
గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ
జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గుట్ట పరిసర ప్రాంతం సందడిగా మారింది.
ఆదివారం సాయంత్రం వరకు సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఎండ తీవ్రంగా ఉండటంతో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకింద భక్తులు సేదతీరారు.