![ACB Raids On Panchayat Secretary In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/6/secretary.jpg.webp?itok=MHWzAg71)
పట్టుబడిన ప్రదీప్
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): నవళగుంద పంచాయతీ ఉద్యోగి తలాటి ప్రదీప్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివరాలు... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూలిన ఇళ్లకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ పరిధిలోని ఓ బాధితుడు పరిహారం కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ ఉద్యోగి ప్రదీప్ రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగదు అందజేస్తున్న సమయంలో ఏసీబీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment