laxmi narasimha temple
-
అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్
సాక్షి, తూర్పు గోదావరి : అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం మంగళవారం సీరియస్ అయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో చక్రదరరావును సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యేవరకు అన్నవరం ఆలయ ఈవో అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. కాగా గత శనివారం అర్థరాత్రి తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశంపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి : స్వామి వారి రథం దగ్ధం.. మంత్రి దిగ్భ్రాంతి) -
రేపు యాదాద్రి ఆలయం మూసివేత
సాక్షి, యాదగిరిగుట్ట : పాక్షిక సూర్యగ్రహణం కారణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రినుంచి ఈ నెల 26(గురువారం)వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8.26గంటల నుంచి 10.57గంటల వరకు మోక్షకాలం ఏర్పడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని బుధవారం (నేడు) రాత్రి ఆలయ ద్వారబంధనం చేస్తారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12గంటల తరువాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, మహానివేదన అనంతరం 2గంటలనుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తామని తెలిపారు. సాయంకాలం భక్తుల మొక్కుసేవలు, దర్బార్‌సేవ, అర్చనలు యధావిధిగా ఉంటాయని పేర్కొన్నారు. పాతగుట్ట ఆలయాన్ని సైతం మూసివేస్తామని తెలిపారు. పాక్షిక సూర్యగ్రహణం అనంతరం శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని శుద్ధి చేసి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వ్రతాలు జరిపిస్తామని పేర్కొన్నారు. వాడపల్లిలో.. దామరచర్ల(విుర్యాలగూడ): జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లిలోని దేవాలయాలను ఈ నెల 26న మూసివేయనున్నట్లు వాడపల్లి ఆలయాల మేనేజర్ మృత్యుంజశాస్త్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా గురువారం ఉదయం 7గంటల నుంచి శ్రీ మీనాక్షి ఆగస్తేశ్వరదేవాలయం, శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దేవాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు. -
యాదాద్రి..భక్తజన సందడి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ధర్మదర్శనం, ప్రసాద విక్రయశాల క్యూలైన్లు, ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డు భక్తులతో నిండిపోయాయి. యాదగిరిగుట్ట పట్టణంలో సైతం ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. సెలవుదినం కావడం, కార్తీకమాసం ముగుస్తుండడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 40వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. –యాదగిరికొండ(ఆలేరు) సాక్షి,యాదగిరికొండ (భువనగిరి):యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. సెలవు దినం, కార్తీకమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయంలోని వివిధ విభాగాల క్యూలైన్లు, కొండపై పరిసరాలు, ఘాట్ రోడ్డు కాలు పెట్టడానికి వీలులేకుండా భక్తులుతో నిండిపోయాయి. రూ.150 క్యూలైన్లు నిండి భక్తులు బయటకు బారులుదీరారు.ప్రసా§ద విక్రయశాల క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. హోటల్, దుకాణాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానికి 6 నుంచి 7గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఉదయం నుంచే భక్తుల రాక మొదలు కార్తీకమాసం ముగుస్తుండడం సెలవుదినం కూడా కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో భక్తులు కాలినడకన, ఆటోల్లో కొండపైకి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలు రెండో ఘాట్‌రోడ్డు మూలమలుపు వరకు పార్కింగ్ చేశారు. కొండకింద పార్కింగ్, టెంపుల్ సిటీ ఘాట్‌రోడ్డు పూర్తిగా కార్లతో నిండిపోయింది. కొండ కింద చెక్‌పోస్టు వద్ద ఘాట్‌రోడ్డు ప్రారంభంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో సీఐలు ఆంజనేయులు, నరసింహారావు తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. అయినా భక్తులు స్వామి దర్శనం అనంతరం చెక్‌పోస్టు నుంచి బస్టాండ్ చేరుకోవడానికి 45 నిమిషాల సమయం పట్టిందని తెలిపారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు భక్తులకు తప్పని తిప్పలు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో సరైన వసతులు లేక ఇబ్బందులకు గురయ్యారు. అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా కొండపై స్థలం లేకపోవడంతో కూర్చొని సేదదీరడానికి సైతం భక్తులు అవస్థలు పడ్డారు. ఇదే అదనుగా దుకాణాదారులు వస్తువులను అధిక ధరలకు విక్రయించారు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లను సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. కొబ్బరికాయలను సైతం దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు విక్రయించారు. విశేష పూజలు బాలాలయంలో స్వామి, అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం సుదర్శన హోమం, మూలమంత్రాలతో హవనం, అనంతరం స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం నిర్వహించారు.అలాగే భక్తులు స్వామివారికి సువర్ణ పుష్పార్చన గావించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, గట్టు యాదగరిస్వామి, మంగళగిరి నరసింహామూర్తి, అధికారులు మేడి శివకుమార్, వేముల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. సమకూరిన ఆదాయం యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్క రోజే రూ.13.50 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. నిత్య పూజలు, టికెట్ల ద్వారా వచ్చిన రూ.4.40లక్షలు, సత్యనారాయణవ్రతాల ద్వారా రూ.9.10లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. -
స్వామీజీకి తప్పని నిరీక్షణ
విశాఖపట్నం, సింహాచలం(పెందుర్తి): శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అధికారులపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అసహనం వ్యక్తం చేశారు. చందనోత్సవానికి వచ్చిన స్వామీజీకి గేటు తీయకపోవడంతో ఆయన తన వాహనంలోనే సుమారు 15 నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల సమయంలో స్వామీజీ తన వాహనంలో రాజగోపురం వరకు వెళ్లేందుకు ఎంక్వైరీ కార్యాలయం వద్దనున్న గేటు వద్దకు వచ్చారు. ఆ సమయంలో గేటు తాళాలు వేసి ఉండడంతో ఆయన కారులోనే ఉండిపోయారు. ఎవరు తాళాలు తీస్తారని ఎదురుచూశారు. దీంతో స్వామీజీ అసహనానికి గురయ్యారు. తాళాలు ఈవో దగ్గర ఉన్నాయంటూ అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు చెప్పారు. ఈవోకు ఫోన్లో స్వామీజీ వచ్చినట్టు సమాచారం ఇచ్చి, తాళాలు తీసుకొచ్చారు. చివరికి తాళాలు తీసి ఆయనను లోపలికి పంపారు. ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా అనుగ్రహించాలని స్వామీని కోరుకున్నా : స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చాలా దిగ్విజయంగా జరిగిందని శారదా పీఠాధిపతి తెలిపారు. ఈ ఏడాది శారదా పీఠానికి తొలి అడుగని, ఈ ఏడాది పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామిని పెడుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఒక నెల ముందు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్నామన్నారు. ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా అనుగ్రహించాలని స్వామిని వేడుకున్నామన్నారు. స్వామి వారి నిజరూప దర్శనం అనంతరం వేద స్వస్తిని అర్చకులు నిర్వహించారు. ప్రసాదాన్ని ఈవో కె.రామ చంద్రమోహన్ అందజేశారు. తాను ఆలయం లోపల ఉండిపోవడంతోనే తాళం తీయడానికి ఆలస్యమైందని ఈవో స్వామీజీకి సంజాయిషీ ఇచ్చారు. -
జగన్ సీఎం కావాలని సుదర్శన హోమం
యాదగిరిగుట్ట : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్సార్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేశ్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసుదర్శన నారసింహ మహాహోమం సోమవారం పదవ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరమైందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి జగన్మోహన్రెడ్డి ముందుకువచ్చారని, ఏపీ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తారని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలను సాధించేందుకు, ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు జగన్ పాటుపడుతారని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించారని, ఆ పాదయాత్రలో లక్షలాది మంది ప్రజల బాధలను నే రుగా తెలుసుకున్నారని, సీఎంగా చేస్తే వాటన్ని ంటినీ పరిష్కారం చేస్తారని వెల్లడించారు. 11న జరిగే ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు.సుదర్శన నారసిం హ హోమం ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. -
కనులపండువగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం శ్రావణలక్ష్మి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కనుల పండువగా సాగాయి. తొలుత ఆలయంలో నారసింహుడితో పాటు అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడికి మహిళా భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు. అర్చక బృందం అమ్మవారికి పూజలు నిర్వహించిన మీదట ప్రధాన అర్చకులు వరలక్ష్మీ వ్రతం విశేషాన్ని వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు, సభ్యులు రఘునాథరెడ్డి, కటికెల వరలక్ష్మి, కరె నాగరాజు, రొడ్డారపు నాగరాజు, గంగులమ్మ, ఇతర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ
జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గుట్ట పరిసర ప్రాంతం సందడిగా మారింది. ఆదివారం సాయంత్రం వరకు సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఎండ తీవ్రంగా ఉండటంతో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకింద భక్తులు సేదతీరారు.