lalu prasad yadav
-
ఎయిమ్స్‌లో లాలూకు కొనసాగుతున్న చికిత్స
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. లాలూ ప్రసాద్ వీపు, చేతులపై పుండ్లు పడినట్లు సమాచారం. దీంతో బుధవారం రాత్రి ఆయన్ని కార్డియో క్రిటికల్ కేర్ యూనిట్(CCU)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్య బృందం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లాలూ వెంట ఆయన సతీమణి రబ్రీదేవి ఉన్నారు. వాస్తవానికి.. బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరినప్పటికీ.. విమానాశ్రయానికి చేరుకోగానే ఒక్కసారిగా రక్తపోటులో తేడా కనిపించింది. దీంతో వెంటనే పాట్నాలోని పరాస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న అనంతరం ఢిల్లీ తరలించారు.లాలూ ఆరోగ్యంపై ఆయన తనయుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. పరాస్ ఆసుపత్రి నుంచి లాలూను తొలుత ఎయిర్ అంబులెన్స్‌లో ఎయిమ్స్‌కు తరలించాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రయాణికుల విమానంలో వెళ్తానని చెప్పడంతో తీసుకెళ్లినట్లు చెప్పారు. తన తండ్రి చాలా ధైర్యవంతుడన్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని తేజస్వి అంటున్నారు. 76 ఏళ్ల చాలా ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతుండడంతో ఇప్పటికే గుండె, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గత ఏడాది జూలైలో ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొంది కోలుకున్నారు. -
రెండుసార్లు మిమ్మల్ని సీఎంను చేశా.. అది మర్చిపోకండి
తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) రాజకీయాల్లో ఎదిగారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. తన వల్లే జేడీయూ ఇవాళ మనుగడలో ఉందని.. నితీశ్ రెండుసార్లు సీఎం కాగలిగారని లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు..తన వల్లే లాలూ సీఎం కాగలిగారని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. కానీ, ఒకసారి ఆయన గతం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన(నితీశ్) కంటే ముందే నా తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా నెగ్గారు. ఎంతో మందిని ప్రధానులుగా చేయడంలో నా తండ్రిదే కీలక పాత్ర. అంతేకాదు..నితీశ్ కుమార్ రెండుసార్లు సీఎం కావడంలో నేను ముఖ్యపాత్ర పోషించా. ఆయన పార్టీని కాపాడా.. ఈ సంగతులేవీ మరిచిపోవద్దు ’’ అని పాట్నాలో జరిగిన ఓ ర్యాలీలో నితీశ్‌ను ఉద్దేశించి తేజస్వి యాదవ్ అన్నారు.2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్బంధన్ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్ చెప్పి మళ్లీ మహాఘట్బంధన్లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్ జట్టు కట్టారు.నితీశ్ ఏమన్నారంటే..బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తేజస్విపై సీఎం నితీశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో బిహార్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదని, తన హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు.‘‘గతంలో బిహార్‌లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? సాయంత్రం అయ్యిందంటే ఎవ్వరూ బయటకు వచ్చేవారు కాదు. అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. ఒకసారి వెళ్లి ప్రజలను అడుగు. మీ నాన్న ఈ స్థాయిలో ఉన్నాడంటే అది నా వల్లే. లాలూకు ఎందుకు అండగా నిలుస్తున్నారని మీ సొంత మనుషులే అడిగారు. అయినప్పటికీ.. మద్దతు ఇచ్చా’ అని నితీశ్ అన్నారు. -
ఆర్జేడీ పాలనలో జంగిల్‌రాజ్
భాగల్పూర్: బిహార్‌లో విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తోపాటు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆర్జేడీ పాలనలో బిహార్‌లో ఆటవిక రాజ్యం నడిచిందని, పశువుల దాణాను కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని ధ్వజమెత్తారు. బిహార్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాని మోదీ సోమవారం బిహార్‌లోని భాగల్పూర్లో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రధానమంత్రి–కిసాన్ సమ్మాన్ నిధి’19వ విడత సొమ్మును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22,000 కోట్లకుపైగా సొమ్ము జమచేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. తొలుత ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా సభావేదికవద్దకు చేరుకున్నారు. సభలో దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పేర్లు నేరుగా ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించారు. జంగిల్‌రాజ్‌వాలా మన విశ్వాసాలను కించపరుస్తున్నారని, సమాజంలో విద్వేషాలు సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. భారతదేశ అతిపెద్ద ఐక్యతా వేడుక అయిన మహాకుంభమేళాను సైతం దూషిస్తుండడం దారుణమని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని సైతం జంగిల్‌రాజ్‌వాలా వ్యతిరేకించారని విమర్శించారు. అలాంటి వారిని బిహార్ ప్రజలు క్షమించరని తేల్చిచెప్పారు. బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే జరిగింది తప్ప అభివృద్ధి మచ్చుకైనా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాతే అభివృద్ధి వేగం పుంజుకుందని వివరించారు. శరవేగంగా వ్యవసాయ రంగ వృద్ధి తమ ప్రభుత్వం గత పదేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలతో దేశంలో వ్యవసాయ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. పీఎం–కిసాన్ సమ్మన్ నిధి కింద ఇప్పటిదాకా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.3.5 లక్షల కోట్లు జమ చేశామని వివరించారు. ఈ పథకం అమల్లోకి వచ్చి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రభుత్వ కృషితో అన్నదాతల గౌరవ ప్రతిష్టలు పెరిగాయని, వారికి నూతన శక్తి లభించిందని పేర్కొ న్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయంతో కోట్లాది మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారని, వారికి మార్కెట్ సదుపాయం మరింతగా అందుబాటులోకి వస్తోందని, తద్వారా ఆదాయం పెరుగుతోందని మోదీ ఉద్ఘాటించారు. మన అన్నదాతలను చూసి ప్రభుత్వం గరి్వస్తోందని వ్యాఖ్యానించారు. వారి జీవితాలను మరింత మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మఖానా సూపర్ ఫుడ్ మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని, దాంతో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బిహార్‌లో సాగవుతున్న మఖానాకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. మఖానా సూపర్ ఫుడ్ అని చెప్పాను. తాను మఖానాను విరివిగా స్వీకరిస్తున్నానని తెలిపారు. సంవత్సరంలో కనీసం 300 రోజులు మఖానా తింటుంటానని అన్నారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించామని గుర్తుచేశారు. భాగల్పూర్ సభలో మఖానాలతో రూపొందించిన దండను అభిమానులు మోదీకి బహూకరించారు. -
‘అమిత్‌షాకు మతి భ్రమించింది’
పాట్నా : ‘కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మతి భ్రమించింది. వెంటనే ఆయన రాకీయాల నుంచి తప్పుకోవాలని’ అని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ప్యాషనైందంటూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ‘అమిత్ షాకు మతి భ్రమించింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అమిత్‌షా రగిలిపోతున్నారు. ఆయన తీరును ఖండిస్తున్నా. అంబేద్కర్ గొప్పవారు. అమిత్‌షా రాజకీయాలను వదిలేయాలి' అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.पगला गया है अमित शाह !इस्तीफा देकर जल्द दे जल्द भाग जाए केंद्रीय गृह मंत्री !संविधान रक्षक - लालू प्रसाद यादव@laluprasadrjd 🔥🔥#तड़ीपार_माफ़ी_मांग pic.twitter.com/uOaBHFBtSw— सरपंच साहेब (@sarpanchsaheb3) December 19, 2024అంతకుముందు,బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడారు. అమిత్ షా,బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆరోపించారు. అంబేద్కర్ మా ఫ్యాషన్. మా ప్రేరణ. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఎవరు అవమానించినా మేం అంగీకరించం. అలాంటి వ్యక్తులు ద్వేషాల్ని రగిల్చే వారు. రాజ్యాంగ వ్యతిరేకులు,పార్లమెంటులో ఉపయోగించిన భాష ఆమోదించదగిన అంశం కాదు. రాజ్యంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేద్కర్ ప్రస్తావన తెచ్చారు. అంబేద్కర్, అంబేద్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలను డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్ వెలుపల నిరసన చేపట్టాయి. ఆ నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార, విపక్ష ఎంపీల మధ్య జరిగిన తోపులాటలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. -
అనంత్ అంబానీ పెళ్లిలో లాలూకు ప్రత్యేక స్వాగతం
రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన ఫార్మా టైకూన్ వీరేన్, శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైన వారిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ యాదవ్ కూడా ఉన్నారు.లాలూ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతి కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు. లాలూ కుటుంబ సభ్యులను అనంత్ అంబానీ చిన్నాన్న అనిల్ అంబానీ, చిన్నమ్మ టీనా అంబానీ ప్రత్యేకంగా స్వాగతించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్ యాదవ్‌తో సహా వివాహానికి వచ్చారు. అలాగే గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ తన భార్యతో కలిసి వచ్చారు. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు కూడా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహానికి హాజరయ్యారు. बिहार के पूर्व सीएम और RJD अध्यक्ष लालू यादव शादी में शामिल होने पहुँचे#BiharNews #anantambaniwedding #AnantRadhikaWedding #AnantAmbani #MukeshAmbani #LaluPrasadYadav pic.twitter.com/JSym9IpQOO— India TV (@indiatvnews) July 12, 2024 -
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
పాట్నా: ఆర్జేడీ దిగ్గజం లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణీ ఆచార్య తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతుండటం తెలిసిందే. బిహార్‌లోని సరన్ నియోజకవర్గం ఆమె పోటీ చేస్తున్నారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అక్కడి నుంచే ఆమెపై పోటీ పడుతున్నారు! తండ్రీ కూతుళ్లు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఏమిటా అని అవాక్కవుతున్నారా? వాళ్లిద్దరూ సరన్ నుంచి పోటీ చేస్తున్నది నిజమే గానీ సదరు లాలు ప్రసాద్ యాదవ్ ఆమె తండ్రి కాదు. ఆ పేరుతోనే ఉన్న ఓ రైతు! రాష్రీ్టయ జన సంభావనా పార్టీ (ఆర్జేపీ) అభ్యరి్థగా నామినేషన్ వేశారాయన. ఈ లాలు ప్రసాద్ యాదవ్‌కు గతంలో పంచాయతీ మొదలుకుని ప్రెసిడెంట్ ఎన్నికల దాకా పోటీ చేసిన అనుభవముంది. అంతే కాదు, 2017, 2022ల్లో రెండుసార్లు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ పడ్డారు. రెండుసార్లూ ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవడం వేరే సంగతి! సరన్ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేయడం ఇది తొలిసారేమీ కాదు. చాలాకాలంగా బరిలో నిలుస్తూనే వస్తున్నారు. లాలు భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవిపై కూడా పోటీ చేశారు. ఇప్పుడు వారి కుమార్తెపై బరిలో దిగారు. గత ఎన్నికల విషయం ఎలా ఉన్నా ఈసారి మాత్రం భారీ మెజారిటీతో గెలుస్తానని ఈ లాలు అంటుండటం విశేషం! ‘‘జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుంటున్నా, నిత్యం సామాజిక సేవలో నిమగ్నమయ్యే ఉన్నా. కనుక ఈసారి సరన్ ప్రజలు నా వెంట ఉన్నారు’’ అంటున్నారు. రోహిణి ఓట్లను చీల్చేందుకే ఆయన బరిలో ఉన్నారని ఆరోపణలున్నాయి. పట్టించుకోనంటున్నాడు. అఫిడవిట్ ప్రకారం ఈ లాలు దగ్గర రూ.5 లక్షల నగదు, భార్య వద్ద 2 లక్షల నగదు, ఆయన పేరిటరూ.17.6 లక్షలు, భార్య పేరిట రూ.5.20 లక్షల చరాస్తులున్నాయి. -
లోక్‌సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు?
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఏడుగురు కుమార్తెల్లో ఇద్దరిని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్ధమయింది. ఆర్జేడీ టిక్కెట్‌పై మిసా భారతిని పాటలీపుత్ర నుంచి, రోహిణీ ఆచార్యను సరన్ నుంచి బరిలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. పాటలీపుత్ర నియోజకవర్గంలో ఆర్జేడీ టిక్కెట్‌పై పోటీ చేసేందుకు ఇప్పటికే రిత్లాల్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పట్నాలోని మాజీ సీఎం రబ్డీదేవి నివాసానికి పలు పర్యాయాలు వచ్చినట్లు కూడా మీడియా అంటోంది. దీంతో, పాటలీపుత్ర నుంచి ఇద్దరిలో ఎవరిని పోటీకి నిలపాలనే విషయంలో కొంత సందిగ్ధం కొనసాగుతున్నట్లు సమాచారం. -
ఇండియా కూటమి ఎన్నికల భేరి
పట్నా: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బిహార్ రాజధాని పట్నా వేదికగా ఎన్నికల ప్రచార నగారా మోగించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలో ఆదివారం జరిగిన ‘జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తదిపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ..రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉసి గొల్పుతూ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వాటిని చూసి తాము భయపడటం లేదని చెప్పారు. దేశ సంపదను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. కేవలం ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను కాపాడుతున్న మోదీ ప్రభుత్వం, దేశ జనాభాలో 73 శాతం మేర ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ప్రసంగిస్తూ.. ఇటీవల తమను వదిలేసి ఎన్డీఏ పక్షంలో చేరిన సీఎం నితీశ్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా మీలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు నేను ఇక్కడే ఉంటాను’అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..యూపీ, బిహార్లలో కలిపి 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య కూడా ర్యాలీలో ప్రసంగించారు. రైల్వేపై రాహుల్ విమర్శలు కేంద్ర ప్రభుత్వం ధనికులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రైల్వే విధానాలను రూపొందిస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీని నమ్మితే నమ్మక ద్రోహం గ్యారెంటీ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘డైనమిక్ ఫేర్ పేరుతో ఏటా 10 శాతం చొప్పున రైలు చార్జీలను ప్రభుత్వం పెంచుతోంది. క్యాన్సిలేషన్ చార్జీలను, ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరలను సైతం పెంచింది’’ అని విమర్శించారు. -
బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది: తేజస్వీ యాదవ్
పట్నా: బిహార్‌లోని మహా కూటమి నుంచి బయటకు వచ్చి సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీ మద్దతుతో మరోసారి బిహార్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. మహాకూటమిలో కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నితీష్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. బీజేపీ-జేడీ(యూ) కూటమి ఏర్పాటుపై తాను మాత్రమే బీజేపీకి శుభాకాంక్షలు తెలుపగలనని అన్నారు. జేడీయూను బీజేపీ కూటమిలో కలుపుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైందని అన్నారు. నితీష్ కుమార్ అలసిపోయారని.. ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాలనలో ఆర్జేడీ పార్టీ అన్ని రకాలకు సహకరించిందని గుర్తుచేశారు. నితీష్‌పై ప్రస్తుతం తాను వ్యక్తిగతమైన వ్యాఖ్యలు ఏం చేయనని అన్నారు. ప్రస్తుతం నితీష్ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో జేడీ(యూ) పూర్తిగా పట్టు కోల్పోవటం ఖాయమని అన్నారు. నితీష్ చేసిన పనికి బిహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు. వారు(జేడీయూ) ఏం చేసినా బిహార్ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తేజస్వీ తెలిపారు. చదవండి: ‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’ -
ఇండియా కూటమి నేతల ఫోన్లకు స్పందించని నితీష్ కుమార్
పట్నా: ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన అధికార మహాఘట్బంధన్ సంకీర్ణానికి జేడీ(యూ) సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పి ఎన్డీఏ కూటమిలో చేరడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. బిహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఇక.. పాత నేస్తం బీజేపీతో మళ్లీ జట్టు కట్టి నితీస్ కుమారు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బిహార్ సీఎం నితీష్‌కుమార్‌పై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’నుంచి నితీష్ జేడి(యూ) పార్టీ వైదులుగుతుందన్న కచ్చితమైన సమాచారం లేదన్నారు. ఇక.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటు అయిన ‘ఇండియా కూటమి’లో జేడీ (యూ) ఓ కీలకమైన పార్టీ జేడీ(యూ) అని తెలిపారు. ‘నాకు నితీష్ కుమార్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయం నేను లేఖ కూడా రాశారు. వారితో మాట్లాడుదామని ప్రయత్నం చేశాను. కానీ, నితీష్ కుమార్ మనసులో ఏం ఉందో నాకు తెలియదు’ అని ఖర్గే పేర్కొన్నారు. రేపు( ఆదివారం) ఢిల్లీ వెళ్లి బిహార్‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ అనిశ్చితిపై పూర్తి సమాచారం తెలుసుకుంటానని.. ఈ వ్యవహారంపై చర్చ జరుపుతామని అన్నారు. నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్న విషయం తనకు తెలియదని, గవర్నర్‌ను కలుస్తారన్న దానిపై కూడా తనకు స్పష్టత లేదని అన్నారు. ఇక.. ఈ విషయంపై ప్రస్తుతం అధికారికంగా మాట్లాడలేనని అన్నారు. రేపటి వరకు ఏం జరుగుతుందో చూస్తామని ఖర్గే తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ సంబంధించిన నేతల ఫోన్లకు నితీష్ కుమార్ స్పందించకపోవటం గమనార్హం. సోనియా గాంధీ కాల్ చేసినా.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే మూడుసార్లు ఫోన్ చేసినా నితీష్ కుమార్ స్పందించలేదు. మరోవైపు.. లాలూప్రసాద్ యాదవ్ ఐదుసార్లు ఫోన్ చేసినా నితీష్ లిఫ్ట్ చేయకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చదవండి: Bihar Politics: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా నేడు? -
డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో అధికార కూటమి భాగస్వామి అయిన జేడీ(యూ)లో తెర వెనక ‘తిరుగుబాటు’కు ఎట్టకేలకు తెర పడింది. పారీ్టలో అధ్యక్ష మార్పు తప్పదన్న ఊహాగానాలే నిజమయ్యాయి. మీడియా కథనాలను నిజం చేస్తూ లలన్సింగ్ను తప్పించి పార్టీ అధ్యక్ష పగ్గాలను సీఎం నితీశ్‌కుమార్ లాంఛనంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ భేటీ ఇందుకు వేదికైంది. పార్టీ అధ్యక్షునిగా నితీశ్ పేరును సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థించారు. ఆ వెంటనే లలన్ రాజీనామా, అధ్యక్షునిగా నితీశ్ బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పరిణామం వెనక నిజానికి చాలా పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. లలన్ తిరుగుబాటు యత్నమే దీనంతటికీ కారణమని సమాచారం. నితీశ్ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లలన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి ఆయన ఉద్వాసనకు దారితీసినట్ చెబుతున్నారు! కొద్ది నెలల క్రితం నుంచే... ఆర్జేడీతో, ఆ పార్టీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్‌తో లలన్‌సింగ్ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. నితీశ్ కూడా దీన్ని చూసీ చూడనట్టే పోయేవారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... లాలు కుమారుడు తేజస్వికి సీఎం పదవి అప్పగించి నితీశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటూ కొద్దికాలం క్రితం లలన్ ప్రతిపాదించారు. 18 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎం పదవిలో కొనసాగినందున అధికార మహాఘట్బంధన్ సంకీర్ణంలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి సీఎం అవకాశమిస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని నితీశ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. లాలు–లలన్ ప్లాన్ నితీశ్ నిరాకరించినా తేజస్విని ఎలాగైనా సీఎం చేసేందుకు లాలు, లలన్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా జేడీ(యూ)ను చీల్చి కనీసం ఒక డజను మంది ఎమ్మెల్యేలను ఆర్జేడీలోకి పంపేందుకు లలన్ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్‌లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని ఆయనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తేజస్వికి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలు. కానీ 45 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో డజను మందే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఈ ముప్పు తప్పించేలా లలన్ ఎత్తే వేశారు. అందులో భాగంగా వారిని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేస్తారు. అప్పుడిక వారికి అనర్హత నిబంధన వర్తించదు. ఆనక 12 మంది ఎమ్మెల్యేలూ ఆర్జేడీకి మద్దతు పలికేలా, నితీశ్ సర్కారు కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన జరిగింది. ఈ మేరకు 12 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వారందరికీ మంత్రి పదవులు ఆశ చూపారు. ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరి ఇందుకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేల్లో తన వీర విధేయుడైన సభ్యుడొకరు దీనిపై ఉప్పందించడంతో నితీశ్ అప్రమత్తమయ్యారు. సైలెంట్‌గా వారం క్రితం ‘ఆపరేషన్ లాలన్’కు తెర తీశారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరితోనూ విడివిడిగా మాట్లాడి వారంతా తనకే విధేయులుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలా పావులు కదుపుతూ శుక్రవారం కథను క్లైమాక్స్‌కు తెచ్చారు. విషయం అర్థమైన లాలన్‌సింగ్ అస్త్రసన్యాసం చేశారు. అధ్యక్ష పదవికి తానే నితీశ్ పేరును సూచించి తప్పుకున్నారు! -
JDU: జేడీయూ అధినేతగా మళ్లీ నితీశ్!
పాట్నా: బీహార్ అధికార పార్టీ జనతా దళ్(యునైటెడ్) పగ్గాల్ని మళ్లీ ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందుకోబోతున్నారా?.. తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. మరో వారంలోగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జేడీయూ చీఫ్‌గా రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ ఉన్నారు. అయితే తప్పించే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నితీశ్ కుమార్‌నే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పలువురు సీనియర్లు కోరుతున్నారట. ఈ క్రమంలో.. ఢిల్లీలో డిసెంబర్ 29వ తేదీన జరగబోయే పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాలన్ సింగ్ తొలగింపు ఎందుకంటే.. జేడీయూ చీఫ్‌గా లాలన్ సింగ్‌ను తొలగించేందుకు కారణం లేకపోలేదు. లాలన్ గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామంపై అసంతృప్తితో రగిలిపోతున్న నితీశ్.. ఆయన్ని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. జనతా దళ్ యునైటెడ్ ఏర్పడిన తొలినాళ్లలో శరద్ యాదవ్ వ్యవస్థాప అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై నితీశ్ కుమార్ 2016 నుంచి 2020 దాకా, 2020-21 మధ్య రామచంద్ర ప్రసాద్ సింగ్, లాలన్ సింగ్ 2021 నుంచి జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఆర్జేడీతో వైరం.. మైత్రి.. గ్యాప్ జనతా పార్టీ చీలికతో.. ఒకవైపు కర్ణాటకలో హెచ్డీ దేవె గౌడ జనతా దళ్(సెక్యులర్), నార్త్ బెల్ట్‌లో బీహార్ నుంచి శరద్ యాదవ్ నేతృత్వంలో జనతా దళ్(యునైటెడ్) ఏర్పాడ్డాయి. అప్పటికే జార్జి ఫెర్నాండేజ్, నితీశ్ కుమార్‌లు సమతా పార్టీని స్థాపించారు. సమతా పార్టీని 2003 అక్టోబర్ 30న జనతా దళ్‌లో విలీనం చేశారు. మరో పార్టీ లోక్ శక్తి కూడా ఇందులో చేరింది. అప్పుడు అధికారంలో రాష్ట్రీయ జనతా దళ్ ఉండగా.. ప్రతిపక్ష కూటమిగా జేడీయూ కొనసాగింది. అయితే.. బీజేపీతో కటీఫ్ ప్రకటించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎంతో పొత్తుగా వెళ్లింది జేడీయూ. నలభై సీట్లలో కేవలం రెండే సీట్లు నెగ్గింది. ఓటమికి నైతిక బాధత్య వహిస్తూ నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జతిన్ రామ్ మాంఝీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ టైంలో బీజేపీ అధికార పక్షాన్ని బలపరీక్షకు ఆహ్వానించగా.. ఆర్జేడీ సాయంతోనే జేడీయూ ప్రభుత్వం నెగ్గడం గమనార్హం. ఆ తర్వాత 2015లో జేడీయూ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు కూటమిగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకున్నప్పటికీ.. ఎస్పీ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో పొత్తుగా వెళ్లి ఎన్నికల్లో నెగ్గాయి. బీజేపీతో జేడీయూ దోస్తీ-కటీఫ్ల నడుమ.. జేడీయూ-ఆర్జేడీల మైత్రి కూడా పడుతూ లేస్తూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా విజయం సాధించి ప్రభుత్వంలో ఆర్జేడీ కూడా భాగమైంది. అయితే.. మధ్య మధ్యలో కీలక నేతల నడుమ లుకలుకలు బయటపడుతూనే వస్తున్నాయి. ఇండియా కూటమి సమావేశాలు కొనసాగుతున్న వేళ.. జేడీయూ-ఆర్జేడీల మధ్య ఆగాథం మరింత పెరుగుతూ వస్తోంది. -
లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: తాను రైల్వేమంత్రిగా ఉన్న కాలంలో భూములు రాయించుకుని కొందరికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కూ సమన్లు పంపింది. ఈనెల 22వ తేదీన ఢిల్లీ ఆఫీస్‌కు రావాలని తేజస్వీని, డిసెంబర్ 27న రావాలని లాలూకు ఈడీ సూచించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో వీరిద్దరి నుంచి అధికారులు వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఈడీ ఇప్పటికే ఇదే కేసులో ఏప్రిల్‌లో ఎనిమిది గంటలపాటు తేజస్వీని విచారించింది. లాలూ ప్రసాద్‌కు ఈ కేసులో సమన్లు పంపడం ఇదే తొలిసారి. గత నెలలో లాలూ కుటుంబానికి ఆప్తుడైన అమిత్ కాత్యాల్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన నేపథ్యంలో వీరికి సమన్లు జారీకావడం గమనార్హం. -
లాలూ ప్రసాద్ ఆటలు
-
సంపూర్ణంగా కోలుకున్న లాలూ
న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. చాలా హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని తేజస్వి యాదవ్ క్యాప్షన్ పెట్టారు. -
Opposition Meet: కాంగ్రెస్ పెద్దన్నగా మారిందా?
కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకునే ఉద్దేశంతో ప్రతిపక్షాలన్నీ కూటమి కట్టాయి. బెంగుళూరు వేదికగా ఐక్యతను చాటే ప్రయత్నం చేశాయి. ప్రత్యామ్నయం తామేనంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాయి. ఇండియా పేరుతో కూటమి కట్టి ఐక్యతా రాగం చాటుతున్నా... ఎవరి ఎజెండా వారిదే. బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 26 పార్టీలు హాజరయ్యాయి. కూటమికి ఇండియా అనే పేరు పెట్టి ప్రతిపక్షాల ఐక్యతే ప్రధానం అంటూ ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతానికి సీట్ల పంపకాలు, పొత్తులపై స్పష్టత రాకున్నా... తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్‌కు కొన్ని రాజకీయపక్షాలు హాజరవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది . అసలు అంతరించిపోతుందనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ స్థాయిలో మీటింగ్ పెట్టడం ఆ పార్టీ వ్యూహకర్తల సక్సెస్ అని ఒప్పుకోవాల్సిందే. ప్రాంతీయ పార్టీల ఆశలు వారి ఎత్తుగడలను తనకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇటీవల హిమాచల్, కర్ణాటక ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పెద్దన్న పాత్రకు తానే కరెక్టు అంటూ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగానే ఎవరికి కావాల్సింది వారికి చేస్తూ కూటమికి అంకురార్పణ చేసింది. (ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..) ఇక ఎప్పటినుంచో ప్రధాని కావాలనుకుంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూటమికి ముందు నుంచి సిద్ధంగానే ఉన్నారు. ఆయన బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల తొలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అవసరమైతే మేము నాయకత్వ బాధ్యతలు వదులుకోడానికి సిద్ధంగా ఉన్నామని ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక తానే ప్రధాని అభ్యర్ధి అని నితీష్ నిర్ధారించుకున్నారు. నితీష్‌ను కేంద్రానికి పంపి తన కొడుకు తేజస్విని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్న లాలుకు పూర్తి అనుకూలమైన పరిస్థితి. అయితే ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్ధిగా నితీష్‌ను ప్రొజెక్ట్ చేయడాన్ని కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితిలేదు. అయినా తాత్కాలికంగా నితీష్‌ను ఊహల్లో ఉంచాలనేది కాంగ్రెస్-లాలు ఆలోచన. అందుకే బీహార్‌లో బీజేపి వ్యతిరేక పార్టీలన్నీ ఇప్పుడు కూటమిగా ఒక్కతాటిపైకి వచ్చాయి. -ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ (బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే) -
విపక్షాలు ఈ వంకతో మిమ్మల్ని ప్రధాని కాకుండా చేస్తున్నాయని నా అనుమానం సార్!
-
బడే భాయ్.. శరద్ యాదవ్ మృతిపై లాలూ భావోద్వేగం
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ హఠాన్మరణం.. బీహార్ రాజకీయాల్లో విషాద ఛాయలు నింపింది. ఐదు దశాబ్దాలపాటు.. జాతీయ రాజకీయాల్లో రాణించి తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా పేరున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. శరద్ యాదవ్ మరణంపై ఎమోషనల్ అయ్యారు. తమ మధ్య రాజకీయపరంగా రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. తమ మధ్య బంధం మాత్రం చెడిపోలేదని లాలూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య కారణాల రిత్యా సింగపూర్‌లో ఉన్న లాలూ.. ఆస్పత్రి నుంచి వీడియో సందేశం ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. బడే భాయ్(పెద్దన్న)గా శరద్ యాదవ్‌ను సంబోధిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని లాలూ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘అతను(శరద్ యాదవ్), ములాయం సింగ్, నితీశ్ కుమార్, నేను.. మీమంతా రామ్ మనోహర్ లోహిలా, కార్పూరి థాకూర్ నుంచి సోషలిజం రాజకీయాలు నేర్చుకున్నాం. ఎన్నోసార్లు మేం రాజకీయాల పరంగా పోటీ పడ్డాం. కానీ, మా మధ్య బంధం మాత్రం ఎప్పుడూ చెడిపోలేదు’’ అని లాలూ గుర్తు చేసుకున్నారు. अभी सिंगापुर में रात्रि में के समय शरद भाई के जाने का दुखद समाचार मिला। बहुत बेबस महसूस कर रहा हूँ। आने से पहले मुलाक़ात हुई थी और कितना कुछ हमने सोचा था समाजवादी व सामाजिक न्याय की धारा के संदर्भ में। शरद भाई...ऐसे अलविदा नही कहना था। भावपूर्ण श्रद्धांजलि! pic.twitter.com/t17VHO24Rg — Lalu Prasad Yadav (@laluprasadrjd) January 12, 2023 శరద్ యాదవ్ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది.. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి మొదలుపెట్టినప్పటికీ.. ఆయన మాధేపురనే బేస్‌గా చేసుకుని ముందుకు వెళ్లారు. ఇందులో లాలూతోనే పోటాపోటీ నడిచింది. నాలుగుసార్లు గెలిస్తే.. నాలుగుసార్లు ఓడిపోయారు. 1991, 1996 నుంచి నెగ్గి, 1998లో లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 1999లో లాలూను ఓడించారు. మళ్లీ 2004లో లాలూ చేతిలో ఓడారు. 2009లో మళ్లీ నెగ్గారు. 2014, 2019లో మోదీ మేనియాలో శరద్ యాదవ్ ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్ యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి 2004 మధ్య వాజ్పేయూ ప్రభుత్వంలో శరద్ యాదవ్ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్ యునైటెడ్(జేడీ-యూ) జాతీయ అధ్యక్షుడయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు. 2018లో లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) పార్టీ ఏర్పాటు చేశారు. కానీ, ఆ పార్టీకి అధికారిక గుర్తింపు లేకుండా పోయింది. తొలుత బహుజన్ ముక్తి పార్టీ తో విలీనం కావాలని భావించినప్పటికీ.. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను ఏకం చేయడంలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇది తొలి అడుగని శరద్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి వెల్లడించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. పల్స్ లేదు. మేము తొలుత సీపీఆర్ ప్రయత్నించి చూశాం. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 10.19 గంటలకు ఆయన చనిపోయారు’ అని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. -
లాలూ ఫ్యామిలీకి షాక్.. ఆ కేసు మళ్లీ తిరగదోడుతున్న సీబీఐ
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రాసాద్ యాదవ్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసును మళ్లీ రీఓపెన్ చేసింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. అయితే సీబీఐ నిర్ణయం చూస్తుంటే ఇది కచ్చితంగా బీజేపీ రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయంలాగే కన్పిస్తోందని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రేల్వై ప్రాజెక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2018లో ఈకేసులో ప్రాథమిక విచారణ మొదలైంది. అయితే 2021 మేలో ఈ కేసును సీబీఐ క్లోజ్ చేసింది. లూలూపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు దొరకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొన్ని నెలల క్రితమే బిహార్‌లో బీజేపీకి షాక్ ఇస్తూ ఆర్జేడీతో కలిశారు సీఎం నితీశ్ కుమార్. తన పాతమిత్రుడి చెంతకు మళ్లీ చేరారు. ఈ కారణంగానే లాలూ కేసును బీజేపీ మళ్లీ రీఓపెన్ చేయిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత -
గర్వంగా ఉంది.. లాలూ కూతురిపై బీజేపీ ప్రశంసలు
ఢిల్లీ: మానవ సంబంధాల కంటే డబ్బుకి, సంఘంలో పేరుప్రతిష్టలు, పరపతికే ప్రాధాన్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. అయినవాళ్లను కూడా దూరంగా పెడుతున్నారు కొంతమంది. అయితే.. కన్నవాళ్ల కోసం, వాళ్ల ఆరోగ్యం కోసం తాపత్రయ పడే పిల్లలకు సమాజంలోని తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అలా.. రాజకీయ దిగ్గజం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బీజేపీ ఫైర్‌బ్రాండ్, బీహార్ నేత గిరిరాజ్ సింగ్.. లాలూ యాదవ్‌పై మామూలుగా విరుచుకుపడరు. అలాంటి వ్యక్తి.. లాలూ కూతురిపై ఆశ్చర్యకరంగా ప్రశంసలు గుప్పించారు. ‘‘రోహిణి ఆచార్య.. కూతురు అంటే నీలా ఉండాలి. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. తర్వాతి తరాలకు నువ్వు(రోహిణిని ఉద్దేశిస్తూ..) ఒక ఆదర్శప్రాయంగా నిలిచావు అంటూ పోస్ట్ చేశారు. మరో బీజేపీ నేత నిషికాంత్ దుబే సైతం రోహిణిపై పొగడ్తలు గుప్పించారు. నాకు కూతురు లేదు. కానీ, ఇవాళ రోహిణిని చూశాక.. దేవుడితో పోరాడైన సరే నాకు ఓ కూతురిని ఇవ్వమని కోరాలని ఉంది అంటూ ట్వీట్ చేశారాయన. “बेटी हो तो रोहणी आचार्य जैसी” गर्व है आप पर… आप उदाहरण होंगी आने वाले पीढ़ियों के लिए । pic.twitter.com/jzg3CTSmht — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) December 5, 2022 मुझे भगवान ने बेटी नहीं दी,आज रोहिणी आचार्य को देखकर सचमुच भगवान से लड़ने का दिल कर रहा है है,मेरी नानी हमेशा कहती थी,बेटा से बेटी भली जो कुलवंती हो pic.twitter.com/j0WSMfckjL — Dr Nishikant Dubey (@nishikant_dubey) December 5, 2022 ఇదిలా ఉంటే.. లాలూ పెద్ద కూతురు మీసా భారతి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం గత సాయంత్రం లాలూ సర్జరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వయసున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో 40లో ఉన్న రోహిణి ఆచార్య.. తన కిడ్నీని తండ్రికి దానం ఇచ్చింది. సింగపూర్‌లో సోమవారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. Ready to rock and roll ✌️ Wish me a good luck 🤞 pic.twitter.com/R5AOmFMW0E — Rohini Acharya (@RohiniAcharya2) December 5, 2022 -
లాలుకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ పూర్తయిందని, ప్రస్తుతం ఆయనను ఐసీయూకి తరలించినట్లు బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేశారు. శస్త్ర చికిత్స తర్వాత ఆమె సైతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు తేజస్వీ యాదవ్. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి సమయంలో ఆయన సన్నిహితుడు భోలా యాదవ్, కుమారుడు తేజస్వీ యాదవ్, రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, పెద్ద కుమార్తే మిసా భారతిలు సింగపూర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. 74 ఏళ్ల లాలూ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వైద్యం కోసం తన కూతురితో కలిసి సింగపూర్ వెళ్లారు. ఈ క్రమంలో తన తండ్రికి కిడ్నీ ఇచ్చి కొత్త జీవితాన్ని ఇవ్వాలి ఆయన కుమార్తె రోహిణి నిర్ణయం తీసుకున్నారు. पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया। डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2 — Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022 ఇదీ చదవండి: ‘పాక్ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోండి’: కాంగ్రెస్ -
లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె గొప్ప మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కొత్త జీవితం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. కాగా 74 ఏళ్ల లాలూ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వైద్యం కోసం కూతురుతో కలిసి ఆయన సింగపూర్ కూడా వెళ్లొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో లాలూకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో తండ్రికి తన కిడ్నీ దానం చేయాలని రోహిణి నిర్ణయించుకున్నారు. అయితే కూతురు ప్రతిపాదనను లాలూ మొదట్లో వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కానీ చివరికి రోహిణి ఒత్తిడి చేయడం, వైద్యుల సూచన మేరకు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో త్వరలోనే లాలూ సింగపూర్ వెళ్లబోతున్నారు. అక్కడే ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగనుంది. ఇక లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ డొనేట్ చేసేందుకు ఆయన కుమార్తె రోహిణి ముందుకు రావడం పట్ల ఆర్జేడీ పార్టీ శ్రేణులతోపాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. చదవండి: నీళ్లలో దూకాడు.. బీజేపీ తరపున జాక్‌పాట్ కొట్టాడు -
చచ్చేదాకా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు!
సమస్తీపూర్: తాను బతికి ఉన్నంతకాలం బీజేపీతో మళ్లీ కలిసే ప్రసక్తే లేదని బిహార్ ముఖ్యమంత్రి,, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని బీజేపీపై మండిపడ్డారు. ఆయన శుక్రవారం సమస్తీపూర్‌లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించి.. ప్రసంగించారు. వారు గతంలో లాలూ గారిపై(ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్) కేసు పెట్టారు. దాని వల్ల ఆయనతో నాకు సంబంధాలు తెగిపోయాయి. వాళ్లకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు మేము మళ్ళీ కలిసి ఉన్నప్పుడు, వాళ్లు మళ్లీ కేసులు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ల పనితీరు శైలి ఎలా ఉందో మీరు గమనించవచ్చు అంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. అయితే.. ప్రస్తుత బీజేపీ నాయకత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషీ హయాం నాటి బీజేపీ ఇప్పుడే లేదన్నారు. అందుకే తాను తుదిశ్వాస విడిచేవరకు జేడీయూ.. బీజేపీతో కలవబోదని అన్నారాయన. జేడీ(యూ), కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలకు కూడిన ‘మహాఘట్బంధన్’ ఎప్పటికీ కలిసే ఉంటుందని తేల్చిచెప్పారు. దేశ ప్రగతి కోసం తామంతా కలిసి పని చేస్తామని అన్నారు. ఇదీ చదవండి: మోయలేని భారం మోపే వాడే మోదీ -
సీబీఐ తర్వాత.. ఇక ఈడీ వంతు: తేజస్వీ
న్యూఢిల్లీ/పట్నా: రైల్వే కుంభకోణంలో తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిల పేర్లను చేరుస్తూ సీబీఐ చార్జిషీటు వేయడంపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇందులో కొత్తేమీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ దెబ్బతిన్నప్పుడల్లా ఇవి జరగడం మామూలేనని పేర్కొన్నారు. ‘బిహార్‌లో అధికారం కోల్పోవడంతో బీజేపీకి మాతో సమస్యలు ఏర్పడుతున్నాయి. మరో వైపు, బీజేపీకి దీటుగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాఘఠ్ బంధన్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పరిణామాలతోనే దర్యాప్తు సంస్థలను మాపైకి ఉసి గొలుపుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఈ డ్రామా 2024 ఎన్నికల దాకా సాగుతుందన్న విషయం పిల్లల్ని అడిగినా చెబుతారు’అని కేంద్రాన్ని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ తర్వాత ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీలు తన నివాసంలో కార్యాలయాలు తెరవాలని కోరారు. చదవండి: షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్! -
లాలు యాదవ్, భార్య, కూతుళ్లు, మరో 13 మందిపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంతిగా ఉన్న సమయలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్దాఖలు చేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ కుంభకోణంలో ఆర్జేడి నేత లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి, ఇద్దరు ముఖ్యమంత్రులు, ప్రస్తుత బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, అలాగే రైల్వేలో ఉద్యోగాలు పొందిన 12 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ చార్జిషీట్లో రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సౌమ్య రాఘవన్‌ని కూడా నిందితుడిగా పేర్కొన్నారు. రాఘవన్ రైల్వే బోర్డు ఆర్థిక కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. రైల్వేలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సిబీఐ సెప్టెంబర్ 23, 2021న కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణ తర్వాత దానిని మే 18న ఎఫ్‌ఐర్‌గా మార్చారు. విచారణలో రైల్వే అధికారులు మితిమీరిన తొందరపాటుతో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే గ్రూప్ డీ స్థానల్లో అభ్యర్థులను ప్రత్యామ్నాయంగా నియమించినట్లు తెలిపింది. ఈ కుంభకోణంలో వ్యక్తులు తమ పేరు, తమ దగ్గరి బంధువుల పేరు మీద భూములను బదలాయించనట్లు సీబీఐ వెల్లడించింది. ఈ భూమికి అసలు ఉన్న రేటు కంటే తక్కువగా, అలాగే మార్కెట్లో ఉన్న ధర కంటే చాలా తక్కువ ధరకు సేకరించారు. ఈ భూమి బదలాయింపు రబ్రీ దేవి, కుమార్తెలు భారతి, హేమ యాదవ్‌ల పేర్లతో బదలాయింపులు జరిగాయని సీబీఐ ఆరోపించింది. పాట్నాలో సుమారు 1.05 లక్షల చదరపు అడుగు భూమిని ప్రసాద్ కుటుంబ సభ్యులు అమ్మకందారులకు నగదు రూపంలో చెల్లించి స్వాధీనం చేసుకున్నారని కేంద్ర ఏజెన్సీ ఆరోపించింది. అలాగే ఈ నిందితుల్లో ఏడుగురు అభ్యర్థులు కూడా ఉన్నారని సీబీఐ పేర్కొంది. (చదవండి: దాదాపు రూ. 5 లక్షలు మోసపోయిన ఇన్స్పెక్టర్... 9 ఏళ్లుగా కేసు నమోదుకాక..) -
బీజేపీ ఓటమి ఖాయం: లాలూ
పాట్నా: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బుద్ధి లేదంటూ ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ శనివారం విరుచుకుపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. బిహార్‌లో జంగిల్‌రాజ్ అంటూ అమిత్ షా పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి గుజరాత్లో అమిత్ షా ఉన్నప్పుడే జంగిల్‌రాజ్ రాజ్యమేలిందని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. లాలూప్రసాద్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ‘ప్రతిపక్షాల ఐక్యతే’ ప్రధాన అజెండా అని లాలూ తెలిపారు. ఆయన శనివారం సాయంత్రం పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరోవైపు హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ర్యాలీకి బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హాజరయ్యే అవకాశం ఉంది. మరికొందరు ప్రతిక్ష నేతలు ఈ ర్యాలీలో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. -
నా పర్యటనతో లాలూ, నితీశ్‌కు కడుపులో నొప్పి.. అమిత్ షా విమర్శలు
పాట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో ప్రధాని కావాలనే లక్ష్యంతో ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచి లాలూ ప్రసాద్ యాదవ్ ఒళ్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు. నితీశ్ తెగదెంపులు చేసుకోవడంతో బిహార్‌లో ఎన్డీఏ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చారు అమిత్ షా. రెండు రోజుల పర్యటనలో భాగంగా సరిహద్దు జిల్లా పూర్ణియాలో ర్యాలీలో ప్రసంగించారు. నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. 'నేను ఈవాళ సరిహద్దు జిల్లాల్లో పర్యటించడం చూసి లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్ కుమార్‌లకు కడుపునొప్పి వస్తోంది. వాళ్లు అశాంతి కోరుకుంటున్నారు. నేను ఇక్కుడకు వస్తే అశాంతి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు. నితీశ్ కుమార్ లాలూ ఒళ్లో కూర్చుకున్నారు. ప్రజలేం ఆందోళన చెందవద్దు. సరిహద్దు జిల్లాలు భారత్‌లో భాగమే. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మనకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఏదో ఒకరోజు ప్రధాని కావాలనే ఆశతో నితీశ్ లాలూ చెంతకు చేరారు. వాళ్లు బిహార్ ప్రజల తీర్పుకు విరుద్ధంగా ద్రోహం చేశారు. సీమాంతర ప్రజలు నితీశ్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. కూటములు మార్చి నితీశ్ ప్రధాని కాగలరా?' అని అమిత్ షా ప్రశ్నించారు. నితీశ్‌కు సీఎం పదవి ఇస్తామని ప్రధాని మోదీ మాటిచ్చినందు వల్లే బీజీపే అందుకు కట్టుబడి ఉండి ఆయనకు బాధ్యతలు అప్పగించిందని అమిత్ షా చెప్పారు. కానీ నితీశ్ మాత్రం ద్రోహం చేసి ప్లేటు పిరాయించారని దుయ్యబట్టారు. ర్యాలీ అనంతరం కిషన్‌గంజ్‌కు వెళ్తారు అమిత్ షా. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, పార్టీ కార్యాలయాల బాధ్యులతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తారు. చదవండి: అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం! -
లాలూ అల్లుడి రగడ.. నితీశ్‌కు కొత్త తలనొప్పి
పాట్నా/గయ: బిహార్‌లో ఇటీవలే ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు శైలేష్ కుమార్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. లాలూ కుమార్తె, ఆర్జేడీ రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి భర్త ఈ శైలేష్ కుమార్. ఇటీవల లాలూ పెద్ద కుమారుడు, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ నేతృత్వంలో జరిగిన రెండు అధికారిక భేటీల్లో అతడు పాల్గొన్నట్లు వీడియో దృశ్యాలు, ఫొటోలు శుక్రవారం బయటకు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ తన అధికారిక విధులను బావ శైలేష్ ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చాడని బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ ఆరోపించారు. శైలేష్ నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాడని ఆక్షేపించారు. దీనిపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఆర్మీలో చేరాలనుకున్నా! కానీ.. -
బీజేపీ నాయకులకు సరైన సమయంలో బదులిస్తా
పట్నా: బిహార్‌లో మళ్లీ జంగిల్ రాజ్ వచ్చిందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించారు. బీజేపీ నాయకులకు సరైన సమాధానం ఇస్తానని అన్నారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో సమావేశం కావడంపై నితీశ్ స్పందించారు. ఆయనను తన పెద్దన్నగా భావిస్తానని చెప్పారు. మరోవైపు, బిహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్కూల్లోనే ఆమెను ప్రేమించాను.. లవ్‌స్టోరి సీక్రెట్ చెప్పిన తేజస్వీ
Tejashwi Yadav's Comments On Wife Rachel Godinho.. బీహార్‌లో అనూహ్య పరిస్థితుల మధ్య నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం, సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తేజస్వీ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన భార్య.. రాచెల్ గొడిన్హో(రాజ్ శ్రీ)తో ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తమది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన లవ్ ట్రాక్ గురించి తేజస్వీ యాదవ్.. తన తండ్రి లాలూ ప్రసాద్‌కు..‘ఈ(రాచెల్) అమ్మాయితో నేను డేటింగ్ చేస్తున్నాను. ఈమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాచెల్.. క్రిస్టియన్’ అని చెప్పాను. ఆ సమయంలో మా నాన్న(లాలూ ప్రసాద్) ఓకే, నో ప్రాబ్లమ్ అన్నట్టుగా తమ పెళ్లికి ఆమోదం తెలిపారంటూ తేజస్వీ చెప్పుకొచ్చారు. అలాగే.. తన భార్య రాచెల్ వివరాలు చెబుతూ.. హర్యానాలోని రేవారి జిల్లాకు చెందిన ఆమె.. తాను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో క్లాస్ మేట్ అని.. ఇద్దరి మధ్య ఏడేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిచిందన్నారు. ఇక, తమ పెళ్లి తర్వాత రాచెల్ హిందుత్వంలోకి మారిందని.. అప్పుడే తన పేరును రాజ్ శ్రీగా మార్చుకుందని జాతీయ మీడియాలో కథనాల్లో పేర్కొన్నారు. కాగా, లాలు, రబ్రీదేవి దంపతులకు తొమ్మిది మంది సంతానం ఉన్నారు. వారిలో తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్ అబ్బాయిలు కాగా, ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరందరిలో చిన్నవాడు తేజస్వీ యాదవ్. ఇక, తేజస్వీ యాదవ్ రాజకీయాల్లోకి రాకముందు క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే. -
లాలూ యాదవ్ కుమారుడి విచిత్రమైన అభ్యర్థన... తిరస్కరించిన పోలీసులు
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ తన తండ్రి ఆరోగం కోసం ప్రార్థించేందుకు మధురకు వచ్చారు. ఐతే అతని విచిత్రమైన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు. మధురలోని గిరిరాజ్ మహరాజ్ ఆలయంలో దేవాలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేయడానికి లేదా దర్శనం చేసుకువాడానికి భక్తులను కాలినడకనే అనుమతిస్తారు. అదీగాక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో వాహానాల ప్రవేశాన్ని నిషేధించారు. ఐతే తేజ్ ప్రతాప్ తాను పరిక్రమ(ప్రదక్షిణ) చేయడానికి కారుతో దేవాలయ ప్రాంగణంలోకి వెళ్తానంటూ విచిత్రంగా అభ్యర్థించాడు. పూర్ణిమ సందర్భంగా విచ్చేసిన భక్తుల రద్దీ దృష్ణ్యా అధికారులు తేజ్ప్రతాపప్కి అనుమతి నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన తేజ్‌ప్రతాప్ దేవాలంయంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తన కారుతో సహా దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించేలా అధికారిక అనుమతి కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు కూడా. ఐతే అక్కడ కూడా తేజ్ ప్రతాప్‌కి అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై పోలీస్ అధికారి మాట్లాడుతూ...ముదియ పూర్ణిమ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినందున, ప్రార్థనలు చేసేందుకైనా లేదా ప్రదక్షిణలు చేయడానికైన భక్తులను కాలినడకనే ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తాం. కానీ వాహనంతో సహా లోపలకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. అదీగాక ఆలయ ప్రధాన ద్వారం వద్ద పరిక్రమ(ప్రదక్షిణ) నిర్వహించడం ఇక్కడ ఒక ప్రామాణిక ఆచారం, శ్రీకృష్ణుని భక్తులు దీన్ని పవిత్రంగా భావిస్తారు అని చెప్పారు. (చదవండి: నిలకడగా లాలూ ఆరోగ్యం.. పరామర్శించిన నితీశ్, ఫోన్లో ప్రధాని మోదీ ఆరా) -
లాలూకు ప్రమాదం.. మెట్లపై నుంచి జారిపడ్డ ఆర్జేడీ చీఫ్
పట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. ఇంట్లో మెట్లు దిగుతుండగా ఆయన కాలుజారి పడిపోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో లాలూ భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నాయి. వీపుపై కుడా గాయమైనట్లు చెప్పాయి. 'లాలూ భుజంలో ఫ్రాక్చర్ అయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గాయమైన చోట వైద్యులు బ్యాండేజ్ చుట్టారు. కొన్ని మెడిసిన్స్ రాసి వెంటనే ఇంటికి పంపారు’ అని లాలూ కుటుంబంతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. రెండు నెలల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటినుంచి ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలోనే ఉంటున్నారు. లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 16 మంది మృతి లాలూ ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆదివారం అనుకోకుండా ఇంట్లోనే మెట్లపై నుంచి జారిపడి గాయపడ్డారు. వెంటనే కుటుంసభ్యులు లాలూను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. భుజం, వీపుపై కాస్త నొప్పి తప్ప.. లాలూకు ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి -
Munni Devi: ఇస్త్రీ చేసే మున్ని ఎంఎల్‌సి అయ్యింది
బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి జీవించే 40 ఏళ్ళ మున్నీ రజక్ ఎం.ఎల్.సి. అయ్యింది. అందుకు కారణం ఆమె గట్టిగా మాట్లాడగలగడం. పెద్దగా అరవగలగడం. లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొనే ర్యాలీల్లో ఆమె గొంతు చించుకుని నినాదాలు చేస్తుంది. ధర్నాల్లో ముందు వరుసలో కూచుని టీవీలకు బైట్లు ఇస్తుంది. ఎన్డిఏ గవర్నమెంట్‌ను విమర్శిస్తూ ధైర్యంగా పాటలు పాడుతుంది. ఇవన్నీ ఆర్.జె.డి నేత లాలూను మెప్పించాయి. ఆమెను నిజమైన కార్యకర్తగా గుర్తించి తమ పార్టీ తరఫున ఎం.ఎల్.సి.ని చేశాడు. 75 మంది సభ్యుల విధాన పరిషత్‌లో కూచోబోతున్న మున్నీ రాజకీయాల మురికిని కూడా వదలగొడతానంటోంది. కొన్ని ఘటనలు కొందరి మేలుకు జరుగుతాయి. 2019. జుడీషియల్ కస్టడీలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. బయటంతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు. రాంచీకి 300 కిలోమీటర్ల దూరం ఉన్న భక్తియార్‌పూర్‌లో అక్కడి రైల్వేస్టేషన్ పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని జీవించే మున్నీ అంత దూరం నుంచి రాంచీకి లాలూని చూడటానికి వచ్చింది. కాని సెక్యూరిటీ వాళ్లు ఆమెను లోపలకు వదల్లేదు. దాంతో ఆమె టీవీ కెమెరాల ముందు పెద్దపెద్దగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ‘నా దేవుడు లాలూని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తారా...’ అంటూ లాలూకు మద్దతుగా విపరీతంగా మాట్లాడింది. ఇది లాలూ కంట పడింది. ఆయన మెచ్చాడు. కట్ చేస్తే – భక్తియార్‌పూర్‌లో నడుచుకుంటూ వెళుతున్న మున్నీ పక్కనే మొన్నటి జూన్ మొదటి వారంలో ఒక జిప్సీ ఆగింది. ‘ఎక్కు’ అన్నారు అందులో ఉన్నవారు. బిహార్‌లో అధికారంలో ఉన్నది జె.డి.యు, బిజెపి అలెయెన్స్ ప్రభుత్వం. తాను ఆర్.జె.డి కార్యకర్త. పోలీసులు కాదుకదా అని భయపడింది. కాదు తమ పార్టీ వాళ్లే. అక్కడికి గంట దూరంలో ఉన్న పాట్నాలో రబ్రీదేవి బంగ్లాకు తీసుకెళ్లారు. లోపల రబ్రీ దేవి, పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ఉన్నారు. ‘లాలూగారు నిన్ను ఎం.ఎల్.సి చేయడానికి నిశ్చయించుకున్నారు’ అని వారు తెలిపితే మున్నీకి మాట రాలేదు. కృతజ్ఞతలు చెప్పి బయట పడింది. ఈ విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యింది. అయితే ‘అయినప్పుడు చూద్దాం’ అని కొందరు అనుకున్నారు. మరోవైపు పార్టీలో రజక వర్గానికే చెందిన మరొక నాయకుడు చురుగ్గా పని చేస్తున్నాడు. రజకులలో ఇవ్వాలనుకుంటే అతనికే ఇస్తారని ఊహించారు. కాని అంచనాలు తారుమారయ్యాయి. జూన్ 20న జరగనున్న ఎం.ఎల్.సి. ఎన్నికల్లో ఆర్.జె.డి. తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్. ముగ్గురు పిల్లల తల్లి మున్నీ ముగ్గురు పిల్లల తల్లి. భర్త అవదేశ్ రజక్ కూడా వృత్తి పనే చేస్తున్నాడు. వీరికి భక్తియార్‌పూర్‌లోని రైల్వేస్టేషన్ పక్కనే ఉండే ఇస్త్రీ బండి ఆధారం. అయితే గత పదేళ్లుగా మున్నీ ఆర్.జె.డి. కార్యకర్తగా మారింది. ఆమె పాటలు పాడగలదు. పార్టీ సభలకు స్టేజ్ మీద పాటలు పాడుతుంది. అంతేకాదు లోకల్ టీవీ చానల్స్‌లో ఆమె పార్టీ విధానాలకు పెద్ద పెద్దగా అరిచి చెప్తుంది. నితీష్ ప్రభుత్వాన్ని బాగా తిట్టి పోస్తుంది. ఇవన్నీ పార్టీని ఆకర్షించాయి. ‘అట్టడుగు స్థాయి కార్యకర్తలను లాలూ అభిమానిస్తారని చెప్పడానికి, ఆ స్థాయి వారికి కూడా పదవులు దక్కుతాయని చెప్పడానికి మున్నీ ఎంపిక ఒక ఉదాహరణ’ అని ఆర్.జె.డి. నేతలు అంటున్నారు. మున్నీ చాలా ఉత్సాహంగా పని చేయాలనుకుంటోంది. ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడేవాళ్లదే పైచేయి కాబట్టి విధాన పరిషత్‌లో ఆమె విమర్శలు అధికార పార్టీని ఇరుకున పెట్టడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు. మున్నీ రజక్ గురించి మున్ముందు మనం మరిన్ని విశేషాలు వినడంలో ఆశ్చర్యం లేదు. -
రాష్ట్రపతి ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్!
లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రపతి ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన కూడా చేశారు. జూన్ 15వ తేదీన నామినేషన్ పేపర్లు దాఖలు చేసేందుకు హస్తినకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయితే.. ఈయన ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(74) కాదు. బీహార్ రాజకీయాల్లో, ఎన్నికల్లొచ్చిన ప్రతీసారి తీవ్ర గందరగోళానికి కారణమయ్యే వ్యక్తి ఇతను. పేరు కూడా లాలూ ప్రసాద్ యాదవ్. సరన్ జిల్లా మరహౌరా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని రహీంపుర్ గ్రామవాసి. ఈ లాలూ ప్రసాద్ యాదవ్‌ను అంతా ముద్దుగా ‘కర్మభూమి’ అని పిలుస్తుంటారు. గతంలోనూ ఈయన రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగే ప్రయత్నం చేశారు. 2017లో నామినేషన్ పేపర్లు దాఖలు చేశారు. ఆ టైంలో బీహార్ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ మధ్య ప్రధాన పోటీ నడిచింది. అయితే ఆ టైంలో లాలూ పేరుని ప్రతిపాదించేంత మంది లేకపోవడంతో అది తిరస్కరణకు గురైంది. అందుకే ఈసారి పక్కగా సిద్ధమై ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నాడట. ఇక ఇంతకు ముందు ఎన్నో ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేశాడు. ఆ టైంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. అయితే అతనికి గెలుపు మాత్రం దక్కలేదు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికలలో తన భార్య రబ్రీదేవి ఓటమికి ఈ లాలూ కూడా ఓ కారణమంటూ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఆ విషయాన్నే సంబురంగా గుర్తు చేసుకుంటున్నాడు సరన్ జిల్లా వాసి లాలూ. ఇదిలా ఉంటే.. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ పంచాయితీ నుంచి ప్రెసిడెంట్ ఎన్నికల దాకా దేన్ని వదలకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడట. కనీసం రికార్డులతో అయినా తన పేరు పదిలపర్చుకోవాలని ఆరాట పడుతున్నాడు ఈ 42 ఏళ్ల రైతు. -
లాలూ ప్రసాద్ యాదవ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌లో పలామూ జిల్లాలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటున్న ఆయన గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎలాంటి అపాయం జరగలేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. జార్ఖండ్ పర్యటనలో భాగంగా లాలూ ప్రసాద్.. పలామూకు వెళ్లారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆయన స్థానిక అతిథి గృహంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం.. లాలూ టిఫిస్ చేస్తున్న సమయంలో గదిలోని ఫ్యాన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది లాలూను వెంటనే బయటకు తీసుకువచ్చారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి.. అనంతరం ఫ్యాన్‌ను తొలగించారు. లాలూకు ప్రమాదమేమీ జరగకపోవడంతో అధికారులు, పార్టీ కార్యకకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. #Ranchi: लालू प्रसाद यादव के कमरे में लगी आग, सर्किट हाउस में हादसे से बाल-बाल बचे RJD सुप्रीमो.@laluprasadrjd @RJDforIndia #RanchiNews #Jharkhand #JharkhandNews #RJD #LaluPrasadYadav pic.twitter.com/qS2N1VtiG4 — India Voice (@indiavoicenews) June 7, 2022 ఇది కూడా చదవండి: ఇక ‘చాన్సలర్’ మమత బెనర్జీ -
పార్టీ కార్యకర్తలను కొట్టిన మాజీ సీఎం భార్య.. వీడియో వైరల్
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సతీమణ రబ్రీ దేవీ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. ఏకంగా కార్యకర్తలపై చేయి చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను లాలూ కుటుంబ సభ్యులు భూములు, ప్రాపర్టీలను ముడుపులుగా తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలతో పాటు మరో 15 మంది ఇళ్లలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు సీబీఐ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. లాలూ ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని, అందులో భాగంగానే ఈ కేసులంటూ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో రబ్రీదేవి పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనల సందర్భంగా లాలూ ఇంటి వద్ద కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj — देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022 ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీలో కలకలం -
లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు శుక్రవారం జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసులో అరెస్టై శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. కాగా, లాలూ సీఎంగా ఉన్న సమయంలో 1990ల్లో బీహార్‌లో దాణా కుంభకోణం కేసు చోటుచేసుకుంది. ఈ కేసులో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్షతోపాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్లను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా..ఈ కేసులో ఐదేళ్ల పాటు శిక్ష పడిన లాలూ ఇప్పటికే 42 నెలలు జైలులో గడిపారు. ఇది చదవండి: బ్రిటన్ ప్రధానితో విదేశాంగ మంత్రి భేటీ -
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన్ను.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రియాటిన్ లెవల్ పడిపోవడంతో మెరుగైన ఆరోగ్యం కోసం లాలూను మంగళవారం ఎయిమ్స్‌కు తరలించాలని జైలు అధికారులకు రిఫర్ చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు మార్చి 11వ తేదీన కొట్టేసింది. 73 ఏళ్ల లాలూకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఆంబులెన్స్‌లో లాలూను ఎయిమ్స్‌కు తరలించే అవకాశం ఉంది. -
లాలూను రాంచిలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు
-
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల శిక్ష
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు జైలు శిక్ష ఖరారైంది. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court).. సోమవారం ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. సంచలనాత్మక దాణా కుంభకోణానికి(fodder scam) సంబంధించిన ఐదో కేసులోనూ ఆయన దోషిగా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దొరండా దాణా స్కామ్ కేసులో లాలూ యాదవ్ ను దోషిగా నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇవాళ జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది సీబీఐ కోర్టు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొత్తం 950 కోట్ల రూ. దాణా స్కామ్‌కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు రాగా.. దొరండా ట్రెజరీ కేసులో 139.35 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 99 మందిలో 24 మందిని నిర్ధోషులుగా విడుదల చేయగా.. 46 మందికి గతవారం సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష ఖారు చేసింది. 73 ఏళ్ల లాలూ.. దుమ్కా, దియోగర్, చాయ్‌బస ట్రెజరీల కేసులకు సంబంధించి.. 14 జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దొరండా ట్రెజరీ కేసు తీర్పు వెలువడేంత వరకు ఆయన బెయిల్‌పై బయటే ఉన్నారు.ఆపై అరోగ్య సమస్యలతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆరో కేసు బంకా ట్రెజరీకి సంబంధించింది ఇంకా విచారణ దశలోనే ఉంది. చదవండి: ఆర్జేడీ చీఫ్‌గా చిన్నకొడుకు తేజస్వి యాదవ్? లాలూ తీవ్ర వ్యాఖ్యలు -
తేజస్వికి పార్టీ పగ్గాలపై లాలూ తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ పగ్గాలు మారబోతున్నట్లు వస్తున్న కథనాలపై ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అలాంటి వార్తల్ని ప్రసారం చేసేవాళ్లను మూర్ఖులుగా ఆయన అభివర్ణించారు. ఆర్జేడీ జాతీయాధ్యక్షుడిగా లాలూ దిగిపోతున్నారని.. ఆ స్థానే చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్‌కు త్వరలో పగ్గాలు అప్పగించబోతున్నట్లు కొన్ని మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై లాలూను వివరణ కోరగా.. ఆయన స్పందించారు. ‘అలాంటి వార్తలు ఇచ్చేవాళ్లు మూర్ఖులు. పిచ్చోళ్లే అలాంటివి ప్రచారం చేస్తారు. ఏమైనా ఉంటే మేం చెప్తాం కదా’ అని న్యూఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తేజస్విని పార్టీ ప్రెసిడెంట్ చేయబోతున్నట్లు వస్తున్న కథనాలపై పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్ కూడా స్పందించాడు. ఆ కథనాల్ని కొట్టిపారేస్తూ.. తండ్రి లాలూనే పార్టీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఆర్జేడీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌కు లాలూ సతీమణి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్, పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే తేజస్విని పార్టీ చీఫ్‌గా ప్రకటిస్తారనే కథనాలు మొదలయ్యాయి. #WATCH | Delhi: "Those who run such news reports are fools. We will get to know whatever happens," says RJD chief Lalu Prasad Yadav when asked if Tejashwi Yadav will be made the national president of the party. (04.02.2022) pic.twitter.com/NYC5YiLzVm — ANI (@ANI) February 5, 2022 -
రోడ్లను తన బుగ్గలతో పోల్చిన మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన హేమమాలిని
Hema Malini Breaks Silence on MP Comments Comparing Roads to Her Cheeks: తన నియోజక వర్గంలోని రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గల మాదిరిగా ఉన్నాయంటూ రాజస్తాన్‌కు చెందిన మంత్రి రాజేంద్రసింగ్ గుదా ఝాంజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలో శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్ సైతం ఇదే తరహాలో అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో మంత్రులు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాందంటూ పలువురు సినీ, రాజకీయన ప్రముఖులు స్పందిస్తూ తప్పుబుడుతున్నారు. చదవండి: క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! తాజాగా మహారాష్ట్ర మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలపై నటి, ఎంపీ హేమమాలిని స్పందించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ఇలాగే అన్నారని గుర్తు చేశారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సంప్రదాయాన్ని లాలూ ప్రసాద్ మొదలు పెట్టారన్నారు ఆమె. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ సరైనవి కావని హేమమాలిని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్స్ చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ, గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. చదవండి: ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్ #WATCH "A trend of such statements was started by Lalu Ji years ago and many people have followed this trend. Such comments are not in a good taste," says BJP MP Hema Malini on Maharashtra minister Gulabrao Patil comparing roads to her cheeks pic.twitter.com/SJg5ZTrbMw — ANI (@ANI) December 20, 2021 ఇక మీ బుగ్గలపై కామెంట్ చేసినందుకు గులాబ్‌రావు పాటిల్‌ను క్షమాపణ కోరుతారా..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను ఆ వ్యాఖ్యలను పట్టించుకోనని హేమమాలిని స్పష్టంచేశారు. కాగ 2005లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రహదారిని త్వరలో నటి హేమమాలిని బుగ్గల మాదిరిగా మారుస్తామంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం చెలరేగడంతో ఆతర్వాత దీన్ని ఖండించారు. ఇక 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ప్రతాప్‌గఢ్‌జిల్లాలోని రోడ్లను హేమమాలినీ, మాధురీ దీక్షిత్ చెంపల మాదిరిగా నిర్మిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ ఆయనను పదవీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. -
లాలూ కుటుంబంలో శుభకార్యం.. సంబరాల్లో ఆర్జేడీ
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో శుభకార్యం జరగనున్నట్టు వార్తలు రావడంతో ఆర్జేడీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. లాలూ ప్రసాద్ చిన్న కుమారుడు, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తేజస్వి యాదవ్ గురువారం ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. అయితే పెళ్లి కూతురు ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. 'సగాయ్' (నిశ్చితార్థం) కోసం లాలూ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. లాలూ-రబ్రీల తొమ్మిది మంది సంతానంలో 32 ఏళ్ల తేజస్వి యాదవ్ ఆఖరివాడు. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ పెళ్లైన కొన్నిరోజులకే భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. తేజస్వి యాదవ్ పెళ్లి వార్తపై ఆర్జేడీ ఎమ్మెల్యే, ముఖ్య అధికార ప్రతినిధి భాయ్ వీరేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. లాలూ కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి తేజస్వి ఒక్కరే మిగిలారని ఆయన చెప్పారు. పెళ్లి తేదీ, వధువు ఎవరనే దాని గురించి ఆయన పెదవి విప్పలేదు. ‘నిశ్చితార్థం తర్వాత, గ్రాండ్ వెడ్డింగ్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. బిహార్ మొత్తం తన ప్రియమైన నాయకుడు సంతోషకరమైన క్షణంలో చేరాలని కోరుకుంటోంద’ని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి భయం నేపథ్యంలో నిరాడంబరంగా వివాహ వేడుకలు నిర్వహించాలని తేజస్వి కోరినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. (చదవండి: మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి) -
లాలు ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత
పట్న: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్‌ను శుక్రవారం ఎయిమ్స్ ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో చేర్పించామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన జ్వరంతో బాధపతున్నారని అయితే ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించిన పరీక్షలు చేయగా.. అన్ని పరీక్షల ఫలితాలు పాజిటివ్ రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. -
Lalu Prasad Yadav: కుల గణన చేయాల్సిందే
పట్నా(బిహార్): కేంద్ర ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించాలని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. కుల గణన తర్వాత మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉందని తేలితే ఆ మేరకు రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత దక్కాలని ఆయన అభిలషించారు. మొత్తం జనాభా కంటే ఈ వర్గాల జనాభా సగం కంటే ఎక్కువగా ఉంటే ఇప్పుడు అమలవుతోన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఆర్జేడీ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు. ‘ స్వాతంత్య్రం రాక ముందు నాటి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కోటాలను అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాం. వేర్వేరు సామాజిక వర్గాల తాజా జనాభాలను లెక్కించి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై నిర్ణయాలు తీసుకోవాలి. కుల గణన చేపట్టాలని తొలిసారిగా డిమాండ్ చేసింది నేనే. ఈ డిమాండ్‌ను పార్లమెంట్ వేదికగా గతంలోనే నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడున్న కోటా ప్రస్తుత అవసరాలకు సరిపోదు. రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు’ అని లాలూ వ్యాఖ్యానించారు. లాలూ చిన్న కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం కుల గణన అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ఇటీవల ప్రస్తావించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక త్వరలోనే బిహార్‌లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని లాలూ చెప్పారు. దాణా కుంభకోణం, తదితర కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తూ, మరి కొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెల్సిందే. అనారోగ్యం, మెరుగైన చికిత్స కారణాలతో బెయిల్ లభించడంతో ఈ ఏడాది జైలు నుంచి బయటికొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు. చదవండి: Farmers Protest: రైతు నిరసనలకు 300 రోజులు -
లాలూ, ములాయం భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌లు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. దీనిపై లాలూ ప్రసాద్ సమావేశపు ఫొటోలతో కూడిన ట్వీట్ చేశారు. అందులో ఆయన ‘దేశంలో మోస్ట్ సీనియర్ సోషలిస్టు మిత్రుడు ములాయం సింగ్‌ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాను. రైతులు, అసమానత, పేదరికం, నిరుద్యోగంపై పోరాడేం దుకు మాకు ఉమ్మడి భావాలున్నాయి’ అని పేర్కొ న్నారు. దేశంలో ఇప్పుడు సమానత, లౌకికత్వ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
లాలూ.. పుత్రోత్సాహం
పాట్నా: చాలా కాలం తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రాజకీయ యవనికపై ప్రత్యక్షమయ్యారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో నితీశ్ పాలన అనేక వైఫల్యాలతో నిండిం దంటూ నిప్పులు చెరిగారు. ఆర్జేడీకి తన కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలో మంచి భవిష్యత్ ఉంటుందని ఆశాభావం ప్రకటించారు. రాష్ట్రీయ జనతాదళ్ స్థాపించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఆయన మద్దతుదారులనుద్దేశించి ఢిల్లీలోని కూతురు నివాసం నుంచి మాట్లాడారు. ఓబీసీ కోటా కోసం తాను ఎంతగా కొట్లాడింది గుర్తు చేసుకున్నారు. ఆన్లైన్లో ఆయన ప్రసంగం వినేందుకు పలువురు నేతలు కార్యకర్తలు పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యలయానికి చేరకున్నారు. దాణా కుంభ కోణంలో జైలు శిక్ష, అనారోగ్యం, కుటుంబ సమస్యలు ఇటీవల కాలంలో లాలును కుంగదీశాయి. తాజా ప్రసంగంలో లాలూ మార్కు చమక్కులు లేకున్నా, ప్రత్యర్ధులపై విమర్శలు మాత్రం తగ్గలేదు. జీఎస్టీ, నోట్ల రద్దు, కరోనాతో ఆర్థిక సంక్షోభం వచ్చిందని, ఇలాంటి తరుణంలో కొందరు మతాన్ని రెచ్చగొట్టే యత్నాలు చేస్తున్నా రని పరోక్షంగా బీజేపీని దుయ్యబట్టారు. తన హయాన్ని జంగిల్‌రాజ్‌గా గతంలో అభివర్ణించ డాన్ని విమర్శిస్తూ, బలహీన వర్గాలు పదవులు చేపట్టడం నచ్చకే తమపై ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు. పీఎస్‌యూల ప్రైవేటీకరణను ప్రస్తావిస్తూ, రైల్వేలను కూడా ప్రైవేటీకరిస్తున్నారని, దీనివల్ల నిరుద్యోగిత మరింత పెరుగుతుందని ఆరోపించారు. ఇంధన ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరిగిందన్నారు. తన ప్రధాన ప్రత్యర్ధి నితీశ్‌పై లాలూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, కరోనా సమయంలో నిర్వహణ బాగాలేదని, రాష్ట్రంలో రోజుకు 4 హత్యలు జరగుతున్నాయని విమర్శించారు. లక్షలాది మంది ఉపాధిలేక వలసకూలీలుగా మారిపోతున్నారన్నారు. పుత్రోత్సాహం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడు సాధించిన విజయాలపై లాలూ మురిసిపోయారు. ఒంటిచేత్తో పార్టీకి మంచి విజయాన్నిచ్చాడని, తేజస్వి ఇంత చేయగలడని తానూహించలేదని చెప్పారు. తేజస్వీ నాయకత్వంలో పార్టీకి మంచి భవిష్యత్ ఉందన్నారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ, జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. తన పెద్ద కుమారుడిని సైతం లాలు ప్రశంసించారు. తాను ఐదుగురు పీఎంల ఎంపికలో కీలకపాత్ర పోషించానని గుర్తు చేసుకున్నారు. తాను జీవించిఉన్నానంటే తన భార్యా పిల్లలు చూపిన శ్రద్ధ కారణమన్నారు. త్వరలోనే తాను బీహార్‌లో పర్యటిస్తానని పార్టీ శ్రేణులకు చెప్పారు. -
దాణా కేసులో లాలూకు బెయిల్
రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు(73) జార్ఖండ్ హైకోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే సగం జైలు శిక్షను పూర్తి చేసుకోవడంతో న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెయిల్ మంజూరు చేశారు. పాస్‌పోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని, అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని లాలూను ఆదేశించారు. బెయిల్‌పై బయట ఉన్నంత కాలం చిరునామా, ఫోన్ నంబర్ మార్చొద్దని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఒక కేసుల్లో, అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన మరో కేసులో రూ.5 లక్షల చొప్పున జరిమానాలను డిపాజిట్ చేయాలని, రూ.లక్ష చొప్పున విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ లాలూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. లాలూ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సగం శిక్షా కాలం పూర్తిచేసుకోవడంతో బెయిల్‌కు అర్హుడేనని పేర్కొన్నారు. లాలూకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను సీబీఐ తరపు న్యాయవాది రాజీవ్ సిన్హా వ్యతిరేకించారు. అయినప్పటికీ బెయిల్ ఇవ్వడానికే న్యాయస్థానం మొగ్గుచూపింది. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో లాలూ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. లాంఛనాలన్నీ పూర్తయ్యాక సోమవారం విడుదలయ్యే అవకాశాలున్నాయని లాలూ తరఫు న్యాయవాది దేవర్షి మండల్ చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అధికారికంగా ఢిల్లీలోని తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా 39 నెలల 25 రోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. మరో మూడు కేసుల్లో గతంలోనే బెయిల్ దాణా కుంభకోణంలో(దుమ్కా ట్రెజరీ కేసు) లాలూ ప్రసాద్ యాదవ్‌కు 2018 మార్చి 24న రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 14 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఒక కేసులో రూ.60 లక్షలు, మరో కేసులో రూ.30 లక్షల జరిమానా విధించింది. 1990వ దశకంలో దాణా కొనుగోలు, పంపిణీకి సంబంధించి దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూతోపాటు ఇతరులపై కేసు నమోదయ్యింది. ఇదే దాణా కుంభకోణానికి సంబంధించిన దేవ్‌గఢ్, చైబాసా, డోరందా ట్రెజరీ కేసుల్లో ఆయనకు గతంలోనే బెయిల్ లభించింది. దుమ్కా ట్రెజరీ కేసులో కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. తమ పార్టీ అధినేత జైలు నుంచి విడుదల కానుండడంతో ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
మళ్లీ జంగిల్ రాజ్ దిశగా బిహార్?
సాక్షి, న్యూఢిల్లీ: అసలు జంగిల్ రాజ్ అంటే ఏంటి..? బిహార్ వెనకబాటుతనానికి జంగిల్‌రాజ్ కారణమా..? బిహార్‌లో జంగిల్ రాజ్ అంశం మళ్లీ తెరపైకి రావటానికి కారణం ఏంటి..? బిహార్‌లో పరిస్థితులు జంగిల్ రాజ్ దిశగా అడుగులు వేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నేరాలు, అవినీతి, శాంతి భద్రతల సమస్యలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న బిహార్‌లో మళ్లీ అదే అంశం తెరపైకి వస్తోంది. నేరాల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సాధారణం. అయితే తాజాగా పాలకపక్షంలోని నాయకులే ఇప్పుడు జంగిల్‌రాజ్ గానం వినిపించడం వివాదానికి కారణంగా మారుతోంది. అసలేంటి జంగిల్ రాజ్..? 1990 నుంచి 2005 వరకు బిహార్‌ను లాలూ ప్రసాద్–రబ్రీదేవి పాలించిన కాలాన్ని జంగిల్ రాజ్‌గా రాజకీయవర్గాలు అభివర్ణిస్తుంటాయి. జంగిల్‌రాజ్‌లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల మధ్య నేరపూరిత సంబంధాలు ఎక్కువగా ఉండేవి. అంతేగాక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డువచ్చే వారిని బహిరంగంగా బెదిరించడం, హింసాత్మకంగా వ్యవహరించడం ఒక ఫ్యాషన్‌గా కొనసాగేది. ఆ సమయంలో బిహార్ కిడ్నాప్‌లకు అడ్డాగా మారింది. రాష్ట్రంలోని వైద్యులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలను పట్టపగలే గ్యాంగ్‌లు కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు డబ్బులు చెల్లించిన తర్వాత కూడా బాధితులను నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. గతంలో చేసిన ఒక సర్వే ప్రకారం 1992 నుండి 2004 వరకు బిహార్‌లో 32,085 కిడ్నాప్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. లాలూ–రబ్రీ హయాంలో రాజకీయ హత్యలు పెద్ద ఎత్తున జరిగాయి. లాలూ అండతో ఆ సమయంలో సివాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన షాబుద్దీన్‌పై అనేక హత్యారోపణలు ఉన్నప్పటికీ, లాలూ ప్రసాద్ కారణంగా పోలీసులు కేసులు పెట్టేందుకు భయపడ్డారు. కిడ్నాప్‌లు, హత్యల నేపథ్యంలో చీకటి పడిన తర్వాత ఇంటి నుంచి బయటి రావాలంటే ప్రజలు వణికిపోయేవారు. బిహార్ పోలీసు గణాంకాల ప్రకారం కేవలం 2001–2005 మధ్య ఐదేళ్ళలో 18,189 హత్యలు జరిగాయంటే 1990 నుంచి 2000 మధ్య కాలంలో జంగిల్ రాజ్‌లో ఎన్ని హత్యలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదేగాక రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా, వాహనం కొన్నా స్థానిక గూండాలకు ‘రంగ్దారీ పన్ను’తప్పని సరిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే వారిని గూండాలు హత్య చేసేవారు. అసలు లాలూ–రబ్రీదేవి అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరగని నేరం అంటూ ఏదీ లేదు. అయితే లాలూ కుటుంబం అధికార పీఠానికి దూరమైన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. ఆర్జేడీని ఎదుర్కొనేందుకు జంగిల్ రాజ్‌ను ఉదహరిస్తూ బీజేపీ, జేడీయూలు ఎన్నికల్లో ప్రజల ముందు నిలబడి విజయం సాధిస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ జంగిల్ రాజ్ పేరు చర్చనీయాంశంగా మారింది. సీతామర్హి బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ ఇటీవల చేసిన ఒక ప్రకటన రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ప్రస్తుత నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలోనూ తన నియోజకవర్గం సీతామర్హిలో పెరుగుతున్న నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, 15 ఏళ్ల క్రితం జంగిల్ రాజ్ రాజ్యమేలిన విధంగా, ప్రస్తుతం బిహార్ జంగిల్ రాజ్ దిశగా అడుగులు వేస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరస్తులు పోలీసులకు ఏమాత్రం భయపడట్లేదని, ఈ కారణంగా సీతామార్హిలో రోజులో కనీసం మూడు నేర ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని, నేరాలను అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకొనే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని మిథిలేష్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. సాధారణంగా శాంతిభద్రతలను ఒక సమస్యగా ప్రతిపక్షం మారుస్తోంది. అయితే బిహార్‌లో స్వపక్షం నుంచే ఈ ప్రకటనలు రావడం రాజకీయంగా నితీష్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కేవలం మిథిలేష్ కుమార్ మాత్రమే కాకుండా నేరాలతో పాటు శాంతి భద్రతల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ సహా పలువురు నేతలు నితీష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేగాక నేర నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అవలంభిస్తున్న విధానాన్ని అనుసరించాలని కోరారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలంటూ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షం, అధికారపార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నాయకులు మాత్రం బిహార్‌లో జంగిల్ రాజ్ కాదు ఎంతో శాంతియుతంగా న్యాయమైన పాలన జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. గత 15 ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఏనాడూ రాలేదని నితీష్ మంత్రివర్గ సహచరుడు, జేడీయూ నేత అశోక్ చౌదరి వెల్లడించారు. మొత్తానికి బిహార్ అభివృద్ధికి జంగిల్ రాజ్ ఇమేజ్ ఏదో ఒక రూపంలో కచ్చితంగా అడ్డుపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మాజీ ముఖ్యమంత్రికి మళ్లీ నిరాశ
రాంచీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే బెయిల్ కోసం రాష్ట్రపతికి ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 50 వేల పోస్టుకార్డులు రాసి ‘మానవత దృక్పథంతో నా తండ్రిని విడుదల చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. మళ్లీ రెండు నెలల వరకు లాలుకు బెయిల్ లభించే అవకాశం లేదు. దాణా కుంభకోణం కేసులో అరెస్టయిన లాలు ప్రసాద్ యాదవ్ 2017 డిసెంబర్ నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శుక్రవారం ఆయన బెయిల్ పిటిషన్ రాగా హైకోర్టు నిరాకరించింది. రెండు నెలల తర్వాత బెయిల్ పిటిషన్ మళ్లీ వేయాలని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది. ఈ బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నా విడుదల చేసేందుకు న్యాయస్థానం అంగీకరించడం లేదు. అయితే లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న లాలును రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. కిడ్నీ 25 శాతం మాత్రమే పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానవతావాదంలో లాలును విడుదల చేయాలనే విజ్ఞప్తులు భారీగా వస్తున్నాయి. -
క్షీణిస్తున్న లాలూ ఆరోగ్యం
రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(72) ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో శనివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ వివిధ ఆరోగ్య సమస్యలతో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ‘ఆయనకు న్యుమోనియా సోకింది. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని నిర్ణయించాం. ఎయిమ్స్ నిపుణులను ఇప్పటికే సంప్రదించాం. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ నుంచి నివేదిక అందిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్తాం’ అని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ శనివారం సాయంత్రం తెలిపారు. అధికారులు, లాలూ కుటుంబసభ్యులు ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్సును ఏర్పాటు చేశారని కూడా ఆయన వెల్లడించారు. లాలూను ఢిల్లీకి తరలించేందుకు రాంచీ జైలు అధికారులు సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. లాలూ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసిన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి శుక్రవారం రాత్రి ఆయనను కలుసుకున్నారు. అనంతరం తేజస్వీ యాదవ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయి, తమ తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు సాయం అర్థించారు. రిమ్స్‌లో ఉండగా లాలూ జైలు నిబంధనలను అతిక్రమించారన్న కేసుపై జార్ఖండ్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో ఆస్పత్రి యంత్రాంగం, జైలు అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. -
విషమించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ కురవృద్దుడు ఇప్పటికే రాంచీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గతకొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గత మూడు రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది. జైలు అధికారుల సమాచారం మేరకు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, రబ్రీదేవి శుక్రవారం రాత్రి రాంచీ చేరుకుని ఆయన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి మెరుగైన ఆరోగ్యం అందించాలని తేజస్వీ యాదవ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌ను కోరారు. దీంతో వైద్యుల సూచనల మేరకు శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, మెరగైన వైద్యం కోసం ఢిల్లీ తరలిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లాలూ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనారోగ్య పరిస్థితుల కారణంగా లాలూకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుఫు న్యాయవాదులు పట్నా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. -
విషమంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణించినట్లు సమాచారం. ఈ మేరకు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ఆయన కిడ్నీ పనితీరు ఎప్పుడైనా పూర్తిగా క్షీణించొచ్చు. అది ఎప్పుడు అనేది ఊహించడం కష్టం. కానీ అది ఖచ్చితంగా జరగుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అందుకే నేను ఈ విషయం గురించి అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపాను. ఇప్పటికే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందటున్న ఆయనకు.. ఇప్పుడు కొత్తగా మూత్రపిండాల పనితీరు క్షీణిస్తుంది. ఇప్పటికే లాలూ డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిసింది. అందువల్ల ఆయన కిడ్నీల నితీరు క్రమంగా క్షీణించిందని' రిమ్స్ వైద్యుడు ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, లాలూకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు జనవరి 22కి వాయిదా వేసింది. చదవండి: (‘నాడు పవార్‌కు దక్కని ప్రధాని పదవి’) -
లాలూ ఆడియో క్లిప్ కలకలం
పట్నా: ఎన్డీఏకు చెందిన ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యత్నిస్తున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన ఆరోపణలు బిహార్‌లో సంచలనం సృష్టించాయి. నితీశ్ కుమార్ నూతన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా లాలూ ఎంఎల్ఏలను ప్రలోభపరుస్తున్నారని చెబుతూ సుశీల్ ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ ఆడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ పిర్పైంటి ఎంఎల్ఏ లలన్ కుమార్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ‘‘నిన్ను బాగా చూసుకుంటాం. స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయేందుకు సాయం చెయ్యి’’ అని లాలూ అంటున్నట్లు ఆడియోలో ఉంది. ఇందుకు ఎంఎల్ఏ బదులిస్తూ ఇందుకు చాలా ఇబ్బందులుంటాయని చెప్పగా, భయపడవద్దని, ఆర్జేడీ స్పీకర్ వస్తారని, ఇందుకుగాను తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి పదవి ఇస్తామని లాలూ చెబుతున్నట్లుంది. సుశీల్‌తో తాను ఉన్నప్పుడే లాలూ కాల్ చేశారని సదరు ఎంఎల్ఏ చెప్పారు. ప్రస్తుతం లాలూ పశుగ్రాసం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని బిహార్ డిప్యుటీ సీఎం తార్ కిశోర్ ప్రసాద్ చెప్పారు. ఈ ఆడియోక్లిప్‌పై ఆర్జేడీ ఏమీ వ్యాఖ్యానించలేదు. కానీ ఆ పార్టీ ఎంఎల్ఏ ముకేశ్ రోషన్ మాత్రం మార్చికల్లా నితీశ్ ప్రభుత్వం పడిపోయి, తేజస్వీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. మరోవైపు బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీఏకి చెందిన విజయ్ సిన్హా ఎన్నికయ్యారు. -
బిహార్‌లో లాలూ ఆడియో టేపుల కలకలం
పట్నా : బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆడియో టేపులు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలకు ఆర్జేడీ చీఫ్ లాలూ చేసిన ఫోన్ కాల్స్‌ను బీజేపీ బయటపెట్టింది. రాంచీ జైలు నుంచే బీజేపీ ఎమ్మెల్యేలకు 8051216302 నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ చేస్తున్నారంటూ బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఆరోపించారు. జైలులో ఉంటూ ఇలాంటి మురికి రాజకీయాలు చేయవద్దని సుశీల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో స్పీకర్ ఎన్నికల నేపథ్యంలో లాలూ ఫోన్ కాల్స్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇందులో ఆర్జేడీకి మద్దతు ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలతో లాలూ సంప్రదింపులు జరిపారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటే మంత్రి పదవి ఇస్తానంటూ లాలూ ఆఫర్ చేసిన ఆడియో క్లిప్‌లు బయటకువచ్చాయి. (నితీష్ కుమార్‌కు ఆర్జేడీ ఆఫర్ ) బీజేపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ..'స్పీకర్ ఎన్నికలకు హాజరు కావద్దు. కరోనా వచ్చిందని చెప్పండి. మీరు మాకు మద్దతు ఇస్తే మా నాయకుడు స్పీకర్ అవుతారు. అప్పుడు మీకు కావల్సిన పనులు జరిగిపోతాయి' అంటూ లాలూ ఆఫర్ చేశారు. పశుగ్రాసం అవినీతి కేసుల్లో అరెస్టు అయిన లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో శిక్షాకాలంలో ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడిపారు. ఈనెల ప్రారంభంలో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది. (బాధ్యతలు చేపట్టిన కాసేపటికే రాజీనామా) Lalu Yadav making telephone call (8051216302) from Ranchi to NDA MLAs & promising ministerial berths. When I telephoned, Lalu directly picked up.I said don’t do these dirty tricks from jail, you will not succeed. @News18Bihar @ABPNews @ANI @ZeeBiharNews — Sushil Kumar Modi (@SushilModi) November 24, 202 -
బిహార్‌లో నేరాలు తగ్గాయా, పెరిగాయా?
సాక్షి, న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీకి మూడ విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర శాంతి భద్రతల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ‘తిరిగి లాలూ ప్రసాద్ యాదవ్ గూండా రాజ్యం కావాలా? లేదా రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎంతో మెరగుపర్చిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం కావాలా?’ అంటూ నితీష్ కుమార్ పార్టీ అయినా జేడీయూతోపాటు దాని మిత్రపక్షమైన బీజేపీ తెగ ప్రచారం కొనసాగిస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్, తన భార్య రాబ్డీదేవీతో కలసి 1990 నుంచి 2005 సంవత్సరం వరకు బీహార్ రాష్ట్రాన్ని పాలించారు. ఆ తర్వాత 2005 నుంచి 2014లో కొన్ని నెలలు మినహా ఇప్పటి వరకు దాదాపు 15 ఏళ్లపాటు నితీష్ కుమార్ పాలించారు. మొదటి విడత ఎన్నికల ప్రచారంలో, ఆదివారమే ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారంలో, నవంబర్ ఏడవ తేదీన జరుగనున్నన మూడవ విడత ఎన్నికల ప్రచారానికి కూడా రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితే ప్రధానాంశం అయినందున నాటి లాలూ ప్రసాద్ హయాంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది ? నితీష్ కుమార్ హయాంలో పరిస్థితిలో మార్పు వచ్చిందా ? నిజంగా శాంతి భద్రతలు మెరగుపడిందా ? ‘నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో’ డేటాను పరిశీలించడం ద్వారా ఏది వాస్తవమో, ఏదవాస్తవమో, ఏ మేరకు వాస్తవమో సులభంగానే గ్రహించవచ్చు. 2018 సంవత్సరం దేశవ్యాప్తంగా నేరాల సరాసరి సగటు రేటు లక్ష జనాభాకు 300లకు పైగా ఉండగా, బీహార్‌లో నేరాల రేటు సగటు రేటు లక్ష జనాభాకు 222.1 శాతం మాత్రమే ఉందని నితీష్ కుమార్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలనే ప్రస్థావించింది. 2018 సంవత్సరానికి బీహార్‌లో ఐపీసీ, ఎస్ఎల్ఎల్ కింద మొత్తం 2,62,815 కేసులు నమోదయ్యాయి. ఇది లక్ష జనాభాకు 222.1 శాతం సగటని చెప్పడం కూడా సబబే. అదే 2016లో 1,89,696 కేసులు, 2017లో 2,36,055 కేసులు నమోదయ్యాయి. అధికారంలో ఏ ప్రభుత్వం ఉందనే అంశంతో సంబంధం లేకుండా 2001 సంవత్సరం నుంచి బీహార్‌లో ఏటేటా నమోదవుతున్న నేరాల సంఖ్య పెరగుతూనే వస్తోంది. నేరాల సంఖ్యలో బీహార్ దేశంలోనే 23వ స్థానంలో ఉందని నితీష్ ప్రభుత్వం చెప్పుకోవడం ఆత్మవంచనే అవుతుందని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. దేశం మొత్తంగా జరిగిన నేరాల్లో 5.2 శాతం నేరాలు ఒక్క బీహార్‌లో జరిగినవేనని, నేరాల సంఖ్య విషయంలో దేశంలో బీహార్ ఏడవ స్థానంలో ఉంది. లక్ష జనాభాతో పోల్చినప్పుడే అది 23వ స్థానంలో కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదైన నేరాలను మాత్రమే తాము పరిగణలోకి తీసుకున్నామని, ఎఫ్ఐఆర్ నమోదుకానీ కేసులను పరిగణలోకి తీసుకోలేదని స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సబ్ ఇనిస్పెక్టర్ ఉమేశ్ కుమార్ తెలిపారు. రేప్‌లు, కులులు, మతాల మధ్య జరిగే కలహాలు, భూముల వివాదాలపై ఎక్కువగా ఎఫ్ఐఆర్లు దాఖలు కావు. బీహార్‌లో 60 శాతం నేరాలు భూ తగాదాల కారణంగానే జరగుతాయి. ఈ తగాదాల కారణంగా బీహార్‌లో 2018 సంవత్సరంలో 1,016 మంది హత్యకు గురయ్యారు. వీటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే రాష్ట్రంలో జరిగిన హత్యలు 34.6 శాతం. ఇంకా దేశంలో ఎక్కడా లేనివిధంగా జల వివాదాల కారణంగా బీహార్‌లో 44 మంది హత్యకు గురయ్యారు. ఇక మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాల్లో కూడా దేశంలోనే బీహార్ 29వ స్థానంలో ఉందని చెప్పడం కూడా ఒక విధంగా వక్రీకరించడమేనని మీడియా విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. ఇందులో 33 రేప్‌లు, 23 కిడ్నాప్‌లు, 11 హత్యలు మాత్రమే పరిగణలోకి వచ్చాయి. వాస్తవానికి వీటి విషయంలో బీహార్ ఎనిమిదవ స్థానంలో ఉంది. వాస్తవానికి రేప్‌ల విషయంలో బీహార్ రెండో స్థానంలో, కిడ్నాప్‌ల విషయంలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. 2016 నాటి గణాంకాలతో పోలిస్తే గతేడాదికి 42 శాతం పెరిగాయి. అవే హత్యలు 20 శాతం పెరిగాయి. 2016లో 2,581 హత్యలు జరగ్గా, గతేడాది 3,138 హత్యలు జరిగాయి. అలాగే 2016తో పోలిస్తే గతేడిదాకి రేప్‌లు 44 శాతం పెరిగాయి. నితీష్ కుమార్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2005 నుంచి 2010 మధ్యనే బీహార్‌లో నేరాలు తగ్గాయని, ఆ తర్వాత పెరగుతూనే వచ్చాయని పట్నాలో సెక్యూరిటీ సంస్థ నడుపుతున్న ఆర్కే కాంత్ పేర్కొన్నారు. -
ఆటవిక రాజ్య యువరాజు
దర్భంగ/ముజఫర్‌పూర్/పట్నా: బిహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం బుధవారం విపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) లక్ష్యంగా సాగింది. ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌ను ‘ఆటవిక రాజ్య యువరాజు(జంగిల్‌రాజ్ కే యువరాజ్)’ అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. బిహార్ బీమారు రాష్ట్రంగా మారడానికి కారణమైన ఆర్జేడీకి మళ్లీ అధికారమిస్తే కరోనాతో పాటు మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలను ప్రధాని హెచ్చరించారు. ఆర్జేడీ చేసిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని ఎద్దేవా చేస్తూ.. ‘ప్రభుత్వ ఉద్యోగాల విషయం మర్చిపోండి. వాళ్లు గెలిస్తే ప్రైవేటు ఉద్యోగాలు కూడా పోతాయి. బలవంతపు వసూళ్లకు భయపడి కంపెనీలను మూసేసుకుంటారు. ఆ పార్టీకి ఇక్కడ కిడ్నాప్‌లపై కాపీరైట్ ఉంది’ అన్నారు. బిహార్‌ను దుష్పరిపాలన నుంచి సుపరిపాలన వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నడిపించారని ప్రశంసించారు. జేడీయూ నేత నితీశ్‌ను ‘ప్రస్తుత, భవిష్యత్ ముఖ్యమంత్రి’ అంటూ సంబోధించారు. నితీశ్ పాలనలో బిహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దర్భంగ సభలో మాట్లాడుతూ సీతామాత జన్మించిన మిథిలకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఇన్నాళ్లూ రామాలయ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని విమర్శించిన వారంతా.. ఇప్పుడు తప్పని సరై మా నిర్ణయానికి చప్పట్లు కొడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బిహార్ అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధుల వైపు రాష్ట్రాభివృద్ధిని కోరుకోని దురాశాపూరిత శక్తులు ఆశగా చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. లాలు ప్రసాద్, రబ్రీదేవీల ఆర్జేడీ పాలనలో చోటు చేసుకున్న కుల ఘర్షణలను ప్రధాని గుర్తు చేశారు. అబద్ధాలు, మోసం, గందరగోళంతో కూడిన విధానాలు వారివని ఆరోపించారు. ప్రతీ ప్రసంగం ప్రారంభంలో ప్రధాని స్థానిక మాండలికంలో మాట్లాడి, స్థానికులైన మహనీయులను గుర్తు చేసి సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దర్భంగలో మైథిలి కవి విద్యాపతిని గుర్తు చేశారు. -
లాలూకి బెయిల్.. నితీష్‌కు ఫేర్వల్
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. తొలి విడత పోలింగ్‌కి సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ రణరంగంలో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో పట్నా రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్ష నేత, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నితీష్ హయాంలో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయిందని, పేదరికం తాండవిస్తోందని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించి ఓ భారీ బహిరంగ సభలో తేజస్వీ ప్రసంగించారు. (మేనిఫెస్టోలు–‘ఉచితా’నుచితాలు) లాలూకి బెయిల్ తన తండ్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, నవంబర్ 9న జైలు నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి బయటకు వచ్చిన వెంటనే నితీష్ పదవి నుంచి దిగిపోక తప్పదని జోస్యం చెప్పారు. సీఎంకు ఇక ఫేర్వల్ ఇచ్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పశుదాణా కుంభకోణంలో అరెస్ట్ అయిన లాలూ ప్రసాద్.. ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఓ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ.. మరో కేసులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులోనూ బెయిల్ మంజూరు కావడంతో విడుదలకు సిద్ధమయ్యారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరగబోతుంది. నవంబర్ 3న రెండో, 7న చివరి విడత పోలింగ్.. 10న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 17 అంశాలతో మేనిఫెస్టో ఇక తొలి విడత పోలింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో తేజస్వీ మరింత దూకుడు పెంచారు. ఎన్నికల్లో కీలకమైన మేనిఫెస్టోని విడుదల చేశారు. మొత్తం 17 అంశాలతో కూడని మేనిఫెస్టోని విడుదల చేశారు. యువత, నిరుద్యోగులను ఆకర్శించే విధంగా వారిని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పది లక్షల ఉద్యోగాల నియామకానికి చర్యలు చేపడతామన్నారు. మెరుగైన ఆరోగ్య భీమాతో పాటు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నితీష్ కుమార్ తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. మరోసారి ప్రజలు మోసం చేయడానికి బీజేపీ-జేడీయూ నేతలు ఉచిత హామీలను ఇస్తున్నారని మండిపడ్డారు. కూటమికే మెజారిటీ మరోవైపు ఇప్పటివరకూ వచ్చిన సర్వేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్‌కుమారే ఇప్పటికీ మెరుగైన సీఎంగా జనం భావిస్తున్నారని చెబుతున్నాయి. ఆయన ప్రభ కాస్త తగ్గినా, కేంద్రంలో నరేంద్ర మోదీ సమర్థపాలన దానికి జవజీవాలు కల్పించిం దని, పర్యవసానంగా ఆ రెండు పార్టీల కూటమి మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని అంటున్నాయి. నవంబర్ 10న వెలువడే ఫలితాల్లో బిహారీలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. కరోనా అనంతరం తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి ఎన్నికలు గనుక దేశ వ్యాప్తంగా వీటిపై సహజంగానే ఆసక్తి నెలకొంది. -
లాలూకు బెయిల్ ఇచ్చారు కానీ..
-
లాలూకు బెయిల్.. అయినా జైలే
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చైబాసా ఖజానాకు సంబంధించిన కేసులో ఆయనకు ఊరట లభించింది. అయిదేళ్ల జైలు శిక్షలో సగం శిక్ష అనుభవించడంతో రూ.2 లక్ష ల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అవిభాజ్య బిహార్ సీఎంగా లాలూ ఉన్నప్పుడు చైబాసా ట్రెజరీ నుంచి తప్పుడు మార్గాల్లో రూ.33.67 కోట్లు విత్‌డ్రా చేసినందుకుగాను ఆయనకు జైలుశిక్ష పడింది. ఇప్పుడు బెయిల్ వచ్చినా లాలూ విడుదలయ్యే అవకాశాల్లేవు. ఎందుకంటే దాణా కుంభకోణంలోనే దుమ్కా ఖజానాకి సంబంధించిన మరో కేసులోనూ ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసులో రూ.3.13 కోట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి. అనారోగ్య కారణాలతో రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. దాణా కుంభకోణం 1992లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో రూ.950 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి. ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా దూరం లాలూప్రసాద్ యాదవ్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు 2018లో శిక్ష పడింది. దీంతో ఆయన తన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ వ్యవహారాలను అప్పగించారు. జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న లాలూ మరికొన్ని కేసుల్లో శిక్ష అనుభవిస్తూ ఉండడంతో ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రచా రానికి దూరంగా ఉండడం ఇదే తొలిసారి. -
ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే
దేశంలో మరో ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నా బిహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో విడత పోలింగ్ అనంతరం నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనుంది. దీంతో ఎన్నికల రణరంగంలోని దిగేందుకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. పొత్తులు, ప్రత్యర్థిపై ఎత్తులు వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధాన పార్టీలై బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీలో సీట్ల పంపకాలపై చర్చలు వేగవంతం చేశాయి. విజయలక్ష్యంగా అభ్యర్థుల వేటను ఆరంభించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు బిహార్‌లో బలమైన పునాదులు ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ అంతా జేడీయూ, ఆర్జేడీ మధ్య ఉండే అవకాశం ఉంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న అతిపెద్ద ఎన్నికల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకటికావడం గమనార్హం. (మోగిన బిహార్ ఎన్నికల నగారా) వెబ్‌స్పెషల్ : కరోనా లాంటి క్లిష్ట సమయంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాజకీయాల్లో ఆరితేరిన నేతలున్న బిహార్‌లో.. కేంద్ర ఎన్నికలు సంఘం ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది. ఆనాటి మౌర్యసామ్రాజ్యానికి రాజధాని వెలసిల్లిన పాటలీపుత్ర నగరం నేడు రాజకీయ వ్యహాలకు, ఎత్తుల పైఎత్తులకు కేంద్రంగా మారింది. దేశంలో తలపండిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న పోటీ కావడంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ (లోక్‌జన శక్తి పార్టీ) ఉమ్మడిగా బరిలోకి దిగుతుండగా.. గత మిత్రులు కాంగ్రెస్-ఆర్జేడీ మరోసారి జట్టుకట్టాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోవడంతో పాటు దాదాపు రెండు దశాబ్ధాల పాటు బిహార్ రాజకీయాలను ఏలిన లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం జైల్లో ఉండటం ఎన్డీయేకూటమికి కలిసొచ్చే అంశం. ఇక నితీష్ కుమార్ పాలనపై ప్రజల్లో నమ్మకం, జాతీయ స్థాయిలో ఆయనకున్న పలుకుబడితో పాటు బీజేపీ మద్దతు జేడీయూ మరింత బలం చేకూరుస్తోంది. లాలూ జైలు పాలవ్వడంతో పార్టీ బాధ్యతల్నిభుజానకెత్తుకున్న తేజస్వీ యాదవ్ గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవడంలో తేజస్వీ విఫలమయ్యారు. అంతేకాకుండా ఇద్దరు అన్నదవమ్ములు (తేజస్వీ-తేజ్ ప్రతాప్యాదవ్)ల మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. గత ఐదేళ్ల కాలంలో నితీష్ చేసిన అభివృద్ధి, బీజేపీతో ఉన్న సత్సంబంధాలు ఎన్డీయే కూటమికి దోహదపడే అవకాశం ఉంది. (రంగు మారిన పవన్ రాజకీయం) ఎన్డీయేకు సవాలే.. నితీష్‌కు కఠిన పరీక్ష మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోవడం, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం, నిరుద్యోగుల ఆక్రోశం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉన్నఫళంగా విధించిన లాక్డౌన్ కోట్లాదిమంది కార్మికులను నడిరోడ్డుపై నిలబెట్టింది. వేసవికాలంలో పొట్టచేతపట్టుకుని వేల కిలోమిటర్లు కార్మికులు నడిచిన తీరు దేశమంతా చూసింది. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం సైతం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర పోలీసులను తప్పుదోవ పట్టించి, బిహార్ పోలీసుల చేత విచారణ జరిపిస్తోందన్న విమర్శలూ వ్యక్తం అయ్యాయి. మరోవైపు సరిహద్దుల్లో గత మూడు నెలలుగా చైనా అక్రమణకు దిగుతోంది. గల్వాన్‌లోయలో 20 మంది సైనికులను పొట్టనబెట్టుకుంది. అయితే చైనాపై భారత పాలకులు సరైన రీతిలో స్పందించడంలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంతకుమించి బీజేపీ-ఆర్జేడీ-ఎల్జేపీ మధ్య కోల్డ్‌వార్ నేతలకు తలనొప్పిగా మారింది. ఎల్జేపీ చీప్ రామ్‌విలాస్ పాశ్వాన్ నితీష్‌పై పీకల్లోతు కోపంతో మండిపోతున్నారు. తమను కనీస భాగస్వామ్య పార్టీగా నితీష్ గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మూడు పార్టీల నడుమ సీట్ల పంపకం అనేది తేలని పంచాయితీగానే మిగిలిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్డీయే కూటమి ఈ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఏడాది చివరన జరిగే ఎన్నికల్లో సీఎం నితీష్ కూడా ఈ ఎన్నికలు కఠిన పరీక్షలాంటివని చెప్పకతప్పదు. (కేసీఆర్ తరువాత టీఆర్ఎస్ బాస్ ఎవరు..?) మోదీ, అమిత్ షాతో నితీష్ బంధం... 2003లో మరోసీనియర్ నేత శరద్ యాదవ్‌తో కలిసి నితీష్ కుమార్ జనతాదల్ (యూనైటెడ్) పార్టీని నెలకొల్పాడు. అయితే అప్పటి నుంచీ అది బీజేపీ మిత్రపక్షంగానే కొనసాగుతోంది. బీజేపీ మద్దతుతోనే నితీష్ సైతం సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. గతంతో పోలీస్తే నితీష్ సీఎం అయ్యాక బిహర్ రూపురేఖలు మారాయనే చెప్పొచు. ముఖ్యంగా నిరుద్యోగం, ఆకలి, అక్షరాస్యత, తాగునీరు వంటి అంశాల్లో రాష్ట్రం కొంత మెరుగుపడింది. వెనుకబడిన రాష్టంగా ముద్రపడ్డ బిహార్‌లో నితీష్ నాయకత్వం పరిశ్రమలకు పెద్ద పీఠ వేసింది. పదేళ్ల ఆర్జేడీ పాలనతో విసిగిన బిహార్ ప్రజలకు జేడీయూ పాలన కొత్త రుచులను చూపించింది. దీంతో నితీష్ నాయకత్వంపై ప్రజలకు ఓ బలమైన విశ్వాసం కలిగింది. బిహార్ రాజకీయాల్లో ఇక తమకు తిరుగులేదనే స్థాయికి బీజేపీ-జేడీయూ కూటమి చేరుకుంది. అంతేకాకుండా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరుఫున తానే ప్రధాని అభ్యర్థి అనేంతగా నితీష్ జాతీయ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్నారు. అయితే తమ సొంత పార్టీ అభ్యర్థిని కాదని భాగస్వామ్య పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని భావించిన కాషాయ దళ పెద్దలు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రే మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పరిణామం ఆ పార్టీ కురువృద్దుడు ఎల్కే అద్వానీతో పాటు మరికొంత మంది సీనియర్లుకు ఏమాత్రం రుచించలేదు. ఈ ప్రభావం జేడీయూ-బీజేపీ 17 ఏళ్ల స్నేహంపైనా పడింది. మోదీ అభ్యర్థిత్వాన్ని నితీష్ కుమార్ బహిరంగంగా వ్యతిరేకించారు. గోద్రా అల్లర్లతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఏంటని నిలదీశారు. మోదీని ముస్లింల నరహంతకుడిగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎన్డీయే కూటమి నుంచి వైదులుగుతున్నట్లు ప్రకటించారు. మా స్నేహం మూనాళ్ల ముచ్చటే.. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో ప్రస్తుతం 73 స్థానాలున్న అర్జేడీ ప్రతిపక్షంలో కూర్చింది. జేడీయూ(69), బీజేపీ (54), ఎల్జేపీ (2) మద్దతులో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏళ్ల నాటి బంధాన్ని వదులుకుని నితీష్ కుమార్ చిరకాల శత్రువు లాలూ ప్రసాద్ యాదవ్‌తో దొస్తీ కట్టారు. మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్-ఆర్జేడీ-జేడీయూ కలిసి పోటీచేసి విజయాన్ని అందుకున్నాయి. అయితే నితీష్-లాలూల స్నేహం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. డిప్యూటీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తేజ్ ప్రతావ్ యాదవ్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో మహాకూటమితో నితీష్ తెగదెంపలు చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతో తాను ప్రభుత్వాన్ని నడపలేనంటూ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన 24 గంటల్లోనే బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పీఠం ఎక్కారు. అయితే ఇదంతా బీజేపీ, జేడీయూ ఆడిన నాటకమని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శించాయి. నితీష్ తీరుపై అప్పట్లో జాతీయ స్థాయిలోనూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజా ఎన్నికల్లో మరోసారి పాత స్నేహం (బీజేపీ)తో నితీష్ బరిలో నిలిచారు. ధీటైన విపక్షం లేకపోవడంతో విజయవకాశాలు దాదాపు ఎన్డీయే కూటమికే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్జేడీ కొంతమేర పోటీ ఇచ్చినా.. కాంగ్రెస్ మాత్రం కేవలం ఉనికి కోసం కొట్లాడే పరిస్థితి కనిపిస్తోంది. 29 ఏళ్లకే లోక్‌సభకు ఎన్నిక లాలూ ప్రసాద్ యాదవ్ భారత కేంద్ర ప్రభుత్వములో ప్రస్తుత (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) రైల్వే శాఖా మంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ ఆధ్యక్షుడు. యాదవ్ ఏడు సంవత్సరముల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. గడచిన రెండు దశాబ్దాలలో బిహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభలమైన వ్యక్తి. లాలూ రాజకీయ జీవితానికి తొలి మెట్టు పాట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడము. జయ ప్రకాష్ నారాయణ్ వల్ల ప్రభావితమైన విద్యార్థుల ఉద్యమానికి 1970లో లాలూ నాయకత్వము వహించారు. ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి ఒక వినతి శాసనాన్ని అందించిన ధీశాలిగా నిలిచారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హా (ఛోటే సాబ్) 1977లో లాలూను లోక్‌సభ స్థానానికి పోటీ చేయించి, లాలూ తరపున ప్రచారము చేశాడు. ఫలితంగా 29 ఏళ్ల పిన్న వయస్సులోనే 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేవలము 10 సంవత్సరముల వ్యవధిలోనే లాలూ, బిహార్‌లో ఒక ఉజ్జ్వల శక్తిగా ఎదిగారు. 1989లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో లాలూ నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయపథాన నడిపించారు. 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు. జాతీయ నేత జైలు పాలు.. 1996లో బిహర్లో బయటపడిన రూ.950 కోట్ల పశుగ్రాస కుంభకోణం లాలూ రాజకీయ జీవితాన్ని మార్చివేసింది. పశుగ్రాస కుంభకోణానికి సంబంధించిన ఆరోపణల వల్ల లాలూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన స్థానములో సతీమణి రబ్రీ దేవిని ముఖ్యమంత్రిగా నియమించారు. అయితే అయితే ఈ దర్యాప్తును లాలూనే స్వయంగా విచారణకు ఆదేశించడము విశేషం. 1997లో లాలూ, జనతా దళ్ నుంచి విడిపోయి రాష్ట్రీయ జనతా దళ్ అనే సొంత పార్టీని స్థాపించారు. కేంద్ర మంత్రి అయిన తరువాత నష్టాల్లో నడుస్తున్న భారతీయ రైల్వేలను లాభాల దిశగా నడిపించిచటంలో ఉపయోగించిన విన్నూత యాజమాన్య పద్ధతులకు జాతీయ స్థాయిలో లాలూ ఖ్యాతిగడించారు. ఆసియా టైమ్స్ ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ లాలూ "ప్రపంచములోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఒక ఆవుల కాపరి కొడుకు ఇంతటి స్థాయికి ఎలా చేరుకోగలిగాడు అని ఆశ్చర్యమును, ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఉత్సుకత భారత ప్రజాస్వామ్య విజయానికి చిహ్నము" అని అన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత: నితీష్ దాదాపు 34 ఏళ్ల రాజకీయ జీవితం, అవినీతి మచ్చలేని మనిషి. పార్టీలు మారినా ప్రజల్లో తనకున్న ఫాలోయింగ్‌లో మాత్రం మార్పు రాలేదు. ఉన్నత కులాలకే ఉన్నత పదవులు అన్న మాటల్ని తిరగరాసి ఉన్నతమైన భావాలున్నవారందరికి అనిపించాడు. రౌడీలు రాజ్యమేలుతున్న బిహర్‌కు ఓ రాథోడ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కరెక్టుగా తెలిసిన రాజకీయ నాయకుడు నితిష్‌కుమార్. నితీష్‌పై జయప్రకాశ్ నారాయణ్, రామ్మనోహర్ లోహియా సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన 1971లో రాజకీయ రంగప్రవేశం చేసి, రామ్మనోహర్ లోహియా పార్టీ సంజీవాది యువజన్ సభలో చేరారు. 1974-1977 వరకు జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.1977లో తన (కుర్మీ) సామాజిక వర్గం బలంగా ఉన్న హర్నాత్ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఆ ఎన్నికల ద్వారా ఆయన ఓ గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1987 యువలోక్ దల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. రెండు సంవత్సరాల అనంతరం జనతా దల్ పార్టీ సెక్రటరీ జనరల్ ఎన్నికయ్యారు. 1994లో సమతా పార్టీ పేరిట సొంత పార్టీని స్థాపించారు. జనతాదల్ యునైటెడ్ ప్రారంభమైన తర్వాత సమతా పార్టీని అందులో విలీనం చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉండగా1998-1999 మధ్య కాలం కేంద్ర మంత్రిగా రైల్వేశాఖ, వ్యవసాయ శాఖల బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో మొదటి సారి బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన ఒక వారంలో నితీష్ తన పదవి కోల్పోవడం గమనార్హం. 2005లో బీజేపీతో పొత్తుపెట్టుకుని మరోసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2015లో లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌తో మహాకూటమి ఏర్పాటు చేశారు. 2016లో మహాకూటమితో తెగదింపెలు చేసుకుని పాత మిత్రుడైన బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ సహాయంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నితీష్ కుమార్ మొత్తం 13 ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1973లో మంజుకుమారీ సిన్హాన అనే ఉపాధ్యాయురాలిని వివాహమాడారు. వారికి నిశాంత్ అనే ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2007 సంవత్సరంలో నితిష్ తన భార్యను కోల్పోయారు. తను కుమారుడిని మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంచడం గమనార్హం. ఇక తాజా ఎన్నికల్లో చాణిక్యుడి చతురత.. వృద్ధనేత వ్యూహాలు ముందు ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో వేచిచూడాలి. -
లాలూకు షాకిచ్చిన ‘వియ్యంకుడు’!
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుటుంబంతో అన్ని బంధాలు తెగిపోయినట్లేనని ఆయన వియ్యంకుడు, పార్టీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ అన్నారు. అదే విధంగా ఆర్జేడీలో ఆత్మగౌరవంతో జీవించే వాళ్లకు చోటు లేదని.. పార్టీలో ఎవరికీ స్వేచ్చగా వ్యవహరించే హక్కు లేదని పేర్కొన్నారు. చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యా రాయ్ వివాహం.. లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌తో జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెళ్లైన కొన్నిరోజులకే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తనకు విడాకులు కావాలంటూ తేజ్‌ప్రతాప్ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన కుమార్తె ఐశ్వర్యను లాలూ భార్య రబ్రీదేవి సహా ఇతర కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేశారంటూ చంద్రికా రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. (‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’) ఈ క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రికా రాయ్.. ఆర్జేడీని వీడి జేడీయూలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆర్జేడీ నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరించిన చంద్రికా రాయ్.. గురువారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో రహస్యంగా భేటీ కావడం బిహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంతో సమావేశమైన అనంతరం చంద్రికా రాయ్ మీడియాతో మాట్లాడుతూ... ఆర్జేడీ తీరుపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా... నితీశ్ కుమార్ దార్శినికత గల ముఖ్యమంత్రి అని, ఆయన హయాంలో బిహార్ అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు.(మేం తీసుకోం.. పబ్లిసిటీ కోసం చిల్లర చేష్టలు) కాగా పార్సా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రికా రాయ్ ఆర్జేడీని వీడినట్లయితే యాదవ్ సామాజిక ఓట్లు భారీగానే చీలిపోతాయంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక చంద్రికా రాయ్ గతంలో నితీశ్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ఆర్జేడీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా... జేడీయూ ఉపాధ్యక్షుడిగా పనిచేసి బహిష్కరణకు గురైన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫిబ్రవరి 18న తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలపడంతో బిహార్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. -
లాలు ఇంట్లో దయ్యాలు!
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సీఎం తన అధికార నివాసాన్ని వదిలి వెళ్లేముందు అక్కడ దయ్యాలను వదిలేశారా? తన తరువాత ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లక్ష్యంగా లాలు ఆ పని చేశారా? అంటే అవుననే అంటున్నారు నితీశ్ కుమార్. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక అనధికార కార్యక్రమంలో ఈ విషయాలను నితీశ్ కుమార్ పంచుకున్నారు. 2005లో ఆర్జేడీ అధికారం కోల్పోయాక, నితీశ్ లాలు కుటుంబం నివాసం ఉన్న 1, అన్నేమార్గ్ భవనంలోకి మారారు. విశాలంగా ఉన్న ఆ ఇంటి వెనక భాగంలో తనకు పెద్ద పెద్ద మట్టికుప్పలు కనిపించాయని, ఇంటి నలుమూలల్లో కొన్ని కాగితపు కవర్లు కనిపించాయని నితీశ్ గుర్తు చేసుకున్నారు. నీ కోసం కొన్ని దయ్యాలను ఆ ఇంట్లో వదిలి వచ్చానని ఆ తరువాత ఒక సందర్భంలో లాలు ప్రసాద్ యాదవ్ స్వయంగా నితీశ్‌తో చెప్పారట. అయితే, ఆ మాటలను లాలు తనదైన స్టైల్లో సరదాగానే అన్నారని నితీశ్ పేర్కొన్నారు. అయితే, నితీశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బిహార్‌లో సంచలనం సృష్టించాయి. నితీశ్ గతంలో లాలుకు నష్టం కలిగించే ఉద్దేశంతో పట్నాలోని కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారని గురువారం ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానందతివారీ ఆరోపించారు. ఆ పూజలు చేసిన పూజారులు ఈ విషయాన్ని లాలుకు చెప్పారని, దాంతో లాలు ఆ ప్రభావం తనపై పడకుండా వేరే పూజలు చేశారని తివారీ వివరించారు. ఈ విషయం తనకు లాలునే చెప్పారన్నారు. కాగా, మూఢనమ్మకాలను, మంత్రతంత్రాలను లాలు విశ్వసిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో నితీశ్‌కు అలాంటి నమ్మకాలేవీ లేవని ప్రచారముంది. -
బీహార్ మాజీ సీఎంకు అనారోగ్యం
రాంచీ : ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (71) అనారోగ్యం బారినపడ్డారు. ఆయన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని రాజేందర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు తెలిపారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్ చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి సీనియర్ డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ శనివారం వెల్లడించారు. షుగర్, బీపీ స్థాయుల్లో కూడా నిలకడ లోపించిందని తెలిపారు. -
నేనింతే: కృష్ణుడిగా మరోసారి...!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా ఆయన మురళీధరుడి వేషం ధరించారు. అనంతరం తన నివాసంలో మరికొంత మంది నటులతో కలిసి శ్రీకృష్ణుడి లీలామృతాన్ని ప్రదర్శిస్తూ.. వేణుగానం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. తేజ్ ప్రతాప్ ఇలాంటి వేషాలు ధరించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన శివుడు, కృష్ణుడి వేషధారణలో అనేకమార్లు కనిపించారు. కాగా కొన్ని రోజుల క్రితం విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన భార్య ఐశ్యర్యారాయ్‌తో కలిసి ఉండలేనని, తామిద్దరం ఉత్తరదక్షిణ ధృవాల వంటి వాళ్లమని తెలిపారు. విడాకుల విషయంలో తన కుటుంబ సభ్యులే తనకు వ్యతిరేకంగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేసి కొన్నాళ్లు అఙ్ఞాతంలోకి కూడా వెళ్లారు. ఈ క్రమంలో పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు విచారణలో భాగంగా తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య... ఆయనకు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయి తనను వేధించేవాడని సంచలన విషయాలు తెలిపారు. భర్త మత్తుకు బానిస అన్న విషయం పెళ్లయిన కొత్తలోనే తనకు తెలిసిందని, డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆయన తనను తాను శివుడి అవతారంగా చెప్పుకొనేవాడని ఆమె పేర్కొన్నారు. ‘తేజ్ శ్రీకృష్ణుడిగా, రాధగా దుస్తులు ధరించేవాడు. పెళ్లయిన కొద్దిరోజులకే అతను దేవతలుగా, దేవుళ్లుగా దుస్తులు ధరిస్తాడని తెలుసుకొని షాక్ అయ్యాను. ఒకసారి డ్రగ్స్ మత్తులో అతను గాగ్రా, చోలీ ధరించి.. మేకప్ వేసుకొని, విగ్గు పెట్టుకొని రాధగా తయారయ్యాడు’ అని ఐశ్వర్య వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహిళలపై గృహ నిరోధ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టులో ఆమె అభ్యర్థన దాఖలు చేశారు. అయినప్పటికీ తేజ్ ప్రతాప్ మాత్రం తనదైన శైలిలో మరోసారి కృష్ణుడి వేషం ధరించి..నాటకం ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక జైళ్లో ఉన్న లాలూకు తేజ్ వ్యవహారం తలనొప్పిగా మారింది. అంతేగాకుండా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర ఓటమి పాలవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయాయి. -
గరీబ్‌రథ్ రైళ్లను ఆపే ప్రసక్తే లేదు..!
న్యూఢిల్లీ : గరీబ్‌రథ్ రైల్వే సేవలు రద్దవుతున్నాయంటూ మీడియాలో వస్తున్న కథనాలను రైల్వే శాఖ కొట్టిపారేసింది. ఇప్పటికే ఖతోగడాం-జమ్ము, ఖతోగడాం- కాన్పూర్ గరీబ్రత్ సేవలకు బదులుగా ఎక్స్‌ప్రెస్ ట్రేన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే గరీబ్ రథ్‌లను 3 టైర్ ఏసీలుగా మారుస్తున్నారంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని రైల్వే అధికారుల స్పష్టం చేశారు. కానీ భవిష్యత్తులో ఈ విషయమై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇక కొత్త కోచ్‌ల తయారీ పట్ల కేంద్ర ప్రభుత్వం విముఖంగా ఉందని, పదేళ్ల పైబడిన రైళ్ల వల్ల నాణ్యతను పెంచడానికి విపరీతంగా ఖర్చవుతున్నట్లు రైల్వే అధికారుల చెబుతున్నారు. కాగా గతంలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పేద ,మద్య తరగతి ప్రజల కోసం గరీబ్ రథ్‌ను ప్రారంభించినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇక మొదటి గరీబ్ రథ్ బీహార్ నుంచి పంజాబ్ వరకు సేవలు అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుత దేశవ్యాప్తంగా 26 గరీబ్‌రథ్ రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. కాగా తొలినాళ్లలో ఈ ఢిల్లీ- బాంద్రా రైలు టికెట్ ధర 1050 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1500గా ఉంది. ఈ క్రమంలో గరీబ్ రథ్ సేవలు రద్దు చేసినట్లయితే ప్రయాణం భారమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పశుగ్రాస స్కాంలో లాలూకు ఊరట
రాంచీ : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు దియోగఢ్ ట్రెజరీకి సంబంధించిన పశుగ్రాస కుంభకోణంలో జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ కోసం లాలూ అప్పీళ్లను కోర్టు పలుమార్లు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో జూన్ 13న ఆర్జేడీ చీఫ్ లాలూ జార్ఖండ్ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు సైతం లాలూ ప్రసాద్ బెయిల్ వినతిని తిరస్కరించింది. లాలూ బెయిల్‌పై స్పందించాలని కోర్టు సీబీఐని కోరగా, లాలూకు బెయిల్ ఇవ్వడం తగదని సీబీఐ తీవ్రంగా ఆక్షేపించింది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూకు న్యాయస్ధానం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీవ్ర అస్వస్ధతతో బాధపడుతున్న లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దియోగఢ్ ట్రెజరీ పశుగ్రాస కేసులో లాలూకు బెయిల్ లభించినా ఇదే స్కామ్‌కు సంబంధించి మరో కేసులో విచారణ న్యాయస్ధానంలో పెండింగ్‌లో ఉండటంతో లాలూ జైలులోనే గడపాల్సిన పరిస్ధితి నెలకొంది. -
హైకోర్టులో లాలూ బెయిల్ పిటిషన్
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్ కోరుతూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఇప్పటికే సగం శిక్షను అనుభవించిన కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన అప్పీల్ చేశారు. దియోగర్ ట్రెజరీ విత్‌డ్రాయల్స్‌లో 90లక్షల రూపాయల మేర అవినీతి పాల్పడిన కేసులో లాలూకు 2017 డిసెంబర్లో సీబీఐ కోర్టు 42 నెలలు జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా విధించింది. కాగా, దాణా కుంభకోణం కేసులో భాగంగా బిర్సాముండా సెంట్రల్ జైలులో లాలూ శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ బెయిల్ పిటిషన్‌పై అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, సీబీఐ న్యాయవాది రాజీవ్ సిన్హా స్పందిస్తూ పిటిషన్ అందిందని చెప్పారు. -
నా ఆయుష్షు కూడా పోసుకుని..
పట్నా : ‘ప్రాణ సమానులు, గౌరవనీయులైన శ్రీ లాలూ ప్రసాద్ గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు. నా ఆయుష్షు కూడా పోసుకుని మీరు కలకాలం వర్ధిల్లాలి’ అని బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి తన భర్త, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాలూతో కలిసి దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ 1948, జూన్ 11న బిహార్‌లో జన్మించారు. 1973లో రబ్రీదేవిని వివాహమాడిన ఆయనకు.. ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని స్థాపించిన లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా, రైల్వే శాఖమంత్రిగా, ఎంపీగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొన్న లాలూ.. ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానమైనా దక్కించుకోగా.. స్థానిక పార్టీ అయిన ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు లాలూ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు బిర్సా ముండా జైలులో లాలూను కలిసినట్లు సమాచారం. प्राणप्रिय आदरणीय श्री @laluprasadrjd जी को 72वें अवतरण दिवस की अनंत बधाईयाँ। आपको हमारी भी उम्र लग जावे। pic.twitter.com/rqwuawj3sx — Rabri Devi (@RabriDeviRJD) June 11, 2019 -
‘సీఎంలు, పీఎంలు వస్తూంటారు..పోతూంటారు’
రాంచీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం ఆత్మహత్యా సదృశ్యం వంటిదేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే కాక సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలన్నింటికీ ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్‌తో మాట్లాడిన లాలూ ప్రసాద్ యాదవ్.. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయానికి విపక్షాల మూకుమ్మడి వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. వ్యూహాత్మక తప్పిదాలు, చర్యల వల్లే బీజేపీని నిలువరించలేకపోయామని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తమ ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటించకుండా పెద్ద తప్పు చేశామన్నారు. వరుడు లేకుండానే పెళ్లి బారాత్ నిర్వహించినట్లుగా తమ పరిస్థితి తయారైందన్నారు. రాహులే కరెక్ట్ ‘ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుపట్టడంలో ప్రాంతీయ పార్టీల తప్పేమీ లేదు. అయితే తమకంటూ నాయకుడు లేకుండా ముందుకు వెళ్లడం ద్వారా మహాఘట్బంధన్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయింది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ముందుగానే ప్రకటించాల్సింది. కాంగ్రెస్ అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించింది. ప్రజల సమస్యలను తీర్చేందుకు తగిన పరిష్కారాలు సూచించింది. కానీ కొన్ని తప్పిదాల వల్ల మేనిఫెస్టో ప్రజలకు చేరువకాలేకపోయింది అని లాలూ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. సిద్ధాంతాల మధ్య పోరాటమిది.. ‘ ఈ ఎన్నికలు.. నరేంద్ర మోదీతో... మమతా దీదీకో లేదా మాయావతి, అఖిలేశ్, తేజస్వీకో మధ్య యుద్ధం కాదు. ఇది ఫాసిస్టు సిద్ధాంతాలు- నిరుద్యోగ యువత, అసంతృప్త రైతులు, వెనుకబడిన వర్గాల మధ్య యుద్ధం. అయినా ప్రధానులు, ముఖ్యమంత్రులు వస్తూంటారు. పోతూంటారు. అధికారం కాదు..కేవలం ప్రజలు, జాతి మాత్రమే శాశ్వతం. అయితే అన్ని విభాగాల్లో విఫలమైన ప్రభుత్వానికి ఇంతటి మెజారిటీ ఎలా వచ్చిందోనన్న విషయం గురించి నాకు అంతుబట్టడం లేదు అని లాలూ పేర్కొన్నారు. -
రెండు రోజుల తర్వాత భోంచేసిన లాలూ
రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్థాపానికి లోనై.. భోజనం కూడా మానేశారు. రెండు రోజుల పాటు లాలూ ఆహారం తీసుకోలేదు. దాంతో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. ఇది ఇలానే కొనసాగితే.. ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం చేయాల్పిందిగా లాలూను కోరారు. చివరకు రెండు రోజుల తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం లాలూ భోజనం చేశారు. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ‘లాలూకు బీపీ, షూగర్‌తో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. అలాంటిది రోజుల తరబడి భోజనం చేయడం మానేస్తే.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. దాంతో ఆయనను కన్వీన్స్ చేసి భోం చేయాల్సిందిగా ఒప్పించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంద’ని తెలిపారు. పశుగ్రాస కుంభకోణం కేసులో భాగంగా లాలూ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్ - ఆర్జేడీ కూటమిగా ఏర్పడి.. ఎన్డీఏను ఎదుర్కొని ఘోర పరాజయాన్ని చవి చూశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితం కాగా.. ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ.. 39 చోట్ల విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసింది. -
ఓటమి షాక్‌తో ఆహారం ముట్టని దిగ్గజ నేత..
రాంచీ : లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఒక్క సీటు కూడా ఆర్జేడీ దక్కించుకోకపోవడంతో ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర మనస్ధాపానికి లోనయ్యారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ఆహారం తీసుకోవడం లేదని రాంచీలోని రిమ్స్‌లో లాలూకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన దినచర్య గాడితప్పిందని వారు తెలిపారు. పశుగ్రాస కుంభకోణంలో లాలూ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచిలాలూ ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదని ఆయనను పర్యవేక్షించే వైద్యుడు ఉమేష్ ప్రసాద్ చెప్పారు. మందులు, ఇన్సులిన్ ఇచ్చేందుకు సహకరిస్తూ ఆయనను ఆహారం సవ్యంగా తీసుకోవాలని తాము కోరుతున్నామని అన్నారు.బిహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడి కూటమిగా ఎన్డీయేను ఎదుర్కోగా కాంగ్రెస్‌కు కేవలం ఒక స్ధానం దక్కగా, ఆర్జేడీ ఒక్క స్ధానంలోనూ గెలుపొందలేదు. రాష్ట్రంలోని 40 స్ధానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్ధానాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రణాళికలు రూపొందించుకోవచ్చని లాలూకు ఆర్జేడీ నేతలు సర్ధిచెబుతున్నా ఆర్జేడీ చీఫ్ మాత్రం ఫలితాల షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
మిస్ యూ నాన్నా..నువ్వు లేనందు వల్లే
పట్నా : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం దొరకని కారణంగా తండ్రిని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. బిహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి మహాఘట్ బంధన్ పేరిట కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాహుల్ గాంధీ తమ పార్టీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాతో కలిసి పాటలీపుత్రలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ కూడా హాజరయ్యారు. అయితే తేజ్ ప్రతాప్‌కు మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన తేజ్ ప్రతాప్.. ‘ మా నాన్న గారు నాతో పాటు లేకపోవడం వల్ల ఈరోజు మాట్లాడేందుకు నాకు అవకాశం దొరకలేదు. మిస్ యూ పప్పా’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం గురించి తేజస్వీని ప్రశ్నించగా తనకు తెలియదన్నారు. సమయం లేకపోవడం వల్లే బహుశా తన సోదరుడికి అవకాశం రాకపోయి ఉండవచ్చునన్నారు. కాగా గత కొంత కాలంగా తేజ్ ప్రతాప్, తేజస్వీల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ఇటీవలే ఆర్జేడీ విద్యార్థి విభాగం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా లాలూ- రబ్రీ మోర్చా పేరిట సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. భార్య ఐశ్వర్యా రాయ్‌తో విడాకుల విషయంలో కూడా కుటుంబ సభ్యులతో తేజ్ ప్రతాప్ విభేదించారు. ఇక లాలూ ప్రసాద్ ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. मेरे आदरणीय पिता के अनुपस्थिति की वजह से मुझे आज बोलने नहीँ दिया गया।#IMissYouPapa😭😭 pic.twitter.com/w5F6uIzckb — Tej Pratap Yadav (@TejYadav14) May 16, 2019 -
సమోసామే ఆలు, బిహార్‌మే లాలూ కా బేటా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు, తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ’ గత బిహార్ ఎన్నికల సందర్బంగా ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చిన నినాదం ఇది. ఈ నినాదం ప్రభావం ఏమేరకు ఉందో చెప్పలేంగానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు ‘మహా కూటమి’గా ఏర్పాటై విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతకుముందు, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లను, మిత్రపక్షాలతో కలుపుకొని 40కి 31 సీట్లను గెలుచుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఏడాదిలోనే జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషమే. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి రాంరాం పలికిన జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తన ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు 29 ఏళ్ల తేజశ్వి యాదవ్ జోక్యం పెరిగిన కారణంగా తాను బీజేపీతో చేతులు కలపాల్సి వచ్చిందని నితీష్ కుమార్ చెబుతూ వచ్చారు. కానీ ఒకప్పుడు విలువల ప్రాతిపదిక బీజేపీతో తెగతెంపులు చేసుకొని, ప్రధాని అభ్యర్థిగా అన్ని విధాల తగిన వ్యక్తంటూ పేరుతెచ్చుకున్న వ్యక్తి, బీజేపీతో చేతులు కలపడం ద్వారా పేరును కాస్త చెడగొట్టుకున్నారు. ఒకప్పటిలాగా రాజకీయ చక్రం తిప్పేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ అందుబాటులో లేరు. ఆయన పశుదాణా కేసులో శిక్షపడి జైల్లో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. అఫ్కోర్స్, శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల ప్రచారం చేయరాదు.. అదే వేరే విషయం. ‘అంతబాగా మాట్లాడేవారు ఎవరూ లేరు. అంత శక్తి సామర్థ్యాలు కూడా ఎవరికి లేవు. ఆయన్ని మిస్సవుతున్నాం. ఆయనకు కావాలనే బెయిల్ ఇవ్వడం లేదు. ఆయన, నేను ఎన్నికల పనులను పంచుకొని ప్రచారం చేసినట్లయితే పూర్తిగా ఊడ్చేసేవాళ్లం’ అని తేజశ్వి యాదవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి స్టార్ ప్రచారకార్త తేజశ్వియే. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ సీట్లు ఉండడం వల్ల మీడియా తన దృష్టిని అంతా అక్కడనే కేంద్రీకరిస్తోంది. కానీ 40 సీట్లు కలిగిన బిహార్‌పైన కూడా దృష్టిని పెట్టాల్సి ఉంది. లాలూ లేకపోయినా తేజశ్వి నాయకత్వంలో 30 సీట్లను సాధిస్తామని కూటమి వర్గాలు ఆశిస్తున్నాయి. ‘జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు, తబ్ తక్ రహేగా బిహార్‌పై లాలూ కా బేఠా’ అని వారు సరికొత్తగా నినదిస్తున్నారు. -
దాగుడుమూతలు ఆడుతున్నారు
ముజఫర్‌పూర్: ప్రతిపక్ష పార్టీలు తొలుత ‘ప్రధాని ఎవరవుతారు?’ అనే ఆట ఆడాయనీ, నాలుగో దశ ఎన్నికల తర్వాత వారు దాగుడుమూతల ఆట ఆడుకుంటున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టలేని బలహీనమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం పనిచేస్తోందని మోదీ అన్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్, యూపీలోని బారాబంకిలో మోదీ మంగళవారం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైనన్ని సీట్లలో కూడా పోటీ చేయని పార్టీలు సైతం తమ వాడు ప్రధాని కావాలని కోరుకుంటున్నాయని మోదీ ఎగతాళి చేశారు. జైలులో ఉన్నవారు లేదా జైలుకు వెళ్లబోయేవారు ఢిల్లీలో బలమైన ప్రభుత్వాన్ని సహించలేరని మోదీ పేర్కొన్నారు. అందుకే వారికి బలహీన, వదులుగా ముడివేయబడిన, నిస్సహాయ, తాము చెప్పినట్లు చేసే ప్రభుత్వం కావాలని మోదీ దుయ్యబట్టారు. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే మోదీ విమర్శలు చేసినప్పటికీ ఆయన పేరును ఎక్కడా ఉపయోగించలేదు. అలాగే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ ఐఆర్సీటీసీ హోటళ్ల కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో లాలూ భార్య, కొడుకు, కూతురు నిందితులుగా ఉండటం తెలిసిందే. విపక్ష కూటమికి ఓటేస్తే బిహార్‌లో మళ్లీ సంఘ విద్రోహులు పెరిగిపోతారనీ, సరైన శాంతిభద్రతలు ఉండవని మోదీ ప్రజలను హెచ్చరించారు. ప్రతిపక్షం కేంద్రంలో అధికారంలోకి రావడానికి కాకుండా, కేవలం పార్లమెంటులో తమ ఎంపీల సంఖ్యను పెంచుకోడానికి మాత్రమే ప్రస్తుతం ఎన్నికల్లో పోరాడుతోందని అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్, చిన్న పార్టీలు తమ కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తాయేమోనని వణికిపోతోందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చామనీ, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించామనీ, ఆ కమిషన్‌కు తొలి చైర్మన్‌గా ముజఫర్పూర్కే చెందిన వ్యక్తిని నియమించామని చెప్పారు. నాలుగోదశ ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రతిపక్షనేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతోందన్నారు. -
పత్తా లేని బిన్ లాడెన్!
బిహార్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒసామా బిన్ లాడెన్ ప్రచారం చేసేవాడు. ఈసారి ఎన్నికల్లో అతను ఎక్కడా కనిపించడం లేదు. ఒసామా బిన్ లాడెన్ ఏంటి...ఎన్నికల ప్రచారం చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారా...ఇతను కూడా బిన్ లాడెనే..అయితే ఆల్ ఖాయిదా నేత లాడెన్ కాదు. అచ్చు ఆ లాడెన్‌లా ఉండే బిహారీ.ఇతని పేరు మెరాజ్ ఖలీద్ నూర్. చూడటానికి అచ్చు అల్ ఖాయిదా నేతలాగే ఉండటంతో అంతా ఇతనని ఒసామా బిన్ లాడెన్ అని పిలిచేవారు.2004,2005 ఎన్నికల సమయంలో నూర్‌కు మంచి డిమాండ్ ఉండేది. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్లకు నూర్ అంటే ఎంతో ఇష్టం.2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పాశ్వాన్ తరఫున ప్రచారం చేశారు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ కోసం రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. పాశ్వాన్ టికెట్ ఇస్తారన్న ఆశతో ఆయన వెంట తిరిగాడు. ఆ ఆశ నెరవేరకపోవడంతో లాలూ పంచన చేరాడు.అప్పట్లో నూర్‌కు రాజకీయంగా మంచి డిమాండు ఉండేది. పెద్ద పెద్ద నాయకులు ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి నూర్‌ను తమతో పాటు ప్రచారానికి తీసుకెళ్లేవారు. హెలికాప్టర్లో చోటు లేకపోతే మరో సీనియర్‌నేతను దించేసి ఆ స్థానంలో నూర్‌ను తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.2014లో వారణాసిలో మోదీపై పోటీ చేయడానికి సిద్ధపడటంతో నూర్ వార్తల్లోకెక్కాడు.అయితే అతని నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. మోదీ తరచూ పాకిస్తాన్‌పైన, తీవ్రవాదంపైన నిప్పులు చెరుగుతుండటంతో నూర్‌కు డిమాండు పడిపోయింది. నూర్ తండ్రి అహ్మద్ జార్జిఫెర్నాండెజ్‌కు సన్నిహితుడట.ప్రస్తుతం డిమాండు లేకపోవడంతో నూరు తన వ్యాపారంలో నిమగ్నమయ్యాడు. -
నామ్‌కే వాస్తే లాలూ!
ఈ ఎన్నికల్లో ‘నామ్‌కే వాస్తే’ అభ్యర్థుల బెడద అసలు అభ్యర్థులకు తప్పడం లేదు. ఊరూ పేరూ లేకున్నా పాపులర్ రాజకీయ వేత్తల పేర్లున్న సాధారణ పౌరులను అసలు సిసలు అభ్యర్థులపై పోటీకి నిలబెట్టి ఓట్లు చీల్చే ప్రక్రియతో అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. మే 6న పోలింగ్ జరిగే సారణ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పేరు కూడా ఉండడంతో అక్కడి ఓటర్లు తికమకపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నిజానికి అభ్యర్థుల జాబితాలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం దాణా స్కాంలో జైల్లో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు అయిన అసలు సిసలు లాలూ ప్రసాద్ యాదవ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అయితే ఈ లాలూ కేవలం ఓ సాదాసీదా నామ్‌కే వాస్తే లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రమే. అయితే 2014లో రబ్రీదేవి మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈ మామూలు లాలూ ప్రసాద్ యాదవ్‌కి 9,956 ఓట్లు వచ్చాయి. ఇతని మాదిరిగానే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరి పేరున్న మరో వ్యక్తి కూడా 2014లో రబ్రీ దేవిపై పోటీ చేశారు. అతనికి కూడా 14,688 ఓట్లు రావడం విశేషం. అయితే ఇలా ఒకే పేరున్న అభ్యర్థులు ఓట్లు చీల్చడం వల్లనే రబ్రీదేవి ఆ ఎన్నికల్లో 40,948 ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని ఆర్జేడీ ఆరోపిస్తోంది. ఈ నామ్‌కే వాస్తే లాలూ యాదవ్ తనకు ఏ స్థిర చరాస్తులూ లేవని నామినేషన్ పత్రాల్లో నమోదు చేశారు. అలాగే ఇతనికి పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా ఉన్నప్పటికీ వారి వివరాలేవీ ఇందులో పొందుపరచలేదు. సెక్యూరిటీ డిపాజిట్ కింద 25,000 రూపాయలను చెల్లించి నామినేషన్ పత్రాలను పొందిన లాలూ కాని లాలూ ప్రసాద్ భవిష్యత్తులో తమ ఓటర్లను తికమకపెట్టే పరిస్థితి ఉందని ఆర్జేడీ ఆందోళన పడుతోంది. -
లాలూ భార్య సంచలన వ్యాఖ్యలు
పట్నా : సార్వత్రిక ఎన్నికల వేళ బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాలును చంపడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకు తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను వెళితే.. అనుమతి నిరాకరించి వెనక్కి పంపిచడం దారుణమన్నారు. లాలూకు ఏదైనా జరిగితే బీహర్, జార్ఖండ్ ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. ‘అలా చేస్తే.. నా కొడుకును సీఎంని చేస్తానన్నాడు’ ‘ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి లాలును చంపేందుకు కుట్ర చేస్తున్నారు. లాలూకు విషం ఇచ్చి చంపాలని చూస్తున్నారు. వాళ్లు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) అనుకుంటే లాలూ కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. కానీ నియంతృత్వాన్ని ఇక్కడ పనిచేయనీయం’ అని రబ్రీ దేవి పేర్కొన్నారు. కాగా పశుగ్రాస కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. రాంచీలోని రిమ్స్‌లో వైద్య చికిత్స పొందుతున్న లాలూ.. ఆస్పత్రి వార్డు నుంచే ఆయన రాజకీయాలు చక్కబెడుతున్నారు. -
3 సీట్లు..లాలూ పాట్లు
పెద్ద బిడ్డ విజయానికి జైలు నుంచే వ్యూహం పాటలీపుత్రలో ఆర్జేడీ తరఫున పోటీచేసే అవకాశం 2014లో మీసాకు లభించింది. ఈ సీటు ఆశించిన పార్టీ సీనియర్ నేత రాంకృపాల్ యాదవ్ బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు పాటలీపుత్ర బీజేపీ టికెట్ కేటాయించారు. మీసాను రాంకృపాల్ 40 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రెండేళ్ల తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. లాలూకు గతంలో సన్నిహిత అనుచరుడైన రాంకృపాల్ మళ్లీ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సీటుకు మే 19న చివరి దశలో పోలింగ్ జరుగుతుంది. లాలూ జైల్లో ఉన్నందున ఆర్జేడీకి ఎన్నికల్లో నాయకత్వం వహిస్తున్న ఆయన రెండో కొడుకు, బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీతో అక్క మీసాకు మంచి సంబంధాలు లేవు. పెద్ద తమ్ముడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్తోనే మీసాకు సాన్నిహిత్యం ఉంది. ‘మీసా దీదీ’ గెలుపు కోసం తేజ్ ప్రతాప్ అప్పుడే పాటలీపుత్రలో ప్రచారం ప్రారంభించారు. తనకున్న సామాజిక, ఇతర సంబంధాల ద్వారా మీసా విజయా నికి ఆయన గట్టి కృషి చేస్తున్నారు. 2014లో మాదిరిగా పాటలీపుత్రలో తన పూర్వ రాజకీయ శిష్యుని చేతిలో ‘పెద్ద బిడ్డ’ ఓడిపోకుండా మొదటి విజయం నమోదు చేయడానికి జైలు నుంచే లాలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మీసా జంషెడ్పూర్ గాంధీ స్మారక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. రూడీపై లాలూ వియ్యంకుని పోటీ.. 2009 ఎన్నికల్లో లాలూ ప్రసాద్ విజయం సాధిం చిన సారణ్ నుంచి కాం గ్రెస్ మాజీ సీఎం కొడుకు, లాలూ వియ్యం కుడు, చంద్రికా రాయ్ ఆర్జేడీ తరఫున పోటీ చేస్తున్నారు. 2008 పునర్విభజనకు ముందు చాప్రా పేరుతో ఉన్న ఈ సీటు నుంచి లాలూ మూడు సార్లు గెలిచారు. సారణ్‌గా అవతరించాక లాలూ గెలిచినా 2013 కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించడంతో సభ్యత్వం కోల్పోయారు. 2014 ఎన్నికల్లో రబ్రీని బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ 40 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ టికెట్ రూడీకే లభించింది. పర్సా ఆర్జేడీ ఎమ్మెల్యేగా 2015 ఎన్నికల్లో గెలిచిన చంద్రికా రాయ్‌కు టికెట్ ఇవ్వడాన్ని లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ వ్యతిరేకించారు. చంద్రికా కూతురు ఐశ్వర్యతో పెళ్లయిన ఆరు నెలలకే తేజ్ ప్రతాప్ విడాకులు కోరు తూ కోర్టుకెక్కారు. ఈ కారణంగా తన మామకు పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదంటూ ఆయన పట్టుబట్టినా లాలూ జోక్యంతో చంద్రికాకే టికెట్ దక్కింది. తన వియ్యంకుడిని లోక్‌సభకు గెలిపించి తన కొడుకు కాపురం నిలబెట్టడం లాలూ లక్ష్యం. చంద్రికా రాయ్ తండ్రి, మాజీ సీఎం దరోగాప్రసాద్ కుటుంబానికి ఈ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉంది. బీజేపీ అభ్యర్థి రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. సారణ్ నియోజకవర్గంలో యాదవులు, రాజపుత్రుల జనాభా, ఆధిపత్యం ఎక్కువ. ఇక్కడ మే 6న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఈసారి లాలూ భార్యకు బదులు ఆయన వియ్యంకుడితో తలపడుతున్న రూడీకి కూడా గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. మాజీ గురువు.. పూర్వ శత్రువు.. ప్రస్తుత మిత్రుడు లాలూ పరువు ప్రతిష్టలకు పరీక్ష పెడుతున్న మూడో నియోజకవర్గం మాధేపురా. ఇక్కడ శరద్‌యాదవ్ ఆర్జేడీ గుర్తుపై మాధేపురా నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జేడీయూలో ఉన్న శరద్ ఆ పార్టీ టికెట్‌పై పోటీచేసి ఆర్జేడీ అభ్యర్థి పప్పూ యాదవ్ చేతిలో ఓడిపోయారు. మాధేపురా నుంచి శరద్ నాలుగుసార్లు గెలుపొందారు. 1999లో లాలూను శరద్ ఓడించారు. 2015 ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ చేతులు కలపడంతో శరద్, లాలూ మళ్లీ దగ్గరయ్యారు. అయితే, 2017లో బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్‌కుమార్ బీజేపీకి దగ్గరవడంతో శరద్ ఆయనతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ కూటమిలో చేరారు. 1967 నుంచీ ఇక్కడ యాదవ నేతలే పార్లమెంటుకు ఎన్నికవుతున్నారు. నియోజకవర్గ జనాభాలో కూడా యాదవులే ఎక్కువ. ఈ కారణంగా ‘రోమ్ పోప్ కా, మాధేపురా గోప్ కా’ (రోమ్ పోప్‌దైతే మాధేపురా యాదవులది) అనే నానుడి ప్రచారంలో ఉంది. 2019 ఎన్నికల్లో శరద్ యాదవ్ ఆర్జేడీ కూటమి తరఫున రంగంలోకి దిగారు. ఆయనపై జేడీయూ తరఫున మాజీ ఎంపీ దినేశ్ చంద్ర యాదవ్, సిట్టింగ్ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ పోటీ చేస్తున్నారు. పప్పూ ఆర్జేడీ నుంచి వైదొలగి జన్ అధికార్ పార్టీ (లోక్తాంత్రిక్) తరఫున బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి పప్పూ చేసిన ప్రయత్నాలు లాలూ, తేజస్వీ ప్రతిఘటనతో బెడిసికొట్టాయి. పప్పూకు కూడా గతంలో లాలూ సన్నిహితునిగా ఉన్న నేపథ్యం ఉంది. ముగ్గురు ప్రధాన అభ్యర్థులూ యాదవులే కావడంతో ఆర్జేడీ టికెట్‌పై పోటీపడుతున్న శరద్‌ను గెలిపించడం లాలూకు ప్రతిష్టాత్మకంగా మారింది. మాధేపురాలో పోలింగ్ మూడో దశలో ఏప్రిల్ 23న జరుగుతుంది. -
లాలూ ప్రసాద్ యాదవ్ డబ్స్మాష్
-
మోదీకి డబ్‌స్మాష్‌తో చురకలంటించిన లాలూ !
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డబ్‌స్మాష్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చురకలంటించారు. 2014 ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను లాలూ డబ్స్మాష్ చేశారు. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేయగా తెగవైరల్ అవుతోంది. 17 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో మోదీ అప్పట్లో ఇచ్చిన పలు హామీలకు లాలూ పెదాలు కదిపారు. ‘దేశంలోని ప్రతి పౌరుడు ఉచితంగా రూ.15 నుంచి 20 లక్షలు పొందుతాడు. సోదర సోదరీమణుల్లారా మంచిరోజులు(‘అచ్చేదిన్’ ) రాబోతున్నాయి.’ అనే వ్యాఖ్యలకు హావభావాలిస్తూ.. లాలూ లిప్ సింక్ ఇచ్చారు. అయితే ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీసారనేది మాత్రం తెలియరాలేదు. కానీ ఈ వీడియోలో మాత్రం లాలూ బూడిదరంగు టీషర్టు వేసుకుని కనబడుతున్నారు. ఇక ఈ వీడియో క్యాప్షన్‌గా రూ.15 లక్షల వేయడం.. అచ్చేదిన్ తీసుకురావడం అనేవి మోదీ ఇచ్చిన ఉత్తహామీలు అని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఇదే వ్యాఖ్యలతో పలుమార్లు నరేంద్రమోదీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కానీ లాలూలా మాత్రం వినూత్నంగా మోదీకి చురకలంటించింది ఎవరు లేరని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. -
‘జరిగింది చాలు.. తిరిగొచ్చేయ్’
పట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి ఉద్వేగానికి లోనయ్యారు. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఇప్పటి వరకూ జరిగింది చాలు.. ఇంటికి వచ్చేయ్’ అంటూ అభ్యర్థించారు. లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. భార్య ఐశ్వర్యతో పొసగడం లేదు.. విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జైలులో ఉన్న తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూడా తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి తేజ్ ప్రతాప్ ఇంటికి వెళ్లకుండా వేరుగా ఉంటున్నాడు. (చదవండి : బాబాయ్ నాకు ఇల్లు కావాలి) ఈ నేపథ్యంలో తొలిసారి రబ్రీ దేవి మీడియా ముందు తన కుమారుని గురించి మాట్లాడారు. ‘నా కొడుకులిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా శత్రువులైన బీజేపీ, జేడీయూ మనుషులు నా కొడుకును తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రస్తుతం నా భర్త మాతో లేకపోవడం కూడా వారికి బాగా కలసివచ్చింది. మేం కూడా లాలూజీని చాలా మిస్ అవుతున్నాం. ఆయన లేకపోతే ప్రతీది నిరుపయోగమే. ఆయన త్వరలోనే వస్తాడు.. సమస్యలన్ని పరిష్కారమవుతాయ’ని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక తాను ప్రతి రోజు తన కుమారునితో ఫోన్లో మాట్లాడుతున్నానని రబ్రీ దేవి తెలిపారు. -
లాలూకు సుప్రీంలో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు పశుగ్రాస కుంభకోణం కేసుల్లో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను బుధవారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. లాలూ బెయిల్ అప్పీల్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో లాలూ లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకే బెయిల్ కోరుతున్నారని ఆరోపించింది. లాలూకు బెయిల్ మంజూరు చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. లాలూ ప్రసాద్ ఎనిమిది నెలలకు పైగా ఆస్పత్రి వార్డులోనే ఉన్నా ఇప్పటికీ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. కాగా లాలూ రాంచీలోని రిమ్స్‌లో వైద్య చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆస్పత్రి వార్డు నుంచే ఆయన రాజకీయాలు చక్కబెడుతున్నారని, ఇందుకు అక్కడికి వచ్చే విజిటర్ల జాబితానే కీలక ఆధారమని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు నివేదించింది. -
నితీశ్‌పై లాలూ పుస్తకంలో వ్యాఖ్యలు.. దుమారం!
సాక్షి, పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి మహాగట్బంధన్ (మహాకూటమి)లో చేరడానికి ప్రయత్నించారని ప్రతిపక్ష ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన పుస్తకంలో రాసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ‘మహాకూటమిని వీడి, ఎన్డీయేలో చేరిన ఆరు నెలలకే, తిరిగి మా దగ్గరికి రావడానికి నితీష్ కుమార్ చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఆయన మా నమ్మకాన్ని కోల్పోయార’ని ‘గోపాల్‌గంజ్ టూ రైజినా: మై పొలిటికల్ జర్నీ’ పేరిట రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది. జేడీ (యూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీని మళ్లీ కూటమిలో చేర్చే అంశానికి సంబంధించి తనను పలుమార్లు సంప్రదించారని లాలూ పుస్తకంలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ధ్రువీకరించిన లాలూ తనయుడు తేజస్వీ కూడా.. ఆర్జేడీ కూటమిలో తిరిగి చేరే విషయంపై తమతో మాట్లాడినట్టు తెలిపారు. గతేడాది ఈ విషయంపై తేజస్వీ మాట్లాడేతూ.. ‘ఎన్డీయేలో జేడీ (యూ) చాలా ఇబ్బంది పడుతోంది. కానీ ఆ పార్టీకి మహాకూటమిలో చోటు లేదు. వారికి కూటమిలోకి వచ్చే తలుపులను మూసేశామ’ని చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యల్ని ప్రశాంత్ కిషోర్ ఖండించారు. లాలూ మాటల్ని బోగస్‌గా కొట్టేసిన ఆయన.. ‘మా అధినేత (నితీష్ కుమార్) ఔచిత్యాన్ని దెబ్బతీయడానికి ఆర్జేడీ చేసిన పేలవ ప్రయత్నమిది. నేను జేడీయూలో చేరడానికి ముందు లాలూను కలిశాను. అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణా వివరాలను వెల్లడిస్తే, ఆయన చిన్నబుచ్చుకోవడం ఖాయమ’ని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల సీంకీర్ణ కూటమిలో దాదాపు 20 నెలలున్న తర్వాత 2017లో నితీష్‌కుమార్.. అందులోంచి బయటకు వచ్చి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరారు. -
లాలూ చెప్పారనే కాంగ్రెస్‌లోకి
న్యూఢిల్లీ: బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన సినీనటుడు, రాజకీయనేత శతృఘ్న సిన్హా కాంగ్రెస్‌లో చేరడంపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా వాస్తవ దృక్పథాన్ని కలిగి ఉన్నందునే తమ కుటుంబ సన్నిహితుడు లాలూ ప్రసాద్ సూచన మేరకు ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు తమ పార్టీలో చేరాలని కోరినప్పటికీ తాను లోక్‌సభ ఎన్నికల్లో పట్నా సాహిబ్ నుంచి పోటీ చేయాలనే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉన్న తనకు పార్టీని వీడటం కష్టంగానే ఉందని, కానీ ఎల్.కె.అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా వంటి అగ్ర నేతలకు పార్టీ తగిన గౌరవం కల్పించకపోవడంతో కలత చెందానని పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఇక 2014లో పట్నా సాహిబ్ నియోజక వర్గం నుంచి బీజేపీ మద్దతు లేకుండా తన సొంత అర్హత ఆధారంగానే గెలుపొందానని, ఈసారి కూడా గత రికార్డులను బద్దలుకొట్టి ఘనవిజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో నియంతృత్వ పోకడలున్నాయని దుయ్యబట్టారు. వాజ్‌పేయి హయాంలో పార్టీలో ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే పద్ధతి ఉండేదని, కానీ ఇప్పుడు వన్ మ్యాన్ షో, టూ మెన్ ఆర్మీ పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తను కాంగ్రెస్‌లో చేరడానికి పలు కారణాలున్నాయని, గాంధీజీ, పటేల్, నెహ్రూ, వంటి గొప్ప నాయకులున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. అలాగే స్వాతంత్య్రోద్యమ సమయంలో కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని కొనియాడారు. పట్నా సాహిబ్ నియోజక వర్గం నుంచి తన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌పై స్పందిస్తూ ‘రవి శంకర్‌కు నా శుభాకాంక్షలు. గెలుపును పట్నా ప్రజలే నిర్ణయిస్తారు. ఆ దేవుడి దయ, ప్రజల మద్దతుతో గెలుస్తాననే నమ్మకం నాకుంది’ అని చెప్పారు. -
‘పాన్ షాప్‌కు కూడా ఆ మాత్రం జనాలు వస్తారు’
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం రోజున మోదీ, నితీశ్‌లు పట్నాలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సంకల్ప ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సభ వేదికగా మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా, ఈ సభను ఉద్దేశించి ట్విటర్లో స్పందించిన లాలూ.. మోదీ, నితీశ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ మైదాన్‌లో సభ నిర్వహించడానికి నితీశ్ నెలల తరబడి ప్రభుత్వ యంత్రాగాన్ని వాడుకున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారని మండిపడ్డారు. సభను విజయవంతం చేసేందుకు మోదీ, నితీష్ చాలా కష్టపడ్డారని.. అయిన జనాలు రాలేదని వ్యాఖ్యానించారు. రోడ్డు పక్కన ఉన్న పాన్ షాప్ దగ్గర కూడా ఆ మాత్రం జనాలు ఉంటారని సెటైర్లు వేశారు. సభ నిర్వహించిన వారు కెమెరాలను తెలివిగా వాడుతూ.. అక్కడికి ఎంతో మంది వచ్చినట్టు చిత్రీకరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా నేతలు ప్రజలను మోసం చేయకుండా.. సభకు సంబంధించిన వాస్తవ దృశ్యాలను వారి ముందుంచాలని అన్నారు. -
లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. ఐఆర్సీటీసీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లాలూకు పటియాల కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ శనివారం తీర్పును వెలువరించింది. రూ.లక్ష వ్యక్తిగత పూచికత్తుతో రెగ్యూలర్ బెయిల్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ కేసులో లాలూ సతీమణి రబ్రీ దేవి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మధ్యంతర బెయిల్ సమయాన్ని జనవరి 28 వరకు పొడిగించినట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖమంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీలో భారీగా అవకతవకలు జరిగాయన్న కారణంగా సీబీఐ అతనిపై అభియోగాలు మోపింది. కుంభకోణాన్ని గుర్తిస్తూ 2006లో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో లూలూ కుటుంబానికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం లాలూ రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. -
ఆ రెండు కేసుల్లో లాలూకు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు గురువారం ఢిల్లీ కోర్టు వచ్చే ఏడాది జనవరి 19 వరకూ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. సీబీఐ, ఈడీ దాకలు చేసిన రెండు ఐఆర్సీటీసీ కేసుల్లో లాలూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లాలూకు బెయిల్ లభించినా పశుగ్రాస కుంభకోణం కేసులకు సంబంధించి లాలూ రాంచీ జైలులోనే శిక్ష అనుభవించనున్నారు. ఐఆర్సీటీసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ రాంచీ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి అరుణ్ భరద్వాజ్ లాలూ ప్రసాద్‌కు బెయిల్ మంజూరు చేశారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోరుతూ లాలూ చేసుకున్న దరఖాస్తులపై బదులివ్వాలని సీబీఐ, ఈడీలను కోర్టు ఆదేశించింది. ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టును కట్టబెట్టడంలో లాలూ అక్రమాలకు పాల్పడ్డారని ఈ కేసులో ఆయనపై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. -
‘విడాకులకు ఒప్పుకుంటేనే ఇంటికొస్తా’
పట్నా: విడాకుల విషయంలో కుటుంబసభ్యులు తన నిర్ణయానికి మద్దతు పలికే వరకు ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ తేల్చి చెప్పారు. శుక్రవారం తేజ్ ప్రతాప్ స్థానిక న్యూస్ చానెల్‌తో ఫోన్లో మాట్లాడుతూ..తాను ప్రస్తుతం హరిద్వార్‌లో ఉన్నానని తెలిపారు. ఐశ్వర్య, తనకు మధ్య విభేధాలకు దగ్గర బంధువులూ కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోయే ఆస్కారమే లేదని..ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు పెళ్లికి ముందే చెప్పానని స్పష్టం చేశారు. అయితే వారు తన మాట విన లేదని చెప్పారు. తన మాటను అంగీకరించనప్పుడు ఇంటికి తిరిగి ఎలా వెళ్తానని ప్రశ్నించారు. -
‘విడాకుల విషయం తేల్చిన తర్వాతే ఇంటికొస్తా’
పాట్నా : పెళ్లై కనీసం ఆరు నెలలు కూడా పూర్తి కాకమునుపే విడాకులు కావాలంటూ రచ్చ కెక్కారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ క్రమంలో విడాకుల విషయం గురించి తండ్రి లాలూకి కూడా సమాచారం అందించారు. అనంతరం హరిద్వార్ వెళ్లిన తేజ్ ప్రతాప్ విడాకుల విషయంలో కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా నిలబడితేనే ఇంటికి వస్తాను లేదంటే ఇలానే దేశ సంచారం చేస్తుంటానంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో సోదరుడు తేజస్వీ యాదవ్ పుట్టిన రోజు వేడకలకు కూడా హాజరు కాలేదు. ఫోన్లో ఒక లోకల్ మీడియాతో మాట్లాడుతూ.. నా సోదరునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సారి తనే ముఖ్యమంత్రి అవుతాడు. నేను తన పక్కనే ఉంటూ తోడుగా నిలుస్తాను అని చెప్పుకొచ్చారు. మహాభారతంలో అర్జునుడికి, కృష్ణుడు ఎలానో.. నేను నా సోదరునితో అలానే ఉంటానని తెలిపారు. ఈ ఏడాది మే 12 న తేజ్ ప్రతాప్ యాదవ్‌కు, బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలు ఐశ్వర్యరాయ్‌కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పైళ్లైన నాటి నుంచి తాను ఒక్క రోజు కూడా సంతోషంగా లేనని.. అసలు పెళ్లి చేసుకోవడమే తనకు ఇష్టం లేదని వాపోయారు తేజ్ ప్రతాప్. తానేమో చాలా సింపుల్‌గా ఉంటానని.. ఐశ్వర్య మెట్రో నగరాలలో పెరిగిన యువతి కావడంతో ఆమెకు, తనకు సెట్ అవ్వడంలేదని తెలిపారు తేజ్ ప్రతాప్. -
పెద్ద కొడుకు వ్యవహారం లాలూను ఏం చేస్తుందో..!
రాంచి : పెళ్లై ఆర్నెళ్లయినా కాకుండానే విడాకులు తీసుకుంటామంటూ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకొడుకు తేజ్‌ప్రతాప్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలు ఐశ్వర్యరాయ్, తేజ్ ప్రతాప్‌ల వివాహం మే 12వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ‘మేమిద్దరం ఉత్తర, దక్షిణ ధ్రువాల లాంటి వాళ్లం. మాకు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయాలు లేవు’ అని తేజ్ వెల్లడించారు. ఏదేమైనా విడాకులు తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై లాలూ ప్రసాద్‌తో వారం క్రితం తేజ్ భేటీ అయ్యారు. (వద్దన్నా.. ఆమెతో పెళ్లి చేశారు) కాగా, విడాకులు తీసుకోవద్దని తేజ్‌కు లాలూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోలేదని సమాచారం. దీంతో డెబ్బై ఏళ్ల లాలూ తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యాడని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) వైద్యులు తెలిపారు. ఇప్పటికే షుగర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారనీ, ఇప్పుడు కుటుంబ వివాదాలు లాలూను తీవ్రంగా బాధిస్తున్నాయని అన్నారు. తేజ్‌ను కలిసినప్పటి నుంచి ఆయన నిద్రలేమితో బాధపడుతున్నారని చెప్పారు. ఇవన్నీ ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రొవిజనల్ బెయిల్‌పై బయటికొచ్చిన లాలూ.. దాణా కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు 2013లో అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో కూడా మరో రెండు దాణా కుంభకోణం కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా.. వైద్యం కోసం ప్రొవిజనల్ బెయిల్‌పై గత మే నెలలో బయటికొచిన లాలూ తిరిగి ఆగస్టు 30న సరెండర్ కావాలని రాంచి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన బిర్సా ముండా సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అయితే, పలు ఆనారోగ్య కారణాలతో అదే రోజున ఆయన రిమ్స్‌లో చేరారు. దాదాపు 950 కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో లాలూ దోషిగా ఉన్నారు. -
‘ఎన్నికల తర్వాతే పెళ్లి చేసుకుంటా’
పట్నా: రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాతే తన పెళ్లి గురించి ఆలోచిస్తానని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా 2019 లోక్‌సభ ఎన్నికలపైనే ఉందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, తన వివాహం, ఇతర అంశాలను ఆయన విలేకరులతో పంచుకున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డిసెంబర్లో పట్నాలో భారీ ర్యాలీ చేపడతామని తేజ్ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ఇతర ప్రతిపక్ష పార్టీలను సైతం ఆహ్వానిస్తామన్నారు. అక్టోబర్ 6 నుంచి రెండో విడత సంవిధాన్ బచావో న్యాయ యాత్ర ప్రారంభిస్తానని తేజస్వీ తెలిపారు. ఇతర పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తానన్నారు. కూటమిలో సీట్ల పంపకం ఎలా చేస్తారని ప్రశ్నించగా గెలిచే చోట తమ పార్టీ సీట్లను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లాలూ కుటుంబ సభ్యులు తేజస్వీకి పెళ్లి చేయాలనుకుంటున్న నేపధ్యంలో పలు సంబంధాలు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఎన్నికల కారణంగా హనీమూన్‌కు ఆటంకం ఏర్పడుతుందని అందుకే ఎన్నికల తర్వాత తేజ్ వివాహం చేసుకోవాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. -
లాలూకు షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు
-
లాలూకు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ మని లాండరింగ్ కేసులో లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితులను అక్టోబర్ ఆరులోపు తన ముందు హాజరుకావల్సిందిగా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం లాలూ రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నందున ఆయనకు ప్రొడక్షన్ వారెంట్‌ను జారీ చేసింది. సుజాత ప్రైవేటు లిమిటెడ్ హోటల్‌కు రెండు రైల్వే హోటళ్లను సబ్ లీజ్‌ను ఇచ్చే విషయంలో లాలూతో సహా అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఈడీ ఆభియోగాలు యోపింది. దీనిపై గతంలో ఈడీ చార్జ్‌షీట్‌ను నమోదు చేయగా.. కేసుపై విచారించడానికి తగిన సమయం కావాల్సిందిగా ఈడీని కోర్టు కోరింది. ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై పూర్తి విచారణ అనంతరం కోర్టు వారికి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న లాలూకు మరోసారి సమన్లు రావడంతో ఆర్జేడీ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. -
దోమలు చంపుతున్నాయ్, వార్డు మార్చండి
రాంచీ/పట్నా: అపరిశుభ్రత, దోమల బెడద, కుక్కల అరుపులతో ఇబ్బందిగా ఉన్నందున వేరే వార్డుకి మార్చాలంటూ ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ రిమ్స్ అధికారులను కోరారు. వివిధ అవినీతి కేసుల్లో బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ వార్డు అపరిశుభ్రంగా ఉందని ఆర్జేడీ నేత భోలా యాదవ్ అన్నారు. దోమలు కుట్టడంతోపాటు ఆ పక్కనే మార్చురీ ఉండటంతో వీధికుక్కల సంచారం, అరుపులతో తమ నేత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను రిమ్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పక్కనే కొత్తగా నిర్మించిన వార్డులోకి మారిస్తే అవసరమైన అద్దె చెల్లిస్తామని చెప్పామన్నారు. గతంలో లాలూ ఎయిమ్స్‌లో చికిత్స పొందినప్పుడు కూడా సౌకర్యవంతంగా ఉండే వార్డులోకి మార్చామని తెలిపారు. ఆస్పత్రిలో లాలూకు కలిగిన అసౌకర్యంపై అధికార జేడీయూ ఎద్దేవా చేసింది. ‘ప్రస్తుతం మీరు దోమలు, కుక్కలను చూసి భయపడుతున్నారు. గతంలో మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని చూసి బిహార్ ప్రజలు భయపడ్డారు’ అని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కోర్టు ముందు లొంగిపోయిన లాలూ
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం అయిన లాలూ ప్రసాద్ యాదవ్. గురువారం సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. తన తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు సరెండర్ అయ్యారు. తర్వాత లాలూను బిర్సా ముండా జైలుకు తరలించారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల ముందు లొంగిపోవాలని జార్ఖండ్ హైకోర్టు ఇటీవల లాలూను ఆదేశించడం తెల్సిందే. చాయ్‌బసా ఖజానా నుంచి అక్రమంగా నగదు ఉపసంహరించిన కేసుకు సంబంధించి తొలుత జడ్జి ఎదుట లాలూ హాజరయ్యారు. తర్వాత డియోఘర్, డమ్కా ట్రెజరీ కేసులకు సంబంధించి మరో జడ్జి ఎదుట లొంగిపోయారు. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలారు. -
30న సీబీఐ కోర్టులో లొంగిపోండి
రాంచీ: దాణా కుంభకోణం కేసుల్లో దోషి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్‌ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించింది. ఈనెల 30వ తేదీలోగా సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని లాలూను ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించిన 4 కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో ఆయనకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించడం తెల్సిందే. జైలులో లాలూ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్సకోసం బెయిలివ్వాలంటూ హైకోర్టును కోరారు. దీంతో మే 11న ఆయనకు 6 వారాల తాత్కాలిక బెయిలిచ్చింది. తర్వాత ఆ బెయిల్‌ను పొడిగించింది. తాజాగా మరో 3 నెలలపాటు బెయిల్‌ను పొడిగించాలంటూ లాలూ కోరారు. అందుకు హైకోర్టు జడ్జి నిరాకరించారు. అవసరమైనప్పుడు వైద్యం అందించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు, ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య రబ్రీదేవిలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. -
ఆగస్టు 30 లోపు జైలుకు రావాల్సిందే!
పట్నా: బిహార్ రాజకీయ నేత, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన పెరోల్‌ను పొడిగించాలని పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఆగస్టు 30వ తేదీ లోపు జైలుకు రావాలని ఆదేశించింది. దాణా కుంభకోణంలో అప్పటి బిహార్ సీఎంగా ఉన్న లాలూ నిందితుడిగా తేలడంతో ఆయనకు రాంచీలోని సీబీఐ కోర్టు జైలుశిక్ష విధించింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యానికి గురవడంతో కోర్టు మే 11న పెరోల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా అప్పటి నుంచి పెరోల్‌ను పొడిగిస్తూ వచ్చారు. ఆరోగ్యం మెరుగు పడలేదని పెరోల్‌ను మరింత పొడిగించాలని లాలూ తరపు న్యాయవాది కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు లాలూకు చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు తొలిసారి మే 11న ఆరువారాల పాటు ప్రొవిజినల్ బెయిల్‌ను మంజూరు చేశారు. అప్పటి నుంచి ఆయన బయటనే ఉన్నారు. అవసరమైతే రాంచీలో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని తెలిపింది. -
IRCTC కుంభకోణంలో లాలూకు షాక్
-
రియాక్షన్.. ‘ఇంక ఫోన్‌కాల్స్ చెయ్యను’
ఎన్డీయేపై అసంతృప్తితో తిరిగి మహాకూటమితో జత కడదామనుకుంటున్న తరుణంలో జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లాలూ కొడుకులు విముఖత వ్యక్తం చేయటంతోపాటు తీవ్ర వ్యాఖ్యలు చేయటం నితీశ్‌కు కోపం తెప్పించింది. పట్నా: లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకొడుకు, ఆర్జేడీ యువనేత తేజ్‌ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నితీశ్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఒకరితో వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నప్పుడు.. వారి ఆరోగ్యం గురించి వాకబు చేయటంలో తప్పేంటి. అతని(తేజ్‌ను ఉద్దేశించి) వ్యాఖ్యలు సబబు కాదు. ఎవరెలా బాధపడుతున్నా పట్టించుకోరనేది వారి మాటల ద్వారా అర్థమైంది. లాలూ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. కానీ, ఇంక వాళ్లకు ఫోన్ చేసి లాలూ ఆరోగ్యంపై ఆరా తీయను. న్యూస్ పేపర్ల ద్వారానే తెలుసుకుంటా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ఏషియన్ హార్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే లాలూ ఆరోగ్యంపై నితీశ్ పదే పదే వాకబు చేస్తుండటంతో తిరిగి ఆర్జేడీకి లాలూ దగ్గరవుతున్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో స్పందించిన తేజ్ ప్రతాప్ యాదవ్... ‘కూటమిలోకి కాదు.. ఇంట్లోకి కూడా రానివ్వం. మా ఇంట్లోకే నితీశ్ చాచాకు అనుమతిలేదని బోర్డు పెట్టాలనుకున్న మేము.. మహాకూటమిలోకి ఎలా ఆహ్వానిస్తామనుకుంటున్నారు?’ అని మీడియానే తేజ్ ఎదురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నితీశ్ ఇలా స్పందించాల్సి వచ్చింది. -
నితీశ్‌పై విషం కక్కిన లాలూ తనయుడు
పట్నా : ఎన్డీఏ కూటమిలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంతోషంగా లేరని, ఆయనను మహాకూటమిలోకి కొందరు కాంగ్రెస్ నేతలు పదే పదే ఆహ్వానిస్తున్నారని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సీఎం నితీశ్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మా ఇంట్లోకి నితీశ్ చాచాకు అనుమతిలేదని బోర్డు పెట్టాలనుకున్న మేం మహా కూటమిలోకి బిహార్ సీఎంను ఎలా ఆహ్వానిస్తామనుకుంటున్నారని ప్రశ్నించారు. పట్నాలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ది 10, సర్క్యూలర్ రోడ్డులో ఉన్న తమ ఇంట్లోకి నితీశ్‌ను అడుగు పెట్టనిచ్చేది లేదన్నారు. మాజీ సీఎం, లాలూ భార్య రబ్రీదేవికి కేటాయించిన ఆ ఇంట్లో కుటుంబం మొత్తం నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. మహాకూటమిలోకి నితీశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి చేర్చుకునేది లేదని లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ఇటీవల స్పష్టం చేయగా.. తేజ్ ప్రతాప్ సైతం అదే మాటపై ఉన్నారు. సీఎం నితీశ్ మహాకూటమిలో చేరాలనుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని జూన్ 17న ఏఐసీసీ బిహార్ కార్యదర్శి శక్తి సింగ్ గోహిల్ వ్యాఖ్యానించారు. మహాకూటమిలోకి నితీశ్ తిరిగి రానున్నారన్న వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో లాలూ తనయులు అందుకు ససేమిరా అంటున్నారు. కాగా, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, హిందూస్తానీ ఆవామ్ మోర్చా(సెక్యూలర్)ల కూటమి అధికారంలోకి వచ్చింది. గతేడాది జూలై మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీశ్ బీజేపీతో జతకట్టి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. -
లాలూను శిక్షించిన జడ్జీ ఇంట్లో దొంగతనం
లక్నో: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ ఛీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష వేసిన జడ్జీ శివపాల్ సింగ్ ఇంట్లో దొంగతనం జరిగింది. సీబీఐ కోర్జు జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్న శివపాల్ ఉత్తరప్రదేశ్‌లోని జలాలున్లో నివాసం ఉంటున్నారు. కాగా బుధవారం రాత్రి ఆయన ఇంట్లోకి దొంగలు చొరబడి 60,000 రూపాయలు, రూ.2 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. శివపాల్ సోదరుడు సురేంద్ర సింగ్ గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు విరగగొట్టి ఉన్నాయి. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివ్‌పాల్ సింగ్ రాంచీలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో లాలూకి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
లాలూ ఫ్యామిలీకి భారీ షాక్
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి భారీ షాక్ తగిలింది. లాలూ కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న 11 ఫ్లాట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) జప్తు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో షాపింగ్ మాల్ నిర్మాణం జరగుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్ రేట్ ప్రకారం వీటి విలువ 44.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఐఆర్సీటీసీ హోటల్ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినందుకు ఈడీ ఈ స్థలాన్ని సీజ్ చేసినట్టు ఈడీ తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఫ్లాట్లను జప్తు చేసినట్టు పేర్కొంది. ఈడీ జప్తు చేసిన ప్రాపర్టీ తొలుత డీలైట్ మార్కెటింగ్ ప్రైవేటు కపంనీ పేరు మీద ఉండగా.. ప్రస్తుతం లారా ప్రాజెక్ట్స్ పేరు మీద ఉన్నాయి. అందులో లాలూ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు లాలూ తనయులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పటికే దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కోర్టు ఆరువారాల ప్రొవిజనల్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
ఒక్క మాటతో వదంతులకు చెక్ పెట్టిన తేజస్వీ..
పట్నా, బిహార్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయంటూ వచ్చిన వార్తలపై ఆయన చిన్న కుమారుడు, బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘మా అన్నయ్య(తేజ్ ప్రతాప్ యాదవ్) నా మార్గదర్శి. 2019 లోక్‌సభ, 2020లో బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. తేజస్వీ దమ్మున్నవాడని ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన నా సోదరుడు, గైడ్ కూడా’ అంటూ తేజస్వీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బిహార్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్న తేజస్వి.. వాటి నుంచి ప్రజల దృష్టి మరలించడానికే కొంతమంది ఇలాంటి చౌకబారు వదంతులు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 మార్కులకు 38 మార్కులు రావడం, 44 మంది మహిళలపై అత్యాచారాలు జరగడం ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. విద్యావ్యవస్థ ఏ విధంగా నాశనమౌతోందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారన్నారు. ఇలాంటి అంశాలను తేలికగా తీసుకుంటే రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తేజస్వీ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రెండు రోజుల క్రితం తేజ్ ప్రతాప్.. మహాభారత పర్వాన్ని ఉటంకిస్తూ.. ‘అర్జుడిని రాజు చేశాక.. ద్వారక వెళ్లాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ కొంతమందికి నన్ను కింగ్‌మేకర్ అనడం అస్సలు ఇష్టం లేనట్లుందంటూ’ ట్వీట్ చేశారు. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన తర్వాత తేజస్వీ యాదవ్ అంతా తానై పార్టీని ముందుండి నడిపిస్తూ ఉండడంతో తేజ్‌ప్రతాప్ ఈవిధంగా అక్కసు వెళ్లగక్కారంటూ వదంతులు ప్రచారమయ్యాయి. -
ఎన్నికల బరిలోకి తేజ్‌ప్రతాప్ యాదవ్ సతీమణి
-
ఎన్నికల బరిలోకి లాలూ కోడలు..!
పట్నా : ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్వర్యరాయ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అంటే కథనాలు ఔననే అంటున్నాయి. బిహార్‌లోని ఛాప్రా నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే, పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్, బిహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్ ఈ నెల 12న జరిగిన సంగతి తెలిసిందే. ఆమె ఛాప్రాకు చెందిన వ్యక్తి కావడంతో.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఛాప్రా ఆడబిడ్డ అయిన ఐశ్వర్య ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే బాగుంటుందని, ఈ విషయంలో లాలూ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ నేత రాహుల్ తివారీ పేర్కొన్నారు. మరోవైపు ఐశ్వర్య ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న వార్త అధికారికంగా ధ్రువీకరించకముందే.. అధికార జేడీయూ ఆర్జేడీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఆర్జేడీ కోసం కార్యకర్తలు ఎంత కష్టపడినా.. ఎన్నికల్లో టికెట్లు మాత్రం లాలూ కుటుంబానికే దక్కుతాయని జేడీయూ నేతలు విమర్శిస్తున్నారు. -
లాలూకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దల్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సరిగ్గా తీసుకోలేక పోతుండటంతో శనివారం ఆయనను ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రి వైద్యులు లాలూకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. పలు అవినీతి కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఆయన కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి సందర్భంగా మూడురోజుల పెరోల్‌పై బయటికి వచ్చారు. అయితే కొన్ని అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మే11న రాంచీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన ఆరు వారాల ప్రొవిజినల్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన మీడియాతో మాట్లాడటంపై నిషేధాన్ని విధించింది. లాలూకు సంబంధించిన ప్రతి కదలికను వీడియోలో రికార్డు చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. లాలూకు బీహార్, జార్ఖండ్ పోలీసుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. -
కోడలు వచ్చిన వేళా విశేషం..
పట్నా : కొత్త కోడలు ఐశ్వర్య రాయ్‌పై బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి పొగడ్తల వర్షం కురిపించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య రాయ్‌ల వివాహం శనివారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ఈ పెళ్లి కోసం మూడు రోజుల పెరోలుపై బయటకు వచ్చారు. సోమవారం కొత్త దంపతులతో కలసి విష్ణు ఆలయానకి వెళ్లిన రబ్రీదేవి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాలు ముగించుకుని వస్తుండగా రబ్రీదేవిని మీడియా ప్రతినిధులు కోడలి గురించి ప్రశ్నించగా ఆమె చాలా ఆనందం వ్యక్తం చేశారు. రబ్రీదేవి మాట్లాడుతూ.. ‘నా కోడలు చాలా అదృష్టవంతురాలు. ఐశ్వర్య మా ఇంటి లక్ష్మీ.. ఆమె రాకతో మా కుటుంబంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది ఒక శుభ శకునం’ అని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకి ఆరు వారాల తాత్కాలిక బెయిల్ లభించడం.. గత నెలలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన రబ్రీదేవి తాజాగా శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడంతో ఆమె ఇలా స్పందించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సోమవారం పెరోల్ గడువు ముగియడంతో లాలూ రాంచీ జైలుకు వెళ్లిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా లాలూకు లభించిన బెయిల్ మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో లాలూ ఈ రోజు సాయంత్రం పట్నాకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి వేడుకలో స్టెప్పులేసిన మాజీ సీఎం
-
తేజ్ ప్రతాప్ పెళ్లిలో రసాభాస
పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి వేడుకలో రసాభాస చోటుచేసుకుంది. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన కొందరు దుండగులు చేతి వాటం ప్రదర్శించారు. తినే ప్లేట్లు, ఆహార పదార్థాలు.. ఇలా కంటికి కనిపించిన వస్తువునల్లా దొంగిలించుకుపోయారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. శనివారం రాత్రి పట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో లాలూ పెద్ద కొడుకు తేజ్- ఆర్జేడీ సీనియర్ నేత చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. వధువరులు దండలు మార్చుకుంటున్న సమయంలో ఆర్జేడీ కార్యకర్తలమంటూ కొందరు.. వీఐపీ, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హాలులోకి లోపలికి ప్రవేశించారు. టపాసులతోపాటు, ప్లేట్లు, భోజనం, అతిథుల కోసం ప్యాకింగ్ చేసిన గిఫ్ట్‌లను పట్టుకుని పారిపోయారు. వారిని గమనించిన కార్యకర్తలు వెంబడించి అడ్డుకునే యత్నం చేశారు. కానీ, అప్పటికే వారు చాలా దూరం వెళ్లిపోయారు. ఈ పరిణామాల నడుమ తమపై దాడి జరిగిందని, కెమెరాలు ధ్వంసం అయ్యాయని కొందరు మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఆర్జేడీ నేతల జోక్యంతో అంతా శాంతించారు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇది జరిగినట్లు ఆర్జేడీ నేత ఒకరు తెలిపారు. 200 స్టాళ్ల ద్వారా సుమారు 7 వేల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయగా.. ఊహించని రీతిలో జనాలు హాజరయ్యారు. మరోవైపు భోజనాల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఇంకోవైపు ప్రాంగణమంతా చెత్త చెదారంతో నిండిపోయింది. బాహుబలి తరహా సెట్స్ .. భారీ వ్యయంతో ఈ వివాహవేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలని యత్నించినప్పటికీ చివరకు గందరగోళ పరిస్థితుల్లో వేడుక ముగిసింది. లాలూకి నితీశ్ కౌగిలింత.. కూటమితో విడిపోయాక తొలిసారి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లాలూలు ఒకే వేదికపై సందడి చేశారు. తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన నితీశ్.. లాలూను ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరు కాసేపు ముచ్చటించుకోగా.. నవ దంపతులు తేజ్ ప్రతాప్-ఐశ్వర్యలను నితీశ్ ఆశీర్వదించారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. -
శివుడిగా తేజ్.. పార్వతిగా ఐశ్వర్య..!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను తేజ్ శనివారం పెళ్లి చేసుకోబోతున్నారు. దాణా కుంభకోణం కేసుల్లో జైలులో ఉన్న లాలూ.. కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికు వచ్చారు. ఈ పెళ్లి కోసం లాలూ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అటు ఆర్జేడీ అభిమానులు, కార్యకర్తల కోలాహలం కూడా పెద్దస్థాయిలో ఉంది. పెళ్లి చేసుకోబోతున్న తేజ్ ప్రతాప్ కటౌట్లు, పోస్టర్లు పెద్ద ఎత్తున ఆర్జేడీ కార్యకర్తలు నిలబెట్టారు. ఇందులో లాలూ నివాసం వద్ద ఏర్పాటుచేసిన ఓ కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి కొడుకు తేజ్‌ప్రతాప్‌ను శివుడిగా, పెళ్లికూతురు ఐశ్వర్యను పార్వతిగా చిత్రీకరించిన ఈ కటౌట్‌ను కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్నాలోని వెటినరీ కాలేజీ కాంపౌండ్‌లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు రామ్ చంద్ర పూర్వే చెప్పారు. -
లాలూ ఇంట..ఘనంగా పెళ్లి సంబరాలు
-
గానా బజానా.. ఘనంగా తేజ్ పెళ్లి వేడుక
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి చాలా కాలానికి పెళ్లి భాజాలు మోగుతున్నాయి. నేడు ఆయన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ ఇంటి వాడు కాబోతున్నారు. ఆర్జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను నేడు(శనివారం) తేజ్ ప్రతాప్ మనువాడబోతున్నారు. దాణా కుంభకోణ కేసుల్లో ఇన్ని రోజులు జైలులో ఉన్న లాలూ, కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికి విడుదలయ్యారు. నిశ్చితార్థపు వేడుకలను మిస్ అయిన లాలూకు, ఆ లోటు లేకుండా పెళ్లికి ముందు జరిగే అన్ని వేడుకలను ఆ ఫ్యామిలీ ఘనంగా చేస్తోంది. తేజ్‌కు పసుపు రాసే వేడుక నుంచి అన్ని వేడుకలను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది. తేజ్‌కు జరిగే అన్ని వేడుకలను తల్లి రబ్రీదేవీ దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. లాలూ సైతం ఈ వేడుకలను ఎంతో సంతోషంతో ఆస్వాదిస్తున్నారు. ఎంతో కాలానికి లాలూ ఇంట్లో ఈ పెళ్లి వేడుక జరుగుతుండటంతో, ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వరకే చాలామంది అతిథులు లాలూ ఇంటికి వచ్చేశారు. లాలూ ఇంటికి, పెళ్లి కూతురు ఐశ్వర్య రాయ్ బంగ్లాకు కేవలం 200 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో, ఆ మార్గమంతా పూలతో, గ్రీన్ చిల్లీస్, లెమన్లతో సర్వాంగ సుందరంగా అలకరించారు. అన్న పెళ్లి వేడుకల్లో భాగంగా తేజస్వి స్టెపులతో అదరగొట్టారు. పలు బాలీవుడ్ సాంగ్‌లకు డ్యాన్స్‌లు వేస్తూ దుమ్మురేపారు. యాదవ్‌ల మాన్షన్‌లో జరుగబోతున్న ఈ పెళ్లికి అతిరథ మహారథులు వేంచేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలకు, ప్రముఖులకు, మంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20వేల మంది వరకు ఈ పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారని బిహార్ ఆర్జేడీ అధ్యక్షుడు రామ్ చంద్ర పూర్వే చెప్పారు. కాగ, పాట్నాలోని వెటిరినరీ కాలేజీ కాంపౌండ్‌లో వీరి వివాహం జరుగబోతోంది. లాలూ ఇంట..ఘనంగా పెళ్లి సంబరాలు -
లాలూకు రామ్‌దేవ్ యోగా పాఠాలు
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి సందర్భంగా పెరోల్‌పై పాట్నాలోని తన ఇంటికి వచ్చారు. పెరోల్‌పై ఇంటికి వచ్చిన ఆయనకి ఆరోగ్యం బాగాలేని కారణంగా వైద్య చికిత్సల కోసం ఆరు వారాల బెయిల్ కూడా కోర్టు మంజూరుచేసింది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. యోగా గురు రాందేవ్ బాబా కూడా లాలూను పరామర్శించారు. ‘ ఆరు వారాల బెయిల్ మంజూరైనందుకు అభినందనలు లాలూ జీ. యోగా చేస్తూ మీకు మీరుగా ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించండి’ అని రాందేవ్ సూచించారు. పశువుల దాణా కుంభకోణ కేసుల్లో రాంచిలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ, గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గత వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయనకు ప్రత్యేక చికిత్స కూడా అందించారు. ఇటీవలే ఆయన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంటికి వచ్చిన ఈయనకు ఆరోగ్య విషయాలపై ప్రముఖులు పలు సూచనలు చేస్తున్నారు. కాగ, 2016లో కూడా రాందేవ్, ఢిల్లీలో జరిగిన యోగా సెషన్‌కు లాలూను ఆహ్వానించారు. రాందేవ్ బీజేపీకి సన్నిహితుడు కావడంతో, లాలూ ఆయనతో అంటిముట్టన్నట్టు ఉంటారు. దాణా కేసుల్లో తనని జైలులో పెట్టడం బీజేపీ కుట్రనేనని లాలూ ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో ఓ సారి రాందేవ్‌పై లాలూ చమత్కరాలు కూడా చేశారు. 2011లో ఓ ఆందోళన చేపట్టిన రాందేవ్ బాబా, పోలీసులు రావడంతో, స్టేజీపై నుంచే పారిపోయారు. దీన్ని కోట్ చేస్తూ.. రామ్‌లీలా మైదాన్‌లో రాందేవ్ యోగసనాలు చేయమంటారు కానీ పోలీసులు వస్తే మాత్రం ఆయన జంప్ అయి పోతారు అని లాలూ జోకులు పేల్చారు. -
లాలూకు మూడు రోజుల పెరోల్
రాంచీ/పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడు రోజుల పాటు పెరోల్ మంజూరైంది. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ బిహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్యరాయ్‌ను ఈ నెల 12న పట్నాలో వివాహం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాలూ కోరారు. అయితే ఆంక్షలతో కూడిన మూడు రోజుల పెరోల్ మాత్రమే మంజూరు చేసినట్టు జార్ఖండ్ జైళ్ల శాఖ ఐజీ హర్‡్ష మంగ్లా మీడియాకు తెలిపారు. అయితే పెరోల్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది స్పష్టంగా చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఆయన ప్రయాణం చేసే సమయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోరని తెలిపారు. పెరోల్ నేపథ్యంలో లాలూకు పలు ఆంక్షలు విధించారు. ఆయన బయట ఉన్న మూడు రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు. పార్టీ నేతలతో కానీ, కార్యకర్తలతో కానీ కలవకూడదు. ఎలాంటి రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొన కూడదు. ఆయన చేసే ప్రతీ పని వీడియోలో రికార్డు అవుతుంది. కాగా, పెరోల్‌పై గురువారం విడుదలైన వెంటనే పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు పట్నా వెళ్లారు. విమానాశ్రయంలో కుమార్తె మీసా భారతి, కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్వి యాదవ్‌లు ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాంచీ నుంచి పట్నా వరకు లాలూ వెంట ఆర్జేడీ జనరల్ సెక్రెటరీ బోలా యాదవ్ ఉన్నారు. పెరోల్ ముగిసిన తరువాత మే 14న లాలూ తిరిగి రాంచీకి వెళ్తారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
మరో పెద్దింటి పెళ్లి
దాంపత్య జీవితానికి బందీ కాబోతున్న పెద్ద కొడుకు తేజ్‌ప్రతాప్ యాదవ్‌ను ఆశీర్వదించేందుకు రాంచీ జైల్లో బందీగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం పెరోల్‌పై విడుదల అయ్యారు. పెళ్లి జరిగే మే 12వ తేదీకి అటు ఇటు కలిపి ఐదురోజుల పాటు ఆయన స్వేచ్ఛా వాయువులు పీలుస్తారు. అయితే జైలు నుంచి లభించిన తాత్కాలిక విముక్తి కారణంగా అది ఆయనకు లభించిన స్వేచ్ఛ కాదు. ఎంతకీ పెళ్లి కాని కొడుకులపై చింతతో బెంగపెట్టుకున్న లాలూకి.. ఎట్టకేలకు పెద్ద కొడుకు ఒకింటివాడు కాబోతుండటంతో ఆ బెంగ నుంచి లభించిన స్వేచ్ఛ అది! పెళ్లి కూతురు పేరు ఐశ్వర్యారాయ్! తేజ్‌ప్రతాప్‌కీ, ఐశ్వర్యకు గత నెల 18న పట్నాలోని మౌర్య హోటల్లో ఎంగేజ్మెంట్ అయింది. ఎవరీ ఐశ్వర్య! ఐశ్వర్య బిహార్ మాజీ ముఖ్యమంతి దరోగా ప్రసాద్ రాయ్ మనుమరాలు. 1970 ఫిబ్రవరి 16 నుంచి డిసెంబర్ 22 వరకు ఆయన బిహార్ సీఎంగా ఉన్నారు. ఐశ్వర్య తండ్రి చంద్రికా ప్రసాద్ రాయ్ బిహార్ మంత్రిగా పనిచేశారు. విశేషం ఏంటంటే.. ఇంతవరకు ఆయన తన కూతురి పెళ్లిని నిర్ధారించకపోవడం! ఐశ్వర్య ముద్దు పేరు ఝిప్సీ. వయసు 25. ముగ్గురు పిల్లల్లో ఆమే పెద్ద. చెల్లెలు ఆయుషి, తమ్ముడు అపూర్వ, అమ్మ, నాన్న.. ఇదీ ఆమె ఫ్యామిలీ. ఐశ్వర్య పట్నాలోని నోటర్ డేమ్ అకాడమీలో చదివారు. ఢిల్లీ యూనివర్శిటీ మిరిండా హౌస్ నుంచి చరిత్రలో పట్టభద్రులయ్యారు. అమిటీ విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఎ. చేశారు. లాలూ ఇంట్లో 2014 తర్వాత ఇంకో పెళ్లి జరగలేదు. ఆ ఏడాది ఆఖరి కూతురు రాజ్యలక్ష్మి పెళ్లి జరిగింది. అప్పట్నుంచి ఇద్దరు కొడుకులు తేజ్‌ప్రతాప్, తేజస్విల పెళ్లి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా తగిన వధువు దొరకకో, ఈ అన్నదమ్ములు తగిన వరులు కాదనో.. పెళ్లి ఘడియలు రాలేదు. తేజస్వికి పెళ్లి సంబంధాలు పుష్కలంగా వస్తున్నప్పటికీ, అన్నయ్య పెళ్లయ్యాకే చేసుకుంటానని భీష్మించుకుని కూర్చోవడంతో అతడి పెళ్లి కూడా అలస్యం అవుతూ వచ్చింది. లాలూ దంపతులకు 9 మంది సంతానం. అందరికన్నా పెద్దవాడు ఇప్పుడు పెళ్లవుతున్న పిల్లవాడు. రెండో సంతానం తేజస్వి. మూడు మిసా భారతి. నాలుగు రోహిణి. ఐదు చందన. ఆరు రాగిణి. ఏడు హేమ. ఎనిమిది అనుష్క. తొమ్మిది రాజ్యలక్ష్మి. మొత్తం ఏడుగురు కూతుళ్లకూ పెళ్లిళ్లయిపోయాయి. ఇక మిగిలింది ఈ ఇద్దరు అబ్బాయిలు. వీళ్ల కోసం గతంలో లాలూ భార్య రబ్రీదేవి స్వయంవరం కూడా జరిపించారు. అయితే వచ్చే కోడళ్లకు ఆమె కొన్ని ‘సంప్రదాయ నిబంధనలు’ విధించడంతో ఎవరూ ముందుకు రాలేదు. పెద్దల్ని గౌరవించడం; అణకువగా, ఒద్దికగా ఉండటం; సినిమాలు, షాపింగులకు దూరంగా ఉండటం.. ఇంకా ఇలాంటివేవో ఆ నిబంధనల్లో ఉన్నాయి! ఇప్పుడీ కొత్త కోడలు అత్తకు నచ్చిన ఉత్తమురాలు అనే అనుకోవాలి. ఎందుకంటే.. రబ్రీ ఎస్ అన్నాకే.. ఎంగేజ్మెంట్ అయింది. అయితే పెళ్లికి మాత్రం ఐశ్వర్య తండ్రి మనస్ఫూర్తిగా ‘ఎస్’ అన్నట్లు ఇప్పటికైతే ఒక్క వార్తా రాలేదు! -
ఆర్జేడి అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కి పెరోల్
-
లాలూ పెరోల్‌పై నేడు నిర్ణయం?
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసుకున్న పెరోల్ విజ్ఞప్తిపై గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో జరిగే తన పెద్ద కొడుకు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు అనుమతివ్వాలని లాలూ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తి ఇంకా పరిశీలన దశలోనే ఉందని, గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని జార్ఖండ్ ఐజీ(జైళ్లు) హర్ష మంగ్లా చెప్పారు. -
ఆహా ఏమి రుచి...తినరా సమోసా మైమరచి!
ఆహా ఏమి రుచి.. తినరా సమోసా మైమరచి.. అంటూ బ్రిటన్ వాసులు పాడేసుకుంటున్నారు. కాస్త కరకరలాడుతూ, కాస్త మెత్తమెత్తగా ఉండే సమోసాకు బ్రిటన్ వాసులు ఫిదా అయిపోయారు. ఏకంగా సమోసా వారోత్సవాలనే నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9 నుంచి 13 వరకు యూకేలోని ఆరు నగరాల్లో జాతీయ సమోసా వారోత్సవాలు జరిగాయి. అందులో సమోసా ఈటింగ్ పోటీలు, ఉత్తమ సమోసాకు అవార్డులు, కొత్త కొత్త సమోసా రెసీపీల పరిచయం వంటి కార్యక్రమాలూ జరిగాయి. కేవలం ఆలూ సమోసాయే కాదు ఉల్లి, బఠాణి, పంజాబీ చోలే సమోసా, హైదరాబాదీ కీమా సమోసా వంటి 20 రకాల సమోసాలెన్నో అందుబాటులో ఉన్నాయి. అసలు ఈ సమోసా చుట్టూ అల్లుకున్న వింతలు, విశేషాలు ఎంతో ఆసక్తికరం.. అవేమిటో తెలుసుకుందామా? - సమోసా అంటే మనందరికీ ఇష్టమే. అయితే ఇది భారతీయ వంటకం కాకపోవడం గమనార్హం. పదో శతాబ్దానికి ముందు మధ్య ప్రాచ్య దేశాల్లో సమోసా పుట్టింది. అక్కడి నుంచి మధ్య ఆసియా దేశాల మీదుగా 14వ శతాబ్దంలో భారత్‌కు పరిచయమైంది. అంతే అప్పట్నుంచి భారతీయుల మెనూలో శాశ్వతంగా చేరిపోయింది. - సమోసా అన్న పదం పర్షియన్ భాషలోని సంబోసాగ్ అన్న పదం నుంచి వచ్చింది. అఫ్గాన్లు సంబోసా అని పిలిస్తే, తజికిస్తాన్లో సంబూసా అని, టర్కీలో సంసా అని అంటారు. - మొఘల్ చక్రవర్తి అక్బర్ నుంచి.. ఇప్పటి అబ్దుల్ కలామ్ వరకు ఎందరో ప్రముఖులు సమోసా రుచికి మైమరచిపోయిన వారే. అక్బర్ తన రాజధాని ఫతేపూర్ సిక్రీలోని ఒక భవనానికి ఏకంగా సమోసా మహల్ అని పేరు పెడితే... భారత్‌కున్న బలాల్లో సమోసా కూడా ఒకటంటూ కలాం తన అడ్వాంటేజ్ ఇండియా పుస్తకంలో శ్లాఘించడం గమనార్హం. - చరిత్రలోనే కాదు.. అంతరిక్షంలోనూ సమోసా ఘుమఘుమలాడిపోయింది. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు తన వెంట తీసుకువెళ్లిన ఆహార పదార్థాల్లో సమోసా కూడా ఉంది. - సమోసా చిరు తిండా లేదా ఒక వంటకమా అన్న అంశంపై వివాదం నెలకొని కోర్టుకు కూడా చేరింది. ఉత్తరాఖండ్‌లో ఒక దుకాణదారు సమోసా అన్నది చిరుతిండేనని, అందువల్ల దానిపై పన్ను ఐదు శాతం మాత్రమే ఉండాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ వాణిజ్య పన్నుల శాఖ అదొక వంటకమని, దానిపై ఎనిమిది శాతం పన్ను ఉండాలంటూ వాదించింది. చివరికి న్యాయస్థానం సమోసా చిరుతిండి కాదని తేల్చేసింది. - ఇక సమోసా పేరు చెబితే బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పేరు చటుక్కున గుర్తుకొస్తుంది. ‘జబ్‌తక్ రహేగా సమోసామే ఆలూ.. తబ్‌తక్ బిహార్‌లో రహేగా లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. బిహార్‌లో లాలూ ఉంటారు)’అంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు గుర్తుండిపోతాయి మరి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అదే లాలూ మిత్రపక్షంగా ఉన్నప్పుడు బిహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం సమోసాలపై 13.5 శాతం లగ్జరీ పన్ను విధించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. - గతేడాది కొందరు సమోసా ప్రియులు లండన్‌లో 153 కేజీల అతి పెద్ద సమోసాను తయారు చేసి గిన్నిస్‌బుక్ రికార్డు సృష్టించారు. -
కొడుకు పెళ్లికి జైలులోనే లాలూ..?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మాజీ మంత్రి చంద్రిక రాయ్ కూడా ఐశ్వర్య రాయ్ కూతురితో మే12న అంగరంగ వైభవంగా జరుగబోతోంది. పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో ఈ వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు. అయితే ఈ పెళ్లి వేడుకకు కూడా లాలూ హాజరవుతారో లేదో ఇంకా క్లారిటీ లేదు. దాణా కుంభకోణ కేసులో ప్రస్తుతం రాంచి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు నిశ్చితార్థానికి కూడా రాలేకపోయారు. డయాబెటీస్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో రాంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇటీవలే చికిత్స తీసుకున్న లాలూ... తక్షణ చికిత్స కోసం తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసుకున్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణను జార్ఖాండ్ హైకోర్టు మే 11కు వాయిదా వేసింది. మే 11నే తేజ్ ప్రతాప్ పెళ్లికి సంబంధించిన వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ మే 11న కోర్టు బెయిల్ మంజూరు చేసిన రాంచి నుంచి పాట్నాకు ఒక్క రోజులో రావడం కొంచెం కష్టమే అంటున్నారు సన్నిహిత వర్గాలు. లాలూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై నిన్ననే జార్ఖాండ్ హైకోర్టు విచారించాల్సి ఉంది. కానీ న్యాయవాదుల బంద్‌తో ఈ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు. అయితే త్వరగా ఈ బెయిల్ పిటిషన్ విచారించాల్సిందిగా లాలూ వర్గాలు కోరుతున్నాయి. వచ్చే శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించాలని సీబీఐ వాదిస్తుందని, అయితే తమకు అనుకూలంగానే ఆదేశాలు వస్తాయని ఆర్జేడీ ఎంపీ, లాలూ సన్నిహితుడు జై ప్రకాశ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న లాలూను రాజకీయ కుట్రతో సోమవారం రాంచి జైలుకు తరలించారని ఆరోపించారు. లాలూ అనారోగ్యంగా ఉండటంతో, తాము పెరోల్‌కు దరఖాస్తు చేయలేదని ఆర్జేడీ అధినేత న్యాయ వ్యవహారాలు చూసుకున్న వ్యక్తి చెప్పారు. తక్షణ చికిత్స కోసం బెయిల్‌ను కోరినట్టు తెలిపారు. సాధారణంగా పెరోల్‌ను పెళ్లి వేడుకలకు కానీ, అంత్యక్రియలకు కానీ దరఖాస్తు చేసుకుంటారు. 2014 తర్వాత లాలూ కుటుంబంలో జరుగబోయే అతిపెద్ద వేడుక తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లినే. ఆర్జేడీ చిన్న కూతురు రాజ్ లక్ష్మి పెళ్లి తర్వాత, ఇప్పుడు ఆ ఇంట్లో తేజ్ పెళ్లి జరుగుతోంది. -
ఎయిమ్స్ నుంచి లాలూ ప్రసాద్ డిశ్చార్జ్
-
ఎస్పీ నా బాస్ అనుకుంటున్నారా : లాలూ
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఎయిమ్స్ నుంచి రాంచీకి తరలించే క్రమంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ పోలీసు లాలూను వెనక్కి వెళ్లమని చెప్పటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎస్పీ చెప్పాడని నన్ను వెనక్కి నెడుతున్నారు.. ఎస్పీ ఏమైనా నా బాస్ అనుకుంటున్నారా అంటూ’ లాలూ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇప్పటికే లాలూను రాంచీకి తరలించడంపై ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. తేజస్వీ యాదవ్ కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ వైద్యులది తొందరపాటు నిర్ణయమని ఆయన విమర్శించారు. ఇక్కడి నుంచి తరలించడం పెద్ద కుట్ర : లాలూ ఇప్పటికే ఎయిమ్స్ వైద్యుల తీరును తప్పుబడుతూ.. తనకు హాని జరిగితే మీదే బాధ్యత అంటూ లాలూ లేఖాస్త్రం సంధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను సోమవారం ఎయిమ్స్ నుంచి తరలించే సమయంలో మీడియాతో మాట్లాడారు. తనను రాంచీకి తరలించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన పేర్కొన్నారు. నా ఆరోగ్యం క్షీణించటానికే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు లేనిచోటుకి తరలిస్తున్నారని.. దీనిని ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలూపై రైల్వే టెండర్ల కేసులోనూ అవినీతి ఆరోపణలున్నాయి. అయితే జార్ఖండ్‌లోని బిర్సా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యం కారణంగా లాలూను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. చదవండి : తొందరపాటు నిర్ణయం.. తేజస్వీ ఆందోళన -
తొందరపాటు నిర్ణయం.. తేజస్వీ ఆందోళన
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదటపడక ముందే, ఆయన ఇష్టం లేకున్నా న్యూఢిల్లీ ఎయిమ్స్ నుంచి జార్ఖండ్ ఆస్పత్రికి ఎందుకు తరలించాలని నిర్ణయించుకున్నారని తేజస్వీ ప్రశ్నించారు. పట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిమ్స్ వైద్యులు తీసుకున్న తొందరపాటు నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఎయిమ్స్ నుంచి లాలూను ఎందుకు డిశ్ఛార్జ్ చేయాలనుకున్నారో సంబంధిత అధికారులు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ హాస్పిటల్‌తో పోల్చితే ఎయిమ్స్ బెస్ట్ హాస్పిటల్ అని తన తండ్రి లాలూను అక్కడే ఉంచి చికిత్స అందించాలని తేజస్వీ కోరారు. ఎయిమ్స్‌కు లాలూ లేఖ తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని, ఎయిమ్స్‌లోనే చికిత్స తీసుకోవాలని భావిస్తున్నాను. రాంచీ హాస్పిటల్‌కు నన్ను ఇప్పుడే షిఫ్ట్ చేయవద్దు. రాంచీలో పూర్తి సౌకర్యాలు లేవు. నాకు ఎదైనా జరిగితే ఎయిమ్స్ బృందం బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ లాలూ ప్రసాద్ యాదవ్ లేఖ రాశారు. కాగా, లాలూ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాంచీ జైలు అధికారులతో చర్చించి వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు లాలూకు మద్దతుగా ఎయిమ్స్ వద్ద ఆర్జేడీ కార్యకర్తలు ధర్నాకు దిగి నిరసన చేపట్టారు. ఇప్పటికే గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలూపై రైల్వే టెండర్ల కేసులోనూ అవినీతి ఆరోపణలున్నాయి. అయితే జార్ఖండ్‌లోని బిర్సా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యం కారణంగా లాలూను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. -
లాలూతో రాహుల్‌కి ఏం పని?
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. దాణా కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఆస్పత్రికి వెళ్లిన రాహుల్ లాలూతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇక ఈ భేటీపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లాలూతో రాహుల్ గాంధీకి ఏం పని?. ప్రజల్లో అవినీతి అంటూ ఉపన్యాసాలు దంచే రాహుల్.. అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూను కలవటంలో ఆంతర్యం ఏంటి. ఈ భేటీపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలి’ అని యోగి డిమాండ్ చేశారు. జన ఆక్రోశ్లో అధికార పక్షంపై విరుచుకుపడిన రాహుల్ ఆ మరుసటి రోజే లాలూతో భేటీ కావటం.. పైగా చర్చల్లో కొనసాగుతున్న వేళ లాలూ-రాహుల్ భేటీ ఆసక్తికరంగా మారింది. ఆస్పత్రిలోనే ఉంటా... లాలూ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావాల్సి ఉంది. అయితే తన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని.. ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని ఎయిమ్స్ వైద్యాధికారులకు లాలూ ఓ లేఖ రాశాడు. రాంచీకి తరలించాక తనకేమైనా జరిగితే ఎయిమ్స్ వైద్యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాంచీ జైలు అధికారులతో చర్చించి వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. -
పెళ్లి మూమెంట్ : లాలూ కుటుంబానికి ఐటీ షాక్
పాట్నా : పెళ్లి పనులతో బిజీబిజీగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. పాట్నాలోని షేక్‌పూర్‌లో 7105 చదరపు అడుగుల భూమిని ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసుకుంది. ఈ భూమి లాలూ కొడుకు తేజ్ ప్రసాద్ యాదవ్ పేరుతో రిజిస్ట్రర్ అయి ఉంది. బినామీ ఆస్తుల చట్టం కింద ఈ భూమిని అటాచ్ చేసినట్టు ఐటీ అధికారులు చెప్పారు. ఇటీవలే తేజ్ ప్రతాప్ యాదవ్‌కు పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు, మాజీ మంత్రి చంద్రికా రాయ్ కూతురు ఈ ఐశ్వర్యరాయ్‌ను తేజ్ ప్రతాప్ యాదవ్ మే 12న పెళ్లి జరుగబోతోంది. అందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఐటీ శాఖ తేజ్ ప్రతాప్ యాదవ్ రిజిస్ట్రర్ భూమిని ఐటీ శాఖ అటాచ్ చేసుకోవడం గమనార్హం. -
లాలూకు మరో 14 ఏళ్ల జైలు
రాంచీ: దాణా కుంభకోణం కేసులు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. 1990ల్లో దుమ్కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్న కేసులో శనివారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.60 లక్షల జరిమానా విధించింది. ఐపీసీతో పాటుగా అవినీతి నిరోధక చట్టం కింద 2 వేర్వేరు కేసుల్లో ఏడేళ్ల చొప్పున జైలు శిక్షను సీబీఐ జడ్జి శివ్‌పాల్ ప్రకటించారు. ఈ రెండు శిక్షలు ఒకదాని తర్వాత మరొకటి అమలు చేయాలని ఆదేశించారు. ఈ తీర్పును ఉన్నతన్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు లాలూ తరపు న్యాయవాది తెలిపారు. దియోగఢ్ ఖజానానుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నారనే కేసులో డిసెంబర్ నుంచి రాంచీలోని బిర్సాముండా జైలులో లాలూ శిక్షననుభవిస్తున్నారు. 420 సహా పలు సెక్షన్ల కింద.. ‘భారతీయ శిక్షాస్మృతిలోని 420 (మోసం), 409 (ప్రజాప్రతినిధిగా విశ్వాసద్రోహం), 467 (విలువైన పత్రాల ఫోర్జరీ), 471 (ఫోర్జరీ పత్రాలను వినియోగించటం), 477 (విలువైన పత్రాలను అక్రమంగా రద్దుచేయటం), 120బీ (నేరపూరిత కుట్రలకు శిక్ష) సెక్షన్ల కింద 7ఏళ్ల శిక్షతోపాటు రూ.30లక్షల జరిమానా విధించారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మరో ఏడేళ్ల జైలు, రూ.30 లక్షల జరిమానా విధించారు’ అని సీబీఐ తరపు న్యాయవాది విష్ణుశర్మ పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో మరికొన్నేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందన్నారు. ఈ కేసులో మరో 18 మంది దోషులకూ న్యాయమూర్తి శిక్షలను ఖరారు చేశారు. పశుసంవర్ధక శాఖ మాజీ ప్రాంతీయ సంచాలకుడు ఓపీ దివాకర్‌కు కూడా లాలూతో సమానమైన శిక్షనే విధించారు. మాజీ ఐఏఎస్ అధికారి ఫూల్‌చంద్ సింగ్ సహా తొమ్మిది మంది అధికారులకు ఏడేళ్ల జైలు, రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏడుగురు దాణా సరఫరాదారులకు మూడున్నరేళ్ల జైలు, రూ.15లక్షల జరిమానాను ఖరారు చేశారు. దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదు కేసుల్లో లాలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత వారం ఛాతీనొప్పి కారణంగా ప్రస్తుతం లాలూ రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆర్జేడీ, బీజేపీ మాటల యుద్ధం తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ రాజకీయ కుట్ర కారణంగానే ఈ కేసులన్నీ నమోదయ్యాయని ఆరోపించింది. అటు బిహార్ అసెంబ్లీలో లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ‘బీజేపీ నుంచి లాలూ ప్రసాద్ ప్రాణాలకు ముప్పు ఉంది. ఆయన అమాయకుడు. ఉన్నత న్యాయస్థానంలో మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా ఆర్జేడీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ‘చట్టం తనపని తాను చేసుకుపోతోంది. దాణా కుంభకోణంలో ఇదేమీ మొదటి కేసు కాదు. లాలూ ప్రాణాలకు ముప్పుందనటం అవాస్తవం. ఆయనకు జైల్లో సంపూర్ణమైన భద్రతను ఏర్పాటుచేశాం’ అని బిహార్ డిప్యూటీ సీఎం, దాణా స్కాం పిటిషనర్లలో ఒకరైన సుశీల్ మోదీ పేర్కొన్నారు. -
లాలూకు జైలు శిక్ష ఖరారు
-
లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష
రాంచీ : ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సీబీఐ న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. దాణా స్కామ్‌కు సంబంధించి నాలుగో కేసులో ఈ మధ్యే లాలూను దోషిగా కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం లాలూకు 14 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఐపీసీ సెక్షన్ల కింద 7 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద 7 ఏళ్లు.. మొత్తం 14 ఏళ్ల జైలు శిక్షను ఒకదాని వెంటే మరొకటి విధిస్తున్నట్లు న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ వెల్లడించారు. అయితే తీర్పు కాపీ అందితేనే ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని లాలూ తరపు న్యాయమూర్తి అంటున్నారు. శిక్షలతోపాటు రూ. 60 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, డుంక ఖజానా నుంచి డిసెంబర్ 1991- 1996 మధ్య సుమారు రూ. 3 కోట్ల 50 లక్షల రూపాయలు అక్రమంగా విత్ డ్రా చేసిన సంఘటనకు సంబంధించిన కేసు ఇది. ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు విచారణ ఎదుర్కొగా.. చివరకు లాలూను దోషిగా తేల్చారు. ఐసీసీ సెక్షన్లు 120-బీ, 419, 420, 467, 468 సెక్షన్ల కింద ఆయనకు శిక్షకు ఖరారైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘మా నాన్నకు ప్రాణహని ఉంది’ కాగా, శిక్షలపై స్పందించిన లాలూ తనయుడు తేజస్వి యాదవ్.. తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ‘బీజేపీ-జేడీయూ రాజకీయ కుట్రంలో మా నాన్న బాధితుడు అయ్యాడు. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది’ అని తేజస్వి తెలిపారు. ఇక మరోవైపు ఆర్జేడీ పార్టీ అత్యవసర భేటీకి పిలుపునిచ్చింది. -
లాలూకు మరో దెబ్బ
రాంచీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. దాణా స్కామ్‌కు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను దోషిగా న్యాయస్థానం తేల్చింది. సోమవారం రాంచీ(జార్ఖండ్) సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీనియర్ నేత జగన్నాథ మిశ్రాను మాత్రం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లాలూ అటు నుంచే అటే ఉదయం కోర్టుకు వెళ్లారు. శిక్షలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. డుంక ఖజానా నుంచి డిసెంబర్ 1994-జనవరి 1996 మధ్య రూ. 3 కోట్ల 13 లక్షల రూపాయలు అక్రమంగా విత్ డ్రా చేసిన సంఘటనకు సంబంధించినదీకేసు. ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు విచారణ ఎదుర్కొన్నారు. దాణా స్కామ్ మొదటి కేసుకు సంబంధించి 2013లో లాలూకు ఐదేళ్ల శిక్ష ఖరారు. రెండో కేసు.. డిసెంబర్ 23, 2017 మూడున్నరేళ్ల శిక్ష ఖరారు. మూడో కేసు జనవరి 2018లో ఐదేళ్ల శిక్ష ఖరారు. ఇవిగాక మరో రెండు కేసులు(పట్నా, రాంచీలలో) ఆయనపై ఉన్నాయి. -
లాలూ యాదవ్‌కు ఏమైంది?
రాంచీ: బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్(69) శనివారం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను ఇక్కడి రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ఆస్పత్రిలో చేర్చారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో లాలూ డిసెంబర్ 23 నుంచి రాంచీలోని బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ ఆరోగ్యస్థితిని కార్డియాలజీ విభాగం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య సమస్యపై వైద్యులు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు దాణా కుంభకోణంలో దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. తండ్రి అనారోగ్యం గురించి తెలియగానే లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హుటాహుటిన పట్నా నుంచి రాంచీకి వచ్చారు. రిమ్స్‌కు వెళ్లి తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్, జార్ఖండ్ ఆర్జేడీ అధ్యక్షుడు అన్నపూర్ణ దేవి, వందలాది పార్టీ కార్యకర్తలు రిమ్స్‌కు తరలివచ్చారు. తమ నాయకుడిని చూసేందుకు అనుమతించడం లేదని అన్నపూర్ణ దేవి మీడియాతో చెప్పారు. లాలూ అనారోగ్యం గురించి తమకు సమాచారం ఇవ్వలేదని, మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడకు వచ్చినట్టు వెల్లడించారు. -
28 ఏళ్ల బచ్చాను.. నితీశ్ దుమ్ము దులిపా!
సాక్షి, పట్నా: ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓ లోక్‌సభ స్థానాన్ని, ఓ అసెంబ్లీ సీటును ఆర్జేడీ సొంతం చేసుకుంది. ఓ స్థానంలో మాత్రం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు తాను ఏం చెప్పానో గుర్తుచేసుకోవాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ సూచించారు. ఉప ఎన్నికల విజయాన్ని ఆస్వాదించే సమయం తన వద్ద లేదని రైతులు, రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు తేజస్వీ. తాను 28 ఏళ్ల బచ్చానని, చాచా(నితీశ్) మీరు 67 ఏళ్ల వ్యక్తి అయినా ఎన్నికల్లో సత్తా చాటి చూపిస్తానని సీఎం నితీశ్‌కు వారం రోజుల ముందే చెప్పానన్నారు తేజస్వీ. బిహార్ మాజీ సీఎం, తేజస్వీ తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లిన తర్వాత జరిగే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ధీమాగా ఉన్నారు. కానీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నితీశ్ వెనుకంజ వేస్తున్నారని ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని తేజస్వీ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీ బిహార్ రైతులకిచ్చిన ఇచ్చిన హామీల అమలుపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఎన్డీయేతర పార్టీల సీనియర్ నేతలు చర్చించుకుని 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాలు రచించాలని లాలు తనయుడు ఆకాంక్షించారు. 'ఎన్డీఏ కూటమి నుంచి నేడు టీడీపీ వైదొలగింది. నితీశ్ ఇంకా ఏం విషయం తేల్చుకోలేక పోతున్నారు. మహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీశ్ తప్పిదం చేశారు. టీడీపీ బాటలో పయనించి మీరు ఎన్డీఏ నుంచి ఎప్పుడు బయటకొస్తారో చెప్పాలంటూ' నితీశ్‌ను తేజస్వీ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు ఎన్డీఏ నుంచి వైదొలగే అంశంపై కామెంట్ చేసేంతే వరకూ తాను ప్రశ్నిస్తూనే ఉంటానని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. -
‘నీ బాస్‌ను హోదా గురించి అడగొచ్చుగా...?’
పట్నా : ఓవైపు ఏపీ ప్రత్యేక హోదా అంశం హస్తినలో వేడిని పుట్టిస్తున్న వేళ.. తమ రాష్ట్రం ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని నిలదీయాంటూ సీఎం నితీశ్‌కు లాలూ సూచిస్తున్నాడు. ‘నితీశ్.. నీ బాస్(మోదీని ఉద్దేశించి)ను బిహార్ ప్రత్యేక హోదాపై ఎందుకు అడగట్లేదు?’ అంటూ లాలూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దాణా స్కామ్ కేసులో లాలూ రాంచీ జైల్లో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జైలు నుంచే ఆయన ట్వీట్లు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని మోదీ 2014లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా లాలూ గుర్తు చేశారు. ఇక లాలూ తనయుడు తేజస్వి కూడా ప్రత్యేక హోదాపై ట్వీట్ చేశాడు. స్పెషల్ స్టేటల్ అంశాన్ని పక్కనపెట్టి.. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ నితీశ్‌పై తండ్రి-కొడుకులిద్దరూ మండిపడ్డాడు. Why Nitish not asking his boss to accord Special Status to Bihar? PM Modi had promised Special Status to Bihar in March 2014 Loksabha election rally at Muzaffarpur. Nitish must play that speech recording in front of PM. For personal gains Nitish surrendered Bihar’s benefits. — Lalu Prasad Yadav (@laluprasadrjd) 8 March 2018 -
దెయ్యాలను వదిలారు.. అందుకే ఖాళీ చేశా!
పట్నా : ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విచిత్రమైన వాదనను వినిపిస్తున్నాడు. ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయనే ఖాళీ చేశామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలు నన్ను భవనం ఖాళీ చేయించటానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అందుకే వాళ్లు అందులోకి దెయ్యాలను వదిలారు’ అంటూ తేజ్ పేర్కొన్నాడు. గతంలో నితీశ్ హయాంలో తేజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఈ బంగ్లాను కేటాయించారు. దేశ్‌రత్న మార్గ్‌లో ఉన్న ఈ భవనానికి వాస్తు దోషం మూలంగా అప్పుడు తేజ్ మార్పులు కూడా చేయించాడు. అయితే మహాకూటమితో విడిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలంటూ తేజ్‌కు నితీశ్ ప్రభుత్వం నోటీసులు పంపింది. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తల్లి రబ్రీదేవి ఇదే భవనాన్ని ఉపయోగించటం.. అది సెంటిమెంట్‌గా భావించి తేజ్ ఖాళీ చేయలేదు. ఇంతలో ఆర్జేడీ నేతలు ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది. విచారణ పెండింగ్‌లో ఉండగానే ఇలా ఉన్నపళంగా దెయ్యాలున్నాయంటూ భవనాన్ని ఖాళీ చేసేశాడు. అయితే ఇదంతా అతను చేస్తున్న జిమిక్కుగా జేడీయూ అభివర్ణిస్తోంది. అతని సోదరుడు తేజస్వి యాదవ్ ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్నాడు. అందుకే మీడియా దృష్టిని తనవైపు మళ్లించుకోవటానికే దెయ్యాలంటూ తేజ్ ప్రతాప్ నాటకాలు ఆడుతున్నాడు అంటూ జేడీయూ నేతలు మండిపడుతున్నారు. -
మూడో కేసులోనూ లాలూ దోషే
-
మూడో కేసులోనూ లాలూ దోషే
రాంచీ: దాణా కుంభకోణానికి సంబంధించిన మూడో కేసులోనూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. లాలూతోపాటు మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా కూడా దోషేనని పేర్కొన్న కోర్టు..వీరిద్దరికీ ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. వీరు ఒక్కోసారి 5 లక్షల రూపాయలను రెండు దఫాల్లో చెల్లించొచ్చు. జరిమానా కట్టని పక్షంలో వారు మరో ఏడాది సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 1992–93 మధ్య కాలంలో చాయ్‌బాసా ఖజానా నుంచి రూ. 37.62 కోట్లను వీరు అక్రమంగా కాజేసినట్లు గుర్తించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ఎస్ ప్రసాద్..ఇదే కేసులో మరో 50 మందిని కూడా దోషులుగా తేల్చారు. బిహార్ మాజీ మంత్రి విద్యాసాగర్ నిషద్, బిహార్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ మాజీ చైర్మన్ జగదీశ్ శర్మ, మాజీ ఎమ్మెల్యేలు ధ్రువ్ భగత్, ఆర్కే రాణా, ముగ్గురు మాజీ ఐఏఎస్ అధికారులు దోషుల జాబితాలో ఉన్నారు. తీర్పు వెలువడిన అనంతరం లాలూ కొడుకు, బిహార్ శాసనసభలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ‘సీబీఐ కోర్టు తీర్పుకు మేం కట్టుబడి ఉంటాం. అయితే ఈ తీర్పే అంతిమం కాదు. హైకోర్టులో అప్పీల్ చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని అన్నారు. బిహార్ ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్, బీజేపీ కలసి కుట్రపన్ని తన తండ్రిని ఈ కేసుల్లో ఇరికించాయని తేజస్వీ ఆరోపించారు. అన్ని శిక్షలూ ఏకకాలంలోనే అమలు దాణా కుంభకోణానికి సంబంధించి మొత్తం ఐదు కేసులుండగా వాటిలో లాలూకు ఇప్పటికే మూడు కేసుల్లో శిక్ష ఖరారైంది. మరో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం బిర్సాముండా జైలులో లాలూ శిక్షననుభవిస్తున్నారు. తొలికేసులో తీర్పు 2013లోనే వెలువడగా అప్పట్లో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఆయన హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు. రెండో కేసులో తీర్పు ఈ ఏడాది జనవరి 6న వచ్చింది. ఈ కేసులో లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానాను సీబీఐ కోర్టు విధించింది. తొలి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో మూడున్నరేళ్లు, మూడో కేసులోనూ ఐదేళ్లు కలిపి మొత్తం లాలూకు పదమూడున్నరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయి కాబట్టి ఆయన ఐదేళ్లు మాత్రమే జైలులో ఉంటే చాలు. మరో రెండు కేసుల్లోనూ లాలూ ఇంకా నిందితుడిగా ఉన్నారు. వాటిలోనూ దోషిగా తేలి శిక్ష పడితే..అన్ని కేసుల్లోకెళ్లా అత్యధిక శిక్షాకాలం ఏది ఉంటుందో అంతకాలం మాత్రం ఆయన జైలులో ఉండాల్సి ఉంటుంది. -
'జడ్జీగారు ప్లీజ్.. నన్ను ఆ జైలులో పెట్టొద్దు'
సాక్షి, రాంచీ : 'సర్, దయచేసి ఒకసారి ఓపెన్ జైలు నియమనిబంధనలు చూడండి.. 60 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లకు పైగా శిక్ష పడినవారు, మావోయిస్టులకు మాత్రమే ఓపెన్ జైలు. పైగా శిక్ష పడిన వ్యక్తి ఇష్టం లేకుండా మీరు ఆ జైలులో పెట్టడం సరికాదు' అంటూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయమూర్తి శివపాల్ సింగ్‌ను విజ్ఞప్తి చేశారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఓపెన్ జైలులో లాలూ శిక్షను పూర్తి చేయాలని తీర్పు సమయంలో న్యాయమూర్తి చెప్పారు. దీని ప్రకారం ఆయన హజరీబాగ్‌లోని ఓపెన్ జైలుకు వెళ్లాలి. అక్కడ ఓ వంద కాటేజీలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి అందులో ఉండొచ్చు. పైగా ఏదైనా పనిచేసుకుంటూ, ఏదేని ఓ కళకు సంబంధించిన శిక్షణను కూడా పొందొచ్చు. 2013లో ఈ జైలును ప్రారంభించారు. మావోయిస్టులు, నేర విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు, లొంగిపోయినవారు తదితరులను ఆ జైలులో పెడుతుంటారు. లాలూను కూడా అదే జైలులో ఉండాలని న్యాయమూర్తి చెప్పగానే ఆయన నిరాకరించారు. అది మావోయిస్టుల కోసం ఉన్న జైలు అన్నారు. తన ఇబ్బందులు తనకు ఉంటాయని తెలిపారు. అయితే, గతంలో బిర్సా ముండా జైలుకు వెళ్లినప్పుడు లాలూ నిబంధనలు అతిక్రమించి వ్యవహరించినట్లు స్పష్టమైంది. -
'అతడిపై మాకు అస్సలు అనుమానం రాలేదు'
సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష పడిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ముందుగానే దొంగ కేసు పెట్టించుకొని జైలుకు వెళ్లిన ఇద్దరి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదంతా ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మదన్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు సుమిత్ అనే ఓ వ్యక్తితో తమపై కేసు పెట్టించుకొని ప్రస్తుతం బిర్సా ముండా జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. సరిగ్గా లాలూకు శిక్షపడి ఆ జైలుకు తరలించే ముందే వారు జైలుకు వెళ్లి ఆయనకు సపర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, మదన్ యాదవ్ కొన్ని రోజులుగా కనిపించకుండా పోవడం, దానిపై చర్చ జరుగుతుండటంతో అతడు జైలులో ఉన్నట్లు తెలిసింది. దీంతో అతడు నివాసం ఉంటున్న ప్రాంతం వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే మదన్ యాదవ్ ఓ ధనవంతుడు. అతడికి రూ.10వేల దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఇక లక్ష్మణ్ యాదవ్ అనే వ్యక్తి లాలూకు ఒకప్పుడు వంటమనిషిగా పనిచేశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసుల దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టగా ఆ ఇద్దరు లాలూకు సన్నిహితులని, ఆయనకు సపర్యలు చేసేందుకు వారికి వారే దొంగ కేసులు పెట్టించుకొని జైలుకెళ్లారని గుర్తించారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ 'సుమిత్ వచ్చి కేసు పెట్టినప్పుడు మాకు ఎలాంటి అనుమానం రాలేదు. పైగా వారు స్వయంగా కోర్టు మేజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు. అనంతరం వారిని బిర్సా ముండా సెంట్రల్ జైలుకు పంపించాం. అయితే, వారు లాలూ కోసమే ఫేక్ కేసు పెట్టించుకొని జైలుకు వెళ్లారని తెలిసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం' అని చెప్పారు. -
జైల్లో లాలూకు సేవకులు: జేడీయూ
పట్నా/రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. జైలులో సేవలందించేందుకు ఇద్దరు కార్యకర్తలను నియమించుకున్నారని జేడీయూ ఆరోపించింది. దాణా కుంభకోణం కేసులో ప్రస్తుతం ఆయన బిర్సా ముండా జైలులో ఉన్నారు. ఈ కేసులో దోషిగా తేలటంతో న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆయన్ను రాంచీ జైలుకు తరలించటానికి కొద్ది గంటల ముందే లక్ష్మణ్ మహతో, మదన్ యాదవ్ అనే నేరస్తులను అధికారులు అదే జైలుకు పంపారు. ఆ ఇద్దరూ ఆర్జేడీ కార్యకర్తలనీ తనకు సేవలు చేసేందుకు, వండి పెట్టేందుకు లాలూ నియమించుకున్నారని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ పేర్కొన్నారు. దీన్ని ఆర్జేడీ పార్టీ అధికార ప్రతినిధి శక్తిసింగ్ యాదవ్ ఖండించారు. -
లాలూ కోసం ఇంత పెద్ద త్యాగమా?
సాక్షి, పట్నా : జైలు అనే మాట వినిపిస్తేనే అమ్మో.. అని భయం వేస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎలాగైనా బయటపడేందుకు ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తాం. కానీ, స్వయంగా కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లే సాహసం ఎవరైనా చేస్తారా?.. సినిమాల్లో అయితే సాధ్యమేగానీ, నిజజీవితంలో మాత్రం చాలా అరుదు. అలాంటి ప్రయత్నమే ఓ ఇద్దరు వ్యక్తులు చేశారు. విశ్వాసం చూపించడంలో తమకు తామే సాటి అనిపించుకున్నారు. వారు ఆర్జేడీ అధినేత, దాణా కుంభకోణం కేసులో మూడున్నరేళ్ల జైలు శిక్షకు గురైన లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత విశ్వాసపాత్రులు. ఒకరు లాలూ వంటమనిషికాగా, మరొకరు పాలప్యాకెట్లు తీసుకురావడంవంటి సహాయక చర్యలు చేసే రాంచీకి చెందిన వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. లక్ష్మణ్ మహతో, మదన్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు తమపై తామే తమ బంధువుతో కేసులు పెట్టించుకొని, లాలూ ప్రసాద్ యాదవ్కంటే ముందే జైలుకు వెళ్లి అక్కడ ఆయనకోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మణ్ మహతో అనే వ్యక్తి లాలూ ప్రసాద్‌కు పలు విధాలుగా సాయం చేసేవాడు. ముఖ్యంగా వంట చేయడంతోపాటు లాలూ రాజకీయ క్షేత్రంలో కీలకంగా పనిచేసేవాడు. ఇక మదన్ యాదవ్ అనే వ్యక్తి లాలూ ఎప్పుడు రాంచీ వచ్చినా చాలా హడావుడి చేసేవారు. చురుకుగా లాలూ చేసే పనుల్లో పాల్గొంటూనే లాలూ ఇంటి పనులు చూసుకునేవాడు. లాలూ త్వరలోనే జైలులో అడుగుపెట్టనున్నారనే విషయం గమనించి.. రాంచీలో సుమిత్ యాదవ్ అనే ఓ వ్యక్తితో తాము అతడిపై దాడి చేసినట్లు ఓ పది వేల రూపాయల దొంగతనం చేసినట్లు కేసు పెట్టించుకున్నారు. అయితే, రాంచీలోని ఓ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేసేందుకు నిరాకరించగా మరో స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకున్నారు. దీంతో వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గత డిసెంబర్ (2017) 23నే బిర్సా ముండా జైలుకు వెళ్లారు. ఈ విషయం తెలిసిన వారంతా వీళ్లు మాములోళ్లు కాదని, మహాముదుర్లని, అందుకే అలా చేశారని అంటున్నారు. కాగా, ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో శిక్షపడిన లాలూ ప్రసాద్ వారు ఉంటున్న జైలుకే వెళ్లనున్నారు. -
లాలూ రోజుకూలీ @ రూ. 93
పట్నా : దాణా కుంభకోణంలో శిక్ష ఖరారైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను అధికారులు బిర్సా ముండా జైలుకు తరలించారు. లాలూ వయసును దృష్టిలో పెట్టుకుని.. ఆయన చేయ గలిగిన పనులనే అప్పగిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లాలూకు బిర్సా ముండా జైల్లో తోటపని అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ పని చేసినందుకు గానూ లాలూ రోజుకు.. 93 రూపాయల కూలీ లభిస్తుంది. ఇదిలావుండగా.. గడ్డి కుంభకోణంలో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ హిందీలో ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమానత్వం, దళితులు, వెనుకబడిన వర్గాల కోసం ప్రాణాలైనా ఇస్తాగానీ.. కాషాయ పార్టీకి తలొగ్గేది లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను మనువాదులుగా అభివర్ణించారు. -
థ్యాంక్ యూ నితీశ్.. లాలూ కొడుకు ట్వీట్
పట్నా : దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష కాలం ఖరారయ్యాక కోర్టు తీర్పును స్వాగతిస్తూ బీజేపీ, జేడీయూలు హర్షం వ్యక్తం చేయటం ఆర్జేడీ పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులపై ఆర్జేడీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. శత్రువులతో చేతులు కలపటమే కాకుండా.. మిత్రుడి(లాలూ)ని దారుణమైన వెన్నుపోటు పొడిచారంటూ బిహార్ సీఎం నితీష్ కుమార్ పై ఆర్జేడీ నేతలు విరుచుకుపడుతున్నారు. లాలూను ఇబ్బందులకు గురి చేసేందుకు బీజేపీ ఓ ప్రణాళికతోనే మహా కూటమిని విచ్ఛిన్నం చేసిందని.. ఈ క్రమంలో జేడీయూ కూడా వారికి తలొగ్గిందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక లాలూ తనయుడు తేజస్వి యాదవ్ తన ట్విట్టర్లో ఓ వ్యంగ్య పోస్టును ఉంచారు. థాంక్యూ వెరీ మచ్ నితీష్ కుమార్ అంటూ నిన్న సాయంత్రం ఆయన తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. Thank you very much Nitish Kumar — Tejashwi Yadav (@yadavtejashwi) 6 January 2018 అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ లాలూ బీజేపీతో సంధి చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ‘‘లాలూ బీజేపీ ముందు మోకరిల్లి ఉంటే.. ఆ పార్టీ ఆయన్ని రాజా సత్యహరిశ్చంద్రుడిగా అభివర్ణించి ఉండేదేమో. ఈ విషయంలో జేడీయూ చాలా ముందుంది’’ అని తేజస్వి ఎద్దేవా చేశారు. జేడీయూ నమ్మకద్రోహాన్ని మరిచిపోలేమన్న తేజస్వి .. తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఓవైపు బీజేపీ, మరోవైపు జేడీయూలు తేజస్వి వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నాయి. అవినీతి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినప్పుడే లాలూ జైలుకు వెళ్లటం ఖాయమైపోయిందని, తేజస్వి పిల్ల రాజకీయాలు మానుకోవాలని బీజేపీ సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ సూచించగా.. లాలూ అవినీతి రాజకీయాలకు శుభం కార్డు పడిందని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూ సహా మిగతా దోషులకు రాంచీ సీబీఐ న్యాయస్థానం మూడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసిన విషయం విదితమే. -
గడ్డిమేతకు మూడున్నరేళ్ల జైలు
రాంచీ: 21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్యాదవ్కు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.10 లక్షల జరిమానా కూడా లాలూ చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ శనివారం తీర్పునిచ్చారు. లాలూ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు అదనంగా జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆర్జేడీ చీఫ్ సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల పాటు జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించారు. లాలూతోపాటుగా మరో 15 మంది దోషులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం శిక్ష ఖరారుకు సంబంధించిన వాదనలు ముగియగా.. నాలుగు గంటలకు న్యాయమూర్తి శివ్‌పాల్‌సింగ్ తీర్పు చెప్పారు. ‘ఇటువంటి దోషులకు ఓపెన్ జైలు సరిగా సరిపోతుంది. ఎందుకంటే వాళ్లకు గతంలో ఆవులను పెంచిన అనుభవం ఉంది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 23నే వీరిని కోర్టు దోషులుగా గుర్తించినప్పటికీ మూడ్రోజులుగా శిక్షల ఖరారు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. మరో 15 మందికీ శిక్షలు ఖరారు మోసం, నేరపూరిత కుట్ర, తప్పుడు పత్రాల వినియోగంతో నిధుల విడుదలతోపాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద లాలూకు మూడున్నర ఏళ్ల జైలు శిక్ష విధించారని సీబీఐ న్యాయవాది వెల్లడించారు. అయితే, ఈ శిక్షను వచ్చే వారం జార్ఖండ్ హైకోర్టులో అప్పీలు చేయనున్నట్లు లాలూ తరపు న్యాయవాది చిత్తరంజన్ సిన్హా తెలిపారు. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో మరో 15 మందికీ ఐపీసీ, పీసీఏ (అవినీతి నిరోధక చట్టం) కింద ఆర్నెల్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షలను కూడా న్యాయమూర్తి ప్రకటించారు. కుంభకోణం జరిగిన సమయంలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా ఉన్న జగదీశ్ శర్మకు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, ఆర్జేడీ నేత ఆర్కే రాణాకు ఆర్నెల్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు బెక్ జూలియస్, ఫూల్‌చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్‌లకు మూడున్నరేళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానాను న్యాయమూర్తి విధించారు. మాజీ ప్రభుత్వాధికారి కృష్ణ కుమార్‌కు ఏడేళ్ల జైలు, రూ. 20 లక్షల జరిమానా, మాజీ అధికారి సుబీర్ భట్టాచార్యకు మూడున్నరేళ్ల జైలు రూ. 10 లక్షల జరిమానా, సప్లయర్ మోహన్ ప్రసాద్‌కు ఏడేళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా విధించారు. మిగిలిన వారికి కూడా దాదాపుగా ఇవే శిక్షలు పడ్డాయి. చట్టం ముందు అందరూ ఒకటే! లాలూ శిక్షపై బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్‌లు స్పందించాయి. చట్టం ముందు అందరూ సమానులేనని బీజేపీ నేత షానవాజ్ వ్యాఖ్యానించారు. ‘కోర్టు తన పని తాను చేసింది. దేశ సంపదను దోచుకునే వారికి ఇదో కీలకమైన గుణపాఠం. ఎట్టకేలకు బిహార్ ప్రజలకు న్యాయం జరిగింది’ అని షానవాజ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని.. రాజకీయ నేతలు ఇకపై తప్పు చేసేందుకు భయపడాల్సిందేనని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి పేర్కొన్నారు. లాలూ అరెస్టయినంత మాత్రాన ఆర్జేడీతో సంబంధాలు తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం సాగుతుందని వెల్లడించింది. కాగా, బీజేపీ, నితీశ్ కుమార్ కుట్రపన్ని మరీ లాలూను జైలుకు పంపారని ఆర్జేడీ ఆరోపించింది. బెయిల్ కోసం హైకోర్టుకెళ్తామని లాలూ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. జైలుకు రెండోసారి దాణా కుంభకోణంలో లాలూ జైలు శిక్ష అనుభవించటం ఇది రెండోసారి. 21 ఏళ్ల క్రితం దేవగఢ్ ట్రెజరీ నుంచి రూ.89.27 లక్షల నిధులను అక్రమంగా తీసుకున్నారనే కేసుపై లాలూ జైలుకెళ్తుండగా.. దంకా ట్రెజరీ నుంచి రూ.3.97 కోట్లు, చైబాసా ట్రెజరీ నుంచి రూ.36 కోట్లు, దోరండా ట్రెజరీ నుంచి రూ. 184 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారనే 3 కేసుల్లోనూ లాలూ విచారణ ఎదుర్కొంటున్నారు. 1996లో పట్నా హైకోర్టు దాణా స్కామ్‌పై విచారణకు ఆదేశించగా.. దేవ్‌గఢ్ ట్రెజరీకి సంబంధించిన కేసులో 1997, అక్టోబర్ 27న 38 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. కాలక్రమేణా 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
లాలూప్రసాద్ యాదవ్ రాయని డైరీ
మాధవ్ శింగరాజు రాంచీలో చలి ఎక్కువగా ఉన్నట్లుంది. బిర్సా ముండా జైలు కూడా రాంచీలో భాగమే కనుక ఇక్కడున్నవన్నీ చలికి బిగదీసుకుపోతున్నాయి. ఈ బిగదీసుకుపోతున్న వాటిలో పద్నాలుగు రోజులుగా నేనూ ఒకడిని. ప్రార్థన, ఉదయపు నడక.. వీటితో నన్ను నేను వెచ్చబరుచుకుంటున్నాను. ఇంకా మూడేళ్ల చలికాలాలు నేనిక్కడ గడపాలి! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇంటి నుంచి తెప్పించుకునే అవకాశం కల్పించారు. ఒక వంట మనిషిని పెట్టారు. కొన్ని పేపర్లు వస్తున్నాయి. టీవీ చూడనిస్తున్నారు. ఇవన్నీ నాకు అక్కరలేనివి. అందుకే సమకూర్చినట్లున్నారు! నాకు మనుషులు కావాలి. నేను మనుషులతో మాట్లాడాలి. అందుకు మాత్రం అనుమతించడం లేదు. అడిగినవి కాదనడం కన్నా, అక్కర్లేనివి అందివ్వడం పెద్ద శిక్ష మనిషికి! మునుపు ఇలా లేదు. గెస్ట్‌హౌస్‌నే నా కోసం జైలుగా మార్చారు. నన్ను కలవడానికి సీఎం కూడా వచ్చాడు. నేరుగా జైలుకే వచ్చాడు! హేమంత్ సొరేన్. కుర్రాడు. ‘‘లాలూజీ మీకు ఇక్కడ సౌకర్యంగానే ఉంది కదా’’ అని పక్కన కూర్చొని అడిగాడు. ‘‘లేకుంటే చెప్పండి ఏర్పాటు చేయిద్దాం’’ అన్నాడు. ‘‘నాకు మనుషులు కావాలి’’ అన్నాను. అర్థం చేసుకున్నాడు. మా పార్టీవాళ్లను పంపిస్తానన్నాడు. అవసరం అయితే తన పార్టీవాళ్లను కూడా పంపిస్తానన్నాడు. ‘‘మనవాళ్లు ఒడిశా, బెంగాల్‌లలో కూడా ఉన్నారు లాలూజీ, వాళ్లను కూడా రప్పిస్తాను’’ అన్నాడు. హేమంత్ సొరేన్ది జార్ఖండ్ ముక్తి మోర్చా. పేరుకు జార్ఖండ్ సీఎమ్మే కానీ, బిహార్ పిల్లాడిలా ఉండేవాడు. ‘‘మావాళ్లు చాలు హేమంత్’’ అన్నాను. ఇప్పుడు వారానికి ముగ్గురిని మాత్రమే బయటి నుంచి నన్ను కలవడానికి అనుమతిస్తున్నారు. వచ్చినవాళ్లు ‘‘ఎలా ఉన్నారు లాలూజీ’’ అని అడుగుతున్నారు. వచ్చినవాళ్లను ‘‘పార్టీ ఎలా ఉంది?’’ అని నేను అడుగుతున్నాను. అక్కడితో టైమ్ అయిపోతోంది. ఈ ఉదయం ఇంటి నుంచి అటుకులు, బెల్లం వచ్చాయి. కొన్ని పండ్లు, నువ్వులుండలు కూడా. నోటికి రుచిగా ఉన్నాయి. నా పక్క వాళ్లకు ఇచ్చాను. ‘‘బాగున్నాయి లాలూజీ’’ అన్నారు. వాళ్లెవరో నాకు తెలీదు. లోపలికి వచ్చాకే పరిచయం. ‘‘ఆ నితీశ్ కుమారే మిమ్మల్ని జైల్లో పెట్టించాడు లాలూజీ’’ అన్నాడు ఒక పరిచయస్తుడు. నవ్వాను. అతడు నా అభిమానిలా ఉన్నాడు. జైలుకు వచ్చినప్పటి నుంచీ అతను ఒకే మాట అంటున్నాడు. ‘‘మిమ్మల్ని కూడా మాతో కలిపేశారేంటి లాలూజీ’’ అని. జీవితంలో మనిషి దేనికో ఒకదానికి బందీ కావాలి. నేను పార్టీకి బందీని అయ్యాను. ఇష్టమైన దానికి బందీ అవడం కంటే స్వేచ్ఛ ఏముంది? జైల్లో ఉన్నా నేను స్వేచ్ఛాజీవినే. -
'సంక్రాంతి తర్వాత వాళ్ల సంగతి చెప్తా'
సాక్షి, పట్నా : దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నారేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత ఆయన చిన్నకుమారుడు తేజస్వీయాదవ్ స్పందించారు. తాను ప్రజాక్షేత్రంలోకి వెళతానని, తన తండ్రి ఇచ్చిన సందేశాన్ని వారికి వినిపిస్తానని అన్నారు. సమాజంలో పేద ప్రజలకోసం తన తండ్రిలాగే పోరాటం చేస్తానని మీడియా ప్రతినిధులకు చెప్పారు. తండ్రి లాలూకు శిక్ష పడిన అనంతరం తన పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేక సమావేశం అయిన అనంతరం తేజస్వీ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీపై ఆయన నిప్పులు చెరిగారు. తన తండ్రిపై మోదీ సర్కార్ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో చేతులు కలిపి కుట్ర చేసిందని అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా చేద్దామనే తలంపుతో తమ కుటుంబాన్ని అక్రమ కేసుల చట్రంలో ఇరికించిందని అన్నారు. 'లాలూ పేద ప్రజల రక్షకుడు. కొంతమంది నాయకులకోసమే సీబీఐ మా నాన్నపై చార్జీషీటు వేసిందని ప్రజలందరికీ తెలుసు. అయినా ఏ ఒక్కరూ మా సంకల్పాన్ని సవాల్ చేయలేరు. ఏం చేసినా మేం ఎవరిముందూ మోకరిల్లం. మకర సంక్రాంతి తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కుట్రలు చేసిన వారి సంగతి చెప్తాం. న్యాయవవస్థ తన పని తాను చేసింది. మేం హైకోర్టుకు వెళ్లి బెయిల్ పిటిషన్ వేస్తాం' అని ఆయన చెప్పారు. -
దాణా కుంభకోణంలో తుది తీర్పు వెల్లడి
రాంచీ : దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు శనివారం తుది తీర్పు వెల్లడించింది. రాంచీ సీబీఐ కోర్టు... బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్లు జైలుశిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు దోషులకు మూడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారణ చేసింది. అయితే అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని లాలూ నిన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. మరోవైపు లాలూకు జైలు శిక్షపై ఆయన తనయుడు తేజస్వి యాదవ్ స్పందించారు. చట్టం తన పని తాను చేసిందని, సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
ప్లీజ్.. తక్కువ శిక్ష విధించండి: లాలూ
రాంచీ: అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కోరారు. దాణా కుంభకోణం కేసులో డిసెంబర్ 23 నుంచి బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను సీబీఐ జడ్జి శివపాల్ సింగ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. తుది తీర్పు శనివారం చెప్తామని జడ్జి తమకు తెలియజేసినట్లు లాలూ తరఫు న్యాయవాది చిత్తరంజన్ చెప్పారు. అయితే, తనకు తక్కువ శిక్ష విధించాలంటూ జడ్జికి లాలూ లిఖితపూర్వకంగా విజ్ఞప్తి పంపారని లాయర్ తెలిపారు. దియోగర్ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూతోపాటు మరో 10 మందిపై కోర్టు విచారణ ఇప్పటికే పూర్తి చేసింది. -
లాలూపై తీర్పు నేటికి వాయిదా!
రాంచీ: దాణా కుంభకోణంలో బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. లాలూకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరుతూ ఆయన సన్నిహితులు పలువురు తనకు ఫోన్లు చేసినట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివపాల్ సింగ్ గురువారం వెల్లడించారు. తాను చట్టప్రకారమే తీర్పు ఇస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లాలూ, శివపాల్‌ల మధ్య ఆసక్తికరమైన సంవాదం నడిచింది. తాను ఉంటున్న బిర్సాముండా జైలులో చలి అధికంగా ఉందని లాలూ జడ్జీకి ఫిర్యాదు చేయగా.. న్యాయమూర్తి స్పందిస్తూ ‘అయితే తబలా వాయించండి’ అని వ్యంగ్యంగా జవాబిచ్చారు. అనంతరం లాలూ కోర్టులో సరిగ్గా ప్రవర్తించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా.. ‘నేను కూడా న్యాయవాదినే’ అని లాలూ ప్రతిస్పందించారు. -
సంచలన కేసు : లాలూకు శిక్ష ఖరారు వాయిదా
రాంచి : దావా కుంభకోణం కేసులో దోషిగా తేలిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష ఖరారు రేపటికి(గురువారానికి) వాయిదా పడింది. లాలూతో పాటు ఈ కుంభకోణంలో దోషిగా తేలిన 15 మందికి రేపే శిక్ష ఖరారు చేయనున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దావా కుంభకోణం రెండో కేసులో వీరందరిని గతేడాది డిసెంబర్ 23న దోషులుగా తేలుస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యాయవాది విందేశ్వరి ప్రసాద్ మరణించడంతో అతడి కేసు తీర్పును గురువారానికి వాయిదా వేస్తున్నట్లు రాంచీ స్పెషల్ సీబీఐ కోర్టు తెలిపింది. మరోవైపు ఈ కేసు విషయంలో కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారంటూ రఘువన్ష్ ప్రసాద్ సింగ్, తేజస్వి యాదవ్, మనోజ్ ఝాలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరు ముగ్గురు ఈ నెల 23న కోర్టుకు హాజరుకావాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన మనోజ్ ఝా ఈ కేసు తీర్పు గురించి తాము ఒక్క మాట మాట్లాడకపోయినా కోర్టు తమకు నోటీసులు పంపడం దారుణమని అన్నారు. దోషిగా తేలిన అనంతరం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ రాంచిలోని బిర్సా ముంద్రా సెంట్రల్ జైలులో ఉన్నారు. దావా కుంభకోణం తొలి కేసులో కూడా లాలూ దోషిగా తేలారు. కానీ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రెండో కేసు విచారణలోనూ లాలూ దోషే అని తేలింది. మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి 5 కేసులు నమోదయ్యాయి. 1991-96 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.84.5 లక్షలకుపైగా అక్రమంగా డ్రాచేశారు. లాలూతో పాటు 22 మందిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. 1997, అక్టోబర్ 27న దీనిపై సీబీఐ చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
జైల్లో లాలూ స్టైల్ ఇదీ...
సాక్షి, రాంచీ: పశుగ్రాసం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాంచీలోని హాత్వార్ జైలులో ఉంచారు. ఈ జైలులో లాలూ తన రొటీన్ లైఫ్‌కు ఏ మాత్రం భంగం కలుగనిరీతిలో వ్యవహరిస్తున్నారు. జైలులోని అప్పర్ డివిజన్ సెల్లో లాలూ లీజర్ టైమ్ గడుపుతున్నారు. ఇదే జైలులో ఉన్న సహచర రాజకీయ నేతలతో పలుమార్లు తేనీరు సేవిస్తూ మంతనాలు జరుపుతూ లాలూ హుషారుగా కనిపిస్తున్నారు. ఉదయాన్నే వార్తాపత్రికలు చదవడం, ఆయా వార్తలపై రాజకీయ సహచరులతో విపులంగా చర్చించడంతో లాలూ రోజు మొదలవుతుంది. వారి చర్చలు ప్రధానంగా బీహార్, జార్ఖండ్ రాజకీయాల చుట్టూ తిరుగుతాయని జైలు వర్గాలు తెలిపాయి. లాలూ సెల్‌కు దగ్గరలోనే అప్పర్ డివిజన్ సెల్ మెస్ ఉండటంతో రోజంతా లాలూ బృందానికి టీలు, స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. లాలూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుండగా అదే సమయంలో సెల్‌లోని ఇతర ఖైదీలు టీవీ చూస్తుంటారు. సెల్లో లాలూతో పాటు మాజీ ఎంపీ ఆర్కే రాణా, నేతలు జగదీష్ శర్మ, స్వర్ణ లక్రా, రాజా పీటర్, కమల్ కిషోర్ భగత్లున్నారు. ఇక లాలూకు ఇష్టమైన స్వీట్ కార్న్, వేయించిన బఠాణీలు, బాస్మతి రైస్ తదితర వంటకాలను జైలు మెస్‌లో అందుబాటులో ఉంచారు. లాలూ నివాసం నుంచి సంకట్ మోచన్ ఆలయ ప్రసాదం పంపారు. -
వాళ్లతో ఉంటే.. మా నాన్న సత్య హరిశ్చంద్రుడే!
సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం.. సీబీఐ కోర్టు తీర్పుపై బీహాన్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైలుకు పంపించి.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాజకీయంగా సమాధి చేశామని అనుకుంటే.. అది వారి మూర్ఖత్వమేనని తేజస్వి యాదవ్ అన్నారు. తప్పుడు ఆలోచనలు చేస్తున్న బీజేపీ, ఇతర పార్టీలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని ఆయన అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా మరికొందరిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సీబీఐ కోర్టు తీర్పు వెలువడిన రెండు రోజుల అనంతరం.. తేజస్వి యాదవ్ స్పందించడం గమనార్హం. లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైలుకు పంపిస్తే.. ఆయన పని అయిపోతుందని బీజేపీ, ఇతర పార్టీలు అనుకోవడం మూర్ఖత్వానికి నిదర్శనం అని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ లాలూప్రసాద్ యాదవ్ బీజేపీతో కలిసుంటే.. వారికి మా నాన్న రాజా హరిశ్చంద్రుడిలా కనిపించేవారని అన్నారు. సీబీఐ కోర్టు తీర్పులో కుట్ర దాగుందని అయన అనుమానాం వ్యక్తం చేశారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టులో తగిన న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని తేజస్వి యాదవ్ వ్యక్తం చేశారు.