nagababu
-
నాగబాబు బెర్త్ ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే
మెగా బ్రదర్... జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి యోగం.. ఉందా..? ఇప్పట్లో..? పండక్కి అవుతుందా ? ఇంకా టైం పడుతుందా ? అంతా గందరగోళం. తన మానాన తాను ట్విట్టర్లో పిచ్చి ట్వీట్స్ చేసుకుంటూ ఎకసెక్కాలు ఆడుకుంటావు ఉంటే ఉన్నఫళాన ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటాం సీఎం చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేసారు. వాస్తవానికి మొన్నామధ్య ఖాళీ అయినా మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి ఆయన్ను ఎంపిక చేసి రాజ్యసభకు ఢిల్లీ పంపుతారని వార్తలు వచ్చాయి కానీ అది కుదరకపోవడంతో ఎకాఎకిన ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అంటూ చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫలానా వ్యక్తికీ త్వరలో కేబినెట్లో స్థానం కల్పిస్తాం అని ప్రకటన చేయలేదు. దీని మీద అప్పట్లో జరిగాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియావాళ్లు సైతం బాగానే ట్రోల్ చేసారు. కానీ ఇంతవరకు ఆ విషయమై ఏమీ తేలలేదు..ఇదిలా ఉండగా మంత్రిగా ప్రమాణస్వీకారం ఎలా చేయాలన్నదానిమీద నాగబాబు ఇప్పటికే రిహార్సిల్స్ కూడా చేసేసి. కొత్త బట్టలు కుట్టించుకుని రెడీగా ఉన్నారు. కానీ మరి చంద్రబాబు నుంచి .. రాజ్ భవన్‌నుంచి కనీసం పిలుపు రాలేదు. వాస్తవానికి రాష్ట్ర కేబినెట్లో ఒకే ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పటికె పలువురు మంత్రులు రెండేసి పదవులు చేపట్టి బాధ్యతలు మోస్తున్నారు. వాటిలో ఒకటి తీసేసి ఈయనకు ఇస్తారని.. అది కూడా జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు ఇస్తారని కూడా పుకార్లు వచ్చాయి. కానీ ఆ సౌండ్ కూడా ఇప్పుడేం లేదు.. అంతా సైలెంట్ అయిపొయింది.ఆరోజుకు కూల్ చేయడమే చంద్రబాబు లక్ష్యమా ?వాస్తవానికి రాజ్యసభ స్థానం కోసం పట్టుబట్టిన నాగబాబును కూల్ చేయాడానికి అప్పటికపుడు ఆ మంత్రి పదవి పేరిట ఒక ప్రకటన ఇచ్చారు తప్ప ఇప్పుడప్పుడే ఆయన్ను కేబినెట్లోకి తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఏమి పదవి అడగాలి.. ఏది తీసుకోవాలి అనే విషయంలో పవన్ కళ్యాణ్.. నాగబాబులమధ్య చర్చలు కూడా నడిచాయని ఏ శాఖ తీసుకోవాలన్నదానిమీద వారు ఒక అవగాహనకు వచ్చారని కూడా అంటున్నారు కానీ చంద్రబాబు దగ్గర ఇవన్నీ నడుస్తాయా..? అయన ఇచ్చింది తీసుకోవడం తప్ప వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అనే అంశాలూ చర్చకు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ గమ్మున కేబినెట్లోకి దూకేసి హడావుడి చేద్దాం అనుకున్న నాగబాబు స్పీడ్ కు చంద్రబాబు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాజ్యసభ ఎన్నికల హడావుడి ముగిసింది.. మళ్ళా ఏదైనా అవసరం పడినపుడు. పవన్ బ్రదర్స్ ను కూల్ చేయాల్సిన అవసరం వచ్చినపుడు చూద్దాం అందాక ఊరుకుందాం అని చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.- సిమ్మాదిరప్పన్న -
టార్గెట్ నాగబాబు.. లోకేష్‌కు బూమరాంగ్!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడైన కొణిదెల నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారు. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ ప్రకటన చేశారు. ఈ పరిణామంపై జనసేన ఫుల్ ఖుషీగా ఉంది. కష్టకాలంలో అండగా ఉన్న అన్నకు పవన్ తగిన బహుమతి ఇవ్వబోతున్నాడని అనుకుంటున్నారు. కానీ, టీడీపీ మాత్రం లోలోపల రగిలిపోతోంది. అందుకు కారణం.. గతంలో టీడీపీని, చినబాబును నాగబాబు ఫుల్‌గా ఆడేసుకోవడం!.2014లో జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంటే ఆయన అన్న నాగబాబు నడుస్తున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఆయన రాజకీయ మనుగడ కష్టమేనని అంతా అనుకున్నారు. అనూహ్యంగా.. జనసేన ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ పార్టీ బలోపేతం కోసం పని చేశారు. 2024 ఎన్నికలకు పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించగానే.. జనసేన శ్రేణుల్లో నైరాశ్యం ఆవహించింది. అయితే.. ఆ అసంతృప్తిని కప్పిపెట్టడంలో నాగబాబే ముఖ్యభూమిక పోషించారు. చివరకు ఏదైతేనేం.. ఎమ్మెల్సీ కోటాతో మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కొణిదెల నాగబాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణలాంటి అర్హత ఉన్నవాళ్లు ఉండగా.. ఏనాడూ ఎన్నికల్లో గెలవని నాగబాబును మంత్రిని చేయడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. అదే టైంలో.. గతంలో నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కొందరు ప్రస్తావిస్తున్నారు.2019-24 మధ్య వైఎస్సార్సీపీతో పాటు టీడీపీని టార్గెట్‌గా పెట్టుకుని నాగబాబు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్ చానెల్లో అడ్డగోలు కామెంట్స్ చేశారు. అందులో చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్‌తో పాటు కొడుకు లోకేష్ నోరు జారి చేసిన ప్రసంగాలను నాగబాబు బాగా హైలైట్ చేశారు. యూట్యూబ్ ఆదాయం కోసమే నాగబాబు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయనపై ఆ టైంలో సెటైర్లు కూడా బాగానే పేలాయి. చివరకు.. ఎందుకనో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.సంబంధిత వార్త: ‘లోకేష్ కామెడీ ముందు జబర్దస్త్ ఏపాటిది’కట్ చేస్తే.. 2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్‌కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు.సంబంధిత వార్త: లోకేష్‌కు ఓ.. వేస్కోండి!ఇప్పుడు కాబోయే మంత్రి నాగబాబుపై పెడుతున్న పోస్టుల వెనుక.. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ మొదలైంది. ప్రతీకార చర్యలో భాగంగానే.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల టైంలో పవన్ కోసం నారా లోకేష్‌ను పక్కనపెట్టారు చంద్రబాబు. తీరా ఎన్నికలయ్యాక లోకేష్‌ను మంత్రిని చేసినప్పటికీ.. జనసేనానితో గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతోంది. మరోవైపు ఈ పోస్టుల ఆధారంగా.. నాగబాబుకు టీటీడీ చైర్మన్ సహా ఏ పదవీ దక్కకపోవడానికి చినబాబే కారణమై ఉంటాడని జనసేనలోనూ ఓ చర్చ నడుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ కోటా మంత్రి అయిన సందర్భాన్ని లోకేష్‌కు అన్వయింపజేస్తూ కౌంటర్‌కు దిగారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా.. టీడీపీ-జనసేనల మధ్య ఏళ్లుగా నడుస్తున్న సోషల్ మీడియా వార్ రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ
-
ఏపీ కేబినెట్ విస్తరణ.. ఆ ఐదుగురికి ఉద్వాసన?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అతిత్వరలో కేబినెట్ విస్తరణ జరగనుందనే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన నేత, పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్న నేపథ్యంతో ఈ పరిణామం తప్పదనేది ఆ వార్త సారాంశం. ఈ క్రమంలో ఇప్పుడున్న కేబినెట్లో ఐదుగురికి ఉద్వాసన తప్పదనే మరో ప్రచారం తీవ్రంగా నడుస్తోంది. కూటమికి చెందిన.. అదీ టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేతే ఈ ప్రచారం దగ్గరుండి చేయిస్తుండడం గమనార్హం.ఏపీలో కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉంటుందా? లేదంటే సంక్రాంతి తర్వాత అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. నాగబాబు కేబినెట్ ఎంట్రీ ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో ఐదుగురిని మారుస్తారనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి కేబినెట్లో ఒక్క స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఆ ఒక్కస్థానం అప్పగిస్తే సరిపోతుంది కదా?. కానీ, ఈ విషయంపై ఆ టీడీపీ పెద్ద ఏం చెబుతున్నారంటే.. ఇప్పుడు ఏపీ మంత్రులు సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సవిత పట్ల చంద్రబాబు మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పనితీరు కూడా పెద్దగా బాగోలేదనే చంద్రబాబు అనుకుంటున్నారు. బోనస్‌గా.. హోం మంత్రి అనిత విషయంలోనూ పాజిటివ్నెస్ లేదు’’ అని ప్రచారం చేయిస్తున్నారు. ఆ టీడీపీ నేత చెప్పిన విషయాల గురించే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు జోరుగా చర్చించుకుంటున్నాయి.ఇదిలా ఉంటే.. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన కూటమి సర్కారులో చిన్నపాటి చిచ్చు రాజేసింది. టీడీపీ నేతలు ఆ ప్రకటనతో రగిలిపోతున్నారు. అయితే చంద్రబాబు వాళ్ల ఆవేశాన్ని చల్లార్చినట్లు సమాచారం. తొలుత.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని, పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు ఊహాగానాలు వినవచ్చాయి. అయితే.. ఢిల్లీ లెవల్లో జనసేన పప్రాతినిధ్యం చంద్రబాబుకు ఇష్టం లేనట్లుంది. అందుకే ఆ మూడు సీట్లలో ఒకటి బీజేపీ.. రెండు టీడీపీకి ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో ఏపీ కేబినెట్లో నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించి.. జనసేనలో పేరుకుపోయిన అసంతృప్తిని చంద్రబాబు చల్లాచర్చారు. -
టీడీపీ సీనియర్లకు దక్కని గౌరవం
-
నాగబాబుకు మంత్రి పదవి!
-
కూటమి @ ఫ్యామిలీ ప్యాక్
కూటమి సర్కారు ఫ్యామిలీ సర్కస్ మాదిరి మారింది. సర్కారులో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును సైతం కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. వాస్తవానికి పార్టీలో అత్యంత కీలకమైనవ్యక్తులకు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనివాళ్లకు మాత్రమే ఇలా ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రిగా చేస్తారు.. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పొంగూరు నారాయణ, లోకేష్ వంటివాళ్లకు మంత్రిగా స్థానం కల్పించారు. మొన్నటికి మొన్న వైయస్ జగన్ కేబినెట్లోనూ ఓడిపోయినా మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడొచ్చిన చిక్కంతా కూటమిలో ఫ్యామిలీ ఫ్యాక్స్ ఎక్కవైనాయి అనేది చర్చకు వచ్చింది.కూటమి ధర్మం అంటూ చంద్రబాబు చేస్తున్న చేష్టలు దిగజారినట్లుగా ఉంటున్నాయని అంటున్నారు. వాస్తవానికి తాజాగా ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ మూడు సీట్లలో ఒకటి బిజెపి.. రెండు తెలుగుదేశం వాళ్ళు ఎగరేసుకుపోవడంతో నాగబాబుకు రాజ్యసభ ప్రాప్తం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సంతుష్టుణ్ణి చేసేందుకు కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మొదటినుంచీ కష్టపడినవాళ్లకు కాకుండా పైరవీకారులకు, డబ్బులు ఇచ్చేవాళ్లకే ప్రాధాన్యం దక్కిందన్న మూతి విరుపులు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీలో నాగబాబు పాత్ర, పార్టీ నిర్వహణ .. ఆర్థికవ్యవహారాలు వంటి అంశాల్లో అయన వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి. టిక్కెట్ల కోసం డబ్బులు కలెక్షన్ చేశారని. కార్యకర్తలను సాంతం వాడేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.అయినా సరే డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కావడం.. పైగా ఎలాగైనా చట్టసభకు వెళ్లాలన్న కోరిక నాగబాబుతో ఉండడంతో ఆయన్ను ఈవిధంగా సంతృప్తి పరుస్తున్నట్లు టీడీపీ క్యాడర్ చెప్పుకుంటోంది. ఇప్పటికే టీడీపీలో సీనియర్లు అయిన యనమల రామకృషుడు,, కిమిడి కళావెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు వంటివాళ్లకు మంత్రిపదవుల్లేక వట్టి ఎమ్మెల్యేలుగా జనాల్లోకి వెళ్లలేక అవమానభారం మోస్తుంటే ఇప్పుడు ఏమీలేని నాగబాబును ఎలా మంత్రిని చేస్తున్నారు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే చంద్రబాబు.. అయన కుమారుడు లోకేష్ అధికారంలో ఉన్నారు.. ఇక శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు. అయన అన్నకొడుకు రామ్మోహన్ నాయుడు (కేంద్ర మంత్రి)గా ఉన్నారు. అలవిమాలిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులూ ఇప్పుడు ఆహామీల సంగతిపక్కనబెట్టి అధికారాన్ని పంచుకోవడంలో బిజీ అయ్యారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.బాబు మాటలు.. నీటి మూటలునీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అనడమే కాకుండా ప్రతి వ్యక్తికీ ఒక పథకాన్ని ప్రకటించారు. అవేం అమలుకాకపోగా గతంలో జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసారు . పైగా ఇప్పటికే 75 వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు రెండుసార్లు పెంచి జనం నడ్డివిరగ్గొట్టారు. ఆ వైఫల్యాలను జనం ప్రస్తావించకుండా ఉండేందుకు ఒక నెల తిరుమల లడ్డులో కొవ్వు అంటూ.. ఇంకో నెల సోషల్ మీడియా అరెష్టులు.. ఇంకోసారి ఇంకేదో అంశాన్ని తెరమీదకు తెచ్చి జనం దృష్టిని మళ్లిస్తూ వస్తున్నారు.ఇదీ చదవండి: డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?ఫ్రీ ఇసుక లేకపోగా దాని ధర ఆకాశాన్ని అంటింది. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎక్కడ రూపాయి ఉంటె అక్కడికి వాలిపోతున్నారు. ఇక పవన్ సైతం పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉంది.. ఏమి చేయలేకపోతున్నాం అని వగచారు. సంపద సృష్టిస్తాం అని చెప్పుకుని గెలిచాక ఈ చేతగాని ఏడుపులు ఎందుకు అంటూ ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే నాగబాబుకు మంత్రిపదవి అంటూ చంద్రబాబు సరికొత్త కాన్సెప్ట్ ను బయటకు తీశారు. మొత్తానికి కూటమి సర్కారు జల్సా చేస్తోంది తప్ప ప్రజలకు చేస్తున్నదేం లేదని అంటున్నారు. నాగబాబు మంత్రి అయితే జబర్దస్త్ కామెడీ మొత్తం కేబినెట్లోనే ఉంటుందని అంటున్నారు-సిమ్మాదిరప్పన్న -
ట్వీట్ పెట్టినందుకు నాగబాబు గారికి థాంక్స్
-
ఎల్లోమీడియాకు నాగబాబు కౌంటర్
సాక్షి,హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎల్లోమీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు నాగబాబు తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో శుక్రవారం(నవంబర్ 29) ఒక పోస్టు చేశారు. తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని నాగబాబు కుండబద్దలు కొట్టారు. పవన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని రోజులుగా ఏదేదో ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియాకు తన ట్వీట్‌తో తాజాగా షాకిచ్చారు నాగబాబు. పవన్ ఢిల్లీ పర్యటన నాగబాబు కోసమేనని ఎల్లోమీడియా ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. నాగబాబుకు రాజ్యసభ సీటు కావాలని పవన్ తన టూర్లో బీజేపీ పెద్దలను కోరినట్టు ఎల్లోమీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ ప్రచారంపై నాగబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకే ఆయన ఎక్స్‌లో క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. -
నిజం ఎప్పటికైనా బయటపడుతుంది..!
-
విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు తర్వాత నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ‘ఎక్స్’లో చేసిన రెండు పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తినీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’అన్న బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్‌ను ఆయన రాసుకొచ్చారు. అలాగే ‘మీరు విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు.ప్రతి కథకు మూడు పార్శా్వలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం’అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్‌ను కూడా పోస్టు చేశారు. జానీ మాస్టర్ గురించి ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించకపోయినా పరోక్షంగా మద్దతు పలికారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పారీ్టలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించడం వల్లే నాగబాబు ఇలా స్పందించారని అంటున్నారు. జానీ మాస్టర్.. తప్పు చేస్తే అంగీకరించండి: మంచు మనోజ్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, అరెస్టు నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ స్పందించారు. ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు. ‘జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అన్నది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు నా అభినందనలు.ఈ సమాజంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండి..’అని మనోజ్ పేర్కొన్నారు. ‘ఇచి్చన మాట ప్రకారం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ని వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. పరిశ్రమలోని మహిళలకు గొంతుగా నిలపండి. మీరు ఒంటరిగా లేరని, మీ ఆవేదన, బాధలను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం..’అంటూ మనోజ్ పోస్టు చేశారు. -
టీటీడీ.. మాకే కావాలి! పట్టుబడుతున్న టీడీపీ, జనసేన
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు ఆ పదవి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామకృష్ణరాజు రేసులో నిలవగా.. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ పారీ్టకి చెందిన సీనియర్ నేత ఎవరికైనా ఆ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అశోక్ గజపతిరాజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె అదితికి అవకాశం కలి్పంచి.. తాను పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆయనకే ఈ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పూర్తికాలం ఆ పదవి కోసం సమయం కేటాయించకపోవచ్చని, అలాగే అందరికీ అందుబాటులో ఉండడం కష్టమనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొంది.ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం.. స్పీకర్ పదవి ఆశించినా అదీ రాకపోవడంతో ఆయన తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా రేసులో ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని.. తమకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. నాగబాబు కోసం ఒత్తిడి! టీడీపీలోనే టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకోగా.. దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు జనసేన పార్టీ పావులు కదుపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు ఆ పదవి ఇవ్వాల్సిందేనని జనసేన పార్టీ చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయమైనట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం ఆ ప్రచారాన్ని ఖండించిన నాగబాబు.. అధికారిక ప్రకటన వస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలన్నారు. దీంతో నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవిపై ఆశ ఉన్నట్లు బయటపడింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైన నాగబాబు.. సర్దుబాటులో భాగంగా ఆ సీటును వదులుకున్నారు. దీంతో అన్నకు ఏదైనా మంచి పదవి ఇప్పించాలనే ఉద్దేశంలో పవన్‌కళ్యాణ్ ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవిని అడుగుతున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉన్నా కూడా ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత.. పోటీ నేపథ్యంలో చంద్రబాబు ఏమీ తేల్చట్లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీటీడీ బోర్డులో కూడా తమ పారీ్టకి చెందిన వారిని సగం మందిని నియమించాలని జనసేన కోరుతున్నట్లు తెలిసింది. బీజేపీ కూడా మూడుకు తగ్గకుండా తమ వారిని బోర్డులో సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తోందని సమాచారం. -
అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్
-
"సారీ రా బన్నీ.."
-
నాగబాబుపై ట్విట్టర్ వేదికగా పోతిన మహేష్ విమర్శలు
-
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎటాక్...పారిపోయిన నాగబాబు
-
తిరుపతి జనసేన నాయకులతో నాగబాబు సమావేశం
-
ట్వీటు రాజా? పోటీ లేదా?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడితే చాలు మెగా బ్రదర్స్ అయిన పవన్, నాగబాబు తెగ హడావుడి చేస్తారు. రాష్ట్రంలో మూడు పార్టీల పొత్తుల కోసం తాను ఎన్నో త్యాగాలు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ బాబుతో ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటే... నాగబాబు మాత్రం తానో అపర మేధావి అనుకుంటూ.. ఎక్కడెక్కడో కొటేషన్లో, పిట్టకథలో తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. ఆపై ప్రతి నెల మొదటి వారంలో తన సోషల్ మీడియాలో QR కోడ్‌ను షేర్ చేసి వంద రూపాయల నుంచి విరాళం పంపాలని కోరుతాడు. అలా ఎప్పుడూ ఆయన నెట్టింట మెగా ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటారు. వాస్తవంగా నాగబాబు కూడా తమ్ముడు పవన్ టైపే! పవన్ స్టేజీపై ఊగిపోతూ మాట్లాడితే.. కొణిదెల నాగబాబు మాత్రం ఇంట్లో కూర్చోని ట్విటర్లో ఊగిపోతాడు. పసలేని తన ట్వీట్లతో ఆజ్ఞానంలో మునిగితేలుతూ అభిమానులపై తన జ్ఞాన ప్రదర్శన చూపిస్తాడు. జనసేనను రాజకీయ పార్టీగా బలపరచుకోండయ్యా అని తెలివైన అభిమానులు సలహాలు ఇస్తే.. వారందరినీ వైసీపీ కోవర్ట్‌లు అంటూ పార్టీ నుంచి వెళ్లిపోండి అంటారు. పవన్ ఏమో చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుంటే.. నాగబాబు మాత్రం పేటీఎం స్కానర్ పట్టుకుని సోషల్ మీడియాతో పాటు ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఫ్యాన్స్ అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు మెగాబ్రదర్స్ ఇద్దరూ ఇలా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి అందరి కంటే ముందుగానే అక్కడ ఎంట్రీ ఇచ్చాడు నాగబాబు.. అచ్యుతాపురంలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి అన్నయ్యకు పవన్ షాకిచ్చాడు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేన త్యాగం చేస్తుందని దానికి ఎల్లో కలరింగ్ ఇచ్చాడు. దీంతో ఎన్నికల యుద్ధం నుంచి కత్తి పట్టకుండానే వెనుతిరిగాడు. అప్పటి వరకు వారం రోజుల పాటు అక్కడ హడావుడి చేసిన నాగబాబు తన షెడ్యూల్‌కు ప్యాకప్ చెప్పడమే కాకుండా ఆ ఇంటికి టూలెట్ బోర్డు పెట్టేశాడు. ఆపై అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చేసి.. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో నాగబాబు ఇంటికే పరిమితం అయి ట్వీట్లు చేసుకుంటూ కాలం గడపుతున్నాడు. వాస్తంగా అక్కడ నాగబాబు ఎంట్రీ సమయంలోనే ఆయనది ఐరన్ లెగ్ అంటూ జనసేన అభిమానులు చెప్పుకొచ్చారు. వారు అనుకున్నదే తర్వాత నిజమైంది. అనకాపల్లిలో నాగబాబు ఓట్లు అడగడం కంటే ప్రజలకు ఎక్కువగా క్యూ ఆర్ కోడ్‌ను చూపించేవారట. వంద రూపాయల నుంచి ఎంతైనా స్కాన్ చేయండి అని వారి ఫ్యాన్స్‌కు చెప్పేవారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా కొంతమేరకు అసహనానికి గురైయ్యారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని ఫ్యాన్స్‌కు అర్థమైంది. నిజంగా జనసేనలో నాగబాబుకు పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగబాబు పొలిటికల్ కేరీర్ ఇంతటితో క్లోజ్ అయినట్లే.. మరో కొద్దిరోజుల్లో చంద్రబాబు వల్ల పవన్ పొలిటికల్ కెరియర్ కూడా క్లోజ్ అవుతుందని మెగా ఫ్యాన్సే బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత పార్టీ పేరుతో వారిద్దరూ విరాళాలు రాబట్టుకోవడంలో బిజీగా ఉంటారని పలువురు జోష్యం చెబుతున్నారు. -
పవన్ కల్యాణ్ సొంత అన్నకే దిక్కులేదు.. మేమెంత?
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన శ్రేణుల్లో సరికొత్త అలజడి రేగుతోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తులో అరకొర సీట్ల కేటాయింపు వీరికి మింగుడు పడడంలేదు. చాలీచాలని సీట్లతో ఎవరికి ఎసరు వస్తుందోనని లోలోన ఆందోళన చెందుతు న్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి తానే బరిలో ఉంటున్నానని, అచ్యుతాపురంలో కాపురం కూడా పెట్టి నానా హంగామా చేసిన నాగబాబు.. పక్షం రోజులు తిరక్కుండానే పలాయనం చిత్తగించారు. ఈ పరిణామానికి జనసేన క్యాడరు షాక్‌కు గురైంది. పవన్ కల్యాణ్ సొంత సోదరునికే ఈ పరిస్థితి వస్తే ఇక మేమెంత? అంటూ పార్టీలో టిక్కెట్లను ఆశిస్తున్న వారు నిర్వేదంలో పడిపోయారు. ఇన్నాళ్లూ పార్టీలో నాగబాబుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని భావించిన వారికి ఆయనకు అంత సీను లేదని తేటతెల్లమైంది. నిజంగా జనసేనలో పట్టున్నా, లేక పవన్ వద్ద పలుకుబడి ఉన్నా నాగబాబుకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. స్వయంగా అన్నకే పార్టీలో దిక్కు లేదని, ఇక ఆయనను నమ్ముకుంటే తాము నట్టేట మునిగినట్టేనని వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాగబాబుకు అన్ని విధాలా దన్నుగా నిలిచి, ఆయన వ్యవహారాలు చూస్తున్న యలమంచిలి ప్రాంతానికి చెందిన సుందరపు బ్రదర్స్ (విజయ్‌కుమార్, సతీష్‌కుమార్) సైతం నాగబాబు ఎపిసోడ్‌తో పత్తాలేకుండా పోయారు. వాస్తవానికి వీరిలో విజయకుమార్ యలమంచిలి, సతీష్‌కుమార్ గాజువాక సీట్లను ఆశిస్తున్నారు. ఇందుకోసం వీరు నాగబాబును ప్రసన్నం చేసుకుంటూ అటు అనకాపల్లి జిల్లాలోను, ఇటు విశాఖపట్నం జిల్లాలోనూ వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. నాగబాబు మనుషులుగా ముద్ర వేయించుకున్న వీరు కొంతమంది నుంచి వసూళ్లకు దిగారన్న ఆరోపణలున్నాయి. నాగబాబు తాజా పరిస్థితితో వీరు ఆందోళన చెందుతున్నట్టు చెబుతున్నారు. త్యాగాలకు సిద్ధంకండి.. మరోవైపు భీమిలి జనసేన సీటు తనకే ఖాయమైందని బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న పంచకర్ల సందీప్‌కు కాకుండా టీడీపీకి కేటాయిస్తున్నట్టు ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ సారి ఈ సీటును త్యాగం చేయాలని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందీప్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే గాజువాక స్థానం నుంచి తమ అభ్యర్థే బరిలో ఉంటారన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు విస్తృతం చేశారు. దీంతో అక్కడ జనసేన సీటును ఆశిస్తున్న సుందరపు సతీష్‌కుమార్, కోన తాతారావులు కూడా త్యాగాలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఇక జనసేన నుంచి విశాఖ దక్షిణ సీటును వంశీకృష్ణ శ్రీనివాస్, సాధిక్, ప్రసాదరెడ్డి, కందుల నాగరాజు, డాక్టర్ మూగి శ్రీనివాసరావులు ఆశిస్తున్నారు. ఈ స్థానం నుంచి కూడా టీడీపీ అభ్యర్థే పోటీ చేస్తారని తెలియడంతో వీరంతా కలవరం చెందుతున్నారు. ఆ ఇద్దరిలో ఒక్కరికే చాన్స్? ఇక ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశించి వైఎస్సార్సీపీ నుంచి జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌లు జంప్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిలో ఒక్కరికే జనసేన సీటు దక్కవచ్చని చెబుతున్నారు. పెందుర్తి స్థానం పంచకర్లకు దాదాపు ఖరారైందని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే వంశీకృష్ణకు మొండి చెయ్యే గతయ్యే పరిస్థితి తలెత్తనుంది. అదే జరిగితే జనసేన త్యాగరాజుల జాబితాలో ఆయన కూడా చేరిపోనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కీలకనేతలు తమకు గుర్తింపు లేదని, నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలతో ఇప్పటికే జాడలేకుండా పోయారు. ఇప్పుడు వీరికి త్యాగమూర్తులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. -
అనకాపల్లి నుండి నాగబాబు పరార్
-
జెండా పీకేసిన నాగబాబు..
-
జెండా ఎత్తేసిన నాగబాబు.. ఓటమి భయమే కారణమా?
-
నాగబాబు ప్యాకప్ వెనుక కారణం ఏంటంటే..
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ ఒక్కటే అనిపించుకున్నారు. ఇద్దరూ పార్ట్ టైమ్ పొలిటిషీయన్స్ అని మరోసారి రుజువు చేసుకున్నారు. ప్రజలకు మేలు చేసేందుకు కాకుండా చంద్రబాబుకు సహకరించేందుకే వారు ఉన్నట్టు నిరూపించుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.. జనసేన నేత నాగబాబు.. అనకాపల్లిలో నుంచి జెండా ఎత్తేశారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా నాగాబాబు ఏపీకి వచ్చారు. అనంతరం, అచ్చుతాపురంలో ఓ ఇల్లు తీసుకుని నాలుగు రోజులు హడావుడి చేశారు. సమీక్షల పేరుతో కలరింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో సర్వేలు కూడా చేయించుకున్నట్టు సమాచారం. అయితే... సర్వేల్లో ప్రతికూల ఫలితాల కారణంగా ఓటమి భయం మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో, నాగబాబు తన మకాంను అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు మార్చారు. తాజాగా మూటాముల్లె సర్దుకుని నాగాబాబు హైదరాబాద్‌కు పయనమయ్యారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజున ఏపీకి వచ్చిన పవన్.. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, పొత్తులో భాగంగా 24 సీట్లు జనసేకు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించగా.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై పవన్ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు తాను ఎక్కడ పోటీ చేస్తున్న విషయం కూడా ఆయన చెప్పలేదు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడా చేయలేదు. ఇక, ఏపీలో రాజకీయాలు అంటూ పవన్ మళ్లీ హైదరాబాద్‌లోనే మకాం వేశారు. దీంతో, ఇలాంటి నేతలా ఏపీ ప్రజల బాగు కోరేది అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ నేత కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: కాళ్ల మండలం పెద అమిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో పాలకొల్లు వైఎస్సార్సీపీ నాయకులు గుణ్ణం నాగబాబు కుమారుడు సుభాష్ వివాహానికి సీఎం హాజరయ్యారు. వరుడు గుణ్ణం సుభాష్, వధువు దీప్తిలను సీఎం జగన్ ఆశ్వీరదించారు. ఈ వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసు బాబు, శ్రీ రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు.