
కాకినాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికే సై అంటోంది. వేరే పార్టీల నాయకులను బెదిరించడంతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించి టీడీపీలో చేర్చుకుంటోంది. తాజాగా తునిలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బెదిరించడంతో పాటు అక్రమ కేసులు బనాయించింది. దాంతో వారు టీడీపీలో చేరకతప్పలేదు. ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 స్థానాలను వైఎస్సార్ సీపీ గెలవగా, ఇప్పుడు తాజాగా టీడీపీ రాజకీయ కుట్రలకు తెరలేపింది. టీడీపీకి సంఖ్యా బలం లేకపోయినా దౌర్జన్యాలు, బెదిరింపులతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేరేలా కుట్రలు చేశారు యనమల.
ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగు సార్లు వాయిదా వేయించిన టీడీపీ.. చైర్మన్ సుధాబాలు రాజీనామా చేసేలా ఆయనపై అక్రమ కేసులు బనాయించింది. ఈ క్రమంలోనే సుధాబాలు తన పదవికి రాజీనామా చేశారు. పోలీసుల సహకారంతో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపి.. వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment