సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్న పవన్‌కల్యాణ్ ఈ సారి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, బరిలోకి దిగకుండానే పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. మిత్ర పక్షాలనుంచి సహకారం కరువు అవ్వడంతో పిఠాపురంలో పవన్ ఎదురీదుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు భగ్గుమన్నారు. పవన్ నిర్ణయంపై తెలుగుదేశం కార్యకర్తల ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే వర్మ రోజుకో ప్రకటనతో టీడీపీ, జనసేన క్యాడర్ అయోమయంలో పడింది.
పవన్ గెలుపుకి మిత్రపక్షం నుంచి సహకారం అనుమానమే.. దీంతో పిఠాపురంలో గెలుపు కోసం పవన్ కల్యాణ్ నానా తంటాలు పడుతున్నారు. వారంలో మూడు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేయాలని నిర్ణయించారు. పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.
కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పలు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నా గెలుపుపై గ్యారెంటీ కనిపించకపోవడంతో వెతికి వెతికి చివరికి పిఠాపురం ఎంచుకున్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు, పిఠాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా వంగా గీత క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎంపీ అయిన గీత గతంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా బాద్యతలు నిర్వహించిన వంగా గీతకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. దీంతో పవన్ తన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం అనుకుంటున్నప్పటికీ అక్కడ అంతే బలంగా ఉన్న వంగా గీతను ఎదుర్కొని విజయం సాధించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: జేపీ కొత్త రంగు.. అదీ అసలు సంగతి!
Comments
Please login to add a commentAdd a comment