
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సభ ముందుకు తేనున్నారు. ఈ నేపథ్యంలో రేపు అన్ని శాఖ అధికారులతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భేటీ కానున్నారు. సమావేశాలకు అన్ని ఏర్పాట్లును చేయాలని వారికి సూచించనున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అమలుచేస్తూ.. వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని అనుగుణంగానే బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని.. సంబంధిత మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment