దర్బంగా: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) వ్యవస్థాపక సభ్యుడు యాసిన్ భత్కల్‌ను ఎన్‌ఐఏ అధికారులు శనివారం బీహార్‌లోని దర్బంగా జిల్లాకు తీసుకెళ్లారు. 2010-11లో ఈ జిల్లాలో నివసించిన భత్కల్ ఇక్కడ తన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు అనుమానిస్తున్నారు. డాక్టర్ ఇమ్రాన్ అనే మారుపేరుతో నివసించిన భత్కల్ యునాని వైద్యం చేసేవాడని పోలీసులు తెలిపారు. అతడు నివసించిన జమల్‌చాక్ గ్రామం తదితర ప్రాంతాలకు భత్కల్‌ను తీసుకెళ్లారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనుమానితులను పట్టుకునేందుకు పలుచోట్ల దాడులు జరిపారు.