మార్చి 17న యాదాద్రిలో కల్యాణోత్సవం
హాజరుకానున్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం మార్చి 17న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవ తేదీలను అధికారికంగా ఖరారు చేశారు. కల్యాణోత్సవానికి తాను హాజరవుతానని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విసృ్తత ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.