సాక్షి, కాకినాడ: చంద్రబాబు అధికారానికి ముందు ఒక మాట.. అధికారం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం అలవాటేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులను సెంట్రల్ జైల్లో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు సర్కార్‌కు అనుకూలంగా ఒక మీడియా దర్మార్గమైన ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
..2003లో పరిశ్రమల కోసం భూములను సేకరించారు. వైఎస్సార్ హయాంలో ఎస్ఈజడ్ కోసం 10 వేల ఎకరాలు సేకరించే ప్రయత్నం చేశారు. 8,150 ఎకరాల్లో జీఎంఆర్ ఈ భూములు సేకరించింది. సెజ్‌లో రైతులు దీనిని వ్యతిరేకించారు. ఉద్యమం ప్రారంభించిన సేకరణ ఆగలేదు. 2012లో చంద్రబాబు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములు వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ కూడా చంద్రబాబు మాటలు నమ్మింది. 2014 తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అపరిచితుడులా మారిపోయారు.
రైతుల భూములను, ఎస్సైన్ లాండ్‌లను తిరిగి తీసేసుకుని సెజ్‌కి ఇచ్చేశారు. పోరాట కమిటీ నాయకులను పోలీసులతో వేధించి అక్రమ కేసులు పెట్టారు. 2018లో సెజ్ ఉద్యమం తీవ్రమైంది. సెజ్ పోరాట కమిటీ నాయకులను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. జైలులో బాత్ రూమ్‌లు రైతులతో కడిగించారు. భూములు ఇవ్వాలని రైతులపై తీవ్రమైమ ఒత్తిడి తెచ్చారు. కార్పోరేట్ కంపెనీలకు కొమ్ముకాసిన చరిత్ర చంద్రబాబుది. సెజ్‌కు భూములు ఇవ్వని రైతులకు తిరిగి ఇచ్చేస్తామని పాదయాత్రలో జగన్ పోరాట కమిటీ ఇచ్చారు. 2180 ఎకరాలు తిరిగి ఇచ్చేయాలని నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తీర్మానం చేసింది. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్పా.. ఆ భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం తప్పా. చంద్రబాబు ఒక్కడే నీతి మంతుడిలా మీడియా చూపిస్తుంది
రైతులను దారుణంగా వేధించారు: దాడిశెట్టి రాజా
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, తన బినామీ అయినా కేవీరావు ద్వారా 2003లోనే చంద్రబాబు సెజ్‌లో భూ సేకరణ చేశాడు. మొట్ట మొదటిగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది అప్పటి తుని ఎమ్మెల్యేగా ఉన్న యనమల రామకృష్ణుడు. దీంతో రైతులు కూడా భూములు ఇవ్వాల్సి వచ్చింది. సెజ్ భూసేకరణ ద్వారా లాభపడింది యనమల రామకృష్ణుడు. 2014 లో చంద్రబాబు సీఎం అయిన వెంటనే దీవిస్ వంటి రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. దీవీస్ కోసం పోరాడిన రైతులను పోలీసులతో దారుణంగా వేధించాడు. 2180 ఎకరాల భూములను సెజ్ నుండి రైతులకు వైఎస్ జగన్ తిరిగి ఇచ్చారు. రైతులకు భూములు తిరిగి ఇచ్చిన జగన్ మంచివారా.. భూములు ఇవ్వాలని రైతులను హింసించిన చంద్రబాబు గొప్పవాడా?. 2003 నుండి జరిగిన భూ సేకరణ పై విచారణ చేయాలి. సెజ్‌లో జరిగిన అవకతవకలు బయట పెట్టాలి’’ ఆయన డిమాండ్ చేశారు.
రైతులను చంద్రబాబు అవమానించారు.. జగన్ గౌరవించారు: వంగా గీత
వంగా గీతా మాట్లాడుతూ.. సెజ్ గురించి 2003 నుంచి 2024 ఏం జరిగిందని రికార్డెడ్‌గా ఉంది. సెజ్‌లో భూముల కోసం పోరాడిన రైతులు ఉన్నారు. ఏరువాక చేసి సెజ్ భూములు వెనక్కి వస్తాయని చంద్రబాబు మోసం చేశారు. సీఎం అయిన వెంటనే రైతులను బెదిరించి చంద్రబాబు అవమానించారు. ఇప్పుడు మళ్లీ సెజ్ నుంచి ఏం ఆశించి అసత్య ప్రచారం మొదలు పెట్టారు. రైతుల ఉద్యమాన్ని వైఎస్ జగన్ గౌరవించారు.
సెజ్‌లో ఉన్న ఆరు గ్రామాల ప్రజలు అక్కడే ఉండేలా చేశారు. 2180 ఎకరాల్లో చాలా భూములు రైతులకు తిరిగి వెళ్లిఫొయాయి. మిగిలిన భూములు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వద్ద నిలిచిపోయాయి. వాటిని చంద్రబాబు సర్కార్ క్లీర్ చేసి ఆ భూములను వెనక్కి ఇవ్వాలి. సెజ్ మీద మళ్లీ ఎందుకు అబద్దపు ప్రచారం మొదలు పెట్టారు. సెజ్ మీద ఏదో కుట్ర కోణం ఉంది?. సెజ్‌పై విచారణ వేయాలి. 2003 నుంచి 2024 నుంచి ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. సెజ్ రైతుల సెంటిమెంట్‌ను వైఎస్ జగన్ గౌరవించారు. సెజ్‌ను రాజకీయం చేయడంలో అసలు కథ ఏంటో ప్రజలకు తెలియాలి
Comments
Please login to add a commentAdd a comment