పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన అనూహ్య ప్రవర్తనతో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లను నమస్కరించేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిహార్‌లోని దర్భంగా ప్రాంతంలో ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ వైపు నడుస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం వెంటనే మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రధాని.. తన పాదాలను తాకకుండా సీఎంను ఆపారు. నితీష్‌కు కరచాలనం అందించారు.
అయితే మోదీ పాదాలను నితీష్ తాకడం ఇదేం తొలిసారి కాదు. గత జూన్‌లో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ఆయన ప్రయత్నించారు. అంతకముందు ఏప్రిల్‌లోనూ నవాడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్.. మోదీ కాళ్లను ముట్టుకున్నారు.
చదవండి: ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లు
Bihar CM Nitish Kumar attempts to touch PM Modi's feet again, showing a growing bond between the leaders. #NarendraModi #Bihar #NitishKumar #BreakingNews
Follow @DigitalUpdateIN pic.twitter.com/kOopns9ZrY— Digital Update India 🇮🇳 (@DigitalUpdateIN) November 13, 2024
Comments
Please login to add a commentAdd a comment