Kakinada District
-
తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
సాక్షి, కాకినాడ జిల్లా: నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలతో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తునిలో టీడీపీ గూండాల దౌర్జన్యకాండకు దిగారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సాస్‌పీ వారే. ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మంది టీడీపీ లాక్కుంది. వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాలు దాడి చేసి.. మున్సిపల్ ఆఫీస్‌లో వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.దీంతో ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గుండాలు.. నాలుగోసారి అడ్డుకున్నారు.తునిలో పోలీస్ బందోబస్తు లేదంటూ వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ‘‘తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు’’ అని దాడిశెట్టి పేర్కొన్నారు. తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను పిఠాపురం టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. -
తుని: వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాల దాడి
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా👉నాలుగోసారి ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గూండాలు👉బలం లేకపోవడంతో అడ్డుకున్న టీడీపీ గూండాలు👉ఎన్నిక జరిగితే ఓడిపోతామన్న భయంతో కూటమి సర్కార్ కుట్రతునిలో టీడీపీ నేతల దౌర్జనకాండ👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతల దాడి👉మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం👉ప్రాణభయంతో వెనుదిగిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు👉మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీగా టీడీపీ గూండాలు👉కర్రలతో భారీగా టీడీపీ గూండాలు మోహరింపుతునిలో ప్రజాస్వామ్యం ఖూనీ👉మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు👉నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలు👉తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కుట్రలు👉తునిలో 30కి 30 కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ వారే👉ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మందిని లాక్కున్న టీడీపీ👉వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు👉తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు👉144 సెక్షన్ అమల్లో ఉన్న పట్టించుకోని టీడీపీ గూండాలుతునిలో పోలీస్ బందోబస్తు లేదు: దాడిశెట్టి రాజా👉తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.👉ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు👉పిఠాపురం టోల్ గేట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు👉తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడిని అడ్డుకున్న పోలీసులు👉పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తల వాగ్వాదంనేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీపై కూటమి ప్రభుత్వం కక్షసాధిపు చర్యలు దిగుతోంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటుగా మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి, కౌన్సిలర్ల పై అక్రమ కేసు నమోదు చేశారు.దాడిశెట్టి రాజా.. నేడు ఛలో తునికి పిలుపునిచ్చారు. ‘చలో తుని’కి పోలీసుల అనుమతి లేదని. వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ వైఎస్సార్సీపీ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.చలో తుని కార్యక్రమంలో భాగంగా తుని వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునివ్వగా, ఇవాళ తెల్లవారుజామునుంచి జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ ప్రత్తిపాడులో వైఎస్సార్సీపీ నేత మురళీకృష్ణ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.మున్సిపల్ వైస్ ఛైర్మన్-2 ఎన్నికకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఎన్నికల కోసం కలెక్టర్ షాన్ మోహన్‌తో దాడిశెట్టి రాజా మాట్లాడారు. మరికాసేపట్లో మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి నివాసం నుంచి 17 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లనున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాకినాడ ఎఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్రమ కేసులు బనాయింపు, బెదిరింపులను దాడిశెట్టి రాజా ఖండించారు. బీసీ మహిళ అయిన తనపై అక్రమ కేసు బనాయింపుపై మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ⇒కూటమి కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. లేని అధికారం కోసం వెంపర్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా అమలుచేసి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం కాలరాస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలోకి తొక్కి కరెన్సీ కట్టలు, అధికార బలాన్ని వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తుని మున్సిపల్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది.⇒జంటిల్మెన్ ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్–2 పీఠాన్ని పోలీసులను కీలు»ొమ్మలుగా మార్చి రౌడీలు, సంఘవ్యతిరేక శక్తులను వెంటేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలంతా కట్టకట్టుకుని ఎగరేసుకుపోదామని వేసిన ఎత్తులకు పై ఎత్తులను ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నాయకత్వంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. చేసేది లేక చివరకు అధికారబలంతో ఈ నెల 3, 4 తేదీలలో జరగాల్సిన ఎన్నికలను రెండు సార్లు వాయిదా వేయించుకున్నారు.⇒ఇలా రెండు పర్యాయాలు టీడీపీ నేతల కుట్రలు బెడిసికొట్టడంతో మూడోసారి సోమవారం వ్యూహాలకు పదునుపెట్టి వైస్‌చైర్‌పర్సన్ పీఠంపై పాగా వేద్దామని గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రలోభాలకు గురిచేసి అక్రమ మార్గంలో వైఎస్సార్ సీసీ నుంచి 10 మంది కౌన్సిలర్లకు టీడీపీ కండువాలు కప్పి నిస్సిగ్గుగా కౌన్సిల్ హాలులో సమావేశపరిచారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేని టీడీపీ నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనుకున్న తెలుగు తమ్ముళ్ల కుట్రలకు రాజా పక్కా వ్యూహంతో మూడోసారి కూడా చెక్ పెట్టారు. ⇒అడ్డదారిలో తెచ్చుకున్న పది మంది కౌన్సిలర్లను కౌన్సిల్ హాలులో సమావేశపరిచి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్ సీపీ వెన్నంటి నిలిచిన నలుగురు కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువచ్చి కోరం చూపించి వైస్ చైర్పర్సన్ పోస్టు కొట్టేద్దామని పెద్ద ప్లానే వేశారు. రాజకీయంగా పరిణతి చెందిన రాజా టీడీపీ వ్యూహాలను పసిగట్టి గట్టి ఎదురుదెబ్బ కొట్టడంలో ఆ పార్టీ పాచిక పారలేదు. తొలి నుంచి వైఎస్సార్ సీపీ వెంట ఉన్న18 మంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేసైనా కౌన్సిల్లో కోరం సాధించి వైస్ చైర్పర్సన్ పీఠాన్ని తన్నుకుపోవాలని టీడీపీ కుట్ర చేసింది. ఇందులో భాగమే మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి భర్త, కో–ఆప్షన్ సభ్యుడు బాబు సహా పార్టీ నేతలను పోలీసుల బలప్రయోగంతో గృహనిర్బంధం చేశారు.⇒ఈ దురాఘతాలతో కూటమి ప్రభుత్వం తునిలో ఒక రకంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. చివరకు మున్సిపల్ చైర్పర్సన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి సహా పలువురు నేతలపై టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ తదితరులతో దౌర్జన్యాలకు కూడా పురిగొలి్పంది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు కౌన్సిల్‌కు వెళ్లకుండా దీటుగా స్పందించడంతో తెలుగు తమ్ముళ్లు తోక ముడిచారు. రౌడీ మూకలతో నింపేసిన కౌన్సిల్‌హాలులో భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం, కోర్టు చెప్పినట్టు ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుందనే నమ్మకం లేక కౌన్సిలర్లు ఎవరూ వెళ్ల లేదు.⇒తునిలో టీడీపీ జరుపుతోన్న అరాచకాలను నిరసిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు రక్షణ కలి్పస్తేనే మంగళవారం జరిపే ఎన్నికకు రాగలుగుతామని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా జిల్లా యంత్రాంగానికి అల్టిమేటమ్ ఇచ్చారు. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి ‘చలో తుని’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రజా మద్ధతుతో తునిలో అధికారపార్టీ నేతల ఆగడాలు, అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న తీరును ఎండగట్టేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు చలో తునికి సమాయత్తమవుతున్నాయి. ⇒వైస్ చైర్పర్సన్ అందునా జంటిల్మెన్ ఒప్పందంలో రెండున్నరేళ్ల కాలానికి రెండో వైస్ చైర్పర్సన్ పోస్టు నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీదే. ఆ పోస్టు కోసం అధికారపార్టీ నేతలు ఇన్ని రోజులుగా ఇన్ని కుప్పిగంతులు వేయాలా అని విజ్ఞులు ఆక్షేపిస్తున్నారు. ఒకప్పుడులో టీడీపీలో నంబర్–2గా వెలిగిన యనమల రామకృష్ణుడు ఇలాకాలో ఆయన కనుసన్నల్లోనే ఇన్ని రోజులుగా కుట్ర రాజకీయం జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.⇒అసెంబ్లీ స్పీకర్, పీఏసీ చైర్మన్, ఆర్థిక మంత్రి వంటి పదవులు అలంకరించిన యనమల వైస్ చైర్పర్సన్ పోస్టు కోసం ప్రజలు ఒక్క సీటు కూడా కౌన్సిల్లో ఇవ్వకుండా తిరస్కరించినా ఇంతలా దిగజారిపోవాలా అని తుని జనం ఆక్షేపిస్తున్నారు. ఎన్నిక పర్యవేక్షించేందుకు జేసీ రాహూల్మీనాను కలెక్టర్ షన్మోహన్ సగిలి నియమించారు. ఎన్నికల అధికారిగా డీపీఓను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కోరం లేక పోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశామని కలెక్టర్ ప్రకటించారు. -
కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు
-
ముద్రగడ నివాసంపై దాడి ఘటన.. పోలీసుల తీరు వివాదాస్పదం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ, కాపు నాయకులు ఖండించారు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం? -
ఆంధ్రా ఊటీ పెదమల్లాపురం
కొండా కోనల మధ్య ప్రకృతి అందిస్తున్న సోయగాల వనం ఆ గ్రామం. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ గిరిజన గ్రామం చుట్టూ ప్రతి అంగుళం పరవశింపజేస్తుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఎత్తయిన కొండలు, పాములా మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు, చుట్టూ పచ్చటి పచ్చిక బయళ్లు, ఎత్తయిన రెండు కొండల మధ్య పాలసముద్రం పొంగుకొస్తోందా అనేట్టు జాలువారే జలపాతాలు.. ఎటు చూసినా ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసే అందాలే.సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆంధ్రా ఊటీగా పాచుర్యం పొందిన ఈ ప్రాంతం కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురం గ్రామం. దీనికి సమీపంలోని సిద్ధివారిపాలెం గ్రామం పర్యాటకులకు మరింత ప్రత్యేకమైనది. ఈ గ్రామంలోని కొండల నడుమ శబరిమలై తరహాలో అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు. 2009లో అప్పటి రోడ్లు, భవనాల శాఖ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు శంకుస్థాపన చేసిన ఈ ఆలయం 2011లో ప్రారంభమైంది.తొలుత ఆథ్యాత్మిక కేంద్రంగా విలసిల్లి కాలక్రమంలో పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. ఇక్కడికి వెళ్లే దారిలో ఎత్తయిన కొండలు, మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు, పచ్చటి చెట్లు కనువిందు చేస్తాయి. కొత్త అచ్చింపేట ృ గౌరంపేట మధ్యలో అమ్మాయి గొప్పు ఘాట్ పర్యాటకులను కట్టిపడేస్తోంది. కొత్త అచ్చింపేట తర్వాత నిటారుగా పచ్చదనంతో నిండిన నిమ్మలగాడి కొండ, ములుకొండ, దారలలొద్దు కొండలు పర్యాటకులకు స్వర్గధామమే. చూపు తిప్పుకోలేనంతగా ఇక్కడి అందాలు పర్యాటకులన కట్టిపడేస్తాయి. అక్కడి నుంచి ముందుకు వెళితే కొండల మధ్య పాల నురగా జారుతున్నట్లుగా వేళంగి మల్లికార్జున లొద్దు జలపాతం కనువిందు చేస్తుంది. మహాశివరాత్రి నాడు పెద్ద సంఖ్యలో తరలివచ్చే పర్యాటకులు, భక్తులతో ఈ గిరిజన ప్రాంతం పరవశించిపోతోంది.ఇలా వెళ్దాం రండి..చెన్నై- కోల్‌కతా 16వ నంబర్ జాతీయ రహదారికి 20 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య గిరిజన గ్రామం సిద్ధివారిపాలెం ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరానికి 28 కిలోమీటర్ల దూరం. విశాఖపట్నం ృ విజయవాడ మధ్య హైవేపై కత్తిపూడి జంక్షన్ నుంచి కుడి వైపు తిరిగితే శంఖవరం మండలం. 3 కిలోమీటర్లు వెళితే నెల్లిపూడి, అక్కడి నుంచి 6 కిలోమీటర్లు వెళ్తే శంఖవరం వస్తాయి. శంఖవరం నుంచి గొంది కొత్తపల్లి, గౌరంపేట మీదుగా 9 కిలోమీటర్ల దూరంలో అమ్మాయిగొప్పు ఘాటీ వస్తుంది. 200 మీటర్ల ఎత్తులో ఉండే అమ్మాయిగొప్పు కొండను చూస్తే పర్యాటకులు ఆ కొండ మీద పడిపోతుందేమోననే అనుభూతి చెందుతారు. దీనికి సమీపంలోనే నిమ్మలగాడి కొండ. అక్కడి నుంచి కుడివైపు వెళితే సిద్ధివారిపాలెం అయ్యప్పస్వామి ఆలయం దర్శనమిస్తుంది. నిమ్మలగాడి కొండ నుంచి సిద్ధివారిపాలెం వరకూ 2 కిలోమీటర్లు పుంత రోడ్డు. కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లొచ్చు. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు వెళితే పెదమల్లాపురం వస్తుంది. ఇక్కడికి 2.2 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య వేళంగి మల్లికార్జున ధార జలపాతం కనిపిస్తుంది.అభివృద్ధి చేయాలిపెదమల్లాపురానికి నిత్యం వందల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు సిద్ధివారిపాలెంలోని ఆంధ్రా శబరిమలై దేవస్థానంతో పాటు పరిసర ప్రాతాల్లోని జలపాతం వంటి ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి. అప్పుడు పర్యాటకులు మరింతగా పెరుగుతారు. - పాము రాములమ్మ, సిద్ధివారిపాలెం, శంఖవరం మండలంరోడ్లు విస్తరించాలినిత్య వందలాదిగా వస్తున్న పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి రోడ్లు వెడల్పు చేయాలి. ఈ ప్రాంతంలో ప్రకృతిని ఆస్వాదించే సుందర ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఎత్తయిన కొండలు, చూడచక్కని జలపాతం, పచ్చని చెట్లు, చూసేకొద్దీ చూడాలనిపించే అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రభుత్వం దృష్టి పెడితే ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది. -చొప్పా శ్రీను, జి.కొత్తపల్లి -
జనసేన నేతల బరితెగింపు
-
విహార యాత్రలో విషాదం
-
ఈ సంక్రాంతి.. పచ్చ నేతలకే పండగ.. ప్రజలకు కాదు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: గత సంక్రాంతికి ఈ ఏడాది పండగకు చాలా వ్యత్యాసం ఉందని.. గత ఏడాది సంక్రాంతికి ప్రతి కుటుంబాన్ని వైఎస్ జగన్ చేయి పట్టుకుని నడిపించారని.. ఈ సంక్రాంతికి చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పేదల పండగ కాదు.. పచ్చ నేతల పండగ అంటూ దుయ్యబట్టారు. పేదల జేబుల్లో డబ్బుల్లేవు.. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. కూటమి నేతలు తరిమేసినవారు పండక్కి రావడానికి భయపడుతున్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం లేదు’’ అని కన్నబాబు చెప్పారు. ఈ సంక్రాంతికి చంద్రన్న కానుక పథకం ఏమైంది?. కూటమి నేతలకే పండగ.. ప్రజలకు కాదు. ఇష్యూ వస్తే డెవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌ను తిట్టడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారు. తిరుపతి తొక్కిసలాట చూసి కూటమి నేతలు సిగ్గుపడాలి. తిరుపతి తొక్కిసలాట కూటమి ప్రభుత్వ వైఫల్యం కాదా?. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమాపణ అన్నట్లు బీఆర్ నాయుడు మాట్లాడారు. తిరుపతి తొక్కిసలాటపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. తిరుమల ప్రసాదంపై కూడా దుష్ప్రచారం చేశారు. వెంకన్న స్వామిని రాజకీయాల్లోకి లాగితే ఫలితాలు ఇలానే ఉంటాయి’’ అని కన్నబాబు వ్యాఖ్యానించారు.‘‘భక్తుల ఫోన్ నంబర్లతో కూటమి ప్రభుత్వానికి ఏం పని?. చంద్రబాబు మనుషులు చేసే తప్పులకు భక్తులు బలైపోతున్నారు. టీటీడీ సమావేశంలో ప్రైవేట్ వ్యక్తులకు ఏం పని?. సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలు ప్రైవేట్ వ్యక్తులపై ఎందుకు మాట్లాడటం లేదు?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..! -
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
రెచ్చిపోయిన పచ్చ మూకలు.. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులతో దాడి
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన గుండుబిల్లి నానాజీపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నానాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే గ్రామంలోనక్కా మాణిక్యం, గడి దివాణం అనే మరో ఇద్దరిపైనా టీడీపీ నేతలు దాడికి దిగారు. కాకినాడ రూరల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నానాజీ చికిత్స పొందుతున్నారు.నిన్న(శుక్రవారం) జరిగిన వైఎస్సార్సీపీ పోరుబాటలో పాల్గొనేందుకు ప్రత్తిపాడు వెళ్తుండుగా రెండు చోట్ల దారి కాచి పచ్చమూక దాడులకు తెగబడ్డారు. దాడికి పాల్పడిన తొమ్మిది మందిపై అన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది. మండపంలో పోలీస్ పహరామండలంలోని మండపం గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలపై కూటమి నేతల దాడి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. దాడుల కారణంగా గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. కూటమి నేతల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేతలకు అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్యపడవద్దని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ముద్రగడ గిరి అన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీపీ పర్వత రాజుబాబు బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఇదీ చదవండి: పోలీసుల ఓవరాక్షన్.. వైఎస్సార్సీపీ పోరుబాటపై అక్రమ కేసులు -
వరుడికి 25, వధువుకి మాత్రం..!
విరిసీ విరియని.. తెలిసీ తెలియని వయస్సులోనే పసిమొగ్గలకు ‘మాంగల్యం తంతునానేనా..’ అంటున్నారు.. యుక్త వయస్సు రాకుండానే తాళిబొట్టు మెడలో వేయించేస్తున్నారు.. కొద్ది నెలలకే తల్లులవుతున్న ఆ అమ్మాయిలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.. అవగాహనా రాహిత్యమో.. గుండెల మీద కుంపటి దింపేసుకోవాలనే అమాయకత్వమో తెలీదు కానీ.. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా జరుగుతున్న బాల్య వివాహాలు కలవరపెడుతున్నాయి.రాజానగరం: యుక్త వయస్సు రాకుండా బాల్య దశలోనే వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరం, అయినప్పటికీ వీటిని నిరోధించడంలో తరచూ అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు, తీసుకుంటున్న చర్యలు ప్రకటనలకే పరిమితమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాలే దీనికి సాక్షిగా నిలుస్తున్నాయి. మండలంలోని భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, కొత్తతుంగపాడు, పాతతుంగపాడు తదితర గ్రామాల్లో తరచుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అవగాహన లేకనో.. ఓ పనైపోతుందనే ఉద్దేశమో కానీ.. యుక్త వయస్సు రాకుండానే కొంత మంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు వివాహాలు చేసి, అత్తారిళ్లకు పంపించేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా.. కొత్త తుంగపాడు గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు దొడ్డ మణికంఠ, 16 సంవత్సరాల బాలిక పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. వరుడు రోజువారీ పనులు చేస్తూండగా.. వధువును ఆమె తల్లిదండ్రులు 9వ తరగతి వరకూ చదివించి, మానిపించేశారు. ఇంటి వద్దనే ఉంటున్న ఆ బాలికతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకూ వెళ్లింది. వారి వివాహానికి బాలిక తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదు. అయితే, అతడు లేకపోతే తాను బతకలేనంటూ ఆ బాలిక తరచూ అతడి ఇంటికి వెళ్లి వస్తూండేది. ఈ నేపథ్యంలో ఇరువైపుల పెద్దలు అయిష్టంగానే వారిద్దరికీ గుట్టు చప్పుడు కాకుండా బుధవారం రాత్రి ముక్కినాడ గ్రామంలోని దేవాలయంలో సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. ఆపై వారిద్దరినీ తిరుపతి పంపించేశారు. అధికారులకు తెలియకుండా ఇరు వర్గాల పెద్దలు ఈ వివాహం జరిపించినా.. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బాల్య వివాహం గుట్టు రట్టయింది. గతంలోనూ.. ⇒ మండలంలోని పలు గ్రామాల్లో గతంలో కూడా ఇదేవిధంగా బాల్య వివాహాలు జరిగాయి. ⇒ పుణ్యక్షేత్రం గ్రామంలో గత ఏడాది అధికారులను బురిడీ కొట్టించి మరీ ఇరు వర్గాల పెద్దలకు బాల్య వివాహం జరిపించేందుకు ప్రయత్నించారు. దీనిపై స్థానిక అంగన్వాడీ కార్యకర్తల నుంచి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే పోలీసులతో కలిసి ఆ గ్రామానికి చేరుకుని, బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. యుక్త వయస్సు రాకుండా పిల్లలకు వివాహం చేయబోమంటూ పెద్దల నుంచి రాతపూర్వకంగా హామీ కూడా తీసుకున్నారు. అంతటితో తమ డ్యూటీ అయిపోయిందని సంబరపడుతూ వెనుదిరిగిన అధికారులు ఆ మర్నాడు అందుకున్న మరో సమాచారంతో షాకయ్యారు. రాతపూర్వక హామీ ఇచ్చిన పెద్దలే.. తమ పిల్లలను వేరొక ప్రాంతానికి తీసుకువెళ్లి, వివాహం చేశారని తెలిసి నిర్ఘాంతపోయారు. ⇒ గడచిన నాలుగేళ్లలో భూపాలపట్నంలో 4, పుణ్యక్షేత్రంలో 6, కొత్తతుంగపాడులో 9, పాతతుంగపాడులో 6 బాల్య వివాహాలు జరిగినట్లు సమాచారం. చట్టం ఏం చెబుతోందంటే.. బాల్య వివాహాలను అరికట్టేందుకు స్వాతంత్య్రం రాక ముందు నుంచే చట్టాలున్నాయి. మొదటిసారిగా 1929లో చైల్డ్ మ్యారేజ్ రి్రస్టిక్ట్ యాక్ట్‌ను బ్రిటిష్ వారు తీసుకువచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్–2006 రూపొందించారు. దీని ప్రకారం 18 సంవత్సరాలలోపు అమ్మాయిలు, 21 సంవత్సరాలోపు అబ్బాయిలను బాలల కిందే పరిగణిస్తారు. ఈ యాక్ట్ ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారి తల్లిదండ్రులతో పాటు ఆ సమయంలో అక్కడున్న వారు, వివాహ తంతు జరిపించే వారు (ప్రోత్సహించినట్టుగా భావిస్తారు) కూడా శిక్షార్హులే అవుతారు. వీరికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. దీనిలో నేరస్తులైతే బెయిల్ కూడా లభించదు.అధికారుల నిర్లక్ష్యమే కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొత్తతుంగపాడులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలకు, గ్రామ కమిటీకి విషయం ముందుగా తెలిసినా కానీ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. బాల్య వివాహం జరుగుతున్న సమాచారాన్ని పై అధికారులకు సకాలంలో ఇవ్వడం లేదు. బుధవారం రాత్రి జరిగిన బాల్య వివాహం గురించి, తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేశాను. – యాళ్ల మాచరయ్య, కొత్తతుంగపాడు ఫలితమివ్వని గ్రామ కమిటీలు బాల్య వివాహాలను నిరోధించండి.. అమ్మాయిల జీవితాలను కాపాడండి.. అంటూ ఎంతగా ప్రచారం చేస్తున్నాగానీ, ప్రజల్లో సరైన స్పందన రావడం లేదు. వీటిని ఏవిధంగానైనా అరికట్టాలనే ఉద్దేశంతో గ్రామ మహిళా కార్యదర్శి (పోలీసు), ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, అంగన్వాడీ కార్యకర్తలతో గ్రామ కమిటీలు కూడా వేశాం. అయినప్పటికీ బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం ముందుగా అందడం లేదు. స్థానికంగా ఉండే మొహమాటాలతో తమ ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతోందని తెలిసి కూడా చూసీ చూడనట్లు వదిలేసి, తెలిసీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. – టి.నాగమణి, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం, రాజానగరం -
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. కుక్కుటేశ్వర స్వామి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరాలో పురుగులు దర్శనమివ్వడంతో భక్తుడు షాక్ అయ్యారు. ప్రసాదంలో కనిపించిన పురుగులపై దేవస్ధానం అధికారులను భక్తులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాదగయాలో నాసిరకం వస్తువులతో ప్రసాదం తయారీ అవుతోంది.కాగా.. గత నెలలో హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు. కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్‌ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
కాకినాడ జిల్లా: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. ముగ్గురి మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం జరిగింది. ఇంటి స్థలం విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై మరో కుటుంబం దాడి చేసింది. ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఏం జరిగిందంటే?గ్రామంలోని ఎస్సీపేట చెరువు సమీపంలో పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబం ప్రయత్నించింది దీంతో ఇరువురి కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రకాశ్‌రావు అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రరావు, ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన సంజీవ్, పండు, దావీదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజల తరఫున గొంతెత్తాలి.. సర్కార్‌పై ఒత్తిడి తేవాలి: బొత్స
సాక్షి, కాకినాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?.. పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగా గీతా, చింతా అనురాధ హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ‘‘విద్యార్థులు, రైతులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఈ నెల 27న విద్యుత్ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఉద్యమిస్తాం’’ అని బొత్స తెలిపారు. -
చంద్రబాబు రైతు ద్రోహి.. సెజ్‌పై విచారణ చేయాల్సిందే: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అధికారానికి ముందు ఒక మాట.. అధికారం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం అలవాటేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులను సెంట్రల్ జైల్లో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చంద్రబాబు సర్కార్‌కు అనుకూలంగా ఒక మీడియా దర్మార్గమైన ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు...2003లో పరిశ్రమల కోసం భూములను సేకరించారు. వైఎస్సార్ హయాంలో ఎస్ఈజడ్ కోసం 10 వేల ఎకరాలు సేకరించే ప్రయత్నం చేశారు. 8,150 ఎకరాల్లో జీఎంఆర్ ఈ భూములు సేకరించింది. సెజ్‌లో రైతులు దీనిని వ్యతిరేకించారు. ఉద్యమం ప్రారంభించిన సేకరణ ఆగలేదు. 2012లో చంద్రబాబు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములు వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ కూడా చంద్రబాబు మాటలు నమ్మింది. 2014 తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అపరిచితుడులా మారిపోయారు.రైతుల భూములను, ఎస్సైన్ లాండ్లను తిరిగి తీసేసుకుని సెజ్‌కి ఇచ్చేశారు. పోరాట కమిటీ నాయకులను పోలీసులతో వేధించి అక్రమ కేసులు పెట్టారు. 2018లో సెజ్ ఉద్యమం తీవ్రమైంది. సెజ్ పోరాట కమిటీ నాయకులను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. జైలులో బాత్ రూమ్‌లు రైతులతో కడిగించారు. భూములు ఇవ్వాలని రైతులపై తీవ్రమైమ ఒత్తిడి తెచ్చారు. కార్పోరేట్ కంపెనీలకు కొమ్ముకాసిన చరిత్ర చంద్రబాబుది. సెజ్‌కు భూములు ఇవ్వని రైతులకు తిరిగి ఇచ్చేస్తామని పాదయాత్రలో జగన్ పోరాట కమిటీ ఇచ్చారు. 2180 ఎకరాలు తిరిగి ఇచ్చేయాలని నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తీర్మానం చేసింది. రైతుల నుంచి భూములు లాక్కోవడం తప్పా.. ఆ భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం తప్పా. చంద్రబాబు ఒక్కడే నీతి మంతుడిలా మీడియా చూపిస్తుందిరైతులను దారుణంగా వేధించారు: దాడిశెట్టి రాజామాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, తన బినామీ అయినా కేవీరావు ద్వారా 2003లోనే చంద్రబాబు సెజ్‌లో భూ సేకరణ చేశాడు. మొట్ట మొదటిగా భూములు రిజిస్ట్రేషన్ చేసింది అప్పటి తుని ఎమ్మెల్యేగా ఉన్న యనమల రామకృష్ణుడు. దీంతో రైతులు కూడా భూములు ఇవ్వాల్సి వచ్చింది. సెజ్ భూసేకరణ ద్వారా లాభపడింది యనమల రామకృష్ణుడు. 2014 లో చంద్రబాబు సీఎం అయిన వెంటనే దీవిస్ వంటి రసాయన పరిశ్రమలకు అనుమతి ఇచ్చాడు. దీవీస్ కోసం పోరాడిన రైతులను పోలీసులతో దారుణంగా వేధించాడు. 2180 ఎకరాల భూములను సెజ్ నుండి రైతులకు వైఎస్ జగన్ తిరిగి ఇచ్చారు. రైతులకు భూములు తిరిగి ఇచ్చిన జగన్ మంచివారా.. భూములు ఇవ్వాలని రైతులను హింసించిన చంద్రబాబు గొప్పవాడా?. 2003 నుండి జరిగిన భూ సేకరణ పై విచారణ చేయాలి. సెజ్‌లో జరిగిన అవకతవకలు బయట పెట్టాలి’’ ఆయన డిమాండ్ చేశారు.రైతులను చంద్రబాబు అవమానించారు.. జగన్ గౌరవించారు: వంగా గీతవంగా గీతా మాట్లాడుతూ.. సెజ్ గురించి 2003 నుంచి 2024 ఏం జరిగిందని రికార్డెడ్‌గా ఉంది. సెజ్‌లో భూముల కోసం పోరాడిన రైతులు ఉన్నారు. ఏరువాక చేసి సెజ్ భూములు వెనక్కి వస్తాయని చంద్రబాబు మోసం చేశారు. సీఎం అయిన వెంటనే రైతులను బెదిరించి చంద్రబాబు అవమానించారు. ఇప్పుడు మళ్లీ సెజ్ నుంచి ఏం ఆశించి అసత్య ప్రచారం మొదలు పెట్టారు. రైతుల ఉద్యమాన్ని వైఎస్ జగన్ గౌరవించారు.సెజ్‌లో ఉన్న ఆరు గ్రామాల ప్రజలు అక్కడే ఉండేలా చేశారు. 2180 ఎకరాల్లో చాలా భూములు రైతులకు తిరిగి వెళ్లిఫొయాయి. మిగిలిన భూములు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వద్ద నిలిచిపోయాయి. వాటిని చంద్రబాబు సర్కార్ క్లీర్ చేసి ఆ భూములను వెనక్కి ఇవ్వాలి. సెజ్ మీద మళ్లీ ఎందుకు అబద్దపు ప్రచారం మొదలు పెట్టారు. సెజ్ మీద ఏదో కుట్ర కోణం ఉంది?. సెజ్‌పై విచారణ వేయాలి. 2003 నుంచి 2024 నుంచి ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. సెజ్ రైతుల సెంటిమెంట్‌ను వైఎస్ జగన్ గౌరవించారు. సెజ్‌ను రాజకీయం చేయడంలో అసలు కథ ఏంటో ప్రజలకు తెలియాలి -
మళ్లీ మొదటికొచ్చిన ‘సీజ్ ది షిప్’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘సీజ్ ది షిప్’ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మల్టీ డిస్ ప్లయినరీ కమిటీతో స్టెల్లా ఎల్ వన్ నౌకలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో తమ అనుకూల మీడియాకు మాత్రమే కూటమి సర్కార్ అనుమతిస్తోంది.పోర్ట్ అథారిటీ అధికారంతో స్టెల్లా నౌకను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే అంతర్జాతీయ షిప్‌ను సీజ్ చేసే విషయంలో అధికారులు తర్జనభజర్జన పడుతున్నారు. ఐదు రోజుల క్రిందట "సీజ్ ద షిప్" అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సముద్రంలో ఉన్న కెన్ స్టార్ నౌకను పరిశీలించకుండా పవన్ వచ్చేశారు.ఇదీ చదవండి: డైవర్షన్ క్లాప్.. ఫ్లాప్ బాబు స్క్రిప్ట్ బోల్తాతమ వియ్యంకుడు బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తారంటూ పట్టాభి అగ్రో ఫుడ్ అధినేత కే.వి.కృష్ణారావు గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు. తాజాగా కాకినాడ పోర్టు నుండి పట్టాభి అగ్రో ఫుడ్ చెందిన రా రైస్ (పచ్చి బియ్యం) విదేశాలకు ఎగుమతి అవుతోంది. "బిరస్ బుల్లోగ్" ప్యాకింగ్‌తో పచ్చి బియ్యాన్ని ఎంవీడీడీఎస్ మరీనా నౌకలోకి ఎగుమతి చేస్తున్నారు. ఇండోనేషియాకు 12 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని పట్టాభి అగ్రో ఫుడ్ సంస్థ ఎగుమతి చేస్తోంది.ఇదీ చదవండి: పవన్ ‘న్యూట్రల్’ గేర్! -
పిఠాపురం: ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైంది. 15 రోజుల క్రితం కళాశాలకు వెళ్లిన కొడవలి గ్రామానికి చెందిన వరలక్ష్మీ(16) మిస్సింగ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో విద్యార్థిని ఇంటర్ ఫస్ట్‌యర్ చదువుతోంది.తొలుత గొల్లప్రోలు పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి తల్లిదండ్రులతో పోలీసులు హేళనగా మాట్లాడారు. దీంతో గత నెల 22న ప్రత్తిపాడు పీఎస్ లో వరలక్ష్మీ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. వరలక్ష్మీ ఆచూకీ తెలియక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె జాడ కోసం సాయం చేయాలని వరలక్ష్మీ తల్లిదండ్రులు పవన్‌కు లేఖ రాశారు. -
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా, జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆ చెక్కు అందజేశారు.కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: వంగా గీతఅనంతరం పిఠాపురంలో జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వంగా గీతా మండిపడ్డారు. మహిళలకు భద్రత, ధైర్యం కల్పించాలని వంగా గీత అన్నారు. వైఎస్సార్సీపీని సంస్ధగతంగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇచ్చినా హమీలను అమలు చేయలేదు. ఇచ్చిన హమీలను నూరు శాతం వైఎస్ జగన్ అమలు చేశారు. కూటమి సర్కార్.. ప్రజలను నమ్మించి హమీలు అమలు చేయకపోవడం అన్యాయం’’ అని ఆమె దుయ్యబట్టారు.మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ: కురసాల కన్నబాబుప్రజలకు మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ. నేరుగా ప్రజలకు సేవలందించాలని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశమంతా చూసేలా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చంద్రబాబులా అబద్దపు హమీలు జగన్ ఇవ్వలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కులం, మతం చూడకుండా అర్హులకు పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీదే. చంద్రబాబూ.. రుషికొండ ప్యాలెస్ కాదు.. పలాసలో నిర్మించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ చూడండీ. పాడేరులో కట్టిన మెడికల్ కళాశాల.. ఉప్పాడలో కట్టిన ఫిషింగ్ హర్బర్‌ను కూడా చూడాలి...అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. పోలీసుల పని తీరు ఏలా ఉందో చెప్పారు. ఇసుక, శాంతి భద్రతల సమస్యలు నాకు సంబంధం లేదంటే కుదరదు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎక్కడపడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. అయినా పోలీసులు పని బాగోలేదని కూటమి నాయకులు చెబుతున్నారు. గోతులు పూడ్చడానికి కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు ప్రచారం పీక్‌లో ఉంటుంది. వాస్తవం కింద ఉంటుంది.ఇదీ చదవండి: నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా? -
పండుగ వేళ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: దీపావళి పండుగ వేళ కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాజులూరు మండలం సెలపాకలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. బత్తుల కుటుంబీకులపై పొట్లకాయ ఫ్యామిలీ కత్తులతో దాడి చేశారు. దీంతో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందారు.మృతులు బత్తుల రమేష్, రాజు, చిన్నిగా గుర్తించారు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారు. గాయపడ్డ నాలుగో వ్యక్తిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్ విచారిస్తున్నారు. సెలపాక గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. -
ఎమ్మెల్యే కొండబాబు అలక.. శంకుస్ధాపనకు డుమ్మా
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అలక బూనారు. బయో మెథనేషన్ ప్లాంట్ శంకుస్ధాపనకు డుమ్మా కొట్టారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరుకాగా, ఎమ్మెల్యే కొండబాబు రాకపోవడంతో శంకుస్ధాపన, భూమి పూజకు ఆయన దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు లేకుండానే ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీతో కలిసి మున్సిపల్ కమిషనర్ భావన ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్లాంట్‌కు మున్సిపల్ కార్పొరేషన్ రెండెకరాల స్ధలం కేటాయించింది. ప్లాంట్‌కు మున్సిపల్ కమిషనర్ భావన భూ కేటాయింపు చేయడంపై ఎమ్మెల్యే కొండబాబు గుర్రుగా ఉన్నారు. ‘‘నాకు తెలియదు.. నన్ను పిలవకండీ" అంటూ కొండబాబు చెప్పారంటూ చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా మున్సిపల్ కమిషనర్ భావన, సిటీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ కొనసాగుతోంది. -
రెండు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రెండు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్ నియమితులయ్యారు.జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్‌రామ్‌లను నియమించారు.కాగా, పార్టీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న(శుక్రవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: కల్తీ.. బాబు సృష్టే -
డాక్టర్‌పై దాడి.. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదైంది. నానాజీతో పాటు అనుచరులపై బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంతం నానాజీ పై చిన్న చిన్న సెక్షన్లతో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.డా.ఉమామహేశ్వరరావుపై పంతం నానాజీ దౌర్జన్యానికి పాల్పడటంతో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పంతం నానాజీని చేర్చగా, కేసు వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.నానాజీపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు సాయంత్రం ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు డా.ఉమామహేశ్వర రావు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నిన్న(సోమవారం) ప్రాయశ్చిత దీక్ష అంటూ ఎమ్మెల్యే నానాజీ కొత్త నాటకానికి తెరలేపారు.ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడికాగా, రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిచింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. -
AP: గోదావరి నదిలో భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో స్థానికులు
సాక్షి, కాకినాడ జిల్లా: గోదావరి నదిలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కొనసాగుతోంది. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్జీసీ పైపు లైన్ లీక్ కావడంతో గ్యాస్ నదిలో పొంగుతూ బుడగలుగా బయటకు వెళ్తుంది. లీకేజీని ఆపేందకు ఓఎన్జీసీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా లీకేజీ అదుపులోకి రావడం లేదు.యానాం దరియాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది ముఖ ద్వారానికి సమీపంలో గ్యాస్ లీకేజీ కావడంతో గోదావరి, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకం కానుందని గ్యాస్ లీకేజీపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే! -
మరోసారి దాతృత్వం చాటుకున్న వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం కాశీవారి పాకలు గ్రామానికి చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు.గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారన్న అక్కసుతో లోవలక్ష్మి, శ్రీలక్ష్మి ఇళ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు.. తిరిగి బాధితులపైనే పోలీసు కేసులు పెట్టించారు. ఇటీవల ఏలేరు వరద పర్యటనలో భాగంగా ముంపు ప్రాంతాలకు వెళ్లిన వైఎస్ జగన్‌ను కలిసిన బాధితులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో చలించిపోయిన వైఎస్ జగన్.. బాధితులకు ఆర్థిక సాయంతో పాటుగా వారి పక్షాన న్యాయ పోరాటం కోసం లీగల్ టీమ్ ఏర్పాటు చేశారు. బాధితులకు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా చెక్కులు అందజేశారు.ఇదీ చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’ -
కాకినాడ జిల్లాను ముంచెత్తిన ఏలేరు
-
ఏలేరు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలం అయిన మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా రైతులను అడిగి తెలుసున్నారు.వరద బాధితుల్ని కలిసి వాళ్లకు కలిగిన కష్టం.. జరిగిన నష్టం గురించి తెలుసుకుని జగన్ ఓదార్చారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కనీసం పునరావాస కేంద్రాలకు కూడా తరలించలేదని బాధితులు జగన్ వద్ద వాపోయారు. ఈ విషయంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: పవన్‌కు పెద్దగా ఏమీ తెలియదు: వైఎస్ జగన్ ఇక.. జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం రమణక్కపేటకు జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ముంపునకు గురైన పంటపొలాలను ఆయన పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడతారు. ఈ పరామర్శలో జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జి వంగా గీత, స్థానిక నేతలు ఉన్నారు.ఇదీ చదవండి: బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. -
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్‌కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
ప్రత్తిపాడు సర్కిల్ అ‘ధర’హో
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ‘త్రీ స్టార్’ రేటింగ్ అదిరిపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వేలం వేసి మరీ పోస్టులు ఖాయం చేశారు. ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఓ సర్కిల్ పోస్టు అర కోటికి ఖరారు కాగా.., ఇప్పుడు ప్రత్తిపాడు సర్కిల్ రూ. 30 లక్షలకు బేరం కుదిరినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో ప్రత్తిపాడు సర్కిల్ హాట్ సీటు. ఈ సర్కిల్ కోసం కొందరు ‘త్రీ స్టార్’లు ఓ నాయకుడి చుట్టూ నెల రోజులుగా తిరగ్గా.. గురువారం పోస్టు భర్తీ అయ్యింది. ప్రత్తిపాడుతో పాటు తుని, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో త్రీ స్టార్ రేటింగ్ అదిరిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి చూడలేదని పోలీసులే విస్తుబోతున్నారు.సర్వం షాడో ఎమ్మెల్యేనే..ఇటీవలి ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి అన్నీ తానై వ్యవహరించి, ఇప్పుడు ఎమ్మెల్యేకు షాడోగా వ్యవహరిస్తున్న నాయకుడే పోలీసు బదిలీలు అన్నింటినీ ఫైనల్ చేస్తున్నారు. ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఒక సర్కిల్ పోస్టును రూ.అర కోటికి ఖాయం చేశారు. ఈ పోస్టు కోసం ఇద్దరు ముగ్గురి మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. చివరకు తన సర్వీసులో ఎక్కువ కాలం కాకినాడలోనే పనిచేసిన ఓ ‘త్రీ స్టార్’ అడిగినంతా ఇచ్చుకుని పోస్టు ఎగరేసుకుని పోయారు. ఇప్పుడు ప్రత్తిపాడుకు రూ. 10 లక్షల నుంచి మొదలై రూ.30 లక్షలకు ఖరారైంది. అందుకే అంత ధర!నాలుగు స్టేషన్లు ఉన్న ప్రత్తిపాడు సర్కిల్ అధికారులకు ఆయిల్ మాఫియా నుంచి నెల నెలా రూ.లక్షల్లో రాబడి వస్తుంది. మిగతా ఆదాయమూ పెద్దగానే ఉంటుంది. గతంలో ఈ ప్రాంతంలో ఎస్ఐగా పనిచేస్తూ కల్తీ ఆయిల్ వ్యవహారంలో రూ.లక్షలు లంచం తీసుకొని ట్యాంకర్‌ను వదిలేసి, సస్పెండైన ఓ పోలీసు అధికారి, గుప్త నిధుల వ్యవహారంలో దొంగ సొమ్మునే దోచేసి చివరకు అసలు నిందితుడు పట్టుబడడంతో 2020లో సస్పెండైన మరో అధికారి కూడా ప్రత్తిపాడు కోసం ప్రయత్నించారు. ఇక కాకినాడ సిటీ నియోజకవర్గంలో మూడు, రూరల్‌లో రెండు, పెద్దాపురం నియోజకవర్గంలో ఒక సర్కిల్ పోస్టుకు ఒక్కో దానికి రూ.20 లక్షలు పైనే బేరం పెట్టినట్లు సమాచారం. -
కాకినాడ జిల్లాలో మందుబాబు హల్చల్
-
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్య
కాకినాడ, సాక్షి: టార్గెట్ వైఎస్సార్సీపీతో కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలను కొనసాగిస్తోంది. ఆ పార్టీ నేతల దగ్గరి నుంచి సానుభూతిపరులదాకా, చివరకు ఓటర్లపైనా భౌతిక దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు ఆన్లైన్ వేదికగానూ వేధింపులకూ తెగబడుతోంది. ఈ వేధింపులు భరించలేక కాకినాడలో వైఎస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో వేట్లపాలెం 10వ వార్డు మెంబర్‌గా వైఎస్సార్సీపీ నేత బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ఉన్నాడు. అయితే.. గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పి ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ ఆయనకు వేధింపులు పెరిగిపోయాయి. దీంతో భరించలేని ఆయన తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్యనారాయణ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే స్థానిక వైఎస్సార్సీపీ నేతలు సత్యనారాయణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల వాంగ్మూలం సేకరిస్తున్నారు. -
రాజకీయాల్లో ముద్రగడ లాంటి వాళ్లు అరుదు: అంబటి
సాక్షి, కాకినాడ: రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు అరుదుగా ఉంటారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాపుల కోసం.. కాపు రిజర్వేసన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం కలిశారు.అనంతరం అంబటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ.. తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదని అన్నారు. కాపునాడు సమావేశం సమయంలో టీడీపీకి రాజీనామా చేసి ఆ సమావేశానికి ముద్రగడ వచ్చారని తెలిపారు. ఆ సమయంలో వంగవీటి జైలులో ఉన్నారని, కేవలం ఒక సవాల్‌ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారని పేర్కొన్నారు. పేరు మారినా.. ముద్రగడ.. ముద్రగడేనని, అందుకే ఆయన్ను అభినందించాలని కిర్లంపూడి వచ్చినట్లు చెప్పారు. -
వాలంటీర్లు వద్దట!.. జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ జిల్లా: వాలంటీర్లపై తమ అసలు రంగును టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. వాలంటీర్ల సేవలు అవసరం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పేశారు. వాలంటీర్లు వద్దని టీడీపీ లేజిస్లేటివ్ సమావేశంలో చెబుతా.. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి నియమించుకోవాలన్న జ్యోతుల నెహ్రూ.. సచివాలయ ఉద్యోగులకు కాపలా కుక్కల్లా ఏన్డీఏ కార్యకర్తలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.కాగా, ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్‌గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. -
వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని తొలగిస్తాం
కాకినాడ రూరల్: కాకినాడ నగరం 49వ డివిజన్లోని పైడా వారి వీధి రాజేశ్వరి నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 452(1) అండ్ 461(1) ఆఫ్ ఏపీఎంసీ యాక్ట్, సెక్షన్ 89 (1అండ్2), రెడ్ విత్ సెక్షన్ 82, 90(1) ఆఫ్ ఏపీఎంఆర్ అండ్ యూడీఏ యాక్ట్–2016 కింద నిర్మాణంలో ఉన్న భవనానికి ఆదివారం నోటీసులు అతికించారు. తదుపరి నిర్మాణాన్ని తక్షణం ఆపివేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబును ఆదేశించారు. అనధికార నిర్మాణాన్ని ఎందుకు తొలగించకూడదో తగిన కారణం చూపాలని నోటీసులో పేర్కొన్నారు. కన్నబాబు లేదా ఆయన అనుమతి పొందిన వారి ద్వారా ఏడు రోజుల్లో రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలన్నారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కడియాల శ్రీరమ్య డిజిటల్ సిగ్నేచర్‌తో ఈ నోటీసు జారీ అయ్యింది. దీనిపై టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ హరిదాస్‌ను వివరణ కోరగా, అనుమతి కోసం దరఖాస్తు చేశారని.. అప్రూవల్ అవ్వలేదన్నారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులు కడప కార్పొరేషన్ : వైఎస్సార్ జిల్లా కడపలోని రామాంజనేయపురంలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్లాన్ అప్రూవల్ లేకుండా నిర్మిస్తున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కార్యాలయం వద్ద గోడలకు నోటీసులు అంటించారు. పోస్ట్ ద్వారా కూడా నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. -
టీడీపీ సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు
ఈసారి తెలుగుదేశం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్లకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లందరికీ చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని కూటమి నుంచి గెలిచి మంత్రి పదవి తీసుకున్న ఆ నేత వల్ల వీరిద్దరి ఆశలకు గండి పడింది. ఇక పదవులు వస్తాయన్న నమ్మకమే లేకుండా పోయిందట వారిద్దరికీ. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?కాకినాడ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని నాయకలు. 2014లో పెద్దాపురం నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచిన చినరాజప్ప డిప్యూటీ సిఎం హోదాలో హోం మంత్రిగా పని చేశారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు..ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో రాజప్ప..నెహ్రూ మరోసారి గెలిచి.. టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తరపున ఆ పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంతో రాజప్ప, నెహ్రూ ఆశలకు గండి పడింది.పవన్‌కల్యాణ్.. నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలది ఒకే సామాజికవర్గం కావడంతో.. సామాజిక సమీకరణాలతో చంద్రబాబు వీరిద్దరని దూరం పెట్టారు. అనేక మంది సీనియర్లతో పాటే వీరిద్దరికి కూడా పదవులు దక్కలేదు. అందుకే ఇద్దిరికీ నిరాశ ఎదురైంది. జ్యోతుల నెహ్రూకు మంత్రి కావాలని ఎప్పటి నుండో ఉన్న ఓకోరిక. అయితే జిల్లా టీడీపీని తన చేతుల్లో ఉంచుకున్న యనమల రామకృష్ణుడుతో ఉన్న రాజకీయ వైరం కారణంగా జ్యోతుల నెహ్రూ కల సాకారం కాలేదు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తన కల సాకారం అవుతుందని ఆయన భావించారు. కాని పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి జ్యోతుల మంత్రి పదవి కల.. కలగానే మిగిలిపోయింది.ఈ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పది మందికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వీరితో పాటు రెండు మూడు సార్లు గెలిచిన మరో ఏడుగురికి కూడా తొలిసారి క్యాబినెట్ బెర్త్‌లు దక్కాయి. మరి కాకినాడ జిల్లాలోని జ్యోతుల నెహ్రూ కల ఎప్పటికైనా తీరుతుందా అనే చర్చ జరుగుతోంది. -
ఉప్పాడలో ‘అల’జడి
కొత్తపల్లి : రెమాల్ తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద కడలి కల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం కోతకు గురవుతోంది.కెరటాల తాకిడికి యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు కడలిలో కలిసిపోతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అలల తాకిడికి జియోట్యూబ్ రక్షణ గోడ రాళ్లు సైతం గ్రామంలోకి వచ్చి పడ్డాయి. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. -
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
-
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
-
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
-
నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పిఠాపురం (కాకినాడ జిల్లా)
-
పిఠాపురంలో ప్రచారం.. చిరంజీవి అందుకే వెనకడుగు వేశారా?
జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎందుకని ప్రచారం చేయడం లేదు? ఆయన పిఠాపురం వస్తారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా తన తమ్ముడు మంచి వాడని చెబుతూ చిరంజీవి ఒక వీడియా క్లిపింగ్ ను విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆయన పిఠాపురం వచ్చి ఎందుకని ప్రచారం చేయడం లేదన్నది ఇపుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్న సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి నేరుగా వచ్చి ప్రచారం చేయడానికి జంకారని అంటున్నారు.2019 ఎన్నికల్లో జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుండి పోటీ చేశారు. రెండు నియోజక వర్గాల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జనసేన కార్యకర్తలు, అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. అటు పవన్ కల్యాణ్ కూడా రెండింట్లో గెలిచిన తర్వాత ఏ నియోజక వర్గానికి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసి పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్ ప్రభంజనంలో పవన్ కు ఎదురు గాలి తగిలేసింది. పోటీచేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి చెందారు. దాన్ని జనసేన నేతలు అవమానంగా భావించారు. ఓటమిని చాలా కాలం పాటు పవన్ జీర్ణించుకోలేకపోయారు. చాలా పెద్ద షాకే కొట్టింది పరాజయం.తన ఓటమికి కారణాలపై పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలని శ్రేయోభిలాషులు అప్పట్లోనే సలహా ఇచ్చారు. రెండు చోట్ల ఓడినా పవన్ కల్యాణ్ కొంతకాలానికే కేంద్రంలోని బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత జనసేన-బిజెపిల జట్టులోకి టిడిపిని తీసుకురావడానికి బిజెపి అగ్రనేతలతో పదే పదే చర్చలు చేశారు.ఈ సందర్భంగానే ఆయన ఆ పార్టీ అగ్రనేతల నుండి తిట్లు తినాల్సి వచ్చింది కూడా. వాటన్నింటినీ భరిస్తూనే మొత్తానికి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. టిడిపి,బిజెపిలతో జట్టు కట్టడంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యి తీరాలని పవన్ పంతంగా ఉన్నారు.ఈ సారి కూడా భీమవరం నుండి పోటీ చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే ఎందుకో కానీ ఆయన దాన్ని వదులుకున్నారు. తమ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పిఠాపురం నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండే నామినేషన్ వేశారు. పవన్ కల్యాణ్ పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. నియోజక వర్గంలో ఆమెకు మంచి పేరు ఉండడంతో పాటు ఇంటింటా పరిచయాలు ఉన్నాయి. అందుకే పవన్ కల్యాణ్ కు గట్టి పోటీ ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పిఠాపురంపైనే దృష్టి సారించారు. తనకు మద్దతుగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లచేత ప్రచారం చేయించారు. అదే విధంగా జబర్దస్త్ టీం కూడా పవన్ తరపున ప్రచారం చేస్తోంది.అందరూ చేస్తున్నారు కానీ పవన్ కల్యాణ్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలే అన్నాయి. ఈ నెల 5న ప్రచారానికి వస్తారని ముందుగా అన్నారు. ఆ తర్వాత లేదు లేదు 10 తేదీన వస్తారని అన్నారు. అయితే చివరకు చిరంజీవి పిఠాపురం వచ్చి ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అలాగని పూర్తిగా ప్రచారం చేయకపోతే పవన్ కల్యాణ్ ఫీల్ అవుతారు కాబట్టి పవన్ గెలిస్తే మంచి చేస్తాడంటూ ఒక వీడియోలో చిరంజీవి తన సందేశాన్ని రికార్డు చేసి విడుదల చేశారు. అదే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి ఎందుకు డ్రాప్ అయ్యారన్న అంశంపై చర్చ జరుగుతోంది.విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం చిరంజీవి పిఠాపురం వచ్చి రోడ్ షో నిర్వహించి పవన్ కల్యాణ్ గెలుపు కోసం విస్తృతంగానే ప్రచారం చేయాలని ముందుగా అనుకున్నారట. అయితే ఆ తర్వాత పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన ఆరా తీస్తే వంగా గీత విజయం ఖాయమని తేలిందట. తాను నేరుగా వచ్చి ప్రచారం చేసినా పవన్ గెలిచే పరిస్థితి లేదని తేలడంతోనే ఊరికే ప్రచారం చేసి తన పరువు తీసుకోవడం ఎందుకని చిరంజీవి భావించారని అంటున్నారు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ పార్టీ కోసం తిరిగారు కాబట్టి.. పవన్ కల్యాణ్ పార్టీ కోసం తాను ప్రచారం చేయకపోతే బాగుండదని అందరూ అనడంతో ప్రచారం చేద్దామనుకున్నారట. కనీసం పవన్ పోటీ చేసే నియోజక వర్గానికే ప్రచారాన్ని పరిమితం చేయాలనుకున్నారట. తీరా పవన్‌కు విజయవకాశాలు లేవని సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి ప్లాన్ మార్చి వెనకడుగు వేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీన్ని మెగా అనుచరులు కొట్టి పారేస్తున్నారు. చిరంజీవి వీడియో క్లిపింగ్‌కే పరిమితం కావడంతో పవన్ కల్యాణ్‌లోలోన గుర్రుగా ఉన్నారని అంటున్నారు -
భగభగల్లోనూ బ్రహ్మరథం
సీఎం జగన్ తెచ్చిన వ్యవసాయ సంస్కరణలు రైతును తిరిగి బతికించాయి. గతంలో వ్యవసాయం చేసి పండించిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. వారు చెప్పిందే ధర. ఆరుగాలం కష్టపడితే లాభం రాకపోగా, నష్టమే కనిపించేది. ఎవరికీ చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు మా గ్రామంలోనే రైతుభరోసా కేంద్రం వచ్చింది. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఇక్కడే ఇస్తున్నారు. పంట నష్టపోతే బీమా అందిస్తున్నారు. నేను 18 ఎకరాలు సాగుచేస్తున్నాను. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.4 లక్షల వరకు లబ్ధిపొందాను. ఇన్నేళ్ల నా జీవితంలో రైతు ఆనందంగా ఉన్నది ఇప్పుడే చూస్తున్నాను. ఇలాంటి నాయకుడే మళ్లీ సీఎం కావాలి. – సత్యనారాయణ, రైతు, రంగంపేట గ్రామం, అనపర్తి నియోజకవర్గం (‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, అభిమానుల కోలాహలం మధ్య సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 18వ రోజు శుక్రవారం కాకినాడ జిల్లాలో కోలాహలంగా సాగింది. అనపర్తి మండలం రంగంపేటకు సమీపంలోని ఎస్టీ రాజపురం వద్ద ఏర్పాటుచేసిన నైట్ స్టే పాయింట్ నుంచి ఉదయం రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్, ఉండూరు మీదుగా కాకినాడకు చేరుకుంది. మార్గమధ్యంలో మహిళలు హారతులు పట్టి సీఎం జగన్‌కు జేజేలు పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు వృద్ధులు.. రైతులు.. అక్కచెల్లెమ్మలు పల్లెల నుంచి పరుగుపరుగున రంగంపేటకు చేరుకున్నారు. సూరంపాలెం వరకు 8 కి.మీ. మేర తమ అభిమాన నేత వెంట నడిచారు. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ భారీ బ్యానర్‌తో స్వాగతం పలికారు. మీవల్లే మేం ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నాం. ‘అన్నా.. నువ్వు జాగ్రత్త, క్షేమంగా వెళ్లి.. సీఎంగా తిరిగి రా’ అంటూ ఒకరు.. ‘మొనగాడిలా ఒక్కడే వస్తాడు.. చరిత్ర సృష్టిస్తాడు’ అని ఇంకొకరు.. ‘పేదవాడి ఇంట్లో కష్టం లేకుండా ఉండాలంటే మళ్లీమళ్లీ నువ్వే సీఎంగా రావాలన్నా’ అంటూ మరో విద్యార్థి, ‘అన్నా నువ్వు జాగ్రత్త.. నీ ఆరోగ్యం జాగ్రత్త..’ ‘వైనాట్ 175.. వన్స్‌మోర్ సీఎం జగనన్న..’ వంటి ప్లకార్డులతో విద్యార్థులు తమ ఆనందాన్ని, అభిమానాన్ని చాటారు. జగన్నినాదాలతో హోరెత్తిన రంగంపేట.. ఉదయం ఎస్టీ రాజపురం వద్ద ప్రారంభమైన యాత్రకు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలతో రంగంపేట కిక్కిరిసిపోయింది. దారిపొడవునా జనం జగన్ నినాదాలతో హోరెత్తించారు. సామర్లకోట సెంటర్ వద్ద మహిళలు జగన్ కాన్వాయ్కి హారతులిచ్చారు. జానపద నృత్యాలు, తీన్మార్ నృత్యాలతో జననేతకు స్వాగతం పలికారు. అచ్చంపేట ఫ్లైఓవర్ వద్ద ఓ పాత ఫొటోతో ఎదురువస్తున్న వృద్ధురాలిని చూసిన జగన్ తన వాహనాన్ని ఆపి ఆమెను పలకరించగా.. తన పేరు మోర్త కుమారి అని, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ మార్గంలో వచ్చినప్పుడు తాను జున్ను పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు ఆయన వచ్చారు, ఇన్నేళ్లకు మీరు వచ్చారంటూ ఆమె తెగ సంబరపడింది. అలాగే, కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే రోగిని తీసుకుని ఆమె బంధువులు జగన్ కోసం ఎదురుచూస్తూ రోడ్డుపై వేచివున్నారు. వీరిని చూసి జగన్ తన వాహనాన్ని ఆపి వారి వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం ఖర్చుచేసిన బిల్లులను జాగ్రత్తచేయాలని పేషెంట్ బంధువులకు సూచించారు. కృష్ణవేణికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించే చర్యలను తక్షణమే చేపట్టాలని ఆరోగ్యశ్రీ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మనసున్న మారాజు అని, ప్రజా సమస్యలపట్ల జగన్ స్పందిస్తున్న తీరును చూసి మళ్లీ సీఎంగా ఆయనే రావాలని అక్కడున్న వారంతా బలంగా కోరుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఉండూరు క్రాస్ నుంచి బయల్దేరి కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగసభకు చేరుకున్నారు. అభిమానం ముందు ఎండ ఎంత? ఓ పక్క భానుడు భగభగలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బయటకు రావడానికి భయపడుతుంటే.. కాకినాడలో మాత్రం జనం ఎండను సైతం లెక్కచేయకుండా అచ్చంపేట జంక్షన్‌కు తండోపతండాలుగా తరలివచ్చారు. తమకు మేలు చేసిన ప్రజా నాయకుడు సీఎం జగన్ తమ ప్రాంతానికి వచ్చాడని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. మా అభిమానం ముందు ఈ ఎండ తీవ్రత ఎంత.. అంటూ జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సభా ప్రాంగణమైతే జనంతో కిక్కిరిసిపోయింది. సభ అనంతరం యాత్ర పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తిపూడి, బెండపూడి, అన్నవరం, తుని మీదుగా యాత్ర సాగింది. కత్తిపూడి కూడలి నుంచి ప్రజలు ప్లకార్డులు పట్టుకుని మానవహారం నిర్వహించారు. లోవ సెంటర్లో అమ్మవారి ఆశీర్వాదం పొందారు. తునిలో రోడ్ షో హైలెట్ తునిలో నిర్వహించిన రోడ్డు షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేజర్ లైటింగ్, యువత డ్యాన్సులతో సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ రహదారికి ఇరువైపులా అభిమానులు నిలబడి తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. జగన్ సాయంత్రం తుని వస్తారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మధ్యాహ్నం నుంచే జాతీయ రహదారి పైకి భారీగా తరలివచ్చారు. కానీ ఆయన రాత్రి 8.25కు తుని చేరుకున్నారు. మహిళలు గుమ్మడికాయలతో హారతి ఇచ్చి దిష్టితీశారు. జగన్ బస్సుపై నుంచి వారికి అభివాదం చేస్తూ రాత్రి పాయకరావుపేటకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ రాత్రి 9.15 గంటలకు వడిచర్ల వద్ద నైట్ స్టే క్యాంపునకు జగన్ చేరుకున్నారు. సామాన్యులకు ‘కార్పొరేట్’ చదువులు జగన్ సర్ వచ్చాకే సామాన్యుల పిల్లలకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి. మాది అనంతపురం జిల్లా గంగవరం గ్రామం. ఇంజినీరింగ్‌లో ర్యాంక్ రావడంతో కాకినాడ జిల్లాలో సీటు వచ్చింది. సీఎస్ఈ (డేటా సైన్స్)లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాను. జగన్ రాకముందు.. వచ్చాక రాష్ట్రంలో చదువులెలా ఉన్నాయో చాలా దగ్గర నుంచి గమనించాను. మా స్కూల్లోనే జగన్ సీఎం కాకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు వచ్చాయి. స్కూల్లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు జగనన్న విద్యాదీవెన పథకంతో ఇంజినీరింగ్ చేస్తున్నాను. మా అన్నయ్యకు కూడా విద్యాదీవెన అందుతోంది. మా నాన్నకు రైతుభరోసా వచ్చింది. ఇలాంటి సీఎంను నేను చూడలేదు. – చైతన్యరెడ్డి, విద్యార్థిని, అనంతపురం జిల్లా జగన్ సర్ రుణం తీర్చుకోలేనిది.. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువు అంటే భయమేసేది. టీచర్లు ఉండేవారు కాదు. టాయిలెట్లు ఉండేవి కావు. వర్షం వస్తే క్లాస్రూంలు కారిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. చదువులు బాగున్నాయి. గతంలో ఇంజినీరింగ్ చేసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీలేదు. నా పాలిటెక్నిక్ చదువు పూర్తిగా ప్రభుత్వ సాయంతోనే పూర్తయింది. మా చెల్లి, తమ్ముడు (కజిన్స్)కి అమ్మఒడి వస్తోంది. నా డిప్లొమా అవుతుండగానే జాబ్ వచ్చింది, కానీ, జగనన్న విద్యాదీవెన ఇస్తుండడంతో ఇంజనీరింగ్ చదవగలుగుతున్నాను. జగన్ సర్ గ్రేట్. హత్యాయత్నం జరిగినా లెక్కచేయలేదు, నవ్వుతూనే ప్రజల్లో ఉన్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – తనూజ, బీటెక్ (ఈసీఈ సెకండియర్), కాకినాడ జగనన్న వచ్చాకే మేలు జరిగింది.. నాకు ఇద్దరు పిల్లలు, నా భర్త పాల వ్యాపారం చేస్తాడు. గతంలో రేషన్ కార్డు కోసం జన్మభూమి కమిటీలో ఎన్నోసార్లు అప్లై చేసినా ఇవ్వలేదు. కారణం కూడా చెప్పలేదు. జగనన్న సీఎం అయ్యాక ఇంటికి వలంటీర్ వచ్చి మరీ కార్డు ఇచ్చారు. మా పాపకి రెండుసార్లు అమ్మఒడి ఇచ్చారు. ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఇంత మేలు చేసిన అన్న మా ఊరికి వస్తే చూడకుండా ఉండలేం కదా.. అందుకే నా బిడ్డను తీసుకుని వచ్చాను. – ఈ. శ్రీలత, గాంధీనగర్, కాకినాడ చేబ్రోలు పట్టు రైతులకు సీఎం హామీ ముఖ్యమంత్రి తీరుతో పట్టు రైతుల హర్షాతిరేకాలు పిఠాపురం: చేబ్రోలు పట్టు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చేబ్రోలు పట్టు పరిశ్రమకు చెందిన పట్టు రైతులు తమ సమస్యలు సీఎంకు వినతిపత్రం ద్వారా తెలియజేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే, బస్సుయాత్ర చేబ్రోలులో ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది. తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే.. బస్సుయాత్ర ఆగకుండా వెళ్లిపోయిందని రైతులు నిరాశకు గురయ్యారు. ఇంతలో బస్సులో నుంచి రైతులు ప్రదర్శించిన ప్లకార్డులను చూసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో ఉన్న వారి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన.. రైతుల వద్దకు వెళ్లి, వారి వినతిపత్రం తీసుకుని, వారి సమస్యను క్షుణ్ణంగా విని, తగిన పరిష్కారం చూపిస్తామని తన మాటగా చెప్పి రావాల్సిందిగా సీఎంఓ కార్యాలయ గ్రీవెన్స్ అధికారి ప్రదీప్‌ను ఆదేశించారు. దీంతో ఆ అధికారి రైతుల వద్దకు చేరుకుని, ముఖ్యమంత్రి తనను పంపించారని చెప్పారు. రైతులతో మాట్లాడి వారి సమస్యను ఆలకించి, వారి వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారని రైతులకు వివరించారు. దీంతో.. సమయాభావంవల్ల సీఎం ఆగకుండా వెళ్లిపోయినా, రైతులను గుర్తించి.. వెంటనే స్పందించి అధికారిని పంపించడంపై పట్టు రైతులు ఆనందం వ్యక్తంచేశారు. -
బాబు గురి గులకరాయిపైనే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘ఎన్నికలకు ఇక 25 రోజులే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ న గారా కూడా మోగింది. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పేదలు, అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మీరంతా సిద్ధమేనా? జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు దాకా పెత్తందార్ల దోపిడీకి, మనందరి పేదల పక్షపాత ప్రభుత్వానికి మధ్య ఈరోజు క్లాస్‌వార్ జరుగుతోంది. చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు కాబట్టే నాపై వేయించటానికి బాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. ఈ యుద్ధంలో ఆ పేదల వ్యతిరేక కూటమిని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? మరోసారి జైత్రయాత్రకు సింహగర్జనతో సిద్ధం కావాలి. ఫ్యాన్‌కు 2 ఓట్లు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం’’అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్లో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో భారీ జనసందోహాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. పసుపు పతి నిద్ర లేస్తాడు.. జాగ్రత్త! అభిమాన సముద్రంగా మారిన వరద గోదావరి ఇవాళ ఇక్కడ కనిపిస్తోంది. ఐదేళ్లుగా మనందరి ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం ఇక్కడ కనిపిస్తోంది. ఆ మంచిని కాపాడుకోవాలన్న సంకల్పం ఈరోజు మీ అందరిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్లు.. అంటే 1,825 రోజులు.. రాబోయే 60 నెలల పాటు మన బతుకులు ఎలా ఉంటాయి? అనేది నిర్ణయించే మన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు ఇక మీదట కూడా అందాలా? లేక అవి రద్దు కావడం అన్నది మీ ఓటుపైనే ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జగన్‌కు ఓటు వేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న నిజం. బాబు మోసాల మేనిఫెస్టో చెబుతున్న వాస్తవం. ఫ్యాన్‌కు ఓటు వేస్తే గ్రామగ్రామాన, పట్టణాల్లో సేవలందిస్తున్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు తథ్యం. ఫ్యాన్‌కు ఓటు వేస్తే అవ్వాతాతలకు ఇంటివద్దే రూ.3,000 పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ల ద్వారా జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా గత 58 నెలల్లో డీబీటీ ద్వారా మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. మళ్లీ పసుపు పతి నిద్ర లేస్తాడు! వదల బొమ్మాళీ.. వదల.. అంటూ మళ్లీ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు ప్రతి ఇంటికీ వస్తాడు. జాగ్రత్త సుమా..! ఒక్క ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే.. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే విత్తనం నుంచి పంట విక్రయం వరకూ ఇప్పుడు సేవలందిస్తున్న ఆర్బీకేలు కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకేలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు ఖాయం. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఏటా క్రమం తప్పకుండా అందుతుంది. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, సున్నావడ్డీకే పంట రుణాలు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోళ్లు నిరాటంకంగా జరుగుతాయి. లేదంటే మళ్లీ చంద్రబాబు మార్కు పాలన, మళ్లీ కత్తిరింపులు, పథకాలన్నీ ముగింపు జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. పెద్దవారి పిల్లలు అసూయపడేలా.. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, రూపురేఖలు మారిన స్కూళ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్, బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీ ప్యానళ్లు, 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, ఉన్నత చదువులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, డిగ్రీ విద్యార్థులకు సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశీ వర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, తొలిసారిగా డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్‌షిప్.. ఇవన్నీ కొనసాగుతాయి. మీ జగన్ ఇదే స్థానంలో ఉంటే మరో పదేళ్లలో పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లిష్ మాట్లాడతారంటే.. వారు అనర్గళంగా మాట్లాడే మాటలకు పెద్దవారి పిల్లలు అసూయ పడే పరిస్థితి వస్తుంది. బాబుకు ఓటేస్తే కత్తిరింపులు.. ముగింపు ఫ్యాన్‌పై రెండు ఓట్లు పడితే జగన్ మార్కు విప్లవాలన్నీ కొనసాగుతాయి. లేదంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, స్కూళ్ల రూపురేఖలు మార్చే నాడు–నేడు రద్దు, బడి పిల్లలకు రోజుకో మెనూతో ఇచ్చే గోరుముద్ద రద్దు, బడులు తెరిచే సమయానికి పిల్లలకు ఇస్తున్న విద్యాకానుక రద్దు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన రద్దు.. 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు రద్దు.. వీటన్నిటికీ కత్తిరింపులు ముగింపే! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు.. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు రద్దు అవుతాయి. అందుకే ఆలోచన చేయండి. పొరపాటు జరిగిందంటే..మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. నిద్ర లేచి మీ పిల్లల చదువులు, బడులు అన్నిటికీ లకలక.. లకలక అంటూ ముగింపు పలుకుతుంది. విప్లవాత్మక పాలన కొనసాగేందుకు.. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజీ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దే పరీక్షలు – మందులు, నాడు– నేడుతో రూపురేఖలు మారిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉత్తమ సేవలు, రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం, ఆపరేషన్ తరువాత జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం లాంటి ప్రతి పేదవాడిని బతికించే జగన్ మార్కు విప్లవాత్మక పాలన కొనసాగుతుంది. లేదంటే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాళీ అంటుంది. పేదవాడు అప్పుల పాలై వైద్యం అందని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది ఆ చంద్రముఖి. ఫ్యాన్‌కు ఓటు వేస్తేనే అక్కచెల్లెమ్మల రాజ్యం, పిల్లలను బడులకు పంపే అమ్మలకు అమ్మ ఒడి, చదువులకు ఇబ్బంది లేకుండా విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ జగనన్న కాలనీలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహాల నిర్మాణం.. అన్నీ కొనసాగి వేగంగా అడుగులు ముందుకు పడతాయి. గతంలో నాకు ఓట్లేయని వారూ ఆలోచించండి.. పొదుపు సంఘాల మహిళలకు బాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? ఓటు వేసే ముందు మీ కుటుంబమంతా కూర్చుని బాగా ఆలోచన చేయండి. ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి. ఎవరివల్ల మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందనే ఆలోచనతో ఓటు వేయాలని కోరుతున్నా. మీ తలరాతలను మార్చే ఎన్నికలివి. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కొనసాగాలా? లేక రాష్ట్రాన్ని పెత్తందార్లు అందరూ కలసి దోచుకుని, పంచుకునే కూటమి పాలన కావాలా? 58 నెలలుగా మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పలు కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. కులం కారణం కావచ్చు.. ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామనే కారణం కావచ్చు.. లేదా ఇతర కారణాలు కావచ్చు.. ఆ అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను కూడా అడుగుతున్నా. గత ఎన్నికల్లో మీరు నాకు ఓటు వేయకపోయినా ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, క్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చుగానీ మీ కుటుంబానికి, మీ బ్యాంక్ ఖాతాల్లోకి 58 నెలల పాలనలో జమ అయిన, చేతికి అందిన పథకాల డబ్బులు మీకు నిజాలే చెబుతాయి. ఇంటికే వలంటీర్ల సేవలు, ఇంటి వద్దకే పెన్షన్, రేషన్, వైద్యం, సర్టిఫికెట్లు, ఇళ్ల పట్టాలు.. ఇవన్నీ మీకు నిజాలే చెబుతాయి. మారిపోయిన మన గవర్నమెంట్ స్కూళ్లు, పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, వ్యవసాయం.. ఇవన్నీ మీకు వాస్తవాలు చెబుతాయి. ఎవరి పాలనలో మీకు మంచి జరిగిందో ఆలోచన చేయండి. 2014లో బాబు మోసాలివీ.. ♦ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? ♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ♦ ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ♦ అర్హులైన వారందరికి మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ♦ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ♦ మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ♦ సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ♦ ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? కాకినాడలో కనిపిస్తోందా? పోనీ పిఠాపురంలో కట్టారా? ♦ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అదీ లేదు. ♦ ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటికి కేజీ బంగారం అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. ఇన్ని మోసాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా, సోషల్ మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబు నుంచి సెల్ఫోన్లు బయటకు తీసి టార్చిలైట్లు వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని వ్యవస్థలు, మన చదువులు, పిల్లలు, రైతన్నలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! ఇంటింటికీ మంచి చేశాడు కాబట్టి ఈ ఎన్నికల యుద్ధానికి మీ బిడ్డ ఒంటరిగా బయల్దేరాడు. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకే ఏ మంచిపనీ లేదు కాబట్టి వారంతా కూటమిగా ఏకమయ్యారు. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పాటైన కూటమి కాదు. ఎన్ని టికెట్లు ఇవ్వాలి? ఎవరు పోటీ చేయాలి? చివరికి ఆ ప్యాకేజీ స్టార్ ఎక్కడ నిలబడాలో కూడా బాబు నిర్ణయిస్తేనే కుదిరిన పొత్తులవి. ఆ ప్యాకేజీ స్టార్‌ను భీమవరం.. గాజువాక.. పిఠాపురం.. ఇలా ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుందనుకుంటే అక్కడ నిలబెట్టిన పరిస్థితి!ఇక బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! జగన్‌ను తిట్టు అంటే తిట్టు..! కొట్టు అంటే కొట్టు..! దత్తపుత్రా నీకిచ్చేది 80 కాదు.. 20 అంటే అందుకు కూడా జీ హుజూర్! ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి! కులాన్ని హోల్‌సేల్‌గా అమ్మేయగలననే భ్రమతో.. ఏపీని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే.. కులాన్ని హోల్‌సేల్‌గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తున్నాడు. ఈయనకు ఏపీ అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్తాడు. ఏ ప్రాంతమన్నా ప్రేమ ఉండదు ఈ మ్యారేజీ స్టార్‌కు. ఏ భార్య అయినా ప్రేమ ఉండదు! పెళ్లిళ్లే కాదు..నియోజకవర్గాలు కూడా మార్చేశాడు. వెనుకటికి ఒకడు పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకన బెటు్టకెళ్లాడట! ఆ పిల్లిని చంకన బెట్టుకెళ్లింది ఎవరో ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు. బాబు తన చంకలో ఉన్న పిల్లిని పిఠాపురంలో వదిలినట్లు ఇప్పుడు అర్థమైంది. ఇదీ గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్‌తో గటగట తాగేది బాబు.. దాన్ని తోమి, తుడిచి మళ్లీ బాబుకు అందించేది మాత్రం.. ఈ ప్యాకేజీ స్టార్! బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్‌తో.. బీజేపీలోకి వదినమ్మ ఈ కూటమిలో వదినమ్మ బాబు చేరమంటే కాంగ్రెస్‌లో చేరింది. ఇదే బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. బాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది! 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా.. బాబు కోవర్టుగా అదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికే ఇస్తారు. వద్దంటే వారిని ఆపేస్తారు, మారుస్తారు. చంద్రబాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. బీఫామ్ బీజేపీదైనా, కాంగ్రెస్‌దైనా, టీ గ్లాస్దైనా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే! మత్స్యకారులకు మాటిస్తున్నా.. కాసేపటి క్రితం కన్నబాబు అన్న మాట్లాడుతూ మత్య్సకారుల సమస్యల గురించి ప్రస్తావించారు. నాకు మంచి మనసు ఉంది కాబట్టే.. ముమ్మిడివరంలో జరిగిన నష్టాన్ని, ఎప్పటి నుంచే పరిష్కారం కాని సమస్యను పరిష్కరించాం. ఓఎన్జీసీ కమిటీని ఏర్పాటు చేయటానికి మీ బిడ్డ ప్రభుత్వ చొరవే కారణమనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కమిటీ సిఫారసులు ఆధారంగా ప్రతి మత్య్సకార కుటుంబానికి మంచి జరిగేలా మీ బిడ్డ తోడుగా ఉంటాడని మాట ఇస్తున్నా. బాబుకు మిగిలింది గులక రాళ్లే... చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికలు ముగిసేదాకా రంగురంగుల స్వప్నాలను చూపిస్తుంది. ఆ తరువాత చెత్తబుట్టలో మినహా ఎక్కడా కనిపించదు. ఎన్నికల తరువాత మోసాలు చేయడం చంద్రబాబు నైజం! ఆయన పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలు రాళ్లు ఏవీ లేవు. మంచి వ్యవస్థలు గానీ, పథకాలుగానీ, ప్రజలకు చేసిన మంచిగానీ ఒక్కటీ లేవు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు. కాబట్టే నాపై వేయించటానికి చంద్రబాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. మన మైలు రాళ్లు.. గత 58 నెలల పాలనలో మనం వేసిన పునాది రాళ్లు, మైలు రాళ్లు చరిత్రలో ఎప్పటికీ విప్లవాలుగా నిలిచిపోతాయి. కాబట్టే మనం జెండా తలెత్తుకుని ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతోంది. ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా? వద్దా? ఆలోచన చేయమని కోరుతున్నా. ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని ప్రతి ఇంట్లో స్టార్ క్యాంపైనర్లుగా ముందుకు వచ్చి వివరించాలి. బాబు గత చరిత్రను, 2014లో ఇదే కూటమి పేరుతో చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి. -
Memantha Siddham: ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర.. కొనసాగుతున్న సీఎం జగన్ ప్రభంజనం (ఫొటోలు)
-
Memantha Siddham Photos: పల్లె పల్లెలో జన గోదారి..సీఎం జగన్‌కు జేజేలు (ఫొటోలు)
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు (ఫొటోలు)
-
కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Updates.. కాకినాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్ కాకినాడ జిల్లా సిద్ధం ఇక్కడ కనిపిస్తోంది.. నిండు గోదావరి ఇక్కడ కనిపిస్తోంది.. అభిమాన వరద గోదావరి ఈ ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం.. దాన్ని కాపాడుకోవాలన్న సంకల్పం మీ అందరిలోనూ కనిపిస్తోంది ఈ సభకు ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ, నా అక్కలకు, నా చెల్లెమ్మలకు, నా అవ్వలకు, నా తాతలకు, నా ప్రతీ సోదరుడికీ, నా ప్రతీ స్నేహితుడికి ముందుగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ నగరా మోగింది. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారు ఇంటింట ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్ జరుగుతోంది ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుంది ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలు వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుంది జగన్‌కు ఓటేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి లేదంటే బాబు మార్క్‌తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడు జగన్‌కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్ మార్క్ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపు జరుగుతుంది ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుంది. అదే సమయంలో పెన్షన్ అందిస్తున్న జగన్ మార్క్ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశాం ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగింది. లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్ ముగింపు ఉంటుంది మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుంది పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడు ఫ్యాన్‌కు ఓటేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయి లేదంటే.. బాబు మార్క్‌తో ముగింపు పడుతుంది. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. ఉచిత పంటల బీమా.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే సున్నా వడ్డీకే రుణాలు, ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే.. రైతన్నకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తేనే.. దళారిలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు, ఇతర పంటలు కొనుగోలు అన్నది జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే అనేది గుర్తుపెట్టుకోండి లేదంటే.. చంద్రబాబు మార్క్‌తో ముగింపు ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఫ్యాన్‌కు ఓటేస్తేనే గవర్నమెంట్ బడుల్లో రూపు రేఖలు మార్చే నాడు-నాడు ఫ్యాన్‌కు ఓటేస్తేనే మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్ బోధన, మూడో తరగతి నుంచే బైజూస్ కంటెంట్ ఆరో తరగతికి వచ్చేసరికి డిజిటల్ బోధన, ఐఎఫ్బీ ప్యానల్స్, ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇక పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ దీనిలో భాగంగా విద్యా దీవెన, వసతి దీవెన డిగ్రీ చదువుతున్న పెద్ద పిల్లలకు ఆ పెద్ద చదువుల్లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ద్వారా విదేశాల్లో అతి ఉన్నత విద్యాలయాలకు మన కాలేజీలు అనుసంధానం తొలిసారి డిగ్రీలో మ్యాండెటరీ ఇంటెర్న్షిప్ ఇవన్నీ కొనసాగి మీ పిల్లలు ఎదగాలంటే.. మీ బిడ్డ వైఎస్ జగన్ 10 ఏళ్లు ఇదే స్థానంలో ఉంటే జగన్ మార్క్ విప్లవాలు కొనసాగుతాయి. లేదంటే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, నాడు-నేడు రద్దు, బడి పిల్లలకు ఇచ్చే గోరుముద్ద కార్యక్రమం రద్దు, బడి తెరిచే సమయానికి ఇచ్చే విద్యాకానుక రద్దు. ట్యాబ్స్, విద్యా కానుక, వసతి దీవెన ఇలా అన్నీ కూడా రద్దు చంద్రబాబు మార్క్‌తో కత్తిరింపులు, ముగింపులు చూడాల్సి ఉంటుంది మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. లకలక, లకలక అంటూ అన్నింటికి ముగింపు. ఫ్యాన్‌కు ఓటేస్తేనే గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఫ్యామిలీ డాక్టర్, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఇంటికే ఆరోగ్య సురక్ష ఇంటివద్దనే టెస్టులు, గ్రామంలోనే మందులు గ్రామంలో రూపు రేఖలు మారుస్తూ నాడు నేడు రూ. 25 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య శ్రీతో పాటు ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్‌లు నిర్మాణం జగన్ మార్క్ ఈ విప్లవాలు కొనసాగాలంటే ఫ్యాన్‌పై రెండు ఓట్లేస్తేనే కొనసాగుతాయి లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాలి అంటూ వైద్యం అందని పరిస్థితుల్లోకి పేదవాడిని తీసుకు పోతుంది ఫ్యాన్‌కు ఓటేస్తేనే పిల్లల్ని బడులకు పంపే తల్లులకు అమ్మ ఒడి అనే పథకం, విద్యా దీవెన, వసతి దీవెన. ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఓ చేయూత కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే కాపు నేస్తం కొనసాగింపు, ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఈబీసీ నేస్తం కొనసాగింపు ఫ్యాన్‌కు ఓటేస్తేనే ఓ వైఎస్సార్ జగనన్న కాలనీలు, అందులో 30 లక్షల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లలు.. అన్నీ కూడా వేగంగా అడుగులు ఫ్యాన్‌కు ఓటేస్తేనే.. నామినేటెడ్ పదవుల్లో నా అక్క చెల్లెమ్మలకు అగ్ర తాంబాలం ఇస్తూ యాబై శాతం రిజర్వేషన్లతో పదవులు అన్నీ కూడా ఉండాలంటే మీ బిడ్డ జగన్ మళ్లీ వస్తానే అనేది ఆలోచన చేయండి లేదంటే.. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.. పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి వదల అంటాడు బాబు సిట్ అంటే పవన్ సిట్.. స్టాండ్ అంటే పవన్ స్టాండ్ ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది. బాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుంది. అక్క చెల్లెమ్మలకు గుర్తుందా? పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా? బాబు మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా మళ్లీ అక్క చెల్లెమ్మల బతుకులన్నీ అతలాకుతలం ఆవుతాయి. ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయండి.. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి ఎవరి ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఓటేయండి అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు.. మీ జీవితాలను, తలరాతలను మార్చే ఎన్నికలు మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? లేకపోతే దోచుకుని దాచుకుని చంద్రబాబు పాలన కావాలా? మీ బిడ్డ చేసిన పాలన అందరికీ కనబడుతోంది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి కాకినాడ వైఎస్సార్సీపీ రూరల్ అభ్యర్థి కన్నబాబు స్పీచ్ చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ సీఎం జగన్ నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తుంటే.. బాబు మాత్రం నాణ్యమైన మద్యం అందిస్తారంట వాలంటీర్ సేవలను అడ్డుకున్న కుట్రదారు చంద్రబాబు ఈ సందర్భంగా మేమంతా సిద్ధం అని తెలియజేసుకుంటున్నా అచ్చంపేట జంక్షన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం లక్షలాదిగా తరలి వచ్చిన ‘అభిమానం’ జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం కాకినాడ జిల్లా: అచ్చంపేట జంక్షన్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర మరికాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం\ సభలో పాల్గోని ప్రసంగించనున్న సీఎం జగన్ జిల్లా నలమూలల నుండి సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు కాకినాడ జిల్లా: ఉండూరు క్రాస్ వద్ద జె.సత్యనారాయణ అనే పేషెంట్‌ను కలిసిన సీఎం జగన్ పిరుదు భాగంలో సర్జరీ కావడంతో వీల్ ఛైర్‌కి పరిమితం అయిన కాకినాడ రూరల్ తూరంగికి చెందిన సత్యనారాయణ. ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా ఆదుకుంటానని హమీ ఇచ్చి మానవత్వం చాటుకున్న సీఎం జగన్ కాకినాడ జిల్లా: ఉండూరు క్రాస్ నుండి ప్రారంభమైన మేమంతా సిద్దం సీఎం జగన్ బస్సుయాత్ర మరికాసేపట్లో తిమ్మాపురం మండలం అచ్చంపేట జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గోననున్న సీఎం జగన్ బస్సుయాత్రలో సీఎం జగన్‌కు భద్రత కట్టుదిట్టం బస్సుయాత్రలో ప్రత్యేకంగా మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పోలీస్ శాఖ, ఐ పేజ్ సంయుక్తంగా కమాండ్ సెంటర్ పర్యవేక్షణ సీఎం జగన్ భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు వైఎస్సార్సీపీలోకి చేరిన టీడీపీ, జనసేన కీలక నేతలు కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన జనసేన, తెలుగుదేశం, కీలక నేతలు కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం వైఎస్సార్సీపీలో చేరిన జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి. రంగంపేట చేరుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్ చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనాలు బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ దారిపొడవునా సీఎం జగన్‌కు ఘన స్వాగతం భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బాణసంచాతో అఖండ స్వాగతాలు కిలోమీటర్ల కొద్దీ వెన్నంటి వస్తున్న వీరాభిమానులు సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్లో మేమంతా సిద్దం సభ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభమైన మేమంతా సిద్దం బస్సు యాత్ర మరికాసేపట్లో కాకినాడ జిల్లాలో ప్రవేశించనున్న సిఎం జగన్ యాత్ర సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్లపై బారులు తీరిన అశేష జనవాహిని నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు Memantha Siddham Yatra, Day -18. ఉదయం 9 గంటలకు ST రాజపురం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4.30 గంటలకు కాకినాడలో బహిరంగ సభ గోడిచర్ల దగ్గర రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/gtYVbwAgfq — YSR Congress Party (@YSRCParty) April 19, 2024 గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు కడియపులంకలో సీఎం వైఎస్ జగన్‌పై పూల వర్షం వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం -
స్వయం సిద్ధ క్షేత్రం ‘తొలి తిరుపతి’
పెద్దాపురం: ఏలేరు నది ఒడ్డున అతి పురాతన కాలంలో స్వయం సిద్ధ క్షేత్రంగా వెలసిన స్వయంభూ శ్రీ భూసమేత శృంగార వల్లభ స్వామి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలాడ తొలి తిరుపతిలో వెలసిన స్వామి వారి కల్యాణం శుక్రవారం రాత్రి 8 గంటలకు నిర్వహిస్తారు. సామర్లకోట–ప్రత్తిపాడు రహదారిలో పెద్దాపురం మండలంలోని దివిలి గ్రామానికి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉంది చదలాడ తొలి తిరుపతి. విశిష్ట నిర్మాణ శైలితో ఉండే ఈ పుణ్యక్షేత్రం సింహాచలం, తిరుమల తిరుపతి కంటే పురాతనమైనదిగా పేర్కొంటారు. తొలి తిరుపతిగా పేరొందిన ఈ గ్రామంలోని ఆలయం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నాటిదని, ఈ విషయం ‘చాతావళి’ అనే సంస్కృత గ్రంథంలో కూడా ఉందని ఆలయ ప్రధాన పూజారులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 108 తిరుపతిలు ఉండగా వాటిలో ‘తొలి తిరుపతి’దే తొలిస్థానమని పేర్కొంటున్నారు. ఈ ఆలయం మాదిరిగానే పెద్ద తిరుపతి (తిరుమల తిరుపతి)లో కూడా ఏడు ద్వారాలు ఉండడం విశేషం. ఇక ప్రతీ శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయానికి పాదయాత్రగా వచ్చి ఏడు వారాలు మొక్కు తీర్చుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఎడమ చేతిలో చక్రం... కుడి చేతిలో శంఖం ఇక్కడ స్వామి ఇతర పుణ్యక్షేత్రాల్లో విగ్రహాలకు భిన్నంగా ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం ధరించి ఉండటం విశేషం. అలాగే ఇక్కడ స్వామి చేతుల్లో తామర పుష్పం ఉన్నట్లే తిరుమల, సింహాచలం ఆలయాల్లోని విగ్రహాల చేతిలోనూ ఉన్నట్లు చెబుతారు. ఇది మూడు క్షేత్రాల మహాక్షేత్రంగా గణుతికెక్కింది. ప్రధానంగా ఇది స్వయం సిద్ధక్షేత్రం. నారద మునీంద్రుడు ఇక్కడ లక్ష్మీదేవిని ప్రతిస్టించడంతో దివ్యక్షేత్రమవ్వగా శ్రీకృష్ణ దేవరాయలు గోదాదేవిని ప్రతిస్టించడంతో రాజక్షేత్రంగా మారి మహా క్షేత్రమైంది. భోజ మహారాజు ఈ ఆలయానికి సున్నం వేయించినట్టు, విక్రమాదిత్యుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్, విక్టోరియా మహారాణి ఈ ఆలయ దర్శనానికి వచ్చినట్లు శాసనాధారాల్లో ఉంది. బొడ్నబావి ప్రత్యేకత.. ఆలయానికి ఆగ్నేయ మూలలో చతురస్రాకారంలో ఉన్న బావిని బొడ్నబావిగా పిలుస్తుంటారు. నేలబావిగా ఉన్న ఈ బావి చుట్టూ రాళ్లు పేర్చి నిరి్మంచడాన్ని పురాతన నిర్మాణానికి ఆనవాలుగా చెబుతారు. కార్తికమాసంలో ఈ బావి నీటిని ఆలయ అర్చకులతో తోడించుకుని స్నానం చేస్తే సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుందని, కార్తిక పౌర్ణమి నాడు ఆ స్నానం మరింత ప్రాశస్థ్యమని భక్తుల నమ్ముతారు. ఈ బావి నీటిని చుట్టుపక్కల గ్రామాల వారు ఇంటికి తీసుకువెళ్లి మామూలు నీళ్లతో కలుపుకొని స్నానం చేస్తారు. టీటీడీ సహకారంతో ఆలయ అభివృద్ధి ఈ ఆలయానికి ఉండే వందలాది ఎకరాల ఆస్తి కాలక్రమంగా అన్యాక్రాంతమై నేటికి 18 ఎకరాలు మాత్రమే మిగిలింది. అయితే జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేశారు. ఇక దాతల సహకారంతో భక్తులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి శృంగార వల్లభ స్వామి దివ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. రాత్రి 8 గంటలకు ఉభయ దేవేరులైన క్షీర సాగరనందని లక్ష్మీదేవి, భూదేవిలతో స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవం ఉంటుంది. 20న గ్రామోత్సవం, 21న సదస్యం, 22న సుదర్శన హోమం, చోర సంవాదం, 23వ తేదీ ఉదయం 8 గంటలకు చక్ర స్నానం, బుక్కా పండగ, సామూహిక కుంకుమ పూజలు, 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్వామి వారికి శ్రీ పుష్పయాగం ఉంటాయి. – వడ్డి శ్రీనివాస్, కార్యనిర్వహణాధికారి -
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
పవన్ ఇలా చేశావేంటి?.. పిఠాపురంలో జనసైనికులకు అవమానం
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు తీవ్ర అవమానం ఎదురైంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తీరుపై కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన వార్డు కమిటీ సభ్యులతో సమావేశం రద్దు చేసుకుని హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్ ప్రయాణం అయ్యారు. పవన్ బస చేసిన హోటల్ వద్ద గేటు దగ్గర మండుటెండలో రెండు గంటల పాటు కార్యకర్తలు పడిగాపులు కాశారు. హోటల్ లోపలికి రానివ్వకుండా పవన్ బౌన్సర్లు గేటు మూసేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కూడా అడ్డుకోవడంతో గేట్లు నెట్టుకుని టీడీపీ నాయకులు లోపలికి వెళ్లారు. పార్టీ కోసం సేవ చేసిన తమను చులకనగా చూస్తున్నారని తమ ఆవేదనను వాట్సాప్ గ్రూపులో జనసేన కార్యకర్తలు షేర్ చేశారు. పిఠాపురానికి ఎవరెవరో వస్తున్నారు.. వారిని భుజంపై మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారాహి వాహనం అనుమతి తీసుకోలేక పోయారని ఉదయ్ శ్రీనివాస్‌ను జనసేన కార్యకర్తలు తిట్టుపోసుకుంటున్నారు. ఇదీ చదవండి: జనసేనను చిదిమేసిన చంద్రబాబు -
పిఠాపురంలో పవన్ ఎదురీత.. గెలుపు కోసం నానా తంటాలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్న పవన్‌కల్యాణ్ ఈ సారి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, బరిలోకి దిగకుండానే పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. మిత్ర పక్షాలనుంచి సహకారం కరువు అవ్వడంతో పిఠాపురంలో పవన్ ఎదురీదుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు భగ్గుమన్నారు. పవన్ నిర్ణయంపై తెలుగుదేశం కార్యకర్తల ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే వర్మ రోజుకో ప్రకటనతో టీడీపీ, జనసేన క్యాడర్ అయోమయంలో పడింది. పవన్ గెలుపుకి మిత్రపక్షం నుంచి సహకారం అనుమానమే.. దీంతో పిఠాపురంలో గెలుపు కోసం పవన్ కల్యాణ్ నానా తంటాలు పడుతున్నారు. వారంలో మూడు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేయాలని నిర్ణయించారు. పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పలు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నా గెలుపుపై గ్యారెంటీ కనిపించకపోవడంతో వెతికి వెతికి చివరికి పిఠాపురం ఎంచుకున్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు, పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగా గీత క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎంపీ అయిన గీత గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బాద్యతలు నిర్వహించిన వంగా గీతకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. దీంతో పవన్ తన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం అనుకుంటున్నప్పటికీ అక్కడ అంతే బలంగా ఉన్న వంగా గీతను ఎదుర్కొని విజయం సాధించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: జేపీ కొత్త రంగు.. అదీ అసలు సంగతి! -
యనమల ఇంట రచ్చకు కారణం ఎవరు?
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం పలువురు నేతల ఇళ్ళల్లో కుంపట్లు రగిలిస్తోంది. టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. ఇద్దరి మధ్యా టిక్కెట్ పోరు రచ్చకెక్కింది. దశాబ్దాలుగా వెంట నడిచిన తమ్ముడిని ఇప్పుడు అన్న దూరం చేసుకున్నాడు. ఇంతకి తుని సీటు కోరిందెవరు? దక్కించుకున్నది ఎవరు? యనమల ఇంట రచ్చకు కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్ నాయకుల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయాక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ దశాబ్దాలుగా తన వెంట నడుస్తూ... నియోజకవర్గంలో పనులు చక్కబెట్టుకుడుతున్న యనమల కృష్ణుడికి సీటు ఇప్పించారు. రెండుసార్లు ఓడిపోయినా... మూడోసారి కూడా తనకు సీటు కావాలని కృష్ణుడు డిమాండ్ చేశారు. తనకు ఇవ్వకపోయినా..తన కొడుక్కి అయినా ఇవ్వాలని ఇటు అన్నను.. అటు టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. తన అన్న కోసమే దశాబ్దాలుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నందున తనకు కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని కృష్ణుడు ఒత్తిడి చేశారు. కాని పరిస్థితి రివర్స్ అయ్యింది. చంద్రబాబు తర్వాత పార్టీలో తానే సుపీరియర్‌గా చలామణీ అవుతున్న యనమల రామకృష్ణుడు తన తమ్ముడి ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఈసారి తన కుమార్తె దివ్యకు కాకినాడు జిల్లా తుని అసెంబ్లీ సీటు ఇప్పించుకున్నారు. దీంతో యనమల ఇంట చిచ్చు రగిలింది. ఇదే సమయంలో దివ్య తన ఎన్నికల ప్రచారంలో బాబాయ్ కృష్ణుడు వర్గాన్ని దూరంగా ఉంచుతున్నారు. తనతో ప్రచారానికి రావొద్దని.. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ..ఆఫీస్ పని చూసుకోవాలని కొద్ది రోజుల క్రిందట కృష్ణుడు ముఖ్య అనుచరుడైన శేషగిరికి యనమల కుమార్తె దివ్య స్పష్టం చేశారు. ఇలా తండ్రి..కూతుళ్ళు కృష్ణుడు.. అతని వర్గాన్ని దూరం పెట్టడంతో తునిలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆరుసార్లు తుని నుంచి గెలిచిన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయారు. అదే సమయంలో యనమల టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో..ప్రభుత్వ పదవుల్లో బిజీగా ఉండటంతో తునిలో పార్టీ తరపున అన్ని పనులూ ఆయన తమ్ముడు కృష్ణుడు చూసుకునేవారు. కార్యకర్తలకు..పార్టీకి మధ్య వారధిగా పనిచేశారు. అందుకే యనమల రెండుసార్లు సిఫార్సుచేసి సీటు ఇప్పించినా కృష్ణుడు ఓడిపోయారు. మూడోసారి తనకు కాకపోయినా తన వారసుడికి అయినా ఇవ్వాలని కోరినా..అన్న రామకృష్ణుడు చక్రం తిప్పి తన కుమార్తెకు ఇప్పించుకున్నారు. దీంతో కృష్ణుడు అవమానతో రగిలిపోతున్నారు. కనీసం ప్రచారంలో కూడా తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇక అన్నకు..తెలుగుదేశం పార్టీకి కూడా గుడ్‌బై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ్ముడు దూరమైతే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దివ్యకు కచ్చితంగా నష్టమే అంటున్నాయి టీడీపీ వర్గాలు. -
పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏమిటో?
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ప్రకటించారు. రాష్ట్రం అంతా దుర్భిణీ వేసి వెతికి చివరికి పిఠాపురం ఎంచుకున్నారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పలు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నా గెలుపుపై గ్యారెంటీ కనిపించడంలేదు. పిఠాపురం అనుకున్నప్పటినుంచీ అక్కడ నాన్ లోకల్ వివాదం మొదలైంది. మాకు పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలంటూ అక్కడ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నియోజకవర్గానికి గెస్ట్‌గా వచ్చే నేత వద్దంటూ అక్కడివారు నినదిస్తున్నారు. మరి అక్కడ పవన్ పరిస్థితి ఏంటో చూద్దాం. గత ఎన్నికల్లో తనను ఓడించినందుకు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోని ప్రజల్ని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నిందించారు. ఒక్క చోట కూడా గెలిపించకపోవడం వల్లే తన పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని వాపోయారు. పదేళ్ళుగా చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్న పవన్‌కల్యాణ్ ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ ఫోబియా పవన్‌ను వెంటాడుతోంది. అందుకే నియోజకవర్గం ఎంచుకోవడానికి ఇంత ఆలస్యం చేశారు. తనకు కులం లేదని చెప్పుకుంటూనే నిరంతరం కాపుల జపం చేస్తున్నారు. అందుకే కాపులు మెజారిటీగా ఉండే పలు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుకున్నా అక్కడి పరిస్థితులు సానుకూలంగా లేవని అర్థమైంది. దీంతో కాకినాడ జిల్లా పిఠాపురం అయితే బెటర్ అని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేత తమ అనుచరులతో ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు జనసేనలో కలకలం రేపాయి. లోకల్ ..నాన్ లోకల్ అనే అర్ధం వచ్చేలా పిఠాపురం నియోజకవర్గంలో దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. పిలిస్తే పలికేవాడే మాకు కావాలంటూ వెలిసిన ఆ ఫ్లెక్సీలు పవన్‌ను అక్కడ పోటీ చేయవద్దనే ఏర్పాటు చేసి ఉంటారని..అది కూడా టీడీపీ ఆశావహుడు వర్మ ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడ ఎప్పటినుంచో పనిచేసుకుంటున్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ మాత్రం జనసేనకు ఇవ్వడానికి వీల్లేదని గట్టిగా పట్టుపడుతున్నారు. చదవండి: పవన్‌కు షాక్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు పొత్తులో భాగంగా పిఠాపురం జనసేన ఖాతాలో చేరుతుందనే ప్రచారంతో టీడీపీ శిబిరంలో అసమ్మతి రాజుకుంది. సీటు జనసేనకు కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమని కొద్ది రోజుల క్రిందట టీడీపీ నేత వర్మ అనుచురులు చంద్రబాబుకు హెచ్చరికలు పంపారు. ఆ మధ్య వర్మ నిర్వహించిన పలు సమావేశాల్లో.. పిలిస్తే పలికే వాడికే ఓటు వేయ్యాలి కానీ.. ఎక్కడో దూరంగా ఉంటూ..అప్పుడప్పుడు వచ్చేవాళ్ళకు ఓటు వేసి సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పిలిస్తే పలికే వ్యక్తి వర్మ.. లోకల్ వ్యక్తి వర్మ అని పలువురు బాహటంగానే ప్రచారాలు మొదలు పెట్టారు. దీంతో పిఠాపురంలో వెలసిన ప్లెక్సీలు టీడీపీ పనే అని అందరు చర్చించుకుంటున్నారు. పిఠాపురానికి నాన్ లోకల్ అయిన పవన్ కళ్యాణ్‌కు అడ్డుకట్ట వేసేలా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. పవన్ పోటీ చేస్తే మాత్రం సహకరించరాదని టీడీపీ నేత వర్మ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగా గీత క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎంపీ అయిన గీత గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బాద్యతలు నిర్వహించిన వంగా గీతకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. దీంతో పవన్ తన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం అనుకుంటున్నప్పటికీ అక్కడ అంతే బలంగా ఉన్న వంగా గీతను ఎదుర్కొని విజయం సాధించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. -
YSRCP కోనసీమ అభ్యర్థులు వీళ్లే
కోనసీమ జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
అనపర్తి: ‘రామకృష్ణారెడ్డి అక్రమాలను ప్రజలకు వివరిస్తా’
సాక్షి,అనపర్తి: కాకినాడలోని అనపర్తిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ళ పర్వం సాగుతోంది. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి పరుడంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచాడు. దీంతో ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్దమయ్యారు. ఇవాళ (శుక్రవారం) ముహూర్తం ఖరారు చేసుకున్న చేసుకునన్నారు. దీంతో అనపరర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి చర్చలకు వేదికను సిద్ధం చేశారు. అయితే అక్కడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి బయల్దేరగా.. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నల్లమిల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనపర్తిలో టీడీపీ నేత రామకృష్ణారెడ్డి తనకు చేసిన సవాలును ఎదుర్కోవడానికి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సిద్ధమైయ్యారు. రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలను స్క్రీన్ పెట్టి మరీ ప్రజలకు వివరిస్తానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ చర్చకు పోలీసులు అనుమతివ్వలేదు. ఇరుపక్షాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. -
పెద్దాపురంలో మార్మోగిన సాధికార నినాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా పెద్దాపురంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ ప్రజల సాధికార నినాదం మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన మేలును ప్రతిబింబిస్తూ శనివారం పెద్దాపురంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర జన ప్రభంజనమే అయ్యింది. పెద్దాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సెంటర్ వరకూ సాగింది. బస్సు యాత్ర ముందు భారీ బైక్ ర్యాలీలో యువత కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరెత్తిన ప్రతిసారీ కరతాళ ధ్వనులతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన సీఎం జగన్: మండలి చైర్మన్ మోషేన్ రాజు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. దళితుడినైన తానే జగనన్న ప్రభుత్వంలో రాజకీయ సమానత్వనికి చిహ్నమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 17 మందిని మంత్రులుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌దేనని అన్నారు. రాజకీయ, సామాజిక, ధన ప్రభావాలు చూడకుండా బడుగులకు పెద్ద పదవులు ఇచ్చిన నేత జగన్ ఒక్కరేనని చెప్పారు. సీఎం జగన్ పాలనలో అన్నింటా బడుగులకు అగ్రస్థానం: ఎంపీ సురేష్ సీఎం వైఎస్ జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రస్థానం లభిస్తోందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. సంక్షేమ పథకాల్లో, రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పేదలు మరింతగా బాగు పడాలంటే జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని, అందు కోసం ఆయనకు అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ప్రేమ, దయ కలిస్తే జగనన్న: జూపూడి ప్రేమ, దయ కలిస్తే సీఎం వైఎస్ జగనన్న అని, ఆయన సమానత్వం చూపించే వ్యక్తి అని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. అందుకే నేడు సామాజిక సాధికార యాత్ర చేయగలుగుతున్నామని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి సీఎం వైఎస్ జగన్ పరిపాలనే కారణమని చెప్పారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు చెప్పారు. అమ్మ ఒడి, రైతు భరోసా, రుణమాఫీ, పింఛన్లు వంటి కార్యక్రమాలతో సంక్షేమాన్ని ప్రతి గుమ్మం వద్దకు చేర్చారని తెలిపారు. ప్రజలందరూ బాగుండాలనే తపనతో పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆరోగ్యం బాగుండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని తపిస్తూ విద్య, వైద్య రంగాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. పేదవారిని గౌరవించి, పథకాలను వారి ఇంటి వద్దకే పంపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అయ్యరక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి, పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. -
పవన్ ఛాయిస్ కాకినాడ.?
కాకినాడ.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది పెన్షనర్ల ప్యారడైజ్ అని. రాష్ట్రంలో ఎక్కడ రిటైరయినా.. కాకినాడకు వచ్చి సెటిల్ కావాలని కలలు కనే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ప్రశాంత వాతావరణం, అందమైన నగరం, సముద్రం నుంచి వచ్చే వెచ్చటి గాలులు.. వెరసి కాకినాడకు విశ్రాంత జీవితం గడపాలనుకుంటారు. ఇప్పుడు కాకినాడ గురించి ఈ చర్చ అంతా ఎందుకంటే.. ఈ నగరంపై పవన్ కన్నుపడింది. కాకినాడలో పవన్ క్యాంపు పవన్ కళ్యాణ్.. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో అర్థంకాక తెగ సతమతమవుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలను పరిశీలించినప్పటికీ కాస్త బెటర్ ఆప్షన్‌ను ఎంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కాకినాడపై పవన్ దృష్టి పడింది. అసలు కాకినాడలో తనకు అనుకూలమేంటీ? ప్రతికూలమేంటీ? అన్న సమీకరణాలతో కాకినాడపై దృష్టి సారించారు పవన్‌కళ్యాణ్. మకాం కోసం ఇల్లు కావలెను కాకినాడలో సొంత ఇంటి కోసం సన్నాహాలు ప్రారంభించారు పవన్ కళ్యాణ్. తన నివాసం కోసం అనువైన ప్రాంతాల పరిశీలన చేస్తున్నారు. పార్టీ నేతలతో మాట్లాడి ఓ విశాలమైన ఇల్లు కావాలని, ఎన్నికల వరకు ఉండేలా ఏర్పాట్లు ఉండాలని చెబుతున్నారు. మీటింగ్‌లతో పాటు, కార్యకర్తలను కలిసేందుకు వీలుండేలా ఓ భారీ భవంతి మంచి సెంటర్లో తీసుకోవాలన్న యోచనలో పవన్ ఉన్నట్టు తెలిసింది. పోటీ చేస్తే.. ఫలితమెలా ఉండవచ్చు? మరొకవైపు వార్డుల వారీగా సామాజిక వర్గాలతో భేటీలకు కూడా శ్రీకారం చుట్టారు పవన్. ఇప్పటికే కాకినాడ 28 వార్డు పెద్దలతో మంతనాలు జరిపిన పవన్.. మరో రెండు మూడు రోజుల్లో అక్కడే పర్యటించనున్నారు. కాకినాడ నుంచే పోటీ చేస్తే.. గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై మంతనాలు చేస్తున్నారు. కులాల వారీగా సమీకరణాలెలా ఉన్నాయి? ఏ వర్గం జనసేనను గుర్తిస్తుంది? ఎవరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు అవకాశాలుంటాయి? అన్న వాటిపై చర్చిస్తున్నారు. గత ఎన్నికల్లో గ్లాసు బోల్తా.! గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ గాజువాకలో 16753 ఓట్ల తేడాతో పవన్ ఓటమి భీమవరంలో 8357 ఓట్ల తేడాతో పవన్ ఓటమి గతంలో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు పవన్. పార్టీ అధ్యక్షుడిగా బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేయడానికి ఏడు-ఎనిమిది నియోజకవర్గాలు పరిశీలన చేసినా చివరకు కాకినాడనే చాయిస్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గాజువాకలో పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి -
యనమల సాక్షిగా.. తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
తుని రూరల్: నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వేదికపై తెలుగు తమ్ముళ్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుని బాహాబాహీకి దిగిన ఘటన సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద చోటు చేసుకుంది. తుని నియోజకవర్గ స్థాయిలో 2024 నూతన సంవత్సర వేడుకలను టీడీపీ నాయకులు సాయి వేదికలో ఏర్పాటు చేశారు. వేదికపై యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు, యనమల దివ్య (రామకృష్ణుడి కుమార్తె) ఉండడంతో నాయకులు, కార్యకర్తలు వరుస క్రమంలో వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొంత సమయం తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. తొండంగి మండలం నుంచి అనుచరులతో తరలివచ్చిన యనమల రాజేష్.. రామకృష్ణుడిని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలైన్ తప్పించుకుని వేదిక పైకి వెళుతుండగా.. వరుసగా రావాలంటూ కృష్ణుడి వర్గీయులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన రాజేష్ వర్గీయులు ఒక్కసారిగా చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజేష్, కృష్ణుడి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల వారు పరస్పరం ఘర్షణ పడుతూ కొట్టుకున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ఇరు వర్గీయులను మందలించి, శాంతింపజేశారు. ఇదీ చదవండి: పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి -
సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న
సాక్షి, కాకినాడ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజ్వరిల్లింది. సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాది మంది జనం కదలివచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగనన్న అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను బహిరంగ సభలో బడుగు వర్గాలకు చెందిన నేతలు తెలియచేస్తుంటే ప్రజలు హర్షధ్వానాలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కురసాల కన్నబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ..... – 14 సంవత్సరాల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్ల జగనన్న పాలనకు తేడా గమనించాలి. – ప్రతి అవ్వాతాత రూ.2,750 పింఛను తీసుకుంటున్నారు. వికలాంగులు రూ.3,500 అందుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం గతంలో వైయస్సార్, నేడు జగనన్న. – చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు 70 రూపాయలున్న పింఛన్ కనీసం 10 రూపాయలైనా పెంచాడా? – చంద్రబాబు 30 లక్షల మందికి వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తే, ఈరోజు రూ.2,750 చొప్పున 64 లక్షల మందికి ఇస్తున్న జగనన్న. – ఫీజు రీయింబర్స్మెంట్ అంటే గుర్తుకొచ్చేది వైయస్సార్. – ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచిన చంద్రబాబు. 30 శాతం స్లాబ్ విధించి 70 శాతం తల్లిదండ్రులు కట్టుకోవాలని విద్యార్థులను గాలికొదిలేశాడు. – మళ్లీ జగనన్న రాగానే వైయస్సార్ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇస్తున్నారు. – జగనన్న అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే సచివాలయ వ్యవస్థ ద్వారా 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. దేశానికే దిక్సూచిగా నిలిచిన జగనన్న. – రాజశేఖరరెడ్డి సంక్షేమంలో రెండడుగులు వేస్తే, జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. – రాజ్యసభకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను 14 సంవత్సరాల్లో ఒక్కరినీ పంపని బాబు. – నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన జగన్మోహన్రెడ్డి. సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న. – ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన జగనన్న. బాబు కేవలం ముగ్గురికే ఇచ్చి ఏడాదికోసారి మార్చేశారు. నలుగురు ఎస్సీ మంత్రుల్నీ కొనసాగిస్తున్న సీఎం జగన్. – ఎస్టీలు లేని మంత్రివర్గం చంద్రబాబుది, ఎస్టీని ఉపముఖ్యమంత్రి చేసిన జగన్. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన జగనన్న. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... – అంబేద్కర్ దగ్గర నుంచి జ్యోతిరావు పూలే, సాహూ మహరాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, జగ్జీవన్‌రామ్ లాంటి వారు సామాజిక సాధికారత కోసం విప్లవాలు చేశారు. – ఏపీలోగానీ, భారతదేశంలోగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు వారి స్థితిగతుల కోసం ఆలోచించిన నాయకులు కరువయ్యారు. – ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు భరోసా, ధైర్యం వచ్చాయి. సమాజంలో అసమానతలు తొలిగాయి. – రాజ్యాధికారం వచ్చేలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, డబ్బులు అందించి గుండెమీద చెయ్యి వేసుకొని పేదవారు బతకడానికి అవకాశాలు వచ్చాయి. – మన పిల్లలు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ చదువుతున్నారు. – 31 లక్షల పట్టాలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందుతున్నాయి. – రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా పేదవారికి అందిస్తే అగ్రతాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కింది. – ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు చంద్రబాబు. బీసీ కులాల తోకలు కత్తిరిస్తాన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారన్నాడు. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని బాబు. ఎస్టీ కమిషన్ ఇవ్వలేదు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు చేయించాడు. – 2014లో మూడు పార్టీలు వచ్చాయి. 648 వాగ్దానాలిచ్చాయి. ఒక్కటీ నెరవేర్చలేదు. – చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. – పేదల కోసం, భావితరలాల భవిష్యత్ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగనన్న. – 11.5 శాతం ఉండే పేదరికం 6 శాతానికి తగ్గిందంటే జగనన్న పేదల కోసం ఎంతగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న సీఎం కావడం అవసరం. 2024 ఎన్నికల్లో మనం తప్పు చేస్తే మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. ఎంపీ నందిగం సురేష్, మాట్లాడుతూ.... – జగనన్న తన పాదయాత్రలో మన కష్టాలు దగ్గర నుంచి చూశాడు. – నాలుగున్నరేళ్లలో జగనన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. – జగనన్నకు పేదవాడి గుండె తెలుసు. వ్యవసాయ కూలీల చమటవాసన తెలుసు. – మన జీవితాల్లో చీకటి నింపిన వ్యక్తి చంద్రబాబు. రెండెకరాల నుంచి ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు. ఆ సంపద మనదే. – నాడు–నేడు కింద స్కూళ్లు గొప్పగా ఉన్నాయంటే, అవ్వాతాతలు పింఛన్ తీసుకుంటున్నారంటే, వ్యవసాయ రైతులు బాగున్నారంటే జగనన్న కారణం. – వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. దేశం మొత్తం మీద ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. – మన జీవితాలకు వెలుగునిచ్చే వ్యక్తి జగనన్న. 20–25 ఏళ్లు సీఎంగా ఉంచుకోగలిగితే మన పిల్లలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా అవుతారు. – చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకురాదు. వెన్నుపోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. – 2014లో మద్దతు పలికి 2019లో బాబును తిట్టిన పవన్ 2024లో మళ్లీ బాబు మంచోడంటున్నాడు. – పేదవాళ్లు గొప్పవాళ్లు అవ్వాలని అసైన్డ్ భూములకు పట్టాలిచ్చిన జగనన్న. – అమరావతిలో అసైన్డ్ భూములు దోచుకుతిన్న చంద్రబాబు. – ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు నేనున్నానంటూ జగనన్న భరోసా ఇస్తున్నారు. – సామాన్యుడు పార్లమెంటులో కూర్చున్నాడంటే కారణం జగనన్న. ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.... – 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు కేబినెట్లో ఉన్నారు. – నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. – డైరెక్టర్ పదవులు వెతికి వెతికి బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారు. అలాంటి ఆలోచన చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా. – నాలుగేళ్లలో రూ.7 లక్షల కోట్లు రాష్ట్రానికి బడ్జెట్ ఉంటే రూ.4.15 లక్షల కోట్లు ఈ వర్గాలకే ఇచ్చారు. – లాంతరు పెట్టి వెతికినా గతంలో బడుగు వర్గాల్లో ఇంజనీరు, డాక్టరు కనిపించేవారు కాదు. ఈరోజు ప్రతి ఇంట్లో ఇంజనీరు,డాక్టర్ ఉన్నారంటే కారణం వైయస్సార్. – ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చి చదువుకొనే అవకాశం కల్పించారు. – ఇంటి స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారు. రాజధానిలో సోషల్ డెమోగ్రఫీ చెడిపోతుందన్నారు. – 30 లక్షల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న జగనన్న. – మహిళలంటే పొలాల్లో కోతలకే, వంటింటికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతి పథకాన్నీ మహిళ పేరు మీద పట్టా, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము తల్లి పేరుమీద ఖాతాలో వేస్తున్నారు. – గతంలో పార్టీ, కులం చూసేవారు. మనకు ఓటు వేస్తారా అని చూసేవారు. మన కులాలను బానిసలుగా భావించేవారు. – ఈరోజు ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన పని లేదు. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ... – జనం గుండెచప్పుడు జగనన్న. కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబం గుండెల్లో జగనన్న ఉన్నారు. – వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన జగనన్న. – దేశం మొత్తం ఆయనవైపు తిరిగి చూస్తోంది. రోల్‌మోడల్‌గా సామాజిక న్యాయాన్ని, సంస్కరణలను అమలు చేస్తున్నారు. – 2014–19 మధ్య ఏ విధమైన సామాజిక న్యాయం చంద్రబాబు చేశారు? ఈరోజు ఏ విధమైన సామాజిక న్యాయం జరుగుతోందో చర్చకు సిద్ధం. – రూ.2.40 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేసి సామాజిక న్యాయానికి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జగనన్న ఉన్నారు. – ఏ ఎన్నికల్లో, ఏ పార్టీ మేనిఫెస్టోలో చూసినా జగనన్న పథకాలు కనిపిస్తాయి. – వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, పెన్షన్ల విధానం ఇస్తామని రాష్ట్రాలు చెబుతున్నాయి. – బాబుకే గ్యారెంటీ లేదు. ఆయన ఇంకేం గ్యారెంటీ ఇస్తాడు. బాబు గ్యారెంటీల్లోనూ జగనన్న స్పూర్తి ఉంది. -
‘జగనన్నకు పేదవాడి మట్టి వాసన తెలుసు’
ప్రత్తిపాడు(కాకినాడ జిల్లా): వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రలో భాగంగా 19వ రోజు కాకినాడ నియోజకవర్గంలో కొనసాగింది. దీనిలో భాగంగా ప్రత్తిపాడు అల్లూరి సీతారామరాజు సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్వంలో జరిగిన ఈ బహిరంగ సభకు పలువురు వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ‘ఆత్మగౌరంతో బతికేలా సీఎం జగన్ ఏలాంటి పాలన చేశారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఆలోచన చెయ్యాలి. క్యాబినేట్,ఛైర్మన్ పదవుల్లో ఉన్నత స్ధానం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు. సామాజి న్యాయంతో అధికార, వనరుల పంపిణీ అన్ని వర్గాలకు చేశారు.30 లక్షల మందికి ఇళ్ళ స్ధలాలు ఇచ్చి ఇళ్లు కట్టుకునేందుకు ఆర్ధిమ సహయం చేశారు. గత ప్రభుత్వం లో వారి మనుషులైతే పథలు ఇచ్చేవారు.అర్హత ఆధారంగా పధకాలు అందజేసిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం.పేద వాడికి అత్యంత గౌరవం సీఎం జగన్ కల్పించారు’ అని స్పష్టం చేశారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత బడుగు,బలహీన వర్గాలకు భరోసా లభించింది. ఏపీ చరిత్రలో రూ. 240 కోట్లు పేదవారికి సంక్షేమ పథకాల ద్వారా నేరుగా అందించారు. ఎస్సీలగా పుట్టాలని కోరుకుంటారా? బీసీల తోకలు కట్ చేస్తానన్న చంద్రబాబు. టీడీపీ ఇచ్చిన 600 హమీలు అమలు చేసిందా?, కాకమ్మ కబుర్లు చెప్పే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని చూశాం. పేదల కోసం పెద్ద పీట వేసిన సీఎం జగన్‌నూ చూశాం. చంద్రబాబు వల్ల బడుగు,బలహీన వర్గాలు మోసపోయాయి. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు అవసరం. చంద్రబాబును కుయోక్తులను నమ్మద్దు అని ప్రజలను కోరుతున్నా. చంద్రబాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేకుండా చెయ్యాలి’ అని తెలిపారు. ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. ‘ జగనన్నకు పేదవాడి మట్టి వాసన తెలుసు. పాదయాత్రలో పేదలను చూసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు ఆర్పేసిన వ్యక్తి చంద్రబాబు. మన సంపదనను చంద్రబాబు దోచుకున్నాడు. ఐదేళ్ళ పాలనలో మనపై చంద్రబాబు పెత్తనం చేశాడు. మన జీవితాల్లో వెలుగు ఇచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం గుర్తుకు వస్తుంది. పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు పొడుస్తాడు. 2019లో చంద్రబాబును దోపిడీదారుడు అని విమర్శించిన పవన్.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పంచన చేరాడు’ అని మండిపడ్డారు. -
జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చ
సాక్షి, కాకినాడ జిల్లా: జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీటు తనదేనన్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. పవన్ కళ్యాణ్ కూడా తనవైపే ఉన్నాడని, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్రకు సీటు ఇస్తే పొత్తులో ఉండనంటూ జ్యోతుల స్పష్టం చేయడంతో సమావేశాన్ని సూర్యచంద్ర బహిష్కరించారు. దీంతో జ్యోతుల తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య తోపులాట చోటు చేసుకుంది. జనసేన-టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. కాగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వెలుపల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించిన నాటినుంచి ఇదే తీరు కనిపిస్తోంది. గత మంగళవారం.. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సమన్వయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు బండబూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సమన్వయ సమావేశమని ప్రకటించినా.. ఇరుపక్షాలు ఎదురెదురుగా బల్లలు, కుర్చీలు వేసుకుని వాదోపవాదాలకు దిగారు.. తాజాగా జగ్గంపేటలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం రచ్చ రచ్చగా మారింది. చదవండి: మరోసారి బయటపడ్డ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు -
పైకి పొత్తులు.. లోపల కత్తులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/పిఠాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వెలుపల జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించిన నాటినుంచి ఇదే తీరు కనిపిస్తోంది. తాజాగా మంగళవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన సమన్వయ సమావేశంలో టీడీపీ, జనసేన నేతలు ఒకరిపై ఒకరు బండబూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగడం చర్చనీయాంశమైంది. సమన్వయ సమావేశమని ప్రకటించినా.. ఇరుపక్షాలు ఎదురెదురుగా బల్లలు, కుర్చీలు వేసుకుని వాదోపవాదాలకు దిగడం చర్చనీయాంశమైంది. ఇలా మొదలైంది పిఠాపురం పట్టణ టీడీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రెండు పార్టీల నేతలు సమన్వయ సమావేశం పేరిట భేటీ అయ్యారు. టీడీపీ తరఫున నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ, జనసేన నుంచి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పార్టీ నేతలతో కలసి సమావేశానికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ప్రారంభోపన్యాసం చేస్తూ.. నియోజకవర్గంలో రూ.2,800 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని చెప్పుకున్నారు. మరి అంత అభివృద్ధి చేస్తే నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓడించారని జనసేన ఇన్చార్జి తంగెళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. టీడీపీ తరఫున గెలిపించినా.. చేసిన అభివృద్ధి ఏమీ లేదని వర్మను ఉద్దేశించి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చేయకపోవడంతోనే గత ఎన్నికల్లో ఓడిపోయారని, వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతిచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ‘మీ పవన్ అన్నిచోట్లా ఓడిపోయారు’ జనసేన ఇన్చార్జి శ్రీనివాస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన టీడీపీ ఇన్చార్జి వర్మ రాష్ట్రంలో తానొక్కడినే ఓడిపోలేదని అతిరథ మహారథులు సైతం ఓడిపోయారన్నారు. ‘మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ ఓటమి చూడలేదు. కానీ.. మీ నాయకుడు పవన్ కల్యాణ్ అన్నిచోట్లా ఓడిపోయార’ని వర్మ కౌంటర్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో తనకు 75 వేలు ఓట్లు వస్తే.. జనసేనకు కేవలం 35 వేలు మాత్రమే వచ్చాయని గుర్తు చేసుకోవాలన్నారు. దీనిని బట్టి మీ సత్తా ఏపాటిదో.. మా సత్తా ఏపాటిదో ప్రజలే నిర్ణయించారన్నారు. ఈ తరుణంలో జనసేన నేతలు వర్మకు వ్యతిరేకంగా కేకలు వేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ‘అప్పట్లో టీడీపీ సీటు ఇవ్వకుండా బయటకు గెంటేస్తే దొంగ ఏడుపులు ఏడ్చిన విషయం గుర్తు లేదా. జాలిపడి జనసేన సహా అంతా కలిసి ఓటేసి గెలిపించిన విషయం గుర్తు లేదా’ అని జనసేన నేతలు వర్మను నిలదీశారు. బల్లలు, కుర్చీలు తన్నేసిన జనసేన టీడీపీ నాయకుడు కొండేపూడి ప్రకాశ్ మాట్లాడుతూ.. టీడీపీ నేతలను జనసేనలో జాయిన్ చేసుకోవద్దని.. జనసేన వారిని టీడీపీలో చేర్చుకోవద్దని సూచించగా మరోసారి గందరగోళం నెలకొంది. ఇంతలో జనసేన నాయకులు కల్పించుకుని దిక్కులేని పరిస్థితుల్లో టీడీపీ వాళ్లే జనసేనలోకి వచ్చి చేరుతున్నారని, తమ పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లడం లేదన్నారు. దీంతో టీడీపీ ఇన్చార్జి వర్మ సహా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. టీడీపీ నేత వర్మతో మనకు పనిలేదంటూ జనసేన ఇన్చార్జి ఉదయశ్రీనివాస్ సహా జనసేన నేతలు, ఆ పార్టీ శ్రేణులు అంతా కలిసి మూకుమ్మడిగా సమావేశంలో బల్లలు, కుర్చీలు తన్నేసి బయటకు వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ నేతలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇరుపార్టీల సమన్వయ సమావేశం రసాభాసగా ముగిసింది. -
నిరుపేద కుటుంబాలకు సీఎం ఆపన్న హస్తం
కాకినాడ సిటీ: సీఎం వైఎస్ జగన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. నిరుపేదలు పడుతోన్న కష్టాలను విని స్పందించి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం సీఎంను హెలిప్యాడ్ వద్ద పలువురు కలిసి తమ గోడు విన్నవించారు. వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సాయం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టరేట్లో 17 మంది బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లా అందజేశారు. ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ జిల్లా పర్యటనలో భాగంగా పలువురు బాధితుల సమస్యలు విని తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలిచ్చారన్నారు. శస్త్ర చికిత్సల కోసం కొందరు, ఇతర ఆరోగ్య సేవల కోసం మరికొందరు తమకు సహాయం చేయాలని సీఎంను అడగ్గా ఆ వెంటనే తదనుగుణంగా సీఎం ఆదేశాలిచ్చారని, దీంతో తమను ఆదుకున్నందుకు సీఎం జగన్‌కు లబి్ధదారులు ధన్యవాదాలు తెలిపినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ఆర్థిక సహాయం పొందిన వారిలో ఈ సత్య సుబ్రహ్మణ్యం (పెద్దాపురం), టీ.ఆనంద్‌కుమార్ (కిర్లంపూడి), కృష్ణకాంత్ (పెద్దాపురం), బుర్రా రాజు (పెద్దాపురం), లక్ష్మి ఆకాంక్ష (పెద్దాపురం), సింగం శ్యామల భాను (కాకినాడ), ఐ సాయి వెంకట్ (పెద్దాపురం), డి నవీన్ (పెద్దాపురం) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పి.మాధురి నవ్య, ఐ.నైనిక, జె.వీరవెంకట సాయి, సిహెచ్ హర్షిత, వి.శశిశ్రీనేత్ర, జి.సుజాత, ఎన్.సతీష్, పి.ప్రేమ్ చంద్, కె.మార్తమ్మ (నంద్యాల)ఉన్నారు. -
లోకేష్ సన్నిహితుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు
సాక్షి, కాకినాడ జిల్లా: లోకేష్ సన్నిహితుడు, టీడీపీ నేత గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. నారా లోకేష్‌కి ప్రధాన అనుచరుడుగా ఉన్న చంద్రమౌళి ఇంట్లో మూడు బృందాలుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 5 గంటలకు సోదాలు కొనసాగుతున్నాయి. ఆక్వా, క్వారీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టిన చంద్రమౌళి.. ఆదాయంలో తేడాలు చూపించి ఇన్ కంటాక్స్లు ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. బినామీల ద్వారా వ్యాపారాలు చేసి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. చదవండి: ‘అమ్మా పురంధేశ్వరి గారూ.. మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు’ -
రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80 శాతం ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన సీఎం జగన్.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అనిచెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. సామర్లకో లేఅవుట్లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, లక్షల విలువ చేసే ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవును తనకు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయని, పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ‘గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదని సీఎం విమర్శించారు. పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని దుయ్యట్టారు. వేలకోట్లు ఖర్చు చేసి పేదల ఇంటి కలను సాకారం చేస్తున్నామని.. పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. చదవండి: Updates: చంద్రబాబు కేసు టుడే అప్డేట్స్ -
రేపు కాకినాడ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
టీడీపీ నేతకు లివర్ వ్యాధి.. సీఎం రిలీఫ్ ఫండ్ రూ.20 లక్షలు మంజూరు
తుని: కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరానికి చెందిన టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ మాజీ సభ్యుడు కె.కృష్ణకు లివర్ వ్యాధి చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.20 లక్షలు మంజూరు అయింది. ఇందుకు సంబంధించిన ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణ భార్య లక్ష్మికి అందజేశారు. కొంతకాలంగా కృష్ణ లివర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఏఎంసీ మాజీ చైర్మన్ మురళి మంత్రి రాజా దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నం మణిపూర్ ఆస్పత్రిలో కృష్ణకు వైద్య సేవలు అందిస్తున్నారు. తమ ప్రభుత్వం పథకాలతో పాటు వైద్య సేవలను పార్టీలకు అతీతంగా అందిస్తున్నదని మంత్రి రాజా అన్నారు. చదవండి: Fact Check: బురద రాతలే పునరావృతం -
బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా?
పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు బాటలో నడుస్తున్నారా? నమ్మినవారిని నట్టేట ముంచి మరొకరిని తెరపైకి తెస్తున్నారా? డబ్బే ఇందులో కీలక పాత్ర పోషిస్తోందా? పిఠాపురం నియోజకవర్గంలో స్వయంగా చిచ్చు రాజేశారా? ఇప్పటికే రెండు వర్గాల కుమ్ములాటకు మరో వర్గాన్ని జత చేశారా? పిఠాపురం గ్లాస్ పార్టీ మూడు ముక్కలు కావడానికి కారణం ఏంటి. ఇందులో కొత్త ఇన్చార్జ్ పాత్ర ఎంత? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ మూడు వర్గాలుగా చీలింది. మొన్నటి వరకు పిఠాపురం పార్టీ ఇన్చార్జ్గా ఉన్న మాకినీడి శేషుకుమారిని తప్పించి తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన టీ టైం అధినేత తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్‌ను ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో అధినేత నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు శేషుకుమారి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలో ఏకైక మహిళా ఇన్చార్జ్గా శేషుకుమారి ఉన్నారు. 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్న శేషుకుమారికి.. కొంతకాలం క్రితం పార్టీలో చేరి షాక్ ఇచ్చారు పిఠాపురంకు చెందిన డాక్టర్ పిల్ల శ్రీధర్ దంపతులు. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తూ ఈ దంపతులు జనసేనలో చేరి రెండవ వర్గాన్ని తయారు చేశారు. కాకినాడకు చెందిన శేషుకుమారిని పిఠాపురం నియోజకవర్గానికి నాన్ లోకల్ గా ముద్ర వేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చేసిన వారాహి యాత్రలో కూడా ఎక్కడా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న శేషు కుమారి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జనసేన క్యాడర్ అయోమయానికి గురైంది. ఏ వర్గంవారిని అనుసరించాలో తెలియక తికమక పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో ఉదయ శ్రీనివాస్‌కు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో క్యాడర్ మరింత అయోమయానికి గురయింది. చదవండి: ఏమయ్యా లోకేష్.. అంతలా లేపినా కూడా తుస్సుమనిపించావ్? టీడీపీతో పొత్తు కుదిరితే శ్రీనివాస్ పిఠాపురం నుండి పోటీ చేస్తారని తెలుస్తోంది. శేషుకుమారి, పిల్ల శ్రీధర్ దంపతులు వచ్చే ఎన్నికల కోసం పెట్టుకున్న ఆశలపై పవన్ కల్యాణ్ నీళ్లు చల్లేశారు. ఇదిలా ఉంటే ఎక్కడో కడియంకు చెందిన శ్రీనివాస్‌కు పిఠాపురం బాధ్యతలు అప్పగించడం ఎందుకని పవన్‌కల్యాణ్‌పై ఫైర్ అవుతున్నారు. కడియం నుంచి వచ్చి పిఠాపురంకు ఇన్చార్జ్ అయిన శ్రీనివాస్ జనసేనకు ఆర్థిక సాయం చేస్తున్న విషయం అక్కడి జన సైనికులకు తెలియదు. వారాహి వాహనం తయారీ నుంచి యాత్ర వరకు స్పాన్సర్ చేస్తున్నది శ్రీనివాస్ అంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయవాడలో పార్టీ కార్యాలయం, రాజమండ్రిలో కడుతున్న పార్టీ కార్యాలయంకు నిధులు సమకూరుస్తున్నది కూడా ఇతనే అని చెబుతున్నారు. అందుకే జనసేనలో శ్రీనివాస్ చెప్పిన మాట వేద వాక్కుగా నడుస్తోందట. అంత పలుకుబడి ఉన్నందునే తన బావైన కాకినాడకు చెందిన న్యాయవాది తోట సుధీర్‌ను జనసేనలోకి రప్పించి ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా పవన్ కల్యాణ్‌తో ప్రకటింపచేశారు శ్రీనివాస్. జనసేన పార్టీ గ్లాస్ పవన్‌కల్యాణ్‌ది అయినా అందులో ఉన్న టీ మాత్రం టీ టైం అధినేత శ్రీనివాస్‌దే అన్న టాక్ నడుస్తోంది. చదవండి: పరువు తీసుకుంటున్న చంద్రబాబు & లోకేషం ఇక ఇన్చార్జ్ బాధ్యతల నుండి తప్పించిన మాకినీడి శేషుకుమారికి ఇంకా పెద్ద పదవి ఇప్పిస్తామని ఒప్పించారట జనసేన నేతలు. అయితే పవన్ నిర్ణయంపై తిరుగుబావుటా ఎగుర వేయడానికి సిద్దంగా ఉన్నారట మాకినీడు శేషుకుమారి. మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పే పవన్.. ఒక మహిళా ఇన్‌చార్జ్‌ను తప్పించి అవమానించడం సరికాదని ఆమె అనుచరులు భగ్గుమంటున్నారు. -
‘టిడ్కో ఇళ్లపై ఓ వర్గం మీడియా విషప్రచారం’
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఊళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్న ఒక వర్గం మీడియా, టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. టీడీపీ నేతలు టీడ్కో గృహాలు తమవని సెల్ఫీ చాలెంజ్‌లు చేస్లున్నారని, టిడ్కో ఇళ్లను సీఎం జగన్ సమూలంగా సంస్కరించారన్నారు. ‘70 వేల టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేశాం.ఆనాడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో..ఇప్పుడు వారే ఉన్నారు.పేదలకు తమ సొంత ఇంటి కల వాస్తవానికి చాల దూరంగా ఉంటుంది.సొంత ఇళ్ళు ఉన్నప్పుడు సమాజంలో చాల గౌరవం ఉంటుంది.అన్ని సముదాయాలతో పేదల ఇంటి కలను సిఎం జగన్ సాకారం చేశారు.లబ్ధిదారుల చెలించాల్సిన సొమ్మును సగానికే తగ్గిండం తో పాటుగా ..రూపాయికే సొంతింటిన అప్పగించిన ఘనతవ సిఎం జగన్‌ది.గత పాలకులు ఓట్ల రాజకీయం చేశారు.30 లక్షల ఇళ్ళ పట్టాల ఇవ్వడం ప్రపంచ రికార్డ్’ అని పేర్కొన్నారు. -
Road Accident : ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం...
(కాకినాడ జిల్లా): కాకినాడ జిల్లా తొండంగి మండలం జి.ముసలయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన ముగ్గు రు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తొండంగి ఎస్సై రవికుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురానికి చెందిన పోలవరపు కిరణ్ (23), పసుపులేటి దుర్గా శివప్రసాద్ (20), కాకర వీరబాబు(21) స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి బుధవారం రాత్రి బైకుపై స్వగ్రామం నుంచి బీచ్‌రోడ్డు మీదుగా అన్నవరంలో జరిగే స్నేహితుని వివాహానికి బయలుదేరారు. వేమవరం, యర్రయ్యపేట మీదుగా ముగ్గురూ వస్తుండగా జి.ముసలయ్యపేట వద్ద వీరి బైకు ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో పోలవరపు కిరణ్, కాకర వీరబాబులు సంఘటన స్ధలంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. దుర్గా శివప్రసాద్‌కు తీవ్రగాయాలై ప్రాణాపా య స్ధితిలో ఉండగా స్ధానికులు తుని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కన్నవారికి కడుపు కోత ఒకరికి తల్లిదండ్రుల్లేరు. మరొకరికి తండ్రి లేడు. ఇంకొకరికి తండ్రి ఉన్నా.. అతని అండ లేదు. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడై ఉండేవారు. కష్టపడి పనిచేసుకుంటూ తమ కుటుంబాలకు అండగా ఉన్నారు. వయసులో వారి మధ్య ఏడాది, రెండేళ్ల వ్యత్యాసమే. ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట.. ఒకే వాహనం. అలాంటి మిత్రులను మృత్యువు కూడా ఒకేసారి కాటేసింది. దీంతో ఒకే రోజు మూడు కుటుంబాల్లో విషాదం నెలకొని, గ్రామం మూగబోయింది. దుర్గాశివప్రసాద్కు తల్లిదండ్రుల్లేరు. చిన్నప్పటి నుంచి మేనత్త రమణమ్మ వద్దే ఉంటున్నాడు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే మిల్లర్ పని చేస్తూ, ఆమెకు భరోసాగా ఉన్నాడు. ఇతని మరణంతో మేనత్త రమణమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కిరణ్‌కుమార్‌కు తల్లి లక్ష్మి, సోదరి హరిణి ఉన్నారు. తండ్రి బతికే ఉన్నా.. ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని గ్రామస్తులు చెప్తున్నారు. తల్లి స్థానికంగా ఉన్న జీడిపిక్కల ఫ్యాక్టరీలో కూలిపని చేస్తుంది. సోదరి దివ్యాంగురాలు కావడంతో ఆశలన్నీ కిరణ్మీదే పెట్టుకున్నారు. కిరణ్ గ్రామంలో కూలి పనులతోపాటు, పెయింటింగ్ పనులకు వెళ్తుంటాడు. త్వరలోనే పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూస్తున్నారు. అలాంటి సమయంలోనే తమకు అందరాని దూరాలకు పోయిన కిరణ్‌ను తలచుకుంటూ ఆ తల్లి, కూతుళ్ల శోకం ఊరంతటినీ పట్టి కుదిపేస్తోంది. కాకర వీరబాబు మిల్లర్ పనితోపాటు, వ్యాన్ డ్రైవింగ్ చేస్తుంటాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. తండ్రి దారబాబు ఇంటి వద్దనే ఉంటాడు. తల్లి మేరీ గల్ఫ్‌లో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. కొడుకు మరణవార్త తెలుసుకుని ఆ తల్లి అక్కడి నుంచి బయలుదేరినట్టు తెలిసింది. -
గుబులు పుట్టిస్తోన్న ఎండ వేడి.. గిర్రున మీటర్లు
సాక్షిప్రతినిధి,కాకినాడ: వేసవి ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. ప్రతి ఇంటా విద్యుత్ మీటర్ గిర్రున తిరుగుతోంది. నెల బిల్లులు రెట్టింపు అవుతున్నాయి. అయినా జనం ఎడాపెడా కరెంటు వాడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈనెలలో వాడకం బాగా పెరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గృహ విద్యుత్ వినియోగం 50శాతం పైనే ఉందని ఏపీఈపీడీసీఎల్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. గడచిన రెండు వారాలుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫలితంగా ఏసీల వినియోగం పెరిగింది.ప్రస్తుతం రోజూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో విద్యుత్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ, రాత్రి 8 నుంచి తెల్లవారేవరకు ఏసీలు వాడుతున్నారు. గడచిన ఏప్రిల్‌లో మధ్యాహ్నం ఒక గంట, రాత్రి రెండు, మూడు గంటలు మాత్రమే ఏసీలు, ఫ్యాన్లు వినియోగించే వారు. ఇప్పుడు ఏసీలతో పాటు ఫ్యాన్ల వినియోగం కూడా మూడొంతులు పెరిగిపోయింది. మార్చి, ఏప్రిల్‌తో పోలిస్తే మే వచ్చేసరికి ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. వారం రోజులుగా మరింత తీవ్రంగా ఉంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోతోంది. ఈనెల గుండె గు‘భిల్లు’ ఉదాహరణకు రెండు ఫ్యాన్లు, ఒక ఏసీ, మూడు ట్యూబులైట్లు ఉన్న ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబ విద్యుత్ వినియోగం ఏప్రిల్‌లో సగటున 185 యూనిట్లు నమోదైంది. అంటే రూ.800 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ నెలలో అదే తరహా కుటుంబ బిల్లు చూస్తే 300 యూనిట్లు దాటిపోయింది. అంటే రూ.1500 చెల్లించాలి. ఇలా ప్రతి కుటుంబంలో స్థాయిని బట్టి వినియోగం పెరిగింది. గతేడాది మేతో పోలిస్తే ఈ ఏడాది వినియోగంలో భారీగా పెరిగింది. గతేడాది మే 10న 11.575 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వాడారు. తాజాగా ఈ నెల 10న సుమారు ఐదారు మిలియన్ యూనిట్లు అదనంగా వాడారని తేలింది. ఇలా ఈ నెలలో 10 నుంచి 16 వరకు పరిశీలిస్తే గతేడాడి కంటే ఐదారు మిలియన్ యూనిట్లు అదనంగా వాడినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గృహవినియోగం 50శాతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా విద్యుత్ వాడకంలో (జగ్గంపేట విద్యుత్ డివిజన్‌తో కలిపి) 45శాతంతో మొదటి స్థానంలో ఉంది. కాకినాడ నగరంతో పాటు మెట్ట ప్రాంత మండలాల్లో అత్యధికంగా కరెంటు వాడుతున్నారు. రామచంద్రాపురం డివిజన్‌తో కలిపి ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 30 శాతంతో రెండో స్థానం, 20శాతంతో రాజమహేంద్రవరం(నిడదవోలు సబ్ డివిజన్ మినహా) మూడో స్థానంలో ఉన్నాయి. రంపచోడవరం విద్యుత్ సబ్‌డివిజన్‌లో మిగిలిన ఐదు శాతం వినియోగం నమోదైంది. గృహవిద్యుత్ వినియోగం 50శాతం పైనే ఉంది. వేసవికి ముందు రోజుకు 16 మిలియన్ యూనిట్లు ఉంటే ప్రస్తుతం 17 నుంచి 20 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు. ఈ నెల 13న 20.08 మినియన్ యూనిట్లు క్రాస్ చేసింది. నిరంతరాయంగా సరఫరా విద్యుత్ వినియోగం పెరిగినా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా ఈపీడీసీఎల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్నారు. గతంలో ప్రతి వేసవిలోనూ విద్యుత్‌కోతలతో ప్రజలు నరకం చూసే వారు. ప్రస్తుతం పెరుగుతోన్న వినియోగానికి తగ్గట్టు ఉత్పత్తికి ఢోకా లేకపోవడంతో కోతల ఊసే లేదు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తుతుంటే డివిజన్ స్థాయిలో అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు డిమాండ్‌కు దగ్గట్టుగా ఉత్పత్తి వేసవి దృష్ట్యా వినియోగం పెరిగినప్పటికీ సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉంది. గతంలో మాదిరిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోతలు ఎక్కడా విధించడంలేదు. అత్యవసర మరమ్మతులు, లైన్లలో నిర్వహణాలోపాలు తలెత్తినప్పుడు అంతరాయం ఏర్పడుతోంది. 24 గంటలు విద్యుత్ సరఫరాకుఎక్కడా ఇబ్బంది లేదు. భవిష్యత్ అవసరాలకు పూర్తిగా విద్యుత్ అందుబాటులో ఉంది. – పి.వి.ఎస్.మూర్తి, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
డిగ్రీ చదివి చిన్నచిన్న ఉద్యోగాలు.. కౌజు పిట్టల పెంపకంతో లాభాలు
పిఠాపురం: కౌజు పిట్టల పెంపకం చేపట్టి అభివృద్ధి బాటలో నడుస్తున్నాడు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు రామరాఘవపురానికి చెందిన దొడ్డి సురేంద్ర. వ్యవసాయ కుటుంబానికి చెందిన సురేంద్ర గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. కొంతకాలం చిన్నచిన్న ఉద్యోగాలు చేసాడు. సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కౌజు పిట్టల పెంపకం చేపట్టాడు. తక్కువ పెట్టుబడితో చిన్న కౌజు పిట్టల (క్వయిల్) ఫామ్ ప్రారంభించాడు. సొంత పొలంలోనే షెడ్లు వేసి 100 పిట్టల్ని పెంచడం ప్రారంభించాడు. రెండేళ్లలోనే ఆ ఫామ్ 10 వేల పిట్టల సామర్థ్యానికి పెరగ్గా.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఐదారు వారాల్లోనే పెరుగుతాయి భారతదేశంలో కౌజు పిట్టల పెంపకం, విక్రయం, వాటిని చంపడంపై నిషేధం ఉండటంతో జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న కౌజు పిట్టల పెంపకం చేపడుతున్నారు రైతులు. ఒక కోడిని పెంచే స్థలంలో 8 కౌజు పిట్టలను పెంచవచ్చు. కొవ్వు తక్కువగా.. ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉండటంతో వీటిని తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు మాంసాహార ప్రియులు. ఐదు వారాల్లోనే ఇవి అమ్మకానికి సిద్ధమవడంతోపాటు గుడ్లు కూడా పెడతాయి. ఒక్కో కౌజు పిట్ట ఏడాదికి సుమారు 250 వరకు గుడ్లు పెడతాయి. వీటి మాంసం, గుడ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించాను సొంతంగా వ్యాపారం చేయాలనేది నా కోరిక. నా స్నేహితుల ద్వారా కౌజు పిట్టల పెంపకం గురించి తెలుసుకుని మా పొలంలో చిన్న పాక వేసి వీటి పెంపకం ప్రారంభించాను. ఏడాదిలోనే వ్యాపారం పెరిగింది. నెలకు 10 వేల పిట్టల్ని అమ్మే విధంగా పెంపకం చేస్తున్నాను. కోరుకొండ నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ పెంచుతున్నాను. ఒకరోజు పిల్ల ఒక్కొక్కటి రూ.9కి దొరుకుతుంది. ఒక్కొక్క పిల్ల పెంచడానికి రూ.20 వరకు ఖర్చవుతుంది. నెల రోజులు పెంచితే ఒక్కో పిట్ట రూ.45 నుంచి రూ.50 వరకు వస్తుంది. గుడ్లు పొదిగే యంత్రాలను కొనుగోలు చేసి సొంతంగా గుడ్లు కొని పిల్లల్ని ఇక్కడే తయారు చేయాలనుకుంటున్నాను. ఫంక్షన్లకు, డాబాలు, రెస్టారెంట్లకు వీటిని సరఫరా చేస్తున్నాం. – దొడ్డి సురేంద్ర, కౌజు పిట్టల పెంపకందారు డిమాండ్ బాగుంది కౌజు పిట్టలకు డిమాండ్ బాగుంది. క్వయిల్ ఫామ్‌లు తక్కువగా ఉండటం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా వైద్య అవసరాలు ఉండవు. మన వాతావరణంలో బాగా పెరుగుతాయి. కేవలం దాణా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. – డాక్టర్ హిమజ, పశు వైద్యాధికారి, గొల్లప్రోలు -
కాకినాడ: తాళ్లరేవులో ఘోర రోడ్డు ప్రమాదం
-
చెట్టు చెట్టుకో వెరైటీ.. అరుదైన మియాజాకీ మామిడి.. కిలో ధర 2.70 లక్షలు
పిఠాపురం (తూర్పు గోదావరి): అరుదైన రకాలు పండించాలన్న ఆ రైతు ఆలోచన మొక్కగా మొదలై.. చెట్టుగా మారింది. అది శాఖోపశాఖలుగా విస్తరించి తోటనిండా అద్భుతాలను పండిస్తోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన ఓదూరు నాగేశ్వరరావు అనే రైతు నాలుగు ఎకరాల మామిడి తోటలో ఎన్నో రకాల మామిడి మొక్కలు నాటారు. తోటంతా కాస్తే వచ్చే ఆదాయాన్ని అందులోని ఒకే ఒక మామిడి చెట్టు తెచ్చిపెడుతోంది. ఆ ఒక్క చెట్టుకు 15 కాయలు కాయగా.. వాటి విలువ అక్షరాల రూ.15 లక్షలకు పైగానే ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కింగ్ ఆఫ్ మేంగో.. ఒక్కో కాయ రూ.లక్ష పైనే జపాన్ దేశంలో మాత్రమే పండే మియాజాకీ రకం మామిడిని ఓదూరు నాగేశ్వరరావు పండిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా గుర్తింపు పొందింది. ఇది బంగారం ధరతో పోటీ పడుతుంది. జపాన్‌లోని మియాజాకీ ప్రాంతంలో పండటం వల్ల దీనికి మియాజాకీ అనే పేరొచ్చింది. దీనిని సూర్యుడి గుడ్లు (ఎగ్స్ ఆఫ్ సన్) అని కూడా పిలుస్తారు. సువాసనలు వెదజల్లుతూ.. లోపల బంగారు ఛాయతో మెరిసిపోయే ఈ మామిడి పండు అత్యధిక పోషకాలను కలిగి ఉంటుందట. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కేజీ రూ.2.70 లక్షల వరకు పలుకుతుందని.. ఒక్కో కాయ ధర కనీసం రూ.లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇది క్యాన్సర్‌కు మందుగా.. కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధంగా పేరొందడంతో దీనికి విలువ పెరిగింది. నాగేశ్వరరావు తోటలో గత ఏడాది మియాజాకీ రకం పండు మాత్రమే ఒకటి మాత్రమే కాయగా.. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి. సుమో.. మామిడి! ఈ రైతు తోటలో ఈ ఏడాది కొత్తగా ఐదు కేజీల మామిడి చెట్లు కాపు మొదలుపెట్టాయి. ఒక్కో మామిడి కాయ బరువు సుమారు ఐదు కేజీలు ఉండటం వీటి ప్రత్యేకం. ప్రస్తుతం ఒక చెట్టుకు రెండు మాత్రమే కాసాయి. ఈ రకాన్ని అఫ్గాన్ దేశానికి చెందిన నూర్జహాన్గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద కాయగా దీనికి గుర్తింపు ఉంది. ఒక్క కాయ రూ.వెయ్యికి పైనే ఉంటుంది. సుమారు అడుగు పొడవు ఉండడం దీని విశేషం. పూత దశలో ఉండగానే దీనికి డిమాండ్ పెరుగుతుంది. మామిడి ప్రియులు వీటిని ముందుగానే బుక్ చేసుకుంటారు. విచిత్ర ఆకారాలు.. చిత్రమైన రంగులు నాగేశ్వరరావు తోటలో అడుగుపెడితే కళ్లు మిరుమిట్లు గొలిపే రంగులు.. చిత్ర విచిత్రమైన ఆకారాల్లో మామిడి కాయలు కనిపిస్తాయి. చూడటానికి తయారు చేసిన కాయల మాదిరిగా కనిపిస్తాయి. ఇక్కడి మామిడి చెట్లకు అరటి పండ్లు వేలాడుతుంటాయి. వాటిని కోస్తే మాత్రం అచ్చమైన మామిడి పండ్లే. వీటిని అరటి పండ్ల మాదిరిగానే వలుచుకు తినేయొచ్చు. అచ్చం యాపిల్ పండ్ల మాదిరిగా ఉండే మామిడి పండ్లు సైతం ఈ తోటలో కాస్తున్నాయి. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు వందకు పైగా అబ్బురపరిచే మామిడి మొక్కలతో ఈ పండ్ల తోట కనువిందు చేస్తోంది. మియాజాకీ 15 కాయలు కాసింది నాలుగేళ్ల క్రితం వివిధ రకాల మామిడి మొక్కలు వేయడం ప్రారంభించాను. గత ఏడాది మియాజాకీ మామిడి పండు ఒకటి కాసింది. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి. ఈ రకం మొక్కలు 20 నాటాను. వాటిలో రెండు చెట్లు మాత్రమే కాస్తున్నాయి. ఒక్కో కాయ 380 నుంచి 450 గ్రాముల వరకు బరువు ఉన్నాయి. మొత్తం మామిడి కాయల బరువు సుమారు 6 కేజీల వరకు ఉంటుంది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.15 లక్షల పైమాటే. – ఓదూరి నాగేశ్వరరావు, రైతు, చేబ్రోలు ఇవి చాలా అరుదు మియాజాకీ, నూర్జహాన్ రకాల మామిడి మన ప్రాంతంలో పండటం చాలా అరుదు. ఇవి చాలా విలువైనవి. నాగేశ్వరరావు తోటలో పండించే పంటలు అన్ని రకాలు చాలా అరుదైనవే. వీటిని ఇతర రైతులకు పరిచయం చేయడానికి ప్రయతి్నస్తాం. మొక్కలు నాటినా అవి చాలా వరకు పంటకు రావు. కానీ.. ఆయన అరుదైన రకాలను పండించడం మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మియాజాకీ పండించడం మిరాకిల్గానే చెప్పవచ్చు. – అరుణ్‌కుమార్, ఇన్చార్జ్ ఉద్యాన శాఖాధికారి, గొల్లప్రోలు -
కారులో ఊపిరాడక 8 ఏళ్ల బాలిక అఖిలాండేశ్వరి మృతి
-
కాకినాడ సెజ్‌కు ప్రత్యేక రైల్వేలైన్.. దక్షిణ మధ్య రైల్వే గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దాదాపు పదేళ్లపాటు పడకేసిన కాకినాడ ఎస్ఈజడ్లో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. కాకినాడ తీరంలో తొండంగి వద్ద నిర్మాణంలో ఉన్న కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్)ను మెయిన్ రైల్వేలైన్‌తో అనుసందానించే ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కుతోంది. ఇందుకోసం కేజీపీఎల్ నుంచి అన్నవరం వరకు 15 కిలోమీటర్లు మేర ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే కూడా ఇందుకు పచ్చజెండా ఊపింది. ప్రత్యేక రైల్వేలైన్‌తో పాటు దశాబ్దాల కాలంగా సత్యదేవుని భక్తుల కలగా మిగిలిన అన్నవరం రైల్వేస్టేషన్ ఆధునీకరణను కూడా చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రైల్వే పనులను కేజీపీఎల్ సొంతంగా చేపడుతోంది. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు నిజానికి.. చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాల కల్పనను అటకెక్కించేశారు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో బహుళ జాతి కంపెనీలు, ఎగుమతి, దిగుమతి ఆధారిత పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఇస్తోంది. మరోవైపు.. కేజీపీఎల్కు ప్రత్యేక రైల్వేలైన్ కోసం 90 ఎకరాల భూసేకరణకు రైతులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా.. విజయవాడ–విశాఖపట్నం మధ్య అన్నవరం రైల్వేస్టేషన్ నుండి కేజీపీఎల్ వరకు 15 కిలోమీటర్ల మేర సరుకు రవాణా కోసం ప్రత్యేక రైల్వేట్రాక్ నిర్మించనున్నారు. ఇక ప్రాజెక్టులో భాగంగా అన్నవరం రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. వచ్చేనెలలో పనులు మొదలు కానున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణంతో కాకినాడ గేట్‌వే పోర్టుకు ప్రతిరోజు 16వేల టన్నుల సామర్థ్యం కలిగిన బొగ్గు, ఎరువులతో పాటు కంటైనర్లలో ఆయిల్, ఎల్ఎన్జీ రవాణా కానుంది. తొలిదశలో నాలుగు గూడ్స్ రైళ్లను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’ ఈ రైల్వేలైన్ కేఎస్‌ఈజెడ్‌లో ఏర్పాటవుతున్న కేజీపీఎల్, బల్‌్కడ్రగ్ పార్కు, అరబిందో పెన్సిలిన్ జీ, దివీస్ తదితర పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది. వీటిపై కేఎస్ఈజెడ్ ప్రాజెక్టు హెడ్ గరుడ సీతారామయ్య స్పందిస్తూ.. రైల్వేస్టేషన్, రైల్వేట్రాక్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి అనుమతులు కూడా లభించాయన్నారు. -
ఇంటి ముంగిటకే వైద్యసేవలు
-
‘కొంప’ముంచిన ‘కార్తికేయ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సహకార చట్టాలను చట్టుబండలు చేస్తూ కొన్ని కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలు ఖాతాదారుల కొంప ముంచేస్తున్నాయి. కాకినాడ జయలక్ష్మి మ్యూచువల్లీ కోఆపరేటివ్ బ్యాంకు రూ.560 కోట్లకు బోర్డు తిప్పేసి, సుమారు 20 వేల మంది ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టిన వ్యవహారం మరచిపోకుండానే మరో సంస్థ అయిన కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ డిపాజిటర్ల సొమ్ములు తిరిగి ఇవ్వకుండా దాటవేస్తోంది. దీంతో వారందరూ లబోదిబోమంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ సొసైటీకి 300 మందికి పైగానే డిపాజిటర్లు ఉన్నారు. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఉన్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన సుమారు 100 మంది డిపాజిటర్లు తాము మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. నగరంతో పాటు కోనసీమలో నాలుగైదు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, మెట్ట ప్రాంతం, తూర్పు గోదావరి జిల్లాలోని పలు మండలాలకు చెందిన వారు ఈ సొసైటీలో డిపాజిట్లు చేశారు. పదిహేనేళ్ల క్రితం కాకినాడ ప్రధాన కూడలి నూకాలమ్మ ఆలయానికి సమీపాన సహకార రంగంలో కార్తికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఏర్పాటైంది. ఇది డిపాజిట్ల రూపంలో రూ.12 కోట్లు సేకరించింది. రూ.5 కోట్ల వరకూ రుణాలూ ఇచ్చింది. మెచ్యూరిటీ గడువు తీరినా.. ఇక ఈ డిపాజిట్లలో రూ.10 కోట్ల డిపాజిట్ల గడువు తీరిపోయింది. డిపాజిటర్లను రేపు మాపు అని బ్యాంకు సిబ్బంది నాలుగైదు నెలలుగా తిప్పి పంపేస్తున్నారు. దీంతో బాధితులు జిల్లా సహకార అధికారులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్వీఎస్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యాన ప్రాథమిక విచారణ జరిగింది. సొసైటీ ఇచ్చిన రుణాల్లో రూ.4.50 కోట్లకు సంబంధించి తనఖా కింద ఎటువంటి డాక్యుమెంట్లూ లేవని తేలింది. సొసైటీ ఆడిట్ కూడా ప్రైవేటు ఆడిటర్లతో నిర్వహిస్తున్నారు. మరోవైపు.. డిపాజిటర్లు సహకార అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ, డిపాజిట్లు, రుణాలకు సంబంధించిన రికార్డుల కోసం సహకార శాఖ సమన్లు జారీచేసినా సొసైటీ నిర్వాహకుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సహకార శాఖ విచారణకు ఆదేశించింది. డిపాజిట్లు సరిచూసుకోవాలి డిపాజిటర్లు తమ సొమ్ము సొసైటీ ఖాతాలో డిపాజిట్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. సొసైటీ వద్ద విచారణాధికారి అందుబాటులో ఉన్నారు. సొమ్ము డిపాజిటర్ల ఖాతాలో జమకాకుంటే చర్యలు తీసుకుంటాం. – దుర్గాప్రసాద్, జిల్లా సహకార అధికారి, కాకినాడ రూ.7.80 లక్షలు డిపాజిట్ చేశాం కార్తికేయ సొసైటీలో నేను, నా భార్య కలిసి రూ.7.8 లక్షలు డిపాజిట్ చేశాం. నాలుగేళ్ల పాటు వడ్డీ ఇచ్చారు. ఏడాది నుంచి ఇవ్వడంలేదు. సమాధానం కూడా చెప్పడంలేదు. దీనిపై నగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. – సజ్జాద్ హుస్సేన్, బాధితుడు, నగరం రూ.44 లక్షలు డిపాజిట్ చేశాం ప్రలోభాలకు గురిచేసి మాతో ఈ బ్యాంకులో డిపాజిట్ చేయించారు. నగరం నుంచి సుమారు రూ.7 కోట్లు డిపాజిట్ చేశారు. మా కుటుంబ సభ్యులు రూ.44 లక్షలు డిపాజిట్ చేశాం. బాధ్యులపై చర్యలు తీసుకుని, మా సొమ్ములు మాకు ఇప్పించాలి. – అన్వర్ తాహిర్ హుస్సేన్, బాధితుడు, నగరం -
బిడ్డల చెంతకు చేరిన తల్లి
కాకినాడ క్రైం: ప్రాణప్రదంగా చూసుకునే ఇద్దరు బిడ్డల్నీ వదిలేసి రోడ్డు పాలైన ఓ తల్లి తిరిగి వారి చెంతకు చేరింది. భర్త వదిలేశాడనే వేదన తాళలేక మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళను దిశ వన్‌స్టాప్ సెంటర్ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాలు దాటి వచ్చి అనాథలా రోడ్లు పట్టిన ఆ తల్లిని తిరిగి బిడ్డల చెంతకు చేర్చింది. వివరాలివీ.. సుమారు నెల రోజులక్రితం ఓ రోజు అర్ధరాత్రి కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఓ అనాథ మహిళ వెంట ఇద్దరు వ్యక్తులు పడ్డారు. వారినుంచి తప్పించుకున్న ఆమె సహాయం కోసం రైల్వే సిబ్బంది క్యాబిన్ తలుపులు కొట్టింది. సిబ్బంది బయటకు రావడంతో ఆ దుండగులిద్దరూ పరారయ్యారు. రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఏవీకే సంతోష్ ఆ మహిళ దుస్థితిని గమనించి, మతిస్థిమితం కోల్పోయిందని నిర్ధారించారు. ఆమె పరిస్థితిని జిల్లా మహిళా, శిశు సాధికార అధికారి ప్రవీణకు వివరించి సహాయం కోరారు. తక్షణమే స్పందించిన ఆమె దిశ వన్‌స్టాప్ సెంటర్ అడ్మిన్ కె.శైలజకు తగిన ఆదేశాలిచ్చారు. శైలజ బాధిత మహిళను కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. నెల రోజులపాటు సపర్యలు చేసి ఆమె వివరాలు రాబట్టారు. ఆమె పేరు ప్రియాంక షైనీ అని, ఊరు గోరఖ్‌పూర్ అని గుర్తించారు. దీంతో ఆమె ఫొటో సర్క్యులేట్ చేసి... ఆ మహిళ బంధువుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 2021 నవంబర్ 2వ తేదీన ఆ మహిళ అదృశ్యమైనట్టు గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని నిర్ధారణ కాగా.. అక్కడి పోలీసుల ద్వారా ప్రియాంక షైనీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వీడియో కాల్లో ఆమెను చూసి నిర్ధారించుకుని కాకినాడ వచ్చారు. దిశ వన్‌స్టాప్ బృందం ఏఎస్ఐ చంద్ర, కౌన్సిలర్ జమీమా, ఐటీ స్టాఫ్ దుర్గాదేవి సమక్షంలో ప్రియాంకను అధికారులు గురువారం ఆమె సోదరికి అప్పగించారు. ప్రియాంక సోదరి మాట్లాడుతూ తన అక్కకు 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, ఏడాదికాలంగా అమ్మ ఏదని వారు అడుగుతుంటే ఊరెళ్లిందని, త్వరలోనే వచ్చేస్తుందని అబద్ధం చెబుతూ కాలం గడిపామని భావోద్వేగానికి గురైంది.