బిహార్ సీఎం నితీశ్ కుమార్ (ఫైల్ ఫోటో)
పట్నా : ఓవైపు ఏపీ ప్రత్యేక హోదా అంశం హస్తినలో వేడిని పుట్టిస్తున్న వేళ.. తమ రాష్ట్రం ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. బిహార్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీని నిలదీయాంటూ సీఎం నితీశ్‌కు లాలూ సూచిస్తున్నాడు.
‘నితీశ్.. నీ బాస్(మోదీని ఉద్దేశించి)ను బిహార్ ప్రత్యేక హోదాపై ఎందుకు అడగట్లేదు?’ అంటూ లాలూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం దాణా స్కామ్ కేసులో లాలూ రాంచీ జైల్లో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జైలు నుంచే ఆయన ట్వీట్లు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు.
ప్రధాని మోదీ 2014లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తానన్న విషయాన్ని ఈ సందర్భంగా లాలూ గుర్తు చేశారు. ఇక లాలూ తనయుడు తేజస్వి కూడా ప్రత్యేక హోదాపై ట్వీట్ చేశాడు. స్పెషల్ స్టేటల్ అంశాన్ని పక్కనపెట్టి.. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ నితీశ్‌పై తండ్రి-కొడుకులిద్దరూ మండిపడ్డాడు.
Why Nitish not asking his boss to accord Special Status to Bihar?
— Lalu Prasad Yadav (@laluprasadrjd) 8 March 2018
PM Modi had promised Special Status to Bihar in March 2014 Loksabha election rally at Muzaffarpur. Nitish must play that speech recording in front of PM.
For personal gains Nitish surrendered Bihar’s benefits.
Comments
Please login to add a commentAdd a comment