ACB special team
-
HYD: ఇరిగేషన్లో 300 కోట్ల అవినీతి తిమింగలం.. మూడు ఫామ్ హౌస్‌లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.వివరాల ప్రకారం.. నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్‌పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆయనతో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గతంలోనూ లంచం తీసుకుంటూ నికేష్ కుమార్ పట్టుబడ్డారు. ఇక, సోదాల్లో భాగంగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. గండిపేట బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో నిబంధనకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్రనగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇక, నికేష్ పేరిట మూడు ఇల్లులు ఉండగా.. ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. ఫామ్ హౌస్‌ల విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక, కొల్లూరులో ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొయినాబాద్‌లో మూడు ఫామ్‌హౌస్‌లు ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. నికేష్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ నికేష్ ఏసీబీకి దొరికారు. -
HYD: నాంపల్లిలో అర్ధరాత్రి హైడ్రామా.. ఏసీబీ అదుపులో ఈఈ, ఏఈలు..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని నీటి పారుదల శాఖలో ఏసీబీ సోదాలు ముగిశాయి. నాంపల్లిలో హైడ్రామా తర్వాత నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.వివరాల ప్రకారం.. నాంపల్లిలో రెడ్ హిల్స్‌లోని నీటి పారుదల శాఖ ఆఫీసులో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్‌లు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో, లంచం డిమాండ్‌కు సంబంధించి కీలక అధికారి పరారీ కావడంతో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. రాత్రి నాలుగు గంటల పాటు శ్రమించి నాలుగో వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు.కాగా, ఒక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆమోదం కోసం నీటిపారుదల శాఖ రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయ అధికారులను సంప్రదించాడు. ఇక్కడ ఈఈగా పనిచేస్తున్న భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేశ్ రూ.2.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీనికి అంగీకరించిన సదరు వ్యక్తి ముందుగా రూ.1.5లక్షలు ఇచ్చేందుకు అధికారులు డీల్ కుదుర్చుకున్నారు. మరో లక్ష తర్వాత చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇదంతా గురువారం సాయంత్రం ఈఈ ఆఫీసులో జరగాలని ప్లాన్ చేసుకున్నారు. ఈలోపే బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు దాడులు జరిపి వారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వివరాలను అధికారులు కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. -
ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ
నగరంపాలెం: మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులను గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లుల్లోనూ దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లయి/శానిటేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి.శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున రూ.1.68 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్ 14400ను సంప్రదించారు. ఏసీబీ వారి సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి ఒప్పకున్నాడు. దీంతో శుక్రవారం సాయంత్రం జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్ (ఆర్డబ్ల్యూఎస్) డివిజన్ కార్యాలయం వద్దకు రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు. దీంతో అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్ కుమార్, ఎన్.సత్యానందం, సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, సురేష్ బాబు, నరసింహా రెడ్డి, ఎస్ఐ మూర్తి పాల్గొన్నారు. -
శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున 52 ఎకరాల భూములు
సాక్షి, యాదాద్రి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బయటపడ్డాయి. ఆయనపై జరుగుతున్న విచారణ సందర్భంగా.. భువనగిరి జిల్లాలో భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలువైన వ్యవసాయ భూములను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ చేసుకున్నట్లు తేలింది. వలిగొండ, బీబీనగర్, మోత్కూరు మండలాల్లో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున గల 52.31 ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి వాటిని ఫ్రీజ్ చేయాలని కోరినట్లు సమాచారం. రిజిస్టర్ డాక్యుమెంట్ల కావాలి శివబాలకృష్ణ కుటుంబ సభ్యులైన శివనవీన్, శివఅరుణ, ఎస్.ప్రసాద్, ఎస్.పద్మావతి, ఎస్.రఘుదేవి పేరున వ్యవసాయ భూముల డాక్యుమెంట్ల ఫ్రీజ్ చేయాలని కలెక్టర్‌ను ఏసీబీ అఽధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్లు, స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, మ్యుటేషన్ ఫైల్స్ ఇవ్వాలని కోరారు. అలాగే, శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబందించిన డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్లను నిలిపివేయాలని, తాము ఇచ్చిన వివరాల ప్రకారం ధరణీ పోర్టల్లోఉన్న రికార్డులను, కార్యాలయంలో ఉన్న రికార్డుల హార్డ్ కాపీలను పరిశీలించాలని కోరారు. శివబాలకృష్ణ పేరు మీద జిల్లాలో ఇంకేమైన ఆస్తుల డాక్యుమెంట్లు ఉంటే వాటికి సంబంధించి చెల్లించిన ఫీజు వివరాలను తమకు ఇవ్వడంతోపాటు వాటిని కూడా ఫ్రీజ్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. 22 మంది ఆధార్‌కార్డులు శివబాలకృష్ణకు కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు, స్నేహితులు, బావమరిది, సొదరుని కుమారులు, కోడలు, వారి స్నేహితులకు సంబంధించి మొత్తం 22మంది ఆధార్ కార్డులు కలెక్టర్‌కు ఏసీబీ అధికారులు పంపించారు. జిల్లాలో ఎక్కడైనా వీరికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆస్తిపాస్తుల వివరాలు తమకు ఇవ్వడంతో పాటు వాటికి సంబంఽధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవీ.. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరుతో భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారులు గుర్తించిన భూముల వివరాలు ఇలావున్నాయి.. వలిగొండ మండలం నర్సాపూర్‌లో ఎస్.హరిప్రసాద్ పేరున 8 ఎకరాలు, ఎస్.రఘుదేవి పేరున 11.03 ఎకరాలు, వలిగొండ మండల చిత్తాపురంలో ఎస్.పద్మావతి పేరున ఎకరం 30 గుంటలు, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో శివఅరుణ పేరున 20 గుంటలు, మోత్కూరు మండలం పాలడుగులో శివనవీన్ పేరున 6.32 ఎకరాలు, 12.5 ఎకరాలు, వలిగొండ మండలం రెడ్లరేపాకలో శివనవీన్ పేరున 4.22 ఎకరాలు, 5.32 ఎకరాల వ్యవసాయ భూమిని వారి కుటుంబ సభ్యులపేరున ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
రానున్న పూర్వవైభవం.. ఏసీబీ మళ్లీ దాడులకు సిద్ధం!
సాక్షి, ఆసిఫాబాద్: ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం.. సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం.. తదితర కారణాలతో ప్రభుత్వ శాఖల్లో పనులు నత్తనడకన జరగడంతో ఇటీవల అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) జోరు తగ్గింది. ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా లేకపోవడంతో కేసుల కోసం తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి.. కొత్త సర్కారు కొలువుదీరింది. పరిపాలన మళ్లీ గాడిన పడింది. ఏసీబీ బాస్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టాక.. ఏసీబీకి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఏసీబీ అధికారులు మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులతోపాటు సొంతంగా దాడులు చేసేందుకు అవకాశమున్న ‘ఆదాయానికి మించి ఆస్తులు’ కేసులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. ఎన్నికలతో విరామం.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రెండు ఏసీబీ దాడులు జరిగాయి. రెబ్బెన మండల సర్వేయర్, చైన్‌మెన్ రూ.10 వేలు, రూ.20 వేల లంచం తీసుకొంటూ చింతలమానెపల్లి ఎస్సై ఏసీబీకి దొరికిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఏసీబీ దాడులు నమోదు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల పర్వంతో రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు తదితర కీలక శాఖల సిబ్బంది ఆ విధుల్లో మునిగిపోయారు. పింఛన్లు, భూముల పట్టాల మంజూరు, వివిధ రకాల అనుమతుల ప్రక్రియలు మందగించాయి. ప్రజలకు సంబంధించిన ప్రభు త్వ కార్యాలయాల్లో పనులన్నీ దాదాపు స్తంభించాయి. దీని వల్ల ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా చాలా తగ్గాయని ఏసీబీ సిబ్బంది చెబుతున్నారు. ఫిర్యాదుల ఆధారంగానే ఉద్యోగులపై నిఘా పెట్టి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వీలవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లంచాల కోసం ఎవరైనా డిమాండ్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ‘వారి’పై ప్రత్యేక దృష్టి.. ప్రస్తుతం ఫిర్యాదులు(ట్రాప్)లతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు(డీఏ) కలిగి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ భావిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో లెక్కకు మిక్కిలిగా సంపాదించుకుంటున్న సిబ్బంది, బినామీ పేర్లతో ఆస్తులు వెనకేసుకున్న ఉద్యోగులు, ఇక్కడే ఏళ్ల తరబడి తిష్టవేసి, పాడి ఆవుల్లాంటి విభాగాల్లో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులపై ఈ విభాగం దృష్టి సారిస్తోంది. అవినీతికి బానిసలైన అధికారుల అక్రమ ఆస్తులపై, బినామీలపై ఏసీబీ రహస్యంగా నిఘా వేయనున్నట్లు సమాచారం. ఇవి చదవండి: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం -
హలో.. మేం ఏసీబీ నుంచి..
ఏది ఏమైనప్పటికీ ఈ తరహా మోసాలపై ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఫోన్ చేసి నగదు డిమాండ్ చేయరన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు కోసం బెదిరింపు చర్యలకు పాల్పడితే వారు నకిలీ అధికారులని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారు. నెల్లూరు(క్రైమ్): అడ్డదారిలో డబ్బు సంపాదించాలని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గ్యాంగ్ సినిమా తరహాలో ఏసీబీ అధికారులుగా అవతారమెత్తారు. ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి రిజిస్ట్రేషన్స్, ఎకై ్సజ్, రెవెన్యూ, పోలీసు, ఆర్టీఓ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్, కమర్షియల్ ట్యాక్స్ తదితర విభాగాలకు చెందిన అధికారుల ఫోన్‌నంబర్లు సేకరించి మోసాలకు తెరలేపారు. తాను ఏసీబీ ఇన్స్పెక్టర్ని, హెడ్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్ చేసి మాటలు కలుపుతారు. మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు. సెటిల్ చేసుకుంటే ఓకే.. లేదంటే రైడ్ జరుగుతుందని భయపెడతారు. కావాలంటే తమ డీఎస్పీతో మాట్లాడాలంటూ బెదిరిస్తారు. బెదిరిపోయే ఉద్యోగుల నుంచి గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రూ.లక్షల్లో నగదు వసూలు చేస్తున్నారు. ఈ తరహా నేరాలు తరచూ జరుగుతున్నా బాధిత అధికారులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడం వెనుక వివిధ కారణాలున్నాయి. దీనిని అలుసుగా తీసుకున్న సదరు నకిలీలు పెద్ద సంఖ్యలో అధికారులను బెదిరించి మరీ నగదు వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. గతంలోనూ ఇదే తరహా నేరాలు గతేడాది డిసెంబర్లో పోలీసుశాఖలో ఏఎస్సైగా పనిచేస్తూ నగరంలో నివాసం ఉంటున్న ఓ అధికారికి నకిలీ ఏసీబీ అధికారి ఫోన్ చేశాడు. మీరు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు అందాయని, రైడ్ చేయకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బెదిరిపోయిన సదరు ఏఎస్సై వెంటనే సదరు నకిలీ అధికారికి అడిగినంత ముట్టజెప్పారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు అప్పట్లో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో గుర్తుతెలియని వ్యక్తి తాను ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌నంటూ గత నెల 31వ తేదీన నగరంలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈఓ వెంకటశ్రీనివాసులురెడ్డికి ఫోన్ చేశాడు. మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, రూ.1.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే రైడ్ చేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ఈఓ ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు కాల్ చేసిన వ్యక్తి ఫోన్‌నంబర్ ఏసీబీలో పనిచేస్తున్న వ్యక్తిదా.. కాదా.. అని ఆరా తీశారు. ఆ నంబర్ తమది కాదని ఏసీబీ అధికారులు స్పష్టంగా వెల్లడించడంతో ఈ ఘటనపై బాధితుడు ఈ నెల 2వ తేదీ రాత్రి దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ గ్యాంగ్ పనేనా..? రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా నేరాల్లో దిట్ట అనంతపురం జిల్లాకు చెందిన మోస్ట్‌వాంటెడ్ జయకృష్ణ గ్యాంగ్. జయకృష్ణ, అతని స్నేహితులు గ్యాంగ్ సినిమాతో ప్రభావితమై అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ ఏసీబీ అధికారుల అవతారమెత్తారు. దొడ్డిదారిన ప్రీపెయిడ్ సిమ్‌కార్డులు సంపాదించి, వాటిని వినియోగించి మోసాలకు పాల్పడుతున్నారు. 2019 నుంచి రాష్ట్రంలోని కర్నూలు, పులివెందుల, అనంతపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ వివిధ శాఖల అధికారులకు ఫోన్ చేసి ఏసీబీ అధికారులమంటూ బెదిరించి నగదు వసూళ్లకు పాల్పడ్డారు. పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు సైతం వెళ్లారు. అయినా వారి తీరులో మార్పు రాకపోగా.. తిరిగి యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. నిందితులు నకిలీ సిమ్‌కార్డులతో అధికారులకు ఫోన్లు చేస్తూ లొకేషన్ తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. తాజా ఘటన సైతం సదరు గ్యాంగ్ పనై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలో కొన్ని ఘటనలు ఏసీబీ అధికారినంటూ 2020లో ఆర్టీఓ కార్యాలయంలో పనిచేసిన ఓ ఉద్యోగికి ఫోన్‌కాల్ వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నావని ఫిర్యాదులు అందాయని, తాను అడిగినంత డబ్బు ఇస్తే రైడ్లు ఉండవని చెప్పడంతో బెంబేలెత్తిన సదరు ఉద్యోగి రూ.లక్షల్లో ముట్టజెప్పాడు. రిజిస్ట్రేషన్ శాఖలో గతంలో ఓ ఉద్యోగికి సైతం ఇదే తరహాలో ఫోన్‌కాల్ వచ్చింది. ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని, మీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదులు అందాయని, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే నగదు ఇవ్వాలని బెదిరించి రూ.లక్షలు కాజేశారు. తాజాగా నగరంలోని ఓ దేవస్థానం ఈఓకు ఫోన్‌కాల్ వచ్చింది. మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సెటిల్ చేసుకుంటే సరే.. లేదంటే రైడ్ జరుగుతుందని బెదిరించారు. రూ.1.50 లక్షలు డిమాండ్ చేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్లో సంభాషణ ఇలా.. నకిలీ ఏసీబీ అధికారి : హలో ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. ఉద్యోగి : నమస్తే సార్ చెప్పండి నకిలీ ఏసీబీ అధికారి : మీపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే మా సిబ్బంది మీకు సంబంధించి చాలా సమాచారం సేకరించారు. మీరు మంచి వ్యక్తి అని పలువురు చెప్పారు. మీపై కేసు పెట్టాలా.. వద్దా.. అనే ఆలోచనలో ఉన్నాం. ఉద్యోగి : సార్ నేను చాలా మంచి వాడిని. ఎవరో గిట్టని వాళ్లు నాపై ఫిర్యాదులు చేశారు. నకిలీ ఏసీబీ అధికారి : కానీ మా ఎంకై ్వరీ రిపోర్టు అలా లేదు కదా? మనం ఒక ఒప్పందానికి వస్తే కేసులు. రైడ్లు లేకుండా చూస్తాను. ఏమంటారు? ఉద్యోగి : ఓకే సార్ మీరు అడిగినంత ఇస్తాను. ఇంతటితో ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి. ఇలా నకిలీ ఏసీబీ అధికారులు ఆర్టీఓ, రిజిస్ట్రేషన్స్, రెవెన్యూ, పోలీసు తదితర శాఖల ఉద్యోగులను బెదిరించి రూ.లక్షలు దోచేస్తున్నారు. అయితే ఈ మోసాలపై ఫిర్యాదులు చేసేందుకు బాధితుల్లో ఒకరిద్దరు మినహా ముందుకు రాకపోవడం వెనుక పరువుపోతుందన్న భయమే కారణంగా తెలుస్తోంది. ఇది మోసగాళ్లకు కలిసి వస్తోంది. దీంతో వారు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. -
ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు
హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఇద్దరు రెవెన్యూ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం..మండల పరిధిలోని అంజంపూర ప్రాంతానికి చెందిన దూదువాయి వెంకటేశ్వరరావు తన తండ్రి మరణించడంతో ఉన్న ఆస్తిని తన తల్లి పేరుపై మార్చేందుకు అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సర్వేయర్ లలితను సంప్రదించారు. దీనిని ఆమె ఇదే కార్యాలయంలో పనిచేసే స్పెషల్ ఆర్ఐ శోభ దృష్టికి తీసుకువెళ్లింది. వీరిద్దరు కలిసి స్థలానికి మొత్తం ఖరీదు రూ.60 నుంచి 80 లక్షల వరకు ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈ స్థలంపై ఎలాంటి చిక్కులు లేవని పైఅధికారులకు రిపోర్టు పంపించేందుకు కనీసం రూ.20 లక్షలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ డ్రైవర్ ఏం.బాపుయాదవ్‌ను రంగంలోకి దింపారు. బాపుయాదవ్ మధ్యవర్తిగా వ్యవహరించి వెంకటేశ్వరరావుతో రూ.10 లక్షలు ఇస్తే పని అవుతుందని చెప్పారు. దీంతో వెంకటేశ్వరరావు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారులు రంగు పూసిన రూ.1.50 లక్షలను వెంకటేశ్వరరావుకు అందించి బాపుయాదవ్కు ఇవ్వాల్సిందిగా సూచించారు. వారి ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ టీ కొట్టులోకి బాపుయాదవ్‌ను పిలిచి రూ.1.50 లక్షలు అందించారు. వెంటనే మఫ్టీలో ఉన్నా ఏసీబీ అధికారులు బాపుయాదవ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చేతులు కడుగగా రంగు మారాయి. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా సర్వేయర్ లలిత, స్పెషల్ ఆర్ఐ శోభ ఆదేశాల మేరకు తీసుకున్నట్లు వెల్లడించారు. అక్కడే ఉన్న సర్వేయర్ లలిత , శోభ, బాపుయాదవ్లను అరెస్ట్ చేశారు. ఈ దాడులను ఏసీబీ జేడీ సుధేందర్ పర్యవేక్షించారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రఘునందన్, రాజేష్‌లు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. -
ఏసీబీ అధికారులకు చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
విజయనగరం క్రైమ్/మక్కువ: ఎట్టకేలకు ట్రాన్స్‌కో ఏఈ పోలాకి శాంతారావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. నాలుగు రోజులపాటు పరారీలో ఉన్న ఏఈను విశాఖపట్నంలోని సీఎంఆర్ సెంట్రల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. విద్యుత్ కనెక్షన్ మంజురుకు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ములక్కాయవలసకు చెందిన రైతు డి.ఈశ్వరరావు నుంచి ఏఈ రూ.60వేలు డిమాండ్ చేయగా రూ. 20వేలు చెల్లించాడు. ఆగస్టు 27న సాయంత్రం మిగిలిన బ్యాలెన్స్ రూ.40వేలు కారులో ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈపై దాడి చేశారు. ఆ సమయంలో అధికారులను గుర్తించిన ఏఈ.. తన కారును వేగంగా పొలాల్లోకి నడిపాడు. ఆయనను వెంబడించిన సీఐను ఢీకొట్టి గాయాలపాలుచేశాడు. పొలాల్లోనే కారును విడిచిపెట్టి పరారయ్యాడు. ఆయన కారును ఏసీబి అధికారులు సీజ్ చేసి, మక్కువ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఏఈ కదలికలపై నిఘా పెట్టి పట్టుకున్నారు. ఏఈ సమక్షంలోనే విజయనగరంలో ఆయన ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం సోదాలు జరిపారు. 350 గ్రాముల బంగారం, సుమారు రెండు కిలోల వెండి, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అద్దె ఇంటిలోనూ సోదాలు మక్కువ ఎస్సీకాలనీ సమీపంలో ఏఈ నివసిస్తున్న అద్దె ఇంటిలో ఏసీబీ సీఐ శ్రీనివాసరావు, తన సిబ్బందితో సోదాలు జరిపారు. ఏఈ కుటంబసభ్యుల సమక్షంలో వివిధ పత్రాలను పరిశీలించారు. విలువైన డాక్యుమెంట్లు ఏమైనా దొరికాయా? లేదా? అన్న విషయాన్ని ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. -
ACB Raids: నగేష్ మామూలోడు కాదు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఏసీబీ.. అవినీతి అధికారుల భరతం పడుతోంది. 14400 కాల్‌సెంటర్, ఏసీబీ యాప్‌లకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేసి, అవినీతి జలగలను కటకటాల వెనక్కి పంపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావుకు సంబంధించిన ఆస్తులపై మంగళవారం సాయంత్రం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసింది. బుధవారం కూడా ఈ సోదాలు కొనసాగాయి. అలాగే దుర్గగుడి సూపరింటెండెంట్ వాసా నగేష్‌పై వచ్చిన ఆరోపణలపైనా ఏసీబీ అధికారులు బుధవారం ఇంద్రకీలాద్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పెద్ద చేపే.. పటమట సబ్ రిజిస్ట్రార్ అజ్జా రాఘవరావు ఆస్తులపై తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు రాఘవరావుతో పాటు మరో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి పటమట కార్యాలయం, ఆయన ఇల్లు, బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు, తదితర ప్రాంతాల్లో మొత్తం ఆరుచోట్ల జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమాస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు, నగదు, వాహనాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్‌కు డబ్బులు కలెక్టు చేస్తున్న ముగ్గురు కీలక ప్రైవేటు వ్యక్తులు అదుపులోకి తీసుకొని ఎవరెవరి నుంచి డబ్బులు కలెక్ట్ చేశారో ఆరా తీస్తున్నారు. తాజాగా ఇటీవల రెండు భవనాల కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షల అడ్వాన్స్ ఇచ్చినట్లు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగు నుంచి ఐదుకోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు కనుగొన్నారు. మార్కెట్ విలువ ఆధారంగా వీటి విలువ రూ.10కోట్ల నుంచి రూ.15కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా కొన్ని లాకర్స్‌ను ఓపెన్ చేయాల్సి ఉన్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో 2018లో అవనిగడ్డ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన సోదాలకు సంబంధించి శాఖాపరమైన చర్య ఇంకా పెండింగ్‌లో ఉంది. నగేష్ మామూలోడు కాదు.. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం సూపరింటెండెంట్ వాసా నగేష్ ఆస్తుల పైనా సోదాలు కొనసాగుతున్నాయి. కుమ్మరిపాలెంలోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నంబర్ ఎఫ్–34లోని నివాసం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో 6 చోట్ల, దుర్గ గుడిలోని ఏఓ కార్యాలయంతో పాటు ఏఓ బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇంకా పలు చోట్ల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారుల సోదాల్లో రూ.5కోట్ల నుంచి రూ.7కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. ఇంద్రకీలాద్రిపై కలకలం.. దుర్గగుడి సూపరిండెంటెంట్ వాసా నగేష్‌పై బుధవారం అవినీతి నిరోధక శాఖ సోదాలు చేయడంతో ఇంద్రకీలాద్రిపై కలకలం రేగింది. నగేష్ తన వ్యక్తిగత పనులపై బుధ, గురువారాలు సెలవుపై వెళ్లారు. అయితే ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిసిన వెంటనే కొంత మంది నాల్గో అంతస్తులోని కార్యాలయానికి వెళ్లి ఆరా తీసేందుకు ప్రయత్నించగా నగేష్ అందుబాటులోకి రాలేదు. గతంలో పాలకవర్గ సమావేశంలో సైతం ఈయన అవినీతిపై ఈవోను పలువురు ప్రశ్నించారు. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అయితే నగేష్‌పై ఆరోపణలు చేసిన వారు సాక్ష్యాలు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఈవో భ్రమరాంబ ఆ సమావేశంలో దాట వేశారు. పాలక మండలి ఫిర్యాదును సైతం ఈవో బుట్టదాఖలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈయనపైన చర్య తీసుకోకపోడటానికి ప్రధాన కారణం ఈయనే షాడో ఈవోగా వ్యవహరిస్తూ, అన్నీ చక్కబెడుతుండటమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక బాధ్యతలు ఆయనకే.. ద్వారకాతిరుమల నుంచి ఇంద్రకీలాద్రికి బదిలీపై వచ్చిన నగేష్‌కు ఈవో భ్రమరాంబ ఆలయంలోని పలు విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. దేవస్థానంలో కీలకమైన అంతరాలయ పర్యవేక్షణతో పాటు ప్రసాదాల కౌంటర్లు, టోల్గేట్లు నిర్వహణ బాధ్యతలు నగేష్ చూస్తారు. అంతే కాకుండా ఆలయం సిబ్బంది పొరపాటున ఏదైనా తప్పు చేసినట్లు గుర్తిస్తే దానికి నగేష్నే విచారణ అధికారిగా నియమించడం సర్వసాధారణమైంది. నకిలీ టికెట్ల వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే నగేష్ మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నప్పటీకీ ఈవో వెనకేసుకురావడంతో అది తప్పింది. ఇప్పుడు ఏసీబీ తనిఖీలతో ఆలయ ప్రతిష్ట మసకబారే పరిస్థితి ఏర్పడిందని పలు భక్తులు ఆరోపిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ ఉద్యోగి
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): నవళగుంద పంచాయతీ ఉద్యోగి తలాటి ప్రదీప్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వివరాలు... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూలిన ఇళ్లకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ పరిధిలోని ఓ బాధితుడు పరిహారం కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ ఉద్యోగి ప్రదీప్ రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు నగదు అందజేస్తున్న సమయంలో ఏసీబీ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు
సాక్షి, కూకట్పల్లి(హైదరాబాద్): కూకట్పల్లి సర్కిల్ పరిధిలో గురువారం ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ఉద్యోగులు పట్టు బడ్డారు. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో రెవెన్యూ డిపార్టుమెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న చాంద్ పాషా ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన నాగరాజుకు సంబంధించిన మ్యుటేషన్ చేయకుండా గత రెండు నెలలుగా జాప్యం చేస్తున్నాడు. ఇటీవల డబ్బులు డిమాండ్ చేయగా గురువారం రూ.8 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చాంద్ పాషా పనిచేసే కార్యాలయంతో పాటు ఇంటి వద్ద కూడా దాడులు నిర్వహించిన అధికారులకు రూ. లక్షల్లో నగదు దొరికినట్లు తెలిపారు. మరో కేసులో.. ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన నాగరాజు ట్రేడ్ లైసెన్స్ పేరు మార్పిడి విషయంలోనూ శానిటేషన్ విభాగానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ షణ్ముఖ్ డబ్బులు డిమాండ్ చేయగా గురువారం రూ. 2,500 తీసుకుంటూ పట్టు బడ్డాడు. గత కొద్ది రోజులుగా నాగరాజు జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా షణ్ముఖ్ పేరు మార్పిడి విషయంలో నాగరాజును ఇబ్బంది పెట్టి డబ్బులు డిమాండ్ చేయటంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ దాడుల్లో డీఎస్పీలు ఫయాజ్, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు రేణుక, రాజు పాల్గొన్నారు. చదవండి: Bike Accident: అత్తాపూర్‌లో రోడ్డు ప్రమాదం -
వ్యవసాయాధికారి బాగోతం.. ముడుపుల కోసం ఏకంగా వాట్సాప్ గ్రూప్..
సాక్షి, చండ్రుగొండ (ఖమ్మం): షాపుల్లో తనిఖీచేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన మండల వ్యవసాయాధికారి(ఏఓ) వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. చండ్రు గొండలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపుల్లో తనిఖీచేయకుండా ఉండేందుకు ఏఓ ఎన్ఎంసీ.చటర్జీ ప్రతీ షాపు నుంచి రూ.15 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రతి నెల లంచం కోసం ఒక వాట్సప్ గ్రూప్‌నే ఏర్పాటు చేశాడు. దీంతో డీలర్లు గోదా సత్యం,ఎర్రం సీతారాములు, చెవుల చందర్రావు, నన్నక వెంకటరామయ్య, ముఖేష్, మచ్చా కుమార్ గతనెల 30వ తేదీన ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన అధికారులు వాస్తవవమేనని నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల సూచన మేరకు డీలర్లు గోదా సత్యం, ఎర్రం సీతారాములు మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో ఏఓ చటర్జీకి రూ.90 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకు న్నారు. కాగా, ఏఓ చటర్జీ స్థానికంగా తనకు తెలిసిన వ్యక్తితో పురుగు మందులు, విత్తనాల షాపు పెట్టించి రైతులందరినీ అదే షాపులో కొనాలని సూచిస్తన్నాడనే ఆరోపణలున్నాయి. ఏఓ నివాసంలో సోదాలు చండ్రుగొండ ఏఓ చటర్జీ స్వగ్రామమైన అశ్వారావుపేటలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఖమ్మం ఏసీబీ ఇ¯న్స్పెక్టర్ రఘుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి పలు డాక్యుమెంట్లు, బంగారు అభరణాలు సీజ్ చేశారు. -
చినవెంకన్న గుడిలో ఏసీబీ తనిఖీలు
సాక్షి, ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆలయంలోని పలు విభాగాల్లో జరుగుతున్న అవకతవకలపై అందిన ఫిర్యాదులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలూరు ఏసీబీ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ దాడులను జరిపారు. ఏకకాలంలో డీఎస్పీతో సహా ఇద్దరు సీఐలు రవీంద్ర, శ్రీనివాసరావు, మరో 9 మంది ఏసీబీ సిబ్బంది, అలాగే వివిధ శాఖలకు చెందిన మరో పది మంది (సహాయకులు) ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వీరంతా ఏడు బృందాలుగా విడిపోయి ఒకే సమయంలో అన్ని విభాగాల్లోనూ సోదాలను చేపట్టారు. ప్రధానంగా ప్రసాదాల తయారీ కేంద్రం (అంబరుఖానా), సెంట్రల్ స్టోర్, టోల్‌ప్లాజా, అలాగే ప్రసాదాలు, టికెట్ విక్రయాల కౌంటర్లు, అన్నదానం, ఇంజినీరింగ్, లీజియస్ ఇలా అన్ని పరిపాలనా విభాగాల్లోనూ తనిఖీలను నిర్వహించారు. అలాగే స్వామి దర్శనార్థం ఆలయంలోకి వెళ్లే భక్తుల టికెట్లను పరిశీలించారు. ప్రసాదాల తయారీలో దిట్టంను సరిగ్గా అనుసరిస్తున్నారా? లేక ఏవైనా అవకతవకలకు పాల్పడుతున్నారా? అన్నదానిపై స్వయంగా ప్రసాదాలను తూకం వేసి తనిఖీ చేశారు. సెంట్రల్ స్టోర్‌లో నిల్వ ఉన్న స్టాకును, సంబంధిత రికార్డులను పరిశీలించారు. స్టోర్‌లో ఉండాల్సిన వాటికంటే ఏమైనా సరుకులు ఎక్కువ, తక్కువలు ఉన్నాయా అన్న కోణంలోనూ సోదాలు జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా ఈ తనిఖీలు జరిగాయి. గుర్తించిన అవకతవకలకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గుర్తించిన అవకతవకలు ప్రభుత్వ ఉత్తర్వులు, జీఓలను తుంగలోకి తొక్కి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరును రికార్డుల ద్వారా ఏసీబీ అధికారులు గుర్తించారు. కొండపైన, దిగువన దేవస్థానం షాపుల అద్దెల వసూలు విషయంలో సంబంధిత ఆలయ అధికారులు నిబంధనలను కాలరాసినట్లు గుర్తించారు. దుకాణదారుల నుంచి ముందే వసూలు చేయాల్సిన ఏడాది లీజు సొమ్మును నెలసరి వాయిదాల పద్ధతిలో కట్టించుకుంటూ, షాపుల యజమానులతో కుమ్మక్కై శ్రీవారి ఆదాయానికి అధికారులు గండి కొడుతున్నట్లు తెలుసుకున్నారు. భక్తుల తలనీలాల కాంట్రాక్టరుకు వెసులుబాటు కల్పిస్తూ పాట మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తూ.. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టడానికి కారణమవుతున్నట్లు గుర్తించారు. అంబరుఖానాలో ఇటీవల మాయమైన 11 వందల కేజీల నెయ్యి కుంభకోణంపై ఆలయ అధికారులు పోలీసు కేసు పెట్టకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ప్రసాదాల తయారీని టెండర్ పద్ధతిన కాకుండా, ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడాన్ని గుర్తించారు. దేవస్థానంలో ఉపయోగిస్తున్న వాహనాల ఇంధన వినియోగం, అద్దెకు తీసుకున్న ప్రైవేటు వాహనాలకు అధికంగా చెల్లింపులు జరుపుతున్నట్టు గుర్తించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువ అద్దెకు షాపును పొందిన వ్యక్తి, మరో వ్యక్తికి ఆ షాపును అధిక లీజుకు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి గతంలో ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) సొమ్ము విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇటీవల బదిలీ అయిన ఆలయ ఈఓ ఇంకా దేవస్థానం గెస్ట్ హౌస్‌ను, సెక్యురిటీ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలనూ ఆరా తీశారు. -
ఈఎస్ఐ స్కామ్‌లో ఆచితూచి అడుగులు
సాక్షి, అమరావతి: ఈఎస్ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసే దిశగా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడితోపాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఏసీబీ అచ్చెన్నాయుడు సహా 9 మందిని అరెస్ట్ చేసింది. టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కాల్ సెంటర్, ఈసీజీ సేవల్లో జరిగిన దోపిడీపై ఒక కేసు.. మందులు, పరికరాలు, వైద్య సామగ్రి కొనుగోలులో చోటుచేసుకున్న అక్రమాలపై మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారాలతో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ల నుంచి ఆశాజనక సమాచారం ► కుంభకోణం వెనుక చీకటి కోణాలను గుర్తించిన ఏసీబీ కీలక విషయాలను రాబట్టేందుకు అచ్చెన్నను 3 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది. ► విచారణకు అచ్చెన్నను సహకరించకుండా దాటవేత ధోరణి అవలంబించినట్టు సమాచారం. ఇదే సమయంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లతోపాటు పలువుర్ని 2 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన ఏసీబీకి ఆశాజనకమైన సమాచారం వచ్చినట్టు తెలిసింది. ► ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఏంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్‌లను ఏసీబీ లోతుగా ఆరా తీసినట్టు సమాచారం. ► కుంభకోణంలో తమ పాత్రను నర్మగర్భంగా అంగీకరించిన మాజీ డైరెక్టర్లు, కొందరు ఉద్యోగులు.. ఇదంతా అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో చేశామనే విషయాన్ని గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. ► వారిచ్చిన కీలక సమాచారం అచ్చెన్నతోపాటు మిగిలిన వారికీ బలంగా చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ► స్కామ్‌లో ఎవరి పాత్ర ఉంది? ఎవరి వాటా ఎంత? అనే కోణాల్లో కొంత క్లారిటీకి వచ్చిన ఏసీబీ మరింత ముందుకు సాగేందుకు నిర్ణయించింది. ► ఇప్పటికే ఏసీబీ సేకరించిన సమాచారం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక, కస్టడీలో నిందితులు ఇచ్చిన వివరాలను క్రోఢీకరించుకుని కార్యాచరణ చేపట్టనుంది. ► నిందితులందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వారినుంచి మరింత కీలక సమాచారం రాబట్టి ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న మిగిలిన వారి ఆట కట్టించేందుకు ఏసీబీ స్కెచ్ వేసింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ► టెలీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రమోద్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ బృందాలు హైదరాబాద్, కోదాడ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. ► ఏపీ సచివాలయంలో టీడీపీ హయాంలో చేతివాటం ప్రదర్శించిన ఓ ఉద్యోగి గురించి ఏసీబీ ఆరా తీస్తోంది. ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసి విచారిస్తే మరికొందరి కీలక వ్యక్తుల బాగోతం బయటకు వస్తుందంటున్నారు. -
విజయవాడ : అక్రమ కట్టడాలపై ఏసీబీ కొరడా
సాక్షి, విజయవాడ : విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని అక్రమ కట్టడాలను ఏసీబీ అధికారులు బిల్డింగ్ ఇన్స్పెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్రమ కట్టడాలకు సంబంధించి అనధికార అనుమతులపై లోతుగా విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు వెల్లడించారు. నిబంధనలకు విరుధ్దంగా నిర్మించిన భవననాల యజమానులపై చర్యలకు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అనిశా టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశించనున్నట్లు ఏసీబీ పేర్కొంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ డ్యూటీనీ సక్రమంగా నిర్వహించకపోవడంతోనే ఈ అక్రమ కట్టడాలు వెలిశాయని పేర్కొన్నారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
ఏపీ: ఏసీబీ మెరుపు దాడులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులపై మెరుపు దాడులు నిర్వహించింది. ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో ఏక కాలంలో 25 ఏసీబీ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. పక్కా వ్యూహంతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు నగదు, నగలు బయటపడ్డాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మోహన్‌రావు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గంధం వెంకట పల్లంరాజు, తూర్పు గోదావరి జిల్లా సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (కాకినాడ) లంకె రఘుబాబు, విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామ పీఏసీఎస్ స్టాఫ్ అసిస్టెంట్ సీరంరెడ్డి గోవిందు, కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్ (పీఏ టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్) సాకే సత్యం ఇళ్లతోపాటు వారి బంధువులు, బినామీలకు చెందిన ఇళ్లల్లో ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ ఐదుగురుకి చెందిన ఆస్తులు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.11 కోట్లు పైబడి ఉంటాయని, బయట మార్కెట్లో ఇంకా ఎక్కువగా ఉంటాయని ఏసీబీ డీజీ తెలిపారు. వారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. భారీగా ఆస్తులు, బంగారం, నగదు గుర్తింపు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (కాకినాడ) సీఈవో లంకె రఘుబాబు ఇంటిపైన, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గంధం వెంకట పల్లంరాజు ఉంటున్న లాడ్జిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాకినాడలో పల్లంరాజుకు సంబంధించిన ఆదాయ వివరాలు ఏమీ లభించకపోవడంతో ఆయనను విశాఖపట్నం తీసుకెళ్లారు. కాగా లంకె రఘుబాబు నివాసంలోని సోదాల్లో దాదాపు రూ.15 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. రఘుబాబు ఇంటితోపాటు విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరంలోని ప్రాంతాల్లో ఉంటున్న ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏక కాలంలో ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. భారీగా ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ పీఏ ఆస్తుల విలువ రూ.5 కోట్లు విశాఖ జిల్లా మాకవరపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీరంరెడ్డి గోవిందు ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఆయనకు ఆదాయానికి మించి 1.75 కోట్ల అక్రమాస్తులున్నట్టు గుర్తించారు. శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ సాకే సత్యం ఇంటితోపాటు ఆయన తమ్ముడు నారాయణస్వామి ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు, అనంతపురంలో నిర్వహించిన సోదాల్లో పలు ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలతోపాటు బంగారు నగలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.5 కోట్లకుపైగానే ఉంటుందని నిర్ధారించారు. గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ) పార్వతీపురంలో ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తూతిక మోహనరావుకు సంబంధించి శ్రీకాకుళం, పార్వతీపురంలో ఉన్న ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. స్థిరాస్తులు, బంగారం, వెండి, గృహోపకరణాలు, గృహాలంకరణ, నగదు అంతా కలిపి మార్కెట్ విలువ ప్రకారం మొత్తం రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు నిర్ధారించారు. -
ప్రతి పనికి ఒక రేటు
సాక్షి, గుంటూరు : ఫైలుపై ఆయన సంతకం చేయాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే... లేదంటే ఎప్పటికి క్లియర్ అవుతుందో ఎవరూ చెప్పలేరు.. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి తాను అనుకున్నంత మామూలు ఇస్తేనే పని చేస్తారు... ఆయన రూటే సెపరేటు .. ఆయన ఎవరోకాదు.. ఆంధప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయ అధికారి (డీసీహెచ్)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చుండూరు ప్రసన్నకుమార్. తన పరిధిలోని ఆస్పత్రుల డైట్ కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు మంజూరు చేసేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. తన కింద పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి ద్వారా డబ్బులు తీసుకుంటూ పట్టుబడటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశగా మారింది. దీంతో ఆయన మామూళ్ల గురించి పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బిల్లుకు ముడుపులు ఇవ్వాల్సిందే ! వైద్య ఉద్యోగులు తమకు రావాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లు, పీఆర్సీ బిల్లు, ఎర్న్‌లీవ్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా.. ఏ బిల్లుపైనా అయినా సంతకం చేయకుండా ఉద్యోగుల అకౌంట్స్‌లో డబ్బులు జమవ్వవు. పలుమార్లు ఉద్యోగులకు సంతకాలు పెట్టకుండా కుంటిసాకులతో ఫైల్స్‌ను వెనక్కి పంపిస్తారని, డబ్బులు ఇస్తే వెంటనే సంతకం పెడతారని వైద్య సిబ్బంది అంటున్నారు. సదరు బిల్లులపై సంతకం పెట్టేందుకు కార్యాలయ ఉద్యోగుల ద్వారా డాక్టర్ ప్రసన్నకుమార్ డబ్బులు భారీగా తీసుకుంటారని వైద్య ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల బిల్లులే కాకుండా మందుల కాంట్రాక్టర్, డైట్ కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు కూడా ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏడాదికి కావాల్సిన బడ్జెట్‌ను ఎక్కువ మొత్తంలో తెప్పించి వాటిని అడ్డదారిలో తానే దిగమింగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రాచేశారనే ఆరోపణలు ఆడిట్ జరిగిన సమయంలో వచ్చాయి. బినామీ పేరుతో మందుల వ్యాపారం జిల్లాలోని పలు ఆస్పత్రులకు మందులు, సర్జికల్ వస్తువులు తన మందుల షాపు నుంచే కొనుగోలు చేయిస్తున్నారని డాక్టర్ ప్రసన్నకుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. చీరాలలోని మందుల షాపును బినామీ పేర్లతో తానే నిర్వహిస్తున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దంత వైద్యానికి సంబంధించిన వైద్య పరికరాలు, చికిత్స మెటీరియల్ కొనుగోలుకు భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు లక్షల్లో వసూలు తన అధికార పరిధిలోని ఆస్పత్రుల్లో పలు కాంట్రాక్ట్ వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల నియామకాలకు లక్షల్లో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనతోపాటు పనిచేస్తున్న వైద్యుల పిల్లలకు సైతం డబ్బులు ఇస్తేనే ఉద్యోగం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ చీరాల ఆస్పత్రిని తనిఖీ చేసి డాక్టర్ ప్రసన్నకుమార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి బదిలీ చేశారు. అయితే, తనకున్న పలుకుబడితో గుంటూరు కోఆర్డినేటర్‌గా 12–8–2017న పోస్టింగ్ వేయించుకున్నారు. ఇక్కడ అందిన కాడికి దండుకుంటూ కూడబెట్టుకుంటూ వైద్యుల్ని, వైద్య సిబ్బందిని ముప్పతిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెగ్యులర్ అధికారికాక పోయినా ఫుల్ అడిషనల్ చార్జి( ఎఫ్ఏసీ) హోదాలో రెండేళ్లపాటు పలు అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడినట్లు వైద్య సిబ్బంది చర్చించుకుంటున్నారు. సాక్షాత్తూ జిల్లాస్థాయి అధికారినే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునే సరికి బుధవారం కార్యాలయ ఉద్యోగుల్లో అధికశాతం మంది తమ ఫోన్లు ఆఫ్ చేసుకుని విధులకు డుమ్మా కొట్టడం చర్చాంశనీయంగా మారింది. ఏసీబీ దాడులతో తెనాలిలో కలకలంతెనాలి గుంటూరులో జరిగిన ఏసీబీ దాడులు తెనాలిలో కలకలం సృష్టించాయి. తెనాలికి సంబంధించిన జిల్లాస్థాయి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా, అతన్ని పట్టించిందీ ఇక్కడకు చెందిన కాంట్రాక్టరు కావడంతో చర్చనీయాంశమైంది. ఒకే కాంట్రాక్టర్ ఇప్పటికి ముగ్గురు వైద్యుల్ని ఏసీబీకి పట్టించడం విశేషం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులో పని చేస్తున్న డాక్టర్ సీహెచ్. ప్రసన్నకుమార్ డెప్యుటేషన్‌పై వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయాధికారిగా వ్యవహరిస్తున్నారు. తెనాలి వైద్యశాల డైట్ కాంట్రాక్టరు తాడిబోయిన శ్రీనివాసరావుకు రావాల్సిన రూ. 20 లక్షల బిల్లులకు సంబంధించి రూ. లక్ష లంచం తీసుకోగా, ఏసీబీ అధికారులు గుంటూరులో రెడ్ హ్యాండెడ్‌గా బుధవారం పట్టుకున్నారన్న వార్త ఇక్కడి వైద్యశాలతో పాటు పట్టణంలో చర్చనీయాంశమైంది. ముగ్గురు వైద్యాధికారులను పట్టించిన కాంట్రాక్టర్ సుమారు దశాబ్దానికి పైగా శ్రీనివాసరావు తెనాలి జిల్లా వైద్యశాల డైట్ కాంట్రాక్టరుగా పని చేస్తున్నారు. రోగులకు అందించే ఆహారానికి సంబంధించి అధికారులు తయారు చేసే అంచనాల్లో అతి తక్కువ ధరలు ఉండడంతో, దీనిపై ఇతర కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపరు. దీంతో శ్రీనివాసరావు కాంట్రాక్టును రెన్యువల్ చేయించుకుంటూ వస్తున్నారు. రోగుల ఆహారానికి సంబంధించి బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు వేధిస్తే ఏసీబీని ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ముగ్గురు వైద్యాధికారులను ఏసీబీకి పట్టించారు. 2014లో అప్పటి తెనాలి జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. రవీంద్రకుమార్ తన కాంట్రాక్టు రెన్యువల్ చేసే విషయంలో లంచం అడిగారంటూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించారు. అంతకు కొన్నేళ్ల క్రితం అప్పటి వైద్యశాల ఆర్ఎంవో డాక్టర్ గంగాధర్నూ ఏసీబీకి పట్టించారు. తాజాగా డాక్టర్ ప్రసన్నకుమార్ లంచం తీసుకుని దొరికారు. -
ఏసీబీ వలలో ‘ఎక్సైజ్’ చేపలు!
నిజామాబాద్‌అర్బన్: లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. కల్లు బట్టి నుంచి శాంపిల్స్ సేకరించి, డబ్బులు డిమాండ్ చేసిన ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ ఇన్స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ స్రవంతిలను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ ప్రసన్నరాణి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలంలోని గూపన్పల్లిలో పులి రాజాగౌడ్ కల్లుబట్టి నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ స్రవంతి కల్లు బట్టిపై దాడి చేసి, శాంపిల్స్ సేకరించారు. తదుపరి చర్యలు చేపట్టకుండా ఉండేందుకు గాను అధికారులు రాజాగౌడ్ నుంచి రూ.40 వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో రాజాగౌడ్ రూ.30 వేలు ఇస్తానని అంగీకరించాడు. ఆ తర్వాత అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం, సీఐ కార్యాలయాలను తనిఖీ చేశారు. మధ్యాహ్యం 2 నుంచి రాత్రి 9.30 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కల్లు బట్టీ నిర్వాహకులను, ఎక్సైజ్ శాఖ అధికారులను విచారించారు. శాంపిల్స్ సేకరించిన తర్వాత పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారా.. లేదా అన్న దానిపై విచారణ జరిపారు. శాంపిల్స్ సేకరించి తమ వద్దే ఉంచుకున్నట్లు వెల్లడైందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ సంబంధించి గతంలో జరిగిన తనిఖీలు, వివిధ విషయాలపై విచారణ అనంతరం లంచం డిమాండ్ నేరం కింద టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ఇన్స్పెక్టర్ స్రవంతిలను అరెస్టు చేశారు. -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కలకలం
కాజీపేట అర్బన్: భూక్రయవిక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతూ మూడో ఖజానాగా పేరుగాంచిన రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు గాను ఏసీబీ సోదాలు ప్రారంభించింది.æ ఈ మేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. కాజీపేట నిట్ ఏరియాలోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు పర్యవేక్షించి, రోజువారి చేపడుతున్న దస్తావేజుల వివరాలను ఆరా తీశారు. స్లాట్ బుకింగ్‌తో పాటు సామాన్య రిజిస్ట్రేషన్లను, వీఎల్టీ ఆధారంగా చేపట్టాల్సిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ల వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలతో తీవ్ర కలకలం రేగింది. కార్యాలయ సిబ్బందితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ రైటర్లపై నజర్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు, భూకొనుగోలుదారుడు స్వయంగా దస్తావేజులను తయారు చేసుకునేందుకు పబ్లిక్ డేటా ఎంట్రీకి శ్రీకారం చుట్టింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థకు స్వస్తి పలికారు. కాగా, డాక్యుమెంట్ రైటర్లు చెప్పిందే ‘రైట్’ అంటూ పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్లుగా ఉద్యోగ విరమణ పొందిన కొందరు డాక్యుమెంట్ రైటర్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లకు తెరలేపుతున్నారు. ఏకంగా రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్లుగా మారుతున్నారంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వారి హవా తెలుసకోవచ్చు. వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూత వేటు దూరంలోని డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలను ఏసీబీ అధికారులు పర్యవేక్షించి రోజువారీ వివరాలపై కూపీ లాగినట్లు సమాచారం. -
కార్పొరేషన్లో అవినీతి కంపు
కర్నూలు (టౌన్): నగర పాలక సంస్థ అధికారులు అవినీతిలో కూరుకుపోయారు. పైసలివ్వందే పనులు చేయడం లేదు. దీంతో ఒక్కొక్కరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడుతున్నారు. ఏడాది వ్యవధిలోనే నలుగురు అధికారులు జైలు పాలయ్యారు. తాజాగా బుధవారం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. మూడునెలల క్రితం నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ప్రశాంతి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అన్ని విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పాలనను గాడిలో పెడుతున్న సమయంలోనే పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం ఏసీబీకి చిక్కడంతో కార్పొరేషన్ పరువు కాస్తా గంగలో కలిసినట్లయ్యింది. ఏడాది వ్యవధిలో నలుగురు నగర పాలక సంస్థలో వివిధ విభాగాలకు చెందిన నలుగురు ఉద్యోగులు లంచం తీసుకుంటూ జైలుపాలయ్యారు. 2018 జనవరి 27న ఇంజినీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాలసుబ్రమణ్యం కంట్రాక్టర్‌కు బిల్లు చేసేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అలాగే ఏప్రిల్ 14న ఇంటికి కుళాయి కనెక్షన్‌కు సంబంధించి రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ విభాగానికి చెందిన బిల్‌కలెక్టర్ సుధాకర్ పట్టుబడ్డారు. ఆ తరువాత ఇదే విభాగంలో మరొక బిల్ కలెక్టర్ షరీఫ్ డిసెంబర్ 13న పన్నులో పేరు మార్పిడికి సంబంధించి రూ.5 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. తాజాగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఐఏఎస్ పాలనలోనూ అదే దందా! నగర పాలక సంస్థ కమిషనర్‌గా పి.ప్రశాంతి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరంతర తనిఖీలు, సమీక్షలు చేయడంతో పాలనలో కొంత మార్పు కనిపించింది. చెత్త సేకరణలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి. కార్పొరేషన్ బాగుపడుతోందని అనుకుంటున్న తరుణంలో మరో అధికారి పట్టుబడటం గమనార్హం. దీన్నిబట్టి ఐఏఎస్ అధికారి పాలనలోనూ అదే దందా కొనసాగుతోందన్న విమర్శలకు తావిచ్చినట్లు అయ్యింది. నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం అన్ని విభాగాల్లో కీలకమైనది. ఇళ్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు..వీటన్నింటి అనుమతి వ్యవహారాలు ఈ విభాగంలో చూస్తుంటారు. దీంతో ఇక్కడ అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది. బిల్డింగ్లు ప్లానింగ్‌కు విరుద్ధంగా నిర్మించినా, అనుమతి లేకుండా కట్టినా, నాన్లేఔట్లలో నిర్మాణాలు చేపట్టినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏసీబీకి చిక్కిన ఏసీపీ – శాస్త్రి షభ్నం తీరే సప‘రేటు’ కర్నూలు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ)గా పనిచేస్తున్న శాస్త్రి షభ్నం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు బుధవారం పట్టుబడ్డారు. నగరంలోని బళ్లారి చౌరస్తాకు చెందిన పవన్‌కుమార్ మోదీ 2015, 2017 సంవత్సరాల్లో రెండు స్థలాలు కోనుగోలు చేశాడు. ఈ స్థలాల్లో నిర్మాణాల కోసం పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నంను కలిశారు. రెండు మూడు సార్లు కలిసినా పని కాలేదు. ప్లాన్ అప్రూవల్ కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విసుగు చెందిన బాధితుడు ఈ నెల 19న అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిసి... లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం నగర పాలక పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీపీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో సోదా చేయగా.. రూ.8.20 లక్షల నగదు, 200 గ్రాముల బంగారు నగలు, బ్యాంకు పాస్‌బుక్కులు, విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. పట్టుబడిన ఏసీపీని గురువారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. కాగా.. శాస్త్రి షభ్నం 1999 నుంచి 2001 వరకు పట్టణ ప్రణాళిక విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆ తరువాత టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ (కర్నూలు నగరపాలక సంస్థ)గా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా (గుంతకల్లు, నందికొట్కూరు) పనిచేశారు. ఆ తరువాత పదోన్నతిపై అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా కర్నూలు నగరపాలక సంస్థలో 2014 నుంచి పనిచేస్తున్నారు. -
ఫారెస్టు కార్యాలయంపై ఏసీబీ దాడులు
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ ఉత్తర మండలం ఫారెస్టు రేంజ్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ రమణకుమార్ నలుగురు సిబ్బందితో కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేసే సమయంలో ఫారెస్టు అధికారి కార్యాలయంలో రూ. 94 వేలు పట్టుబడినట్లు సమాచారం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల కిందట నెలవారీ మూమూళ్ల కోసం ఫారెస్టు అధికారులు వేధింపులు చేపట్టడంతో బాధితుడు ఒకరు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్కడి నుండి ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చినట్లు సమాచారం. రేంజ్ పరిధిలో మొత్తం సామిల్లులు ఎన్ని ఉన్నాయి. వాటి నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ డీఎస్పీ ప్రసన్నరాణితో పాటు సిబ్బంది ఉన్నారు. విచారణ పూర్తయిన తరువాతే వివరాలు వెల్లడిస్తామని డిప్యూటీ డైరెక్టర్ చెప్పారు. అక్రమ కలప వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌కు గురికాగా, దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ దాడులు జరగడం కలకలరేగింది. అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. -
అక్రమాస్తులు @ రూ.100కోట్లు!
విజయవాడ/సీతమ్మధార (విశాఖ): ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు.. రాష్ట్ర పర్యాటక శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్.శివరావు, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావు ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో శివరావుకు రూ.80 కోట్లు, శంకరరావుకు రూ.20 కోట్ల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ సెంట్రల్ టీమ్‌కు చెందిన 25మంది అధికారులు డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయంలో ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివరావు ఇంటితో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో మొత్తం 6చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శివరావు భార్య, అత్త, బావమరిది, బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. వారి పేరు మీద దాదాపు రూ.80కోట్ల విలువ చేసే భూములు, స్థలాలు, ఇళ్లకు చెందిన డాక్యుమెంట్లు, చెక్కులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరంలో బందరు రోడ్డు పక్కనే ఉన్న టిక్కిల్ రోడ్డులో శ్వేత టవర్స్‌లో నివాసం ఉంటున్న శివరావు ఇంట్లో 793 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు, చెక్కులు డాక్యుమెంట్లు సోదాల్లో దొరికాయి. సోదాల్లో మొత్తం 14 ఇంటి ఫ్లాట్లు, 2 ఫ్లాట్లు 2ఇళ్లు, 0.96సెంట్ల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తమ సమీప బంధువులైన అన్నపూర్ణమ్మ, సుబ్బారావు, శ్రీనివాసరావు పేర్లతో 4 స్థలాలు కంకిపాడు, కంచికచర్లలో కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్న మొత్తం శివరావు అక్రమాస్తులు బహిరంగ మార్కెట్లో సుమారు రూ.80 కోట్లు ఉండవచ్చని ఏసీబీ అధికారులు చెప్పారు. కాగా విచారణ గురువారం కూడా కొనసాగుతుందని తెలిపారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని డీఎస్పీ రమాదేవి చెప్పారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావు ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, నర్సీపట్నం, మధురవాడ, బొబ్బిలి, పలాస, టెక్కలి, భీమిలిలో సోదాలు నిర్వహించారు. రామకృష్ణ ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ సోదాల్లో విశాఖపట్నం ఎంవీపీకాలనీ, సెక్టార్–4లో 207 గజాల స్థలంలో ఇల్లు, మధురవాడ వాంబేకాలనీలో 267 గజాల్లో మూడు ఆంతస్తుల భవనం, భీమిలి, సంగివలస, నేరెళ్ల వలసలో 60 సెంట్ల భూమి ఉన్నట్లు గుర్తించారు. చిట్టివలస స్టేట్‌బ్యాంకు, భీమిలి స్టేట్‌బ్యాంకులో రూ.5 లక్షలు, బొబ్బిలి కరూర్ వైశ్యా బ్యాంకులో రూ.2లక్షల 50 వేలు విలువ గల బంగారం తనఖాలో ఉన్నట్లు గుర్తించారు. కొన్ని స్థలాలు బినామీల పేరుతో ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 కోట్ల పైన ఉంటుంది. శంకరావును అరెస్టు చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. -
మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు?
-
ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ–1 నిందితుడైన రేవంత్‌రెడ్డిని మంగళవారం 8 గంటలపాటు విచారించి ప్రశ్నలవర్షం కురిపించింది. ఉదయం 11.30కు ఈడీ కార్యాలయానికి హాజరైన రేవంత్‌ను రాత్రి 7.30 దాకా విచారించింది. ఈ వ్యవహారంలో హవాలా జరిగిందా అనే విషయాలపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారులు, ఉదయసింహాను విచారించిన ఈడీ.. వారి సమాచారం ఆధారంగా రేవంత్ కోసం ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్లు తెలిసింది. రేవంత్ చెప్పే సమాధానాలను సరిపోల్చుకునేందుకు ఐటీతోపాటు గతంలో ఈ కేసును విచారించిన ఏసీబీ అధికారులు విచారణకు హాజరయ్యారు. వారూ రేవంత్‌ను డబ్బు విషయంపై ప్రశ్నలు అడిగారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడ నుంచి సేకరించారు? ఎవరిచ్చారు? ఆ డబ్బు హవాలా డబ్బా? లేక స్థానికంగా ఎవరైనా సర్దుబాటు చేశారా? అనే విషయాలపైనే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు? ఒకవేళ ఆ డబ్బు ముందుగానే సిద్ధం చేసి ఉంటే.. దాన్ని ఎవరి వద్ద ఉంచారు? అంత డబ్బు ఇచ్చేందుకు ఒకరే సహకరించారా? ఒకరికన్నా ఎక్కువమంది సహకరించారా? అనే విషయాలపై రేవంత్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. తెలియదు.. గుర్తులేదు.. ఈ కేసులో చాలా విషయాలకు రేవంత్ సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. చాలా ప్రశ్నలకు తనకు గుర్తులేదని, తెలియదని, మిగిలిన విషయాలు తన లాయర్ మాటాడతారని సమాధానమిచ్చారని తెలిసింది. రేవంత్‌కు సహకరించేందుకు పలువురు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆయన వెంట వచ్చారు. ఇదంతా కక్ష సాధింపే: విచారణ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా. రేపు కూడా రమ్మన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో ఐటీని పంపారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈడీని ప్రయోగిస్తున్నారు. ఇది వరకే ఏసీబీ విచారణ పూర్తి చేసిన కేసుపై ఈడీ విచారణ ఎందుకు? నాపై పోటీ చేసిన నరేందర్‌రెడ్డి వద్ద రూ. 51 లక్షలు దొరికినా ఈడీ, సీబీఐకి ఎందుకు ఇవ్వడంలేదు.’అని రేవంత్ ఆరోపించారు. కాగా బుధవారం మరోసారి విచారణకు రావాలని రేవంత్‌ను అధికారులు ఆదేశించారు. -
దూకుడు పెంచిన ఏసీబీ
వరంగల్ క్రైం: ప్రభుత్వం వేల రూపాయల వేతనాలు పెంచినా.. కొంత మంది అధికారుల వక్ర బుద్ధి మారడం లేదు. ప్రజలను లంచం పేరుతో జలగల్లా పీక్కుతుంటున్నారు. పైసలు ఇవ్వందే ఫైళ్లు కదలటం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అవినీతి అధికారుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఉచితంగా..స్వచ్ఛందంగా చేయాల్సిన పనులకు పర్సంటేజీలు కట్టి వాటిని వసూల్ చేసేందుకు నిబంధనలున అడ్డుగా పెట్టి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూన్నారు. పచ్చ నోట్లు చేతుల్లో పెడితే ఫైళ్లకు రెక్కలు వస్తున్నాయి. కాసుల కక్కుర్తికి నిబంధనలకు నీళ్లు ఒదులుతున్నారు. ప్రతినిత్యం అందిన కాడికి దోచేద్దాం అనే ఆలోచనలో కొంత మంది అధికారులు కార్యాలయాలకు వస్తున్నారు. ఇలాంటి దృష్యాలు ప్రతీ సర్కారు ఆఫీసుల్లో దర్శనం ఇస్తున్నాయి. అక్రమ సంపాదన కోసం ప్రజలను పీక్కుతుంటున్న అవినీతి అధికారుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ ఇటీవల దూకుడు పెంచింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు కాదు...రాకెట్లు పరుగిడుతున్నాయి. ఏసీబీ వల్ల కొంత మంది అధికారులైన స్వచ్ఛందంగా పనులు చేయటానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల ఏసీబీ పెంచిన దూకుడుకు అవినీతి చేపలు ఒక్కొక్కటిగా వలలో చిక్కుతున్నాయి. గత ఏడాది జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అ«ధికారులు 12 కేసులు నమోదు చేయగా ఈ సంవత్సరం ఒక నెలల్లోనే మూడు కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించారు. గత ఏడాది 12 కేసులు నమోదు.. 2018 సంవత్సరంలో ఏసీబీ అధికారులు అక్రమాస్తులు, లంచం పుచ్చుకున్న అధికారులపై 12 కేసులు నమోదు చేశారు. మునిసిపాలిటీ డీఈ పాటి కొండల్రావు ఆదాయంకు మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. మహబుబాబాద్ టౌన్ సబ్ఇన్స్పెక్టర్ ముత్తె కమలాకర్ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఎస్ఏ ఈఈ రవీందర్రావు కాంట్రాక్టర్ నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుని పట్టుబడ్డాడు. నర్సంపేట నగరపంచాయతీ ఆర్ఐ మెరుగు మురళి రూ.10 వేలు లంచం తీసుకోని ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. భూపాల్పల్లి ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పిండి శ్రీనివాస్ రూ.50 వేలు లంచం తీసుకుని పట్టుబడ్డాడు. జనగామ జిల్లా చిల్పూరుగుట్ట దేవస్థానం ఈవో చెరుకు జయశంకర్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. హన్మకొండ ఆర్అండ్బీ ఏఈ వంగరి కోటేశ్వర్రావు కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. చిట్యాల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే డిప్యూటీ తహశీల్దార్ కిరణ్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మహబుబాబాద్ జిల్లా, కురవి మండలం బలుపాల వీఆర్ఓ గౌసియాబేగం రూ.8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయింది. జనగామ ఫైర్ అధికారి ఆర్.సత్యనారాయణ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. భీందేవరపల్లి మండలం వంగర వీఆర్ఓ గుమ్మడి రమేష్ రూ.5 వేలు, ఇరిగేషన్ కార్యాలయంలో పనిచేసే డీఈ వి.రఘుపతి, ఏఈ గాడిపల్లి గౌరిలక్ష్మీలు రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక్క నెలలో మూడు కేసులు.. ఈ సంవత్సరం జనవరి నెలలోనే ముగ్గురు అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అవినీతి అధికారులపై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై స్పందిస్తున్న అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజలను పీడీస్తున్న అధికారులకు ఏసీబీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. మహబుబాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వి. వీరేశంను రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ములుగు ఇరిగేషన్ కార్యాలయం టెక్నికల్ అధికారి ఎం.ఆశలు రూ.20 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. తెలంగాణ రాష్త్ర ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయం సూపరింటెండెంట్ పల్లకొండ యాదగిరి రూ.64,500 లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదులు చేస్తే స్పందిస్తాం ప్రభుత్వ అధికారులు పనుల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, లంచం డిమాండ్ చేసిన అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తే స్పందిస్తాం. ఫిర్యాదులపై విచారణ చేసి దాడులు నిర్వహిస్తాం. ఫిర్యాదు దారులు వాస్తవ విషయాలను మాత్రమే చెప్పాలి. వ్యక్తిగత కక్షలతో ఫిర్యాదు చేయరాదు. ఇక్కడ ప్రతి ఫిర్యాదుపై లోతైన విచారణ ఉంటుంది. అవినీతి అధికారులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఏ అధికారైన లంచం కోసం డిమాండ్ చేస్తే నేరుగా 1064,104 టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలి. దీంతో పాటు 9440446146 నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతీ ఫిర్యాదును గోప్యంగా ఉంచుతాం. యువకులు, స్వచ్ఛంద సంస్థలు అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నవారి వివరాలు అందజేసిన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. –కె.భద్రయ్య, వరంగల్ ఏసీబీ డీఎస్పీ -
సంక్షేమంలో అవినీతి సామ్రాట్
నెల్లూరు(అర్బన్): దళిత వర్గాల అభ్యున్నతికి పాటు పడేందుకు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ (సోషల్ వెల్ఫేర్) జిల్లాలో అవినీతికి అడ్డాగా మారింది. ఫైళ్ల క్లియరెన్స్ పేరిట భారీగా వసూళ్లు, బ్యాంక్‌ల ఖాతాల్లో నగదు తారుమారు, గురుకుల పాఠశాలల పేరుతో పెద్ద ఎత్తున నిధులు గోల్మాల్ చేయడం వంటివి పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన డీడీ మధుసూదన్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. దీంతో సాంఘిక సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి కంపు మరోసారి గుప్పుమంది. జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డీడీగా మధుసూదన్‌రావు 2015 డిసెంబర్లోబాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 81 వరకు సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహ అధికారుల నుంచి ప్రతి నెలా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆయనకు ముడుపులు ఇచ్చుకునేందుకు వసతి గృహ అధికారులు విద్యార్థుల మెనూకు కోత వేసి తమ అధికారిని సంతృప్తి పరిచేవారనే ఆరోపణలు లేకపోలేదు. వసూళ్లకు శ్రీకారం ఆ శాఖకు చెందిన బ్యాక్లాగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తున్నారని నమ్మించి పలువురు నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాల్లో వసూళ్లు చేశారనే ప్రచారం జరుగుతోంది. నాయుడు పేటలో దళిత వర్గాల కోసం స్ఫూర్తి గురుకుల పాఠశాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇక్కడ కళాశాల ప్రారంభించక ముందే ప్రారంభించినట్టు చూపి రూ.కోటి వరకు నిధులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 17 బ్యాంక్‌ల్లో రూ. 86.90 లక్షలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇందులో ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయానికి రూ.42 లక్షలకే లెక్కలు చూపుతున్నట్టు సమాచారం. డీడీ కార్యాలయ కోటరీపైన ఏసీబీ దృష్టి మధుసూదనరావుకు డిప్యూటీ డైరెక్టర్ కార్యాయలంలో కొందరు ఉద్యోగులు అన్ని తామై చూసుకునే వారు. నెలవారీ మామూళ్లు మొదలుకుని అన్ని అంశాలు వీరే చక్కబెట్టేవారు. గతంలో ఎన్ని బదిలీలు జరిగినా పైరవీలు, కోర్టులకు వెళ్లి మరీ బదిలీలు నిలుపుదల చేయించుకున్నారు. తాజాగా మధుసూదనరావు నివాసంలో ఏసీబీ సోదాల నేపథ్యంలో కొందరు కార్యాలయ సిబ్బందిలో తీవ్ర అలజడి మొదలైంది. ముఖ్యంగా 8 మంది ఉద్యోగులు అన్ని తామై చక్రం తిప్పారని సమాచారంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు వారిపై దృష్టి సారించినట్లు సమాచారం. బదిలీ జరిగినా వారాల తరబడి ఇక్కడే అక్టోబర్ 12వ తేదీన సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా మధుసూదన్‌రావు తూర్పుగోదావరి జిల్లాకు డీడీగా బదిలీ అయ్యారు. అయితే ఆయన రెండు వారాలకు పైగా జిల్లా నుంచి రిలీవ్ కాలేదు. తన బదిలీని నిలుపుదల చేయించుకునేందుకు పైస్థాయిలోనే పైరవీలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రిలీవ్ కాకుండానే కార్యాలయానికి వచ్చి ప్రమోషన్ల, ఇన్చార్జీ, బదిలీలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ పేరిట పెద్దఎత్తున అక్రమ వసూళ్లకు తెర లేపారని సమాచారం. అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్ వంటి మహానేతల జయంతులను ప్రభుత్వం రాష్ట్ర పండగలుగా గుర్తించి నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ వారి ఉత్సవాల పేరిట వసతిగృహ అధికారుల నుంచి నిధులు వసూలు చేసి ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని దిగమింగారనే వార్తలు గుప్పుమన్నాయి. భారీగా ఆస్తులు గుర్తింపు ఏసీబీ అధికారులు దాడి చేసి మధుసూదనరావుకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన నివాసంలో బహిరంగ మార్కెట్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. ఒక కిలో బంగారం నగలు, ఒకటిన్నర కిలోల వెండి, రూ.లక్ష వరకు నగదు దొరికింది. ఇవి కాక వివిధ బ్యాంక్ ఖాతాలు.. అందులో ఉన్న నగదు, చెక్కులకు సంబంధించి మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. డీడీ ఉద్యోగ ప్రస్థానాలు దాసరి మధుసూదనరావు నెల్లూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తూ ఈ ఏడాది అక్టోబర్ 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. అదే నెల 29వ తేదీన ఆయన నెల్లూరు నుంచి బదిలీ అయ్యారు. ఇంత వరకూ తూర్పుగోదావరి జిల్లాలో బాధ్యతలు స్వీకరించలేదు. గుంటూరు జిల్లాకు చెందిన మధుసూదనరావు 2004 జూలై 20వ తేదీన చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి (సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్)గా విధుల్లో చేరారు. కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పని చేశారు. 2010 ఏప్రిల్ 6వ తేదీన డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. డీడీగా వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాలో పని చేసి 2015 డిసెంబర్లో నెల్లూరు సోషల్ వెల్ఫేర్ డీడీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్ల పాటు జిల్లాలో పని చేసి ఇటీవల బదిలీ అయ్యారు. -
ఏసీబీ వలలో సర్వేయర్
సాక్షి, అలంపూర్: లంచం తీసుకుంటుండగా సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం ఉండవల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు... మండలంలోని కంచుపాడుకు చెందిన పెద్ద వెంకట్‌రెడ్డి, చిన్న వెంకట్ రెడ్డి, సత్యారెడ్డి అన్నదమ్ములు. వారికి 7.12 ఎకరాల పొలం ఉంది. ఆస్తి పంపకాల్లో పెద్ద వెంకట్ రెడ్డికి 2.18 ఎకరాలు, చిన్న వెంకట్ రెడ్డికి 2.17 ఎకరాలు, సత్యారెడ్డికి 2.17 ఎకరాలు ఆస్తి సంక్రమించింది. తనçపొలానికి హద్దులు ఏర్పాటు చేయాలని సత్యారెడ్డి రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్ సూచన మేరకు గతనెల 18న మీసేవ ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేశాడు. ఈవిషయాన్ని సర్వేయర్ హరికృష్ణకు తెలిపాడు. దీంతో అక్టోబర్ 2న హరికృష్ణ సర్వే పనులు పూర్తి చేశాడు. రిపోర్టు ఇవ్వలేదు. కొన్నిరోజులు తిప్పుకుని రూ.7వేలు ఖర్చవుతుందని చెప్పాడు. సత్యారెడ్డి అభ్యర్థన మేరకు రూ.5వేలకు రిపోర్టు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇదే విషయమై సత్యారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే సర్వేయర్ ముందుగా లంచం డబ్బులు కర్నూలులోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా సూచించాడు. చివరకు కార్యాలయం వద్దకే తేవాలని చెప్పాడు. చివరికి సర్వేయర్ సూచన మేరకు ఆయన కారులో డబ్బును ఉంచాడు. ఏసీబీ అధికారులు కారును సోదా చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్ హరికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో కర్నూలోని ఆయన నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇన్స్పెక్టర్లు లింగస్వామి, కమల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
చిట్యాల(భూపాలపల్లి): ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో రెండేళ్లలో తహసీల్దార్ పాల్‌సింగ్, వీఆర్వో రవీందర్ ఏసీబీ అధికారులకు పట్టుపడగా, శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ రామగిరి కిరణ్‌కుమార్ రూ.5వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ కథనం ప్రకారం... చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన రేషన్ డీలర్ ముకిరాల శ్యామలకు పభుత్వం నుంచి రూ.40 వేల కమీషన్ విడుదలైంది. శ్యామలను అత్తగారింటి వద్ద విజయలక్ష్మి అని పిలుస్తుంటారు. ఈమేరకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు విజయలక్ష్మి పేరుమీదే ఉన్నాయి. ఆమె పేర కమీషన్ డబ్బు మంజూరు కాగా కుమారుడు మధువంశీకృష్ణ 45 రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్‌ను సంప్రదించి శ్యామలగా ధ్రువీకరించి చెక్కు ఇవ్వాలని కోరాడు. ఇందుకు డీటీ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. తమ వద్ద డబ్బులు లేవని వేడుకున్నా వినలేదు. దీంతో రూ.5వేలు ఇస్తానని చెప్పి గత నెల 28న ఏసీబీ కార్యాలయంలో సంప్రదించాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి డీటీ కిరణ్‌కుమార్‌పై ఈనెల 1 నుంచి 4 వరకు నిఘా పెట్టారు. శుక్రవారం ఆఫీస్‌లో మధువంశీకృష్ణ నుంచి డీటీ రూ.5వేల నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రికార్డులు సోదా చేశారు. డీటీని అరెస్ట్ చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నారు. ఏసీబీ సీఐలు సతీష్‌కుమార్, క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. డీటీపై అవినీతి ఆరోపణలు చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో 2014లో డిప్యూటీ తహసీల్దార్‌గా కిరణ్‌కుమార్ విధుల్లో చేరాడు. రెండేళ్లుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిల్లా అధికారులు పలుమార్లు హెచ్చరించారు. 2016లో తహసీల్దార్ శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడగా సహచర ఉద్యోగులు, అధికారులు చందాలుగా ఇచ్చిన రూ.3లక్షల డబ్బులను డీటీ దగ్గర పెట్టుకోవడంతో స్థానిక అధికారులు గొడవ పడి మృతుడి కుటుంబ సభ్యులకు ఇప్పించారు. డీలర్లు కొందరు తమను వేధిస్తున్నాడని డీటీపై ఫిర్యాదు చేశారు. ఇటీవల మంగపేట తహసీల్దార్‌గా వెళ్లాలని జిల్లా అధికారులు ఆదేశించినా పోలేదని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఇష్టారాజ్యాంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కడ పరిపాటిగా మారింది. 2013లో అప్పటి తహసీల్దార్ లింగాల సూరి బాబు రైతు వద్ద రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2016 సెప్టెంబర్ 19న తహసీల్దార్ పాల్‌సింగ్, వీఆర్వో రవీందర్ రైతు వద్ద రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డీటీగా కిరణ్‌కుమార్ శుక్రవారం రూ.5వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అయినా సహచర అధికారుల్లో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. -
ఏసీబీ పంజా!
ఊట్కూర్ (మక్తల్): మండల తహసీల్దార్ కార్యాలయ చరిత్రలో మొదటిసారిగా ఏసీబీ అధికారులు పంజా విసిరారు. పట్టా మార్పిడికి లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన శుక్రవారం కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన కొండారెడ్డి పేరుపై పెద్దజట్రం శివారులో 13 ఎకరాల భూమి ఉంది. ఆయనకు కుమారుడు చెన్నారెడ్డి, కూతురు శ్రీదేవి ఉన్నారు. అయితే కూతురు వివాహ సమయంలో 6 ఎకరాల భూమిని ఆమె పేరుపైన మార్పిడి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై భాగ పరిష్కారంలో బాగంగా తన అక్క శ్రీదేవి పేరుపైన 6 ఎకరాల భూమిని పేరు మార్పు చేయాలని కోరుతూ చెన్నారెడ్డి గత రెండు నెలల క్రితం ఆర్ఐ సతీష్‌కుమార్‌రెడ్డికి దరఖాస్తు చేశాడు. ఆయన పేరు మార్పిడి చేయడానికి కుదరదని, పట్టాదారు బతికి ఉన్నందున సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దానపత్రం కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. అయితే చెన్నారెడ్డి మళ్లీ ఆర్ఐని కలిసి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డబ్బులు అధికంగా అవుతాయని ఇక్కడే పేరు మార్చి ఇవ్వాలని కోరడంతో రూ.10 వేలు లంచం ఇస్తే మారుస్తానని ఒప్పందం కుదిరింది. ఈ విషయమై చెన్నారెడ్డి గత నెల 16 తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించడాడు. వారి ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న టీకొట్టు దగ్గర చెన్నారెడ్డి ఆర్ఐ సతీష్‌కుమార్‌రెడ్డికి రూ.10 వేల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్ఐని శనివారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు. ఆర్ఐ ఇంట్లో సోదాలు ఊట్కూరులో ఆర్ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు మరోవైపు నర్వ మండలం కు మార్‌లింగంపల్లిలోని ఆర్ఐ సతీష్‌కుమార్‌రెడ్డి ఇం ట్లోనూ ఏసీబీ సీఐలు వెంకట్, రఘుబాబు ఏకకాల ంలో సోదాలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేర కు ఆర్ఐపై ఏసీబీ యాక్ట్ 7ఎ, 7బీ సెక్షన్ల కింద కేసు లు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. దాడు ల్లో సీఐ లింగస్వామి, కమల్‌కుమార్ పాల్గొన్నారు. మొదటిసారి దాడులు ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయంపై మొదటి సారి ఏసీబీ దాడులు జరిగినట్లు తహసీల్దార్ తిరుపతయ్య తెలిపారు. కిందిస్థాయి అధికారులు డబ్బు లు అడుగుతున్నట్లు ఇప్పటి వరకు తనకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఏసీబీ దాడులు జరిగా యని తెలియడంతో స్థానికులు అధిక సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. లంచం అడిగితే సమాచారమివ్వండి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వివిధ పనుల నిమిత్తం లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాయాల్లో అవినీతిని అరికట్టేందుకు టోల్‌ఫ్రీ నం.1064 ఏర్పాటు చేశామన్నారు. బాధితులు సెల్ నం.94913 05609కు గాని లేకపోతే మహబూబ్‌నగర్‌లోని ఏసీబీ కార్యాలయంలో గాని నేరుగా సంప్రదించవచ్చన్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. -
ఏసీబీకి చిక్కిన బీమా అధికారి
ఖమ్మంక్రైం: బీమా శాఖలో పనిచేస్తున్న ఓ అవినీతి చేప సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఉద్యోగ విరమణ పొందిన వారిని లక్ష్యంగా పెట్టుకొని ఏళ్లతరబడి వారి వద్ద లంచాలు తింటున్న ఉన్నతాధికారి బండారం ఎట్టకేలకు బట్టబయలు అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నగరానికి చెందిన కొండపర్తి బుచ్చయ్య ఎస్ఐగా పనిచేసి మే నెలలో ఉద్యోగ విరమణ పొందాడు. అతనికి రాపర్తినగర్‌లోని ఎల్ఐసీ కార్యాలయం నుంచి రూ.1,89,238లు రావలసివుంది. వీటి కోసం ఆయన గత నెల 18 నుంచి బీమా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కార్యాలయంలో ఉన్నతాధికారి ఏడీ మోహన్‌రావును కలువగా తనకు ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తే బీమా సొమ్మును రిలీజ్చేస్తామని తెలిపాడు. తాను పోలీస్ అధికారిని అని కూడా చెప్పాడు. ఇక్కడ ఎవరైనా ఒకటే.. లంచం ఇస్తేనే పని అవుతుందని మోహన్‌రావు తేల్చిచెప్పాడు. ఆయనకు ముట్ట చెబితేనే .. ఏసీబీకి పట్టుబడ్డ మోహన్‌రావు గతంలో నిజామాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల్లో పనిచేసాడు. తన కార్యాలయానికి బీమా డబ్బు కోసం వచ్చే ఉద్యోగ విరమణ పొందిన వారికి రావలసిన సొమ్ము చెల్లించాలంటే ఈ అధికారికి లంచం ఇవ్వాల్సిందే. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా ఈ అధికారికి లంచం ముట్టజెప్పితేనే, లేదంటే చెప్పులు అరిగిపోవాల్సిందే. కార్యాలయం చుట్టూ తిరగలేక చివరకు ఏడీ మోహన్‌రావు అడిగిన లంచం చెల్లిస్తూ ఉంటారు. ఇలా చిక్కిన అవినీతి చేప.. ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐ బుచ్చయ్యను పదేపదే లంచం అడుగుతుండగా చివరకు విసిగిపోయిన ఆయన ఏసీబీ సిబ్బందిని ఆశ్రయించాడు. దీంతో మోహన్‌రావును అరెస్ట్ చేయడానికి సిబ్బంది పథకం వేసారు. ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్ అధ్వర్యంలో రసాయనం పూసిన ఐదువందల రూపాయలు ఎనిమిదివేలను బుచ్చయ్యకు సోమవారం ఇచ్చి పంపారు. బుచ్చయ్య వెళ్లి ఏడీ మోహన్‌రావును కలిసి ఎనిమిది వేల రూపాయలను ఇచ్చాడు. అదే సమయంలో అప్పటికే అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ సిబ్బంది ఒక్కసారిగా దాడి చేసి మోహన్‌రావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనతో కార్యాలయంలో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏసీబీ బృందం వెళ్లేవరకు ఎల్ఐసీ ఉద్యోగులను ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదు. మోహన్‌రావును ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం హాజరుపరుస్తామని డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ దాడిలో ఖమ్మం ఏసీబీ సీఐలు రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్, వరంగల్ ఏసీబీ సీఐలు çవెంకట్, క్రాంతికుమార్ సిబ్బంది చారి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో మత్స్యశాఖ అవినీతి చేప
కరీంనగర్‌క్రైం: ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ డబ్బులు అందించడానికి రూ.10 వేల లంచం తీసుకుంటూ కరీంనగర్ మత్య్స శాఖ కార్యాలయం సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి శివ మంగళవారం ఏసీబీకి చిక్కారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన మత్య్స కార్మికుడు పిల్లి స్వామి 1.25 లక్షలు బ్యాంక్‌లో చెల్లించి సబ్సిడీలో టాటాఏస్ వాహనం కొనుగోలు చేశాడు. తరువాత సబ్సిడీలోన్ కోసం కరీంనగర్ మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 3.75 లక్షల రుణం మంజూరైంది. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు మత్య్సశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ బంది వెంకటేశ్వర్లు రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా వినలేదు. చివరకు రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. మొదట రూ.5వేలు తీసుకున్న వెంకటేశ్వర్లు మళ్లీ రూ. 10వేలు ఇస్తేనే మంజూరైన రుణాన్ని ఇస్తానని తెగేసి చెప్పాడు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన పిల్లి స్వామి ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కరీంనగర్ మానేరు డ్యాం వద్ద ఉన్న మత్య్సశాఖ కార్యాయలంలో మంగళవారం రూ.10వేలు అందించేందుకు వచ్చాడు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి శివ ద్వారా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయం రికార్డులను ఏసీబీ ఆఫీస్‌కు తరలించారు. నిందితులను నేడు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నామని డీఎస్పీ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. -
దోచుకో.. దాచుకో
రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ)లో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది అక్రమ సంపాదనకు బాగా అలవాటుపడిపోయారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి.. కేసులు నమోదు చేస్తున్నా ఏమాత్రం భయపడడం లేదు. ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చినా అవినీతి తగ్గడం లేదు. అక్రమ వసూళ్ల రూపంలో దోచుకుని.. వాటిని దాచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. అనంతపురం సెంట్రల్: రోడ్డు రవాణా శాఖలో అవినీతి అక్రమాలను తగ్గించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఏడెనిమిది రకాల సేవలు తప్ప మిగిలిన 76 రకాల సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. ఇక పారదర్శక పాలన అందుతుందని అందరూ భావించారు. కానీ అది తప్పని నిరూపిస్తున్నారు కొంతమంది సిబ్బంది. తమ వాటా తమకు అందితే తప్ప ఫైల్ ముందుకు పోదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీని వలన పేరుకు ఆన్లైన్ అయినా జరిగేదంతా ఆఫ్లైనేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగని అక్రమాలు.. శాఖలో మార్పులు తీసుకొస్తున్నా.. వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా అక్రమాలు తగ్గడం లేదు. తాజాగా శనివారం తెల్లవారు జామున పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేసి అనధికారికంగా ఉన్న రూ.10వేల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇదే పెనుకొండ చెక్‌పోస్టుపై 2016లో రెండుసార్లు, గతేడాది ఒక సారి దాడులు చేసి అవినీతిని బట్టబయలు చేశారు. గత నెలలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడానే అభియోగంపై గుంతకల్లు ఆర్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవింద్రనాథ్రెడ్డికి సంబంధించి మూడు ప్రాంతాల్లోని ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రూ.30కోట్లకు పైగా విలువజేసే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన మరవకముందే పెనుకొండ ఆర్టీఏ చెక్ఫోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం కలవరపాటుకు గురి చేస్తోంది. బాధ్యులపై చర్యలు నిల్ అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై రోడ్డు రవాణా శాఖలో చర్యలు ఉండడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన వారు మరుసటి రోజు నుంచే యథావిధిగా విధులకు హాజరైన ఘటనలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అవినీతి, అక్రమాలను ఏ స్థాయిలో వెనుకేసుకొస్తున్నారో తెలిసిపోతుంది. పెనుకొండ: అక్రమాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న పెనుకొండ ఆర్టీఓ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు నేతృత్వంలో సీఐలు ప్రతాపరెడ్డి, చక్రవర్తి శనివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ దాడుల్లో ఏసీబీ కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, షేక్షావలి, విరూపాక్ష, హరిబాబు పాల్గొన్నారు. మధ్యవర్తులుగా మున్సిపల్ కార్పొరేషన్ డీఈ నరసింహ, అంజనీకుమార్ వ్యవహరించారు. తనిఖీల్లో లెక్కలు లేని రూ.10,010 నగదును అధికారులు స్వాధీనం చేసుకుని.. డ్యూటీలో ఉన్న ఏఎంవీఐ మధుసూదనరెడ్డితో పాటు హోంగార్డ్ చాంద్‌బాషాపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అక్రమ వసూళ్లకు తెరలేపారిలా.. చెక్‌పోస్ట్‌లో ఇరవై రోజులుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఇక ఏమి చేసినా సాక్ష్యాధారాలు ఉండవని ఇక్కడి సిబ్బంది రెచ్చియపోయారు. బెంగళూరు, అనంతపురం వైపు వెళ్లే లారీల డ్రైవర్లు డబ్బులు – రికార్డులు తీసుకురాగా చెక్‌పోస్ట్ సిబ్బంది నగదును చేతికి తీసుకోకపోవడంతో వారు సమీపంలోని పూలకుండీలో వేసి వెళ్లారు. ప్రతి డ్రైవర్ అదేవిధంగా చేశాడు. ఏసీబీ డీఎస్పీ ఇదంతా నిశితంగా పరిశీలించారు. ఎంవీఐలకు చురకలు చెక్‌పోస్టులో సీసీ కెమెరాలు చెడిపోయి ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.. మరమ్మతు చేయించుకోకుండా మూడు వారాలైనా పట్టించుకోవడం లేదంటే డబ్బు వసూలు కోసమే ఇలా చేశారు కదా అంటూ ఎంవీఐలకు ఏసీబీ అధికారులు చురకలంటించారు. ఓ మహిళా ఎంవీఐ తాను ఐదు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చానని చెప్పగా.. డీఎస్పీ పరిగణనలోకి తీసుకోలేదు. ఏసీబీ అధికారులు వచ్చిన విషయాన్ని పసిగట్టిన ప్రైవేట్ వ్యక్తులు అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలిసింది. -
ఏసీబీ వలలో వీఆర్ఓ
అచ్చంపేట రూరల్ : రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఎక్కడో ఒక దగ్గర ఆ శాఖ అధికారులు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఉప్పునుంతల మండలం ఫిరట్వానిపల్లికి చెందిన వీఆర్ఓ వెంకటయ్య రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అచ్చంపేట ఆర్టీసీ బస్టాండు ఆవరణలోని చెట్ల కింద పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన వెంకటసాయి కిరణ్ ఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామ సమీపంలో ఉన్న గుట్ట సర్వే నంబర్ 61లో గాజు పెంకులు తీసుకోవడానికి 2018 ఆగస్టు 1న మైనింగ్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆగస్టు 3న సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు ఉప్పునుంతల మండల తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డికి సర్వే నంబర్ 61లో పూర్తి వివరాలను సేకరించి దరఖాస్తుదారుడికి కావాల్సిన పత్రాలను ఇవ్వాలని సూచించారు. రూ.30 వేలు డిమాండ్ విచారణ చేసిన అనంతరం తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆగస్టు 14న ఎన్ఓసీ, స్కెచ్ ఇచ్చారు. కాగా ఏ1 సర్టిఫికెట్ మాత్రం వీఆర్ఓ వెంకటయ్య దగ్గర ఉండిపోయింది. విచారణ చేసి ఏ1 సర్టిఫికెట్ ఇవ్వాలని తహసీల్దార్ పదేపదే చెప్పినా వినిపించుకోలేదు. ఏ1 సర్టిఫికెట్ ఇవ్వాలని వెంకటసాయి కిరణ్ వీఆర్ఓ వెంకటయ్యను పదే పదే అడిగినా అలసత్వం చేసి రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకటసాయి కిరణ్ ఈ నెల 25న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు అదే రోజు వెంకటసాయి కిరణ్ వీఆర్‌ఓతో మాట్లాడి రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకారం కుదిర్చాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు అచ్చంపేటలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న చెట్ల కింద వెంకటసాయి కిరణ్ వీఆర్ఓ వెంకటయ్యకు రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్నట్లు వేలిముద్రల ద్వారా నిర్ధారణ అయ్యిందని, పూర్తి విచారణ చేసి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో వీఆర్ఓ వెంకటయ్యను హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. రెవెన్యూ శాఖలో, ఎవరైనా అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని డీఎస్పీ కోరారు. వీఆర్ఓ వెంకటయ్యను వలవేసి పట్టుకున్న ఏసీబీ సిబ్బందిలో ఎస్ఐ లింగస్వామి, కమల్‌కుమార్, అష్రప్, కృష్ణ, రవి, ఆంజనేయులు ఉన్నారు. అప్పుడూ అదే స్థలంలో.. బల్మూర్ మండల కేంద్రంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తించిన వీఆర్ఓ వెంకటయ్య 2014 జనవరి 7న భూమి విరాసత్ విషయంలో రూ.4 వేలు లం చం తీసుకుంటూ పట్టుబడ్డారు. విషయమేమంటే మొదటిసారి కూడా అచ్చంపేట ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న చెట్ల కిందే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. గురువారం కూడా అచ్చంపేటలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఉన్న చెట్ల కిందే రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రస్తుతం వీఆర్ఓ వెంకటయ్య వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
జిమ్మిబాబు అరెస్టుకు రంగం సిద్ధం!
-
జిమ్మిబాబు అరెస్టుకు రంగం సిద్ధం!
* ఏపీలో తలదాచుకున్నట్లు గుర్తించిన ఏసీబీ * ముమ్మరం కానున్న ‘ఓటుకు కోట్లు’ దర్యాప్తు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో దర్యాప్తు తిరిగి ఊపందుకోనుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఏసీబీ.. సాంకేతిక అడ్డంకులు తొలగిపోవడం, కీలకమైన సమాచారం లభించడంతో దర్యాప్తును వేగవంతం చేయనుంది. గత నెల 4న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు నోటీసులు జారీ చేసినా.. తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబు ఇప్పటివరకు ఏసీబీ విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో జిమ్మిబాబు పాత్ర కీలకం కావడంతో ఆయనను పట్టుకోవడానికి ఏసీబీ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. జిమ్మిబాబు ఏపీలోని తన సమీప బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందినట్లు గుర్తించింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ (నిందితుడిగా అనుమానిస్తూ) నోటీసులు జారీ చేసినందున నేరుగా అదుపులోకి తీసుకోవాలని యోచిస్తోంది. త్వరలో ఆయనను అరెస్టు చేసి కేసులోని ‘ఆర్థిక మూలాల’పై ప్రశ్నించే అవకాశం ఉంది. తొలగిన సాంకేతిక సమస్యలు: ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక కీలకంగా మారింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి డబ్బులిస్తుండగా చిత్రీకరించిన దృశ్యాలతో పాటు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఉన్న కాల్ రికార్డులు, డేటా ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. ముఖ్యంగా రెండో నిందితుడు సెబాస్టియన్‌కు చెందిన రెండు ఫోన్లలో కీలక సమాచారం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అందులో ఒక ఫోన్లో రికార్డయిన సెబాస్టియన్, సండ్రల సంభాషణలను న్యాయస్థానానికి అందజేసింది. మరోఫోన్‌లో డిలీట్ చేసిన ఎస్ఎంఎస్లు, వాయిస్ రికార్డులను ప్రత్యేక సాఫ్ట్వేర్ తెప్పించి రికవరీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన దృశ్యాలను, వారి ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లలోని సమాచారాన్ని సైతం ఎఫ్ఎస్ఎల్ పూర్తిగా అధ్యయనం చేసింది. అయితే ఎఫ్ఎస్ఎల్ నుంచి సమాచారాన్ని నేరుగా తీసుకునే వీలు లేనందున న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని.. దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు.