![ACB Taken Serious Action On Illegal Construction In Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/19/ACB-RAIDS.jpg.webp?itok=46dz7s8V)
సాక్షి, విజయవాడ : విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని అక్రమ కట్టడాలను ఏసీబీ అధికారులు బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్రమ కట్టడాలకు సంబంధించి అనధికార అనుమతులపై లోతుగా విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు వెల్లడించారు. నిబంధనలకు విరుధ్దంగా నిర్మించిన భవననాల యజమానులపై చర్యలకు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అనిశా టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశించనున్నట్లు ఏసీబీ పేర్కొంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్‌లు తమ డ్యూటీనీ సక్రమంగా నిర్వహించకపోవడంతోనే ఈ అక్రమ కట్టడాలు వెలిశాయని పేర్కొన్నారు. బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్‌లు, లైన్‌మెన్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment