
కాకినాడ, సాక్షి: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu) పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి కాకరేపింది. వర్మ పేరిట ఆయనకు తెలుగు తమ్ముళ్లు మరోసారి షాక్ ఇచ్చారు. జై వర్మ(Jai Varma) నినాదాలతో నాగబాబుకు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో పసుపు జెండాలతో టీడీపీ బలప్రదర్శనకు దిగగా.. జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పిఠాపురంలో తన సీటు త్యాగం చేసి మరీ పవన్ కల్యాణ్‌ను గెలిపించారని టీడీపీలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎస్పీఎస్ఎన్ వర్మ మీద సానుభూతి ఏర్పడింది. అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు మండిపడుతున్నారు.
పైగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానికంగా వర్మకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయింది. దీని వెనక కూడా నాగబాబు కుట్ర ఉందనే అభిప్రాయం వాళ్లలో బలంగా ఏర్పడింది. ఈ క్రమంలో నిన్న గొల్లప్రోలులోనూ అన్నాక్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో రసాభాసా సృష్టించారు. తాజాగా కుమారపురంలోనూ వర్మకు మద్ధతుగా నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి: వర్మ అవుట్.. ఇక పిఠాపురం జమీందార్‌గా కొణిదెల నాగబాబు