Pithapuram
-
లోకేష్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటి: పిఠాపురం వర్మ
సాక్షి,కాకినాడజిల్లా: లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు వర్మ ఆదివారం(జనవరి 19) మీడియాతో మాట్లాడారు.‘నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్‌కే దక్కుతుంది. పార్టీ పూర్తిగా పోయిందని,టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువ గళంతో సమాధానం చెప్పారు.ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి.లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు.అలాంటిది పార్టీని బలోపేతం చేసి, టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి?కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్‌ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా.ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.టీడీపీ కార్యకర్తల మనసులో మాట.ఏదేమైనా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం’అని వర్మ అన్నారు. కాగా, లోకేష్‌ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతోందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో.. లోకేష్‌ను డీసీఎంను చేస్తే.. పవన్‌ను సీఎం చేయాలనే వాదనను వాళ్లూ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసైపోయిందని, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు.మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్‌కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్‌నే వినిపిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ ఉంచారు. ఈ నేతల జాబితాలో పవన్‌కల్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చేరడం పొటికల్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ, జనసేన మధ్య సంబంధాలపైనా ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పిఠాపురం పవన్ కల్యాణ్ సభలో వీర మహిళ లక్ష్మీకి తీవ్ర అవమానం
-
పవన్ పర్యటన.. జనసేన మహిళా నేతకు అవమానం!
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వేళ జనసేన మహిళా నేత చల్లా లక్ష్మీకి చేదు అనుభవం ఎదురైంది. సంక్రాంతి సంబరాల వద్ద ఆమెకు అనుమతి లేదని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చల్లా లక్ష్మీని బయటకు పంపారు. దీంతో, తోపులాట జరిగి ఆమె కిందపడిపోవడంతో తలకు గాయమైంది. అనంతరం, ఆమె విలవిల్లాడిపోయింది.సంక్రాంతి సందర్బంగా పిఠాపురం మండలం కుమారపురంలో మినీ గోకులాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, స్థానికులు వచ్చారు. అలాగే, జనసేన ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆమెకు అనుమతి లేదంటూ చల్లా లక్ష్మీని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు తెలిపారు. దీంతో, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమె తలకు దెబ్బ తగలడంతో విలవిల్లాడిపోయారు.ఈ నేపథ్యంలో జనసేన నేతలు, పోలీసులపై జనసేన వీర మహిళలు మండిపడుతున్నారు. పార్టీలో మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే ఇదేనా తమను ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక, గాయపడిన చల్లా లక్ష్మీ అక్కడే ఉన్న మహిళలు సాయం చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా పిఠాపురంలో జనసేన వీర మహిళలకు అవమానం జరిగింది. పవన్ పాల్గొంటున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వెళుతున్న వీర మహిళలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. వీరంతా.. పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకుందామని అక్కడికి వచ్చినట్టు చెప్పారు. కానీ, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గత ఎన్నికల్లో మండుటెండల్ని లెక్క చేయకుండా.. కుటుంబాన్ని వదిలి పవన్ గెలుపు కోసం పని చేశామని వీర మహిళలు గుర్తు చేశారు. ఇద్దరు నేతలే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. -
పిఠాపురంలో మరోసారి టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు
-
పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు చేదు అనుభవం
-
పులిహోర ప్రసాదంలో పురుగులు
-
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. కుక్కుటేశ్వర స్వామి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరాలో పురుగులు దర్శనమివ్వడంతో భక్తుడు షాక్ అయ్యారు. ప్రసాదంలో కనిపించిన పురుగులపై దేవస్ధానం అధికారులను భక్తులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాదగయాలో నాసిరకం వస్తువులతో ప్రసాదం తయారీ అవుతోంది.కాగా.. గత నెలలో హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
హోమగుండం లో దేవుని ఫోటోలు
-
పిఠాపురం నియోజకవర్గంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
-
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. పిఠాపురం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా, జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆ చెక్కు అందజేశారు.కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: వంగా గీతఅనంతరం పిఠాపురంలో జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయని వంగా గీతా మండిపడ్డారు. మహిళలకు భద్రత, ధైర్యం కల్పించాలని వంగా గీత అన్నారు. వైఎస్సార్సీపీని సంస్ధగతంగా పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇచ్చినా హమీలను అమలు చేయలేదు. ఇచ్చిన హమీలను నూరు శాతం వైఎస్ జగన్ అమలు చేశారు. కూటమి సర్కార్.. ప్రజలను నమ్మించి హమీలు అమలు చేయకపోవడం అన్యాయం’’ అని ఆమె దుయ్యబట్టారు.మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ: కురసాల కన్నబాబుప్రజలకు మంచి చేసి ఓడిపోయిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ. నేరుగా ప్రజలకు సేవలందించాలని బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశమంతా చూసేలా వలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. చంద్రబాబులా అబద్దపు హమీలు జగన్ ఇవ్వలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కులం, మతం చూడకుండా అర్హులకు పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీదే. చంద్రబాబూ.. రుషికొండ ప్యాలెస్ కాదు.. పలాసలో నిర్మించిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ చూడండీ. పాడేరులో కట్టిన మెడికల్ కళాశాల.. ఉప్పాడలో కట్టిన ఫిషింగ్ హర్బర్‌ను కూడా చూడాలి...అమరావతిలో మీరు కట్టిన సచివాలయానికి ఖర్చు ఎంతో చెప్పండి. కూటమీ ప్రభుత్వంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దుర్మార్గమైన పరిస్ధితులు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో.. పోలీసుల పని తీరు ఏలా ఉందో చెప్పారు. ఇసుక, శాంతి భద్రతల సమస్యలు నాకు సంబంధం లేదంటే కుదరదు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు ఎక్కడపడితే అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు. అయినా పోలీసులు పని బాగోలేదని కూటమి నాయకులు చెబుతున్నారు. గోతులు పూడ్చడానికి కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. చంద్రబాబు ప్రచారం పీక్‌లో ఉంటుంది. వాస్తవం కింద ఉంటుంది.ఇదీ చదవండి: నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా? -
అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల పాత్రలో పరస్పరం సహకరించుకుంటూ అనేక రాజకీయ డ్రామాలను రక్తి కట్టించిన చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ ద్వయం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను అనుసరిస్తోంది! కూటమి ప్రభుత్వంపై కొద్ది నెలల్లోనే తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సరికొత్త డ్రామాకు తెర తీసింది!! రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో సర్కారు దారుణ వైఫల్యాలపై సామాన్య ప్రజలతో పాటు అధికార పక్షంలోనూ వ్యతిరేకత వెల్లువెత్తుతున్న విషయం విదితమే. శాంతి భద్రతల వైఫల్యంపై టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రతరమవుతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను నమ్మించే యత్నాల్లో నిమగ్నమయ్యారు. దీనిపై ఆయన నిజంగానే నిజాయితీగా వ్యవహరించదలచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా నిలదీసి ప్రశ్నించాలి. లేదంటే మంత్రివర్గంలో తనూ భాగమే కాబట్టి.. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించాలి. అయితే అలాంటిదేమీ లేకుండా.. శాంతి భద్రతలను నేరుగా పర్యవేక్షించే ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా.. దళిత మహిళ అయిన హోంమంత్రి అనితపై నెపాన్ని నెట్టేసే విధంగా పవన్ మాట్లాడటాన్ని చూస్తుంటే.. కొత్త డ్రామాను రక్తి కట్టిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం పిఠాపురం పర్యటన సందర్భంగా గొల్లప్రోలు సభలో పవన్‌కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ‘రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, అరాచకాలు మితిమీరిపోయాయి. పోలీసులు శాంతి భద్రతలను గాలికొదిలేసి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బయటకెళ్లాలంటే ప్రజలు ఏం ప్రశ్నిస్తారో అని భయమేస్తోంది. మమ్మల్ని తిడుతున్నారు. వారికి సమాధానం చెప్పలేక బయటకు వెళ్లలేకపోతున్నాం. మూడేళ్ల బాలికపై హత్యాచారం జరిగితే పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఆడబిడ్డల మాన, ప్రాణ రక్షణకు తగిన చర్యలు తీసుకోమని ఎన్నిసార్లు చెబుతున్నా స్పందన కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు ఇసుకలో లాభాలు చూసుకుంటున్నారేగానీ అరాచకాలను ప్రశ్నించడం లేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఆడపిల్లలను ఇబ్బందులు పెడుతుంటే కూటమి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పట్టించుకున్నారా?’ అని తాజాగా పవన్ వ్యాఖ్యలు చేశారు. అయితే శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకుగానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనకు గానీ ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా.. హోంమంత్రి అనిత ఇందుకు బాధ్యత వహించాలంటూ పవన్‌కళ్యాణ్ ఆ సభలో డిమాండ్ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందుకు బాధ్యత బాబుదే కదా..! హోంమంత్రి అనిత అయినప్పటికీ వాస్తవానికి శాంతి భద్రతల విభాగం పూర్తిగా ముఖ్యమంత్రి ఆ«దీనంలో కొనసాగుతుంది. మూడేళ్ల చిన్నారులపై అత్యాచారాలు జరిగినా, ఆడబిడ్డలపై లైంగిక దాడులు, హత్యాచారాలు చోటు చేసుకున్నా అవన్నీ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కిందకే వస్తాయి. అలాంటప్పుడు ఉప మఖ్యమంత్రి మాట్లాడిన మాటల ప్రకారమే.. శాంతి భద్రతల శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలి. ఇందుకు విరుద్ధంగా మహిళా మంత్రి, పైపెచ్చు దళిత మంత్రి అయిన హోంమంత్రి అనిత వీటికి బాధ్యత తీసుకోవాలని పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘హోంశాఖ మంత్రిగా మీరు బాధ్యత వహించండి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, హత్యలను పట్టించుకోండి. నేను హోంశాఖను తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకున్నానంటే పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తోడుదొంగల డ్రామాను బహిర్గతం చేస్తున్నాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు భీషణ ప్రతిజ్ఞలు.. ఇప్పుడు భయమేస్తోందంటూ! ఎన్నికల్లో చంద్రబాబుతో కలసి కూటమిగా పోటీ చేసిన పవన్‌కళ్యాణ్ పలు సభల్లో ఆయన తరపున కూడా తానే హామీలిచ్చేశారు. ‘రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఏ ఆడ్డబిడ్డపైనా అఘాయిత్యం జరగకుండా బలమైన చట్టాలు తెస్తాం..’ అని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై వరుసగా అఘాయిత్యాలు, చిన్నారులపై అకృత్యాలు జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ కనీసం ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇవ్వలేదని సర్వత్రా విమర్శలున్నాయి. జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తమను తిడుతున్నారని.. జనంలోకి వెళ్లాలంటే భయమేస్తోందని పవన్ స్వయంగా పిఠాపురం సభలో చెప్పారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకతను హోంమంత్రి పైకి మళ్లించి వైఫల్యాల నుంచి చంద్రబాబు, తాను బయట పడే వ్యూహాన్ని పవన్‌కళ్యాణ్ ఎంచుకున్నారు. ప్రభుత్వమంటే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మొత్తానిది ఉమ్మడి బాధ్యత అని గుర్తులేదా? పవన్‌కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందంటే.. మంత్రివర్గం మొత్తం వైఫల్యం కిందకే వస్తుందని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
జంతువుల కొవ్వుతో ఆయిల్ పవన్ ఇలాకాలో కల్తీ దందా
-
నకిలీ నెయ్యి కలకలం
పిఠాపురం: జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పిఠాపురం వేదికగా మారింది. భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ అక్రమ వ్యాపారాలతో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. కొద్ది నెలలుగా సాగుతున్న ఈ దందా ఆలస్యంగా వెలుగు చూసింది. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పక్కాæసమాచారం మేరకు పిఠాపురంలో శుక్రవారం ఒక ఇంటిపై దాడి చేయగా జంతువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పిఠాపురంలోని రెండవ రోడ్డులోని పద్మావతినగర్‌లో బండారు ఫణి ప్రసాద్ ఇంట్లో సుమారు 400 కేజీల నకిలీ నెయ్యిని, దాని తయారీకి ఉపయోగించే సామగ్రిని సీజ్ చేశారు. గోవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి పలు దేవాలయాలకు సరఫరా చేస్తున్నట్టు తయారీ దారులు కమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. రానున్న కార్తీకమాసాన్ని దృష్టిలో పెట్టుకుని భారీగా నకిలీ నెయ్యి తయారు చేసి ఆలయాల వద్ద విక్రయించడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కమిషనర్ సైతం ధ్రువీకరించారు. ఇదే పిఠాపురంలో ఇలాంటి కేంద్రాలు ఇంకా ఉన్నాయని, వాటిపై కూడా దాడులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అసలు దొంగలను పట్టుకోరా? ఇదిలా ఉండగా, ఈ విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ.. చాలా మందికి తెలియడంతో విషయాన్ని బయట పెట్టక తప్పలేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో చెందుర్తి, కొడవలి, తాటిపర్తి తదితర గ్రామాల శివారు ప్రాంతాల్లో అనధికార కబేళాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ యథేచ్చగా గోవధ జరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నెయ్యికి ఉపయోగించే జంతు కొవ్వు ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నట్లు తెలిసింది. గోవులను చంపి, అందులో కావాల్సిన మాంసాన్ని తీసుకుని.. మిగిలిన వ్యర్థ పదార్థాలను, ఎముకలను కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచి, దానిని మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తున్నారు. ఇలా తయారయ్యే నకిలీ నెయ్యిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యిని పలు ఆలయాల్లో పూజలు, ప్రసాదాల తయారీ, దీపారాధనకు వినియోగిస్తున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యి దందా వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు తెలిసింది. ఇంత జరిగినా అధికారులు అసలు వ్యక్తులను వదిలేసి.. వీళ్లే నిర్వాహకులంటూ కొందరిపై నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
పిఠాపురం మైనర్ బాలిక ఘటనపై పవన్ కళ్యాణ్ పై వంగగీత షాకింగ్ వ్యాఖ్యలు
-
ఏపీలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువు: వంగా గీత
సాక్షి, కాకినాడ: ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరాు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. అలాగే, పిఠాపురంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.పిఠాపురంలో అఘాయిత్యానికి గురైన దళిత బాలికను వంగా గీత బుధవారం పరామర్శించారు. కాకినాడలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలితో మాట్లాడారు. అనంతరం, వంగా గీత మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం సెంటర్లో మిట్ట మధ్యాహ్నం బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా జిల్లాల్లో ఇలాంటి ఘటనలో జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని ఘటనలు చాలానే ఉన్నాయి. నేరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రాష్ట్రంలో చిన్నారులకు, మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని కూటమీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము’ అంటూ కామెంట్స్ చేశారు. -
బాధిత బాలికకు న్యాయం జరిగేనా?
పిఠాపురం/సాక్షి, అమరావతి: పిఠాపురంలో సంచలనం రేపిన బాలిక అత్యాచార ఉదంతంలో కూటమి నేతలు తమ పార్టీ నేతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైన పిఠాపురానికి చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు దుర్గాడ విజయలక్ష్మి భర్త డి.జాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మంగళవారం ప్రకటించారు. నైతిక బాధ్యత వహించాల్సిన నిందితుడి భార్యపై మాత్రం పార్టీ తరఫున ఏ చర్యలూ తీసుకోకుండా ఆమెకు అండగా ఉంటామన్నట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, జనాలను నమ్మించడానికి వేసిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తమ కూటమిలో పార్టీకి చెందిన నేత అరాచకానికి పాల్పడితే బాధితురాలికి న్యాయం చేస్తాం అంటూ ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. తన ప్రకటనలో ఎక్కడా టీడీపీకి చెందిన నేతగా పేర్కొనకపోగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో అధికారులను ఆదేశించాం అంటూ పేర్కొనడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిని పట్టుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిఠాపురంలో ఒక బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆయన మంగళవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్‌ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తమ అదుపులో ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: పవన్ కళ్యాణ్పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. -
పిఠాపురంలో కత్తుల కూటమి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నాటినుంచి టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. తాజాగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో వారి మధ్య వైషమ్యాలు ముదురుపాకాన పడ్డాయి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ రూ.50 కోట్ల వార్షిక టర్నోవర్‌తో నడుస్తోంది.మొత్తం 2,011 ఖాతాదారులున్న ఈ బ్యాంక్‌లో ఐదుగురు డైరెక్టర్ల పదవులకు రెండు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఇరు పార్టీల నుంచి ఐదు స్థానాలకు నామినేషన్లు వేయడంతో కూటమి పార్టీల మధ్య పొత్తు చిత్తయింది. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మధ్యవర్తిత్వం వహించి.. టీడీపీ రెండు, జనసేన మూడు స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిర్చారు.టీడీపీ ఒక స్థానంతో సరి!ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి టీడీపీ ఒక స్థానానికే పరిమితమైంది. పొత్తును చిత్తు చేస్తూ జనసేన బలపరిచిన వ్యక్తులు మూడు (2, 4, 5) స్థానాలు దక్కించుకోగా.. సొసైటీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు బాలిపల్లి రాంబాబు 1వ వార్డు నుంచి గెలుపొంది డైరెక్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన తీరుపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.టీడీపీ వర్గాల మండిపాటుసార్వత్రిక ఎన్నికల నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా సొసైటీ ఎన్నికల్లో జనసేన నేతలు దొంగ దెబ్బ తీయడాన్ని వర్మ, టీడీపీ నేతలకు పుండుపై కారం చల్లినట్టయింది. వర్మ ప్రాధాన్యం తగ్గించి, దెబ్బకొట్టే వ్యూహంతోనే పవన్ డైరెక్షన్లో జనసేన నేతలు పొత్తు ధర్మాన్ని తుంగలోకి తొక్కారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం చైర్మన్ జనసేనకు, టీడీపీకి వైస్ చైర్మన్ పదవులు దక్కాలి. దీనికి జనసేన నేతలు తూట్లు పొడిచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో ఏ ఒక్కటీ దక్కకుండా చేయడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సోమవారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో జనసేన బలపరిచిన చెల్లుబోయిన ప్రమీలా నాగేశ్వరరావు చైర్మన్, మేళం రామకృష్ణ వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. -
పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్ టీడీపీ నేత. ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు.ఆటో డ్రైవర్ జాన్ మరో మహిళతో కలిసి సోమవారం సాయంత్రం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వద్ద ఉన్న ఓ బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పిఠాపురం శివారు మాధవపురం సమీపంలోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లి అక్కడ మహిళను కాపలాగా పెట్టి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునే వారు జాన్‌ను, మహిళను పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితురాలిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. జాన్‌ను కేసు నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే బాధితురాలి బంధువులు ఆందోళనకు సిద్ధపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వాళ్లకి సన్న బియ్యం.. దళితులకు కోటా బియ్యం.. పవన్ ఎంత మోసం చేశాడు...!
-
పవన్ సినిమా ఆర్టిస్ట్, బాబు డ్రామా ఆర్టిస్ట్.. జగన్ దెబ్బకు నోరు మూసుకున్న లోకేష్..
-
ఏపీలో రైతులను నిండా ముంచిన ప్రభుత్వ నిర్లక్ష్యం
-
అతడే ఒక ధైర్యం
-
వైఎస్ జగన్ పిఠాపురం పర్యటనలో భద్రతా లోపం
-
పథకాలు పోయాయ్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ హయాంలో ప్రజలకు ప్రతి ఒక్కటీ డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు ఏది కావాలన్నా టీడీపీ నాయకులను, జన్మభూమి కమిటీలను వేడుకోవాల్సిన దుస్థితి నెలకొందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తు చేశారు. ‘ఎన్నికల ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పిల్లలు కనిపిస్తే చాలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు ఇస్తామన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని వారినీ మోసగించారు. 50 ఏళ్లు దాటిన అమ్మలు కనిపిస్తే చాలు.. జగన్ మీకు రూ.18,000 మాత్రమే ఇస్తాడు! చంద్రన్న రూ.48 వేలు ఇస్తాడంటూ వారినీ మోసం చేశాడు. మరి ఎక్కడైనా రూపాయి ఇచ్చాడా? ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 వంతున ఏటా రూ.36 వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్నాడు. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలైనా ఒక్కటీ అమలు కాలేదు. అమ్మఒడి లేదు.. సున్నా వడ్డీ పోయింది.. చేయూత లేదు! ఇంత అన్యాయంగా అందరినీ మోసం చేస్తూ బడి పిల్లల గోరుముద్దను సైతం నిర్వీర్యం చేశాడు. ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.2,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య ఆసరా అసలే లేదు. 108, 104 సిబ్బందికి జీతాలు లేవు. మూడు త్రైమాసికాలు గడిచిపోయినా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదు. వసతి దీవెన లేదు’ అని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లోనే సచివాలయ సిబ్బంది పింఛన్లు పంచుతున్నారని, ఎవరైనా అలా వెళ్లి తీసుకోకుంటే కట్ చేస్తున్నారన్నారు. కూటమి సర్కారు పాలనలో ఎవరైనా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి వారిపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని, పాలన అస్తవ్యస్థంగా మారిందని ధ్వజమెత్తారు. ‘ఇలాంటి దారుణ పాలన పోవాలి. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. వారు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. చంద్రబాబు మోసాలకు కోపం వస్తోంది. ఆ భయంతోనే రెడ్‌బుక్ పాలనకు తెర తీశారు. అయినా ఏమీ చేయలేరు. ప్రజలు భరించే పరిస్థితి లేదు’ అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అయితే సీఎం చంద్రబాబు ఫొటోలకే పరిమితమై డ్రామా ఆర్టిస్టుగా మారారని, పవన్ కంటే బాగా నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలుసుకున్న అనంతరం రమణక్కపేటలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...బాబు ఇచ్చింది ఏమిటి? 2014–19 మధ్య 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రమే చంద్రబాబు పంటల బీమా కింద ఇచ్చారు. అదీ కూడా ప్రీమియం రైతులు కడితేనే వచ్చాయి. మరి ఆయన ఇచ్చింది ఏమిటి? అదే జగన్ హయాంలో రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు ఉచిత పంటల బీమా కింద అందాయి. మా ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించింది. చంద్రబాబు పెట్టిన రూ.715 కోట్ల బకాయిలను కూడా నాడు మా ప్రభుత్వమే చెల్లించింది. ఒక్క రైతు భరోసా కిందే 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. రైతులు నష్టపోతే ఆదుకునేందుకు గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా అన్ని విధాలా తోడుగా నిలిచాం. ఇప్పుడు అవేవీ లేకపోవడం, వ్యవస్థలను అస్తవ్యస్థంగా మార్చేయటంతో అన్నదాతలు అల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించింది. సున్నా వడ్డీ, పంట రుణాలు ఏమయ్యాయి? పెట్టుబడి సాయం ఏమైంది? ఈ–క్రాపింగ్ జరగడం లేదు. ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యం అయిపోయాయి. వలంటీర్ల వ్యవస్థ కనుమరుగైపోయింది. ఉచిత పంటల బీమాను గాలికొదిలేశారు. రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు? అదే ఇవాళ మీ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే రైతన్నకు రైతు భరోసా రూ.13,500 వచ్చి ఉండేది. ఎకరాకు రూ.7 వేలు ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగా వచ్చి ఉండేది. ఉచిత పంటల బీమా పథకం కింద రూ.24 వేల నుంచి రూ.29 వేల వరకూ పంటల బీమా రైతులకు అందేది. సున్నా వడ్డీ కింద రైతులకు ఎకరాకు కనీసం రూ.4 వేలు వచ్చేవి. అన్నీ కలిపి రైతులకు ఎకరాకు దాదాపు రూ.45 వేల వరకు సాయం అందేది. పంట నష్టం జరిగితే మేం హెక్టారుకు రూ.17 వేలు ఇచ్చాం. గతంలో చంద్రబాబు హయాంలో కేవలం రూ.15 వేలు మాత్రమే అందేది. పంట నష్టానికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు ఇంతవరకు కనీసం ఈ–క్రాప్ కూడా చేయించలేదు. గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీల కోసం జాబితాలు ఎందుకు ప్రదర్శించడం లేదు? మళ్లీ రైతులు టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. పారదర్శకత ఎక్కడా లేదు. 2023–24 ఖరీఫ్‌లో వచ్చిన కరవుకు సంబంధించి రూ.1,278 కోట్ల ప్రీమియంను ఈ ప్రభుత్వం కట్టాలి. కానీ చంద్రబాబు డబ్బులు కట్టకుండా, రైతులకు నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారు.జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం...సాక్షి ప్రతినిధి, కాకినాడ / గుంటూరు : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భదత్ర పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి కొట్టొచ్చినట్లు కనిపించింది. బుధవారం గుంటూరు జిల్లాలో, శుక్రవారం కాకినాడ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా లోపాలు ఆందోళన కలిగించాయి. ఈ రెండు పర్యటనల్లో వైఎస్ జగన్‌కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంలో ప్రభుత్వం, పోలీసు అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగిన స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయలేదు. కేవలం ఒక్కో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, అరకొరగా కానిస్టేబుళ్లను భద్రతకు వినియోగించారు. వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో వైఫల్యాలపై ఇప్పటికే వైఎస్సార్సీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయస్థానంలో కేసు కూడా వేసింది. అయినా ప్రభుత్వం పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా స్పందించడంలేదు. ప్రభుత్వ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గుంటూరులో కనీస భద్రతా లేదు టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డి గుంటూరు జైలులో ఉన్నారు. వారిని ములాఖత్‌లో పరామర్శించేందుకు వైఎస్ జగన్ బుధవారం అక్కడికి వెళ్లారు. తాడేపల్లిలోని నివాస గృహం నుంచి బయల్దేరిన ఆయనకు సాధారణ భద్రత మాత్రమే కల్పించారు. గుంటూరు అమరావతి రోడ్లోకి ప్రవేశించిన దగ్గర నుంచి లాడ్జి సెంటర్, తాలుకాసెంటర్ మీదుగా జిల్లా జైలుకు చేరే వరకూ దారి పొడుగునా పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. భారీగా తరలివచ్చిన వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించనే లేదు. దాంతో పలువురు గోడలు, గేట్లు వైఎస్ జగన్ ఉన్న ప్రదేశానికి వచ్చేశారు. అక్కడక్కడ గుంపులుగా పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇక జైల్లో ములాఖత్ ముగిసి, బయటకు వచ్చిన జగన్ వద్ద పోలీస్ భద్రతే కనిపించలేదు. అక్కడే చెట్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వద్దకు చేరుకునేందుకు ఆయనకు చాలా కష్టమైంది.హెలిపాడ్ దగ్గరా నిర్లక్ష్యంగా పోలీసులు శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానిచ్చారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద కూడా కనీస భద్రత లేదు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత హెలిపాడ్ ఉన్న కాలేజీ గేటును పోలీసులు తెరవడంతో ఒకేసారి పెద్ద సమూహం జగన్‌ను చుట్టుముట్టింది. అక్కడే ఉన్న రోప్ పార్టీ, పది మంది పోలీసు కానిస్టేబుళ్లు ఆ గుంపును నియంత్రించేందుకు కూడా ప్రయత్నించలేదు. ఎవరు పార్టీ కార్యకర్తలో ఎవరు విద్రోహ శక్తులో కూడా గుర్తించే పరిస్థితి లేదు. మాధవపురం వద్ద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు పైకి కొందరు యువకులు ఎక్కి హల్చల్ చేయడం కలకలం రేపింది. వారిని అడ్డుకునేందుకు కూడా పోలీసులు ప్రయత్నించలేదు. నాగులాపల్లి, ఇసుకపల్లి, రమణక్కపేట వద్ద జనం పెద్దఎత్తున జగన్ కాన్వాయ్‌ను చుట్టుముట్టిన సందర్భంలో రోప్ పార్టీ తగిన రీతిలో స్పందించ లేదు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇలాగే అరకొరగా ఉంటే అభిమానుల ముసుగులో విద్రోహ శక్తులు ప్రవేశించినా అడ్డుకునే పరిస్థితే లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు జగన్‌పై జరిగిన దాడులను గుర్తుకు తెస్తున్నారు. ఒక మాజీ సీఎంకు భద్రతపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది ఈ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. -
జగన్ పిఠాపురం పర్యటనలో భద్రతా లోపం
సాక్షి, పిఠాపురం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో మరోసారి భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ పిఠాపురం పర్యటన సందర్భంగా ఆయన భద్రత అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకుముందు జిల్లాల పర్యటనల సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది.కాగా, వైఎస్ జగన్‌కు కల్పిస్తున్న భద్రత సరిపోలేదని ఇది వరకే పలుమార్లు వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్ జగన్‌కు భద్రతను కుదించింది. ఇక, వైఎస్ జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా భద్రతా లోపం బయటపడుతున్నప్పటికీ కూటమి సర్కార్‌కు చీమకుట్టినట్టు కూడా లేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో, చంద్రబాబు సర్కార్ తీరుపై వైస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.తాజాగా వైఎస్ జగన్ పిఠాపురంలో పర్యటిస్తున్న సమయంలో ఆయన కారుపైకి కొందరు యువకులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు యువకులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. అలాగే ఈరోజు ఉదయం హెలికాప్టర్ ల్యాండ్ అయిన సందర్భంలో కూడా హెలిపాడ్ కిక్కిరిసిపోయింది. ఇక్కడ తగినంత భద్రతను పోలీసులు కల్పించలేదు. అయితే, వైఎస్ జగన్ అంటే గిట్టని వారు అభిమానుల ముసుగులో ఏదైనా చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో వైఎస్ జగన్‌పై జరిగిన దాడులను గుర్తు చేస్తున్నారు. -
నీకు 15వేలు.. నీకు 15వేలు ఎక్కడ?
-
ధైర్యంగా ఉండండి నేనున్నా.
-
రైతులకు జగన్ భరోసా..
-
జగన్ అమలు చేసిన పథకాలు ఇప్పుడు లేవు.. బాగా నష్టపోతున్నాం
-
పిఠాపురంలో వైఎస్ జగన్‌కు జననీరాజనం
-
వరదబాధితులకు జగన్ పరామర్శ.. పిఠాపురంలో జననేతకు జన నీరాజనం (ఫొటోలు)
-
పిఠాపురంలో జగన్ కు అడుగడుగునా జన నీరాజనం
-
జగన్ పాలనలో ఇంత ఘోరం చూడలేదు
-
వరద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
-
YS జగన్ పిఠాపురం టూర్.. భారీగా తరలివచ్చిన జనం..
-
పిఠాపురంలో జగన్.. హెలికాప్టర్ దృశ్యాలు..
-
Watch Live: పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన
-
కాసేపట్లో పిఠాపురం పర్యటనకు వైఎస్ జగన్
-
ఏలేరు బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలం అయిన మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా రైతులను అడిగి తెలుసున్నారు.వరద బాధితుల్ని కలిసి వాళ్లకు కలిగిన కష్టం.. జరిగిన నష్టం గురించి తెలుసుకుని జగన్ ఓదార్చారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కనీసం పునరావాస కేంద్రాలకు కూడా తరలించలేదని బాధితులు జగన్ వద్ద వాపోయారు. ఈ విషయంలో పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: పవన్‌కు పెద్దగా ఏమీ తెలియదు: వైఎస్ జగన్ ఇక.. జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం రమణక్కపేటకు జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ముంపునకు గురైన పంటపొలాలను ఆయన పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడతారు. ఈ పరామర్శలో జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జి వంగా గీత, స్థానిక నేతలు ఉన్నారు.ఇదీ చదవండి: బడుగు జీవితాలు పదేళ్లు వెనక్కు!పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా మూడు నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తాన్ని కళ్లెదుటే చేజేతులా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుతుందని ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. -
నేడు పిఠాపురంకు వైఎస్ జగన్
-
‘పవన్.. నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావ్’
సాక్షి, కాకినాడ: ఏపీలో ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో భారీగా పంట నష్టం జరిగింది. ఇక, కూటమి ప్రభుత్వం నిర్లక్క్ష్యం కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. కాగా, వర్షాల నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ప్రజలను, రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏదో అరకొరగా సాయం అందించి ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కాకినాడ రైతులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మండిపడుతున్నారు.తాజాగా చంద్రబాబు ప్రకటించిన వరద నష్టపరిహారంపై పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లి మండలంలో రమణక్కపేటకు చెందిన రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..‘ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహరం ఎందుకూ పనికి రాదు. ఎకరాకు రూ.30 వేలు ఇస్తేనే రైతు ఆర్ధికంగా గట్టెక్కగలడు. ఏలేరు వరదతో సర్వం కోల్పోయాం. ఐదు రోజులుగా నీట మునిగిన పంట ఎందుకు పనికి రాదు. ఇప్పటికే నీటిలో మునిగిన పంట కుళ్ళిపోయి వరద నీటిలో పైకి తేలుతుంది.ఎకరాకు రూ.10వేలు ఇస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనపై మాకు నమ్మకం లేదు. గతంలో ఎప్పుడైనా చంద్రబాబు నష్టపోయిన రైతులకు పరిహరం అందించాడా?. డిప్యూటీ సీఎం, మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇంత వరకు నష్టపోయిన రైతులను పలకరించ లేదు. ఎన్నికల సమయంలో ఏ చిన్న కష్టం వచ్చినా మీకు నేను ఉన్నాను అంటూ లేనిపోని హామీలు ఇచ్చాడు. ఇప్పుడు కనీసం మావైపు కూడా చూడటం లేదు. ఇదేనా మామీద పవన్‌కు ఉన్న బాధ్యత. ఆయనను నమ్మి గెలిపించుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు.ఇది కూడా చదవండి: చంద్రబాబు పర్యటనకు జనసేన ఎమ్మెల్యేలు డుమ్మామా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన పిఠాపురంలో ఉన్నాడో.. హైదరాబాద్‌లో ఉంటున్నాడో మాకు తెలియదు. ఓట్లు వేయించుకున్న ఎంపీ ఉదయ్ ఎక్కడ ఉన్నారు. మా బాధలు ఎందుకు పట్టించుకోరు. ఎన్నికల సమయంలో పిఠాపురానికి వచ్చి జబర్ధస్ ఆర్టిస్టులు వచ్చి ఏదోదో చెప్పారు. పిఠాపురాన్ని మలేషియా చేస్తాం. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. మాకు ఇంత నష్టం జరిగినా కనీసం ఏ ఒక్కరూ వచ్చి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే కౌలు రైతుకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు కోసం వచ్చారు కానీ కష్టంలో ఉంటే ఎవరూ కనబడడం లేదు!!పవన్ కళ్యాణ్ ,ఎంపీ ఉదయ పై పిఠాపురం రైతులు ఫైర్. pic.twitter.com/5eFox9Drjn— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) September 11, 2024 -
వరదల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకున్న వంగా గీత
-
నిండా మునిగిన పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం
-
పిఠాపురానికి అండగా నేనున్నా..
-
మీటింగ్ లోనే కొట్టుకున్న కమిషనర్, ఇంజనీర్
-
పూజా సామగ్రిలో సగం వస్తువులు బి చివాట్లు పెట్టిన మహిళలు
-
పవన్ కళ్యాణ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్
-
పిఠాపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
నీకు ఓటేసినందుకు ఇల్లు కూల్చేస్తావా బాబూ.. జగన్ ఉన్నా బాగుండేది...
-
కాళ్లు పట్టుకున్నాడని గెలిపిస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు
-
"డ్రైనేజ్ టు డైమండ్.." పవన్ కొత్త ప్రాజెక్ట్
-
‘ఏ హోదాతో పిఠాపురంలో పెత్తనం చేస్తున్నారు?’
సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్‌ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. -
పిఠాపురంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు
-
వైఎస్ జగన్ ను కలిసిన తర్వాత వంగా గీత రియాక్షన్
-
టీడీపీ Vs జనసేన.. పిఠాపురంలో మరో రచ్చ..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం టీడీపీ-జనసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తి గ్రామంలో ఆ పార్టీల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలను గత పాలక కమిటీ జనసేన నాయకులకు అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన-టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నీచంగా చూస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని మండిపడ్డారు. ఆలయ తాళాలు గ్రామ కమిటికి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.ఇదిలా ఉండగా, పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగిన సంగతి తెలిసిందే.. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. -
పిఠాపురంలో వర్మపై దాడి చేసిన జనసైనికులు
-
పిఠాపురం వర్మపై జనసేన దాడి
కాకినాడ, సాక్షి: పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.రాళ్లు, కొబ్బరి కాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి తప్పించుకుని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. వర్మపై దాడి విషయం తెలియడంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా వారు శాంతించలేదు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు– చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్‌హౌస్‌కు చేరుకోగా పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు. నన్ను చంపడానికి ప్రయత్నించారు: వర్మ ఎన్నికల్లో పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళితే జనసేన శ్రేణులు తనపై దాడి చేశాయని టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు చిలకపూరి ప్రభాకరరావు పిలుపు మేరకు సర్పంచ్‌లు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేశారన్నారు. దీంతో తాను సర్పంచ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వన్నెపూడి వెళ్లానన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన మాజీ టీడీపీ నేతలు, ప్రస్తుతం అధికారం కోసం జనసేనలోకి వెళ్లిన కొందరు నేతలు తనపై దాడికి దిగారని ఆరోపించారు. తనపై ఇటుకలు, గాజు గ్లాసులు, డ్రింక్ సీసాలు, కంకర రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడిలో తనతో పాటు మరికొందరికి గాయాలయ్యాయన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయతి్నంచారని ధ్వజమెత్తారు. 9 నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని.. జనసేనకు పనిచేయడం తన ఖర్మ అని వ్యాఖ్యానించారు.తనపై హత్యాయత్నం వెనుక ఉదయ్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేస్తున్నప్పుడు వన్నెపూడికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 150 మంది తనకు రక్షణ వలయంగా ఉండడంతో తాను బయటపడ్డానన్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ గొల్లప్రోలు పోలీసు స్టేషన్ వద్ద వర్మ టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. -
ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
పిఠాపురం: మామిడిలో రారాజుగా పేరొందిన కొత్తపల్లి కొబ్బరి మామిడికి ఎక్కడాలేని గిరాకీ పలుకుతోంది. మామిడి ప్రియుల మనసు దోచుకున్న ఒకే ఒక్క మధుర ఫలం ఇది. రుచిలో అతి మధురంగా ఉండడంతో ఈ మామిడి పండ్ల రేటు పైపైకి ఎగబాకి పండ్ల ప్రియులను ఊరిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... మామిడిలో ఎన్నో రకాలున్నప్పటికీ వాటిలో గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడికి ఉన్న డిమాండ్ వేరు. మామిడి రకాల్లో ఈ రెండింటినీ హిడెన్ జెమ్స్‌గా భావిస్తారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించి, సంరక్షించిన గ్రామాల పేరిటే ఇవి ప్రసిద్ధి చెందాయని ఆ ప్రాంతవాసులు అంటున్నారు.ఉత్తమ లక్షణాలున్న పండ్లుగా ఇవి గుర్తింపు పొందడంతో రాజుల కాలం నుంచే వీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పూర్వం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు తమ తోటల్లో వీటిని పెంచుకుని, ఆ రుచిని తాము ఆస్వాదించడంతోపాటు మిత్ర రాజులకు కానుకలుగా పంపేవారట. అందుకే ఒకప్పుడు రాజ సంస్థానాల్లో మాత్రమే ఈ పండ్లు ఉండేవని, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండేవి కావనే ప్రచారం కూడా ఉంది.ఇప్పటికీ ఈ రకం మామిడి పండ్లను తమ స్నేహితులకు, బంధువులకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు బహుమతిగా పంపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఏటా గోదావరి జిల్లాల నుంచి సుమారు 20 టన్నుల వరకూ కొత్తపల్లి కొబ్బరి, కాకినాడ రూరల్ మండలంలోని పండూరు మామిడి రకాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కవ కాలం నిల్వ ఉండకపోవడంతో ప్రస్తుతం దూర ప్రాంతాలకు ఎగుమతులు జరగడం లేదని అంటున్నారు. కొత్తపల్లి కొబ్బరి గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన మామిడి రకాల్లో కొత్తపల్లి కొబ్బరిదే ప్రథమ స్థానం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి ప్రాంతంలో లభించే అమోఘమైన రుచి కలిగిన మామిడి పండు ఇది. కొబ్బరి కాయలో మాదిరిగా పీచు అధికంగా ఉండటంతో ఈ రకాన్ని కొత్తపల్లి కొబ్బరిగా పిలుస్తారు. మేలిమి బంగారు రంగులో మెరిసిపోతూ సువాసనలు వెదజల్లుతుంటుంది. పూదోటలో మాదిరిగా ఈ రకం మామిడి పండ్లు ఉన్నచోట సువాసనలు వెదజల్లుతుంటాయి.ఈ మామిడి పండులో కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి. ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి సైజు చిన్నగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండటంతో పచ్చి మామిడి తినలేరు. కానీ పండు మాత్రం అతి మధురం. ఇవి మామిడి సీజన్లో మాత్రమే పండుతాయి. పీచు ఎక్కువగా ఉండటంతో ఆవకాయ, ఊరగాయలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మామిడితో పెట్టిన ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ చెట్ల కాపు తక్కువగా ఉంటుంది. పండు చిన్నదే కానీ ధర మాత్రం అదరగొడుతుంది.పండూరు మామిడి ఇది అత్యంత పురాతనమైన మామిడి రకం. ఈ చెట్టు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగి, నిండా కాయలుంటాయి. చూడటానికి పప్పులో వేసుకునే చిన్న మామిడి కాయల్లా మాత్రమే ఉంటాయి. పండ్లు కూడా ఆకుపచ్చగానే ఉండటం వీటి ప్రత్యేకత. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వెలగదూరు గ్రామ పరిసరాల్లోని సంస్థానంలో పూర్వం కొందరు దొంగలు మామిడి పండ్లను దొంగిలించి, తిని, వాటి టెంకలను కోట అవతల పారేశారని, వాటిని తీసి నాటగా వచి్చన చెట్టు ద్వారా ఈ పండ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది.దిగుబడి తగ్గి.. డిమాండ్ పెరిగి.. గత ఏడాదికంటే దిగుబడి తగ్గడంతో కొబ్బరి మామిడికి డిమాండ్ అమాంతం పెరిగింది. గత ఏడాది 100 కొబ్బరి మామిడి కాయలు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ విక్రయించగా ఈ ఏడాది రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ అమ్ముడవుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పంపడానికి స్థానిక నేతలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు కొని తినే అవకాశం లేకుండా పోయింది. గతంలో దిగుబడి ఎక్కువగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండేవి.కానీ ఈ ఏడాది కొబ్బరి మామిడి చెట్లు పూత రాలిపోయి తక్కువగా కాశాయి. దీంతో దిగుబడి చాలా తక్కువ వస్తోంది. కాయ సైజు కూడా చిన్నదిగా ఉంటోంది. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి మామిడి ప్రియులు ఎగబడటంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ 2 టన్నుల కాయలు విక్రయించాం. మరికొద్ది రోజులు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. – కండేపల్లి సురేన్, మామిడి వ్యాపారి, కొత్తపల్లి వీటి గిరాకీ వేటికీ ఉండదు కొత్తపల్లి కొబ్బరి రకానికి ఉన్న గిరాకీ మరే మామిడి పండుకూ ఉండదు. పీచు అధికంగా ఉండటంతో ఊరగాయలకు ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఏడాది కాపు తక్కువగా ఉండడంతో వీటికి ఎనలేని గిరాకీ పెరిగింది. దీంతో కాయ పెద్దది కాకముందే కోసేస్తున్నాం. మామిడి సీజన్లో మొదటిగా ఇవి అందుబాటులోకి వస్తాయి. కాయ టెంక కట్టగానే పండించడానికి వీలుంటుంది. వందల సంఖ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇది తొందరగా ముగ్గిపోతుంది. కాయ బాగా ముదిరితే మంచి నాణ్యత ఉంటుంది. ప్రస్తుతం కొనుగోలుదారులు ఎక్కువగా ఉండటంతో ఇవి ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. – ఓరుగంటి నాగబాబు, మామిడి రైతు, చేబ్రోలు -
పిఠాపురం ప్రజలంతా సీఎం జగన్ వైపు..
-
పిఠాపురంలో జోరుగా పోలింగ్
-
జగన్ పాటకు ఊగిపోయిన పిఠాపురం ప్రజలు
-
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
-
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
-
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
-
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
-
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
-
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
-
దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ జిల్లా: సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కూటమి మోసాలను ఎండగట్టారు. ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే..‘‘చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. కూటమికి ఓటేస్తే పథకాలన్నిటింకీ ముగింపే. 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జమ చేసింది. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటి వద్దకే పెన్షన్, పౌరసేవలు, పథకాలు ఇస్తున్నాం. గతంలో ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను కూటమి నేతలు చెత్తబుట్టలో వేశారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా..‘‘2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశాం. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు చూశారా. అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం. డ్రైవర్ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం. జగనన్న తోడు, చేదోడుతో చిరు వ్యాపారులకు తోడుగా నిలిచాం’’ అని సీఎం పేర్కొన్నారు.మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే‘‘స్వయం ఉపాధికి గతంలో ఈ పథకాలు ఉన్నాయా?. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. మన మేనిఫెస్టోను నేరుగా ఇళ్లకే పంపి ఆశీస్సులు తీసుకున్నాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే’’ అని సీఎం చెప్పారు.మీ ఇద్దరినీ అడుగుతున్నా..‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరి వెళ్లి భూములు కొన్నాడు.. బాలకృష్ణ మొన్ననే విశాఖలో రిషికొండలో భూమలు కొన్నాడు.. మీ ఇద్దరినీ అడుగుతున్నా.. మీకు ఒరిజినల్ డీడ్స్ ఇచ్చారా? జిరాక్స్ ఇచ్చారా?. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 9 లక్షల మందికి ఒరిజినల్ డీడ్స్ ఇచ్చాం’’ అని సీఎం జగన్ వివరించారు.దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?‘‘వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి.. దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు’’ అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. -
నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్
-
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
పిఠాపురం : ప్రత్యర్ధులు నన్ను అవమానిస్తున్నారు.. అవహేళన చేస్తున్నరని వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘ కొంగు చాచి అడుగుతున్నాను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను. మళ్లీ జన్మలో పిఠాపురంలో పుడతాను. కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా. నేను పిఠాపురం వదిలి వెళ్లను. నా అంతిమయాత్ర పిఠాపురంలోనే జరగాలి. మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు వంగా గీత. ‘వంగా గీతాను నిలదీయండి అని పవన్ అంటున్నాడు. పిఠాపురంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను అడగాలా? కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెచ్చినందుకా? కరోనా సమయంలో ప్రజల్లో ఉన్నది నేను. నాకు అనారోగ్యం వస్తే.. అవమానించేలా మాట్లాడారు. నాటకాలు ఆడాల్సిన అవసరం రాలేదు. .. జ్వరం వస్తే హైదరాబాదు పారిపోలేదు. ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా?. వర్మ వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. ను పిఠాపురంలో పుట్టలేదని వర్మ అంటున్నాడు.వర్మ మాత్రం పిఠాపురంలో పుట్టాడా?’ అని వంగా గీతా మండిపడ్డారు. -
వంగా గీత గూస్ బంప్స్ స్పీచ్.. దద్దరిల్లిన పిఠాపురం
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పిఠాపురం (కాకినాడ జిల్లా)
-
పిఠాపురంలో ప్రచారం.. చిరంజీవి అందుకే వెనకడుగు వేశారా?
జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎందుకని ప్రచారం చేయడం లేదు? ఆయన పిఠాపురం వస్తారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా తన తమ్ముడు మంచి వాడని చెబుతూ చిరంజీవి ఒక వీడియా క్లిపింగ్ ను విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆయన పిఠాపురం వచ్చి ఎందుకని ప్రచారం చేయడం లేదన్నది ఇపుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్న సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి నేరుగా వచ్చి ప్రచారం చేయడానికి జంకారని అంటున్నారు.2019 ఎన్నికల్లో జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుండి పోటీ చేశారు. రెండు నియోజక వర్గాల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జనసేన కార్యకర్తలు, అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. అటు పవన్ కల్యాణ్ కూడా రెండింట్లో గెలిచిన తర్వాత ఏ నియోజక వర్గానికి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసి పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్ ప్రభంజనంలో పవన్ కు ఎదురు గాలి తగిలేసింది. పోటీచేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి చెందారు. దాన్ని జనసేన నేతలు అవమానంగా భావించారు. ఓటమిని చాలా కాలం పాటు పవన్ జీర్ణించుకోలేకపోయారు. చాలా పెద్ద షాకే కొట్టింది పరాజయం.తన ఓటమికి కారణాలపై పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలని శ్రేయోభిలాషులు అప్పట్లోనే సలహా ఇచ్చారు. రెండు చోట్ల ఓడినా పవన్ కల్యాణ్ కొంతకాలానికే కేంద్రంలోని బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత జనసేన-బిజెపిల జట్టులోకి టిడిపిని తీసుకురావడానికి బిజెపి అగ్రనేతలతో పదే పదే చర్చలు చేశారు.ఈ సందర్భంగానే ఆయన ఆ పార్టీ అగ్రనేతల నుండి తిట్లు తినాల్సి వచ్చింది కూడా. వాటన్నింటినీ భరిస్తూనే మొత్తానికి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. టిడిపి,బిజెపిలతో జట్టు కట్టడంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యి తీరాలని పవన్ పంతంగా ఉన్నారు.ఈ సారి కూడా భీమవరం నుండి పోటీ చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే ఎందుకో కానీ ఆయన దాన్ని వదులుకున్నారు. తమ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పిఠాపురం నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండే నామినేషన్ వేశారు. పవన్ కల్యాణ్ పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. నియోజక వర్గంలో ఆమెకు మంచి పేరు ఉండడంతో పాటు ఇంటింటా పరిచయాలు ఉన్నాయి. అందుకే పవన్ కల్యాణ్ కు గట్టి పోటీ ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పిఠాపురంపైనే దృష్టి సారించారు. తనకు మద్దతుగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లచేత ప్రచారం చేయించారు. అదే విధంగా జబర్దస్త్ టీం కూడా పవన్ తరపున ప్రచారం చేస్తోంది.అందరూ చేస్తున్నారు కానీ పవన్ కల్యాణ్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలే అన్నాయి. ఈ నెల 5న ప్రచారానికి వస్తారని ముందుగా అన్నారు. ఆ తర్వాత లేదు లేదు 10 తేదీన వస్తారని అన్నారు. అయితే చివరకు చిరంజీవి పిఠాపురం వచ్చి ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అలాగని పూర్తిగా ప్రచారం చేయకపోతే పవన్ కల్యాణ్ ఫీల్ అవుతారు కాబట్టి పవన్ గెలిస్తే మంచి చేస్తాడంటూ ఒక వీడియోలో చిరంజీవి తన సందేశాన్ని రికార్డు చేసి విడుదల చేశారు. అదే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి ఎందుకు డ్రాప్ అయ్యారన్న అంశంపై చర్చ జరుగుతోంది.విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం చిరంజీవి పిఠాపురం వచ్చి రోడ్ షో నిర్వహించి పవన్ కల్యాణ్ గెలుపు కోసం విస్తృతంగానే ప్రచారం చేయాలని ముందుగా అనుకున్నారట. అయితే ఆ తర్వాత పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన ఆరా తీస్తే వంగా గీత విజయం ఖాయమని తేలిందట. తాను నేరుగా వచ్చి ప్రచారం చేసినా పవన్ గెలిచే పరిస్థితి లేదని తేలడంతోనే ఊరికే ప్రచారం చేసి తన పరువు తీసుకోవడం ఎందుకని చిరంజీవి భావించారని అంటున్నారు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ పార్టీ కోసం తిరిగారు కాబట్టి.. పవన్ కల్యాణ్ పార్టీ కోసం తాను ప్రచారం చేయకపోతే బాగుండదని అందరూ అనడంతో ప్రచారం చేద్దామనుకున్నారట. కనీసం పవన్ పోటీ చేసే నియోజక వర్గానికే ప్రచారాన్ని పరిమితం చేయాలనుకున్నారట. తీరా పవన్‌కు విజయవకాశాలు లేవని సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి ప్లాన్ మార్చి వెనకడుగు వేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీన్ని మెగా అనుచరులు కొట్టి పారేస్తున్నారు. చిరంజీవి వీడియో క్లిపింగ్‌కే పరిమితం కావడంతో పవన్ కల్యాణ్‌లోలోన గుర్రుగా ఉన్నారని అంటున్నారు -
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
-
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
-
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
-
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
-
పవన్ పై ఏపీ NRIలు కౌంటర్
-
పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
పిఠాపురం: గోకులం గ్రాండ్ హోటల్లో ఏం జరిగింది?. అక్కడి నుంచి డబ్బుల బ్యాగులు ఎక్కడికి వెళ్లాయి? పిఠాపురంలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్‌గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన సీన్లో అసలు కథ ఏంటంటే.. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎవ్వరూ ఆపకుండానే ఓ కారు వచ్చి ఆగింది.రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కారు డ్రైవర్. ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్‌పోస్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది. అనుమానం వచ్చి సోదా చేయగా.. అందులో 17 అట్టపెట్టెల్లో జనసేన గుర్తుతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి. వెంటనే వాటిని స్వా«దీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది. పోలీసులు కారును, గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పక్కదోవ పట్టించేలా పక్కా వ్యూహం తనిఖీ అధికారులు, పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులూ లేకపోవడంతో స్వా«దీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం.. కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన నేతలు వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. అక్కడ క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు.అధికారులు కారులో గ్లాసులు స్వా«దీనం చేసుకున్నప్పుడు ఎటువంటి బిల్లులూ లేవని చెప్పిన జనసేన నేతలు.. హోటల్లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులకు బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది. సినీ నటులు, సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమీ కాదని, భవిష్యత్‌లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్‌ను నెల క్రితం జనసేన అగ్ర నేతలు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచి నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ నగదు ఉంది అనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేవని తేల్చేశారు. జనసేన నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ హోటల్‌పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారం జనసేన అగ్ర నేతలకు ముందే తెలిసింది.వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు. చెక్‌పోస్టు వద్దకు పంపి ట్రాఫిక్‌ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు. దీంతో మీడియా ఫోకస్ అటు మళ్లింది. ఈలోపు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటీకీల్లో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, మీడియా, పోలీసుల దృష్టి ట్రాఫిక్‌కు అడ్డంగా పెట్టిన కారుపైకి మళ్లించి.. డబ్బును రహస్య ప్రాంతానికి మళ్లించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!