
తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) రాజకీయాల్లో ఎదిగారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. తన వల్లే జేడీయూ ఇవాళ మనుగడలో ఉందని.. నితీశ్ రెండుసార్లు సీఎం కాగలిగారని లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు
..తన వల్లే లాలూ సీఎం కాగలిగారని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. కానీ, ఒకసారి ఆయన గతం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన(నితీశ్) కంటే ముందే నా తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా నెగ్గారు. ఎంతో మందిని ప్రధానులుగా చేయడంలో నా తండ్రిదే కీలక పాత్ర. అంతేకాదు..
నితీశ్ కుమార్ రెండుసార్లు సీఎం కావడంలో నేను ముఖ్యపాత్ర పోషించా. ఆయన పార్టీని కాపాడా.. ఈ సంగతులేవీ మరిచిపోవద్దు ’’ అని పాట్నాలో జరిగిన ఓ ర్యాలీలో నితీశ్‌ను ఉద్దేశించి తేజస్వి యాదవ్ అన్నారు.
2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్‌బంధన్ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్ చెప్పి మళ్లీ మహాఘట్‌బంధన్‌లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్ జట్టు కట్టారు.
నితీశ్ ఏమన్నారంటే..
బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తేజస్విపై సీఎం నితీశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బిహార్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదని, తన హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు.
‘‘గతంలో బిహార్‌లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? సాయంత్రం అయ్యిందంటే ఎవ్వరూ బయటకు వచ్చేవారు కాదు. అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. ఒకసారి వెళ్లి ప్రజలను అడుగు. మీ నాన్న ఈ స్థాయిలో ఉన్నాడంటే అది నా వల్లే. లాలూకు ఎందుకు అండగా నిలుస్తున్నారని మీ సొంత మనుషులే అడిగారు. అయినప్పటికీ.. మద్దతు ఇచ్చా’ అని నితీశ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment