dg vk singh
-
జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌పై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు జైళ్లశాఖ ఇంఛార్జ్ డీఐజీగా సందీప్ శాండిల్యకు బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జైళ్లను సైనిక్ స్కూళ్లుగా మార్చడమే లక్ష్యం
జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ వరంగల్: రాష్ట్రంలోని జైళ్లన్నింటినీ సైనిక్ స్కూళ్లుగా మార్చడమే జైళ్ల శాఖ లక్ష్యమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్(జైళ్లు) వీకేసింగ్ అన్నారు. వరంగల్ కేఎంసీలో సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో కుల, మత, ప్రాంతీయతత్వాలతో ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయన్నారు. సిటిజన్ ఫోరం ఏర్పడటంతోనే సరిపోదని డివిజన్, మండలంతోపాటు గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడి ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడే బంగారు తెలంగాణ సుసాధ్యమవుతుందన్నారు. గతేడాది 80 వేల మంది ఖైదీలను అక్షరాస్యులుగా మార్చామన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఏమీ కేటాయించలేదన్నారు. రెండేళ్లుగా జైళ్లశాఖను అవినీతి రహిత శాఖగా మార్చడం, చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తించిన ప్రభుత్వం జైళ్లలో మరిన్ని సౌకర్యాల కల్పనకు వచ్చే బడ్జెట్లో రూ.30 కోట్లు కేటాయిస్తోందన్నారు. సదస్సులో జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్, శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, సిటిజన్ ఫోరం అర్బన్ కమిటీ సభ్యులు పరశురాములు, గిల్దార్ సుల్తానా, బాలరాజు, నరేశ్, వీరభద్రరావు, మంజుల, రమాదేవి, ఉమేందర్, యాకుబ్‌పాషా పాల్గొన్నారు. -
సిటిజన్ ఫోరం ఓ ఉద్యమం లాంటింది
► ప్రతి ఒక్కరూ మిషన్‌గా తీసుకొని పనిచేయండి ► ప్రస్తుత పనితీరు బాగాలేదు.. మెరుగుపరుచుకోవాలి ► జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజల మద్దతు కూడగట్టుకొని సిటిజన్ ఫోరంను ఒక ఉద్యమంలాగ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత సభ్యుల ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్రజైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. సిటిజన్ ఫోరంను ఒక మిషన్‌గా తీసుకొని సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. జిల్లా సిటిజన్ ఫోరం శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి సారిగా ఖమ్మం జిల్లాలో సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసి విజయవంతం అయ్యామని, అదే పద్ధతిలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఈ ఫోరం ఏర్పాటు చేశామన్నారు. కమిటీల ఏర్పాటు తర్వాత నాలుగు జిల్లాలో ఆశించిన స్థాయిలో పనితీరులేదని, దానిని మెరుగు పరుచుకోవాలని సిటిజన్ ఫోరం అంటే ఒక సంస్థ కాకుండా ఉద్యమంగా భావించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉందని, దీంట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎక్కువగా ఉందన్నారు. దీనిపై సభ్యులు స్పందించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక రూపం తీసుకురావడానికి ఈ సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జైళ్లను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క అక్షరం రాకుండా జైలుకు వచ్చిన ఖైదీలకు తిరిగే వెళ్లే సమయానికి పుస్తకాలు చదివే స్థాయిలో విద్య నేర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం లేకుండా జరిగే పరిపాలనను సిటిజన్ ఫోరం నుంచి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలన్నారు. అంతకుముందు టీజేఏసీ ఛైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ పరిపాలనలో ఉన్న లోపాలను ఎత్తిచూపడానికి సిటిజన్ ఫోరం అనే ఒక మొక్క నాటడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ దశరథరాంరెడ్డి, జైలర్ శ్రీనునాయక్, ఉపేందర్, డిప్యూటీ జైలర్ సుధాకర్‌రెడ్డి, టీఏఎన్జీవో అధ్యక్షుడు రామకృష్ణారావు, చంద్రనాయక్, సాజిదసికిందర్, రాజమల్లెష్, జగపతిరావు, రవీందర్‌రెడ్డి, నాలుగు జిల్లాల సభ్యులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. జైలును పరిశీలించిన డీజీ : జిల్లా జైలును సోమవారం రాత్రి జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ పరిశీలించారు. సుదర్శన్గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత జైలును పరిశీలించి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. డీజీ వెంట సూపరింటెండెంట్ దశరథరాంరెడ్డి ఇతర సిబ్బంది ఉన్నారు. -
అదృశ్యం.. హైడ్రామా..!
-
అదృశ్యం.. హైడ్రామా..!
నల్లగొండ /ఖమ్మం క్రైం: నల్లగొండ జిల్లా భువనగిరి సబ్‌జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ అదృశ్యం ఆద్యంతం హైడ్రామాను తలపించింది. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక వెళ్లిపోతున్నానంటూ లేఖ రాసి మంగళవారం కనిపించకుండా పోరుున శ్రీనివాస్ బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని బస్టాం డ్లో అపస్మారకస్థితిలో కనిపించాడు. ప్రస్తుతం శ్రీనివాస్ స్నేహితుల సాయంతో ఖమ్మంలోని ఏషియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలేం జరిగింది.. శ్రీనివాస్ కొంతకాలంగా భువనగిరి సబ్‌జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా డు. ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన ఆలేరుకు చెందిన కిషోర్ వద్ద సబ్ జైలులో పనిచేస్తున్న ఇద్దరు వార్డర్లు నవీన్, కిరణ్‌కుమార్ రూ.వెయ్యి లంచం తీసుకున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. డీఎస్పీ స్థారుు అధికారితో విచారణ నిర్వహించడంతో ఆరోపణలు నిజమని తేలింది. ఈ క్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట సబ్ జైలుకు, వార్డర్లలో ఒకరిని చంచల్‌గూడ, మరొకరిని వరంగల్ జిల్లా నర్సంపేట జైళ్లకు అటాచ్మెంట్ చేశారు. ఉద్యోగానికి వెళ్తున్నానని.. శ్రీనివాస్ ఉద్యోగానికి రిపోర్ట్ చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాకు వెళుతున్నానని భార్య సరితతో చెప్పాడు. భార్యను పుట్టింటికి వరంగల్ జిల్లా కేసముద్రం పంపించి తాను మాత్రం లేఖ రాసి ఇంట్లోపెట్టి అదృశ్యమయ్యూడు. అరుుతే శ్రీనివాస్ సన్నిహితుడి ద్వారా విష యం వెలుగులోకి రావడంతో కలకలం రేపిం ది. విషయం తెలుసుకున్న అతడి భార్య బంధువులు భువనగిరికి వచ్చారు. కాగా, తనకు లక్సెట్టిపేట కాకుండా చంచల్‌గూడ జైలుకు బదిలీ చేయూలని ఉన్నతాధికారులను శ్రీనివాస్ కోరినట్లు సమాచారం. నాపై నింద మోపారు: శ్రీనివాస్ తనను అకారణంగా బదిలీ చేసి, అవినీతి ఆరోపణల నింద మోపారని, దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని శ్రీనివాస్ చెప్పా రు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ భువనగిరి సబ్జైల్లో ఏడాదిగా పనిచేస్తున్నానని, ఈ క్రమంలో ఈనెల 9న ఆది లాబాద్ జిల్లా లక్సెట్టిపేట సబ్‌జైలుకు బదిలీ చేసినట్లు ఉత్తర్వులు ఇవ్వడంతో షాకయినట్లు చెప్పారు. తనతోపాటు మరో నలుగురు వార్డర్లను బదిలీ చేస్తూ జైళ్లశాఖ డీజీ వీకే.సింగ్ ఉత్తర్వులు జారీ చేశారని, ఉన్నట్టుండి తనను 350 కిలోమీటర్ల దూరం ట్రాన్స్ఫర్ చేయడాన్ని తట్టుకోలేకపోయానని తెలిపారు. ఇదే మనస్తాపంతో మంగళవారం ఇంట్లో లెటర్ రాసి ఎవరికీ చెప్పకుండా ఖమ్మం వచ్చానని, స్నేహితుడు రాఘవేంద్రరావు వచ్చి ఆస్పత్రిలో చేర్చాడని వివరించారు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో రాయలేదని, భువనగిరి సబ్‌జైలులో ఉన్న నయీమ్ ముఠా సభ్యులకు సహకరించారనడం అవాస్తవమని అన్నారు. అకారణంగా బదిలీ: శ్రీనివాస్ భార్య కేసముద్రం: ఆదిలాబాద్‌లో విధులకు హాజరవుతానని చెప్పి వెళ్లిన తన భర్త నోట్ రాసి వెళ్లిపోరుునట్లు ఫోన్ వచ్చిందని, సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయాడని వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందానని శ్రీనివాస్ భార్య సరిత అన్నారు. తన భర్తకు అకారణంగా ఏడాదిలోపే బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని, అందుకే మానసికవేదనకు లోనై అదృశ్యమయ్యాడని సరిత చెప్పింది. జైళ్ల శాఖ డీఐజీ, ఇన్చార్జి ఐజీ నర్సింహా స్పందించి తిరిగి అదే స్థానంలో పని చేసే విధంగా చూస్తామని చెప్పినట్లు అతడి మామ గోవర్ధన్ చెప్పారు. అవినీతిని సహిం చేది లేదని ఆకుల నర్సింహా స్పష్టం చేశారు. బుధవారం భువనగిరి సబ్‌జైలును పరిశీలించి మీడియూతో మాట్లాడారు. అవినీతి అధికారులపై చర్యలు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ హైదరాబాద్: అవినీతి అధికారులు, సిబ్బం దిపై చర్యలు కొనసాగుతాయని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ బుధవారం ‘సాక్షి’తో అన్నారు. డీజీ వేధిం పులకు గురి చేస్తున్నాడంటూ నల్లగొండ జిల్లా భువనగిరి సబ్ జైలు అధికారి శ్రీనివాస్‌రావు లేఖరాసి అదృశ్యమైన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రతినిధితో డీజీ వినయ్‌కుమార్ మాట్లాడారు. అవినీతికి పాల్పడుతున్నాడంటూ శ్రీనివాస్‌రావుపై ఇద్దరు ఖైదీలు జైళ్ల శాఖ ప్రత్యేకటీమ్కు ఫిర్యాదు చేశారని, దీనిపై రంగారెడ్డి జిల్లా జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథన్ను విచారణాధికారిగా నియమించి సమగ్ర నివేదిక తీసుకున్నట్లు చెప్పారు. శ్రీనివాస్‌రావుపై వచ్చిన ఫిర్యాదులు వాస్తవమని తేలడంతో అతనిని ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ సబ్ జైలుకు బదిలీ మాత్రమే చేశామన్నారు. -
జైళ్లు.. హౌస్‌ఫుల్!
- ఖైదీలతో కిక్కిరిసిపోతున్న కారాగారాలు - వీరిలో శిక్ష పడిన వారు మూడో వంతే.. రాష్ట్రంలోని కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. సెంట్రల్ జైలు మొదలుకుని జిల్లా, సబ్‌జైళ్లు అన్నీ కూడా ఖైదీలతో నిండిపోయాయి. రాష్ట్రంలో మూడు కేంద్ర కారాగారాలతో పాటు మొత్తం 46 జైళ్లు ఉన్నాయి. అన్ని జైళ్లలో కలిపి 6,848 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు జైళ్లు నిండిపోయాయి. కేంద్ర కారాగారాల్లో అయితే సామర్థ్యం కంటే అధికంగా ఖైదీలు ఉన్నారు. మూడు కేంద్ర కారాగారాల్లో కలిపి 3,126 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 3,500 మందితో కిక్కిరిసిపోయాయి. మహిళా కేంద్ర కారాగారం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉమెన్ సెంట్రల్ జైలు కెపాసిటీ 220 కాగా.. ప్రస్తుతం 250 మంది ఉన్నారు. అయితే జిల్లా జైళ్లు, సబ్ జైళ్లలో మాత్రం సామర్థ్యం కంటే కాస్త తక్కువగానే ఖైదీలు ఉన్నారు. - సాక్షి, హైదరాబాద్ శిక్షపడిన వారు 2,124 మందే జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీల్లో న్యాయస్థానాల్లో శిక్షపడిన వారు మూడో వంతు మాత్రమే. సుమారు 6,800 మంది ఖైదీలకుగానూ శిక్షపడిన వారు 2,124 మందే. మిగతా వారంతా కేసుల విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. శిక్షపడిన ఖైదీల్లో అత్యధికంగా హత్యానేరం కింద శిక్ష అనుభవిస్తున్న వారు 1,180 మంది. దొంగతనం(198), అత్యాచారం(154), వరకట్న హత్యలు(90) వంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారూ ఉన్నారు. సిబ్బందిపై పనిభారం.. రాష్ట్రంలోని అన్ని జైళ్లూ ఖైదీలతో నిండిపోయిన నేపథ్యంలో సరిపడా సిబ్బంది లేక జైళ్ల శాఖ సతమతమవుతోంది. మొత్తం 1,900 పోస్టులకుగానూ 1,500 మంది సిబ్బందితోనే జైళ్ల శాఖ నెట్టుకొస్తోంది. 400 పోస్టులు ఖాళీగా ఉండటంతో పనిభారం పెరిగి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఐజీ ర్యాంకు స్థాయిగల అధికారి పోస్టు కూడా ఖాళీగానే ఉంది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా.. నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపకపోవడంతో ఉన్నతాధికారులు ఆవేదన చెందుతున్నారు. తగ్గిన ఖైదీల మరణాలు.. మహా పరివర్తన్ పేరిట జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అవలంబిస్తున్న చర్యల ద్వారా ఖైదీల్లో మార్పు వస్తోంది. తెలిసో, తెలియకో తప్పు చేసి జైళ్లకు వచ్చే వారిని మరోసారి తప్పిదం చేయకుండా ఉండేందుకు మానసిక నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. వివిధ రకాల దురలవాట్లు, ఆరోగ్యం దెబ్బతిన్న వారు జైలుకు వచ్చాక పరిస్థితి మరింత విషమించి, సమయానికి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులకు దూరమై మనోధైర్యం కోల్పోయి.. వివిధ వ్యాధులకు గురై మరణిస్తుంటారు. అయితే గత ఏడాది కాలంగా యోగా, మానసిక నిఫుణుల శిక్షణల వల్ల మరణాల రేటు కూడా సగానికి పైగా తగ్గింది. 2014లో 52 మంది ఖైదీలు మరణించగా, 2015లో 26 మంది వివిధ కారణాల వల్ల మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎనిమిది మంది మాత్రమే మరణించినట్లు సమాచారం. -
జైళ్లలో చికెన్ బిర్యానీ!
అధునాతన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని జైళ్లశాఖ డీజీ ఉత్తర్వులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జైలు పేరు చెబితే ఠక్కున గుర్తుకొచ్చేది చిప్పకూడు! కానీ ఇకపై చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫ్రైడ్‌రైస్ సహా అన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ జైలు క్యాంటిన్లో ఖైదీలకు అందుబాటులోకి రాబోతున్నాయి. బయట హోటల్ మాదిరిగా డబ్బులు చెల్లిస్తే చాలు.. ఉదయం ఇడ్లీ, దోశ, పూరి, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఇష్టమైన చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్.. వగైరా లాగించేయొచ్చు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల డీజీ వీకే సింగ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఎందుకంటే... మంచి భోజనం కోసం ఖైదీలు, రిమాండ్ ఖైదీలు అల్లాడిపోతున్నారు. జైలు కూడు తినలేక పస్తులుంటూ ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. కొందరైతే నచ్చిన తిండి కోసం జైలు సిబ్బందికి వేలకు వేలు లంచాలిచ్చి బయట్నుంచి చాటుమాటుగా తెప్పించుకుని తింటున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు జైళ్ల శాఖ డీజీ జైళ్లలో అదునాతన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఖైదీలు ఇష్టమైన తిండి కోసం జైలు సిబ్బందికి లంచాలిచ్చే పద్ధతికి స్వస్తి పలకొచ్చని ఆయన భావిస్తున్నారు. దీనికితోడు క్యాంటీన్ల ద్వారా వచ్చే ఆదాయంతో జైళ్లను ఆర్థికంగా బలోపేతం చేయొచ్చని భావిస్తున్నారు. ఒక్కో ఐటమ్కు ఒక్కో రేటు! క్యాంటీన్లో ఆహార పదార్థాలకు ఒక్కో ఐటమ్కు ఒక్కో ధర నిర్ణయిస్తారు. ఆహార పదార్థాలకయ్యే ఖర్చు, క్యాంటీన్ నిర్వహణ ఖర్చులపై 20 శాతం లాభం వేసుకొని ఈ ధరలు నిర్ణయించాలని జైళ్లశాఖ డీజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చిన ఆదాయాన్ని జైళ్ల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. జైలు క్యాంటీన్లో ఇష్టమైన ఆహారం తినే సదుపాయం విదేశాల్లో ఎప్పట్నుంచో అమలవుతోంది. మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటికే కరీంనగరం జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఖైదీల నుంచి అనూహ్య స్పందన రావడంతో త్వరలో పూర్తిస్థాయిలో అధునాతన క్యాంటీన్‌ను ఏర్పాటు చేసేందుకు జైలు సూపరింటెండెంట్ శివకుమార్ సిద్ధమవుతున్నారు. ఖైదీల సంక్షేమం కోసమే: శివకుమార్, జైలు సూపరింటెండెంట్, కరీంనగర్ జైళ్లశాఖ డీజీ ఆదేశాల మేరకు జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా చికెన్, ఎగ్‌తో చేసిన ఆహార పదార్థాలను ఖైదీలకు అందించాం. ఎగ్‌ఫ్రైడ్ రైస్, ఎగ్కర్రీల ధర రూ.40. ఖైదీల నుంచి మంచి స్పందన రావడంతో పూర్తిస్థాయిలో మెనూలోని ఆహార పదార్థాలన్నీ అందించేందుకు సిద్ధమవుతున్నాం. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. క్యాంటీన్ నిర్వహణను ఐదుగురు ఖైదీలకు కేటాయించాం. ఇదీ జైలు క్యాంటీన్ మెనూ ఉదయం: ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఉప్మా సాయంత్రం: చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్‌రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్‌బోండా, చపాతీ. -
జైళ్ల శాఖ టర్నోవర్ రూ.216 కోట్లు
సగానికి తగ్గిన ఖైదీల మరణాలు: డీజీ వీకే సింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్ల శాఖ 2015 సంవత్సరంలో రూ.216.03 కోట్లు టర్నోవర్ సాధించినట్లు డెరైక్టర్ జనరల్ (డీజీ) వినయ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. జైళ్ల శాఖకు ఒక్క రూపాయి నిధులు రాకపోయినా... తమ శాఖ ఆదాయం నుంచే ఖర్చులన్నీ పోను గతేడాది రూ.4.77 కోట్లు మిగులు సాధించినట్లు తెలిపారు. 2025 నాటికి రూ.100 కోట్ల లాభాలను ఆర్జించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. మంగళవారం జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంతో పోల్చితే జైళ్లలో ఖైదీల మరణాలు సగానికిపైగా తగ్గినట్లు చెప్పారు. 2013లో 53 మంది ఖైదీలు చనిపోగా, 2014లో 56 మంది చనిపోయారన్నారు. 2015లో 32 మంది వివిధ వ్యాధుల బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. ఖైదీల మరణాలను నివారించేందుకు మహాపరివర్తన్ పేరిట జైళ్లలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని, ఫలితంగా జైలుకు వచ్చే ఖైదీల సంఖ్య కూడా భారీగా తగ్గిందని సింగ్ పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలోని అన్ని జైళ్లకు 94 వేల మంది ఖైదీలు రాగా, 2015లో 79,409 మంది వచ్చారన్నారు. వీరిలో శిక్ష పడిన వారు 3,926 మంది కాగా, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీల్లో 49,942 మంది పురుషులు, 25,541 మంది మహిళలు ఉన్నట్లు ఆయన చెప్పారు. -
త్వరలో ఖైదీలకు క్షమాభిక్ష
సాక్షి, హైదరాబాద్: యావజ్జీవశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్షను త్వరలో అమలు చేస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జైళ్లశాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఇటీవలే ముసాయిదా విధి విధానాలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో ఖైదీల విడుదలకు రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. నూతనంగా నిర్మించిన జైళ్లశాఖ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం హోంమంత్రి నాయిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ జైళ్లశాఖను తీర్చిదిద్దామని వివరించారు. మహాపరివర్తన కార్యక్రమం ద్వారా ఖైదీలలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. జైళ్లశాఖ కేవలం ఖైదీల భద్రతా విధులు మాత్రమే కాకుండా.. వారిని ప్రధాన మానవ వనరుగా పరిగణించి పలు సామాజిక సేవా అభివృద్ధి పథకాలు రూపొందించడం అభినందనీయమన్నారు.చంచల్‌గూడ జైలు తరలింపునకు కనీసం నాలుగేళ్ల సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా: డీజీ వీకే సింగ్ జైళ్లశాఖ ఆధ్వర్యంలో శిక్ష పడిన ఖైదీలకు వివిధ రంగాలలో శిక్షణ ఇస్తున్నట్టు డెరైక్టర్ జనరల్ (డీజీ) వీకే సింగ్ తెలిపారు. శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వెళ్లినవారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒకట్రెండ్ నెలల వ్యవధిలో ఉద్యోగమేళా నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం వివిధ కంపెనీలను ఆహ్వానిస్తామని తెలిపారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రభుత్వం కేటాయించిన వెయ్యి ఎకరాల్లో ఓపెన్ జైలు ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. ఖైదీలను గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నామని, భవిష్యత్తులో జైళ్లశాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ నర్సింహ, వరంగల్ రేంజ్ డీఐజీ కె.కేశవనాయుడు, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ సైదయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
భత్కల్ తప్పించుకునే అవకాశం లేకపోలేదు
- జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ - ఆయనను కోర్టుకు తరలించడం ఇబ్బందికరమే - రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదు సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన భత్కల్ను ప్రతీసారి కోర్టుకు తీసుకెళ్లడమంటే కాస్త ఇబ్బందికరమేనని జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ వ్యాఖ్యానించారు. జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే మార్గంలో వారు తప్పించుకోవడానికి అవకాశాలు లేకపోలేదన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో డీజీ వీకే సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘భత్కల్‌తో పాటు ఇతర ఉగ్రవాదులను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ఉంచుతామని సూచించాం. అయితే ట్రయల్స్ ఉన్నందున కచ్చితంగా తీసుకు రావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. మాకు కాస్త ఇబ్బందికరమైనా కోర్టు ఆదేశాల మేరకు తీసుకెళ్తున్నాం. ఈ విషయంలో న్యాయస్థానాలదే అంతిమ నిర్ణయం’ అని అన్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ భత్కల్ కోర్టు వద్ద విసిరిన లేఖ విషయాన్ని ప్రస్తావించగా... ‘ప్రాణహాని ఉందని భత్కల్ చెబితే మేం ఏం చేసేది. మా జైల్లో ఉన్నంత వరకు అతను భద్రంగా ఉంటారు. ఎలాంటి అపోహలకు తావులేదు’ అని అన్నారు. భత్కల్ జైల్ నుంచి పారిపోతారని తమకు కేంద్రం నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదని స్పష్టం చేశారు. ైజైల్లో కల్పించిన ఫోన్ ద్వారా భత్కల్ తన భార్యతో మాట్లాడిన రికార్డులన్నీ పరిశీలించామని, ఎక్కడా కూడా పారిపోతానని చెప్పిన సందర్భం లేదన్నారు. రేవంత్ రాజకీయ నాయకుడు చర్లపల్లి జైల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ కొట్టిపారేశారు. ఆయన రాజకీయ నాయకుడని, ఆయనేం చెప్పారో తమకు తెలియదన్నారు. జైళ్లలో మాత్రం ఎలాంటి అక్రమాలు జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లన్నింటినీ అవినీతి రహితంగా మార్చుతున్నామన్నారు. తాము ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటి వరకు 60 కాల్స్ వచ్చాయని, వాటిలో 18 మాత్రమే తమశాఖకు చెందినవి కావడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. 60 ఏళ్లుగా జైళ్ల విభాగానికి ప్రాధాన్యం లభించలేదని, ఏడాది కాలంగా అనేక మార్పులు చేపట్టినట్లు వివరించారు. తెలంగాణ జైళ్ల శాఖను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటి వరకు జైళ్లలో నిరక్షరాస్యులుగా ఉన్న 20వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించినట్లు వెల్లడించారు. కొన్ని సంస్థల సహకారంతో పదో తరగతి పూర్తి చేసుకున్న వారికి కంప్యూటర్ విద్యను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. -
'భత్కల్ చేతికి సెల్ ఫోన్ చేరడం అసాధ్యం'
-
'భత్కల్ చేతికి సెల్ ఫోన్ చేరడం అసాధ్యం'
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ జైల్ నుంచి పరారయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న సమాచారంపై తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకేసింగ్ స్పందించారు. భత్కల్ చేతికి మొబైల్ ఫోన్ చేరడం అసాధ్యమని, అతడు సెల్ఫోన్లో మాట్లాడారన్న వార్తలను ఆయన శనివారమిక్కడ ఖండించారు. భత్కల్ భద్రత కోసం జైలులో ప్రత్యేక ఏర్పాటు చేశామని, భత్కల్ చేతికి ఫోన్ చేరడం అసాధ్యమన్నారు. జైలులో ఉన్న ప్రతిఖైదీకి జైలు ఫోన్ ద్వారా వారానికి రెండు నెంబర్లకు మాట్లాడుకునే వెసులుబాటు ఉందని, ఖైదీలు ఇద్దరి బంధువుల నంబర్లు ముందే రిజిస్టర్ చేస్తారని డీజీ వీకేసింగ్ తెలిపారు. భత్కల్ కూడా తన భార్య నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నాడని, తన భార్య జహిదాతో భత్కల్ ప్రతివారం మాట్లాడతాడని చెప్పారు. ఖైదీలు మాట్లాడే ప్రతీ ఫోన్ కాల్ రికార్డు అవుతుందని, భత్కల్ తన భార్యతో మాట్లాడిన ఫోన్ కాల్స్ పరిశీలిస్తామన్నారు. కాగా పోలీసులను తప్పుదోవ పట్టించడానికి డమాస్కస్ స్నేహితుల గురించి భత్కల్ మాట్లాడి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.