Kurasala kanna babu
-
వైఎస్ జగన్,వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయం : కురసాల
సాక్షి,కాకినాడ: ‘ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే. వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తన రంగు భయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అన్నా.. వైఎస్ జగన్ అన్నా భయమే.’ వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు.ధన్యవాదాలు తీర్మానంలో సీఎం చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. సభా మర్యాదలు చూస్తే చిత్రంగా ఉంది. సభా మర్యాదలను మంట కలిపే శ్రీకారం చుట్టుంది చంద్రబాబే. ఎన్టీఆర్‌ను పదవి లోంచి దించే సమయంలో ఆయనకు మైక్ ఇవ్వలేదు.మాజీ గవర్నర్ నరసింహన్ చంద్రబాబును చూసి బిత్తరపోయారు. హరిచందన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు చంద్రబాబు ఏవిధంగా కించపరిచారో అందరికి తెలుసు. వీళ్లా సభలో వైఎస్సార్సీపీ గవర్నర్‌కు మర్యాద ఇవ్వలేదు అని అంటున్నారు. నిరనసగా వాకౌట్ చేసి వెళ్లి పోవడం చాలా కాలం నుంచి నడుస్తోంది. చాల పార్టీలు చేస్తున్నాయి. ధన్యవాదాలు తీర్మానంలో చంద్రబాబు మాటలు వింటే..ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాలి అని సినిమా డైలాగ్ గుర్తుకువస్తుంది. గౌరవ సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజలు ఏమీ అనుకుంటున్నారో తెలుసుకోండి. గ్రూప్-2 అభ్యర్ధులైతే..తాము తప్పు చేశామని చెప్పులతో కొట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆబద్దాలు చెప్పారు. రూ.7 లక్షల కోట్ల అప్పు అని తేలింది. ఒక అబద్దాన్ని జనంలోకి తీసుకు వెళ్లి దానిని నిజమని నమ్మిస్తారు. ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లు కూటమీ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ అప్పులు దేని కోసం ఖర్చు చేశారు? ఏ వర్గాన్ని వదలకుండా మోసం చేయడానికి సిగ్గులేదా?. గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెబుతున్నారు.వీసీలను రాత్రికి రాత్రి బెదిరించి రాజీనామాలను చేయించారు. దీనిపై విచారణ జరిపించండి. తొమ్మిది నెలల కాలంలో మీ అసలు రంగు బయట పడింది. ప్రతిపక్ష హోదా మీద పార్లమెంటు చట్టం ఏం చెప్పిందో తెలుసుకోండి.వైఎస్సార్సీపీ అంటే మీకు భయం.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా మీ పాలనను ఎండగడతారని భయం. 151 సీట్లు వచ్చినా..11 సీట్లు వచ్చినా టీడీపీ వైఎస్ జగన్ చూసి భయపడుతోంది. ఆ ఒకే ఒక్కడు 49% ఓటు బ్యాంక్ పొందారు. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వైఎస్సార్సీపీదే అని అన్నారు. -
చంద్రబాబు రైతు ద్రోహి.. సెజ్‌పై విచారణ చేయాల్సిందే: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అధికారానికి ముందు ఒక మాట.. అధికారం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం అలవాటేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులను సెంట్రల్ జైల్లో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు సర్కార్‌కు అనుకూలంగా ఒక మీడియా దర్మార్గమైన ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు...2003లో పరిశ్రమల కోసం భూములను సేకరించారు. వైఎస్సార్ హయాంలో ఎస్ఈజడ్ కోసం 10 వేల ఎకరాలు సేకరించే ప్రయత్నం చేశారు. 8,150 ఎకరాల్లో జీఎంఆర్ ఈ భూములు సేకరించింది. సెజ్‌లో రైతులు దీనిని వ్యతిరేకించారు. ఉద్యమం ప్రారంభించిన సేకరణ ఆగలేదు. 2012లో చంద్రబాబు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములు వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ కూడా చంద్రబాబు మాటలు నమ్మింది. 2014 తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అపరిచితుడులా మారిపోయారు.రైతుల భూములను, ఎస్సైన్ లాండ్లను తిరిగి తీసేసుకుని సెజ్‌కి ఇచ్చేశారు. పోరాట కమిటీ నాయకులను పోలీసులతో వేధించి అక్రమ కేసులు పెట్టారు. 2018లో సెజ్ ఉద్యమం తీవ్రమైంది. సెజ్ పోరాట కమిటీ నాయకులను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. జైలులో బాత్ రూమ్‌లు రైతులతో కడిగించారు. భూములు ఇవ్వాలని రైతులపై తీవ్రమైమ ఒత్తిడి తెచ్చారు. కార్పోరేట్ కంపెనీలకు కొమ్ముకాసిన చరిత్ర చంద్రబాబుది. సెజ్‌కు భూములు ఇవ్వని రైతులకు తిరిగి ఇచ్చేస్తామని పాదయాత్రలో జగన్ పోరాట కమిటీ ఇచ్చారు. 2180 ఎకరాలు తిరిగి ఇచ్చేయాలని నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తీర్మానం చేసింది. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్పా.. ఆ భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం తప్పా. చంద్రబాబు ఒక్కడే నీతి మంతుడిలా మీడియా చూపిస్తుందిరైతులను దారుణంగా వేధించారు: దాడిశెట్టి రాజామాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, తన బినామీ అయినా కేవీరావు ద్వారా 2003లోనే చంద్రబాబు సెజ్‌లో భూ సేకరణ చేశాడు. మొట్ట మొదటిగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది అప్పటి తుని ఎమ్మెల్యేగా ఉన్న యనమల రామకృష్ణుడు. దీంతో రైతులు కూడా భూములు ఇవ్వాల్సి వచ్చింది. సెజ్ భూసేకరణ ద్వారా లాభపడింది యనమల రామకృష్ణుడు. 2014 లో చంద్రబాబు సీఎం అయిన వెంటనే దీవిస్ వంటి రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. దీవీస్ కోసం పోరాడిన రైతులను పోలీసులతో దారుణంగా వేధించాడు. 2180 ఎకరాల భూములను సెజ్ నుండి రైతులకు వైఎస్ జగన్ తిరిగి ఇచ్చారు. రైతులకు భూములు తిరిగి ఇచ్చిన జగన్ మంచివారా.. భూములు ఇవ్వాలని రైతులను హింసించిన చంద్రబాబు గొప్పవాడా?. 2003 నుండి జరిగిన భూ సేకరణ పై విచారణ చేయాలి. సెజ్‌లో జరిగిన అవకతవకలు బయట పెట్టాలి’’ ఆయన డిమాండ్ చేశారు.రైతులను చంద్రబాబు అవమానించారు.. జగన్ గౌరవించారు: వంగా గీతవంగా గీతా మాట్లాడుతూ.. సెజ్ గురించి 2003 నుంచి 2024 ఏం జరిగిందని రికార్డెడ్‌గా ఉంది. సెజ్‌లో భూముల కోసం పోరాడిన రైతులు ఉన్నారు. ఏరువాక చేసి సెజ్ భూములు వెనక్కి వస్తాయని చంద్రబాబు మోసం చేశారు. సీఎం అయిన వెంటనే రైతులను బెదిరించి చంద్రబాబు అవమానించారు. ఇప్పుడు మళ్లీ సెజ్ నుంచి ఏం ఆశించి అసత్య ప్రచారం మొదలు పెట్టారు. రైతుల ఉద్యమాన్ని వైఎస్ జగన్ గౌరవించారు.సెజ్‌లో ఉన్న ఆరు గ్రామాల ప్రజలు అక్కడే ఉండేలా చేశారు. 2180 ఎకరాల్లో చాలా భూములు రైతులకు తిరిగి వెళ్లిఫొయాయి. మిగిలిన భూములు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వద్ద నిలిచిపోయాయి. వాటిని చంద్రబాబు సర్కార్ క్లీర్ చేసి ఆ భూములను వెనక్కి ఇవ్వాలి. సెజ్ మీద మళ్లీ ఎందుకు అబద్దపు ప్రచారం మొదలు పెట్టారు. సెజ్ మీద ఏదో కుట్ర కోణం ఉంది?. సెజ్‌పై విచారణ వేయాలి. 2003 నుంచి 2024 నుంచి ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. సెజ్ రైతుల సెంటిమెంట్‌ను వైఎస్ జగన్ గౌరవించారు. సెజ్‌ను రాజకీయం చేయడంలో అసలు కథ ఏంటో ప్రజలకు తెలియాలి -
సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారు?
-
బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ: కన్నబాబు
సాక్షి ,గుంటూరు: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర అప్పులపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు. 30 వేల మంది మహిళలను అక్రమ రవాణా చేశారని పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని.. మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతలే ఒప్పుకున్నారన్నారు.‘‘పచ్చిఅబద్ధాలు ప్రచారం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రుషికొండ భవనాలపై రాష్ట్ర ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. తప్పుడు హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు మాటలు నమ్మి వాలంటీర్లు మోసపోయారు. వాలంటీర్లను మోసం చేశామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే ఒప్పుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.’’ అని కన్నబాబు నిలదీశారు.‘‘టీడీపీ అబద్దాల పునాదుల మీద బతుకుతోంది. రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పులు అని, రాష్ట్రం శ్రీలంకగా మారుతోందని ప్రచారం చేశారు. చివరికి రూ.6 లక్షల కోట్లేనని తేలింది. 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా జరిగిందని పవన్ కళ్యాణ్ విషప్రచారం చేశారు. 46 మంది మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా నిగ్గు తేలింది. రూ.3 వేల కోట్లు రంగుల కోసం ఖర్చు చేశారని పవన్, చంద్రబాబు ఆరోపణలు చేశారు. కానీ అదే పవన్ కల్యాణ్ అసెంబ్లీలో రంగులు వేయటానికి, తొలగించటానికి రూ.101 కోట్లేనని చెప్పారు..రిషికొండ మీద ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భవనాలు కట్టారని నిసిగ్గుగా ఆరోపణలు చేశారు. కానీ ఇవాళ అన్ని అనుమతులు ఉన్నాయని అసెంబ్లీలో చెప్పారు. వాలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి, ఇప్పుడు అసలు వాలంటీర్ల వ్యవస్థ లేదని అబద్దాలు చెప్తున్నారు. ఇంత మాట్లాడటానికి ఏమాత్రం సిగ్గు అనిపించటం లేదా?. గత అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లను కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశాల్లో వాలంటీర్ల వ్యవస్థేలేదన్నారు. 2023 ఆగస్టు నుంచి ఆ వ్యవస్థే లేదని చెప్తూ మరి మే నెల వరకు ఎలా జీతాలు ఇచ్చారు?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘వాలంటీర్లు న్యూస్ పేపర్ కొనేందుకు ఇస్తున్న రూ.200 లను కట్ చేస్తూ జీవో కూడా ఇచ్చారు. మరి వాలంటీర్లు లేకపోతే ఆ జీవో ఎలా ఇచ్చారు?. ఉచిత ఇసుక పేరుతో ట్రక్కు రూ.26 వేల చొప్పున అమ్ముతున్నారు. రాష్ట్రమంతటా నిర్మాణాలు ఆగిపోయాయి. గ్రామాల్లో బహిరంగంగా మద్యం బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలే బెల్టుషాపులు తెరిచారు. మద్యం ధరలను తగ్గించకుండా మోసం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు 30 నుండి 50 శాతం వరకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు పన్నులు వేయటమే సంపదను సృష్టించటం అంటారా?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారింది. చంద్రబాబు సీఎం అయ్యాక తొలిసంతకం పెట్టిన మెగా డీఎస్సీకి ఇప్పటికీ దిక్కూమొక్కులేదు. ఉచిత గ్యాస్ సిలెండర్లకు నిధుల కేటాయింపే చేయకుండా ప్రజల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక హత్యలు, దోపిడీలు, అరాచకాలు జరుగుతున్నాయి. పోలీసు అధికారులు టీడీపీ నేతలు చెప్పిందే చేస్తూ కాలం గడుపుతున్నారు. సామాన్యుడు న్యాయం కోసం పోలీసు స్టేషన్ గడప ఎక్కే పరిస్థితే లేదు. మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీద 8 అక్రమ కేసులు నమోదు చేశారు..స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టమని లోకేష్ చెప్పాడు. మరి ఇప్పుడు స్మార్ట్ మీటర్లను ఎలా పెడుతున్నారు?. అప్పుడు ఉరితాడులు అన్న స్మార్ట్ మీటర్లు ఇప్పుడు పసుపు తాడులుగా మారాయా?. గీత కార్మికులకు ఒక్క మద్యం షాపు కూడా ఇవ్వకుండా ఇచ్చినట్టు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారు. గతంలో కుల కార్పొరేషన్లను తప్పుపట్టున చంద్రబాబు ఇప్పుడు అవే కార్పొరేషన్లను ఎలా కొనసాగిస్తున్నారు?. అప్పుల గురించి చంద్రబాబు, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు వేర్వేరుగా లెక్కలు చెప్పారు. కాగ్ చెప్పిన లెక్కలు నిజమా? లేక ఈనాడు పత్రిక, టీడీపీ నేతలు చెప్పిన లెక్కలు నిజమా?..రాష్ట్ర పరపతిని దెబ్బతీసే కథనాలు పత్రికలో వస్తే ఆర్థిక శాఖ ఎందుకు ఖండించటం లేదు?. అసలు కాగ్ లెక్కలు కరెక్టా? మీ కాకి లెక్కలు కరెక్టా?. ఈ ఐదు నెలల్లోనే రూ.50 వేల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుది. గతంలో మాపై చేసినవి పచ్చి అబద్దాలని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. పబ్లిసిటీ స్టంటు, మీడియా మేనేజ్మెంట్తో ఎక్కువ కాలం ఏ ప్రభుత్వమూ నిలపడలేదు’’ అని కురసాల కన్నబాబు చెప్పారు. -
బాబూ.. వరద సంక్షోభం నుంచి సంపద సృష్టించుకున్నారా?: కన్నబాబు
సాక్షి, కాకినాడ: విజయవాడ వరదలతో కూటమి అసలు స్వరూపం బయటపడిందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు చెప్పుకొచ్చారు. దాతల నుండి వచ్చిన సాయాన్ని హారతి కర్పూరం చేశారని ఆరోపించారు.మాజీ మంత్రి కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వరదలను చంద్రబాబు పండుగ చేసుకున్నారు. సంక్షోభం నుండి సంపద సృష్టించినట్లు ఉంది. సకాలంలో వరద సహయక చర్యలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కూటమి అసలు స్వరూపం ఏమిటో బయట పడింది. ప్రజలు ఏమనుకుంటారో అని సిగ్గులేకుండా ప్రభుత్వం ఉంది. వినాయక చవితి, దసరా చందాలు వసూలు చేసినట్లు చంద్రబాబు వరదలకు సహాయం వసూలు చేశాడు. రూ.368 కోట్లతో ఎంత మందికి భోజనాలు పెట్టారు.కృష్ణా, గోదావరి వరదలకే చంద్రబాబు హడావిడి చేశాడు. కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు రూ.28 కోట్లు ఖర్చు చేశారా?. డ్రోన్లకు రూ.2కోట్లు ఖర్చు చేశారంట. చంద్రబాబు సర్కార్‌కు వరదొచ్చినా.. కరువొచ్చినా పండుగే. ఇది మంచి ప్రభుత్వం అని చెబుతున్న కూటమి నేతలు చెబుతున్నారు. వరద లెక్కలకు తేడా చూడమని ప్రజలను కోరుతున్నాం. నష్టపోయిన లక్షలాది ఎకరాల్లో పంటలకు ఎన్యూమరేషన్ జరగలేదు. ఇన్ని లెక్కలు వేసుకుంటున్న మీకు ప్రజలు ఏ లెక్క వేస్తారో అర్ధం కావడం లేదా?ఎన్నో సంస్థలు.. స్వచ్చంద సంస్థలు వరద బాధితులకు సాయం చేశాయి. వైఎస్సార్సీపీ కూడా ముందుకు వచ్చి వరద సాయం అందించింది. దాతల నుంచి వచ్చిన వరద సాయాన్ని హారతి కర్పూరం చేశారు. ఇప్పటికీ విజయవాడలో సాయం అందలేదని వరద బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. వరద నష్టం కోసం మేయర్ అడిగితే విజయవాడ అధికారులు ఎందుకు నిరాకరించారు. ఇంత దుర్మార్గంగా ఖర్చు చేశామని లెక్కలు ఎలా రాస్తారు. రేపు ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు మన గురించి ఎలా ఆలోచిస్తారు అని చంద్రబాబుకు ధ్యాసే లేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: పవన్ స్వామీ.. మీరు అరవాల్సింది ఎక్కడో తెలుసా?: ఆర్కో రోజా -
బాబూ.. 45 ప్రాణాలు పోయినా సిగ్గనిపించడం లేదా?: కురసాల కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ తప్పిదం వల్లే విజయవాడ మునిగిందని ఆరోపించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందన్నారు. మీడియా పబ్లిసిటీకి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు.కాగా, కురసాల కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడను ముఖ్యమంత్రి చంద్రబాబు ముంచేశారు. చంద్రబాబు పాలనలో డొల్లతనం బయటపడింది. బాధితులను ఆదుకున్నామని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా?. చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. కేవలం పబ్లిసిటీ మాత్రమే చేసుకుంటున్నారు. వర్ష ప్రభావాలపై ముఖ్యమంత్రి ఒక సమీక్ష అయినా చేశారా?. వర్షాలు, వరదల గురించి సీఎంఓ ఎందుకు ఆరా తీయలేదు.పునరావాస కేంద్రాలు ఎక్కడ?సుమారు 20 జిల్లాల్లో వరద ప్రభావం ఉంది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తుతామని డీఈ ముందే సమాచారం ఇచ్చారు. ప్రభుత్వానికి తెలిసే ప్రజల్ని గాలికి వదిలేశారు. 45 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి సిగ్గు అనిపించలేదా?. బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైంది. ఇరిగేషన్ శాఖ అధికారులు అలర్ట్ ఇచ్చినా పట్టించుకోలేదు. పునరావాస కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. విపత్తు నిర్వహణపై అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సింది పోయి.. మీడియా పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భారీగా వరదలు వచ్చినా ప్రాణ నష్టం జరగలేదు.సమీక్ష ఏది బాబూ..?ఎనిమిది రోజులు ఐనా ఇంతవరకు పరిస్థితి సద్దుమనగలేదు. రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఇది చంద్రబాబు ఫెయిల్యూర్ స్టోరీ. 20 గంటల ముందే వెలగలేరు గేట్లు ఎత్తుతామని చెప్పినట్టు చెప్పారు. మేము అలర్ట్‌గా లేమని కలెక్టర్ చెప్పారు. సిసోడియా అయితే ఏకంగా జనాన్ని తరలించటం సాధ్యం కాదని చెప్పేశారు. సినీనటి గురించి చంద్రబాబు ఆరా తీశారే గానీ, వరదలను గాలికి వదిలేశారు. కొండ చరియలు విరిగి పడి ఆరుగురు చనిపోతే చంద్రబాబు అక్కడకు ఎందుకు వెళ్లలేదు?. ఈ ఘటనలన్నిటినీ సీఎం చాలా తేలిగ్గా తీసుకున్నారు. వరదలు వస్తున్నప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులలో ఫ్లడ్ కుషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు?. 2014-19 మధ్య బుడమేరును చంద్రబాబు ఎందుకు ఆధునీకరణ చేయలేదు?. మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా?. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు బుడమేరు గురించి తెలియదా?. నిత్యవసర వస్తువులను 2.35 లక్షలకు ఇవ్వాలనుకుని ఎంతమందికి ఇచ్చారు?. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కనీసం 25% మందికి కూడా నిత్యవసరాలు పంపిణీ చేయలేదు. బ్యారేజీ వద్ద బోట్లను వైఎస్సార్సీపీ వాళ్లే అడ్డు పెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎనిమిది రోజులు చంద్రబాబు సెక్రటేరియట్‌కు వెళ్లి ఎందుకు సమీక్ష నిర్వహించలేదు?. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 5.04 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు లెక్కలు వేశారు. అంటే రెండు లక్షలకు పైగా రైతులు నష్టపోతే సమీక్ష ఎందుకు చేయలేదు?. కరకట్ట మీదకు జనాన్ని ఎందుకు వెళ్లనీయటం లేదు?. ఎవర్నీ ఫోటోలు కూడా ఎందుకు తీయనీయటం లేదు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సిబ్బందికి కనీసం భోజనాలు కూడా ఏర్పాటు చేయటం లేదు.వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల్లోనే..గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులను టార్గెట్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్ కట్టించిన రక్షణ గోడ కృష్ణలంకను కాపాడింది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎండీయూ వాహనాలను చంద్రబాబు కూడా వాడుకోక తప్పట్లేదు. కరోనా లాంటి అతిపెద్ద సమస్యలను కూడా వైఎస్ జగన్ వీరి ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. వరద రాజకీయాలు, బురద రాజకీయాలు చేయటం వైఎస్సార్సీపీ విధానం కాదు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటుంది. బుడమేరుకు ఇప్పటికి మూడుసార్లు వరద వచ్చింది. ఆ మూడుసార్లు సీఎంగా చంద్రబాబే ఉన్నారు. మరి ఆయన శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేదు?. చంద్రబాబు నిర్లక్ష్యం వలనే బుడమేరు వలన నష్టం కలిగింది. 1960లోనే బుడమేరుకు వెలగలేరు దగ్గర గేట్లు పెట్టారు. కానీ అసలు గేట్లే లేవని చంద్రబాబు అనటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బస్సు యాత్రకు అనూహ్య స్పందన
-
ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
‘చంద్రబాబుకు దృష్టిలోపం.. అందుకే పేదల వైపు చూడలేకపోయాడు’
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అవినీతి కేంద్ర సంస్థలే బయటపెట్టాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. స్కీంల పేరుతో చంద్రబాబు అంతా దోచేశారని, ఆయన్ను కక్షపూరితంగా అరెస్ట్ చేయలేదని చెప్పారు. పక్కా ఆధారాలతోనే చంద్రబాబు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు. బాబు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. ‘ఏపీ శ్రీలకంలా మారుతుందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను సిఎం జగన్ కలుపుకుని వెళ్ళున్నారు. గురువారం నుంచి ‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలి’ ప్రారంభం అవుతుంది. చంద్రబాబు కోసం అబద్దాలు చెప్పి ఎల్లో మీడియా ప్రజల్ని భమల్లోకి తీసుకువెళ్లాయి. ఆ భ్రమల్లో నుంచి ప్రజలు బయటకు వచ్చారు. జగనే ఎందుకు కావాలి అని చెప్పకపోతే.. అబద్దాల చంద్రబాబు నిజం అని ప్రజలు నమ్ముతారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే భూకంపం వస్తుందని టీడీపీ బిల్డప్ ఇచ్చింది. బాబు అరెస్ట్ అయితే చిన్న ప్రకంపనం కూడా రాలేదే. చంద్రబాబుకే గ్యారంటీ లేదు, వచ్చి వాయన ఎవరికి గ్యారంటీ ఇస్తారు. గవర్నర్‌కు కూడా అబద్దాలు చెబుతున్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో వందల కోట్లు లాగేసినా అరెస్ట్ చేయ్యకుడదా?. తాగుబోతులకు మంచి బ్రాండ్లు దొరకడం లేదని టీడీపీ భాధపడుతుంది. చేసేదంతా చేసి.. ఆ బురదను టీడీపీ ఎదుట వాళ్ళ మీద చల్లుతుంది. చంద్రబాబుకు ఎప్పుడూ దృష్టి లోపం ఉంది. అందుకే పేదల పక్షం వైపు చూడలేకపోయాడు. తన మ్యానిపెస్టోను చదువుకోలేకపోయాడు. బాబుకు, వైఎస్ జగన్‌కు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక బలవంతుడు, ధైర్యవంతుడిని ఢీ కొట్టాలంటే పదిమంది కలిసి వస్తారు. సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు ఒంటరిగా దైర్యంగా వెళ్తున్నారు. చంద్రబాబు ఏనాడైన జర్నలిస్టులకు సెంటు స్ధలం ఇచ్చాడా?. చంద్రబాబు పత్రికా యాజమాన్యాలను చూస్తాడు.. కలం కార్మికులను గుర్తించి మూడు సెంట్లు స్ధలాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. యాజమాన్యాల వైపు చంద్రబాబు ఉంటే.. జర్నలిస్టుల వైపు జగన్ ఉన్నారు’ అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. -
చంద్రబాబుకే గ్యారెంటీ లేదు.. ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారు
-
చంద్రబాబు, నారా లోకేష్ పై కురసాల కన్నబాబు సెటైర్లు..
-
అటెండర్ ని కూడా అన్నా అంటారు
-
‘బాబూ.. చేతనైతే సాయం చేయ్.. శవాలపై పేలాలు ఏరుకోకు’
సాక్షి, కాకినాడ: విద్యార్థి అమర్నాథ్ హత్య దురదృష్టకరమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. వారి కుటుంబానికి ఇంటి స్థలం, ఇల్లు, ఉద్యోగం కూడా ఇస్తామన్నామని తెలిపారు. ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయించిందన్నారు. చంద్రబాబు శవరాజకీయాలకు తెరలేపుతున్నాడని, ప్రతిచోటా రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఆరాటపడుతోందని విమర్శించారు. బాబూ.. చేతనైతే బాధిత కుటుంబానికి సాయం చేయాలి కానీ శవాలపై పేలాలు ఏరుకోవడం సరికాదని హితవు పలికారు. కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేయటం సబబు కాదని హితవు పలికారు.. చంద్రబాబుకు పనిలేక ఖాళీగా ఉన్నాడని ఎవరు పిలుస్తారా? వెళ్దామని ఎదురు చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుయుక్తులన్నీ ఆయన ఉంటున్న అక్రమ ఇంటి నుంచే జరుగుతున్నాయని విమర్శించారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబును ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. వారిని పరామర్శించావా బాబూ! 2014 - 2019 మధ్యలో నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి చనిపోతే వారింటికి వెళ్లి పరామర్శించావా చంద్రబాబు? వనజాక్షిపై నీ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం వనజాక్షిని పరామర్శించావా? రెండు నెలల క్రితమే టీడీపీ స్థానిక కౌన్సిలర్ హత్యకు గురైతే కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఖాళీగానే ఉన్నప్పటికీ ఆ కుటుంబాన్ని పరామర్శించని నేత చంద్రబాబు. చంద్రబాబు సతీమణి గురించి ప్రస్తావన చేశారని బోరున ఏడ్చిన వ్యక్తి చంద్రబాబు. మా కుటుంబాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాలుక కోస్తాం. పవన్‌కు వాస్తవాలు తెలియవు పవన్ లాగా నాకేమీ ప్యాకేజీ డబ్బులు రావటం లేదు. నా కష్టార్జితాన్ని తీసుకుని వెళ్ళి అమరనాథ్ కుటుంబానికి ఇచ్చి అండగా నిలిచాను. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదివే పవన్‌కు వాస్తవాలు తెలియవు. మత్స్యకారుల జీవితాలను పైకి తీసుకుని రావటానికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. హార్బర్లు కట్టిస్తున్నారు. డీజిల్ సబ్సిడీ అప్పటికప్పుడే ఇచ్చే ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి జగన్ వల్లే సాధ్యం. 2024లో కూడా జగనే సీఎం ఖాయం’ అని మోపిదేవి పేర్కొన్నారు. చదవండి: పవన్‌తో జాగ్రత్త! లేదంటే జనసేన నేతల చొక్కాలు చించుతారేమో! ఇది సినిమా కాదు, రాజకీయం పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. పవన్ సినిమాటిక్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సినిమా డైలాగ్స్‌తో హడావిడీ చేస్తున్నాడని దుయ్యబట్టారు. పవన్.. ఇది సినిమా కాదు, రాజకీయం అని హితవు పలికారు. సీఎం అవుతానంటున్న పవన్ భాష సరిగా లేదని, సభ్యత లేకుండా దిగజారి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ వ్యక్తిగత దూషణలకు దిగాడు. ఏదైనా ఆరోపించామంటే కనీస ఆధారాలు ఉండాలి. ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశాడు. పవన్తాను ఎక్కడా కుల రాజకీయం చేయనంటుంటాడు. కులాల ప్రస్తావన లేకుండా పవన్ ఎక్కడైనా మాట్లాడాడా?. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టింది టీడీపీయే. టీడీపీ ఆవిర్భావంతో కులాల కుంపట్లు ప్రారంభం అయ్యాయి. 80 శాతం కాపులు సీఎం జగన్‌కే మద్దతు తెలుపుతున్నారు. పవన్ చంద్రశేఖర్‌రెడ్డిపై పోటీ చేయాలి. కాకినాడలో పోటీ విషయంపై ద్వారంపూడి సవాల్‌కు ఇవాళైనా పవన్ సమాధానం ఇస్తాడో లేదో చూడాలి’ అని కన్నబాబు పేర్కొన్నారు. అవినీతి రాక్షసుడు చంద్రబాబు ‘నాలుగు దశాబ్ధాలుగా ఏపీని పట్టిపీడిస్తున్న శని చంద్రబాబు. చంద్రబాబు తప్పుడు ప్రచారంతో లబ్ది పొందాలని చూస్తున్నాడు. అవినీతి రాక్షసుడు చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు పని. వారాహి యాత్రలో పవన్ ఏం మాట్లాడుతునఆనడో తనకే తెలియట్లే. చంద్రబాబు ఏం చెబితే అదే పవన్ మాట్లాడుతున్నాడు. కాపుల పరువు తీసేలా పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ దిగజారి మాట్లాడుతున్నాడు. పవన్ వ్యాఖ్యలకు బాధపడే ముద్రగడ లేఖ రాశారు. చంద్రబాబు మారణహోమంలో పవన్ బలి అవుతాడేమో?. పవన్‌కు అపాయం జరిగితే చంద్రబాబుకే సానుభూతి వస్తుంది. చంద్బరాబు నుంచే పవన్‌కు పెను ప్రమాద పొంచి ఉంది. పవన్‌కు మా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది.’ -మంత్రి కొట్టు సత్యనారాయణ ‘ఎమ్మెల్యే ద్వారంపూడి.. ఆయన కుటుంబం పట్ల పవన్ చేసిన వాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్.. పార్టీని నడింపించాల్సిన విధానం ఇదేనా?. దూషణలు, పరుష పదజాలంతో పవన్ మాట్లాడుతున్నాడు. యువతకు ఏం మెసెజ్ ఇవ్వాలనుకుంటున్నావ్?. ద్వారంపూడిపై పవన్ మాట్లాడిన భాష అభ్యంతరం. సీఎం జగన్ వారసత్వంగా రాలేదు. ఒక నాయకత్వ లక్షణంతో ముందుకు వచ్చారు. ప్రజాస్వామ్యం గతిని మార్చిన వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలకు ఒక దైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చారు. -ఎంపీ వంగా గీత -
చంద్రబాబు చెప్పేవన్నీ నంగనాచి కబుర్లే: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, మోసాలేనని బాబు విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి బాబే కారణమని, అధికారం కోసం మళ్లీ కోతల రాయుడు సిద్ధమయ్యాడని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ నంగనాచి కబుర్లేనని దుయ్యబట్టారు. ‘ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. మళ్లీ కొత్త అబద్ధాల పుట్టతో తయారయ్యాడు. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారు. చంద్రబాబు తొలి సంతకానికే దిక్కులేదు. ఆయన తప్పుడు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీని లేపేందుకే ఎల్లో మీడియా ప్రయత్నం’ అని కన్నబాబు పేర్కొన్నారు. బాబు, లోకేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి టీడీపీ మహానాడు అట్టర్‌ఫ్లాప్ అయిందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మహానాడు అనే కంటే కులసభ అంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. చంద్రబాబు హామీలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. బాబూ కొడుకులకు అధికారం అనే పిచ్చి బాగా ఎక్కిపోయిందని.. బాబు, లోకేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. చదవండి: ‘పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు’ -
బాబుకు విజనూ లేదు.. విస్తరాకుల కట్టా లేదు: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: ఎన్నికలకు ఇంకో ఏడాది ఉన్న తరుణంలో చంద్రబాబు రోజుకో వేషం పూటకో మాట మాట్లాడుకుంటూ మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమం చేపట్టారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రాంతాలలో చిచ్చు పెట్టి, తన మాయలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తానేదో సత్యహరిశ్చంద్రుడిలా, నీతి మంతుడిలా, ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్న గురువులా బిల్డప్‌లు ఇవ్వడం బాబు ప్రారంభించాడని, కొన్ని ఎల్లో పత్రికలు అయితే చంద్రబాబు ప్రవచనాలతో పేజీలకు పేజీలు నింపాయని ఫైర్ అయ్యారు. 'పేదరిక నిర్మూలనకు.. ఈ వృద్ధ నాయకుడికి కొత్త విజన్ అట.. అసలు పేదల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినవాడు.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినవాడు, 28 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నవాడు, ఇప్పుడు కొత్తగా పేదరిక నిర్మూలన అని అంటున్నాడు. పేదలకు ఏం చేశావు అంటే.. తన మార్కు ఉన్న ఒక్క పథకం పేరు చెప్పలేడు. పేదరిక నిర్మూలన గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఎక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ ప్రారంభింంచిన 2047 విజన్ కు తాను మద్దతు ఇచ్చానని చెబుతున్నాడు.' అని కన్నబాబు ఏకిపారేశారు. మోదీ కనికరం కోసం మోకరిల్లిన బాబు 'రిపబ్లిక్ టీవీకి చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే.. మోదీ కోసం తాను రెడీగా ఉన్నానని, ఆయన కరుణ కోసం ఎదురు చూస్తున్నాడన్నది.. రాజకీయాల్లో ఏ కొంచెం అవగాహన ఉన్నవారైనా ఇట్టే చెబుతారు. గతంలో మీరు ఎన్డీఏ యేతర పార్టీలతో కూటమి కట్టారు కదా.. అని ఇంటర్వ్యూలో అడిగితే.. అప్పుడు కూడా మోదీని వ్యతిరేకించలేదు. ఆయన విజన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన కోసం నేను, నా ప్రజలు కలిసి పనిచేస్తాం.. అని చెప్పే పరిస్థితికి బాబు వచ్చాడు.' అని కన్నబాబు ఎద్దేవా చేశారు. కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడమే బాబు విజన్ 'అనుభవం ఉందని 2014లో అధికారం అప్పగిస్తే.. ఒక్క పర్మినెంటు బిల్డింగు కట్టలేని వాడు, శివ రామకృష్ణన్ కమిటీ వద్దన్న చోటే రాజధానిని ప్రకటించి.. ఏమీ చేయలేని వాడు చంద్రబాబు. చంద్రబాబుకు విజన్ లేదు.. విస్తరాకుల కట్టా లేదు. బాబుకు భజన చేసే నారాయణ లాంటి వారు, కొన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. చంద్రబాబుకు ఉన్న విజన్ ఒక్కటే.. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలి. తన చుట్టూ ఉన్న వందిమాగధులకు దోచి పెట్టాలి. తన కొడుక్కు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి. ఇంతకంటే వేరే విజన్ బాబుకు ఉందా..?' అని మాజీ మంత్రి ప్రశ్నించారు. చదవండి: టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష -
‘కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది కదా?’
సాక్షి, కాకినాడ: 2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే.. కోడి కత్తి కేసు అని చంద్రబాబు, ఎల్లో మీడియా ఎగతాళి చేశాయని మండిపడ్డారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు ఎప్పుడైనా కోడి కత్తి చూశారా? అని ప్రశ్నించారు. ఎంత పదునుగా ఉంటుందో ఓసారి టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు. ఈ మధ్య కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది చూసుకోండి అని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. 'వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఛార్జిషీటు పేర్కొంది. దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. ఈనాడు కథనంలో దీనిపై తీర్పు కూడా ఇచ్చేశారు. తీర్పులు ఇవ్వడానికి మీరెవరూ? మీకు ఏం హక్కుఉంది. నిందితుని వాంగూల్మంతో తీర్పులు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఈనాడు అచ్చేస్తుంది. ఎన్ఐఎ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయమని కోరితే మీకు ఇబ్బంది ఏంటి? మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఈ సంఘటనను చులకనగా తీసిపడేస్తే చంద్రబాబును కాపాడొచ్చు అని మీ దుర్బుద్ధి కాదా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు బాధ్యత లేదా? నిందితుడి కత్తి భుజానికి కాకుండా మెడకు తగిలి ఉంటే పరిస్ధితి ఏంటి?' అని కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘చంద్రబాబు, లోకేశ్‌ను తరిమికొడతాం’ -
రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది: కన్నబాబు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి కన్నబాబు టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్‌లో రైతలును కాల్చి చంపింది ఎవరూ? అని కన్నబాబు ప్రశ్నించారు. నిడదవోలు కాల్దరి గ్రామంలో రైలు పట్టాలపై ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరిపితే ఇద్దరు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో రైతులపై బాబు లాఠీచార్జ్ చేయించారని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో రైతులను గుర్రాలతో తొక్కించారని మండిపడ్డారు. ‘2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమలు చేసినప్పుడు లెఫ్ట్ పార్టీలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నాయి. విద్యుత్ బిల్లులు కట్టలేదని మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసి వ్యానులో తరలించిన చరిత్ర చంద్రబాబుది. రైతులను రోజుల తరబడి జైళ్లలో పెట్టించాడు. పార్టీలు మారటం గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. పార్టీ లేదు.. బొక్కా లేదు అన్న వ్యక్తి అచ్చెన్నాయుడు. చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్, టీడీపీలో చేరి మామ నుంచి పార్టీని లాక్కున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు చేతికి అందని పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమే’నని కన్నబాబు ధ్వజమెత్తారు. చదవండి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ -
చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ దరిద్రం: మాజీ మంత్రి కురసాల కన్నబాబు
-
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబే: కన్నబాబు
-
సీఎం జగన్ నిర్ణయాలు ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఉంటాయి: కన్నబాబు
-
ప్రధాని పర్యటనలో విభజన హామీలు నెరవేరుతాయని ఆశిస్తున్నా : కురసాల కన్నబాబు
-
కోతికి కొబ్బరికాయ దొరికినట్టు
-
శవాలు ఎక్కడ ఉంటే అక్కడ టీడీపీ: మంత్రి కన్నబాబు
-
రోడ్డు మీద నుంచి బాబు డైరక్షన్లు: మంత్రి కన్నబాబు
-
ఎల్లో మీడియా పచ్చ రాతలు వీళ్ళవి పిచ్చి కూతలు..
-
కేంద్రం జోక్యం చేసుకుని విభజన సమస్యలు పరిష్కరించాలి: కన్నబాబు
-
టీడీపీ హయాంలో ఈనాడు ఎందుకు మాట్లాడలేదు..
-
టీడీపీ హయాంలో ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు: కురసాల కన్నబాబు
సాక్షి, తూర్పుగోదావరి: ఎల్లో మీడియా కథనాలపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ కేంద్రంగా కిలో బియ్యం రూ.25 లకే విదేశాలకు రిసైకిల్ చేసి ఎగుమతి చేస్తున్నారని ఈనాడులో కథనం వచ్చిందన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే కాకినాడ నుంచి బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయా అని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బియ్యం ఎగుమతి అయ్యాయా లేదా అంటూ ఈనాడు పత్రికను నిలదీశారు. అప్పుడెందుకు ఈ అనుమానం రాలేదని ప్రశ్నించారు కనీసం వివరణ తీసుకుని వార్త రాయాలన్న జర్నలిజం నైతిక విలువలు పాటించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళు మూసుకుపోయి వార్తలు రాయొద్దన్నారు. లాంగ్ గ్రేయిన్ రైస్ ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో ఎగుమతి చేశారో అధ్యయనం చేయాలని సూచించారు. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయ్యే బియ్యాన్ని అధికారులు ముందుగా పరీక్షిస్తారని తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు బయటకు వచ్చి రాజకీయంగా నడవలంటే రెండు ఊత కర్రలు.. ఒక త్రీవీల్ ఛైర్ కావాలని, రాజకీయంగా కదలలేని స్ధితిలో మూలన పడిపోయారని విమర్శించారు. చదవండి: చంద్రబాబు రివర్స్ డ్రామా.. ఇదీ వాస్తవం -
చంద్రబాబు మాటలను సీఎం జగన్‌కు వివరించిన మంత్రి కన్నబాబు
-
విశాఖ రింగు వలల వివాదం పరిష్కారంపై సమావేశం
-
ఫోన్ చేసినట్లు అమిత్ షా మీకు చెప్పారా?
సాక్షి, అమరావతి: సమగ్రమైన బిల్లు తీసుకురావాలనుకోవడం వెనకడుగు వేయడమతుందా? చంద్రబాబు ఇలాంటివి తప్పుడు ప్రచారం చేయడంలో దిట్ట అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము వికేంద్రీకరణపై వెనుకడుగు వేయలేదని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటే ఆయన ఖర్మని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా చెప్పారని, సాంకేతిక సమస్యలను తొలగించి మళ్లీ వస్తామని అన్నారు. అమిత్ షా ఫోన్ చేస్తే బిల్లు రద్దు చేశామనడం అవివేకమని మండిపడ్డారు. ఫోన్ చేసినట్లు అమిత్ షా వీళ్లకు చెప్పారా? అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటివి ప్రచారం చేయడంలో టీడీపీ నాయకులు ముందుంటారని ఎద్దేవా చేశారు. మండలి విషయంలోనూ తాము వేసింది వెనుకడుగు కాదని స్పష్టం చేశారు. ఆ రోజు మండలిలో తమ బలాన్ని ఉపయోగించి ప్రతీ దాన్ని టీడీపీ నాయకులు రాజకీయం చేశారని మండిపడ్డారు. అనేక బిల్లులు ఆపింది నిజం కాదా అని నిలదీశారు. అలా ఒక సభను దుర్వినియోగం చేయొచ్చా? అని ప్రశ్నించారు. అందుకే అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం నుంచి స్పందన రాలేదని అన్నారు. మరో వైపు ఇప్పుడు ఆ శక్తుల బలం తగ్గిందని అందుకే మండలి కొనసాగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. రాజధానిపై రకరకాల ప్రచారం చేస్తున్నారని, కానీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
‘చంద్రబాబు సతీమణి గురించి సభలో ఎక్కడా ప్రస్తావన రాలేదు’
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిది బాధపెట్టించే తత్వమే కానీ బాధపడే మనస్తత్వం కాదని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు కన్నీళ్లు పెట్టిస్తారే తప్ప.. పెట్టుకోరని ధ్వజమెత్తారు. తన భార్యను ఎవరో ఏదో అన్నట్లు చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని, ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఒక్కరోజైనా చంద్రబాబు విలువతో కూడిన రాజకీయం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పుడూ పదవి కావాలని, పదవి కోసం ఆయన ఎవరినైన వాడుకుంటారని దుయ్యబట్టారు. చదవండి: చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నాడు: మంత్రి బాలినేని ‘టీడీపీ సభ్యులే వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభించారు. బాబాయ్ గొడ్డలి అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశాచారు. టీడీపీ కామెంట్లకు మావాళ్లు స్పందించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అసెంబ్లీలో ఎక్కడా చర్చలోకి రాలేదు. భువనేశ్వరి గురించి మాట్లాడినట్లు తప్పుడు చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టారు. భువనేశ్వరిపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోం’ అని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. చదవండి: ‘బాలకృష్ణ అమాయకుడు.. చంద్రబాబు ఏం చేప్తే అది నమ్ముతాడు’ -
చంద్రబాబు, కరువు కవల పిల్లలు: మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ ఐదేళ్లలో చేసిన బీమా కన్నా రెట్టింపు బీమ చేయించామని తెలిపారు. రైతు విత్తనం వేసిన దగ్గర్నుంచే బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ ప్రక్రియలో 71లక్షల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ఏనాడు రైతులకు పూర్తి సబ్సిడీ ఇవ్వలేదని గుర్తు చేస్తూ, రైతుల కోసం టీడీపీ నేతలు ఏనాడైనా ఒక్క సలహానైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు రైతులు గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన చంద్రబాబు, ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్నాడు.. అసలు చంద్రబాబు గురించి మాట్లాడితే ఏడాది పాటు సభ పెట్టినా సరిపోదని విమర్శించారు. మంగళగిరిలో లోకేష్ ఓటమిని తట్టుకున్న గుండె చంద్రబాబుది, కుప్పంలోనూ ఓటమి ఆయనకు లెక్కకాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని మంత్రి ప్రశ్నించారు. చదవండి: Andhra Pradesh: అధికార పార్టీ అరుదైన రికార్డు -
‘కుప్పంలో చంద్రబాబు వీధి నాటకం’
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటనను మీడియాలో ప్రచారం చేసుకునేందుకే బాంబులు, రాళ్ల దాడులంటూ వీధి నాటకాలకు దిగారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పుకునేందుకు ఆయన సిగ్గుపడాలన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పునాదులు కదిలిపోవడంతో ఎప్పుడూ లేనిది వంగి వంగి నమస్కారాలతో చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నిన్నటి వరకు గంజాయి, హెరాయిన్.. ఆ తర్వాత దాడులంటూ పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చర్చకు సిద్ధమే.. ఎవరైనా అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రమ్మంటారు. బూతులపై చర్చకు రావాలని సవాళ్లు విసురుతున్నారంటే చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయినా సరే.. ఎక్కడికి రావాలో చెబితే చర్చకు మేం సిద్ధం. చంద్రబాబు చేత చంద్రబాబు కోసం నడుపుతున్న వ్యవస్థలుగా కొన్ని పత్రికలు, చానళ్లు పని చేస్తున్నాయి. చంద్రబాబు మీద దాడి చేయాల్సిన అవసరం వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు లేదు. చంద్రగిరి నుంచి బదిలీపై వచ్చిన టూరిజం ఉద్యోగి మోహన్‌పై చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే కనీసం వారించలేదు. శాంతి భద్రతలు క్షీణించాయంటూ చేస్తున్న విష ప్రచారానికి కొనసాగింపే తాజా డ్రామా. ఒక వ్యక్తి హుందాతనానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు కూడా చెప్పాయి. మరి రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు కదా? మరి ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? రైతుల బలవన్మరణాలపై దారుణ కథనం ... రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందంటూ ఈనాడు దినపత్రిక ఓ దారుణమైన కథనాన్ని ప్రచురించింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2020లో ఏపీలో 889 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో కౌలు రైతులే ఎక్కువని కథనంలో పేర్కొంది. 2020లో కేవలం 225 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా బాధిత కుటుంబాలకు పరిహారం కూడా చెల్లించాం. రైతాంగాన్ని ఆదుకోవడంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో సీఎం జగన్ ఉన్నారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎన్సీఆర్బీకి పోలీసు శాఖ పంపిస్తున్న గణాంకాలు, తమ గణాంకాల మధ్య వ్యత్యాసం ఉందని, సరిచూసుకోవాలంటూ 2020 సెప్టెంబర్‌లో రాష్ట్ర అగ్రికల్చర్ కమిషనర్ లేఖ కూడా రాశారు. గంటా, అయ్యన్న ఏమన్నారో గుర్తుందిగా? టీడీపీ హయాంలో 3 వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు రికార్డుల్లో ఉందంటే సాగు జరిగినట్లే కదా? గంజాయి సాగు, మాఫియా పేట్రేగిపోయాయని మంత్రులుగా ఉన్నప్పుడు గంటా, అయ్యన్నపాత్రుడు మాట్లాడటం నిజం కాదా? గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు. ఎస్ఈబీ ద్వారా ఉక్కుపాదం మోపుతున్నాం. పక్క రాష్ట్రాల్లో సాగు చేసి ఏపీ మీదుగా తరలిస్తుండటంతోమనకు అపకీర్తి వస్తోంది. లోకేశ్ తాను పప్పు కాదని బ్రాండింగ్ చేసుకునేందుకు బూతులు తిట్టే పనిలో పడ్డారు. -
అమిత్‌షాపై రాళ్లు వేయించిన ఘనుడు చంద్రబాబు
-
‘రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతలకు కడుపుమంట’
సాక్షి, కాకినాడ: రైతు సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల ఆనందం చూడలేక టీడీపీ నేతలకు కడుపుమంట అని మండిపడ్డారు. క్రాప్ హాలీడే అంటూ.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ క్రాప్ హాలీడే ప్రకటించారో ఆధారాలు చూపించాలని అన్నారు. విద్యుత్ మీటర్ల వల్ల ఒక్క రైతుకైనా రూపాయి భారం పడిందా? అని ప్రశ్నించారు. మీటర్లపై రైతులకు లేని అభ్యంతరం టీడీపీ నేతలకు ఎందుకని నిలదీశారు. -
త్వరలోనే ఏపీలో ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తాం: కన్నబాబు
సాక్షి, అమరావతి: ఏపీలో త్వరలో ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని తీసుకొస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో స్పష్టమైన ప్రణాళికలు చేస్తున్నాం అన్నారు. ఎఫ్పీఓలు, ఎన్జీఓలు, అధికారులు, శాస్త్రవేత్తలతో మంత్రి కన్నబాబు సోమవారం అమరావతి ఏపీఐఐసీ బిల్టింగ్‌లో సమావేశం నిర్వహించారు. రైతులు, ఎఫ్పీఓలు, ఎన్జీఓల నుంచి సేంద్రియ వ్యవసాయపు అనుభవాలు, సలహాలను మంత్రి కన్నబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ‘‘రైతులకు రెట్టింపు ఆదాయంతో పాటు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ప్రజలకు చేరేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బీకే కేంద్రంగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సీఎం ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయానికి సహాయంగా రెండు దశల్లో 5,000 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం’’ అన్నారు. (చదవండి: సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలి: కన్నబాబు) పొలంబడి ద్వారా వ్యవసాయ, ఉద్యాన వన వర్సిటీలు.. రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులను చైతన్య పరచాలి. ఉత్పత్తులు తగ్గకుండా రసాయనాలు, పురుగు మందులను తగ్గిస్తూ, క్రమేపి వాటి వినియోగాన్ని కనీస స్థాయికి తీసుకురావాలి. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ భావితరాలకు ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని అలవాటు చేయాలి’’ అన్నారు. (చదవండి: కోవిడ్ సాగు: షుగర్ క్వీన్.. తియ్యటి పంట) ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు, ఎప్‌పీఓలు, ఎన్జీఓలు సర్టిఫికేషన్, శిక్షణ, పనిముట్ల పంపిణి, మార్కెటింగ్ సౌకర్యాలు, ఆర్గానిక్ ఉత్పత్తులపై విస్తృత ప్రచారం, రైతులకు కసాయాలు, ఘన జీవామృతం అందుబాటులో ఉంచడం వంటి అంశాలపై సలహాలిచారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ ఉన్నతాధికారులు టి విజయ కుమార్, స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య , అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ , హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ , యూనివర్సిటీ వీసీ జానకిరామ్ , ఏపీ సీడ్స్ ఎండి శేఖర్ బాబు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర , సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు -
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కురసాల కన్నబాబు
-
పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు వెళ్లింది: మంత్రి కురసాల కన్నబాబు
-
‘ఇవి సీఎం జగన్‌కు ప్రజలు వెన్నుదన్నుగా నిలిచిన ఎన్నికలు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పరిషత్ ఎన్నికలు చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయాల పరంపరం కొనసాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి కురుసాల కన్నబాబు తెలిపారు. గత స్థానిక ఎన్నికలు చూసినా, ఇప్పుటి ఫలితాలు చూసినా అదే ట్రెండ్ కొనసాగుతోందన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో 80 శాతం వస్తే ఇప్పుడు అంతకు మించి రానున్నాయన్నారు. ఒక నాయకుడి నిబద్ధతకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు ఏ ముహూర్తాన ఆ మాట అన్నాడో గానీ ఆ మాటలు అక్షర సత్యం అవుతున్నాయని తెలిపారు. చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్: జిల్లాల వారీగా ఫలితాలు అయితే ఈ రోజు తాము బహిష్కరించాం కాబట్టే వైఎస్సార్సీపీ గెలిచిందని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అప్పుడు టీడీపీ అన్ని ఎన్నికల్లో పాల్గొన్నారని, బీఫామ్ ఇచ్చారని, ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు బహిష్కరణ అంటే ప్రజలు నమ్మరని అన్నారు. మున్సిపాలిటీల్లో ఒక్క తాడిపత్రి తప్ప అన్ని చోట్లా వైఎస్సార్సీపీ గెలిచిందని చెప్పారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు సీఎం జగన్ వెనుక ఉన్నారన్నారు. మీ వెనుక మేమున్నాం.. ముందుకెళ్లండి అంటూ సీఎంకు భరోసా ఇచ్చారని తెలిపారు. ఆ రోజు మూడు కరోనా కేసులు మాత్రమే ఉంటే ప్రభుత్వానికి కూడా సమాచారం లేకుండా నిలిపేశారని, ఎన్నికలు జరపొద్దని అడ్డుపడి, ఆ తర్వాత ఫలితాలను ఆపేశారన్నారు. ఇప్పుడు వీళ్లు ఎన్ని చేసినా ప్రజలు సీఎం జగన్ వెనకున్నామని స్పష్టం చేశారని పేర్కొన్నారు. చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్: జిల్లాల వారీగా ఫలితాలు ‘ఇవి గాలివాటం ఎన్నికలు కాదు.. ఒక ముఖ్యమంత్రికి ప్రజలు వెన్నుదన్నుగా నిలిచిన ఎన్నికలు. ఏ రోజు స్థానిక ఎన్నికల్లో టీడీపీ ప్రజామోదాన్ని పొందినది లేదు. ఇప్పటికీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అర్థం చెప్పింది వైఎస్ జగన్. ఓటమికి కారణాలు వెతుక్కోవద్దు. కొత్త బాష్యాలు చెప్పొద్దు. పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం. ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మీరు అమితంగా ప్రేమిస్తున్న అమరావతిలోనే మీకు మద్దతు లభించలేదు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఒకే రకమైన ఫలితాలు వస్తున్నాయి. 13కి 13 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంటాం. ఓడిపోయిన ప్రతిసారీ ఎన్నికలకు వెళదాం రండి అంటున్నారు. ఇవన్నీ ఎన్నికలు కాదా...? సిగ్గులేదా.. ఓటమిని ఒప్పుకోండి. మేము లేస్తే మా అంత వస్తాదులు లేరని తొడగొట్టడం మానండి.’ అని మంత్రి కురసాల హితవు పలికారు. -
అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు మభ్యపెడుతున్నారు: కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: అమరావతి ఉద్యమం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని మభ్యపెడుతున్నారని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఐదేళ్లూ అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఉద్యమం పేరుతో మభ్యపెట్టాలనే ప్రయత్నిస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు.. అభివృద్ధి వికేంద్రీకరణను తన స్వార్థం కోసం వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని సీఎం జగన్ భావించారని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబు స్వార్థంతోనే వ్యతిరేకిస్తున్నారని, ఆయన చేసిన తప్పిదాల వల్లే దారుణంగా ఓటమి చెందారని మంత్రి ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టారని, అయినా ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని మండిపడ్డారు. చంద్రబాబు రెచ్చగొట్టినా ప్రజలు సంయమనం పాటించారని, రాజధాని ప్రాంతంలో కూడా వైఎస్సార్సీపీకి ప్రజలు మద్దతు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని, అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ఇంకా మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో పెట్టిన తమ పెట్టుబడులకు తగిన రాబడులు రావనే కారణంతోనే బాబు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని వస్తే ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా కన్నబాబు తెలిపారు. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని కన్నబాబు గుర్తుచేశారు.. హైదరాబాద్‌లోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకృతమైందన్నారు. విశాఖ పరిపాలన రాజధానికి అచ్చెన్నాయుడి మద్దతు ఉందా? లేదా? సూటిగా కన్నబాబు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అమరావతికి అధ్యక్షుడా? లేదా ఏపీ టీడీపీకి అధ్యక్షుడా? అని నిలదీశారు. తాము స్పష్టంగా చెబుతున్నాంమని, అమరావతి అభివృద్ధి కూడా తమ బాధ్యతేనని కన్నబాబు తెలిపారు. మోసం గురించి యనమలే చెప్పాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసం చేసి వెన్నుపోటు పొడుస్తుంటే ఆయన వెంటే ఉన్నాడని, వారు దివాలాకోరుతనం గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటారని అన్నారు. విశాఖలో పరిపాలన రాజధాని వస్తే యనమలకు వచ్చే ఇబ్బందేంటో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఎవరు నియంతలా వ్యవహరించారో యనమల ఆలోచించుకోవాలని మండిపడ్డారు. కచ్చితంగా 3 రాజధానులు ఉంటాయనని మంత్రి కన్నబాబు తెలిపారు. 600 రోజుల పండగ అంటూ అక్కడి ప్రజలను మోసం చేయొద్దని, మీరు చేస్తే ఉద్యమాలు.. దళితులు చేస్తే అల్లరి మూకలా? అని విరుచుకపడ్డారు. చంద్రబాబు బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు పోరాటం రియల్ఎస్టేట్ కోసమైతే.. అన్నిప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని ఆయన గుర్తుచేశారు. మట్టి, నీరు తెచ్చి పండగ చేసే ప్రభుత్వం మాది కాదని, సీఎం జగన్ ప్రభుత్వం అన్నిప్రాంతాలకు సమన్యాయం చేస్తుందని కన్నబాబు స్పష్టం చేశారు. స్వార్ధ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని మంత్రి కన్నబాబు అన్నారు. వికేంద్రకరణ కోసం సీఎం జగన్ 3 రాజధానులకు సంకల్పించారని తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా రెఫరెండం అనే చంద్రబాబు.. అమరావతి ప్రాంతంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూశారని అన్నారు. ప్రజలు ఎవరి పక్షాన నిలబడ్డారో చంద్రబాబుకు ఇంకా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు. గుంటూరు, విజయవాడల్లో మొత్తం వైఎస్సార్సీపీ గెలిచిందని తెలిపారు. మరి దాన్ని ఎందుకు రెఫరెండంగా చంద్రబాబు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు ఇంకా మభ్య పెడుతున్నారని, అమరావతిలో పెట్టిన తమ పెట్టుబడులకు రాబడులు రావని బాబుకు ఆవేదన ఉందన్నారు. -
ఆప్కాబ్ ఛైర్‌పర్సన్‌గా మల్లెల ఝాన్సీ బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఛైర్‌పర్సన్‌గా మల్లెల ఝాన్సీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ వ్యవసాయశాఖమంత్రి కురుసాల కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సహకార వ్యవస్థలో కొత్త అధ్యయనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆప్కాబ్, సహకారశాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని, సహకార సంఘాల అభున్నతికి సీఎం అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ‘ఆడిట్ విధానాన్ని బలోపేతం చేయడం , పూర్తి స్థాయిలో సహకార సంఘాల కంప్యూటీకరణ , మానవ వనరుల పాలసీ తదితర నిర్ణయాలను తీసుకున్నాం. అప్కాబ్‌కు తొలి మహిళా పర్సన్ ఇన్ ఛార్జ్ గా మల్లెల ఝాన్సీ ని సీఎం నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత అప్కోబ్ చాల ఒడిదుడుకులను చూసింది. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి నాలుగు జిల్లాల్లో సహకార కేంద్ర బ్యాంకులు నష్టాల్లో ఉండేవి. ఈ ప్రభుత్వ పారదర్శక నియమాలు, నియంత్రణ, ఇతర చర్యల వల్ల నేడు అన్ని జిల్లాల డీసీసీబీ లు లాభాల బాటలో పడ్డాయి. ఈ ఏడాది 31 వేల కోట్ల రూపాయిల టర్నోవర్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్కాబ్లో ప్రతి రూపాయి రైతు కష్టం, అత్యంత బాధ్యతగా, నిజాయితీగా రైతు డబ్బు ను మనమంతా కాపాడాలి. నిధుల దుర్వినియోగం , విధుల పట్ల నిర్లక్ష్యం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పారు. గుంటూరు సహా పలు జిల్లాల డీసీసీబీలు చాల బాగా నడుస్తున్నాయి , రైతుకు , చిరు వ్యాపారాస్థులకు ఉపయోగపడే వివిధ స్కీములను అమలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు అప్పులిచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇటీవల నియమితులైన అన్ని జిల్లాల డీసీసీబీ చైర్మన్లకు , డీసీఎంఎస్ చైర్మన్లకు అభినందనలు’ తెలిపారు మంత్రి కన్నబాబు. -
మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20వేల ఆర్థికసాయం: కన్నబాబు
సాక్షి, అమరావతి: నూజివీడును ఉద్యానవన పంటల హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సోమవారం నూజివీడులో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.250 కోట్లతో జామ, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.2600 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ఒక హార్టీ కల్చర్ హబ్, ఆయిల్ ఫామ్ రైతులకు ఓఈఆర్ ధర చెల్లిస్తున్నామని చెప్పారు. టన్ను రూ.7 వేల నుంచి రూ.19 వేలు దాటేలా చర్యలు తీసుకున్నామని, మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20వేల ఆర్థికసాయం అందించునున్నట్లు భరోసా ఇచ్చారు. చదవండి: బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే -
వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది..
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి మేలు కలిగేలా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంకలనం చేసిన ఉద్యాన పంటల పంచాంగం ఆవిష్కరణ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఆర్థిక ప్రయోజనాలు, ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కలిగించేలా మన వ్యయసాయ పద్దతులుండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమతమని, అందుకు తగ్గట్టుగా మనందరం కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన సాగులో ఆరోగ్యానికి మరింతగా ఉపకరించే కొత్త పంటలను ప్రోత్సాహించాలని, పురుగు మందులు, రసాయనాల వినియోగం తగ్గిస్తూ అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని శాస్త్రవేత్తలకు సూచించారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయానికి, మన రాష్ట్ర ఉద్యాన పంటల ఉత్పత్తలకు జాతీయ స్థాయిలో ఉన్నత గుర్తింపు ఉందని, ఈ గుర్తింపును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నతికి ఉప కులపతి డా జానకి రామ్, వారి శాస్త్రవేత్తల బృందం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. 98 ఉద్యాన పంటల సమగ్ర సమాచారంతో రైతులకు సులువుగా అవగాహన కలిగించేలా ఉద్యాన పంటల పంచాంగం రూపొందించారని మంత్రి ప్రశంసించారు. ఉద్యాన పంచాంగ పుస్తకాలు ప్రతి ఆర్బీకేలో ఉండేలా చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులకు సూచించారు. ఉద్యాన పంటల సాగుపై నిర్వహిస్తున్న "తోటబడి" శిక్షణా కార్యక్రమాల్లో ఉద్యాన శాస్త్రవేత్తలు మరింత శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా పూనమ్ మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, ఉప కులపతి డా జానకి రామ్ తదితర అధికారులు పాల్గొన్నారు. చదవండి: రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన -
‘సీఎం రైతు పక్షపాతి అనడానికి వ్యవసాయ బడ్జెట్ నిదర్శనం’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి అని చెప్పడానికి వ్యవసాయ బడ్జెట్ నిదర్శనం వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు సంక్షేమం, శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. వచ్చే ఖరీఫ్ నాటికి వైఎస్సార్ ల్యాబ్స్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవినీతి లేకుండా లక్షా 25 వేలకోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించామని పేర్కొన్నారు. కానీ కోవిడ్ సమయంలో బాధ్యత లేకుండా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి మాట ఇస్తే తప్పరని మరోసారి రుజువైందని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత మంత్రి రాజశేఖర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చరిత్రాత్మక నిర్ణయమని ప్రశంసించారు. ఉద్యోగులు, కార్మిక సంఘాల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని తెలిపారు. చదవండి: అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు కట్టడం కాదు: సీఎం జగన్ -
ప్రకృతి వ్యవసాయంపై బ్లూమ్ అధ్యయనం: కురసాల
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలోనూ రైతులు గతేడాది కంటే అధిక దిగుబడి సాధించారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏపీ ప్రజా నిర్వాహక ప్రకృతి వ్యవసాయంపై బ్లూమ్ అధ్యయనం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కన్నబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా కలిగే ఆరోగ్య లాభాలపై అధ్యాయనం చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఎంవోయూ తీసుకున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు మరింత ఆదాయం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారని, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దిగుబడి పెంచేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
సీఎం జగన్‌కు సవాల్ విసిరే స్థాయి లోకేష్‌కు లేదు: కన్నబాబు
-
‘రైతుల సెంటిమెంట్‌ను సీఎం జగన్ గౌరవించారు’
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ సెజ్(స్పెషల్ ఎకనామిక్ జోన్) భూములను వెనక్కి ఇచ్చేయడం చారిత్రాత్మక నిర్ణయమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పిఠాపురం వద్ద పాదయాత్ర బహిరంగ సభలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సెజ్ భూములపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం జగన్ దమ్మున్న నాయకుడని కొనియాడారు. జిల్లాలో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్‌లో భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య ఎదురైందన్నారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి రానీయలేదని, సెజ్ నుంచి ఆరు గ్రామాలను విడిచిపెట్టడం జరిగిందన్నారు. రైతుల సెంటిమెంట్‌ను సీఎం జగన్ గౌరవించారన్నారు. సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిషేధిత భూమిలో చేర్చిన దుర్మార్గపు అలోచన చంద్రబాబుదని కన్నబాబు విమర్శించారు. 657 ఎకరాల అసైన్డ్ భూమికి పదిలక్షలు ఇవ్వాలని నిర్ణయించాడని, చేయని పాపానికి రైతులతో జైలులో బాత్రూమ్లు కడిగించారని మండిపడ్డారు. రైతులపై ఎస్ఈజెడ్ కేసులన్నీ ఎత్తివేస్తున్నామన్నారు. ఎస్ఈజెడ్ పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. దేశంలో రొయ్యపిల్లల ఉత్పత్తి అధికంగా ఉన్న ప్రాంతం సెజ్ అక్వా కాలుష్య వ్యర్థాలను శుద్ధి చేసి విశాఖపట్నం వైపు తరలించి అక్కడ మళ్లీ శుద్ది చేసి సముద్రంలో విడిచి పెడతామన్నారు. చంద్రబాబు భూములను వెనక్కి ఇచ్చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కేసులు పెట్టి వేధించారు. కాకినాడ సెజ్ రైతులది న్యాయమైన పోరాటం. అమరావతిలో కొంతమంది రైతుల్లో ఈ న్యాయం లేదు. చంద్రబాబు, లోకేష్ తీవ్ర ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఘోరాజయం చెందారు. 38.89% శాతం పంచాయతీలు గెలుచుకున్నామని బాటా రేట్లా లోకేష్ చెప్తున్నారు. ఆ పంచాయతీల జాబితా మీడియాలో విడుదల చేయండి. ఢిల్లీ కాంగ్రెస్ ఎన్ని రకాలుగా వేధించినా గుండె దైర్యంతో ఎదుర్కొన్న వ్యక్తి జగన్. పెట్రోల్, డీజిల్ రేట్లు కేంద్రం పెంచుకుపోతుంటే లోకేష్ సీఎంను తిడుతున్నారు. లోకేష్‌కు పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది’. అని కురసాల విమర్శించారు. చదవండి: కాకినాడ సెజ్ భూముల్లో 2,180 ఎకరాలు తిరిగి రైతులకే చిన్నారుల ప్రతిభకు సీఎం జగన్ ప్రశంస -
చంద్రబాబుకు పవన్ వకీల్ సాబ్: మంత్రి కురసాల
సాక్షి, విజయవాడ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్రతిపక్షనాయకుడు చంద్రబాబుకు పవన్ వకీల్ సాబ్లా పనిచేస్తున్నాడని దుయ్యబట్టారు. 2014 నుంచి చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పని చేస్తున్నాడని విమర్శించారు. నాలుగు సార్లు గెలిచిన కొడాలినానిని విమర్శించే అర్హత పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఒకే రోజు పవన్, లోకేష్ జిల్లాలో పర్యటించడం వెనుక అంతర్యం తెలియదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో ఎన్నడూలేని విధంగా నెల రోజుల్లోనే పరిహారం అందిస్తున్నారని, చంద్రబాబు పాలనలో ఏనాడైనా పరిహారం త్వరగా ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఎందుకు అడగలేదని, ఎకరానికి రూ. 6 వేలు నిర్ణయించింది చంద్రబాబు పాలనలో కాదా అని సూటిగా అడిగారు. -
‘ఆ దిక్కుమాలిన గ్రంథం మా దగ్గర లేదు’
సాక్షి, అమరావతి: వ్యవసాయం దండగ అని చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంటూ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ సభ్యులను విమర్శించారు. అసత్యాలు మాట్లాడటం, వెల్‌లోకి వెళ్లటం వాళ్లకు ఫ్యాషన్ అయిపోయిందంటూ మండిపడ్డారు. నివర్ తుపాను నష్టం- ప్రభుత్వ చర్యలపై చర్చ శాసనమండలిలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి కన్నబాబు... ‘‘లోకేష్ ట్రాక్టర్ తీసుకెళ్లి పెద్ద యాక్షన్ చేశాడు. ఆయనకు కనీసం ట్రాక్టర్ నడపడం కూడా రాదు. నాడు వ్యవసాయం దండగ అన్నారు. 9 నెలలు హైదరాబాద్‌లో దాక్కుని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ తీరును ప్రస్తావిస్తూ చురకలు అంటించారు.(చదవండి: ఏపీ అసెంబ్లీ: లైవ్ అప్డేట్స్) ఆ దిక్కుమాలిన గ్రంథం మా దగ్గర లేదు: మంత్రి అనిల్ మంత్రులు మాట్లాడుతుంటే వెల్‌లోకి వచ్చి గొడవ చేసిన టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సెల్ మెసేజ్ పంపడం, మరికొంత మంది మొబైల్ ఆపరేట్ చేస్తూ బయటికి మెసేజ్‌లు ఇవ్వడం పట్ల మండిపడ్డారు. ‘‘గతంలో కూడా ఇలానే ఫోటోలు వీడియోలు పంపారు. దయచేసి సభ్యుల సెల్ఫోన్లు బయటే ఉంచేలా అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి’’ అని అనిల్ అన్నారు. ఇక ప్రభుత్వంపై టీడీపీ విమర్శలను తిప్పికొడుతూ.. ‘‘మీరు రాసుకున్న మనసులో మాట అనే దిక్కుమాలిన గ్రంథం మా దగ్గర లేదు. టీడీపీ వాళ్లు ఆ మహా గ్రంథాన్ని తీసుకు వస్తే చంద్రబాబు వ్యవసాయం గురించి ఏం రాశారన్నది ఉంటుంది’’ అంటూ ఎద్దేవా చేశారు.(చదవండి: ‘ఏమనాలి వీణ్ణి .. ఇంగిత జ్ఞానం ఉందా?’) -
అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు ఫోజులు..
-
‘ఆ వ్యాఖ్యల గురించి యనమల ఆలోచించుకోవాలి’
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తాను ఇచ్చే స్టేట్మెంట్ల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. తప్పులు చేసిన టీడీపీ ఇప్పుడు తమ మీద ఆరోపణలు చేయడానికి సిగ్గుపడాలి అని మండిపడ్డారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ, ‘ కాకినాడ సెజ్‌ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టాయాలని చూస్తున్నారంటూ యనమల చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. అసలు సెజ్‌లు తీసుకొచ్చింది ఎవరు టీడీపీ కాదా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెజ్ భూములు వెనక్కి ఇస్తాం అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వలేదు? ప్రజలను గ్రాఫిక్స్ లో ఉంచకుండా వాస్తవంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంటే చంద్రబాబు ఎందుకు భయం. భోగపురంలో గత ప్రభుత్వం ఇచ్చిన 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంది. ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను కేవలం పారిశ్రామిక వేత్తలుగానే చూస్తుంది. మ్యాట్రిక్ ప్రసాద్ గతంలో చంద్రబాబుతో వ్యాపారం చేస్తే ఆయన మంచోడు అదే జగన్ ప్రభుత్వంతో వ్యాపార సంబంధాలు ఉంటే మాత్రం చెడ్డ పారిశ్రామిక వేత్తా? గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో సెజ్‌కి వచ్చారు. సెజ్ విషయంలో ఉన్న సమస్యల కోసం ఒక కమిటీ వేసి ఆ కమిటీకి నన్ను అధ్యక్షుడుగా పెట్టారు. యనమల ఒకసారి తాను చేస్తున్న వ్యాఖ్యల గురించి ఆలోచించుకోవాలి. హెటిరో అనే ఫార్మా సంస్థ ఏర్పాటు కోసం అక్కడ ప్రజల పైన కేసులు పెట్టలేదా ? గతంలో దివిస్ పరిశ్రమ వచ్చినప్పుడు ఒక భారీ బహిరంగ సభ పెట్టి గొప్పగా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిశ్రమ పెడితే తప్పు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో సెజ్ విషయంలో పెట్టిన కేసులతో ఇప్పటికీ అక్కడ రైతులు బాధపడుతున్నారు. గతంలో సమ్మిట్ ల పేరుతో కోట్లాది రూపాయల ఖర్చుచేశారు కానీ, కోటి రూపాయల పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారు. రెండు కమిటీల మధ్య జరిగిన ఒప్పందాన్ని ముఖ్యమంత్రికి అంటగడుతున్నారు. మచిలీపట్నం పోర్ట్ విషయంలో కేసులు వేసింది టీడీపీ నాయకులు కాదా? అమరావతిలో 5 సంవత్సరాల్లో ఒక బిల్డింగ్ కూడా కట్టలేక ప్రజలకు గ్రాఫిక్స్ చూపించారు. మీ పార్టీ పారిశ్రామిక వేత్తలను అధికారం పోయాక చంద్రబాబు ఎక్కడ జాయిన్ చేశారో అందరికి తెలుసు. గత 5 సంవత్సరాల్లో సెజ్ భూములను వెనక్కి ఇస్తా అంటే ఎవరు అడుకున్నారు?, పరిశ్రమలు పెడతామంటే ఎవరు వద్దు అన్నారు, ఓడ రేవులు కడతామంటే ఎవరు ఆపారు?. అమరావతి రైతుల నోట్లో చంద్రబాబు మట్టి కొట్టారు. 5 సంవత్సరాల్లో భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు ప్లాట్లు వేసి ఇవ్వలేకపోయారు. దేశంలో 82 కార్పొరేషన్లు అమ్మేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే గతంలో చంద్రబాబు 52 అమ్మేశారు. కాకినాడ నడిబొడ్డులో ఉన్న గోదావరి ఫెర్టిలిజర్స్ ఫ్యాక్టరీని చంద్రబాబు అమ్మేశారు. యనమల ఒకసారి గతాన్ని చూసుకుంటే వారి చరిత్ర తెలుస్తుంది. గతంలో టీడీపీ చేసిన అప్పులను తీర్చడానికే ఈ ప్రభుత్వం కష్టపడాల్సి వస్తుంది. పరిశ్రమలకు భూములిచ్చిన రైతులకు మా ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేస్తుంది’ అని పేర్కొన్నారు. చదవండి: సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సేవలు -
టీడీపీ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
-
బాబువి నిన్న కుల, నేడు మత రాజకీయాలు
సాక్షి, తాడేపల్లి: అంతర్వేది రథం దగ్ధం విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియోతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో ఎవర్నీ ఉపేక్షించాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. దీన్ని చంద్రబాబు లాంటి వారు రాజకీయాలకు వాడుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. నిన్నటి వరకు కుల రాజకీయాలు చేసి, నేడు మత రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వారి ఆశలు నెరవేరవని, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సంఘటనపై స్పందించిందని గుర్తు చేశారు. అధికారులను సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తోందని తెలిపారు. కొత్త రథానికి నిధులు కూడా కేటాయించిందని చెప్పారు. చదవండి: (రథం చుట్టూ రాజకీయం!) ఆనాడు చంద్రబాబు సమక్షంలోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. విజయవాడలో దేవాలయాలను కూల్చి వేసింది మర్చిపోయారని అనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఆ రోజు పరిశీలనకు వచ్చిన స్వామీజీలను అరెస్ట్ చేసింది చందబాబు కాదా అని నిలదీశారు. నిన్నటి వరకు పవన్ కల్యాణ్ బాబు బాటలో నడిచారని, నేడు బీజేపీ బాటలో నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరైనా సరే ప్రభుత్వం ఎక్కడ లోపం లేకుండా విచారణ చేస్తోందని వివరించారు. మత రాజకీయాలు చేయాలనుకునే వారి ఆశలు నెరవేరవని తెలిపారు. -
చంద్రబాబూ.. చరిత్ర మరిచిపోకు..
-
కాకినాడ జీజీహెచ్ సిబ్బందికి లయన్స్ క్లబ్ సాయం
-
మార్కెటింగ్ కేంద్రాలుగా ఆర్బీకేలు..
సాక్షి, తూర్పు గోదావరి: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ.. వారికి వెన్నుదన్నుగా ఉండాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దేశంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. జిల్లాలోని మండపేట మండలం ఆర్తమూరులో సోమవారం రైతులతో నిర్వహించిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 10600 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహకారం అందుతోందని.. రానున్న కాలంలో వీటిని మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చబోతున్నామని తెలిపారు. అదే విధంగా 200 కోట్ల రూపాయిలతో ఇంటిగ్రేటెడ్ ల్యాబులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘త్వరగా పాడయ్యే పంటలకు సైతం గిట్టుబాటు ధర కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అదే విధంగా రైతులకు ఏదైనా ప్రమాదం లేదా మరణం సంభవిస్తే ఏడు లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోంది. ప్రతి రైతు భరోసా కేంద్రంలో 15 లక్షల రూపాయిలు విలువ చేసే వ్యవసాయ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతుకు అన్ని రకాలుగా అండగా ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యం’’అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. -
టీడీపీ నేతలు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు
-
‘ఏడాదిలోనే విత్తన శుద్ధి కేంద్రాలు పూర్తి చేస్తాం’
సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం ఏడాదిలోనే అభివృద్ధి చెందిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఏడాదిలోనే విత్తన శుద్ధి కేంద్రాలు పూర్తి చేస్తామని తెలిపారు. చెరుకు రైతులకు 55 కోట్ల బకాయిలు ముఖ్యమంత్రి చెల్లించారన్నారు. మంత్రి గురువారం మాట్లాడుతూ.. చెక్కర కర్మాగారాలు అభివృద్ధి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెరకు రైతులకు ఆదుకున్నారన్నారు. (‘నాడు – నేడు’పై మన కల నిజం కావాలి) చోడవరం చెరకు ఫ్యాక్టరీ కోసం ఇప్పటి వరకు ఏడాది కాలంలో 96 కోట్లు నిధులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. చోడవరం షుగర్స్‌లో 140 కోట్ల పంచదార నిల్వ ఉంచగా వెంటనే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చక్కెర కర్మాగారాలు ఆధునీకరణకు అగష్టు నెల గడువులోగా కమిటీ వేస్తామన్నారు. ప్రతి జిల్లాలో సీడ్ ప్రోసెసింగ్ యూనిట్లు, ప్రతి నియోజకవర్గంలో మినీ ప్రోసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. (ఏపీలో కొత్తగా 1555 పాజిటివ్ కేసులు) -
ఒంగోలు పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కన్నబాబు
-
పొగాకు రైతులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తాం
-
అందుకే జీతాలు ఇవ్వలేకపోయాం: మంత్రి కన్నబాబు
సాక్షి, విజయవాడ: అధికారం కట్టబెట్టలేదని ప్రజలపై చంద్రబాబు నాయుడు కక్ష సాధిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం కాకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీని వల్ల సకాలంలో జీతాలివ్వలేకపోయాం. ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా సభలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. బిల్లును ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకుంది. ఈ విషయంలో ప్రజలకు, ఉద్యోగులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. (ఆ ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు) ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘క్షమాపణ చెబితే చంద్రబాబు సీనియార్టీని కాపాడుకున్న వారవుతారు. ఎక్కువ కాలం సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు... ఉద్యోగుల జీతాలను అడ్డుకుని ఆ విషయంలో కూడా చరిత్ర సృష్టించారు. పేదల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంది కాబట్టే ఫించన్లు ఇవ్వగలిగాం. నగదు రూపంలో డ్రా చేసి.. ఫించన్లు అందివ్వగలిగాం. కానీ ఉద్యోగుల జీతాలను ఈ విధంగా అందివ్వలేం. పొగాకు కొనుగోళ్లను తొలిసారిగా ప్రభుత్వమే కొనుగోళ్ల చేసే ప్రక్రియ ప్రారంభించింది. రైతులకు నష్టం లేకుండా చర్యలు చేపట్టాం. రైతు భరోసా కేంద్రాలను మార్కెటింగ్ కేంద్రాలుగా మార్చే ప్రక్రియను చేపట్టనున్నాం’ అని తెలిపారు. (ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు) -
పవన్ కల్యాణ్‌కు ఎందుకీ ఉక్రోషం?
సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు అన్నారు. కాపు నేస్తంపై పవన్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాపులను మోసం చేసిన చంద్రబాబు నాయుడును ఆయన ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. మంత్రి కన్నబాబు శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కుల ప్రస్తావన లేకుండా పవన్ రాజకీయాలు చేయలేకపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘కాపులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. కాపు నేస్తం పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం చేశాం. ఏడాది కాలంలో కాపులకు రూ.4,769 కోట్లు ఆర్ధిక సాయం చేశాం. మంచి చేస్తున్న ప్రభుత్వంపై పవన్‌కు ఎందుకంత ఉక్రోషం. ఓర్వలేనితనంతోనే అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. గతంలో కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే చంద్రబాబు అణచివేశారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలను బూతుల తిట్టడమే కాకుండా వారిపై కేసులు పెట్టారు.కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ్డ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు సర్కార్ అవమానించినప్పుడు పవన్ ఎక్కడున్నారు?. చంద్రబాబు హయాంలో పవన్‌కు కళ్లు కనిపించలేదు. చంద్రబాబు పట్ల తన ప్రేమను దాచుకోలేకపోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. కాపు సామాజిక వర్గానికి ఎవరు మేలు చేశారో ఇప్పటికైనా పవన్ తెలుసుకోవాలి’ అని హితవు పలికారు. (‘కాపులను చంద్రబాబు గాలికి వదిలేశారు’) కాగా కాపు కార్పొరేషన్‌కు ఇప్పటివరకూ ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారు..ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు కాపులకు ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ పవన్ విమర్శలకు దిగారు. అయితే ఆయన విమర్శలను మంత్రి కన్నబాబు తిప్పికొట్టారు. ఇప్పటికైనా పవన్ తన తీరు మార్చుకోవాలని సూచించారు. కాపు నేస్తం అద్భుతమైన పథకమని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. (‘కాపు’ కాసిన దేవుడు ! ) -
‘వైఎస్సార్ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం తెలుసుకోవచ్చు. అలాగే సదరు పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రజల కోసం కొత్తగా రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా సరైన సమయంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యాప్‌లో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈ-క్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణతోపాటు పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్దం చేయడం, రైతులకు ఇన్పుట్స్ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనిని ఉన్నతస్థాయిలోని అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. (రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్: సీఎం జగన్) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) డిజిటల్ రిజిస్టర్‌ను నిర్వహించడం, ఆర్బీకే ఆస్తులను పరిరక్షించడం, ఎక్కడైనా పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సకాలంలో రిపోర్ట్ చేయడం, డాష్‌బోర్డ్‌లో ఆర్బీకే కార్యక్రమాలను పర్యవేక్షించడం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వే చేయడం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్నులను తీసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యపడుతుంది. ఆర్‌బికె పెర్ఫార్మ్న్స్ డాష్‌బోర్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్బీకే పనితీరును పరిశీలించడం, సరిపోల్చడం, మెరుగైన పనితీరు కోసం ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్ధేశం చేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. (ధనికులకు బాబు.. పేదలకు జగన్) రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి అవసరాలను తీర్చడం, వారికి మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాచారం పొందేలా ఈ యాప్ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(ఆర్బీకేల నుంచే పండ్లు, కూరగాయల విత్తనాలు, మొక్కలు) -
రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జగన్
-
విజయనగరంలో మంత్రుల సమీక్ష
సాక్షి, విజయనగరం: జిల్లా కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు అళ్ల నాని, పుష్ప శ్రీ వాణి, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కరోనాపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా జిల్లాలో సమీక్ష చేయడం జరిగిందని మంత్రులు తెలిపారు. భవిష్యత్తులో జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ కరోనా వైరస్ పాజిటివ్ నుంచి నెగిటివ్ రాగానే ఆసుపత్రి నుంచి డిశార్జి చేసి ఇంటికి పంపిస్తున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి శనివారం నాలుగు పాజిటివ్ కేసులు రావడం జరిగిందన్నారు.వీటిలో మూడు పాజిటివ్ కేసులు వలసకార్మికులు కావడం గమనార్హమన్నారు. (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం) అన్ని క్వారంటైన్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నమన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తి స్థాయిలో గుర్తించి వారికి ముందుగానే పరీక్షలు చేసి హోం క్వారంటైన్ చేశామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పూర్తి స్థాయిలో మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. జిల్లాలోని 72 క్వారంటైన్ కేంద్రాల్లో పరిశుభ్రత పాటిస్తూ వారికి ఆహారం అందిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన గ్రామాల్లో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అనుమానితులని వెంటనే గుర్తించి వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేసి రిపోర్ట్ వచ్చేవరకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం వైజాగ్ విమ్స్ లో కూడా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సిబ్బందికి , వైద్యులు కి అన్ని రకాల రక్షణ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వెంటిలేటర్స్ని కూడా అదనంగా సిద్ధం చేశామన్నారు. వీటితో పాటు జిల్లాలో ఐదు ప్రైవేటు ఆసుపత్రులను కూడా కోవిడ్ ఆసుపత్రుల కింద సిద్ధం చేసినట్లు చెప్పారు. స్పెషాలిటీ సేవలుని కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లా మెరుగుగానే ఉందన్నారు. (వైద్యం అందించటంపై దృష్టి పెట్టాలి: సీఎం జగన్) వైజాగ్‌లో కరోనా వైరస్‌తో శనివారం మృతిచెందిన బలిజిపేట , చిలకలపల్లి కి చెందిన 60 ఏళ్ల వృద్ధ మహిళకు సంబంధించిన 16 మంది కుటుంబ సబ్యులకు పరీక్షలు చేయగా అందరకీ కరోనా నెగటివ్ రావడం జరిగిందన్నారు. ఆ మహిళ కరోనాతో పాటు డయాలసిస్ పేషెంట్ అని కూడా తెలిపారు. చిలకలపల్లి గ్రామం తో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో సర్వే చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు అందరూ సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనవసర విషయాలకి బయటకి రావద్దు అని విజ్ఙప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. (తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్) -
పండ్లను ప్రజలకు చౌకగా అందిస్తాం
-
రూ.100కే అయిదు రకాల పండ్లు..
సాక్షి, తూర్పుగోదావరి : ఉద్యానవన శాఖ, మెప్మా ద్వారా పండ్లను కిట్ల రూపంలో ప్రజలకు చౌకగా అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో మంగళవారం రూ. 100లకే అయిదు రకాల పండ్లను డోర్ డెలీవరి సదుపాయాన్ని మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యానవన రైతులకు మేలు జరిగేలా.. వినియోగదారులకు చౌకగా పండ్లు అందించేలా కిట్ల రూపంలో డోర్ డెలీవరీ చేస్తున్నామని తెలిపారు. (విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..! ) ముందుగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో వీటిని ప్రారంభించి త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. మామిడి పండ్ల సీజన్ మొదలైన నేపథ్యంలో మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు140 టన్నులు, తిరుపతి నుంచి 1.2 టన్నుల మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేశామని తెలిపారు. కరోనా వంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ వంగా గీత అన్నారు. ధరలు పెరగకుండా వినియోగదారులను ఆదుకుంటున్నారని తెలిపారు. రూ. 100లకే అయిదు రకాల పండ్లు సదుపాయాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. (కరోనా: బెజవాడంతా రెడ్‌జోన్ ) -
కన్నబాబుకు కేంద్ర సహాయ మంత్రి ఫోన్
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం రెండో దఫా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అనుసరిస్తున్న విధివిధానాల గురించి తెలుసుకునేందుకు సోమవారం సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు కేంద్ర సహాయ మంత్రి కైలాష్ చౌదరి ఫోన్ చేసి సంభాషించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం సడలింపులపై ఆరా తీయగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కన్నబాబు వివరించి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కోసం చర్యలు చేపట్టారని తెలిపారు. అందులో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్రం ఇచ్చిన సడలింపులను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ధాన్యం, జొన్న, మొక్క జొన్న పంటల కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మార్కెటింగ్ శాఖ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. పండ్లకు కూడా ధర కల్పించడం కోసం సీఎం జగన్ చొరవ తీసుకున్నారని ప్రస్తావించారు. వ్యవసాయంతోపాటు పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు కూడా కొన్ని సడలింపులు ఇచ్చి రైతులు నష్టపోకుండా కాపాడుతున్నామని కన్నబాబు పేర్కొన్నారు. (చేపల ఎగుమతికి సహకరించండి!) -
‘మీలా ఇంట్లో పడుకుని ప్రకటనలు ఇవ్వడం లేదు’
కాకినాడ: కరోనా వైరస్ నివారణకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రభుత్వానికి మంచి పేరు రావడం చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి అయ్యన్న పాత్రుడి వరకూ నోటికీ ఏదొస్తే అది మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్ చేసే మంచి పనులతో టీడీపీ నేతలకు కడుపు రగిలిపోతుందన్నారు. లాక్డౌన్ విధించిన పరిస్థితుల్లో వ్యవసాయం, వ్యవసాయేతర అనుబంధాల రంగాల పట్ల ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఓ చారిత్రకమన్నారు.(‘చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకో’) ‘ఇది అంతా టీడీపీ నేతల కడుపు మంట. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. చంద్రబాబులా మాది మాటల గారడీ, పబ్లిసిటీ ప్రభుత్వం కాదు. ధాన్యం నుండి ఉద్యానవన పంటల వరకూ మద్దతు ధర ఇచ్చి మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. చంద్రబాబు, లోకేస్, రాజప్ప, అయ్యన్న పాత్రుడిలా మేము ఇంట్లో పడుకుని ప్రకటనలు ఇవ్వడం లేదు. ప్రాణాలకు తెగించి కరోనా నివారణకు రోడ్లపై తిరుగుతున్నాం. వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది మా ముఖ్యమంత్రి జగనే. రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేని చరిత్ర మీది.గత టీడీపీ ఐదేళ్ల పాలనలో రైతులను గాలికొదిలేసి, ఇవాళ అదే రైతుల కోసం చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు మాట్లాడతారా?, ఆక్వాకు మొట్టమొదటి సారిగా మేము మద్దతు ధర ఇచ్చిన విషయాన్ని మీరు అంగీకరిస్తారా?, మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి.. సవరించుకోండి’అని టీడీపీ నేతల తీరుపై కురసాల ధ్వజమెత్తారు. -
లాక్‌డౌన్‌తో అరటి రైతులు కష్టాల్లో పడ్డారు
-
ఆక్వా రైతుల్లో ఆత్మస్థయిర్యం కల్పించాం
-
రైతు చెంతకే వెళ్లి ధాన్యం కొనుగోలు
కాకినాడ రూరల్: రైతు చెంతకే వెళ్లి రబీ ధాన్యం కొనుగోలు చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులు తమ పంటల వివరాలను గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ల వద్ద నమోదు చేసుకోవాలని, ఆ వివరాల ఆధారంగా నేరుగా రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ), మార్క్‌ఫెడ్ ద్వారా ధాన్యం, ఇతర పంటలు కొనుగోలు చేస్తామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ–క్రాప్‌లో ఉన్న ప్రతి పంటనూ కొనుగోలు చేయడంతో పాటు వెబ్‌ల్యాండ్‌లో లేని భూములను కూడా పరిశీలించి, వాటిలో వరి సాగు ఉంటే ఆ పంట కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రతి జిల్లాలో వ్యవసాయ శాఖ జేడీ ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేశామన్నారు. వరి కోత యంత్రాలకు కొరత లేకుండా చూడటం, వాటికి అద్దెను నిర్ణయించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగించామన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► గత నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 57 వేల మెట్రిక్ టన్నుల అరటి కొనుగోళ్లు జరిగాయి. ► మామిడికి స్థానికంగా తక్కువ ధర వస్తే కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. ► గుంటూరు జిల్లాలో మిర్చికి సంబంధించి కూలీలు, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. సమస్యలు ఉంటే 1902 నంబర్‌కు రైతులు ఫిర్యాదు చేయాలి. ► వచ్చే ఖరీఫ్‌కు అన్ని రకాలూ కలిపి 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాలి. ఇప్పటికే 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ► ఏయే జిల్లాల్లో ఏయే పంటలు ఏయే కాలాల్లో దిగుబడికి వస్తాయనే దానిపై పంటల దిగుబడి కేలండర్ రూపొందిస్తున్నాం. ► పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు వ్యాపారులు కరోనా సాకుతో రైతుల నుంచి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. వారిపై చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి లెవీ చూపేందుకు కొందరు మిల్లర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వీటికి వారు స్వస్తి చెప్పాలి. ► పట్టుగూళ్లకు సంబంధించి హిందూపురం, ధర్మవరం, కదిరి మార్కెట్లలో కిలోకు రూ. 250 నుంచి రూ. 300 పలుకుతుండగా చేబ్రోలులో రూ.130 మాత్రమే వస్తోంది. దీనిపై ఉద్యానవన కమిషనర్‌తో మాట్లాడి, ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా కర్ణాటక, ఇతర రాష్ట్రాల బయ్యర్లను రప్పించాలని కోరాం. ► రాష్ట్రంలో 101 రైతుబజార్లు, 402 డీసెంట్రలైజ్డ్ రైతుబజార్లు, 260 మొబైల్ రైతుబజార్లు, 926 టేక్ హోమ్ డోర్ డెలివరీ, 38,440 కిరాణా, నిత్యావసర సరుకుల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. ► ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. కుంటి సాకులతో రైతులను వ్యాపారులు నష్టపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ► నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకుంటోందనే చౌకబారు ఆరోపణలను టీడీపీ నాయకులు మానుకోవాలి. -
టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట?
సాక్షి, తూర్పుగోదావరి : కరోనా నేపథ్యంలో రాష్ట్ర రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. మొక్కజొన్న రైతుల కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సచివాలయంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్ వద్ద రైతులు నమోదు చేసుకోవాలని సూచించారు. అరటి ధరలు పడిపోకుండా చూడాలని ఉద్యానవన శాఖకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఏపీ సీడ్స్ ద్వారా ఇప్పటికే లక్ష క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేశామని, 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సేకరించామని చెప్పారు. మరో 2 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సేకరిస్తున్నామని చెప్పారు.దళారులను నమ్మి పంటను తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులను కోరారు. ఆక్వా రైతులు నష్టపోకుండా ప్రాసెసింగ్ యూనిట్లు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించముందే పేద ప్రజలకు సీఎం జగన్ రూ.వెయ్యి ఆర్థిక సాయం ప్రకటించారని గుర్తుచేశారు. పేదలకు ఆర్థిక సాయం అందిస్తుంటే టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. కరోనాను కూడా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు చౌకబారు విమర్శిలు మానుకోవాలన్నారు. -
రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నాం
-
పరిపాలన స్తంభింప చేయటమే బాబు లక్ష్యమా?
-
నూరు గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకు..
సాక్షి, విజయవాడ : ప్రతి రోజు మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలో మంత్రి మాట్లాడుతూ.. పీఎస్‌పై సోదాలు చేస్తేనే రూ.2 వేల కోట్లు తేలిందని, చంద్రబాబు, లోకేష్‌లపై సోదాలు జరిపితే ఎన్ని లక్షల కోట్లు తెలుతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎంత దోచుకున్నారో ఐటీ సోదాలు బట్టి తేలిపోయిందని, ఆయన అవినీతి, రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు, లోకేష్ లపై కూడా ఐటీ సోదాలు జరపాలని సూచించారు. కృష్ణా: నూరు గొడ్డులు తిన్న రాబందు ఒక గాలి వానకు కూలినట్లు ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇది ఇక్కడితో ఆగదు, చంద్రబాబు అవినీతి చిట్టా బయటపడే రోజు దగ్గరలోనే ఉందని స్పష్టం చేశారు. తన పలుకుబడితో అవినీతి కేసులకు స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఇన్నాళ్లకు అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు. తిరుపతి : గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో చంద్రబాబు నాయుడు బినామీల అక్రమ ఆస్తులు వెలుగు చూశాయని పరిశ్రమల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియాకి ఐటీ దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2 వేలకోట్లు బయటపడ్డ కళ్లకు గంతలు కట్టినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు ఒక్కమాట కూడా బయట పడటం లేదని, ఆయనకు ఎలాంటి సంబంధం లేకుంటే ఎందుకు ఐటీ దాడులపై స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తామని వచ్చిన పవన్ కళ్యాణ్ ,కాంగ్రెస్ నాయకులు కూడా నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం : చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలు అయిందని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గతంలో సీబీఐ విచారణలు వద్దన్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. అవినీతి జరిగిందని అరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలని హితవు పలికారు. ప్రజలు అవినీతిని సహించడం లేదని, పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారన్నారు. నాలగైదు చోట్ల దాడులకే రెండు వేల కోట్లు బయటపడ్డాయని, ఇంకా దాడులు చేయాల్సి ఉందని అన్నారు. *చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు ఐటీ దాడుల మీద స్పందించాలని పిలుపునిచ్చారు. -
కురసాల చురకలు
-
‘ఆ ఆనందంలో ఉన్న తీపి ఎలాంటిదో తెలిసిన వాడ్ని’
సాక్షి, తూర్పుగోదావరి : దళారీ వ్యవస్థను తొలగించినప్పుడే రైతులకు విలువ పెరిగి.. వినియోగదారునికి మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో రూ.50 లక్షల నిధులు మార్కెట్ యార్డు అభివృద్ధికి కేటాయించామని పేర్కొన్నారు. అలాగే రైతు బజారును ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గురువారం కాకినాడ అర్బన్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకార సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటేడ్ పదవుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాన్ని సృష్టించరన్నారు. యాభై శాతం రిజర్వేషన్లు ఉండాలని చట్టం రూపంలో తీసుకు వచ్చారని, బహుశా దేశ చరిత్రలో ఇది ఎవ్వరూ చేయని సాహసమని కొనియాడారు. త్వరలోనే మొబైల్ రైతు బజార్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రూ. 3వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేసి.. రైతులకు అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్ ఒక సందేశాన్ని ఇచ్చారని మంత్రి అన్నారు. (11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూ: మంత్రి) పార్టీ కోసం అహర్నిశలు కష్టడిన వారికి గుర్తింపు వస్తే ఆ ఆనందంలో ఉన్న తీపి ఎటువంటిదో తెలిసిన వాడినని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్ట పడే వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన గుర్తింపు, హోదాను కల్పిస్తారన్నారు. దేవాలయ కమిటీలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎవ్వరికి పెన్షన్లు పోలేదని, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ఇచ్చిన తప్పుడు పేర్లను పరిశీలించి తొలగించడమైనదని స్పష్టం చేశారు. నిజమైన లబ్ధిదారులకు పోతే వార్డు సెక్రటేరియట్‌కు వెళ్ళి మళ్ళీ దరఖాస్తూ చేసుకోవాలని సూచించారు. కాకినాడ నగరంలో పది వేల ఇళ్ళు ఇస్తామని హమీ ఇచ్చానని, ఆ హమీని వచ్చే మార్చి 25 న అమలు చేస్తానని తెలిపారు. ఇంటి కోసం 34 వేల దరఖాస్తులు వచ్చాయని, మార్చి 25న నవరత్నాల పథకంలోఅందిరికీ ఇళ్ళు పథకాన్ని ముఖ్యమంత్రి కాకినాడ నుండే ప్రారంభిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. -
క్యాన్సర్ రహిత దేశాన్ని నిర్మించుకోవాలి: బ్రహ్మనందం
సాక్షి, తూర్పుగోదావరి : క్యాన్సర్ రహిత భారత దేశాన్ని దూపొందించుకోవాల్సిన అవసరం ఉందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, హస్యనటుడు బ్రహ్మనందం తెలిపారు. పిబ్రవరి 4 (మంగళవారం) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ గురించి అందరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పొగాకు మన సంస్కృతి కాదని, విదేశీయులకు ఉన్న పొగతాగే అలవాటును మనం నేర్చుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో విదేశీ ప్రభావం ఎక్కువ అవడం వల్ల వారి అలవాట్లు బాగా నేర్చుకున్నామన్నారు. మంచి ఆరోగ్యం ఒక వరమని.. అలాంటి వరాన్ని అందరూ పొందాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో గుండె, క్యాన్సర్ రోగాలు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. -
గల్ఫ్ దేశాలకు ‘అనంత’ అరటి ఎగుమతి
సాక్షి, అనంతపురం: నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలం కడవకల్లులో అరబ్ దేశాలకు అరటి ఎగుమతి చేసే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టింది. ఈ ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటెయినర్ల ద్వారా విదేశాలకు అరటి సరఫరాను దేశంలోనే మొట్టమొదటి సారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. (అరబ్ దేశాలకు ‘అనంత’ అరటి) దీని వల్ల పండ్ల తోటల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది యాభై వేల టన్నుల అరటి ఎగుమతి చేస్తామని ఆయన వెల్లడించారు. అన్ని రకాల పండ్లకు దీన్ని విస్తరిస్తామని కన్నబాబు పేర్కొన్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మట్లాడుతూ.. కరవు జిల్లా అయిన అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పండ్ల తోటల రైతులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పద్మావతి పిలునిచ్చారు. -
ఆదాయం తగ్గుదలపై బుగ్గన వివరణ
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆదాయం తగ్గుదలపై శాసన మండలిలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష టీడీపీ చెప్పినట్లు రాష్ట్ర ఆదాయం 40 శాతం తగ్గలేదని.. కేవలం 8 శాతం మాత్రమే తగ్గిందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదాయం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయమేకాదు.. దేశ ఆదాయం కూడా తగ్గిందని బుగ్గన అన్నారు. ‘ఏ ప్రభుత్వమైనా ఐదారు కోట్లు బిల్లులు చెల్లించకుండా వెళ్ళడం పరిపాటే.. కానీ గత ప్రభుత్వం ఏకంగా 40 వేల కోట్లకుపైగా బిల్లులు చెల్లించలేదు. ఆరు నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన 20 వేల కోట్లు అప్పులు చెల్లించాం. 15 వ ఆర్ధిక సంఘం కింద నిధులను పెంచి ఇవ్వమని కేంద్రాన్ని అడుతున్నాం. గత సంవత్సరం జూలై, నుంచి డిసెంబర్ మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం 24 రోజులు ఓడీలో ఉంది. కానీ ఈ ప్రభుత్వం జూలై నుంచి డిసెంబర్ మధ్యలో రెండు రోజులు మాత్రమే ఓడీలో ఉంది’ అని అన్నారు. అవినీతి రహిత పాలన కోసం చర్యలు: కన్నబాబు ఏసీబీ డీజీగా ఠాగూర్ పనిచేసిన సమయంలో అధికారులను ఉద్దేశ్యపూర్వకంగా వేధించారని తమకు ఫిర్యాదులు అందాయని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ‘ఈ వ్యవహారంపై ఉన్నత స్ధాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. ఠాకూర్ హైద్రాబాద్‌లో ఇళ్ళు, పార్కు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఏసీబీతో ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేయించారా లేక ఇతర కోణాల్లో చేశారా అన్న ఆరోపణలపై కూడా విచారిస్తున్నాం. అవినీతి రహిత పాలన కోసం సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. -
‘సీఎంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు మేలు చేస్తుంటే కొందరు ఆయనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండపేటలో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. అంతా సక్రమంగా జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు దీక్ష చేస్తున్నాడో అర్థం కావటం లేదన్నారు. గతంలో రైతుల కోసం ఏ రోజైనా పవన్ కళ్యాణ్ నోరు విప్పాడా? అని ప్రశ్నించారు. మంత్రి కన్నబాబు సోమవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ‘60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచనా వేశాం. ఇందుకోసం 1283 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు కూడా ఇస్తున్నాం. 5 రోజుల్లో మొత్తం డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 3,62,955 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దీనికి సంబంధించిన రూ. 407 కోట్లు రైతులకు చెల్లించాం. రైతులకు రోజూ సుమారు రూ. 50 కోట్లు చెల్లిస్తున్నాం. రైతులకు ధాన్యం కొనుగోలు చేశాక మెసేజ్‌లు పంపుతున్నారు’ అని మంత్రి స్పష్టం చేశారు. -
రైతుల కోసం పవన్ కళ్యాణ్ ఏ రోజైనా నోరు విప్పాడా?
-
‘వాటిపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు’
సాక్షి, అమరావతి: ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదని మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలు ఇచ్చిపుచ్చుకోవడం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని.. ఈ రాష్ట్రంలో పార్టీలు ఇచ్చి పుచ్చుకోవడం టీడీపీకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదన్నారు. పార్టీలే కాదు, బీ ఫారాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారన్నారు. 2014 నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ ఒక్కరేనని తెలిపారు. ఢిల్లీ, గుంటూరులో దీక్షలు చేశారని, ధర్నాలు, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. పార్టీ ఎంపీల చేత కూడా వైఎస్ జగన్ రాజీనామాలు కూడా చేయించారన్నారు. వైఎస్సార్సీసీ ఎంపీలు కన్నా.. టీడీపీ ఎంపీలు అప్పట్లో ఎక్కువ మంది ఉన్నారని, కాని చీమ కుట్టినట్టుకూడా వారికి అప్పుడు లేదన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే బెటరని అప్పట్లో బల్ల గుద్దినట్టు చంద్రబాబు చెప్పారన్నారు. అప్పట్లో ఆర్థిక మంత్రికి శాలువాలు కప్పి, స్వీట్లు పంచుకున్న చరిత్ర వారిదని.. ఇప్పుడు అదే వ్యక్తులు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. అలా చేయకపోతే కేంద్రం ఆలోచించేంది.. ఆరోజు నుంచి నేటి వరకూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కావాలంటూ మడమ తిప్పకుండా మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత రాత్రికి రాత్రి యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసి, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా సరిపెట్టుకుంటారన్న ఒక మైండ్‌సెట్‌ని క్రియేట్ చేసింది చంద్రబాబేనన్నారు. అలా చేయకపోతే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉండేదన్నారు. ‘షీలా బీడే కమిటీ ఈ జనవరితో అయిపోయింది. వాళ్లు 89 రికమెండేషన్లు ఇస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక 68 రికమెండేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. మేం అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఏ అభ్యంతరాలు పెట్టకుండా 68 సిఫార్సులకు సానుకూలత తెలిపింది. కాని ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది. రాజకీయం చేసింది. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తర్వాత పారిపోయి ఈ రాష్ట్రానికి వచ్చేశారు. హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని అయితే... కట్టుబట్టలతో పారిపోయి వచ్చారని’ కన్నబాబు దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు బాధపడే పరిస్థితి ఏర్పడిందని.. చేసిందంతా చేసి ఇవాళ నీతి కథలు, పిట్ట కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు నాడు అలా..నేడు ఇలా... టీడీపీకి ప్రత్యేక హోదాపైన, విభజన హామీలపైన మాట్లాడే హక్కులేదని.. ఐదేళ్ల పాటు ఏమీ చేయకపోగా, ఆరునెలల్లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే ఫలితం ఉండేదని, కాని అలా చేయకుండా మోదీ అన్యాయం చేశారని ఎన్నికల ముందు మాట్లాడి, ఇప్పుడు మళ్లీ మోదీతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించి మళ్లీ ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో వారికే తెలియాలి.. ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి, ఆస్తుల పంపిణీ గురించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ఇచ్చిన భవనాల్లో ఏదీ కూడా విభజన చట్టంలోని పరిధిలోనిది కాదని.. విభజన చట్టంలో భవనాల్లోని ఒక్క గదిని కూడా అప్పగించలేదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా... విభజన చట్టంలోని భవనాలను ఆక్రమిస్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. అక్కడ సచివాలయంలో భవనాలు ఎందుకు వృథాగా పడి ఉన్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం అభివృద్ది చేసిన దాన్ని కూడా విడిచిపెట్టారని.. ఇప్పుడు అక్కడ ఉండకపోయినా, బూజు పట్టినా.. కరెంటు బిల్లుల రూపేణా కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్లపాటు వాళ్లు చేసిన నిర్వాకానికి మరో ఐదేళ్ల పాటు కష్టపడితే తప్ప తీరని విధంగా సమస్యలు సృష్టించారన్నారు. మనకు కేటాయించిన భవనాలను తెలంగాణ ప్రభుత్వం ఆక్యుపై చేసినా.. అడగలేకపోయారని.. కారణం ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రికి ఉన్న బలహీనత అని తెలిపారు. ఢిల్లీతో సంబంధాల విషయంలో ఎన్నిసార్లు నాలుకలు మడతపెట్టారో టీడీపీ వాళ్లకే తెలియాలని ఎద్దేవా చేశారు. -
అబద్ధాలు, బుకాయింపులు బాబుకు అలవాటే
సాక్షి, అమరావతి: మొక్కజొన్న, వేరు శనగకు మద్దతు ధర లేక రైతులు నష్టపో తున్నారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్లు చేయడాన్ని రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకట రమణారావు, శంకరనారాయణ తప్పుబట్టారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాటాడుతూ.. పచ్చి అబద్ధాలు, బుకాయింపులు, బురద చల్లడాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని మండిపడ్డారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయనకు ఎప్పుడూ ఏదో ఒక అసత్య అజెండా ఉండాలని ధ్వజమెత్తారు. ఇసుక, ఆంగ్ల మాధ్యమం అంశాలు ముగిసిపోవడంతో ఇప్పుడు కొత్తగా మార్కెట్ ధరలంటూ కొత్త పల్లవి అందుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు నైజాన్ని ప్రజలు గమనించాలి చంద్రబాబు పునాదులు కదిలిపోతున్నా యని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తేల్చిచెప్పారు. అందుకే ఆయన అసత్యా లతో ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బాబు అసలు నైజాన్ని ప్రజలు గమనించా లని కోరారు. రైతులతో పాటు వ్యవ సాయ అనుబంధ రంగాలను, అన్ని వృత్తుల వారినీ ఆదుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న సీఎం జగన్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించడంలో చంద్రబాబు దిట్టని మంత్రి శంకరనారాయణ ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకున్నది జగనే.. ధరలు లేక మొక్కజొన్న, వేరుశనగ రైతులు రూ.వందల కోట్లు నష్టపోయారంటున్న చంద్రబాబు పంట మార్కెట్‌కు రాకముందే ఆయన ఏ లెక్కన ఈ నష్టాన్ని అంచనా వేశారో చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. బట్ట కాల్చి ముఖాన వేస్తామంటే కుదరదని అన్నారు. చంద్రబాబు లాగా రైతులను మోసం చేయడం తమ ప్రభుత్వానికి చేతకాదని స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీనాటికి మార్కెట్‌కు వేరుశనగ వస్తుందని అంచనా వేసి, మూడు రోజుల ముందే కొనుగోలు కేంద్రాలు తెరవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందని అన్నారు. -
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి : ఇసుక అక్రమ నియంత్రణ చర్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించేలా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ కేబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలన్నింటిలోను ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అదే విధంగా మొక్కజొన్న ధరలు పడిపోతుండటంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారం రోజుల క్రితం మొక్కజొన్న క్వింటాలు ధర రూ.2200 ఉండేదని.. ఇప్పుడు రూ.1500కు పడిపోయిందని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర రూ.1750 కూడా రావడం లేదని మంత్రివర్గం వద్ద ప్రస్తావించారు. ఈ క్రమంలో రైతులు నష్టపోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు నష్టం రాకుండా కొనుగోళ్లు జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీఎం జగన్ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో బుధవారం మధ్యాహ్నమే విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు మొదలుపెట్టారు. -
బాబు వాళ్లను లారీలతో తొక్కించారు: కన్నబాబు
సాక్షి, తాడేపల్లి : వరదల కారణంగా ఇసుక తీయడంలో ఇబ్బంది తలెత్తిందని.. అందుకే ఇసుక డిమాండ్, సప్లై మధ్య కొంత అంతరం ఏర్పడిందని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో 260 రీచ్‌లకు గానూ కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్ కల్యాణ్‌కు ఇవేమీ పట్టడం లేదని.. కేవలం ఇసుకతో రాజకీయం చేయాలని మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్ దీక్ష చేస్తే.. వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కృత్రిమ పోరాటాలు చేయడం వారికే చెల్లిందని విమర్శించారు. నిజంగా పవన్ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లుగా జరిగిన ఇసుక మాఫియాపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వాళ్లను లారీలతో తొక్కించారు.. ‘రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. కరువు సీమలో కూడా పచ్చని పంటలు పండుతున్నాయి. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడటంపై చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాన్‌కు సంతోషం గా ఉంది. అందుకే కృత్రిమ పోరాటాలు చేస్తున్నారు. నిజానికి వైజాగ్‌లో కొత్తగా పవన్ లాంగ్ మార్చ్ చేసేది ఏముంది. గత ఐదేళ్లు చేస్తూనే ఉన్నారు కదా. బీజేపీ సొంతంగా పోరాటం చేస్తామని ప్రకటించింది. లెఫ్ట్ పార్టీలు కూడా పవన్‌తో వేదిక పంచుకోమని స్పష్టం చేశాయి. పవన్ దీక్షకు టీడీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో బొగ్గు గనుల్లో తవ్వినట్లు నదిలో అక్రమంగా ఇసుకను తవ్వారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది. ఇసుక అక్రమాలపై వార్తలు రాసిన రిపోర్టర్లపై టీడీపీ నేతలు దాడి చేశారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించారు. అక్రమ ఇసుకను అడ్డుకున్న మహిళలపై చంద్రబాబు లాఠీచార్జీ చేయించారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వారిని లారీలతో తొక్కించి చంపించారు. మరి అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారు’ అని కన్నబాబు ప్రశ్నించారు. అయినా చంద్రబాబు, పవన్ కల్యాణ్ బంధం ఏనాడు విడిపోలేదు.. వారి లాంగ్ జర్నీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి పట్టడం లేదు. చంద్రబాబు ఎజెండాను పవన్ అమలు చేస్తున్నారు. అభూతకల్పనలు సృష్టించడంలో చంద్రబాబుది ప్రపంచంలో ప్రథమ స్థానం. చంద్రబాబు హయాంలో లక్షలాది కార్మికులు వలసపోయారు. వాళ్లంతా ఇప్పుడు తిరిగి తమ సొంత ఊళ్లకు వస్తున్నారు. ఇప్పటికైనా కలిసి పోటీ చేసిన వామపక్షాలు ఎందుకు తన నుంచి దూరమయ్యాయో పవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని కన్నబాబు హితవు పలికారు. -
వ్యవసాయ చరిత్రలోనే సీఎం జగన్‌ది గొప్ప నిర్ణయం
-
దమ్మున్న నాయకుడు జగన్
సాక్షి, కాకినాడ: కౌలు రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించేందుకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కరప గ్రామానికి వెళ్లిన విషయం తెలసిందే.. ఈ క్రమంలో కరప గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో ఉపముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇచ్చిన మాట జవదాటని నేత దివంగత మహానేత వైఎస్సార్ అయితే.. ఇచ్చిన మాట నెరవేర్చి వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచారని ప్రశంసించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి అత్యధికంగా పండిస్తూ రాష్ట్రానికే కాక దేశానికి అన్నం పెడుతున్న ఈ రెండు జిల్లాలను ఆ రోజు వైఎస్సార్ ఆదరించారని గుర్తు చేశారు. ఈ రోజు సాగు చేస్తున్న రైతుల పట్ల వైఎస్ జగన్ కరుణ చూపిస్తున్నారని ఉపముఖ్యమంత్రి సుభాష్ కొనియాడారు. రైతులకు సీఎం జగన్ భరోసా కల్పిస్తూ, భూ యజమానులకు, కౌలు రైతులకు న్యాయం చేస్తున్నారన్నారు. ఉదారంగా రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా రైతులు ఉత్సాహంగా సాగు చేసేవారని, ప్రస్తుతం వారు నష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులు దాదాపు 5 లక్షల మంది వలస వెళ్లారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. అందరికీ సాయం చేసేందుకు ముందుకువచ్చిన వైఎస్ జగన్‌ను అభినందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోనే 2.60 లక్షల మంది వాలంటీర్లుగా, 1.30 లక్షల మందిని సచివాలయ ఉద్యోగులుగా నియమించారని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ దమ్మున్న నాయకుడు: కురసాల ప్రతి పనిలో చిత్తశుద్ధి, పారదర్శకతతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. నాలుగు నెలల పాలనలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన దమ్మున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శప్రాయుడిగా సీఎం జగన్ మారారన్నారు. 2019 ఎన్నికల శంఖారావాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచే వైఎస్ జగన్ పూరించారన్నారు. దేశం మొత్తం చూసేవిధంగా ఎన్నికల ఫలితాల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు సాధించి, నాయకుడు అంటే ఈయనేనని వైఎస్ జగన్ దేశానికి చూపించారని పేర్కొన్నారు. ఒక వ్యవస్థను రూపొందించి దాన్ని అమలు చేయడానికి దమ్ముండాలని, అలాంటి దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని మంత్రి కన్నబాబు కొనియాడారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, కానీ చంద్రబాబు హయాంలో ఎవరికీ ఒక్క జాబు కూడా రాలేదని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత యువత అంతా జగనన్న వచ్చాడు. జాబు ఇచ్చాడని నినదిస్తోందని తెలిపారు. ప్రజల ముందుకు నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని, దశలవారీగా మద్య నిషేధం మంగళవారమే ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇంతటి సుపరిపాలనలో భాగస్వాములు అయినందుకు గర్వపడుతున్నానని మంత్రి కన్నబాబు అన్నారు. దేశమంతా ఆంధ్ర రాష్ట్రవైపు చూస్తుంది. గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం గ్రామ సచివాలయమని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీర్వాదాలు సీఎం వైఎస్ జగన్‌కు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం మాటను నిజం చేస్తూ వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చారని అన్నారు. ఉద్యోగం వచ్చిన కుటుంబాలు నా బిడ్డకు జగనన్న ఉద్యోగం ఇచ్చాడని ఆనందపడుతూ సీఎంను ఆశీర్వదిస్తున్నారన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని మాత్రమే కాకుండా నేను ఉంటాను.. మీకు అన్నీ చేస్తానని సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారన్నారని కొనియాడారు. సీఎం జగన్‌కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎంతైనా ఖర్చు పెట్టమని సీఎం చెప్పారు..
సాక్షి, విజయవాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బండి కలుగకుండా ఎంత ఖర్చైనా పెట్టి సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అలాగే ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా చూడాలని కోరారన్నారు. శుక్రవారం ఆయన... దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి దుర్గగుడిలో ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఐదవ తారీఖు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. పోలీస్, శానిటేషన్, గుడి సిబ్బంది, ఫైర్ సిబ్బందితో కలిసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 125 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మోడల్ గెస్ట్ హౌస్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనల అమలుతో పాటు వరదనీరు ఎక్కువగా ఉండడంతో ఘాట్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. సామాన్య భక్తుల శీఘ్ర దర్శనం కోసం ఈసారి విఐపి పాసులను కుదించినట్టు కన్నబాబు తెలిపారు. మరోవైపు ఉత్సవాల నాటికి చేస్తున్న పనులన్నీ పూర్తవ్వాలని సోమా కంపెనీని ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ మున్సిపల్ కమీషనర్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఈవో పాల్గొన్నారు. -
ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం: మంత్రి కురసాల
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రతి నెల వ్యవసాయ నిపుణులతో చర్చిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ మిషన్ మూడో సమావేశం నిర్వహించిన సందర్భంగా మంత్రి శనివారం ఇక్కడ మాట్లాడుతూ.. మార్కెట్లపై నిరంతరం నిఘా ఉంచి ధరల నియంత్రణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. సరుగుడు, జామాయిల్ రైతులకు సాయం చేసే అంశంపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి కోరినట్లు వెల్లడించారు. చిరు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం చేపట్టాలని, దాని కోసం మిల్లెట్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతు ఏ దశలోనూ నష్టపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో చంద్రబాబు 2000 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టారని, ఇప్పుడు వాటిని విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కన్నబాబు తెలిపారు. టమాట విస్తీర్ణం తగ్గిందని, అంతేగాక ధర విషయంలోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయన్నారు. కావున వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దానికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ తెలిపారని మంత్రి అన్నారు. ధర పడిపోయినప్పుడు స్పందించడం కంటే ముందు చూపుతో రైతును ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలని, ఇప్పటికే ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు ఉందని స్పష్టం చేశారు. మినుములు, పెసలు, కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ముందుగానే చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ మిషన్ మూడో సమావేశం సీఎం జగన్ నిర్వహించారని, రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలన్నదే ఈ సమావేశ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టమాట పంట దిగుబడి ఉన్నా.. రైతులు మార్కెటింగ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రైతు భరోసా పధకం అమలు చేయాలని, దాని కోసం అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ఎవరనీ ఇబ్బంది పెట్టొద్దని, కౌలుదారులకు భరోసా ఇచ్చేందుకు కృష్ణా డెల్టా ఆధునికీకరణపై చర్చ జరిగిందని తెలిపారు. -
బాబు ఇంటిని ముంచారనడం సిగ్గుచేటు
సాక్షి, కృష్ణా: వరదల వల్ల నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి, జిల్లా ఇంచార్జి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ అధికారులు పంటనష్టంపై అంచనాలు రూపొందిస్తున్నారని, రైతులందరికీ నష్ట పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు అండగా ఉండాలన్నదే సీఎం జగన్ మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. రైతులకు వంద శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామన్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు.. కృత్రిమ వరదను సృష్టించారనడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రైతుల బాధలు వినకుండా తన ఇంటిని ముంచారనడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, కొలుసు పార్థసారథి, కొక్కిలిగడ్డ రక్షణనిధి, వ్యవసాయ కమిషనర్ అరుణ్ కుమార్ వెంట ఉన్నారు. -
కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా?
అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్‌గా పని చేసిన కోడెల శివ ప్రసాదరావు అసెంబ్లీలో ఫర్నీచర్‌ని ఇంటికి తీసుకెళ్లడం చాలా దారుణమని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఇప్పుడు దీనిపై విచారణ జరుగుతుంది కాబట్టే ఆ ఫర్నీచర్‌ని తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారని, ఒకవేళ విచారణ లేకపోతే దాని ఊసే ఉండేది కాదన్నారు. అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా?, ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. విచారణలో ఆయన తప్పు చేశానని ఒప్పుకుంటే, తప్పు ఒప్పు అవుతుందా అని కన్నబాబు నిలదీశారు. ఇదే పనిని ఒక సామాన్యుడు చేస్తే ఏమంటారు.. దొంగతనమో, చేతివాటమనో అనేవారని ఎద్దేవా చేశారు. ఫర్నీచర్‌ను ఇంటికి తీసుకెళ్లడంపై కోడెలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వరదల కారణంగా పంటలు నష్టపోయిన చోట మళ్లీ పంటలు వేసుకునేలా ప్రోత్సాహిస్తామన్నారు. పంటలు పోయిన రైతులకు వంద శాతం సబ్బిడీపై విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారని, దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మినుములు, పెసల విత్తనాలు కూడా సబ్బిడీపై ఇస్తామన్నారు. రాయలసీమకు కృష్ణ నీటిని తరలించామని, కళ్లకు కనిపిస్తున్నా దేవినేని ఉమ, మిగతా టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారని, వరదపై బురద రాజకీయాలు చేశారని కన్నబాబు మండిపడ్డారు. డ్రోన్ కోసం నానా రాద్దాంతం చేస్తున్నారని, అసలు ఈ రాష్ట్రంలో డ్రోన్ కార్పోరేషన్ ఏర్పాటు చేసింది బాబు కాదా? అని ప్రశ్నించారు. గతంలో గోదావరి పుష్కరాల్లో డ్రోన్ వాడలేదా..?, ప్రభుత్వం వరద వలన ఎవ్వరికి నష్టం లేకుండా చర్యలు తీసుకునేందుకు డ్రోన్ వినియోగించిందన్నారు. -
‘టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు’
సాక్షి, అమరావతి : గత టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గురువారం శాసన మండలిలో సంక్షేమ పథాకాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు తన పాలనలో రైతులను అన్ని విధాల మోసం చేశారని అందుకే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు పెద్ద పీట వేసిందని, వారి సంక్షేమానికి, అభివృద్దికి ప్రత్యేక వ్యుహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. రైతుల రుణమాఫీకి నిధులు లేవన్న చంద్రబాబుకు పసుపు, కుంకుమకు మాత్రం నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదని, రైతుల కోసం కేటాయించిన 2వేల కోట్ల ఇన్ పుట్ సబ్సిడిని టీడీపీ ప్రభుత్వం ఎగ్గోట్టిందని ఆరోపించారు. అయితే తాము అధికారంలోకి రాగానే శనగ, పామాయిల్ రైతులను ఆదుకున్నామని, ఇప్పుడు ఈ నిధులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. అలాగే రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు. తమది రైతు ప్రభుత్వమని తెలిపారు. అదే విధంగా రైతుల కోసం ఏం చేయడానికైనా తాము ఎప్పుడూ సిద్దంగా ఉంటామన్నారు. కాగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని ఈ విషయం గురించి అధికారులు చెబుతున్న చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. -
11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సభ ముందుకు తేనున్నారు. ఈ నేపథ్యంలో రేపు అన్ని శాఖ అధికారులతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భేటీ కానున్నారు. సమావేశాలకు అన్ని ఏర్పాట్లును చేయాలని వారికి సూచించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అమలుచేస్తూ.. వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని అనుగుణంగానే బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని.. సంబంధిత మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. -
రైతులందరికీ రాయితీలు
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభయహస్తం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి రాయితీ కౌలు రైతులతో సహా అన్నదాతలందరికీ కచ్చితంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమం కోసమే రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఏర్పాటైందని ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ (అగ్రి మిషన్) తొలి సమావేశం శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. అగ్రి మిషన్ చైర్మన్ హోదాలో దీనికి అధ్యక్షత వహించిన సీఎం వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన అగ్రి మిషన్ సమావేశంలో అజెండాలోని ఏడు అంశాలను వివరంగా చర్చించారు. సభ్యుల సూచనలు, సలహాలను ముఖ్యమంత్రి ఓపిగ్గా వింటూ రైతులకు మేలు జరిగేలా అగ్రి మిషన్ పని చేయాలని సూచిం చారు. వైఎస్సార్ రైతు భరోసాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ అన్నదాతలకు అందేలా చూడడం అగ్రి మిషన్ కీలక బాధ్యతన్నారు. ప్రతి నెలా అగ్రి మిషన్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విత్తన సరఫరాపై ప్రణాళికకు ఆదేశం అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మంత్రులు కె.కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అనిల్ కుమార్ యాదవ్, ఆ శాఖల అధిపతులు మధుసూధన్‌రెడ్డి, పూనం మాలకొండయ్య, అరుణ్‌కుమార్, చిరంజీవి ఛౌదురి, మురళీ, నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అజయ్ కల్లం, ధనుంజయ్‌రెడ్డి, ఆర్డీటీ ప్రతినిధి మల్లారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త చంద్రశేఖర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైఎస్ ఛాన్స్లర్ రాఘవరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం ఎంవీఎస్ నాగిరెడ్డి, మంత్రి కన్నబాబు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ తొలి సమావేశం సంతృప్తికరంగా జరిగిందన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాల మాటే వినబడకూడదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, వచ్చే సీజన్‌కు సంబంధించి విత్తన సరఫరా ప్రణాళికలు రూపొందించాలని సూచించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన వ్యవసాయ మిషన్ తొలి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు, మిషన్ సభ్యులు ఉన్నతాధికారులు వ్యవసాయ విద్యుత్తు ఫీడర్లకు తక్షణమే రూ.1,700 కోట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని అగ్రి మిషన్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ప్రస్తుతం పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు అనువైన ఫీడర్లు 60 శాతం అందుబాటులో ఉండగా మిగతా 40 శాతం ఫీడర్లు కూడా పని చేసేలా రూ.1,700 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వచ్చే మార్చి నెలాఖరులోగా 40 శాతం ఫీడర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా పర్యవేక్షించాలని అగ్రి మిషన్ సభ్యులకు సూచించారు. ప్రణాళికతో పని చేద్దాం.. ప్రతి పనికీ ప్లానింగ్ ఉండాలని, గత ప్రభుత్వ ప్రణాళికా లోపమే ప్రస్తుతం విత్తనాల కొరత సహా వ్యవసాయ రంగ సంక్షోభానికి కారణమని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించవచ్చన్నారు. ప్రతి నియోజకవర్గంలో పరీక్షా ప్రయోగశాలలు (టెస్టింగ్ ల్యాబ్స్) ఏర్పాటు చేసి ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను క్షుణ్నంగా తనిఖీ చేసి నిర్ధారించిన తర్వాతే మార్కెట్‌కు విడుదల చేయాలని ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇకపై రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోరాదని హెచ్చరించారు. ఇన్పుట్ సరఫరాదారులు ఇచ్చిన నమూనాలే మార్కెట్లో కూడా ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అగ్రి మిషన్‌లో ఇన్పుట్ సరఫరాదారుల సంఘం ప్రతినిధుల్ని చేర్చడం వెనక ఉద్దేశం కూడా అదేనని వివరించారు. ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎప్పుడో ఇచ్చేది కాదు.. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అక్టోబర్ 15వతేదీ నుంచి రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం కింద రూ.12,500 చొప్పున ఇస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో నూటికి 50 శాతం మంది రైతులు 1.22 ఎకరాల లోపు పొలం ఉన్నవారేనని, వారందరికీ ఈ పెట్టుబడి సాయం ఉపకరిస్తుందని, దీంతో పాటు ప్రభుత్వం వడ్డీలేని పంట రుణాలు కూడా ఇప్పిస్తున్నందున రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రైతులకు ప్రకటించిన రాయితీలలో ఎక్కడా అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి మిషన్ సభ్యుడిపై ఉందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎప్పుడో రెండు మూడేళ్లకు ఇచ్చేది కాదని, ఒక సీజన్లో నష్టపోతే ఆ తర్వాత సీజన్లో పంట వేసుకునేందుకు అందేలా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిపడ్డ రూ.2 వేల కోట్లకుపైగా ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం రైతులకు బకాయిపడ్డ రూ.970 కోట్లను చెల్లించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ధాన్యం రైతులకు ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. బెండ విత్తనాలపై ఫిర్యాదులను విచారించండి సహకార రంగాన్ని గాడినపెట్టి ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా కసరత్తు చేపట్టే బాధ్యతను వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబుకు, భూ రికార్డుల సంస్కరణ బాధ్యతను అజయ్ కల్లంకు, సాగునీటి సంఘాల ఎన్నికల బాధ్యతను నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు అప్పగించినట్టు తెలిసింది. రాయలసీమలో బెండ విత్తనాలపై అందిన ఫిర్యాదులను అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా తక్షణమే విచారించాలని ఉద్యాన శాఖాధికారులను ఆదేశించారు. సమావేశంలో కౌల్దారీ చట్టం అమలుపై కూడా చర్చించారు. -
పూర్తి స్థాయి సర్వే జరిగి 111 సంవత్సరాలు
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబాస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సన్నబియ్యం సేకరించాలని జగన్ ఆదేశించారన్నారు. ఈ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి కమిటీ : పిల్లి సుభాష్‌చంద్రబోస్ గత ప్రభుత్వం భూముల వ్యవహారం ఆన్లైన్ చేయడం వల్ల అనేక అవకతవకలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఫలితంగా రైతుల భూమి హక్కుకు భంగం కల్గిందని.. భద్రత లేదని విమర్శించారు. భూసమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి రిటైర్డ్ జడ్జి, అనుభవజ్ఞులైన రిటైర్డ్ సర్వేయర్, రెవెన్యూ అధికారులతో ఒక కమిటీ నియమించాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారన్నారు. ఇది ఒక ఆహ్లదకరమైన.. ఆహ్వానించదగిన నిర్ణయమని కొనియాడారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి భూ సర్వే జరిగి దాదాపు 111 సంవత్సరాలు అవుతుందన్నారు. రీసర్వేను జగన్ ఒక చాలెంజ్‌గా తీసుకున్నారని.. దీనిపై అనుభవజ్ఞులైన అధికారులతో సమీక్షిస్తున్నారని తెలిపారు. -
రైతు పేరిట రుణం తెచ్చి ఎన్నికల పందేరం
సాక్షి, అమరావతి: రైతుల పేరిట రుణాలు తెచ్చి ఎన్నికల తాయిలాల కింద పంపకం చేసిన మాజీ సీఎం చంద్రబాబుకు రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని రాష్ట్ర వ్యవసాయ, జల వనరుల శాఖ మంత్రులు కురసాల కన్నబాబు, పి.అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రులు ఇద్దరూ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా రుణ మాఫీని ప్రకటించి, అధికారంలోకి వచ్చాక అనేక కోతలు పెట్టిన చంద్రబాబు రైతులను మోసం చేశా రని ధ్వజమెత్తారు. ఇప్పుడు నాలుగైదు విడతల రుణమాఫీని జగన్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరమని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాదనే ఆనాడు తమ నాయకుడు వైఎస్ జగన్ రుణమాఫీని ప్రకటించలేదని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల శాఖ తెచ్చిన రూ. 4,800 కోట్ల రుణాన్ని, కరువు నివారణ పనుల కోసం కేంద్రం ఇచ్చిన రూ. 932 కోట్లను దారి మళ్లించిన విషయం వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో బయటపడిందని కన్నబాబు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినా ఇంతవరకు సొమ్ము చెల్లించలేదని మండిపడ్డారు. గతేడాది రూ.1,800 కోట్లు, అంతకుముందు రూ.200 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని రైతులకు టీడీపీ ప్రభుత్వం బకాయి పడిందని, తాజాగా కేబినెట్లో సీఎం వైఎస్ జగన్ రూ.2 వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటన చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్ రైతు భరో సా పథకం కింద ఏటా రూ.12,500 చొప్పున నాలు గేళ్ల పాటు ఇచ్చే రూ.50 వేలను అధికారంలోకి వచ్చి న రెండో ఏడాదినుంచి అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ రైతులు కష్టాలలో ఉన్నారనే కారణంతో వచ్చే అక్టోబర్ నుంచే ఇస్తున్నారని వివరించారు. ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులకు సకాలంలో విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గజనీని తలపిస్తున్న చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేస్తుందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులను ఆపేస్తున్నారంటూ బాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. చంద్రబాబు తీరు గజనీ మాదిరిగా ఉందని, ఆయనకు మతి చెడినట్టుందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిపుణుల కమిటీ వేస్తామని, పారదర్శకంగా, అవినీతి రహితంగా చేపడతామని తెలిపారు. జ్యుడీషియల్ కమిటీ వేసి రివర్స్ టెండరింగ్ విధానం తీసుకువస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటే గుమ్మడికాయల దొంగ మాదిరిగా చంద్రబాబు భుజాలు తముడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం, రాజధాని నిర్మాణ పనుల్లో భారీస్థాయిలో అవినీతి జరిగిందని, దీనిపై కమిటీలు వేస్తున్నామని తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్ మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను వైఎస్ జగన్ ఐదేళ్లలో పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. -
ప్రజల గుండె చప్పుడు వినగలిగిన నాయకుడు వైఎస్ జగన్
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కన్నబాబు
-
‘చంద్రబాబుకు పవన్ కల్యాణ్ చెంచా’
సాక్షి, తూర్పు గోదావరి : ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి జనసేన దుష్ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ మాట్లాడుతూ.. టీడీపీకి పరోక్షంగా లాభం చేసేందుకే కన్నబాబుపై పవన్ కల్యాణ్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ చెంచా అని ఘాటుగా స్పందించారు. కాకినాడ రూరల్ ప్రజల మదిలో కన్నబాబుకు ప్రత్యేక స్ధానం ఉందని అన్నారు. చదవండి : కన్నబాబుపై జనసేన దుష్ప్రచారం -
‘జగన్ గెలిస్తే ప్రతి ఒక్కరు గెలిచినట్టే’
సాక్షి, కాకినాడ: పేద ప్రజలకు మేలు జరిగే ప్రతి పథకాన్ని చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ అభ్యర్థి కురసాలు కన్నబాబు విమర్శించారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో జరిగిన వైఎస్సార్సీసీ ఎన్నికల ప్రచార సభలో కన్నబాబు ప్రసంగించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పసుపు-కుంకుమ ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రమే చంద్రబాబుకు ప్రజల ప్రేమ పట్టుకోస్తుందని ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక చంద్రబాబు ప్రజలను పట్టించుకోరని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో వైఎస్ జగన్ గెలిస్తే ప్రతి ఒక్కరు గెలిచినట్టేనని తెలిపారు. రాజన్న రాజ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని అన్నారు. వైఎస్ జగన్ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగా గీతా మాట్లాడుతూ.. వ్యవసాయం పండగ కావాలంటే.. వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని అన్నారు. ప్రజలు ఆలోచించి సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అర్హత ఆధారంగా సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. వైఎస్ జగన్ రావాలని పేర్కొన్నారు. అందరికీ ఆరోగ్య భద్రత వైఎస్ జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. రాజన్న రాజ్యం వైఎస్ జగన్ తీసుకువస్తారని వ్యాఖ్యానించారు. పోలరం ప్రాజెక్టును సజీవంగా ఉంచిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనని గుర్తుచేశారు. ప్రజల కోసం పనిచేసేవారినే ప్రజలు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
జనసేన దుష్ప్రచారం.. కేసు నమోదు
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): మార్ఫింగ్ ఫోటోలతో కాకినాడ రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై జనసేన చేస్తున్న దుష్ప్రచారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నబాబుపై సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జనసేన దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తెలిసి కన్నబాబు స్పందించారు. నాలుగు నెలల కిందట కూరాడ గ్రామంలో కాలుజారి పడిపోయిన దళిత వృద్ధురాలికి ధన సహాయం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్ చేసి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జనసేన దుష్ప్రచారం చేస్తోందని కన్నబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నాగమల్లితోట జంక్షన్ వద్ద సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను ఇటీవలే అరెస్ట్ చేసినట్లు జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనసేన చేస్తోన్న తప్పుడు ప్రచారంపై కన్నబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కన్నబాబు ఫిర్యాదుతో సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేసేందుకు సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. జనసేన కార్యకర్తలు కన్నబాబుపై దుష్ప్రచారం చేస్తున్న పోస్టులు.. -
కన్నబాబుపై జనసేన దుష్ప్రచారం
కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): కాకినాడ రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై సోషల్ మీడియా వేదికగా జనసేన దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లుగా.. పోలీసులు అరెస్ట్ చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు పాత ఫోటోలతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విషయం తెలిసి కన్నబాబు స్పందించారు. నాలుగు నెలల క్రిందట కూరాడ గ్రామంలో కాలుజారి పడిపోయిన దళిత వృద్ధురాలికి ధన సహాయం చేశానని, ఆ సమయంలో తీసిన ఫోటోను మార్ఫింగ్ చేసి ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నట్లుగా, పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జనసేన దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నాగమల్లితోట జంక్షన్ వద్ద సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసిన ఫోటోను ఇటీవలే అరెస్ట్ చేసినట్లు జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనసేన చేస్తోన్న తప్పుడు ప్రచారంపై కన్నబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆ నాయకులు రేషన్ బియ్యం తింటున్నారా?
సాక్షి, కాకినాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలు వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్సీపీకి ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. డబ్బున్న వాళ్లకే వైఎస్ జగన్ సీట్లు ఇస్తున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘టీడీపీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, గల్లా జయదేవ్, నారాయణలు తేల్లరేషన్ కార్డులు ఉన్న నిరుపేదలా? వాళ్లు ఏమైన రేషన్ బియ్యం తింటూ బతుకుతున్నారా? చంద్రబాబు ఏమైనా నిరుపేదలను రాజకీయ నాయకులుగా తీర్చుదిద్దుతున్నారా? సీఎం తీరు వినేవాడుంటే చెప్పవాడు చంద్రబాబు అన్నట్లుగా ఉంది’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇలాగే మాట్లాడి టీడీపీకి పుట్టగతులు లేకుండా చేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్‌కు దొంగ బుద్దులు నేర్పించారన్నారు. టీడీపీకి, చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చేప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధిస్తుందని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. (చినబాబు సీటు.. పెద్ద తలనొప్పే) -
అన్ని వర్గాలకూ ఉపయోగపడేలా..
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉత్తమమైన మానిఫెస్టో రూపకల్పన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ సిటీ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బుధవారం హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులను నియమించారని, దీనిలో జిల్లా నుంచి తనతోపాటు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ సభ్యులుగా వ్యవహరిస్టున్నట్టు చెప్పారు. జిల్లాలోని పార్టీ కో ఆర్డినేటర్లతో పాటు, వివిధ అనుబంధ సంఘ నాయకులను అభిప్రాయాలు సేకరించామన్నారు. 2014 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 650పైగా అమలుకానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రస్తుతం అమలు చేసే హామీలను మాత్రమే వైఎస్సార్ సీపీ రూపొందిస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఈ మేనిఫెస్టో ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వారికే ఖర్చు చేయాలని చట్టం చేసినా, ప్రస్తుతం రూ.2500 కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ఫ్లాన్ నిధులు పసుపు, కుంకుమ పథకానికి దారి మళ్లించారన్నారు. పార్టీ మేనిఫెస్టోలో మాత్రమే సబ్‌ప్లాన్ నిధులు వారికే ఖర్చు చేస్తామన్నారు. తప్పుడు కేసులు పెడితే సహించం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లను లక్ష్యంగా చేసుకొని వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తే సహించేది లేదని కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు టీడీపీ నాయకులను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసి టెక్నాలజీ దుర్వినియోగం చేసి వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఫారం– 7 ద్వారా ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు ఆన్లైన్లో దరఖాస్తులు చేశారని కేసులు నమోదు చేయడం సిగ్గు చేటన్నారు. కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారని, తమ పార్టీ బూత్ కన్వీనర్లు ఓట్లు తొలగించాలని ఎందుకు దరఖాస్తులు చేస్తారని ప్రశ్నించారు. కాకినాడ సిటీ, రంపచోడవరం నియోజకవర్గాల్లో బూత్ కన్వీనర్లు ఫిర్యాదు చేశారని వారిపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఎటువంటి కమ్యూనికేషన్ లేని ఏజెన్సీలోని మారేడుమిల్లి ప్రాంతంలోని బూత్ కమిటీ కన్వీనర్లు ఆన్లైన్లో ఓట్లు తొలగింపునకు ఎలా దరఖాస్తు చేస్తారన్నారు. ఇది కేవలం అమరావతి కేంద్రంగా టీడీపీ ఆడిస్తున్న డ్రా అన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని జిల్లాలోని కొందరు అధికారులు పార్టీ నాయకులు, సానుభూతిపరులపై రౌడీషీట్లు, బైండోవర్ నమోదు చేసి, పోలింగ్ రోజున వారిని అరెస్ట్ చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. ఒక ప్రైవేటు సంస్థకు రాష్ట్రంలోని 3.70 కోట్ల మంది డేటా, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఎలా చేరాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసు కంటే ప్రస్తుతం డేటా గ్రిడ్ సంస్థపై కేసుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలిశామని, త్వరలో జిల్లా ఎస్పీ విశాల్‌గున్నిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజవర్గ అధ్యక్షుడు మార్గాని భరత్, కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, దవులూరి దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ వివిధ అనుబంధసంఘ నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో పొత్తా?
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారా? అని టీడీపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు మోపి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు సక్రమంగా పనిచేయకపోవడంతోనే తమ నాయకుడు వైఎస్ జగన్ జనంలోకి వెళ్లారన్నారు. పవన్ కల్యాణ్ పారిపోయేవారు.. చంద్రబాబు హామీలకు తనే బాధ్యుడ్ని అని చెప్పిన పవన్ కల్యాణ్ ఒక్కసారి కూడా ఎందుకు ప్రశ్నించలేకపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిలదీశారు. శాసనసభలో టీడీపీ అరాచకాలను ఇన్నాళ్లు తమ అధినేత వైఎస్ జగన్ ఎదుర్కోగలిగారన్నారు. పవన్ అయితే ఒక్క రోజు కూడా ఉండలేక ముందే పారిపోయేవారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను పవన్‌కు కనబడటం లేదా అని మరో వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యుల బాధలు జగన్ తెలుసుకుంటున్నారని తెలిపారు. అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు ఫ్యాక్షనిస్టా.. ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్ ఫ్యాక్షనిస్టా? అని రాజా ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో ఎక్కడ కష్టం వచ్చినా ముందుగా వచ్చేది జగనేనని స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు కామెడీ.. జనం నవ్వులు..’
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నది ధర్మపోరాట దీక్ష కాదని, అది అధర్మ పోరాట దీక్షని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనం సొమ్ముతో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. దీక్ష కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. దీక్షకు ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, పెన్షనర్లను బలవంతంగా తరలించారని ఆరోపించారు. సభలో చంద్రబాబు చేసిన కామెడీ చూసి జనం ఫుల్లుగా నవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. దీక్ష పేరుతో 2 వేల ఆర్టీసీ బస్సులను సభాస్థలికి తరలించడంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వివరించారు. సభ కోసం పాఠశాలలకు సెలవులు ఇస్తారా? అని నిలదీశారు. -
బాబు దిగజారుడుతనానికి పరాకాష్ట
కాకినాడ : ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష సందర్భంగా వ్యవహరించిన తీరు ఆయన దిగజారుడు తనానికి పరాకాష్టగా నిలిచిందని కాకినాడ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేసి దీక్షల పేరుతో ఖర్చు చేశారని మండిపడ్డారు. విజయవాడలో చంద్రబాబు చేసిన దీక్షకు మజ్జిగ, నీళ్ల కోసం రూ.నాలుగు కోట్లు ఖర్చు చేశారని, ఇక ప్రజలను తరలించడం, ఇతర ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. దీక్షలు చేస్తే హోదాలు వస్తాయా? అంటూ గతంలో వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసిన చంద్రబాబు ఎం దుకు దీక్ష చేస్తున్నారో ప్ర జలకు సమాధానం చెప్పాలని కన్నబాబు డిమాండ్ చేశారు. జపాన్ తరహాలో ఉద్యమించాలంటూ నాడు ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఉద్యమబాట పట్టడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరసనలను ఆక్షేపిస్తూ ఆందోళనలు ఇక్కడి చేస్తే రావని, ఢిల్లీలో చేయాలంటూ ఉచిత సలహాలు ఇచ్చిన చంద్రబాబు తాను మాత్రం ఇక్కడే ఎందుకు దీక్ష చేశారని కన్నబాబు నిలదీశారు. తన ప్రచార ఆర్భాటం కోసం అధికార యంత్రాంగంతోపాటు అన్ని వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ అనేక జిమ్మిక్కులు చేస్తోందన్నారు. అనవసర వివాదాలను తెరపైకి తెచ్చి సమస్యను దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. -
'ధాన్యం కొనుగోళ్లలో అధికారిక దందా'
కాకినాడ: ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లలో అధికారిక దందా జరుగుతోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా గోతులు తీసే కార్యక్రమం చేపడుతారని విమర్శించారు. ఆదివారం కాకినాడలో కురసాల కన్నబాబు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు ఇంకుడు గుంతలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ధ్వజమెత్తారు. రైతులకు అందాల్సిన రవాణా హ్యాండిలింగ్ ఛార్జీలు పెద్ద ఎత్తునా పక్కదారి పడుతున్నాయని దుయ్యబట్టారు. ఈ అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రజా పోరాటం చేస్తుందని వెల్లడించారు. ఎండవేడిమిని తట్టుకోలేక గోదావరి పుష్కరాల్లో తోపులాట జరిగిందని కలెక్టర్ నివేదిక ఇవ్వడం విచారకరమన్నారు. గోదావరి, కృష్ణా జలాలను కాపాడుకోవాలంటే ఎగువన చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 17న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్షకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లాలోని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ దీక్షలు చేపట్టనున్నట్టు కురసాల కన్నబాబు పేర్కొన్నారు.