
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తానన్నారు. ‘‘వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా.. పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు’’ అని వర్మ అన్నారు.
కాగా, పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ కల్యాణ్ తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ నాయకత్వం తనను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందన్న పవన్.. మరోవైపు, కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు.
ఒక వేళ అమిత్‌షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు. ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్న పవన్.. ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి: చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం
Comments
Please login to add a commentAdd a comment