kakinada
-
కాకినాడ జిల్లా బూరుపూడిలో మందుబాబు వీరంగం
-
వైఎస్ఆర్సీపీలో నూతన నియామకాలు
-
కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, 21 నుంచి పరీక్షలు ఉన్నాయని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేదానిపై తెలియలేదన్నారు. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాలి. ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయి.. స్పోర్ట్స్ కూడా బాగా ఆడతాడని ఉమామహేశ్వరరావు అన్నారు.రైలు కిందపడి..శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ ఎల్సీ గేటు దగ్గర గూడ్స్ రైలు క్రింద పడి గుర్తు తెలియని యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పలాస రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం
సాక్షి,కాకినాడజిల్లా:తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక భాష్యం స్కూల్లో దాడిశెట్టి పరమేష్(6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం పరమేష్‌ను తండ్రి సురేష్ స్కూల్లో వదిలిపెట్టాడు. ఉదయం 10:30 గంటలకు పరమేష్‌కు టానిక్ పట్టించాలని చెప్పిన ఆగంతకుడు స్కూల్ నుండి బైక్‌పై తీసుకువెళ్లాడు.మధ్యాహ్నం పేరేంట్స్ పరమేష్‌కు లంచ్ బాక్స్ తేవడంతో అసలు విషయం బయటపడింది. స్కూల్లో బాబు లేకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వెంటనే బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. -
కూటమి కార్యకర్త హల్చల్.. ముద్రగడ ఇంటిపై దాడి
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు.వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం వద్ద జనసేన కార్యకర్త హల్చల్ చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. అనంతరం, అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన దాడిని పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రామ్ లక్ష్మణ్.. హ్యాపీ బర్త్ డే
కవలలుగా పుట్టిన రామ్ లక్ష్మణ్ లకు ఆ గ్రామంలో గురువారం మొదటి పుట్టిన రోజు (Birthday) వేడుక ఘనంగా జరిపారు. చప్పట్ల మధ్య పెద్ద కేక్ కట్ చేసి తినిపించారు. బంధుమిత్ర సపరివారంగా ఆ చిన్నారులను ఆశీర్వదించి, చివరిగా విందారగించారు. ఈ హడావుడి చూసి ఇదేదో చిన్న పిల్లల జన్మదిన వేడుక అనుకుంటున్నారేమో! ఇదంతా ఓ కుటుంబం సొంత బిడ్డల్లా సాకుతున్న దూడల జన్మదిన వేడుక. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలోని మిరియాల వెంకట్రాజు ఇల్లు ఈ వేడుకకు వేదిక అయ్యింది. వెంకట్రాజుకు చెందిన ఆవు (Cow) ఏడాది కిందట సరిగ్గా ఇదే తేదీన రెండు కవల దూడలకు జన్మనిచ్చింది. వాటికి రామ్, లక్ష్మణ్ (Ram Laxman) అని పేర్లు పెట్టారు. అవి పుట్టి ఏడాది పూర్తి కావడంతో ఘనంగా జన్మదిన వేడుక జరిపారు. – ప్రత్తిపాడుకిలో మీటరు మేర డోలీ మోత గిరిజన ప్రాంతంలో గర్భిణులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేక గిరి బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి కిలోమీటరు వరకు రహదారి సౌకర్యం లేదు. ఎటువంటి వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక వనిత భర్త మోహన్‌రావు, కుటుంబ సభ్యుల సహాయంతో డోలీ కట్టి రహదారి సౌకర్యం ఉన్న బొడ్డగొంది గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి సంతోష్, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా చెరువువీధి గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామానికి రహదారి ఉండేదని, భూ సమస్య కారణంగా ఒక వ్యక్తి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రహదారి సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితంలేకుండాపోతోందని వాపోయారు. – ముంచంగిపుట్టుచివరి మజిలీలో ‘దారి’ చిక్కులుతిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, జింగిలిపాళెం దళితవాడకు చెందిన వెంకటేశ్ (34) మృతి చెందడంతో గురువారం ఆయన అంతిమ యాత్రకు చిక్కులు ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ మృతి చెందడంతో బంధువులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. అయితే దారి లేకపోవడంతో నానా అగచాట్లు పడుతూ పంట పొలాల గట్లు మీద నడుచుకుంటూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలు అవస్థల మధ్య జరగడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. – రేణిగుంటవిశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రెండు ఎద్దులు అధిపత్యం కోసం పోరాడాయి. వీటి మధ్య జరిగిన పోరును స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఓ దశలో ఇవి వారివైపునకు రాగా... స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఒకవైపు పెట్రోలింగ్‌కు వాహనాలు లేవని చెబుతున్న పోలీసులు..చిన్న మరమ్మతులైన వాటినీ రిపేర్ చేయించకుండా మూలన పడేస్తున్నారు. దానికి ఈ చిత్రమే నిదర్శనం. విశాఖలోని మద్దిలపాలెం అవుట్‌పోస్ట్ వద్ద మరమ్మతులకు గురైన పోలీస్ పెట్రోలింగ్ బైక్‌ను నెలల తరబడి ఇలాగే వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఇది తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్. లడ్డూలు లేకపోవడంతో ఇలా నో స్టాక్ బోర్డును టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు లడ్డు ప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరిగారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, తిరుపతిచదవండి: సర్పమా.. మేఘమా! -
రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: ‘మీకూ మీ రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఓ దండం.. నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు.. అక్రమ కేసులు, వేధింపులకు నేను పాల్పడ లేను..’ అని సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు.. తాము చెప్పింది చేయాల్సిందేనని, నిబంధనలు జాన్తానై అంటూ డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు. దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డీజీపీ, సీఐడీ చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలోబ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు. రెడ్‌బుక్(Redbook) వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్‌బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) ద్వారా కుట్రకు తెరతీసి.. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ‘సీజ్ ద షిప్’ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కాగా, కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సీఐడీకి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్‌కు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను చీఫ్‌గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్‌లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలి తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. పోలీసు పెద్దకు దిశా నిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ‘క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తోంది. సీఐడీ చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్‌లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్‌లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. డీజీపీదీ అదే మాట.. బ్రిజ్‌లాల్ వైఖరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్‌లాల్‌ను డీజీపీ తన చాంబర్‌కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్‌లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పని చేస్తున్నానన్నారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్‌కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏవోబీలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్‌గా పని చేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ, సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన బ్రిజ్‌లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ, సీఐడీ చీఫ్ హడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్‌లాల్‌ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు.త్వరలో సిట్ చీఫ్‌గా మరొకరు! తమ కుట్రలకు వినీత్ బ్రిజ్‌లాల్ ససేమిరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్‌గా మరొకర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా, వినీత్ బ్రిజ్‌లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. ఉన్నత పదవులు పొందేందుకు, రిటైరైన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి. చదవండి: చెప్పారంటే.. చేయరంతే!డీజీపీ కావాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైరైన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టింగు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పని చేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్‌లాల్ నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నాయి. -
సెల్‌ఫోన్ మింగి మహిళ మృతి
కాకినాడ క్రైం: సెల్‌ఫోన్ మింగిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి (35) మానసిక అనారోగ్యంతో బాధ పడుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చేరింది. అక్కడ తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. వెంటనే వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈసోఫాగస్ (అన్నవాహిక) పూర్తిగా దెబ్బ తింది. దీంతో అక్కడి వైద్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. రమ్య స్మృతిని శఽనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. సెల్‌ఫోన్ తొలగింపు ప్రక్రియలో రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు చేసిన పొరపాటు వల్లే తమ కుమార్తె చనిపోయిందని తండ్రి విలపించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడయ్యే వరకూ అక్కడే ఉంచాలని కోరినా రాజమహేంద్రవరం జీజీహెచ్ అధికారులు బలవంతంగా కాకినాడకు తరలించారని ఆరోపించాడు. అక్కడి నుంచి కాకినాడ చేరేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆ వ్యవధిలో రమ్య ఆరోగ్య స్థితి మరింత క్షీణించి మరణానికి దారి తీసిందని వాపోయాడు.భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం! -
గుండాట పేరుతో గుండు కొట్టేశారట
-
పవన్ పర్యటన.. జనసేన మహిళా నేతకు అవమానం!
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వేళ జనసేన మహిళా నేత చల్లా లక్ష్మీకి చేదు అనుభవం ఎదురైంది. సంక్రాంతి సంబరాల వద్ద ఆమెకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చల్లా లక్ష్మీని బయటకు పంపారు. దీంతో, తోపులాట జరిగి ఆమె కిందపడిపోవడంతో తలకు గాయమైంది. అనంతరం, ఆమె విలవిల్లాడిపోయింది.సంక్రాంతి సందర్బంగా పిఠాపురం మండలం కుమారపురంలో మినీ గోకులాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, స్థానికులు వచ్చారు. అలాగే, జనసేన ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆమెకు అనుమతి లేదంటూ చల్లా లక్ష్మీని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు తెలిపారు. దీంతో, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ తగలడంతో విలవిల్లాడిపోయారు.ఈ నేపథ్యంలో జనసేన నేతలు, పోలీసులపై జనసేన వీర మహిళలు మండిపడుతున్నారు. పార్టీలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే ఇదేనా తమను ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక, గాయపడిన చల్లా లక్ష్మీ అక్కడే ఉన్న మహిళలు సాయం చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా పిఠాపురంలో జనసేన వీర మహిళలకు అవమానం జరిగింది. పవన్ పాల్గొంటున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న వీర మహిళలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. వీరంతా.. పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకుందామని అక్కడికి వచ్చినట్టు చెప్పారు. కానీ, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గత ఎన్నికల్లో మండుటెండల్ని లెక్క చేయకుండా.. కుటుంబాన్ని వదిలి పవన్ గెలుపు కోసం పని చేశామని వీర మహిళలు గుర్తు చేశారు. ఇద్దరు నేతలే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. -
సీజ్ ద షిప్! అంతా తూచ్..!
-
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో 52 అదనపు రైళ్లు (special trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. SCR to run Additional Sankranti Special Trains between various Destinations @drmvijayawada @drmgtl @drmgnt pic.twitter.com/fdoNVWdxSq— South Central Railway (@SCRailwayIndia) January 5, 2025 -
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్.. నేటి నుంచి బుకింగ్స్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లాలనుకొనే ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. పండగ రద్దీ దృష్ట్యా ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుంది. కాచిగూడ -కాకినాడ టౌన్, హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు టికెట్ రిజర్వేషన్ల బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8గంటల నుంచి అందుబాటులో ఉంటుందని సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు.కాచిగూడ - కాకినాడ టౌన్ రైలు (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకోనుంది. అలాగే, కాకినాడ టౌన్ -కాచిగూడ రైలు (07654) ఈ నెల 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది.హైదరాబాద్ -కాకినాడ టౌన్ రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయని రైల్వే శాఖ తెలిపింది.ఇదీ చదవండి: బంగారం ఎంత కొనచ్చు? పెళ్లికానివారికైతే అంతే! -
జనసేన ఎమ్మెల్యేపై ప్రజల తిరుగుబాటు
-
పుంగనూరు గిత్త దూడ ఎత్తు 16 అంగుళాలు
కాకినాడ జిల్లా, కరప మండలం జెడ్. భావారం గ్రామంలో పుంగనూరు జాతి గిత్త దూడ 16 అంగుళాల ఎత్తుతో జన్మించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది మరీ పొట్టిగా ఉండటంతో గ్రామంలోని రైతులు వింతగా చూస్తున్నారు. పుంగనూరు ఆవు బుధవారం ఉదయం ఈ దూడకు జన్మనిచ్చిందని ఆ గ్రామానికి చెందిన రైతు కంచెర్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ దూడ 16 అంగుళాల ఎత్తు, 36 అంగుళాల పొడవు, 4 కిలోల బరువు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. – కరపరైతులకు ‘జల’గండంవరుసగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామ రైతులకు కష్టాలు తప్పడం లేదు. వీరి పంట భూములు బాహుదానదికి అవతల ఉండటంతో ఏటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు బాహుదా గెడ్డలోకి నీరు చేరడంతో కోత కోసిన ధాన్యం ఓవులను ఇంటికి తెచ్చేందుకు రైతులు పీకల్లోతు నీటిలోకి దిగాల్సి వచ్చింది. ప్రభుత్వం మినీ వంతెన నిర్మిస్తేనే ‘జలగండం’ తప్పుతుందని అన్నదాతలు చెబుతున్నారు. – ఇచ్ఛాపురం రూరల్‘మా రోడ్డు చూడండి..’తమ రోడ్డు దుస్థితిని చూడాలంటూ విజయనగరం జిల్లా వంగర మండలం భాగెంపేట యువకులు రోడ్డుకోసం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అరసాడ జంక్షన్ నుంచి భాగెంపేట వరకు అధ్వానంగా ఉన్న రోడ్డును డ్రోన్ కెమెరాలో బుధవారం చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నీలయ్యవలస, భాగెంపేట, పటువర్ధనం, శ్రీహరిపురం, దేవకివాడ ఆర్అండ్ఆర్ కాలనీ గ్రామాలకు ఈ గోతులమయమైన రోడ్డే గతని, అధికారులు సమస్యపై స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో బస్సు సర్వీసును నిలిపివేశారని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించకుంటే నిరసన తెలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – వంగరచదవండి: బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..! -
‘సీజ్ ద షిప్’ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్!
కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్ ఎపిసోడ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టెల్లా షిప్ సీజ్ చేయడం కుదరదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పరోక్షంగా తేల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైప్ నేపథ్యంలో .. ఈ ఎపిసోడ్లో నెక్ట్స్ ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ‘‘ స్టెల్లా ఎల్ పనామా షిప్ లో12 శాంపిల్స్ సేకరించాం. షిప్ లో 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకుంటే ..పరీక్షలు చేసిన తర్వాత 1,320 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. ఆ బియ్యాన్ని మొదట ఆన్ లోడ్ చేస్తాం. అసలు ఏ రైస్ మిల్లు నుంచి ఆ బియ్యం వచ్చాయో తేలాలి. .. ప్రస్తుతానికి ఆ లోడ్ సత్యం బాలాజీ అనే ఎక్సపర్టర్స్ కి చెందినది గా గుర్తించాం. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది. కాకినాడ పోర్టులో ఇంకా లోడ్ చేయాల్సిన బియ్యం 12వేల టన్నులు ఉన్నాయి. వాటిలో ఎక్కడా పీడీఎస్ బియ్యం లేవని నిర్ధరించుకున్న తర్వాతే లోడింగ్‌కు అనుమతిస్తాం. .. కాకినాడ యాంకేజ్ పోర్టు, డీప్సీ వాటర్ పోర్టులో కూడా మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేశాం. ఒక్క గ్రాము పీడీఎస్ బియ్యం కూడా దేశం దాటకుండా చర్యలు తీసుకుంటాం. షిప్‌ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. షిప్‌ను సీజ్ చేయడం అంత సులువుగా జరిగే పని కాదు’’ అని కలెక్టర్ మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. గత నెల 29న అప్పటికే అధికారులు పట్టుకున్న రేషన్ బియ్యపు అక్రమ రవాణా షిప్ వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో.. తనను ఎవరూ పట్టించుకోలేదని అధికార యంత్రాంగంపైనా ఆయన చిర్రుబుర్రులాడారు కూడా.ఇదీ చదవండి: అందులో భాగంగానే తెరపైకి సీజ్ ద షిప్! -
‘కుడా’ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి
సాక్షి, కాకినాడ: కాకినాడలో ‘కూడా’(కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఛైర్మన్ తుమ్మల బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. పరిమితికి మించి స్టేజ్‌పైకి ఎక్కవ మంది చేరడంతో కుప్పకూలింది. వేదిక కూలడంతో ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కిందపడిపోయారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత యథావిధిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. -
కాకినాడలో కుడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశ్రుతి
-
టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం
సాక్షి,కాకినాడ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు. గోపి మూర్తికి 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిదే గెలుపు కాయం అవుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 15,490.జేఎన్టీయూలో ఇవాళ ( (సోమవారం) ఉదయం 8 గంటలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్ళపై 9 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని విజయం వరించింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుపై పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం. నా విజయం దివంగత మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీకి అంకితం. నాకు ఓట్లు వేసిన టీచర్లకు కృతజ్ఞతలు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. టీచర్లపై అదనపు భారం తగ్గించాలి. సీపీఎస్ రద్దుపై పోరాటం కొనసాగిస్తాను. పిపుల్స్ రిప్రజెంటీవ్ నుండి పొలిటికల్ రిప్రజెంటీవ్ అయ్యాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 15,490 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎన్నికల అధికారులు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. ఇద్దరి పోరులో గోపిమూర్తి విజయం సాధించారు. -
భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం తప్పా: Kanna Babu
-
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది
-
వైఎస్సార్సీపీలో ఉంటే ఆస్తులు కొనుక్కోకూడదా?: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీ, కాపులను అణివేసే ధోరణీ జరుగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. గత వైఎస్ జగన్ హయంలో ధాన్యం ధర రూ.2వేలు ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.1400 లకే రైతులు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రింబయిర్స్మెంట్ చెల్లించాలని, లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రమైన ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.ఈ మేరకు శుక్రవారం దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కాకినాడ సెజ్‌లో తాను ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్ మీద హెచ్చు రేటు పెట్టి భూములను రైతుల నుంచి కొనుక్కున్నానని చెప్పారు. 1940 నుంచి తమ కుటుంబం బంగారం వ్యాపారంలో ఉందన్నారు. తన దగ్గర డబ్బులు ఉండటం వల్లే రైతులు అమ్మిన భూములు కొన్నుకున్నట్లు పేర్కొన్నారు.‘చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదేదో తప్పులా అసత్య ప్రచారాలు చేశాయి. ఆ మధ్య చంద్రబాబు భూములు కొనుక్కున్నారు. ఇటీవల పిఠాపురంలో 15 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఈ పది రోజుల కాలంలో రెండు ఆస్ధులను యనమల రామకృష్ణుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, యనమల కొన్న ఆస్ధులు ప్రజల దగ్గర దోచుకున్నవే అని నేను ఆరోపించగలను.ఒక్క బకెట్ బురద చల్లేస్తే సరిపోతుందా?. వైఎస్సార్సీపీలో ఉన్నాం కాబట్టి మేము ఆస్ధులు కొనుక్కోకూడదా?. యనమల మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ. రెండు లక్షలు లేకపోతే రైతు సంఘాలు ఖర్చులు బరించి గెలిపించాయి. ఇవాళ యనమల దగ్గర వేలాది కోట్ల ఆస్ధులు ఉన్నాయి. ఆ ఆస్ధులన్ని పేదలకు పంచిపెట్టాలి’ అని తెలిపారు -
మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు
-
సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారు?
-
MLA కొండబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్
-
పాఠాలు పక్కన పెట్టి పనిలో పిల్లలు
-
ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల చిన్నారులతో పనులు
-
కాకినాడ జిల్లా పెద్దాపురంలో మైనర్ బాలిక కిడ్నాప్
-
Kakinada: రంగరాయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
చీరమీను.. రుచి అదిరేను.. రేటెంతైనా తినాల్సిందే
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే చీరమీనుల్ని చూస్తే గోదావరి వాసులు లొట్టలేస్తారు. శీతల గాలి తిరిగిందంటే.. గోదావరి తీరంలో చీరమీను కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు. గోదావరికి వరదలు వస్తే పులస చేపల కోసం క్యూకట్టే తరహాలోనే అక్టోబరు నెలాఖరు మొదలు నవంబరు నెలాఖరు వరకూ చీరమీను కోసం గోదావరి తీరంలో తెల్లవారకుండానే జనం తండోపతండాలుగానే కనిపిస్తుంటారు. పోషకాలు దండిగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే అరుదైన ఈ చిట్టి చేపలను కొనాల్సిందేనంటారు. కార్తీకాన్ని ఎంతో నిష్టగా ఆచరించే వారు సైతం అరుదుగా లభించే చీరమీనును మాత్రం వదిలిపెట్టరు. కొలత ఏదైనా.. ధర ఎంతైనా.. మార్కెట్లో అన్నిరకాల వస్తువులను కేజీలు, లీటర్లలో కొలుస్తుంటారు. కానీ.. చీరమీను మాత్రం సంప్రదాయంగా వస్తున్న గిద్ద, సోల, గ్లాసు, తవ్వ , శేరు, కుంచం, బకెట్ కొలమానంతో విక్రయిస్తున్నారు. చీరమీను రోజువారీ లభ్యతను బట్టి లభ్యతను బట్టి ప్రస్తుతం శేరు (సుమారు కిలో) రూ.2 వేల నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. ఈ చీరమీను ఎక్కువగా యానాం, భైరవపాలెం, ఎదుర్లంక, జి.వేమవరం, గుత్తెనదీవి, జి.మూలపొలం, ఎదుర్లంక, మురమళ్ల, పశువుల్లంక, మొల్లేటిమొగ, పండి, పల్లం, సూరసేన యానాం, అంతర్వేదికర, వేమగిరి గ్రామాల్లో లభిస్తోంది. సెలీనియం అధికం సంపూర్ణ ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ చేపల్లో సెలీనియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలోని హానికరమైన కణాలతో పోరాడటానికి సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలిందని మత్స్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవునికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపర్చి ఆస్తమాను తగ్గించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. థైరాయిడ్, గుండె సంబంధ వ్యాధులు, కొలె్రస్టాల్ స్థాయిలను తగ్గించడానికి చీరమీనులో ఉండే సెలీనియం సహాయపడుతుందని చెబుతున్నారు. చీరమీనుతో మసాలా కర్రీ, చింతకాయలతో కలిపి కూర, చీరమీను గారెలు కూడా వేస్తుంటారు. అంగుళం నుంచి.. ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అరుదుగా లభించే చీరమీను లిజార్డ్ ఫిష్ జాతికి చెందిన చేపగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సినోడాంటిడే కుటుంబానికి చెందిన చేపలివి. వీటి శాస్త్రీయ నామం సారిడా గ్రాసిలిస్. సారిడా టంబిల, సారిడా అండోస్క్యామిస్ జాతులకు చెందిన చిట్టి చేపలని కూడా పిలుస్తారు. అంగుళం నుంచి మూడు అంగుళాల పరిమాణంలో ఉండే చీరమీను చీరల సాయంతో పడుతుంటారు. రంగు, రంగు చీరలను చూసి ఈ చిట్టిచేపలు గోదావరి అడుగు నుంచి నీటి ఉపరితలంపైకి వస్తుంటాయి. అలా చీరల్లోకి సమూహాలుగా వచ్చి ఇవి జాలర్లకు పట్టుబడుతుంటాయి. రేటెంతైనా తినాల్సిందే చాలా అరుదైన చీరమీను మార్కెట్లోకి వచ్చి0దంటే ఎంత ధరకైనా కొనాల్సిందే. మా చిన్నప్పుడు తాతల కాలం నుంచి చీరమీను సీజన్లో ఒక్కసారైనా ఈ కూర తినాలని చెప్పేవారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిగా ఉండటంతో ఏ సీజన్లోను విడిచిపెట్టం. ఎంత ధర ఉన్నా కొని తినాల్సిందే. ధర రూ.5 వేలు ఉన్నా కొని కూర వండిస్తాం. – చిక్కాల నరసింహమూర్తి, యానాం ఆరోగ్యానికి దోహదం సీజనల్‌గా దొరికే చీరమీను ఎంత రుచిగా ఉంటుందో.. ఆరోగ్యానికి కూడా అంతే దోహదం చేస్తుంది. కాల్షియం, పొటాషియం, జింక్, అయోడిన్ చీరమీనులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ చేపల్లో ఉండే ఒమెగా–3 ప్యాటీ యాసిడ్స్‌తో ఎంతో ఉపయోగం. ఆరోగ్యానికి చీరమీను ఎంతో దోహదం చేస్తుంది. అనేక అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అందుకే ఈ ప్రాంతంలో మాంసాహార ప్రియులు సీజన్లో దొరికే చీరమీను ఎంత ఖర్చు పెట్టి అయినా కొనుగోలు చేస్తుంటారు. – కె.కరుణాకర్, మత్స్యశాఖ అధికారి, కాకినాడ -
కాకినాడలో రోడ్డెక్కిన టీడీపీ - జనసేన విభేదాలు
-
ఆత్మహత్యకు యత్నించిన మహిళను పరామర్శించిన కన్నబాబు
-
కాకినాడ జిల్లాలో ప్రియురాలి మృతికి కారణమైన ప్రియుడు
-
కాకినాడ కాలింగ్
కాకినాడ కాలింగ్ అంటూ అక్కడికి వెళ్లనున్నారు పుష్పరాజ్. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూ΄÷ందనున్న ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీ వల్లీ ΄ాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 6న విడుదల కానుంది. కాగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కొన్ని రోజులుగా ‘పుష్ప: ది రూల్’ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కాకినాడలో జరగనుందని తెలిసింది. కానీ ఈ షెడ్యూల్ రెండు మూడు రోజుల్లోనే పూర్తవుతుందట. దీంతో ‘పుష్ప: ది రూల్’ సినిమా మేజర్ టాకీ ΄ార్టు పూర్తవుతుందని, ఆ తర్వాత మిగిలి ఉన్న ΄ాటల చిత్రీకరణను ΄్లాన్ చేశారని సమాచారం. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతిబాబు కీలక ΄ాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
అవయవదానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు
-
ఫలిస్తున్న వైఎస్ జగన్ కృషి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా చేసుకున్న ఒప్పందాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఏఎం గ్రీన్ (గ్రీన్కో గ్రూప్ సంస్థ) రూ.12,500 కోట్ల పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదికి మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కార్యకలాపాలు 2026లో ప్రారంభం కానున్నాయి.ఇందుకోసం 1,300 మెగావాట్ల కార్బన్ రహిత విద్యుత్, 4,500 మెగావాట్ల సోలార్, 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్, ఇతర వనరులను కంపెనీ సమకూర్చుకుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే అమ్మోనియాను యూరప్‌కు ఎగుమతి చేయనున్నారు. ఇందుకోసం యారా క్లీన్, కెప్పెల్, యూనిపర్ వంటి ప్రధాన సంస్థలతో ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందాలు సైతం ఇప్పటికే కుదుర్చుకుంది. మరోవైపు ఏడాదికి 5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యాన్ని 2030 నాటికి ఛేదించేలా దేశవ్యాప్తంగా ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించేందుకు గ్రీన్కో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. -
రైతులకు జగన్ భరోసా..
-
జగన్ పర్యటనలో జన సందోహం
-
నీటమునిగిన పంటలు పశువులకు మేత లేదు రైతుల ఆవేదన
-
TDP నేతల వేధింపులతో YSRCP నేత ఆత్మహత్య..
-
బెంగాలీ కూలీలకు అస్వస్థత
కరప: బతుకుదెరువు కోసం కాకినాడ జిల్లాకు వచ్చిన 12మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా కరప ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కరప మండలం యండమూరు శివారు వడ్డిపాలెంలో జంపన కిరణ్‌రాజు, మరో ఇద్దరు యజమానులకు చెందిన రొయ్యల చెరువుల వద్ద పని చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 12మంది కూలీలు షేక్ సలీం, అజీద్, నియోరుద్దీన్, అమనుల్లా, ఫారూక్, కలిపటి ముండ్, ఫ్రాడాస్, సాంతూల్, ఫైజప్, అన్వర్, సలుద్దీన్, మీనుదీన్ వచ్చారు. వారంతా రెండు వారాలుగా చెరువుల వద్దే ఉంటూ పని చేస్తున్నారు. పెద్ద డ్రమ్ముల్లో మంచి నీరు నిల్వ చేసుకుని, వాటినే తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కూలీలు శనివారం ఉదయం డ్రమ్ములో ఉంచిన నీటిని తాగడంతో వాంతులయ్యాయి. దీనిపై చెరువుల వద్ద పని చేస్తున్న గుమస్తా వెంటనే యజమాని కిరణ్రాజుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఆరా తీయగా, గడ్డి మందు కలిపిన డ్రమ్ములోని నీటిని తాగినట్టు కూలీలు తెలిపారు. గడ్డి మందు కలిపిన డ్రమ్ము నీరు లేకుండా ఖాళీగా ఉంది. దీనిపై ప్రశ్నించగా, ఆ నీటిని పారబోసి కడిగేశామని కూలీలు తెలిపారు. వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైన కూలీలందరినీ వెంటనే చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరికి ఎక్కువగా వాంతులు అవుతున్నాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు కిరణ్‌రాజు కరప పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రామకృష్ణ వడ్డిపాలెంలోని చెరువుల వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. బెంగాలీ కూలీలు నెల రోజులు పని చేయడానికి వచ్చారని, మధ్యలో పని మానేసి వెళ్లిపోవడానికి ఇటువంటి ఎత్తుగడలు వేస్తుంటారని, గతంలో కాండ్రేగుల చెరువుల వద్ద కూడా ఇలాగే జరిగిందని కిరణ్‌రాజు వివరించారు. నిజంగా గడ్డిమందు కలిపిన నీరు తాగారా, విష ప్రభావం ఏమైనా ఉందా.. అని తేల్చేందుకు కూలీలకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. -
రాక్ సిరామిక్స్ కార్మికుల ఆందోళన
-
ఏపీ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు అంతర్జాతీయ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న ఏఎం గ్రీన్ (గతంలో గ్రీన్కో జీరోసీ) సంస్థకు చెందిన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. యూరప్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహక సంస్థ సర్టిఫ్‌హై నుంచి ప్రీ-సర్టిఫికేషన్ పొందింది.పునరుత్పాదక ఇంధనాల కోసం కఠినమైన యూరోపియన్ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫ్‌హై ఈయూ పునరుత్పాదక ఇంధనాలు నాన్-బయోలాజికల్ ఆరిజిన్ (ఆర్ఎఫ్ఎన్బీఓ) ప్రీ-సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ ప్రాజెక్టుగా ఏఎం గ్రీన్ నిలిచింది. ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైంది.కార్బన్ రహిత ఇంధన వనరులను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేయడానికి ఏఎం గ్రీన్ నిబద్ధతను ప్రీ-సర్టిఫికేషన్ నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగాలను డీకార్బోనేట్ చేయడానికి కీలకమైన ఈ దశలో రవాణా, పరిశ్రమలో సుస్థిరత కోసం ఈయూ నియంత్రణ ప్రమాణాలను చేరుకోవడానికి కంపెనీ సంసిద్ధతను ఈ ప్రీ-సర్టిఫికేషన్ ధ్రువీకరిస్తుంది. లాభదాయకమైన ఈయూ ఆర్ఎఫ్ఎన్బీఓ మార్కెట్‌ను సమర్థవంతంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.సర్టిఫ్‌హై ప్రీ-సర్టిఫికేషన్ ప్రాముఖ్యతను ఏఎం గ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి నొక్కి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఏఎం గ్రీన్ పాత్రను పునరుద్ఘాటించారు. 2030 నాటికి కాకినాడలో ఏడాదికి 10 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.మహేష్ కొల్లి, ఏఎం గ్రీన్ అధ్యక్షుడు -
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
-
కాకినాడ జిల్లాలో పోలింగ్ కోసం స్వరం సిద్ధం
-
కాకినాడ తీరం... విస్తరిస్తున్న పారిశ్రామికం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ తీరం కళ్లు మిరుమిట్లు గొలిపే పారిశ్రామిక ప్రగతి వైపు దూసుకెళ్తోంది. కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ (కేఎస్ఈజెడ్) ఏర్పాటై దశాబ్ద కాలం గడచినా చంద్రబాబు పాలనలో ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్తా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆయన హయాంలో సెజ్ భూముల బదలాయింపులు తప్ప తదనంతర ప్రగతి కనిపించ లేదు.అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గడచిన రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు వస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ఈ ఏడాది అంతానికి పట్టాలెక్కేలా ప్రణాళికతో నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలన్నీ పూర్తయితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉండి సముద్ర తీరానికి ఆనుకుని సుమారు ఏడువేల ఎకరాలను అన్ని అనుమతులతో సెజ్ కోసం సిద్ధం చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సరళీకరణ పారిశ్రామిక విధానాలు దోహదం చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ‘పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్’ నిర్మాణం తొండంగి మండలంలో అరబిందో ఫార్మా దేశంలోనే అతి పెద్ద పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా ప్లాంట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 416 ఎకరాలు కేటాయించింది. అరబిందో ఫార్మా అనుబంధ లీఫియస్ ఫార్మా ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పెన్సిలి జీ డిసెంబర్ నెలాఖరు నాటికి ట్రయల్‌రన్ నిర్వహించాలనే ప్రణాళికతో ఉంది. రూ.2,000 కోట్ల వ్యయంతో 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటువుతున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డును సొంతం చేసుకోనుంది. పీఎల్‌ఐఎస్ పథకం ద్వారా దేశంలో ఎంపికైన తొలి ప్రాజెక్టు లీఫియస్ ఫార్మా పెన్సిలిన్ జీ కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 4,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. చురుగ్గా మేజర్ హార్బర్ నిర్మాణ పనులు ఉప్పాడలో మేజర్ హార్బర్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో ఇచి్చన హామీ మేరకు రూ.350 కోట్లతో ప్రతిపాదించారు. సాంకేతిక కారణాలతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా.. ఇప్పటికే 70 శా తం పూర్తి అయింది. ఏకకాలంలో 2,500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 50 వేల కుటుంబాల అవసరాలను తీర్చగలిగేలా, లక్ష టన్నుల సామర్థ్యంతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.రూ.2,500 కోట్లతో కాకినాడ గేట్ వే పోర్టు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్) నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం సెజ్‌లో 1,650 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డీప్ సీ పోర్టుగా 11 బెర్తుల సామర్థ్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పోర్టు ద్వారా 16 మిలియన్ టన్నుల కార్గోను ఏటా హ్యాండ్లింగ్ చేసే అవకాశం లభిస్తుంది. 2.70 లక్షల టన్నుల బరువును మోయగల భారీ ఓడలు నిలుపుకునేలా పోర్టు నిర్మాణం జరుగుతోంది. పోర్టు కోసం అన్నవరం నుంచి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు కేటాయించింది. యాంకరేజ్ పోర్టులో అంతర్గత రహదారులు, జట్టీల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. -
గోదారిలో గాలి కబుర్లే..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నవతరం రాజకీయాలకు ఆలంబన అని...ఇప్పుడున్న రాజకీయాలకు భిన్నమైన ఆలోచనలతో పురుడుపోసుకున్న పార్టీ అని..పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అగ్రాసనం వేస్తామనే అజెండాతో వచ్చిందీ జనసేన అని చెప్పడంతో నిజమనుకుని నమ్మి జనసేనలో పలువురు చేరారు. ఇన్నేళ్లూ ఆ పార్టీని భుజాన వేసుకుని కార్యక్రమాల కోసం లక్షలు తగలేసుకున్నారు. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి అవన్నీ గాలి కబుర్లేనని తెలిసొచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే ఆవేదన ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.రాజకీయ పార్టీ అంటే గెలుపు ఓటముల ప్రమేయం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. అటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ముఖం చాటేసినప్పుడే ఆ పార్టీకి ఓ సిద్ధాంతం లేదని తేలిపోయిందని అప్పట్లోనే ఆ శ్రేణులు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరును విభేదించాయి. అయినా, ఆయన పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి పొత్తులంటూ తలాతోకా లేని నిర్ణయాలతో పార్టీని, ఆ పార్టీని నమ్ముకున్న నాయకులను తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా చేసేశారని మండి పడుతున్నారు.పొత్తుతో మరింత దిగజారి..టీడీపీతో పొత్తులో కనీసం 50 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తారని పార్టీ నేతలు, పవన్ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. చివరకు మూడింట ఒక వంతు సీట్ల కంటే తక్కువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిని సమర్థించుకుంటూ పవన్ కల్యాణ్..‘మన బలం మనం తెలుసుకోకుండా ఎన్ని అంటే అన్ని సీట్లు ఎలా అడిగేస్తాం? గత ఎన్నికల్లో కనీసం నన్ను కూడా గెలిపించుకోలేకపోయామని ప్రశ్నిస్తూ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళం సృష్టించారు.గోదావరి జిల్లాలపైనే ఆశలు!రాష్ట్రంలో కొద్దోగొప్పో పార్టీకి మనుగడ ఉందంటే అది గోదావరి జిల్లాల్లోనేనని ఆ పార్టీ నాయకుల మాట. దీనికి బలం చేకూర్చేలా ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సగం ఈ జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన 11 అసెంబ్లీ స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఆ పార్టీకి బలం, బలగం ఉందనే నమ్మకంతో ఈ జిల్లాల పైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.కానీ పార్టీని వీడుతున్న నేతలు ఈ జిల్లాల నుంచే ఎందుకు ఎక్కువగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది గత సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఈ జిల్లాల పైనే ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి ఏకైక స్థానం రాజోలులో మాత్రమే ఆ పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగా గెలుపొందింది. చివరకు రాష్ట్రంలో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిపోయారు.ఆ పార్టీకి దూరంగా..పార్టీపై నమ్మకంతో ఇంత కాలం పార్టీని భుజాన మోసిన నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్యమైన నాయకులు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ, ముమ్మిడివరం, అమలాపురం, జగ్గంపేట, ఆచంట ఇన్చార్జీలు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, పాఠంశెట్టి సూర్యచంద్ర, చేగొండి, అమలాపురం పార్లమెంటరీ ఇన్చార్జి డీఎంఆర్ శేఖర్ వంటి సుమారు డజను మందికి పైగా నాయకులు జనసేనకు గుడ్‌బై చెప్పారు. సిద్ధాంతం మాట దేవుడెరుగు కనీసం పార్టీలో విలువనేదే లేకుండా చేసేశారని, ఆత్మాభిమానం చంపుకుని ఇంకా ఆ పార్టీలో కొనసాగలేమని అంటున్నారు.ఇవి చదవండి: ఓహెూ.. అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది! -
ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి
-
‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
కాకినాడ: అధికారం అనే ఆకలితో చంద్రబాబు నాయుడు అలమటిస్తున్నాడని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. కాపు ఉద్యమాన్ని అణిచివేసి... తన కుటుంబాన్ని వేధించిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ జత కడతారా? అంటూ ముద్రగడ ప్రశ్నించారు.చంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పెంకుటింటికి మరమత్తులు చేయించుకోలేదా? ఎమ్మెల్యే అయ్యేంత వరకూ పెంకుటింట్లో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఉన్న పళంగా అపరకోటీశ్వరుడు అయిపోయాడు. చంద్రబాబు ఎలా అపర కోటీశ్వరుడు అయ్యారో ప్రజలకు చెప్పమని కోరుతున్నాను. అధికారం అనే ఆకలితో చంద్రబాబు అలమటిస్తున్నాడు.వయస్సు పెద్దదైంది... ఆబద్దాలు ఆపేయండి. జగన్‌కు ఓటేయద్దని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదు. పేదల పెన్నిధి జగన్. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. కుమిలి కుమిలి చనిపోయేలా చేశారు. రాష్ట్రంలో మీరు స్వేచ్చగా తీరుగుతున్నారు. మీరు, మీ సతీమణీ,.కుమారుడుకోడలు..వియ్యంకుడు,దత్తపుత్రుడుస్వేచ్చగాతిరుగుతున్నారు.ఇంకేమి స్వేచ్చ కావాలో తమ సతిమణీని అడగండి.కాపు ఉద్యమాన్ని అణిచివేసి.. .నా కుటుంబాన్ని వేధించిన చంద్రబాబుతో పవన్ జతకడతారా? నన్ను ప్రేమించే జగన్‌తో నేను జతకట్టకూడదా?, పవన్ సినిమా డైలాగ్‌లు చదువుతున్నారు. సినిమాల్లోను..రాజకీయాల్లోను పవన్ నటించేస్తున్నారు. యువతను పాడు చేయకండి..వారి జీవితాలను నాశనం చేయకండి.యువత జీవితాల్లో చీకటి నింపకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని యువతను కోరుతున్నాను.సినిమా హీరోలతో తిరిగి మీ బంగారు భవిష్యతు పాడుచేసుకోకండి.మీ కుటుంబాలు నాశనం అవకుండా యువత మేలుకోండి. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫాస్ఫరిక్ యాసిడ్–సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులను ప్రారంభించింది. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ ఫెసిలిటీ కోసం రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి చేస్తున్నట్టు కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వెల్లడించారు. రోజుకు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉత్పత్తి కేంద్రం రానుంది. అలాగే రోజుకు 1,800 టన్నుల సామర్థ్యంగల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం కొలువుదీరనుంది. కాకినాడ ప్లాంటు దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికిపైగా భర్తీ చేస్తుందని.. ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్ఫరిక్ యాసిడ్ స్థిరంగా సరఫరా చేస్తుందని సంస్థ తెలిపింది. ప్రాజెక్టు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి పెట్టుబడి మద్దతును కూడా కంపెనీ అన్వేíÙస్తోంది. ఇది ఎరువుల తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థాలకు సరఫరా భద్రతను నిర్ధారిస్తుందని సంస్థ భావిస్తోంది. కాగా, కాకినాడ వద్ద ఉన్న కోరమాండల్ ప్లాంటు ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్ తయారీలో దేశంలో రెండవ అతిపెద్దది. సామర్థ్యం 20 లక్షల టన్నులు. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయం (ఎన్పీకే) ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది. -
వైఎస్ జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన న్యాయవాదులు
-
రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, కాకినాడ : లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ట్వీటర్లో పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై రేపు ఉదయం ప్రెస్మీట్లో స్పందిస్తానని వైఎస్ జగన్ చెప్పారు. కాకినాడ జేఎన్టీయూకు ఎదురుగా ఉన్న పాదయాత్ర శిబిరంలో ప్రెస్‌మీట్ ఉంటుందని వైఎస్సార్సీపీ మీడియా సెల్ తెలిపింది. Keenly following the happenings at the Loksabha #NoConfidenceMotion. I will react on this episode at tomorrow’s 8:30am press conference. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2018 -
వైఎస్ జగన్ హామీలపై ప్రజల్లో హర్షం
-
భారీగా వైఎస్సార్సీపీలో చేరిక
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలు చాలా బావున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దేవుని ఆశీర్వాదంతో జగన్ అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని మరిపించే విధంగా ఆయన పాలన ఉండబోతోందని మాకు సంపూర్ణ విశ్వాసం కలుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మా శాయశక్తులా కృషి చేస్తాం’ అని కాకినాడకు చెందిన పలువురు బ్రాహ్మణ యువకులు పేర్కొన్నారు.ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 216వ రోజు గురువారం కాకినాడ పట్టణంలో కొనసాగింది. ఉదయం పలువురు బ్రాహ్మణ యువకులు జగన్‌ను కలుసుకున్నారు. నవరత్నాల పథకాలు తమను ఆకట్టుకున్నాయని, మీ పోరాట పటిమ చాలా నచ్చడంతో పార్టీలో చేరాలనుకుంటున్నామని తమ అభీష్టాన్ని వెల్లడించారు. దీంతో జగన్ సుమారు 50 మంది బ్రాహ్మణ యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆకెళ్ల మురళీకృష్ణ, విఆర్జె దిలీప్‌కుమార్, భమిడిపాటి మూర్తి, ఎస్.విష్ణుమూర్తి, వేదుల మణితో పాటు పలువురు యువకులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు అకుంఠిత దీక్షతో పని చేస్తామని చెప్పారు. తరలివచ్చిన జనం కాకినాడలో రెండవ రోజు కూడా జగన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. పెద్ద సంఖ్యలో జనం జననేత అడుగులో అడుగు వేశారు. కాకినాడలో బుధవారం జగన్ బ్రహ్మాండమైన బహిరంగ సభలో పాల్గొన్నాక రాత్రికి ఆదిత్య కళాశాల సెంటర్ వద్ద బస చేశారు. గురువారం ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభించడానికి ముందే పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల వారు శిబిరం వద్దకు తరలి వచ్చారు. ఆ పరిసరాల్లో ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు ఉండటంతో వాటిలో చదువుకునే విద్యార్థులు సైతం పెద్ద సంఖ్యలో జగన్‌ను కలవడానికి ఉపాధ్యాయుల అనుమతి తీసుకుని వచ్చారు. పాదయాత్ర ప్రారంభం కాగానే రోడ్డుపై వందల సంఖ్యలో విద్యార్థినులు ఉత్సాహంతో జగన్‌ను కలిశారు. అక్కడి నుంచి మాధవనగర్ మీదుగా జేఎన్టీయూ సెంటర్ వరకూ దారి పొడవునా వేలాది మంది జగన్ వెంట నడిచారు. ఇక వినతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. కాకినాడకు చెందిన మత్స్యకారులు.. హార్బర్ కోసం కేటాయించిన భూమిని స్థానిక ఎమ్మెల్యే కొండబాబు కబ్జా చేశారని జగన్‌కు వినతిపత్రం అంద జేశారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు జగన్‌కు వివరించారు. ఉప్పరలను ఆదుకోవాలని ఆ సంఘం నేతలు నక్కా మాధవరావు, లోవరాజు కోరారు. మా మద్దతు జగన్‌కే... కాకినాడ ముస్లిం నేతలు ఎండీఏ ఖౠన్, ఏకె జిలాని, కరీంఖాన్, అహ్మద్ ఖాన్ తదితరులు జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వస్తేనే అందరి కష్టాలు తీరతాయని, అందుకే తాము పూర్తిగా మద్దతిస్తున్నామని ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో పేదలు అధికంగా ఉన్న ముస్లింలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. జగన్ అందరికీ ‘రోటి, కపడా ఔర్ మకాన్’ కల్పిస్తారన్న నమ్మకం ఉందన్నారు. దారిపొడవునా పలువురు ప్రజలు పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, రేషన్‌లో కోత విధిస్తున్నారని అర్హులైన వారికి పింఛన్లు రావడం లేదని జగన్ ఎదుట గోడువెళ్లబోసుకున్నారు. అందరికీ ధైర్యం చెబుతూ జననేత ముందుకు సాగారు. టీడీపీ పాలనలో అన్నీ కష్టాలే అన్నా.. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నిరుపేదలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదు. ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా లాభం లేదు. రేషన్ షాపుల్లో గతంలో తొమ్మిది సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకటి రెండు సరుకులు కూడా సరిగా ఇవ్వడం లేదు. కొంతమందికి సరుకులు ఇవ్వకుండానే వేలిముద్రలు వేయించుకుని పంపిచేస్తున్నా పట్టించుకునే వారు లేరు. – వైఎస్ జగన్‌తో డానెల బేబి, కాకినాడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉద్యోగులు మరింత బాధ్యతతో పని చేస్తారు. ఈ దిశగా ఇప్పటికే మీరు చేసిన ప్రకటనపై ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన వారికి క్యాడర్‌తో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలి. – వైఎస్ జగన్‌తో డి.రామ్మోహన్రావు జగనన్న వస్తేనే అందరికీ న్యాయం రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. నేను 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నాను. పాదయాత్ర అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. ఇప్పుడు వైఎస్ మాదిరిగా జగనన్న కూడా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలందరికీ మేలు చేస్తారనే నమ్మకం ఉంది. – పందిటి ధనలక్ష్మి -
వైఎస్ జగన్ వెంట కదులుతున్న జన సునామీ
-
కాకినాడ బహిరంగ సభలో పోటెత్తిన జనాభిమానం
-
అమరావతిలో బాబు జిమ్మిక్కులు కనిపిస్తాయి
-
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు.. ఈజ్ ఆఫ్ కరప్షన్’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు ఈజ్ ఆఫ్ కరప్షన్ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో లంచాలు లేనిదే పనులు జరగడం లేదన్నారు. గజ దొంగలు పాలిస్తే ఎలా ఉంటుందో దానికి కాకినాడే నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు తప్ప చేసిందేమీలేదని జననేత ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో అంతులేని అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలను టీడీపీకి కట్టబెట్టినా.. సంతలో పశువులను కొన్నట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్నారని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సంతచెరువు వద్ద జరిగిన బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. అంతకంటే సిగ్గులేని వ్యక్తి ఎవరు ఉండరు.. ‘కాకినాడ స్మార్ట్ సిటీగా మారలేదు.. అవినీతి మాత్రం స్మార్ట్‌గా జరుగుతోంది. జిల్లాలో 19మంది ఎమ్మెల్యేలకు 17 మంది చంద్రబాబు వద్దే ఉన్నారు. అయినా చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలకు చేసిందేమీ లేదు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కాకినాడకు చంద్రబాబు ఏంచేశారు? కాకినాడలో ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్తులను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారు. కాకినాడలో యథేచ్చగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ప్రతీనెల పేకాట క్లబ్బుల నుంచి టీడీపీ నేతలకు మామూళ్లు అందుతున్నాయి. లంచం లేనిదే ఒక్క పని కూడా ముందుకు వెళ్లడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 400 కోట్లు కాకినాడకు వస్తే.. కేవలం రూ. 50కోట్లు కూడా కాకినాడకు ఖర్చు పెట్టని పరిస్థితి. కాకినాడలో డంపింగ్ యార్డ్ మార్చాలని జనం చెబుతున్నా.. గత నాలుగేళ్లుగా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాకినాడకు ప్రకటించిన మంచినీటి పథకం ప్రాజెక్టుల పనులు ఎక్కడి వేసిన గొంగలిలా అక్కడే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో లంచాలు లేనిదే పనులు జరగడం లేదు. పేదవాడి వద్ద అవినీతి చేయాలంటే అంతకంటే సిగ్గులేని వ్యక్తి ఎవరు ఉండరు’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. బాహుబలి గ్రాఫిక్స్ కనిపిస్తాయి.. ‘కాకినాడ అర్బన్‌లో వైఎస్ఆర్ 13 వేల ఇళ్లు కటించారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క ఇళ్లైనా కట్టించారా? పేదల ఫ్లాట్లలో కూడా చంద్రబాబు అవినీతి చేస్తున్నారు. చంద్రబాబు ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆ ఫ్లాట్లపై ఉన్న అప్పును మాఫీ చేస్తాం. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవు. ఇద్దరు రోగులకు ఒకే బెడ్ ఇస్తున్నారు. కాకినాడ ఆస్పత్రిలో 500పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు పాలన అంతా అవినీతి చేయడం, వెన్నుపోట్లు పొడవడం. వారం రోజుల కిందట చంద్రబాబు సింగపూర్ పోయారు. అవినీతి గురించి చంద్రబాబు సింగపూర్‌లో మాట్లాడారు. సింగపూర్‌లో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్పారు. అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయట. అమరావతిలో ఇప్పటివరకు శాశ్వత భవనాలకు ఒక్క ఇటుక కూడా పడలేదు. అమరావతిలో ఎమ్మెల్యే గేదెలు గడ్డి మేస్తు కనిపిస్తాయి. అమరావతిలో చంద్రబాబు బాహుబలి గ్రాఫిక్స్ కనిపిస్తాయి. సమ్మిట్ల ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. నాలుగేళ్లలో రూ. 20 వేలకోట్లు పెట్టుబడులు కూడా రాలేదు. ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్‌లో చంద్రబాబు ఫస్ట్ ఎలా వచ్చారు? పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను నాలుగేళ్లుగా బకాయి పెడుతున్నారు. అలాంటి చంద్రబాబుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇచ్చిన వాళ్లకు బుద్ది ఉందా? వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డుయింగ్ కాదు.. ఈజ్ ఆఫ్ కరప్షన్ ‘కరెంట్ చార్జీలు రూ.3.75 పైసల నుంచి రూ. 8.75 పైసలకు పెంచడంతో కర్నూల్ జిల్లాలో నాపరాళ్ల పరిశ్రమలు మూతపడ్డాయి. కర్నూల్, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో గ్రానైట్ పరిశ్రమలపై రాయల్టీ విపరీతంగా పెంచడం ద్వారా ఈ పరిశ్రమలన్నీ మూతపడే స్థాయికి వచ్చాయి. ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే? షుగర్ ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు అన్నీ మూతపడుతున్నాయి. మరీ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎక్కడ జరుగుతోంది? ఏపీలో ఉన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు.. ఈజ్ ఆఫ్ కరప్షన్’ అని రాజన్న బిడ్డ ఎద్దేవా చేశారు. మోసంలో చంద్రబాబు నంబర్ వన్ స్థానం.. ‘హోదా కోసం వైఎస్సార్సీపీ లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేశారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి నిరాహారదీక్ష చేసి ఉంటే అప్పుడే దేశం మొత్తం ఏపీ వైపు చూసేది. మోసం చేయడంలో చంద్రబాబుకు నెంబర్‌వన్ స్థానం వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చినందుకు చంద్రబాబుకు నంబర్‌వన్ స్థానం వచ్చింది. గ్రామాల్లో మన పిల్లలను తాగించడంలో చంద్రబాబుకు నంబర్ వన్ స్థానం. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నందుకు నంబర్ వన్ స్థానం. ప్రతీ కులాన్ని మోసం చేయడంలో చంద్రబాబుకు నెంబర్ వన స్థానం. హామీలను అమలు చేయమని అడిగితే వారిని కొట్టించడంలో నెంబర్ వన్. మట్టి ఇసుక, బొగ్గు, కరెంట్ కొనుగోళ్ల కాంట్రాక్టులు, రాజధాని భూములు దోచుకోవడంలో చంద్రబాబుకు నంబర్‌వన్ స్థానం. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబుకు నెంబర్‌వన్. ఓటుకు కోట్లు కేసులో వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుని కేసులు లేకుండా చేసుకోవడంలో నెంబర్‌వన్ స్థానం. లంచం లేనిదే పనులు జరగకుండా చేయడంలో నెంబర్‌వన్ స్థానం. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, వెన్నుపోట్లు, మోసాలు, అవినీతి’ అని జననేత విమర్శలు గుప్పించారు. బయట యుద్ధం.. లోపల కాళ్లబేరం.. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చంద్రబాబు యుద్ధం చేస్తున్నట్లు డ్రామాలు. వైఎస్సార్సీపీ ఎన్నిసార్లు అవిశ్వాసం పెట్టినా స్పీకర్ అనుమతించలేదు. కాగా, వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిన తర్వాత టీడీపీ అవిశ్వాసం పెట్టడం.. వెంటనే స్పీకర్ ఆమోదించడం చాలా ఆశ్చర్యకరం. పార్టీ ఫిరాయించినా బుట్టా రేణుకను డిస్క్వాలిఫై చేయాలని ఫిర్యాదు చేశాం. కానీ, అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున బుట్టా రేణుకను పిలిచారు. చంద్రబాబు ప్లాన్‌లో భాగంగానే బుట్టా రేణుకను పిలిచారు. బయటికేమో బీజేపీతో యుద్ధం.. లోపల చూస్తే కాళ్లబేరం. అధికారం కోసం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడుస్తారు. ఎన్నికలు రాగానే ఎన్టీఆర్ ఫొటోకు దండ వేసి దండం పెడతారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని బహిరంగ సభలో వైఎస్ జగన్ చెప్పారు. ‘ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గ్రామ సచివాలయాల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాం. పెన్షన్, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్మెంట్లను 72 గంటల్లో మంజూరు చేస్తాం. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. వైఎస్సార్సీపీకి చెందిన 25మంది ఎంపీలను గెలిపించండి. హోదా ఎవరిస్తే కేంద్రంలో వారికే మద్దతు ఇస్తామని’ వైఎస్ జగన్ చెప్పారు. జనోత్సాహం ఉప్పొంగింది. కాకినాడ జన ప్రభంజనమైంది. ఎగసిపడిన కెరటంలా జన సందోహం వెల్లివిరిసింది. కాకినాడలో ఓ ప్రభంజనంలా వైఎస్ జగన్ వెంట జనం నడిచారు. కాకినాడ సిటీలోకి ప్రవేశించిన జననేతకు గులాబీ పూలతో విద్యార్ధినులు స్వాగతం పలికారు. నేడు కాకినాడలోని సంతచెరువు వద్ద జరిగిన బహిరంగ సభకు అశేష జనవాహిని కదలివచ్చారు. -
214వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర విశేషాలు
-
కాకినాడ రూరల్‌లో జన సునామీ
సాక్షి, కొవ్వాడ (కాకినాడ రూరల్) : ప్రజాసంకల్పయాత్రతో రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కాలినడక ఇడుపులపాయ నుంచి బయల్దేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు కొవ్వాడ గ్రామంలో అడుగుపెట్టబోతున్న వైఎస్ జగన్‌కు పార్టీ శ్రేణులు రైల్వే గేటు వద్ద 65 అడుగుల భారీ కటౌట్‌తో ఆహ్వానం తెలుపగా, వందలాది మంది మహిళలు వైఎస్ జగన్‌కు హారతి ఇస్తూ నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు అమర్ వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. ఆయనతో పాటు అడుగులో అడుగేశారు. తమ సమస్యలు వినేందుకు వచ్చిన వైఎస్ జగన్‌ను కలుసుకునేందుకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. దీంతో కొవ్వాడ వీధులు జనసంద్రాన్ని తలపించాయి. పాదయాత్ర కొవ్వాడ శివార్లకు చేరుకునే సందర్భంగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షాన్ని కూడా లెక్కచేయని ప్రజలు వైఎస్ జగన్‌తో కలసి నడిచారు. అనపర్తిలో పాదయాత్ర హీట్.. అనపర్తిలో పాదయాత్ర హీట్ నియోజకవర్గం నలుమూలలా ప్రతిధ్వనించింది. దాదాపు మూడు రోజుల పైచిలుకు అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా టీడీపీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. పెదపూడిని దాటేందుకు దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టిందంటే ప్రజలు వైఎస్ జగన్ రాకను ఎంతలా కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. జీమామిడాడలో ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ యానిమేటర్లు తమ సమస్యలను వైఎస్ జగన్‌కు విన్నవించగా స్పందించిన జగన్ వేతనాల పెంపునకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
గట్టు చెరెవరకూ గండమే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఈ ఫొటోలోని పడవను చూశారా? పరిమితికి మించి ఎక్కిన ప్రయాణికులతో నడిచింది. ఇదెక్కడో కాదు తాజాగా మంటూరు–వాడపల్లి మధ్య లాంచీ ప్రమాదానికి గురైన ప్రదేశానికి 500 మీటర్ల దూరంలో నడిచిన పడవిది. రక్షణ కోసం ఉండాల్సిన లైఫ్ జాకెట్లు లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు జల సమాధి కావడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఉభయ గోదావరి జిల్లాల అధికారుల కళ్లముందే పరిమితికి మించి ప్రయాణికులతో నడిచింది. కానీ, ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదు. ప్రమాద ఘటనకు చేరుకునేందుకు ఈ పడవలపైనే ప్రయాణాలు సాగాయి. జనాల రద్దీ దృష్ట్యా అక్కడున్న లాంచీలు తిప్పాల్సిందిపోయి ప్రమాదకరమైన ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు చోద్యం చూశారు. లాంచీలు తిరగకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో పడవలపైనే స్థానికులు రావల్సి వచ్చింది. ఒక్కొక్క పడవపై 25 మందికి మించి ప్రయాణించిన దృశ్యాలు కన్పించాయి. ఏముందిలే ఈ ఒక్కరోజే కదా అన్నట్టుగా లాంచీ ప్రమాద ఘటనా స్థలి వద్ద అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కానీ, ఇక్కడ రోజూ జరుగుతున్న తంతు కూడా దాదాపు ఇదే. లాంచీ ప్రయాణాలతో పాటు పడవ ప్రయాణాలు సమాంతరంగా సాగుతున్నాయి. లాంచీలే ప్రమాదాలకు గురైతే, పడవల పరిస్థితి ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మచ్చుకు ఇక్కడ జరిగిన పరిణామాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ జిల్లాలో చాలా చోట్ల జరిగేది ఇదే. రహదారుల్లేక, ప్రత్యామ్నాయ మార్గాలు కన్పించక జిల్లాలో 70 వరకు గ్రామాల ప్రజలు పడవ ప్రయాణాలపైనే ఆధారపడుతున్నారు. నిర్వాహకులు తమకెంత సొమ్ము వస్తోందని చూసుకుంటున్నారే తప్ప పరిమితిని పట్టించుకోవడం లేదు. అసలు ప్రయాణికుల రాకపోకలకు పడవలను అనుమతించకూడదు. లాంచీలు, పంటుల పైనే ప్రయాణాలు సాగించాలి. ఇప్పుడా లాంచీలు, పంటులే ప్రమాదాలకు గురై ప్రయాణికుల్ని బలితీసుకుంటున్నాయి. అలాంటి పడవ ప్రయాణాలను ఇంకెంత తీవ్రంగా తీసుకోవాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, జిల్లాలో ఆ దిశగా పర్యవేక్షణ చేయడం లేదు. ప్యాసింజర్లను ఎక్కించకూడదన్న నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. పడవ ప్రయాణాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగాక అయ్యో పాపం అంటూ హడావుడి చేయడం తప్ప నిబంధనలు, జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో పడవ ప్రయాణాలు సాగిస్తున్న గ్రామాలివే ► ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివానిపాలెం, కమిని, గురజాపులంక, సేరులంక, కొత్తలంక, గోగుల్లంక గ్రామాలకు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. 1992లో గోగుల్లంక, భైరవలంక మధ్య చింతేరుపాయలో పడవ బోల్తాపడి తొమ్మిది మంది మృతి చెందారు. ► ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్లేందుకు పడవ ప్రయాణమే సాగిస్తారు. 1990లో లంక రేవులో పడవ మునిగిపోయి 10మంది చనిపోయారు. ► తాళ్లరేవు మండల పరిధిలో గోవలంక, పిల్లంక, అరిటికాయ లంక, శేరిలంక, కొత్తలంక ప్రజలు పడవ ప్రయాణం చేయకతప్పడం లేదు. ఈ ప్రాంతంలోని గోదావరి నదీపాయపై 2004లో జరిగిన పడవ ప్రమాదాల్లో తొమ్మిది మంది వరకు మృతి చెందారు. ► మామిడికుదురు మండలంలో కరవాక–ఓడలరేవు, గోగన్నమఠం–బెండమూర్లంక, పెదపట్నం లంక–కె.ముంజవరం గ్రామాల మధ్య పడవ ప్రయాణాలు సాగిస్తున్నారు. ► రాజోలు, సఖినేటిపల్లి మండలాలకు చెందిన రైతులు లంక భూములకు వెళ్లేందుకు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ► పి.గన్నవరం మండలంలోని కనకయ్యలంక–దొడ్డిపట్ల, ఎల్.గన్నవరం– కోడేరులంక గ్రామాల ప్రజలకూ పడవలే గతి. ► కొత్తపేట మండలంలోని తొగరిపాయకు వెళ్లేందుకు వరదలొచ్చినప్పుడు పడవపై ప్రయాణం సాగిస్తున్నారు.ఆలమూరు మండలంలో వరదలొచ్చినప్పుడు చెముడులంక నుంచి బడుగువాని లంక గ్రామాలకు పడవపైనే వెళ్లాల్సి ఉంటుంది. ► కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురం–కేదారిలంక గ్రామానికి పడవపైనే ప్రయాణాలు సాగిస్తుంటారు. ► కాట్రేనికోన మండలం పల్లంకురు పంచాయతీ పరిధిలోని రామాలయంపేట, జీ. మూలపొలం మధ్య, తల్లంకుర్రు–కేశనకుర్రుపాలెం మధ్య, కుండలేశ్వరం– కేశనకుర్రుపాలెం మధ్య పడవ ప్రయాణాలు సాగిస్తున్నారు. ► సీతానగరం మండలం వంగలపూడి నుంచి గూటాల వరకు వెళ్లేందుకు పడవపైన ప్రయాణం సాగిస్తున్నారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం వెళ్లేందుకు లాంచీపై ప్రయాణికులు వెళ్తుంటారు. ► వీఆర్‌పురం మండలంలోని తుమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు, కూనవరం మండలం కూనవరం నుంచి రుద్రంకోట వరకు పడవపై వెళ్తుంటారు. ► తాజాగా లాంచీ ప్రమాదం జరిగిన దేవీపట్నం మండలంలోనైతే 17 గ్రామాలకు పడవలు, లాంచీలే ఆధారం. సర్కార్ చిన్నచూపు – గ్రామాలకు ప్రయాణ ముప్పు రహదారి సౌకర్యం లేని గ్రామాలన్నింటికీ నాటు పడవలే ఆధారం. వాటి మీదే ప్రయాణం సాగిస్తున్నారు. నిత్యం ప్రమాదాల మధ్యే జీవనయానం సాగిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, ప్రమాదకర పరిస్థితులను నియంత్రించే దిశగా అధికారులు, పాలకులు అడుగు వేయడం లేదు. వాస్తవానికైతే పైన చెప్పిన 70 గ్రామాల్లో చాలా వరకు రహదారులు వేస్తే పడవలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఏజెన్సీలోని గ్రామాలకు ప్రత్యామ్నాయ రహదారులు వేసినట్టయితే పడవలపై వెళ్లి రావాల్సిన అవసరం ఉండదు. కానీ, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు రహదారుల్లేక పోవడం వల్ల అధికారులు, సిబ్బంది సైతం అక్కడికి వెళ్లడం లేదు. ఫలితంగా ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితుల్లేవు. అంతెందుకు తాజాగా లాంచీ ఘటనలో మృతి చెందినవారు ఉన్న కొండమొదలు, కచ్చులూరు, కె.గొందూరు, తాటివాడ గ్రామాల్నే తీసుకుంటే.. అక్కడ కనీస సౌకర్యాల్లేవు. గ్రామాలకు రహదారులు లేవు సరే.. కనీసం ఫోన్ సౌకర్యం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం మరమ్మతులకు గురైనా ఇంతవరకు పట్టించుకోలేదు. కచ్చులూరు గ్రామంలోనైతే పది రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. ఇటీవల కురిసిన గాలివానకు పడిపోయిన విద్యుత్ స్తంభాలను రోజులు గడుస్తున్నా పునరుద్ధరించలేదు. ఇక, వైద్యం పరిస్థితీ అంతే. వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వారంతా పడవలు, లాంచీల మీద ప్రయాణాలు సాగించి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదు. ఆయా గ్రామాల్లో టెలిఫోన్, విద్యుత్ సౌకర్యాల సంగతి పక్కన పెడితే ప్రయాణమే ప్రమాదకరంగా ఉన్న గ్రామాలను ప్రాధాన్యతగా తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాకపోకలకు వీలుగా రహదారులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో.. ఇంకెన్ని ప్రమాద ఘటనలు జరగాలని చూస్తుందో చూడాలి. -
టికెట్ బుక్‌చేసిన పరిపూర్ణానంద.. రంగంలోకి పోలీసులు!
సాక్షి, హైదరాబాద్ : నగర బహిష్కరణ ఎదుర్కొంటున్న శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద మళ్లీ హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలలు హైదరాబాద్ నగర బహిష్కరణను పోలీసులు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన మళ్లీ హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఆయన టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. తనపై బహిష్కరణ హైదరాబాద్ పరిధి వరకే పరిమితం కావడంతో సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నట్టు తెలిసిందే. ఈ విషయమై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనూ స్వామి పరిపూర్ణానందపై ఆరు నెలల బహిష్కరణ విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి.. వాటిని పరిపూర్ణానందకు అందజేసేందుకు కాకినాడ బయలుదేరినట్టు తెలుస్తోంది. -
కాకినాడకు చేరిన పరిపూర్ణనంద
-
సురక్షిత ప్రాంతాలకు యాత్రికులు
-
మానస సరోవరం: ముమ్మరంగా సహాయక చర్యలు!
ఢిల్లీ: మానస సరోవర యాత్రలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు అనే తెలుగు యాత్రికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెల్సిందే. ఆయన మృతదేహాన్ని హిల్సా నుంచి సిమికోట్‌కు నేపాల్ అధికారులు తరలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం లక్నో మీదుగా కాకినాడ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాన్ని తర్వగా తరలించేందుకు నేపాల్ రాయబార కార్యాలయంతో ఏపీభవన్ అధికారులు సంప్రదింపులు చేపడుతున్నారు. కేరళకు చెందిన మరో యాత్రికుడు కూడా ఈ మానస సరోవర యాత్రలో ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు తెలిసింది. యాత్రికులకు తరలించేందుకు అధికారులు ఏడు విమానాలను ఏర్పాటు చేశారు. సిమికోట్ నుంచి నేపాల్గంజ్కు 104 మంది యాత్రికుల తరలించారు. తెలుగువారి బాగోగులు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ గంజ్‌కు ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి ఒక టీంను ఓఎస్డీ రవి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం పంపుతున్నామని ఏపీ భవన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో మాట్లాడారు. మానస సరోవర యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. హిల్సా బేస్ క్యాంప్ లో చిక్కుకున్న వారికి అవసరమైన వైద్య చికిత్స అందించాలన్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లిన వారు సురక్షితంగా రావాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. అమర్నాథ్ యాత్రలో అపశృతి అమర్నాథ్ యాత్రలో మంగళవానం అపశృతి చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) అనే తెలుగు మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్‌లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం అందింది. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
సెల్ ఫోన్ దొంగలు అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి : ఆర్టీసీ బస్టాండులో ఆదమరిచి నిద్రపోతున్న ప్రయాణికుడి జోబు నుంచి సెల్‌ఫోన్‌ను దొంగలించిన ఓ కిలాడి జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీసీ బస్టాండులో చోటుచేసుకుంది. ఐతే ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో బండారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాదితుడు ఆర్టీసీ బస్టాండులో నిద్రలోకి జరుకోగానే దొంగలు చీకట్లో తాము ఏమి చేసినా గమనించలేరని సెల్‌ఫోన్‌ను దొంగలించి ఉడాయించారు. బాధితుడి నిద్రలేచే సరికి సెల్‌ఫోన్ లేకపోడంతో పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ కిలాడి దొంగలను సీసీ కెమెరాల సాయంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. -
కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌లో చోరీకి పాల్పడిన జంట
-
‘చంద్రబాబు కామెడీ.. జనం నవ్వులు..’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నది ధర్మపోరాట దీక్ష కాదని, అది అధర్మ పోరాట దీక్షని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనం సొమ్ముతో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. దీక్ష కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. దీక్షకు ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, పెన్షనర్లను బలవంతంగా తరలించారని ఆరోపించారు. సభలో చంద్రబాబు చేసిన కామెడీ చూసి జనం ఫుల్లుగా నవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. దీక్ష పేరుతో 2 వేల ఆర్టీసీ బస్సులను సభాస్థలికి తరలించడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వివరించారు. సభ కోసం పాఠశాలలకు సెలవులు ఇస్తారా? అని నిలదీశారు. -
వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్ గురువారం తెలిపారు. సికింద్రాబాద్–విజయవాడ ప్రత్యేక రైలు (07757) ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14, 21, 28వ తేదీల్లో ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. విజయవాడ–సికింద్రాబాద్ రైలు (07758) ఆగస్ట్ 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14, 21, 28వ తేదీల్లో విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ ప్రత్యేక రైలు (07942) ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో, సెప్టెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14, 21 ,28వ తేదీల్లో తిరుపతిలో సాయంత్రం బయలుదేరుతుంది. కాకినాడటౌన్–రేణిగుంట ప్రత్యేక రైలు (07941) ఆగస్టు 6, 13, 20, 27వ తేదీల్లో, సెప్టెంబర్ 3, 10, 17, 24వ తేదీల్లో, అక్టోబర్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో సాయంత్రం 7.00 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరుతుంది. నాందేడ్ –తిరుపతి ప్రత్యేక రైలు (07607) ఆగస్టు 7, 14, 21, 28వ తేదీల్లో, సెప్టెంబర్ 4, 11, 18, 25వ తేదీల్లో, అక్టోబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో సాయంత్రం 6.45కు నాందేడ్‌లో బయలుదేరుతుంది. -
అయ్యో! కన్నా!
కాకినాడ: వీధి కుక్కలు దాడి చేశాయి. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాయి. వివరాలివి...కాకినాడ నగరం నడిబొడ్డున ఉన్న బాలాజీ చెరువు వద్ద మండల రెవెన్యూ కార్యాలయం ఎదుటి వీధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వాసంశెట్టి శ్రీనివా స్, భూలక్ష్మి దంపతులు 15 రోజు క్రితమే ఇంద్రంపాలెం నుంచి ఇక్కడి ఇంట్లోకి అద్దెకు వచ్చారు. వీరికి సాందిక, సాయిశారద ఇద్దరు కుమార్తెలు. దాదాపు 11 సంవత్సరాల తరువాత నాగేంద్ర అనే బాలుడు జన్మించాడు. దీంతో అతడ్ని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. బాలాజీచెరువు వద్ద ఆటో మెకానిక్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ శనివారం ఉదయం మెకానిక్ షెడ్డుకు వెళ్లాడు. భూలక్ష్మి ఒక వృద్ధురాలికి సహాయకురాలిగా వెళ్లింది. ఇంట్లో ఇద్దరు అక్కలతో పాటు ఆరేళ్ల బాలుడు నాగేంద్ర ఉన్నారు. ఆ బాలుడు ఆడుకునేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. విశాలమైన ఆవరణలో చెట్లు, మొక్కల మధ్య చిన్న కత్తెర పట్టుకుని ఆకులు కత్తిరిస్తూ ఆడుకుంటున్నాడు. ఇంతలో ప్రహరీ గోడదూకి వచ్చిన కుక్కలు నాగేంద్రపై హఠాత్తుగా దాడి చేశాయి. అతడ్ని ఈడ్చుకుంటూపోయాయి. భుజంపై చర్మం పీకేశాయి. తలపై చర్మం ఊడిపోయింది. ఒళ్లంతా గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఇంతలో పక్క ఇంట్లో నివసిస్తున్న మహిళ బయటకు వెళ్తూ నిర్జీవంగా ఉన్న నాగేంద్రను చూసి అతడి అక్కలకు చెప్పింది. దీంతో వారు బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ దూరమైపోయాడని తల్లిదండ్రులు, అక్కలు గోలు గోలున విలపించారు. బాలుని మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మూడో వపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ సత్యవేణి, కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న పరామర్శించారు. కుక్కల దాడికి మాంసం వ్యర్థాలే కారణమా? కుక్కలు బాలుడిని హతమార్చిన ఇంటి ముందు డంపర్ బిన్నులో ఆస్పత్రి, హోటళ్ల నుంచి తెచ్చి వేసిన వ్యర్థాలను తినేందుకు కుక్కలు అక్కడ వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల ఉండే ఆస్పత్రుల నుంచి రక్తం మరకలతో కూడిన వ్యర్థాలు, హోటళ్లలోని ఆహార వ్యర్థాలను రాత్రి వేళల్లో తెచ్చి డంపర్ బిన్లో వేయడంతో వాటిని తినేందుకు కుక్కలు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. వాటిని తిన్నాకా ఎండ తీవ్రతకు మొక్కల మధ్యకు వచ్చి పడుకోవడానికి ప్రహరీ దూకి వస్తున్నాయని స్థానికులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాలుడిపై కుక్కలు దాడి చేసి ఉంటాయని భావిస్తున్నారు. -
కుక్కల దాడిలో బాలుడు మృతి
సర్పవరం (కాకినాడ సిటీ): ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి దారుణంగా చంపేశాయి. ప్రహరీ దూకి వెళ్లి మరీ చిన్నారిపై దాడి చేశాయి. అందరూ ఇంటి లోపల ఉండడంతో ఆ బాలుడి ఆర్తనాదాలు ఎవరికీ వినబడలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. కాకినాడ బాలా చెరువు సెంటర్లోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న దీపాలవారి వీధిలోని ఓ ఇంటిలో ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆటోమెకానిక్‌గా పనిచేస్తున్న వాసంశెట్టి శ్రీనివాస్ కుటుంబంతో సహా ఇటీవలే ఆ ఇంటిలో అద్దెకు దిగాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. భార్య భూలక్ష్మి ఓ వృద్ధురాలి వద్ద ఆయాగా పనిచేస్తోంది. కుమారుడు నాగేంద్ర ఒకటో తరగతి చదువుతున్నాడు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో చిన్నారులు ఇంటి వద్దే ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ రోజు మాదిరిగానే పనికి వెళ్లిపోయారు. అక్కలు ఇంటిలో ఉండగా, నాగేంద్ర ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఇంటి ప్రహరీ దూకి వీధికుక్కలు ఒక్కసారిగా నాగేంద్రపై దాడి చేసి ఈడ్చుకెళ్లాయి. అందరూ లోపల ఉండిపోవడంతో అతడి ఆర్తనాదాలు ఏ ఒక్కరి చెవినా పడలేదు. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు గమనించి వారి బంధువులకు చెప్పారు. వారి వెళ్లి చూడగా అప్పటికే నాగేంద్ర మరణించాడు. అతడి తల వెనుక భాగాన్ని, భూజాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
తనువు చాలిస్తాం..అనుమతించండి
జన్మనిచ్చిన తల్లిదండ్రులను దైవంతో సమానంగా కొలిచే నేల మనది. నాన్నంటే నడిచే దేవాలయం లాంటి వ్యక్తి. అమ్మప్రేమకు సాటిలేదు. ఇలాంటి కర్మభూమిలో పుట్టి, జీవిత చరమాంకంలో జబ్బు బారిన పడిన తండ్రిని కంటికి రెప్పలా కాచుకోవాల్సిందిపోయి.. ఆయన సంపాదించిన కోట్లాది రూపాయలున్నా చికిత్స చేయించకుండా అడ్డుపడుతున్నాడో కొడుకు. గారాబంగా పెంచి, ఓ ఇంటి వాడిని చేసిన తండ్రి సంపాదించిన ఆస్తిని లాగేసుకొని వీధిన పడేశాడు. ఓవైపు మూత్రపిండాల వ్యాధి పీడిస్తోంది.. మరోవైపు ఇంకెంతకాలం బతుకుతారంటూ హేళన చేస్తూ దుర్మార్గంగా మాట్లాడే కుమారుడు.. వెరసి తమకు ఆత్మార్పణే శరణ్యమని, చనిపోయేందుకు అనుమతించాలంటూ శనివారం జిల్లా ఎస్పీ విశాల్ గున్నికి అర్జీ ఇచ్చారు ఆ వృద్ధదంపతులు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ రూరల్: తూర్పుగోదావరి జిల్లా సర్పవరానికి చెందిన పిట్టా అప్పారావు, లక్ష్మి దంపతుల దయనీయస్థితి ఇది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ముగ్గురికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకు రవి విడిగా ఉంటున్నాడు. అప్పారావుకు కిడ్నీ పాడవడంతో రెండ్రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రిలో రూ.వేలు ఖర్చు అవుతున్నాయి. కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ దుస్థితిలో తల్లిదండ్రులను రవి పట్టించుకోవడంలేదు. అప్పారావు కష్టపడి కూడబెట్టిన ఆస్తి రూ.2 కోట్లు ఉంటుంది. చికిత్స నిమిత్తం అందులో కొంత భూమిని అమ్ముదామంటే కొడుకు ఒప్పుకోవడం లేదు సరికదా.. ‘62 ఏళ్లు వచ్చాయి. ఇంకా ఎంతకాలం బతుకుతారేంటి?’ అంటున్నాడు. తన భర్త సంపాదించిన ఆస్తికి సంబంధించిన దస్తావేజులను రెండేళ్ల క్రితం బ్యాంకులోను కోసం అని చెప్పి కొడుకు తీసుకెళ్లిపోయాడని, వాటిని ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని, విషయాన్ని పెద్దల వద్ద పెట్టినా ప్రయోజనం లేకపోయిందని లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. భర్తకు వచ్చిన వ్యాధిని బాగుచేయించుకోలేక, కొడుకు పెడుతున్న ఇబ్బందులను భరించలేక తీవ్ర మనోవ్యధ చెందుతున్నామని, తామిద్దరం చనిపోయేందుకు అనుమతి ఇప్పించాలంటూ వృద్ధ దంపతులు ఎస్పీని అభ్యర్థించారు. వారిని సముదాయించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరపాలని కాకినాడ డీఎస్పీ రవివర్మను ఆదేశించారు. వృద్ధుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసిందని, అధైర్య పడొద్దని చెప్పి పంపించారు. -
లక్షల విలువైన గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం
సాక్షి, కాకినాడ : ఆన్లైన్లో సొమ్మును బదిలీ చేస్తానని చెప్పి బంగారం అపహరించిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకున్నారు. వివరాలు.. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసేవాడనీ, తరువాత విలాసాలకు అలవాటు పడిన వ్యక్తి చోరీలకు కూడా పాల్పడ్డాడని, ఈ క్రమంలోనే బంగారు దుకాణంలో గోల్డ్ బిస్కెట్లను కూడా అపహరించాడని పోలీసులు తెలిపారు. అతడి వద్ద రూ. 26లక్షల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కరెంట్ షాక్ తగిలి వదిన,మరిది దుర్మరణం
-
కాకినాడ నడిబొడ్డున మహిళ హత్య
కాకినాడ రూరల్: కాకినాడ బ్యాంక్‌పేటలో ఓ మహిళ హత్యకు గురైంది. పేటలో నివాసం ఉంటున్న పెంకే విజయలక్ష్మి అలియాస్ జయమ్మ (54) గురువారం తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. ఈమెను ముందు పీక నొక్కి, అనంతరం ఇనుప రాడ్డుతో తల పగలగొట్టి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన జయమ్మకు భర్త చనిపోయి ఏడేళ్లయ్యింది. ఏడాదిన్నర క్రితం మండపేటకు చెందిన కట్టా వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కొద్ది రోజుల పాటు సహజీవనం చేసిందని, అనంతరం ఏడాది క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదని చెబుతున్నారు. జయమ్మ ఇంటికి, ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్లింటికి వెళ్లి రావడానికి కేవలం మూడు అడుగుల సందు మాత్రమే ఉంది. వెళ్లిన మార్గం గుండానే రాకపోకలు సాగించాలి. జయమ్మకు రెండు అంతస్తుల డాబా ఇల్లు ఉండగా ఓ పోర్షన్లో ఆమెతో పాటు ఆమె రెండో భర్త కట్టా వెంకటేశ్వర్లు ఉంటూ మిగిలిన పోర్షన్లు అద్దెకు ఇచ్చారు. ఈ ఇంటితో పాటు జయమ్మకు మండపేటలో రెండు డాబా ఇళ్లు, ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉందని, వ్యవసాయ భూమిపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని పోలీసులు చెబుతున్నారు. పదేళ్లుగా జయమ్మ మండపేట నుంచి వచ్చి బ్యాంకుపేటలో ఉన్న ఇంట్లో కొద్ది రోజులు ఉండి వెళుతుంటుందని స్థానికులు చెబుతున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఏడాదిగా రెండో భర్త వెంకటేశ్వర్లుతో వచ్చి ఇక్కడ ఉంటోందంటున్నారు. నెల రోజుల క్రితం బ్యాంకుపేట వచ్చి తన ఇంట్లోనే రెండో భర్త వెంకటేశ్వర్లుతో ఉంది. ఈమెకు పిల్లలు లేకపోవడంతో అక్క కుమార్తెను పెంచి పెళ్లి చేసిందని, రెండో భర్తగా చేసుకున్న వెంకటేశ్వర్లుకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఉన్నారని పోలీసులు వివరించారు. జయమ్మ హత్య జరగడానికి కారణాలు ఏమిటనేది తెలియలేదు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి హత్య జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు. జయమ్మ హత్య జరిగిన మంచం కింద కట్టా వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో ఉండడం గమనించిన పోలీసులు, స్థానికులు అతడిని వైద్య నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. వెంకటేశ్వర్లుకు తగిలిన గాయం పెద్దదేమీ కాదని, అయితే ఇతడిని హత్య ఎలా జరిగిందని పోలీసులు ప్రశ్నిస్తే ఎవరో వచ్చి తమపై దాడి చేశారని, ఎవరనేది తాను చెప్పలేనని, మండపేటలో ఓ షావుకారుకి, జయమ్మకు ఆస్తి గొడవలు ఉన్నాయని, వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులకు వివరించినట్టు సమాచారం. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ హత్య చేశారా? లేక జయమ్మ ఆస్తులు ఎవరికైనా వెళ్లిపోతాయని ఆమెతో ఉంటున్న వ్యక్తులే ఈ హత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య గురువారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని క్రైమ్ డీఎస్పీ పల్లపురాజు, డీఎస్పీ రవివర్మ, త్రీటౌన్ సీఐ దుర్గారావు సందర్శించి సంఘటనకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించారు. జయమ్మ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ దుర్గారావు తెలిపారు. శవపం^నామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. -
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం.. పిడుగులు!
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు పడటంతో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో పిడుగులు పడి ఇద్దరు మృతిచెందగా.. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురంలో మరో ఇద్దరు పిడుగుల బారిన పడి మరణించారు. జిల్లాలో భారీగా వర్షం పడుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇటు తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ నగరంలో భారీగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. ఉరుములతో వర్షం పడుతోంది. -
నా బిడ్డను చంపేశారు...మమ్మల్నీ చంపేస్తారు
నా బిడ్డను చంపేశారు. మమ్మ ల్నీ చంపేస్తారు. భయపడి వేరే ఇంట్లో తలదాచుకుంటున్నాం. ప్రాణభయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వారూ పట్టించుకోలేదు. నా కొడుకును చంపేసినోళ్లే మా చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడేం చేస్తారోనని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని గడుపుతున్నాం. నోట్ల మార్పిడిలో నా కొడుకును ఓ పావుగా వాడుకున్నారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు, బయటకు తీసుకువెళ్లి చంపేశారు. చావును ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులు అనుమానాస్పద మృతిగా చెబుతున్నప్పటికీ నమ్మకం కలగడం లేదు. నా బిడ్డ చావుకు నలుగురు వ్యక్తులు కారణం, వారి పేర్లతో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. దీంట్లో అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేల ప్రమేయం ఉంది. ఇప్పుడా వ్యక్తులే మమ్మల్ని కూడా చంపేసేలా ఉన్నారు. పోలీసులకు మొర పెట్టుకున్నాం. ఓ న్యాయవాదిని ఆశ్రయించాం. కానీ న్యాయం జరగలేదు. ఎవరికి చెప్పాలన్నా భయమేస్తోంది. అందుకే మీడియా ముందుకు వచ్చాం...కాపాడండి. – 27 ఏళ్ల వయసున్న కుమారుడిని పోగొట్టుకున్న కర్రి కృష్ణవేణి కన్నీరుమున్నీరు... సాక్షి ప్రతినిధి, కాకినాడ : పెదపూడి మండలం అచ్యుతాపురత్రయానికి చెందిన కర్రి నాగేశ్వరరావు, కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యం కోసమని తిమ్మాపురంలో ఓ ఇంటిలో అద్దెకుంటున్నారు. నాగేశ్వరరావు, కృష్ణవేణి దంపతుల రెండో కుమారుడు కర్రి దుర్గా ప్రసాద్ తొలుత కేబుల్ టీవీలో పనిచేసేవారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు. కొంతకాలం క్రితం ఈయన భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా నోట్ల రద్దు తర్వాత కొంతమంది వ్యక్తులతో కలిసి నోట్లు మార్పిడి చేసేవారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు కూడా వీరిని వినియోగించుకుని నోట్లు మార్పిడి చేయించుకున్నారన్న వినికిడి ఉంది. ఈ క్రమంలో వ్యవహారాలు ఏరకంగా బెడిసికొట్టాయో తెలియదు గానీ ఈ ఏడాది జనవరి 24వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లిన దుర్గాప్రసాద్ తిరిగి రాలేదు. ఆ రోజు సాయంత్రం దుర్గా ప్రసాద్ స్నేహితుడికి దుర్గా కుటుంబీకులు ఫోన్ చేసి అడిగారు. దుర్గా ప్రసాద్ ఊరు వెళ్తున్నాడని, బట్టలు, ఛార్జర్ తనను తీసుకు రమ్మన్నాడని, సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నానని సదరు స్నేహితుడు చెప్పాడు. ఆ తర్వాత రెండు రోజులు దుర్గా ప్రసాద్ స్నేహితులు ఇంటికొచ్చి అక్కడ బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చారు. తన కుమారుడు ఎంతకీ రాలేదని అదే నెల 27వ తేదీన దుర్గా ప్రసాద్ కుటుంబీకులు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన దుర్గా ప్రసాద్ ‘తాను ఆపదలో ఉన్నానని, డబ్బు తినేశాననే అనుమానంతో నన్ను బంధించారని, మన ఇల్లును ఫలానా వ్యక్తుల పేరున రాసి ఇచ్చేయాల’ని అదే ఫోన్లో ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. ఎవరి పేర్లైతే దుర్గా ప్రసాద్ చెప్పాడో ఆ నలుగురు అదే నెల 28, 29వ తేదీల్లో ఇంటికొచ్చి ఇల్లును తమ పేరున రిజిస్ట్రేషన్ చేసేయాలని సతాయించడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే దుర్గా ప్రసాద్‌ను చంపేస్తామని బెదిరించారు. ఫిబ్రవరి 3వ తేదీన దుర్గా ప్రసాద్ నేరుగా ఫోన్ చేసి, ‘మన ఇల్లును వారి పేరున రిజిస్ట్రేషన్ చేసేయ’మని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అదే రోజున బెదిరింపులకు దిగినవారి పేరున రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఎటువంటి బాకీ లేదని లిఖిత పూర్వకంగా> ఆ నలుగురు వ్యక్తులు రాసిచ్చారు. ఆ వెంటనే తన కుమారుడ్ని ఇంటికి పంపించేయండని ఆ వ్యక్తులను కోరారు. వణికిపోతున్న కుటుంబీకులు అటు తాడేపల్లి గూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి న్యాయం జరగలేదని దుర్గా ప్రసాద్ కుటుంబీకులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. మధ్యలో ఒక న్యాయవాది వద్దకు వెళ్లి చెప్పుకున్నా...ఫలితం లేదు సరికదా కొంత డబ్బు గుంజేసి పలాయనం చిత్తగించాడని దుర్గా ప్రసాద్ తల్లి కృష్ణవేణి రోదిస్తూ చెబుతున్నారు. పెద్ద వ్యక్తులు (మంత్రి, ఎమ్మెల్యేలు) ఉండటంతో తమనేం చేస్తారేమోనన్న భయంతో దుర్గా ప్రసాద్ కుటుంబీకులు వణికిపోతున్నారు. ఎవరూ న్యాయం చేయడం లేదని, కనీసం మీరైనా లోకం దృష్టికి తీసుకురావాలని, మేలు జరిగేలా చూడాలని కృష్ణవేణి ‘సాక్షి ప్రతినిధి’ని కలిసి మొరపెట్టుకున్నారు. వాస్తవమేంటో నిగ్గు తేల్చాలి అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఎవరిపైనైనా అనుమానాలు వ్యక్తం చేస్తే తప్పనిసరిగా ఆ దిశగా విచారణ జరపాలి. అనుమానాల్నే క్లూస్‌గా తీసుకుని విచారణ చేస్తే వాస్తవమేంటో బయటికొస్తుంది. మృతుడు దుర్గాప్రసాద్ కుటుంబీకుల ఆరోపణల్లో పస ఎంత ఉందో స్పష్టమవుతుంది. ముఖ్యంగా నోట్ల మార్పిడి వ్యవహారంతో సంబంధాలుండటంతో ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలున్నారని వెనక్కి తగ్గితే ఇలాంటి బాధితులు బలి అయిపోవల్సి వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దుర్గాప్రసాద్ కుటుంబీకులకు రక్షణ కల్పించడమే కాకుండా వారి అనుమానాలను నివృత్తి చేయవల్సిన అవసరం ఉంది. చనిపోయినట్టు ఫోన్ కాల్... రెండు రోజుల్లో వచ్చేస్తాడని చెప్పిన మూడో రోజే (ఫిబ్రవరి 6వ తేదీ) తాడేపల్లిగూడెం పోలీసుల నుంచి ‘దుర్గా ప్రసాద్ చనిపోయాడని, నవాబుపాలెం అనే గ్రామంలో మృతదేహం ఉందని’ ఫోన్ వచ్చింది. ఎవరైతే ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారిలో ఓ వ్యక్తితో కలిసి దుర్గా ప్రసాద్ కుటుంబీకులంతా తాడేపల్లిగూడెం వెళ్లారు. ‘తన చావుకు ఎవరూ కారణం కాదని’... అని చెప్పి సూసైడ్ నోట్ రాసి పెట్టాడని దుర్గా ప్రసాద్ కుటుంబీకుల దృష్టికి అక్కడి పోలీసులు తీసుకొచ్చారు. సదరు వ్యక్తే పోలీసులతో మాట్లాడి, సంతకాలు చేయించి, మృత దేహాన్ని తీసుకొచ్చేసేలా చేశాడు. రెండు రోజుల అనంతరం ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు వచ్చి, మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కనిపించడం మానేశారు. జరిగిన పరిణామాలన్నీ గమనించాక దుర్గా ప్రసాద్ కుటుంబీకులు తాడేపల్లిగూడెం వెళ్లి, నలుగురిపై అనుమానం ఉందని, వారే చంపేసి ఉంటారని, సూసైడ్ నోట్లో ఉన్న అక్షరాలకు ... దుర్గాప్రసాద్ రాసే అక్షరాలకు తేడా ఉందని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి సదరు వ్యక్తులు వెంబడిస్తూ, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండటంతో ప్రాణభయం ఉందని తిమ్మాపురంలో ఉన్న ఇంటిని ఖాళీ చేసి, వారి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నారు. ఇదే విషయమై జిల్లా ఎస్పీ విశాల్ గున్నీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని సదరు ఫిర్యాదులో అభ్యర్థించారు. ఫిర్యాదు వచ్చింది మృతుడు దుర్గాప్రసాద్ కుటుంబీకుల నుంచి ఫిర్యాదు వచ్చింది. దాన్ని కాకినాడ రూరల్ సీఐకి రిఫర్ చేశాను. –విశాల్ గున్నీ, జిల్లా ఎస్పీ అనుమానాస్పద మృతిగా విచారణ చేస్తున్నాం తాడేపల్లిగూడేం మండలం నవాబుపాలెంలో మృతి చెందిన దుర్గా ప్రసాద్ కేసుపై విచారణ జరుపుతున్నాం. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ వద్ద నుంచి మాకు సమాచారం వచ్చింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదులో ఆరోపించిన వ్యక్తులను కూడా పిలిచి విచారించాం. వారి స్టేట్మెంట్ రికార్డు చేశాం. మృతుడికి చెందిన ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఫోరెన్సిక్ నుంచి రావల్సి ఉంది. సూసైడ్ నోట్లో అక్షరాలు దుర్గాప్రసాద్వి కావని మృతుడి తల్లిదండ్రులు చెప్పారు. కాకపోతే, అందుకు తగ్గ ఆధారాలు అడిగాం. మృతుడు తల్లిదండ్రులు సహకరించాల్సిన అవసరం ఉంది. ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ముందుకెళ్తాం. – చంద్రరావు, ఎస్ఐ, తాడేపల్లి గూడెం -
అక్రమ ఆయిల్ ముఠా అరెస్ట్
కాకినాడ రూరల్: వాకలపూడి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఆయిల్ అమ్మకాలు నిర్వహిస్తున్న ముఠాపై సర్పవరం పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సర్పవరం సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొంగ ఆయిల్ ముఠా వివరాలను వెల్లడించారు. తీరప్రాంతంలో ఒకసారి ఉపయోగించిన ఆయిల్‌ను నిల్వ చేస్తూ అమ్మకాలు చేస్తున్న ఆవుల శ్రీనివాసరెడ్డి, మందపాక సూరిబాబు, పెంటకోట గంగాధర్‌లను ఎస్సై శ్రీనివాసరెడ్డి సిబ్బంది సహాయంతో అరెస్టు చేసినట్టు వివరించారు. ఆవుల శ్రీనివాసరెడ్డి నుంచి ఆరు బ్యారెల్స్ (1200 లీటర్లు) యూజ్డ్ ఇంజన్ ఆయిల్, మందపాక సూరిబాబు నుంచి 75 లీటర్లు క్రూడ్ కాటన్ ఆయిల్‌ను, పెంటకోట గంగాధర్ అనే వ్యక్తి నుంచి 20 లీటర్ల డీజిల్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పాతనేరస్తుడైన ఆవుల శ్రీనివాసరెడ్డి వాకలపూడి ఎఫ్‌సీఐ కాలనీలో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని పాత ఇనుప వ్యాపారం షాపు నడుపుతున్నట్టు తెలిపారు. ఒకసారి ఉపయోగించిన ఇంజన్ ఆయిల్‌ను సేకరించి వాటిలో కొంత మంచి ఆయిల్‌ను కలిపి మంచి ఇంజన్ ఆయిల్గా చుట్టుపక్కల లారీ యజమానులకు, చిన్నచిన్న కంపెనీవాళ్లకు విక్రయిస్తూ వ్యాపారులను మోసగిస్తున్నాడన్నారు. సీఐ చైతన్యకృష్ణకు ముందుగా వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నామన్నారు. ఈనెల 6వ తేదీన ఏపీ5డబ్ల్యూ 1282 నంబర్ గల లారీ యజమాని కడలి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ వాకలపూడిలోని ఎన్సీఎస్ ఆయిల్ కంపెనీ నుంచి అమలాపురం, రావులపాలెం పెట్రోల్ బంకులకు వెళ్లేందుకు డీజిల్ నింపిన ట్యాంకర్ నుంచి డ్రైవర్ పెంటకోట గంగాధర్ ట్యాంకర్ కంపార్ట్‌మెంట్‌కు సీలు తొలగించి సుమారు 20 లీటర్లు డీజిల్ ఆయిల్‌ను దొంగిలించడంపై అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు. ఇదే విధంగా వాకలపూడి గ్రామంలోనే అక్రమంగా ఆయిల్ వ్యాపారం చేస్తున్న మంటపాక సూరిబాబుని అరెస్టు చేసి అతడి నుంచి 75 కిలోల కాటన్ క్రూడ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్ల వద్ద నుంచి కాటన్ క్రూడ్ ఆయిల్ కలిపి చుట్టుప్రక్కల వారిని స్వచ్ఛమైన ఆయిల్గా నమ్మించి అమ్మి మోసగిస్తున్నట్టు తెలియడంతో అరెస్టు చేశామన్నారు. సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పేకాట, జూదం ఆడుతున్న తొమ్మిది పేకాట కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు. నాలుగు గుట్కా కేసుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. పోర్టులో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను మోసగించి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వివిధ కేసుల్లో ఉన్న పాతనేరస్తులు(ఆయిల్ కేసుల్లో) 15 మందిని అదుపులోకి తీసుకుని 15 కేసుల్లో బైండవర్ చేసినట్టు వివరించారు. ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల ఏరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా పోర్టు ఏరియాలో రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచినట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు. కార్యక్రమంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై సత్యనారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జి పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడటౌన్–తిరుపతి ప్రత్యేక రైలు (07210) మే 11, 13, 18, 20, 25, 27, జూన్ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29వ తేదీల్లో రాత్రి 6.45కు కాకినాడటౌన్‌లో బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ టౌన్ రైలు (07209) మే 12, 14, 19, 21, 26, 28, జూన్ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నర్సాపూర్–హైదరాబాద్ ప్రత్యేక రైలు (07258) మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. హైదరాబాద్–విజయవాడ రైలు (07257) మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.20కు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాక పోకలు సాగిస్తాయని రాజశేఖర్ తెలిపారు.