Yasin Bhatkal
-
తీహార్ జైల్లో ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది యాసీన్ భత్కల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ సిటీ సెషన్స్ కోర్టు గత వారం కొట్టేసింది. కేసు విచారణ కోసం బెంగళూరు తరలించడం సాధ్యం కాదని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ట్రయల్ జరుగుతుందని స్పష్టం చేసింది. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్ అండ్ కో’కు చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది ఉరి శిక్ష విధించింది. దీంతో ఇక్కడి కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరుల్ని తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్ భత్కల్ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారం (సోలిటరీ కన్ఫైన్మెంట్)లో ఉంచారు. ఓపక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో భత్కల్ను బెంగళూరు న్యాయస్థానం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది. అయితే యాసీన్ గత నెలలో ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. కెమెరా అంటే సిగ్గు ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ఇబ్బందిగా ఉందంటూ అందులో పేర్కొన్నాడు. స్వేచ్ఛాయుతంగా కేసు విచారణ జరగాలంటే తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా బెంగళూరు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. భద్రతా కారణాల నేపథ్యంలో యాసీన్ భత్కల్ లాంటి ఉగ్రవాదిని విచారణ కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న అంశమంటూ పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. -
నాకు అసలే సిగ్గు బాబు!
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు... దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, వారణాసి, బెంగళూరు విధ్వంసాలకు సూత్రధారి... దేశ వ్యాప్తంగా 149 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది... గతేడాది ఉరి శిక్ష కూడా పడిన యాసీన్ భత్కల్‌కు కెమెరాను ఫేస్ చేయాలంటే సిగ్గట. ఈ విషయాన్ని అతడే ఢిల్లీ న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. తనకు కెమెరా షై ఉన్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే ప్రక్రియను ఆపాలని కోరాడు. ఈ మేరకు గత వారం ఢిల్లీ సిటీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే నిఘా వర్గాలు మాత్రం కేసు విచారణ జాప్యం జరిగేలా చేయడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నాడని అంటున్నారు. తీహార్ జైలు ‘ఏకాంత కారాగారం’లో కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2013, ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్ అండ్ కో’కు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది ఉరి శిక్ష విధించింది. దీంతో దిల్సుఖ్నగర్ కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరుల్ని తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్‌ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్మెంట్) ఉంచారు. ఓ పక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో భత్కల్ను బెంగళూరు న్యాయస్థానం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది. ఇక్కడే ఈ ఉగ్రవాదికి ‘సిగ్గు పుట్టుకు’వచ్చింది. జాప్యం చేయడానికే... కేసు విచారణకు అడ్డంకులు సృష్టించి జాప్యం జరిగేలా చేయడానికే యాసీన్ పిటిషన్ దాఖలు చేశాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని కేసుల విచారణ పూర్తయితే ఇప్పటికే పడిన ఉరి శిక్ష అమలు చేసే ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం కోసమే యాసీన్ పిటిషన్ దాఖలు చేసినట్లు అంచనా వేస్తున్నాయి. కాగా భద్రతా కారణాల నేపథ్యంలో యాసీన్ లాంటి ఉగ్రవాదిని విచారణ కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని అధికారులు చెప్తున్నారు. గతంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ తీసుకువెళ్లడానికి సరిహద్దు భద్రతా దళానికి చెందిన హెలీకాఫ్టర్ వాడాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. యాసీన్ పిటిషన్ ఢిల్లీ సిటీ సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ కారణాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కెమెరా షై అంటూ పిటిషన్... కొన్నాళ్లుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు కోర్టు విచారణ ఎదుర్కొంటున్న యాసీన్ భత్కల్ గత సోమవారం ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. కెమెరా షై ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ఇబ్బందిగా ఉందంటూ పేర్కొన్నాడు. కేసుకు సంబం«ధించిన చర్చలు చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ తన లాయర్లను బెంగళూరు నుంచి తీహార్ జైలు వరకు రప్పించడానికి భారీగా ఖర్చు అవుతోందని పిటిషన్లో పేర్కొన్నాడు. స్వేచ్ఛాయుతంగా కేసు విచారణ జరగాలంటే తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా బెంగళూరు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ముంబై దాడులకు (26/11 ఎటాక్స్) కీలక పాత్రధారిగా ఉండి, సజీవంగా పట్టుబడిన పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు విచారణ నేపథ్యంలో ఇచ్చిన వెసులుబాట్లలో కొన్ని తనకూ వర్తింపజేయాలని యాసీన్ విన్నవించుకున్నాడు. -
భత్కల్‌పై నేడు మరొకటి
సాక్షి, న్యూఢిల్లీ : జమా మసీద్ పేలుడు కేసులో పటియాలా హౌజ్ కోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉగ్రవాది, ఇండియన్ ముజాహిద్దీన్ చీఫ్ యాసిన్ భత్కల్‌పై ఆరోపణలను నమోదు చేయనుంది. భత్కల్‌తోపాటు అతని కుడి భుజంగా చెప్పుకునే అసదుల్లాపై పేరును కూడా జత చేయనుంది. సెప్టెంబర్ 19, 2010లో జమా మసీద్ గేట్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తైవాన్ జాతీయులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు మసీద్ సమీపంలో ఓ కారులో బాంబు పెట్టి పేలుడు జరిపారు. ఈ దాడి వెనుక యాసిన్ భత్కల్ ఉన్నాడన్నది ప్రధాన ఆరోపణ. ఇక ఇదే కేసులో భత్కల్‌తోపాటు.. అసదుల్లా అక్తర్ పై కూడా ఆరోపణలను కోర్టు నమోదు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే సాక్ష్యులను విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకోబోతోంది. ఈ ఏడాది ఆగష్టు 1న ఈ కేసు విచారణ సందర్భంగా సరైన సాక్ష్యాలు లేకపోవటంతో ముగ్గురిని కోర్టు విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన యాసిన్ భత్కల్ పై మొత్తం 10 బాంబు కేసులు నమోదు అయ్యాయి. 2008 ఢిల్లీ, 2010 వారణాసి, బెంగళూరు స్టేడియం ఇలా వరుస పేలుళ్ల వెనుక ప్రధాన నిందితుడిగా ఉండగా, 2006 ముంబై వరుస రైళ్లు పేలుళ్లు, 2012 పుణే పేలుళ్ల కేసులో అనుమానితుడిగా ఉన్నాడు. బెంగళూర్‌లో జన్మించిన భత్కల్.. తర్వాత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా తయారవ్వగా... 2013 ఆగష్టు 28న నేపాల్ సరిహద్దులో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కోర్టు డిసెంబర్ 19, 2016 అతనికి మరణశిక్ష విధించింది. -
హైదరాబాద్ నుంచి తీవ్రవాదుల తరలింపు
హైదరాబాద్: దిల్షుక్నగర్ పేలుళ్ల నిందితులను ఢిల్లీ, ముంబై జైళ్లకు తరలించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో పాటు మరో ఇద్దరిని తీహార్ జైలుకు, మిగతా ఇద్దరు ఉగ్రవాదులను ముంబైకి గురువారం విమానంలో తరలించినట్టు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. యాసిన్ భత్కల్‌తో పాటు ఇద్దరిని ఢిల్లీ స్పెషల్ పోలీసులు, ముంబై తరలించిన ఇద్దరినీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందాలు ప్రశ్నించనున్నట్టు తెలిసింది. -
యాసిన్ భత్కల్ తీహార్ జైలుకు తరలింపు
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ను ఢిల్లీకి తరలించారు. చర్లపల్లి జైలు నుంచి శిక్ష అనుభవిస్తున్న అతన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్ఐఏ అధికారులు తీహార్ జైలుకు పంపించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు అజాజ్, అక్తల్‌ను ముంబైకు తరలించినట్లు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ట్రయల్స్ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లే సమయంలో భత్కల్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. భత్కల్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అధికారులు అతన్ని తీహార్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. -
ముప్పుతిప్పలు పెట్టాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన యాసీన్ భత్కల్ దిల్సుఖ్నగర్ పేలుళ్ళ కేసు విచారణ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలతో పాటు పోలీసులు, జైళ్ళ శాఖ అధికారులకు చుక్కలు చూపించాడు. ఓసారి జేబులో ‘అనుమానాస్పద వస్తువుతో’, మరోసారి ఫోన్ కాల్‌తో హడలెత్తించాడు. యాసీన్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా భత్కల్‌లో 1983లో జన్మించాడు. అంజుమన్–హమి–ఇ–ముస్లమీన్ పాఠశాలలో ప్రాథమిక విద్యతో ప్రారంభమై... ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పుణేకు మాకాం మార్చిన యాసీన్... తనకు సోదరుడి వరుసయ్యే రియాజ్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్ళాడు. రియాజ్ దేశం విడిచి పారిపోయిన తర్వాత విధ్వంస రచనలో యాసీన్ కీలకంగా మారాడు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు కో–ఫౌండర్ బాధ్యతలు స్వీకరించి సౌత్ ఇండియా చీఫ్‌గా మారాడు. జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ పేలుళ్ళ తర్వాత ఇతడి పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 2013లో ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్టు చేసిన తర్వాత ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ తరలించారు. ‘సినిమా’ చూపించాడు... దిల్సుఖ్నగర్ పేలుళ్ళ కేసు విచారణ...తొలుత ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలోనే జరిగింది. ఆ సమయంలో ఓసారి యాసీన్ భత్కల్ కోర్టుకు హాజరైనప్పుడు అతడి జేబులో ‘ఓ అనుమానాస్పద వస్తువు’ మీడియాకు చిక్కింది. ఆకారాన్ని బట్టి అది సెల్‌ఫోన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో మరోసారి అతడికి కోర్టుకు తీసుకువచ్చినప్పుడు దాన్ని బయటకు తీయించిన అధికారులు అదో పుస్తకంగా తేల్చారు. చర్లపల్లి జైలు నుంచి తన కుటుంబంతో ఫోల్లో మాట్లాడినట్లు, ఆ నేపథ్యంలోనే తాను ఐసిస్ ఉగ్రవాదుల సాయంతో తప్పించుకోనున్నట్లు చెప్పాడని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో కేసు విచారణ కోసం చర్లపల్లి జైలులోనే కోర్టు ఏర్పాటు చేయించిన అధికారులు విచారణ అక్కడకు మార్చారు. జైలులో ఉన్న యాసీన్ అనేక న్యాయ పుస్తకాలను అధ్యయనం చేశారని తెలుస్తోంది. వీటి ఆధారంగా ప్రాసిక్యూషన్ లాయర్లను ఎదురు ప్రశ్నించేవాడని సమాచారం. మరోపక్క టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ నేపథ్యంలోనే యాసీన్ తన హావభావాలతో అనేక మంది సాక్షుల్ని బెదిరించడానికి ప్రయత్నించాడని సమాచారం. ఎవరు... ఎప్పుడు... ఎక్కడ చిక్కారంటే... కేంద్ర నిఘా సంస్థ, ఢిల్లీ స్పెషల్ స్పెల్ అధికారులు సంయుక్తంగా నేపాల్‌లో చేసిన ఆపరేషన్‌లో 2013 ఆగస్టు 29న యాసీన్, అసదుల్లా అక్తర్ చిక్కారు. వీరిని బీహార్–నేపాల్ సరిహద్దుల్లోని రక్సెల్ ప్రాంతంలో అరెస్టు చూపించారు. దిల్సుఖ్నగర్ పేలుళ్ళు చోటు చేసుకున్నది, వీరిద్దరూ చిక్కింది గురువారమే కావడం యాధృచ్ఛికం. వీరిద్దరూ చిక్కడంతో దిల్సుఖ్నగర్ పేలుళ్ళ కేసు కొలిక్కివచ్చింది. విచారణలో తెహసీన్, వఖాస్ల పాత్ర పూర్తిస్థాయిలో నిర్థారణైంది. దీంతో వీరిద్దరిపై జాతీయ దర్యాప్తు సంస్థ 2013 సెప్టెంబర్ 24న రూ.10 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. సీన్, అసదుల్లా విచారణలోనే వఖాస్ భారత్‌లోనే ఉన్నాడని కర్నాటక, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రల్లో సంచరిస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో పక్కా నిఘా ఉంచిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2014 మార్చి 23న ముంబై నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చేరుకున్న వఖాస్‌ను అక్కడి రైల్వేస్టేషన్లో పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంలో జైపూర్, జోధ్‌పూర్‌ల్లో మరో ముగ్గురిని అరెస్టు చేసి భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక అప్పటికి పరారీలో ఉన్న మోను ఆచూకీ కోసం అనేక సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి పరిణామాలను పరిశీలించిన నిఘా వర్గాలు మోను రాజస్థాన్‌కు చేరుకున్నట్లు గుర్తించాయి. అజ్మీర్‌లో గైడ్ ముసుగులో ఉంటున్న ఇతడిని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు 2014 మార్చి 25న పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో పట్టుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న ఎజాజ్ షేక్‌ను మహారాష్ట్రలో అరెస్టు చేశారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్లు..వాదనలు పూర్తి
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో వాదనలు ముగిశాయి. ఈనెల 21న నిందితులకు శిక్షలను ఖరారు చేస్తూ చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇవ్వనున్నది. 2013 సంవత్సరం ఫిబ్రవరి 21న జరిపిన పేలుళ్లలో 22మంది మృతి చెందగా 138మంది గాయపడిన విషయం విదితమే. ఈ కేసులో అసదుల్లా అక్తర్, యాసిన్ భత్కల్, తహ సిన్ అక్తర్, జియావుర్ రెహ్మాన్ (పాక్), ఎజాజ్ షేక్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిపై చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. 157మంది సాక్షులను కోర్టు విచారించగా 502 డాక్యుమెంట్లను ఎన్ఐఏ సేకరించింది. కాగా పాకిస్థాన్‌లో తలదాచుకున్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ సూత్రధారిగా, బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేసిన ఐఎం ఆపరేషనల్ చీఫ్ యాసిన్ భత్కల్ పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. Dilsukh nagar Blasts, NIA court, hearing, verdict, Yasin Bhatkal, దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు, వాదనలుపూర్తి, ఎన్ఐఏ, యాసిన్ భత్కల్ -
మోస్ట్‌వాంటెడ్ జాబితాలో.. ఆ ఇద్దరూ మిస్సింగ్!
⇒ యూఎన్ జాబితాలో..కనిపించని భత్కల్, షఫీ ఆర్మర్ ⇒ సిటీ పోలీసులకూ వీరు ‘బాగా కావాల్సిన వారే’ ⇒ విస్మయం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర పోలీసు వర్గాలు సాక్షి, సిటీబ్యూరో: విషవృక్షంగా విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని తమవంతుగా అడ్డుకోవడానికి ఐక్యరాజ్య సమితి (యూఎన్) సమాయత్తమవుతోంది. దీని కోసం సభ్యదేశాలకు తమకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదుల జాబితా అందించమని ఇటీవల కోరింది. భారత్ ఇచ్చిన జాబితాలో దేశానికి, నగరానికి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, ఐసిస్‌కు అనుబంధంగా అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) ఏర్పాటు చేసిన షఫీ ఆర్మర్ పేర్లు ఆ జాబితాలో లేవని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇది నిర్లక్ష్యమా? వ్యూహంలో భాగమా? అనేది అర్థంకాక విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సిటీకీ అవే అత్యంత ప్రమాదకరం... హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ప్రస్తుతం ముప్పు ‘రెండు’రకాలుగా పొంచి ఉంది. ఇందులో ప్రధానమైనది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కాగా, రెండోది ఐసిస్. ఇటీవల ఎనిమిది నెలల కాలంలోనే హైదరాబాద్‌లో ఐసిస్‌కు చెందిన రెండు ప్రధాన మాడ్యుల్స్ చిక్కాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐఎం, ఐసిస్‌కు చెందిన గజఉగ్రవాదులు రియాజ్ భత్కల్, షఫీ ఆర్మర్ పేర్లను యూఎన్‌కు ఇచ్చిన జాబితాలో చేర్చకపోవడం వెనుకా వ్యూహం దాగి ఉండచ్చని అధికారులు చెప్తున్నారు. అత్యంత రహస్య ఆపరేషన్లు చేస్తున్న సందర్భంలోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటారని అభిప్రాపడుతున్నారు. భత్కల్ ఎందరికో మోస్ట్‌వాంటెడ్... 2007 ఆగస్టు 25, 2013 ఫిబ్రవరి 21న రాజధాని నగరం జంట పేలుళ్లతో దద్దరిల్లింది. మొదటిది గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో జరగ్గా... రెండోది దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌లో చోటు చేసుకున్నాయి. ఈ రెండింటిలోనూ రియాజ్ భత్కల్‌ది కీలక పాత్ర. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఇతడు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాల సృష్టించాడు. 2005 నుంచి దేశ వ్యాప్తంగా 19 పేలుళ్లకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్‌పూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి, సూరత్‌లో పేలుళ్లకు కుట్రల్లోనూ వాంటెడ్. ప్రస్తుతం ఇతను పాకిస్థాన్‌లోని కరాచీలో తలదాచుకున్నాడు. అక్కడ నుంచే హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నుతున్న ఇతడికి ఆ దేశ ఆర్మీ, ఐఎస్ఐ భద్రత కల్పిస్తోంది. ఆర్మర్‌తో ఆషామాషీ కాదు... ఐసిస్‌కు అనుబంధంగా ఏయూటీని ఏర్పాటు చేసిన షఫీ ఆర్మర్ సైతం మామూలోడు కాదు. హైదరాబాద్‌కు సంబంధించి ఇప్పటి వరకు పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదులు, సానుభూతిపరుల వెనుక ఇతడే ఉన్నాడు. 2014లో శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన సల్మాన్ మొయినుద్దీన్ నుంచి తాజాగా పాతబస్తీలో చిక్కిన ఇబ్రహీం యజ్దానీ మాడ్యుల్ వరకు అందరినీ ఇతడే ఆ బాటపట్టించాడు. ప్రస్తుతం సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడిపిస్తున్న షఫీ ఆర్మర్ అక్కడ అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తాను చనిపోయినట్లు అనేకసార్లు వదంతులు వ్యాపించజేశాడు. నిఘా వర్గాల దృష్టి మళ్లించడానికే ఈ పంథా అనుసరించినట్లు అధికారులు చెప్తున్నారు. కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఆర్మర్ భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలకు ఇన్చార్జ్గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్ ఉల్ తౌహిద్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్ చనిపోగా... షఫీ మాత్రం భారత్ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. -
కోర్టులో యాసిన్ భత్కల్ హల్చల్
-
కోర్టులో యాసిన్ భత్కల్ హల్చల్
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ మరోసారి కోర్టులో హల్చల్ సృష్టించాడు. మంగళవారం అతడిని రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టులో ఓ లెటర్ విసిరేశాడు. ఆ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పెద్ద కుట్ర చేస్తున్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భత్కల్ చేష్టలు పలు అనుమానాలను రేకెత్తించాయి. -
రంగారెడ్డి జిల్లా కోర్టుకు భత్కల్
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఐఎస్ఐ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ను మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించారు. విచారణలో భాగంగా భత్కల్ ను పటిష్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చారు. ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పెద్ద కుట్ర చేస్తున్నట్లు ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చర్లపల్లి జైలు నుంచి భత్కల్‌తో పాటు మిగతా ఉగ్రవాదులను తప్పించేందుకు స్లీపర్ సెల్స్ ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాల ద్వారా జైలు సమాచారం చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
భత్కల్ పరారీకి ఐఎస్ఐఎస్ ప్లాన్!
మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్ భత్కల్ కదలికలపై డేగకన్ను చర్లపల్లి జైలు వద్ద ఆక్టోపస్ బలగాలు హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పెద్ద కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించింది. చర్లపల్లి జైలు నుంచి భత్కల్‌తో పాటు మిగతా ఉగ్రవాదులను తప్పించేందుకు స్లీపర్ సెల్స్ ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాల ద్వారా జైలు అధికారులకు సమాచారం చేరింది. నెల రోజుల వ్యవధిలో రెండవసారి కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ కావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. భత్కల్ కదలికలను గమనించేందుకు ఆయన ఉంటున్న బ్యారక్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. జైలు గోడలను బద్దలు కొట్టైనా బయటకొస్తానంటూ భత్కల్ తన భార్యకు ఫోన్లో చెప్పినట్లు నిఘా వర్గాలు భావిస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకలను సమర్థంగా తిప్పికొట్టగలిగే ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి 30 మంది బలగాలు జైలు పరిసరాలలో గస్తీ నిర్వహిస్తున్నాయి. నిఘా వర్గాల సీరియస్.. ఇటీవలి కాలంలో భత్కల్ వ్యవహరిస్తున్న తీరును నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ట్రయల్స్ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లిన ప్రతీసారి భత్కల్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రంగారెడ్డి కోర్టుకొచ్చిన మూడుసార్లు భత్కల్ వ్యవహరించిన శైలిపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 6వ తేదీన కోర్టుకు వచ్చిన భత్కల్.. భద్రత పేరుతో లేఖ రాసి కోర్టు ఆవరణలో విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక గులాబీ పువ్వును ప్రదర్శించాడు. మూడవసారి ఒక నోట్‌బుక్‌ను చూపిస్తూ హల్చల్ చేశాడు. అయితే వీటిని నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. మూడుసార్లు భిన్నంగా వ్యవహరించడానికి కారణాలేంటి అనేదానిపై విశ్లేషిస్తున్నట్లు సమాచారం. భత్కల్ ఎవరికైనా ఇండికేషన్స్ ఇస్తున్నాడా? స్లీపర్ సెల్స్ ఏమైనా ఫాలో అవుతున్నాయా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా భత్కల్ నోటి నుంచి ఐఎస్ఐఎస్ విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. ఐఎస్ఐఎస్తో భత్కల్‌కు గల సంబంధంపై నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా కశ్మీర్లో ఐఎస్ జెండాలు ప్రదర్శించడంతో మరింత అప్రమత్తమయ్యారు. ఇలాంటి చర్యల నేపథ్యంలో ఓ వైపు భత్కల్ కదలికలపై నిఘా వేస్తూనే, మరో వైపు జైలు భద్రతపై అధికారులు దృష్టి సారించారు. -
చర్లపల్లి జైలు వద్ద హై అలర్ట్
హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా నెలకొంది. జైలు ఆవరణ చుట్టూ పోలీస్ విభాగమైన ఆక్టోపస్ బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడైన యాసిన్ భత్కల్ జైలు నుంచి పారిపోయే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కొద్దిరోజుల కిందట జైలు నుంచి తన తల్లి, భార్యతో ఫోన్లో మాట్లాడిన భత్కల్.. జైలు నుంచి బయటికి వస్తానని చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. భత్కల తప్పించుకుంటాడనే వార్తలను జైళ్ల శాఖ అధికారులు మొదట కొట్టిపారేసినప్పటికీ తర్వాత ఆ అవకాశం లేకపోలేదని పేర్కొనడం గమనార్హం. -
భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదు
- జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ - ఆయనను కోర్టుకు తరలించడం ఇబ్బందికరమే - రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదు సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన భత్కల్ను ప్రతీసారి కోర్టుకు తీసుకెళ్లడమంటే కాస్త ఇబ్బందికరమేనని జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ వ్యాఖ్యానించారు. జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే మార్గంలో వారు తప్పించుకోవడానికి అవకాశాలు లేకపోలేదన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో డీజీ వీకే సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘భత్కల్‌తో పాటు ఇతర ఉగ్రవాదులను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ఉంచుతామని సూచించాం. అయితే ట్రయల్స్ ఉన్నందున కచ్చితంగా తీసుకు రావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. మాకు కాస్త ఇబ్బందికరమైనా కోర్టు ఆదేశాల మేరకు తీసుకెళ్తున్నాం. ఈ విషయంలో న్యాయస్థానాలదే అంతిమ నిర్ణయం’ అని అన్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ భత్కల్ కోర్టు వద్ద విసిరిన లేఖ విషయాన్ని ప్రస్తావించగా... ‘ప్రాణహాని ఉందని భత్కల్ చెబితే మేం ఏం చేసేది. మా జైల్లో ఉన్నంత వరకు అతను భద్రంగా ఉంటారు. ఎలాంటి అపోహలకు తావులేదు’ అని అన్నారు. భత్కల్ జైల్ నుంచి పారిపోతారని తమకు కేంద్రం నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదని స్పష్టం చేశారు. ైజైల్లో కల్పించిన ఫోన్ ద్వారా భత్కల్ తన భార్యతో మాట్లాడిన రికార్డులన్నీ పరిశీలించామని, ఎక్కడా కూడా పారిపోతానని చెప్పిన సందర్భం లేదన్నారు. రేవంత్ రాజకీయ నాయకుడు చర్లపల్లి జైల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ కొట్టిపారేశారు. ఆయన రాజకీయ నాయకుడని, ఆయనేం చెప్పారో తమకు తెలియదన్నారు. జైళ్లలో మాత్రం ఎలాంటి అక్రమాలు జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లన్నింటినీ అవినీతి రహితంగా మార్చుతున్నామన్నారు. తాము ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటి వరకు 60 కాల్స్ వచ్చాయని, వాటిలో 18 మాత్రమే తమశాఖకు చెందినవి కావడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. 60 ఏళ్లుగా జైళ్ల విభాగానికి ప్రాధాన్యం లభించలేదని, ఏడాది కాలంగా అనేక మార్పులు చేపట్టినట్లు వివరించారు. తెలంగాణ జైళ్ల శాఖను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటి వరకు జైళ్లలో నిరక్షరాస్యులుగా ఉన్న 20వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించినట్లు వెల్లడించారు. కొన్ని సంస్థల సహకారంతో పదో తరగతి పూర్తి చేసుకున్న వారికి కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. -
ఉగ్రవాది భత్కల్ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
కోర్టు హాల్ నుంచి పేపర్ విసరడంతో కలకలం.. నాగోలు: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, ఐఎస్ఐ ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో పాటు మరికొంత మంది నిందితులను కేసు విచారణ నిమిత్తం సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు అధికారులు భారీ బందోబస్తు మధ్య వీరిని కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ సమయంలో భత్కల్ కోర్టు హాల్ కిటికీలోంచి బయటికి తాను రాసిన పేపర్‌ను విసిరాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడే ఉన్న పోలీసు అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ కాగితాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం భత్కల్‌తో పాటు మిగతా నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, ఎన్ఐఏ అధికారులు కావాలనే తనను వేధిస్తున్నారని, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టులో భత్కల్ పిటిషన్ వేసినట్లు తెలిసింది. కాగా, పేపర్ విషయంపై ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాము ఎలాంటి పేపర్‌ను స్వాధీనం చేసుకోలేదన్నారు. -
కోర్టులో భత్కల్ హల్చల్
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హల్చల్ సృష్టించాడు. కేసు విచారణ నిమిత్తం పోలీసులు అతడ్ని కోర్టులో హజరుపర్చారు. కోర్టు హాలులోకి ప్రవేశించిన వెంటనే ఒక్కసారిగా జేబులో నుంచి ఓ కాగితాన్ని తీసిన భత్కల్.. కోర్టు కిటికీ నుంచి దానిని బయటకు విసిరేశాడు. ఈ అనూహ్య చర్యకు బిత్తరపోయిన పోలీసులు ఒక్క ఉదుటన భత్కల్ను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కిటికీ నుంచి అతడు విసిరేసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే పారిపోతున్నానని ప్రచారం చేస్తున్నారని, ఎన్కౌంటర్లో చంపేస్తారేమోనని అనుమానం ఉదని భత్కల్ ఆ లేఖలో పేర్కొన్నాడు. మరోవైపు భత్కల్ తల్లి రహీనా కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. -
యాసిన్ భత్కల్ను ఎన్కౌంటర్ చేస్తారేమో!
భత్కల్ (ఉత్తరాఖండ్): విచారణా ఖైదీగా ఉంటూ పోలీసుల చేతిలో హతమైన సిమీ ముఖ్య నాయకుడు వికారుద్దీన్లానే ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ఎన్‌కౌంటర్‌కు బలికానున్నాడా? నేరం నిరూపణ కాకముందే అతడ్ని మట్టుబెట్టేందుకు పోలీసులు పథకం పన్నారా? అంటే అవుననే అంటోంది భత్కల్ తల్లి రిహానా సిద్దిబా! ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కరాగారంలో విచారణ ఖైదీగా ఉన్న భత్కల్.. 'ఐఎస్ఐఎస్ సహకారంతో జైలు నుంచి బయటికొస్తా' అని తల్లి, భార్యలతో ఫోన్లో చెప్పినట్లు వెలుగుచూసిన వార్తలు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే అసలు యాసిన్ తమతో అలా మాట్లాడనేలేదని రిహానా చెబుతున్నారు. సొంత ఊరు ఉత్తరాఖండ్‌లోని భత్కల్‌లో సోమవారం ఆమె విలేకరులతో మాట్టాడారు. 'నా కొడుకుతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడా. దమస్కస్ నుంచి ఎవరో వచ్చి జైలు నుంచి బయలకు తీసుకొస్తారనే సంభాషణలేవీ మా మధ్య జరగలేదు. నిజానికి పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని భత్కల్ మాతో అన్నాడు. వాడు అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేయడం చూస్తోంటే నా కొడుకును పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారేమోననే అనుమానం మరింత బలపడుతోంది' అని రిహానా చెప్పారు. భత్కల్‌పై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవేనన్న ఆమె.. హై సెక్యూరిటీ జైలు నుంచి తప్పించుకోవడం ఎవరికైనా ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. -
జైల్లో నుంచి తప్పించుకుంటా!
ఢిల్లీలోని భార్యతో ఫోన్లో ఐఎం ఉగ్రవాది యాసిన్ భత్కల్ బయటపడ్డాక సిరియా రాజధాని డమాస్కస్ పారిపోదాం ఫోన్ సంభాషణల ఆధారంగా గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు భద్రత రెట్టింపునకు ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్: ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థ దేశంలో మారణహోమం సృష్టించడంతోపాటు జైళ్లలోని ఉగ్రవాదులను ఎలాగైనా తప్పించేందుకు కుట్రపన్నుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు నుంచి తప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు యాసిన్ ఇటీవల తన భార్య జెహిదాతో మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆధారంగా గుర్తించాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని స్నేహితులు త్వరలో తనను జైలు నుంచి తప్పిస్తారని...అవసరమైతే జైలు గోడలు బద్దలు కొట్టైనా బయటకు తెస్తారని అతను చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం డమాస్కస్ పారిపోదామని భార్యతో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. అప్రమత్తమైన నిఘా వర్గాలు... దేశంలో దాదాపు 40 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడైన యాసిన్ భత్కల్ తన భార్యతో జరిపిన ఫోన్ సంభాషణల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. జైళ్లలోని ఉగ్రవాదులపై నిఘా పెంచాలని, భద్రతను రెట్టింపు చేయాలని, ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించాయి. మరోవైపు యాసిన్ భత్కల్‌కు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18 నుంచి కుటుంబ సభ్యులతో ల్యాండ్‌లైన్ ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జైళ్లశాఖ డీఐజీ నర్సింహ తెలిపారు. భత్కల్ ఇప్పటివరకు 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని, అరబిక్, ఉర్దూలలో సాగిన అతని సంభాషణలను ప్రత్యేక నిపుణుల కమిటీ విశ్లేషిస్తున్నట్లు శనివారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. భత్కల్‌కు అందరి ఖైదీల మాదిరిగానే వారానికి రెండుసార్లు ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భత్కల్ తన భార్య జెహిదా, తల్లి రెహానాలతో మాట్లాడేందుకు అనుమతి కోరగా తాము ఆయా ఫోన్ నంబర్లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో సంప్రదించి వారి ఆదేశాల మేరకే అనుమతించామన్నారు. జైల్లో కేవలం ఎస్టీడీ ఫోన్ సౌకర్యమే ఉంటుందని, ఐఎస్డీకి అవకాశం లేదని డీఐజీ స్పష్టం చేశారు. చర్లపల్లి కేంద్రకారాగారంలో మొత్తం 13 మంది ఉగ్రవాదులున్నారన్నారు. 2013 సెప్టెంబర్ 24 నుంచి భత్కల్ చర్లపల్లి జైల్లో ఉంటున్నాడని, మధ్యలో ఒకట్రెండుసార్లు అతన్ని వివిధ కేసులరీత్యా ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించామన్నారు. గతేడాది నవంబర్ 16 నుంచి అతన్ని పూర్తి స్థాయిలో చర్లపల్లి జైల్లోనే ఉంచామన్నారు. -
జైళ్లో ఐఎస్డీ సౌకర్యం లేదు: డీఐజీ నరసింహా
-
'భత్కల్ 27 సార్లు మాట్లాడాడు'
యాసిన్ భత్కల్ మొత్తం 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని జైళ్ల శాఖ డీఐజీ నరసింహ తెలిపారు. భత్కల్ తన భార్యతో మాట్లాడిన అంశాలు బహిర్గతం అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భత్కల్ వద్ద సెల్‌ఫోన్ ఉందన్న మాట అవాస్తవమని చెప్పారు. అతడు తన తల్లితోను, భార్యతోను జైలు ఫోన్ నుంచే మాట్లాడాడన్నారు. నిబంధనల ప్రకారం భత్కల్ మాట్లాడిన ప్రతి కాల్‌ను రికార్డు చేశామని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలందరికీ ల్యాండ్ లైన్ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ఆ ఫోను వాడుకోడానికి కూడా మొదట్లో తాము భత్కల్‌కు అనుమతి ఇవ్వలేదని.. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు వారంలో రెండుసార్లు ఫోన్ మాట్లాడుకునేందుకు అనుమతి ఇచ్చామన్నారు. అది కూడా ఒక్కోసారి 5 నిమిషాలు మాట్లాడేందుకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. భత్కల్ మొత్తం 27 సార్లు మాట్లాడాడని వివరించారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారాన్ని ఎన్ఐఏ తమకు ఇవ్వలేదని డీఐజీ నరసింహ చెప్పారు. అయితే తాజాగా వెల్లడైన అంశాల నేపథ్యంలో చర్లపల్లి జైలుకు అదనపు భద్రత కల్పిస్తున్నామని ఆయన అన్నారు. -
'భత్కల్ చేతికి సెల్ ఫోన్ చేరడం అసాధ్యం'
-
'భత్కల్ చేతికి సెల్ ఫోన్ చేరడం అసాధ్యం'
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ జైల్ నుంచి పరారయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న సమాచారంపై తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకేసింగ్ స్పందించారు. భత్కల్ చేతికి మొబైల్ ఫోన్ చేరడం అసాధ్యమని, అతడు సెల్ఫోన్లో మాట్లాడారన్న వార్తలను ఆయన శనివారమిక్కడ ఖండించారు. భత్కల్ భద్రత కోసం జైలులో ప్రత్యేక ఏర్పాటు చేశామని, భత్కల్ చేతికి ఫోన్ చేరడం అసాధ్యమన్నారు. జైలులో ఉన్న ప్రతిఖైదీకి జైలు ఫోన్ ద్వారా వారానికి రెండు నెంబర్లకు మాట్లాడుకునే వెసులుబాటు ఉందని, ఖైదీలు ఇద్దరి బంధువుల నంబర్లు ముందే రిజిస్టర్ చేస్తారని డీజీ వీకేసింగ్ తెలిపారు. భత్కల్ కూడా తన భార్య నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నాడని, తన భార్య జహిదాతో భత్కల్ ప్రతివారం మాట్లాడతాడని చెప్పారు. ఖైదీలు మాట్లాడే ప్రతీ ఫోన్ కాల్ రికార్డు అవుతుందని, భత్కల్ తన భార్యతో మాట్లాడిన ఫోన్ కాల్స్ పరిశీలిస్తామన్నారు. కాగా పోలీసులను తప్పుదోవ పట్టించడానికి డమాస్కస్ స్నేహితుల గురించి భత్కల్ మాట్లాడి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
భత్కల్ను తప్పించేందుకు ప్లాన్
-
భత్కల్ను తప్పించేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర
హైదరాబాద్ :రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ పథకం వేసింది. అయితే ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న భత్కల్ తన భార్య జహిదాతో ఫోన్లో మాట్లాడినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. తనను త్వరలో ఐఎస్ఐఎస్ జైలు నుంచి తప్పిస్తుందని అతడు..ఢిల్లీలో ఉంటున్న భార్యకు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. డమాస్కస్‌లోని స్నేహితులు.. తనను త్వరలో జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డమాస్కస్ వెళ్లిపోదామని భత్కల్ తన భార్యతో చెప్పినట్లు తెలుస్తోంది. భత్కల్ చెప్తున్న డమాస్కస్‌లోని స్నేహితులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతేకాక చర్లపల్లి జైలు నుంచి భత్కల్ తన భార్యకు 10 ఫోన్‌కాల్స్ చేశాడని... భార్యతోపాటు ఇంకొంతమందితోనూ అతడు ఫోన్లో మాట్లాడాడని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. యాసిన్ భత్కల్ ఫోన్‌కాల్స్‌ను రికార్డ్ చేసిన కేంద్ర నిఘా వర్గాలు... అతని వెనకున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు భత్కల్‌కు సెల్ ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. -
జైల్లో జంతువు కంటే హీనంగా చూస్తున్నారు..
న్యూఢిల్లీ: భారత ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ చేసిన విజ్క్షప్తిపై సమాధానమివ్వాలని తీహార్ జైలు అధికారులను కోర్టు కోరింది. జైలులో ఓ జంతువు కంటే హీనంగా చూస్తున్నారని, రంజాన్ సమయంలో సరియైన ఆహారం ఇవ్వడం లేదని జైలు అధికారులుపై భత్కల్ కోర్టు న్యాయమూర్తి రాజ్ కపూర్ కు ఫిర్యాదు చేశారు. భత్కల్ ఫిర్యాదుపై జూలై 23 తేది లోపు వివరణ ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది. భత్కల్ తరపు న్యాయవాది ఎంఎస్ ఖాన్ ఫిర్యాదును దాఖలు చేశారు. వివిధ నేరాల్లో నిందితుడైన భత్కల్ ను నేపాల్ సరిహద్దులో గత ఆగస్తులో అరెస్ట్ చేశారు. -
ముంబై పేలుళ్లకు గర్వపడుతున్నా: భత్కల్
ముంబై: ముంబైలో 21 మంది మృతికి కారణమైన 2011నాటి వరుస పేలుళ్లకు పాల్పడినందుకు తనకు గర్వంగా ఉందని ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అన్నాడు. ‘పేలుళ్లకు పశ్చాత్తాపపడ డం లేదు. నా దృష్టిలో అవి నేరం కాదు. అందుకే వాటికి పాల్పడ్డానని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇవ్వదలచుకున్నా’ అని ఇటీవల ముంబై పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో చెప్పాడు. పేలుళ్లకు పశ్చాత్తాపపడడం లేదని భత్కల్ సహచరుడు అసదుల్లా ఆఖ్తర్ కూడా తన నేరాంగీకార ప్రకటనలో పేర్కొన్నాడు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో 2005 నుంచి తాము పాల్పడ్డ పేలుళ్ల వివరాలను వీరు వెల్లడించారు. 2002 నాటి గోధ్రా అల్లర్లకు ప్రతీకారంగానే బాంబులు పేల్చామన్నారు. వీరిని జాతీయ దర్యాప్తు సంస్థ గత ఏడాది ఆగస్ట్‌లో భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్ట్ చేయడం తెలిసిందే. -
ఎన్ఐఏ వేధిస్తోంది: భత్కల్
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపక సభ్యుడు యాసిన్ భత్కల్ ప్రత్యేక కోర్టుకి మంగళవారం తెలిపారు. కేంద్ర దర్యాప్త సంస్థ (ఎన్ఐఏ) అధికారులు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని, కనీసం తగిన ఆహారం కూడా ఇవ్వడం లేదని భత్కల్ దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నాడు. కడుపు నొప్పి వచ్చినా వైద్య సదుపాయం కల్పించడం లేదని ఆరోపించాడు. దీన్ని విచారించిన డిస్ట్రిక్ట్ జడ్జి ఐఎస్ మెహతా, తీహర్ జైలు అధికారులు వారంలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. జైలు నిబంధనల ప్రకారం భత్కల్‌కు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తదుపరి విచారణను వచ్చే నెల 29కి వాయిదా వేశారు. -
భత్కల్‌కు మళ్లీ బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ-వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌కు జామా మసీదు పేలుళ్ల కేసులో బెయిల్ మంజూరు చేసేందుకు స్థానిక కోర్టు గురువారం తిరస్కరించింది. కేసు దర్యాప్తునకు మే ఎనిమిది వరకు పోలీసులకు సమయం ఇస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి దయాప్రకాశ్ ప్రకటించారు. తన కక్షిదారును అరెస్టు చేసి 90 రోజులు ముగిసినా, చార్జిషీటు సమర్పించలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలన్న భత్కల్ న్యాయవాది ఖాన్ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇటీవలే అరెస్టయిన పాక్ జాతీయుడు జియా ఉర్ రెహమాన్ ఎలియాస్ వకాస్‌ను ప్రశ్నించాల్సి ఉన్నందున, దర్యాప్తునకు మరింత సమయం కావాలని పోలీసులు అభ్యర్థించారు. కేసు దర్యాప్తు పోలీసులకే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనాయకుల కేసుల దర్యాప్తుపై ఢిల్లీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మధ్య నెలకొన్న వివాదం పరిష్కారమయింది. ఈ కేసుల దర్యాప్తు నుంచి తాము వైదొలగి, ఢిల్లీ పోలీసులకే బాధ్యతలను అప్పగిస్తున్నామని ఎన్ఏఐ ఢిల్లీ హైకోర్టుకు గురువారం తెలిపింది. ఐఎం ఉగ్రవాదులు ఢిల్లీపై దాడులకు కుట్రపన్నినట్టు నగర పోలీసులు 2012ల కేసు నమోదు చేశారు. దీనిపై ఎన్ఐఏ కూడా ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వివాదంపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తి వీపీ వైశ్... వివరణ ఇవ్వాల్సిందిగా హోంశాఖను ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసులే నిర్వహిస్తారని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది వరకే చార్జిషీటు కూడా సమర్పించారని తెలిపారు. విచారణకు ఎన్ఐఏ డెరైక్టర్ జనరల్, ఢిల్లీ పోలీసుశాఖ ప్రత్యేక కమిషనర్ హాజరయ్యారు. -
నఖ్వీ నివాసం ఎదుట సాబీర్ భార్య హైడ్రామా
బీజేపీ నేత ముఖ్తర్ అబ్బాస్ నఖ్వీ నివాసం ముందు జేడీ(యూ) బహిషృత నేత సాబిర్ ఆలీ సతీమణి యాస్మిన్ హైడ్రామా సృష్టించారు. టెర్రిరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు చేసిన నఖ్వీ క్షమాపణలు చెప్పాలంటూ యాస్మీన్ ధర్నా చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు నఖ్వీ నివాసం ముందే కూర్చుంటాను. చేసిన ఆరోపణల్ని నఖ్వీ రుజువు చేయాలి లేదా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. సాబీర్ ఆలీ నివాసంలోనే భత్కల్ ను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే భత్కల్ ఎక్కడ అరెస్ట్ చేసిందనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల సాబీర్ అలీ బీజేపీలో చేరడంపై ఆపార్టీకే చెందిన నఖ్వీ అభ్యంతరం చెప్పారు. భత్కల్ స్నేహితుడు సాబీర్ బీజేపీలో చేరారు. త్వరలోనే దావుద్ ను చేర్చకుంటారా? అంటూ ట్విటర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా సాబీర్ కు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. స్వంత పార్టీ నుంచే సాబీర్ ను చేర్చుకోవడంపై నిరసనలు వ్యక్తం కావడంతో ఇచ్చిన సభ్యత్వాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలపై నఖ్వీపై సాబీర్ ఆలీ పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. -
సాబీర్ ఆలీ తర్వాత దావూద్ ను చేర్చుకుంటారా?: నఖ్వీ
న్యూఢిల్లీ: బీజేపీలో మొజాహిద్దీన్ టెర్రిరిస్ట్ గ్రూప్ కు చెందిన యాసిన్ భత్కల్ స్నేహితుడు సాబీర్ ఆలీ చేరిక అగ్గి రాజేస్తోంది. బీజేపీలో సాబీర్ ఆలీ చేరికపై మెజార్టీ పార్టీ నేతలు వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. టెర్రిరిస్ట్ భత్కల్ స్నేహితుడు బీజేపీలో చేరాడు. త్వరలో దావుద్ ను కూడా చేర్చుకుంటారేమో అని పార్టీ ఉపాధ్యక్షుడు ముఖ్తర్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పార్టీ చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని నఖ్వీ నిలదీయడం అగ్ర నాయకత్వానికి మింగుడు పడటం లేదు. సాబీర్ ఆలీని పార్టీలోకి ఆహ్వానించడంపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరో నేత బల్బీర్ పంజ్ సూచించారు. పార్టీ నిర్ణయం లక్షలాది మంది కార్యకర్తల్ని షాక్ గురి చేసిందన్నారు. సాబీర్ ఆలీ లాంటి వ్యక్తులు పార్టీలో చేరడం వలన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తింటాయని మరో నేత రామేశ్వర్ చౌరాసియా అన్నారు. అయితే సాబీర్ పై పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలంటే అందర్ని కలుపుకుపోవాలని ఆయన సూచించారు. కీలక ఎన్నికల సమయంలో సాబీర్ ఆలీ చేరికపై ఇతర పార్టీలు పెద్దగా స్పందించకపోయినా.. బీజేపీ నేతలే వివాదస్పదం చేయడం చర్చనీయాంశమవుతోంది. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
-
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్
ఢిల్లీ : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిద్దీన్ నేత తహసీన్ అక్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతోనే రెండు రోజుల క్రితం జోధ్‌పూర్‌లో వఖాస్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు అక్తర్ అరెస్ట్‌ను ఆలస్యంగా ప్రకటించారు. మొత్తంమీద దిల్సుఖ్నగర్ కేసులో ఇప్పటిదాకా రియాజ్ మినహా మిగతా వారంతా అరెస్ట్ అయ్యారు. యాసిన్ భత్కల్ అరెస్ట్ అనంతరం తహసీన్ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు. కాగా 2013 ఫిబ్రవరి 21 దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదాలు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇండో-నేపాల్ సరిహద్దులో బీహార్ పోలీసులు అగస్ట్ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది. భక్తల్, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు. -
ఎన్నికలపై ఉగ్రపంజా
ఇండియన్ ముజాహిదీన్ అనుమానిత సభ్యుడు యాసిన్ భత్కల్ అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో దాడులకు దిగాలని మరో ఉగ్రవాద సంస్థ సిమి ప్రయత్నిస్తున్నట్టు గూఢచార వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీలోని ఏడు సీట్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులందరికీ తగిన రక్షణ కల్పించాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. న్యూఢిల్లీ: నిషేధిత ఉగ్రవాద సంస్థలు సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజధానిలో దాడులు చేయడం/నాయకులను అపహరించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ పోలీసుశాఖ అన్ని పోలీసు స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ ముజాహిదీన్ కీలక సభ్యుడిగా అనుమానిస్తున్న యాసిన్ భత్కల్ అరెస్టుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సంస్థ సభ్యులు దేశరాజధానిలో దాడులకు తెగబడవచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏడు సీట్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, నాయకులందరికీ తగిన రక్షణ కల్పించాలని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి జనాదరణ పెరగడాన్ని సహించలేని నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ (సిమి) కార్యకర్తలు మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనకుండా నిరోధించేందుకు సిమి కార్యకర్తలు ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో బాంబు పేలుళ్లకు తెగించే అవకాశాలను తోసిపుచ్చలేమని సీనియర్ పోలీసు అధికారి ఒకరు అన్నారు. ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్, కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీని కూడా ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయని సమాచారం. అబ్దూస్ సుభాన్ ఖురేషి ఎలియాస్ తాఖీర్ వంటి సిమి సభ్యులు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. లష్కరే తోయిబా నేతృత్వంలో సిమి..ఇండియన్ ముజాహిదీన్‌ను (ఐఎం) ఏర్పాటు చేసింది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాం తం (ఎన్సీఆర్)లో దాడులు చేయాలని ఐఎం నాయకుడు తెహిసిన్ అఖ్తర్ ఎలియాస్ మోనూ వ్యూహాలు రచిస్తున్నాడని అధికారవర్గాలు తెలిపాయి. ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఇతర రాష్ట్రాలకు వచ్చి విదేశీయులను అపహరించాలని మోనూ భావిస్తున్నట్టు యాసిన్ పోలీసుల విచారణలో తెలిపాడు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు గత నుంచి గత ఏడాది తప్పించుకుపారిపోయిన సిమి ఉగ్రవాదులు కూడా దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. దక్షణాదిలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్న అల్ ఉమ్మా కార్యకర్తలు సిమికి సహకరించవచ్చని సమాచారం. సిమి తో అల్ ఉమ్మాకు చాలా కాలంగా సంబంధాలు ఉన్నా, ఇది ఉత్తరాదిలో ఎప్పుడూ దాడులకు పాల్పడలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధానిలో భద్రత సంబంధిత అంశాలపై చర్చించడానికి నగర పోలీసులు, సంబంధిత అధికారులు వచ్చే వారం సమావేశం కానున్నారు. యాసిన్ భత్కల్‌కు మరోసారి నిరాశే ఢిల్లీలో 2008 వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితు డు యాసిన్ భత్కల్‌కు బెయిల్ ఇవ్వడానికి స్థానిక కోర్టు మళ్లీ తిరస్కరించింది. ఇతని అనుచరుడు అసదుల్లా అఖ్తర్‌కు కూడా నిరాశ తప్పలేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి వీలుగా ఈ ఇద్దరిని మరోసారి 15 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసుల విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి దయాప్రకాశ్ అంగీకరించారు. గ్రేటర్ కైలాష్‌లో 208, సెప్టెంబర్ 13న జరిగిన పేలుళ్లపై వీరిద్దరి ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసు ల అదుపులో ఉన్న భత్కల్, అఖ్తర్‌ను వచ్చే మూడు న విచారణకు హాజరుపర్చాలని ఆదేశిస్తూ జడ్జి దయాప్రకాశ్ ప్రొడక్షన్ వారంట్లు జారీ చేశారు. ఈ కేసుతో ప్రమేయమున్న ఆసియా దేశస్తుడి గురించి కేంద్ర నిఘావర్గాలు కొంత సమాచారం ఇచ్చినందునే, వీరిద్దరి కస్టడీ కోరుతున్నామని స్పెషల్‌సెల్ న్యాయమూర్తికి విన్నవించింది. -
‘భత్కల్ పోలీసు వ్యాన్‌ను పేల్చాలనుకున్నాడు’
ముంబై: 2011, జూలై 13 బాంబు పేలుళ్ల కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ జనసంచారం అధికంగా ఉన్న దాదర్‌లో పోలీసు వ్యాన్‌ను పేల్చేందుకు కుట్ర పన్నాడు. అయితే అతను ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి పోలీసు వ్యాన్ అక్కడి నుంచి వెళ్లిపోయిందని రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) వర్గాలు శుక్రవారం తెలిపాయి. వ్యాన్‌లోని పోలీసులను చంపాలనుకున్నాడని వివరించాయి. చెత్తకుండీకి సమీపంలో నాలుగో పేలుడు పదార్థాన్ని పెట్టిన భత్కల్ పథకం వేసిన రోజు పోలీసు వ్యాన్ లేకపోవడంతో ఆ బాంబును పేల్చలేదని చెప్పాయి. 2011, జూలై 13న ముంబైలో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మూడు వరుస బాంబు పేలుళ్లు జరగడంతో 21 మంది మృతి చెందగా, 141 మంది గాయపడ్డారు. సాయంత్రం 6.50 గంటలకు జావేరి బజార్‌లోమొదటిది, నిమిషం తర్వాత ఓపెరా హౌస్, 7.04 నిమిషాలకు సెంట్రల్ ముంబైలోని పశ్చిమ దాదర్‌లో పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అరెస్టయిన భత్కల్ను విచారించగా మొత్తం నాలుగు పేలుడు పదార్థాలను అమర్చామని, అయితే నాలుగో బాంబును మాత్రం పేల్చలేదని అంగీకరించాడు. తూర్పు దాదర్‌లోని పూల మార్కెట్‌కు సమీపంలో సహచరుడు తహసీన్ అక్తర్ షేక్‌తో కలిసి రెండు పేలుడు పదార్థాలు నాటామని తెలిపాడు. అయితే పోలీసు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకున్నామని, ఆ రోజు అనుకున్న సమయంలో ఆ వాహనం లేకపోవడంతో ఆలోచనను విరమించుకున్నామని వివరించాడు. 2011 బాంబు పేలుళ్ల కేసులో భత్కల్, అక్తర్లను విచారించేందుకు న్యూఢిల్లీ నుంచి తీసుకొచ్చిన పోలీసులు విచారించారు. వీరిని గురువారం మోకా కోర్టు ముందు హాజరుపరచగా ఈ నెల 18 వరకు పోలీసు కస్టడీకి ఆదేశించింది. -
పిక్‌పాకెటర్ అనుకుంటే బాంబులు పేల్చాడు
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో తమకు సంబంధం ఉందని ఇండియన్ ముజాహుద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. విచారణ అధికారులు యాసిన్ నుంచి పూర్తి వివరాలు రాబట్టారు. బాంబు పేలుళ్ల ఘటనకు పక్షం రోజుల ముందు తుమకూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే బాంబులు తయారు చేసినట్లు భత్కల్ చెప్పినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బాంబు పేలుళ్ల ఘటనకు మూడు రోజుల ముందు యాసిన్ భత్కల్ తుమకూరు నుంచి బస్సులో బెంగళూరు చేరుకున్నాడు. తరువాత మెజస్టిక్, గాంధీబజార్, కబ్బన్‌పార్క్, చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలలో తిరిగాడు. 2010 ఏప్రిల్ 17న బెంగ ళూరు రాయల్ చాలెంజర్ - ముంబాయి ఇండియన్స్ జట్ల మధ్య టీ-20 క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని అక్కడే బాంబులు పెట్టాలని యాసిన్ భత్కల్ నిర్ణయించాడు. ఏప్రిల్ 16న చిన్నస్వామి స్టేడియం దగ్గర యాసిన్ భత్కల్ అనుమానాస్పదంగా కనిపించడంతో పిక్‌పాకెట్ చేసే వ్యక్తిగా భావించిన పోలీసులు రెండు దెబ్బలు వేసి పంపించి వేశారు. ఏప్రిల్ 17 వేకువజామున చిన్నస్వామి స్టేడియం దగ్గర బాంబులు పెట్టారు. మ్యాచ్ ప్రారంభం కాక మునుపే పేలుళ్లు సృష్టించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. అనంతరం గాంధీబజార్, బీవీకే అయ్యంగార్ రోడ్లలో బాంబు పేలుళ్లు సష్టించాలని స్కెచ్ వేసిన యాసిన్ భత్కల్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్లు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. -
ట్యాంకర్లు, రైళ్లే బాంబులు
సాక్షి, హైదరాబాద్: ‘టార్గెట్ చేసిన ప్రాంతాల్లో బాంబుల్ని పేల్చినప్పుడు పదుల సంఖ్యలోనే మరణిస్తున్నారు. అదును చూసుకుని వీటి స్థానంలో ట్యాంకర్లు, రైళ్లను పేలిస్తే...’ నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పన్నాగమిది. దీనికోసం మాగ్నెటిక్ పరిజ్ఞానంతో పనిచేసే బాంబుల్ని తయారుచేస్తోంది. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతల్ని తెహసీన్ అక్తర్ మాడ్యుల్‌కు అప్పగించింది. ప్రస్తుతం బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్న ఐఎం సహ వ్యవస్థాపకుడు, దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ బయటపెట్టిన విషయాలివి. గత సెప్టెంబర్‌లో కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఐఎం స్థావరంలో పోలీసులు చేసిన సోదాల్లో చిక్కిన 90 బాంబుల్లో కొన్ని మాగ్నెటిక్ పరిజ్ఞానంతో కలిగినవి కూడా ఉండటం దీనికి బలాన్నిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో తలదాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు ఇది జరుగుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. తెహసీన్ కనుసన్నల్లో 13 మాడ్యుల్స్... యాసిన్ భత్కల్ అరెస్టు తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తెహసీన్ అక్తర్ దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో 13 మాడ్యుల్స్‌ను తయారుచేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. - ఉత్తరప్రదేశ్‌లోని ఆజాంగఢ్‌లో ఐదు, బీహార్‌లోని దర్భంగాలో నాలుగు, ఛత్తీస్‌గఢ్‌లోని రాంచీలో ఒకటి, కర్ణాటకలోని మంగుళూరు పరిసరాల్లో మరో రెండింటితో పాటు హైదరాబాద్‌లోనూ వీటిని విస్తరించినట్లు భావిస్తున్నారు. - అయస్కాంత పరిజ్ఞానంతో కూడిన ఐఈడీలను పేల్చడానికి వీటిని వినియోగించవచ్చని హెచ్చరిస్తున్నాయి. - ఈ తరహా బాంబుల తయారీ, వీటి రూపురేఖలతో పాటు ఇంధనాన్ని రవాణా చేసే ట్యాంకర్లు, రైళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలు, విధివిధానాలను రూపొందించి సంబంధిత విభాగాలకు పంపేందుకు కేంద్ర నిఘా వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. రైల్వేస్టేషన్లు, జనసమ్మర్ద ప్రాంతాలే లక్ష్యం - ఈ ఆధునిక మాగ్నెటిక్ మెకానిజంతో కూడిన ఐఈడీలను ట్యాంకర్లు, రైళ్లకు అతికించే ముందు అవి ప్రయాణించే మార్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఐఎం ఉగ్రవాదులకు స్పష్టంచేసింది. - జనసమ్మర్ద ప్రాంతాలు, కీలక రైల్వేస్టేషన్ల మీదుగా వెళ్లే వాటిని ఎంచుకుని వీటిని పేలిస్తేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని ఉగ్ర సంస్థ భావిస్తోంది. - పరారీలో ఉన్న ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్, వకాస్లు ఈ బాంబుల్ని తయారుచేయడంలో నిష్ణాతులైనప్పటికీ రెండో వ్యక్తి పాకిస్థానీ కావడంతో స్లీపర్ సెల్స్ సహకారంతో ఈ ఆపరేషన్లు పూర్తిచేసే బాధ్యతల్ని తెహసీన్కే భత్కల్ అప్పగించాడని నిఘా వర్గాలు గుర్తించాయి. - గత సెప్టెంబర్‌లో దర్యాప్తు అధికారులు మంగళూరులో ఉన్న ఉగ్రవాదుల అడ్డా జఫైర్ హైట్స్‌పై దాడి చేసినప్పుడు తెహసీన్, వకాస్లు త్రుటిలో తప్పించుకున్నా.. పేల్చడానికి సిద్ధంగా ఉన్న 90 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో 50 వరకు మాగ్నెటిక్ పరిజ్ఞానంతో చేసినట్లు నిపుణులు నిర్ధారించారు. ఇంధన రవాణాలే లక్ష్యంగా... - ఇప్పటివరకు ఐఎం ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పరిజ్ఞానంతో తయారుచేసిన బాంబుల్నే వినియోగిస్తున్నారు. ప్రధానంగా పేలుడు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్‌తో చేసే వీటిని విధ్వంసం సృష్టించాల్సిన ప్రదేశంలో పెట్టిన తరవాత టైమర్, డిజిటల్ వాచ్, సెల్‌ఫోన్ అలారమ్‌లను వినియోగించి నిర్ణీత సమయంలో పేలుస్తున్నారు. - వీటికి మరింత ఆధునికత జోడించి మాగ్నెటిక్ పరిజ్ఞానాన్నీ అందుబాటులోకి తెచ్చింది ఐఎం. ఈ ఐఈడీలకు శక్తిమంతమైన అయస్కాంతాన్ని జోడించడం ద్వారా భారీ ఇనుప వస్తువుల్ని పట్టి ఉండేలా చేస్తారు. - ఇలాంటి ఐఈడీలను కొన్ని రకాలైన యాసిడ్లతో పాటు పెట్రోల్, డీజిల్ వంటి త్వరతగతిన మండే, మంటల్ని త్వరగా విస్తరింపజేసే లక్షణం ఉన్న వాటిని రవాణా చేస్తున్న ట్యాంకర్లు, గూడ్స్ రైళ్లకు అతికించాలన్నది ఉగ్ర సంస్థ పన్నాగం. - ఈ రకమైన ‘అతికించే బాంబులు’ అఫ్ఘానిస్థాన్, ఇరాక్‌ల్లో సుపరిచితమే అయినా... భారత్‌లో మాత్రం వీటి వినియోగం అరుదు. - 2012 ఫిబ్రవరి 13న ఢిల్లీలోని ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం సమీపంలో ఇలాంటి బాంబుతో కూడిన కారే పేలింది. ఇది తక్కువ తీవ్రత కలిగింది కావడంతో నలుగురికి గాయాలయ్యాయి. అంతకు మించి అయస్కాంత పరిజ్ఞానం ఉన్న బాంబుల తయారీ, వినియోగానికి సంబంధించి పోలీసు విభాగాలకే పూర్తి అవగాహన లేదు. -
రూ.5 నోటు ఉందా.. బహుశా నకిలీ కావొచ్చు!
మీ జేబులో ఐదు రూపాయల నోటు ఉంటే.. బహుశా అది నకిలీ నోటు కావొచ్చు. మళ్లీ ఎప్పుడైనా మీ చేతికి ఐదు రూపాయల నోటు వస్తే ఓ సారి జాగ్రత్తగా పరిశీలించండి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. గత సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున నకిలీ ఐదు రూపాయల నోట్లను స్వాధీన పరుచుకోవడం ఇదే తొలిసారి అంటున్నారు ఢిల్లీ పోలీసులు. నకిలీ ఐదు రూపాయల నోట్ల వ్యవహారం వినియోగదారులనే కాకుండా, ఆర్ధిక వ్యవస్థను ఆందోళనకు గురి చేస్తోంది. భారీ మొత్తంలో నకిలీ నోట్ల సరఫరాలో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ది ప్రధాన పాత్ర అని పోలీసులు వెల్లడించారు. నకిలీ నోట్లపై దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకు ఓ ఆసక్తికరమైన అంశం దృష్టికి వచ్చింది. పాకిస్థాన్ లోని కరాచీ, ముల్తాన్, క్వెట్టా, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రింటింగ్ ప్రెస్ లోనే నకిలీ భారతీయ కరెన్సీ ప్రింట్ అవుతోందనే సమాచారం అందింది. నకిలీ నోట్లన్ని గుర్తుపట్టని రీతిలో దాదాపు ఒరిజినల్ నోట్లుగానే చెలామణీలో ఉంటాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. గతంలో నకిలీ నోట్లన్ని హై డినామినేషన్ లో వచ్చేవని... నకిలీ నోట్ల సరఫరాలో ప్రస్తుతం మాఫియా వ్యూహాన్ని మార్చారని పోలీసుల తెలిపారు. గతంలో 1000, 500 నోట్లు మాత్రమే నకిలీ నోట్లుగా వచ్చేవని.. ఐతే తక్కువ విలువ నోట్లను మార్పిడి చేయడానికి అంతగా కష్టం ఉండకపోవడంతో పాక్ నకిలీ కరెన్సీ మాఫియా 5 రూపాయలను ఎంచుకుందని ఉన్నతాధికారులు తెలిపారు. గత మూడేళ్లుగా 5, 10, 20 రూపాయల నకిలీ నోట్లను భారత్ లోకి ప్రవేశపెట్టి.. భారీ ఎత్తున ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మాఫియా చెలామణిలోకి తీసుకువస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. కేవలం 2013 సంవత్సరంలో 5.66 కోట్ల రూపాయల భారతీయ నకిలీ కరెన్సీని అధికారులు సీజ్ చేశారు. గత సంవత్సరం 19,400 ఐదు రూపాయల నోట్లను, 20,517 వంద రూపాయల నోట్లను, 60,525 ఐదు వందల నోట్లను, 24,116 వెయి రూపాయల నోట్లను స్వాధీన పరుచుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కరెన్సీ పేపర్, ఇంక్, మాగ్నటిక్ దారంను పాక్ మాఫియా భారతీయ కరెన్సీ ప్రింటింగ్ కు వినియోగిస్తోందని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇటీవల పట్టుబడిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్, లష్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ కరీం తుండాలు ఇంటారాగేషన్ లో వెల్లడించినట్టు పోలీసుల తెలిపారు. పాక్ లో ప్రచురించిన నకిలీ కరెన్సీని బంగ్లాదేశ్, నేపాల్, థాయ్ లాండ్, డెన్మార్క్, హాలెండ్, సింగపూర్, శ్రీలంక దేశాల నుంచి భారత్ లో ప్రవేశపెడుతున్నట్టు విచారణలో సమాచారం తెలిసిందన్నారు. ఏది ఏమైనా నకిలీ కరెన్సీని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కస్టమ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాలతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నామని పోలీసులు అధికారులు తెలిపారు. కరెన్సీ నోట్ల మార్పులో ఏదైనా అనుమానం వస్తే వాటిని పోలీసుల దృష్టికి తీసుకురావాలని వినియోగదారులకు విజ్క్షప్తి చేస్తున్నారు. -
భత్కల్ను తప్పించేందుకు ఐఎం కుట్ర!
-
భత్కల్ను తప్పించేందుకు ఐఎం కుట్ర!
న్యూఢిల్లీ: తమ నాయకుడు యాసిన్ భత్కల్ను తప్పించేందుకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యూహ్యాలు పన్నుతోందని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయి. భత్కల్ను విడిపించుకునేందుకు ఐఎం కుట్రలు చేస్తోందని నిఘా వర్గాలు అన్ని రాష్ట్రాలను హెచ్చరించినట్టు సమాచారం. భత్కల్ను విమానంలో హైజాక్ చేసే అవకాశముందని కేంద్ర ఇంటెలిజెన్స్ వెల్లడించింది. నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. యాసిన్ భత్కల్ ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉన్నాడు. 2010, ఏప్రిల్ 17వ తేదీన బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుళ్ల కేసులో అతడిని పోలీసులు విచారిస్తున్నారు. -
ఒక ఉగ్రవాది ఆత్మకధ
-
భత్కల్‌కో ‘జీవిత చరిత్ర’
సాక్షి,సిటీబ్యూరో: అనేకమందిని పొట్టనపెట్టుకొని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) కో-ఫౌండర్ యాసీన్ భత్కల్ రాస్తున్న ఆటోబయోగ్రఫీపై నిఘా వర్గాలు ఆత్రుతుగా చూస్తున్నాయి. 2008 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన అనేక పేలుళ్లకు సూత్రధారిగా ఉన్న యాసీన్‌భత్కల్ గతేడాది ఆగస్టు 29న నేపాల్‌లో చిక్కిన విషయం విదితమే. అక్కడ్నుంచి అనేక కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. దిల్సుఖ్నగర్ జంటపేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సైతం హైదరాబాద్ తీసుకొచ్చి విచారించింది. ఇలా ఇతడు కేవలం తీహార్ జైల్లోనే కాదు ఏ పోలీసుల కస్టడీలో ఉన్నా...ప్రతిరోజూ ఇంటరాగేషన్ పూర్తయిన తర్వాత తన సెల్‌లోకి వెళ్లిపోతూ పోలీసుల నుంచి తీసుకున్న కాగితాలపై ‘జీవితచరిత్ర’ రాస్తున్నాడు. ఎవరా ‘క్లోజ్‌ఫ్రెండ్’..?: యాసీన్ భత్కల్ ఉర్దూలో రాస్తున్న ఈ ‘జీవితచరిత్ర’లో కొన్ని కవితలు, పద్యాలు సైతం ఉన్నట్లు కేంద్ర నిఘావర్గాలకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. ఈ రాతలపై కన్నేసి ఉంచిన నిఘావర్గాలను ఓ అంశం ఆకర్షించింది. ఇప్పటివరకు యాసీన్ రాసిన దానిప్రకారం కేంద్ర నిఘా వర్గాలకు తన కదలికలపై ఉప్పందించింది ఓ ‘క్లోజ్‌ఫ్రెండ్’గా అతడి అనుమానం. తన అరెస్టుకు కొన్నినెలల ముందు సదరు స్నేహితుడిని కలిసిన సంద ర్భంలో ‘అగ్లీ రంజాన్ షాయద్ తీహార్ మేహోగా’ (బహుశా వచ్చేడాది రంజాన్‌ను తీహార్ జైల్లో చేసుకోవాల్సి ఉంటుందేమో!) అని అతడితో వ్యాఖ్యానించానని యాసీన్ రాశాడు. ఈ విషయాన్ని జైలు, పోలీసు అధికారుల ద్వారా తెలుసుకున్న నిఘావర్గాలు ఆ ‘క్లోజ్‌ఫ్రెండ్’ ఎవరనే కోణంలో ఆరాతీస్తున్నాయి. ఎక్కడా కనిపించని పశ్చాత్తాపం: ఆరేళ్లపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబులతో విధ్వంసం సృష్టించి, వందలాదిమంది చావుకు, వేలమంది క్షతగాత్రులు కావడానికి కారణమైన యాసీన్‌భత్కల్‌లో ఎలా ంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని నిఘావర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు అతగాడు రాసిన ‘జీవిత చరిత్ర’లోనూ ఈ కోణంలో ఎలాంటి ప్రస్తావన లేదని, ఓచోట తాను చేస్తున్న పనుల్ని ‘తమవారి కోసం చేస్తున్న త్యాగం’ అంటూ అభివర్ణించాడని అవి వివరించాయి. మాకూ ప్రాణహానీ ఉంది..: పదుల సంఖ్యలో విద్రోహక చర్యలకు పాల్పడి, వందలమంది ప్రాణాలు తీసిన టై ద్వయం యాసీన్,అసదుల్లాఅక్తర్‌లు ప్రస్తుతం తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారట. ఇదే విషయాన్ని తమ లాయర్ ద్వారా తీహార్ జిల్లా కోర్టుకు నివేదించారు. స్పందించిన న్యాయస్థానం నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖను ఆదేశిస్తూ కేసు విచారణను శుక్రవారానికి వాయిదావేసింది. -
‘మా ప్రాణాలకు ముప్పు’
న్యూఢిల్లీ: పటిష్ట భద్రత కలిగిన తీహార్ కారాగారంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌లు ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) కోర్టు న్యాయమూర్తి ఐఎస్ మెహతాకు బుధవారం దరఖాస్తు చేసుకున్నారు. తాము హత్యకు గురవుతామంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ తమను హెచ్చరించాడని, తమ విషయంలో జైలు అధికారుల వైఖరి దారుణంగా ఉందని అందులో పేర్కొన్నారు. తమను శత్రువుల కంటే ఘోరంగా చూస్తున్నారన్నారంటూ వారిరువురూ తమ దరఖాస్తులో తెలిపారు. ఈ నేపథ్యంలో తాము తీవ్ర భయాందోళనలకు గురువుతున్నామన్నారు. తీహార్ కారాగారంలో తమకు తగినంత భద్రత క ల్పించాలని డెరైక్టర్ జనరల్‌ను ఆదేశించాల్సిందిగా విన్నవించారు. ఈ విన్నపాన్ని పరిశీలించిన కోర్టు ఈ నెల 17వ తేదీలోగా ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటై తీహార్ కారాగార అధికారులను ఆదేశించింది. జ్యుడిషియల్ కస్టడీ కింద యాసిన్ భత్కల్, అఖ్తర్‌లను పోలీసులు తీహార్ కారాగారానికి తరలించిన విషయం విదితమే. మాకు అప్పగించండి: ఎన్ఐఏ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను తమకు అప్పగించాలని ఎన్ఐఏ కోర్టును అభ్యర్థించారు. 2010, ఏప్రిల్ 17వ తేదీన బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి విదితమే. ఈ ఘటనలో భత్కల్ ప్రమేయం ఉందని అనుమానించిన అక్కడి పోలీసులు కేసు నమోదుచేశారు. రాయల్ చాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందనగా ఈ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి బెంగళూర్‌లోని మెజిస్ట్రేట్ కోర్టు... భత్కల్‌పై ప్రొడక్షన్ వారంట్ జారీచేసిందని కర్ణాటక పోలీసులు స్థానిక న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 15 మంది గాయపడిన సంగతి విదితమే. క్షతగాత్రుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. కర్ణాటక పోలీసుల అభ్యర్థనను ఆలకించిన కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. -
సూరత్‌లో అణుబాంబు పేల్చాలనుకున్నా!
న్యూఢిల్లీ: అణుబాంబు.. అత్యంత ఆధునిక ఆయుధం.. భారీస్థాయిలో ప్రాణనష్టాన్నే కాకుండా, తరాల తరబడి తీవ్ర ప్రభావం చూపగల మారణాయుధం. అది ముష్కరులు.. ముఖ్యంగా భారత్‌పై ఎల్లవేళలా విషం కక్కే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) లాంటి ఉగ్రవాద సంస్థల చేతికి చిక్కితే.. వారికి అవి యథేచ్ఛగా లభిస్తుంటే..! ఐఈడీ లాంటి బాంబులతోనే అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులు.. ఇక అణుబాంబు దాడులను ప్రారంభిస్తే..! ఆలోచిస్తేనే వణుకు పుట్టే పరిస్థితి. అయితే, అణు బాంబులు అంత ఈజీగా ఉగ్రవాదులకు లభించవని, వాటిని భద్రపరిచే, వినియోగించే సాంకేతికత వారి దగ్గర లేదనే నమ్మకంతో మనమే కాదు, మన నిఘా సంస్థలూ ఉన్నాయి. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా పలు కళ్లు చెదిరే వాస్తవాలను ఇండియన్ ముజాహిదీన్ ఇండియా చీఫ్ యాసిన్ భత్కల్ వెల్లడిస్తున్నాడు. ప్రస్తుతం జాతీయ నిఘా సంస్థ(నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) అదుపులో ఉన్న యాసిన్ ఐఎం ప్రణాళికలను, శిక్షణ విధానాలను, సహాయం అందిస్తున్న వారి వివరాలను ఇంటరాగేషన్ సందర్భంగా వెల్లడిస్తున్నాడు. ఒక ఆంగ్ల పత్రిక చేతికి యాసిన్ భత్కల్ ఇంటరాగేషన్ వివరాలు చిక్కాయి. అవి యాసిన్ భత్కల్ మాటల్లోనే.. ‘గుజరాత్‌లోని సూరత్‌లో చిన్నపాటి అణుబాంబును పేల్చాలని ప్రణాళిక వేశాను. న్యూక్లియర్ బాంబును అందించగలరా? అని పాకిస్థాన్‌లోని మా బాస్ రియాజ్ భత్కల్ను అడిగాను. పాకిస్థాన్‌లో మనకు ఏదైనా లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నాకో చిన్నపాటి అణుబాంబును అందించమని, దానిని సూరత్‌లో పేల్చాలనుకుంటున్నానని చెప్పాను. అలా చేస్తే ముస్లింలు కూడా చనిపోతారని రియాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలా జరగకుండా.. కుటుంబాలతో సహా నగరం విడిచివెళ్లిపోవాలని కోరుతూ పేలుడుకు ముందు సూరత్‌లోని అన్ని మసీదుల్లో పోస్టర్లు అతికిస్తానని చెప్పాను’. అదృష్టవశాత్తూ ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చకముందే యాసిన్ భత్కల్ నేపాల్‌లో ఈ ఆగస్ట్‌లో అరెస్ట్ అయ్యాడు. కానీ అణుబాంబు భయం మాత్రం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. విచారణ సందర్భంగా యాసిన్ ఐఎం నిర్వహణకు సంబంధించిన పలు వివరాలను భారత నిఘా విభాగాలకు వెల్లడిస్తున్నాడు. సైనిక శిక్షణకు దీటైన శిక్షణను పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో పాకిస్థాన్‌లో ఐఎం శ్రేణులకు అందుతోందని తెలిపాడు. అందులో శారీరక ధృడత్వ శిక్షణ, పీఈ3ఏ, సీ3, సీ4, టీఎన్టీ సహా పలు రకాల బాంబుల తయారీ, పిస్టల్ నుంచి ఏకే 47 వరకు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించే విధానం నేర్పిస్తారని చెప్పాడు. సాధారణంగా 50 రోజులపాటు ఆ శిక్షణ ఉంటుందన్నారు. దాడులకు సంబంధించిన అన్ని ప్రణాళికలను రియాజ్ భత్కల్‌కు తెలియజేస్తామన్నాడు. -
అది ఇండియన్ ముజాహిదీన్ దాడే
పాట్నా పేలుళ్ల సూత్రధారి తెహసీన్ అక్తర్ ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు పాట్నా/రాంచి: బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ సభ లక్ష్యంగా జరిగిన వరుస పేలుళ్లు.. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పనేనని దర్యాప్తులో వెలుగుచూసింది. ఐఎం అగ్రనేత, ఇటీవల అరెస్టయిన యాసిన్భత్కల్కు కుడిభుజంగా పేరుపడ్డ తెహసీన్ అక్తర్ (దిల్సుఖ్నగర్ పేలుళ్లలో పాత్రధారి) పాట్నా పేలుళ్ల సూత్రధారిగా బయటపడింది. పాట్నా పేలుళ్లకు సంబంధించి ఇంతియాజ్ అన్సారీ, తౌసీమ్ అనే ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంతియాజ్ పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్ రాజధాని రాంచీ నివాసి అని.. ఐఎం ఇటీవలే నెలకొల్సిన ‘రాంచీ మాడ్యూల్’లో భాగస్వామి అని దర్యాప్తులో వెల్లడైనట్లు బీహార్, జార్ఖండ్ పోలీసులు తెలిపారు. అతడు పేలుళ్ల నేరాన్ని అంగీకరించాడని, కుట్ర రచన, అమలు వివరాలు వెల్లడించాడని వివరించారు. రాంచీలోని ఇంతియాజ్ నివాసంలో సోదాలు చేయగా బాంబుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలు, ప్రెషర్ కుక్కర్లు, ఉగ్రవాద సాహిత్యం లభ్యమయ్యాయని రాంచీ పోలీసులు చెప్పారు. పాట్నాలోని గాంధీ మైదాన్ వద్ద సంభవించిన ఆరు పేలుళ్లు, పాట్నా రైల్వే స్టేషన్లో మరో పేలుడులో ఐదుగురు చనిపోగా, 83 మంది గాయపడిన విషయం తెలిసిందే. పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి సోమవారం చనిపోవటంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. జార్ఖండ్ ఏడీజీ ఎస్.ఎన్.ప్రధాన్, పాట్నా ఎస్ఎస్పీ మనుమహరాజ్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు వేర్వేరుగా వెల్లడించిన వివరాల ప్రకారం బాంబు పేలుళ్లు, ఐఎం ఉగ్రవాద సంస్థ పాత్ర వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతా వెళ్తున్నామంటూ పాట్నాలో పేలుళ్లు తొలి బాంబు పేలిన పాట్నా రైల్వేస్టేషన్లో ఇద్దరు కీలక నిందితులు ఇంతియాజ్, తౌసీమ్లను అరెస్ట్‌చేశారు. ఇంతియాజ్‌ను విచారించగా.. యాసిన్భత్కల్ సన్నిహితుడైన తెహసీన్అక్తర్.. పాట్నా పేలుళ్లకు కుట్రపన్ని వీరిని రంగంలోకి దింపినట్లు వెల్లడైంది. తెహసీన్ గత వారం రాంచీలో తనను కలిశాడని.. మోడీ సభ వద్ద పేలుళ్ల ప్రణాళికకు అప్పుడు తుదిరూపం ఇచ్చామని ఇంతియాజ్ బయటపెట్టాడు. తనతో పాటు గాంధీ మైదాన్ వద్దకు ఆరేడు బృందాలు బాంబులు అమర్చేందుకు వచ్చాయని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని ధుర్వా ప్రాంతంలో గల అతడి నివాసంలో సోదాలు నిర్వహించగా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇంతియాజ్, అతడి మేనల్లుడు తొఫేక్, తారిక్ అన్సారీ, నోమన్ అన్సారీలు శనివారం పాట్నా వెళ్లారని.. వారితో మార్గంలో మరో ఇద్దరు కలిశారని బయటపడింది. ఈ నలుగురూ తాము కోల్‌కతా వెళుతున్నామని స్థానికులకు చెప్పారు. కానీ శనివారం పాట్నా బయలుదేరి వెళ్లారు. వీరిలో పాట్నాలో బాంబులు అమరుస్తుండగా తారిక్ చనిపోయాడు. తౌసీమ్ ఒక బాంబుకు లోటస్ టైమర్‌ను అమరుస్తుండగా ఆ బాంబు అనుకోకుండా పేలిపోవటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి నుంచి పారిపోతున్న తౌసీమ్ను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ పేలుడులో తౌసీమ్ తీవ్రంగా గాయపడ్డాడని, పరిస్థితి విషమంగా ఉందని, జీవించే అవకాశాలు అతి తక్కువ అని వైద్యులు చెప్తున్నారు. రైల్వే స్టేషన్లోనే ఇంతియాజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. పాట్నా పేలుళ్లకు సంబంధించి ఆరుగురు అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఐఎం రాంచీ మాడ్యూల్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రాంచీ చేరుకుంది. పాట్నా పేలుళ్లకు సంబంధించి రాంచి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్న ముగ్గురు అనుమానితులను విచారించి వారి ప్రమేయం లేదని నిర్ధారించుకున్న తర్వాత సోమవారం విడిచిపెట్టారు. మైదానం వద్ద మెటల్ డిటెక్టర్లు పెట్టలేదు మోడీ సభాప్రాంగణమైన గాంధీ మైదాన్‌లోకి వేలాది మంది పది ద్వారాల ద్వారా ప్రవేశించారు. అయితే వారిలో ఎవరైనా ప్రమాదకర వస్తువులు తెస్తున్నారేమో శోధించేందుకు ఎక్కడా మెటల్ డిటెక్టర్లను ఉపయోగించలేదని సమాచారం. ఇంతకుముందు బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో కూడా రాంచీ మాడ్యూల్ హస్తం ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పాట్నాలో ఆదివారం నాటి పేలుళ్లకు ఉపయోగించిన బాంబులు కూడా.. గత జూలై ఏడో తేదీన బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో ఉపయోగించన బాంబుల తరహాలోనే ఉన్నాయి. రెండు చోట్లా ఒక్కో నాటు బాంబులో అర కిలో పేలుడు పదార్థాలను ఉపయోగించారు. వాటిని పేల్చేందుకు టైమర్లను ఉపయోగించారు. రెండు చోట్లా ఉపయోగించిన టైమర్లు ఒకే బ్రాండువి. ఇవి గువాహటిలోని ఒక షాపు నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఒకే బ్రాండు టైమర్ వాచ్‌లు. రెండు చోట్ల పేలుళ్లూ ఒక్కరి పనే అనేందుకు ఇది తిరుగులేని ఆధారంగా పోలీసులు చెప్తున్నారు. భద్రతా వైఫల్యం.. రాజ్‌నాథ్ మోడీ సభవద్ద భద్రతా వైఫల్యాలు ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపిం చారు. ‘ఆ సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి పాల్గొంటున్నందున.. అదనపు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. భద్రతా వైఫల్యముంది.. అందులో సందేహం లేదు’ అని అన్నారు. బీహార్ పోలీసులకు ఐబీ ముందుగానే నిర్దిష్ట హెచ్చరిక జారీచేసిందన్న అరుణ్‌జైట్లీ ఆరోపణలను పరిశీలించాల్సిందిగా అధికారులకు నిర్దేశించినట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. టూరిస్ట్ గైడ్ అవతారంలో... ‘తెహసీన్ తరచుగా గుర్తింపులను మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. సాధారణంగా టూరిస్ట్ గైడ్ అవతారంలో సంచరిస్తూ.. ఉగ్రవాద దాడులకు అనువైన ప్రాంతాల వద్ద రెక్కీ నిర్వహిస్తుంటాడు. ముఖ్యమైన పర్యాటక స్థలాలు, లేదా తాను తరచుగా వెళ్లే ఇంటర్నెట్ సెంటర్లలో కనిపించే అవకాశముంది. అలాగే.. నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు కావాలంటూ దుకాణాలకు వచ్చే అవకాశముంది’ అని ఐబీ, ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అప్రమత్తంగా ఉండండి: కేంద్రం న్యూఢిల్లీ: పాట్నా వరుస పేలుళ్ల నేపథ్యంలో.. అన్ని రాష్ట్రా లూ అప్రమత్తంగా ఉండాలని.. పండుగ సీజన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్రం సూచించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మిజోరంలలో పార్టీల సభలకు భద్రతను మరింతగా పెంచాలనీ హోంశాఖ నిర్దేశించింది. మార్కెట్లు, ఆలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. మోడీకి తగిన భద్రత కల్పిస్తున్నాం: షిండే మోడీకి తగినంత భద్రత కల్పిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే పేర్కొన్నారు. పాట్నా పేలుళ్ల నేపథ్యంలో మోడీ భద్రతను సమీక్షించాలన్న బీజేపీ డిమాండ్‌కు షిండే పై విధంగా స్పందించారు. ‘అత్యున్నతమైన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్ఎస్జీ) కమెండోలతో మోడీకి 24 గంటల పాటూ జడ్ ప్లస్ భద్రత కేటాయించాం’ అని ఆయన చెప్పారు. తాను మంగళవారం పాట్నా వెళ్తానని.. మోడీ సభ వద్ద పేలుళ్లపై సమీక్షిస్తామన్నారు. -
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ : పాట్నా పేలుళ్ల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌కు భద్రత పెంచాల్సిందిగా ఆయా రాష్ట్రాల పోలీసులకు సోమవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు పాట్నా బాంబు పేలుళ్ళ వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ హస్తం ఉన్నట్లు బీహార్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌కు సన్నిహితుడైన తైసిన్ అక్తర్ ఈ పేలుళ్లకు సూత్రదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక పాట్నా పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. మరో వందమంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులను ఢిల్లీకి తరలించిన ఎన్ఐఏ
దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి తరలించారు. దిల్సుఖ్నగర్ బాంబ్ కేసులో విచారణ నిమిత్తం ఆ ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ తీసుకువచ్చారు. ఇటీవల దేశ సరిహద్దుల వద్ద యూసిన్ భత్కల్‌తోపాటు మరోకరిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ బాంబు పేలుళ్లలో భత్కల్ కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు: తబ్రేజ్
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు విచారణలో ఎన్ఐఏ పురోగతి సాధించింది. ఎన్ఐఏ విచారణలో అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ పలు కీలక విషయాలు వెల్లడించాడు. ప్రయివేట్ ట్రావెల్స్‌లో మంగళూరు నుంచి వచ్చి రెక్కీ నిర్వహించేవారని తెలిపాడు. అబిడ్స్, మలక్‌పేట, దిల్సుఖ్ నగర్లో రెక్కీ నిర్వహించినట్లు అసదుల్లా అక్తర్ వెల్లడించాడు. మంగళూరులోని యూనిట్ హెల్త్‌కేర్ వద్ద ఓ వ్యక్తి రియాజ్ భక్తల్ పేరుతో కొంత పేలుడు సామాగ్రిని అందచేశాడని చెప్పాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నామని, పేలుళ్లకు రెండు రోజుల ముందే బాంబులను పరీక్షించినట్లు పేర్కొన్నాడు. జుమారాత్బజార్, మలక్‌పేట్‌లలో పాత సైకిల్ విడిభాగాలు కొన్నామని... సేకరించిన విడిభాగాలతో రెండు సైకిళ్లు తయారు చేసినట్లు చెప్పాడు. పేలుళ్ల రోజు మలక్‌పేట రైల్వేస్టేషన్లో సైకిళ్లు ఉంచి, ఆ సైకిళ్లకు టిఫిన్ బాక్స్ బాంబులు అమర్చినట్లు అసదుల్లా అక్తర్ తెలిపాడు. దిల్సుఖ్ నగర్ బస్టాప్ వద్ద ఓ సైకిల్‌ను వాఖత్ ఉంచగా, A1 మిర్చి సెంటర్ వద్ద తహసీన్ మరో సైకిల్ ఉంచినట్లు అసదుల్లా అక్తర్ వెల్లడించాడు. రియాజ్ భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు జరిగాయని, పేలుళ్లు జరిగిన రోజే బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలిపాడు. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లి అక్కడ నుంచి నేపాల్ చేరుకున్నట్లు చెప్పాడు. -
పేలుళ్లకు నెల్లాళ్ల ముందే బాంబులు సిద్ధం
ఎన్ఐఏ విచారణలో భత్కల్, తబ్రేజ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కోసం ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పక్కా పథకం ప్రకారం నెల్లాళ్ల ముందుగానే బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో విధ్వంసం సృష్టించేందుకు జనవరిలోనే బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్‌లు దర్యాప్తులో వెల్లడించాడు. బాంబుల తయారీ కోసం ఒక వ్యక్తి యాసిన్ భత్కల్‌కు పేలుడు పదార్థాలను సమకూర్చినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు. యాసిన్ భత్కల్ నెల్లాళ్ల ముందుగానే నగరంలో మకాం వేసినట్లు వారు అనుమానిస్తున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను బాధ్యులుగా గుర్తించారు. -
ఈ ఉగ్రవాదుల సమాచారమివ్వండి
ప్రజలకు ఎన్ఐఏ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల సమాచారం తెలిస్తే తమకు అందించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులు తహసీన్ అక్తర్ అలియాస్ మోను, అలియాస్ హసన్, వకాస్ అలియాస్ జవేద్ అలియాస్ అహ్మద్‌లు దేశంలోనే ఉండివుంటారని అనుమానిస్తోంది. వీరిద్దరూ మళ్లీ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉండొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్యాప్తు అధికారులు సూచించారు. 2010లో జరిగిన వారణాసి, 2011లో ముంబై పేలుళ్లకు కూడా వీరు బాధ్యులని ఎన్ఐఏ ప్రకటించింది. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల రివార్డును ఇప్పటికే ప్రకటించింది. వీరిద్దరి ఆచూకీ తెలిసినవారు ‘ఎస్పీ10.ఎన్ఐఏఎట్జీవోవీ.ఇన్’కు మెయిల్ పంపాలని, 011-23438200, 91-8540848216 నంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఎస్పీ, సీబీఐ-1, ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్, 6వ అంతస్తు, ఎన్డీసీసీ బిల్డింగ్ -11, జై సింగ్ రోడ్, న్యూ ఢిల్లీ-110001 అడ్రస్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదుచేయవచ్చని వెల్లడించారు. కూనంనేనిపై కేసు ఎత్తివేయాలి: నారాయణ సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహా తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన నాన్‌బెయిలబుల్ కేసుల్ని ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. -
యాసిన్ భత్కల్‌కు అక్టోబరు 17 వరకు రిమాండ్
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను హైదరాబాద్ పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్టోబరు 17 వరకు కోర్టు భత్కల్ను రిమాండ్ విధించింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ప్రధాన సూత్రధారులైన యాసిన్, తబ్రేజ్‌లను గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భత్కల్ను హైదరాబాద్ అధికారుల కస్టడీకి ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు అనుమతించింది. దాంతో హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు భత్కల్ను విచారిస్తున్నారు. ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. గత వారంలో ఎన్ఐఏ అధికారులు భత్కల్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గోవా తీసుకెళ్లారు. అక్కడ అంజునా, పనాజి సమీపంలోని చింబెల్ అనే మురికివాడలో అతడు నివసించిన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని యాసిడ్ బాటిళ్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చింబెల్ ఇందిరానగర్ నుంచి విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజునాలో భత్కల్ అద్దెకు ఉన్న నివాసం నుంచి ఎన్ఐఏ అధికారులు బాంబు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. -
భత్కల్ను హైదరాబాద్ తీసుకువచ్చిన ఎన్ఐఏ అధికారులు
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భత్కల్‌తోపాటు ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అతడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. కాగా భత్కల్ను రేపు నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరపరచనున్నారు. యాసిన్ భత్కల్ను హైదరాబాద్‌లో విచారించేందుకు న్యూఢిల్లీలోని కోర్టు శనివారం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. యాసిన్ భత్క్లల్తోపాటు మరోకు ఇటీవల భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. గతంలో భారత్‌లో పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లలో భత్కల్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. -
నేడు హైదరాబాద్‌కు యాసిన్ భత్కల్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: దిల్సుఖ్నగర్ జంటపేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది యాసిన్ భత్కల్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) హైదరాబాద్ విభాగ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి వీలుగా ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌కు ఢిల్లీ కోర్టు శనివారం అనుమతించింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో శనివారంతో యాసిన్ భత్కల్ కస్టడీ ముగియడంతో శనివారం అతన్ని ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. అయితే దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో అతన్ని విచారించేందుకు హైదరాబాద్‌కు తీసుకెళ్లడానికి అనుమతి కోరుతూ ఎన్ఐఏ హైదరాబాద్ విభాగ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రెండ్రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధిస్తూ జడ్జి ఐ.ఎస్.మెహతా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు భత్కల్ను ఆదివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి 23వ తేదీన ఇక్కడి కోర్టులో హాజరుపరచనున్నారు. -
నాంపల్లి కోర్టులో తబ్రేజ్ ను హాజరుపరిచిన ఎన్ఐఏ
-
నాంపల్లి కోర్టులో తబ్రేజ్ ను హాజరుపరిచిన ఎన్ఐఏ
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తబ్రేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. జంట పేలుళ్లలో నేరుగా పాల్గొన్న తబ్రేజ్ ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. ఢిల్లీ కోర్టు అనుమతి పొందిన ఎన్ఐఏ అధికారులు ఈరోజు కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ కేసులో యాసిన్ ,తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు 15 రోజులు కస్టడీ కోరారు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఎన్ఐఏ ఇప్పటికే భత్కల్, తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. కాగా దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో త్రుటిలో తప్పింది. ఈ పేలుళ్లకు ముందు, తర్వాత తబ్రేజ్తోపాటు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన రహస్య ప్రాంతంలో పెద్దసంఖ్యలో బాంబులను పోలీసులు ఇటీవల కనుగొన్న విషయం తెలిసిందే. -
భత్కల్‌కు బాంబుల ల్యాబ్?
పనాజి: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది యాసిన్ భత్కల్ గోవాలో బాంబులు తయారు చేసేవాడా? ఇందుకోసం అక్కడ అద్దెకు తీసుకున్న ఇంటినే ఉపయోగించాడా? ప్రస్తుతం ఈ అంశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరా తీస్తోంది. గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో యాసిన్‌తోపాటు మరో ఉగ్రవాది తబ్రేజ్‌ను అరెస్టు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఎన్ఐఏ అధికారులు భత్కల్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గోవా తీసుకెళ్లారు. అక్కడ అంజునా, పనాజి సమీపంలోని చింబెల్ అనే మురికివాడలో అతడు నివసించిన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని యాసిడ్ బాటిళ్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చింబెల్ ఇందిరానగర్ నుంచి విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజునాలో భత్కల్ అద్దెకు ఉన్న నివాసం నుంచి ఎన్ఐఏ అధికారులు గతవారం బాంబు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. చాలామంది నేరస్తులు గోవాను ఆశ్రయంగా ఎంచుకుంటున్నారని, అందువల్ల స్థానికులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. -
త్వరలో హైదరాబాద్‌కు తబ్రేజ్
దిల్సుఖ్నగర్ కేసులో తీసుకురానున్న ఎన్ఐఏ సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్‌పై ఉగ్రవాది తబ్రేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. పేలుళ్లలో నేరుగా పాల్గొన్న తబ్రేజ్‌ను ఇక్కడకు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ కోర్టు నుంచి ఎన్ఐఏ అధికారులు అనుమతి పొందారు. ఈనెల 19 లోపు హైదరాబాద్‌కు తీసుకువచ్చి, స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. కేసులో తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఎన్ఐఏ ఇప్పటికే తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో తప్పిన భారీ ముప్పు: మంగళూరులో 90 ఐఈడీలు స్వాధీనం దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో త్రుటిలో తప్పింది. ఈ పేలుళ్లకు ముందు, తర్వాత తబ్రేజ్తోపాటు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన రహస్య ప్రాంతంలో పెద్దసంఖ్యలో బాంబులను పోలీసులు ఇటీవల కనుగొన్నారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని జఫర్ హైట్స్ భవంతి మూడో అంతస్తులో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి పేలుళ్ల కోసం సిద్ధం చేసిన 90 అధునాతన పేలుడు పరికరాలను(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో యాసిన్, తబ్రేజ్‌లను అరెస్టు చేయడం తెలిసిందే. తబ్రేజ్ వెల్లడించిన సమాచారం ఆధారంగా మంగళూరులోని రహస్య డెన్‌ను ఈ నెల 7న గుర్తించారు. తబ్రేజ్‌ను తీసుకెళ్లి డెన్‌లోని ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. -
బీహార్‌కు భత్కల్ తరలింపు
దర్బంగా: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) వ్యవస్థాపక సభ్యుడు యాసిన్ భత్కల్ను ఎన్ఐఏ అధికారులు శనివారం బీహార్‌లోని దర్బంగా జిల్లాకు తీసుకెళ్లారు. 2010-11లో ఈ జిల్లాలో నివసించిన భత్కల్ ఇక్కడ తన ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు అనుమానిస్తున్నారు. డాక్టర్ ఇమ్రాన్ అనే మారుపేరుతో నివసించిన భత్కల్ యునాని వైద్యం చేసేవాడని పోలీసులు తెలిపారు. అతడు నివసించిన జమల్చాక్ గ్రామం తదితర ప్రాంతాలకు భత్కల్ను తీసుకెళ్లారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా అనుమానితులను పట్టుకునేందుకు పలుచోట్ల దాడులు జరిపారు. -
వారం ముందే హైదరాబాద్‌లో మకాం
ఉగ్రవాది తబ్రేజ్‌ను తీసుకొచ్చి దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ! విద్యార్థుల ముసుగులో బహదూర్‌పురాలో ఉగ్రవాదుల అడ్డా ఆశ్రయం పొందిన ఇంట్లో అధికారుల తనిఖీలు ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్స్, బాంబు తయారీ పదార్థాలు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు.. ఆ పేలుళ్లకు వారం రోజుల ముందే హైదరాబాద్‌కు వచ్చి మకాం వేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తులో తేలింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్, వకాస్ అలియాస్ అహ్మద్, తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ ఆశ్రయం పొందిన బహదూర్‌పురాలోని ఇంటిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. గత నెల 28న భారత్- నేపాల్ సరిహద్దుల్లో యాసిన్ భత్కల్‌తో పాటు అరెస్టైన తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు మూడురోజుల కింద హైదరాబాద్‌కు తీసుకువచ్చి దర్యాప్తు జరిపారు. అయితే, భద్రతా కారణాల రీత్యా తబ్రేజ్‌ను ఇక్కడికి తీసుకువచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. వారం ముందుగా నగరానికి వచ్చామని, వకాస్‌తో కలసి పేలుళ్లు జరిగిన మరుసటి రోజు మంగళూరుకు వెళ్లామని తబ్రేజ్ అధికారులకు వివరించినట్లు సమాచారం. తబ్రేజ్ వెల్లడించిన సమాచారం ప్రకారమే నెహ్రూ జూపార్కుకు సమీపంలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్స్, కొంతపాడై ఉన్న ట్రాలీ బ్యాగ్, బాంబుల తయారీకి ఉపయోగించే కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఆ ఇంట్లో చిన్నచిన్న వస్తువులను, వెంట్రుకలను దర్యాప్తు అధికారులు సేకరించారు. అయితే, యాసిన్ భత్కల్, తబ్రేజ్ సహా ఈ ఉగ్రవాదులు తాము విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారిగా చెప్పుకొని బహదూర్‌పురాలో ఆశ్రయం పొందినట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. అసలు ఉగ్రవాదులకు ఇంటిని అద్దెకు ఇప్పించింది ఎవరు? బాంబుల తయారీకి అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడంలో సహకరించిన స్లీపర్ సెల్స్ ఎవరు? అనేదిశగా ఆరా తీస్తున్నారు. అయితే, ఎన్ఐఏ అధికారులు మూడు రోజుల విచారణ అనంతరం తబ్రేజ్‌ను శనివారం ఉదయమే ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది. కాగా.. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లు, లుంబినీపార్కు, గోకుల్‌ఛాట్ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ను విచారించేందుకు ఎన్ఐఏతో పాటు రాష్ర్ట కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ అధికారులు పీటీ వారెంట్ పొందేందుకు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. -
వరుస పేలుళ్లకు ఐదేళ్లు
న్యూఢిల్లీ: ఇటీవల ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అత ని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌ల అరెస్టు నేపథ్యం లో వ రుస బాంబు పేలుళ్ల కేసులో ఇతర నిందితులను పట్టుకోగలుగుతామనే ధీమా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్నారు. 2008, సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం నగరంలోని కన్నాట్‌ప్లేస్, బారాఖంబారోడ్, గఫార్ మార్కెట్, గ్రేటర్ కైలాశ్ తదితర ప్రాంతాల్లో ఐదు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 26 మంది చనిపోగా 133 మంది గాయపడిన సంగతి విదితమే. ఇక కన్నాట్‌ప్లేస్, రీగల్ సినిమా, ఇండియా గేట్ల వద్ద పేలని బాం బులు లభించాయి. భత్కల్, అసదుల్లాలతో కలిపి ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు మొత్తం 16 మంది నిందితులను అరెస్టుచేశారు. మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉంది. న్యాయస్థానంలో దాఖలుచేసిన అభియోగపత్రం లోనూ పోలీసులు వీరిరువురి పేర్లు చేర్చారు. ఈ కేసు విషయమై పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ భత్కల్‌నుంచి మరింత సమాచారం లభించొచ్చంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. కుట్రదారుల పేర్లు కూడా బయటికొచ్చే అవకాశముందన్నారు. గఫార్ మార్కెట్లో జరిగిన బాంబు పేలుడు ఘటన మీరాదేవి అనే మహిళ జీవితంలో పెనువిషాదం మిగిల్చింది. ఈ ఘటనలో ఆమె నలుగురిని కోల్పోయింది. ప్రస్తుతం ఇంటికి సమీపంలోని ఓ రావి చెట్టు కింద మంచం వేసుకుని కాలం గడుపుతున్న మీరా ఇప్పటికీ ఆనాటి ఘటనను మరిచిపోలేకపోతోంది. ఆనా టి పేలుడు ఘటనలో ఆమె అల్లుడు హర్షన్, కుమార్తెలు సరోజ, పూజ. మనవడు అశోక్‌లు చనిపోయా రు. ఆనాటి ఘటన గురించి మాట్లాడుతూ ‘ఆ రోజు కూడా ఈ రావి చెట్టు కిందే కూర్చున్నా. సరోజ బతిమిలాడుతుండడంతో స్నానం చేసేందుకు లోపలికెళ్లా. అంతలోనే చెవులు పగిలిపోయేలా శబ్దం వినిపించింది. భూకంపం వచ్చిందేమోనని అనుకున్నా. స్నానంచేసిన తర్వాత బయటికి రాగా శవాలు చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించింది’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పింది. దేవుడా నన్ను మాత్రం ఎందు కు తీసుకెళ్లలేకపోయావంటూ రోదించానని తెలి పింది. సొంత బిడ్డలకంటే ఎంతో జాగ్రత్తగా చూసుకున్న తన అల్లుడిని ఎందుకు తీసుకు పోయావు దేవుడా అంటూ గద్గద స్వరంతో పలి కింది. కుటుంబసభ్యులంతా చనిపోయిన తర్వాత మీరా జీవితం అస్తవ్యస్తమైపోయింది. జీవనం కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు 60 ఏళ్ల భగవతి అనే నగరవాసిది కూడా దాదాపు ఇదే పరిస్థితి. కార్యాలయం నుంచి తిరిగొచ్చిన తన పెద్దకుమారుడు గంగా ప్రసాద్ అలి యాస్ బిల్లు టీ పెట్టమ్మా కాసేపాగి మళ్లొస్తా అంటూ బిల్లు బయటికెళ్లాడు. బిల్లు బయటికెళ్లిన కాసేపటి తరువాత భీకర శబ్దం వినిపించిందని భగవతి తెలిపింది. తాము ఉండే ప్రాంతమంతా పొగతో నిండిపోయిందని చెప్పింది. ఈ ఘటనలో గంగాప్రసాద్ చనిపోయాడు. చిన్నకుమారుడి తలకి గాయాల య్యాయని, అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలిపింది. -
యాసిన్‌కు నిధులెలా వచ్చాయి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 40 వరకూ బాంబు పేలుళ్లు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు పాకిస్థాన్ నుంచి నిధులు ఏ మార్గంలో అందాయనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆరా తీస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలన్నింటికీ పాకిస్థాన్ నుంచే నిధులు అందినట్లు ఎన్ఐఏ విచారణలో యాసిన్ అంగీకరించాడు. దీంతో హవాలా మార్గంలో వచ్చాయా, నకిలీనోట్ల ముఠాల ద్వారానా అనే విషయాన్ని దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు ఒక్కో హవాలా ఏజెంట్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా పాకిస్థాన్ నుంచి డబ్బును పంపేవిధానం రెండేళ్లవరకూ కొనసాగింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా తీవ్రం కావడంతో ఇటీవలి కాలంలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నట్లు ఎన్ ఐఏ ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. పాకిస్థాన్ ఐఎస్ఐ సహకారంతో ముద్రించే నకిలీ నోట్లను ఉగ్రవాద మాడ్యూల్స్ ద్వారానే నేపాల్ మీదుగా పెద్దమొత్తంలో భారతదేశంలోకి తరలిస్తున్నారు. దీంతో ఈ ముఠాల ద్వారానే దక్షిణాది రాష్ట్రాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు పంపే ఎత్తుగడ వేశారు. ఒకవైపు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, మరోవైపు శాంతిభద్రతల సమస్య సృష్టించి హైదరాబాద్ వంటి నగరాలకు పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా వ్యవహరించారు. ఇదేవిషయాన్ని యాసిన్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. గత ఏడాది కాలంగా ఐఎం కీలక నేతలు రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్ మాడ్యూల్ల ద్వారా కోట్లాది రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల చలామణి జరుగుతున్నట్లు దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాయి. యాసిన్ మాడ్యూల్లో కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరు వ్యక్తులు నకిలీనోట్ల చలామణి ముఠాల నుంచి మారకం రూపంలో సేకరించిన డబ్బునే దిల్సుఖ్నగర్ పేలుళ్ల కోసం అప్పగించినట్లు సమాచారం. ఈ పేలుళ్ల కోసమే రూ.10 లక్షల వరకూ ఖర్చుచేసినట్లు కూడా బయటపడింది. ఇలావుండగా 2011లో ముంబైలో జరిగిన మూడు వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి యాసిన్‌ను, అక్తర్ అలియాస్ తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు వీలుగా అక్కడి మోకా కోర్టు సోమవారం బదిలీ వారంట్ జారీ చేసింది. -
బాంబులు పెట్టింది నేనే
హైదరాబాద్/న్యూఢిల్లీ: బాంబులతో దారుణ మారణకాండకు పాల్పడి, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 17 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నది తానేనని ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ అంగీకరించాడు. ఆ ఘటనలో వాడిన బాంబులను తయారు చేయడంతో పాటు, తానే స్వయంగా అమర్చానని భత్కల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. 2008 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన వివిధ పేలుళ్లకు పాల్పడింది కూడా తానేనని అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడాల్సిందిగా పాకిస్థాన్‌లో ఉన్నవారి నుంచి తనకు ఆదేశాలు అందినట్లు చెప్పాడు. ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 17 మంది మరణించగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లకు పాల్పడ్డ భత్కల్ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భత్కల్‌తో పాటు మరో ఉగ్రవాది తబ్రేజ్‌ను బీహార్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నిఘా సంస్థల సిబ్బంది విచారించారు. ఆ విచారణలో ‘దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ఎలా రెక్కీ నిర్వహించిందీ? బాంబులను తయారుచేసి స్వయంగా ఎలా పేలుళ్లకూ పాల్పడిందీ?’ తదితర విషయాలను భత్కల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. దిల్సుఖ్నగర్ పేలుళ్ల ప్రాంతాన్ని, అక్కడి ఆధారాలను పరిశీలించిన రాష్ర్ట ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు అప్పట్లోనే పలు కీలక విషయాలను వెల్లడించారు. రెండు బాంబులూ స్థానికంగానే తయారయ్యాయని, నిపుణులే వాటిని తయారుచేసి ఉంటారని కూడా గుర్తించారు. బాంబుల తయారీకి ఉపయోగించిన పదార్థాలన్నీ స్థానికంగా సేకరించుకున్నట్లు కూడా తేలింది. అత్యంత నైపుణ్యంతో ఎక్కువ నష్టం కలిగించేలా ఆ బాంబులను రూపొందించారు. అయితే.. ఆ బాంబుల తయారీకి పేలుడు పదార్థాల సేకరణలో స్థానికంగా భత్కల్‌కు ఎవరు సహకరించారు? భత్కల్ హైదరాబాద్‌లో ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు? తదితర విషయాలు భత్కల్ను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. యాసిన్ భత్కల్ అరెస్టు సమయంలో రెండు ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిళ్ల డీకోడింగ్ తలనొప్పే పేలుళ్ల సమయంలో మాత్రమే బినామీ అడ్రస్‌ల ద్వారా తీసుకున్న సిమ్‌కార్డులతో సెల్ఫోన్లు ఉపయోగించే భత్కల్.. సాధారణ సమయంలో తన మాడ్యుల్‌తో ఈ-మెయిళ్ల ద్వారానే సంబంధాలు నెరిపేవాడని తేలింది. హైదరాబాద్‌లోని కొందరితో కూడా ఈ-మెయిళ్ల ద్వారానే సంప్రదింపులు జరిపినట్లు భత్కల్ అంగీకరించినట్లు తెలిసింది. కానీ, ‘కోడ్’ల రూపంలో ఉన్న ఆ మెయిళ్లను ‘డీకోడ్’ చేయడం అధికారులకు సమస్యగా మారినట్లు సమాచారం. ‘డీకోడ్’ చేయగలిగితే దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సహకరించిన స్థానికులెవరనేది గుర్తించడం సాధ్యమవుతుందని అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరిగిన పలు పేలుళ్లకు తానే బాంబులను తయారు చేసినట్లు కూడా భత్కల్ బీహార్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. బాంబుల నమూనాలు, ఆకారాల్లో మార్పులు చేస్తూ అధికారులను బురిడీ కొట్టించానన్నాడు. బాంబుల తయారీలో వంద మంది యువకులకు శిక్షణ ఇచ్చాననీ భత్కల్ వెల్లడించినట్లు సమాచారం. నేపాల్ ద్వారానే.. భారత్-నేపాల్‌ల మధ్య వీసా అవసరం లేకుం డా సులువుగా ప్రయాణించగల అవకాశాన్ని తాము ఉపయోగించుకున్నట్లు భత్కల్ చెప్పాడు. ఇరు దేశాల మధ్య తనతో పాటు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్ తరచూ ప్రయాణించేవారమన్నాడు. తన సోదరులు ఇక్బాల్, రియాజ్ భత్కల్‌లు ఇండియాకు వచ్చేవారు కాదని, ఇక్బాల్ మాత్రం నేపాల్‌కు వచ్చే వాడనీ చెప్పాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌లోని వారితో శాటిలైట్ ఫోన్లద్వారా మాట్లాడేవారమన్నాడు.అంతేగాకుండా దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల కోసం బీహార్ యువకులను పెద్ద సంఖ్యలో ఇండియన్ ముజాహిదీన్‌లో చేర్చినట్లు భత్కల్ చెప్పారని సమాచారం. అందుకే పాత సైకిళ్లు... దిల్సుఖ్నగర్ పేలుళ్లకు, 2010 పుణెలో జర్మన్ బేకరీ పేలుళ్లకూ సైకిళ్లనే ఉపయోగించినప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు భత్కల్ చెప్పినట్లు తెలిసింది. పుణె పేలుళ్లలో కొత్త సైకిళ్లను వాడటంతో ఛాసిన్ నంబరు ఆధారంగా వాటిని కొనుగోలు చేసినవారిని దర్యాప్తు అధికారులు గుర్తిం చారు. అందువల్ల దిల్సుఖ్నగర్ పేలుళ్లకు మాత్రం రెండూ పాత సైకిళ్లనే ఉపయోగించామన్నాడు. దిల్సుఖ్నగర్ పేలు ళ్ల తర్వాత అధికారులు రెండు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నప్పటికీ బాగా పాతవి కావడంతో అవి ఎక్కడివి? ఎవరు కొనుగోలుచేశారు? అనేవి గుర్తించలేకపోయారు. -
రియాజ్ @ ‘లవ్లీ హంక్’
సాక్షి, సిటీబ్యూరో: బీహార్‌లోని భారత్-నేపాల్ సరిహద్దుల్లో చిక్కిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కీలక ఉగ్రవాది యాసీన్ భత్కల్ విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో పాటు కేంద్ర నిఘాః వర్గాలు వేగవంతం చేశాయి. యాసీన్‌తో పాటు తబ్రేజ్‌ను ఢిల్లీ తరలించిన ఎన్ఐఏ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో అరెస్టు చూపించింది. కోర్టు అనుమతితో 12 రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. విచారణలో ఎన్ఐఏతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) పాలుపంచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా యాసీన్ భత్కల్, తబ్రేజ్‌లు సృష్టించిన విధ్వంసాలు, వీరికి సహకరించిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వీటన్నింటికీ మించి ఇప్పటికీ పరారీలోనే ఉన్న, గోకుల్‌చాట్, లుంబినీపార్క్, దిల్సుఖ్నగర్ పేలుళ్లలో వాంటెడ్ ఐఎం కో-ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌ల సమాచారం సేకరించడంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన కీలక సమాచారం లభ్యమైంది. రియాజ్, ఇక్బాల్‌లు పాక్ నిఘా సంస్థ(ఐఎస్ఐ) ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా కనుసన్నల్లో పని చేస్తున్నారని, గతేడాది నుంచి కరాచీలోనే ఉంటున్నారని యాసీన్ బయటపెట్టాడు. అంతకు ముందు షార్జాలో ఉన్నారని, అయితే, అమెరికా ఐఎంను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం, ఇంటర్‌పోల్ వేట ముమ్మరం కావడంతో ఐఎస్ఐ ఇరువురినీ కరాచీకి రప్పించిందని చెప్పాడు. కరాచీలోని మిలటరీ బేస్‌కు సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ ప్రాంతంలో వీరి షెల్టర్ ఉందని, అక్కడి ఫేజ్-4 లో ఉన్న డిఫెన్స్ హౌసింగ్ కాలనీలో వీరిద్దరి కోసం ఐఎస్ఐ ఓ సేఫ్‌హౌస్‌ను కేటాయించిందన్నాడు. పాక్ ఆర్మీ వీరికి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోందని యాసీన్ పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న తమ అనుచరులు, స్లీపర్ సెల్స్‌తో రియాజ్ భత్కల్ ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడని యాసీన్ బయటపెట్టాడు. ‘లవ్లీహంక్ 34’ పేరుతో మెయిల్ ఐడీని సృష్టించి గతేడాది నుంచి దాని ద్వారా అటు ఐఎస్ఐ, ఎల్ఈటీ సంబంధీకులతో పాటు అనుచరులతోనూ సంప్రదింపులు జరుపుతున్నాడని యాసీన్ వెల్లడించాడు. ఐఎం ఇప్పటి వరకు విధ్వంసాలకు వినియోగించిన బాంబుల్లో అమోనియం నైట్రేట్‌నే పేలుడు పదార్థంగా వినియోగించింది. దీన్ని యాసీన్ భత్కల్ కర్ణాటకలో సేకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2007లో అక్కడి కుడేర్‌గుండి నుంచి ట్రక్కు అమోనియంను ఓ రహస్య ప్రాంతానికి రవాణా చేశాడు. దేశవ్యాప్తంగా జరిగిన దాదాపు 30 పేలుళ్లలో దీన్నే వాడాడు. ఈ పేలుడు పదార్థం సేకరణ, రవాణా, భద్రపరచడం వంటి అంశాలపై నిఘా వర్గాలు యాసీన్‌ను ప్రశ్నిస్తున్నాయి. -
'దిల్సుఖ్నగర్ పేలుళ్లకు వ్యూహం పన్నింది నేనే'
ఢిల్లీ: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఢిల్లీకి పయనం కానున్నారు. పేలుళ్లకు సూత్రధారి తానేనని భత్కల్ విచారణలో తెలపడంతో నగర పోలీసులు ఢిల్లీకి పయనమైందేకు సిద్ధమవుతున్నారు. ఈ విచారణంలో నేషనల్ ఇన్విస్టిగేషన్ టీం సభ్యులు కూడా నగర పోలీసులకు జతకలవనున్నారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు గత గురువారం ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. ఇప్పటి వరకూ వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ భారత్ -నేపాల్ సరిహద్దులో దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అతనిపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. -
చెన్నైలోనూ భత్కల్ రెక్కీ
సాక్షి, చెన్నై: యూసిన్ భత్కల్ రెండు రోజుల క్రితం పట్టుబడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న భత్కల్ తన ఉగ్ర చర్యల్ని ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. పత్రికల్లో, మీడియాలో భత్కల్ ఫొటోలు వచ్చాయి. వీటి ఆధారంగా ఇతను గతంలో చెన్నైలో తిష్ట వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో సెలయూరులో బీహారి విద్యార్థుల ముసుగులో సాగుతున్న సిమీ కార్యకలాపాల్ని కేంద్ర నిఘా సంస్థ బట్టబయ లు చేసింది. కేంద్ర పోలీసు బృందం దాడికి ముందుగా అక్కడి నుంచి కొందరు యువకులు ఉడాయించినట్లు వార్తలు వెలువడ్డాయి. వీరిలో భత్కల్ ఉన్నట్లు తాజాగా తేలింది. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న నిఘా నేత్రాల్లో గతంలో నమోదైన దృశ్యాలతో భత్కల్ నగరంలో పలుచోట్ల రెక్కీ నిర్వహించినట్లు తేలింది. రిచ్ స్ట్రీట్‌లో.. రిచ్ స్ట్రీట్‌లోని కెమెరాల్లో గతంలో నమోదైన దృశ్యాల ఆధారంగానే కేంద్ర బృందం సెలయూరులో దాడులు చేసినట్లు తేలింది. ఆ వీధిలో భత్కల్ పలుమార్లు సంచరిం చినట్లు గుర్తించారు. ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ విడి భాగాలు కొనుగోలు చేసినట్లు తేలింది. నగరంలో తిష్ట వేసిన సందర్భంలో భత్కల్ వలలో ఎవరైనా యువకులు పడ్డారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. భత్కల్ చెన్నై నుంచి పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలు బయటపడ్డారుు. దీంతో ఇక్కడ ఏదేని కుట్రకు వ్యూహ రచన చేశాడా అనే ఆందోళన నెలకొంది -
ఉగ్రవాది 'యాసిన్ భత్కల్'ను ఉరితీయాలి
బాంబుపేలుళ్లతో ఎందరికో ప్రత్యక్ష నరకం చూపించిన ఉగ్రవాది యాసిన్ భత్కల్. అతడు పోలీసులకు పట్టుబడ్డాడనగానే ఆనాటి బాధితుల్లో ఎంతో ఆనందం. తీవ్రవాదిని టీవీల్లో చూపిస్తుంటే అతడిని అక్కడికక్కడే ఉరితీయించాలన్న ఆక్రోషం... ఆవేదన. తాము అనుభవిస్తున్న క్షోభకు అంతకంతకు ఆ తీవ్రవాది కూడా అనుభవించాలని, మరో ఘటనకు పాల్పడాలనే ఆలోచనే మరొకరికి రాకుండా అతడిని శిక్షించాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న రాత్రి హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్లలో జిల్లాకు చెందిన పలువురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఎందరో క్షతగాత్రులయ్యారు. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు. ఆ సంఘటన తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. క్షతగాత్రులు ఇంకా కోలుకోలేదు. యాసిన్ భత్కల్ అరెస్టు సందర్భంగా ఆనాటి బాధితులను ‘న్యూస్‌లైన్’ పలకరించింది. భత్కల్ను బతకనీయొద్దని, అతడిని వెంటనే ఉరి తీసి చంపాలని వారు డిమాండ్ చేశారు. నరకం సూపియ్యాలి నా కొడుకు తిరుపతిని చంపిన భత్కల్‌కు చావులో నరకం చూపించాలి. ఒక్కరోజులోనే వాన్ని సంపొద్దు. మా బిడ్డను అన్యాయంగా సంపేసిండు. వాన్ని సంపుతుంటే ప్రతీ కన్నతల్లి కడుపుకోత అర్థం కావాలె. ఆ రాక్షసుడు ఎంతమంది ఉసురుపోసుకున్నడో. బాంబుపేలుళ్ల చనిపోయినోళ్లను టీవీలల్ల ఎట్ల సూపిచ్చిండ్లో భత్కల్ నరకం అనుభవించేది కూడా టీవీలల్ల సూపియ్యాలె. టీవీలల్ల వాన్ని సూత్తంటే కోపం ఆగుతలేదు. కడుపు రగుల్తంది. అన్యాయంగా మా బిడ్డను, వాడి దోస్తు రవిని పొట్టన బెట్టుకున్నడు. ఆనాటి ఘటన తల్సుకుంటేనే గుండె పగుల్తది. సావంటే ఎట్లుంటదో నరకం వానికి చూపియ్యాలె. అప్పుడే బాంబుదాడిలో సనిపోయినోళ్ల ఆత్మకు శాంతి. - గుంట తిరుపతి తల్లిదండ్రులు భీమయ్య-రాజమ్మ, పరుశరామ్నగర్, గోదావరిఖని వణుకు పుట్టించాలి మా తమ్ముడి ప్రాణాలు బలితీసుక్ను యాసిన్ భత్కల్ చావు అతి భయంకరంగా ఉండాలె. ఇంకొకరు దేశంపై దాడి చేయాలనే ఆలోచన రావడానికే వణుకు పుట్టించాలె. భత్కల్ను పట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆ క్రూరుడి నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టాలె. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లలాంటివి మళ్ల జరగకుంట ముందుగానే పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం తయారు చేసుకోవాలె. టీవీలల్ల భత్కల్ను సూపిత్తంటే ఇంట్లో అమ్మా నాన్న అన్నం తింటలేరు. కోపంతో రగిలిపోతున్నరు. తమ్ముడు చావు ఇంట్లో అందరినీ కుదిపేసింది. - తిరుపతి సోదరుడు మల్లేశ్ భత్కల్ను ఉరిదియ్యాలె నా బిడ్డ అమృత రవిని వాడు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నడు. వాన్ని(యాసిన్ భత్కల్)ను ఉరితీసి చంపాలి. నాకు ఏ చిన్న కట్టం వచ్చినా దగ్గరుండి సూసుకునేటోడు. కొడుకు సచ్చిపోయినప్పటి నుంచి కంటి నిండా నిద్ర కూడా పడుతలేదు. అలాంటి కొడుకే లేని జీవితం ఎందుకనిపిత్తంది. చిన్నప్పుడే వాని తండ్రి సచ్చిపోతే అన్నీ నేనే అయిన. ఓ సారి నాకు దెబ్బ తగిలి బొక్కలిరిగితే నాకు ఎంతో సేవ చేసిండు. నేను మళ్ల మంచిగ నడిసేదాక నన్ను ఇడిసిపెట్టి పోలె. అట్లాంటోన్ని ఎట్ల మర్సిపోవాలె. ఉద్యోగం సంపాదించుకుంట అని చదువుకునేటందుకు హైదరాబాద్ పోయిండు. నా కొడుకు ఏం అన్యాయం చేసిండని వాడు పొట్టనబెట్టుకుండు. నా కొడుకును సంపినోన్ని ఈ భూమ్మీద ఉంచద్దు. నాకు పెద్ద దిక్కు లేకుండా చేసినోన్ని బతకనీయొద్దు. - రవి తల్లి లక్ష్మి, బేగంపేట్, - న్యూస్‌లైన్, సెంటిన రీకాలనీ (యైటింక్లయిన్‌కాలనీ) ఆ రోజు మర్చిపోలేకపోతున్నా.. ఆ రోజును మర్చిపోలేకపోతున్నా. ఆ రోజు నా పుట్టినరోజు. ఇంజినీరింగ్ చదువుతున్న నేను వేడుకలు జరుపుకుందామని ట్యుటోరియల్ నుంచి హాస్టల్‌కు వెళ్తుండగా బాంబు పేలింది. నా కాళ్లు, చేతులు, కళ్లకు బలమైన గాయాలయ్యాయి. ఇప్పటికి కూడా కోలుకోలేకవైద్యం చేయించుకుంటున్నా. నా ఆస్పత్రి ఖర్చుల కోసం మా నాన్న మల్లారెడ్డి పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఏడుపస్తంది. ఇప్పటికే రూ.లక్షకుపైగా ఖర్చయినయ్. గాయపడ్డవారికి ప్రభుత్వం సాయం చేస్తానంది. నాకు ఇప్పటిదాకా ఏ సాయం అందలె. గాయాలతో నా చదువు కూడా చక్కగా సాగడం లేదు. క్లాసులకు పోతున్నా. ఇప్పటికి కూడా కుడిచేయిలో నొప్పి తీవ్రం గా వస్తంది. రెటీనా దెబ్బతిని చూపు మందగించింది. ఎంపీ పొన్నం, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నన్ను పరామర్శించారు. వారి పరామర్శ కంటే భత్కల్ను ఉరితీస్తే ఎక్కువ సంతోష పడు త. భత్కల్ను పట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. ఎంతో మం దిని బలిగొన్న ఇలాంటి క్రూరులను కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటి పనిచేయొద్దని భయపెట్టేలా ఈ శిక్షలుండాలె. - పత్తి మానస, ఇంజినీరింగ్ విద్యార్థి, రాజపల్లి, - న్యూస్‌లైన్, హుజూరాబాద్ రూరల్ -
యాసిన్ భత్కల్ కు 12 రోజుల కస్టడీ
ఢిల్లీ:నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత అయిన యాసిన్ భత్కల్ ను 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతనితో పాటు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’కి కూడా కోర్టు కస్టడీకి అప్పగించింది. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు గురువారం ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. ఇప్పటి వరకూ వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ భారత్ -నేపాల్ సరిహద్దులో దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. యాసిన్‌పై రూ.35 లక్షల రివార్డు ఉంది. పలుమార్లు దొరికినట్టే దొరికి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఇతని కోసం గత ఐదేళ్లుగా గాలింపు కొనసాగుతోంది. ఇతనితో పాటు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు అప్పగించారు.. -
జైల్లో నిద్రలేని రాత్రి గడిపిన భత్కల్
భారత్ - నేపాల్ సరిహద్దుల్లో గురువారం బీహార్ పోలీసులకు చిక్కిన కరుడు గట్టిన తీవ్రవాది యాసిన్ భత్కల్ పాట్నాలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రాంతమైన మిలటరీ క్యాంప్ జైలులో నిన్న రాత్రింతా నిద్రపోలేదని ఆ జైలు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ తెలిపారు. అలాగే అతడు ఒత్తిడి కూడా గుర్యయాడని చెప్పారు. భత్కల్‌తోపాటు చిక్కిన అసదుల్లా అక్తర్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉందని పేర్కొన్నారు. తీవ్రవాదులు ఇద్దరు కూడా రాత్రి చాలా తక్కువగా ఆహారం తీసుకున్నారని, అలాగే మంచి నీరు కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పారు. ఆహారం తీసుకున్న సమయంలో తప్ప మిగతా సమయంలో అసలు మాట్లాడనే లేదని జైలు ఉన్నతాధికారులు తెలిపారు. వారిరువురిని న్యూఢిల్లీలో విచారించేందుకు తమకు అనుమతి ఇప్పించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన అధికారుల అభ్యర్థనపై బీహార్ కోర్టు సానుకూలంగా స్పందించింది. వారిని మూడో రోజుల పాటు ఎన్ఐఏ ఉన్నతాధికారులకు అప్పగించాలని బీహార్ పోలీసులను కోర్టు గురువారం ఆదేశించింది. దాంతో ఆ తీవ్రవాదులిద్దరిని ఈ రోజు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ తరలించనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో యాసిన్ భత్కల్ బాంబు పేలుళ్ల ద్వారా మారణహోమం సృష్టించాడు. అతడిని తమకు అప్పగించాలని కేంద్రం హోం మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఇప్పటికే 12 రాష్ట్రాలు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. -
భత్కల్ను ప్రశ్నించనున్న యూపీ పోలీసులు!
2010లో వారణాసి బాంబుపేలుళ్ల ఘటనపై కరడుకట్టిన తీవ్రవాది యాసిన్ భత్కల్ను ప్రశ్నించేందుకు తమ రాష్ట్రానికి చెందిన తీవ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) ఒకటి గత అర్థరాత్రి న్యూఢిల్లీ పయనమైయ్యందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఐజీపీ (శాంతి భద్రతలు) ఆర్.కే.విశ్వకర్మ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. 2010 సెప్టెంబర్ 7వ తేదీన వారణాసిలో శీతల్ ఘాట్ వద్ద వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో ముగ్గురు మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుశ్చర్య తమ పనే అని ఇండియన్ ముజాహిద్దీన్ ప్రకటించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే ఆ ఘటనలో భత్కల్ పాత్రకు సంబంధించి ఏటువంటి ఆధారాలు లభించలేదని విశ్వకర్మ పేర్కొన్నారు. అయినా అతడికి ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలిసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భత్కల్ను యూపీ తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. గురువారం భారత్- నేపాల్ సరిహద్దుల్లో భత్కల్‌తోపాటు నిఘావర్గాలకు చిక్కిన అసదుల్లా స్వస్థలం అజాంగఢ్‌లోని బాజ్ బహదుర్ ప్రాంతమని ఆయన తెలిపారు. అయితే అతనిపై స్థానికంగా ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. -
రాష్టంలో హై అలర్ట్
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్ నేపథ్యంలో బెంగళూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా సముద్రతీర ప్రాంతాలు, ఉత్తర కన్నడ జిల్లాలో హైఅలర్డ్ ప్రకటించారు. గురువారం ఉదయం నుంచి బెంగళూరులోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించారు. మెజిస్టిక్, సిటీ మార్కెట్, శివాజీనగర తదితర బస్టాండ్లలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. సున్నితమైన ప్రాంతాలలో మఫ్టీలో పోలీసులు సంచరిస్తూ వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. కొత్త ముఖం కనిపిస్తే వెంటనే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బెంగళూరు వాసులలో ఎవరితోనైనా భత్కల్ సోదరులకు సంబంధాలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్ జన్మించిన ఉత్తర కన్నడ జిల్లాతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. బెంగళూరులోని విధానసౌధ, రాజభవన్, హైకోర్టుతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కట్టడాలు, ఐటీ, బీటీ సంస్థల కార్యాలయాలు, మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద అదనపు బలగాలను రంగంలోకి దింపారు. శివాజీనగర చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రంగంలోకి అదనపు బలగాలను దింపారు. బీహార్‌కు కర్ణాటక పోలీసులు : సీఎం రాష్ర్టంలో వరుస బాంబు పేలుళ్లకు కారణమైన యాసిన్ భత్కల్ను అరెస్ట్ చేసినట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడుతూ.... బెంగళూరులో చోటు చేసుకున్న పేలుళ్ల విషయమై భత్కల్ను విచారణ చేసేందుకు రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారుల బృందాన్ని బీహార్‌కు పంపినట్లు తెలిపారు. యాసిన్ భత్కల్ కోసం చాలా కాలంగా పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. కర్ణాటక పోలీసులకు కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు పూర్తిగా సహకరిస్తారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాసిన్ తీసుకు వస్తాం : ఔరాద్కర్ బెంగళూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో భాగంగా యాసిన్ భత్కల్ను ఇక్కడికి తీసుకువచ్చి విచారణ చేస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 2010 ఏప్రిల్ 17న చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో యాసిన్ ప్రధాన నిందితుడు అని అన్నారు. వీలైనంత త్వరంగా యాసిన్‌ను బెంగళూరు తీసుకు వస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక బృందం బీహార్ వెళ్లిందని తెలిపారు. -
హైదరాబాద్‌కు యాసిన్, తబ్రేజ్!
సాక్షి, హైదరాబాద్: యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్‌ల అరెస్టు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు దర్యాప్తును ఒక కొలిక్కి తేగలదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. 17 మంది ప్రాణాలు తీయడంతో పాటు 119 మంది గాయాలకు కారణమైన జంట పేలుళ్లపై మలక్‌పేట (146/2013), సరూర్‌నగర్ (56/2003) పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. స్థానిక పోలీసు లు రెండు వారాలపాటు దర్యాప్తు చేశారు. తర్వాత కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ మార్చి 14న కేసు నమోదు చేసింది. వెంకటాద్రి థియేటర్ ఎదురుగా 107 బస్‌స్టాప్ వద్ద పేలుడుకు సంబంధించి ఆర్సీ-01/2013/ఎన్ఐఏ/హైదరాబాద్‌గా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ద పేలుడుకు సంబంధించి ఆర్సీ 02/2013/ఎన్ఐఏ/హైదరాబాద్‌గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టం ప్రకారం ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాసిన్, తబ్రేజ్‌లు స్వయంగా దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పెట్టినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో నిర్ధారణైంది. రెగ్జిన్ బ్యాగ్‌ను వీపునకు తగిలించుకుని 107 బస్టాప్‌లో సైకిల్‌కు యాసిన్భత్కల్ బాంబు పెట్టినట్లు సీసీ కెమెరాల వీడియో దృశ్యాల ద్వారా గుర్తించారు. యాసిన్‌కు సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ కూడా ఉన్నట్లు బయటపడింది. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ సైకిల్ బాంబును అమర్చినట్లు తేలింది. బాంబును అమర్చిన సైకిల్‌ను తబ్రేజ్ తోసుకుంటూ వెళ్లిన దృశ్యాలు రోడ్డు మీద ట్రాఫిక్ పరిశీలన కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమేరా ద్వారా గుర్తించారు. అరెస్టయిన యాసిన్ భత్కల్, తబ్రేజ్‌లను జంట పేలుళ్ల కేసులో విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. యాసిన్ అరెస్టుతో రాష్ర్టవ్యాప్తంగా అన్ని నగరాలు, పుణ్యక్షేత్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాల్సిందిగా డీజీపీ దినేష్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలకూ ఆదేశాలు జారీచేశారు. -
భత్కల్. ఆధునిక ఉగ్రవాదానికి చిరునామా
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆధునిక కాల ఉగ్రవాదానికి చిరునామాగా ముద్రపడిన జరార్ అహ్మద్ సిద్దిబాబా అలియాస్ యాసిన్ భత్కల్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా భత్కల్‌లో 1983లో జన్మించాడు. అంజుమన్ హమి-ఇ-ముస్లిమీన్ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తదనంతర కాలంలో శిక్షణ పొందిన ఇంజనీర్‌గా, బాంబుల నిపుణుడిగా ఐఎంలోని ఇతర సభ్యులకు పరిచయమయ్యాడు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లకు యాసిన్ భత్కల్ వరుసకు సోదరుడు. రియాజ్, ఇక్బాల్ ఇద్దరూ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న వీరిద్దరి కుటుంబసభ్యులు ఇప్పటికీ భత్కల్‌లోని మదీనా కాలనీలోనే నివాసం ఉంటున్నారు. యాసిన్ రియాజ్ భత్కల్‌తో కలిసి ఇండియన్ ముజాహిదీన్‌ను ఏర్పాటు చేశాడు. రియాజ్ షాబందరి, అబ్దుల్ సుభాన్ ఖురేషి, సాదిక్ ఇశ్రార్ షేక్, టైస్టుగా మారిన గ్యాంగ్‌స్టర్ అమీర్ రెజా ఖాన్లు వీరి సహచరులుగా ఉన్నారు. పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ నుంచి దీనికి పూర్తి సహాయ సహకారాలున్నాయి. ఈ నేపథ్యంలో భత్కల్ నుంచి పుణేకు మకాం మార్చిన యాసిన్ ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొన్నాడు. ఐఎం భారతదేశ చీఫ్‌గా పలు పేలుళ్లకు నేతృత్వం వహించాడు. వందల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి, గాయపడటానికి కారకుడయ్యాడు. 2008లో జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలో పేలుళ్ల ద్వారా యాసిన్ భత్కల్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఐదు వరుస పేలుళ్లలో 30 మంది చనిపోయారు. 2008 మే 13న జైపూర్‌లో, జూలై 25న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో, అదేనెల 26న అహ్మదాబాద్‌లో, సెప్టెంబర్ 13న ఢిల్లీలో పేలుళ్లకు నేతృత్వం వహించాడు. 2010 ఫిబ్రవరి 13న పుణేలో జర్మన్ బేకరీలో పేలుడుకు, 2011 జూలై 13న ముంబైలో వరుస పేలుళ్లకు యాసిన్ ప్రధాన సూత్రధారి. ఈ ఏడాది ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్, గత జూలై 7న బుద్దగయలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లకు కూడా యాసిన్ సూత్రధారి. ఈ క్రమంలో కొనసాగిన దర్యాప్తులోనే.. 2004లో కర్ణాటకలో పేలుడు పదార్థాల పంపిణీలో ఇతని పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. 2006లో ముంబైలో జరిగిన వరుస రైలు పేలుళ్లకు కూడా ఇతనే సూత్రధారి అనే అనుమానాలున్నాయి. ఈ పేలుళ్లలో 187 మంది మృత్యువాతపడ్డారు. యాసిన్‌తోపాటు అరెస్టైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన వాడు. ఇతను కూడా కాలాంతకుడు. 2011 జూలై 13న జరిగిన ముంబై సీరియల్ పేలుళ్లలో నేరుగా పాల్గొన్న 26 ఏళ్ల తబ్రేజ్ రిస్క్ ఆపరేషన్లు చేయడానికి ఉత్సాహం చూపుతాడనే పేరుంది. హైదరాబాద్ పేలుళ్లలో నేరుగా పాల్గొనడానికి కారణం అదే. పలుమార్లు తప్పించుకుని: ఐదేళ్లుగా దర్యాప్తు బృందాల కన్నుగప్పి తిరుగుతున్న యాసిన్ అనేకమార్లు దొరికినట్లేదొరికి తప్పించుకున్నాడు. 2009 డిసెం బర్ 29న కోల్‌కతా పోలీసులు దొంగనోట్ల కేసులో బల్లూ మాలిక్ అనే వ్యక్తిని అరెస్టుచేశారు. అతను కోర్టు నుంచి బెయిల్ తీసుకుని పారిపోయిన తరువాత అతనే యాసిన్భత్కల్ అని తేలింది. 2011లో చెన్నైలోని ఒక హోటల్లో తనిఖీలు జరుపుతుండగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. రాంచీలో వేరొక పేరుతో పాస్‌పోర్టు కోసం ప్రయత్నించి పోలీసులకు అనుమానం రావడంతో అక్కడనుంచి పరారయ్యాడు. గత ఏడాది బెంగళూరులో కూడా పోలీసుల నుంచి తప్పించుకున్నట్లు ఉగ్రవాది ఉబెయిద్-ఉర్-రెహ్మాన్ విచారణలో బయటపడింది. స్టూడెంట్ గుర్తింపు కార్డులతో పేలుళ్లకు ముందే మకాం వేయడం, స్వయంగా రెక్కీ నిర్వహించిన తరువాతే పేలుళ్లకు పాల్పడటం యాసిన్భత్కల్ స్టైల్. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు కూడా వారం రోజుల ముందుగానే నగరంలో ఆశ్రయం పొందినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. యాసిన్ బాంబు పేలుళ్లకు పాల్పడిన తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు వెళ్లి ఆశ్రయం పొందేవాడ ని నిఘావర్గాల పరిశీలనలో బయటపడింది. ఉగ్రవాదుల గురువు టుండా అరెస్టు తరువాత కీలక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇండో-నేపాల్ సరిహద్దులలో పలువురు ఉగ్రవాద నేతలు అశ్రయం పొందుతున్నట్లు తేలింది. -
యాసిన్ భత్కల్ చిక్కాడు
ఇంటెలిజెన్స్ వలలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన బీహార్ పోలీసులు దేశవ్యాప్తంగా 40 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల సూత్రధారి, పాత్రధారి ఇతనే వెంకటాద్రి థియేటర్ ఎదురుగా 107 బస్‌స్టాప్‌లో స్వయంగా బాంబులు పెట్టిన యాసిన్ ఇదే కేసులో మరో నిందితుడు తబ్రేజ్ కూడా అరెస్టు సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ/పాట్నా: రాష్ర్ట రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. భారత్-నేపాల్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనేత అయిన యాసిన్‌పై రూ.35 లక్షల రివార్డు ఉంది. పలుమార్లు దొరికినట్టే దొరికి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఇతని కోసం గత ఐదేళ్లుగా గాలింపు కొనసాగుతోంది. ఇతనితో పాటు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు అప్పగించనున్నారు. బీహార్‌లోని మోతిహరి మేజిస్ట్రేట్ వీరిని మూడురోజుల ట్రాన్సిట్ రిమాండ్‌కు అనుమతించారు. ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదుల అరెస్టును కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ధ్రువీకరించారు. ‘బుధవారం రాత్రి భారత్-నేపాల్ సరిహద్దులో ఉన్న యాసిన్ భత్కల్ను ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం బీహార్ పోలీసుల అదుపులో ఉన్న అతన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు..’ అని షిండే గురువారం పార్లమెంటు వెలుపల విలేకరులకు చెప్పారు. యాసిన్ పట్టుబడిన విషయం జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి తన సంబంధీకులను కలుసుకోవాలని యాసిన్ ప్రయత్నించాడని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలోని భారత్-నేపాల్ సరిహద్దులో తూర్పుచంపారన్ జిల్లా రక్సువల్ సబ్ డివిజన్లోని నహర్ చౌక్ సమీపంలో యాసిన్‌ను, తబ్రేజ్‌ను అరెస్టు చేసినట్లు బీహార్ అదనపు డీజీపీ రవీంద్రకుమార్ పాట్నాలో విలేకరులకు చెప్పారు. యాసిన్ మరో పేలుడుకు కుట్ర చేస్తున్నట్టుగా సమాచారం ఉందన్నారు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ మాస్టర్‌మైండ్, బాంబుల నిపుణుడిగా భావించే అబ్దుల్ కరీమ్ తుండా పట్టుబడిన పక్షం రోజులకే యాసిన్ భత్కల్ సైతం చిక్కడం అనేక బాంబు పేలుళ్ల కేసుల దర్యాప్తులో కీలకమలుపు కాగలదని భావిస్తున్నారు. ముప్పై ఏళ్ల యాసిన్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ ప్రభుత్వం, ఎన్ఐఏలు రూ.10 లక్షల చొప్పున, ముంబయి పోలీసులు రూ.15 లక్షలు రివార్డు ప్రకటించారు. -
భత్కల్ను ఎన్కౌంటర్ చేయాల్సిందే
‘2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ జంటబాంబు పేలుళ్ల ఘటనకు కారణమై, 17 మంది చావుకు, అనేక మంది జీవితాలను చీకట్ల పాలు చేసిన ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో పాటు అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలి. ప్రస్తుతం మేము పడుతున్న బాధలు భవిష్యత్‌లో మరెవ్వరూ పడకూడదంటే వాడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి’... అని ఘటనలో కాళ్లు, చేతులు, కళ్లు కోల్పోయిన క్షతగాత్రులు స్పష్టం చేశారు. మారణహోమం జరిగి ఆరు నెలల ఎనిమిది రోజులైంది. ఇప్పటికైనా అతన్ని అరెస్ట్ చేయడం హర్షనీయం. అయితే కేసులు, కోర్టులు, విచారణల పేరుతో జాప్యం చేయకుండా వెంటనే భత్కల్ను శిక్షించాలి. అతనికి విధించే శిక్ష తీవ్రవాదులకు ఓ హెచ్చరిక కావాలని బాధితులు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ చేయాలి విచారణ పేరుతో జాప్యం చేయకుండా భత్కల్ను వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. నరకమంటే ఎలా ఉంటుందో వాడికీ చూపించాలి. చేయని తప్పుకు నేను కాలు, చెయ్యి, కన్ను కోల్పోయాను. గా యా లు ఇంకా మానలేదు. ఆరు మాసాలుగా నరకం అనుభవిస్తున్నా. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంకా పూర్తి సాయం చేయలేదు. వైద్యం ఖర్చులను ఇవ్వడంలేదు. ఇప్పటికే నా సొంత డబ్బు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేశా. కంటి ఆపరేషన్‌కు మరో రూ. లక్షకుపైగా ఖర్చు అవుతుంది. - పాండురంగారెడ్డి, గట్లమల్లెపల్లి, నల్లగొండ జిల్లా ఉగ్రవాదులకు హెచ్చరిక కావాలి ఉగ్రవాదుల కుట్రకు నేను బలైపోయాను. పేలుళ్లలో కుడి కాలు కో ల్పోయాను. ఎంబీఏ పూర్తి చేసి, తల్లిదండ్రులకు ఆసరాగే ఉండాల్సిన నన్ను వారికి భారంగా మార్చారు. నన్ను ఈ దుస్థితికి తెచ్చిన ఉగ్రవాదులను వదలొద్దు. జైల్లోనే నరకం చూపించాలి. భత్కల్‌కు విధించే శిక్ష ఉగ్రవాదులకు హెచ్చరిక కావాలి. గాయం మానడంతో ఇటీవలే కృత్రిమ కాలు అమర్చుకున్నా. - రజిత, బికనూర్, నిజామాబాద్ వందసార్లు ఉరి తీసినా తక్కువే... భత్కల్ మనిషి రూపం లో ఉన్న మృగం. ఇ లాం టి వాళ్లను వదలొ ద్దు. పేలుళ్లలో ఎంతో మంది చనిపోయారు. నాతో పాటు 130 మంది తీవ్రం గా గాయపడ్డారు. ఇంకా చాలా మంది కోలుకోలేదు. ఈ ఘటనలో గాయపడటం వల్ల నేను ఉద్యోగం కోల్పోయాను. భత్కల్లాంటి మా నవ మృగాళ్లను వందసార్లు ఉరితీసినా త క్కువే. - స్వాతిరెడ్డి , బీఎన్‌రెడ్డినగర్ నరరూపరాక్షసుడిని ఉరి తీయాలి అమాయకుల ప్రాణాలు తీసి వా రి కుటుంబాలను చిన్నాభిన్నం చేసి న నరరూపరాక్షసుడు యాసిన్ భత్కల్ను ఉరి తీయాలి. దేశంలో ఉగ్రవాదం అనే మాట వినిపించకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేయాలి. ముష్కరుల ఘాతుకానికి ఎంతో మంది జీవచ్ఛవాల్లా బతుకులీడుస్తున్నారు. ఉన్నత చదువులు చదవాలన్న నా కలలను చిదిమేసిన ఇలాంటి దుండగులను ఏం చేసినా పాపంలేదు. - బొంగు శ్రావణి, బాధితురాలు, సైదాబాద్ నరహంతకుల్ని మాకు అప్పగించాలి అమయాకుల ప్రాణాల్ని బలి తీసుకున్న నరహంతకులను ప్రభుత్వం జైల్లో ఉంచి రాచమర్యాదలతో బిర్యానీలు పెట్టకూడదు. బాంబుపేలుళ్ల ఘటనలో గాయపడి నరకాన్ని అనుభవిస్తున్న క్షతగాత్రులకు వారిని అప్పగించాలి. భత్కల్, అతని అనుచరులను నాకు అప్పగిస్తే ఒక్కొక్క అవయావాన్ని తొలగించి చిత్రహింసల పాలుజేసి చావంటే ఏలా ఉంటుందో చూపించాలని ఉంది. ఘటన జరిగిన నాటి నుంచి కాలు, చేయి చచ్చుపడి నడవలేని పరిస్థితుల్లో జీవచ్ఛవంలా బతకుతున్నా. ఆనాటి నుంచి నేటి వరకు కంటి నిండా నిద్రపోయింది లేదు. ఉన్నదంతా వైద్యానికే ఖర్చు అయిపోయింది. ఇంటి పెద్ద దిక్కును మంచానికే పరిమితమయ్యా. ఆదుకునే వారు.. పరామర్శించేవారు లేరు. ఏం పాపం చేశామని మాకు ఈశిక్ష. - పి.యాదయ్య, బాలాజీనగర్ ఐఎస్‌సదన్ ఉగ్రవాదులను బహిరంగంగా శిక్షించాలి జంట బాంబు పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను బహిరంగా ఉరితీయాలి. పేలుళ్ల చనిపోయిన వారు, గాయపడిన వారిలో ఎక్కువ మంది పేదలే. క్షతగాత్రులు అంగవైకల్యంతో నానా కష్టాలుపడుతున్నారు. ప్రభుత్వం తీవ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయాలి. భత్కల్, ఇతర ఉగ్రవాదులను జైల్లో పెట్టి వారికి కోట్ల రూపాయలు ఖర్చు చేసేకన్నా నిర్థాక్షిణ్యంగా చంపేయాలి. దేవుని దయ వల్ల పేలుడు ఘటన నుంచి బతికి బయటపడ్డా. - ఆశంగారి బక్కారెడ్డి, ఏ-1, మిర్చి సెంటర్, దిల్సుఖ్నగర్ బాధితుల కళ్లెదుటే ఉరితీయాలి... బౌద్దనగర్: దిల్సుఖ్నగర్ జంటపేలుళ్ల నింది తు డు భత్కల్ను పోలీసులు గురువారం అరెస్టు చే యడంపై మృతుల కుటుంబ సభ్యులు హర్షం వ్య క్తం చేశాయి. బౌద్దనగర్‌కు చెందిన జీహెచ్ఎంసీ ఉద్యోగి రాములు బాంబుపేలుళ్లలో మృతి చెం దిన విషయం విదితమే. భత్కల్ అరెస్టు గురించి తెలిసి అతని భార్య అండాలు, కుమారుడు సుధాకర్ ఆనందం వ్యక్తం చేశారు. అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులను బాధిత కు టుంబాల ఎదుటే ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. -
పేలుళ్లు.. అరెస్ట్..గురువారమే
సాక్షి, సిటీబ్యూరో:2013 ఫిబ్రవరి 21 గురువారం: దిల్‌సుఖ్‌నగర్‌లోని ‘107’ బస్టాప్, ‘ఏ-1’ మిర్చ్ సెంటర్ వద్ద భారీ బాంబు పేలుళ్లు ... 2013 ఆగస్టు 29 గురువారం: ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యాసీన్ భత్కల్, తబ్రేజ్ అరెస్టు... 2005 నుంచి దేశ వ్యాప్తంగా అనేక విధ్వంసాలు సృష్టించిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) రాజధానిలో రెండు ఘాతుకాలకు పాల్పడింది. ఐఎం స్థాపనలో కీలకపాత్ర పోషించిన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ నేతృత్వంలోని మాడ్యుల్ 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో బాంబులు పేల్చింది. అదేరోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో పేలని బాంబు కూడా దొరికింది. ఇది జరిగిన ఐదున్నరేళ్లకు ఐఎం మరోసారి పంజా విసిరింది. ఈ సంస్థకు కో-ఫౌండర్‌గా ఉన్న యాసీన్ భత్కల్ నేతృత్వంలోని మాడ్యుల్ దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడింది. రియాజ్, ఇక్బాల్‌లకు యాసీన్ భత్కల్ సోదరుడు. గతంలో రియాజ్ నేరుగా వెళ్లి గోకుల్‌చాట్‌లో బాంబు పెట్టగా... తాజాగా యాసీన్ స్వయంగా ‘107’ బస్టాప్‌లో బాంబు పెట్టాడు. ‘పొరుగువారి’ వల్లే కొలిక్కి... సిటీలో 2007 నాటి తొలి జంట పేలుళ్లు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రెండో జంట పేలుళ్లు... ఈ రెండు కేసుల్లో ఒక్కటి కూడా నగర, రాష్ట్ర పోలీసులో, నిఘా వర్గాలో ఛేదించలేదు. గోకుల్, లుంబినీ పేలుళ్ల చిక్కుముడిని ఏడాది తరవాత ముంబై క్రైమ్ బ్రాంచ్ విప్పింది. ఢిల్లీలోని బాట్లాహౌస్లో 2008 సెప్టెంబరు 19 జరిగిన ఎన్కౌంటర్లో దొరికిన ఆధారాలను బట్టి క్రైమ్ బ్రాంచ్ మొత్తం ఇండియన్ ముజాహిదీన్ గుట్టు విప్పారు. 2005 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఈ ఉగ్రవాదుల్లో దాదాపు 20 మందిని 2008 అక్టోబరు 6న అరెస్టు చేశారు. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అన్సార్ బాద్షా షేక్, సాదిక్ షేక్, ఫారూఖ్ తర్ఖాష్ సైతం ఉన్నారు. ఫిబ్రవరి నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సంబంధించి నగర, రాష్ట్ర పోలీసు వర్గాలు కనీసం ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్నీ ఆరు నెలల పరిశోధనలో పట్టుకోలేకపోయారు. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల సంయుక్త ఆపరేషన్‌తో ఈ చిక్కుముడి వీడింది. భత్కల్ బ్రదర్స్ బీహార్‌లోని బుద్ధగయ, హైదరాబాద్ గురిపెట్టారంటూ గత ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఉగ్రవాది మగ్బూల్ వెల్లడించినా ఏ ఒక్కటీ ఆపలేకపోయారు. నేపాల్ సరిహద్దుల్లో కీలక అరెస్టులు ఉగ్రవాద కోణంలో నగరానికి సంబంధించిన 2 కీలక అరెస్టులు నేపాల్ సరిహద్దుల్లో చోటు చేసుకున్నాయి. పాక్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ నెల రెండో వారంలో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ 1998లో సిటీ పోలీసులకు చిక్కిన పాక్ జాతీ యుడు సలీం జునైద్ కేసులో టుండా నింది తుడు. ఇతడు తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ (టీఐఎం) స్థాపనలో కీల క పాత్ర పోషించాడు. ఈ సంస్థ 1993లో సిటీ లో అబిడ్స్, గోపాలపురం, హుమయూన్‌నగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో పేలుళ్లు జరిపిం ది. ఈ పేలుళ్లలో నలుగురు మరణించగా... పలువురు గాయపడ్డారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సూత్రధారులైన యాసీన్ భత్కల్, తబ్రేజ్ కూడా నేపాల్ సరిహద్దుల్లోనే చిక్కారు. సమాచారం సేకరించాక బృందం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన యాసీన్, తబ్రేజ్లకు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో సంబంధం ఉందనే అనుమానాలున్నాయి. 107బస్టాప్ దగ్గర యాసీన్ స్వయంగా బాంబు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రాథమికంగా అక్కడి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తాం. ఆపై వారి విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పంపుతాం. నేరం నిర్ధారణ అయితే న్యాయస్థానం ఆదేశాలతో పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువస్తాం. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. -
భత్కల్‌కు అరదండాలు
మన భద్రతా సంస్థలు చాలా తక్కువ వ్యవధిలో రెండు ఎన్నదగిన విజయాలు సాధించాయి. ఈ రెండూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయడంలో ఎంతగానో ఉపయోగపడేవి. సరిగ్గా పక్షం రోజుల క్రితం ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా పట్టుబడ్డాడు. గురువారం మరో ఉగ్రవాది యాసీన్ భత్కల్ దొరికి పోయాడు. ఇద్దరి మధ్యా వయసులో చాలా వ్యత్యాసమున్నా ఇద్దరికిద్దరూ అత్యంత ప్రమాదకరవ్యక్తులు. టుండా రెండు దశాబ్దాల నుంచి మన భద్రతా సంస్థలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుంటే భత్కల్ గత ఐదేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇద్దరూ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కనుసన్నల్లో పనిచేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పథక రచన చేశారు. ఎందరెందరో అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. టుండా చాలాకాలం ఆచూకీ లేకుండా పోయి బంగ్లాదేశ్ నుంచి తన కార్యకలాపాలు కొనసాగించగా, భత్కల్ మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతూ విధ్వంసక చర్యలు కొనసాగిస్తూ, ఒకటి రెండుసార్లు దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. చివరకు ఇద్దరూ నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డారు. అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణే, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్ నగరాల్లో గత అయిదేళ్లుగా జరిగిన బాంబు పేలుడు ఘటనలన్నిటా భత్కల్ హస్తముందన్నది పోలీసుల ఆరోపణ. 17 మంది మరణానికి దారితీసిన పూణే జర్మన్ బేకరీ బాంబు పేలుడు ఘటన సందర్భంగా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో తొలిసారి భత్కల్‌ని గుర్తించారు. ఆరునెలల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల ఘటనల్లో సైతం భత్కల్ ప్రమేయాన్ని సీసీ టీవీ కెమెరాలు రికార్డు చేశాయి. 2009లో కోల్‌కతాలో దొంగనోట్ల కేసులో మారుపేరుతో పట్టుబడి, అసలు విషయం గుర్తించే లోగానే బెయిల్‌పై విడుదలై పరారయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లి ఇండియన్ ముజాహిదీన్ సంస్థ స్థాపకుల్లో ఒకడిగా ఉండి ఐఎస్ఐ సహకారంతో ఈ ఘటనలన్నిటికీ పాల్పడ్డాడు. మొన్న దొరికిన అబ్దుల్ కరీం టుండాగానీ, ఇప్పుడు పట్టుబడిన భత్కల్గానీ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్‌వర్క్‌లో భాగస్తులు. పాకిస్థాన్ సైన్యం తమ గడ్డపై ఇలాంటి ఉగ్రవాదులకు శిక్షణనివ్వడం, అటు తర్వాత వారిని సరిహద్దులు దాటించి భారత్‌లో ఉగ్రవాద ఘటనలకు పాల్పడేలా చేయడం చాలాకాలం నుంచి సాగుతోంది. భత్కల్‌కు వరసకు సోదరులయ్యే రియాజ్, ఇక్బాల్ ఇప్పటికీ పాకిస్థాన్‌లోనే తలదాచుకున్నారని మన గూఢచార సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇలా దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్న దాదాపు 12మంది పాక్‌లోనే ఉంటున్నారు. వీరుకాక లష్కరే తొయిబా నేతలు హఫీజ్ సయీద్, జకీ-ఉర్-రెహ్మాన్, మౌలానా మసూద్ అజర్ తదితరులను అప్పగించాలని సాక్ష్యాధారాలు సమర్పించినా పాకిస్థాన్ నిజాయితీగా వ్యవహరించలేదు. 1993 ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్న దావూద్ ఇబ్రహీం కూడా కరాచీలోనే ఉన్నాడు. పాక్ సైన్యం కనుసన్నల్లో పనిచేసే ఐఎస్ఐ వీరందరినీ వెనకుండి నడిపిస్తున్నది కాబట్టే పాకిస్థాన్‌లో ఉన్న పౌర ప్రభుత్వాలు చర్య తీసుకోలేకపోతున్నాయి. ఆ మాట చెబితే తమ చేతగానితనం ఎక్కడ బయట పడుతుందోనన్న భయంతో భారత్ సమర్పించిన సాక్ష్యాధారాలు సరిపోవని సాకులు వెదుకుతున్నాయి. ఈమధ్య గద్దెనెక్కిన ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా తమ గడ్డ ఉగ్రవాదుల అడ్డాగా మారడానికి అంగీకరించ బోమని చెప్పినా చేతలు మాత్రం ఇంతవరకూ మొదలుకాలేదు. సరిహద్దుల్లో జరిగిన ఇటీవలి ఘటనలు చూస్తే పాకిస్థాన్‌లో ఏవిధమైన మార్పూ రాలేదన్న సంగతి స్పష్టమవుతోంది. టుండా, భత్కల్ పట్టుబడటంవల్ల దేశంలో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులకు మరింత స్పష్టత వస్తుంది. ఆ నెట్‌వర్క్‌లో ఎంత మంది, ఏ ఏ స్థాయిల్లో పనిచేస్తున్నారో, ఎవరి సహాయ సహకారాలు వారికి అందుతున్నాయో వెల్లడయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్ నుంచి అందే సాయంపై పకడ్బందీ సాక్ష్యాధారాలు లభించవచ్చు. ఈ క్రమంలో మరింత మంది పట్టుబడవచ్చు కూడా. భత్కల్ ఇప్పటికే తన కార్యకలాపాల గురించి, తన నేరాల గురించి విలువైన సమాచారం అందించాడని భోగట్టా. ముఖ్యంగా హైదరాబాద్‌లో 2007లో జరిగిన లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్‌లో జరిగిన పేలుళ్లు, ఇటీవలి దిల్సుఖ్నగర్ పేలుళ్ల విషయమై ఎన్నో కొత్త కోణాలు బయట పడతాయి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న ప్రతిసారీ ఇంటెలిజెన్స్ సంస్థల వైఫల్యమో, వారిచ్చిన నివేదికలపై సరిగా స్పందించని పోలీసుల వైఖరో బయట పడుతోంది. వాటిని సరిచేసుకోవడంతోపాటు ఉగ్రవాదులు రూపొందడానికి ఎలాంటి పరిస్థితులు దోహదం చేస్తున్నాయో, ఏ పరిణామాలు కొందరు యువకుల్ని అలాంటి కంటకమార్గం వైపు నడిపిస్తున్నాయో, సమాజానికి పెను ముప్పుగా మారుస్తున్నాయో అధ్యయనం చేయాల్సిన బాధ్యత, నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. భత్కల్ వంటివారిని పట్టుకోవడం, వారి నేరాలను నిరూపించి కఠినశిక్ష పడేలా చేయడం ఒక ఎత్తయితే... సమాజంలో భిన్నవర్గాల మధ్య చిచ్చుపెట్టే శక్తులను సకాలంలో గుర్తించడం మరో ఎత్తు. అదృష్టవశాత్తూ ఎందరు ఎంత రెచ్చగొట్టినా సంయ మనం పాటించడం, హేతుబద్ధంగా ఆలోచించడం ఈ గడ్డపై ఆది నుంచీ ఉంది. అయితే, చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అందరూ ఒకేవిధంగా స్పందించరు. పరిస్థితుల ప్రభావంతో ఒక్కరు పెడదోవ పట్టినా వారివల్ల మొత్తం సమాజమంతా ఇబ్బందుల్లో పడుతుంది. నష్టపోతుంది. అలాంటి పరిస్థితులను నివారించడంపై కూడా దృష్టిపెడితే ఇరుగుపొరుగు దేశాల కుట్రలను మొగ్గలోనే తుంచడం, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యమవుతుంది. -
యాసిన్ భత్కల్ ను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు!
భారత జాబితాలో మోస్ట్ వాంటెడ్ టెర్రిరిస్ట్ యాసిన్ భత్కల్ కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భత్కల్ ఐడెంటిటీని ధృవీకరించడానికి బీహార్ పోలీసులు కర్నాటక పోలీసులను సంప్రదించినట్టు తెలిసింది. భత్కల్ ను అరెస్ట్ చేసిన వెంటనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి ఓ టీమ్ ను పంపించాలని విజ్క్షప్తి చేసినట్టు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వ్యక్తి భత్కలేనా కాదా అని ధృవీకరించడానికి కర్నాటక పోలీసు విభాగానికి చెందిన ఓ టీమ్ బీహార్ కు వెళ్లినట్టు సమాచారం. కర్నాటకలోని తీరపాంత్రమైన భత్కల్ గ్రామానికి యాసిన్ భత్కల్ చెందినవాడని అధికారులు తెలిపారు. మభ్యపెట్టే విషయంలో భత్కల్ ఆరితేరిన వాడు కావడంతో అతని కుటుంబ సభ్యులతో జీవసంబంధమైన అంశాన్ని పోలీసులు సరి చూడటానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించానున్నారు. -
యాసిన్ భత్కల్ ను హైదరాబాద్ కు రప్పిస్తాం: అనురాగ్ శర్మ
భారత, నేపాల్ సరిహద్దులో అరెస్టైన ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్ లను విచారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు బీహార్ కు వెళ్లనున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమీషన్ అనురాగ్ శర్మ మీడియాకు వెళ్లడించారు. ఫిబ్రవరి 21 తేదిన దిల్ సుఖ్ నగర్ లో జరిగిన వరస పేలుళ్ల ఘటనలో భత్కల్, అసదుల్లాలను విచారిస్తారని శర్మ తెలిపారు. దిల్ సుఖ్ నగర్ పేలుళ్లతో సంబంధమున్న సీసీటీవీ దృశ్యాలతో భత్కల్, అసదుల్లాల చిత్రాలు సరిపోయాయని పోలీసులు తెలిపారు. విచారణలో పేలుళ్ల సంఘటనతో సంబంధమున్నట్టు తేలితే, తదుపరి విచారణకు భత్కల్, అసదుల్లాలను హైదరాబాద్ కు తీసుకువస్తామన్నారు. ఫిబ్రవరి 21 తేదిన జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 17 మంది మృత్యువాత పడగా, 100 మందికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. తొలుత ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరుపగా, ఆతర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. -
కరుడు కట్టిన ఉగ్రవాదు భత్కల్ అరెస్టు