యాదగిరిగుట్ట : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్సార్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేశ్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసుదర్శన నారసింహ మహాహోమం సోమవారం పదవ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరమైందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి జగన్‌మోహన్‌రెడ్డి ముందుకువచ్చారని, ఏపీ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తారని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలను సాధించేందుకు, ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు జగన్ పాటుపడుతారని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించారని, ఆ పాదయాత్రలో లక్షలాది మంది ప్రజల బాధలను నే రుగా తెలుసుకున్నారని, సీఎంగా చేస్తే వాటన్ని ంటినీ పరిష్కారం చేస్తారని వెల్లడించారు. 11న జరిగే ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు.సుదర్శన నారసిం హ హోమం ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment