sudarshana yagam
-
సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం ప్రారంభం
-
త్వరలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం
-
మహా సుదర్శన యాగం
సాక్షి, హైదరాబాద్: త్వరలో యాదాద్రిలో మహా సుదర్శన యాగాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. యాగం నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామితో ఆయన చర్చించారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపం లోని శ్రీరామనగరంలో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని కేసీఆర్ మంగళవారం సందర్శించారు. స్వామి సీఎంను ఆశీర్వదించి జ్ఞాపికను, మంగళశాసనాలు అందజేశారు. ఈ సందర్భంగా యాగంపై ఇరువురూ చర్చించారు. వంద ఎకరాల యజ్ఞ వాటికలో 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగంనిర్వహించాలని నిర్ణయించారు. 3వేల మంది రుత్విక్కులు, మరో 3వేల మంది సహాయకులతో మహా యాగాన్ని గొప్పగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం భారతదేశంలోనివి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలతోపాటు బద్రీనాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి వంటి మహాక్షేత్రాల నుంచి మతాధిపతులను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులను, అన్ని సంప్రదాయాలకు చెందిన మత గురువులను ఈ యాగానికి ఆహ్వానించనున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి విస్తృతమైన ఏర్పాట్లు చేసే అంశంపైనా ఈ భేటీలో చర్చించారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్‌కుమార్, మై హోం గ్రూప్ అధినేతలు జూపల్లి రామేశ్వర్రావు, జూపల్లి జగపతిరావు ఉన్నారు. జీయర్‌స్వామితో సీఎం కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు. అనంతరం కేసీఆర్ జూపల్లి బాలమ్మ మెమోరియల్ గార్డెన్‌లోని రామేశ్వర్రావు ఫాంహౌజ్‌కు వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడ ఉండి తిరుగు పయనమయ్యారు. -
వైఎస్ జగన్ సీఎం కావాలని అనంతపురంలో సుదర్శన హోమం
-
జగన్ సీఎం కావాలని సుదర్శన హోమం
యాదగిరిగుట్ట : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్సార్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేశ్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసుదర్శన నారసింహ మహాహోమం సోమవారం పదవ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరమైందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి జగన్మోహన్రెడ్డి ముందుకువచ్చారని, ఏపీ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తారని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలను సాధించేందుకు, ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు జగన్ పాటుపడుతారని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించారని, ఆ పాదయాత్రలో లక్షలాది మంది ప్రజల బాధలను నే రుగా తెలుసుకున్నారని, సీఎంగా చేస్తే వాటన్ని ంటినీ పరిష్కారం చేస్తారని వెల్లడించారు. 11న జరిగే ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు.సుదర్శన నారసిం హ హోమం ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. -
ఆలయంలో ఘనంగా సుదర్శన యాగం
యాదగిరికొండ : యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయంలో సుదర్శన యాగాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వయంభూమూర్తులకు పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేశారు. ఆలయంలో ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అదిష్ఠింప చేసి వివిధ రకాలైన పుష్పాలు, తులసీ దళాలతో అర్చన గావించారు. అలాగే ఆలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహించారు. నవగ్రహాలకు ప్రదక్షిణం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగళ్ లక్షీనరసింహచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు గట్టు యాదగిరిస్వామి, మంగళగిరి నరసింహమూర్తి, ఆలయ అధికారులు చంద్రశేఖర్, జూషెట్టి కృష్ణ, వేముల వెంకటేశ్, రాకేశ్ బాబు పాల్గొన్నారు.