లో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రధానమంత్రి–కిసాన్ సమ్మాన్ నిధి’19వ విడత సొమ్మును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22,000 కోట్లకుపైగా సొమ్ము జమచేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. తొలుత ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా సభావేదికవద్దకు చేరుకున్నారు. సభలో దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పేర్లు నేరుగా ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించారు. జంగిల్‌రాజ్‌వాలా మన విశ్వాసాలను కించపరుస్తున్నారని, సమాజంలో విద్వేషాలు సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. భారతదేశ అతిపెద్ద ఐక్యతా వేడుక అయిన మహాకుంభమేళాను సైతం దూషిస్తుండడం దారుణమని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సైతం జంగిల్‌రాజ్‌వాలా వ్యతిరేకించారని విమర్శించారు. అలాంటి వారిని బిహార్ ప్రజలు క్షమించరని తేల్చిచెప్పారు. బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే జరిగింది తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాతే అభివృద్ధి వేగం పుంజుకుందని వివరించారు. శరవేగంగా వ్యవసాయ రంగ వృద్ధి తమ ప్రభుత్వం గత పదేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలతో దేశంలో వ్యవసాయ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. పీఎం–కిసాన్ సమ్మన్ నిధి కింద ఇప్పటిదాకా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.3.5 లక్షల కోట్లు జమ చేశామని వివరించారు. ఈ పథకం అమల్లోకి వచ్చి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రభుత్వ కృషితో అన్నదాతల గౌరవ ప్రతిష్టలు పెరిగాయని, వారికి నూతన శక్తి లభించిందని పేర్కొ న్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయంతో కోట్లాది మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారని, వారికి మార్కెట్ సదుపాయం మరింతగా అందుబాటులోకి వస్తోందని, తద్వారా ఆదాయం పెరుగుతోందని మోదీ ఉద్ఘాటించారు. మన అన్నదాతలను చూసి ప్రభుత్వం గరి్వస్తోందని వ్యాఖ్యానించారు. వారి జీవితాలను మరింత మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మఖానా సూపర్ ఫుడ్ మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని, దాంతో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బిహార్‌లో సాగవుతున్న మఖానాకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. మఖానా సూపర్ ఫుడ్ అని చెప్పాను. తాను మఖానాను విరివిగా స్వీకరిస్తున్నానని తెలిపారు. సంవత్సరంలో కనీసం 300 రోజులు మఖానా తింటుంటానని అన్నారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించామని గుర్తుచేశారు. భాగల్పూర్ సభలో మఖానాలతో రూపొందించిన దండను అభిమానులు మోదీకి బహూకరించారు. -
పాలిటిక్స్‌లోకి ‘నితీశ్’ వారసుడు..!స్పందించిన తేజస్వి
పాట్నా:సీఎం నితీశ్ కుమార్ కొడుకు నిషాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. నిషాంత్‌కుమార్ జేడీయూను బీజేపీ నుంచి కాపాడగలుగుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి ఇప్పటికీ 100 శాతం ఫిట్ అని,వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లతో అందరూ జేడీయూను బలపరిచాలని నిషాంత్ ఇచ్చిన పిలుపుపై తేజస్వియాదవ్ స్పందించారు.‘నితీష్‌కుమార్ కంటే మా నాన్న లాలూయే ఫిట్‌గా ఉన్నారు. బిహార్‌లో బలహీనవర్గాల వారికి లాలూ చేసినంత మంచి ఎవరు చేయలేదు. లాలూ హయంలోనే బిహార్‌లో మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేశారు. నితీష్‌కుమార్ కొడుకు నిషాంత్ రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తా.అతడు రాజకీయాల్లోకి రావడాని కంటే ముందు పెళ్లిచోసుకోవాలని కోరుకుంటున్నా’అని తేజస్వి వ్యాఖ్యానించారు. -
సీఎం నితీష్, మాజీ సీఎం లాలుపై అసభ్య పాటలు... గాయకుడు అరెస్ట్
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌లను అసభ్యకరంగా వర్ణిస్తూ పాటలు పాడిన భోజ్‌పురి గాయకుడు సూరజ్ సింగ్‌ను నవాడ పోలీసులు అరెస్టు చేశారు.నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌లపై సూరజ్ సింగ్ అభ్యంతరకరమైన రీతిలో పాటలు పాడిన విషయమై సీనియర్ అధికారులకు ఫిర్యాదు అందిన దరిమిలా వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. భోజ్‌పురి పాటలు బీహార్‌లో ఎంతో ఆదరణ పొందుతుంటాయి. అయితే ఈ పాటలు అశ్లీలంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాగా భోజ్‌పురి సింగర్ సూరజ్ సింగ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌లపై అభ్యంతరకరంగా పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియోను పోలీసులు గుర్తించారు. ప్రముఖ నేతలను అవమానించిన ఆ గాయకునిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటపై జేడీయూ, ఆర్జేడీ పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కేసు గురించి సైబర్ డీఎస్పీ ప్రియా జ్యోతి మాట్లాడుతూ ఈ కేసులో సూరజ్ సింగ్ అనే గాయకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
‘చంద్రబాబు ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం’
గత రెండు సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి.. 2024 ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయి మిత్రపక్షాల మీద ఆధారపడే స్థాయికి చేరుకుంది బీజేపీ. అయితే కింగ్మేకర్లుగా తమ తమ రాష్ట్రాలకు కావాల్సింది సాధించుకోవడంలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌లు విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు ఎన్డీయే కూటమికి ఎప్పుడు హ్యాండిస్తారో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ పంచాయితీ రాజ్‌భవన్‌లో లోక్స్వరాజ్ మంచ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘400 సీట్లు సాధిస్తామని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు 240 సీట్లకే పరిమితమయ్యారు(పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ..). చంద్రబాబు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదు. నితీశ్ కుమార్ ఎప్పుడు తన మద్దతు వెనక్కి తీసుకుంటారో తెలియదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతమని భావించకూడదు.. .. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచీచెడులు ఉంటాయి. కీర్తి అనేది తాత్కాలికం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలిచిన వారే, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకుని శాశ్వతంగా గుర్తుండిపోతారు అని అన్నారాయన. అలాగే ఇండియా కూటమి మధ్య బీటల అంశంపై ప్రస్తావిస్తూ.. లోక్‌సభ ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్నాయని, ఈలోపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో బీజేపీ(240) తర్వాత టీడీపీ 16 స్థానాలు, జనతాదళ్ (యూ) 12, అతిపెద్ద పార్టీలుగా ఉన్నాయి. -
మీరేమంటారు?.. చంద్రబాబు, నితీశ్‌కు కేజ్రీవాల్ లేఖ
ఢిల్లీ, సాక్షి: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌లకు లేఖ రాశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారాయన.‘‘బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు. ఈ అవమానానికి మీ మద్ధతు ఉందా?.. మీ నుంచి సమాధానం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది’’ అని ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారాయన. టీడీపీ, జేడీయూలు ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే.అలాగే.. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బ తిన్నాయి. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారు. బీజేపీ మద్దతుపై పునరాలోచించుకోవాలి అని లేఖలో కేజ్రీవాల్ లేఖలో కోరారు.बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।My Letter to Shri N Chandra Babu Naidu ji. pic.twitter.com/87pKYTfdDY— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024 बीजेपी ने संसद में बाबा साहेब का अपमान किया है। लोगों को लगता है कि बाबा साहेब को चाहने वाले बीजेपी का समर्थन नहीं कर सकते। आप भी इस पर विचार करें।श्री नीतीश कुमार जी को मेरा पत्र। pic.twitter.com/YLd7lXrqmn— Arvind Kejriwal (@ArvindKejriwal) December 19, 2024బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలతో ఇండియా కూటమి హోరెత్తిస్తోంది. అమిత్ షా రాజీనామా చేయాలని.. లేదంటే ప్రధాని మోదీ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు.. రాజ్యసభలో షాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్.ఏమన్నారంటే.. భారత రాజ్యాంగంపై చర్చ సమయంలో.. రాజ్యసభలో సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాజకీయ లబ్ధి కోసమే హస్తం పార్టీ బీఆర్ అంబేద్కర్ పేరును వాడుకుంటోందని విమర్శించారు. అంబేద్కర్ పేరు జపించడం ఆ పార్టీ నేతలకు ఫ్యాషన్‌గా మారిందని.. అన్నిసార్లు దేవుడు పేరు జపిస్తే, ఏడు జన్మలకు సరిపడా పుణ్యం వచ్చి.. స్వర్గానికి వెళ్లేవారని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్, BSP అధినేత్రి మాయావతి, నటుడు.. TVK చీఫ్ విజయ్ సహా పలువురు విపక్ష నేతలు షా వ్యాఖ్యలను ఖండించారు.దీనికి అధికార పక్షం గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్, రాజ్యసభలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు .. కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కావాలని వక్రీకరిస్తోందని మండిపడ్డారు కేంద్రమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ విమర్శలు కొనసాగుతున్న వేళ.. అమిత్ షాకు మద్దతుగా నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చీకటి చరిత్రను షా బహిర్గతం చేశారని.. దీంతో హస్తం పార్టీ ఉలిక్కిపడి.. డ్రామాలకు తెరతీసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కొన్నేళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం ఏమీ చేయలేదన్నారు ప్రధాని మోదీ. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయేలా చేసిందని.. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా.. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడాన్ని వ్యతిరేకించిందంటూ.. కాంగ్రెస్ పాపల చిట్టాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.If the Congress and its rotten ecosystem think their malicious lies can hide their misdeeds of several years, especially their insult towards Dr. Ambedkar, they are gravely mistaken!The people of India have seen time and again how one Party, led by one dynasty, has indulged in…— Narendra Modi (@narendramodi) December 18, 2024 -
Video: ప్రధాని మోదీ కాళ్లు మొక్కబోయిన నితీష్ కుమార్..
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన అనూహ్య ప్రవర్తనతో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లను నమస్కరించేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బిహార్‌లోని దర్భంగా ప్రాంతంలో ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ వైపు నడుస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం వెంటనే మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రధాని.. తన పాదాలను తాకకుండా సీఎంను ఆపారు. నితీష్‌కు కరచాలనం అందించారు.అయితే మోదీ పాదాలను నితీష్ తాకడం ఇదేం తొలిసారి కాదు. గత జూన్‌లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ఆయన ప్రయత్నించారు. అంతకముందు ఏప్రిల్‌లోనూ నవాడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్.. మోదీ కాళ్లను ముట్టుకున్నారు.చదవండి: ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లుBihar CM Nitish Kumar attempts to touch PM Modi's feet again, showing a growing bond between the leaders. #NarendraModi #Bihar #NitishKumar #BreakingNewsFollow @DigitalUpdateIN pic.twitter.com/kOopns9ZrY— Digital Update India 🇮🇳 (@DigitalUpdateIN) November 13, 2024 -
ముఖ్యమంత్రి చేతులు జోడించి వేడుకున్నా.. మరోసారి ఆ తప్పు చేయం
బీహార్‌లో రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. జనతాదళ్(యూ) చీఫ్, సీఎం నితీష్ కుమార్.. బీహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీపై తేజస్వీ యాదవ్ స్పందించారు. సీఎం నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.నితీష్‌కుమార్‌కు విశ్వసనీయత లేదు. ఆయన చర్మిషా తగ్గింది. ఇప్పటికే మద్దతు కోరి రెండుసార్లు మా వద్దకు వచ్చారు. సపోర్ట్ చేయమని చేతులు జోడించి వేడుకున్నారు. మద్దతు ఇచ్చాం. కానీ ఈ సారి ఆ తప్పు చేయం’అని చెప్పారు. భవిష్యత్తులో నితీష్ కుమార్‌తో చేతులు కలిపే అవకాశం గురించి అడిగినప్పుడు పార్టీ మరోసారి ఆ తప్పు చేయదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి : ట్రంప్ దేశాన్ని అమ్మేశారుబీహార్లో నితీష్ కుమార్ విశ్వసనీయత, ప్రభావం ముగిసింది. శాంతిభద్రతలు అదుపు తప్పాయి. వాటిని నిర్మూలించే సామర్ధ్యం సీఎం నితీష్ కుమార్లో లేవని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తరచూ పొత్తులు మారుతున్నారని యాదవ్ విమర్శించారు. నితీష్ ఆర్జేడీతో ఉన్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. బీజేపీలో ఉన్నప్పుడు ఆర్జీడీని విమర్శిస్తారు. ఇవేం రాజకీయాలు. ఫలితమే అతని విశ్వసనీయత నాశనం అయ్యిందని తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. తేజస్వీయాదవ్‌తో నితీష్ కుమార్ భేటీపైతేజస్వీయాదవ్తో నితీష్ కుమార్ భేటీపై బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. కేవలం సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించి వీరిద్దరూ భేటీ అయ్యారని స్పష్టం చేసింది. సమాచార కమిషనర్ నియామక కమిటీలో విపక్ష నేత కూడా సభ్యుడేనని గుర్తుచేసింది. అందులో ఎలాంటి రాజకీయాలు లేవని వెల్లడించింది. -
జేడీ(యూ) కీలక పదవికి కేసీ త్యాగి రాజీనామా
పట్నా: జనతాదళ్(యునైటెడ్) సీనియర్ నేత కేసీ త్యాగి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత కారణలతో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్‌కు రాసిన లేఖలో త్యాగి పేర్కొన్నారు.ఇటీవల కాలంలో పార్టీ అధికార ప్రతినిధి హోదాలో కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అందుకే ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలో చర్చ జరుగుతోంది. మరోవైపు.. కేసీ త్యాగి స్థానంలో కొత్త జాతీయ అధికార ప్రతినిధిగా రాజీవ్ రంజన్ ప్రసాద్‌ను నియమించినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ అఫాక్ అహ్మద్ ఖాన్ ప్రకటించారు.ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై ఇటీవల చేసిన త్యాగి చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు దూరంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావించినందునే యాన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గాజాలో శాంతి, కాల్పుల విరమణకు భారతదేశం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్టీ నేతలను సంప్రదించకుండానే త్యాగి చేసిన వ్యాఖ్యల కారణంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో విభేదాలు తలెత్తినట్లు పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంలో జేడీ(యూ) కీలక భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది. -
నితీశ్‌కుమార్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: జనతాదళ్(యునైటెడ్)పార్టీ అధ్యక్షుడిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 29(గురువారం) ఈ ఫిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. జేడీయూ మాజీ సభ్యుడు గోవింద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని, అంతర్గత పార్టీ మార్పులపై కోర్టు జోక్యం చేసుకోవడానికి బలమైన కారణం లేదని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ అన్నారు. ‘‘ఈ పిటీషన్‌ను విచారించే మెరిట్ లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 అధికార పరిధికి సంబంధం లేకుండా ఉంది.పెండింగ్‌లో ఉన్న పిటిషన్లతో పాటు రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’’ అని ఢిల్లీ కోర్టు పేర్కొంది. 2016, 2019, 2022 సంవత్సరాల్లో జేడీయూ నిర్వహించిన పార్టీ అంతర్గత ఎన్నికలు పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాయని ప్రకటించాలని గోవింద్ యాదవ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ జేడీయూ పార్టీలోని ఒక వర్గం లేవనెత్తగా.. 2017లో ఎన్నికల సంఘం నితీశ్‌కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిందని హైకోర్టు పరిశీలించింది. -
సీఎం నితీశ్ ఆఫీసు పేల్చేస్తా.. మెయిల్ పంపిన వ్యక్తి అరెస్టు
పాట్నా: బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆఫీసును బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నితీశ్‌కుమార్ ఆఫీసు పేల్చేస్తామని అల్‌ఖైదా పేరుతో శనివారం బెదిరింపు మెయిల్ వచ్చిందని, తనిఖీలు చేయగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ పంపిన వ్యక్తిని కోల్‌కతాలో అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. మెయిల్ పంపిన వ్యక్తి బిహార్ జిల్లాలోని బెగుసరాయ్‌కి చెందిన మహ్మద్ జాహెద్‌గా గుర్తించారు. జాహెద్ కోల్‌కతాలో పాన్‌షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.ఇతడు నితీశ్‌కుమార్‌కు ఎందుకు బెదిరింపు మెయిల్ పంపాడన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల బిహార్‌లో స్కూళ్లకు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్లు ఎక్కువయ్యాయి. -
సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌లో 65 శాతం రిజర్వేషన్ చట్టం నిలుపుదలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై వాదనలు వినేందుకు మాత్రం సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన రిజర్వేషన్ సవరణలు రాజ్యాంగ సమానత్వ నిబంధనలను ఉల్లంఘించేవని పట్నా హైకోర్టు జూన్ 20 నాటి తీర్పులో వెల్లడించింది. వెనకబడిన తరగతులకు 65 శాతం రిజర్వేషన్ కోటా ఇవ్వడాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ నిలుపుదల తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించటాన్ని నిరాకరించింది. చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం -
ముగిసిన నీతిఆయోగ్ భేటీ.. ప్రధాని స్పీచ్ హైలైట్స్..
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం(జులై 27) జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై ఈ సమావేశంలో పలువురు సీఎంలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు సరైన దిశలో పయనిస్తున్నామన్నారు. వందేళ్లలో ఒకసారి వచ్చే మహమ్మారిని(కరోనా) ఓడించామని చెప్పారు. అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితో 2047 నాటికి వికసిత్ భారత్ కల నెరవేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా, తాను మాట్లాడుతుండగా మధ్యలో మైక్ కట్ చేశారని నీతిఆయోగ్ సమావేశం నుంచి వెస్ట్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలిగి వెళ్లిపోయారు. ఎన్డీఏ కీలక భాగస్వామ్యపక్షమైన జేడీయూ నుంచి బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నీతిఆయోగ్‌కు రాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్యకారణాల వల్లనే నితీశ్ రాలేదని జేడీయూ ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. -
నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ కుమార్ డుమ్మా.. కారణం అదేనా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగుతోంది. వికసిత్ భారత్-2047 అజెండాగా సాగుతున్న ఈ భేటీకి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు ఇతరులు పాల్గొన్నారు.అయితే ఈ సమావేశానికి విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. కేవలం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరవ్వగా.. ఆమెకు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వలేదని, మైక్ కట్ చేశారంటూ ఆరోపిస్తూ మమతా సైతం ఈ భేటీ నుంచి వాకౌట్ చేశారు.ఇదిలా ఉండగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామి జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్‌కుమార్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాలేదు. బిహార్ తరపున డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పాల్గొన్నారు. అయితే నీతి ఆయోగ్ కీలక సమావేశానికి సీఎం నితీష్‌కుమార్ గైర్హాజరుపై దేశ రాజకీయాల్లో అప్పుడే చర్చ మొదలైపోయింది. కేంద్రం బీహార్‌కు ప్రత్యేక మోదాఇవ్వకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధానిగా అవతరించడంతో నితీష్ పార్టీ జేడీయూ కీలకంగా వ్యవహరించింది. అయినప్పటికీ తమ డిమాండ్‌ను కేంద్రం తిరస్కరించడంతో నిరసనగా.. బిహార్ సీఎం ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన్నట్లు సమాచారం.ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివక్ష చూపారంటూ నిరసిస్తూ ప్రతిపక్ష ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగసామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. కాగా కేంద్ర ప్రభుత్వ విభాగమైన నీతి ఆయోగ్‌కు ప్రధానమంత్రిని చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులను సభ్యులుగా ఉంటారు. -
ఆయనతో పోలిస్తే చంద్రబాబు మరీ అంత వీకా?
మీడియా చేతిలో ఉంటే చాలు తిమ్మిని బొమ్మి చేయవచ్చు. బొమ్మిని తిమ్మి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢీ కొట్టగలిగినవారే దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. అమరావతి రాజదాని నిర్మాణానికి కేంద్రం పదిహేనువేల కోట్ల రూపాయల సాయం చేయడానికి ముందుకువచ్చింది కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం ప్రకటించినప్పుడు ఆంద్రులంతా సంతోషించారు. చంద్రబాబు నాయుడు అమలు చేయతలపెట్టిన స్కీములకు ఈ మేరకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నారు. కానీ.. అసలు విషయం తెలిశాక..ఇందులోనూ ఇంత మతలబు ఉందనే అభిప్రాయం కలుగుతుంది. అమరావతికి కేంద్రం గ్రాంట్ గా ఇవ్వడం లేదని, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణ సాయం ఇప్పిస్తుందని, ఇందులో మాచింగ్ గ్రాంట్ విషయం కేంద్ర,రాష్ట్రాలు చర్చించి నిర్ణయించుకుంటాయని ఆమె చెప్పారు. అంటే ఇందులోను గ్యారంటీ లేదన్న మాట. అవసరమైతే రాష్ట్రం కూడా భరించవలసి ఉంటుందన్నమాట. ఇక పోలవరం ప్రాజెక్టు పేరు కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించినందుకే టీడీపీ, జనసేనలు మురిసిపోయాయి. అలాగే పారిశ్రామికవాడలకు ఇచ్చే రాయితీలు గురించి మాట వరసకు చెప్పారు తప్ప ఎంత మేర ఆర్దిక సాయం చేసేది నిర్దిష్టంగా తెలపకపోయినా తెలుగుదేశం మీడియా ఆహో,ఓహో అంటూ ఊదరగొట్టాయి. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించాయి. బీహారు రాష్ట్రానికి మాత్రం కేంద్రం నేరుగా 58,900 కోట్ల రూపాయల ఆర్దిక సాయాన్ని వివిధ ప్రాజెక్టుల రూపేణా ఇవ్వదలచింది. అంటే అదంతా గ్రాంట్ అన్నమాట. రూపాయి అప్పుగా ఉండదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు సంబంధించిన ఎంపీల మద్దతు లేనిదే మోదీ ప్రభుత్వం నిలబడడం కష్టం. అయినా నితీష్ ధైర్యంగా ప్రత్యేక హోదా అడిగారు. చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, అంతకు మించిన సాయాన్ని మోదీ ప్రభుత్వం ఇస్తోంది. ఏపీకి మాత్రం అప్పుకు సాయం చేస్తామని అన్నారు. ఎక్కడ ఉంది బలహీనత. కొంతమంది విమర్శిస్తున్నట్లు చంద్రబాబుపై గతంలో కేంద్రం ఇచ్చిన నోటీసుల కత్తి వేలాడుతోందా?లేక చంద్రబాబే కేంద్రంతో గొడవ పెట్టుకుని గతంలో మాదిరి దెబ్బతింటానని భయపడుతున్నారా?. 2014-19 టరమ్ లో తొలుత ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని ఆనాటి ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించారు. దానిని చంద్రబాబు స్వాగతించారు. ఆ తర్వాత కాలంలోమళ్లీ ప్రత్యేక హోదానే కావాలన్నారు. అది వేరే సంగతి.ప్యాకేజీ కూడా అప్పట్లో రుణసాయం కిందే ఇవ్వచూపారు. దానికే చంద్రబాబు అప్పట్లో అంగీకరించడం విమర్శలకు దారి తీసింది. సరిగ్గా అదేరీతిలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి రుణం తీసుకోవడానికి ఒప్పుకున్నారు. స్వయంగా చంద్రబాబే అది అప్పే అని తేల్చి చెప్పారు. జనం అంతా ఏపీకి పప్పన్నం లాంటి సాయం వచ్చిందని అనుకుంటే అది కాస్త అప్పన్నం అని తేలిపోయింది. ఈ మాత్రం దానికే ఈనాడు పత్రిక ఏమని హెడింగ్ పెట్టిందో చూడండి. ‘‘రాజధానికి రాజసం’’ అని పెట్టి తమ రాజభక్తిని ప్రదర్శించుకున్నారు. మరో టీడీపీ పత్రిక ఆంధ్రజ్యోతి ‘‘హ్యాపీ ఏపీ’’ అని ఆనంద తాండవం చేసింది. వారికి ఇష్టం అయితే ఇలా..అదే జగన్ ప్రభుత్వం చేస్తే అప్పుల చిప్ప అని హెడింగ్ పెట్టేవారు. అయితే ఇక్కడ చంద్రబాబు సమర్ధించుకున్న తీరు కూడా ఆసక్తికరమైనదే. పదిహేనువేల కోట్ల మేర కేంద్రం ఇచ్చేది అప్పే అయినా ,ముప్పై ఏళ్లతర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు. అంటే అప్పటివరకు ఏపీ ప్రజల నెత్తిన ఈ రుణభారం ఉంటుందని అంగీకరించడమే కదా!. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే ఈ అప్పులకు కేంద్రం పూచికత్తు ఇస్తుందని అన్నారు. నిజానికి ఏ విదేశీరుణానికి అయినా కేంద్రం గ్యారంటీలు ఇస్తుందన్నది తెలిసిందే.గతంలో ప్రపంచ బ్యాంక్ ఇదే ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి నో చెప్పింది.దానికి కారణం అది పర్యావరణ నియమాలకువ్యతిరేకంగా ఉండడం,కొందరు రైతులు నిరసనలు తెలుపుతుండడం. నిధులు ఏ రూపేణా వచ్చినా అది రాష్ట్రానికి ఉపయోగమేనని చంద్రబాబు ఉవాచ. మరి జగన్ ప్రభుత్వంపై తెగ ఆడిపోసుకున్నారు కదా? అని ఎవరైనా అడిగితే అధికారం కోసం ఎన్ని అయినా అంటాం అని సమాధానం ఇస్తారేమో తెలియదు. పోలవరం ప్రాజెక్టు కునిధులు ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్ లో పెట్టకపోయినా, పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందట.అంటే అది ఎప్పటికి పూర్తి చేస్తారో, ఎంత మొత్తం ఇస్తారో, నిర్వాసితుల సమస్య ఎప్పటికి తీర్చుతారో తెల్చకుండా పోలవరం అంటేనే పులకరించిపోతే ఏమి చేయాలి!. పోనీ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తున్నట్లు ఏమైనా చెప్పారా?అదేమీ లేదు. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ బుందేల్ ఖండ్ తరహాలో ఉంటుందని సమాచారం ఉందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ నిర్మలా సీతారామన్ అనడం లేదు. పారిశ్రామిక రాయితీలు ఈ ప్యాకేజీలో భాగమేనని ఆయన అంటు్నారు.చంద్రబాబు వీటన్నిటిపైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు కూడా తెలిపేశారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం,పారిశ్రామికరంగంతో పాటు వెనుకబడిన అభివృద్దికి దృష్టి సారించినందుకు మోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఏమి సాధించారని చంద్రబాబు ఇంతగా కేంద్రాన్ని పొగిడారో తెలియదు. .. దీనిని బట్టే చంద్రబాబు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉంది అర్దం అవుతుంది.ధైర్యం చేసి నితీష్ మాదిరి గట్టిగా అడగలేకపోయారు.వారు ఇచ్చిందే మహా గొప్ప విషయం అన్నట్లు చంద్రబాబు సరిపెట్టుకున్నారు. కాకపోతే ఏపీ ప్రజలను తనకు ఉన్న మీడియా బలంతో మభ్యపెట్టడానికి మాత్రం యత్నించారు. అబద్దపు వాగ్దానాలనువిని ఓట్లు వేసిన ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మకుండా ఉంటారా? అన్నది వారి విశ్వాసం కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మరోసారి సహనం కోల్పోయిన నితీష్.. మహిళా నేతపై అరిచిన సీఎం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరోసారి తన సహనాన్ని కోల్పోయారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తమ ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన మహిళా నేతపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యాలపై ప్రతిపక్ష ఆర్జేడీ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా బుధవారం నితీష్ కుమార్ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు.. రిజర్వేషన్లు, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆయన ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా ‘ నితీష్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.దీనిపై నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సహనం కోల్పోయిన సీఎం.. ఓ మహిళా నేతపై విరుచుకపడ్డారు. నువ్వు మహిళవే కదా? నీకేమైనా తెలుసా? తాను ఎలా మాట్లాడుతుందో చూడండి. .మీరు మహిళల కోసం ఏమైనా చేశారా? లేదు కదా. మేము మాట్లాడతాం మీరు నిశబ్దంగా వినండి..వినకపోతే అది మీ తప్పు.’అంటూ మడిపడ్డారు.సీఎం వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే సమయంలో నితీష్ కుమార్ అలవాటు పడిన నేరస్థుడిగా ప్రవర్తిస్తారని విమర్శలు గుప్పించారు. 2నువ్వు స్త్రీవి, నీకు ఏమైనా తెలుసా?’ అంటూ మహిళలపై చౌకబారు, అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే.ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత నెల జూన్‌లో సంచలన తీర్పు వెలువరించింది. ఇక తాజాగా ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితిష్ కుమార్.. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో జేడీయూకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
బీహార్ కు స్పెషల్ స్టేటస్ పై కేంద్రం క్లారిటీ..!
-
బిహార్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేం.. తేల్చిచెప్పిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న బిహార్ అధికార పార్టీ జేడీయూకి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని కేంద్రం పార్లమెంట్ వేదికగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్సీపీ, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ, అలాగే ఒడిశా కోసం బీజేడీ డిమాండ్ చేశాయి.The Special Category Status for plan assistance was granted in the past by the National Development Council (NDC) to some States that were characterized by a number of features necessitating special consideration. The decision was taken based on an integrated consideration of… pic.twitter.com/PbPDiJjLyz— ANI (@ANI) July 22, 2024అయితే సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పార్లమెంట్లో స్పందించింది. ఈ సందర్భంగా బిహార్‌కు స్పెషల్ స్టేటస్‌పై కేంద్రం స్పందిస్తూ అధికారికంగా ఓ నోట్‌ను విడుదల చేసింది. అందులో లోక్‌సభలో బిహార్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.అందులో 2012లో ఇంటర్ మినిస్ట్రీ రియల్ గ్రూప్ బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించింది. అయితే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలలో బిహార్ అర్హత సాధించలేదని స్పష్టం చేసింది. దీంతో బిహార్‌కు ఇక ప్రత్యేక హోదా దక్కదేమోనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.ఇక పంజక్ చౌదరి.. లిఖిత పూర్వక సమాధానంలో ప్రత్యేక హోదా సాధించాలంటే కావాల్సిన అర్హతల గురించి ప్రస్తావించారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే..👉పర్వత ప్రాంత రాష్ట్రం అయి ఉండాలి.👉తక్కువ జనాభా,ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఉండాలి.👉అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండాలి 👉ఆర్థిక మౌలిక వసతుల లేమి కలిగిన రాష్ట్రమై ఉండాలి 👉అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు అర్హులని తెలిపింది. -
‘బీజేపీతో పొత్తుపై పునరాలోచించండి’.. సీఎం నితీష్‌కు పార్టీ నేత విజ్ఞప్తి
శ్రీనగర్: బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కకపోవటంతో మిత్రపక్షం సహకారంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో బిహార్ సీఎం నితీష్‌కుమార్ జేడీయూ పార్టీ కీలకంగా వ్యవహారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జమ్ము కశ్మీర్ రాష్ట్ర జేడీ(యూ) జనరల్ సెక్రటరీ వివేక్ బాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా జేడీ(యూ) పార్టీ ఉండటంపై పునరాలోచించాలని ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.‘‘జమ్ము కశ్మీర్ బీజేపీ నేతలు చేస్తున్నట్లు చర్యలు కారణంగా మా పార్టీ చీఫ్ నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై పునరాలోచించాలని కోరుతున్నాం. మేము ఇస్లామిక్ స్కాలర్లను తిరిగి సమాజంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. వారు దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. అందుకే వారిని మేము వదిలిపెట్టాలని అనుకోవటం లేదు. అయితే మా ప్రయత్నాలను మాత్రం బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది’’ అని వివేక్ బాలి తెలిపారు. ఇక.. లోక్ సభఎన్నికల్లో బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీ (యూ) 12 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటని బీజేపీ.. మిత్రపక్షాల సాయంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ కీలకంగా మారారు. -
‘కావాలంటే కాళ్లు మొక్కుతా’.. ఇంజనీర్‌పై బిహార్ సీఎం అసహనం
పట్నా: బిహార్‌లోని జేపీ గంగా బ్రిడ్జ్ పనులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సహానం కోల్పోయారు. జేపీ గంగా ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇంజనీర్‌పై వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం 12. 5 కిలోమిటర్ల దూరం నిర్మించాల్సి ఉంది. అయితే ఇంకా 4. 5 కిలో మీటర్ల నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రాజెక్టు ఇంజనీర్‌పై సీఎం నితీష్ తీవ్ర అసహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్‌తో మాట్లాడుతూ.. ‘‘మీరు కావాలనుకుంటే.. మేము కాళ్లు మొక్కుతాం. తొందరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి’’ అని చేతులు జోడించి కోపంతో ఊగిపోయారు. దీంతో ‘‘సర్, మీరు దయ చేసి అలా మాట్లాడవద్దు’’ అని సదరు ఇంజనీర్ తిరిగి సీఎంకు చేతులు జోడించి వివరణ ఇచ్చారు. దీంతో సీఎం నితీష్ శాంతించారు. ఈ కార్యకమ్రంలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, స్థానిక ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.Watch: Bihar CM Nitish Kumar urged an IAS officer to expedite the extension of JP Ganga Path up to Kangan Ghat in Patna, says "I touch your feet; please complete the work on time" pic.twitter.com/bAkFU6aAOK— IANS (@ians_india) July 10, 2024 ఇక.. ఇటీవల బిహార్‌లో పలు బ్రిడ్జ్‌లు, కాజ్‌వేలు కుప్పకూలడంతో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో 15 మంది ఇంజనీర్లపై బిహార్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. అనంతరం ప్రభుత్వం వరుస బ్రిడ్జ్‌లు కుప్పకూలటంపై ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 17 రోజుల్లో 10 బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యం, సరిగా పర్వవేక్షించపోవటమే కారణమని దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చినట్లు బిహార్ జలవనరుల విభాగం అడిషినల్ చీఫ్ సెక్రటరీ చైతన్య ప్రసాద్ పేర్కొన్నారు. -
నితీష్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు: జేడీయూ
పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ నేతృత్వంలోనే జేడీయూ బరిలోకి దిగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం నితిష్ కుమార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని తన భూజాలపై వేసుకొని నడిపించారని ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు.నితీష్ రాజకీయాల్లో పడిపోతున్నారని అనుకున్న ప్రతీసారి అతను తన అద్భుతమైన పనితనంలో పునరాగమనం చేసి అందరిని ఆశ్యర్యపరుస్తుంటారని తెలిపారు. నితీష్‌పై ప్రజలకు ఇంకా నమ్మకం ఉందని చెప్పేందేకు లోక్‌సభ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా 177 స్ధానాల్లో ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యం లభించిందని గుర్తుచేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇండియా కూటమి నుంచి ఎన్డీయేలోకి మారిన నితిష్ కుమార్ బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు సాధించి 'కింగ్‌మేకర్'గా అవతరించారు.'బీహార్‌కు ప్రత్యేక హోదాపై సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ, 2004 నుండి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భాగస్వామిగా ఉన్న ప్రతిపక్షం బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పుడూ లేవనెత్తలేదు. ప్రత్యేక హోదా గురించి వారు కనీసం ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు.మేము మాత్రం మొదటినుంచీ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నాం. ఈ విషయంలో సీఎం నితీష్ కుమార్ నిబద్ధతతో కృషి చేస్తున్నారు. భవిష్యత్‌లో బిహార్‌కు కొద్దిపాటి ఊతం లభించినా తాము కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబడతాం. ప్రత్యేక హోదా విషయంలో అవరోధాలు ఏమైనా ఉంటే ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై రాజకీయాలు చేయకూడదు'. ఆయన అన్నారు. -
బిహార్‌లో కూలిన మరో వంతెన.. 17 రోజుల్లో 12వ ఘటన
పాట్నా: బిహార్‌లో వంతెనలు పేకమేడల్లా కూలుతున్నాయి. ఒకదాని వెనక ఒకటి పోటీపడి మరీ కుప్పకూలిపోతున్నాయి. గత 17 రోజుల్లో ఇలా రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు వంతెనలు కుప్పకూలగా.. తాజాగా మరో బ్రిడ్జి కూలింది.గురువారం సరన్ జిల్లాలోనని గ్రామాలను- సివాన్ జిల్లాను కలుపుతూ గండకి నదిపై ఉన్న 15ఏళ్ల నాటి వంతెన కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల డీసిల్టింగ్ పని జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా సరన్ జిల్లాలో గత 24 గంటల్లో మూడు వంతెనలు కూలినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ తెలిపారు. గత 17 రోజుల్లో మొత్తం 12 వంతెనలు కూలిపోయాయి,ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సిన అన్ని పాత వంతెనలను గుర్తించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్వేకు ఆదేశించిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన వెలుగుచూసింది. వంతెన నిర్వహణ విధానాలను మెరుగుపరచాలని రహదారుల నిర్మాణం, గ్రామీణ పనుల శాఖలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల సివాన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లోనూ వంతెనలు కూలాపోయాయి. భారీ వర్షాలు, నదీ ప్రవాహం పెరిగిన ఈ తరుణంలో వంతెనలు కూలుతుండటంతో వాటి నాణ్యతపై అనుమానాలు పెరిగాయి. దీంతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసి వంతెనల సామర్థ్యం, స్థితిగతులపై సమీక్ష నిర్వహంచనున్నారు. -
నీట్ పేపర్‌లీక్ సూత్రధారి నితీషే.. తేజస్వియాదవ్
పాట్నా: నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్‌లీక్‌లో తనను ఇరికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.పేపర్‌లీక్‌లో నిందితుడిగా తేలిన వ్యక్తితో తేజస్వియాదవ్ పీఏకు పరిచయం ఉందని బీజేపీ ఆరోపించింది. దీనిపై తేజస్వి స్పందిస్తూ నితీష్‌కుమార్‌పై ఆరోపణలు చేశారు. అసలు నీటి పేపర్ లీకేజీకి కుట్ర చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమారే అన్నారు. బీజేపీ బిహార్‌లో పవర్లోకి వచ్చినప్పుడల్లా పేపర్‌లీక్‌లు జరుగుతున్నాయన్నారు. నీట్ విషయంలో ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని కూటమి డిమాండ్ చేస్తోందన్నారు. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ‘ఈ కేసులో నా పీఏను, నన్ను లాగాలని చూస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. లీక్ వెనుక అసలైన సూత్రధారులు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్లే’అని తేజస్వి ఆరోపించారు. -
Patna high court: రిజర్వేషన్ల పెంపు చెల్లదు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు పెంచుతూ 2023 నవంబర్‌లో ప్రభుత్వం తీసుకొచి్చన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 16ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితికా రాణి చెప్పారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తుది తీర్పు ఇచి్చందని వెల్లడించారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగం, ఉపాధి విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలి్పంచాలి. కుల గణన ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచినట్లు బిహార్ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. ఇంద్ర సహానీ కేసుతోపాటు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో కోటాను 50 శాతానికి మించి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పిందని గుర్తుచేశారు. 75 శాతానికి చేరిన రిజర్వేషన్లు బిహార్ ప్రభుత్వం కుల గణన నిర్వహించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ) 63 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానిపైగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రభుత్వం గతంలోనే ఈబీసీలకు 10 రిజర్వేషన్లు కలి్పంచింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదు కాబట్టి రిజర్వేషన్ చట్టాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 50 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాను 65 శాతానికి పెంచేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిహార్‌లో ఈబీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల జాబితా తొమ్మిదో షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు 1992లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిహార్ సర్కారు రిజర్వేషన్లు పెంచడాన్ని సవాలు చేస్తూ పలువురు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. -
ఆ ఇంక్ ఏంటి ?
-
నితీశ్‌కు ప్రధాని పదవి ఆఫర్ చేసిన ఇండియా కూటమి!
పట్నా: ఎన్డీయే సంకీర్ణ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో బిహార్‌లోని నితీష్‌కుమార్ జేడీ(యూ) కీలకంగా మారింది. బీజేపీ సొంతంగా మెజార్టి సీట్లు దక్కించుకోని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నితీష్ కుమార్‌కి డిప్యూటీ పీఎం పదవి ఆఫర్ చేసి.. తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జేడి(యూ) నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్‌కి ఇండియా కూటమి నుంచి ఏకంగా ప్రధాన మంత్రి పదవి ఆఫర్ వచ్చింది. ఇండియా కూటమికి కన్వీనర్‌గా అంగీకరించని వాళ్లు.. ఏకంగా నితీష్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకే నితీష్ వాళ్ల ఆఫర్‌ను తిరస్కరిచారు. తాము ఎన్డీయేతోనే ఉన్నాం. మళ్లీ ఇండియా కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు. మా మద్దలు ఎన్డీయే ఉంటుంది’’ అని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టి సొంతంగా బీజేపీ, కాంగ్రెస్ కూటమికి లేకపోవటంతో నితీష్ కుమార్‌పై మద్దతును కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి ఆయన మద్దతు కోరినట్లు త్యాగి తెలిపారు. తరచూ కూటములు మారుతారనే పేరు నితీష్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వహించారు. అయితే.. ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీ(యూ) 12 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉంది. శుక్రవారం భాగస్వామ్య పార్టీలు ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కోలువుదీరనుంది. రేపు (ఆదివారం) 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.స్పందించిన కాంగ్రెస్‌తమ పార్టీ చీఫ్‌కు నితీశ్‌కుమార్‌కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి అఫర్ చేసిందని జేడీ(యూ) నేత త్యాగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘‘ జేడీ(యూ) నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు’’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. -
సమన్వయ కమిటీ! నితీశ్ సారథ్యంలో సీఎంపీ: జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మనుగడకు కీలకంగా మారిన భాగస్వామ్య పక్షాలు బీజేపీ ముందు పలు డిమాండ్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని జేడీ(యూ) డిమాండ్ చేస్తోంది. దాని కనీ్వనర్‌గా పార్టీ చీఫ్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఉండాలని కోరుతోంది. అంతేగాక ఎన్డీఏకు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ఉండాలని, దాని అమలు కమిటీ సారథ్యాన్ని కూడా నితీశ్‌కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి అదనంగా నాలుగు కేబినెట్ బెర్తులు, బిహార్‌కు ప్రత్యేక హోదా తదితరాలను నితీశ్ ఇప్పటికే బీజేపీ పెద్దల ముందుంచారు. టీడీపీ కూడా నాలుగైదు కేబినెట్, ఒక సహాయ మంత్రి, లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. టీడీపీ, జేడీ(యూ) డిమాండ్లకు బీజేపీ అంగీకరించడం లేదని తెలుస్తోంది. టీడీపీకి ఒకకేబినెట్, ఒకట్రెండు సహాయ పదవులను ఆఫర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. జేడీ(యూ), ఇతర మిత్రపక్షాల డిమాండ్లపై వాటితో చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. -
విలువల జాడేది?!
వేదికలపై గంభీరోపన్యాసాలు చేయడంలో, విలువల గురించి మాట్లాడటంలో మన నాయకులకు ఎవరూ సాటిరారు. ఆ ఉపన్యాసాలకూ, ఆచరణకూ పెద్దగా పొంతనవుండదు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఈ సంగతిని మరోసారి ధ్రువీకరించాయి. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయం ప్రాతిపదికనే తీసుకుంటామని మోదీ ప్రకటించారు. మంచిదే. గత అయిదేళ్ల పాలనలో ఏకాభిప్రాయం జాడ ఎక్కడా కనబడకపోగా చాలా నిర్ణయాలు విపక్షాన్ని సభనుంచి గెంటేశాక మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఆ నిర్ణయాలపై తీవ్ర విమర్శలూ వచ్చాయి. ప్రతిఘటన కూడా ఎదురైంది. బహుశా అందువల్లే కావొచ్చు... 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా వచ్చిన మెజారిటీ ఈసారి మాయమైంది. మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని స్థితి ఏర్పడింది. రామమందిర నిర్మాణం లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపి, దానిమాటున మూడున్నర దశాబ్దాలుగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ... తీరా ఆలయ నిర్మాణం కొనసాగుతున్న దశలో కనీస మెజారిటీకి దూరంకావటం, యూపీలో సగంపైగా సీట్లు కోల్పోవటం కేవలం యాదృచ్ఛికమని మోదీ చెప్పగలరా? చివరకు అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గాన్ని సైతం బీజేపీ కోల్పోవలసి వచ్చిందని ఆయనకు గుర్తుందో లేదో! అయోధ్య ప్రాంతంలోని 9 స్థానాల్లో 5, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రాంతంలోని 12 స్థానాల్లో తొమ్మిదింటిని ఈసారి బీజేపీ చేజార్చుకుంది. బీజేపీ హిందుత్వ ప్రాజెక్టుకు ఈ రెండు ప్రాంతాలూ ఆయువుపట్టు. అంతేకాదు... వివిధ రాష్ట్రాల్లో బీజేపీ 2019 ఎన్నికల్లో 50 శాతంపైగా వోట్లతో 224 స్థానాలు గెల్చుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 156కి పడిపోయింది. బీజేపీ 500 కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 30... వేయి కంటే తక్కువ వోట్లతో గెలిచిన స్థానాలు 100 ఉన్నాయి. ఇండియా కూటమి, మరీ ముఖ్యంగా అందులోని సమాజ్‌వాదీ పార్టీ దాదాపు అన్నిచోట్లా గణనీయంగా కోలుకుంది. తమ గెలుపును ఓటమిగా చిత్రిస్తున్న కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఇప్పుడూ, గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకొచ్చిన మొత్తం సీట్ల సంఖ్యతో పోల్చినా ఈసారి తమకొచ్చిన స్థానాలు చాలా ఎక్కువని ఎద్దేవా చేయటం బాగానేవుంది. అయితే జరిగిందేమిటో లోతుగా విశ్లేషిస్తే సత్యం బోధపడుతుంది. మోదీ పైకేమి మాట్లాడినా నిరుపేదలూ, మధ్యతరగతి తమకు క్రమేపీ దూరం జరుగుతున్నారని బీజేపీకి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఈసారి ఆ రెండు వర్గాలకూ కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. పార్లమెంటులో ఏ అంశంపైన అయినా చర్చ జరిగినప్పుడు ఉపన్యాస పోటీలుగా భావించి మాట్లాడటంకాక ఆరోగ్యకరమైన చర్చలకు చోటీయడం ఎంతో అవసరం. ఎన్డీఏ సహజసిద్ధమైన కూటమని, ఇందులో అధికార యావలేదని మోదీ చెప్పటం కూడా వింతగానే ఉంది. ఇప్పుడు ఎన్డీఏకు మద్దతుగా నిలిచిన నితీశ్, చంద్రబాబులిద్దరూ ఊగిసలాటకు పెట్టింది పేరు. నిలకడ తక్కువ, అవకాశవాద రాజకీయం ఎక్కువ. ఏ గట్టున బాగుంటుందనుకుంటే అటు దూకే బాపతు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి ప్రయాణించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో హఠాత్తుగా కాడి పారేసి విడిగా ఎందుకు పోటీ చేశారో, అంతకు సంవత్సరం ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎందుకు అంటకాగారో ఎవరైనా చెప్పగలరా? తరచు యూటర్న్లు తీసుకోవటంలో నితీశ్, చంద్రబాబులకు పోటీ పెడితే ఎవరు ప్రథమ స్థానం గెల్చుకుంటారో చెప్పటం కొంత కష్టమే. ఇలాంటివారిని పక్కనబెట్టుకుని ‘ఇది సహజసిద్ధమైన కూటమి, సుపరిపాలన కోసం కలిశాం’ అంటూ పెద్ద పెద్ద మాటలు వల్లిస్తే నమ్మడానికి దేశ ప్రజలు తెలివితక్కువవారు కాదు. మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచడంమాట అలావుంచి 2014లోనే ‘మీరు పదిహేనేళ్లు అధికారంలో వుంటారని బాబు జోస్యం చెప్పార’ని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి 2019లో వీరిద్దరూ ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకొచ్చినట్టు... ఇప్పుడెందుకు కలిసినట్టు? ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారంలో పెట్టి, చివరకు కేంద్రమే ప్రతిపాదించిన భూ యాజమాన్య హక్కు చట్టంపై ప్రజానీకాన్ని పక్కదోవ పట్టించి బాబు లాభపడ్డారు. విలువలన్నిటినీ గాలికొదిలి ఏం చేసైనా అధికారంలోకి వచ్చితీరాలన్న పట్టుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత హీనంగా దుర్భాషలాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ తదితరులు ఏం మాట్లాడినా మౌనంగా ఉండిపోవటమో, ఆలస్యంగా స్పందించటమో చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలను అనుకరిస్తూ ఏపీలో ఏం జరిగినా, బాబు తదితరులు అవాకులూ చవాకులూ మాట్లాడినా ప్రధాన ఎన్నికల అధికారి ఉలుకూ పలుకూ లేకుండా నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయారు. ఆఖరికి పోలైన వోట్లకన్నా గెలిచిన అభ్యర్థికి అధికంగా వోట్లు వచ్చిన ఉదంతాలు అక్కడక్కడ బయటపడ్డాయి. ఇలాంటి అక్రమాలతో గట్టెక్కాలనే కాళ్లావేళ్లాపడి మరీ బాబు ఎన్డీఏలోకి లంఘించారు.వేదికలెక్కి విలువల గురించి గంభీరోపన్యాసాలు చేసేముందు మొన్న ఎన్నికల్లో తమ ప్రవర్తన ఎలావుందో, ఏం మాట్లాడామో చూసుకోవటం వారికే మంచిది. పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగిన చందాన వేదికలెక్కి విన్యాసాలు చేస్తే జనం నవ్విపోతారని నరేంద్ర మోదీతోపాటు ఎన్డీఏ భాగస్వామ్యపక్ష నేతలు తెలుసుకోవాలి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ ఉన్నన్నాళ్లూ ఏం చేశారో, ఎలా మెలిగారో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. -
‘మోదీ 1/3 పీఎం మాత్రమే’.. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శలు
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ నష్టాన్ని మూటగట్టుకుందని అన్నారు. నరేంద్ర మోదీ ఇక నుంచి ఒకటిలో మూడో వంతు ప్రధాని (1/3 పీఎం)గా కొనసాగుతారని ఎద్దేవా చేశారు. కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్కుమారు, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో కలిసి మోదీ ‘1/3 పీఎం’ అవుతారని అన్నారు.బీజేపీ ప్రజాస్వామ్యం కంటే పదవుల కుర్చినే ఎక్కువగా నమ్ముతుందని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి ఎక్కువ కాలం ఉండలేదని అన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ.. ఎప్పటికైనా ఎన్డీయే కూటమి నుంచి బయటకువెళ్లే వ్యక్తులేనని అన్నారు.లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సొంతంగా పూర్తి మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంకోసం ఎన్డీయే కూటమి పార్టీల మద్దతు తీసుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో జేడీ(యూ) నితీష్ కుమార్, టీడీపీ చంద్రబాబు కీలకంగా మారారు. బీజేపీ సొంతంగా 240 సీట్లు మత్రామే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 272. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో మొత్తం ఎంపీల సంఖ్య 293గా ఉంది. -
నాడు చావే శరణ్యం.. నేడు బీజేపీతోనే ప్రయాణం
బీహార్ సీఎం నితిష్ కుమార్ మౌనం వీడారు. ఎన్డీయే కూటమి వెంటే నడుస్తానంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో గతంలో క్రితం బీజేపీ కూటమిలో చేరడం కంటే చావే మేలంటూ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.ఇటీవల విడుదలైన 542 లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే (బీజేపీ) కూటమి 240 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా (కాంగ్రెస్) కూటమి 243 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఇరు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అందుకే ఎన్డీయే,ఇండియా కూటమిలు ఇరు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు పావులు కదిపాయి.ఎన్డీయే కూటమికి కటిఫ్ అంటూఈ తరుణంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ సమావేశానికి నితీష్ కుమార్.. ఇండియా కూటమికి మద్దతు పలికే తేజస్వీతో కలిసి విమానంలో ప్రయాణించారు. ఈ ప్రయాణంతో నితీష్ కుమార్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారని, ఎన్డీయే కూటమికి గుడ్‌బాయ్ చెప్పనున్నారంటూ జాతీయ మీడియా సంస్థలు కథనాలను వండి వార్చాయి.మీ వెంటే నేనుంటాఅయితే నితీష్ కుమార్ మాత్రం తాజా ఎన్డీఏ సమావేశంలో మీ వెంటే నేనుంటా నంటూ మోదీకి మద్దతు పలికారు. ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి పని చేయదు అంటూనే, తాను అన్ని వేళలా ప్రధానమంత్రి మోదీతోనే ఉంటానని అని అన్నారు.బీజేపీతో పొత్తంటే.. చావే శరణ్యంఅంతవరకు బాగానే కూటముల్ని మార్చడంలో పేరున్న నితిష్ కుమార్ గతంలో బీజేపీ కూటమికి కటిఫ్ చెప్పి.. కాంగ్రెస్ చెంతన చేరారు. ఆ సమయంలో నితిష్ మాట్లాడుతూ.. మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోను. అలా పెట్టుకోవడం కంటే చావే శరణ్యం. 2017లో కమలంతో పొత్తు పెట్టుకునే పెద్ద తప్పే చేశాను అని వ్యాఖ్యానించారు. తాజా బీజేపీ కూటమికి మద్దతు పలకడంతో నాడు నితిష్ చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. -
చంద్రబాబు, నితీశ్‌కు అందరూ స్నేహితులే: సంజయ్‌రౌత్
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏలో కీలకంగా మారిన నితీశ్‌కుమార్, చంద్రబాబులపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో జరిపే భేటీకి సంజయ్‌రౌత్ బయలుదేరారు. సందర్భంగా రౌత్ మీడియాతో మాట్లాడారు.‘బీజేపీకి మెజారిటీ ఎక్కడుంది. మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, నితీశ్‌కుమార్ అందరికీ స్నేహితులే.ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసేవారికి వారు మద్దతిస్తారని నేను అనుకోను. అయితే ఎన్నికలకు ముందే వారు బీజేపీతో కలిసి పోటీ చేసినందున వారు ఎన్డీఏ సంకీర్ణంలో కొనసాగే అవకాశాలే ఉన్నాయిసంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే శక్తి మోదీకి లేదు. ఆయన ఇంకా తన వైఖరినీ వీడలేదు. మోదీ సర్కార్, మోదీగ్యారెంటీ అని మాట్లాడుతున్నారు’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. -
ఒకే విమానంలో నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్
-
Bihar: ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్, తేజస్వి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూన్5) సాయంత్రం జరిగే ఎన్డీఏ,కూటమిల సమావేశాల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి నేతలు బయలుదేరారు. ఎవరి కూటమి సమావేశంలో ఆ కూటమికి చెందిన నేతలు పాల్గొంటారు. ఇదే విషయమై అయితే బిహార్‌లో మాత్రం ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి భేటీలో పాల్గొనేందుకు సీఎం నితీశ్‌కుమార్, ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ పరిణామంతో ఎవరు ఎవరిని ఏ కూటమి వైపు తీసుకెళ్తారనే చర్చ మొదలైంది. అయితే తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని జేడీయూ నేత కేసీ త్యాగి ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరానని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ క్లారిటీ ఇచ్చారు. -
ఎన్టీయే మిత్రపక్షాలకు గాలం.. ఇండియా కూటమి మాస్టర్‌ప్లాన్!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోల్తా పడ్డాయి. జాతీయ సర్వే సంస్థలు ఏకపక్షంగా ఎన్డీయేకు మెజారిటీ కట్టబెడితే.. ఫలితాల్లో మాత్రం ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఇక.. ఫలితాల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంటున్న వేళ పార్టీల సరళిలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా ఒక మాస్టర్‌ప్లాన్ రూపొందించుకుని దాన్నే అనుసరించే ప్ర యత్నాల్లో ఉన్నట్లు సమాచారం.లోక్‌సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారవుతున్నాయి. '400 సీట్లకు పైనే' అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే జస్ట్ మెజారిటీకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో ఈసారి చతికిలపడింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఆధిక్య స్థానాల్లో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. నేటి సాయంత్రం మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం కానుండగా.. రేపు ఎన్డీయే మిత్రపక్షాలు భేటీ కానున్నాయి. ఎన్టీయే కూటమి తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నాయి.ఇక.. ఇండియా కూటమి మరో అడుగు ముందుకు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పుంజుకోవడంతో ఎన్డీయే కూటమిలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలకు గాలం వేయడాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఇండియా కూటమి కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్డీయే కూటమిలో ఉన్న నితిష్‌ను ఇండియా కూటమి తమ వైపు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. నితీష్‌కు ఉప ప్రధాని పదవిని కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదే విధంగా ఏపీలో చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించినట్లు భోగట్టా. బాబు తమ కూటమిలో చేరితో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆశచూపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతోనూ ఇండియా కూటమి ప్రతినిధులు సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల ముందే జేడీయూ, టీడీపీలు ఎన్డీయే కూటమితో కలిశాయికాగా బిహార్‌లో 16 లోక్‌సభ స్థానాలకు గానూ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 14 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇటు టీడీపీ కూడా 14 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ, టీడీపీ దాదాపు 28 లోక్‌సభ స్థానాలను కలిగి ఉండటంతో.. వీరు ఇండియా కూటమికి మారితే కింగ్మేకర్లుగా మారే అవకాశం ఉంది. ఈ లెక్కన మున్ముందు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. -
ప్రధాని మోదీతో సీఎం నితీష్ భేటీ.. బీహార్‌లో ఏం జరగనుంది?
దేశంలో లోక్‌సభ ఎన్నికల తంతు పూర్తయ్యింది. ఇక ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలివుంది. ఈ నేపధ్యంలో దేశంలో పలు ఆసక్తిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది.ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు జరిగిన ఈ భేటీలో బీహార్ రాజకీయాలతో పాటు ఇతర ప్రాంతాల రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి అమిత్‌షాతో నితీష్ కుమార్ సమావేశం కానున్నారు.ప్రధానితో సీఎం నితీశ్ కుమార్ భేటీ వెనుక అనేక అంశాలు ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. బీహార్ సహా దేశవ్యాప్తంగా ఎన్డీఏ సీట్లను అంచనా వేయడం, నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక క్యాబినెట్లో జేడీయూ పాత్ర ఎలా ఉండనుంది? భవిష్యత్తులో రెండు ప్రభుత్వాలు కలిసి ఎలా పని చేయాలి? అనే అంశాలపై వీరిమధ్య చర్చ జరిగినట్లు సమాచారం.హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ నుంచి పాట్నాకు తిరిగి వెళ్లనున్నారు. సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటనలో ఆయన వెంట జేడీయూ రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా కూడా ఉన్నారు. రేపు (శనివారం) లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. -
మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
నేతల ఉత్సాహ పూరిత ప్రసంగాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లుతుంటాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పొరపాటుగా ఒక వ్యాఖ్యానం చేసి, నలుగురిలో నవ్వులపాలయ్యారు.సీఎం నితీశ్ కుమార్ ఎన్నికల ప్రసంగాల్లో జనాన్ని ఉత్సాహపరిచేందుకు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఒక్కోసారి తడబటడం, నోరు జారడం లాంటివి జరుగుతుంటాయి. తాజాగా ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం నితీష్ టంగ్ స్లిప్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.బీహార్‌లోని పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గంలోని దానియావాన్‌లో బీజేపీ నేత, ఎన్డీఏ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రసంగిస్తూ, లోక్‌సభలో బీజేపీ 400కు పైగా సీట్లను గెలుచుకుంటుందని, ప్రజలంతా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. నితీష్ నోటివెంట ఈ మాట రాగానే అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. అయితే వేదికపై ఉన్న ఇతర నేతలు జరిగిన పొరపాటును సీఎంకు గుర్తు చేశారు. దీంతో ఆయన.. ప్రధాని మోదీ మరోసారి దేశానికి ప్రధాని అవుతారని సర్దిచెప్పారు.గతంలోనూ సీఎం నితీష్ కుమార్ ఇలా పలుమార్లు నోరు జారారు. వైశాలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి వీణా దేవికి మద్దతుగా ప్రసంగిస్తూ, బీహార్‌లోని 40 స్థానాల్లో ఎన్డీఏ గెలవాలని కోరుకుంటున్నానని, మన కూటమి దేశం మొత్తం మీద నాలుగు వేల సీట్లు గెలవాలని అభిలషిస్తున్నానని అన్నారు. -
సీఎం నితీష్ కుమార్ జీ మీరెక్కడా? బీజేపీ ప్రచారంపై తేజస్వీ ప్రశ్నల వర్షం
బీహార్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీ ఎన్నికల ర్యాలీలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గైర్హాజరవుతున్నారు. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ గయా, పూర్ణియాలో చేపట్టిన ర్యాలీలకు జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ హాజరుకాకపోవడాన్ని తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. సీఎం నితీష్ కుమార్జీ మీరెక్కడా? ఎన్నికల ర్యాలీలకు బీజేపీ ఆయనను ఎందుకు ఆహ్వానించడం లేదు? మంగళవారం జరిగిన ప్రధాని మోదీ ర్యాలీలో కూడా ఆయన ఎందుకు కనిపించలేదంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగానికి సంబంధించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని చేసిన ఆరోపణలపై తేజస్వీ యాదవ్ స్పందించారు. మోదీ మూడవసారి అధికారంలోకి రాగానే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కమలం నేతలే చెబుతున్నారు. వారిపై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, యువతకు ఉపాధి కల్పించడం, పేదరికాన్ని తగ్గించడం, నల్లధనాన్ని భారతదేశానికి వెనక్కి తీసుకురావడం గురించి ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు? అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నొక్కాణించారు. -
‘ఇక మాట్లాడింది చాలు’.. బహిరంగ సభలో సీఎం నితీష్‌కు అవమానం
పాట్నా : బీహార్‌లో ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు. బీజేపీ అభ్యర్థి వివేక్ ఠాకూర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవాడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కూటమిలో భాగంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం హాజరయ్యారు. అయితే ఈ సభలో సీఎం నితీష్ కుమార్‌కు సొంత పార్టీల నేతల నుంచి తీవ్ర అవమానం ఎదురైంది. నవాడాలో లోక్‌సభ ఎన్నికలను ఉద్దేశిస్తూ భారీ బహిరంగ సభలో నితీష్ కుమార్ 25 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో నితీష్ కుమార్ పలు మార్లు తడబడ్డారు. 400కు బదులు 4000 మందికిపైగా ఎంపీల గెలుపుతో మోదీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు. సీఎం నితీష్ ప్రసంగిస్తుండగా.. ఆ పార్టీల నేతలు తమవాచీలు చూసుకుంటూ.. మీ ప్రసంగం ఇంక చాలంటూ చేతులతో సంజ్ఞలు చేశారు. आज नीतीश जी ने तो 4000 पार का नारा लगा दिया। 🤣 pic.twitter.com/Sef6ACaSxo — Kanchana Yadav (@Kanchanyadav000) April 7, 2024 జనతాదళ్ యునైటెడ్ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి వేదిక ముందు వరుసలో కూర్చొని తన గడియారాన్ని తనిఖీ చేస్తూ కదులుతూ కనిపించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రికి సైగలు చేసి, తన ప్రసంగాన్ని ముగించమని సైగలు చేశారు. పలువురు నాయకులు పోడియం వైపు అసహనంగా ఎదురుచూస్తూ కనిపించారు. This should go viral and everyone in Bihar should watch this Nitish Kumar had to touch Modi's feet and then do Pranam to him. This is what Chief Minister has reduced to? Stop treating someone like God. pic.twitter.com/6aH6UgR7CH — AmOxxicillin FC (@amoxcicillin1) April 7, 2024 దీంతో చేసేది లేక రెండు నిమిషాల తర్వాత తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. అనంతరం ప్రధాని మోదీ.. నితీష్ కుమార్ ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు. ‘మీరు మంచి ప్రసంగం ఇచ్చారు. నేను మాట్లాడడానికి ఏమీ మిగల లేదు’ అని అన్నారు. అంతే వెంటనే కృతజ్ఞతగా నితిష్ కుమార్ చిరునవ్వులు చిందిస్తూ మోదీ పాదాలు తాకారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
Bharat Ratna : భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి (ఫొటోలు)
-
ఎమ్మెల్సీలుగా నితీశ్, రబ్డీ దేవి ఏకగ్రీవం
పట్నా: బిహార్ శాసనమండలి సభ్యులుగా సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీ దేవి సహా 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్జేడీకి చెందిన రబ్డీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేబినెట్ మంత్రి సంతోష్ సుమన్ కూడా మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్ కుమార్ గురువారం పార్టీ నాయకులతో శాసనమండలి సెక్రటేరియట్‌కు చేరుకుని ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. -
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన బిహార్ సీఎం నితీష్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు(ఎమ్మెల్సీ) పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి అందించారు. నితీష్ కుమార్‌తో పాటు జేడీయూకు చెందిన ఖలీద్ అన్వర్, జితిన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం) కుమారుడు సంతోష్ సుమన్ సైతం శాసనమండలికి నామినేషన్లు దాఖలు చేశారు. నితీష్ వెంట ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, లలన్ సహా పలువురు అధికార ఎన్డీయేకు చెందిన సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఈ ఏడాది మే తొలి వారంలో నితీష్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. ఆయనతోపాటు రబ్రీదేవి(ఆర్జేడీ), షానవాజ్ హుస్సేన్(బీజేపీ), సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), ప్రేమ్ చంద్ర మిశ్రా(కాంగ్రెస్), సంతోష్ కుమార్ సుమన్(హెచ్ఏఎం-ఎస్), మంగళ్ పాండే(బీజేపీ), రామ్ చంద్ర పుర్వే(ఆర్జేడీ), ఖలీద్ అన్వర్(జేడీ-యూ), రామేశ్వర్ మహతో(జేడీ-యూ), సంజయ్ పాశ్వాన్(బీజేపీ) పదవీ కాలం కూడా మే నెలలో ముగియనుంది. చదవండి: 'సందేశ్‌ఖాలీ' కేసులో సుప్రీంకోర్టుకు దీదీ సర్కార్ ఈ నేపథ్యంలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 చివరితేదీ. మార్చి 21వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం.. ఆరు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగతా ఐదు స్థానాలు మహాఘటబంధన్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ తాము నాలుగు స్థాన్లాలో పోటీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. మరో స్థానాన్ని మిత్రపక్షం హిందూస్థాన్ ఆవాస్ మోర్చాకు కేటాయించనున్నట్లు తెలిపారు. -
Bihar: నితీశ్ జోకులు.. ప్రధాని నవ్వులు
పాట్నా: బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ తన మాటలతో ప్రధాని మోదీని నవ్వించారు. రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో శనివారం జరిగిన రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ, నితీశ్‌కుమార్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ ‘ఇంతకుముందు మీరు వస్తే నేను మాయమయ్యేవాడిని. కానీ ఇప్పుడు మీతోనే ఉన్నాను. ఇక నేను అటు ఇటు వెళ్లను మీతోనే ఉంటానని మాటిస్తున్నాను’అని అనడంతో మోదీ నవ్వారు. బీజేపీ, జేడీయూ కలిసి పూర్తి ఐదేళ్లు లేకున్నా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సంకీర్ణ ప్రభుత్వాన్ని వదిలి పెట్టిన నితీశ్ ఎన్డీఏతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామం తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ తొలి పర్యటనకు వచ్చినపుడు నితీశ్‌కుమార్ తన మాటలతో పండించిన హాస్యం ఆసక్తికరంగా మారింది. #WATCH | Bihar CM Nitish Kumar says, "...You (PM Modi) had come earlier as well, 'par idhar hum gayab ho gaye the. Hum phir aapke saath hai.' I assure you that I will not go here and there. 'Hum rahenge aap hi ke saath'..." pic.twitter.com/itLbLBS5rg — ANI (@ANI) March 2, 2024 ఇదీ చదవండి.. వారణాసి నుంచే మళ్లీ మోదీ -
‘ఇక మీతోనే ఉంటా..’ ప్రధాని మోదీ నవ్వులు
పట్నా: తాను ఇక పార్టీలు మారబోనని బీజేపీ-ఎన్డీయే కూటమిలో ఉంటానని బిహార్ సీఎం నితీష్‌కుమార్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాటిచ్చారు. నితీష్ మాటలతో వేదికపై ఉన్న ప్రధాని మోదీ సహా పలువురు నేతలు పగలబడి నవ్వారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. #WATCH | Bihar CM Nitish Kumar says, "...You (PM Modi) had come earlier as well, 'par idhar hum gayab ho gaye the. Hum phir aapke saath hai.' I assure you that I will not go here and there. 'Hum rahenge aap hi ke saath'..." pic.twitter.com/itLbLBS5rg — ANI (@ANI) March 2, 2024 ‘మీరు(మోదీ) త్వరగా వచ్చారు. లేకపోతే నేను పూర్తిగా మాయమయ్యేవాడిని. కానీ, నేను మీతో( మోదీ) ఉన్నా. నేను మీకు హామీ ఇస్తున్నా నేను ఏ కూటమిలోకి మారబోను. నేను మీతోనే ఉంటాను’ అని సీఎం నితీష్ కుమార్ అన్నారు. నితీష్ కుమార్.. బిహార్‌లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీ ఎన్డీయే కూటమిలో చేరిన విషయం తెలిసిందే. జనవరిలోని నితీష్ కుమార్ బీజేపీ కూటమి మద్దతుతో తొమ్మిదోసారి సీఎం ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక.. రూ. 4,800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ బిహార్‌లో పర్యటించారు. -
ఇండియా కూటమి కథ ముగిసింది: నితీశ్ కుమార్
పాట్నా: ఎన్డీఏలో చేరి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఇండియా కూటమిపై తొలిసారి స్పందించారు. శనివారం పాట్నాలో ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందునుంచే ఇష్టం లేదని చెప్పారు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించానన్నారు. బిహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీయేలో చేరానన్నారు. కాగా, ఇప్పటికే ఇండియా కూటమిలో పలు పార్టీలు పొత్తులను పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కూటమిలోని కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీట్లను తేల్చకపోవడం వల్లే మిగిలిన పార్టీలు సొంతగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. w ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ -
Bihar: ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు
పాట్నా: బిహార్‌లో ఎంఐఎం పార్టీకి చెందిన మరో నేతను దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైలెక్కేందుకు రైల్వేస్టేషన్‌కు బంధువుతో కలిసి బైక్‌పై వెళుతున్న ఎంఐఎం నేత సలామ్‌పై రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సలామ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సలామ్ ఎంఐఎం తరపున గోపాల్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాల్పుల ఘటనపై దర్యాప్తునకుగాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గోపాల్‌గంజ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ తెలిపారు. పార్టీ నేత దుండగుల కాల్పుల్లో చనిపోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కుర్చీ కోసం పాకులాట తప్ప నితీశ్‌కుమార్‌కు బిహార్‌లో శాంతిభద్రతలు కాపాడటం చేతకావడం లేదని ఒవైసీ మండిపడ్డారు. తమ పార్టీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్లో సివాన్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఆరిఫ్ జమాల్‌ను దుంగులు కాల్చి చంపారు. ఇదీ చదవండి.. మొదలైన ఢిల్లీ ఛలో.. పోలీసుల హై అలర్ట్ -
బలపరీక్షలో నితీశ్ ప్రభుత్వం విజయం
-
మీ మేనల్లుడు మోదీని అడ్డుకుంటాడు: తేజస్వీ యాదవ్
బిహార్‌లో జేడీ(యూ).. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు(సోమవారం) నితీష్ కుమార్ జేడీయూ ప్రభుత్వం బలపరీక్ష ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. నితీష్ కుమార్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. బిహార్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వరంలోని బీజేపీని తాము ఎదుర్కొంటామని అన్నారు. ఒక టర్మ్‌లో మూడుసార్లు సీఎం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మిగిలిపోతారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ‘నితీష్ కుమార్ విషయంలో జేడీయూ ఎమ్మెల్యేలు బాధ పడతారు. ఎందుకంటే వారు ప్రజల్లోకి వెళ్లితే.. ప్రజల నుంచి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ నాయకుడు మూడు సార్లు సీఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారంటే ఏం చెబుతారు?. గతంలో బీజేపీని తిట్టి.. ఇప్పుడు అదే పార్టీపై పొగడ్తలు కురిపిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారు?’ అని జేడీ(యూ) ఎమ్మెల్యేలను తేజస్వీ ప్రశ్నించారు. ‘నేను సీఎం నితీష్ కుమర్‌కు ఓ కుటుంబ సభ్యుడిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మాదంతా సమాజ్‌వాదీ కుటుంబం.దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకున్నేందు మీరు(నితీష్‌కుమార్) ఎగురవేసిన జెండాను మీ మేనల్లుడు(తేజస్వీ యాదవ్) కొనసాగిస్తాడు. బిహార్‌లో మోదీని అడ్డుకుంటాం’ అని తేజస్వీ అన్నారు. నితీష్‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తరచూ ‘మామా’ అని ఆప్యాయంగా పిలుస్తారన్న విషయం తెలిసిందే. బీజేపీ దివంగత సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వటం సంతోషమన్న తేజస్వీ.. ఒక రాజకీయ ఒప్పదం ప్రకారమే ఇచ్చిందని మండిపడ్డారు. ఆ క్రమంలో బిహార్‌లోని మహాఘట్బంధన్ను బీజేపీ చీల్చిందని దుయ్యబట్టారు తేజస్వీ యాదవ్. చదవండి: బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ -
బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్
బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన నితీష్ సర్కార్ సీఎం నితీష్‌కుమార్‌కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు బిహార్‌లో మొత్తం 243 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 122 శాసన సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్ నితీష్ కుమార్‌కు అనుకూలంగా ఓటేసిన ఐదుగురు విపక్ష సభ్యులు బిహార్ అసెంబ్లీలో బలపరీక్ష అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం నితీష్ కుమార్ నితీష్ కుమార్‌పై తేజస్వీ యాదవ్ ఘాటు విమర్శలు బీహార్‌లో ఏ ఒక్కరికీ నితీష్ కుమార్‌పై నమ్మకం లేదు నీతీష్ మళ్లీ జంప్ చేయరని మోదీ గ్యారంటీ ఇవ్వగలరా? బిహార్ అసెంబ్లీ స్పీకర్‌పై నెగ్గిన అవిశ్వాసం అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు ప్రస్తుత బిహార్ స్పీకర్‌గా ఆర్జేడీ నేత బిహారీ చౌదరి నితీష్‌కు అనుకూలంగా ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు బిహార్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. కొత్తగా కొలువుదీరిన జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్- బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనుంది. ఈ బల పరీక్షలో ఎన్డీయే సర్కార్ సులువుగా నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధాన విపక్షమైన ఆర్జేడీ తన బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బిహార్ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాసం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 113 ఓట్లు వచ్చాయి. అయితే నితీష్‌కు అనుకూలంగా ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఓటేయ్యడం గమనార్హం. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఆర్జేడీ నేత బిహారీ చౌదరి ఉన్నారు. #WATCH | Bihar Governor Rajendra Arlekar addresses the State Assembly Floor Test of CM Nitish Kumar's government to prove their majority will be held today. pic.twitter.com/uE1jWBIdmr — ANI (@ANI) February 12, 2024 అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. BIG BREAKING: Tejashwi Yadav reaches the Bihar assembly for the floor test. The wait is over, 'Khela' begins now 🔥#BiharFloorTest pic.twitter.com/lVhoJ8qBqg — Ankit Mayank (@mr_mayank) February 12, 2024 బిహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తర్వాత గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని(ఆర్జేడీ నేత) తొలగించాలంటూ ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన వెంటనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత బల పరీక్ష జరగనుంది. #BiharFloorTest | Bihar CM and JDU national president #NitishKumar arrives at the #Bihar Assembly in Patna ahead of the floor test of his government today.#Bihar #JDU #BiharFloorTest #NitishKumar #BiharPoliticalCrisis #TejashwiYadav #तेजस्वी_ज़रूरी_है #Patna #ElvishYadav… pic.twitter.com/l2TjHuhzkJ — Neha Bisht (@neha_bisht12) February 12, 2024 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం బీజేపీ-జేడీయూ కూటమికీ 128 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 78, నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి 45, జితిన్ రామ్ మంఝీకి చెందిన ఆవామ్ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు, ఒకరు స్వతంత్ర్య ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష కూటమికి 114 ఎమ్మెల్యేల బలం ఉంది. ఆర్జేడీ-79, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-12, సీపీఎం-2, సీపీఐ-2, ఇతరులు-1, ఏఐఎంఐఎం-1..కూటమికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. చదవండి: Bihar Assembly Floor Test: నేడు బీహార్‌లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత? కాగా జనవరి 28న రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు కూటములు తమ ఎమ్మెల్యేలు గీత దాటకుండా క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. ప్రతిపక్ష 'మహాఘట్బంధన్'కు చెందిన 79 మంది శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నివాసంలో మకాం వేశారు. ఇటు కాంగ్రెస్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు బిహార్‌కు బయలుదేరారు. మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్‌ను హౌస్ అరెస్టు చేశారని ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఆయన ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
నేడు బీహార్‌లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత?
2024, జనవరి 28.. లాలూకు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌తో కూడిన మహాకూటమి ప్రభుత్వానికి ముగింపు పలికిన బీహార్ సీఎం నితీష్.. బీజేపీ మద్దతుతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపధ్యంలో నితీష్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. 14 రోజుల తరువాత అంటే ఈరోజు (ఫిబ్రవరి 12) బీహార్ అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా లేదా అనేది తేలిపోనుంది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని 14 రోజుల ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నేడు బీహార్ అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంది. దీనినే ఫ్లోర్ టెస్ట్ అని అంటారు. బీహార్ అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243. దీనిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండు వంతులు ఉండాలి. అంటే 122 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ సంఖ్య 122 కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వం పడిపోతుంది. జనవరి 28న మహాకూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి పదవికి సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేసినప్పుడు, ఆయనకు బీజేపీ మద్దతు లేదు. ఆయన పార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్‌కు చెందిన 45 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అయితే ఆయన రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తన 78 మంది ఎమ్మెల్యేల మద్దతును జేడీయూకి అందించింది. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా నితీష్‌కు మద్దతు పలికారు. ఒకే స్వతంత్ర అభ్యర్థి నితీష్ కుమార్ వెంట నిలిచారు. ఈ విధంగా నితీష్ కుమార్ రాజ్ భవన్లో మొత్తం 128 మంది ఎమ్మెల్యేల మద్దతును చూపించారు. అనంతరం కొత్త మంత్రివర్గంతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి పక్షంలో 114 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున రాజ్‌భవన్ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ప్రస్తుతం ఆర్జేడీలో 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో 19 మంది, వామపక్షాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరే కాకుండా అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. ఇలా మొత్తంగా 114 మంది ఎమ్మెల్యేలున్నారు. -
జేడీ(యూ) ఎల్పీ భేటీకీ ఎమ్మెల్యేలు డుమ్మా
పాట్నా: సీఎం నితీశ్ కుమార్ సర్కారుపై అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అధికార జేడీయూ ధీమా వ్యక్తం చేసింది. శనివారం సీఎం నితీశ్ ఇచ్చిన విందుకు కొందరు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఆదివారం మంత్రి విజయ్ కుమార్ చౌదరి అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభా పక్షం భేటీకి సైతం కొందరు గైర్హాజరవడం కలకలం రేపింది. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితుల్లో గైర్హాజరయ్యారని చౌదరి చెప్పారు. తొలుత ఆర్జేడీకి చెందిన స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం, అనంతరం ప్రభుత్వంపై విశ్వాస పరీక్షలో వారంతా ఓటేస్తారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ జేడీయూ ఎల్పీ భేటీలో పాల్గొనడం విశేషం. సోమవారం వామపక్ష సభ్యులతో కలిసి ఆర్జేడీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారని తెలిసింది. వారం రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం పటా్న చేరారు. -
నితీష్ పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది?
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతోంది. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్‌సింగ్ కుష్వాహ ప్రకటించడం విశేషం. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు పూరిగా నిరాధారమన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రతిపక్షం రాజకీయ నిరుద్యోగిగా మారింది. నితీష్ కుమార్ పార్టీ(జేడీయూ)ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు నిరాధారమైన, అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. గందరగోళ పరిచే రాజకీయాలు ఎప్పటికీ ఫలించవు. చివరికి ‘వారికి’ నిరాశే మిగులుతుంది. రాష్ట్రంలో ఎన్డీఏకి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మెజారిటీ కంటే ఆరు ఎక్కువ. ఈ లెక్కలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. దీనికి భయపడే కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించింది. ఎదుటివారి ఇళ్లను ధ్వంసం చేసేందుకు కుట్ర చేసే ముందు ప్రతిపక్షాలు సొంత ఇంటి గురించి ఆలోచించాలని ఉమేష్‌సింగ్ కుష్వాహ సూచించారు. బీహార్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున అంటే సోమవారం(ఫిబ్రవరి 12) బలపరీక్ష జరగనుంది. దీనికి ముందు శనివారం పట్నాలో జేడీయూకి చెందిన మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలిన జేడీయూ ఆహ్వానించింది. ఈ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఆదివారం మంత్రి విజయ్ చౌదరి నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేల విందు కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. -
బిహార్ స్పీకర్ రేసులో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
పట్నా: బిహార్‌లో బీజేపీ మద్దతుతో జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుంచి రాష్ట్ర స్పీకర్ పదవిపై బీజేపీ, జేడీయూ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. బిహార్‌్ స్పీకర్ పదవి కోసం ఐదుగురు ఆశావహులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రస్తుత స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధి బిహారీ స్థానంలో బీజేపీ నేతకు అవకాశం ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచే ఐదుగురు స్పీకర్ పదవి కోసం పోటీపడటం గమనార్హం. బీజేపీ పార్టీలోని నందకిషోర్ యాదవ్, నితీష్ మిశ్రా, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి, సంజయ్ సరోగి, జానక్ సింగ్ స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ఫైనల్ నిర్ణయం మాత్రం కేంద్రంలోని బీజేపీ అధిష్టానం చేతిలో ఉందని చర్చ నడుస్తోంది. నందకిషోర్ యాదవ్: బీసీ సామాజిక వర్గానికి చెందిన నందకిషోర్ గతంలో పలు మంత్రి పదవులను స్వీకరించారు. ఆయన పట్నా సాహిబ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ మేధామిగా.. పార్లమెంటరీ ప్రొసిడింగ్స్పైన పట్టు ఉన్న వ్యక్తిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. నితీష్ మిశ్రా: మాజీ సీఎం డా. జగన్నాథ్ మిశ్రా కుమారుడు. ఈయనకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్‌పై పట్టు ఉందనే గుర్తింపు ఉంది. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నితీష్ మిశ్రా.. ఝంఝర్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సంజయ్ సరోగి: దర్బంగా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయనకు స్పీకర్ పదవి ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగోతంది. మాస్ లీడర్‌గా పేరున్న ఈయన ఉన్నతమైన విద్యార్హతలు కలిగి ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా సంజయ్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈయన బనియా(వ్యాపార) సామాజకవర్గానికి చెందిన వ్యకి. బీజేపీకి ఈయన సమాజిక వర్గం నుంచి బలమైన ఓటు బ్యాంక్ ఉండటం గమనార్హం. జానక్ సింగ్: తారణ్య అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఈయన అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి. ఈయినకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్ మంచి పట్టు ఉంది. రాజ్‌పుత్ వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ పదవి కేటాయించాలని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. రేణు దేవి: మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి స్పీకర్ పదవిపై కన్నేశారు. వెనబడిన నోనియా సామాజికవర్గానికి చెందిన ఆమెకు సామాజిక సమీకరణాల దృష్ట్యా స్పీకర్ పదవిని కేటాయిస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఇక.. ప్రస్తుత ఆర్జేడీ పార్టీకి చెందిన అవధ్ బిహారి ఇప్పటికీ స్పీకర్ పదవికి రాజీనామా చేయలేదు. బీజేపీ పార్టీ అతనిపై అవిశాస్వ తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానం ద్వారా స్పీకర్ పదవి కోల్పోతే.. బిహార్ చరిత్రలో స్పీకర్ పదవి కోల్పోయిన మొదటి వ్యక్తిగా అవధ్ బిహారి నిలుస్తారు. -
‘‘ఇండియా కూటమికి నితీశ్ అంత్యక్రియలు చేశారు’’
లక్నో: ఇండియా కూటమిపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పుట్టగానే దానికి ఎన్నో వ్యాధులు సంక్రమించాయని, ఆ తర్వాత అది వెంటిలేటర్‌పైకి వెళ్లిందని ప్రమోద్ అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఇండియా కూటమికి ఇటీవలే జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాట్నాలో అంత్యక్రియలు పూర్తి చేశారని చెప్పారు. ఇప్పుడిక ఇండియా కూటమి అనేది ఉనికిలో ఉందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రమోద్ ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపైనా పదునైన విమర్శలు గుప్పించారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడుతుంటే ఒక్క కాంగ్రెస్ మాత్రం 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని వ్యంగ్యాస్రం సంధించారు. గత వారమే ఒక విషయమై ప్రమోద్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన త్వరలో కాంగ్రెస్‌ను వీడీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రమోద్ గత ఎంపీ ఎన్నికల్లో లక్నో నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ఇదీచదవండి.. ‘‘ఈవీఎంల గోల్‌మాల్‌లో ప్రధాని హస్తం ఉండొచ్చు’’ -
మనం ఎందుకు పట్టించుకోం?
భారత రాజకీయాల గురించి ఒక శోచనీయమైన, దురదృష్టకరమైన నిజానికి నితీశ్ కుమార్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం ఏ పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లిమొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో యూకేలో కన్జర్వేటివ్‌లతో లిబరల్స్ పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతిమాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ కుప్పకూలింది. మరి ఈ ‘దుముకుళ్లను’ మన ఓటర్లు ఎందుకు సమ్మతిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? నాయకులు పార్టీని వదిలి వెళ్లడం, వేరే పార్టీలో చేరడం మన అందరికీ బాగా తెలి సిన విషయమే. మనం ఆశించినంతగా ఏమీ వారు అసాధారణమైన వ్యక్తులు కారు. కానీ నితీశ్ కుమార్ అంత బుద్ధిహీనమైన పని చేసిఉండాల్సింది కాదని మీరు అంగీకరిస్తారా? ఆయన అలా చేయకుండా ఉండలేరని అందరూ ఊహిస్తున్నదే అయినప్పటికీ ఆయన ప్రవర్తన నాకు నిజంగా చాలా దిగ్భ్రాంతిని కలుగజేసింది. ఆత్మగౌరవం గల ఒక మనిషి – రాజకీయ నాయకుడే అయినా – తన సొంత రాజకీయ మనుగడ కోసం తను కట్టుబడి ఉండవలసిన విలువల్ని, సిద్ధాంతా లను వెనక్కు నెట్టేయగలిగినంతగా దిగజార గలడని నేను నమ్మ లేకపోయాను. 2013 నుండి, నితీశ్ తన వ్యక్తిగత రాజకీయ జీవితాన్నిముందుకు తీసుకెళ్లడానికి హఠాత్తుగా కూటములను మార్చేయటం ఇది ఐదోసారి. అయితే నా సహోద్యోగి అశోక్ ఉపాధ్యాయ అనటం ఏమిటంటే – మీరు కనుక నితీశ్ 1994లో సమతా పార్టీని స్థాపించడం కోసం లాలూ ప్రసాద్ యాదవ్‌తో, జనతాదళ్‌తో తెగతెంపులు చేసు కోవటాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఆయన అలా చేయడం ఆరో సారి అవుతుందని! నేను అంతగా ఎందుకు ఆశ్చర్యపోయానని మీరు నన్ను అడగ వచ్చు. రెండు కారణాలు. నితీశ్ మళ్లీ అలాంటి పని చేస్తాడని నేను ఊహించలేదు. అలా చేస్తే కనుక విశ్వసనీయత ప్రమాదంలో పడి పోయే స్థాయికి ఆయన ఇప్పటికే చేరుకుని ఉన్నారని నా భావన. ఆయన అలా చేస్తాడని నేను అనుకోకపోవటానికి రెండో కారణం మరింతగా నిస్సందేహమైనది. బీజేపీతో తిరిగి కలిసే అవకాశంపై ఆయన, ఆయన్ని తిరిగి రెండోసారి కూటమిలోకి చేర్చుకునే విషయమై బీజేపీ... ‘అసలు అలాంటి ఆలోచనే లేదన్నట్లు’గా స్పష్టం చెయ్యటం జరిగింది. ఏడాది క్రితమే 2023 జనవరి 30న, ‘‘ఏదో ఒక రోజు మీరు బీజే పీలో తిరిగి కలుస్తారా?’’ అని అడిగినప్పుడు నితీశ్ ఇలా అన్నారు: ‘‘మర్ జానా కబూల్ హై, ఉన్ కే సాథ్ జానా హమ్కో కభీ కబూల్ నహీ హై. యే అచ్ఛీ తరహ్ జాన్ లీజియేగా.’’ (చావనైనా చస్తాను కానీ, వాళ్లతో వెళ్లి కలిసేది లేదు. దీనిని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి.)తర్వాత కొన్ని వారాలకు 2023 ఫిబ్రవరి 25న ఇదే ప్రశ్న హోంమంత్రి అమిత్ షాకు ఎదురైంది. బీజేపీ నితీశ్‌ను మరొకసారి అక్కున చేర్చుకోటానికి సుముఖంగా ఉందా? ‘ది హిందూ’లో వచ్చిన దానిని బట్టి అమిత్ షా ఈ విధంగా సమాధానం చెప్పారు: ‘‘ఆయా రామ్, గయా రామ్‌లు ఇక చాలు. నితీశ్ కుమార్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూతపడ్డాయి.’’ సరే, నితీశ్ కుమార్ ఏడాది క్రితం స్పష్టంగా మరణం కంటే అధ్వాన్నం అని భావించిన దానినే ఇప్పుడు కోరుకున్నారు. ఇక ‘ఎప్పటికీ’ అనేది అమిత్ షా ఉద్దేశంలో కేవలం తాత్కాలికం అని మాత్రమే కాదు, హాస్యాస్పదంగా అది ఎంతో స్వల్పకాలిక వ్యవధి అని కూడా!ఈ వైఖరులపై అవమానకరమైన మాటలు వచ్చి పడటంలోవింతేమీ లేదు. నితీశ్‌ని పల్టూరామ్, పల్టూమార్, పల్టూపుత్ర అంటు న్నారు. శశి థరూర్ అయితే సహజంగానే ఇప్పుడంతగా వాడుకలో లేని ఆంగ్ల పదాన్ని నితీశ్‌కు అన్వయించడం కోసం తవ్వి తీశారు. ‘స్నోలీగోస్టర్’ అనే మాట అది. ‘తెలివైన, కానీ విలువల్లేని వ్యక్తి’ అని ఆ మాటకు అర్థం. ఏమైనా ఈ పరిణామంపై నా ఆందోళన ఇక్కడితో ఆగటం లేదు. భారతదేశ రాజకీయాల గురించి విచారం వ్యక్తం చేయదగిన, దురదృష్టకరమైన ఒక నిజానికి నితీశ్ కుమార్ సాక్ష్యంగా నిలిచారా? ఈ విధమైన అవకాశవాదం, పదేపదే మిత్రపక్షాలను మార్చటం అనేది ఏ ప్రధాన పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశంలోనూ ఆమోదయోగ్యమైనది కాదు. పైగా ఖండించదగినది. అది ఆ నాయకుడి విశ్వసనీయతను, పార్టీ ప్రతిష్ఠను నాశనం చేస్తుంది. నితీశ్ కుమార్ పిల్లి మొగ్గలతో పోల్చలేం కానీ, 2010లో బ్రిటన్‌లో లిబరల్స్ అనేవాళ్లు కన్జర్వేటివ్ లతో పొత్తు పెట్టుకున్నప్పుడు అదొక నీతి మాలిన చర్యగా పరిగణన పొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓట్లు రాబట్టలేక లిబరల్ పార్టీ కుప్పకూలింది... ఇండియాలో జరగని విధంగా! మన భారతీయులం భిన్నంగా ఎలా ఆలోచి స్తామో, భిన్నంగా ఎలా స్పందిస్తామో చూపించటానికి అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ కొన్ని ఉదాహ రణలు మాత్రమే. మధ్యప్రదేశ్‌లో ప్రతి పక్షంలో ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకు రావటానికి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరినవారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ గత ఏడాది డిసెంబర్ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీని సాధించారు. ఈ దుముకుళ్లను మన ఓటర్లు ఎందుకు సమ్మ తిస్తారు? తమను గెలిపించిన వారికి ద్రోహం చేసి వెళ్లిన రాజకీయ నాయకులకు మన ఓటర్లు ఎందుకు శిక్ష విధించరు? ప్రజాసేవ కంటే, నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత కంటే తమ ప్రయోజనాలకు, సంపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఎందుకు మన ఓటర్లు పట్టించుకోరు?ఎందుకు అన్నదానిపై అనేక విధాలైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా కూడా నా దగ్గర సమాధానమైతే లేదు. వాటిల్లో ఒక అభిప్రాయం... అలాంటి రాజకీయ నాయకులు తమ నియోజక వర్గాలకు కావలసినవన్నీ చేసిపెడుతుంటారని; అలాగే వారి నేర్పరి తనం, రాజకీయ చలనశీలత వారిపై వ్యతిరేకతను కాక, ప్రజల మన్ననను పొందేలా చేస్తోందని! కానీ ఆ అభిప్రాయాలు సరైనవని అనిపించేవి కావు. సాకులు లేదా, అనుకూల వాదనలు. లేదంటే నిలబడని సమర్థింపులు. చివరికి చెప్పొచ్చేదేమంటే, లోపం మనలో ఉన్నదే కానీ, మన తలరాతలో ఉన్నది కాదు. తెలిసే మనం ఇలాంటి నాయకులకు, తమ స్వార్థం కోసమే తప్ప మరింత గొప్ప లక్ష్యాలకు, గొప్ప ప్రజా ప్రయో జనాలకు కట్టుబడి ఉండని వారికి – వాళ్లెప్పుడైనా ప్రజలకు కొంత మేలు చేస్తే చేసి ఉండొచ్చుగాక – ఓటు వేస్తాం. అది కొనసాగినంత కాలం భారతదేశ నితీశ్‌కుమార్‌లు మన రాజకీయాలను స్వేచ్ఛగా నడిపిస్తూనే ఉంటారు. మన భవిష్యత్తును కూడా! - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - కరణ్ థాపర్ -
హైదరాబాద్ వేదికగా మరో క్యాంపు రాజకీయం
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)క్యాంపు రాజకీయం ముగియటంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాష్ట్రం జార్ఖండ్‌కు బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్ మరో రాష్ట్ర క్యాంపు రాజకీయాలకు వేదికైంది. తాజాగా బిహార్ క్యాంపు రాజకీయం తెలంగాణలోని హైదరాబాద్‌కు చేరుకుంది. బిహార్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లోని ఇబ్రహింపట్నం పార్క్ అవెన్యూ రిసార్ట్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ క్యాంపు బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి తెలంగాణ పీసీసీ అప్పగించింది. #WATCH | Telangana: The 16 Congress MLAs reach Hyderabad. The floor test of the newly elected NDA government in Bihar is likely to happen on February 12. (Visuals from Hyderabad airport) pic.twitter.com/SELbKPBlPG — ANI (@ANI) February 4, 2024 ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాఘట్ బంధన్ కూటమి నుంచి వైదొలగడంతో బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి గుడ్‌బై చెప్పిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఎన్డీయే కూటమిలో చేరి.. నితీష్ కుమార్ బిహార్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిహార్‌కు 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనుంది. అయితే ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు గురి కావొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ అప్రమత్తమై ఎమ్మెల్యేను హైదరాబాద్‌కు తరలించటం గమనార్హం. -
మాకు నితీష్ అవసరం లేదు: రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ భారత జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం బిహార్‌లో సాగుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ వైదోలిగన మరుసటి రోజే(సోమవారం) కిషన్‌గంజ్ నుంచి రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. మంగళవారం పూర్నియాలో రాహుల్ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగింస్తూ.. తొలిసారి నితీష్ కుమార్ ఎన్డీయే గూటికి చేరడంపై స్పందించారు. బిహార్‌లో సామాజిక న్యాయం అందించే బాధ్యత ఇండియా కూటమి తీసుకుందని.. ఇకపై బిహార్‌కు నితీష్ అవసరం లేదని అన్నారు. బీజేపీ ఉచ్చులో నితీష్ చిక్కకున్నారని మండిపడ్డారు. మహాఘట్ బంధన్ ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేస్తామని చెప్పారు. మోదీ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు రాహుల్. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారని పేర్కొన్నారు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. సామాజిక, ఆర్థిక న్యాయం నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ దేశంలో విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి కులగణన ఎంతో అవసరమన్న ఆయన భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధూ.. ఎవరీయన? ఇదిలా ఉండగా క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తుకు హాజరైన నేపథ్యంలో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ సహా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అగ్రనేతలు నేడు పూర్నియాలో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ర్యాలీకి దూరంగా ఉన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం బీహార్‌లోని పూర్నియాలో రైతు సంఘం సభ్యులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓ ధాబాలో టీ తాగుతూ కొంతమంది బీహార్ నివాసితులతో మాట్లాడారు. ఆయన వెంట కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ కూడా ఉన్నారు. आज एक ढाबे पर कुछ बिहार निवासियों से चाय के दौरान कई बातें हुईं।#BharatJodoNyayYatra pic.twitter.com/Nsug8YrW2Q — Bharat Jodo Nyay Yatra (@bharatjodo) January 30, 2024 आज पूर्णिया में भारत जोड़ो न्याय यात्रा के दौरान @RahulGandhi ने स्थानीय किसानों के साथ काफ़ी देर तक बातचीत की। किसानों ने उन्हें अपने साथ हो रहे अन्याय से अवगत कराया। उन लोगों ने बताया कि वे बढ़ती इनपुट लागत, भूमि अधिग्रहण की ग़लत नीति और फसलों के लिए पर्याप्त MSP न मिलने से… pic.twitter.com/ptlK7ruBZZ — Jairam Ramesh (@Jairam_Ramesh) January 30, 2024 -
‘హీ నితీష్డ్ మీ’
న్యూఢిల్లీ: బిహార్ సీఎం నితీశ్ కుమార్ పదేపదే కూటములు మార్చడంపై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీమ్స్, జోకులు పేలుతున్నాయి. మోసానికి సిసలైన పేరు నితీశ్ అంటూ కొత్త విశేషణాన్ని ఖరారుచేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్‌లో కొన్ని... ‘అతను నన్ను మోసం చేశాడు’ అనడానికి ‘హీ నితీష్డ్ మీ’ అంటూ పలువురు ట్యాగ్ చేస్తున్నారు. ‘‘బీసీసీఐ కొత్త తరహా క్రికెట్ టోర్నమెంట్ ఫార్మాట్ తేనుంది. అదేంటంటే మ్యాచ్ మధ్యలో కెప్టెన్లు మారిపోతారు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ. ఆదాయానికి ఆదాయం. వరల్డ్ కప్ లాగా అది ‘నితీశ్ కప్’ అని ఒక పాత్రికేయుడు ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. కార్పోరేట్ ప్రపంచంలో సీఈవోలకు నితీశ్ కుమార్ ఒక ఆదర్శనీయుడు. తొమ్మిదిసార్లు ‘కంపెనీ’ల విలీనాలు, టేకోవర్ల తర్వాత కూడా ఈయనే సీఈవోగా కొనసాగడం అద్భుతం’ అని మరో యూజర్ ట్వీట్‌చేశారు. కూటముల మధ్య తెగ ‘పల్టీలు కొట్టే పుత్రుడు’ని కన్నందుకు ‘పాటలీపుత్ర’కు ఆ పేరు వచ్చిందని మరొకరు కొత్త భాష్యమిచ్చారు. ‘‘జాతీయ రహదారులపై యూటర్న్ గుర్తు తీసేసి అక్కడ నితీశ్ ఫొటో పెట్టాలని కేంద్ర రహదారుల మంత్రి ఆదేశించారు’’ అని మరొకరు ట్వీట్‌చేశారు. బిహార్‌లో మహాఘట్బంధన్ కూటమికి చరమగీతం పాడి బీజేపీతో నితీశ్ జట్టు కట్టిన విధానాన్ని ఐదు అంశాల్లో నెటిజన్లు సరికొత్తగా నిర్వచించారు. 1. ఎటంటే అటు మారేలా అనువుగా ఉండాలి. 2. సరిగ్గా సరైన సమయం చూసి అటువైపు దూకేయాలి. 3. అదే సమయంలో పాత మిత్రులతో సత్సంబంధాలు కొనసాగించాలి. 4. చెడిపోయిన స్నేహాన్ని చిగురింపజేయాలి. 5. కొత్త అవకాశం చేతికొచ్చాకే పాత మిత్రుల చేయి వదిలేయాలి. గవర్నర్ బిత్తరపోయిన వేళ! ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వెళ్లిన నితీశ్, 15 నిమిషాల్లోపే తిరిగి రాజ్‌భవన్‌కు రావడం చూసి గవర్నర్ షాకయ్యారంటూ సరదా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అదేమంటే, రాజ్‌భవన్‌లో మర్చిపోయిన తన మఫ్లర్(స్కార్ఫ్)ను తీసుకోవడం కోసం నితీశ్ వెనుదిరిగి వస్తారు. అది చూసి గవర్నర్ బిత్తరపోతారు. ‘ఈసారి కూటమికి గుడ్‌బై చెప్పడానికి నితీశ్‌కు 18 నెలలు టైమ్ పట్టింది. ఇప్పుడేమిటి మరీ 15 నిమిషాల్లోపే మళ్లీ వచ్చారా?’ అని గవర్నర్ షాక్‌కు గురయ్యారంటూ కాంగ్రెస్ వ్యంగ్యంగా ట్వీట్‌చేసింది. ‘‘వెంటవెంటనే రాజీనామాలు, ప్రమాణాలతో నితీశ్ రాజకీయ రంగు మారుస్తున్నారు. ఈయనను చూసి ఊసరవెల్లి కూడా కొత్త రంగును వెతుక్కోవాల్సి వస్తోంది. ఆయారామ్ గయారామ్ బదులు ఇక ఆయా నితీశ్ గయా నితీశ్ అనుకోవాలి’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. -
పిల్లిమొగ్గల రాజకీయం
అనుకున్నదే అయింది. ఊహాగానాల్ని నితీశ్ కుమార్ నిజం చేశారు. ‘ఇండియా’ కూటమిలో నుంచి బయటకురావడం, కూటమిలోని ఆర్జేడీతో కలసి బిహార్‌లో నడుపుతున్న సర్కార్‌కు స్వస్తి చెప్పడం, ‘ఎన్డీఏ’లో మళ్ళీ చేరుతున్నట్టు ప్రకటించడం, ముందుగా మాట్లాడిపెట్టుకున్న బీజేపీ మద్దతుతో ఆదివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. దీంతో, రానున్న ఎన్నికల రాజకీయ నాటకంలో ఒక అంకం ముగిసింది. కొత్త చర్చ మొదలైంది. తొమ్మిదోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతూ, ఎన్డీఏ నుంచి ఇక అటూ ఇటూ ఎక్కడికీ పోనంటూ నితీశ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ నమ్మడం లేదు కానీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ బిహారీ బాబు తాజా పిల్లిమొగ్గల పర్యవసానం ఏమిటి, మోదీపై యుద్ధానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు – ఒక వర్గం ఓటర్లు ఆశపడ్డ ‘ఇండియా’ కూటమి భవితవ్యం ఏమిటి, ఎన్డీఏ కూటమికి ఎంతగా లాభిస్తుందన్న చర్చ ఆగడం లేదు. తరచూ పొత్తులు మారుస్తూ, నోటికొచ్చిన వివరణతో నెట్టుకొస్తున్న నితీశ్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైన నేత. రెండేళ్ళలో రెండోసారి, దశాబ్ది పైచిలుకులో అయిదోసారి రంగులు మార్చి, తాజాగా తొమ్మిదోసారి పీఠమెక్కి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న ఆయన తీరును పలువురు తప్పుబట్టడంలో ఆశ్చర్యం లేదు. అసలు ‘ఇండియా’ కూటమి కట్టడంలో సూత్రధారే నితీశ్. దశాబ్దాల రాష్ట్ర రాజకీయ అనుభవం అనంతరం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆయన మోజుపడ్డారు. కూటమికి సమన్వయకర్తగా వ్యవహరించాలనీ, కాలం కలిసొస్తే రాబోయే ప్రతిపక్ష సర్కారుకు ప్రధాన మంత్రి కావాలనీ కలలు కన్నారు. కానీ, ఛాన్స్ తన దాకా రాకపోవచ్చని గ్రహించేశారు. పీతలబుట్ట లాంటి ప్రతిపక్షాలు, బలం పెరుగుతున్న బీజేపీ లాంటివి చూసి నితీశ్ ప్లేటు తిప్పేశారు. గెలుపు గుర్రంపై పందెం కాస్తే, పీఎం కాకున్నా ప్రయోజనాలైనా నెరవేరతాయను కున్నారు. ‘చస్తే మళ్ళీ వెళ్ళన’ని ఏడాది క్రితం అన్న ఎన్డీఏ కూటమిలోకే నిస్సిగ్గుగా ఫిరాయించారు. ఇందులో ప్రతిపక్ష కూటమి స్వయంకృతమూ ఉంది. ఆ మధ్య 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు వచ్చినప్పుడు, వాటిపైనే దృష్టిపెట్టి కూటమి తన పనిని పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. అలా 3 నెలల పైనే వృథా అయింది. సార్వత్రిక ఎన్నికల సన్నాహం, ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయ సాధన వెనకపట్టు పట్టింది. కనీసం 300 లోక్‌సభా స్థానాల్లో పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ పట్టుబట్టడమూ కూటమి పక్షాలకు మింగుడుపడలేదు. పోనీ ఆ డిమాండ్‌కు తగ్గట్టు కాంగ్రెస్ తన బలిమిని చూపగలిగిందా అంటే అదీ లేదు. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింటిలో హస్తం వీగిపోయింది. ‘ఇండియా’ కూటమిలో తనదే పైచేయిగా ఉండాలన్న ఆ పార్టీ ఆశ అడియాసే అయింది. మునుపటంత బలం లేని జాతీయ పార్టీని తమ భుజాలపై మోయడానికి బలమైన ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా లేవు. పైగా, కన్వీనర్ అంటూ ఎవరినీ ఎంపిక చేయకపోవడం మరో తప్పిదం. కనీస ఉమ్మడి అజెండా మొదలు సీట్ల పంపిణీ దాకా అన్నిటినీ పేరబెట్టేసరికి చివరకు వ్యవహారం చేయి దాటింది. ఎన్నికలు కొద్ది నెలల్లోనే ఉన్నా, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఇచ్చినంత ప్రాధాన్యం వాటికి ఇవ్వట్లేదన్నది కాంగ్రెస్‌పై మరో విమర్శ. ఈ యాత్ర ద్వారా ప్రజా బాహుళ్యంలో బలం పుంజుకొని, తమకు మరిన్ని సీట్ల కోసం గట్టిగా బేరం చేయాలనేది ఆ పార్టీ భావననీ ఓ విశ్లేషణ. ఏమైనా, ప్రతిపక్షాలు అనైక్యతతో ఇలా కుమ్ములాడుకుంటూ ఉండగానే, బీజేపీ మాత్రం ఎన్నికలకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ఇన్ఛార్జ్లను సైతం నియమించేసింది. గత వారం బులంద్‌షహర్‌లో సభతో ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల సమరభేరి మోగించారు. జైపూర్ లాంటి చోట్ల ర్యాలీలతో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కొద్ది నెలల క్రితమే 5 రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మూడింటిని గెలుచుకోవడం సైతం బీజేపీకి కొత్త ఊపునిచ్చింది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి మీడియా, అలాగే కేంద్ర సర్కార్ హంగామాతో హిందూత్వకు మారుపేరుగా ఆ పార్టీ తన స్థానం సుస్థిరం చేసుకుంది. అందుకే, దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిన ఈ హిందూత్వ ప్రభంజనానికి ఎదురొడ్డడం ప్రతి పక్షాలకు అగ్నిపరీక్షే. పైగా, మందిర్ ప్లస్ మండల్‌గా మారిన బీజేపీ వ్యూహం పదునైనది. మండల్ రాజకీయాల ఉద్ధృతిలో వచ్చిన కుల ఆధారిత పార్టీలకు సెగ తగులుతోంది. అయితే, మోదీ సర్కార్ విభజన రాజకీయాలు చేస్తోందనీ, ప్రజాస్వామ్యానికిది ప్రమాద భరితమనీ అన్న నోటితోనే నితీశ్ మళ్ళీ అదే పంచన చేరడం ఆయన ఇమేజ్ను పలచన చేసింది. కుల సమీకరణలు నిష్ఠురసత్యమైన ప్పటికీ, బిహార్‌లో బలం తగ్గుతున్న నితీశ్‌కూ, ఆయన పార్టీకీ తాజా పిల్లిమొగ్గ అద్భుత భవితను అందించకపోవచ్చు. నితీశ్ నైజం తెలుసు గనక ఆయన్ని అడ్డం పెట్టుకొని, లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాల బిహార్‌లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. అవసరం తీరాక ఆ దోస్తీ కొనసాగకపోవచ్చు. లోక్‌సభ తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లోపు ఏమవుతుందో, మన ‘పల్టూ రామ్’ ఏం చేస్తారో చెప్పలేం. నెలల క్రితం ఆశ రేపిన ప్రతిపక్ష కూటమి ఇప్పుడు బలహీనమైందన్నది నిజం. కానీ, ఇంతటితో కూటమి కథ ముగిసిందనడం తొందరపాటే. తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ పాలనపై దేశమంతా తృప్తిగా ఏమీ లేదు. ధరలు, నిరుద్యోగం, విభజన రాజకీయాలపై జనంలో అసహనం ఉన్నా, మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం విషాదం. మోదీని దింపాలనే తప్ప పాజిటివ్ అజెండా చెప్పలేకుంటే ఈ అసంతృప్త, అనిశ్చిత ఓటర్ గణాన్ని ప్రతిపక్షాలు ఆకర్షించలేవు. ప్రతిపక్షాలంటే కుమ్ములాటల కూటమనే భావన తొలగించకపోతే, ఎన్ని ఎన్నికలొచ్చినా అది ఎడ్వాంటేజ్ బీజేపీయే. ఇది వికసిత, ఆత్మనిర్భర్ భారత్ అవునో కాదో కానీ, ‘ఇండియా’ మటుకు వెలిగిపోవడం లేదంటున్నది అందుకే! -
Bihar: కొత్త డిప్యూటీ సీఎం తలపాగ వెనుక ఆసక్తికర కథ
పాట్నా: బిహార్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన సామ్రాట్ చౌదరి కాషాయ తలపాగా వెనుక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. గతంలో నితీశ్ బీజేపీని వదిలి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పట్లో ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సామ్రాట్ ఒక శపథం చేశారు. నితీశ్ కుమార్‌ను గద్దె దించిన తర్వాతే తాను తలపాగా తీస్తానని ప్రతిన పూనారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య నితీశ్ తాజాగా బిహార్‌లో మళ్లీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో మీడియా ప్రతినిధులు సామ్రాట్‌కు తన తలపాగాపై ప్రశ్నలు సంధించారు. దీనికి స్పందించిన సామ్రాట్ బీజేపీ తనకు రెండో తల్లిలాంటిదని, అయోధ్యకు వెళ్లినపుడు రాముడిని దర్శించుకునేందుకు తల వంచేందుకు వీలుగా తలపాగా తీసేస్తానని సామ్రాట్ నర్మగర్భంగా సమాధానిమిచ్చారు. సామ్రాట్ 2018లో నితీశ్‌కుమార్ పార్టీ జేడీయూను వీడి బీజేపీలో చేరడం గమనార్హం. मुरेठा खोलने पर सम्राट बोले : मुरेठा के सम्मान में अगर मुझे अयोध्या जाकर सिर मुड़वाना पड़े तो मैं तैयार हूं#BiharCM #Bihar #BiharNews #BJP #SamratChaudhary @RJDforIndia @RohiniAcharya2 pic.twitter.com/bBOmAsDXiQ — FirstBiharJharkhand (@firstbiharnews) January 29, 2024 ఇదీచదవండి.. మోదీ మళ్లీ పీఎం అయితే.. ఖర్గే కీలక వ్యాఖ్యలు -
ఎన్డీయే విజయావకాశాలపై పీకే కీలక వ్యాఖ్యలు
బిహార్‌లో నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జేడీయూ అధినేత నితీష్.. ఎన్డీఏ కూటమిలో చేరటంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. నితీష్ బిహార్‌లోని మహాకూటమి నుంచి వైదొలిగి.. ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధిక సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డారు. బిహార్‌లో నీతిష్ కుమార్ తిరిగి మాళ్లీ ఎన్డీయేలో చేరటంతో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బిహార్‌లో మహా కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్‌పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ రాజకీయం జీవితంలో ఇదే చివరి ఇన్సింగ్స్ అన్నారు. రాజకీయాల్లో నితీష్ చాలా కపటంతో కూడిన వ్యక్తి అని మండిపడ్డారు. 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో కూడా జేడీయూ విజయం సాధించలేదని జోష్యం చెప్పారు. నితీష్ ఏ కూటమితో పొత్తు పెట్టుకున్నా సరే.. ఆయన పార్టీ అంతం కావటం ఖాయమన్నారు. కేవలం 20 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతారని అన్నారు. నితీష్‌ను బిహార్ ప్రజలు తిస్కరిస్తున్నారని.. అందుకే తన సీఎం కుర్చీ కోసం కూటములు మారుతున్నారని మండిపడ్డారు. బిహార్‌లో ఇండియా కూటమిని దెబ్బతీయటానికి బీజేపీ.. నితీష్ కుమార్‌తో ఎత్తుగడ వేసిందన్నారు. కానీ.. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా పార్లమెంట్లో ఎన్నికల్లో మంచి ఫలితాలనే సాధిస్తుందని అన్నారు. ఇక.. ఎన్డీయే కూటమిలో చేరిన నితీష్ కుమార్ 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు మళ్లీ బయటకు వస్తారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లో ఎన్డీయేతో నితీష్‌కు విభేదాలు వస్తాయని అంచనా వేసిన విషయం తెలిసిందే. చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన -
Bihar: బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం.. 24 గంటల్లోనే కీలక నిర్ణయం
పట్నా: బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు గుడ్‌బై చెప్పిన సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి తొమ్మిదోసారి బిహార్ సీఎంగా అవతరించారు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు దీరిన మరుసటి రోజే ప్రతిపక్షాలపై చర్యలను ప్రారంభించింది ఎన్డీయే సర్కార్. ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తన పదవి నుంచి తొలగించాలంటూ అసెంబ్లీ సెక్రటరికీ బీజేపీ, ఆర్డేడీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందించారు. బీజేపీ నేతలు నంద కిషోర్ యాదవ్, తార్కిషోర్ ప్రసాద్(మాజీ డిప్యూటీ సీఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా అధినేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, జేడీయూకు చెందిన వినయ్ కుమార్ చౌదరి, రత్నేష్ సదా, ఎన్డీయే కూటమికి చెందిన ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని తొలగించాలంటూ నోటీసులు ఇచ్చారు. చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ కాగా బిహార్ సీఎం నితీష్ కుమార్ హమాఘట్ బంధన్ సంకీర్ణం నుంచి తప్పుకొని మరోసారి బీజేపీ సార్ధంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఆదివారం ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి.. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో 72 ఏళ్ల నితీష్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ నుంచి ఇద్దరు (సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పార్టీలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల నిష్క్రమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ
పాట్నా: బిహార్‌లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం సోమవారం తన తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు. అడ్వకేట్ జనరల్ నామినేషన్‌పై తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశం ఏర్పాట్లపై కూడా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. బిహార్‌లో మహాఘట్బంధన్కు నితీష్ కుమార్ ఆదివారం భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమిని వదిలి ఎన్డీఏలో చేరారు. సీఎం నితీష్ కుమార్ ఆదివారం రాజీనామా చేశారు. అదే రోజు సాయంత్రం ఎన్డీఏ భాగస్వామ్యంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. సీఎం నితీశ్ కుమార్, బీజేపీకి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటు జేడీయూ నుంచి చెందిన ప్రేమ్ కుమార్, విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, విజేంద్ర యాదవ్, హిందుస్థాన్ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నేత సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో రెండు రోజుల్లో కేబినెట్ విస్తరణ చేపడతామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. బీహార్ కేబినెట్లో గరిష్టంగా 35 మంది మంత్రులకు అవకాశం ఉంది. నితీష్ కుమార్ మినహా మొత్తం ఎనిమిది మంది మంత్రులు ఆదివారం ప్రమాణం చేశారు. నూతన కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నారు. అటు ఓబీసీలను ప్రసన్నం చేసుకోవడమే ఎన్డీఏ లక్ష్యంగా కనిపిస్తోంది. కొత్త కేబినెట్లో భూమిహార్ కమ్యూనిటీ నుండి విజయ్ చౌదరి, విజయ్ సిన్హా, రాజ్‌పుత్ కమ్యూనిటీ నుండి సుమిత్ కుమార్ సింగ్ (స్వతంత్ర) సహా ముగ్గురు అగ్రవర్ణాల మంత్రులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సహా కుర్మీ కులానికి చెందిన జేడీయూ నాయకుడు శ్రవణ్‌కుమార్, మహాదళిత్ సామాజికవర్గానికి చెందిన సంతోష్ కుమార్ సుమన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్‌లో ఇటీవలి కులాల సర్వే ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభాలో కుర్మీలు 2.8 శాతం ఉన్నారు. ఇదీ చదవండి: Jharkhand: బీహార్‌లో ‘ఆట ముగిసింది’.. జార్ఖండ్‌లో మొదలైంది? -
బీహార్‌లో ‘ఆట ముగిసింది’.. జార్ఖండ్‌లో మొదలైంది?
బీహార్‌లో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీహార్‌లో గత 15 రోజులుగా కొనసాగిన పొలిటికల్ గేమ్‌కు తెరపడింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. బీహార్‌లో రాజకీయ మార్పులు చోటుచేసుకున్న నేపధ్యంలో పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ నుండి కూడా ఇటువంటి వార్తలు వెలువడుతున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరి 31న మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇందుకోసం హేమంత్ సోరెన్ తన నివాసం లేదా ఈడీ కార్యాలయానికి వెళ్లవలసి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే ఇది రాజకీయవర్గాల్లో పలు చర్చలకు దారితీస్తోంది. వాస్తవానికి జనవరి 20న సీఎం హేమంత్ సోరెన్‌ను ఏడున్నర గంటల పాటు విచారించిన ఈడీ.. తదుపరి విచారణకు జనవరి 27 నుంచి 31 మధ్య ఏదో ఒక రోజు చెప్పాలంటూ హేమంత్ సోరెన్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది. వీటిని అందుకున్న సీఎం హేమంత్ సోరెన్ నుంచి ఈడీకి సమాధానం అందిందని సమాచారం. ఈ నేపధ్యంలో ఈడీ జనవరి 29 లేదా 31వ తేదీల్లో విచారణకు ఒక తేదీని కోరుతూ ప్రత్యుత్తర లేఖ రాసింది. దీనికి స్పందించకపోతే అధికారులే సీఎం ఇంటికి వస్తారని ఈడీ స్పష్టం చేసింది. ఈడీ అందించిన లేఖలోని స్పష్టతను గమనిస్తే, జార్ఖండ్‌లో అతి త్వరలో రాజకీయ పెనుమార్పులు సంభవించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మళ్లీ ప్రమాణం
-
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్‌కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్‌ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్‌కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్‌కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్‌ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్‌లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌లోనూ ఆప్‌ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది: తేజస్వీ యాదవ్
పట్నా: బిహార్‌లోని మహా కూటమి నుంచి బయటకు వచ్చి సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ మద్దతుతో మరోసారి బిహార్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. మహాకూటమిలో కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నితీష్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. బీజేపీ-జేడీ(యూ) కూటమి ఏర్పాటుపై తాను మాత్రమే బీజేపీకి శుభాకాంక్షలు తెలుపగలనని అన్నారు. జేడీయూను బీజేపీ కూటమిలో కలుపుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని అన్నారు. నితీష్ కుమార్ అలసిపోయారని.. ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో ఆర్జేడీ పార్టీ అన్ని రకాలకు సహకరించిందని గుర్తుచేశారు. నితీష్‌పై ప్రస్తుతం తాను వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఏం చేయనని అన్నారు. ప్రస్తుతం నితీష్ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో జేడీ(యూ) పూర్తిగా పట్టు కోల్పోవటం ఖాయమని అన్నారు. నితీష్ చేసిన పనికి బిహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. వారు(జేడీయూ) ఏం చేసినా బిహార్ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తేజస్వీ తెలిపారు. చదవండి: ‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’ -
Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం..
పట్నా: బీహార్‌లో మరో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నితీష్ కుమార్‌తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఇక, తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసి దేశంలోనే నితీష్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. అనంతరం, ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్షా, సామ్రాట్ చౌదరి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. కాగా, నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. #WATCH | Nitish Kumar takes oath as Bihar CM for the 9th time after he along with his party joined the BJP-led NDA bloc.#BiharPolitics pic.twitter.com/v9HPUQwhl3 — ANI (@ANI) January 28, 2024 #WATCH | Nitish Kumar takes oath as Bihar CM for the 9th time after he along with his party joined the BJP-led NDA bloc. pic.twitter.com/ePGsqvusM3 — ANI (@ANI) January 28, 2024 #WATCH | Bihar: BJP leader Vijay Sinha takes oath as a cabinet minister. pic.twitter.com/Dkk9wXQHNR — ANI (@ANI) January 28, 2024 -
బీజేపీ-జేడీయూ కూటమిపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
జేడీ(యూ) చీఫ్ బిహార్‌లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏర్పడిన బీజేపీ-జేడీ(యూ) కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదని అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ మహాకూటమి సీఎం పదవీ రాజీనామా చేసి.. ఎన్డీఏ కూటమి నేతగా మళ్లీ బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న సమయంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీ-జేడీయూ కూటమి స్థిరంగా ఉండదని జోష్యం చేప్పారు. బిహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దాని కంటే తక్కువేనని కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయన కేవలం ఆరు నెలల్లోనే ఊహించినంత మార్పు సంభవిస్తుందని కూడా తెలిపారు. ఇక 2022లో నితీష్ కుమార్ ఎన్డీఏ ఉంచి బయటకు వచ్చారని.. అప్పుడు బిహార్‌లో రాజకీయ స్థిరత్వం ఉంటుందని ఆశించానన్నారు. అయితే రాజకీయ, పరిపాలన పరమైన అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోవటం వల్లనే ఇలాంటి కూటమి మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి కూటమి కూడా 2020 వరకు మాత్రమే కొనసాగదని గతంలో తాను అంచనా వేసినట్లు గుర్తు చేశారు. గత అంచనా నిజం అయినట్టు ఇప్పుడు కూడా 2025 వరకు మాత్రమే ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమి సైతం కొనసాగుతుందని అన్నారు. అనంతరం బీజేపీ- జేడీయూ కూటమి కూడా బీటలు వారుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. చదవండి: ‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’ -
‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’
జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మహాకుటమి నుంచి బయటకు వచ్చి సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీతో జట్టు కట్టి ఆదివారం మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జును స్పందిస్తూ.. బిహార్‌లో ఇటువంటి పరిస్థితి వస్తుందని.. జేడీ(యా) చీఫ్ నితీష్ కుమార్ మహాకూటమి నుంచి వైదొలుగుతారని ముందే ఊహించినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ మాత్రం నితీష్.. బీజేపీలో చేరటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై నితీష్ వైదొలటం ఎలాంటి ప్రభావాన్ని చూపదని అన్నారు. 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ ప్రజలు నితీష్ కుమార్, ఢిల్లీలో(బీజేపీ) వారికి ఖచ్చితంగా తమదైన శైలిలో బుద్ధి చెబుతారని తెలిపారు. నితీష్ కుమార్ వంటి పచ్చి రాజకీయ అవకాశవాదిని తానెప్పుడూ చూడలేదని తీవ్రంగా మండిపడ్డారు. #WATCH | On Nitish Kumar joining NDA, Congress MP Jairam Ramesh says, "This will not affect the INDIA alliance. The people of Bihar will give the right answer to Nitish Kumar and those who are sitting in Delhi in the 2024 elections. I have not seen any opportunistic leader like… pic.twitter.com/w1IYot6jCc — ANI (@ANI) January 28, 2024 అవకాశవాదంలో ఊసరవెల్లితోనే ఆయన పోటీ పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారం అంతా ప్రధాని మోదీ డైరెక్షన్లో నడుస్తోందని మండిపడ్డారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సాధిస్తున్న విజయం పట్ల బీజేపీకి భయం కలుగుతోందని అన్నారు. అందుకే కూటమిని చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇక.. నితీష్ కుమార్ నేడు సాయంత్రం 4 గంటలకు మరోసారి బిహార్ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతుతో సీఎం కానున్న నితీష్.. బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు , స్పీకర్ పదవిని కేటాయిస్తారని తెలుస్తోంది. చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
ఊసరవెల్లితో నితీష్ పోటీ పడుతున్నారు.. కాంగ్రెస్ చురకలు
పాట్నా: మహాకూటమిని వీడి బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏతో కలిశారు. ఈ పరిణామంతో సీఎం నితీష్ కుమార్‌పై కాంగ్రెస్ మండిపడింది. నితీష్ కుమార్ ఊసరవెళ్లితో పోటిపడుతున్నారని ఎద్దేవా చేసింది. ' నిత్యం రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్న నితీష్ కుమార్ ఊసరవెళ్లికి పోటీ ఇస్తున్నారు' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. ప్రజల మనోభావాలను నితీష్ దెబ్బతీశారని అన్నారు. ఈ మోసానికి నితీష్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ, జేడీయూ సహా ఇతర పార్టీల సహకారంతో నితీష్ కుమార్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సీఎంగా నితీష్ ఈ రోజు సాయంత్రం మళ్లీ ప్రమాణం చేయనున్నారు. बार-बार राजनीतिक साझेदार बदलने वाले नीतीश कुमार रंग बदलने में गिरगिटों को कड़ी टक्कर दे रहे हैं। इस विश्वासघात के विशेषज्ञ और उन्हें इशारों पर नचाने वालों को बिहार की जनता माफ़ नहीं करेगी। बिलकुल साफ़ है की भारत जोड़ो न्याय यात्रा से प्रधानमंत्री और भाजपा घबराए हुए हैं और उससे… https://t.co/v47tQ8ykaw — Jairam Ramesh (@Jairam_Ramesh) January 28, 2024 బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. మళ్లీ మహా కూటమిని విడిచి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
నితీష్‌పై కాంగ్రెస్ ఫైర్
పాట్నా: బీహార్‌లో రాజకీయ గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ను వీడి సీఎం నితీష్ కుమార్ ఎన్డీయే చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్‌పై కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరితో వివాహం.. మరొకరితో సంబంధం కలిగి ఉండటం నితీష్‌కి బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. "ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకరితో వివాహం మరొకరితో సంబంధం. ఇది నితీష్ కుమార్ స్వభావంగా మారింది" అని ట్వీట్టర్లో కాంగ్రెస్ నాయకుడు తారిఖ్ అన్వర్ పేర్కొన్నారు. నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. మళ్లీ మహా కూటమిని విడిచి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
నితీష్ కుమార్ రాజీనామా
-
అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్
పాట్నా: మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవని.. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని నితీష్ కుమార్ తెలిపారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నరగా మహా కూటమి ప్రభుత్వం సరిగ్గా ముందుకు వెళ్ళలేక పోయిందని నితీష్ కుమార్ అన్నారు. గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితో వెళ్లాలని అనుకుంటున్నామని తెలిపారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ నేడు రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి కూలిపోయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నితీష్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. బీజేపీతో చేతులు కలిపి నితీష్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అటు.. బీజేపీ ఇటు జేడీయూలు తమ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ కొత్త కూటమిలో పాల్గొననున్నాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. ఇదీ చదవండి: Bihar political crisis: ఇలా రాజీనామా, అలా ప్రమాణం! -
క్లైమాక్స్ కు చేరిన బీహార్ రాజకీయాలు
-
కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే
కలబురిగి(కర్ణాటక): బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీ(యూ) ఇండియా కూటమిని వీడి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరనుందన్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే తపన ఉన్నవారు కచ్చితంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరని తమ పార్టీ భావిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమిని ఐక్యంగా నిలిపి ఉంచేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
ఇలా రాజీనామా, అలా ప్రమాణం!
పట్నా/న్యూఢిల్లీ: బిహార్‌లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కని్పస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం నితీశ్ సారథ్యంలో పటా్నలో ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘెల్ హుటాహుటిన పట్నా చేరుకున్నారు. ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా మాంఝీతో మంతనాలు జరిపారు. మరోవైపు నితీశ్‌తో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తోంది. శనివారం పటా్నలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చ జరిగినా జేడీ(యూ)ను తిరిగి ఎన్డీఏలోకి ఆహా్వనించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక ఘట్బంధన్ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ ఎలాగైనా సర్కారును కాపాడుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్జేడీ నేతలతో పార్టీ చీఫ్ లాలు మంతనాల్లో మునిగి తేలుతున్నారు. జేడీ(యూ) లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వాలని నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు (122)ను సులువుగా దాటేస్తారంటూ లాలు కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వాటిని తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇలా శనివారమంతా పట్నాలో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్‌లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. -
బిహార్‌లో ఆసక్తికరంగా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
పట్నా: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహా కూటమి నుంచి వైదొలిగి బీజేపీలో చేరి.. మళ్లీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి బిహార్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా జేడీ(యూ), ఆర్జేడీ పార్టీల్లో జరగుతున్న చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు నితీష కుమార్ పార్టీ జేడీ(యూ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మందితో జేడీయూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో 13 మందిని లాగేందుకు ఆర్జేడీ అధినేత లాలూ సైతం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా పట్నాలో అందుబాటులో ఉండాలని లాలూ ఆదేశించారు. నితీష్ కుమార్ మహా కూటమిని మారే సమయంలో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శనివారం రాత్రి 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ చర్చలు జరపనున్నారు. అయితే ఈ రాత్రికి నితీష్ సీఎంగా రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ మద్దతుతో రేపు(ఆదివారం) మరోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలో పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు బిహార్ వెళ్లనున్నారు. ఆదివారం పట్నాలో బీజేపీ ఎమ్మెల్యేలతో వారు సమావేశం కానున్నారు. చదవండి: ‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’ -
‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’
ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఒక్కొక్కరుగా తమ పార్టీలు వైదొలుగుతన్నట్లు ప్రకటించటం వల్ల కాంగ్రెస్ ఢీలా పడిపోతుంది. ఇదే సమయంలో ఇండియా కూటమిపై బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’ ఎక్కడ ఉందని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ ప్రశ్నించారు. బెంగాల్లో టీఎంసీ, పంజాబ్‌లో ఆప్.. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తామన్న విషయం తెలిసిందే. మరోవైపు బిహార్‌లో కూడా నితీష్ కుమార్ ‘ఇండియా కూటమి’కి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరి మళ్లీ సీఎం అవుతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’పై బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇండియా కూటమి ’ అనేది దేశంలోని ఓటర్లలో అపనమ్మకాలను సృష్టించి.. వారిని మోసం చేయడానికే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. దేశంలో కూటమి కనిపించటం లేదన్నారు. ‘అసలు కూటమి అనేదే లేదు. అందులో ఉండే భాగస్వామ్య పార్టీలు బయటకు వెళ్తున్నాయి. బెంగాల్లో ఇండియా కూటమి లేదు. ప్రజలు, ఓటర్లను మోసం చేయడానికి ప్రతిపక్షాలు ఈ కూటమిని ఏర్పాటు చేశారు. చివరికి సీపీఐ(ఎం) కూడా కూటమిలో లేమని ప్రకటించింది’ అని ఎంపీ దిలీప్ ఘోష్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ మొత్తం ఒక్క సీటు కూడా గెవలకుండా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఇక.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి సగం కంటే తక్కువ సీట్లకే పరిమితం కానుందని తెలిపారు. బిహార్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. అక్కడ విడిగా పోటీ చేయలేరు.. అలా అని కలిసి పోటీ చేయలేని పరిస్థితి ఉందని కూటమి పార్టీలపై విమర్శలు గుప్పించారు. చదవండి: కేరళ గవర్నర్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత పెంపు.. ఎందుకంటే? -
ఇండియా కూటమి నేతల ఫోన్లకు స్పందించని నితీష్ కుమార్
పట్నా: ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఇక.. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి నితీస్ కుమారు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బిహార్ సీఎం నితీష్‌కుమార్‌పై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’నుంచి నితీష్ జేడి(యూ) పార్టీ వైదులుగుతుందన్న కచ్చితమైన సమాచారం లేదన్నారు. ఇక.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటు అయిన ‘ఇండియా కూటమి’లో జేడీ (యూ) ఓ కీలకమైన పార్టీ జేడీ(యూ) అని తెలిపారు. ‘నాకు నితీష్ కుమార్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయం నేను లేఖ కూడా రాశారు. వారితో మాట్లాడుదామని ప్రయత్నం చేశాను. కానీ, నితీష్ కుమార్ మనసులో ఏం ఉందో నాకు తెలియదు’ అని ఖర్గే పేర్కొన్నారు. రేపు( ఆదివారం) ఢిల్లీ వెళ్లి బిహార్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ అనిశ్చితిపై పూర్తి సమాచారం తెలుసుకుంటానని.. ఈ వ్యవహారంపై చర్చ జరుపుతామని అన్నారు. నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్న విషయం తనకు తెలియదని, గవర్నర్‌ను కలుస్తారన్న దానిపై కూడా తనకు స్పష్టత లేదని అన్నారు. ఇక.. ఈ విషయంపై ప్రస్తుతం అధికారికంగా మాట్లాడలేనని అన్నారు. రేపటి వరకు ఏం జరుగుతుందో చూస్తామని ఖర్గే తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ సంబంధించిన నేతల ఫోన్లకు నితీష్ కుమార్ స్పందించకపోవటం గమనార్హం. సోనియా గాంధీ కాల్ చేసినా.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే మూడుసార్లు ఫోన్ చేసినా నితీష్ కుమార్ స్పందించలేదు. మరోవైపు.. లాలూప్రసాద్ యాదవ్ ఐదుసార్లు ఫోన్ చేసినా నితీష్ లిఫ్ట్ చేయకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చదవండి: Bihar Politics: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా నేడు? -
Bihar Politics: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా నేడు?
పాట్నా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడేక్కాయి. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీ వైపు జేడీయూ అధినేత నితీష్ కుమార్ అడుగులు వేయన్నుట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. నేడు సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసే అవకాశం ఉంది. జేడీయూ నిష్క్రమణతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణ కూటమి కుప్పలిపోయే సూచనలు కనిపిస్తన్నాయి. ఇప్పటికే నితీష్ కోసం అవసరమైతే తలుపులు తెరుస్తామని బీజేపీ నేతలు వెల్లడించారు. ఆదివారమే సీఎం.. గవర్నర్‌ను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీతో కలిసి నితీష్ ఆదివారమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కూడా ఆయనే సీఎంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోసారి సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోదీ అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే చాన్స్ ఉంది. జేడీయూ నేతలతో నితీష్ భేటీ తాజా పరిణామాల నేపథ్యంలో నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానున్నారు. ఇటు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లో ఆర్జేడీ కీలక నేతలు సమావేశం కానున్నారు. అదే సమయంలో పూర్ణియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్‌కుమార్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో నేడు జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడం, పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీష్‌కు సోనియా ఫోన్.. నితీష్ బీజేపీతో చేతులు కలిపితే విపక్ష ‘ఇండియా’ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ ఊహాగానాల వేళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నితీశ్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెతో మాట్లాడేందుకు సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఈ నెల 30న బిహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనాలని సోనియా గాంధీ శుక్రవారం ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆ కాల్స్‌ను సీఎం పట్టించుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చదవండి: Nitish Kumar: నితీశ్ కొత్త అవతారం! -
Bihar Politics: రేపే ఎన్డీఏలోకి నితీశ్?
పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి ఆయన కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారమే నితీశ్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చని జేడీ(యూ) వర్గాలంటున్నాయి. రాష్ట్ర బీజేపీ అగ్ర నేత సుశీల్‌కుమార్ మోదీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుందని సమాచారం. ‘‘(నితీశ్‌కు ఇంతకాలంగా బీజేపీలోకి) మూసుకుపోయిన తలుపులు తెరుచుకోవచ్చు. రాజకీయాంటేనే అవకాశాల ఆటస్థలి. కనుక ఏదైనా సాధ్యమే’’ అంటూ శుక్రవారం సుశీల్ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. బిహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, సుశీల్‌కుమార్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపి వచ్చారు. ఈ నేపథ్యంలో జేడీ(యూ)ను ఎన్డీఏలోకి తీసుకోవడంపై శని, ఆదివారాల్లో బిహార్ బీజేపీ రెండు రోజుల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఆదివారమే పొత్తు నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది. ఆ రోజు ఉదయమే జేడీ(యూ) ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశం కానుండటం విశేషం! మరోవైపు 10 మంది దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలు అధికార సంకీర్ణంలో కలకలం రేపుతున్నాయి. నితీశ్ స్పష్టత ఇవ్వాలి: ఆర్జేడీ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామి అయిన ఆర్జేడీతో నితీశ్‌కు విభేదాల నేపథ్యంలో బిహార్‌లో రెండు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన ఎన్డీఏలో చేరతారన్న వార్తలు గురువారం కలకలం రేపాయి. జేడీ(యూ) ని్రష్కమిస్తే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన 8 మంది ఎమ్మెల్యేల కోసం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలున్న ఎన్డీఏ భాగస్వామి హిందూస్తానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్‌రామ్ మాంఝీతో శుక్రవారం మంతనాలు జరిపారు. మాంఝీ మాత్రం నితీశ్ కూడా త్వరలో ఎన్డీఏలోకి వస్తారని మీడియాతో చెప్పుకొచ్చారు! ఘట్బంధన్ సర్కారు ఒకట్రెండు రోజుల్లోనే కుప్పకూలడం ఖాయమని ఆయన కుమారుడు సంతోష్ జోస్యం చెప్పారు. మొత్తం ఉదంతంపై నితీశ్ తక్షణం స్పష్టమైన ప్రకటన చేసి ఊహాగానాలకు తెర దించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కోరడం విశేషం. -
Nitish Kumar: నితీశ్ కొత్త అవతారం!
గాలి ఎటు వీస్తున్నదో... అది ఏ గమ్యం చేరుతుందో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు తెలుసున్నంతగా దేశంలో మరే రాజకీయ నాయకుడికీ తెలియదని ఇప్పటికే ముద్రపడింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా ఆయన మరోసారి ఈ విన్యాసానికి తెరలేపారు. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటులో చొరవ తీసుకుని, నాలుగైదు సమావేశాల్లో కూడా పాల్గొన్న నితీశ్ మరోసారి రంగు మార్చబోతున్నారని వారం రోజులుగా కథనాలు వస్తూనేవున్నాయి. మరికొన్ని గంటల్లో ఆయన కాషాయ కూటమి తీర్థం పుచ్చుకుని తరించబోతున్నారని కథనాలు వెలువడుతున్న దశలో కూడా ఆయన మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. పరస్పర విరుద్ధ సంకేతాలిస్తూ కథను రక్తికట్టించటానికి ఆయన పార్టీ జేడీ(యూ) ప్రయత్నిస్తోంది. ఒకపక్క తదుపరి సర్కారు గురించి గవర్నర్‌తో మంతనాలు జరుపుతూ కూడా ‘మహాఘట్’ బంధన్ సర్కారు బాగానేవుంది. మీడియా కథనాలన్నీ ఊహాగానాలే’ అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా ప్రకటించటం ఎవరిని నమ్మించటానికో అర్థం కాదు. చిత్రమేమంటే మహాఘట్ బంధన్ కాపురాన్ని వదులుకోకుండానే... సీఎం పదవికి రాజీనామా చేయకుండానే ఆదివారం ఆయన నేతృత్వంలో ఏర్పడబోయే ఎన్డీయే సర్కారులో ఉపముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎవరెవరుండాలనే నిర్ణయాలు జరిగిపోతున్నాయి. పట్నా–ఢిల్లీ మధ్య ఫోన్లైన్లు బిజీ అయిపోయాయి. బీజేపీలో బహిరంగంగానే హడావుడి కనబడుతోంది. ఎందుకిలా? ‘రాజకీయాల్లాంటి జూదం మరేదీ లేదు... అక్కడ కనిపించినంత ప్రస్ఫుటంగా మరెక్కడా వైపరీత్యాలు కనబడవు’ అని వెనకటికొక రాజనీతిజ్ఞుడు వ్యాఖ్యానించాడు. నితీశ్ పోకడలు గమనిస్తే అది అక్షరాలా నిజం అనిపిస్తుంది. ఆయన ఒక కూటమిలో వున్నంత కాలం మరో కూటమి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ వుంటుంది. నితీశ్‌కు సీఎం పదవి కట్టబెట్టి ఆయన డిప్యూటీలుగా కొనసాగేందుకు రెండుచోట్లా నేతలు సిద్ధంగావుంటారు. కూటములను మార్చటంలో నితీశ్‌ను తలదన్నే నేత దేశంలో మరెవరూ ఉండకపోవచ్చు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడొక్కరే బహుశా ఆ విషయంలో నితీశ్‌తో పోటీపడగలరు. ఎన్డీయేతో తన దశాబ్దకాల అనుబంధాన్ని 2013లో నితీశ్ తెంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటం అప్పట్లో ఆయనకు అభ్యంతరం అనిపించింది. తీరా 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడం, కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడటంతో సీఎం పదవికి రాజీనామా చేసి జీతన్‌రాం మాంఝీని ఆ పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఆ వైరాగ్యం మూన్నాళ్ల ముచ్చటే అయింది. కొన్ని నెలలకే ఆయన్ను తొలగించి తిరిగి సీఎం అయ్యారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి మహాగuŠ‡బంధన్ కూటమి కట్టి మరోసారి సీఎం అయ్యారు. కానీ రెండేళ్లు గడిచేసరికల్లా మళ్లీ ఎన్డీయే గూటికి చేరి మళ్లీ సీఎం అవతారమెత్తారు. మోదీ నాయకత్వాన్ని సంపూర్ణంగా ఆమోదించారు. తీరా 2022లో దాన్నుంచి బయటపడి మరోసారి మహాగuŠ‡బంధన్ సర్కారుకు సారథ్యం వహించారు. తాజాగా ఎన్డీయే కూట మిలో ప్రవేశం ఖరారైందన్న కథనాలు నిజమైతే ఆయన ముచ్చటగా మూడోసారి రంగు మార్చి నట్టు! 2005లో తొలిసారి సీఎంగా అయినప్పుడు మొదలుకొని ఈ పదిహేడేళ్లలో ఆయన పదహారేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. చిత్రమేమంటే ఆయన ఎన్నిసార్లు యూటర్న్లు తీసుకున్నా బిహార్‌లో కాస్త అటూ ఇటూగా ఆయన ప్రతిష్టకు ఏనాడూ ఇబ్బంది కలగలేదు. లాలూ ప్రసాద్ యాదవ్, అటుపై ఆయన సతీమణి రబ్డీ దేవి ఏలుబడి సవ్యంగా వుంటే నితీశ్ ప్రాభవం ఈ స్థాయిలో ఉండేది కాదేమో! తన సొంత సామాజికవర్గం కుర్మీల బాగోగులు చూస్తూ బాగా వెనకబడిన కులాలనూ, మహాదళిత్ కులాలనూ సమాదరించి ‘కోటాలో కోటా’ కల్పించటం ఆయ నకు రాజకీయంగా కలిసొచ్చింది. అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యతనీయటంవల్ల ఆధిపత్య కులాల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం. అలాగే బీజేపీతో తరచు దగ్గరవుతున్నందుకు ముస్లింలలోనూ నితీశ్‌పై కినుకవుంది. కానీ ఆయన్ను పూర్తిగా దూరం పెట్టేంత తీవ్ర వ్యతిరేకత ఆ వర్గాల్లో లేక పోవటం నితీశ్‌కు ఆమోదయోగ్యతను కల్పిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో బీసీల్లోనూ, దళితుల్లోనూఅత్యంత వెనకబడిన కులాల ఆదరణను సులభంగా పొందగలిగిన బీజేపీకి బిహార్‌లో నితీశ్ అండ దండలుంటేనే అది సాధ్యంకావటం జేడీ(యూ)కు తోడ్పడుతోంది. మన పార్లమెంటరీ పార్టీలకు సిద్ధాంత జంజాటం తక్కువ. కొంతకాలం క్రితంవరకూ వామ పక్షాల్లో, మితవాదపక్షాల్లో ఆ పట్టింపు ఎక్కువుండేది. కానీ ఓట్ల, సీట్ల వేటలో అది మసకబారింది. వామపక్షాలు బీజేపీని అంటరాని పార్టీగా చూస్తాయి తప్ప దాంతో జతకట్టినవారిపట్ల ఆ భావంవుండదు. వారు బయటపడిన మరుక్షణం పునీతులైనట్టే భావిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాలి వాలుకు తగినట్టు రంగులు మార్చే నితీశ్ వంటి వారి నుంచి మెరుగైన కార్యాచరణను ఆశించలేం. ఆ సంగతలావుంచి ఇప్పటికే తృణమూల్ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోఇండియా కూటమితో పొత్తుండదని చెప్పిన తరుణంలో, పంజాబ్ ఆప్ నేత, సీఎం భగవంత్ మాన్ సైతం అదే బాణీ వినిపించిన నేపథ్యంలో నితీశ్ నిర్ణయం ఇండియా కూటమిని నామమాత్రావశిష్టం చేస్తుంది. నిర్దిష్టమైన సిద్ధాంతం లేనివారినీ, సులభంగా రంగులు మార్చే వారినీ, సూత్రబద్ధ రాజకీ యాలు అనుసరించలేని వారినీ వెంటేసుకుని కూటమి కట్టినంత మాత్రాన మెరుగైన ఫలితాలు రావని, ఎంత మాత్రమూ ప్రయోజనం ఉండదని విపక్షాలు ఇప్పటికైనా గ్రహించటం ఉత్తమం. -
‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమారే ప్రధాని!’
లక్నో: ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూపంలో మరో భారీ షాక్ తగలనున్నట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఇప్పటికే కూటమి నుంచి బయటకు వచ్చి.. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, పంజాబ్‌లో ఆప్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు మరో కీలకమైన పార్టీ జేడీ(యూ) కూడా కూటమి నుంచి వైదొలగనుందని తెలుస్తోంది. బిహార్ సీఎం నితీష్ కుమారు దీని కోసం పావులు కదపుతున్నారని సమాచారం. దాని కోసం ఆయన ప్రస్తుత సీఎం పదవి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి మళ్లీ 9వ సారి సీఎం ప్రమాణస్వీకారం చేయడానికి కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాల కూటమిలో ఎవరైనా ప్రధానమంత్రి పదవికి అర్హులేనని తెలిపారు. ఇక.. కూటమిలో ఎవరినైనా ప్రధాని చేయటానికి అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. అటువంటి స్వేచ్ఛ ప్రతిపక్షాల కూటమిలో ఉంటుందని చెప్పారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఉంటే ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ లో తాను ఎప్పుడు పాల్గొంటాననే విషయాన్ని సరైన సమయలో వెల్లడిస్తానని అన్నారు. నితీష్ కుమార్ యూ టర్న్ తీసుకొని బీజేపీతో చేతులు కలుపుతున్నారన్న వార్తలపై అఖిలేష్ యాదవ్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటగా నితీష్ కుమార్ చొరవ తీసుకొని మరీ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన కూటమి నుంచి వైదొలగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆయన కూటమిలోనే ఉంటే ప్రధాని అవుతారని అన్నారు. చదవండి: బీజేపీ-జేడీయూ నేతృత్వంలో నితీష్ మళ్లీ సీఎం? -
Lok Sabha polls 2024: బీజేపీ వైపు... నితీశ్ చూపు!
పట్నా/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి రెండు రోజుల్లోనే మూడో భారీ ఎదురుదెబ్బ! కీలక భాగస్వామి అయిన జేడీ(యూ) అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూటమికి కటీఫ్ చెప్పేలా కని్పస్తున్నారు. అవసరార్థపు గోడ దూకుళ్లకు పెట్టింది పేరైన ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల ముంగిట యూ టర్న్ తీసుకుని మళ్లీ బీజేపీతో జట్టు కట్టే దిశగా సాగుతున్నారు. ఈ దిశగా బుధవారం నుంచీ జరుగుతున్న వరుస పరిణామాలతో బిహార్‌లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు కూడా కుప్పకూలేలా కన్పిస్తోంది. ఘట్‌బంధన్‌తో 18 నెలల కలహాల కాపురానికి ఫుల్స్టాప్ పెట్టి బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం కాపాడుకునే ప్రయత్నాలకు నితీశ్ పదును పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతిగా ఆర్జేడీ కూడా జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా మెజారిటీ సాధనకు ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ దిశగా జేడీ(యూ) సీనియర్ నేతలతో నితీశ్ ఇంట్లో, ఘట్‌బంధన్‌లోని ఇతర పక్షాలతో ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ నివాసంలో పోటాపోటీ సమావేశాలతో గురువారం బిహార్ రాజధాని పట్నాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నితీశ్ నివాసంలో భేటీలో జేడీ(యూ) ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక లాలు ఒకవైపు తన నివాసంలో భేటీ జరుగుండగానే మరోవైపు ఆర్జేడీకే చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరితో కూడా ఫోన్లో మంతనాలు జరిపారు. దాంతో నితీశ్ మరింత అప్రమత్తయ్యారు. ఆర్జేడీకి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సివ్వకుండా అవసరమైతే అసెంబ్లీని రద్దు చేయాలని కూడా ఆయన యోచిస్తున్నట్టు చెబుతున్నారు! లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్‌లో ఆప్‌దీ ఒంటరి పోరేనని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ బుధవారం ప్రకటించడం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా డీలా పడ్డ ఇండియా కూటమిలో బిహార్ తాజా పరిణామాలు మరింత కలవరం రేపుతున్నాయి. నితీశ్ బీజేపీ గూటికి చేరితే విపక్ష కూటమి దాదాపుగా విచి్ఛన్నమైనట్టేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజుల విరామమిచ్చి ఢిల్లీ చేరిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఈ పరిణామాలన్నింటిపై పార్టీ నేతలతో మంతనాల్లో మునిగిపోయారు. మరోవైపు బిహార్ బీజేపీ చీఫ్ సమర్థ్ చౌదరి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అశ్వినీ చౌబేతో పాటు జేడీ(యూ) రాజకీయ సలహాదారు కేసీ త్యాగి కూడా ఒకే విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. దాంతో హస్తినలోనూ రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. ఆదినుంచీ కలహాల కాపురమే... బిహార్‌లో 2020లో ఏర్పాటైన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారు నిత్యం కలహాలమయంగానే సాగుతూ వస్తోంది. ముఖ్యంగా తేజస్విని సీఎం చేసి తప్పుకోవాలని లాలు కొంతకాలంగా పట్టుబడుతుండటంపై నితీశ్ గుర్రుగా ఉన్నారు. జేడీ(యూ) తాజా మాజీ అధ్యక్షుడు లలన్ సింగ్ సాయంతో ఆ పార్టీ నుంచి డజను మంది ఎమ్మెల్యేలను లాగేసేందుకు లాలు ఇటీవల గట్టి ప్రయత్నమే చేశారు. దాన్ని సకాలంలో పసిగట్టిన నితీశ్ లలన్‌కు ఉద్వాసన పలికి తానే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ ఉదంతంతో ఆర్జేడీతో విభేదాలు తారస్థాయికి చేరాయి. లాలు, నితీశ్‌లిద్దరికీ రాజకీయ గురువైన బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం నితీశ్ చేసిన వ్యాఖ్యలు విభేదాలకు మరింతగా ఆజ్యం పోశాయి. పారీ్టల్లో కుటుంబాల పెత్తనాన్ని కర్పూరి తీవ్రంగా వ్యతిరేకించేశారన్న నితీశ్ వ్యాఖ్యలు ఆర్జేడీని ఉద్దేశించినవేనంటూ లాలు కుటుంబం మండిపడింది. నితీశ్ అవకాశవాది అని తూర్పారబడుతూ లాలు కుమార్తె రోహిణీ ఆచార్య ఎక్స్‌లో పెట్టిన పోస్టులతో పరిస్థితి రసకందాయంలో పడింది. నితీశ్‌పై ఆమె విమర్శలను రాష్ట్ర బీజేపీ అగ్ర నేతలు తీవ్రంగా ఖండించడం, ఆ వెంటనే ఆ పారీ్టతో జేడీ(యూ) దోస్తీ అంటూ వార్తలు రావడం... నితీశ్, లాలు నివాసాల్లో పోటాపోటీ సమావేశాల తదితర పరిణామా లు వెంటవెంటనే జరిగిపోయాయి. గిరిరాజ్ చెణుకులు పదేపదే ఆర్జేడీపై అలగడం నితీశ్‌కు పరిపాటేనంటూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత గిరిరాజ్‌సింగ్ విసిరిన చెణుకులు గురువారం వైరల్‌గా మారాయి. ‘‘నే పుట్టింటికి వెళ్లిపోతా. నువ్వు చూస్తూ ఉండిపోతావ్ అని పాడుతూ లాలును నితీశ్ చీటికీమాటికీ బెదిరిస్తుంటారు. కానీ పుట్టింటి (బీజేపీ) తలుపులు తనకు శాశ్వతంగా మూసుకుపోయాయన్న వాస్తవాన్ని మాత్రం దాస్తుంటారు’’ అంటూ తాజా పరిణామాలపై గిరిరాజ్ స్పందించారు. గోడదూకుళ్లలో ఘనాపాఠి రాజకీయ గాలికి స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా మంచినీళ్ల ప్రాయంగా కూటములను మార్చడంలో నితీశ్‌కుమార్ సిద్ధహస్తుడు. దాంతో ఆయన్ను పల్టూ (పిల్లిమొగ్గల) కుమార్‌గా పిలవడం పరిపాటిగా మారింది. బీజేపీ వాజ్‌పేయీ, అడ్వాణీల సారథ్యంలో సాగినంత కాలం ఆ పారీ్టతో నితీశ్ బంధం అవిచి్ఛన్నంగా సాగింది. వారి శకం ముగిసి నరేంద్ర మోదీ తెరపైకి రావడంతో పొరపొచ్ఛాలు మొదలయ్యాయి. ఆయన్ను ప్రధాని అభ్యరి్థగా ప్రకటించడంతో బీజేపీతో 17 ఏళ్ల బంధానికి 2013లో తొలిసారిగా గుడ్‌బై చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత బిహార్ సీఎంగా తప్పుకుని జితిన్‌రాం మాంఝీని గద్దెనెక్కించారు. తన బద్ధ విరోధి అయిన లాలు సారథ్యంలోని ఆర్జేడీతో పొత్తు ద్వారా సర్కారును కాపాడుకున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాఘట్‌బంధన్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు. కానీ సంఖ్యాబలంలో ఆర్జేడీ పెద్ద పారీ్టగా అవతరించడంతో నితీశ్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. లాలు కుమారుడు తేజస్విని అయిష్టంగానే డిప్యూటీ సీఎం చేయాల్సి వచి్చంది. రెండేళ్లలోపే కూటమిలో పొరపొచ్ఛాలు పెద్దవయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లాలు, తేజస్విలపై సీబీఐ కేసులు నితీశ్‌కు అందివచ్చాయి. డిప్యూటీ సీఎం పోస్టుకు రాజీనామా చేసేందుకు తేజస్వి ససేమిరా అనడంతో తానే సీఎం పదవికి రాజీనామా చేసి 2017లో కూటమి సర్కారును కుప్పకూల్చారు. గంటల వ్యవధిలోనే బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కి ఔరా అనిపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. కానీ ఈసారి బీజేపీ పెద్ద పారీ్టగా అవతరించడంతో ఏ విషయంలోనూ తన మాట సాగక ఉక్కపోతకు గురయ్యారు. చివరికి జేడీ(యూ)ను చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022 ఆగస్టులో దానికి గుడ్‌బై చెప్పారు. మర్నాడే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్బంధన్ సర్కారు ఏర్పాటు చేసి సీఎం పీఠం కాపాడుకున్నారు. తాజాగా నితీశ్ మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు నిజమైతే ఇది ఆయనకు ఐదో పిల్లిమొగ్గ అవుతుంది! తెరపైకి మెజారిటీ లెక్కలు... నితీశ్ బీజేపీ గూటికి చేరతారన్న వార్తల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీలో బలాబలాలు మరోసారి తెరపైకొచ్చాయి. 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 122. మహాఘట్బంధన్ ప్రస్తుత బలం 159. 45 మంది ఎమ్మెల్యేలున్న జేడీ(యూ) ని్రష్కమిస్తే ఆర్జేడీ (79), కాంగ్రెస్ (19), వామపక్షాల (16)తో కూటమి బలం 114కు పడిపోతుంది. అప్పుడు మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం (4), మజ్లిస్ (1), స్వతంత్ర ఎమ్మెల్యే (1) మద్దతు కూడగట్టినా 120కే చేరుతుంది. మెజారిటీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలి. ఈ నేపథ్యంలో మాంఝీ తదితరులతో పాటు జేడీ(యూ) అసంతృప్త ఎమ్మెల్యేలతో కూడా ఆర్జేడీ చీఫ్ లాలు జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి చెందిన స్పీకర్ పాత్ర కూడా కీలకంగా మారేలా కన్పిస్తోంది. మరోవైపు బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కును అలవోకగా దాటేస్తాయి. తద్వారా తానే సీఎంగా కొనసాగాలని నితీశ్ భావిస్తున్నట్టు సమాచారం. కానీ అందుకు బీజేపీ సుముఖంగా లేదని, తమకే సీఎం చాన్సివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. అందుకు నితీశ్ అంగీకరించే పక్షంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
బిహార్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం నితీష్
-
బిహార్‌లో పతనం దిశగా మహాకూటమి సర్కార్
పాట్నా: బిహార్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం నితీష్ కుమార్ ఉన్నారని సమాచారం. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో నితీష్ కుమార్ తీరుపై లాలూ కుమార్తె రోహిణి ఫైర్ అయ్యారు. నితీష్ కుమార్ పచ్చి అవకాశవాది అంటూ ట్వీట్ చేశారు. దీంతో మాహా కూటమిలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు బయటకొచ్చాయి. బిహార్ రాజకీయ క్షేత్రంలో కీలక మలుపులు చోటుచేసుకోబోతున్నాయి. బిహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి బీజేపీతో కలిసిపోనున్నారని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మహాకూటమి(మహాగత్బంధన్) నుంచి వైదొలగనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇండియా కూటమికి అతిపెద్ద షాక్ తగలనుంది. నితీష్ కుమార్ 2013 నుంచి ఎన్డీయే, మహాఘట్బంధన్ మధ్య ఊగిసలాడుతున్నారు. నిత్యం పొత్తులతో జిమ్మిక్కులు చేస్తూ సీఎం పదవిని చేజిక్కించుకుంటూ వచ్చారు. మహాకూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేలో చేరిన రెండేళ్లకే చివరిసారిగా 2022లో ఆయన మళ్లీ మహాకూటమిని ఏర్పరిచారు. 2020లో బిహార్‌లో చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ సహా స్థానిక పార్టీలతో కలిసి మహాకూటమి పేరుతో ప్రభుత్వం ఏర్పడింది. నితీష్ కుమార్ సీఎం అయ్యారు. అనుమానాలకు ఆజ్యం.. దివంగత సీఎం కర్పూరీ రాకూర్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారత రత్న ప్రకటించడాన్ని నితీష్ ప్రభుత్వం స్వాగతించింది. అంతేకాకుండా వంశపారంపర్య రాజకీయాలను ఎత్తిచూపుతూ ఆర్జేడీ టార్గెట్‌గా నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్పూరీ ఠాకూర్ చూపిన మార్గంలోనే తమ పార్టీ పయనిస్తోందని నితీష్ పేర్కొన్నారు. కొన్ని పార్టీలు తమ వారసులకు రాజకీయ భవిష్యత్ కోసం పోరాడుతారని విమర్శించారు. నితీష్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత లాలూ కుమార్ కుమార్తె రోహిణీ ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈ పరిణామాలు బీజేపీ వైపు నితీష్ కుమార్ అడుగులు పడుతున్నాయనడానికి అనుమానాలను పెంచుతున్నాయి. జోడో యాత్రలో జాయిన్ కాము.. అటు.. జనవరి 30న బిహార్‌లో ప్రవేశించే కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో నితీష్ కుమార్ హాజరుకాబోరని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ ద్వారా నిన్న సాయంత్రం ఆహ్వానం అందిందని.. అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల చర్చల్లో జాప్యం జరగడంతో నితీష్ కుమార్ కలత చెందారని వెల్లడించాయి. ఇదీ చదవండి: నితీష్ కుమార్‌పై లాలూ కూతురు ఫైర్ -
క్రెడిట్ కోసం మోదీ ప్రయత్నం.. నితీష్ కుమార్ విమర్శలు
పట్నా: స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గుర్తింపుగా ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని బిహార్ సీఎం నితీష్‌కుమార్ విమర్శించారు. కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించటంపై మోదీ తనకే పూర్తి క్రెడిట్ దక్కాలని భావిస్తున్నారని అన్నారు. దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటిస్తున్నట్లుగా ఆయన కూమారుడు, జేడి(యూ) నేత రామ్మత్ ఠాకూర్‌కు ప్రధాని మోదీ సమాచారం అదించారని తెలిపారు. ప్రధాన మంత్రి ఫోన్ చేసినట్లు రమ్మత్ ఠాకూర్ తనకు చెప్పారని అన్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం తనకు ఈ విషయాన్ని తెలియజేయలేదని చెప్పారు. అయితే తనకే పూర్తి క్రెడిట్ దక్కాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. ఏదేమైనా తమ పార్టీ సుదీర్ఘంగా చేసిన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చిందని కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పలుసార్లు తమ జేడీ(యూ) పార్టీ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. తమ సంకల్పానికి దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ ప్రేరణ అని అన్నారు. ఆయన వెనకబడిన, బలహీన వర్గ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఠాకూర్ స్పూర్తీతోనే తాము బిహార్‌లో కులగణన చేపట్టామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఇక.. ‘ఇన్నాళ్లకు దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ కపటత్వం బయటపడింది. ఇప్పటికైనా జన నాయకుడు ఠాకూర్‌కు భరత రత్న ప్రకటించటాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది’ అని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: ‘కాంగ్రెస్ పనికి రాని పార్టీ.. కూటమి అసహజమైంది’ -
ముంబైతో రంజీ మ్యాచ్.. అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి.. రహానే, శ్రేయస్ సహా..!
ముంబై: ‘ఎలైట్’ డివిజన్లో భాగంగా ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ యువ పేసర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతను అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ లాంటి అంతర్జాతీయ స్థాయి బ్యాటర్లు సహా మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. నితీశ్ ధాటికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటైంది. రహానే (0), శ్రేయస్ (48) వికెట్లతో పాటు బిస్తా (39), షమ్స్ ములాని (38), తనుష్ కోటియన్ (54) వికెట్లు నితీశ్ ఖాతాలో పడ్డాయి. లలిత్ మోహన్, షోయబ్ ఖాన్ తలో రెండు వికెట్లు, షేక్ రషీద్ ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్ భుపేన్ లాల్వాని (61)తో పాటు లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి (53) అర్ధసెంచరీలతో రాణించగా.. సువేద్ పార్కర్ (41), కులకర్ణి (24 నాటౌట్) పర్వాలేదనిపించారు. రహానే సహా రోస్టన్ డయాస్ (0), ప్రసాద్ పవార్ (15) నిరశపరిచారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (23), హనుమ విహారి (6), షేక్ రషీద్ (3) వెనుదిరగగా...ప్రశాంత్ కుమార్ (59 నాటౌట్), రికీ భుయ్ (4 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. షమ్స్ ములానీ 2, రోస్టన్ డయాస్ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఆంధ్ర మరో 297 పరుగులు వెనుకబడి ఉంది. బ్యాటింగ్‌లోనూ నితీశ్ చిచ్చరపిడుగే.. విశాఖకు చెందిన 20 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటగల సమర్ధత ఉన్న ఆటగాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్.. ఓ అండర్-16 సీజన్లో 1200కు పైగా పరుగులు సాధించి, తనలోని బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ సీజన్లో నితీశ్.. ఓ ట్రిపుల్ సెంచరీ, క్వాడ్రపుల్ సెంచరీ (400) సహా ఓ భారీ సెంచరీ (190) చేశాడు. నితీశ్ గత రంజీ సీజన్లోనూ బంతితో రాణించాడు. 2022-23 సీజన్లో అతను 25కు పైగా వికెట్లు పడగొట్టి ఆంధ్ర జట్టులో కీలక బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న నితీశ్.. టీమిండియాలో చోటే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. హార్దిక్ పాండ్యాలా నితీశ్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని విశ్లేషకులు అంటున్నారు. -
ఇండియా కూటమి కన్వినర్‌గా నితీష్ కుమార్?
ఢిల్లీ: ఇండియా కూటమి కన్వినర్‌గా బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను నియమించనున్నారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీల వర్చువల్ సమావేశం ఈ వారంలో జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదిత నియామకాన్ని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లతో కాంగ్రెస్ ఇప్పటికే చర్చించింది. భారత కూటమిలోని ఇతర భాగస్వాములను కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై నితీష్ కుమార్ నిన్న ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించే ఆలోచనకు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతును వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇండియా కూటమి నేతలు డిసెంబర్ 19న నాలుగవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలోనే కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను నియమించాలనే ప్రతిపదానను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు నేతలు తీసుకున్నారు. ఈ సమావేశంలోనే సీట్ల పంపకం సహా 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనడానికి కావాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇదీ చదవండి: మూడోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా -
హ్యాపీ న్యూ ఇయర్!
హ్యాపీ న్యూ ఇయర్! -
జేడీయూలో ట్విస్ట్..!
-
పెద్ద పదవులు కోరుకోవడం లేదు: నితీశ్
పాట్నా: గత వారం ఢిల్లీలో జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానంటూ వెలువడిన వార్తలను బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ఖండించారు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యరి్థగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ సోమవారం పాటా్నలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తనకు పెద్ద కోరికలేవీ లేవని తెలిపారు. పెద్ద పదవులను తాను ఆశించడం లేదన్నారు. ‘ఇండియా’ కూటమి నిర్ణయాలపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఉద్ఘాటించారు. జేడీ(యూ) నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయన్న ప్రచారాన్ని నితీశ్ కొట్టిపారేశారు. పారీ్టలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. -
JDU: జేడీయూ అధినేతగా మళ్లీ నితీశ్!
పాట్నా: బీహార్ అధికార పార్టీ జనతా దళ్(యునైటెడ్) పగ్గాల్ని మళ్లీ ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందుకోబోతున్నారా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మరో వారంలోగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జేడీయూ చీఫ్‌గా రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ ఉన్నారు. అయితే తప్పించే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నితీశ్ కుమార్‌నే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు సీనియర్లు కోరుతున్నారట. ఈ క్రమంలో.. ఢిల్లీలో డిసెంబర్ 29వ తేదీన జరగబోయే పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాలన్ సింగ్ తొలగింపు ఎందుకంటే.. జేడీయూ చీఫ్‌గా లాలన్ సింగ్‌ను తొలగించేందుకు కారణం లేకపోలేదు. లాలన్ గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామంపై అసంతృప్తితో రగిలిపోతున్న నితీశ్.. ఆయన్ని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. జనతా దళ్ యునైటెడ్ ఏర్పడిన తొలినాళ్లలో శరద్ యాదవ్ వ్యవస్థాప అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై నితీశ్ కుమార్ 2016 నుంచి 2020 దాకా, 2020-21 మధ్య రామచంద్ర ప్రసాద్ సింగ్, లాలన్ సింగ్ 2021 నుంచి జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఆర్జేడీతో వైరం.. మైత్రి.. గ్యాప్ జనతా పార్టీ చీలికతో.. ఒకవైపు కర్ణాటకలో హెచ్డీ దేవె గౌడ జనతా దళ్(సెక్యులర్), నార్త్ బెల్ట్‌లో బీహార్ నుంచి శరద్ యాదవ్ నేతృత్వంలో జనతా దళ్(యునైటెడ్) ఏర్పాడ్డాయి. అప్పటికే జార్జి ఫెర్నాండేజ్, నితీశ్ కుమార్‌లు సమతా పార్టీని స్థాపించారు. సమతా పార్టీని 2003 అక్టోబర్ 30న జనతా దళ్‌లో విలీనం చేశారు. మరో పార్టీ లోక్ శక్తి కూడా ఇందులో చేరింది. అప్పుడు అధికారంలో రాష్ట్రీయ జనతా దళ్ ఉండగా.. ప్రతిపక్ష కూటమిగా జేడీయూ కొనసాగింది. అయితే.. బీజేపీతో కటీఫ్ ప్రకటించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎంతో పొత్తుగా వెళ్లింది జేడీయూ. నలభై సీట్లలో కేవలం రెండే సీట్లు నెగ్గింది. ఓటమికి నైతిక బాధత్య వహిస్తూ నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జతిన్ రామ్ మాంఝీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ టైంలో బీజేపీ అధికార పక్షాన్ని బలపరీక్షకు ఆహ్వానించగా.. ఆర్జేడీ సాయంతోనే జేడీయూ ప్రభుత్వం నెగ్గడం గమనార్హం. ఆ తర్వాత 2015లో జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు కూటమిగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకున్నప్పటికీ.. ఎస్పీ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో పొత్తుగా వెళ్లి ఎన్నికల్లో నెగ్గాయి. బీజేపీతో జేడీయూ దోస్తీ-కటీఫ్ల నడుమ.. జేడీయూ-ఆర్జేడీల మైత్రి కూడా పడుతూ లేస్తూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా విజయం సాధించి ప్రభుత్వంలో ఆర్జేడీ కూడా భాగమైంది. అయితే.. మధ్య మధ్యలో కీలక నేతల నడుమ లుకలుకలు బయటపడుతూనే వస్తున్నాయి. ఇండియా కూటమి సమావేశాలు కొనసాగుతున్న వేళ.. జేడీయూ-ఆర్జేడీల మధ్య ఆగాథం మరింత పెరుగుతూ వస్తోంది. -
ప్రధాని అభ్యర్థిగా ఖర్గేనే.. నితీష్‌కు రాహుల్ ఫోన్
ఢిల్లీ: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేసే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టతనిచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా మద్దతునిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఫోన్ చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లు ఖర్గే పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. దేశానికి తొలి దళిత వ్యక్తిని పీఎంగా ప్రకటించిన ఘనత కూడా దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనను ఎమ్‌డీఎమ్‌కే నేత వైకోతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు మద్దతు పలికారు. ఫోన్ కాల్ సందర్భంగా ఇండియా కూటమి బలాబలాలపై రాహుల్, నితీష్ కుమార్ చర్చించుకున్నారు. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రస్తావన తనకు తెలియదని నితీష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇదే క్రమంలో బిహార్ కేబినెట్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్యను పెంచుతానని నితీష్ హామీ ఇచ్చారు. కాగా.. 2024 లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులను అతి త్వరలో నిర్ణయిస్తామని కాంగ్రెస్ గురువారం తెలిపింది. ఢిల్లీలో ఇటీవల కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహించింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చింది. రాహుల్ భారత్ జోడో యాత్ర 2.0(తూర్పు-పశ్చిమం) చేయాలని ఈ సమావేశంలోనే నేతలు కోరారు. ఈ భేటీలో పాల్గొన్న 76 మంది నేతలు దేశంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై చర్చించారు. ఇదీ చదవండి: ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసనకు విపక్ష నేతల పిలుపు -
అయోమయంలో ‘ఇండియా’
పాలకపక్షాన్ని అధికారం నుంచి దించటమే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఇప్పటికీ అయోమయాన్ని వదుల్చుకోలేకపోతున్నదని మంగళవారం జరిగిన సమావేశం రుజువుచేసింది. తాము ఎవరికి ప్రత్యామ్నాయమో, దేనిలో ప్రత్యామ్నాయమో కూటమి భాగస్వామ్య పక్షాలకు ఈనాటికీ అర్థం కాలేదని ఆ సమావేశం తీరుతెన్నులు తేటతెల్లం చేస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతుండగా ఆయన హిందీ అర్థంకాక ఇబ్బందిపడుతున్న డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు విషయంలో నితీశ్ స్పందించిన వైనం దిగ్భ్రాంతికరం. ‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్థమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని అడిగిన ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝాపై నితీశ్ నిప్పులు కక్కారు. పనిలో పనిగా ‘హిందీ మన జాతీయ భాష. అందరి భాష. అందుకే మన దేశాన్ని హిందూస్థాన్‌గా పిలుచుకుంటాం. అది అందరికీ తెలియాల్సిందే. మీరేమీ అనువాదం చేయకండి’ అన్నారట. నితీశ్ రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో బిహార్‌లో అవినీతికీ, అధికధరలకూ వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంలో ఎదిగి రాజకీయరంగ ప్రవేశం చేసిన వ్యక్తి. పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్నవారు. అలాంటి నాయకుడు హిందీ మన జాతీయ భాష అనుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశానికి ఉమ్మడి భాష అవసరమనీ, దాన్ని అందరూ నేర్చుకోవాలనీ ఉత్తరాది నాయకులు పార్టీలకు అతీతంగా చెబుతూవుంటారు. మాతృభాష కాక మరికొన్ని భాషలు నేర్చుకోవాలని చెప్పటంలో తప్పేమీ లేదు. అలా నేర్చుకోవటం వల్ల దేశంలో ఏమూలకైనా వెళ్లి జీవనం సాగించటం సులభమవుతుంది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది సమానంగా వర్తిస్తుంది. సివిల్స్‌లో విజేతలై దక్షిణాది రాష్ట్రాల క్యాడర్‌కు వచ్చేవారు స్థానిక భాషలు స్వల్పకాలంలోనే నేర్చుకుని అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. హిందీ భాషా ప్రాంతాలనుంచీ, వేరే రాష్ట్రాలనుంచీ వస్తున్న హీరోయిన్లు చాలా తొందరలోనే తెలుగు భాష అర్థం చేసుకుని మాట్లాడుతున్న వైనం అందరికీ తెలుసు. కానీ హిందీ ‘ఉమ్మడి భాష’గా వుండాలనీ, అది మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనీ మన నేతలు సుద్దులు చెప్పటం వింత గొలుపుతుంది. భాషాద్వేషంలాగే భాషాదురభిమానం కూడా ప్రమాదకరమేనని ఈ నేతలు గుర్తించటం లేదు. మనకు జాతీయ భాషంటూ ఏమీ లేదు. రాజ్యాంగంలోని 343 అధికరణ ప్రకారం కేంద్ర స్థాయిలో హిందీ, ఇంగ్లిష్ అధికార భాషలు. రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషలు అధికార భాష లుగా వుంటున్నాయి. 1960 ప్రాంతంలో హిందీని బలవంతంగా రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో భారీయెత్తున ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాతే 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లిష్‌లో జరపాలని నిర్దేశిస్తూ 1967లో ఆ చట్టానికి సవరణ కూడా చేశారు. ఇంకా వెనక్కు వెళ్తే స్వాతంత్య్రోద్యమ కాలంలో సైతం హిందీ భాష పెత్తనంపై తిరగబడిన దాఖలాలున్నాయి. హిందీని ఉమ్మడి భాషగా గుర్తించాలని నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించాలని పురుషోత్తందాస్ టాండన్ నేతృత్వంలో కొందరు ఉత్తరాది నాయకులు జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో ప్రయత్నించినప్పుడు నాటి ఆంధ్రప్రాంత ప్రముఖ నేత స్వర్గీయ ఎన్జీ రంగా గట్టిగా వ్యతిరేకించి అడ్డు కున్నారు. కేంద్రంలో పాలకపక్షంగా యూపీఏ వున్నా, ఎన్డీఏ వున్నా హిందీ వినియోగాన్ని పెంచ టానికి శ్రమిస్తుండటం తరచు కనబడుతూనే వుంటుంది. 2008లో అప్పటి యూపీఏ సర్కారు కేంద్ర ప్రభుత్వ నియామకాల కోసం జరిపే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరి చేయాలని ప్రతిపాదించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ప్రతిపాదన వల్ల హిందీ భాషా ప్రాంతవాసులే లబ్ధిపొందుతారనీ, దక్షిణాది వారికి అన్యాయం జరుగుతుందనీ ఆయన ఎలుగెత్తారు. తాను కాంగ్రెస్ నాయకుడే అయినా, యూపీఏకు తమ పార్టీయే నేతృత్వం వహిస్తున్నా హిందీ భాషను రుద్దాలన్న ప్రయత్నాన్ని ఆయన సాగనివ్వలేదు. ఈ చరిత్రంతా తెలుసుకోకుండా నితీశ్ ఆగ్రహించటం కూటమికి గానీ, వ్యక్తిగతంగా ఆయనకు గానీ ప్రతిష్ఠ తీసుకురాదు. అసలు తాము ఇండియా కూటమిగా ఎందుకు ఏర్పడ్డారో, దేశంలో ఎలాంటి ప్రజాస్వామిక వాతావరణం ఏర్పర్చటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారో భాగస్వామ్య పక్షాల నేతలకు అవగాహన వుందా? ఉంటే నితీశ్ వంటి నాయకుడి నుంచి ఇలాంటి స్పందన రాదు. ఏ భాష అయినా పౌరులు ఎంతో ఇష్టంతో, ప్రేమతో నేర్చుకోవాలి. సినిమాలు, టీవీ చానెళ్ల వల్ల ఈరోజుల్లో హిందీతో సహా ఏ భాష నేర్చుకోవటమైనా ఎంతో సులభమవుతోంది. కూటమి ఏర్పడి అయిదు నెలలవుతోంది. తాజా సమావేశం నాలుగవది. సెప్టెంబర్ 14న ఢిల్లీలో సమావేశమైనప్పుడు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం ప్రక్రియపై ‘త్వరలో’ చర్చించాలని తీర్మానించారు. అది కాస్తయినా ముందుకు కదల్లేదు. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఖరారు చేద్దామన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన సమావేశంలో వీగిపోయింది. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ దీనిపై మండిపడగా, కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ కిక్కురుమనలేదు. దేశానికి భారత్‌గా నామకరణం చేయాలన్న ఎన్డీఏ ప్రతిపాదనకు నితీశ్ వంత పాడటం కూడా చాలామందికి నచ్చలేదంటున్నారు. ఇలా ఏ అంశంలోనూ ఏకాభిప్రాయానికి రాలేక, చరిత్రపై అసలే అవగాహన లేక ఇండియా కూటమి సాధించేదేమిటి? -
ప్రముఖుల దూరం.. ఇండియా కూటమి భేటీ వాయిదా
ఢిల్లీ: దేశ రాజధానిలో రేపు జరగనున్న ఇండియా కూటమి భేటీని వాయిదా వేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ప్రముఖులు దూరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెంటనే డిసెంబర్ 6న ఇండియా కూటమి భేటీకి కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లు తమ బదులుగా పార్టీ నుంచి ఇతర సభ్యులను పంపుతామని ఇప్పటికే ప్రకటించారు. "ఇండియా కూటమి సమావేశానికి అఖలేష్ యాదవ్ హాజరయ్యే ఆలోచన లేదు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ లేదా అఖిలేష్ సూచించిన ఇతర నేత ఎవరైనా సమావేశానికి వెళతారు" అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. అటు.. జేడీయూ నుంచి పార్టీ చీఫ్ లాలన్ సింగ్, బిహార్ నీటి వనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఘా సమావేశానికి హాజరుకానున్నారు. ఇండియా కూటమి భేటీకి తాను కూడా హాజరు కాలేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే తెలిపారు. ఉత్తర బెంగాల్లో పర్యటించాల్సిన ఇతర షెడ్యూల్‌ను సూచిస్తూ భేటీకి దూరంగా ఉన్నారు. మిచౌంగ్ తుపానుతో చెన్నై ఎయిర్‌పోర్టు బంద్ అయిన కారణంగా తాను రాలేనని సీఎం స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీజేపీకి కనీసం దరిదాపుల్లో కూడా లేని స్థితిలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌ను పునరాలోచనలో పడేశాయి. దీంతో వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చారు. ఈ భేటీకి ప్రముఖులు దూరంగా ఉండటం కీలక సంకేతాలను అందిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ధ్యేయంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల కూటమికి 'ఇండియా' పేరును కూడా నిర్ణయించారు. ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమయ్యారు. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్ -
మోదీపై ప్రశంస.. రాజీనామా చేయాలంటూ డిమాండ్!
పట్నా: రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్.. ఈ మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో తాము మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జనతా దళ్ యునైటెట్(జేడీయూ)చెందిన లోక్‌సభ ఎంపీ సునీల్ కుమార్ పింటూ.. మోదీని ప్రశంసిస్తూ చేసిన స్లోగన్ వివాదాస్పదంగా మారింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ‘గెలుపు మోదీతో సాధ్యమవుతుంది’అనే బీజేపీ నేతలు, కార్యకర్తలు పలికే స్లోగన్‌ను ఆయన కూడా అంటూ మోదీని ప్రశంసించారు. దీంతో జేడియూ పార్టీ నేతలు పింటూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి, బీజేపీకి అనుకూలంగా ప్రశంసలు కురిపించినందుకు పింటూ.. లోక్ సభ సత్వానికి రాజీనామా చేయాలని జేడియూ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ డిమాండ్ చేశారు. పింటూ మోదీ పట్ల ప్రభావితం అయ్యారని అగ్రహించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ, మోదీకి అనుకూలమైన స్లోగన్లు చేయటం సరికాదన్నారు . అతి తర్వరలో లోక్‌సభ సభ్యత్వ రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే పింటూ చేసిన మోదీ అనుకూల స్లోగన్‌పై బీజేపీ అధికార ప్రతినిధి కుంతల్ కృష్ణా స్పందిస్తూ.. పింటూ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని తెలిపారు. గతేడాది జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకుని.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదికూడా చదవండి: ‘ఫ్యామిలీలో మరణం’ అయినా.. పార్టీ గెలుపు కోసం కృషి: మోదీ -
బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేదంటే!: కేంద్రానికి నితీష్ హెచ్చరిక
పాట్నా: కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్ సీఎం నితీష్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. బిహార్‌కు అతి త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. అలా జరగని నేపథ్యంలో కేంద్రంపై వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రకటించారు. కాగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ గత కొన్నేళ్లుగా బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ డిమండ్‌ను మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. హోదా విషయంలో ముందుకు సాగాలంటే ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం త్వరగా బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మూలమూలన ప్రత్యేక హోదా కోసం డిమాండ్ వినిపిస్తుందని పేర్కొన్నారు. ఎవరైతే ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు ఇవ్వరో.. వారికి రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకున్న వారే అవుతారని సీఎం విమర్శించారు. కులాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపు బిల్లును ఇటీవలే బిహార్ అసెంబ్లీ ఆమోదించిన విషయాన్ని నితీష్ ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్సీ, ఈబీసీ, ఓబీలకు ఉన్న రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన ఆధారంగా మొత్తం రిజర్వేషన్లను 75 శాతానికి తీసుకువెళ్లామని వెల్లడించారు. చదవండి: కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు! సమాజంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, దీనికోసం బీహార్ వంటి పేద రాష్ట్రానికి అనేక కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. వాటిని అయిదేళ్లలో ఖర్చు చేస్తామని చెప్పారు. అయితే బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే వచ్చే రెండున్నరేళ్లలో ప్రజలకు ఆ సదుపాయాలను అందించగలుగుతామని చెప్పారు. అందుకే బీహార్‌కు తక్షణమే హోదా అవసరమని తెలిపారు. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర అసెంబ్లీ, మండలిలో ఏకగ్రీవంగా ఆమోదించిన రిజర్వేషన్‌కు సంబంధించిన రెండు బిల్లులను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆమోదం కోసం పంపినట్లు నితీష్ తెలిపారు. రెండు బిల్లులపై గవర్నర్ త్వరలో సంతకం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదం అనంతరం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం దీనిని అమలు చేస్తామని చెప్పారు. -
Bihar: రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
పాట్నా: రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు బిహార్ అసెంబ్లీలో గురువారం ఆమోదముద్ర పడింది. కులాల వారీగా కోటా పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని కేబినెట్ ప్రతిపాదించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను తాజాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం నితీష్ కుమార్ సభలో లేకుండానే అసెంబ్లీ బిల్లు పాస్ అవ్వడం విశేషం. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ కోటా 65శాతానికి పెరిగింది. అయితే రిజర్వేషన్ల సవరణ బిల్లులో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రస్తావించకపోవడంపై బీజేపీ రాష్ట్ర అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లుపై బీజేపీ అభ్యంతరం తెలపడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలగజేసుకొని.. తన మాటలు వినాలనుకుంటేనే మాట్లాడతానని చెప్పారు. లేకపోతే మాట్లాడనని చెప్పారు. తొమ్మిది పార్టీల మద్దతుతో కుల ఆధారిత గణన జరిగిందని, దీని ద్వారా ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితిని పరిశీలించామని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సభలో చెప్పినప్పటికీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే బిల్లును అమలు చేయాలని కోరుతున్నట్లు సీఎం చెప్పారు. చదవండి: అయోధ్యలో కేబినెట్ భేటీ.. ఇదే తొలిసారి రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ), ఇతర వెనకబడిన వర్గాలు(ఓబీసీ) , అత్యంత వెనకబడిన వర్గాల (ఈబీసీ) వారికి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని మంగళవారం జేడీఎస్ సర్కార్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను 65 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లు ఆమోదం లభించడంతో అయితే ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) వారికి కేంద్రం 10శాతం రిజర్వేషన్ ఇస్తుండగా.. బిహార్ ప్రభుత్వం అందిస్తున్న కోటాతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 75శాతానికి పెరిగాయి తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం. షెడ్యూల్డ్ కులాల వారికి 20 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కుతుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లు అందనున్నాయి. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. కాగా ప్రస్తుతం ఓబీసీలకు 12 శాతం, ఈబీసీలకు 18 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. ఇక ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కులగణన ప్రకారం.. రాష్ట్ర 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం
పాట్నా: సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సమర్ధించడాన్ని ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తప్పుబట్టారు. తేజస్వీ యాదవ్ పాఠశాలకు ఎప్పుడూ వెళ్లలేదని, కనీసం తొమ్మిదో తరగతి కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. సెక్స్ ఎడ్యూకేషన్ పట్ల తేజస్వీ యాదవ్‌కు ఎలాంటి అవగాహన లేదని దుయ్యబట్టారు. తేజస్వీ యాదవ్ ఏ పాఠశాలకు వెళ్లారో బయటకు వెళ్లడించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఎక్కడ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్‌ను నేర్చుకున్నారో? బహిర్గతం చేయాలని కోరారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినంత అసభ్యకరమైన భాషలో పాఠశాలల్లో లైంగిక విద్య బోధించరని చెప్పారు. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించిన తీరు ఆయనకు జ్ఞానం లేనివాడనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఆ సమయంలో అసెంబ్లీలోనే ఉన్న తేజస్వీ యాదవ్.. నితీష్ వ్యాఖ్యలను సెక్స్ ఎడ్యుకేషన్‌గా పేర్కొంటూ.. పాఠశాలల్లో కూడా చర్చిస్తారని అన్నారు. అయితే.. బీజేపీ, మహిళా సంఘాల ఆందోళనలతో నితీష్ కుమార్ తన వ్యాఖ్యలపై ఎట్టకేలకు క్షమాపణలు కోరారు. ఇదీ చదవండి: సీఎం రేసుపై సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు -
నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్
వాషింగ్టన్: మహిళలపై బిహార్ సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలను అమెరికా గాయని, నటి మేరీ మిల్బెన్ ఖండించారు. నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను భారతీయురాలినైతే బిహార్‌కు వెళ్లి సీఎం పదవికి పోటీ చేసేదాన్నని అన్నారు. బిహార్ సీఎంగా పోటీ చేయడానికి ఓ ధైర్యవంతురాలైన మహిళ అవసరమని అభిప్రాయపడ్డారు. "బిహార్‌లో మహిళల విలువలు ప్రమాదంలో ఉన్నాయి. నితీష్ కుమార్ వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ సవాళ్లకు ఒకే ఒక సమాధానం కనిపిస్తోంది. బిహార్‌లో సీఎం పదవికి ఓ ధైర్యవంతురాలైన మహిళ పోటీ చేయాల్సిన అవసరం ఉంది. నేనే భారతీయురాలినైతే బిహార్‌కు వెళ్లి సీఎం పదవికి పోటీ చేస్తా' అని మేరీ మిల్బెన్ అన్నారు. భారతీయులు మహిళల కోసం ఓటు వేయాలని కోరారు. మార్పును ఆహ్వానించాలని ఆకాంక్షించారు. బిహార్‌లో మహిళల అధికారం దిశగా బీజేపీ అడుగులు వేయాలని కోరారు. ఇదే నిజమైన అభివృద్ధని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ సారథ్యంలో మహిళా సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
నితీశ్ సిగ్గుపడాలి: ప్రధాని నరేంద్ర మోదీ
దమోహ్/గుణ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సాక్షాత్తూ అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను దారుణంగా అగౌరవపర్చినా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరు విప్పడం లేదని, కనీసం ఖండించడం లేదని తప్పుపట్టారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల నితీశ్ సిగ్గుపడాలని అన్నారు. తల్లులు, అక్కచెల్లెమ్మల పట్ల ఏమాత్రం గౌరవం లేని నాయకులతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. మహిళలను చిన్నచూపు చూసే వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు మోదీ సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడడానికి తాను చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని దమోహ్, గుణ పట్టణాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తనకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ కోర్టుకు వెళ్లినా సరే ఉచిత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు. ప్రతి ఇంట్లోనూ సౌర విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడూ విద్యుత్ ఉత్పత్తిదారుడే అవుతారని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ రూ.80 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. ‘ఉచిత రేషన్’ పొడిగింపుపై కాంగ్రెస్ అక్కసు పేదల ప్రజలకు ఉచిత రేషన్ సరుకుల పంపిణీ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామంటూ తాను హామీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని, అందుకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వారిని ఆ పాపం చేయనిద్దామని అన్నారు. తాను మాత్రం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటానని చెప్పారు. 80 కోట్ల మందికి వచ్చే ఏదేళ్లపాటు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వబోతున్నామని తెలిపారు. తనను చాలామంది ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, అయిప్పటికీ అవినీతిపై పోరాటం ఆపబోనని తేల్చిచెప్పారు. ఎవరెంత తిట్టుకున్నా తాను లెక్కచేయనని అన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రులు బెట్టింగ్‌ల్లో భాగస్వాములవుతున్నారని, నల్లధనం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం తాము 2014లో అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి చేరుకుందని, 200 ఏళ్లపాటు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టేశామని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలతో మనవైపు చూస్తోందని అన్నారు. తాను మూడోసారి ప్రధానమంత్రి కావడం తథ్యమని, భారత్‌ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘85 శాతం కమిషన్ వ్యవస్థ’ మళ్లీ అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. -
ఇంకా ఎంత దిగజారుతారు..? నితీష్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఫైర్
భోపాల్: జనాభా నియంత్రణలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ప్రతిపక్షాల మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని గునా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన.. నితీష్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని అన్నారు. "భారత కూటమికి చెందిన ప్రధాన నాయకుడు బిహార్ అసెంబ్లీలో మహిళలపై అసభ్య పదజాలం ప్రయోగించాడు. భారత కూటమిలోని ఏ నాయకుడు దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది వారికి ఏమాత్రం అవమానకరంగా కనిపించట్లేదు. మహిళల గురించి ఇలా ఆలోచించే వ్యక్తులు మీకు ఏం మంచి చేయగలరు?మన అమ్మా, అక్కాచెల్లెళ్ల పట్ల ఇలాంటి దుర్మార్గపు వైఖరి ఉన్నవాళ్లు మన దేశాన్ని అవమానిస్తున్నారు"" అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఇంకా ఎంత దిగజారిపోతారని ఇండియా కూటమిని ఉద్దేశించి ప్రశ్నించారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా ప్రముఖులు చిరునవ్వులు కురిపించారు. సీఎం వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని అసెంబ్లీలో బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. నితీష్ వ్యాఖ్యలు అవమానకరమని తక్షణమే క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ఎట్టకేలకు నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు
ఢిల్లీ: జనాభా నియంత్రణ అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ, ఢిల్లీ మహిళా ప్యానెల్ హెడ్ స్వాతి మలివాల్‌లు విరుచుకుపడ్డారు. నితీష్ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. "నితీష్ కుమార్ వ్యాఖ్యలు మహిళల హక్కులను భంగపరిచేవిలా ఉన్నాయి. ఇంతటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆయన క్షమాపణలు చెప్పాలి" అని జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్లో పేర్కొంది. 'నితీష్ మాట్లాడిన చెత్త వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించాయి. అసెంబ్లీలో వాడిన ఇలాంటి అవమానకరమైన, చౌకబారు పదజాలం మన సమాజానికి ఓ మరక. ప్రజాస్వామ్యంలో సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఆ రాష్ట్రంలో మహిళల దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.' అని రేఖా శర్మ అన్నారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. స్త్రీద్వేషి, పితృస్వామ్య స్వభావం అంటూ మండిపడింది. రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలతో నితీష్ కుమార్ ప్రజాస్వామ్యం గౌరవాన్ని కించపరిచారని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే దుయ్యబట్టారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఇదీ చదవండి: నోరుజారిన సీఎం నితీష్.. జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు -
నోరుజారిన సీఎం నితీష్.. జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు
బిహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నోరుజారారు. జనాభా నియంత్రణపై రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ నితీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోయిందో వివరిస్తూ ముఖ్యమంత్రి అసభ్యకరమైన, కించపరిచే పదజాలాన్ని ఉపయోగించారు. నితీష్ మాట్లాడుతూ.. ‘గతంలో 4.3 శాతం సంతానోత్పత్తి రేటు ఇప్పుడు 2.9 శాతానికి పడిపోయింది. సెక్స్ ఎడ్యుకేషన్ (లైంగిక విద్య) గురించి ఈ తరం అమ్మాయిలకు అవగాహన పెరిగింది. ఏ టైంలో ఏం చేయాలో వారి బాగా తెలుసు. అందుకే జనాభా తగ్గుతోంది’ అని వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలపై అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు షాక్‌కు గురయ్యారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయంటూ మహిళా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సీఎం నితీష్‌ను అత్యంత నీచమైన వ్యక్తిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించింది. ‘దేశ రాజకీయాల్లో నితీష్ అంత అసభ్యకరమైన నాయకుడిని చూడలేదు. అతని మనసుంతా చెత్త ఆలోచనలతో నిండిపోయి ఉంది. సీఎం డబుల్ మీనింగ్ వ్యాఖ్యాలను నిషేధించాలి’ ట్విటర్ వేదికగా డిమాండ్ చేసింది. సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం సీఎం వ్యాఖ్యలను సమర్ధించుకున్నాయి. పాఠశాలల్లో బోధించే సెక్స్ ఎడ్యుకేషన్ విద్య గురించి నితీష్ మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు సైన్స్, జీవశాస్త్రంలో దీన్ని నేర్చుకుంటారని అన్నారు. చదవండి: Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. -
Bihar Caste Reservation: రిజర్వేషన్లపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాట్నా: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది. దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల వారికి 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కనుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. చదవండి: బీహార్ కులగణన: 34 శాతం మంది పేదలే.. నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ఆదాయం కాగా కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
బీహార్ కులగణన: 34% మంది పేదలే.. నెల ఆదాయం రూ. 6 వేల కంటే తక్కువ..
పాట్నా: బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 34 శాతం పేదలు ఉన్నట్లు ఇటీవల చేపట్టిన కులగణన నివేదిక ద్వారా వెల్లడైంది. వీరి ఆదాయం నెలకు రూ.6 వేల కంటే దిగువన ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 29 శాతం మంది రూ.పది వేల కన్నా తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరో 28 శాతం మంది రూ.10 వేల నుంచి రూ.50 వేల మధ్య ఆదాయం పొందుతున్నారని, కేవలం 4 శాతం జనాభా మాత్రమే రూ.50 వేల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్లు రిపోర్టులో తేలింది. కులగణన ఆధారిత సర్వే రెండో విడత డేటాను బీహార్ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం 215 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనబడిన వర్గాలు, అత్యంత వెనకబడిన వర్గాలు(Extremely Backward Classes), జనరల్ కేటగిరికి చెందిన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. సర్వే అందించిన సమాచారం ప్రకారం.. ఎస్సీ ప్రజల్లో 42 శాతం, ఎస్టీ జనాభాలో 42.70 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నట్లు వెల్లడైంది. వెనకబడిన వర్గాల్లో (ఓబీసీ) 33.16 శాతం, అత్యంత వెనకబడిన వర్గాల (ఈబీసీ) వారిలో 33.58 శాతం మంది సైతం పేదరికం అనుభవిస్తున్నట్లు తెలిపింది. జనరల్ క్యాటగిరీకి చెందిన 25.09 శాతం కుటుంబాలు పేదరికం జాబితాలో ఉన్నట్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఇవేగాక ఇతర కులాల్లోని పేదలు 23.72 శాతం ఉన్నట్లు రిపోర్టులో తేలింది. షెడ్యూల్డ్ కులాల్లో కేవలం ఆరుశాతం కంటే తక్కువ మంది పాఠశాల విద్యను పూర్తిచేశారు. 11వ, 12వ తరగతి వరకు చదివిన వారు 9 శాతం మంది ఉన్నారు. ఇక గత నెలలో విడుదల చేసిన కులగణన మొదటి విడత నివేదికలో బీహార్‌లో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. మొత్తం 13.1 కోట్ల రాష్ట్ర జనాభాలో 20 శాతం జనాభా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో యాదవ్, ముస్లిం వర్గాల జనాభాను పెంచాలని నీతీశ్ కుమార్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనివల్ల ఓబీసీలకు, ఈబీసీలకు అన్యాయం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. షా వ్యాఖ్యలపై మండిపడిన బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కేంద్రమంత్రి ఆరోపణలను కొట్టిపారేశారు. యాదవులు వెనుకబడినవారు కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఏ ప్రాతిపదికన ఒకరి జనాభా తగ్గిస్తున్నారు, ఒకరి జనాభా పెంచుతున్నారని ఆరోపిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనకు మద్దతివ్వడానికి తమ వద్ద శాస్త్రీయ డేటా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సర్వే డేటా బయటపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే! -
కుల గణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను పెంచారు
ముజఫర్‌పూర్: బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను ఉద్దేశపూ ర్వకంగానే ఎక్కువ చేసి చూపించిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. మొత్తమ్మీద వెనుకబడిన కులాల వారికి మొండిచేయి చూపిందని చెప్పారు. ముజఫర్‌పూర్ జిల్లా పటాహిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ముస్లింల పట్ల అనుసరిస్తున్న బుజ్జగింపు వైఖరి ఫలితంగా నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలు తప్పవని నితీశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటువంటి రాజకీయాలకు తక్షణమే ముగింపు పలకాలని కోరారు. ‘నితీశ్ కుమార్ ప్రధాని పీఠంపై ఆశలు వదులుకోవాలి. అది ఎన్నటికీ జరగ దు. ఇండియా కూటమికి కనీసం ఆయన కన్వీనర్ అయినా కాలేకపో యారు. బిహార్‌లో గూండారాజ్యాన్ని తిరిగి రావడానికి ఆయనే బాధ్యుడు’అని ఆరోపించారు. గతంలో కులగణనకు ఆదేశాలు ఇచ్చిన సమయంలో రాష్ట్రంలో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. ఓబీసీలను ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ సైతం ఇప్పుడు అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేపడతానంటోందని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో అధికారం పంచుకుంటున్న జేడీయూ, ఆర్జేడీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నాయంటూ అమిత్ షా, ఈ కూటమి ఏకైక ఎజెండా ప్రధాని మోదీని వ్యతిరేకించడమేనన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఈ కూటమి పార్టీలు వ్యతిరేకించాయని కూడా మంత్రి చెప్పారు. కేంద్ర కేబినెట్లో 27 మంది మంత్రులు, అంటే 35 శాతం మంది వెనుకబడిన కులాలకు చెందిన వారేనన్నారు. ప్రధాని మోదీ హయాంలోనే ఓబీసీల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించామన్నారు. -
‘భారత్’ కూటమి అని మారిస్తే బలం పెరుగుతుందేమో ప్రయత్నిద్దామా సార్!
‘భారత్’ కూటమి అని మారిస్తే బలం పెరుగుతుందేమో ప్రయత్నిద్దామా సార్! -
కాంగ్రెస్ వల్లే ‘ఇండియా’లో వేడి తగ్గింది: నితీశ్ కుమార్
పట్నా: విపక్ష ‘ఇండియా’ కూటమి స్తబ్ధుగా మారిపోయిందని, ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ పారీ్టయే అందుకు కారణమని జేడీ(యూ) సీనియ ర్ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మునిగిపోయిందని, దాంతో ఇండియా కూటమిలో వేడి తగ్గిందని అన్నా రు. గురువారం బిహార్ రాజధాని పట్నాలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన సభలో నితీశ్ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ పాలనను వ్యతిరేకించే పారీ్టలు ఒకే వేదికపైకి వచ్చాయని, ఆ కూటమిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. -
కాంగ్రెస్ వల్లే 'ఇండియా' పురోగతి తగ్గింది: నితీష్ కుమార్
పాట్నా: కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమిలో పెద్దగా పురోగతి లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టిందని విమర్శించారు. అందుకే కూటమిలో దూకుడు తగ్గిందని చెప్పారు. బీజేపీ హటావో.. దేశ్ బచావో పేరుతో పాట్నాలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడానికి అందరం అంగీకరించామని తెలిపిన నితీష్ కుమార్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే ఇండియా కూటమి మరో భేటీ జరిగేలా కనిపిస్తోందని వెల్లడించారు. ఇండియా కూటమి కాంగ్రెస్ వల్లే దెబ్బతింటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే లోక్ సభ ఎన్నికలపై సన్నద్ధత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. కాగా.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొదటి సమావేశం బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగింది. రెండో సమావేశం బెంగళూరు వేదికగా నిర్వహించారు. ఇక మూడోసారి ముంబయిలో ఆగష్టు 31న భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. సీట్ల షేరింగ్‌లో పార్టీల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించింది. ఇదీ చదవండి: కేంద్రానికి రాజస్థాన్ సర్కార్ షాక్!.. ఇద్దరు ఈడీ అధికారుల అరెస్టు -
బహుజనులకు అదే విముక్తి మార్గం
కోట్లాది మంది రాజ్యాధికారానికి నోచుకోకుండా పోవడానికి రాజకీయాల్లో ఉన్న వర్ణతత్వమే కారణం అన్నారు అంబేడ్కర్. నిజానికి అంబేడ్కర్, మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ బహుజన వర్గాల సామాజిక, సాంస్కృతిక రాజకీయ విముక్తి కోసం బాటలు వేస్తూనే వచ్చారు. కానీ దళిత బహుజనులు, మైనారిటీలు మత భావాల ఊబిలో కూరుకుపోయారు. రాజ్యాధికారాన్ని అగ్రవర్ణ పార్టీల మీద ఆధారపడి పొందాలనే భావనలోనే ఇంకా ఉన్నారు. దేశంలో సామాజిక న్యాయం సంపూర్ణంగా జరగాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలి. శూద్రులను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తేవడం అన్ని పార్టీల తక్షణ కర్తవ్యం కావాలి. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించిన బీసీ కుల గణన ఇండియా కూటమికి ప్రధాన ఎజెండాగా ఉంది. దేశంలో సామాజిక న్యాయం సంపూర్ణంగా జరగాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజ స్థాన్, మిజోరం, తెలంగాణ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో దళిత బహుజన మైనారిటీలు 85 శాతం. అభ్యర్థులుగా నిలబడుతున్న మెజారిటీ వర్గం అగ్ర కులాలే. డబ్బును, మద్యాన్ని నియంత్రించడానికి ఈ రాష్ట్రాల్లో 970 చెక్‌పోస్టులు పెట్టారని చెబుతున్నారు. నిజానికి ఎన్నికల వ్యవహారం మొత్తం మద్యం, మాఫియా, డబ్బు పంపిణీలో మునిగిపోయి వుందని అందరికీ తెలుసు. ఎన్నికల బరిలో కోటీశ్వరులు, అవినీతి సమ్రాట్లు, కల్తీ వ్యాపారులు, విద్యా వ్యాపారులు ఎక్కువమంది నిలబడుతు న్నారు. కేసుల్లో ఉన్నవారు భారీగా ఉన్నారు. దీనికి పార్టీల భేదం లేదు. అందులో ఉన్నవారు ఇందులో ఉంటారు. ఆ పార్టీలో ఉన్నవారు టికెట్ లేకపోతే రెండో రోజే జంప్ అవుతారు. సామాజిక న్యాయానికి దూరంగా బతుకుతున్న పార్టీలు ఇవన్నీ. ఇంతకుముందు ఇచ్చిన మానిఫెస్టోనే మరలా కొత్తగా ప్రకటిస్తారు. రాజ్యాంగాన్ని పూర్తి చేసిన తరువాత అంబేడ్కర్ చేసిన ప్రకటన చాలా విలువైనది. జనవరి 26, 1950 నుంచి వైరుద్ధ్యాల జీవితంలోకి మనం అడుగు పెడుతున్నాం. రాజకీయాల్లో, ఆర్థిక, సాంఘిక జీవి తాల్లో అసమానత్వం, వైరుధ్యాలను తొలగించకపోతే అసమానత్వంతో బాధపడుతున్న ప్రజలు ఈ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవ స్థను పేల్చివేస్తారు అని హెచ్చరించారు. ఇది చాలా వాస్తవమైన ప్రక టన. రాజ్యాంగం ఇచ్చిన హక్కును గౌరవించలేని అంధత్వం సోకాల్డ్ రాజకీయ నాయకుల్ని వెంటాడుతోంది. అంబేడ్కర్ భారతదేశానికి బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ వాదాలను శత్రువులన్నాడు. బ్రాహ్మణవాదం అంటే ఇది బ్రాహ్మణు లకు పరిమితమైంది కాదు. నా కులమే అన్ని కులాల కంటే అధికమైందనే భావం, ఆ కుల భావంతో ఇతరులను కించపరచడం. నేను, నా కుటుంబం, నా కులం మాత్రమే ఆర్థికంగా పైకి రావాలని ఆలోచించడం. కులాన్ని, కుటుంబాన్ని దాటలేనివాడు రాజనీతిజ్ఞుడు కాలేడు. అంబేడ్కర్ ఆలోచనలు ఆనాటి నుండి ఈనాటి వరకు సమ కాలీనంగానే ఉండడానికి కారణం సమాజంలో మార్పు చాలా ఆలస్యంగా జరుగుతోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మొదటి నుండి అన్యాయం చేస్తూనే వచ్చింది. కాకా కాలేల్కర్ కమీషన్‌ను తొక్కిపెట్టింది. మండల్ కమిషన్‌ను తొక్కి పెట్టింది. ఇకపోతే 1951లో రాజ్యాంగంలో 15(4), 16(4) క్లాజులను పొందుపరచి రాజ్యాంగ పరంగా బీసీ రిజర్వేషన్లకు వున్న అడ్డంకి తొలగించబడింది. అక్కడి నుండి 1978 వరకు పరిపాలనలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తమ రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకున్నదే తప్ప వారి సంక్షేమానికి ఇసుమంత సౌలభ్యాన్ని కూడా కలిగించలేదు. 2012– 1978న అప్పటి జనతాపార్టీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో చేసిన ప్రకటన మేరకు మాజీ పార్లమెంటు సభ్యులు బి.పి. మండల్ అధ్యక్షతన వెనుకబడిన తరగతుల కమీషన్ నియమింపబడింది. ఆ కమీషన్లో ఆర్.ఆర్. బోలె, దివాన్ మోహన్ లాల్, దీనబంధు సాహు, కె. సుబ్రహ్మణ్యం, యన్.యన్. గిల్ సభ్యులుగా వున్నారు. ఈ కమిషన్ మొత్తం 40 సిఫార్సులను చేసింది. అందులో ప్రధానమైనవి: సాంఘికంగా, విద్యా విషయకంగా వెనుకబాటుతనం, ఆర్థిక పేదరికం అనేవి అంగవైకల్యం పొందిన కుల వ్యవస్థ తాలూకు రెండు ప్రత్యక్ష ఫలితాలు. వీటిని తొలగించడానికి తీవ్రమైన పరిపాలనా మార్పులు అవసరం; రిజర్వేషన్లు వుండడం వలన అర్హత, యోగ్యత ఏమీ దెబ్బతినవు. జనాభాలో 52 శాతం వున్న వీరికి ఆ జనాభాకు తగిన రిజర్వేషన్లు విద్యా ప్రభుత్వోద్యోగాల్లో వుండాలి; ఉద్యోగ నియా మకాలలో ప్రత్యక్షంగా భర్తీ చేసుకొనేటప్పుడు అభ్యర్థుల వయసు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వలె పొడిగించాలి; ఆయా కులాల్లోని అభ్యర్థులు దొరకనపుడు ఖాళీలను మూడు సంవత్సరాల వరకు అట్టి పెట్టాలి; మిగులు భూముల పంపిణీ బీసీలకు కూడా జరపాలి; 3,743 కులా లను బీసీ కులాలుగా తేల్చారు. మండల్ కమిషన్ నివేదిక అమలు జరపకపోవడం వల్లే ఆనాడు కాంగ్రెస్‌కు బీసీలు దూరమయ్యారు. ఆ తరువాత జనతా పార్టీ ఏర్పడిన తరువాత మండల్ కమీషన్ నివేదికలోని కొన్ని అంశాలు అమలు జరపడం గురించే జన సంఘ్ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా రూపొందింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటిగానే ఉన్నాయని మాజీ ప్రధాని వీపీ సింగ్ ఈ వ్యాసకర్తతో స్వయంగా అన్నారు. బీసీలంతా హిందువులే అని బీజేపీ ప్రకటిస్తుంది. శూద్రులను క్షత్రియత్వం నుండి కిందకి నెట్టి బాని సలుగా మార్చారని అంబేడ్కర్ చెప్పారు. ఏ బానిసత్వాన్ని అయితే వైదిక, బ్రాహ్మణవాదం, హిందూ వాదం బీసీలపై రుద్దిందో వారు అదే హిందూ ఆచారాలని ఆచరించడం ఆశ్చర్యాన్ని కొలిపే విషయం. సామాజిక, రాజకీయ బానిసత్వం అనే భావజాలం కట్టు బాని సలుగా చేస్తుంది. శూద్రులను బానిసత్వం నుండి విముక్తి చేయడం కోసం, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తీవ్రంగా కృషి చేశారు జ్యోతిబా ఫూలే. శూద్రులను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తేవటం ప్రభుత్వ కర్తవ్యం. శూద్రుల మనస్సు çహృదయమూ సంతోషపడినట్ల యితే ముందు ముందు బ్రిటిష్ ప్రభుత్వం వారి విధేయత గురించి ఆలోచించవలసిన అవసరమే రాదు అన్నారు జ్యోతిబా. ఆయన ఉద్యమం 1840 నుండి 1880 వరకు బలంగా సాగింది. ఆయన సత్య శోధక్ సమాజాన్ని స్థాపించి శూద్రుల్లోనూ, దళితుల్లోనూ ఉత్తేజక రమైన మార్పులు తీసుకువచ్చాడు. శూద్రుల్లోని భూస్వామ్య కులాలు ఓబీసీల నుండి విడిపోయాక బ్రాహ్మణవాదులు, భూస్వామ్య కులాలు కలసి ఓబీసీలను, దళితులను అణుస్తూ వచ్చాయి. నిజానికి 1870 దశకంలోనే జ్యోతిబా, ఆయన శ్రీమతి నిమ్న జాతుల పాఠశాలల కోసం సుమారు పది సంవత్సరాల పాటు కృషి చేశారు. అవి స్థిరపడ్డా యనుకొన్న తర్వాతనే ఇతర సాంఘిక, సేవా కార్యక్రమాలవైపు దృష్టి మళ్ళించారు. అయితే విదేశీయుల ఆదరణ తగ్గటం, స్థానికులు వాటిపై తగినంత శ్రద్ధ చూపకపోవటం వంటి కారణాల వల్ల అవి ప్రత్యేకంగా నిలబడలేకపోయాయి. నిజానికి దళితులని, శూద్రులని ఎప్పటికప్పుడు నూత్నమైన నినాదాలతో అగ్రకుల పార్టీలు మోసం చేస్తూనే వస్తున్నాయి. అంబేడ్కర్, మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్ ఈ వర్గాల సామాజిక, సాంస్కృతిక రాజకీయ విముక్తి కోసం బాటలు వేస్తూనే వచ్చారు. కానీ దళిత బహుజనులు, మైనార్టీలు మత భావాల ఊబిలో కూరుకుపోయారు. రాజ్యాధికారాన్ని అగ్రవర్ణ పార్టీల మీద ఆధారపడి పొందాలనే భావనలోనే ఇంకా ఉన్నారు. ఇండియా కూటమి ఒక దళితుడిని ప్రధానమంత్రిగా ప్రకటించే స్థాయిలో ఎందుకు లేదు? నిరంతరం రాజ్యాంగ సూత్రాలను ధ్వంసం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న బీజేపీని కొన్ని ప్రయోజనాలను ఆశించో, కొన్ని ఆచారాలకు లోబడో, మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటున్నారు. వారి గంభీరమైన ఉపన్యాసాలకు మైమరచిపోయి వారికి సామాజిక, రాజకీయ బానిసత్వం చేస్తూనే వస్తున్నారు. కోట్లాది మంది రాజ్యాధికారానికి నోచుకోకుండా పోవడానికి కారణం రాజకీయాల్లో ఉన్న వర్ణతత్వమే అన్నారు అంబేడ్కర్. ఆయన మార్గంలోనే విముక్తి ఉందని దళిత, బహుజనులు గమనించినప్పుడే మత, కుల భావాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695 -
రెండో గాంధీ కాదు కదా మరో గాంధీగా కూడా ఒప్పుకోరట సార్..!!
రెండో గాంధీ కాదు కదా మరో గాంధీగా కూడా ఒప్పుకోరట సార్..!! -
నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్‌ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్‌పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్‌ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు -
బీహార్‌లో కులగణనపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేపట్టిన కులగణన సర్వే తదుపరి డేటాను ప్రచురించకుండా బిహార్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు కులగణన సర్వే గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందని, దీనిపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషిన్పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవడం సరికాదని తెలిపింది. నలంద నివాసి అఖిలేష్ కుమార్, ఎన్జీవో 'ఏక్ సోచ్ ఏక్ పర్యాస్' సహా పలువురు వేసిన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టును అశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. కులగణన సర్వేపై స్టే విధించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. విధాన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించడం తప్పు అని పేర్కొంది. ఈ మేరకు కుల గణనకు సంబంధించి తదుపరి వివరాలు వెల్లడించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. విధాన రూపకల్పనకు కులగణన డేటా ఎందుకు అవసరమో పాట్నా హైకోర్టు ఉత్తర్వుల్లో చాలా వివరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం పిటిషనర్లకు తెలియజేసింది. చదవండి: ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు కాగా 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బిహార్ ప్రభుత్వం ఆక్టోబర్ 2న కులగణన సర్వే ఫలితాలను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 13.07 కోట్ల జనాభాలో 36 శాతం మంది అత్యంత వెనకబడిన వర్గాలు (ఈబీసీ) ఉన్నట్లు తెలిపింది. మూడున్నర కోట్లు (27 శాతం) ఇతర వెనకబడిన వర్గాలు(ఓబీసీలు) ఉన్నట్లు పేర్కొంది. 19.7శాతం షెడ్యూల్డ్ కులాలు, 1.7 శాతం షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఉన్నట్లు వెల్లడిచింది. అదే విధంగా జనరల్ క్యాటగిరీలో ఉన్న ఆధిపత్య కులాలు 15.5 శాతం అని కుల గణన చెబుతోంది. ఇక జనాభాలో హిందువులు 81.99 శాతం కాగా, ముస్లింలు 17.7 శాతం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలవారూ ఒక శాతంలోపేనని నివేదిక తెలిపింది. -
చరిత్ర సృష్టించించిన బిహార్ సర్కార్.. ప్రజల ముందుకు కులగణన ఫలితాలు
గాంధీ మహాత్ముడి జయంతి రోజైన సోమవారం బిహార్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. గత తొమ్మిది నెలల్లో రెండు దఫాలుగా నిర్వహించిన కులగణనలో వెల్లడైన గణాంకాలను ప్రజల ముందుంచింది. ఇందులో ఆర్థిక స్థితిగతుల సర్వే కూడా ఉంది. మొన్న జనవరిలోనూ, ఏప్రిల్‌లోనూ నిర్వహించిన ఈ కుల గణన మండల్ రాజకీయాలకు అంకురార్పణ పడిన బిహార్‌లోనే చోటు చేసుకోవటం గమనించదగ్గది. ఈ విషయంలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ చొరవను అభినందించాలి. నిజానికి రాజకీయ పక్షాలేవీ బాహాటంగా దీన్ని వ్యతిరేకించలేదు. 2021లో బిహార్ నుంచి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అఖిలపక్ష బృందంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని ఆ ప్రతినిధి బృందం డిమాండు చేసింది. కానీ బీజేపీ కేంద్ర నాయ కత్వం దీనిపై మౌనంగానే ఉంది. బిహార్ గణాంకాలు వెల్లడిస్తున్న అంశాలు ఈ సర్వే అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు మొదలై దశాబ్దాలు గడుస్తున్నా ఈనాటికీ అనేక వెనకబడిన కులాలు అభివృద్ధికి ఎంతో దూరంలో ఉన్నాయని ఈ గణన రుజువు చేస్తోంది. ఎప్పుడో వలస పాలనలో దేశవ్యాప్తంగా 1931లో తొలిసారి కులగణన నిర్వహించగా తొమ్మిది దశాబ్దాల అనంతరం ఇన్నాళ్లకు నితీష్‌కుమార్ ఈ సాహసం చేశారు. 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సామాజిక ఆర్థిక కుల గణన పేరిట ఒక ప్రయత్నం చేయకపోలేదు. 130 కోట్లమంది ప్రజానీకం నుంచి వివరాలు కూడా సేకరించారు. కానీ దాని నిర్దుష్టతపై సందేహాలున్నాయంటూ నాటి పాల తకులు ఆ గణాంకాలను అటకెక్కించారు. దీని వెనకున్న నిజానిజాలేమిటో ఎవరికీ తెలియదు. విమర్శల మాటెలావున్నా, ఎదుర్కొన్న అవరోధాలు ఎలాంటివైనా బిహార్ గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఏ కులానికి ఆ కులం తమ జనాభా ఎక్కువని చెప్పుకోవటం ఎన్నికల సమయంలో రివాజే అయినా మొత్తంగా చూసుకుంటే దేశ జనాభాలో ఓబీసీల శాతం అత్యధికమన్నది అందరూ ఎప్పటినుంచో అంగీకరిస్తున్న సత్యం. బిహార్ గణాంకాలు ఆ సంగతినే ధ్రువీకరించాయి. అయితే అభివృద్ధి ఫలాలు ఈనాటికీ అందుకోలేని అశక్తతలో అనేక కులాలున్నాయని ఈ గణన వెల్లడిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. బిహార్ లోని 13.07 కోట్ల జనాభాలో ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ) సంఖ్య మూడున్నర కోట్లు (27 శాతం) కాగా, అత్యంత వెనకబడిన వర్గాలు 4.70 కోట్లు (36 శాతం) అని నివేదిక వెల్లడిస్తోంది. అంటే మొత్తంగా వెనకబడిన వర్గాల జనాభా 63 శాతం! రాష్ట్ర జనాభాలో 2.6 కోట్లమంది (20 శాతం) ఎస్సీలు, 22 లక్షలమంది (1.6 శాతం) ఎస్టీలు. జనరల్ క్యాటగిరీలో ఉన్న ఆధిపత్య కులాలు 15.5 శాతం అని కుల గణన చెబుతోంది. జనాభాలో హిందువులు 81.99 శాతం కాగా, ముస్లింలు 17.7 శాతం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలవారూ ఒక శాతంలోపేనని నివేదిక తెలిపింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన పర్యవసానంగా దేశవ్యాప్తంగా కుల వృత్తులు తీవ్ర సంక్షోభంలో పడి నిరసనల వెల్లువెత్తాక అట్టడుగు వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు కొత్త విధానాలు రూపొందించాయి. కానీ ఈ మొత్తం వ్యవహారం చీకట్లో తడుములాటగానే ఉంటున్న దన్న విమర్శలు ఆనాటినుంచీ ఉన్నాయి. ఎందుకంటే సాధికారకమైన గణాంకాలు లేకపోవటంతో 1979లో కేంద్రంలోని అప్పటి జనతాపార్టీ ప్రభుత్వం నియమించిన మండల్ కమిషన్ నివేదిక అంచనాలనే అన్ని ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఓబీసీలు 52 శాతం ఉంటారని ఆ నివేదిక అంచనా వేసింది. అయితే ఈ శాతం మరింత ఎక్కువుండొచ్చని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ వచ్చారు. ఇప్పుడు బిహార్ గణాంకాలు ఆ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. బహుశా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తే ఇదే రుజువయ్యే అవకాశం ఉంది. కుల గణనకు పూనుకొని నితీష్ సర్కారు కొత్త ఆలోచనలు రేకెత్తించింది. దీనివల్ల ఆయన పార్టీకీ లేదా అక్కడి సామాజిక న్యాయ రాజకీయాలకూ వెనువెంటనే కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పలేం. ఓబీసీల హక్కుల కోసం మాట్లాడే పార్టీలు ఎటూ కొత్త ఆలోచనలు చేయక తప్పదు. ఆ కులాల్లో సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఇన్ని వ్యత్యాసాలున్నాయని గ్రహించాక వాటికి తమ దగ్గరున్న పరిష్కారాలేమిటన్నది పార్టీలు తేల్చుకుంటాయి. వీటన్నిటికన్నా ప్రధానమైనదేమంటే... ఓబీసీ కులాల్లో కొన్ని మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నాయనీ, ఇప్పటికీ అందుకు దూరంగావుంటున్న కులాలు అనేకం ఉన్నాయనీ, వాటి జనాభాయే ఎక్కువనీ నివేదిక వెల్లడించిన వాస్తవం పాలనావ్యవస్థ కళ్లు తెరిపిస్తుంది. ఇప్పుడు అమలు చేస్తున్న విధానాల, పథ కాల లోపాలను సరిదిద్ది, వాటిని పదునెక్కించటంతోపాటు కొత్తగా చేయాల్సిందేమిటన్న అంశంపై దృష్టి సారిస్తుంది. బహుశా రిజర్వేషన్ల శాతం 50 శాతం మించరాదన్న నిబంధనపై సైతం న్యాయ స్థానాలు పునరాలోచన చేయవచ్చు. శతాబ్దాలుగా మన దేశంలో వేళ్లూనుకున్న నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ వల్ల సామాజిక అభివృద్ధికి మెజారిటీ వర్గాలు దూరంగా ఉండిపోయాయని బ్రిటిష్ వలస పాలనలోనే గుర్తించారు. కానీ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటూ వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచాక కూడా అత్యంత వెనకబడిన కులాలున్నాయంటే అది మన పాలనా వ్యవస్థ లోపాన్ని పట్టి చూపుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలు సైతం కులగణనకు అనుకూలంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయంలో చొరవ తీసుకుని జనగణనతోపాటు కుల గణనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే అట్టడుగు వర్గాలవారిని ఉద్ధరించటానికి ఆ చర్య దోహదపడుతుంది. -
‘నితీష్ ప్రధాని అవుతారు, ఆయన్ను మించిన సమర్థుడు లేడు’
బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధానమంత్రి అవుతారని జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో నితీష్ కుమార్ ప్రధాపి అభ్యర్థిగా ఉంటారని బిహార్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ పేర్కొన్నారు. నితీష్‌కు మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని అన్నారు. నితీషే ప్రధానమంత్రి అభ్యర్థనే విషయాన్ని ఇండియా కూటమి తర్వలోనే ప్రకటిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2024 లోకసభ ఎన్నికలకుముందు పార్టీ సన్నద్ధత గురించి ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్లో ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు, లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి పేరును ఎప్పుడు ప్రకటించినా.. అది నితీష్ కుమార్ పేరే అయి ఉంటుందని తెలిపారు. దేశంలో రామ్మనోహర్ లోహియా తర్వాత మహోన్నతమైన సోషలిస్టు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ కుమార్ జీ అని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో వ్యాఖ్యానించారని, నితీష్ కుమార్ 5 సార్లు కేంద్రంలో మంత్రిగా 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: మణిపూర్-మయన్మార్ సరిహద్దులో కంచె! కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని కూటమి నేతలు చెప్తున్నప్పటికీ.. మమతాబెనర్జీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ఇలా పలువురు నాయకులు ప్రధాని అభ్యర్థి బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ హజారీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ మాత్రం తనకు ప్రధాని పదవిపై ఎలాంటి ఆశలు లేవని ఇదివరకే అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఏకమై ముందుకు సాగాలన్నదే తన కోరిక అని తెలిపారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తానని చాలాసార్లు చెప్పారు. చదవండి: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం, బీజేపీకి సర్ప్రైజ్!: రాహుల్ గాంధీ -
కాలు జారిన సీఎం
-
అడ్డుకోవాలని చూశారు.. అయినా పూర్తి చేశాం: నితీష్ కుమార్
పాట్నా: బీహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన పూర్తయినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ప్రస్తుతం ఈ డేటా సంకలనం జరుగుతోందని అతి త్వరలోనే ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతూ కులగణన సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనకరమని అన్నారు. శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన కులగణన అన్ని కులాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని దీని వలన ఎంతోకాలంగా నష్టపోయిన వారితో పాటు సమాజంలో ఆయా వర్గాల వారికి కూడా మేలు చేస్తుందని అన్నారు. పూర్తి డేటా వచ్చిన తర్వాత ఏయే అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందో స్పష్టంగా తెలుస్తుందని మిగిలిన రాష్ట్రాల్లో కూడా కులగణన జరిపితే బాగుంటుందని అన్నారు. కొంతమంది ఈ కులగణనను వ్యతిరేకిస్తున్నారు కానీ అఖిలపక్షాల అభిప్రాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వ్యతిరేకించే వారి అభిప్రాయం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ సర్వే ద్వారా సాంఘిక, ఆర్ధిక అసమానతలకు గురైన వారికందరికీ సంక్షేమ పథకాలు అందించి మెరుగైన సేవ చేయడానికి వీలుంటుందని తెలిపారు. మొదటి నుంచి కులాల ప్రాతిపదికన సంక్షేమం అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని అందులో భాగంగానే కులగణన చేశామని అన్నారు. కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు అనుమతి కోరడంపై స్పందిస్తూ.. సుప్రీం కోర్టు ప్రజలకు ప్రయోజనకరమైన అంశాలను నిలిపివేయమని ఎప్పుడూ చెప్పదు. ఇక పాట్నా హైకోర్టు అయితే ఇదే అంశంపై నమోదైన అనేక పిల్లను కొట్టి పారేసిందని గుర్తు చేశారు. మరి 2021లోనే పూర్తి కావాల్సిన కులగణన జాప్యం విషయమై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కేంద్రం ఈ కులగణన కార్యక్రమంలో జోక్యానికి అనుమతి కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇందులో ఉన్న చట్టపరమైన సమస్యలు తెలుపుతూ తదుపరి వాయిదా తేదీ ఆగస్టు 28లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఈలోపే ఈ సర్వే పూర్తి కావడం విశేషం. ఇది కూడా చదవండి: మా పార్టీ చీలిపోలేదు: శరద్ పవార్ -
‘ఇండియా’ కూటమితో మోదీలో గుబులు: నితీశ్
పాటా్న: విపక్షాలతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటు కావడంతో ప్రధాని మోదీలో గుబులు మొదలైందని జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ అన్నారు. ‘ఇండియా’ ఏర్పాటైన తర్వాత ఎన్డీయే పక్షాల సమావేశాలు నిర్వహిస్తున్నారని పరోక్షంగా ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఎన్డీయే పగ్గాలు మోదీ చేతుల్లోకి వచ్చాక భాగస్వామ్య పక్షాలను గౌరవించడం మానేశారన్నారు. ‘ఇండియా’ అధికారంలోకి వస్తే దేశానికి మంచి జరుగుతుందన్నారు. -
స్వాత్రంత్య వేడుకల్లో షాకింగ్ ఘటన.. సీఎం ప్రసంగిస్తుండగా దూసుకొచ్చిన యువకుడు
పట్నా: బిహార్ స్వాత్రంత్య వేడుకల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీష్‌కుమార్ ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు ఆయన హై సెక్యూరిటీ జోన్లోకి దూసుకొచ్చాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మైదాన్‌లో జరిగిన స్వాత్రంత్య దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. అనంతరం ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు చేతిలో పోస్టర్ పట్టుకుని వేదిక వద్దకు దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఆ యువకుడిని ముంగేర్ జిల్లాకు చెందిన రాజేశ్వర్ పాశ్వాన్ కుమారుడు నితీష్ కుమార్ (26)గా గుర్తించారు. అతడిని భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారు. యువకుడి తండ్రి రాజేశ్వర్ పాశ్వాన్ బిహార్ మిలిటరీ పోలీసు విభాగంలో పనిచేస్తూ కొన్నేళ్ల క్రితం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎంను కలిసేందుకు అక్కడకు వచ్చాడని పట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై పాట్నా జిల్లా యంత్రాంగం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. చదవండి: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన మంత్రి -
‘ఇండియా’ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ!
పట్నా: 26 పార్టీలతో కూడిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ నేత సోనియా గాందీ, కన్వినర్‌గా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కూటమి తదుపరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరుగనుంది. కూటమికి చెందిన 11 మంది సభ్యుల సమన్వయ కమిటీ చైర్‌పర్సన్‌గా సోనియా గాం«దీని, కన్వినర్‌గా నితీశ్ కుమార్‌ను ఈ సమావేశాల్లో ఎన్నుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
నిరాశ్రయులకు ఓటు హక్కు కల్పించేలాచర్యలు చేపట్టండి
సాక్షి, విశాఖపట్నం: అర్హత కలిగి ఉండి.. నిరాశ్రయులుగా ఉన్నవారికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ–2024పై రెండు రోజుల సమీక్ష విశాఖలో గురువారం ముగిసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా అధ్యక్షతన సదస్సు జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హృదేశ్కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్ బుటాలియా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌కుమార్ హాజరయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణపై అవగాహన కలెక్టర్లకు ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)–2024పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మానవ వనరుల లభ్యత, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఎన్నికల సిబ్బందికి, పోలింగ్ స్టేషన్లకు కనీస సౌకర్యాలు, ఫిర్యాదు నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ముగింపు సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్ మాట్లాడుతూ అర్హులైన వారందర్నీ ఓటరు జాబితాలో 100 శాతం చేర్పించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా నిరాశ్రయులపై శ్రద్ధ వహించాలనీ, అట్టడుగు సమాజంలో ఉన్న వారిని, మురికివాడలు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు, గిరిజన తండాల్లో నివాసితులు, పీవీజీటీ పరిధిలో (బలహీన గిరిజన సమూహాలు) ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ విలువైన ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనంతరం ఓటర్ల నమోదుపై వచ్చే ప్రతి ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు ఓటింగ్, ఎన్నికల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఈవీఎంలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లు, వలస ఓటర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఎస్ఆర్–2024 ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అర్హులైన ఓటర్లతో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకంగా ఉన్న ఓటర్ల జాబితా తయారు చేసేందుకు 26 జిల్లాల కలెక్టర్లు నిరంతరం కృషి చేయాలని ధర్మేంద్రశర్మ, నితీష్ ఆదేశించారు. -
నితీష్ కుమార్‌కు ఊరట.. కుల గణనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిహార్ ప్రభుత్వం చేపడుతున్న కుల గణన కార్యక్రమాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో గతంలో పలు పిటీషన్లు నమోదయ్యాయి. వీటిని కొట్టివేస్తూ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. బిహార్‌లో కుల గణన మొదటి సర్వే జనవరి 7 నుంచి 21 వరకు జరిగింది. రెండో దఫాలో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు జరగాల్సి ఉంది. కాగా ఈ కార్యక్రమంపై మే 4నే హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు ఇచ్చింది. కుల గణన చేపట్టాలని గత ఏడాది జూన్ 21నే రాష్ట్ర అసెంబ్లీలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. బిహార్ సీఎం నితీష్ కుమార్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని నిర్మించడానికి ఆయన ప్రధాన వ్యక్తిగా నిలిచారు. ఎన్డీయే కూటమికి దేశంలో ప్రతిపక్షాలన్నింటిని ఒకే తాటి మీదకు తీసుకువచ్చి ఇండియా అనే కూటమిని నిర్మించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు.. -
అలాగే తనతో పాటు వాళ్లందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పండి సార్!
అలాగే తనతో పాటు వాళ్లందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పండి సార్! -
నితీష్ కుమార్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
ముంబై: కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధినేత రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఐక్యతలో కీలక పాత్ర పోషించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమవాడేనని, ఏ క్షణమైనా ఎన్డీయే కూటమిలోకి తిరిగి వచ్చేస్తారని వ్యాఖ్యానించారు. కాగా గతేడాది వరకు ఎన్డీయే కూటమిలోనే కొనసాగిన నితీష్ కుమార్.. 2022 ఆగస్టులో బీజేపీతో తెగదెంపులు చేసుకొని లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో (మహాఘట్బంధన్) చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకు రావడంతో బిహార్ సీఎం కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో 26 విపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. తాజాగా రామ్‌దాస్ అథవాలే ముంబైలో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ సీఎంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ఎన్డీయే లక్ష్యమైతే.. కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి తొలగించడమే ఏకైక ఎజెండాగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయని ‘ఇండియా’ కూటమిపై విరుచుకుపడ్డారు. కూటమికి కన్వీనర్, ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయంలో కూడా విపక్షాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు. చదవండి: జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ‘నేను నిన్న(శనివారం) పాట్నాలో ఉన్నాను. బెంగుళూరులో జరిగిన ప్రతిపక్షాలు భేటీపై నితీష్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇండియా పేరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతను సంతోషంగా లేకపోతే త్వరలో ముంబయిలో నిర్వహించబోయే సమావేశానికి కూడా హాజరు కావొద్దని కోరాను. నితీష్ అంతకుముందు ఎన్డీయేలో సభ్యుడు, ఆయన ఎప్పుడైనా సొంతగూటికి తిరిగి రావొచ్చు’ అని అథవాలే పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదే విధంగా మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు మమతా వల్ల ఉపయోగం లేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యలపై జేడీయూగానీ, నీతీష్గానీ స్పందించలేదు. కానీ ‘ఇండియా’ పేరుపై నీతీష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అథవాలే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
విపక్ష కూటమి పేరుపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ అభ్యంతరం
-
‘ఇండియా’ పేరుపై నితీశ్ తీవ్ర అభ్యంతరం!
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఐక్యతా పోరు ఉద్ధృతం చేశాయి. ఇందులో భాగంగా పట్నాలో తొలి విడత భేటీ నిర్వహించగా.. రెండో విడతలో భాగంగా బెంగళూరులో మరోసారి సమావేశమయ్యాయి. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, జేడీయూ సహా 26 పార్టీల అధినేతలు, అగ్ర నేతలు ఈ భేటీలో పాల్గొని పలు కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. విపక్ష కూటమికి ‘ఇండియా’(ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్యూజివ్ అలయన్స్)గా నామకరం చేస్తున్నట్లు సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఇండియా పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు సమాచారం. దీనిపై నేతలలంతా లోతుగా చర్చించి, ఏకాభిప్రాయంతో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇండియా పేరు ఎలా పెడ్తారు? అయితే ఇండియా అనే పేరును బిహార్ సీఎం నితీష్ కుమార్ గట్టిగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. విపక్షాల కూటమి పేరు గురించి కాంగ్రెస్ ఏ విధంగానూ చర్చించలేదని, దీంతో నితీష్ షాక్‌కు గురైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో NDA అక్షరాలు ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కూటమికి ఇండియా అనే పేరు ఎలా పెడ్తారని భేటీలోనే జేడీయూ అధినేత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నితీష్పాటు వామపక్షాలు సైతం నితీష్‌తోపాటు వామపక్ష నేతలు కూడా INDIA పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయ పేరును సూచించినట్లు సమాచారం. కానీ మిగతా మెజార్టీ పార్టీలు ఆమోదించడంతో నితీష్ కుమార్ సైతం చివరికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘సరే మీ ఆందరికీ ఇండియా పేరు ఓకే అయితే కానివ్వండి.. అదే మంచిందంటూ బిహార్ సీఎం అన్నట్లు సమాచారం. కాగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో నితీష్ కుమార్ పాత్ర ఎంతో కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చదవండి: డేంజర్ యమున.. తాజ్ మహల్‌ను తాకిన వరద జీతేగా భారత్ తమ కూటమికి ఇండియా అనిపేరు పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు దానికి ట్యాగ్‌లైన్‌గా ‘జీతేగా భారత్’( భారతదేశం గెలుస్తుంది)ఎంచుకున్నాయి. కూటమి ట్యాగ్‌లైన్ హిందీలో ఉండాలని ఉద్దవ్ ఠాక్రే సూచించారని తెలుస్తోంది. హిందీ భాషతోపాటు అన్ని భాషల్లో ఈ ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తామని వెల్లడించాయి. కూటమికి సారథి ఎవరు? ప్రతిపక్షాల కూటమికి సారథి ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు. అయితే నాయకత్వ బాధ్యతలను సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించవచ్చునని తెలుస్తోంది. భాగస్వామ్యుల మధ్య సమన్వయం, సహకారం తదితరాల సాధనకు 11 మంది సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాయి. ముంబైలో నెక్స్ట్ మీటింగ్ విపక్షాల తర్వాతి భేటీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరగనుంది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అశం, సీట్ల సర్ధుబాటుపైనా ఆరోజే చర్చిస్తామని నేతలు చెప్పారు. -
Opposition Meet: కాంగ్రెస్ పెద్దన్నగా మారిందా?
కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకునే ఉద్దేశంతో ప్రతిపక్షాలన్నీ కూటమి కట్టాయి. బెంగుళూరు వేదికగా ఐక్యతను చాటే ప్రయత్నం చేశాయి. ప్రత్యామ్నయం తామేనంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాయి. ఇండియా పేరుతో కూటమి కట్టి ఐక్యతా రాగం చాటుతున్నా... ఎవరి ఎజెండా వారిదే. బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 26 పార్టీలు హాజరయ్యాయి. కూటమికి ఇండియా అనే పేరు పెట్టి ప్రతిపక్షాల ఐక్యతే ప్రధానం అంటూ ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతానికి సీట్ల పంపకాలు, పొత్తులపై స్పష్టత రాకున్నా... తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్‌కు కొన్ని రాజకీయపక్షాలు హాజరవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది . అసలు అంతరించిపోతుందనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ స్థాయిలో మీటింగ్ పెట్టడం ఆ పార్టీ వ్యూహకర్తల సక్సెస్ అని ఒప్పుకోవాల్సిందే. ప్రాంతీయ పార్టీల ఆశలు వారి ఎత్తుగడలను తనకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇటీవల హిమాచల్, కర్ణాటక ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పెద్దన్న పాత్రకు తానే కరెక్టు అంటూ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగానే ఎవరికి కావాల్సింది వారికి చేస్తూ కూటమికి అంకురార్పణ చేసింది. (ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..) ఇక ఎప్పటినుంచో ప్రధాని కావాలనుకుంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూటమికి ముందు నుంచి సిద్ధంగానే ఉన్నారు. ఆయన బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల తొలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అవసరమైతే మేము నాయకత్వ బాధ్యతలు వదులుకోడానికి సిద్ధంగా ఉన్నామని ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక తానే ప్రధాని అభ్యర్ధి అని నితీష్ నిర్ధారించుకున్నారు. నితీష్‌ను కేంద్రానికి పంపి తన కొడుకు తేజస్విని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్న లాలుకు పూర్తి అనుకూలమైన పరిస్థితి. అయితే ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్ధిగా నితీష్‌ను ప్రొజెక్ట్ చేయడాన్ని కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితిలేదు. అయినా తాత్కాలికంగా నితీష్‌ను ఊహల్లో ఉంచాలనేది కాంగ్రెస్-లాలు ఆలోచన. అందుకే బీహార్‌లో బీజేపి వ్యతిరేక పార్టీలన్నీ ఇప్పుడు కూటమిగా ఒక్కతాటిపైకి వచ్చాయి. -ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ (బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే) -
ఆసియా కప్-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డికి చోటు
ACC Men’s Emerging Teams Asia Cup 2023: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2023కి భారత్ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్ క్రికెట్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. ఎనిమిది ఆసియా దేశాల మధ్య ఇండియా- ఏ జట్టుకు యశ్ ధుల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. అభిషేక్ శర్మ అతడి డిప్యూటీగా ఎంపికయ్యాడు. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డి సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టీమ్‌కి సితాంషు కొటక్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకలో.. జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్ ఆసియా కప్-2023 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గ్రూప్-బిలో భారత్‌తో పాటు.. నేపాల్, యూఏఈ, పాకిస్తాన్- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఒమన్- ఏ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆరోజు ఫైనల్ ఇందులో గ్రూప్-ఏ టాపర్‌తో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్-బి టాపర్‌తో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి. జూలై 23న ఈ టోర్నీ ఫైనల్ జరుగనుంది. ఇదిలా ఉంటే తొలిసారి నిర్వహించిన మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ విజేతగా భారత జట్టు అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో బంగ్లాదేశ్-ఏ జట్టును చిత్తు చేసి భారత మహిళల- ఏ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఎమర్జింగ్ ఏసియా కప్-2023 భారత- ఏ జట్టు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వైస్ కెప్టెన్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యశ్ ధుల్(కెప్టెన్), రియాన్ పరాగ్, నిశాంత్ సంధు, ప్రభ్‌షిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సిన్హ్ దోడియా, హర్షిత్ రానా, ఆకాశ్ సింగ్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్ హంగ్రేకర్. స్టాండ్ బై ప్లేయర్లు: హర్ష్ దూబే, నేహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కార్. కోచింగ్ స్టాఫ్: సితాంశు కొటక్(హెడ్‌కోచ్), సాయిరాజ్ బహూతులే (బౌలింగ్ కోచ్), మునిష్ బాలి(ఫీల్డింగ్ కోచ్). చదవండి: Ashes: ‘బజ్‌బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి.. -
నితీశ్‌కుమార్ తిరిగి ఎన్డీయేలోకి?!
అతిత్వరలో బీహార్‌లోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం నెలకొంటుంది. అదీ అధికార పక్షంలోనే!. నితీశ్ కుమార్ వైఖరి నచ్చక కొందరు ఎమ్మెల్యేలు జేడీయూ నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల నడుమ నితీశ్ మరో దారి లేక తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి అడుగు పెడతారు!!. మహారాష్ట్రలో అజిత్ పవార్‌తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల జంపింగ్ పరిణామం నడుమ.. తర్వాతి వంతు బీహార్దేనంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. పైగా ప్రభుత్వం కూలిపోయే తరుణంలో గత్యంతరం లేని స్థితిలో నితీశ్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరతారంటూ పలు మీడియా విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజులుగా నెలకొన్న పరిస్థితులూ ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండడంతో.. నితీశ్ వైఖరిపైనా అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలను విపక్షాలు నిర్వహించదల్చిన భేటీ.. మహారాష్ట్ర ఎన్సీపీ ఎపిసోడ్ కారణంగా వాయిదా పడింది. అదే సమయంలో బీహార్ గత నాలుగు పర్యటనలో నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆశ్చర్యంగా తాజా పర్యటనలో మాత్రం పన్నెత్తి మాట అనలేదు. పైగా అవినీతి పక్షంతో పొత్తు(జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీకి) దేనికి అంటూనే.. దానిని దూరంగా ఉండాలంటూ నితీశ్ సర్కార్‌కు పరోక్ష సూచన చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పాత మిత్ర కూటమికి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2017లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేయగా.. నితీశ్ కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో పొత్తుకు ముందుకు వెళ్లారు. అయితే.. తాజా ఊహాగానాలను పటాపంచల్ చేశారు బీహార్ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదంతా మీడియా సృష్టేనని తేల్చిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నితీశ్‌ను బీజేపీ దగ్గరకు తీయబోదని స్పష్టం చేశారాయన. ‘‘బీజేపీకి ఆయన(నితీశ్) దూరం జరిగాక అమిత్ షా ఓ స్పష్టత ఇచ్చారు. ఇకపై బీజేపీ ఎప్పటికీ నితీశ్‌ను అంగీకరించబోదని. అలాంటప్పుడు నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది! అని సుశీల్ మోదీ మీడియాతో స్పష్టం చేశారు. అయితే.. బీజేపీకి చెందిన మరో సీనియర్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావాలే మాత్రం మరో తరహా ప్రకటన ఇచ్చారు. బీహార్లోనే కాదు.. యూపీలోనూ మహారాష్ట్ర పరిణామాలు ఏర్పడొచ్చని చెబుతున్నారాయన. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ జేడీయూలో, ఉత్తర ప్రదేశ్ ఎస్పీలోనూ ఆయా పార్టీ చీఫ్‌ల మీద ఉన్న అసంతృప్తితో కొందరు బయటకు రావడం ఖాయం. ఎస్పీలో జయంత్ చౌద్రి ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేకపోలేదు అని సంచలన ప్రకటన చేశారు అథావాలే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో జేడీయూతోగానీ, నితీశ్ కుమార్‌ను గానీ దగ్గరకు తీయొద్దంటూ ఏకంగా ఓ తీర్మానం పాస్ చేసింది పార్టీ. ఇదిలా ఉంటే.. మహా పరిణామాల నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదా పడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ.. ఈ నెలలోనే భేటీ ఉంటుందని విపక్షాల తరపున ఒక ప్రకటన వెలువడింది కూడా. ఇదీ చదవండి: ఎన్పీసీని బలోపేతం చేస్తాం.. పునర్నిర్మిస్తాం! -
ప్రతిపక్షాల ఆశల పందిరి
కొన్ని సమావేశాలకు ఎక్కడ లేని ప్రత్యేకతా ఉంటుంది. సమయం, సందర్భం, చేపట్టిన అంశం, హాజరయ్యే ప్రతినిధులు – ఇలా అందుకు ఏదైనా కారణం కావచ్చు. మరి, కీలకమైన అవన్నీ కలగలిసిన సమావేశమంటే దానికుండే ప్రాధాన్యం చెప్పనక్కర లేదు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ)కి చెందని ప్రతిపక్షాలన్నీ ఈ శుక్రవారం పాట్నాలో జరుపుతున్న సమావేశం సరిగ్గా అలాంటిదే. వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఉమ్మడి ప్రణాళికను మథించేందుకు ప్రతిపక్ష నేతలు ఒక దగ్గరకు వస్తున్నారు. ఆలోచన మంచిదే. పాలక పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఇది మంచి ప్రయత్నమే. అయితే, ఆచరణలో ప్రతిపక్ష ఐక్యత ఓ ఊహకందని పజిల్ కూడా కావడంతో పాట్నా భేటీ ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యం గనక, ఢిల్లీ గద్దెపై ఎవరి ఆశలు వారికున్న బడా నేతల మధ్య ఐక్యత ఏ మేరకు ఫలిస్తుంది, నిలుస్తుందనే సందేహాలనూ కలిగిస్తోంది. ఆ మధ్య కొద్దికాలం క్రితమే బీజేపీ వ్యతిరేకిగా అవతారమెత్తిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాషాయ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలనూ ఏకం చేయాలని తపిస్తున్నారు. కొన్నాళ్ళుగా వివిధ పార్టీల అగ్రనేతల్ని కలుస్తూ, కూటమి కట్టడానికి సమాలోచనలు చేస్తున్నారు. అందులో భాగమే పాట్నాలో ఈ మెగా భేటీ. దాదాపు 20 కీలక ప్రతిపక్షాలకు చెందిన నేతలను సాదరంగా స్వాగతించి, ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నిత్యం కీచులాడుకొంటూ, ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నించే ప్రతిపక్షాల మధ్య ఇది ఓ అపురూప దృశ్యం. ఉమ్మడి కార్య క్రమం, పార్లమెంట్ లోపల – బయట ఉమ్మడి అజెండా, క్షేత్రస్థాయి వ్యూహం లాంటివన్నీ ఈ భేటీ అజెండాలో భాగం. అలా ఇది ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని పెంచనుంది. వచ్చే ఎన్నికలు భీకరపోరు కానున్నాయనే సంకేతం ఇవ్వనుంది. కాషాయ పార్టీకి కంటి మీద కునుకు కరవయ్యేలా చేయనుంది. ప్రతిపక్షాల ఐక్యతా అజెండాలో అనేకం ఉన్నప్పటికీ, అవి అత్యవసరంగా పరిష్కరించుకోవా ల్సిన సమస్యలూ అనేకం. ముందుగా ఆ పార్టీలు తమ మధ్యనున్న విభేదాలను రూపుమాపుకోవాల్సి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సారథి క్రేజీవాల్ లాంటివారు సుప్రీమ్ కోర్ట్ తీర్పును సైతం పక్కన పెట్టేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఐక్యతా పోరాటాన్ని ఆశిస్తున్నారు. కానీ, ఆర్డినెన్స్‌పై ఆప్‌ను సమర్థించే విషయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో ఉండడం అర్థం చేసుకోదగినదే. ఢిల్లీ, పంజాబ్‌లలో ‘ఆప్’కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. త్వరలో ఎన్నికలు జరగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో సైతం చొచ్చుకుపోవాలని ‘ఆప్’ కత్తులు నూరు తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ తమ పార్టీ సామాజిక న్యాయ అజెండానే కాపీ కొట్టారంటూ కేజ్రీవాల్ ఆరోపణలూ చేశారు. మరి, పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న ఈ పార్టీలు ఎలా కలుస్తాయి? రెండు కత్తులు ఒకే ఒరలో ఎలా ఇముడుతాయి? యూపీలో సమాజ్‌వాది పార్టీకి కాంగ్రెస్, బీఎస్పీలతో; బెంగాల్లో తృణమూల్‌కు కాంగ్రెస్, వామపక్షాలతో; ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఉప్పూ నిప్పూ పరిస్థితులే ఉన్నాయి. వాటిని అవి ఎలా సర్దుబాటు చేసుకుంటాయో చూడాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడికక్కడ బీజేపీపై ఒకే బలమైన ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడం చెప్పినంత సులభం కాదు. ఎన్నికల తర్వాత కన్నా ఎన్నికల ముందే ఐక్యతా రాగాలాపనకు పార్టీలకు ఇలాంటి సమస్యలెన్నో! అందుకే, ఐక్య ప్రతిపక్షం ఆలోచన మంచిదైనా, సరైన అజెండా, ఆచరణాత్మక ప్రణాళిక, అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని పక్షాలకూ ఆమోదయోగ్యుడైన ఉమ్మడి నేత లేకపోతే కష్టం. ప్రతిపక్షాలన్నీ పరస్పర నమ్మకంతో సాగించాల్సిన సుదీర్ఘ ప్రయాణమిది. అలాంటప్పుడు అను మానాల నివృత్తి అయినా, ఆచరణ ప్రణాళికైనా ఒక రోజు మాటల మథనంతో సాధ్యమనుకుంటే అత్యాశ. ఇలాంటి భేటీలు తరచూ జరగాలి. బలమైన పాలకపక్షాన్నీ, జనాకర్షక విన్యాసాల్లో దిట్ట అయిన దాని సారథినీ ఎదుర్కొనాలంటే, ప్రతిపక్షాలన్నీ తమ మధ్య పాత పగలను పక్కన పెట్టాలి. స్వీయ ప్రయోజనాల కన్నా ఉమ్మడి శత్రువుపై విజయమే వాటి లక్ష్యం కావాలి. అందుకవసరమైతే కొంత త్యాగానికి కూడా సిద్ధం కావాలి. అంతటి దీక్ష, దృఢ సంకల్పం, చిత్త శుద్ధి ఎన్ని పార్టీలకు ఉందన్నది విమర్శకుల సందేహం. అందుకే, ఒక్కరోజు పాట్నా భేటీపై అతిగా అంచనాలు ఎవరికీ లేవు. అదే సమయంలో కలసి పోరాడాలన్న ఆశయంలో ఇది ముందడుగనడంలో అనుమానం లేదు. ఎన్నికలకు మరో 11 నెలల కన్నా తక్కువ వ్యవధి మాత్రమే ఉన్నందున పాట్నా భేటీ సాక్షిగా ప్రతిపక్షాలు తమలో తాము పట్టువిడుపులు ప్రదర్శించాలి. ఐక్యంగా ఉండడం ఎంత ముఖ్యమో, తమ కూటమి అసలైన ప్రత్యామ్నాయమనే నమ్మకం ప్రజల్లో కల్పించడం అంతకన్నా ముఖ్యం. అలాగే, పాలక నేతకు తమ ప్రత్యామ్నాయం ఎవరో స్పష్టం చేయగలిగి ఉండాలి. ఒకప్పుడు కాంగ్రెస్, ఇందిరా గాంధీలకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో సాగిన ప్రతిపక్ష ప్రయోగం మాదిరిగా... మళ్ళీ అంత నమ్మకం కలిగించగలిగితేనే ఏ కూటమి అయినా ఫలిస్తుంది. ఎన్నికల క్షేత్రంలో ఫలితాలు సాధిస్తుంది. ఏది ఏమైనా, ప్రభుత్వం లోటుపాట్లను ఎత్తిచూపుతూ, ప్రజల పక్షాన నిలదీసే దృఢమైన ప్రతిపక్షం ఉంటేనే ఏ ప్రజాస్వామ్యమైనా నాలుగు కాళ్ళపై నిలుస్తుంది, నడుస్తుంది. తొమ్మిదేళ్ళ తర్వాత దేశంలో ఇప్పుడా అవసరం ఎంతైనా ఉంది. తాజా పాట్నా భేటీ ఆశలు రేపుతోంది అందుకే! -
ఉమ్మడి పౌరస్మృతిపై ప్రశ్న..వేడిగా ఉందంటూ దాటవేసిన నితీష్..
బిహార్:ఉమ్మడి పౌరస్మృతిపై ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తోంది. ఈ అంశంలో లా కమిషన్ కూడా ఇప్పటికే వివిధ మత సంస్థల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో యునిఫామ్ సివిల్ కోడ్‌పై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తప్పించుకున్నారు.'ఎండలు బాగా కొడుతున్నాయ్.. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం'..అంటూ సింపుల్‌గా దాటవేశారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్యాయంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని నితీష్ నేతృత్వంలో ప్రముఖ నేతలు జూన్ 23న సమావేశం కానున్నారు. మూడో కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశాలను అందులో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్‌పై తన అభిప్రాయాన్ని నితీష్ కుమార్ చెప్పకుండా దాటవేశారు. కేంద్ర న్యాయ శాఖ సిఫారసుల మేరకు 22వ లా కమిషన్ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను పరిశీలిస్తోంది. జూన్ 14న ఈ మేరకు ప్రముఖ మత సంస్థల అభిప్రాయాన్ని కూడా కమిషన్ కోరింది. అయితే బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. 21వ లా కమిషన్ ఇచ్చిన సిఫారసుల మేరకు యూనిఫామ్ సివిల్ కోడ్ దేశానికి ఇప్పుడే అవసరం లేదని పేర్కొన్నట్లు కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ తెలిపారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా దేశ అవసరాలు ఉండవని అన్నారు. ఇదీ చదవండి:నితీష్ కుమార్ సర్కార్‌కు ఎదురుదెబ్బ ..మద్దతు ఉపసంహరించుకున్న జితన్ మాంఝీ పార్టీ -
Bihar: నితీష్ కుమార్ సర్కార్‌కు ఎదురుదెబ్బ ..
బిహార్: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవాం మోర్చా(హెచ్ఏఎమ్) ప్రభుత్వానికి తన మద్దుతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంతోష్ సుమన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉపసంహరణ పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు. కేబినెట్‌కు గత వారమే రాజీనామా చేసిన మాంఝీ తనయుడు సంతోష్ సుమన్.. నితీష్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తన పార్టీని విలీనం చేయాలని సీఎం బలవంతం చేస్తున్నట్లు ఆరోపించారు. పార్టీ భవిష్యత్తును ఢిల్లీకి వెళ్లి చర్చించనున్నట్లు చెప్పారు. మూడో కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా నితీష్ కుమార్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించిన జితన్ రాం మాంఝీ పార్టీ ఎన్డీయేకు చేరువయ్యేందుకు సంకేతాలు పంపింది. తాను మంగళవారం ఢిల్లీ వెళుతున్నానని, ఎన్డీయే నుంచి ఆహ్వానం అందితే కాషాయ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదననూ కూడా పరిశీలిస్తున్నామని సుమన్ తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశానికి సంబంధించిన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న హిందుస్థాన్ స్వామ్ మోర్చా పార్టీ.. గతేడాది బీజేపీని వీడిన నితీష్ కుమార్‌కు మద్దతుగా మహాకూటమిలో చేరింది. ప్రస్తుతం బిహార్‌లో 243 సీట్లకు గాను ప్రభుత్వానికి చెందిన కూటమికి 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో పాటు మరో మూడు చిన్న పార్టీలు ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఇదీ చదవండి:గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. కాంగ్రెస్ ఫైర్.. రూ కోటి నిరాకరణ -
ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్
పట్నా: దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమవుతుండడం అధికార బీజేపీకి కలవరం కలిగిస్తోందని చెప్పారు. విపక్ష కూటమి పూర్తిగా బలం పుంజుకోకముందే ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో అధికార పక్షం ఉండొచ్చని తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఐచ్ఛికం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని గుర్తుచేశారు. -
నితీశ్ కుమార్ వైపు దూసుకొచ్చిన బైక్.. అప్రమత్తమై పుట్‌పాత్ పైకి దూకడంతో..
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భద్రతలో భారీ వైఫల్యం చోటు చేసుకుంది. సీఎం ఎప్పటిలానే తన ఇంటి నుంచి వాకింగ్ కోసమని బైటకు వచ్చారు. అంతలో అటుగా వస్తున్న ఓ బైకర్ సీఎం సెక్యూరిటీ బలగాలను దాటుకుని నితీశ్ వైపుకు దూసుకొచ్చాడు. చూస్తుండగానే సీఎంకు అత్యంత సమీపానికి వచ్చేశాడు. దీంతో అప్రమత్తమైన నితీశ్ వెంటనే రోడ్డుపై నుంచి పుట్పాతవైపు దూకాల్సి వచ్చింది. సీఎం తన నివాసం నుంచి సర్క్యులర్ రోడ్డులోని వాకింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం బైకర్‌ను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ కమాండెంట్, పాట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నరు. ప్రస్తుతం అధికారులు దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: ‘నీట్’ని క్రాక్ చేసిన కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. -
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు
పాట్నా: లోక్‌సభకు ముందస్తుగానే ఎన్నికలు జరుగుతాయని, ఈ ఏడాదే జరిగినా ఆశ్చర్యం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పనులను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024 జనవరి కంటే ముందే ఈ పనులు పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ఆదేశించానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియదని, కచ్చితంగా వచ్చే ఏడాదే జరగాలన్న నియమం ఏమీ లేదని, ముందుగానే జరిగే అవకాశాలున్నాయని, ఈ ఏడాదే జరగొచ్చని, అలా జరగడం సాధ్యమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని అధికారులకు నితీశ్ సూచించారు. పనులన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తయితే తాను సంతోషిస్తానని పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించారని, ఇప్పుడు దాన్ని 60 శాతానికి తగ్గించారని ఆక్షేపించారు. 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపుతున్నారని చెప్పారు. ‘ప్రధానమంత్రి సడక్ యోజన’ అని పేరుపెట్టిన పథకానికి కేంద్రం 60 శాతం నిధులే ఇస్తోందన్నారు. ఈ నెల 23న పాట్నాలో జరగబోయే ప్రతిపక్షాల కీలక సమావేశంలో ముందస్తు ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారంముందస్తు ఎన్నికలు వస్తాయన్న నితీశ్ కుమార్ వ్యాఖ్యలను బిహార్ బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ కొట్టిపారేశారు. నితీశ్ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారని, ఊహాగానాల్లో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. #WATCH | I have always been saying that the (Lok Sabha) elections should be conducted early. It is better if the polls are conducted early. Nobody knows when the elections will be conducted, so I request to do it as early as possible: Bihar CM Nitish Kumar (Source: IPRD Bihar) pic.twitter.com/gQOVHJEIVI — ANI (@ANI) June 14, 2023 ఇది కూడా చదవండి: బెంగాల్ పంచాయతీ ఎన్నికల నామినేషన్లో ఉద్రిక్తత.. -
విపక్ష కూటమి సమావేశం
విపక్ష కూటమి సమావేశం -
23న విపక్ష పార్టీల భేటీ.. కేసీఆర్‌కు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే కార్యాచరణ సిధ్దం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష అగ్రనేతల సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరుగనుంది. ఈ నెల 12నే విపక్ష నేతల సమావేశం జరగాల్సి ఉన్నా, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 23న నిర్వహించనున్నట్లు జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ–ఎంఎల్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యలు హాజరు కానున్నారు. కాగా ఈ భేటీకి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు జేడీయూ నేతలు ఆహ్వానం పంపలేదు. గత ఏడాది ఆగస్టులో బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో భేటీ నిర్వహించిన కేసీఆర్, బీజేపీ ముక్త్ భారత్ౖMðకలిసి పోరాడతామని ప్రకటించారు. అయితే అనంతరం వివిధ కారణాలతో రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదు. తాజా భేటీకి ఆహ్వానం పంపలేదు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకునే అంశంపై చర్చించనున్నారు. హాజరవుతున్నా: శరద్ పవార్ బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బుధవారం తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, విపక్షాల భేటీకి తాను హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ గురువారం తెలిపారు. పలు జాతీయ అంశాలపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అది విపక్షాల బాధ్యతని పవార్ అన్నారు. -
ఎట్టి పరిస్థితుల్లో ఈ భేటీని మిస్సవరట సార్!
ఎట్టి పరిస్థితుల్లో ఈ భేటీని మిస్సవరట సార్! -
12న పట్నాలో విపక్షాల కీలక భేటీ!
పట్నా/కోల్‌కతా: కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్ కుమార్ తన కార్యాచరణను వేగవంతంగా చేశారు. తమతో కలిసివచ్చే పార్టీల ముఖ్యనాయకులతో రాజధాని పట్నాలో కీలక భేటీ నిర్వహించాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. ప్రతిపక్షాల సమావేశం వచ్చే నెల 12న జరిగే అవకాశం ఉందని నితీశ్ కుమార్‌కు సన్నిహితుడైన బిహార్ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి సోమవారం చెప్పారు. భేటీ తేదీ దాదాపు ఖరారైనట్లేనని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ హాజరవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం చాలా తేలిక అని అభిప్రాయపడ్డారు. విపక్ష కూటమి ఏర్పాటుకు నితీశ్ కుమార్ చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. హాజరుకానున్న మమతా బెనర్జీ ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత హాజరయ్యే అవకాశం ఉందని టీఎంసీ నేత చెప్పారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుతోపాటు బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆమె సలహాలు సూచనలు ఇస్తారని వెల్లడించారు. పట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశం ఏర్పాటు చేయాలన్న సూచన తొలుత మమత నుంచి రావడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట తాము ఆ పార్టీకే మద్దతు ఇస్తామని మమత గతంలో అన్నారు. -
త్వరలో విపక్షాల కీలక భేటీ!
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగుకు రంగం సిద్ధమవుతోంది. విపక్షాల ఉమ్మడి భేటీకి మూహూర్తాన్ని, వేదికను ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీలతో బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ జరిపిన భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. విపక్షాల భేటీ పట్నాలోనే ఉండొచ్చని నెల క్రితం ఖర్గేతో భేటీ అనంతరం నితీశ్ పేర్కొనడం తెలిసిందే. కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసిన నేపథ్యంలో ఐక్యతా యత్నాలను మరింత ముమ్మరం చేయాలని తాజా సమావేశంలో నేతలు నిర్ణయించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహరచన విపక్షాల భేటీలో ఏయే అంశాలను చర్చించాలనే దానిపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఖర్గే, రాహుల్, నితీశ్ సమావేశమవడం గత నెలన్నరలో ఇది రెండోసారి కావడం విశేషం. జేడీ(యూ) అధినేత లాలన్‌సింగ్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అనారోగ్యంతో రాలేకపోయారని సమాచారం. ఇప్పుడిక దేశమంతా ఒక్కటవుతుందంటూ భేటీ అనంతరం ఖర్గే ట్వీట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మా సందేశం. దేశానికి నూతన దిశానిర్దేశం చేసే ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని నితీశ్‌తో భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొన్నారు. అతి త్వరలో విపక్షాలన్నీ భేటీ కావాలని నిర్ణయించినట్టు వేణుగోపాల్, లాలన్‌సింగ్ మీడియాకు తెలిపారు. విపక్షాల అధినేతలంతా అందులో పాల్గొటారని చెప్పారు. కొన్నాళ్లుగా వరుస భేటీలు నితీశ్ కొద్ది రోజులుగా విపక్ష నేతలందరినీ వరుసబెట్టి కలుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో నితీశ్ మరోసారి సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఢిల్లీ ప్రభుత్వాధికారులపై అజమాయిషీ విషయమై కేంద్రంతో జరుపుతున్న పోరాటంలో ఆప్ సర్కారుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని హామీ ఇచ్చారు. శనివారం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కూడా జాతీయ స్థాయిలో విపక్ష నేతలంతా వేదికపైకి వచ్చి సమైక్యతా సందేశమివ్వడం తెలిసిందే. నితీశ్‌తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు వీరిలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను కూడా విపక్ష కూటమిలోకి తీసుకొచ్చేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నారు. ఇవే కీలకం! ప్రధాని మోదీకి దీటుగా విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని తమ సారథిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి. అయితే పోటీదారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిపై ఏకాభిప్రాయం ఎలా కుదుదరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేగాక లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తమకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయించాలని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నాయి. అవి కోరినట్టుగా తాను 200 సీట్లలోనే పోటీకి పరిమితమయ్యేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. బలమైన విపక్ష కూటమి ఏర్పాటై లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలంటే దీనిపైనా వీలైనంత త్వరగా స్పష్టత రావాల్సి ఉంది. -
బీఆర్ఎస్తో భేటీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేలా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్న బిహార్ సీఎం నితీశ్‌కుమార్.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీకావడంపై సందిగ్ధం నెలకొంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందే కేసీఆర్‌తో నితీశ్ భేటీ ఉంటుందని జేడీయూ నేతలు ప్రకటించినా ఇంతవరకు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే కేసీఆర్‌తో భేటీకి నితీశ్ వెనక్కి తగ్గారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుసగా కీలక నేతలతో భేటీలు బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో దేశంలోని ప్రధాన పార్టీల అధినేతలను నితీశ్‌కుమార్ కలుస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ముందు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియకు మరింత పదునుపెట్టారు. శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నేతలతోపాటు జేఎంఎం నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లతో సమావేశమయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌తో మరోమారు భేటీ అయ్యారు. తాజాగా సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో నితీశ్ సమావేశమయ్యారు. ఈ భేటీల సందర్భంగా విపక్ష పార్టీల ఐక్యత, బీజే పీని ఎదుర్కొనే వ్యూహాలు, పొత్తులు, ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అయితే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొన్నట్టుగానే బీఆర్ఎస్ను కూడా కలుపుకొని పోవాలని నితీశ్ భావిస్తున్నా.. కాంగ్రెస్ పెద్దలు దీనికి సానుకూలంగా లేరని సమాచారం. ఎన్నికల తర్వాత ఆలోచిద్దాం! బీఆర్ఎస్ను కలుపుకొనిపోయే విషయంలో రాహుల్ గాంధీ అంత సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)ను విలీనం చేస్తామని మాట ఇచ్చి తప్పారని.. అలాంటి బీఆర్ఎస్ను రాష్ట్రంలో అధికారంలోంచి దింపేందుకు కాంగ్రెస్ శ్రేణులు బలంగా పనిచేస్తున్నాయని నితీశ్‌కు రాహుల్ స్పష్టం చేశారని అంటున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనమవుతూ, కాంగ్రెస్ బలపడుతున్న దృష్ట్యా.. ఆ పార్టీని కలుపుకొంటే తమకు నష్టం వస్తుందని రాహుల్ పేర్కొన్నట్టు వివరిస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు సంకేతం అన్నట్టుగానే కర్ణాటక సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి 17 విపక్షాలను పిలిచినా బీఆర్ఎస్ను ఆహ్వానించలేదని సమాచారం. ఒకవేళ బీఆర్ఎస్ను కలుపుకోవాలని అన్ని పార్టీలు కోరితే.. ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక, లోక్‌సభ ఎన్నికలకు ముందుగానీ, ఎన్నికల తర్వాతగానీ ఆలోచిద్దామని ఏఐసీసీ పెద్దలు నితీశ్‌కు తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో భేటీపై నితీశ్ ఊగిసలాడుతున్నారని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. వారం, పది రోజుల్లో బిహార్‌లోని పట్నాలో విపక్షాల ఉమ్మడి భేటీ నిర్వహించాలని నితీశ్ యోచిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పిలిచే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.