Darbhanga
-
Video: ప్రధాని మోదీ కాళ్లు మొక్కబోయిన నితీష్ కుమార్..
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన అనూహ్య ప్రవర్తనతో మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లను నమస్కరించేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బిహార్‌లోని దర్భంగా ప్రాంతంలో ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ వైపు నడుస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం వెంటనే మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. గమనించిన ప్రధాని.. తన పాదాలను తాకకుండా సీఎంను ఆపారు. నితీష్‌కు కరచాలనం అందించారు.అయితే మోదీ పాదాలను నితీష్ తాకడం ఇదేం తొలిసారి కాదు. గత జూన్‌లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని కాళ్లకు నమస్కరించేందుకు ఆయన ప్రయత్నించారు. అంతకముందు ఏప్రిల్‌లోనూ నవాడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్.. మోదీ కాళ్లను ముట్టుకున్నారు.చదవండి: ఎన్నికల వేళ.. అజిత్ పవార్ ఎన్సీపీకి సుప్రీంకోర్టు చీవాట్లుBihar CM Nitish Kumar attempts to touch PM Modi's feet again, showing a growing bond between the leaders. #NarendraModi #Bihar #NitishKumar #BreakingNewsFollow @DigitalUpdateIN pic.twitter.com/kOopns9ZrY— Digital Update India 🇮🇳 (@DigitalUpdateIN) November 13, 2024 -
తమిళనాడులో గూడ్స్ రైలును ఢీ కొన్న మైసూరు-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్... రెండు బోగీల్లో మంటలు... పట్టాలు తప్పిన 13 కోచ్‌లు.. ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు
-
న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగి మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. సరాయ్ భూపత్ స్టేషన్ నుంచి దాటిపోతున్న క్రమంలో స్లీపర్ కోచ్ నుంచి పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన స్టేషన్ మాస్టర్.. ట్రైన్ డ్రైవర్, గార్డ్‌కు విషయాన్ని చేరవేశాడు. #WATCH | Fire broke out in the S1 coach of train 02570 Darbhanga Clone Special when it was passing through Sarai Bhopat Railway station in Uttar Pradesh. According to CPRO, North Central Railways, there are no injuries or casualties (Earlier Video; Source: Passenger) pic.twitter.com/mTFHcTlhak — ANI (@ANI) November 15, 2023 దీంతో రైలును అక్కడే నిలిపివేయగా ప్రయాణికులందరూ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. రైలుకు పూర్తి స్థాయిలో మంటలు అంటుకున్నాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కామ్రేడ్ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్ -
Ruchi Varma: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..
సొంతంగా ఏదైనా సాధించాలనే కల అందరిలోనూ ఉంటుంది. ఆ కల కోసం నిరంతరం శ్రమిస్తేనే అనుకున్న ఫలితాలను అందుకోగలం. కానీ, కుటుంబ బాధ్యతలలో చాలా వరకు కలలు కల్లలుగానే ఉండిపోతాయి. ఉద్యోగం చేస్తున్న రుచివర్మ పరిస్థితి మొదట్లో అలాగే ఉండేది. వ్యాపారం వద్దని అడ్డుకున్న కుటుంబాన్ని మెప్పించింది, కాబోయే తల్లులకు డ్రెస్ డిజైన్స్ పేరుతో రెండున్నర లక్షలతో మొదలు వ్యాపారం మొదలుపెట్టి, రెండేళ్లలో ఏడాదికి 5 కోట్ల టర్నోవర్ చేరుకునేలా కృషి చేసింది. ఉద్యోగం వదులుకున్న పరిస్థితి నుంచి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన తన తపన నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ‘‘మాది బీహార్‌లోని దర్భంగా పట్టణం. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న బ్యాంకు ఉద్యోగి, అమ్మ గృహిణి. ముగ్గురు అక్కచెల్లెళ్లం. దర్భంగా నుండి ముంబైకి ఫ్యాషన్ డిజైనర్‌గా నా ప్రయాణం సాగింది. ► అమ్మ కోరుకున్నదని.. ప్రతి తల్లిదండ్రిలాగే మా అమ్మ కూడా మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఇంజనీర్లు కావాలని కోరుకునేది. ఆమె కల నెరవేర్చడానికి చాలా ప్రయత్నించాను. కానీ, ఆ కోచింగ్ ఖర్చు భరించడం పెద్ద విషయంగా అనిపించింది. అమ్మనాన్నల గురించి ఆలోచించినప్పుడు నా మనసులో చాలా గందరగోళం ఏర్పడింది. ఇవన్నీ ఆలోచించి నా శక్తి మేరకు ప్రయత్నించి, ఆ కోచింగ్ నుంచి ఆరు నెలల్లో తిరిగి వచ్చేశాను. ► ఫ్యాషన్ పరిశ్రమ వైపు మనసు దర్భంగా భూమి కళలకు ప్రసిద్ధి. మా ఇంటి పక్కన టైలర్‌గా పనిచేసే ఆమె వర్క్ నన్ను బాగా ఆకట్టుకునేది. ఈ విషయం ఇంట్లో చెప్పలేకపోయాను. ధైర్యం తెచ్చుకుని నాకు ఆర్ట్స్ అంటే ఆసక్తి ఉందని, ఇంజినీరింగ్ చదవలేనని నాన్నకు చెప్పాను. నాన్న అంతా గ్రహించి, ఏ చదువు కావాలో దానినే ఎంచుకోమన్నారు. దీంతో నేను నిఫ్ట్‌లో చేరాను. ► ప్రతి నిర్ణయమూ కష్టమే నిఫ్ట్ పరీక్షలో పాసయ్యాక ముంబైకి వెళ్లాలనే నిర్ణయం కష్టమే అయ్యింది. ఒంటరిగానా?! అని భయపడ్డారు. కానీ, కొన్ని రోజుల ప్రయత్నంలో నా ఇష్టమే గెలిచింది. అది నా జీవితాన్ని మార్చింది. కాలేజీ నుంచి వెళ్లి ఓ ఎక్స్పోర్ట్ హౌజ్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ మెటర్నిటీ వేర్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. మూడేళ్లపాటు ఆ ఎక్స్పోర్ట్ హౌస్‌లో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఆఫీసు, ఫ్యాక్టరీ ఒకే చోట ఉండడం వల్ల డిజైనింగ్ కాకుండా ప్రింటింగ్, స్టిచింగ్, శాంపిల్, ప్రొడక్షన్ నేర్చుకున్నాను. ఆ వర్క్ నాకు చాలా ఉపయోగపడింది. ► ఎక్కడో ఏదో లోటు. 2012 లో మొదటి ఉద్యోగం వస్తే 2019 నాటికి, నేను నాలుగు కంపెనీలలో డిజైనర్ నుండి సీనియర్ డిజైనర్ స్థానానికి చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి మాత్రం లభించలేదు. పని పెరుగుతూ వచ్చింది. స్థిర జీతం అలవాటుగా మారింది. కానీ ఎప్పుడూ ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. బాల్యంలో టైలర్ ఆంటీని స్ఫూర్తిగా తీసుకుంటే టెన్త్ క్లాస్ వచ్చేనాటికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నా ఆదర్శంగా ఉండేవారు. ‘నేను కూడా నా సొంత బ్రాండ్‌ని ప్రారంభించాలనుండేది. నేను ఉద్యోగం కోసమే ఈ కోర్సు ఎంచుకోలేదు.. ఎలా?’ అనే ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు. ► ఇంట్లో వాళ్లు మాట్లాడలేదు... 2019లో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం మానేసినట్లు తల్లిదండ్రులు, భర్తకు చెప్పినప్పుడు వారు సంతోషించలేదు. మొదట నా భర్త చాలా నిరాకరించాడు. తరువాత నా తల్లిదండ్రులు కూడా సెటిల్డ్ లైఫ్ ను ఎందుకు వదిలేయాలి అనే మాటలే. ఇంట్లో ఉన్నవాళ్లంతా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లకు నా బాధ అర్థం కాకుండాపోయింది. నేనే ఓ రోజు నిర్ణయం తీసుకుని ఉద్యోగం వదిలేశాను. ఉద్యోగం మానేసినందుకు నా భర్త కొన్ని రోజులు మాట్లాడలేదు. రీసెర్చ్ వర్క్ చేశాక, వచ్చే 34 నెలల ప్లానింగ్‌ని మా అమ్మనాన్నలకు చెప్పాను, అప్పుడు వాళ్ళు కొద్దిగా కన్విన్స్అయ్యారు. నేను రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. ► చులకనగా మాట్లాడేవారు.. ఈ రంగంలోకి రాకముందే చాలా పరిశోధనలు మొదలుపెట్టాను. మార్కెట్లో ఏ సెక్షన్ కు డిమాండ్ పెరుగుతుందో కనిపించింది. కాబోయే తల్లుల దుస్తుల విషయంలో చాలా లోటు కనిపించింది. ఇంతకు ముందు ఇదే రంగంలో పనిచేశాను కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం వచ్చి ఈ ప్రొడక్ట్‌ని ఎంచుకున్నాను. అయితే, రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. వన్ మ్యాన్ ఆర్మీలా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం డిజైనింగ్ వర్క్ మాత్రమే చేశాను. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ లైన్, లోగో డిజైనింగ్, ప్యాకేజింగ్, డెలివరీ ఫైనాన్స్లాంటివన్నీ చేశాను. ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ అతిపెద్ద సమస్య ఏర్పడింది. నా అవస్థ చూసి ఎగతాళి చేసినవారున్నారు. చులకనగా మాట్లాడినవారున్నారు. ‘ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు డ్రెస్ డిజైన్స్ ఏంటి?!’ అని నాతో పని చేయడానికి వర్కర్స్ నిరాకరించేవారు. దీంతో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొన్నాను. కానీ, నా పట్టుదలను వదిలిపెట్టలేదు. రెండేళ్లలో 2.5 లక్షల వ్యాపారం కోట్లకు కోవిడ్ కాలం అందరికీ కష్టంగా ఉండేది. దీంతో ఆఫ్‌లైన్ పనులు ప్రారంభం కాలేదు. అప్పుడు నా వ్యాపారం ఆఫ్‌లైన్ లో మాత్రమే చేయాలని ఆలోచించాను. ఇది నాకు ప్రయోజనకరంగా మారింది. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ సైట్స్‌తో మాట్లాడాను. ముందు నా ప్రతిపాదనను వాళ్లు అంగీకరించలేదు. దీంతో నా సొంత సైట్లో ‘ఆరుమి’పేరుతో కాబోయే తల్లుల కోసం చేసిన నా డిజైన్స్ పెట్టాను. ప్రారంభించిన 24 గంటల్లోనే ఆర్డర్లు రావడం మొదలయింది. ఈ రోజు నా బ్రాండ్ అన్ని ఆన్లైన్ మార్కెట్లోనూ సేల్ అవుతోంది’’ అని వివరించే రుచివర్మ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
పాక్ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు.. కుట్ర పన్నింది ఇలా...
సాక్షి, హైదరాబాద్: బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్లో ఈ ఏడాది జూన్ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్ కేంద్రంగానే కుట్ర సాగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో యూ పీవాసి ఇక్బాల్ ఖానా (ప్ర స్తుతం లాహోర్‌లో ఉంటున్నాడు) ఈ కుట్రను అమలు చేసినట్లు నిర్ధారించింది. ఈ మేరకు గురువారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు హైదరాబాదీలతో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేసింది. పేలుడుకు కుట్ర పన్నింది ఇలా... ► ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా ఖైరాన ప్రాంతానికి చెందిన మహ్మద్ నాసిర్ ఖాన్ హై దరాబాద్ మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ సమీపంలో ఉండేవాడు. అతని సోదరుడు ఇమ్రాన్ మాలిక్ స్వస్థలంలో ఉండేవాడు. ► ఖైరాన ప్రాంతానికే చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖానా 1993 నుంచి నకిలీ నోట్ల చెలామణి చేస్తున్నాడు. అతనిపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పాక్‌కు పారిపోయి లాహోర్‌లో ఉంటున్నాడు. ► అక్కడి నుంచే ఐఎస్ఐ సహకారంతో నకిలీ నోట్ల చెలామణితోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. లష్కరే తోయిబాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ► ఇక్బాలే కొన్నాళ్ల క్రితం ఆన్లైన్ ద్వారా ఇమ్రాన్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. స్థానిక పదార్థాలతో పేలుళ్లు జరపడం ఎలా? అని ఆన్లైన్లో శిక్షణ ఇస్తూ యూ ట్యూబ్‌లోని కొన్ని వీడియోలు పంపాడు. ► గతంలో పాక్‌కు వెళ్లిన నాసిర్ అక్కడ ఉగ్రవాద శిక్షణ పూర్తి చేసి వచ్చాడు. బాంబుల తయారీ నుంచి గూఢచర్యం వరకు వివిధ అంశాల్లో అతను శిక్షణ పొందాడు. ► వేగంగా వెళ్లే రైళ్లలో అగ్నిప్రమాదాలు సృష్టించి భారీ ప్రాణనష్టం సృష్టించాలని ఇక్బాల్ చెప్పడంతో ఈ ఏడాది మేలో సిటీకి వచ్చిన ఇమ్రాన్ తన సోదరుడు నాసిర్ వద్ద ఆశ్రయం పొందాడు. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రాలకు, కేంద్రం కీలక ఆదేశాలు సొంతంగా బాంబు తయారీ... దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టాలని నిర్ణయించుకొని చిక్కడపల్లి, హబీబ్నగర్లలోని దుకాణాల్లో కొన్న సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించి మంటలు సృష్టించే బాంబు తయారు చేశారు. ► గాజు సీసాలోకి ఈ పదార్థాలను ఇంజెక్షన్ సిరంజిల ద్వారా నింపి 16 గంటల్లో పేలి జరిగి మంటలు చెలరేగేలా కుట్రపన్నారు. ► ఈ ఏడాది జూన్ 15న రెడీమేడ్ వస్త్రాల పార్శిల్లో ఈ సీసాను ఉంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దర్భంగ వెళ్లే దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో దీన్ని బుక్ చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఈ పేలుడు ఆలస్యమైంది. 17న దర్భంగ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగి పార్సిల్‌ను అన్లోడ్ చేశాక స్వల్ప పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. ► దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ... ఇక్బాల్ ఖానా, నాసిర్, ఇమ్రాన్లతోపాటు వారికి పరోక్షంగా సహకరించిన యూపీవాసులు హాజీ సలీం, ఖఫీల్ అహ్మద్‌లను అరెస్టు చేసింది. ► సికింద్రాబాద్ పార్శిల్ ఆఫీస్‌లో ఈ అన్నదమ్ములు మహ్మద్ సూఫియాన్ పేరు తో ఇచ్చిన పాన్ కార్డు కాపీనీ ఇక్బాలే వాట్సాప్ ద్వారా పంపాడని ఎన్ఐఏ గుర్తించింది. -
దర్బంగా బ్లాస్ట్ NIA విచారణలో కీలక అంశాలు
-
దర్భంగా పేలుళ్ల విచారణ... కీలక అంశాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: దర్భంగా పేలుడు ఘటనపై జరుగుతున్న విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. దర్భంగా పేలుడు సూత్రధారులకు హవాలా రూపంలో డబ్బులు అందినట్లు తెలిసింది. పేళుళ్లలో ప్రధాన సూత్రధారులైన మాలిక్ సోదరులకు హాజీ సలీం హవాలా రూపంలో డబ్బులు అందించినట్లు సమాచారం. పదేళ్ల క్రితం పాకిస్తాన్లో ఇక్బాల్ ఖానాని నాసిర్, మాలిక్ కలిశారు. ఆ సమయంలోనే నాసిర్, మాలిక్‌లు కెమికల్ బాంబుల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత సొంత జిల్లా కైరానాలో హాజీ సలీంతో కలిసి పేలుళ్లకు కుట్ర పన్నారు. దీని కోసమే నాసిర్, మాలిక్‌లకు హవాలా రూపంలో డబ్బులు సరఫరా జరిగింది. హాజీ పంపిన డబ్బులతోనే నాసిర్, మాలిక్‌లు కెమికల్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు లష్కరే తొయిబా ఉగ్రవాది ఇక్బాల్ పాక్‌లోనే ఉండి పెద్ద ఎత్తున్న బ్లాస్ట్‌లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్లాస్టింగ్స్ కోసం లష్కరే తొయిబా ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని ఎంపిక చేసింది. -
దర్భంగా బ్లాస్ట్: కశ్మీర్లో ఇమాజ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
కశ్మీర్: దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాఫ్తు సంస్థ( ఎన్ఐఏ) మరొక నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసింది. కశ్మీర్లో ఇమాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నిందుతులైన మాలిక్ సోదరులతో కలిసి ఇమాజ్ దర్భంగా పేలుడుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇటీవల దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. -
ఒక్కో బ్లాస్ట్‌కు రూ.కోటి ఇస్తామని నిందితులకు లష్కరే తోయిబా ఆఫర్
-
NIA అధికారులనే బురుడీ కొట్టించిన మాలిక్ బ్రదర్స్
-
దర్భంగా పేలుడు కేసులో కొత్తకోణం
-
దర్భాంగా బ్లాస్ట్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
-
దర్భంగా బ్లాస్ట్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడింది. పాకిస్తాన్ నుండి ఇక్బాల్ ఖానా ఆదేశాలు ఇచ్చేందుకు సోషల్ మీడియా ద్వారా వాయిస్ కాల్స్ చేసినట్లు నిర్థారణ అయ్యింది. హాజీ సలీమ్‌కి ఇంటర్నెట్ పై అవగాహన లేకపోవడంతో ఖలీం అనే వ్యక్తి సహాయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఖలీం సోషల్ మీడియా ఖాతా ద్వారా హాజీ సలీమ్ తో ఇక్బాల్ ఖానా వాయిస్ కాల్స్ మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఒక్కో బ్లాస్ట్ కు కోటి రూపాయల నజరానా ఇస్తామని మాలిక్ సోదరులకు ఇక్బాల్ ఆశ చూపినట్లు విచారణలో వెల్లడైంది. 2012లో పాకిస్థాన్ ఆఫ్గన్ సరిహద్దులో ముఖ్య నేతలను కలిసినట్టు నజీర్ మాలిక్, హాజీ సలీం అంగీకరించారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. -
ఢిల్లీకి ‘దర్భంగ ఉగ్రవాదులు’
సాక్షి, హైదరాబాద్: బిహార్‌లోని దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటనం కేసులో నిందితులుగా ఉన్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఢిల్లీకి తరలించారు. ఇద్దరినీ హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో పట్టుకున్న విషయం తెలిసిందే. వీరి కస్టడీ గడువు పూర్తి కావడంతో శుక్రవారం బిహార్ రాజధాని పట్నాలో ఉన్న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరి నుంచి మరికొంత సమాచారం సేకరించాల్సి ఉందని, మరో పది రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఈ నెల 16 వరకు అనుమతించింది. దీంతో ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు సోమవారం బిహార్ నుంచి ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ ఉగ్రవాద కుట్రలో కీలకంగా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా వాసి సలీంను సైతం కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఐఏ భావించింది. అనారోగ్య కారణాలతో అతగాడు పట్నా హాస్పిటల్లో చేరడంతో సాధ్యం కాలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక బృందం సిటీకి వచ్చే అవకాశం ఉంది. -
దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్ : దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. పండగల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నిఘా పెంచారు. కాగా, ఎన్ఐఏ అధికారులు తాజాగా హైదరాబాద్‌లో ఒకరిని, యూపీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ-హైదరాబాద్ లింకులపై ఆరా తీస్తున్నారు. ఉనికిని చాటుకునేందుకు లష్కరే తొయిబా స్లీపర్‌సెల్స్‌ను యాక్టివ్ చేసినట్లు.. విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. దర్భంగా పేలుడు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్భంగా రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటం కేసులో హైదరాబాద్ కేంద్రంగా బాంబు తయారుచేయడంతో విచారణను ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు ఉగ్రవాదులను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పండుగలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. -
దర్భంగ కేసు’.. ఎవరీ ఇక్బాల్ ఖానా?
సాక్షి, హైదరాబాద్: దర్భంగ ఎక్స్‌ప్రెస్ దహ నానికి కుట్ర కేసుతో ఇక్బాల్ ఖానా పేరు దక్షిణాదిలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరాది పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలకు ‘సుపరిచితుడైన’ ఇతడే ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా(ఎల్ఈటీ) తరఫున పనిచేస్తూ మల్లేపల్లిలో నివసించిన అన్నదమ్ములు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన హాజీ, ఖఫీల్‌ను ఉగ్రవాదులుగా మార్చాడు. వీరి ద్వారానే దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం సృష్టించడానికి కుట్రపన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఇక్బాల్ ఖానా నేపథ్యమిది.. ►ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ సమీపంలో ఉన్న ఖైరానా ప్రాంతానికి చెందిన ఇతడి అసలు పేరు మహ్మద్ ఇక్బాల్ మాలిక్. పుట్టుకతోనే కుడి కంటిలో లోపం ఉండటంతో ఇక్బాల్ ఖానాగా మారాడు. ►ఖైరానా ప్రధాన రహదారిపై కూరగాయల దుకాణం నిర్వహించే ఇక్బాల్‌కు ఆది నుంచి ధనార్జనపై ఆశ ఎక్కువగా ఉండేది. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తమ ప్రాంతానికే చెందిన గోల్డ్ స్మగ్లర్ హాజీ అనీస్ ముఠాలో చేరాడు. ►1980 నుంచి బంగారం స్మగ్లింగ్ చేసిన ఈ గ్యాంగ్ 1990లో ఇక్బాల్ చేరిన తర్వాత మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కూడా ప్రారంభించింది. దీంతో ఖైరానా ప్రాంతానికి చెందిన మిగిలిన ముఠాలతో వైరం ఏర్పడింది. ►ఇక్బాల్ 1992లో యూపీలోని సహరన్‌పూర్‌కు చెందిన ముస్తారీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 1993–94లో రెండుసార్లు ప్రత్యర్థి వర్గాలు ఇక్బాల్‌పై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశాయి. ►మరోపక్క పోలీసు నిఘా కూడా ముమ్మరం కావడంతో 1995 జూన్‌లో పాక్‌కు మకాం మార్చిన ఇక్బాల్ అక్కడి లాహోర్‌లో ఉన్న బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందాడు. కొన్నాళ్లకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెల్నీ అక్కడకు రప్పించుకున్నాడు. ►లాహోర్ చేరిన తొలినాళ్లలో ఇక్బాల్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడలేదు. అక్కడి యతీంఖానా ప్రాంతంలో నివసించే ఐఎస్ఐ ఏజెంట్ తారిఖ్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత స్మగ్లర్‌గా మారాడు. ►ఇక్బాల్ నేరచరిత్ర, ఖైరానా ప్రాంతంలో అతడికి ఉన్న పరిచయాలు, భారత్‌లో ఉన్న నెట్వర్క్ తెలుసుకున్న తారిఖ్ అతడి ద్వారా ఆయుధాలను అక్రమ రవాణా చేయించాడు. వీటిని ఖైరానాలో ఉన్న ఇక్బాల్ గ్యాంగ్ ఉత్తరాదిలో విక్రయించేది. ►1996 నుంచి భారీస్థాయిలో ఆయుధాల సరఫరా స్మగ్లింగ్ చేయాలని తారిఖ్–ఇక్బాల్‌లు భావించారు. అందుకోసం అప్పట్లో పాకిస్థాన్‌లో నివసించిన స్విస్ జాతీయుడు క్రిస్టోఫర్‌ను వాడుకున్నాడు. ►అతడి కార్‌వ్యాన్‌లో రహస్య అరలు ఏర్పాటు చేసి వాటిలో ఆయుధాలు మందుగుండు సామాగ్రి నింపారు. ఖర్చుల కోసం రూ.లక్ష ఇచ్చి భారత్‌కు పంపారు. ఆయుధాల డెలివరీ పూర్తయిన తర్వాత మరో రూ.35 వేల డాలర్లు ఇస్తామన్నారు. ►ఇతగాడిని ఢిల్లీ పోలీసులు 1996 ఫిబ్రవరి 17న అరెస్టు చేసి భారీస్థాయిలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. క్రిస్టోఫర్‌కు సహకరిస్తున్న హసన్ పోద్దార్‌ను పట్టుకున్నారు. ►వీరి విచారణలోనే ఇక్బాల్ లాహోర్ కేంద్రంగా చేస్తున్న కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇతగాడు భారత ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. 1999 తర్వాత ఐఎస్ఐకి మరింత సన్నిహితంగా మారాడు. ►భారత సైనిక రహస్యాలను అందించడానికి అవసరమైన ఏజెంట్లను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాడు. ఇలా ఇతడి కోసం పనిచేస్తున్న ఖైరానావాసి సమయుద్దీన్ 2001 డిసెంబర్లో పట్టుబడ్డాడు. ►ఆ తర్వాత నుంచి భారత్‌కు నకిలీ కరెన్సీ సరఫరా, చెలామణి కోసం ఐఎస్ఐ ఇక్బాల్‌ను వాడుకుంది. ఏటా వందల కోట్ల నకిలీ కరెన్సీని తన అనుచరుల ద్వారా చెలామణి చేయించాడు. ► పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఇక్బాల్ మాలిక్ నకిలీ కరెన్సీ చెలామణి నుంచి ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ వైపు మారాడు. తాజాగా లష్కరే తొయిబా కోసం కొందరిని రిక్రూట్ చేసి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు ప్లాన్ చేశాడు. -
హైదరాబాద్ కు దర్భాంగా పేలుడు కేసు నిందితులు
-
అందుకే ‘దర్భంగ బాంబు’ విస్ఫోటనం ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: లాహోర్‌లోని ఇక్బాల్ ఖానా న్యూస్ పేపర్ వాడమంటే.. నగరంలో నివసిస్తున్న లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అట్టముక్క వినియోగించారు. ఇదే దర్భంగా ఎక్స్‌ప్రెస్ అగ్నికి ఆహుతి కాకుండా కాపాడింది. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ అధికారుల విచారణలో ఈ విషయం బయటపెట్టారు. మరోపక్క కేసు దర్యాప్తులో భాగంగా క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం ఇద్దరు ఉగ్రవాదుల్నీ అధికారులు సోమవారం నగరానికి తీసుకువచ్చారు. ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ తరఫున పని చేస్తున్న ఇక్బాల్ ఖానా ఉత్తరప్రదేశ్‌కు చెందిన తండ్రీకొడుకులు హాజీ, ఖఫీల్ ద్వారా నగరంలోని మల్లేపల్లిలో నివసిస్తున్న యూపీ వాసులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్‌లను రంగంలోకి దింపారు. దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో రసాయనాల బాటిల్ ద్వారా విస్ఫోటనం కలిగించి భారీ అగ్ని ప్రమాదం సృష్టించడమే వీరి కుట్ర. దీనికోసం స్థానికంగా లభించే రసాయనాలతోనే బాంబు మాదిరి తయారు చేయాలని అన్నదమ్ములకు ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరు హబీబ్‌నగర్, చిక్కడపల్లిలోని దుకాణాల నుంచి సల్ఫ్యూరిక్, నైట్రిక్ యాసిడ్స్, పంచదార తదితరాలు ఖరీదు చేశారు. ఈ రసాయనాలతో విస్ఫోటనం ఎలా సృష్టించాలో వివరించే యూ ట్యూబ్ లింకుల్ని షేర్ చేశారు. దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో పంపాల్సిన పార్శిల్ ఉంచాల్సిన ‘బాటిల్ బాంబు’ తయారీపై ఇక్బాల్ ఈ అన్నదమ్ములకు సూచనలు చేస్తూనే ఉన్నాడు. ఓ టానిక్ సీసాలో ఈ మూడింటినీ నేర్పుగా, వేర్వేరుగా ఏర్పాటు చేయించాడు. సిడ్స్‌ను వేరు చేయడానికి మందంగా మడతపెట్టిన న్యూస్ పేపర్ వాడాలంటూ ఇక్బాల్ స్పష్టం చేశాడు. పంచదార కరిగి రసాయనాల్లో కలవడానికి చిన్న సిరంజీతో నీళ్లు ఉంచి చుక్కలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించాడు. ‘బాటిల్’ను సిద్ధం చేస్తున్న ఇమ్రాన్, నాసిర్‌లు ఎన్నిసార్లు ప్రయత్నించినా న్యూస్ పేపర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. దీంతో మందమైన అట్ట ముక్కను వినియోగించి యాసిడ్స్‌ను వేరు చేశారు. దీన్ని వ్రస్తాల పార్శిల్ మధ్యలో పెట్టారు. దీంతో ఆ అట్టముక్క పూర్తిగా కరిగి రెండు యాసిడ్స్ కలవడానికి ఎక్కువ సమయం పట్టింది. ఫలితంగా రైలు నడుస్తుండగా కాజీపేట– రామగుండం స్టేషన్ల మధ్య జరగాల్సిన విస్ఫోటనం దర్భంగ స్టేషన్లో పార్శిల్ దింపిన తర్వాత చోటు చేసుకుంది. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం ఎన్ఐఏ అధికారులు నగరంలో అరెస్టు చేసిన ఇద్దరు ఉగ్రవాదులను సోమవారం ఇక్కడకు తీసుకువచ్చారు. -
దర్భాంగా పేలుడు కేసు విచారణ
-
దర్భంగా కేసు : హైదరాబాద్ కేంద్రంగా ఎన్ఐఏ విచారణ
సాక్షి, హైదరాబాద్: దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటం కేసులో హైదరాబాద్ కేంద్రంగా విచారణ కొనసాగనుంది. నలుగురు ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్, హాజీ సలీం, ఖాఫిల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 9 వరకు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా బాంబు తయారుచేసిన నేపథ్యంలో.. హైదరాబాద్ నుంచే ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. బాంబు తయారీ, అమర్చిన తీరుపై ఎన్ఐఏ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ రెండ్రోజుల్లో నిందితులను హైదరాబాద్‌కు తీసుకురానుంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్ఐఏ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. -
దర్భంగా కేసు: "రా" ఏజెంట్‌ను అంటూ..
సాక్షి, హైదరాబాద్ : దర్భంగా బ్లాస్ట్‌కు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాలిక్ తరచూ ఫోన్లో మాట్లాడుతుండటంపై కుటుంబ సభ్యుల ఆరా తీయగా.. తాను ఇండియన్ ‘‘రా’’ ఏజెంట్‌ను అంటూ కుటుంబ సభ్యులను నమ్మించాడు. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ ఖాన్లు కుటుంబాన్ని మోసం చేసి ఉగ్ర కార్యాచరణ చేపట్టారు. తాను "రా" పనిపై పాక్ వెళ్తున్నట్లు చెప్పి.. పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. 2012లో 4 నెలలపాటు పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఐఈడీ అమర్చడంలో నాసిర్ మాలిక్ మాస్టర్ మైండ్. సోదరులిద్దరూ 2016లో దుబాయ్ వెళ్లారు. కాగా, ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. దర్భంగా బ్లాస్ట్ వెనుక భారీ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు మాలిక్ సోదరుల కదలికలపై ఎన్ఐఏ విచారణ చేస్తోంది. -
దర్భంగ పేలుడు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ‘పార్సిల్’
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ‘పార్సిల్ వ్యవస్థ’ అస్తవ్యస్థంగా మారిందని, ఎలాంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 17న బిహార్‌లోని దర్భంగ రైల్వే స్టేషన్లో పేలిన బాంబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని పార్సిల్ సర్వీస్ కేంద్రం నుంచే వెళ్లినట్లు తేలడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. బుక్ చేసిన పార్సిల్స్‌ను స్కానర్ యంత్రం ద్వారా తనిఖీ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా పార్సిల్స్‌ను డిస్పాచ్ చేస్తున్నారు. ఈ విషయంలో రైల్వే అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయంపైనే దృష్టి... అటు లీజు హోల్డర్లు, ఇటు నగర ప్రజల నుంచి వచ్చిన పార్సిళ్లను ఎడాపెడా స్వీకరించి ఆదాయం రాబట్టుకుంటున్న రైల్వే అధికారులు అందులో ఏముందనే విషయంలో మాత్రం దృష్టి సారించడం లేదు. దర్భంగ రైల్వేస్టేషన్లో పేలిన బాంబు సికింద్రాబాద్ పార్సిల్ సర్వీసు నుంచి వెళ్లిందేనని తేలాక అనుమానాస్పద వ్యక్తుల సంచారం పట్ల రైల్వే రక్షక దళం పోలీసులు గస్తీ పెంచారే తప్ప రవాణా చేయాల్సిన పార్సిళ్లను తనిఖీ చేసే విషయంలో మాత్రం ఎటువంటి చర్యలు లేవు. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం సుమారుగా 130 వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయలుదేరుతున్నాయి. ఒక్కో రైలులో రెండు బోగీలను పార్శిల్ సర్వీసు సేవలకు వినియోగిస్తున్నారు. ఈ బోగీల్లో సరుకులు రవాణా చేసేందుకు 29 మంది లీజుదారులు ఉన్నారు. వారు చేస్తున్న బుకింగ్‌ల ఆధారంగానే సరుకులు వెళ్తుంటాయి. స్కానర్లు లేని కారణంగానే.. ఒక లీజుదారు బుక్ చేసుకున్న పార్సిల్‌లోనే బాంబు ఉంచారు. రాత్రి 10.40 గంటలకు బయలుదేరాల్సిన దర్భంగా రైలులో పార్సిల్ పంపించాలని ఒక వ్యక్తి లీజుదారుడిని రాత్రి 8.30 గంటలకు సంప్రదించడంతో హడావుడిగా బుక్ చేసుకుని రైల్లో పంపించగా..ఆ పార్శిల్లోని బాంబే దర్భంగ స్టేషన్లో పేలింది. ప్యాసింజర్ రైళ్లలో పార్సిళ్లను పంపించడానికి కాంట్రాక్టు దక్కించుకున్న 29 మంది లీజుదారుల్లో ఏ ఒక్కరి వద్ద పార్సిళ్లు తనిఖీ చేసేందుకు స్కానర్లు లేవు. టెండరు సొమ్ము, లాభాన్ని రాబట్టుకోవడం కోసం స్కానింగ్ తదితర భద్రతా చర్యలు చేపట్టకుండానే బుకింగ్‌లు చేసుకుంటున్నారు. బుకింగ్దారుల వద్దకు ప్రైవేటు వాహనాలు, వ్యక్తులు పంపిస్తున్న లీజుదారులు దుస్తులు, వస్తువులతో కూడిన పార్సిళ్లను నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పార్సిల్ కార్యాలయానికి చేరవేస్తున్నారు. అన్ని స్టేషన్లలోనూ అదే పరిస్థితి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తోపాటు నగరంలో పార్సిల్ సేవలు అందిస్తున్న అన్ని రైల్వేస్టేషన్లలో ఎక్కడా స్కానింగ్ మెషిన్లు లేవు. అటు లీజుదారుల నుంచి, ఇటు నగర ప్రజల నుంచి వస్తున్న అన్ని రకాల వస్తువులతో కూడిన పార్సిళ్లను స్వీకరిస్తున్న పార్సిల్ కార్యాలయ సిబ్బంది నేరుగా రైళ్లకు ఎక్కించేస్తున్నారు. రైల్వేస్టేషన్లలో స్వీకరించిన బాక్సులు, లగేజీలకు తూకం వేయడం, బిల్లులు రాయడం మినహా వేరే ఎటువంటి భద్రతా చర్యలు ఇక్కడ తీసుకోవడం లేదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పార్శిల్ సేవలను వినియోగించుకునేందుకు వందల సంఖ్యలో వ్యక్తులు బారులు తీరుతున్నారు. బుకింగ్ కోసం వచ్చే వ్యక్తుల నివాస ధృవీకరణలు, ఫోన్ నెంబర్లు స్వీకరించడం మినహా వారు వెంట తెచ్చిన పార్శిల్లో ఏముందన్న విషయాన్ని పట్టించుకునేవారు లేరు. గస్తీ పెంచాం..లేఖలు రాశాం దర్భంగ ఘటన నేపథ్యంలో పార్సిల్ కేంద్రాల వద్ద గస్తీ ముమ్మరం చేశాం. పార్సిల్ సర్వీసు లీజుదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. పార్సిల్ సేవలను వినియోగించుకునేందుకు వచ్చే వ్యక్తుల వివరాలు పూర్తిగా తీసుకోవాలని సూచించాం. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు పోలీసులకు అందించాలని తెలియజెప్పాం. పార్సిల్ కార్యాలయాల వద్ద స్కానర్ల ఏర్పాటు కోసం రైల్వే అధికారులకు లేఖలు రాశాం. – కె.బెన్నయ్య, ఇన్స్పెక్టర్ రైల్వే రక్షణ దళం చదవండి: దర్భంగ పేలుడు: తండ్రికి తగని కుమారులు! -
సాక్షి టీవీ చేతిలో దర్భంగా బ్లాస్ట్ కీలక సాక్ష్యం
-
దర్భంగ పేలుడు: తండ్రికి తగని కుమారులు!
సాక్షి, సిటీబ్యూరో: దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటం కేసులో అరెస్టు అయిన లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్‌లు తండ్రికి తగని కుమారులని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. వీరి తండ్రి మూసా ఖాన్ ఆర్మీలో పనిచేసి చైనాపై పోరాడగా.. ఈ ద్వయం హైదరాబాద్‌లో ఉండి పాకిస్థాన్ కోసం పని చేశారని వివరిస్తున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం పట్నాలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పట్నా సెంట్రల్ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 1962 యుద్థంలో పాల్గొన్న మూసా... ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా ఖైరానానగర్లో ఉన్న మొహల్లా ఖయాస్తవాడ ప్రాంతానికి చెందిన మూసా ఖాన్‌ది వ్యవసాయ కుటుంబం. చిన్న వయస్సులోనే ఆర్మీలో సైనికుడిగా చేరిన మూసా 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధంలో పాల్గొన్నాడు. భారత సైనికుల తరఫున కీలకపాత్ర పోషించిన ఈయన ఆ యుద్ధం తర్వాత పదవీ విరమణ పొందారు. ఆపై ఖైరానానగర్‌లోనే వంట సామాగ్రి విక్రయించే దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. తన కుమారులను లష్కరేతొయిబా ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారనే విషయం మీడియా వచ్చిన బుధవారం నుంచి ఇల్లు, దుకాణానికి తాళం వేసిన మూసా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఉగ్రవాదులు, సికింద్రాబాద్ స్టేషన్ వద్ద కారు నుంచి పార్శిల్ దింపుతున్న సీసీ టీవీ ఫుటేజ్ అటు ఉగ్రవాదులు..ఇటు మాఫియా... రెండు నెలల క్రితం వరకు ఇమ్రాన్ ఖాన్ తండ్రి దుకాణంలోనే ఉంటూ ఆ వ్యాపారంలోనే ఉంటూ సహకరించాడు. కొన్నాళ్ల క్రితం ఇతడికి పాకిస్థాన్‌లో ఉంటున్న ఇక్బాల్ ఖానాతో పరిచయమైంది. కొన్నేళ్లుగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఇతగాడు భారత్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఇక్బాల్‌పై నకిలీ నోట్ల సరఫరా, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం వంటి అనేక కేసు లు నమోదై ఉన్నాయి. ఇతడి ఆదేశాలతో 2012లో తన బంధువుల వద్దకు వెళ్తున్నట్లు వీసా తీసుకున్న ఇమ్రాన్ పాకిస్థాన్‌కు వెళ్లాడు. అక్కడి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఎల్ఈటీ ట్రైనింగ్ క్యాంప్‌లో నాలుగు నెలల పాటు ఉగ్రవాద శిక్షణ పొందాడు. ఖైరానాలో జరిగిన కుట్ర... దర్భంగ విస్ఫోటనానికి సంబంధించిన కుట్ర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానాలో ఉన్న లష్కరేతొయిబా ఉగ్రవాది మహ్మద్ సలీం అహ్మద్ అలియాస్ హాజీ సలీం ఇంట్లో సమావేశమైన ఉగ్రవాదులు ఈ మేరకు కుట్ర చేశారు. ఈ మీటింగ్‌లో హాజీతో పాటు అతడి కుమారుడు ఖఫీల్, నగరం నుంచి వెళ్లిన ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ పాల్గొన్నారు. కదిలే రైలుకు మంటలు అంటుకునేలా చేస్తే అది ఆగేలోపే భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు ఉంటాయని ఇలా చేశారని ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్థాన్‌లో ఉండి కథ నడుపుతున్న ఇక్బాల్ ఖానాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న హాజీనే ‘దర్భంగ కుట్ర’కు సూత్రధారని స్పష్టమైంది. ఇక్బాల్ నుంచి హాజీకి రూ.1.6 లక్షలు కోల్తాలోని హవాలా వ్యాపారి ద్వారా అందినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దాదాపు వారం రోజులుగా బీహార్ ఏటీఎస్ కస్టడీలో ఉన్న హాజీ, ఖఫీల్లను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. చదవండి: ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం.. బిల్ కలెక్టర్ బాగోతం -
Darbhanga Blast: యూపీలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా... నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్ మాలిక్ బ్రదర్స్‌తో పాటు యూపీకి చెందిన హాజీ సలీం, కాఫీల్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పేలుడు కుట్రలో హాజీ సలీం అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. ఎన్ఐఏ అధికారుల వివరాల ప్రకారం.. హజీ సలీం, కాఫిల్ లష్కరే తోయిబాకు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. దర్భంగా బ్లాస్ట్‌కు ఫిబ్రవరి 2021లో వ్యూహాలు రచించగా, యూపీలోని హాజీ సలీం ఇంట్లో నలుగురు ఉగ్రవాదులు ఈ పేలుడుకు ప్లాన్ చేశారని వెల్లడించారు. పథకం ప్రకారం వాళ్లు రన్నింగ్ ట్రైన్లో ఐఈడీ బాంబులను ఫిక్స్ చేయాలనుకున్నట్లు తెలిపారు. లష్కరే తోయిబా ముఖ్యనేత ఇక్భాల్ ఖాన్‌కు హాజీ సలీం దగ్గరి బంధువని, పేలుడుకు సంబంధించి మాలిక్ బ్రదర్స్‌కు ఇక్భాల్ ఖాన్ కు హాజీ సలీం మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిపారు. ఇవే కాక మాలిక్ బ్రదర్స్‌కు ఇక్భాల్ ఖాన్ నుంచి నిధులు సమకూర్చింది కూడా హాజీ సలీమేనని దర్యాప్తులో తేలింది. 9 రోజులు ఎన్ఐఏ కస్డడీలో మాలిక్ బ్రదర్స్ గతనెల 30న ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ అరెస్టు కాగా శుక్రవారం వీరిని పాట్నా కోర్టులో ఎన్ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. నిందితులను 10 రోజుల కస్టడీ కోరుతూ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేయగా, 9 రోజుల పాటు కస్టడీకి పాట్నా కోర్టు అనుమతినిచ్చింది.