
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మాతృభాషపై మమకారంతో ఓ ఆదివాసీ కుటుంబం పెళ్లి శుభలేఖ (ఉండమీరి పెళ్లి జోడ)ను కోయ భాషలో ముద్రించి ప్రత్యేకత చాటుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన సున్నం (ఉండం) సాధు సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఇల్లెందు మండలం సంజయ్‌నగర్‌లో జీవనం సాగించేవారు.
ఆయన మరణానంతరం పెద్ద కుమారుడు బాలరాజు కుటుంబ బాధ్యతలు చూస్తున్నాడు. కాగా, సోదరుడు శ్రీనివాస్ వివాహం లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన చింత వినీతతో మార్చి 2న జరగనుంది. దీంతో సోదరుడి వివాహ ఆహ్వాన పత్రికను కోయ భాషలో ముద్రించి బంధు మిత్రులకు పంపిణీ చేశారు. కాగా, అంతరించిపోతున్న భాషను బతికించేందుకు బాలరాజు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment