కూటమి కార్యకర్త హల్‌చల్‌.. ముద్రగడ ఇంటిపై దాడి | Janasena Activist Over Action At Mudragada House In Kakinada, More Details Inside | Sakshi
Sakshi News home page

కూటమి కార్యకర్త హల్‌చల్‌.. ముద్రగడ ఇంటిపై దాడి

Published Sun, Feb 2 2025 10:11 AM | Last Updated on Sun, Feb 2 2025 11:31 AM

Janasena Activist Over Action AT Mudragada House

సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార​్‌సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్‌చల్‌ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు.

వివరాల ప్రకారం.. వైఎస్సార్‌సీపీ ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం వద్ద జనసేన కార్యకర్త హల్‌చల్‌ చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్‌ తీసుకుని వచ్చాడు. అనంతరం, అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్‌ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్‌ చేశాడు.

అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన దాడిని పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement