పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు బాటలో నడుస్తున్నారా? నమ్మినవారిని నట్టేట ముంచి మరొకరిని తెరపైకి తెస్తున్నారా? డబ్బే ఇందులో కీలక పాత్ర పోషిస్తోందా? పిఠాపురం నియోజకవర్గంలో స్వయంగా చిచ్చు రాజేశారా? ఇప్పటికే రెండు వర్గాల కుమ్ములాటకు మరో వర్గాన్ని జత చేశారా? పిఠాపురం గ్లాస్ పార్టీ మూడు ముక్కలు కావడానికి కారణం ఏంటి. ఇందులో కొత్త ఇన్‌చార్జ్ పాత్ర ఎంత?
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ మూడు వర్గాలుగా చీలింది. మొన్నటి వరకు పిఠాపురం పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాకినీడి శేషుకుమారిని తప్పించి తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన టీ టైం అధినేత తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్‌ను ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీంతో అధినేత నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు శేషుకుమారి.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలో ఏకైక మహిళా ఇన్‌చార్జ్‌గా శేషుకుమారి ఉన్నారు. 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. అప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్న శేషుకుమారికి.. కొంతకాలం క్రితం పార్టీలో చేరి షాక్ ఇచ్చారు పిఠాపురంకు చెందిన డాక్టర్ పిల్ల శ్రీధర్ దంపతులు. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తూ ఈ దంపతులు జనసేనలో చేరి రెండవ వర్గాన్ని తయారు చేశారు. కాకినాడకు చెందిన శేషుకుమారిని పిఠాపురం నియోజకవర్గానికి నాన్ లోకల్ గా ముద్ర వేశారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో చేసిన వారాహి యాత్రలో కూడా ఎక్కడా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న శేషు కుమారి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జనసేన క్యాడర్ అయోమయానికి గురైంది. ఏ వర్గంవారిని అనుసరించాలో తెలియక తికమక పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో ఉదయ శ్రీనివాస్‌కు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో క్యాడర్ మరింత అయోమయానికి గురయింది.
చదవండి: ఏమయ్యా లోకేష్.. అంతలా లేపినా కూడా తుస్సుమనిపించావ్?
టీడీపీతో పొత్తు కుదిరితే శ్రీనివాస్ పిఠాపురం నుండి పోటీ చేస్తారని తెలుస్తోంది. శేషుకుమారి, పిల్ల శ్రీధర్ దంపతులు వచ్చే ఎన్నికల కోసం పెట్టుకున్న ఆశలపై పవన్ కల్యాణ్ నీళ్లు చల్లేశారు. ఇదిలా ఉంటే ఎక్కడో కడియంకు చెందిన శ్రీనివాస్‌కు పిఠాపురం బాధ్యతలు అప్పగించడం ఎందుకని పవన్‌కల్యాణ్‌పై ఫైర్ అవుతున్నారు.
కడియం నుంచి వచ్చి పిఠాపురంకు ఇన్‌చార్జ్ అయిన శ్రీనివాస్ జనసేనకు ఆర్థిక సాయం చేస్తున్న విషయం అక్కడి జన సైనికులకు తెలియదు. వారాహి వాహనం తయారీ నుంచి యాత్ర వరకు స్పాన్సర్ చేస్తున్నది శ్రీనివాస్ అంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయవాడలో పార్టీ కార్యాలయం, రాజమండ్రిలో కడుతున్న పార్టీ కార్యాలయంకు నిధులు సమకూరుస్తున్నది కూడా ఇతనే అని చెబుతున్నారు.
అందుకే జనసేనలో శ్రీనివాస్ చెప్పిన మాట వేద వాక్కుగా నడుస్తోందట. అంత పలుకుబడి ఉన్నందునే తన బావైన కాకినాడకు చెందిన న్యాయవాది తోట సుధీర్‌ను జనసేనలోకి రప్పించి ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా పవన్ కల్యాణ్‌తో ప్రకటింపచేశారు శ్రీనివాస్. జనసేన పార్టీ గ్లాస్ పవన్‌కల్యాణ్‌ది అయినా అందులో ఉన్న టీ మాత్రం టీ టైం అధినేత శ్రీనివాస్‌దే అన్న టాక్ నడుస్తోంది.
చదవండి: పరువు తీసుకుంటున్న చంద్రబాబు & లోకేషం
ఇక ఇన్‌చార్జ్ బాధ్యతల నుండి తప్పించిన మాకినీడి శేషుకుమారికి ఇంకా పెద్ద పదవి ఇప్పిస్తామని ఒప్పించారట జనసేన నేతలు. అయితే పవన్ నిర్ణయంపై తిరుగుబావుటా ఎగుర వేయడానికి సిద్దంగా ఉన్నారట మాకినీడు శేషుకుమారి. మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పే పవన్.. ఒక మహిళా ఇన్‌చార్జ్‌ను తప్పించి అవమానించడం సరికాదని ఆమె అనుచరులు భగ్గుమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment