Bigg Boss 5 Telugu: Naga Babu Shocking Comments On Priyanka Singh - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: పింకీపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Dec 7 2021 1:59 PM | Last Updated on Tue, Dec 7 2021 2:21 PM

Bigg Boss Telugu 5: Naga Babu Praises Priyanka Singh - Sakshi

బిగ్‌బాస్‌లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తనదైన ఆటతో 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది  ప్రియాంక సింగ్‌ అలియాస్‌ పింకీ. గతంలో ఒకటి రెండు షోలలో పాల్గొన్నప్పటికీ.. పింకీకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షో కారణంగా ప్రియాంక లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ట్రాన్స్‌ జెండర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక.. గత సీజన్‌లోని తమన్నా లాగే కొద్ది రోజుల్లోనే ఎలిమినేట్‌ అయిపోతుందని అంతా భావించారు. కానీ తన అందచందాలతో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా.. అద్భుతమైన ఆటతీరుతో 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది.

ఒకానొక దశలో టాప్‌ 5లో ప్రియాంక కచ్చితంగా ఉంటుందనేట్లుగా తన గేమ్‌ని కొనసాగించింది. అయితే అనూహ్య పరిణామాల వల్ల గత ఆదివారం ప్రియాంక ఎలిమినేట్‌ అయి హౌస్‌ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా పింకీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం పింకీ.. బిగ్‌బాస్‌ వల్ల వచ్చిన క్రేజ్‌ని ఆస్వాదిస్తుంది. ఈ క్రమంలో తాను హౌస్‌లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్‌ నాగబాబును కలిసి, ఆశీర్వాదం తీసుకుంది. ఈ విషయాన్ని నాగబాబు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ.. పింకీపై ప్రశంసల వర్షం కురించాడు. ‘ఎన్నో అసమానతలను ధిక్కరించి, అవమానాలను, అవరోధాలను ఎదుర్కొని ఈ రోజు గొప్ప స్థానంలో నిలిచావు. నువ్వు బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవకపోవచ్చు. కానీ నిత్యం సమాజంలో నిత్యం నీలా అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి నువ్వు ఒక స్ఫూర్తిగా నిలిచావు. జీవితంలో గెలవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అని నాగబాబు ఇన్‌స్టాలో ఓ సుధీర్ఘ పోస్ట్‌ పెట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement