
అదృశ్యం.. హైడ్రామా..!
నల్లగొండ /ఖమ్మం క్రైం: నల్లగొండ జిల్లా భువనగిరి సబ్‌జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ అదృశ్యం ఆద్యంతం హైడ్రామాను తలపించింది. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక వెళ్లిపోతున్నానంటూ లేఖ రాసి మంగళవారం కనిపించకుండా పోరుున శ్రీనివాస్ బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని బస్టాం డ్‌లో అపస్మారకస్థితిలో కనిపించాడు. ప్రస్తుతం శ్రీనివాస్ స్నేహితుల సాయంతో ఖమ్మంలోని ఏషియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అసలేం జరిగింది..
శ్రీనివాస్ కొంతకాలంగా భువనగిరి సబ్‌జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా డు. ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన ఆలేరుకు చెందిన కిషోర్ వద్ద సబ్ జైలులో పనిచేస్తున్న ఇద్దరు వార్డర్లు నవీన్, కిరణ్‌కుమార్ రూ.వెయ్యి లంచం తీసుకున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. డీఎస్పీ స్థారుు అధికారితో విచారణ నిర్వహించడంతో ఆరోపణలు నిజమని తేలింది. ఈ క్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట సబ్ జైలుకు, వార్డర్లలో ఒకరిని చంచల్‌గూడ, మరొకరిని వరంగల్ జిల్లా నర్సంపేట జైళ్లకు అటాచ్‌మెంట్ చేశారు.
ఉద్యోగానికి వెళ్తున్నానని..
శ్రీనివాస్ ఉద్యోగానికి రిపోర్ట్ చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాకు వెళుతున్నానని భార్య సరితతో చెప్పాడు. భార్యను పుట్టింటికి వరంగల్ జిల్లా కేసముద్రం పంపించి తాను మాత్రం లేఖ రాసి ఇంట్లోపెట్టి అదృశ్యమయ్యూడు. అరుుతే శ్రీనివాస్ సన్నిహితుడి ద్వారా విష యం వెలుగులోకి రావడంతో కలకలం రేపిం ది. విషయం తెలుసుకున్న అతడి భార్య బంధువులు భువనగిరికి వచ్చారు. కాగా, తనకు లక్సెట్టిపేట కాకుండా చంచల్‌గూడ జైలుకు బదిలీ చేయూలని ఉన్నతాధికారులను శ్రీనివాస్ కోరినట్లు సమాచారం.
నాపై నింద మోపారు: శ్రీనివాస్
తనను అకారణంగా బదిలీ చేసి, అవినీతి ఆరోపణల నింద మోపారని, దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని శ్రీనివాస్ చెప్పా రు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ భువనగిరి సబ్‌జైల్‌లో ఏడాదిగా పనిచేస్తున్నానని, ఈ క్రమంలో ఈనెల 9న ఆది లాబాద్ జిల్లా లక్సెట్టిపేట సబ్‌జైలుకు బదిలీ చేసినట్లు ఉత్తర్వులు ఇవ్వడంతో షాకయినట్లు చెప్పారు. తనతోపాటు మరో నలుగురు వార్డర్లను బదిలీ చేస్తూ జైళ్లశాఖ డీజీ వీకే.సింగ్ ఉత్తర్వులు జారీ చేశారని, ఉన్నట్టుండి తనను 350 కిలోమీటర్ల దూరం ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని తట్టుకోలేకపోయానని తెలిపారు. ఇదే మనస్తాపంతో మంగళవారం ఇంట్లో లెటర్ రాసి ఎవరికీ చెప్పకుండా ఖమ్మం వచ్చానని, స్నేహితుడు రాఘవేంద్రరావు వచ్చి ఆస్పత్రిలో చేర్చాడని వివరించారు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో రాయలేదని, భువనగిరి సబ్‌జైలులో ఉన్న నయీమ్ ముఠా సభ్యులకు సహకరించారనడం అవాస్తవమని అన్నారు.
అకారణంగా బదిలీ: శ్రీనివాస్ భార్య
కేసముద్రం: ఆదిలాబాద్‌లో విధులకు హాజరవుతానని చెప్పి వెళ్లిన తన భర్త నోట్ రాసి వెళ్లిపోరుునట్లు ఫోన్ వచ్చిందని, సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయాడని వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందానని శ్రీనివాస్ భార్య సరిత అన్నారు. తన భర్తకు అకారణంగా ఏడాదిలోపే బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని, అందుకే మానసికవేదనకు లోనై అదృశ్యమయ్యాడని సరిత చెప్పింది. జైళ్ల శాఖ డీఐజీ, ఇన్‌చార్జి ఐజీ నర్సింహా స్పందించి తిరిగి అదే స్థానంలో పని చేసే విధంగా చూస్తామని చెప్పినట్లు అతడి మామ గోవర్ధన్ చెప్పారు. అవినీతిని సహిం చేది లేదని ఆకుల నర్సింహా స్పష్టం చేశారు. బుధవారం భువనగిరి సబ్‌జైలును పరిశీలించి మీడియూతో మాట్లాడారు.
అవినీతి అధికారులపై చర్యలు
తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్
హైదరాబాద్: అవినీతి అధికారులు, సిబ్బం దిపై చర్యలు కొనసాగుతాయని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ బుధవారం ‘సాక్షి’తో అన్నారు. డీజీ వేధిం పులకు గురి చేస్తున్నాడంటూ నల్లగొండ జిల్లా భువనగిరి సబ్ జైలు అధికారి శ్రీనివాస్‌రావు లేఖరాసి అదృశ్యమైన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రతినిధితో డీజీ వినయ్‌కుమార్ మాట్లాడారు.
అవినీతికి పాల్పడుతున్నాడంటూ శ్రీనివాస్‌రావుపై ఇద్దరు ఖైదీలు జైళ్ల శాఖ ప్రత్యేకటీమ్‌కు ఫిర్యాదు చేశారని, దీనిపై రంగారెడ్డి జిల్లా జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథన్‌ను విచారణాధికారిగా నియమించి సమగ్ర నివేదిక తీసుకున్నట్లు చెప్పారు. శ్రీనివాస్‌రావుపై వచ్చిన ఫిర్యాదులు వాస్తవమని తేలడంతో అతనిని ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ సబ్ జైలుకు బదిలీ మాత్రమే చేశామన్నారు.