serious action
-
రైస్ మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం
-
మహిళలకు బస్సు ఆపని డ్రైవర్.. షాకిచ్చిన సీఎం కేజ్రీవాల్
-
ఏపీ: మాల్ ప్రాక్టీసింగ్ టీచర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ఏపీ టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసింగ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మాల్ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన టీచర్లపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. ఈ క్రమంలో 30 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 44 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన టీచర్లపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. -
ప్రభుత్వ ఉద్యోగులూ.. జాగ్రత్త!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీందర్ టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదులొచ్చాయి. రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరపగా నిజమేనని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అవే ఎన్నికల్లో చొప్పదండి మండలం ఆర్నకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులొచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆయన సస్పెండ్ అయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులపై ఇలాగే వేటు పడింది. అందుకే ఉద్యోగులూ.. జాగ్రత్త!. సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికపై దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా వేటుపడటం ఖాయమే. ఎన్నికల నిబంధనల అమలులో ఉన్నతాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా సస్పెన్షన్ వేటు పడనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి. దీంతో ఉద్యోగులు అనుచితంగా వ్యవహరిస్తే వేటు వేయడానికి సిద్ధమైంది. ఉద్యోగులు కేవలం తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి వత్తాసు పలకొద్దని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘాతోపాటు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ పోస్టులపై కూడా ఓ కన్నేశారు. ఎన్నికల్లో నాయకులు ఎలా ప్రచారం చేసుకున్నా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఏర్పడే ప్రభావం కన్నా ప్రభుత్వ ఉద్యోగులు చేసే ప్రచారం, వారి వ్యవహార శైలి మాత్రం పెనుచిక్కులు తేనుంది. సభలు, సమావేశాలు వద్దు ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకొని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొంటే చాలు వేటు పడినట్లే. దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు అధికారులకు అందినా, సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అయినా జరగాల్సిన నష్టం జరుగుతుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలంగానో, వ్యతిరేకంగానో ఉంటూ సందర్భం వచ్చినప్పుడు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడిది పెనుముప్పే. అందుకే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కాకపోవడమే ఉత్తమం. ఇష్టానుసారంగా మాట్లాడటం, పరనింద, ప్రభుత్వ పథకాలపై నిందలు మోపడం వంటి చర్యలకు దిగే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినచర్యలు చేపట్టేందుకు ఎన్నికల సంఘం తన నిబంధనలకు మరింత పదును పెడుతోంది. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తూనే అంగన్వాడీలపై వేటు వేశారు. గతంలో అంగన్వాడీ, ఐకేపీ సిబ్బంది ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫోన్లు చేసి, మద్దతు కోరినా దయచేసి తమను ఎన్నికల్లోకి లాగొద్దని సూచిస్తున్నారు. సెల్ఫోన్లతో కష్టాలు.. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో క్షణాల్లో సమాచారం విశ్వవ్యాప్తమవుతోంది. స్మార్ట్ఫోన్లు లేనివారు లేకపోగా ఉన్నవారు అధునాతన ఫీచర్లను వినియోగిస్తున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగులు సెల్‌ఫోన్ ద్వారా విస్తృతంగా వాడుతున్న ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేసినా చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తొలుత విధుల నుంచి తొలగించాకే మరో ఆలోచన ఉంటుంది. ఉద్యోగులు ఎటువైపు? హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉన్నారన్న చర్చ జోరందుకుంది. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని ప్రతికూలం అంటున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆశించిన ప్రయోజనాలను కల్పించలేకపోయిందన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఉద్యోగుల తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీపీఎస్ విధానంపై ఉద్యోగులు సర్కారుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. పాత పెన్షన్ విధానాన్ని ఎవరు అమలుపరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. చదవండి: సిట్టింగ్‌లకు నో ఛాన్స్.. సుమారు 150 మందికి అవకాశం లేదు ! -
రైతుల ఆందోళన: కేంద్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర తీసుకోచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన దీక్ష ఇప్పటికే పలుసార్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్, హరియాణా,యూపీ సహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటిసులు జారీచేసింది. ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే కమిషన్ ఈ ఆందోళన ప్రభావాన్ని ముదింపు చేయాలని ఆదేశిస్తోందని తెలిపింది. శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే ఆందోళనలు కమిషన్ గౌరవిస్తుందని తెలిపింది. కాగా, పారిశ్రామిక రంగంపై ఆందోళనల ప్రభావాన్ని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ లెక్కించి అక్టోబర్ 10 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అదే విధంగా, కోవిడ్-19 ప్రోటోకాల్ ఉల్లంఘనల ప్రభావాన్ని‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక రూపంలో అందించాలని తెలిపింది. గతంలో ఆందోళన జరిగే ప్రదేశం వద్ద మానవ హక్కుల కార్యకర్త గ్యాంగ్ రేప్‌కు గురైన ఘటనపై ఝజ్జర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతుల ఆందోళనల కారణంగా సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి కల్గిన విఘాతంపై ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ) అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలను జారీచేసింది. చదవండి: సాగు చట్టాలపై దేశవ్యాప్త ఉద్యమం ! చదవండి: కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం.. చదవండి: మళ్లీ రైతు రక్తం చిందింది.. సిగ్గుతో దేశం తలవంచుకుంటోంది: రాహుల్ ఫైర్ -
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..
సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. అక్రమార్కులపై కఠిన చర్యలకు పూనుకుంటోంది. అందులో భాగంగానే బాలాజీ టింబర్ డిపో వివాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎస్పీ రమేష్‌రెడ్డి రంగంలోకి దిగారు. డిపోలోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడిన 12 మందిని అరెస్టు చేసి కేసు నమోదుచేశారు. డిపో వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిపిరి సీఐ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది. భూ కబ్జాలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని ఎస్పీ రమేష్ రెడ్డి, ఆర్డీఓ కనకనరసారెడ్డి హెచ్చరించారు. టింబర్ డిపో విషయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎస్పీ, ఆర్డీఓ దూకుడుగా వ్యవహరించడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. (చదవండి: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన టీడీపీ మాజీ కౌన్సిలర్) టీడీపీ హయాంలోనే భూకబ్జాలు తిరుపతి, చంద్రగిరి, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి పరిధిలోని టీడీపీ నాయకులు, వారి బంధువులు, అనుచరులు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూఆక్రమణకు పాల్పడ్డారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్వర్ణ ముఖి నదీ, పోరంబోకు, మఠం, కాలువ, ఇనాం, ప్రభుత్వ భూములు ఆక్రమించి సొమ్ము చేసుకున్నారు. పద్మావతీపురం వద్ద మాజీ ఎమ్మెల్యే అల్లుడు కుంటపోరంబోకు భూ మిని ఆక్రమించి పెద్ద అపార్ట్మెంట్ నిర్మిస్తున్నట్లు ఆ రో పణలు ఉన్నాయి. శిల్పారామం ఎదురుగా ఉన్న భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆ క్రమించి సొమ్ముచేసుకున్న విషయం తెలిసిందే. మదనపల్లెలో కోట్ల రూపాయల విలువచేసే భూములను కాజేశారు. మాజీ సైనికుల పేర్లతో కొన్ని, వారికి కేటాయించిన భూములు మరికొన్ని ఎకరాలను టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న భూముల్లోనే టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి అనుభవిస్తున్నారు. పీలేరులో ఓ నాయకుడి సహకారంతో అనుచరులు సుమారు 2 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి కోట్ల రూపాయలు కాజేశారు. శ్రీకాళహస్తిలోని అయ్యలనాడు చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది. టీడీపీ హయాంలోనే మాజీ మంత్రి సహకారంతో చెరువు దురాక్రమణ అ య్యింది. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో కూడా కమీషన్లు పుచ్చుకుని భారీగా జేబులు నింపుకున్నారనే విమర్శలున్నాయి. పాడిపేట, వికృతమాల, తనపల్లె సమీపంలో నిర్మించిన గృహ స ముదాయాల్లో ఎక్కువ నివాసాలను తమ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రీ సర్వేతో భూ ఆక్రమణలకు చెక్ తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి రెవెన్యూ డివిజినల్ పరిధిలో భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేందిలేదని, క్రిమినల్ కేసులు న మోదు చేస్తామని ఆర్డీఓ వి.కనకనరసారెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న భూ వివాదాలకు రీ సర్వేతో చెక్ పడ నుందని తెలిపారు. కొన్ని రోజులుగా తిరుపతి రెవెన్యూ డివిజినల్ పరిధిలో భూ ఆక్రమణపై వస్తున్న ఫిర్యాదులపై గురువారం ఆయన మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో నిజమైన భూ యజమానులను కొంతమంది దుండగులు బెదిరించిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. వెంటనే అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో ప్రభుత్వ, నదులు, కాలువ, చెరువులకు సంబంధించిన భూములను, నిజమైన పట్టాదారుల భూము ల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులు ఎవరైనా అక్రమార్కులకు సహకరిస్తే శాఖా పరమైన చర్యలతో పాటు, కేసులు నమోదు చేస్తా మని స్పష్టం చేశారు. భూ అక్రమణలు, కబ్జాలకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూముల రీ సర్వే చేపట్టనుందన్నారు. భూముల రీ సర్వేతో రాష్ట్ర రెవెన్యూ విభాగంలో చారిత్రాత్మఘట్టం ప్రారంభం కానుందని, దీంతో గ్రామీణ, పట్టణ ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేకూరనుందని ఆర్డీఓ కనకనరసారెడ్డి తెలిపారు. -
అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్
సాక్షి, తూర్పు గోదావరి : అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం మంగళవారం సీరియస్ అయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో చక్రదరరావును సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యేవరకు అన్నవరం ఆలయ ఈవో అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా గత శనివారం అర్థరాత్రి తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి : స్వామి వారి రథం దగ్ధం.. మంత్రి దిగ్భ్రాంతి) -
తెలంగాణలో పోలీస్ శాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన సిబ్బంది కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డిస్ ఇన్ఫెక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. తొలి విడతలో అధికంగా కేసులున్న స్టేషన్లను డిస్ ఇన్ఫెక్షన్ టీమ్‌లు శుభ్రం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లను శుద్ధి చేయనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పల్స్ ఆక్సీమిషన్స్ పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్ట్‌లు నిర్వహించనున్నారు. అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి సెలవుపై వెళ్లాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కరోనా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చదవండి: అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్! -
తప్పుడు పోస్టింగ్ చేస్తే చర్యలు
సాక్షి, గోదావరిఖని : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు చేసిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాను వేదికలుగా చేసుకొని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో కొందరు వ్యక్తులు ఇతర మతాలను కించపరిచేలా సందేశాలు అప్లోడ్ చేయడం, సమాజంలో పరువు ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులు, వ్యవస్థలపై దుమ్మెత్తి పోయడం బురద చల్లడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారని అన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతువులను నమ్మొద్దని కోరారు. పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పోస్ట్ చేయాలని సీపీ సూచించారు. ముగ్గురిపై కేసు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురించి తప్పుగా, కించపరిచేలా పోస్టింగ్ చేసిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. ధర్మారం పోలీస్‌స్టేషన్ ప రిధిలోని దొంగతురి్తకి చెందిన జుంజిపల్లి శంకరయ్య అలియాస్ శేఖర్, గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన యాకుల తిరుపతియాదవ్, పెద్దపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉయ్యంకర్ సాయి కిరణ్‌పై కేసు నమోదు చేశామన్నారు. -
మటన్ రూ.700కు మించి అమ్మితే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఇష్టానుసారంగా వ్యవహరించి గొర్రెల ధరలను పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. శనివారం పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రతో కలిసి చెంగిచెర్ల, జియాగూడ, బోయగూడ మండీల్లో లైసెన్స్ మొండెదార్లు (గొర్రెల విక్రయదారులు)తో సమావేశం నిర్వహించారు. ప్ర భుత్వం నిర్ణయించిన ధర రూ.700 మించి విక్రయిస్తే శాఖాపరంగా కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతోనే పశుసంవర్థక శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని తెలిపారు. దీంతో మొండెదార్లు అందరూ లాక్డౌన్ కారణంగా తాము ఎక్కువ లాభాలు ఆశించకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. అలాగే గొర్రెలను కేవలం మాంసం దుకాణాల నిర్వాహకులకే అమ్ముతామని, మద్య దళారులకు గొర్రెలను విక్రయించబోమని మంత్రికి విన్నవించారు. సమావేశంలో తనిఖీ బృందం డిప్యూటీ డైరెక్టర్ వెంకట సుబ్బారావు, డాక్టర్ బాబుబేరి, సింహా రావు, సుభాష్, నిజాం, మొండెదార్లు గౌలిపుర ప్రకాశ్, హోమర్, పి.లక్ష్మణ్, రాజు మల్తూకర్, కమల్ ప్రకాశ్, భగీరథ్, శ్రీనివాస్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. పీపీ విధానంతో చేపల మార్కెట్! మత్స్య ఫెడరేషన్ ద్వారా కాని, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కానీ హోల్ సేల్ చేపల మార్కెట్‌ను నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, ఇందుకు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. చేపల ధరలు నియంత్రణలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, ఆ శాఖ కమిషనర్ సువర్ణ, అధికారులతో మత్స్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా లాక్‌డౌన్‌లోనూ సమృద్ధిగా చేపలు లభ్యం అవుతున్నాయన్నారు. ముషీరాబాద్ (రాంనగర్)లోని హోల్‌సేల్ చేపల మార్కెట్ వారంలో మూడు రోజులు పని చేస్తుందని, ఈ మార్కెట్‌కు 80 నుంచి 90 మెట్రిక్ టన్నుల చేపలు వస్తున్నాయని, దీంతో నగర ప్రజల అవసరాల మేరకు చేపలు లభిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన మత్స్యకారులు అందరికీ అందేలా చూడాలని అన్నారు. 33 జిల్లాల వారీగా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం పాలకవర్గం ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు -
నగరంలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు
-
లాక్డౌన్ సడలింపులపై ఢిల్లీ సీరియస్
-
అడ్మిన్.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని ఇతరులతో పంచుకో వడంలో బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ డిజిటల్ మీడియా విభాగం హెచ్చరించింది. సమాచార ప్రామాణికతను తెలుసుకోకుండా ఇతరులకు పంపవద్దని స్పష్టం చేసింది. వాట్సాప్ వేదికల్లో గ్రూపు సభ్యులు తప్పుడు సమాచారం పంపిస్తే అడ్మిన్ బాధ్యులవుతారని హెచ్చరించింది. ఈ మేరకు ఐటీ శాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేశారు. నిబంధనలు అతిక్రమించే వారు చట్టపరంగా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆయా మాధ్యమాల దుర్వినియోగం వల్ల కలిగే పరిణామాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కలిగించాలన్నారు. • కరోనాపై అవగాహన పెంచడంలో సంప్రదాయ స మాచార, వార్తా సంస్థలతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, షేర్‌చాట్, టిక్‌టాక్ వంటి అనేక సామజిక మాధ్యమాలు, వెబ్సైట్లు, మొబైల్ యాప్స్ వంటి డిజిటల్ మాధ్యమాలు ఉపయోగపడుతున్నాయి. అయితే అవగాహన లోపం, ఆకతాయితనంతో కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారు. దీనిని ఇన్ఫోడెమిక్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది. • కరోనా బారిన పడిన వ్యక్తుల వి వరాల గోప్యతను ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారు. వారికి విపత్తు నిర్వహణ చట్టం–2005 లోని 54వ సెక్షన్ కింద ఏడాది జైలు శిక్ష, జరిమానా, ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం కూడా శిక్ష పడుతుంది. • కరోనా సమాచారాన్ని అధికారులతో ధుృవీకరించుకోకుండా సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వదంతులు వ్యాపింపజేస్తే అంటువ్యాధుల చట్టం–1897 కింద తెలంగాణ అంటువ్యాధులు (కోవిడ్–19) నిబంధనల్లోని 10వ సెక్షన్ ప్రకారం శిక్షార్హులవుతారు. • కొన్ని యూట్యూబ్ చానెళ్లు వార్తలను థంబ్ నెయిల్స్‌తో పోస్ట్ చేస్తున్నాయి. వార్తకు, సమాచారానికి సంబంధం లేని ఈ థంబ్ నెయిల్స్ వీక్షకుడిని తప్పుదోవ పట్టించడమే కాకుండా, సమాచారా న్నీ కలుషితం చేస్తున్నాయి. ఇటువంటి వాటిపై డిజి టల్ మీడియా విభాగం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి వార్తలు, వీడియోలను పోస్టు చేస్తున్న ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్లు, యూట్యూబ్ చానెళ్లకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిపివేస్తారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే చానెళ్లను, సామాజిక మాధ్యమ సంస్థలను తొలగిస్తారు. -
ఇటలీలో శ్మశాన నిశ్శబ్దం
ఇటలీ ప్రభుత్వం విధించిన నిబంధనలు చూస్తే వామ్మో అనిపించొచ్చు. మరీ అతి చేస్తున్నారా అన్న భావన రావచ్చు. కానీ కబళించింది ఏదో కాదు ప్రపంచాన్నే వణికించే రక్కసి. చైనా తర్వాత అత్యంత ఆందోళనకర స్థితి నెలకొన్న దేశం ఇటలీ. రోజు రోజుకూ కేసుల సంఖ్య, మృతులు పెరిగిపోతున్నారు. ఇప్పటికే 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో పకడ్బందీ చర్యలు చేపట్టారు. నిత్యావసరాలు దొరికే సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు తప్ప మిగతావన్నీ మూసేశారు. తమకు కావల్సిన సరుకులు తెచ్చుకోవాలంటే ఇంట్లో నుంచి ఒక్కరికి మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, ఫార్మసీల కిటికీలు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఒకరి తర్వాత ఒకరు క్యూ పద్ధతి పాటిస్తూ లోపలికి వెళ్లి వారికి కావల్సినవి తెచ్చుకోవాలి. రద్దీ ఎక్కువ ఉంటే ఒకసారి నలుగురైదుగురిని లోపలికి అనుమతిస్తారు కానీ ఒక్కొక్కరి మధ్య కనీసం మూడు అడుగుల దూరం పాటించాలి. ఇల్లు కదిలి బయటకి రావాలంటే పోలీసులకు కారణాలు చెప్పాలి. ఇలా అడుగడుగునా ఆంక్షలు విధించారు. అయితే అంతటి నిర్బంధంలో ఉండడం మామూలు విషయం కాదంటున్నారు మిలాన్‌లో ఉంటున్న అమెరికన్ క్రిస్టినా హిగ్గిన్స్. దేశమే ఒక జైలులా మారినప్పుడు కాలం గడపడం దుర్లభం అని ఆమె అంటున్నారు. భర్త, పిల్లలు ఇంటిపట్టునే ఉన్నా ఊపిరాడనట్టుగా ఉంటోందని హిగ్గిన్స్ మీడియా ఇంటర్వూ్యల్లో చెప్పారు. మరో రెండు వారాల పాటు ఇటలీలో ఇవే పరిస్థితులు కొనసాగనున్నాయి. -
నామినేషన్లు అడ్డుకునే వారిపై కఠిన చర్యలు
-
విజయవాడ : అక్రమ కట్టడాలపై ఏసీబీ కొరడా
సాక్షి, విజయవాడ : విజయవాడ వన్‌టౌన్ పరిధిలోని అక్రమ కట్టడాలను ఏసీబీ అధికారులు బిల్డింగ్ ఇన్స్పెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్రమ కట్టడాలకు సంబంధించి అనధికార అనుమతులపై లోతుగా విచారణ చేపట్టినట్లు ఏసీబీ ఏఎస్పీ మహేశ్వర రాజు వెల్లడించారు. నిబంధనలకు విరుధ్దంగా నిర్మించిన భవననాల యజమానులపై చర్యలకు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అనిశా టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశించనున్నట్లు ఏసీబీ పేర్కొంది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ డ్యూటీనీ సక్రమంగా నిర్వహించకపోవడంతోనే ఈ అక్రమ కట్టడాలు వెలిశాయని పేర్కొన్నారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. -
‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు
దుబాయ్: జెంటిల్మెన్ క్రికెట్‌కు తమ దురుసు ప్రవర్తనతో మచ్చ తెచ్చిన భారత్, బంగ్లాదేశ్ యువ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్యలు తీసుకుంది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై, దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్ సింగ్‌కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు విధించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహిద్ హ్రిదోయ్ (10 సస్పెన్షన్=6 డి మెరిట్), షమీమ్ హుస్సేన్ (8 సస్సెన్షన్=6 డి మెరిట్), రకీబుల్ హసన్ (4 సస్పెన్షన్= 5 డి మెరిట్)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు. -
నకిలీలతో జాగ్రత్త..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్లు ఉన్న ఫ్యాకల్టీ ఉంటే యాజమాన్యాలపై చర్యలు చేపడతామని జేఎన్టీయూ పేర్కొంది. తమ కాలేజీల్లో చేరే ఫ్యాకల్టీకి సంబంధించిన సర్టిఫికెట్ల జెన్యూనిటీ తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలదేనని స్పష్టం చేసింది. నకిలీ/ఇన్వ్యాలిడ్ సర్టిఫికెట్లు, నకిలీ పీహెచ్‌డీలు చూపించి ఏయే కోర్సులకు అనుబంధ గుర్తింపు పొందుతారో కాలేజీల్లో ఆయా కోర్సు లను రద్దు చేస్తామని వెల్లడించింది. అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసే సమయంలో యాజమాన్యాలు చూపించే ఫ్యాకల్టీకి సంబంధించిన బయోమెట్రిక్ హాజరు వివరాలను ఏడాది పొడవునా పరిశీలిస్తామని, ఏ దశలోనైనా హాజరు లేకపోయినా వారు, కాలేజీలో లేకపోయినా ఆయా కోర్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది. 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసుకునే అఫీలియేషన్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌ను జేఎన్టీయూ సోమవారం ప్రకటించింది. దానిపై యాజమాన్యాలు మెయిల్ ద్వారా (feedbackaac@jntuh.ac.in) అభిప్రాయాలను, సలహాలు, సూచనలు తెలపాలని స్పష్టం చేసింది. ఏటా పరిగణనలోకి తీసుకునే నిబంధనలతో పాటు ఈసారి కొత్త నిబంధనలను చేర్చింది. ముఖ్యంగా ఫ్యాకల్టీ వెల్ఫేర్, కాలేజీల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, నిర్వహణకు సంబంధించి ప్రత్యేక అంశాలను పొందుపరిచింది. మరోవైపు ప్రభుత్వ అనుమతితో కొత్త కోర్సులకు, కాలేజీలకు అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే గడిచిన మూడేళ్లలో కాలేజీల్లో ప్రవేశాలు 25 శాతం కంటే తక్కువగా ఉంటే ఆ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే గతంలో అఫీలియేషన్ రెగ్యులేషన్స్‌లో లేని విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు వివిధ కారణాలతో తమ వద్దే పెట్టుకోవద్దనే నిబంధనను ఈసారి రెగ్యులేషన్స్‌లో పొందుపరిచింది. డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌లోని ప్రధాన అంశాలు.. ►కాలేజీల గవర్నింగ్ బాడీ సభ్యులు, గవర్నింగ్ బాడీ సమావేశాల మినిట్స్‌ను కచ్చితంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ►ఫ్యాకల్టీ బయోమెట్రిక్ హాజరును ఏడాది కాలంలో ఎప్పుడైనా పరిశీలిస్తారు. ఫ్యాకల్టీ లేకపోతే ఆ కోర్సుల అనుబంధ గుర్తింపును రద్దు చేస్తారు. ►కాలేజీల్లో తమ ఉద్యోగులు, ఫ్యాకల్టీకి వర్తింపజేస్తున్న సర్వీసు రూల్స్‌ను కూడా యూనివర్సిటీకి అన్లైన్ అందజేయాలి. -
ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, వాల్యుయేషన్ సర్టిఫికెట్లు, ఇతర సర్టిఫికెట్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొందరు మున్సి పల్ కమిషనర్లు తెలంగాణ మున్సి పాలిటీ 1965, 2019 చట్టాలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ పాలన విభాగం డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. -
హద్దులు దాటితే ఆపేస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రు ల్లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌పై వారంలో గా సమగ్ర తనిఖీలు చేపట్టాలని, అక్కడి రికార్డులను పరిశీలించాలని సర్కారు ఆదేశించింది. ఉల్లంఘన జరిగినట్లు తేలితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ నిలిపివేస్తామని తెలి పింది. క్లినికల్ ట్రయల్స్‌ల్లో రోగుల భద్రతే అత్యంత కీలకమని తెలిపింది. ఆస్పత్రికి వచ్చే సాధారణ రోగులు, అనారోగ్యంతో చేరే వారిపై క్లినికల్ ట్రయల్స్ జరపకూడదని పేర్కొంది. నిలోఫర్‌లో ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మార్గదర్శకాలతో కూడిన ఓ ప్రకటన జారీ చేశారు. స్వచ్ఛందంగా క్లినికల్ ట్రయల్స్‌ల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చే వారిని మాత్రమే అంగీకరించాలని స్పష్టం చేశారు. వారి సమ్మతిని తెలియజేసే పత్రాలు, ఆడియో విజువల్ రికార్డింగ్ వంటి అన్ని రకాల చట్టపరమైన విధానాలను అనుసరించడం ప్రయోగాలు చేసే వారి బాధ్యతన్నారు. అధికారులు రూపొందించిన కఠిన నిబంధనలను అనుసరించిన తర్వాతే పారదర్శకంగా ట్రయల్స్ నిర్వహించాలని తెలిపారు. నిలోఫర్‌పై ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ సోమవారం అన్ని రకాల పత్రాలను, రోగుల నుంచి తీసుకున్న సమ్మతి వివరాలను సేకరిస్తుందని చెప్పారు. ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్గదర్శకాలిలా.. ►క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో ఎథికల్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. దాని ఆధారంగానే ఔషధ ప్రయోగాలు జరగాలి. ►ఎథిక్స్ కమిటీ ప్రయోజనాలు, నష్టాలను అంచనా వేయాలి. ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశాలున్నాయా పరిశీలించాలి. అటువంటి ప్రమాదాలను తగ్గించే ప్రణాళికలను రూపొందించాకే ట్రయల్స్ చేయాలి. ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో చట్టబద్ధంగా అనుమతించే క్లినికల్ ట్రయల్స్ మాత్రమే జరపాలి. ►క్లినికల్ ట్రయల్స్‌పై వివాదాలు తలెత్తినప్పుడు విచారణ జరపడం తప్పనిసరి. నిలోఫర్ ఆస్పత్రిలో కూడా అటువంటి విచారణే జరుగుతుంది. క్లినికల్ ట్రయల్స్‌ల్లో పాల్గొనే వాలంటీర్ల భద్రత కోసం ఇలా చేస్తున్నాం. ►ఔషధ ప్రయోగాల్లో పాల్గొనేవారి నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. క్లినికల్ ట్రయల్స్ దేనిపై చేస్తున్నారో సమాచారాన్ని ఇవ్వాలి. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వారు నిరక్షరాస్యులైతే, వారికి అవగాహన కల్పించి సాక్షి సమక్షంలో సమ్మతి తీసుకోవాలి. ►క్లినికల్ ట్రయల్స్ జరపాలని కోరుకునే పరిశోధకుడు మొదట ఎథిక్స్ కమిటీకి, తర్వాత మెడికల్ సూపరింటెండెంట్ పైస్థాయికి పంపించాలి. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియాకు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి మాత్రమే అనుమతి వస్తుంది. ►ట్రయల్స్‌ను ఆమోదించే ముందు పరిశోధన యోగ్యత, ప్రయోజనాన్ని నిర్ణయించాలి. ►దేశంలో నిబంధనలను ఐసీఎంఆర్ నిర్దేశిస్తుంది. ఒక క్లినికల్ ట్రయల్‌ను సమగ్రమైన వివరాలతోనే నిర్వహిస్తారు. ►ఎథిక్స్ కమిటీలు క్లినికల్ ట్రయల్స్‌కు ముందు ప్రాథమిక సమీక్ష చేయాలి. ట్రయల్స్ జరుగుతున్నప్పుడు పర్యవేక్షించాలి. మానవులపై ట్రయల్స్ విషయంలో కఠినమై న నియంత్రణ చర్యలున్నాయి. ►ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎథిక్స్ కమిటీ నిలోఫర్‌లో చేసే క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిచ్చినట్లు తేలింది. భద్రతాచర్యల ను అనుసరిస్తున్నాయో లేదో తేల్చడానికి ముగ్గురు సభ్యుల కమిటీ వేశాం. అది నివేదిక అందజేస్తుంది. ►క్లినికల్ ట్రయల్స్‌ను పర్యవేక్షించా లని అన్ని ఎథిక్స్ కమిటీలకు సూచించాలని నిర్ణయించాం -
పాసు పుస్తకాలు ఇవ్వాల్సిందే !
సాక్షి, నిజామాబాద్ అర్బన్ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అర్హులైన వారందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని ఇదివరకే చాలా సార్లు చెప్పాను. అయినా తీరు మార్చుకోవడం లేదు. మండలాల్లో సమస్యలు పరిష్కరించడం లేదని రైతులు జిల్లా కేంద్రానికి వచ్చి మొర పెట్టుకుంటున్నారు. మండలాల్లో మీరేం చేస్తున్నట్లు..? అంటూ జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు తహసీల్దార్లపై సీరియస్ అయ్యారు. మంగళవారం ప్రగతిభవన్‌లో తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతుల రికార్డులు ఇంకా సరిచేయకపోవడం వల్ల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో జిల్లా నలు మూలల నుంచి రైతులు వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి వచ్చి విన్నపాలు అందజేస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో పరిష్కరించడం లేదన్నారు. కోర్టు స్టే ఇచ్చినవి అనర్హత కేసులు తప్ప మిగతా అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే పలుసార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో ద్వారా స్వయంగా అలాగే మండలాలను తనిఖీ చేసిన సందర్భంగా ఆదేశాలు జారీ చేసినా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటగిరిల వారీగా అర్హత గల వారందరికీ పట్టా పాసు పుస్తకాలు సత్వరమే అందజేయాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నిర్ణయం తీసుకుని అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హత గలవారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ ‘చీడ’ ఇక విరగడ!
► రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే ఇకపై కఠిన చర్యలు ► బిల్లుకు రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం ► వచ్చే సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు ► జైలుశిక్షతోపాటు కంపెనీల నుంచి రైతులకు పరిహారం ► కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలు ► నష్టపోయిన రైతులు ఈ కమిటీని ఆశ్రయించవచ్చు ► అప్పిలేట్ అథారిటీగా రాష్ట్రస్థాయిలో మరో కమిటీ ► బిల్లు చట్టరూపం దాల్చాక శిక్షలపై మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: రైతులకు నకిలీ, నాసిరకం విత్తనాలు అంటగట్టే కంపెనీలు, డీలర్లపై ఇకపై కఠిన చర్యలు తప్పవు! జైలు శిక్షతోపాటు వారి నుంచి రైతులకు భారీమొత్తంలో పరిహారం ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బిల్లును రూపొందించింది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపాదించి చట్టం రూపంలోకి తీసుకురానుంది. కేంద్ర విత్తన చట్టం–1966కు అనుగుణంగా తెలంగాణ రైతు ఫిర్యాదుల పరిష్కార (నకిలీ విత్తనాలతో పంట నష్టం జరిగినప్పుడు) చట్టం–2016 ముసాయిదాకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఈ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ బిల్లు ప్రకారం నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయించే కంపెనీలు, డీలర్లపై కఠిన చర్యలు చేపడతారు. బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న తర్వాత.. నష్టపరిహారం, జైలు శిక్షలపై స్పష్టత రానుంది. పరిస్థితిని బట్టి పరిహారంతోపాటు జైలు శిక్ష కూడా ఉండేలా ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించనున్నారు. ఇటీవల నకి లీ మిరప విత్తనాలతో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు నష్టపోయారు. అవి నకిలీ విత్తనాలేనని సర్కారు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తేల్చింది. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేలా... వారికి నష్టపరిహారం ఇప్పించేలా చట్టం తీసుకు రావాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో సర్కారు నూతన చట్టం దిశగా కసరత్తు చేస్తోంది. జిల్లా కమిటీకే అధికారం నకిలీ విత్తనాల కారణంగా పంట నష్టం జరిగితే విత్తన కంపెనీల నుంచి పరిహారం ఇప్పించే అంశం కేంద్ర విత్తన చట్టంలో లేదు. అయితే 2007లో ఉమ్మడి రాష్ట్రంలో పత్తి పంటకు నష్టం జరిగితే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించేలా ఏపీ కాటన్ సీడ్స్ యాక్ట్–2007ను తీసుకొచ్చారు. ఇది నకిలీ పత్తి విత్తనాలకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో ఇతర పంట విత్తనాల్లో మోసం జరిగితే పరిహారం ఇప్పించేందుకు కొత్త చట్టం అవసరమైంది. తాజాగా రూపొందించిన ముసాయిదా ప్రకారం.. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేస్తారు. అందులో జిల్లా వ్యవసాయాధికారి సభ్య కన్వీనర్‌గా ఉంటారు. జిల్లా ఉద్యానాధికారి, సంబంధిత పంటకు సంబంధించిన వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల శాస్త్రవేత్తలు, రైతు ప్రతినిధులు, విత్తన ఉత్పత్తిదారులు సభ్యులుగా ఉంటారు. నకిలీ విత్తనాలతో ఏ పంటకు నష్టం వాటిల్లినా జిల్లా కమిటీనే పరిహారం ఇప్పిస్తుంది. నకిలీ విత్తనాలతో పంట నష్టం జరిగిన రైతు వ్యవసాయ క్షేత్రాల్లో ఈ కమిటీ పర్యటిస్తుంది. రైతుకు ఎంత నష్టం జరిగింది? దాని విలువ ఎంత? అనేది కమిటీనే అంచనా వేస్తుంది. ఆ ప్రకారం కంపెనీలను పిలిపించి పరిహారం ఇప్పిస్తుంది. శిక్షలను కూడా ఖరారు చేస్తుంది. అప్పీలుకు అవకాశం జిల్లాస్థాయి కమిటీలో రైతు తనకు సరైన న్యాయం జరగలేదని భావించినా... విత్తన సరఫరాదారు కూడా అలాగే యోచించినా రాష్ట్రస్థాయి కమిటీకి ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రాష్ట్రస్థాయి కమిటీకి వ్యవసాయశాఖ కమిషనర్ నేతృత్వం వహిస్తారు. వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ పరిశోధన విభాగాల డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ విత్తన విభాగం అడిషనల్ డైరెక్టర్ తదితరులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ అప్పిలేట్ అథారిటీగా పనిచేస్తుంది. జిల్లా కమిటీలో తీసుకున్న నిర్ణయాలపై రెండు వర్గాల వాదనలను ఇది పరిగణలోకి తీసుకుంటుంది. అవసరమైతే జిల్లాస్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో కొద్దిపాటి మార్పుచేర్పులు చేసి తుది నిర్ణయం ప్రకటిస్తుంది. దాన్ని ఇరువర్గాలూ పాటించాల్సిందే. బిల్లులోని ఇతర ముఖ్యాంశాలు... ► పత్తికి ప్రత్యేక చట్టం ఉన్నందున ఆ పంటకు ఈ నూతన చట్టం వర్తించదు. మిరప, వరి, మొక్కజొన్న తదితర అన్ని పంటలకూ వర్తిస్తుంది ► నకిలీ విత్తనాలతో తనకు నష్టం వాటిల్లిందని రైతు లేదా రైతు బృందం భావిస్తే జిల్లా కమిటీకి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వొచ్చు ► ఈ బిల్లు చట్టంగా రూపుదిద్దుకున్న తర్వాత శిక్షలు, పరిహారం వంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు తయారు చేసి మార్గదర్శకాలు జారీ చేస్తుంది. చట్టంలోనే శిక్షలు, పరిహారం వంటి అంశాల ప్రస్తావన ఉండదు. కఠిన శిక్షలు అని మాత్రమే ప్రస్తావిస్తారు ► ఈ చట్టం మూడేళ్లపాటు అమలు చేశాక అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని తొలగిస్తారు. అవసరాన్ని బట్టి మరికొన్నింటిని జోడిస్తారు ► రైతుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన అధికారి, ఉద్యోగి, ఏజెన్సీ, డీలరు ఇలా ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకునేలా చట్టం ఉంటుంది ► జిల్లా లేదా రాష్ట్రస్థాయి కమిటీలో సభ్యులుగా ఉన్నవారు సంబంధిత సమావేశానికి రాకున్నా తీసుకున్న నిర్ణయాన్ని వారు అంగీకరించాలి. కమిటీలో ప్రతినిధులుగా ఉండే విత్తన సరఫరాదారులు సమావేశానికి రాకున్నా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిందే ► విత్తన కంపెనీల రిజిస్ట్రేషన్‌ను కఠినతరం చేస్తారు -
‘కఠిన చర్యలు తీసుకోండి’
హైదరాబాద్ సిటి: తల్లిపాల కోసం గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి ప్రాణాలోదిలిన బాబు హృదయవిదారక సంఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మెదక్ జిల్లా హత్నూర్ మండలం కానాపూర్‌లో కూలికి వచ్చిన మహిళ తన బాలుడికి పాలివ్వడానికి కాంట్రాక్టర్ నిరాకరించడంతో ఈ ఘోరం సంభవించింది. ఈ విషయంపై సోమవారం తెలంగాణ తెలుగు మహిళా కన్వినర్ శోభారాణి మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.