'భత్కల్‌ చేతికి సెల్ ఫోన్‌ చేరడం అసాధ్యం' | dg vk singh statement on bhatkal phone issue | Sakshi
Sakshi News home page

'భత్కల్‌ చేతికి సెల్ ఫోన్‌ చేరడం అసాధ్యం'

Published Sat, Jul 4 2015 11:58 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

'భత్కల్‌ చేతికి సెల్ ఫోన్‌ చేరడం అసాధ్యం'

'భత్కల్‌ చేతికి సెల్ ఫోన్‌ చేరడం అసాధ్యం'

హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్‌ జైల్‌ నుంచి పరారయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నాడన్న సమాచారంపై తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకేసింగ్‌ స్పందించారు. భత్కల్‌ చేతికి మొబైల్‌ ఫోన్‌ చేరడం అసాధ్యమని, అతడు సెల్ఫోన్లో మాట్లాడారన్న వార్తలను ఆయన శనివారమిక్కడ ఖండించారు. భత్కల్ భద్రత కోసం జైలులో ప్రత్యేక ఏర్పాటు చేశామని, భత్కల్ చేతికి ఫోన్ చేరడం అసాధ్యమన్నారు.

జైలులో ఉన్న ప్రతిఖైదీకి జైలు ఫోన్ ద్వారా వారానికి రెండు నెంబర్లకు మాట్లాడుకునే వెసులుబాటు ఉందని, ఖైదీలు ఇద్దరి బంధువుల నంబర్లు ముందే రిజిస్టర్ చేస్తారని డీజీ వీకేసింగ్ తెలిపారు. భత్కల్ కూడా తన భార్య నంబర్ను రిజిస్టర్ చేసుకున్నాడని, తన భార్య జహిదాతో భత్కల్ ప్రతివారం మాట్లాడతాడని చెప్పారు. ఖైదీలు మాట్లాడే ప్రతీ ఫోన్ కాల్ రికార్డు అవుతుందని, భత్కల్ తన భార్యతో మాట్లాడిన ఫోన్ కాల్స్ పరిశీలిస్తామన్నారు. కాగా పోలీసులను తప్పుదోవ పట్టించడానికి డమాస్కస్ స్నేహితుల గురించి భత్కల్ మాట్లాడి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement