
టీడీపీ ఎమ్మెల్సీ శివ కుమారి( పాత చిత్రం)
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ నేతల అవినీతి కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్సీపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి 2012-2013 ఆర్ధిక సంవత్సరంలో రూ.26.3 లక్షల స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో పదిమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితులపై కోటనందూరు పోలీసులు సెక్షన్ 409, 420 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment