yadagiri gutta
-
8న యాదాద్రికి సీఎం రేవంత్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన యాదాద్రి జిల్లా పర్యటనకు రానున్నారు. అదేరోజు ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో తొలుత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ, జిల్లా అధికారులతో సమావేశమై యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా మిగిలిపోయిన పనులు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై సమీక్షించనున్నట్లు తెలిసింది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచినీటిని సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్టు పైలాన్‌ను యాదాద్రిలో సీఎం ప్రారంభిస్తారు. పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. పైప్‌లైన్ ద్వారా 550కి పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తారు.మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా భువనగిరి నియోజకవర్గంలోని బొల్లేపల్లి– సంగెం మధ్య భీమలింగం బ్రిడ్జి వద్దనుంచి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి ప్రజాచైతన్య యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో కూడా సీఎం పర్యటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పర్యవేక్షిస్తున్నారు. -
యాదగిరిగుట్ట లడ్డూపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రభుత్వం 60 కిలోల బంగారు తాపడం పెట్టనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అక్టోబర్ 18(శుక్రవారం) ఆమె మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రవ్యాప్తంగా అన్ని గుడుల లడ్డూలను టెస్టింగ్‌కు పంపితే యాదగిరి గుట్ట లడ్డూ భేష్ అని రిపోర్ట్ వచ్చింది. వేములవాడ దేవస్థానం మాస్టర్‌ప్లాన్ త్వరలోనే విడుదల చేస్తాం. త్వరలోనే దేవాలయాల్లో 24 రకాల ఆన్లైన్ సేవలను అందించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.వేములవాడ రాజన్నకు 65 కిలోల బంగారంతో తాపడం చేయిస్తాం. బాసర సరస్వతి టెంపుల్ పునర్నిర్మాణం కోసం మాస్టర్‌ప్లాన్ రెడీ అయింది. వేములవాడను రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తాం’అని మంత్రి సురేఖ తెలిపారు.ఇదీ చదవండి: కేటీఆర్,హరీశ్‌రావులకు సీతక్క కౌంటర్ -
యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్టగా పిలువబుడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ విడుదల చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆయన శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడాడు. ‘ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. మేం జీరో బిల్ ఇచ్చినట్టు.. కేటీఆర్‌కి జీరో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృథా. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు?. ... కాళేశ్వరం పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజలే కేసీఆర్‌ను నామరూపాలు లేకుండా చేశారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోంది. భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీని కోరాను. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో.. దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుంది. మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. -
యాదాద్రిలో ఘనంగా జరుగుతున్న అమ్మవారి పూజలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను కొలిచిన ఆచార్యులు.. ప్రధానాలయంలోని ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలలో శుద్ధజలం, సుగంధ ద్రవ్యాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటితో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించారు. అమ్మవారి సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు అంతకుముందు హోమం నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు గజివెల్లి రఘు, దొమ్మాట సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా ఊంజలి సేవ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. -
ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న యాదాద్రి
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని వచ్చే నెల 5వ తేదీ నుంచి కొండపైనే అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి (శివాలయం) ఉత్సవాలను నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 7వ తేదీన రాత్రి 7గంటలకు శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని అభిషేకములు, రాత్రి లింగోద్భోవ కాలములో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపిస్తారు. 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచనారసింహుడిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తీ వాచనంతో ఉత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుడతారు. 12వ తేదీన ధ్వజారోహణము, దేవతాహ్వానం, వేద పారాయణం, హవన జరిపిస్తారు. అదే రోజు అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం 17వ తేదీన, తిరు కల్యాణ మహోత్సవం 18వ తేదీన, రథోత్సవం 19న, చక్రతీర్థ స్నానం 20న నిర్వహిస్తారు. 21వ తేదీన శతఘటాభిషేకం ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ముగింపు చేస్తారు. 8న అఖండ జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్‌పురలోని యాదగిరి భవన్ నుంచి మహా శివరాత్రి రోజు 8వ తేదీన ఉదయం 9.30గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే యాత్ర నిర్వాహకులు అఖండ జ్యోతి యాత్రను దివ్య పుష్ప రథంపై ఊరేగింపుగా యాదాద్రికి తీసుకురానున్నారు. 8వ తేదీన బర్కత్‌పురలో ప్రారంభమయ్యే అఖండ జ్యోతి యాత్ర 11వ తేదీన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల తొలిరోజు యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. -
యాదాద్రిని సందర్శించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
నల్గొండ: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు. కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి మొక్కను అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరును హై కమిషనర్‌కు కలెక్టర్ పమేలా సతప్పతి వివరించారు. అనంతరం బ్రిటీష్ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్ యాదగిరిగుట్టకు వెళ్లి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రి వైభవం..
-
భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి సన్నిధి (ఫొటోలు)
-
కార్తీక మాసం షురూ.. యాదాద్రిలో భక్తుల సందడి (ఫోటోలు)
-
యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)
-
యాదాద్రిలో సీఎం కేసీఆర్.. కిలో బంగారం సమర్పించి మొక్కు చెల్లింపు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. బంగారు తాపడం కోసం వారి కుటుంబం తరపున కిలో 16 తులాల బంగారం స్వామి వారికి కానుకగా ఇచ్చారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. శనివారం వరంగల్‌కు.. సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ వరంగల్‌లో నిర్మించిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించే అవకాశముంది. జాతీయ పార్టీ పేరు, ముహూర్తంపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. జాతీయ పార్టీపై దసరా రోజు అధికారిక ప్రకటన చేయనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రూ.80 కోట్లతో కొనుగోలుకు టీఆర్ఎస్ నిర్ణయం -
యాదాద్రిలో జర్నలిస్టుల ఆందోళన
సాక్షి, యాదాద్రి: మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం ఉదయం యాదాద్రిలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఈవో గీతారెడ్డి, జర్నలిస్టులను అరెస్ట్ చేయించగా.. అరెస్ట్‌లకు నిరసనగా యాదగిరి గుట్ట పీఎస్ వద్ద జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు జర్నలిస్టులకు మద్దతు ప్రకటించాయి. -
కుటుంబ కలహాలతో... అఘాయిత్యానికి పాల్పడిన తండ్రి, కూతుళ్లు
యాదగిరిగుట్ట: కూతురితో సహా ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదగిరిగుట్టలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లా, బోక్తాపూర్కు చెందిన చెరుకూరి సురేష్ (40) హైదరాబాద్‌కు చెందిన నాగలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సురేష్ హైదరాబాద్, చందానగర్‌లోని బీఎస్ ఎన్ఎల్లో సబ్ డివిజనల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా డు. వీరికి శ్రేష్ఠ(6) కూతురు ఉంది. గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సురేష్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా సర్దిచెప్పడంతో వివాదాలు సద్దుమణిగాయి. ఇటీవల మళ్లీ గొడవలు ఎక్కువ కావడంతో మనస్తాపానికిలోనైన సురేష్, తన కుమార్తెతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం కుమార్తెతో సహా యాదాద్రికి వచ్చాడు. స్వామిని దర్శించుకుని.. స్థానిక మయూరి గ్రాండ్ హోటల్లో గది అద్దెకు తీసుకున్న సురేష్ సాయంత్రం కూతురితో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని, అనంతరం కొండ కిందకు వచ్చి కుమార్తెకు ఇష్టమైన ఆహార పదార్థాలు కొనిచ్చాడు. సాయంత్రం 7గంటల ప్రాంతంలో తిరిగి హోటల్‌కు చేరుకున్నాడు. రాత్రి 12.30గంటల ప్రాంతంలో కుమార్తెను తీసుకొని హోటల్ పై అంతస్తులోకి వెళ్లి, తొలుత కూతురు శేష్ఠను కిదకు తోసేశాడు. అనంతరం తాను కూడా కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్ద శబ్దం రాగానే హోటల్ నిర్వాహకులు వెళ్లి చూడగా రోడ్డుపై శ్రేష్ఠ, టెర్రస్‌పై సురేష్ మృతదేహాలు పడి ఉన్నాయి. దీంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులు, భార్యకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ప్రసాద్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జానకిరెడ్డి తెలిపారు. గదిలో సూసైడ్ నోట్ లభ్యం సురేష్ ఆత్మహత్య చేసుకునే ముందే తాను బస చేసిన గదిలో సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే తాను కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నానని.. నేను చని పోతే నా కూతురును నా భార్య సరిగా చూస్తుందో లేదో అనే భావనతో ఇద్దరం చనిపోతున్నామని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. ఫ్రెండ్స్ కాలనీలో విషాద చాయలు కుమార్తెతో సహా సురేష్ ఆత్మహత్యకు పాల్పడిన వార్త తెలియడంతో ఫ్రెండ్స్ కాలనీలో విషాదం నెలకొంది. సురేష్ సాయిబాలాజీ అపార్ట్మెంట్లో ఉంటూ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఎస్డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య నాగలక్ష్మి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోనే పని చేసేది. విదేశాలకు వెళ్లే నిమిత్తం కొన్నాళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సురేష్ కుమార్తెతో సహా యాదగిరిగుట్టకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సురేష్‌కుమార్ అందరితో కలవిడిగా ఉండేవాడని, ఉద్యోగ విషయంలో చురుగ్గా పనిచేసేవాడని, అవార్డులను కూడా అందుకున్నట్లు అతడి స్నేహితులు తెలిపారు. మృతదేహాలను బీరంగూడలో ఉంటున్న మృతుడు సురేష్‌కుమార్ తండ్రి ప్రసాద్‌రావు నివాసానికి తీసుకెళ్లారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. (చదవండి: డ్రగ్ వరల్డ్ @ ఆన్లైన్!) -
యాదగిరిగుట్టలో విషాదం
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ లాడ్జి పైనుంచి దూకి తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని హైదరాబాద్ లింగంపల్లికి చెందిన చెరకూరి సురేష్, శ్రేష్ఠగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా.. భార్యభర్తల మధ్య గొడవ ఈ అఘాయిత్యానికి కారణమని తెలుస్తోంది. -
‘యాదాద్రి’ గోపురంపై రామాయణ గాథ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ గోపురాలు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర రాజగోపురంపై రామాయణానికి సంబంధించిన చిత్రాలపై ఆడియో పవర్ ప్రొజెక్టర్ ద్వారా శుక్రవారం రాత్రి ట్రయల్ నిర్వహించారు. రామాయణం, ఇతర ఇతిహాసాలను ప్రొజెక్టర్ ద్వారా తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలో మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు వీటిని ఏర్పాటు చేస్తున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు. భక్తులు ఉత్తర రాజగోపురం వైపు ఉన్న పచ్చికలో కూర్చొని కట్టడాలను వీక్షించే అవకాశం ఉన్నందున్న.. శ్రీనృసింహస్వామి, ప్రహ్లాద చరిత్రను కూడా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును వైటీడీఏ అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. -
ప్రకృతి దేవతలను ప్రతిష్ఠించినట్లుంది
యాదగిరిగుట్ట: యాదాద్రిక్షేత్రంలో శిల్పకళాసంపదను చూస్తే ప్రకృతి దేవతలను ప్రతిష్ఠించినట్లు ఉందని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని గద్దర్ తన కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. తూర్పు రాజగోపురం వద్ద ‘నర్సన్న.. మా నర్సన్న యాదగిరి నర్సన్న.. మా బీదోళ్లందరినీ సల్లంగా చూడన్నో మాయన్నో నర్సన్న.. నర్సన్న’ అంటూ పాటపాడారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను చూశారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అందుకు నాయకత్వం వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు వందనాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రి క్షేత్రం ఎలా విరాజిల్లుతోందో, అలాగే తెలంగాణ ప్రజలు అందరూ ఆనందంగా బతకాలని కోరుకున్నట్లు తెలిపారు. -
యాదాద్రి ప్రసాదంలో ప్లాస్టిక్ కవర్
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వడ ప్రసాదంలో ఓ భక్తుడికి ప్లాస్టిక్ కవర్ ప్రత్యక్షమైంది. భక్తుడు దీనికి సంబంధించిన వీడియో తీసి పోస్టు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లోని బేగంపేట్‌కు చెందిన సందీప్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 11న యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. స్వామి వారి నిత్య కల్యాణ వేడుకలో పాల్గొన్న వీరికి వడ ప్రసాదం అందజేశారు. ఇంటికెళ్లిన తర్వాత సోమవారం రాత్రి వడ ప్రసాదం తింటున్న సమయంలో అందులో ప్లాస్టిక్ కవర్ తగిలింది. దీంతో సందీప్ ‘‘ఎవరైనా చూసుకోకుండా తింటే ప్రాబ్లెమ్ అవుతుంది..దేవస్థానం వారు మరోసారి ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను’’అంటూ వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. ఈ విషయమై దేవస్థానం సూపరింటెండెంట్ అశోక్‌ను సాక్షి వివరణ కోరగా..ప్రసాదం తయారీ గోదాంలో బియ్యం బ్యాగులు ఉంటాయని వాటిపై ఉన్న కవర్ చిన్నది పడినట్లుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎస్
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయం వద్ద సోమేశ్కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతిష్టా బంగారు కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజలు చేశారు. సీఎస్‌కు ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సోమేశ్ ప్రధానాలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రధానాలయం దాదాపు పూర్తయిందని, కొండ కింద రోడ్లు, తదితర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 28న జరిగే ప్రధానాలయ ఉద్ఘాటన సమయానికి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. -
యాదగిరి నర్సన్నకు.. మంత్రి మల్లన్న 3.5 కిలోల బంగారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడంకోసం మూడున్నర కిలోల బంగారానికి సరిపడే నగదును కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (మల్లన్న) గురువారం తన నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి అందజేశారు. మేడ్చల్‌లోని తన క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో మం త్రి మల్లారెడ్డి యాదాద్రి కొండకు చేరుకున్నారు. రూ.కోటి 83 లక్షల నగదును తలపై పెట్టుకొని కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లతో కలిసి బాలాలయం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గీతారెడ్డి, ఆచార్యులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఇటీవల సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించిన సందర్భంగా.. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం తరపున కిలో బంగారం, అలాగే మేడ్చల్ ప్రజల తరపున కూడా బంగారం అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం తరపున కిలో బంగారం, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరపున రూ.1 కోటి 83 లక్షలను విరాళంగా అందజేశారు. ఇందులో రూ.72 లక్షలు చెక్కు రూపంలో, రూ.కోటి 11 లక్షలు నగదు రూపంలో అందజేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మల్లారెడ్డి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.మల్లారెడ్డి అనుచరులు బాలాలయంలో శ్రీస్వామివారి ప్రతిష్టా కవచమూర్తుల విగ్రహాలను సెల్ ఫోన్లతో ఫొటోలు తీశారు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఫొటోలను సెల్ ఫోన్లో నుంచి తొలగించారు. ‘జేఎస్ఆర్ సన్‌సిటీ’రూ.50 లక్షల విరాళం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడం పనులకు స్థిరాస్తి సంస్థ జేఎస్ఆర్ సన్‌సిటీ అధినేత జడపల్లి నారాయణ విరాళం అందజేశారు. గురువారం రూ.50 లక్షల చెక్కును ఆయన ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. -
విద్యుత్ కాంతుల్లో మండపాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సీఎం కేసీఆర్ సూచనలు, సలహాల మేరకు భక్తులకు ఆహ్లాదం కలిగించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు నెలల క్రితం యాదాద్రీశుడిని సందర్శించిన సీఎం కేసీఆర్ మండపాల్లో తామరపువ్వు ఆకృతిలో ఉన్న దీపాలు బాగున్నాయని చెప్పడంతో ఆ మేరకు ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో దీపాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ఆలయ లోపలి, బయటి ప్రాకారాల సీలింగ్‌కు 125 తామర పువ్వు దీపాలను బిగించి గురువారం రాత్రి ట్రయల్ రన్ చేశారు. అద్దాల మండపం ముందు వైపు వేసిన ఈ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. దక్షిణ రాజగోపురం వైపు సైతం విద్యుత్ దీపాలను ట్రయల్ రన్ చేశారు. -
‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా
అమీర్‌పేట(హైదరాబాద్): దళితులపాలిట వరంగా మారనున్న దళితబంధు పథకాన్ని విపక్షాలు అడ్డుకుంటే యాదగిరిగుట్టలో ఆత్మహత్య చేసుకుంటానని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితబంధుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఒకరోజు నిరసనదీక్ష చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మోత్కుపల్లికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. నర్సింహులు మాట్లాడుతూ అగ్రవర్ణాలకు దీటుగా దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాహసోపేత నిర్ణయం తీసుకుని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను పెట్టి అమలు చేస్తున్నారని, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనే అపార నమ్మకం తనకుందని తెలిపారు. రేవంత్‌రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ‘రేవంత్‌రెడ్డిది ఐరన్ లెగ్, టీటీడీపీని పత్తాలేకుండా చేయించి కాంగ్రెస్ పార్టీలో దూకిన వ్యక్తికి టీపీసీసీ కట్టబెట్టడం సిగ్గుచేట’న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అర్థం లేదని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకోవటానికే యాత్రను చేపట్టారని విమర్శించారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్‌కు దళితులందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. -
కారెనుక కారు.. హారం తీరు
సాక్షి, యాదగిరిగుట్ట: కారెనుక కారు.. గుట్ట చుట్టూ హారం తీరు.. భక్తజనం చేరె.. బారులు తీరె.. గోరంత దీపం.. కొండంత వెలుగు.. దివ్వెల వెలుగు.. దివ్యమైన కాంతి.. కొండపైన ఆధ్యాత్మిక సందడి.. ఇదీ ఆదివారం యాదాద్రి సంతరించుకున్న కార్తీక శోభ. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతోపాటు సెలవు రోజు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించి, దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని 23వేలకుపైగా మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తజన సంద్రం.. యాదాద్రీశుడి క్షేత్రం యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్త జన సంద్రంగా మారింది. సెలవురోజుతో పాటు కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల వాహనాలను కొండకింద గల తులసీ కాటేజీలో, మల్లాపురం వెళ్లే దారుల్లో నిలిపివేసి, ప్రైవేట్ వాహనాల్లో, ఆర్టీసీ, దేవస్థానం బస్సుల్లో కొండపైకి పంపించారు. సరైన పార్కింగ్ స్థలం లేక భక్తులకు ఇబ్బందులు కలిగాయి. స్వామివారిని సుమారు 23వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటలకు పైగా సమయం పట్టిందని పలువురు భక్తులు తెలిపారు. కాగా సత్యనారాయణస్వామి వ్రతాల్లో 968 జంటలు పాల్గొన్నాయి. దీంతో రూ.4,84,000 ఆదాయం చేకూరింది. ఇక కొండ కింద వాహనాల రద్దీ ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెదటి ఘాట్‌రోడ్డు, రెండవ ఘాట్ దారుల సమీపంలో నుంచి బస్టాండ్ వద్దకు వాహనాలు రావడానికి సుమారు 45నివిుషాల సమయం పట్టింది. ట్రాఫిక్ పోలీసులు, స్థానిక పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. యాదాద్రి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో శ్రీస్వామి వారికి రూ.36,15,179 ఆదాయం వివిధ పూజల ద్వారా వచ్చిందని అధికారులు తెలిపారు. యాదగిరీశుడికి విశేష పూజలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆ దివారం ఆచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేకువజామునే బాలాలయాన్ని తెరిచిన అర్చకస్వాములు సుప్రభాత సేవ చేపట్టి, ప్రతిష్ఠామూర్తులను ఆరాధిస్తూ హా రతి నివేధించారు.ఉత్సవ మూర్తులను అభిషేకించి, తులసీ పత్రాలతో అర్చించి, దర్శనామూర్తులకు సువర్ణ పుష్పార్చన చేపట్టి, మండపంలో ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజ, శ్రీసుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేన ఆరాధన, నిత్య కల్యాణ పర్వాలు, సత్యనారాయణస్వామి వ్రతాలను విశేషంగా జరిపారు. సాయంత్రం ఆలయ మండపంలో సేవోత్సవాన్ని నిర్వహించారు. రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి శయనోత్సవాన్ని నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయ ఆవరణలోని క్యూకాంప్లెక్స్‌లో నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక కార్తీక దీపారాధనలో మహిళలు, కొత్తగా వివాహాలైన జంటలు, యువతులు పాల్గొని దీపాలను వెలిగించారు. ఆయా వేడుకల్లో ఆలయ ఈఓ గీతారెడ్డి పాల్గొన్నారు. శాశ్వత పూజలు ప్రారంభం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులచే జరిపించే శాశ్వత పూజలను ఆదివారం ప్రారంభించినట్లు ఈఓ గీతారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్–19 కారణంగా ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుంచి ఈ పూజలను రద్దు చేశామని తెలిపారు. కోవిడ్–19 ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో భక్తుల సౌకర్యం దృష్ట్యా పరిమిత సంఖ్యలో ఈ శాశ్వత పూజలను ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. ప్రతి రోజుకు ప్రతి శాశ్వత పూజలో 10 మందికి అనుమతివ్వనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు శాశ్వత పూజల పర్యవేక్షకులు సెల్ నంబర్ 83339 94019, డోనర్ సెల్ విభాగం సెల్ 83339 94025లకు సంప్రదించాలని తెలిపారు. -
యాదాద్రిలో ఆర్జిత సేవలు ప్రారంభం
సాక్షి, యాదగిరిగుట్ట : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఉదయం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 కారణంగా మార్చి 22 నుంచి రద్దు అయిన ఆర్జిత సేవలు 196 రోజుల తర్వాత పున:ప్రారంభమయ్యాయి. దీంతో స్వామి వారి దర్శనానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. భక్తుల రద్దీ ఉండటంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించే క్రమంలో థర్మల్ స్క్కీనింగ్,శానిటైజర్ ఏర్పాటు చేశారు. ఆదివారం (నేటి) నుంచి శ్రీస్వామి వారి ఆర్జిత సేవలైన అభిషేకం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీస్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన పూజలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు చేసుకునేందుకు భక్తులను అనుమతించినట్లు ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా భక్తులు మొక్కులుగా సమర్పించే తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను సైతం తెరిచినట్లు తెలిపారు. కొండ కింద గల తులసీ కాటేజీలో సైతం ఒక కుటుంబంలో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న కుటుంబానికే గదులు కేటయిస్తామన్నారు. వీటన్నింటికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి, కోవిడ్–19 నిబంధనల ప్రకారం జరిపించనున్నట్లు చెప్పారు. అంతే కాకుండా వేకువజామున 4గంటలకు తెరచి రాత్రి 9.45గంటల వరకు ఆలయంలో పూజలు జరిపించనున్నట్లు తెలిపారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. ఇక యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం ఆర్జిత సేవలను ప్రారంభించనున్నట్లు ఈవో వెల్లడించారు. అంతే కాకుండా ఆలయ దర్శన వేళలను మార్పు చేసినట్లు తెలిపారు. వేకువ జామున 4 గంటల నుంచి రాత్రి 9.45గంటల వరకు నిత్య కైంకర్యాలను కొనసాగిస్తామన్నారు. ఇక శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి బాల ఆలయంలో నిత్య కైంకర్యములు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పూజలన్నీ కోవిడ్–19 నిబంధనల ప్రకారం జరిపిస్తామన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే ప్రతి భక్తుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు. ఆరు నెలల తరువాత ఆర్జీత సేవలు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 6నెలల 11 రోజుల తరువాత ఆర్జిత సేవలు మొదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22వ తేదీన లాక్డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాదాద్రి ఆలయంలో భక్తులచే జరిపించే ఆర్జిత సేవలను దేవాదాయశాఖ ఆదేశాలతో రద్దు చేశారు. ఇక జూన్ 8వ తేదీ నుంచి భక్తులను శ్రీస్వామి వారి దర్శనానికి అనుమతిచ్చి, ఆన్లైన్లో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న భక్తుల పేరుతో పూజలు జరిపించారు. ఇక లాక్డౌన్లో వచ్చిన సడలింపులతో ఆదివారం కోవిడ్–19 నిబంధనలతో భక్తులకు ఆర్జిత సేవలను ఆలయ అధికారులు అనుమతిచ్చారు. -
‘యాదాద్రి’లో భక్తుల రద్దీ..
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాల ఆలయంలో స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం విశేషంగా పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లకు నిత్యారాధనలతో పాటు వేకువ జామున అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ మహా మండపంలో 108 కలశాలలకు శాస్త్రోక్తంగా శతఘటాభిషేక పూజ చేసి, అందులోని వివిధ ఫల రసములు, పంచామృతాలు, ఫల జలములు, శుద్ధమైన జలంతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఈ శతఘటాభిషేకంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు. అదే విధంగా నిత్య పూజలు కూడా ఘనంగా నిర్వహించారు. కలశాన్ని ఊరేగిస్తున్న ఆచార్యులు, ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి శ్రీస్వామి వారి ఆదాయం రూ.6,56,449 భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకోవడంతో ఆలయానికి రూ.6,56,449 ఆదాయం చేకూరిందని అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,000, ప్రచార శాఖ ద్వారా రూ.4,150, ప్రసాద విక్రయం ద్వారా రూ.5,31,845, శాశ్వత పూజల ద్వారా రూ.35,848, చెక్‌పోస్టు ద్వారా రూ.2,170, మినీ బస్సు ద్వారా రూ.2,510, వాహన పూజల ద్వారా రూ.17,200, అన్నధాన విరాళం ద్వారా రూ.6,616, కొబ్బరికాయల ద్వారా రూ.54,570 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూజలు చేస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు స్వామివారిని దర్శించుకున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదివారం సందర్శించారు. బాల ఆలయంలో ప్రతిష్ఠామూర్తులను దర్శించుకున్న ఆయనకు ఆలయ అచార్యులు స్వామి అమ్మవార్ల ఆశీస్సులను అందజేశారు. అనంతరం ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. తదనంతరం యాదగిరిగుట్ట మున్సిపాలిటి కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌ను శాలువాతో సన్మానించారు. నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆదివారంస్వామి వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో బాల ఆలయం, ప్రసాదం కౌంటర్, ఆలయ పరిసరాలు, పుష్కరిణి వద్ద, ఘాట్ రోడ్లలోని పార్క్‌లు భక్తులతో కోలాహలంగా కనిపించాయి. స్వామి వారిని సుమారు 5,500 నుంచి 6వేల వరకు భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గర్భాలయ గోడకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలు అద్భుత శిల్పాలు.. ఆధ్యాత్మిక రూపాలు యాదగిరిగుట్ట (ఆలేరు): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయమంతా ఆధ్యాత్మిక రూపాలను శిల్పులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన ఆలయంలో నారసింహ రూపాలు, దశవతారాలు, సుదర్శన ఆళ్వార్, శంకు, చక్ర, నామాలు, వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ఆధ్యాత్మిక రూపాలను శిల్పులు చెక్కి, వాటిని తుది మెరుగులు దిద్దారు. ప్రధాన ఆలయంలో భక్తులకు పునర్ దర్శనం ప్రారంభం కాగానే వారిని ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్లే విధంగా ఈ రూపాలను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ఈ ఆధ్యాత్మిక రూపాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణశిల రాతి గోడపై తీర్చిదిద్దిన సుదర్శన ఆళ్వార్ రూపం -
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
-
ఆధ్యాత్మికత ఉట్టిపడాలి : సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి : ‘‘అణువణువునా ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణం అద్భుతంగా రూపుదిద్దు కోవాలి. అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుం డా, తొట్రుపాటు పడకుండా సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ నిర్మాణం జరగాలి. స్వామివారికి వివిధ రకాల సేవలు, పూజలు, భక్తులకు సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండాలి’’అని సీఎం కేసీఆర్ వైటీడీఏ అధికారులు, స్తపతులు, ఆర్కిటెక్ట్‌లను ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి క్షేత్రంలో సీఎం కేసీఆర్ ఆదివారం 6 గంటల పాటు పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో యాదాద్రికి 12.12 గంటలకు సీఎం చేరుకున్నారు. ముందుగా బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లను దర్శిం చుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం ఇచ్చారు. అనం తరం సుమారు ఆరు గంటలపాటు కేసీఆర్ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో పురోగతిని సమీక్షించారు. ప్రధాన ఆలయంలోకి భక్తులు ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణ అనంతరం గర్భాలయంలోగల శ్రీస్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుని బయటకు వెళ్లే క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలోకి భక్తులు వచ్చి పోయే మార్గాలు, పూజారుల మార్గాలపై అధికా రులను అడిగి తెలుసుకున్నారు. గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన సీఎం అనంతరం గర్భాలయంలో స్వయంభూలను దర్శించుకున్నారు. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఉప ఆలయాలను పరిశీలించారు. బంగారు వర్ణంలో విద్యుత్ దీపాలు ఆలయ నిర్మాణంపై ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కేసీఆర్ తిలకించారు. తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలోకి వచ్చే క్యూలైన్, దర్శనం అనంతరం పడమటి రాజగోపురం నుంచి బయటకు భక్తులు వెళ్లేందుకు ఉద్దేశించిన క్యూలైన్ అంశాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. క్యూలైన్లకు సంబంధించిన పలు మార్పులు, చేర్పులను ఆనంద్‌సాయికి సీఎం సూచించారు. బ్రహ్మోత్సవ మండపం వెనుకభాగం నుంచి అష్టభుజి ప్రాకార మండపం, తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచే విద్యుత్ దీపాలకు సంబంధించిన ప్రజెంటేషన్ చూశారు. బంగారు వర్ణంలో విద్యుత్ దీపాలు చూడముచ్చటగా ఉన్నాయని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఇన్నర్ ప్రాకార మండపంలో నిర్మాణం జరుగుతున్న అద్దాల మండపం ప్రజెంటేషన్‌ను చూశారు. ఊయలలో ఊగుతూ శ్రీస్వామి అద్భుతంగా కనిపిస్తున్నారని, వీడియోలో ఉన్న మాదిరిగానే ఆలయం క్యూలైన్లు, విద్యుత్ దీపాలు, అద్దాల మండపం కనిపించే విధంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద తంజావూర్ చిత్రం, గర్భాలయ ముఖ మండపంపై ఏర్పాటు చేసిన ప్రహ్లాద చరిత్రలు బాగున్నాయన్నారు. ఆలయంలో రెండు హుండీలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన ఆలయంలో ఒకటి, మండపాల్లో మరొక హుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. స్టోన్ ఫ్లోరింగ్ పనులు నాణ్యతతో చేయాలన్నారు. అనంతరం శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆలయం విశాలంగా ఉందన్నారు. శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, గణపతి దేవుడిని దర్శించుకున్న అనంతరం శివుడిని దర్శించుకునే విధంగా క్యూలైన్లు ఉండాలన్నారు. అంతే కాకుండా మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన మహా నందీశ్వరుడి విగ్రహాన్ని ఆలయానికి తూర్పు ప్రాకారంలో పెట్టాలని సూచించారు. మండపాల్లో తంజావూర్ పెయింటింగ్స్ పెట్టాలి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు ఆధ్యాత్మికతను పెంపొందించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకోసం ఆలయ ఇన్నర్ ప్రాకార మండపంలో చెక్కుతున్న ఎంబోజింగ్ చిత్రాలస్థానంలో తంజావూర్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయాలని స్తపతులకు, వైటీడీఏ అధికారులకు సూచించారు. మండపాల్లో తంజావూర్ పెయింటింగ్స్‌తో రూపుదిద్దుకున్న సుమారు 50 లక్ష్మీనరసింహస్వామి చిత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు ప్రతి కట్టడాన్ని తిలకించాలి యాదాద్రి ఆలయానికి వచ్చిన భక్తులు ప్రతి రాతి కట్టడాన్ని తిలకించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇందు కోసం తూర్పు రాజగోపురం నుంచి ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకున్న భక్తులు పడమటి రాజగోపురం నుంచి బయటకు నేరుగా వెళ్లకుండా కట్టడాలను తిలకించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దృశ్యాలను ప్రతి భక్తుడు చూసి తరించి పోయేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మణిహారంలా రింగ్‌రోడ్డు... యాదాద్రి ఆలయానికి రింగ్‌రోడ్డును మణిహారంలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో రింగ్‌రోడ్డును అత్యంత సుందరంగా తయారు చేయాలని ఆదేశించారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండిచెరువును పుష్కరిణిగా తీర్చిదిద్దుతున్నందున ప్రతి రెండునెలలకోసారి కాళేశ్వరం గోదావరి జలాలతో నింపాలన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణపనుల కోసం మూడువారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావును సీఎం ఫోన్లో ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అని, ఒకేసారి 4,000 మంది వ్రతం చేసుకునేలా వ్రత మంటప ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా వీఐపీ సూట్లు, గిరిప్రదర్శన రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్, గండిచెరువు, టెంపుల్ సిటీ, కాటేజీల నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా ఆలయ ప్రాంగణమంతా కలియదిరిగారు. సీఎం వెంట మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ భూపతిరెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్‌ఆండ్‌బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, స్థపతి ఆనందాచారి వేలు, అర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, డీసీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు. అద్భుతంగా స్వర్ణ ద్వారం యాదాద్రి గర్భాలయానికి చేతివృత్తుల కళాకారుల నైపుణ్యంతో అద్భుతమైన స్వర్ణ ద్వారాన్ని రూపొందిస్తున్నారు. అత్యంత నాణ్యమైన టేకు చెక్కపై రాగి, ఇత్తడి, షీట్మెటల్పైన బంగారు పూతతో తయారు చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు కళాకారులు తయారు చేస్తున్న స్వర్ణ ద్వారం గురించి సీఎం వాకబు చేశారు. కోతుల ఆకలి తీర్చిన కేసీఆర్ యాదాద్రి పర్యటనలో కోతులను గమనించిన కేసీఆర్ కారు ఆపి మరీ వాటి ఆకలిని తీర్చారు. పున్నమి గెస్ట్ హౌజ్‌లో భోజనం అనంతరం గిరిప్రదర్శన రోడ్డు పరిశీలనకు వాహనంలో వెళ్లారు. రోడ్డుపక్కన వానర సమూహాన్ని గుర్తించిన కేసీఆర్ తన కాన్వాయ్‌ను ఆపి కారులోంచి దిగారు. తన వెంట కారులో ఉన్న అరటిపండ్లను తీసుకుని కోతులకు స్వయంగా అందించారు. అరటి పండ్ల పంపిణీతో పెద్ద ఎత్తున కోతులు సీఎం వద్దకు చేరుకున్నాయి. కోతులతో ప్రమాదం అని సెక్యూరిటీ వారించినప్పటికీ ఏమీ కాదంటూ సీఎం స్వయంగా పండ్లను వాటికి అందజేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యాదాద్రిలో ఆధ్యాత్మికత ఉట్టిపడాలి: సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు లేకుండా, సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. స్వామివారికి వివిధ రకాల సేవలు, పూజలు చేసే విషయంలో, భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం యాదాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ..శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 6 గంటలపాటు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయానికి రింగు రోడ్డు సుందరీకరణ ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లతో రింగ్ రోడ్డును అత్యంత సుందరంగా తయారుచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అన్ని నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండిపేట చెరువును ప్రతి రెండు నెలలకు ఒకసారి కాళేశ్వరం జలాలతో నింపాలని ఆదేశాలు ఇచ్చారు. ఆలయం పరిసరాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతమైన పచ్చదనంతో నిండి ఉండాలని, ఇందుకోసం చెట్లను ఎక్కువగా పెంచాలన్నారు. స్పెషల్ ఆర్కిటెక్ట్‌లను పిలిపించి గండిపేట చెరువు ప్రాంతాన్ని అందమైన స్పాట్ గా తీర్చిదిద్దాలని సీఎం కోరారు. యాదాద్రి టెంపుల్ సిటీలో 365 క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మరో 200 ఎకరాల్లో కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. కళ్యాణ కట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రహదారుల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆర్అండ్బీ ఈఎన్సీకి సూచించారు. బస్టాండ్ నుంచి గుడి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ద్వారాలకు బంగారు తాపడం చేయడానికి పెంబర్తి నుండి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలని ముఖ్యమంత్రి సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఫోన్లో ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అనీ, ఒకేసారి నాలుగు వేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆలయం, టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్లను బయటకు పంపడానికి ప్రత్యేక నిర్మాణాలు చేయాలని కోరారు. 5 వేల కార్లు, 10 వేల బైకుల కోసం పార్కింగ్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హరిత అతిథి గృహంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీత, ఆర్అండ్బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, స్తపతి డాక్టర్ వేలు తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి క్యూలైన్ల డిజైన్ ఖరారు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసే క్యూలైన్ల డిజైన్‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు ఆర్కిటెక్టు ఆనందసాయి తెలిపారు. దీనికి సంబంధించిన నమూనాను ఆనందసాయి శుక్రవారం యాదాద్రిలో విడుదల చేశారు. లక్నో నుంచి ప్రత్యేకంగా క్యూలైన్లు తయారు చేసే కార్మికులను త్వరలోనే యాదాద్రికి రప్పించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించే ప్రసాదం కౌంటర్ నుంచి బ్రహ్మోత్సవ మండపం మీదుగా తూర్పు రాజగోపురం ముందు నుంచి బంగారు రంగులో మెరిసే క్యూలైన్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. -
వందో సినిమా ఆదర్శంగా ఉండేలా తీస్తాం..
యాదగిరిగుట్ట(ఆలేరు) : నేను తెలుగులో వందవ సినిమా ప్రజలందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఉండేలా తీస్తానని సినీ హీరో సుమన్ పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో హీరోనే ఉన్నాడు ఈతరంలో.. వారిని దృష్టిలో పెట్టుకొని నూతనంగా వందో సినిమా తీసే నిర్మాత కోసం వేచి చూస్తున్నా.. వచ్చే ఏడాదిలో కచ్చితంగా వందవ సినిమా విడుదలయ్యే విధంగా ముందుకు వెళ్తున్నా.. ఇప్పటికే ఎనిమిది భాషల్లో 500 సినిమా తీశాను.. సినిమా హిట్ అయినా.. ఫట్ అయినా.. అభిమానులు ఇంకా నాతోనే ఉన్నారు.. చాలా సంతోషంగా ఉంది.. 40 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు, ఓటములు అందుకున్నానని పేర్కొన్నారు. యాదగిరిగుట్టకు వచ్చిన సినీ హీరో సుమన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఇప్పటి వరకు ఎన్ని భాషల్లో సినిమాలు తీశారు..? తమిళం, కన్నడం, తెలుగు, మళయాలం, హిందీ తదితర భాషల్లో ఇప్పటి వరకు సినిమాలు తీశాను. అన్ని భాషలు కలిపి ఎనిమిది వందల సినిమాలను తీశాను. దాదాపు 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడి ఉన్నాను. తెలుగు సినిమాలో ఇప్పటికి 99 సినిమాలు తీశాను. ఎనిమిది భాషల్లో ఎక్కువగా ఎక్కడ ప్రాధాన్యత ఇస్తారు..? మా తల్లిదండ్రుల ఊరు కర్ణాటక.. నేను పుట్టింది కర్ణాటకలో.. నేను ఫేమస్ అయింది తెలుగులో.. చేసింది ఎనిమిది భాషలు. ఇవ్వన్ని ఎలా ఉన్నా దాదాపు 30 సంవత్సరాలు తెలంగాణాలోనే ఉన్నాను. అనుకోకుండా ఒక్కో భాష నుంచి క్లిక్ అయ్యాను. కానీ ఎక్కువగా నేను తెలంగాణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తాను. దాని తరువాత ఇండియాకు ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది..? రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వస్తాను. ఏ పార్టీ అని తెలియదు. నాకున్న ఎజెండా నాకు ఉంటుంది. నన్ను సినిమా ఫీల్డ్‌కు ప్రజలు తీసుకువచ్చారు. ప్రజల ఆశీర్వాదం, అభిమానుల అండదండలతో ఈ స్థాయికి వచ్చాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో ఉండి కూడా చేయవచ్చు. తెలంగాణ ఉద్యమంలో హీరో సుమన్ పాత్ర ఉందా..? తెలంగాణ వచ్చే ముందే జైతెలంగాణ అని నినదించి చెప్పాను. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఫీల్ అయ్యాను. ఎంతో మంది త్యాగాలు చేశారు. వారందరినీ చూసి చలించిపోయాను. దీంతో ఉద్యమంలో పలు చోట్లా పాల్గొన్నాను. కానీ ఇంత త్వరగా తెలంగాణ వస్తుందని అనుకోలేదు. ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. రాజకీయాల్లో చాలామందికి పదవులు వచ్చాయి. ఇవ్వన్నీ కేసీఆర్‌తోనే సాధ్యమైంది. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు..? రాబోయే రోజుల్లో మంచి సినిమాలు తీయాలని అనుకుంటున్నాను. ప్రధానంగా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులకు, పిల్లలకు మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని నా ఉద్దేశ్యం. త్వరలోనే ఫైర్ ఫైటర్ గూర్చి సినిమా తీయాలనుకుంటున్నాను. హత్య జరిగిందంటే పోలీసులు వస్తున్నారు.. అదే అగ్నిప్రమాదం జరిగితే ఆ సందర్భంలో ఫైర్ ఫైటర్ రావాలి. దీంతో పైర్ఫైటర్కు గౌరవం పెరుగుతుంది. ఇలాంటి సినిమాలు తీయడంతో యువతకు ఆదర్శంగా నిలవాలనే ధ్యేయం. సుమన్‌కు ఎక్కువగా విలన్ పాత్రలే వస్తున్నాయని అభిమానుల టాక్..? నేను విలన్‌గా ఏ సినిమాలో చేయలేదు. శివాజీ సినిమాలో చేసిన క్యారెక్టర్ టైపు వస్తే చేస్తాను. శివాజీ సినిమాలో ఉన్న హీరోటైపు ఉన్న వ్యక్తి, అలాంటి డైరెక్టర్, సినిమాలో ఉంటేనే క్యారెక్టర్ చేస్తా. హీరోకు ఎంత పేరు వస్తుందో అలాంటి పేరు విలన్‌కు వస్తేనే చేస్తాను. శివాజీ సినిమాలో రజినీ కాంత్‌కు ఎంత పేరు వచ్చిందో అంత పేరు నా పాత్రకు, నాకు వచ్చింది. ప్రస్తుతం ఏఏ భాషల్లో సినిమాలు తీస్తు బిజీగా ఉన్నారు..? తెలుగులో 6 నుంచి 7 సినిమాలు తీస్తున్నాను. నెగిటివ్ రోల్స్ కాకుండా పాజిటివ్ రోల్స్, మంచి కథతో తీస్తున్నాం. ప్రస్తుతం వృత్తిపరంగా సంతోషంగా ఉన్నాను. -
ఇల్లు కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యం
యాదగిరిగుట్ట : మండలంలోని దాతారుపల్లిలో బుధవారం ఓ ఇంటిని కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామాగ్రి బయటపడ్డాయి. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దాతారుపల్లికి చెందిన జంగం రాములు స్థానిక శివాలయంలో పూజారి. ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అందులో ఉన్న విగ్రహాలతో పాటు పూజ సామగ్రిని గ్రామస్తులు రాములు ఇంట్లో భద్రపరిచారు. ఆలయం నిర్మిస్తున్న సమయంలోనే రాములు అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆయన భార్య జయమ్మ, పిల్లలు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నారు. జయమ్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో వర్షాలకు క్రమక్రమంగా కూలిపోతోంది. బుధవారం జయమ్మ, ఆమె కుమారులు వచ్చి ఇంటిని పూర్తిగా కూల్చివేస్తున్న క్రమంలో భద్రపరిచిన విగ్రహాలు, పూజ సామాగ్రి బయటపడ్డాయి. స్థానికులు, సర్పంచ్ బైరగాని పుల్లయ్యగౌడ్, ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, ఉప సర్పంచ్ కాల్నె భాస్కర్లు విగ్రహాలను, పూజ సామాగ్రికి పూజలు నిర్వహించి ఆలయంలోకి తరలించారు. -
యాదాద్రి ఆలయానికి మూడు వాకిళ్లు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి మూడు వాకిళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో గర్భాలయానికి అమర్చిన మూడో వాకిలిని బంగారంతో తాపడం చేయడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తిరు మల తరహాలోనే బంగారు వాకిలిని రూపొందించడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఏడంతస్తుల ప్రధాన రాజగోపురానికి అమర్చనున్న మొదటి వాకిలికి 27 అడుగుల ఎత్తులో టేకు చెక్కతో భారీ ద్వా రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండవ వాకిలి ద్వా రాన్ని టేకుతో తయారు చేసి, దానిపై వెండి తాపడం చేయనున్నారు. దీన్ని 18 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు. అలాగే గర్భాలయం లోపల భాగంలోని ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం పనులు మరో నెల రోజుల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. దేవాలయాన్ని అన్ని హంగులతో శోభాయమానంగా రూపుదిద్దడానికి మరో మూడు నెలలు పట్టనుందని వారు పేర్కొన్నారు. 5 నుంచి వరుణయాగం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని శివాలయంలో ఈ నెల 5 నుంచి 7 వరకు వరుణ యాగం తలపెట్టారు. ఈ యాగానికి 16 మంది రుత్వికులకు ఆహ్వానాలు పంపాలని తీర్మానించారు. భక్తులు సైతం పాల్గొని వరుణ యాగాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు గణపతి పూజతో యాగాన్ని ప్రారంభించి రాత్రి 8 వరకు నిర్వహించనున్నారు. ఇలా మూడు రోజుల పాటు యాగం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి
హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం వద్ద ఈ నెల 8న పోలీసు వాహనం ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. వివరాలు.. ఎల్బీనగర్ చైతన్యపురి డివిజన్ మున్సిపల్ కాలనీకి చెందిన పి.మల్లేష్ జీహెచ్ఎంసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి. 7 నెలల క్రితం మల్లేశ్ భార్య సంధ్య డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. మల్లేశ్‌కు ఇద్దరు కుమార్తెలు ప్రీతి (5), ప్రణతి (మూడున్నరేళ్లు) ఉన్నారు. అక్క కుమార్తె నవీనకు బియ్యం పోస్తుండటంతో ఈ 8వ తేదీ సాయంత్రం తన తల్లి, పిల్లలతో కలసి మల్లేశ్ యాదగిరిగుట్టకు వెళ్లాడు. అనంతరం 9వ తేదీ ఉదయం పాత లక్ష్మీనర్సింహస్వామి గుడిలో సత్యనారాయణస్వామి వ్రతం చేయించుకునేందుకు బంధువులతో కలసి పాత గుట్టకు వెళ్లాడు. ఈ క్రమంలో మల్లేశ్ తన తల్లి బుచ్చ మ్మ, చిన్న కుమార్తె ప్రణతితో కలసి దేవాలయానికి ఎదురుగా ఉన్న పార్కింగ్లోని చెట్టు నీడలో సేద తీరుతున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన యాదాద్రి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు వాహనం (టీఎస్09 పీఏ 5508) నీడలో సేద తీరుతున్న మల్లేశ్, ప్రణతిలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రణతిని ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రణతి ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు మృతి చెందింది. దీంతో చిన్నారి తండ్రి మల్లేశ్, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదానికి వాహన డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం భార్య, ఇప్పుడు కుమార్తె మృతి చెంద డంతో మల్లేశ్ బోరున విలపించాడు. ప్రణతి అంత్యక్రియలను సైదాబాద్ దోభిఘాట్ శ్మశానవాటికలో నిర్వహించారు. ప్రణతి మృతి చెందిన సమాచారం అందుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆస్పత్రికి చేరుకుని చిన్నారి మృతదేహానికి నివాళులర్పించారు. ప్రణతి అక్క ప్రీతి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని, ఆర్థికంగా సాయం అందిస్తామని ఎల్బీనగర్ ఏసీపీ పృద్వేందర్రావు తెలిపారు. చిన్నారి అంత్యక్రియలకు పోలీసులు రూ.50 వేలు ప్రణతి కుటుంబసభ్యులకు అందజేశారు. -
యాదగిరికొండపై అగ్నిప్రమాదం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఈ ఘటనలో భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కొండపైన వేసవిలో నీడ కోసం రేకులతో చలువ పందిళ్లు వేశారు. వాటిపైన ఎండను తట్టుకునేందుకు గడ్డిపరిచారు. కార్యాలయంలోని పనికిరాని ఫైళ్లను 2 నెలలకోసారి ఆలయం గోడచాటున వేసి తగులబెడుతుంటారు. ఇలా శుక్రవారం ఫైళ్లను తగులబెడుతుండగా గాలికి నిప్పురవ్వలు లేచి చలువ పందిళ్లపై పడ్డాయి. దీంతో మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి. మంటలు వ్యాపించడంతో చలువ పందిళ్ల కింద సేదదీరిన భక్తులు భయాందోళనతో పరుగులుతీశారు. ఫైర్ ఇంజన్ రావడానికి చాలా అలస్యమవడంతో స్థానికులు, దుకాణదారులు బకెట్లతో నీటిని తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. -
జగన్ సీఎం కావాలని సుదర్శన హోమం
యాదగిరిగుట్ట : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్సార్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేశ్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసుదర్శన నారసింహ మహాహోమం సోమవారం పదవ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరమైందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి జగన్మోహన్రెడ్డి ముందుకువచ్చారని, ఏపీ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తారని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలను సాధించేందుకు, ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు జగన్ పాటుపడుతారని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహించారని, ఆ పాదయాత్రలో లక్షలాది మంది ప్రజల బాధలను నే రుగా తెలుసుకున్నారని, సీఎంగా చేస్తే వాటన్ని ంటినీ పరిష్కారం చేస్తారని వెల్లడించారు. 11న జరిగే ఎన్నికల్లో జగన్ విజయం సాధించడం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు.సుదర్శన నారసిం హ హోమం ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. -
వైభవంగా చక్రతీర్థం,మహాపూర్ణాహుతి
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులతోపాటు శ్రీచక్ర పెరుమాళ్లను అలంకారం చేసి ప్రత్యేక సేవలో పూజలు చేశారు. అదే విధంగా శ్రీ చక్ర పెరుమాళ్లకు చక్రతీర్థ స్నానం ఆచరింపజేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన ముక్కోటి దేవతలను ఆయా స్వస్థలాలకు పంపించే దేవతా ఉద్వాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు నల్లంథీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఖాదీ ఫర్ నేషన్.. ఖాదీ ఫర్ ఫ్యాషన్
సాక్షి, న్యూఢిల్లీ: భారత సంస్కృతిలో భాగమైన చేనేతను రక్షించేందుకు యువత ఖాదీ వస్త్రాలు ధరించాలని కోరుతూ యాదగిరి గుట్ట యువకులు ‘ఖాదీ ఫర్ నేషన్.. ఖాదీ ఫర్ ఫ్యాషన్’పేరిట చైతన్య యాత్ర చేపట్టారు. తెలంగాణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో యాదగిరి గుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన చేనేత కార్మికుడు నరేశ్, సాదువెల్లికి చెందిన రాజశేఖర్ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. 18 రోజుల అనంతరం గుజరాత్, రాజస్తాన్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌ల మీదుగా ప్రయాణించి శనివారం ఢిల్లీ చేరుకున్నారు. దేశంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, దాన్ని కాపాడేందుకు ఖాదీ వస్త్రాలు ధరించాలని ఆయా రాష్ట్రాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. వీరిరువురి యాత్ర ఢిల్లీ చేరుకున్న సందర్భంగా ఎంపీ డి.రాజా, మాజీ ఎంపీ ఆనందభాస్కర్ ఇక్కడి తెలంగాణ భవన్లో వారికి స్వాగతంపలికి సన్మానించారు. అనంతరం నరేశ్, రాజశేఖర్ మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని రక్షించేందుకు, యువతను ఖాదీ వైపు మళ్లించడానికి యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. జీఎస్టీ, విద్యుత్ చార్జీల పెంపు వల్ల పలు రాష్ట్రాల్లో చేనేత పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమను ఆదుకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డి.రాజా కోరారు. -
నేలమాలిగలు.. ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు లేవు!
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట కేంద్రంలోని వేశ్యాగృహాల్లో నేలమాలిగలు లేవని, అలాగే ఈస్ట్రోజన్ ఇంజెక్షన్లు వాడలేదని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) తెలిపింది. ఇది కేవలం కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని అభిప్రాయపడింది. యాదగిరిగుట్టలో వేశ్యావృత్తిని నిర్వహిస్తున్న వారిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు జరిపి పీడీ యాక్టు కింద అరెస్టు చేసి జైళ్లకు తరలించి ఆర్నెల్లుగా జైళ్లలో ఉంచిన నేపథ్యంలో ఈ నెల 8న మానవ హక్కుల వేదిక బృందం యాదగిరిగుట్టకు చేరుకుని అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అన్నీ హృదయవిదారక అంశాలే... యాదగిరిగుట్ట వేశ్యాగృహాలను నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు, బాలికల సంరక్షణ గృహాలకు తరలించారు. వారి ఇళ్లకు తాళం వేయడంతో మిగిలిన కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న హెచ్ఆర్ఎఫ్ బృందం బాధితులను పరామర్శించడంతో వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అరెస్టు కాని కుటుంబ సభ్యుల్లో కొందరు ఇతర ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకోగా.. మరికొందరికి అవి కూడా దొరకలేదు. కొందరు గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ గుడారాల్లో ఓ బాలింత సైతం పసికందుతో అవస్థలు పడుతూ ఉంది. ఇటు పీడీ యాక్టుపై జైలుకు వెళ్లి వచ్చిన వారి పరిస్థితిదుర్భరంగా మారింది. దీన్ని చూసి హెచ్ఆర్ఎఫ్ సభ్యులు చలించిపోయారు. పునరావాసం ఎక్కడ...: వేశ్యావృత్తిని మానేసిన వారు ఇతర ఉపాధి పనులకు వెళ్తున్నారని హెచ్ఆర్ఎఫ్ తెలిపింది. ‘వేశ్యావృత్తిని మానేసినట్లు ప్రత్యేకంగా బోర్డులు తగిలించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పునరావాసం, ఆర్థిక సాయం అందలేదు. బాధితులకు పునరావాసం కల్పించడంతో పాటు వారి ఇళ్లను వారికే అప్పగించాలి. హోంలలోని పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలి..’అని నివేదికలో కోరింది. అవన్నీ నిరాధారం.. వేశ్యాగృహాల్లో పిల్లలను నేలమాలిగల్లో రహస్యంగా పెంచుతున్నట్లు, వారు త్వరగా ఎదిగేందుకు ఈస్ట్రోజన్ ఇంజక్షన్లు చేస్తున్నట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ అదంతా ప్రచారమేనని హెచ్ఆర్ఎఫ్ బృందం అభిప్రాయపడింది. అక్కడ అలాంటి పరిస్థితేమీ లేదని.. అందుకు తగ్గ ఆధారాలు కూడా ఏమీ కనిపించలేదని వెల్లడించింది. ‘ఈ ఆరోపణల ఆధారంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్‌పై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఆస్పత్రి సీజ్ చేసినప్పటికీ అక్కడ ఈస్ట్రోజన్‌కు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. మరి ఆ వైద్యుడిని ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు. 33 మంది బాధిత బాలికలను రెండు హోంలకు తరలించారు. ఆమన్‌గల్‌లో ప్రజ్వల నడుపుతున్న హోంలో 20 మంది, మిగిలిన 13 మందిని నల్లగొండలోని శిశు విహార్‌కు పంపించారు. అయితే ప్రజ్వల హోంలోని పిల్లలను చూసే అవకాశం కూడా ఇవ్వడం లేదు..’అని హెచ్ఆర్ఎఫ్ పేర్కొంది. -
నలుదిశలా ఖ్యాతి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాకతీయులు, చాళుక్యుల శిల్పకళా రీతులకు అనుగుణంగా లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం 90 శాతం పనులు పూర్తయ్యాయి. మహారాజగోపురం, దివ్య విమాన గోపురం, నాలుగు దిక్కుల పంచతల రాజగోపురాలు, ఆలయ మండపాల నిర్మాణం శిల్ప సౌందర్య సమాహారంగా రూపుదిద్దుకుంది. వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ ఆలోచనలకు అద్దంపట్టే విధంగా స్తపతులు, ఆర్కిటెక్ట్‌లు ప్రపంచ స్థాయి ఆలయంగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆలయ నిర్మాణంలో వ్యాలీపిల్లర్లు, ఆళ్వారు పిల్లర్లు, ఔటర్ ప్రాకారంలో బాలపాదం పిల్లర్లు.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్లేలా ఉన్నాయి. లక్ష్మీనరసింహ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, యాదాద్రి దివ్యక్షేత్రం చరిత్రను స్తపతులు కృష్ణ శిలల్లో తీర్చిదిద్దారు. డాక్యుమెంటరీ నిర్మాణం.. : యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. భవిష్య త్ తరాలకు ఆలయ నిర్మాణ శైలి, నిర్మాణం జరిగిన తీరు వంటి పలు అంశాలను తెలియజెప్పేందుకు దీనిని నిర్మిస్తున్నారు. యాదగిరిగుట్టకు నాలుగు దిక్కుల నుంచి.. ఎటువైపు నుంచి చూసినా ఆలయం కనిపించేలా మహోన్నత శిల్పగ్రామంగా తీర్చిదిద్దారు. తంజావూరులోని బృహదీశ్వరాలయం ప్రధాన రాజగోపురం తరహాలో వెయేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా యాదాద్రిలో రాజగోపురాల నిర్మాణం చేపట్టారు. ఇందులో మహారాజ గోపురం (79 అడుగులు), గర్భాలయంపై దివ్యవిమాన గోపురం (40 అడుగులు), నాలుగు దిక్కులా ఐదంతస్తుల రాజగోపురాల (55 అడుగులు)ను పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మించారు. యాదాద్రిలో మండపంలో కూర్చున్న వారు స్వామివారి నిత్య కల్యాణాన్ని వీక్షించే విధంగా నిర్మాణాలను డిజైన్ చేశారు. జైపూర్ నుంచి జైన శిల్ప కళాకృతులు.. కాగా, జైన ఆలయ రీతుల్లో కూడా యాదాద్రిలో శిల్పాకృతులను ఏర్పాటు చేయనున్నారు. జైన శిల్పకళా ఖండాలను జైపూర్‌లో తీర్చిదిద్దుతున్నారు. ఆ శిల్పాలు త్వరలో ఇక్కడికి రాబోతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, బాహ్య ప్రాకారంలో 153 బాలపాదాల పిల్లర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పిల్లర్‌ను తయారు చేయడానికి ఒక్కో శిల్పికి మూడు నెలల సమయం పట్టిందని చెబుతున్నారు. బాలపాదం ప్రతి స్తంభంపైన నవనారసింహ అవతారాలు, సింహం, ఏనుగులు, హంసలు, పుష్పాలు ఇలా.. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలే విధంగా రమణీయంగా అష్టభుజి మండపాలను తీర్చి దిద్దుతున్నారు. ఇతర దేవాలయాల్లో ఆళ్వార్లు కూర్చుని ఉన్న భంగిమలో భక్తులకు దర్శనం ఇస్తారు. కానీ యాదాద్రిలో ఆళ్వార్లు నిలబడి ఉన్న భంగిమలో భక్తులకు దర్శనం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత అని చెబుతున్నారు. -
యాదాద్రికి ఎల్ఈడీ వెలుగులు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అత్యాధునిక హంగులతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. ఎల్ఈడీ లైట్లతోపాటు ఏసీ చిల్లర్స్, అగ్నిమాపక యంత్రాలు, సీసీ కెమెరాలు, సీసీ టీవీలను అమర్చనున్నారు. యాదాద్రిని తిరుమల తరహాలో తీర్చిదిద్దాలన్న ప్రణాళికలో భాగంగా ఒక్కో హంగును సమకూరుస్తున్నారు. అవసరమైన విద్యుత్ పరికరాలను వివిధ దేశాలనుంచి ప్రత్యేక సంస్థల ద్వారా దిగుమతి చేసుకునే పనుల్లో వైటీడీఏ అధికారులు నిమగ్నమయ్యారు. కొండపై ప్రత్యేకంగా రెండు సబ్స్టేషన్లు నిర్మించనున్నారు. మెట్లదారిలో సుమారు రూ.15 కోట్ల ఖర్చుతో 1600 కేవీ సబ్‌స్టేషన్, అలాగే 1000 కేవీ కెపాసిటీ గల మరో సబ్‌స్టేషన్ గోశాలవద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రధానాలయంలో సౌండ్ సిస్టం, కేబుల్, విద్యుత్ దీపాలు, ఏసీల అమరికను ప్రత్యేకం గా చేపడుతున్నారు. గర్భాలయం, ముఖ మండపం, గిరి ప్రదక్షిణం, సత్యనారాయణవ్రత మండపం, ఆలయ తిరుమాడ వీధులు, దక్షిణ ప్రాకార మండపం వంటి ప్రాంతాలలో విద్యుత్లైట్లకు సంబంధించిన కేబుళ్లను పూర్తిగా భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నారు. గర్భాలయంలో 600 టీఆర్ సామర్థ్యం గల ఏసీలను అమర్చుతున్నారు. ఆలయంలో అమర్చే లైట్లన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. ఆలయ తిరుమాడ వీధులు, శివాలయం, సత్యనారాయణవ్రత మండపం వంటి ప్రదేశాలలో హైమాస్ట్ లైట్లతో వెలుగులు నింపే విధంగా ఎల్ఈడీలను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రికి మూడో కన్నుగా కెమెరాలు దేవస్థానంలో ఏ మూలాన ఏమి జరిగినా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అమర్చనున్నారు. ప్రధానాలయంలో మొత్తంగా 65 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. సుమారు కోటిన్నర రూపాయలతో జర్మనీనుంచి సీసీ కెమెరాలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కెమెరాలను 10 టీవీలకు అనుసంధానించనున్నారు. భద్రతకు సంబంధించిన పరికరాలన్నీ జర్మనీ, జపాన్, స్వీడన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. యాదాద్రి రాజగోపురాలు ఎంత దూరం నుంచి చూసినా లైట్ల వెలుతురులో అందంగా కనపడే విధంగా ప్రత్యేక షేడింగ్ లైట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆధునిక ఏసీల ఏర్పాటు గర్భాలయంలో అత్యాధుక ఏసీ చిల్లర్స్‌ను అమర్చనున్నారు. ఈ ఏసీ చిల్లర్స్కు కొండపైన గల పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసి అందులో ఈ మిషన్ నుంచి గర్భాలయంలోకి పైపుల ద్వారా శీతలగాలిని వదులుతారు. గర్భాలయం మొత్తం చల్లగా మారుతుంది. గంటపాటు నిర్విరామంగా ఏసీని వదులుతే మూడు గంటలపాటు చల్లదనం ఉంటుందని చెబుతున్నారు. ఈ మిషన్లన్నీ కూడా జర్మనీ నుంచి తెప్పిస్తున్నారు. సంవత్సరం తర్వాత యాదాద్రి దేవస్థానం అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. అలాగే ఆధునిక అగ్నిమాపక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
కీరాతకం
తెల్లవారి లేచినప్పుడు ఇంటి ముందు ముగ్గు కనిపిస్తే ఆనందంగా ఉంటుంది. రక్తపు కళ్లాపి కనబడితే? రెండు నెలల క్రితం. అక్టోబర్‌లో దసరా మరుసటి రోజు. ఉదయం 5 గంటలు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట.మరి కాసేపటిలో గుడి నుంచి మేలుకొలుపు మొదలుకానుంది.ఆ లోపే పోలీస్ స్టేషన్లో ఫోన్ అదేపనిగా మోగింది.నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కునికిపాట్ల నుంచి బయటపడి ఫోన్ ఎత్తాడు.‘చెప్పండి’...‘సార్.. నేను తూరుపు వీధి నుంచి మాట్లాడుతున్నాను. ఐదు నిమిషాల క్రితం మార్నింగ్ వాక్ కోసమని నిద్ర లేచి ఇంటి బయటకు వచ్చాను. మా ఇంటి ముందంతా రక్తపు మరకలు పడి ఉన్నాయి. ఏం జరిగిందో తెలియడంలేదు. భయంగా ఉంది..’ వెంటనే సమాచారం ఎస్.ఐకి వెళ్లింది. మరి కాసేపటిలోనే ఎస్.ఐతో పాటు పోలీసు సిబ్బందీ అక్కడకు చేరుకున్నారు.ఆ ఇంటి ముందంతా రక్తపు మరకలు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు పెనుగులాyì నట్టు నేల ఒరుసుకున్నదానిని బట్టి అర్థమవుతోంది. అయితే రక్తం ఎవరిదన్న విషయమై ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఎవరిదా రక్తం? ఏదైనా అనుకోని ఘటన జరిగి ఉంటుందా? రకరకాల అనుమానాలతో సిబ్బంది తిరుగుముఖం పట్టారు. అక్టోబర్ 19న దసరా. భక్తుల రాకపోకలకు తోడు పండక్కి బంధువుల రాకపోకలు కూడా ఉండేసరికి ఊరంత సందడి సందడిగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరుగకుండా పోలీసులు యాదగిరిగుట్ట పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించారు. అంతా సక్రమంగా ఉంది అనుకుంటూ ఉండగా తెల్లారే సరికి ఈ రక్తపు మరకల సంఘటన ఎదురై ఎస్.ఐ మనసును చేదుగా మార్చింది. ‘ఎవరిదైనా హత్య జరిగి ఉంటుందా? ఎవరు చేసి ఉంటారు..? హత్య కాబడిన వ్యక్తి ఎవరు..? అక్కడికి రక్తపు మరకలు ఎలా వచ్చాయి’ స్థానికులను ఆరా తీశారు పోలీసులు. ఎవరి నుంచీ సరైన సమాధానం గానీ, ఆనవాలు కానీ లభించలేదు. యాదగిరిగుట్ట రూరల్ సీఐకి సమాచారం ఇచ్చాడు ఎస్సై. సీఐ హుటాహుటినా వచ్చాడు. ఇద్దరూ కలిసి విషయం చర్చించి, మరోసారి రక్తపు మరకలు ఉన్న స్థలాన్ని పరిశీలించారు. రక్తపు మరకల వార్త యాదగిరిగుట్టలో దావానలంలా వ్యాపించింది. రక్తం చిందిన చోటు కనిపిస్తోంది. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా శవం లేదు. అసలు ఆ రక్తం మనిషిదేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.ఇదే విషయం మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనం పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. చనిపోయింది ఒకరా, ఇద్దరా.. అనే కోణంలో విపరీతమైన ప్రచారం సాగుతోంది. క్లూస్ టీం రంగంలోకి దిగి గాలించారు. వాళ్ల అన్వేషణ ఫలించింది. రక్తపు మరకలకు కొద్ది దూరంలో వారికో వస్తువు కనిపించింది.చేతిలోకి తీసుకుని చూశారు.బైక్ కీ. మరికొంత వెతికితే చేతి వాచీ కనిపించింది. ఆ రెండూ ఎవరివి? ఒకరోజు గడిచింది.పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళ వచ్చింది. వాలకం చూస్తుంటే ముస్లిం అని వెంటనే తెలిసిపోతోంది. ‘సార్... మా ఆయన పేరు జాఫర్. ఆయన తన ఫ్రెండ్ బైక్ మీద హైదరాబాద్ వెళుతున్నానని తెల్లారే వస్తానని చెప్పిన వ్యక్తి రెండు రోజులు గడిచినా రాలేదు’ అంది. ఆమె ఏడుస్తూ ఉంది.ఈ జాఫర్ ఎవరు? ఆ రక్తపు మరకలకు ఇతనికీ ఏమైనా సంబంధం ఉందా?పోలీస్‌లు జాఫర్ కోసం వెదకడం ప్రారంభించారు. ఇంతలో.. యాదగిరిగుట్ట నుంచి గంగసానిపల్లి వెళ్లే రోడ్డుపై పల్సర్ బైక్ ఒకటి పడి ఉందని స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు మునుపు కీ దొరికింది. ఇప్పుడు బైక్ దొరికింది. ఆ కీ ఈ బైక్దేనా? ట్రై చేసి చూశారు. ఆ బైక్ దే. దెబ్బకు స్టార్ట్ అయ్యింది. కేసు కూడా. దెబ్బకు సాల్వ్ అయిపోతుందా? ఆర్టిఏ నుంచి బైక్ నెంబర్ ఆధారంగా దాని యజమాని అడ్రస్ తీసుకున్నారు. అది సురేష్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అతని ఫోన్ నెంబర్ కోసం ట్రై చేస్తే స్విచ్చాఫ్ వస్తోంది. పోలీసులు సురేష్ ఇంటికి వెళ్లారు. ‘సార్.. రెండు రోజుల క్రితం బైక్‌ను జాఫర్ అని నా భర్త స్నేహితుడు తీసుకెళ్లాడు. మా ఆయన ఊరెళ్లి నాలుగు రోజులైంది’ అని చెప్పింది.‘మరి ఫోన్ ఎందుకు పలకడం లేదు?’‘ఫోన్ పాడైంది. ఇంకా కొత్తది కొనలేదు. అందుకే స్విచ్చాఫ్ వస్తోంది’ అని చెప్పింది.బైక్ కీ ఎవరిదో తేలిపోయింది. ఇక వాచీ ఎవరిదో తేలాలి.. అనుకుంటూ జాఫర్ భార్యకు కబురుపెట్టారు. సంఘటన స్థలంలోదొరికిన వాచీని చూపించారు. ‘ఇది మా ఆయనదే సార్’ చెప్పిందామె ఏడుస్తూ... ఏదో అనర్ధం జరిగే ఉంటుందని భయపడుతూ! ‘రక్తపు మరకలు కనిపించిన రోజు నుంచి జాఫర్ కూడా కనిపించడం లేదు. అంటే హత్యకు గురైంది జాఫరేనా..?’వెంటనే సురేశ్ కోసం సెర్చింగ్ మొదలైంది. పోలీసులు అనుమానాస్పద పరిసరాల్లో ఏదైనామృతదేహం దొరుకుతుందేమో అని వెతకడం ప్రారంభించారు. చివరకు హైదరాబాద్‌లోని నాగోల్ వద్ద గల మూసీకాలువలో జాఫర్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆలస్యం చేయలేదు. జాఫర్ స్నేహితులు ఎవరెవరు అని కూపీ లాగారు. వాళ్లల్లో అనుమానితులుగా ఉన్న సంతోష్, వర్ధన్‌లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో బంధువులింట్లో ఉన్న సురేశ్నీ పట్టుకొచ్చారు. విచారణలో అసలు విషయంవెలుగులోకి వచ్చింది. సంతోష్, వర్ధన్లు అన్నదమ్ములు. వీరికి సురేష్, జాఫర్ స్నేహితులు. నలుగురూ చిన్ననాటి నుంచి కలిసి తిరిగారు. నలగురికీ వ్యసనాలు ఉన్నాయి. దొంగమార్గంగా డబ్బులు సంపాదించడం, వచ్చినదాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం చేసేవారు. ఇటీవల జాఫర్‌కు ఎక్కడి నుంచో అనుకోకుండా పెద్ద మొత్తంలో పైకం చేతికి అందింది. ఏం సెటిల్మెంట్ చేశాడో తెలియదు. ఆ డబ్బు చూసుకొని స్నేహితులను లెక్క చేయకుండా ఉండటం మొదలెట్టాడు. అతనికి హేళన ఎక్కువ. ఎంతమాటంటే అంత మాట అనేవాడు. కార్లు బేరం చేయడం, ఫోన్లు కొనడం.. ఇవన్నీ చేస్తుండేసరికి జాఫర్ మీద ఈ ముగ్గురికీ అసూయగా ఉంది. దసరా రోజున ‘పండగ రోజు పార్టీ ఇస్తున్నాను రా’ అని జాఫర్‌ని పిలిచారు సంతోష్, వర్థన్‌లు. రోజూ మందు పార్టీ అంటే భార్య తిడుతుందని ఆమెకు హైదరాబాద్ వెళుతున్నానని అబద్ధం చెప్పి పార్టీకి వచ్చాడు జాఫర్. వీరితో సురేశ్ కూడా జాయిన్ అయ్యాడు.నలుగురూ ఊళ్లోనే ఒక వీధి మలుపులోని అడ్డా మీద చేరి తాగడం మొదలుపెట్టారు. ఒంటి గంట దాటి పోయింది. ఊరంతా గాఢంగా నిద్ర పోతూ ఉంది. మేలుకుని ఉన్నది ఈ ఇద్దరే.ఇంతలో ముందు అయిపోయింది.‘మీరు ఇళ్లకెళ్లి చీప్ లిక్కర్ తాగి పడుకోండి. నేను బ్లాక్ లేబుల్ తాగి పడుకుంటా’ అని హేళనగా మాట్లాడాడు జాఫర్. అసలే మంట మీద ఉన్న స్నేహితులకు ఈ మాటలు ఇంకా మంట పుట్టించాయి.‘ఏమన్నావ్’ అని సంతష్ అతని మీదకు వెళ్లాడు. ఇద్దరూ కలబడ్డారు. మధ్యలో అడ్డు పడబోయిన వర్థన్‌ను రెండు పీకాడు జాఫర్. అది చూసే సరికి సంతోష్‌కు ఇంకా కోపం వచ్చింది. ‘నా తమ్ముడినే కొడతావా..’ అంటూ చేతికి అందిన వస్తువుతో ఇష్టం వచ్చినట్టు జాఫర్‌ని కొట్టాడు. ఆ పెనుగులాటలో వారు తమ అడ్డా నుంచి కదిలి ఒక ఇంటి ముందుకు వచ్చి పడ్డారు. ఆ ఇంటి ముందే జాఫర్ మీద దాడి చేశాడు సంతోష్. చివరి దెబ్బ పడటానికి చాలాసేపటికి ముందే జాఫర్ చనిపోయాడు, తన చావుకు ఆనవాలుగా రక్తపు మరకలను వదిలి.మత్తు దిగింది. ఆవేశం తగ్గింది. కాని ఎదురుగా మాత్రం శవం పడి ఉంది. జరగరాని తప్పు. చెరపలేని తప్పు. ఏం చేయాలో ఈ ముగ్గురికీ అర్ధం కాలేదు. అక్కడ ఉన్నది ముగ్గురు మనుషులు, ఒక శవం, ఒక బైక్. సురేశ్ ముందు అక్కడి నుంచి తన బైక్‌తో సహా మాయమవ్వాలని అనుకున్నాడు. కాని స్టార్ట్ చేద్దామంటే కీ కనిపించలేదు. ఈ గొడవలో ఎక్కడో పడిపోయింది. బైక్ అక్కడే ఉంటే ప్రమాదమని బైక్‌ని తోసుకుంటూనే మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్లాడు సురేష్. అటు నుంచి ట్రాలీ ఆటో వెతికి పట్టి దానిలోకి ఎక్కించాడు.సంతోష్, వర్ధన్‌లకు సొంత ఆటో ఉంది. వర్థన్ వెంటనే వెళ్లి ఆ ఆటో తెస్తే తమ్ముడితో కలిసి సంతోష్ జాఫర్ శవాన్ని అందులోకి చేర్చాడు. వాళ్లు అక్కడి నుంచి హైదరాబాద్ శివారు వరకు వచ్చి నాగోల్‌కి దగ్గరలో పారుతున్న మూసి కాలువలో శవాన్ని పడేసి వెళ్లిపోయారు.. సురేశ్ తన పల్సర్‌ను యాదగిరిగుట్ట నుంచి గంగసానిపల్లికి వెళ్లె దారిలో ట్రాలీ నుంచి దింపించి ట్రాలీ వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక చెట్ల పొదల్లో బైక్‌ని ఉంచేసి, మరుసటి రోజు డూప్లికేట్ కీ తెచ్చి తీసుకెళ్దామని ఇంటికి వెళ్లాడు. భార్యకు జరిగిన విషయం అంతా చెప్పి ‘ఎవరైనా అడిగితే బండిని జాఫర్ తీసుకెళ్లాడని చెప్పు. నేను ఊళ్లో లేనని చెప్పు’అని హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. కాని కీ దొరకడంతో కేసు తాలూకు క్లూ కూడా దొరికినట్టయ్యింది. స్నేహితులం అని చెప్పుకు తిరిగిన ఈ నలుగురూ స్నేహానికి మచ్చ తీసుకొచ్చారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఏ ప్రయతమూ ఫలించలేదు. నిందితులు ముగ్గురు ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు. – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
కుప్పకూలిన శిక్షణ విమానం..!
కిలోమీటర్ దూరంలోనే బాహుపేట గ్రామం.. పక్కనే నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి.. ఓ వెంచర్లో పనులు చేసుకుంటున్న పలువురు కూలీలు... ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఓ శిక్షణ విమానం పెద్దశబ్దంతో ఆ వెంచర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో కళ్లుమూసి తెరిచేలోపే కుప్పకూలింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే విమాన శకలాలు అల్లంతదూరాన పడ్డాయి. విమానం ఆనవాళ్లు లేకుండా కాలిబూడిదైపోయింది. ఉహించని ఘటనతో మండల పరిధిలోని బాహుపేట ఉలిక్కిపడింది. ప్రత్యక్ష సాక్షులు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట (ఆలేరు) : హైదరాబాద్ హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్శిక్షణ కేంద్రానికి చెందిన ఫైటర్ విమానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యోగేష్ యాదవ్ శిక్షణ తీసుకుంటున్నాడు. మరో 15 రోజులైతే శిక్షణ పూర్తి చేసుకునే దశలో యోగేష్ నడుపుతున్న ఫైటర్ విమానంలో హకీంపేట నుంచి బయలుదేరాడు. బాహుపేట సమీపంలోకి రాగానే.. బుధవారం ఉదయం సుమారు 11.40 గంటల ప్రాంతంలో యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలోకి రాగానే ఫైటర్ విమానంలోని ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారులతో ఎప్పటికప్పుడు పైలట్ యోగేష్ యాదవ్ సమస్యకు సంబంధించిన వివరాలు అందిస్తూనే ఉన్నాడు. విమానంలో తలెత్తిన సమస్య మరింత తీవ్రంగా మారింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి, పైలట్ యోగేష్ యాదవ్ విమానంలో ఉన్న ప్యారాచూట్, ఇతర సామగ్రి సహాయంతో బయటికి దూకాడు. దీంతో సుమారు అర కిలోమీటర్ దూరంలోకి వెళ్లి విమానం భారీ శబ్దంతో కుప్ప కూలిపోయి.. పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు, వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై నుంచి వెళ్లె ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సుమారు అర కిలోమీటర్ దూరంలో పడిపోయిన పైలెట్ యోగేష్ యాదవ్‌ను స్థానికులు వెళ్లి పరామార్శించారు. ఏం జరిగిందంటూ.. బాహుపేట సమీపంలో కుప్పకూలిన ఫైటర్ విమానం చూసి యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. శిక్షణ తీసుకుంటున్న పైలట్‌కు చెందిన ఫైటర్ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.. అదే సయమంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కోసం ప్రముఖ నాయకులు అప్పుడే బహిరంగ సభలకు బయల్దేరిన హెలికాప్టర్ ఏమైనా కుప్పకూలిందా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇటీవల వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హెలికాప్టర్లో పర్యటనలు చేస్తున్నారు. బుధవారం అధికంగా ప్రముఖులు వివిధ ప్రాంతాలకు పర్యటించే క్రమంలో ఏమైన ప్రమాదం జరిగాందా అనే అనుమానంతో అధిక సంఖ్యలో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు అధిక సంఖ్యలో చేరుకున్నా రు. శిక్షణ తీసుకుంటున్న విమానం కుప్పకూలిందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా ప్రమాదం జరిగిన ప్రదేశంలో కూడా ఎవరు లేకపోవడంతో ప్రాణహాని జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అధికారులు సంఘటన స్థలానికి 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో చేరుకున్నారు. తొలుత హెలికాప్టర్లో ఆర్మీకి చెందిన వైద్యులు నలుగురు అక్కడికి చేరుకున్నారు. పైలెట్‌కు వైద్య పరీక్షలు చేసి, మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలోనే మరో హెలికాప్టర్ ఆకాశంలో నాలుగు సార్లు తిరిగి దిగింది. అందులో ప్రమాదం జరిగిన తీరును పరిశీలించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సాంకేతిక నిపుణులు వచ్చి అక్కడ ఖాళీ బూడిదైన శకలాలను పరిశీలించారు. అంతకు ముందే భువనగిరి ఏసీపీ జితేదర్రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేష్‌లు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయాలతో పైలెట్.. సెల్ఫీలతో యువకులు... శిక్షణ విమానంలో గాయాలైన పైలెట్‌ను రక్షించకుండా స్థానిక యువకులు సెల్ఫీ తీసుకున్నారు. కనీస మానవతాదృక్పథంతో ఆలోచించకుండా ఖాళీ బూడిదైన విమానం వద్ద, గాయాలై కిందపడిపోయిన పైలెట్ వద్దకు వెళ్లి కొందరు యువకులు సెల్ఫీలు తీసుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ శబ్దం వచ్చింది మేము వెంచర్లో పనులు చేస్తున్నాం. అప్పుడే మా సార్ కారులో వస్తున్నాడు. ఒక్క సారిగా విమానం ఆకాశంలో నుంచి కిందకి వస్తుంటే అందులో నుంచి ఓ వ్యక్తి బెలున్ కట్టుకొని కిందకు దూకాడు. కళ్లు తెరచి మూసే లోపే భారీ శబ్దంతో విమానంలో భూమిపై పడిపోయింది.దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. దానిని చూసి షాక్‌కు గురయ్యాం. భయమేసింది. నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు. కొద్ది సేపటికి తేరుకొని చూసే సరికి జనమంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. కిందపడిన వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేసిన.. భాష అర్థం కాలేదు. ఇలాంటి ప్రమాదం చూడడం ఇదే ప్రథమం. – నిర్మల, బాలలక్ష్మి, ప్రత్యక్ష సాక్షులు -
సాంకేతిక లోపంతో కూలిన ఫైటర్ విమానం
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలోని విఖ్యాత్ వెంచర్లో బుధవారం ఓ ఫైటర్ శిక్షణ విమానం సాంకేతిక లోపంతో నేలకూలింది. అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్ హకీంపేటలో గల భారత వాయుసేనకు చెందిన స్థావరంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేశ్ యాదవ్ పైలట్‌గా శిక్షణ తీసుకుంటున్నాడు. బుధవారం ఉదయం యోగేశ్ హకీంపేట నుంచి ఫైటర్ శిక్షణ విమానంలో బయల్దేరాడు. సరిగ్గా 11.40 గంటల సమయంలో విమానం బాహుపేట సమీపంలోకి రాగానే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని కంట్రోల్ చేయడానికి యోగేశ్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో గ్రామ శివారులో ఉన్న విఖ్యాత్ వెంచర్ వద్దకు రాగానే ప్యారాచూట్ సాయంతో కిందకి దూకాడు. విమానం సుమారు అర కిలోమీటర్ దూరంలో కుప్పకూలిపోయి, పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో పైలట్ యోగేశ్ కాళ్లకు తీవ్ర గాయాలై చచ్చుబడి పోయాయి. ప్రమాదం జరిగిన అరగంటకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మరో హెలికాప్టర్లో ఆర్మీ వైద్యులు అక్కడికి చేరుకున్నారు. యోగేశ్‌కు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆర్మీ నిపుణులు పరిశీలించారు. భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేశ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. -
ఆడపిల్లలా.. బ్రాయిలర్ కోళ్లా?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో అభం శుభం తెలియని చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టిన వ్యవహారంపై ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్రాయిలర్ కోళ్లకు ఇచ్చినట్లు ఆడపిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినా ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని మండిపడింది. యాదాద్రిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. మీకు తెలియలేదంటే అసలేం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కయి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. అటు, ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం సోమవారం విస్మయం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం జరగకుండా అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. ‘యాదాద్రి’ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడంపై వైఖరి తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నరకకూపం నుంచి బయటపడిన బాధితులను రక్షించేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారో చెప్పాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఏం చేయాలనుకుంటున్నారో కూడా వివరించాలని ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాలన్నింటినీ తమ ముందుంచాలంటూ విచారణను మంగళవారానికి (అక్టోబర్ 23) వాయిదా వేసింది. అలాంటి వారికి బెయిలిస్తారా? యాదాద్రి వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి కింది కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి హేయమైన కేసుల్లో దిగువ కోర్టు బెయిల్ ఇస్తుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ‘సదరు కోర్టు బెయిల్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారా? ఒకవేళ ఆయన వ్యతిరేకించినా.. జడ్జీ బెయిల్ ఇచ్చారా? ఇంత క్రూరంగా వ్యవహరించిన వారికి బెయిల్ ఎలా ఇస్తారు?’ అని ధర్మాసనం మండిపడింది. ఈ కేసు వివరాలన్నింటినీ తన ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపడమే తీవ్రమైన నేరమైతే.. వారు యుక్త వయస్కులుగా కనిపించేందుకు హార్మోన్ల ఇంజక్షన్లు ఇవ్వడం అమానవీయం. మాంసం ఎక్కువగా వచ్చేందుకు బ్రాయిలర్ కోళ్లకు హార్మోన్ ఇంజక్షన్లు ఇస్తారు. ఇక్కడ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడానికి వాళ్లు.. ఆడపిల్లలా? లేక బ్రాయిలర్ కోళ్లా?’ అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చిన్నారులను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపడం ఓ మార్కెట్‌గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకోసం ఏం చేస్తున్నారు? యాదాద్రిలో చిన్నారులను వ్యభిచార వృత్తిలోకి దింపిన దారుణ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలతో చలించిపోయిన ప్రధాన న్యాయమూర్తి ఈ ఘటనను సుమోటోగా పరిగణించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. యాదాద్రి ఘటనపై ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు, జరిపిన అరెస్టులు వివరాలను కోర్టు ముందుంచారు. కొందరిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బాధితులను రక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని, ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చర్యలు తీసుకోబోతున్నారని ప్రశ్నించింది. ఘటన జరిగిన తీరును చూస్తుంటే.. నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కయ్యారనే అనుమానం వస్తోందని పేర్కొంది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వ వైఖరేంటో తెలియచేయాలని ఆదేశించిన ధర్మాసనం.. ఈ సిట్‌లో మహిళాధికారులకు తగిన ప్రాధాన్యత ఉండాలని తేల్చిచెప్పింది. వర్ణనాతీత వేదనకు పరిహారం సరిపోతుందా? అమాయకులైన చిన్నారులకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిన వైద్యుడికి కూడా బెయిల్ రావడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. ఈ వైద్యుడిపై నేరపూరిత కుట్ర (ఐపీసీ సెక్షన్ 120(బీ)కింద) కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను నిలదీసింది. ఈ సమయంలో అదనపు ఏజీ జె. రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ బాధితులకు పరిహారం చెల్లించామని చెబుతుండగా.. ధర్మాసనం జోక్యం చేసుకుని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘తమపై అరాచకంగా వ్యవహరించిన నరకకూపంలో మగ్గిన చిన్నారులు పడ్డ వర్ణనాతీత వేదనకు పరిహారం ఇస్తే సరిపోతుందా?’ అంటూ మండిపడింది. పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఇటువంటి హేయమైన ఘటనలు జరుగుతున్నా.. తెలియలేదంటే ఏం చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ను, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై అదనపు ఏజీ సమాధానమిస్తూ.. అసలు వ్యభిచారం జరుగుతున్నట్లు చుట్టుపక్కల వారికీ తెలియదని చెప్పారు. దీనిపైనా ధర్మాసనం మండిపడింది. దారుణమైన అరాచకాన్ని నిరోధించలేకపోవడానికి ఇలాంటి వాదనలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. పత్రికల్లో వచ్చిన కథనాలపై అదనపు ఏజీ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘మేం పత్రికా కథనాలపై పూర్తిగా ఆధారపడలేదు. జిల్లా జడ్జీ నుంచి కూడా నివేదిక కూడా తెప్పించుకున్నాం’ అని వెల్లడించింది. అవసరమైతే ఈ కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు సైతం ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. మంగళవారం నాటి విచారణకు యాదాద్రి డీసీపీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. -
మిస్సింగ్ కేసుల్లో ఫేషియల్ రికగ్నైజేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదృశ్యమైన చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్(ఎఫ్ఆర్)ను వినియోగించుకోవాలని సీఐడీ భావిస్తోంది. యాదగిరిగుట్ట వ్యభిచార కూపంలోని చిన్నారులను రక్షించిన పోలీసులకు ఇప్పుడు వారిని తమ తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత పడింది. ఆ చిన్నారుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది తల్లిదండ్రులు ముందుకొచ్చారు. అయితే ఎవరు ఎవరిబిడ్డో తేల్చలేని పరిస్థితి పోలీసులకు ఏర్ప డింది. దీంతో సీఐడీ దగ్గరున్న మిస్సింగ్ డేటాను ఎఫ్ఆర్ ద్వారా గుర్తించాలని సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్, చైల్డ్ రైట్ వింగ్ ప్రయత్నాలు చేస్తోంది. దీనితో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెస్క్యూ అయిన చిన్నారుల తాజా ఫొటోలను తమ వద్ద ఉన్న సమాచారానికి పోలీసులు అనుసంధానిస్తున్నారు. -
వారిని సమాజ బహిష్కరణ చేయాలి
సాక్షి, హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కేంద్రంగా సాగిన వ్యభిచారంతో సంబంధమున్న వారిని సమాజ బహిష్కరణ చేయాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కూపంలోకి చిన్నారులను సైతం దించడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, దీనిపై సీఎం జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో సమీక్షించాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మంలో హ్యాపీ ఫ్యూచర్ మల్టీపర్పస్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో మహ్మద్ రఫీ అనే వ్యక్తి రూ.100 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని, దీనిపై సీబీసీఐడి దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లు, గర్భాలయం, కొండపై పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా కొండపైకి భారీ వాహనాలను అనుమతించలేదు. సుమారు 40 వేల మంది స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి 4 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండపై పనులు జరిగే ప్రాంతాల నుంచి విష్ణు పుష్కరిణిలోకి పెద్ద ఎత్తున మట్టి కొట్టుకు వచ్చింది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
‘గుట్ట’లో కార్డన్ సెర్చ్
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదగిరిగుట్ట పట్టణంలోని పలుకాలనీల్లో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రాంచంద్రారెడ్డి, ట్రైనీ ఐపీఎస్ రక్షిత ఆధ్వర్యంలో ఖాకీలు నిర్బంధ తనిఖీలు నిర్వహించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వేకువ జామున గాఢ నిద్రలో ఉన్న ఆయా కుటుంబాలు.. ఒక్క సారిగా ఇంటి తలుపుల శబ్దం విని తీసే సరికి పోలీసులు కనిపించడంతో ఏమీ జరిగిందోననే ఆందోళన నెలకొంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండో రోజే కార్డన్ సెర్చ్ చేయడంతో సర్వత్ర చర్చనీయాంశమైంది. పట్టణంలోని ప్రశాంత్‌నగర్, సుభాష్‌నగర్, అంగడిబజారు, పెద్దకందుకూర్ ప్రాంతాల్లో సుమారు 300 ఇళ్లు, వ్యభిచార గృహాలపై పోలీసులు ఒక్కసారిగా సోదాలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. భక్తులు బస చేసే ప్రవేట్ లాడ్జీల్లోకి వెళ్లి పలు జంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, కుటుంబాల్లో ఉన్న వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలు సరిగ్గా లేకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేసిన వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సోదాల్లో పత్రాలు సరిగ్గా లేని 23 ద్విచక్రవాహనాలు, 4 కార్లు, 4 ఆటోలను ఠాణాకు తరలించారు. అంతే కాకుండా లాడ్జీల్లో ఉన్న 16 జంటలను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుగురులాడ్జీ యాజమానులను అరెస్టు చేసి 5మంది ఉమెన్స్ రెస్క్యూ చేశారు. ఉదయాన్నే మద్యం అమ్మకాలు జరుపుతున్న రెండు బెల్ట్ దుకాణాపై దాడులు చేసి సీజ్ చేశామని, అనుమానితుడిని, 8మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. ఈ సోదాల్లో యాదగిరిగుట్ట, భువనగిరి ఏసీపీలు సముద్రాల శ్రీనివాసచార్యులు, జీతేందర్‌రెడ్డి, ఎనిమిదిమంది సీఐలు, 20మంది ఎస్ఐలు, 15మంది మహిళా పోలీసులు, 150మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్‌కు ప్రజలు మద్దతునిచ్చారని, రానున్న రోజుల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం పెద్దదిగా మారుతుండటంతో నిత్యం ఇలాంటి దాడులు చేయాలని ప్రజలు పోలీసులను కోరారు. వాహనాల పత్రాలు సరిగ్గా ఉన్న పలు వాహనాలను యాజమానులు పత్రాలు తీసుకెళ్లి పోలీసులకు అందజేయడంతో పలువురికి ఇచ్చారు. -
యాదాద్రి జోన్లో కార్డన్ సెర్చ్..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జోన్లో పోలీసులు తాజాగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. యాదగిరిగుట్ట ట్రెయినీ ఐపీఎస్ అధికారిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్‌లో ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 8 సీఐలు, 20 మంది ఎస్సైలు, 15 మంది మహిళా పోలీసులు, 120 పోలీసులు పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలులేని నాలుగు కార్లు, నాలుగు ఆటోలు, 21 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలు జంటలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 21 మంది మహిళలను, 43 మంది పురుషులు ఉన్నారు. -
చిన్నకందుకూరులో గోరక్షకుల దాడి
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో దళితులపై దాడి చేశారు. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంక్రాంతి పండగ సందర్భంగా 14న చిన్నకందుకూరులో దళితులు అర్ధరాత్రి గోవును కోస్తున్న క్రమంలో 30 మంది ఆర్ఎస్ఎస్, గోరక్షక్, వీహెచ్‌పీ కార్యకర్తలు బైక్‌లపై వచ్చారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ, ఆర్ఎస్ఎస్ జిందాబాద్ అంటూ కర్రలతో దాడి చేశారు. దీంతో ఎర్ర చంద్రయ్య, ఎర్ర ఉప్పల య్య, బొల్లారం యాదయ్య, ఎర్ర పోచయ్య, ఎర్ర మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గోవును వధిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దళితులపై కేసులు నమోదు చేశారు. నిందితులను శిక్షించాలి: టీమాస్ విషయం తెలుసుకున్న టీమాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్‌వెస్లీ, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్లు బాధితులను శనివారం పరామర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయా లని యాదగిరిగుట్ట ఏసీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని ఏసీపీ సముద్రాల శ్రీనివాసాచార్యులు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. -
24 నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 31 వరకు జరగనున్నాయి. 24న అంకురార్పణ, 26న స్వామివారి ఎదుర్కోలు, 27న తిరుకల్యాణ మహోత్సవం, 28న దివ్య విమాన రథోత్సవం ఉంటాయని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రంగులు, సున్నాలు, చలువ పందిళ్లు వేస్తున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత ఈ నెల 31న చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నామని ఈవో వెల్లడించారు. ఆలయాన్ని ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేస్తున్నట్లు చెప్పారు. -
2030లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదు
యాదాద్రి భువనగిరి : 2019లో కాదు కదా 2030లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు. యాదగిరిగుట్టలో విలేకరులతో మాట్లాడుతూ..వంగపల్లి సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మార్ రెడ్డి ప్రగల్భాలు పలికాడని విమర్శించారు. ఎవరిని మభ్యపెట్టడానికి సీఎం కేసీఆర్ పై వాఖ్యలు చేశారని ప్రశ్నించారు. అవినీతికి నిలువుట్టద్దం బిక్షమయ్యగౌడ్ అని ఆరోపించారు. బిక్షమయ్య ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి తీన్మార్ మల్లన్న విమర్శలు చేస్తున్నాడని చెప్పారు. నిజంగా బిక్షమయ్య నీతిపరుడే అయితే ఎందుకు ముందస్తు బెయిల్‌తో తిరుగుతున్నాడని సూటిగా అడిగారు. -
కుటుంబసమేతంగా యాదాద్రికి కేసీఆర్
సాక్షి, యాదాద్రి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా శుక్రవారం యాదాద్రి సందర్శించారు. స్వామివారి దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వచనం పొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్వీ నాయకుడు తుంగ బాలు వివాహానికి సీఎం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సుమారు రూ.800 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనతో పాటు రెండోదశ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రధానాలయం, పెద్దగుట్ట టెంపుల్ సిటీ పనులను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం, వైటీడీఏతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్ట చేరుకున్నారు. ఆయనకు ఈ సందర్భంగా మంత్రులు జగదీశ్ రెడ్డి, ఐకే రెడ్డి, విప్ సునీత, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. -
కుటుంబసమేతంగా యాదాద్రికి కేసీఆర్
-
దర్శనభాగ్యం కలిగేనా!
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహుడి ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిజ దర్శనం భక్తులకు మరింత దూరం అవుతోంది. దసరా, బ్రహ్మోత్సవాలు, స్వామి వారి జయంత్యుత్సవాలు ఇలా గడవు పొడిగిస్తూ పోతున్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నా.. ఆశించినంత వేగంగా జరగడం లేదు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి యాదాద్రీశుడి దర్శనభాగ్యం కల్పిస్తామని వైటీడీఏ ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చడం లేదు. ముఖ్యమంత్రి యాదాద్రిని తిరుపతి తిరుమల తరహాలో ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి రూ. 1000 కోట్లతో బృహత్తర ప్రణాళికను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైటీడీఏ పనులను పర్యవేక్షిస్తోంది. బిల్లులు రాకపోవడమే కారణమా..? యాదాద్రి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 4 నెలలుగా వైటీడీఏ నుంచి బిల్లులు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. కూలీల కొరత, పెద్దనోట్ల రద్దు, వర్షాలు ఇలా పలు రకాల కారణాలతో పనులను వాయిదా వేస్తూ వస్తున్నారు. జాప్యానికి కారణాలు తొలుత దసరా, ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు ఇప్పుడు స్వామివారి జయంతి.. అంటే వచ్చే సంవత్సరం మే నాటికి పొడిగింపు జరిగింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. దక్షిణ ప్రాకారం పనులు పూర్తికాకపోవడంతో శిల్పి పనులు, ప్రధానాలయం విస్తరణ పనులకు అడ్డంకిగా మారింది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవల యాదాద్రికి వచ్చి బ్రహ్మోత్సవాలకు స్వయంభూవుల దర్శనం కల్పించలేమని జయంత్యుత్సవాల నాటికి అది సాధ్యమవుతుందని తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి యాదాద్రికి వచ్చి పనులను పరిశీలించి పనులు జరుగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ పనుల ప్రణాళిక అక్టోబర్ 19, 2016 ముఖ్యమంత్రి కేసీఆర్ గుట్టలో సమీక్ష నిర్వహించారు మార్చి 31,2017 నాటికి సివిల్ పనులు పూర్తి చేయాలి ఆగస్టు 31,2017 నాటికి శిల్పి పనులు పూర్తి చేయాలి దసరా నాటికి స్వయం భూవుల దర్శనం కల్పించాలి -
యాదాద్రి పనులు పరిశీలించిన సీఎమ్‌వో కార్యదర్శి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులను శనివారం సీఎమ్‌వో కార్యదర్శి భూపాల్‌రెడ్డి పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్ ఆనంద్‌సాయి, జేసీ రవినాయక్, ఆలయ ఈవో గీతారెడ్డి ఉన్నారు. -
సురేంద్రపురి వద్ద రోడ్డు ప్రమాదం
- 15 మందికి తీవ్ర గాయాలు భువనగిరి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలం సురేంద్రపురి వద్ద శనివారం చోటు చేసుకుంది. యాదగిరిగుట్టకు వెళ్లే దారిలో ఉన్న సురేంద్రపురి వద్ద తుఫాన్, స్కార్పియో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి 32 అవతారాలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం యాదాద్రి అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష జరిగింది. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాలు ప్రతిబింబించేలా ప్రతిష్టించాలని, లక్షమందికి పైగా భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా దర్శనం జరగాలని, యాదాద్రికి నలువైపులా నాలుగు లైన్ల రోడ్డు నిర్మించాలని, ప్రధాన గుట్టకు అభిముఖంగా ఉండే గుట్టపై కాటేజీలు, ఈశాన్య భాగంగా 13 ఎకరాల గుట్టపై రెసిడెంట్ సూట్ నిర్మించాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. అలాగే ఇప్పుడున్న బస్టాండ్, డిపోలను మరోచోటుకు మార్చాలని ఆయన పేర్కొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాలు తరలించొద్దు
యాదగిరిగుట్ట: యాదాద్రిలో అభివృద్ధి నెపంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోద శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే అశాస్త్రీయంగా ఆర్టీసీ డిపోతోపాటు బస్టాండు వంటివి తరలిస్తే ఎంతోమంది చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోవడంతోపాటు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ కార్యాలయాల తరలింపు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని శ్రీరాములు కోరారు. కాగా, ఈ విషయమై వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావును కలిసి విజ్ఞప్తి చేస్తామని కూడా ఆయన తెలిపారు. -
మోటకొండూరు మండలం గ్రామస్థుల ఆందోళన
నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేయనున్న మోటకొండూరు మండలంలో తమ గ్రామాలను కలపాలని కోరుతూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం ఉదయం రాస్తారోకో చేశారు. మహబూబ్‌పేట, చెల్లేరు, చిన్నకందుకూరు, చీమలకొండూరు, ముత్యాలపల్లి తదితర గ్రామాలను మోటకొండూరు మండలంలో కలపాలని వారు డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి ఈ గ్రామాలు దగ్గరగా ఉన్నందున పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని వారు చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వారు మంగళవారం ఉదయం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. -
విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి చెందాలి
యాదగిరిగుట్ట: ప్రదేశాల్లో భక్తుల ఆకలి తీరుస్తున్న అన్నదాన సత్రాలు ఎంతో గొప్పవని, అన్ని దానాల కంటే.. అన్నదానం గొప్పదని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనచారి అన్నారు. యాదగిరిగుట్టలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అన్నదాన సత్రానికి భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఇలాంటి అన్నదాన సత్రాలు నిర్మించి అన్నప్రసాదం అందించడంతో ఎంతో మంది భక్తులు, ప్రజలు గుర్తు చేసుకుంటారన్నారు. విశ్వ బ్రాహ్మణుల్లో అనైక్యతతో ప్రస్తుత కాలంలో వారికి డబ్బు, రాజ్యాధికారం లేదన్నారు. ఇకనైనా ఐక్యతతో ముందుకు సాగి అభివృద్ధి చెందాలన్నారు. విశ్వబ్రాహ్మణులకు అనేక రకాలుగా సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విశ్వబ్రాహ్మణులు పారిశ్రామికంగా సైతం ఎదగాలని సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు కుందారం గణేషాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములవాడ మధన్మోహన్, రాష్ట్ర కార్యదర్శి వడ్లోజు వెంకటేశ్, గౌరవ అధ్యక్షుడు శివకోటి వీరస్వామి, వడ్లోజు మన్మథాచారి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పసూనూరి బ్రహ్మనందచారి, మండల అధ్యక్షుడు చెన్నోజు భగవంతాచారి, కందోజు నర్సింహాచారి, శివకోటి భాస్కరాచారి, కందుకూరి నాగభూషణం, కోటగిరి విద్యాధర్‌చారి, జనగాం రత్నయ్యచారి ఉన్నారు. -
యాదాద్రిలో కొనసాగుతున్న బైండోవర్లు
యాదగిరిగుట్ట: గ్యాంగ్‌స్టర్ నయీం అలియాస్ నయీమొద్దీన్ ఎన్కౌంటర్ నేపథ్యంలో జిల్లాలోని బైండోవర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు నయీంతో సంబంధాలు నెరిపిన ఛోటా నాయకుల నుంచి బడా రౌడీల వరకు మొత్తం 25 మంది అనుమానితులను పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ నిర్వహించారు. తాజాగా శుక్రవారం మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పథకాలన్నీ కాంగ్రెస్‌వే :భిక్షమయ్యగౌడ్
యాదగిరిగుట్ట : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవేనని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే కొత్తపేర్లతో ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారని విమర్శించారు. తొలి సారిగా రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిధులు ఏ మాత్రం ప్రకటించకున్నా తనపై సీబీఐ కేసులు బయటకి రాకుండా ఉండడానికే సీఎం ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన శక్తులే కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌గౌడ్, గుండ్లపల్లి నర్సింహగౌడ్, గుడ్ల వరలక్ష్మీ, కలకుంట్ల బాలనర్సయ్య, పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, తంగళ్లపల్లి సుగుణాకర్, కానుగు బాలరాజు, షంషీర్‌పాషా, బొజ్జ సాంబేష్ ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయలు
యాదగిరిగుట్ట: హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి నుంచి ఆలేరు వైపునకు వెళ్తున్న మహేంద్రజీపు వంగపల్లి వద్ద నిలిచి ఉన్న ఆటోను, ద్విచక్రవాహనంతో పాటు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్ గడ్డం బాలయ్య, బైక్‌పై ఉన్న బండి మధు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ప్రశాంత్‌లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం జీపు అతివేగమని స్థానికులు తెలుపుతున్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
త్వరలో రాజగోపురాల కూల్చివేత
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థాన విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రధానాలయం రాజగోపురాలు, ఆలయ ఆవరణలోని మండపాలను కూల్చివేయనున్నట్లు వైటీడీఏ అధికారులు సోమవారం తెలిపారు. సుమారు 2.33 ఎకరాల్లో విస్తీర్ణం కానున్న ప్రధానాలయానికి ఇటీవల వాస్తు ప్రకారం అమ్మవారి ఆలయం, ఆళ్వార్ల ఆలయం, గోదాదేవి ఆలయం వంటివి ఎక్కడ నిర్మించాలో సర్వే చేశామన్నారు. ఈ క్రమంలో పాంచరాత్రాగమ శాస్త్రానుసారం పూజలు చేసిన అనంతరం ధ్వజస్తంభాన్ని తొలగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సుదర్శన చక్రం ఉన్న రాజగోపురం కేవలం 12 ఫీట్లు మాత్రమే ఉందని, దీనిని సుమారు 52 అడుగుల ఎత్తు పెంచనున్నట్లు తెలిపారు. -
సీఎం రాజీనామా చేయలంటూ ర్యాలీ
యాదగిరిగుట్ట : ఎంసెట్–2 లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిలు రాజీనామా చేయాలని కోరుతూ గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైకుంఠ ద్వారం నుంచి అమరవీరుల స్థూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. లీకేజీతో ర్యాంకులు పొందిన వారిని అనర్హులుగా ప్రకటించి, మిగతా విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ, తెలంగాణ యూనివర్సిటీల కన్వీనర్ శంకర్లు కోరారు. ఈ ర్యాలీలో తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన 350 ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉచిత సేవలు అభినందనీయం...
యాదగిరిగుట్ట: పేద ప్రజలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉచిత వైద్యం చేస్తున్న ఆర్కే ఆస్పత్రి సేవలు అభినందనీయమని యాదగిరిగుట్ట జెడ్పీటీసీ కర్రె కమలమ్మ అన్నారు. మండలంలోని బాహుపేటలో ఆదివారం భువనగిరికి చెందిన ఆర్కే ఆస్పత్రి నిర్వాహకులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కమలమ్మ సర్పంచ్ ఇమ్మడి మాధవితో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పల్లె ప్రాంతాల్లోని పేదలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలాంటి ఆస్పత్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో 300పైగా మంది రోగులు వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ఆస్పత్రి అధినేత డాక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అరుణ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుండె నర్సయ్య, ఎస్ఎంసీ చైర్మన్ కౌడే మహేందర్, ఉపసర్పంచ్ చాంద్‌పాషా, చెవి, ముక్కు, గొంతు నిపుణులు విద్యాసాగర్, ఆండ్రియాలజిస్టు సురేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దేవస్థాన రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి
యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉద్యోగాలు నిర్వర్తించి విరమణ పొందిన వారందరికీ ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇవ్వాలని ఆ సంఘం అధ్యక్షుడు కె.శేషాచార్యులు కోరారు. పట్టణంలో గురువారం రిటైర్డ్ ఉద్యోగ సంఘం 18వ పెన్షనర్స్‌డే సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేవస్థాన ఫించన్‌దారులకు ఇంక్రుమెంట్లు కల్పించాలన్నారు. అంతే కాకుండా స్థానికంగా ఉన్న దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగులకు వైటీడీఏ ద్వారా ని«ధులు కేటాయించి భవనం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం 75 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న విశ్రాంత ఉద్యోగులకు అమృతోత్సవ సన్మానం చేశారు. అలాగే సమావేశానికి వచ్చిన పెన్షనర్లకు భోజన ఏర్పాటు చేసిన రాములు, జయమ్మకు సన్మానం చేశారు. సమావేశంలో కలకుంట్ల బాలనర్సయ్యగౌడ్, కోల ఆంజనేయులుగౌడ్, శ్రీనివాసరావు, యాదగిరిచారి, నాగభూషణం, నర్సింహ, డి.యాదగిరిరెడ్డి, నరేశ్, స్వామి పాల్గొన్నారు. -
ఆలయంలో ఘనంగా సుదర్శన యాగం
యాదగిరికొండ : యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయంలో సుదర్శన యాగాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వయంభూమూర్తులకు పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేశారు. ఆలయంలో ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అదిష్ఠింప చేసి వివిధ రకాలైన పుష్పాలు, తులసీ దళాలతో అర్చన గావించారు. అలాగే ఆలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహించారు. నవగ్రహాలకు ప్రదక్షిణం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగళ్ లక్షీనరసింహచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు గట్టు యాదగిరిస్వామి, మంగళగిరి నరసింహమూర్తి, ఆలయ అధికారులు చంద్రశేఖర్, జూషెట్టి కృష్ణ, వేముల వెంకటేశ్, రాకేశ్ బాబు పాల్గొన్నారు. -
యాదగిరి గుట్టలో కార్డెన్ సెర్చ్
యాదగిరి గుట్ట: నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట పట్టణంలో భువనగిరి డీఎస్పీ సాదు మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వేకువజామున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లు, అనుమానిత ప్రాంతాలలో తనిఖీలు చేశారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో ఐదుగురు సీఐలు, 25 మంది ఎస్ఐలు, 200 మంది పోలీసులు పాల్గొన్నారు. రహదారిలో వాహనాలను కూడా తనిఖీ చేశారు. -
గౌరాయిపల్లిలో చిరుత సంచారం
యాదగిరిగుట్ట : ఓ చిరుత పులి గ్రామంలో సంచరిస్తోందని భయాందోళన చెందతున్న సంఘటన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లిలో జరిగింది. గ్రామంలో చిరుత పులి సంచారాన్ని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు గ్రామంలో పులి సంచరించిన అనవాళ్లను పరిశీలించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని చూచించారు. -
ఆలయాల కూల్చివేతలకు నిరసనగా భారీ ర్యాలీ
యాదగిరిగుట్ట: విజయవాడలో నిర్మాణాల పేరుతో హిందూదేవాలయాల కూల్చివేయడాన్ని నిరసిస్తూ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ తీశారు. పీఠాధిపతులు, పూజారుల సలహాలు, సూచనలు పాటించకుండా దేవాలయాలను కూల్చడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సమితి రాష్ట్ర కార్యదర్శి కట్టెగొమ్ముల రవీందర్ రెడ్డి అన్నారు. కూల్చివేసిన విగ్రహాలను మళ్లీ ప్రతిష్టించి మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
నీటి కోసం మహిళల నిరసన
యాదగిరిగుట్ట: తమ కాలనీలో నీటి సమస్యపై ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పంచాయతీలోని బీసీ కాలనీ మహిళలు శుక్రవారం ఉదయమే పంచాయతీ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. దాదాపు 25 మంది మహిళలు బిందెలతో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నీటి కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులెవరూ ఇంకా అక్కడికి చేరుకోలేదు. -
యాదాద్రిలో ప్రైవేటు లాడ్జీలపై దాడులు
యాదగిరిగుట్ట (నల్లగొండ) : ప్రైవేటు లాడ్జీలపై పోలీసులు దాడిచేసి 20 జంటలను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం యాదగిరిగుట్టలో జరిగింది. యాదాద్రిలో సుమారు 50కిపైగా ప్రైవేటు లాడ్జీలు ఉన్నాయి. వాటిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇవాళ పోలీసులు ఒకేసారి దాడి చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న 20 జంటలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ చేసి వదిలేశారు. -
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ రాస్తారోకో
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. కరువుపై సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టింది. ఇందులో భాగంగా మండల కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలు, ధర్నాలు, సీఎం దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, వరంగల్ జిల్లా హసన్‌పర్తి, నల్లగొండ జిల్లా గరిడేపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రిలో ప్రధాన రహదారిపై నాయకులు రాస్తారోకోకు దిగారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తుండగా అట్టహాసంగా టీఆర్ఎస్ పార్టీ సభలు జరుపుకోవటాన్ని తీవ్రంగా ఖండించారు. నిరసన కారణంగా రహదారిపై వచ్చే భక్తుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పైన ఎండ వేడిమి, ఆగి పోయిన రాకపోకల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, సీఎం దిష్టిబొమ్మల దహనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాల ఆలయానికి తరలిన లక్ష్మీనృసింహుడు
యాదగిరికొండ(నల్లగొండ): యాదిగిరి లక్ష్మీ నృసింహుడు బాలాలయానికి తరలివెళ్లాడు. ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను చేపట్టిన నేపథ్యంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేపట్టారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త్రిదండి చిన్న జీయర్‌స్వామి నేతృత్వంలో సాగింది. ఇకపై బాలాలయం నుంచే స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వయంభు నరసింహుడితో పాటు కవచమూర్తులు, ఆండాళ్ అమ్మవారు, ఆళ్లార్ల, క్షేత్రపాలకుల విగ్రహాలను ఒక్కొక్కటిగా బాలాలయంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, విప్ సునీత, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్రధాని సోదరుడు
భువనగిరి: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ దర్శించుకున్నారు. బుధవారం ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా క్షేత్రన్ని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. -
'గుట్ట'లో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. గుళ్లపల్లి నుంచి గుట్ట వైకుంఠ ద్వారం వరకు రోడ్డు పనులకు అధికారులు మార్కింగ్ చేశారు. కాగా, రోడ్డు విస్తరణ కారణంగా షాపులు, ఇళ్లు కోల్పోయే బాధితులకు ముందుగా పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్ డిమాండ్ చేశారు. -
మార్చి 17న యాదాద్రిలో కల్యాణోత్సవం
హాజరుకానున్న ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం మార్చి 17న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవ తేదీలను అధికారికంగా ఖరారు చేశారు. కల్యాణోత్సవానికి తాను హాజరవుతానని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విసృ్తత ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. -
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రిలో భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం కావడంతో.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. -
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో యాదాద్రి లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అదే విధంగా వేముల వాడ రాజరాజేశ్వరి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భద్రాచలం ఇక భద్రాచలం వెళ్లే దారులన్ని భక్త జన కోలహలంతో నిండిపోయాయి. భద్రాచలంలోని రాముల వారి ఉచిత దర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రం స్వామివారిని రాపత్తు ఉత్సవంలో భాగంగా గోవింద మండపంపై వూరేగిస్తారు. ఈ ఊరేగింపు చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు.