
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నది ధర్మపోరాట దీక్ష కాదని, అది అధర్మ పోరాట దీక్షని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనం సొమ్ముతో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యక్రమం నిర్వహించిందని అన్నారు.
దీక్ష కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. దీక్షకు ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, పెన్షనర్లను బలవంతంగా తరలించారని ఆరోపించారు. సభలో చంద్రబాబు చేసిన కామెడీ చూసి జనం ఫుల్లుగా నవ్వుకున్నారని ఎద్దేవా చేశారు.
దీక్ష పేరుతో 2 వేల ఆర్టీసీ బస్సులను సభాస్థలికి తరలించడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వివరించారు. సభ కోసం పాఠశాలలకు సెలవులు ఇస్తారా? అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment