సాక్షి, తూర్పు గోదావరి : అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం మంగళవారం సీరియస్ అయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో చక్రదరరావును సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యేవరకు అన్నవరం ఆలయ ఈవో అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా గత శనివారం అర్థరాత్రి తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి : స్వామి వారి రథం దగ్ధం.. మంత్రి దిగ్భ్రాంతి)
Comments
Please login to add a commentAdd a comment