Priyanka Singh
-
అమెరికాలో సగం సినిమా
ఆదర్శ్ పుందిర్, అశ్రిత్ రెడ్డి, ప్రియాంకా సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ కీలక పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తు న్నారు. స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్, సెటిల్ కింగ్ ప్రొడక్షన్‌పై వేణుబాబు నిర్మిస్తున్నారు. ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘టెక్నాలజీ, భావోద్వేగాలు, లింగ సమానత్వం నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. డిసెంబరు 26న ఆరంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 50 శాతం పూర్తయింది. మిగతా సగభాగం షూటింగ్ కోసం అమెరికా వెళ్తున్నాం’’ అన్నారు. ప్రియాంకా సింగ్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో దర్శక–నిర్మాతలు నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో టెక్నాలజీ అనేది కీలక ΄ాత్ర పోషించబోతోంది’’ అన్నారు ఆదర్శ్ పందిరి. ‘‘లింగ సమానత్వంపై వినోదాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అని పూజిత పుందిర్, నటుడు అశ్రిత్ రెడ్డి చెప్పారు. కెమెరామేన్ దిలీప్ కుమార్ చిన్నయ్య మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్ చరణ్, జీవీ. -
బిగ్ బాస్ 'ప్రియాంక సింగ్' ఇంట్లో విషాదం
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున ఆమె తండ్రి బీబీ సింగ్ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. తన తండ్రి మరణించారని సోషల్ మీడియా ద్వారా ప్రియాంక సింగ్ ఒక పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె స్నేహితులు, అభిమానులు ధైర్యంగా ఉండాలని ఓదార్చుతున్నారు.శ్రీకాకుళానికి చెందిన ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందే. సాయితేజగా ఉన్న తను లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారిపోయారు. అయితే, తాను ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయం మొదట తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా కాలం పాటు తన తండ్రి వద్ద ఈ విషయాన్ని దాచారు. అయితే, బిగ్‌బాస్5 హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో తానొక ట్రాన్స్‌జెండర్ అనే విషయం తన తండ్రికి తెలియాలని ఎమోషనల్ అయ్యారు. బిగ్‌బాస్ వేదికగా తన తండ్రికి తాను ట్రాన్స్ జెండర్ చేయించుకున్నట్టు, అమ్మాయిగా మారిపోయినట్టు తెలిపారు.కొంత కాలం తర్వాత ప్రియాంక సింగ్ నిర్ణయాన్ని బీబీ సింగ్ కూడా గౌరవించారు. తన తండ్రికి ఓ ప్రమాదంలో కళ్లుపోతే .. అన్నయ్యలు, చెల్లెల్లు తమకు పట్టనట్లు ఉండటంతో తానే తల్లిదండ్రుల బాధ్యతలు స్వీకరించినట్లు ప్రియాంక చెప్పింది. ఈ క్రమంలో వారికి ప్రియాంక సొంత ఇల్లు కూడా కట్టించారు. ఎంతో ఇష్టమైన తన తండ్రి మరణంతో ప్రియాంక సింగ్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. -
పింక్ గౌనులో 'బిగ్‌బాస్' ఫేమ్ పింకీ (ఫొటోలు)
-
చీరలో కుందనపు బొమ్మలా బిగ్ బాస్ ప్రియాంక సింగ్ (ఫొటోలు)
-
Priyanka Singh: వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
-
Priyanka Singh: బటర్‌ఫ్లై మామ్
ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంటిముందు గుమ్మానికి ఆకుపచ్చ తోరణం ఉండాలి. గుమ్మానికి ఇరువైపులా పచ్చటి మొక్కలుండాలి. ఆ మొక్కలకు రంగురంగుల పువ్వులుండాలి. ఇంట్లోకి అడుగుపెడుతుంటే పరిమళాలు స్వాగతం పలుకుతుండాలి. ఇవన్నీ ముంబయి నగరంలో, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌లో సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదని ఊరుకుంటే ప్రియాంక సింగ్ బటర్‌ఫ్లై మామ్ అయ్యేదే కాదు. ఆమె ఇల్లు వేలాది సీతాకోక చిలుకలకు పుట్టిల్లయ్యేదీ కాదు. ప్రియాంక సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణం. గంగానది తీరాన, వందల ఏళ్ల నాటి మహావృక్షాల నీడన పెరిగిన బాల్యం ఆమెది. చదువు, ఉద్యోగం, పెళ్లి... ఆమె గమ్యాన్ని నిర్దేశించాయి. ముంబయిలో అడుగు పెట్టింది. ఆమె ఫ్లాట్ ఆ భవనంలో పదమూడవ ఫ్లోర్లో ఉంది. తాను గడిపిన అందమైన బాల్యం తన పిల్లలకు ఉండదని దిగులు పడిందామె. మహావృక్షాల నీడన కాకున్నా, కనీసం అడుగు ఎత్తు మొక్కల మధ్య పెరిగినా చాలనుకుంది. బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచింది. మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచాలనుకోవడమే ఆమెకు తెలియకుండా ఆమె చేసిన ఓ మంచిపని. మొక్కలకు చీడపీడలకు రసాయన క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియాలతో పెంచింది. ఒకరోజు ఒక లార్వా ఆమె మొక్కల ఆకుల కింద కనిపించింది. రోజుల్లోనే అది ప్యూ΄ా దశకు చేరడం, ఆ తర్వాత రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు విచ్చుకుని ఎగరడం అన్ని దశలూ చూస్తుండగానే జరిగి΄ోయాయి. అప్పటి నుంచి ఆమె సీతాకోక చిలుకల పరిణామక్రమాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రసాయన క్రిమిసంహారిణులను ఇంట్లోకి తీసుకురావడమే మానేసింది. ఇప్పుడామె బాల్కనీలో నిమ్మజాతి చెట్లు, అక్షింతల చెట్టు, కరివే΄ాకు, వెస్ట్ ఇండియన్ జాస్మిన్... వంటి మొక్కలున్నాయి. వాటి మీద మోనార్క్ బటర్‌ఫ్లై, కామన్ జాయ్, లైమ్ స్వాలోటెయిల్ వంటి అరుదైన జాతుల సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి. అలా వచ్చి వెళ్లి΄ోకుండా ఆ చెట్ల ఆకుల మీదనే గుడ్లు పెడుతున్నాయి. సంతతిని వృద్ధి చేస్తున్నాయి. ఆమె ఇంట్లో సీతాకోక చిలుకలకు అనువైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని పరిరక్షిస్తోందామె. అందుకే ప్రియాంక సింగ్‌ను బటర్ ఫ్లై మామ్ అంటున్నారు ఆమె స్నేహితులు. తాను జీవవైవిధ్యత కోసం అంకితమవుతానని వారణాసి నుంచి ముంబయికి పయనమైనప్పుడు కలలో కూడా ఊహించలేదు... అంటుంది ప్రియాంక సింగ్. ఆమెకు సీతాకోక చిలుకలను చూస్తూ తేడాలను గుర్తించడంతో΄ాటు ప్రతి సీతాకోక చిలుకనూ ఫొటో తీయడం అలవాటైంది. ఇప్పటివరకు ఆమె మినీ గార్డెన్లో ఐదు వేలకు పైగా సీతాకోక చిలుకలు కొలువుదీరాయి. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరి వెళ్లి΄ోయాయి. -
ఆస్పత్రిలో చేరిన 'బిగ్‌బాస్' ప్రియాంక.. ఆ తప్పు వల్లే ఇలా!
బిగ్‌బాస్ తెలుగు షో వల్ల చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఐదో సీజన్లో పాల్గొన్న ఈ ట్రాన్స్ బ్యూటీ.. పలు షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాను ఇప్పుడు ఆస్పత్రి పాలైనట్లు చెప్పుకొచ్చింది. ఒక్క తప్పు వల్లే ఇలా జరిగిందని బోరుమంది. అసలు తనకు ఏం జరిగింది? ఎందుకు అనారోగ్యానికి గురయ్యాననే విషయాల్ని వీడియోగా రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) ప్రియాంకకు ఏం చెప్పింది? 'ప్రస్తుతం నేను ఓ ఛానెల్లో డ్యాన్స్ షో చేస్తున్నారు. దానికోసం ప్రాక్టీస్ కూడా అవుతోంది. అయితే ఓ రోజు ప్రాక్టీస్ తర్వాత ఎందుకో బాడీ సహకరించలేదు. చాలా డీహైడ్రేట్ అయిపోయాను. 20 రోజులుగా వరసగా డ్యాన్స్ ప్రాక్టీసు చేయడం వల్ల ఒళ్లు నొప్పులు వచ్చాయి. దీంతో డాక్టర్ని సంప్రదించకుండా పెయిన్ కిల్లర్స్, మెడిసన్ తీసుకున్నాను. వీటి వల్ల లివర్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యేంత పరిస్థితి వచ్చింది. యాంటీ బయోటిక్ లాంటి మందులు వాడటం వల్లే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను' 'ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే.. డాక్టర్ సలహా తీసుకోకుండా నాలా ఎలాంటి మందులు వాడొద్దు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాసరే డాక్టర్ దగ్గరికి వెళ్లండి. వాళ్ల సలహా, సూచనలతో మెడిసన్ వాడి ఆరోగ్యం సరిచేసుకోండి. నేను సొంతంగా ఇలా మందుల వాడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాను. పెయిన్ కిల్లర్స్ అయితే నా లివర్‌పై చాలా ఎఫెక్ట్ చూపించాయి. ఆస్పత్రిలో చేరడం వల్ల డ్యాన్స్ కూడా నా బదులు వేరొకరు చేయాల్సి వచ్చింది' అని ప్రియాంక తన వీడియోలో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'కల్కి' హీరోయిన్? పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) -
రక్తం కారుతున్నా అలాగే నడుస్తూ.. మూడుసార్లు ఆత్మహత్యాయత్నం!
ప్రియాంక సింగ్.. సెలబ్రిటీలు సైతం కుళ్లుకునేంత అందం ఈమె సొంతం. పుట్టుకతో అబ్బాయి అయినా తనలో ఆడ లక్షణాలు ఉండటం, అలా కనిపించేందుకే ఎక్కువ ఇష్టపడటంతో ఆపరేషన్ చేయించుకుని మరీ అమ్మాయిగా మారింది. బిగ్‌బాస్ షో ద్వారా జనాలకు మరింత చేరువైన ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను ఏకరువు పెట్టింది. సర్జరీ చేయించుకున్నా.. ప్రియాంక మాట్లాడుతూ.. చిన్నప్పుడు అక్క స్కూలు నుంచి రాగానే తన డ్రెస్సులు వేసుకునేదాన్ని. రానురానూ నాకు అమ్మాయిలాగే ఉండాలనిపించింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్ వచ్చాను. మేకప్ ఆర్టిస్టుగా చేశాను. జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేశాను. బయట షోలు చేశాను. ఆ డబ్బుతో సర్జరీ చేయించుకున్నాను. అప్పుడు విపరీతమైన నొప్పితో బాధపడ్డాను. ఆస్పత్రిలో పట్టించుకునేవాళ్లే లేరు. ఓపక్క రక్తస్రావం అవుతున్నా.. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి గేటు వరకు నడుచుకుంటూ వెళ్లాను. బ్యాంకు బ్యాలెన్స్ జీరో.. సర్జరీ నుంచి కోలుకునేలోపే ఆర్థరైటిస్‌తో ఏడాదిపాటు మంచానికే పరిమితమయ్యాను. 90 కిలోల దాకా పెరిగాను. దానికి చికిత్స చేయించుకునేసరికే నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో అయింది. అక్కడి నుంచి మళ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడిదాకా వచ్చాను. అమ్మాయిగా మారాలని చాలామంది అనుకుంటారు. కానీ సర్జరీ వల్ల చాలా నొప్పి భరించాల్సి ఉంటుంది. హార్మోన్ థెరపీ కూడా కచ్చితంగా చేయించుకోవాలి. ఇప్పుడైతే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే పెళ్లిపై ఆసక్తి లేదు. చర్మం కాలిపోయింది నా జీవితంలో మూడుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాను. పదో తరగతి అయ్యాక.. ఊర్లో అందరూ ఏదైతే అన్నారో అదే మాట నాన్న నోటి వెంట నుంచి వచ్చేసరికి తట్టుకోలేకపోయాను. అప్పుడు కిరోసిన్ పోసుకుని కాల్చుకున్నాను. ఆ సమయంలో 60 శాతం వరకు చర్మం కాలిపోయింది. దానికి చికిత్స తీసుకున్నాను. తర్వాత లవ్‌లో ఫెయిలైనప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఆ బాధ భరించలేక మరోసారి నిద్రమాత్రలు మింగాను. అయినా సరే మళ్లీ బతికి బయటపడ్డాను. మందు తాగేదాన్ని.. నా కోసం ఏదో మంచిది రాసిపెట్టుంది, అందుకే దేవుడు బతికిస్తున్నాడనుకున్నాను. భగవంతుడిని నమ్ముతాను. నేను మందు తాగడమనేది బ్రీజర్తో మొదలుపెట్టాను. మందు, సిగరెట్ తాగేదాన్ని. కానీ అవి మానేశాను. సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాను. హాట్‌స్టార్‌లో హీరోయిన్గా లాంచ్ కాబోతున్నాను. చిన్న చిన్న సినిమాలతో పాటు హీరోయిన్గా కూడా చేస్తున్నాను. ఎప్పటికైనా ఫుడ్ బిజినెస్ చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి! - పోడూరి నాగ ఆంజనేయులు -
Priyanka Singh HD Photos: బిగ్ బాస్ బ్యూటీ పింకీ స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
ఓ ఆర్టిస్ట్‌గా మాత్రమే చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ!
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మానస్ అంటే ఇష్టమంటూ హౌస్‌లో సందడి చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది భామ. బోల్డ్ ఫోటో షూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఇది చదవండి: ఎంపీతో ఎంగేజ్మెంట్.. అందంగా ముస్తాబైన హీరోయిన్ ఇల్లు) ప్రియాంక తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఇది బోల్డ్ కాదు.. నేను ఓ ఆర్టిస్ట్ అన్న విషయం గుర్తుంచుకోండి. మీ హృదయంతో నా అందాన్ని చూడండి. అంతేకానీ మీ కామపు కళ్లతో కాదు.' అంటూ పోస్ట్ చేసింది. అందులో టవల్ చుట్టుకున్న ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్స్ మరీ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ ఆమె తీరును తప్పుబడుతుండగా.. మరికొందరేమో మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ పింకీ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
ఇప్పుడు డిలీట్ చేసి ఏం లాభం..ఆల్రెడీ డౌన్లోడ్ చేశాం.. బిగ్‌బాస్ నటికి షాక్!
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో 13 వారాలు ఉండి మెప్పించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో టాప్-7లో నిలిచింది. ఈ షోతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ప్రియాంకా సింగ్ జబర్దస్త్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులను అలరించింది. కొన్నాళ్లకు బిగ్ బాస్ ద్వారా ఆమెకు ఒక మంచి అవకాశం దొరికింది. ఆ షో తర్వాత కచ్చితంగా అవకాశాలు వస్తాయని భావించింది. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం పింకీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా పింకీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు మరీ బోల్డ్‌గా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాటిలో ఒక ఫోటోను వెంటనే డిలీట్ చేసిందామె. అయినప్పటికీ ఆమె ఫోటోను డౌన్లోడ్ చేశామంటూ ప్రియాంక సింగ్‌కు షాకిచ్చారు నెటిజన్స్. పోస్ట్ చేసేముందుకు కాస్తా ఆలోచించాల్సింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు డిలీట్ చేసి ఏ లాభం.. మేము ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నాం.' అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రియాంక తన్ ఇన్‌స్టాలో రాస్తూ..'నేను యాటిట్యూడ్‌తో పుట్టలేదు.. కానీ నా జీవితంలో ఎదగడానికి మంచి దృక్పథం ఉంది. కొన్నిసార్లు నా కళ్లు కూడా అలా మాట్లాడతాయి. ఇది నా జీవిత గమనాన్ని చెబుతుంది.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత దారుణమైన ఫోటోలు పెట్టాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటితో నీకిచ్చే విలువ కూడా తగ్గిపోయిందంటూ ఫైర్ అవుతున్నారు. అయితే మరి కొందరేమో ప్రియాంక సింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
మీకెందుకు భయం.. మీ పని అదేగా.. సుశాంత్ సోదరి సంచలన ఆరోపణలు
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఫైరయింది. నువ్వు ఒక వేశ్య అంటూ రియాను ఉద్దేశించి హిందీలో ట్వీట్ చేసిందామె. సోమవారం రియా తాను సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రియాంక సింగ్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. రియా వెనక పాలకులు ఉన్నందుకే భయపడట్లేదని ప్రియాంక ఆరోపిస్తోంది. ప్రియాంక ట్వీట్లో రాస్తూ.. 'మీరు ఎందుకు భయపడతారు? మీ చేసే వేశ్య వృత్తిలో ఉన్నారు. ఎప్పటికీ అందులోనే కొనసాగుతారు. మీకు మద్దతు ఇస్తున్న పాలకులను చూసే నీకంత ధైర్యం' అంటూ పోస్ట్ చేసింది. సుశాంత్ కేసు విచారణలో ఆలస్యానికి బాధ్యులెవరో తనకు తెలుసని ప్రియాంక పేర్కొంది. అయితే కాసేపటికే తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి ట్వీట్ చేయలేదని స్పష్టం చేసింది. కాగా.. సోమవారం రియా చక్రవర్తి తిరిగి రోడీస్ 19 షోలో నటిస్తున్నట్లు ప్రకటించింది. 'పోయినా వారు ఎలాగో తిరిగి రారు.. కానీ ఇప్పుడు ఎందుకు భయపడాలి? అలా భయపడేవారు వేరేలా ఉంటారు' అంటూ రియా మాట్లాడింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని గర్ల్‌ఫ్రెండ్ రియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సూసైడ్‌కు ముందు సుశాంత్, రియా రిలేషన్ షిప్లో ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబసభ్యులు ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిందంటూ రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్‌పై విడుదలైనప్పటికీ సీబీఐ, ఈడీ, ఎన్సీబీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. तुम क्यूँ डरोगी? तुम तो व्यश्या थी, हो, और रहोगी! प्रशन् ये है कि तुम्हारे उपभोगता कौन है? कोई सत्ताधारी ही ये हिम्मत दे सकता है। WhoResponsible 4Delay InSSRCs is obvious — Priyanka Singh (@withoutthemind) April 10, 2023 -
నా పెళ్లి కోసం నగలు కొంటున్నా.. పెళ్లిపై ప్రియాంక క్లారిటీ!
బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ ఆ మధ్య వార్తలు తెగ వైరల్ అయ్యాయి. బిగ్‌బాస్ ఐదో సీజన్‌తో బాగా పాపులర్ అయిన పింకీ ఎల్లో కలర్ లెహంగాలో పెళ్లికూతురిలా ముస్తాబైన ఫోటోలు షేర్ చేయడంతో తన పెళ్లి నిజమే అనుకున్నారంతా! కానీ నెలలు గడిచినా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. అయితే ఇన్నాళ్లకు తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది పింకీ. యూట్యూబ్‌లో 'నా పెళ్లి జ్యువెలరీ షాపింగ్' అంటూ ఏకంగా ఓ వీడియో చేసింది. 'నా పెళ్లి ఫిక్స్ అయింది, కాబోయే భర్త ఎవరు? అని అడుగుతున్నారు. ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చేస్తున్నా. నిజంగానే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. సింపుల్‌గా ఈ పెళ్లి జరగబోతోంది. ఈ వివాహం కోసం నగలు తీసుకుందామనుకుంటున్నా. వీడియో చివర్లో అబ్బాయి గురించి అన్ని వివరాలు చెప్తాను, మాది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? చివర్లో చెప్పేస్తాను' అని వివరించింది. తర్వాత నగలు షాపింగ్ చేశాక అసలీ పెళ్లి తనది కాదని తన స్నేహితురాలిదని ట్విస్ట్ ఇచ్చింది. 'త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. నేను జస్ట్ ఇది ప్రాంక్ వీడియో చేశాను. నాకిప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు' అని కుండలు బద్ధలు కొట్టింది పింకీ. -
సుశాంత్ పెంపుడు కుక్క మరణం, నెటిజన్ల భావోద్వేగం
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెంపుడు కుక్క ఫడ్జ్ మరణించింది. ఈ బాధాకర విషయాన్ని సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 'ఫడ్జ్.. స్వర్గంలో ఉన్న నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లిపోయావు. మేము కూడా ఏదో ఒకరోజు మిమ్మల్ని అనుసరిస్తాం.. అప్పటివరకు మాకీ బాధ తప్పదు' అని భావోద్వేగంతో ట్వీట్ చేసింది. దీనికి సుశాంత్, తాను కుక్కతో కలిసి దిగిన పాత ఫోటోలను జత చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు శునకం మరణంపై విచారం వ్యక్తం చేశారు. 'యజమాని చనిపోయిన తర్వాత కుక్క సంతోషంగా, ఎప్పటిలా మామూలుగా ఉండలేదు. ఆ బాధతోనే ఇన్నేళ్లు బతికి చివరికి తన యజమానిని చేరుకుంది', 'సుశాంత్ గురించి ఏ చిన్నవార్త తెలిసినా తట్టుకోలేకపోతున్నాను.. ఇప్పుడు ఫడ్జ్ చనిపోయిందంటే దుఃఖం దానంతటదే వస్తోంది.. మిస్ యూ ఫడ్జ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే సుశాంత్ ఫడ్జ్‌తో ఆడుకున్న వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020లో జూన్ 14న మరణించాడు. ఆయన ఈ లోకాన్ని విడిచి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన మరణంపై అనుమానాలు వీడనేలేదు. So long Fudge! You joined your friend’s Heavenly territory… will follow soon! Till then… so heart broken 💔 pic.twitter.com/gtwqLoELYV — Priyanka Singh (@withoutthemind) January 16, 2023 Dear Sushant There's a shadow looming over you. A shadow with a tail He’s crossed over the rainbow bridge. Hope you feel His affectionate kisses happy embraces & trusting eyes again ♥️ Om shanti adorable Fudge thank you for leaving paw prints in our hearts pic.twitter.com/mXaV8XItcs — me4SSR (@memia26645588) January 17, 2023 చదవండి: టీమిండియాతో జూనియర్ ఎన్టీఆర్ -
ప్రియాంక పెళ్లి వార్తలపై స్పందించిన యాంకర్ రవి
బిగ్‌బాస్ బ్యూటీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోనుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఓ హల్దీ ఫంక్షన్లో ఎల్లో కలర్ సారీలో అదిరిపోయింది పింకీ. పెళ్లికూతురులా ముస్తాబైన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్వరలోనే ప్రియాంక పెళ్లి చేసుకోబోతుందేమోనని అనుకున్నారు. తాజాగా దీనిపై యాంకర్ రవి స్పందించాడు. ఓ ఫన్ వీడియోను షేర్ చేస్తూ.. 'నా చెల్లి పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే మధ్యలో ఒక పన్ను ఊడిపోయింది. ముందు దాన్ని సెట్ చేయాలి. ప్రియాంక నా బంగారం..' అని రాసుకొచ్చాడు. యాంకర్ రవి మాటలను బట్టి చూస్తుంటే ప్రియాంక ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేట్లు లేదని తెలుస్తోంది. ఇకపోతే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ప్రియాంక, రవి ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. హౌస్‌లో ఉన్నప్పుడే వీరు బాగా కలిసిపోయారు. షో అయిపోయాక కూడా వారు తమ మధ్య ఉన్న అన్నాచెల్లెలి బంధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) చదవండి: నటికి చేదు అనుభవం, అమెరికా ఎయిర్‌లైన్‌పై బాలీవుడ్ బ్యూటీ ఫైర్! ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ -
బిగ్‌బాస్ ఫేం ప్రియాంక సింగ్ హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ప్రియాంక సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్లుగానే కొన్ని రోజుల కిందట ఆమె తన అమ్మానాన్నలతో కలిసి పూజా చేస్తూ ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. దీనికి ఇట్స్ డన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే తాజాగా హల్దీ ఫంక్షన్లో తళుక్కుమంది. ఎల్లో కలర్ లెహంగాలో పెళ్లికూతిరిలా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కంగ్రాట్స్ ప్రియాంక అంటూ పలువురు నెటిజన్లు ఆమెకు విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
వేలెత్తి చూపేలా ఎదుగు: సుశాంత్ సోదరి కామెంట్స్‌కి రియా కౌంటర్
రియా చక్రవర్తి.. పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్గా తెరపై కంటే దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో ఈమే పేరు ఎక్కువగా వినిపించింది. సుశాంత్ ప్రియురాలైన రియా అతడి మృతి, డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తిగా మారింది. 2020లో సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ కేసు విచారణ చేప్పట్టిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) రీసెంట్గా ఆమెపై చార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతికి ఆమె ప్రధాన కారణమని, అతడికి డ్రగ్స్ కొని తెచ్చిందని ఎన్సీబీ పేర్కొంది. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ఇప్పిటికే రియాపై పీకలదాకా కోపంతో ఉన్న సుశాంత్ కుటుంబ సభ్యులు ఎన్సీబీ చార్జిషీట్ అనంతరం గుప్పుమన్నారు. పలు సందర్భాల్లో రియాపై మాటల దాడికి దిగిన సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తాజాగా ఆమెను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘2019లో అన్నయ్య(సుశాంత్ సింగ్) జీవితంలోకి రియా వచ్చినప్పుడే మా జీవితాలు నాశనమయ్యాయి. సుశాంత్‌కు క్లబ్‌లు, పార్టీలు అలవాటు లేదు. అందుకే అందుకే బాలీవుడ్ పెద్దలు కొందరు రియాను నియమించి సుశాంత్‌ను అలా తయారు చేశారు’ అంటూ మండిపడింది. ఇక ఆమె కామెంట్స్‌పై రియా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొట్ను షేర్ చేసింది. చదవండి: యంగ్ హీరో ఇంట తీవ్ర విషాదం ‘శబ్దానికి, ఈగోకు అతీతంగా ఎదుగు. నీవైపు వేలెత్తి చూపేలా ఎదుగు. ఎందుకంటే వారు చేరుకొలేని స్థానంలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ప్రేమతో ఎగరాలి. ఏ కారణం లేకుండానే నువ్వు వారిపట్ల కరుణతో ఉండాలి. నువ్వు వారిని ఆశ్చర్యపరచాలి. నీలా నువ్వు ఉండు. అదే నువ్వు. అదే నీ జీవితం. అంతేకాని ఇతరులు చెప్పేలా నువ్వు ఉండకు’ అంటూ ఆసక్తిగా పోస్ట్ పెట్టింది. కాగా రియా, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తితో పాటు మరో 34 మంది పేర్లను ఎన్సీబీ ఈ తమ చార్జీషీట్ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్సీబీ తమ చార్జీషీట్లో వెల్లడించింది. -
స్టార్ రైటర్‌తో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక.. త్వరలో సర్ప్రైజ్ అంటూ
తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో టాప్ 7 వరకు కొనసాగిన ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం లేని పేరు. అయితే బిగ్‌బాస్ ఎలిమినేషన్ తర్వాత ప్రియాంకకు భారీగానే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్‌ను ప్రియాంక సింగ్ కలిసింది. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ప్రియాంక. ఈ పోస్ట్‌కు 'ఒక సర్ప్రైజింగ్ వార్త రాబోతోంది. మీతో సమయం గడపడం చాలా సంతోషంగా ఉంది' అని క్యాప్షన్ రాసుకొచ్చింది ప్రియాంక. ఇది చూస్తుంటే కోన వెంకట్‌తో ప్రియాంక సినిమా గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరీ అది ఏ సినిమా గురించో, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే జబర్దస్త్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్‌గా మారింది. బిగ్‌బాస్ ఐదో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక టాప్ 7 వరకు కొనసాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందం, ఆట తీరుతో అభిమానులను మూటగట్టుకున్న ప్రియాంక తర్వాత మానస్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంపై ట్రోలింగ్ బారిన కూడా పడింది. ఏదైమైనా బిగ్‌బాస్ అనంతరం ప్రియాంకకు ఆఫర్లు రావడం ఆమె కెరీర్‌కు మంచి శుభపరిణామం. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
పింకీ అలా అడిగిందంటే.. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా : మానస్
Bigg Boss 5 Telugu Finalist Maanas Clear On Relationship With Priyanka Singh: బిగ్‌బాస్ సీజన్-5లో మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ మానస్. ఎమోషన్స్, గేమ్‌ను బ్యాలెన్స్ చేస్తూ టాప్ 5లో స్థానం సంపాదించుకున్న మానస్ తన ఆటతీరుతో, ప్రవర్తనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. చదవండి: బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన షణ్ముఖ్.. పోస్ట్ వైరల్ చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బిగ్‌బాస్ షోతో పాపులర్ అయ్యాడు. అయితే మానస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది పింకీ లవ్ ట్రాక్. చాలా సార్లు తన ఇష్టాన్ని వ్యక్తపరిచినా మానస్ మాత్రం సున్నితంగానే నో చెప్పేవాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మానస్ ప్రియాంక గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'జైలు నామినేషన్ టాస్కుల్లో అవకాశం ఉన్నా రవిని కాకుండా జెస్సీని నామినేట్ చేసింది. ఆ సందర్భంలో ప్రియాంక నటిస్తున్నట్లు అనిపించింది. అంతకుముందు టవర్ టాస్కులో కూడా చీరను అడ్డుపెట్టి ఓడిపోయేలా చేసింది. ఈ రెండు సందర్భాల్లో ప్రియాంక నటిస్తున్నట్లు ఉంది అని కాజల్‌తో చెప్పాను. తను నా ఫ్రెండ్ కాబట్టి ఎక్స్‌ప్రెస్ చేశాను. వేరే వాళ్లతో చెప్పలేదు. కానీ కొందరికి అది బ్యాక్ బిచ్చింగ్లా అనిపించొచ్చు. హౌస్‌లో 90రోజులు జర్నీ చేసిన ప్రియాంక సైతం బయటికి వెళ్లాక ఈ ఫుటేజ్ చూసి.. నువ్వు నటించావా లేదా భరించావా అని వీకెండ్ ఎపిసోడ్లో అడిగింది. 24 గంటలు హౌస్‌లో నన్ను గమనించి కేవలం ఒక గంట ఫుటేజ్ చూసి అలా అడిగిందంటే అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా' అంటూ వివరించాడు. చదవండి: బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ -
కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ప్రియ, షాక్‌లో ప్రియాంక!
Bigg Boss 5 Telugu, Transgender Priyanka Singh about Actress Priya: ప్రియ, ప్రియాంక.. పేర్లే కాదు.. వారి అభిరుచులూ కలిశాయి. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇద్దరిలో ఎవరికి కష్టం వచ్చినా మిగతా ఒకరు తల్లడిల్లిపోయేవారు. అంతలా క్లోజ్ అయ్యారిద్దరూ. తాజాగా ప్రియాంకసింగ్కు మర్చిపోలేని బహుమతిచ్చింది నటి ప్రియ. ఎంతో ఖరీదైన డైమండ్ రింగ్‌ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ విషయాన్ని పింకీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్క ఇచ్చిన బహుమతి తెరచి చూడగానే ఒక్కసారిగా షాకయ్యాను. అందులో డైమండ్ రింగ్ ఉంది.. ఇది నేను ఊహించలేదు. థాంక్యూ, లవ్ యూ అక్కా.. అంటూ డైమండ్ రింగ్ ఫొటోను పోస్ట్ చేసింది. దీని గురించి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ప్రియక్కలో అమ్మను చూసుకున్నా.. ఆమె మనసు వెన్నలాంటిది. దుబాయ్ నుంచి బావగారు అక్కకోసం డైమండ్ రింగ్ తీసుకొచ్చారు. కానీ అక్క ఈ ఉంగరం నీకోసమే, నువ్వే పెట్టుకో అని నాకు బహుకరించింది. ఆ డైమండ్ రింగ్ కన్నా ప్రియ అక్క నాకు పెద్ద డైమండ్..' అంటూ ప్రియతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది పింకీ. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
బిగ్‌బాస్‌లోకి పింకీ.. మానస్‌తో మసాజ్ కూడా.. అదెలా అంటారా?
బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. 13 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షోకి కొద్ది రోజుల్లో శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారిలో శ్రీరామ్ మినహా మిగతావారంతా నామినేషన్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆ ఆరుగురికి రోల్ ప్లే అనే టాస్క్‌లు ఇచ్చి నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా మానస్ ప్రియాంకలా, సన్నీ మానస్‌లా మారిపోయి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా మానస్ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్ జెస్సీలా మారి.. సిరిని ఓ రేంజ్లో ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ఓ ముద్దు అడిగాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఇక కాజల్ సన్నీలా మారి అతన్ని బాగానే ఇమిటేట్ చేశాడు. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే మంగళవారం ఎపిసోడ్లో నవ్వులే వర్షం కురిచేలా కనిపిస్తోంది. -
బిగ్‌బాస్ టైటిల్ గెలవలేదు కానీ.. పింకీపై నాగబాబు ప్రశంసలు
బిగ్‌బాస్‌లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తనదైన ఆటతో 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ. గతంలో ఒకటి రెండు షోలలో పాల్గొన్నప్పటికీ.. పింకీకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ షో కారణంగా ప్రియాంక లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ట్రాన్స్ జెండర్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక.. గత సీజన్‌లోని తమన్నా లాగే కొద్ది రోజుల్లోనే ఎలిమినేట్ అయిపోతుందని అంతా భావించారు. కానీ తన అందచందాలతో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా.. అద్భుతమైన ఆటతీరుతో 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. ఒకానొక దశలో టాప్ 5లో ప్రియాంక కచ్చితంగా ఉంటుందనేట్లుగా తన గేమ్‌ని కొనసాగించింది. అయితే అనూహ్య పరిణామాల వల్ల గత ఆదివారం ప్రియాంక ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా పింకీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం పింకీ.. బిగ్‌బాస్ వల్ల వచ్చిన క్రేజ్‌ని ఆస్వాదిస్తుంది. ఈ క్రమంలో తాను హౌస్‌లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్ నాగబాబును కలిసి, ఆశీర్వాదం తీసుకుంది. ఈ విషయాన్ని నాగబాబు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. పింకీపై ప్రశంసల వర్షం కురించాడు. ‘ఎన్నో అసమానతలను ధిక్కరించి, అవమానాలను, అవరోధాలను ఎదుర్కొని ఈ రోజు గొప్ప స్థానంలో నిలిచావు. నువ్వు బిగ్‌బాస్ టైటిల్ గెలవకపోవచ్చు. కానీ నిత్యం సమాజంలో నిత్యం నీలా అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి నువ్వు ఒక స్ఫూర్తిగా నిలిచావు. జీవితంలో గెలవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అని నాగబాబు ఇన్‌స్టాలో ఓ సుధీర్ఘ పోస్ట్ పెట్టాడు. View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) -
ప్రియాంక ఎలిమినేట్ అవడానికి ప్రధాన కారణాలివే!
Bigg Boss 5 Telugu Priyanka Singh Elimination Reasons: బిగ్‌బాస్ హౌస్‌లో తన అందచందాలతో అందరినీ బుట్టలో వేసుకుంది ప్రియాంక సింగ్. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందు వరుసలో ఉండే పింకీ బిగ్‌బాస్ షో చివరి రోజుల్లో మాత్రం తన సొంతవైద్యంతో శ్రీరామ్‌ను లేవలేని స్థితికి తీసుకొచ్చింది. ఇది పింకీ కావాలని చేయకపోయినప్పటికీ నాగ్ ఆ విషయాన్ని గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో ఆమె బాధపడిపోయింది. ఇక హౌస్‌లో తనకు అందరూ జస్ట్ ఫ్రెండ్స్ అయితే మానస్ మాత్రం అంతకుమించి అంటూ అతడితో కొన్ని స్వీట్ మొమోరీస్ కూడగట్టుకోవాలనుకుంది పింకీ. కానీ కేవలం అతడి మీదే ఫోకస్ చేసి గేమ్‌ను పక్కనపెట్టేయడంతో 13 వారాల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చింది. మరి పింకీ ఎలిమినేట్ అవడానికి ముఖ్య కారణాలేంటో చదివేయండి.. ► బిగ్‌బాస్ హౌస్‌లో ప్రియాంకను అందరూ ముద్దుగా పింకీ అని పిలుస్తుంటారు. తనకు నచ్చినవారి కోసం ఏమైనా చేసే స్వభావం పింకీది. షోలో పాల్గొన్న 18 మంది కంటెస్టెంట్లలో మానస్ అంటే చాలు పడిచచ్చేది. అతడిపై ఎక్కడలేని ప్రేమ కురిపించేది. అతడు తిననని బెట్టు చేస్తే బతిమాలి బుజ్జగించి మరీ తినిపించేది. అతడు మాట్లాడకపోతే ఒడ్డున పడ్డ చేపపిల్లలా విలవిల్లాడిపోయేది. ఏమీ తినకుండా ఒకరకంగా నిరాహార దీక్ష చేసేది. ►మొదట్లో అది కొంత సరదాగానే ఉన్నప్పటికీ రానురానూ అది విపరీత చేష్టలుగా మారింది. అతడు తిట్టినా, ఈసడించుకున్నా మానస్ మానస్ అంటూ అతడి జపమే చేసింది. అదే ఆమె కొంప ముంచింది. పైకి తనకు గేమ్ ముఖ్యం అని చెబుతున్నా తన ప్రవర్తన మాత్రం మానసే ముఖ్యం అన్నట్లుగా ఉండేది. దీనికితోడు గతవారం మానస్‌తో జరిగిన గొడవలు కూడా పింకీకి మరింత మైనస్‌గా మారాయి. ►అందరికీ వండిపెట్టడం మంచిదే! కానీ కిచెన్లోనే ఉంటూ టాస్కుల్లో వెనకబడిపోయింది పింకీ. ఏవో కొన్ని టాస్కులు మినహా మిగతావాటిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో పింకీ హౌస్‌లో ఉండటం అవసరమా? అన్న ప్రశ్నకు తనే అంకురార్పణ చేసినట్లైంది. ► హౌస్‌లో దాదాపు అందరు కంటెస్టెంట్లు ఆమెకు సపోర్ట్‌గా ఉన్నప్పటికీ దాన్ని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయింది పింకీ. పైగా తను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేక ప్రతిదానికి తన స్నేహితులపై ఆధారపడుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. 13వ వారం ప్రియాంకతో పాటు శ్రీరామ్, సిరి, కాజల్, మానస్ కూడా నామినేషన్లో ఉన్నారు. అయితే షణ్ముఖ్ నామినేషన్లో లేకపోవడంతో అతడి ఓట్లు సిరికి, సన్నీ కూడా పై లిస్టులో లేకపోవడంతో అతడి ఓట్లు మానస్, కాజల్‌కు పడ్డట్లు తెలుస్తోంది. దీంతో పింకీకి దెబ్బ పడింది. ఒకవేళ మానస్ నామినేషన్లో లేకుంటే అతడి ఓట్లు పింకీకి పడే అవకాశముండి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఆస్కారం ఉండేది. కానీ అతడు కూడా పింకీతో సహా నామినేషన్లో ఉండటంతో ఆమెకు ఓట్లు తక్కువగా వచ్చి ఎలిమినేట్ అయింది. ► హౌస్‌లో పెద్దగా ఎవరితోనూ గొడవపడకుండా, ఏ విషయంలోనూ తలదూర్చకుండా సేఫ్‌గా ఆడటం వల్లే ఆమె ఇన్నిరోజులు హౌస్‌లో ఉండగలిగిందన్నది మరో వాదన. కానీ బిగ్‌బాస్ జర్నీ చివరి మజిలీకి చేరుకుంది. ఇప్పుడు సేఫ్‌గా ఆడినా ప్రయోజనం ఉండదు. ఉన్నవారిలో ఎవరు బెస్ట్? ఎవరు వరస్ట్ అని చూస్తారు. అలా ఇప్పుడు హౌస్‌లో ఉన్నవారిలో పెద్దగా పర్ఫామ్ చేయకుండా టాస్కుల్లో వెనకబడిపోయింది పింకీయే అంటున్నారు. ► అందరి కోసం ఆరాటపడే పింకీ బిగ్‌బాస్ వద్దంటున్నా సొంత వైద్యం చేసింది. ఐస్ క్యూబ్స్‌లో ఎక్కువసేపు నిలబడి స్పర్శ కోల్పోయిన శ్రీరామ్ పాదాలకు బామ్ రాసి వేడినీళ్లు పోసింది. అసలు వేడినీళ్లు పోయకూడదని బిగ్‌బాస్ చెప్పినప్పటికీ పింకీ అలా చేయడంతో శ్రీరామ్ నరకం అనుభవించాడు. కొద్ది రోజులపాటు కాలు కిందపెట్టలేకపోయాడు. కాళ్లకు కట్టు కట్టుకుని మంచానికే పరిమితమయ్యాడు. అటు సిరికి కూడా ఏదో అస్వస్థతగా ఉందంటే పింకీ సలహా ఇవ్వగా బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. సొంత వైద్యం అక్కర్లేదని హెచ్చరించాడు. అయితే పింకీ ఇదంతా కావాలనే చేసిందా? అని కొందరు నెటిజన్లు అనుమానించారు. మంచి ఉద్దేశంతో సాయం చేయబోతే చేతులు కాల్చుకుంది పింకీ. ► ఏదేమైనా ఒక ట్రాన్స్‌జెండర్ 90 రోజులపాటు బిగ్‌బాస్ హౌస్‌లో తన జర్నీని కొనసాగించడం మామూలు విషయం కాదు! భారత్‌లోని ఏ ఇతర భాషల్లో కూడా ట్రాన్స్‌వుమెన్ మూడు, నాలుగు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయింది. కానీ ప్రియాంక తొలిసారిగా ఆ రికార్డును తిరగరాసింది. ఏకంగా 13 వారాలు హౌస్‌లో ఉండి సూపర్ 7 లిస్టులో చోటు దక్కించుకుంది. బిగ్‌బాస్ ట్రోఫీ గెలవలేకపోయినా ఎందరో మనసులను గెలుచుకుని బయటకు వచ్చింది. -
మానస్ బండారం బయట పెట్టిన అరియాన, కన్నీళ్లు పెట్టుకున్న పింకీ
Bigg Boss 5 Telugu Priyanka Singh Interview With Ariyana Glory: అందరూ ఊహించినట్టుగానే బిగ్‌బాస్ 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియాంక సింగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ ఫినాలే వైపు అడుగులెస్తోంది. మొదటి ఫినాలే కంటెస్టేంట్గా శ్రీరామ్ ఎన్నికయ్యాడు. ఇక హౌజ్‌లో మానస్, శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, కాజల్, సిరిలు మాత్రమే ఉన్నారు. ఇక ఎలిమినేట్ అయిన ప్రియాంక అరియానతో బిగ్‌బాస్ బజ్‌లో ముచ్చటించింది. హౌజ్‌లో ఉన్నంత కాలం మానస్ జపం చేసిన పింకీ బయటకు వచ్చాక కూడా మానస్ పేరునే కలవరించింది. ఈ క్రమంలో ఆమె హౌజ్‌లోని కంటెస్టెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎవరూ గెలుస్తారని అరియాన అడగ్గా మానస్ పేరు చెప్పింది. దీంతో అరియాన ఆమె కళ్లు తెరిపిస్తూ పింకీకి ఓ షాకింగ్ వీడియో చూపించింది. చదవండి: ఎలిమినేషన్ అనంతరం పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే అది చూసి ప్రియాంక భావోద్యేగానికి లోనవుతూ కంటితడి పెట్టుకోగా అరియాన సైతం ఆమెను హత్తుకుని ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానస్, కాజల్.. ప్రియాంక గురించి మాట్లాడుకుంటున్నా వీడియోను అరియానా చూపించింది. ఆ వీడియో చూసి షాకైన పింకీ.. ‘మానస్ చాలా సారీ.. ఇది నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు’ అంటూ చెప్పుకోచ్చింది. మానస్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడగ్గా.. మానస్ గురించి నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే.. ఎవరినైనా చదివి పక్కనపెట్టేస్తాడు. నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో అలాగే చూసుకుంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. చదవండి: సోనూసూద్‌కు మరోసారి షాకిచ్చిన బీఎంసీ, మాట నిలబెట్టుకోలేదంటూ హెచ్చరిక ఇక అరియానా ఇచ్చిన టాస్కులో డౌన్ తంబ్ సింబల్ కాజల్‌కు ఇవ్వగా.. లవ్ సింబల్ శ్రీరామచంద్రకు ఇచ్చింది. పంచ్ సింబల్ మాత్రం మానస్‌కు ఇచ్చి షాకిచ్చింది పింకీ. అలా ఎందుకు అని అరియానా అడగ్గా.. ఏదైనా ఉంటే నాతో మాట్లాడోచ్చు కదా అంటూ సమాధానమిచ్చింది. ఇక పింకీ అంటే మానస్ గుర్తోస్తాడని అరియానా అనగా.. మానస్ గేమ్ నేను ఆడితే ఇక మా ఇద్దరికి ఓకే ట్రోఫీ ఇచ్చేయ్యొచ్చు కదా అంటూ బదులిచ్చింది. కాజల్ మీద మీ అభిప్రాయం ఏంటీ.. తన ఆట ఎలా ఉంటుంది అని అరియానా అడగ్గా.. ప్రతి విషయాన్ని లాగుతూ ఆ గొడవను ఇంక పెద్దతి చేయాలని చూస్తుందనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. అలాగే షణ్ముఖ్ సైలెంట్ కిల్లర్ అని.. స్ట్రాంగ్ అని.. టాస్కులలో తను చేయాలనుకున్నది ఎలాగైనా చేసేస్తాడని చెప్పింది. -
ఎలిమినేషన్ అనంతరం పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే
Bigg Boss Priyanka Singh first Interview After Elimination: ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 5 తెలుగు చివరకి దశకు చేరుకుంది. 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియాంక సింగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. హౌజ్‌లో తన అందం, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక ఎంతోమంది మనసులను గెలచుకుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌజ్‌ను వీడి బయటకు వచ్చిన ప్రియాంకకు ఆమె ఫ్యాన్స్ నీరాజనాలు పట్టారు. రోడ్‌షోలో అభిమానులంతా క్యూ కట్టి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. చదవండి: దోమకొండ గడికోటలో ఘనంగా ఉపాసన సోదరి పెళ్లి వేడుకలు, మెగా ఫ్యామిలీ సందడి ఇక ఈ రోడ్‌షోకు మోడల్ జశ్వంత్(జెస్సీ) మాత్రమే వచ్చి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. బయటకు వచ్చిన ప్రియాంకను కలిసేందుకు వచ్చిన జెస్సీ ఆమెతో పాటు ఈ రోడ్‌షోలో పాల్గొన్నాడు. అనంతరం ప్రియాంక సాక్షి టీవీతో ముచ్చిటించింది. ఈ సందర్భంగా మానస్ గురించి అడగ్గా.. ప్లీజ్ మానస్ గురించి అడగకండి.. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇంకా మానస్ గురించి పింకీ ఏం చెప్పుకొచ్చింది, తన బిగ్‌బాస్ జెర్నీతో పాటు హౌజ్‌లోని మిగతా కంటెస్టేంట్పై తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలంటే ప్రియాంక సింగ్ మాటల్లోనే వినండి.. చదవండి: Kareena Kapoor: కరీనా డ్రెస్సింగ్‌పై నెటిజన్ల విమర్శలు, ‘హే భగవాన్ ఇంకేం చూడాల్సి వస్తుందో బిగ్‌బాస్ ద్వారా పింకీ ఎన్ని లక్షలు వెనకేసిందంటే? -
నీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎప్పటికీ కావాలి మానస్!
Bigg Boss Telugu 5, Priyanka Singh Eliminated From BB5 Show: టాలీవుడ్ కింగ్ నాగార్జున బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చీరావడంతోనే హౌస్‌మేట్స్‌తో ఓ వెరైటీ గేమ్ ఆడించాడు. బాగా ఫేమస్ అయిన పాత్రలు స్క్రీన్‌పై చూపించి అది ఎవరికి సెట్టవుతుందో చెప్పాలన్నాడు. దీంతో సన్నీ.. మహానటి పాత్ర ప్రియాంకకు పర్ఫెక్ట్గా సూటవుతుందన్నాడు. ఇంకొకరిని కంట్రోల్లో పెట్టే డా.వశీకరణ్ మరెవరో కాదు షణ్నునే అని చెప్పుకొచ్చింది సిరి. అందరినీ డామినేట్ చేసే పెదరాయుడు కూడా షణ్నునే అని ఫీలయ్యారు. నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కకూడదు అనుకునే నీలాంబరి మాత్రమే కాక వెన్నుపోటు పొడిచే కట్టప్ప, ఫిదాలోని భానుమతి.. ఇవన్నీ పాత్రలూ సిరికే నప్పుతాయని చెప్పుకొచ్చారు. సన్నీకి అర్జున్‌రెడ్డి, చిట్టిబాబు, ఎవరి మాటా వినని సీతయ్య ట్యాగ్‌లిచ్చారు. శ్రీరామ్ రేలంగి మావయ్య మాత్రమే కాదని దురదృష్టవంతుడైన మర్యాద రామన్న అని తెలిపారు. శ్రీరామ్‌కు ఎవరు క్లోజ్ అయినా బయటకు వెళ్లిపోతారు అని నాగ్ అనడంతో అందరూ నిజమేనంటూ నవ్వేశారు. తర్వాత మానస్, కాజల్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అనంతరం నాగ్ ఇంటిసభ్యులతో లూడో గేమ్ ఆడించాడు. ఈ క్రమంలో మానస్ పిల్లోతో రొమాన్స్ చేయాలని నాగ్ ఆదేశించాడు. కానీ ఆచరణలో మానస్ విఫలమయ్యాడు. దిండుతో ఎలా రొమాన్స్ చేయడమని అతడు ఎదురు ప్రశ్నించగా పోనీ ప్రియాంకతో రొమాన్స్ చేస్తావా? అని సూటిగా అడిగేశాడు నాగ్. దీంతో షాకైన మానస్ వద్దు, దిండే నయమని ఫీలైనప్పటికీ అందరూ పట్టుబట్టి మరీ పింకీతో రొమాన్స్ చేయించారు. టాప్ 7లో ఎవరుంటారని ఊహించలేదని షణ్నుని అడగ్గా అతడు కాజల్ పేరు చెప్పాడు. ఈ కాజల్ హౌస్‌లో సింపతీ కోసం ప్రయత్నిస్తుందన్నాడు మానస్. హౌస్‌లో కామన్‌సెన్స్‌లేని వ్యక్తులు ఇద్దరున్నారని వారెవరో కాదు.. సిరి, పింకీ అని చెప్పుకొచ్చాడు షణ్ను. లూడో గేమ్‌లో సన్నీ, కాజల్ గెలిచారు. తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. నాతో కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిందని మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది. స్టేజీపైకి వచ్చాక తన జర్నీ చూసుకుని ఏకధాటిగా ఏడ్చింది పింకీ. ఆమెతో చివరిసారిగా గేమ్ ఆడించాడు నాగ్. ఇప్పుడున్న టాప్ 6 కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఇప్పుడు వారిపై ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పాలన్నాడు. మొదటగా సిరి గురించి చెప్తూ.. ఇదేంటి నాకంటే అందంగా ఉందని అసూయపడ్డాను. కానీ అదెప్పుడూ నా చెల్లెలిగా అనిపిస్తుంది. తను ఈ హౌస్‌కు చాలా అవసరమని నొక్కి చెప్పింది. శ్రీరామ్‌తో ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తన కనెక్షన్ ఒకేలా ఉందని తెలిపింది. శ్రీరామచంద్రను శ్రీకృష్ణుడు చేద్దామనుకున్నా కానీ అతడు రాముడిలాగే ఉండిపోయాడంది. షణ్ను పక్కింటబ్బాయిలా అనిపిస్తాడని, అతడిని తమ్ముడు అని పిలుద్దామనుకున్నాను. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి ఊరుకున్నానని చెప్పింది. హౌస్‌లో మొదటి రోజు సన్నీ అన్నయ్య నన్ను చూడగానే స్వప్నలోక సుందరి దొరికిందన్నాడు. కానీ నేను అన్నయ్య అని గాలి తీసేశానని నవ్వేసింది. కాజల్ చాలా అల్లరి చేస్తుందని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు మానస్‌ను చూసి హాయ్ చెప్తే అతడు స్పందించలేదు.. ఇతడికి ఎంత పొగరు? అసలు మాట్లాడొద్దనుకున్నాను. కానీ రానురానూ మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ కుదిరింది. నీ నుంచి చాలా నేర్చుకున్నాను. నీతో ఫ్రెండ్షిప్ ఎప్పటికీ కావాలి. నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? అని పదేపదే అడుగుతుంటావు కదా, నేను నీ విజయాన్ని కోరుకుంటున్నాను అని చెప్తూ ఏడ్చేసింది పింకీ. ఆమె వెళ్లిపోతున్న బాధను బయటకు కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డ మానస్.. 'ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో..' అంటూ పాటందుకుని తన భావాలను అభివ్యక్తీకరించాడు. ఐ లవ్యూ నా ప్రాణం పోయినా.. ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా అంటూ పాట రూపంలో ఆమె మీదున్న ప్రేమను ప్రకటించాడు. అంతేకాక ఈ పాటను పింకీకి అంకితమిస్తున్నాననడంతో ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. అలాగే సింగర్ శ్రీరామ్... ప్రియా ప్రియా.. చంపొద్దే అంటూ పింకీ కోసం సాంగ్ పాడాడు. అనంతరం ప్రియాంక భారమైన హృదయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది. -
బిగ్‌బాస్ ద్వారా పింకీ ఎన్ని లక్షలు వెనకేసిందంటే?
Bigg Boss 5 Telugu 13th Week Elimination | Priyanka Singh Remuneration: ప్రియాంక సింగ్.. అదిగో వెళ్లిపోతుంది, ఇదిగో వెళ్లిపోతుంది అంటూ చాలాసార్లు ఆమె ఎలిమినేషన్ గురించి వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం మొక్కవోని దీక్షతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చివరి జర్నీదాకా చేరుకుంది. కానీ టాప్ 5లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. 13వ వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి భారంగా నిష్క్రమించింది. ఈసారైనా ఒక ట్రాన్స్‌జెండర్ ఫినాలేలో అడుగుపెడుతుందేమోనన్న ఆశలను అడియాశలు చేసింది. అయితే పింకీకి బిగ్‌బాస్ షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కన్నా మానస్ దూరమవుతున్నాడన్న బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. అందం, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక ఎంతోమంది మనసులను గెలచుకుంది. తాజాగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక ఈ షో ద్వారా ఎంత సంపాదించిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే ఆమెకు వారానికి 1.75 నుంచి 2 లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు టాక్! అంటే ఈ లెక్కన పింకీ 13 వారాలకు గానూ మొత్తంగా దాదాపు పాతిక లక్షల రూపాయలు వెనకేసిందన్నమాట! అయితే షోలో ఆమె పర్ఫామెన్స్‌ను బట్టి ఈ పారితోషికం కాస్త అటూఇటుగా ఉండే అవకాశముంది. -
ఊహించిందే జరిగింది.. ప్రియాంక అవుట్!
Bigg Boss Telugu 5 13th Week Elimination: Priyanka Singh Eliminated From BB5 House: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ కథ కంచికి, కంటెస్టెంట్లు ఫినాలేకు చేరబోతున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉండటంతో అందులో ఇద్దరిని పంపించేసి మిగతా ఐదుగురు ట్రోఫీ కోసం పోటీపడనున్నారు. ఇక ఈ వారం షణ్ను, సన్నీ మినహా సిరి, కాజల్, మానస్, శ్రీరామచంద్ర, ప్రియాంక నామినేషన్లో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఫినాలేకు అడుగు దూరంలో ఆగిపోయి తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేయనున్నారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ వారం లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట! నిజానికి ఫిమేల్ కంటెస్టెంట్లు కూడా మేల్ కంటెస్టెంట్లకు బాగా టఫ్ ఫైట్ ఇస్తున్నప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్‌లో కొంత వెనకబడి ఉన్నారు. అంతేకాకుండా కొన్ని టాస్కుల్లో వారితో సమానంగా ఆడలేక మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. దీంతో ఈ వారం హౌస్‌లో నుంచి ఫీమేల్ కంటెస్టెంట్ బయటకు వచ్చేయనుందని అంతా అనుకుంటున్నారు. అందులోనూ ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవడం తథ్యం అని భావిస్తున్నారు. నిజానికి గతవారమే ఆమె ఎలిమినేట్ అవుతుందనుకున్నారు కానీ షోలో సీన్ రివర్స్ అయింది. యాంకర్ రవిపై ఎలిమినేషన్ వేటు పడింది. దీంతో పింకీ కోసం రవిని బలి చేశారంటూ చాలామంది బిగ్‌బాస్ షోతో పాటు ఆమెను ట్రోల్ చేశారు. అయితే ఈసారి మాత్రం పింకీ తప్పించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది. 13వ వారంలో ప్రియాంక హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
ప్రియాంకకు బిగ్‌బాస్ వార్నింగ్, సొంత వైద్యం అక్కర్లేదని హెచ్చరిక!
Bigg Boss 5 Telugu, Episode 90: వీకెండ్ దగ్గరపడుతుందంటే చాలు హౌస్‌మేట్స్‌లో ఎక్కడలేని భయం తొంగి చూస్తుంది. ఈ వారం నేను లేదా కాజల్ ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందని ప్రియాంక అభిప్రాయపడింది. కానీ షణ్ను మాత్రం మానస్ కూడా వెళ్లొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. అనఫీషియల్ పోలింగ్ చూస్తుంటే పింకీ మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఇంటిసభ్యులు 'టికెట్ టు ఫినాలే' టాస్క్‌లో ఫోకస్ ఛాలెంజ్ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా కొన్ని శబ్ధాలు ప్లే చేయగా వాటిని సరిగ్గా గుర్తించి వరుస క్రమంలో రాసినవాళ్లు మొదటి స్థానంలో నిలుస్తారని బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే కాజల్ పదేపదే మధ్యలో మాట్లాడుతూ పోటీదారులను డిస్టర్బ్ చేయడంతో సన్నీ ఆమెపై ఫైర్ అయ్యాడు. ఇది తర్వాత చిలికి చిలికి గాలివానలా మారింది. ఇక హెలికాప్టర్ సౌండ్‌ను ట్రాక్టర్ అని, గురక శబ్ధాన్ని పులి గాండ్రింపు అని సిరి రాయడంతో అందరూ నవ్వాపుకోలేకపోయారు. షణ్ను అయితే ఈ విషయంలో సిరిని చాలా ఏడిపించాడు. ఈ ఛాలెంజ్‌లో సన్నీ, మానస్ ఎక్కువ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా శ్రీరామ్, సిరి తర్వాతి స్థానాల్లో నిలిచారు. గేమ్‌లో సన్నీని డిస్టర్బ్ చేసినందుకు కాజల్ పదేపదే సారీ చెప్పింది. అయినప్పటికీ సన్నీ తన మాటలను పట్టించుకోనట్లు నటిస్తూ ఆమెను మరింత ఉడికించాడు. చిర్రెత్తిపోయిన కాజల్.. టిష్యూ పేపర్‌ను ముఖం మీద విసరగా అసహనానికి లోనైన సన్నీ కామన్సెన్స్ లేదని తిట్టాడు. దీంతో కాజల్ దుప్పటి కప్పుకుని ఏడ్చేసింది. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అక్యురెసీ అనే ఐదో ఛాలెంజ్ ఎంచుకున్నారు హౌస్మేట్స్. ఈ టాస్క్‌లో బోర్డుపై ఉన్న బల్బ్స్లో కొన్ని ఆన్, కొన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. తక్కువ సమయంలో అన్నింటినీ ఆన్ చేసినవారు ప్రథమస్థానంలో నిలుస్తారు. ఈ గేమ్‌లో ఇప్పటికీ సరిగా నడవలేకపోతున్న సిరి, శ్రీరామ్ ఇద్దరి తరపున షణ్ను ఆడాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్, సన్నీ, సిరి, మానస్ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ ఛాలెంజ్‌లన్నీ ముగిసే సమయానికి చివరి రెండు స్థానాల్లో ఉన్న సిరి, సన్నీ రేసు నుంచి తప్పుకోగా మానస్, శ్రీరామ్ ఫినాలే టికెట్ కోసం పోటీపడ్డారు. సిరికి మోషన్స్ అవుతున్నాయంటే ప్రియాంక ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది. షుగర్ వాటర్ తాగమని, అరటిపండు తినమని తనకు తోచిన సూచనలు ఇచ్చింది. ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కొత్తగా సిరికి వైద్యసలహా ఇవ్వడంతో వెంటనే స్పందించిన బిగ్‌బాస్ నీకోసం కానీ, ఇతర ఇంటిసభ్యుల కోసం కానీ సొంత వైద్యం చేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించాడు. ఈ దెబ్బతో పింకీ తలెక్కడ పెట్టుకోవాలో తెలియక చిన్నబుచ్చుకుంది. ఆఖరి రౌండ్లో శ్రీరామ్, మానస్ పోటీపడగా శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని వారికి అభినందనలు తెలిపాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యానోచ్ అంటూ తెగ సంబరపడిపోయిన శ్రీరామ్‌కు పట్టరాని ఆనందంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మరోపక్క చివరిదాకా వచ్చి ఓటమిని చవిచూసినందుకు మానస్ దిగులుచెందాడు. ఫినాలే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఎంతగానో బాధపడ్డాడు. -
పింకీ, కాజల్‌లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Bigg Boss 5 Telugu, 13th Week Elimination: బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగులో విజయవంతంగా దూసుకుపోతోంది. నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపుకు చేరుకుంటోంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలారు. వీరందరూ ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం నువ్వా?నేనా? అన్న రీతిలో పోరాడుతున్నారు. ఇదిలా వుంటే ఈ వారం షణ్ముఖ్, సన్నీ మినహా శ్రీరామ్, సిరి, మానస్, ప్రియాంక, కాజల్ నామినేషన్లో ఉన్నారు. ఎలాగో ఇందులో శ్రీరామ్ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో దూసుకుపోతున్నాడు. అటు మానస్ కూడా కేవలం గేమ్ మీదే ఫోకస్ పెట్టి ఆడుతూ తనకు మంచి ఓట్లు పడేలా జాగ్రత్తపడుతున్నాడు. మిగిలిందల్లా సిరి, కాజల్, ప్రియాంక. నిజానికి గతవారంలోనే వీళ్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యాంకర్ రవిని ఎలిమినేట్ చేసి షాకిచ్చారు. ఇక ఈ వారం దాదాపు ప్రియాంక హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశాలున్నాయి. లేదంటే కాజల్‌ను పంపించేందుకు ఆస్కారం ఉంది. సిరి టాప్ 5లో పాగా వేసే ఛాన్స్ ఉంది. కానీ మొన్నటి ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అభిమానులకు భయం పట్టుకుంది. ఎవరో ఒకరిని రక్షించడం కోసం మళ్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయరు కదా! అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వారం బిగ్‌బాస్ పింకీని పంపించేస్తాడా? లేదా వేరే ఆప్షన్ ఎంచుకుంటాడా? అన్నది చూడాలి! -
'చూసుకుంటున్నాడు, హగ్గివ్వకపోతే ఎలా?' తల్లిని తలుచుకున్న సిరి
Bigg Boss Telugu 5, Episode 89: టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా.. 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్‌లో మానస్ మొదటి స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మానస్ సాయం చేసినా సన్నీ ఓడిపోవడంతో హౌస్మేట్స్ అతడిపై కౌంటర్లు వేశారు. మరోపక్క సిరి హగ్గివ్వంటూ షణ్నును అడిగింది. దీంతో అతడు కాస్త తటపటాయిస్తూనే ఫ్రెండ్షిప్హగ్ అని కెమెరాల వంక చూడగా.. నన్ను బాగా చూసుకుంటున్నాడు, మరి హగ్గివ్వకపోతే ఎలా అంటూ అతడిని హత్తుకుంది సిరి. వారి ఫ్రెండ్షిప్ గురించో మరేంటో కానీ.. మా అమ్మకు ఇప్పుడు అర్థమవుతుందని తనలో తానే అనుకుంది సిరి. అయితే వీళ్ల హగ్గులు చూసిన పింకీ.. తనకు కూడా ఓ హగ్గివ్వమని కోరింది కానీ అతడు మాత్రం పట్టించుకోలేదు. అనంతరం షణ్ను, కాజల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నిజంగా నేను తప్పైతే నీకంటే ముందే వెళ్లిపోతా! అని కాజల్‌తో శపథం చేశాడు షణ్ను. నువ్వెప్పుడూ నేను తప్పు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తావని ఫైర్ అయింది కాజల్. ఈ క్రమంలో షణ్ను నీ బొంద, కామన్సెన్స్ అంటూ కొన్ని అనవసర మాటలు జారాడు. తర్వాతరం హౌస్మేట్స్ స్కిల్ ఛాలెంజ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బాల్స్ కింద పడేలా చేయాలి. ఎవరైతే అన్ని బాల్స్ ముందుగా కిందపడేలా చేస్తారో వారు మొదటి స్థానంలో నిలుస్తారు. ఐస్ టాస్క్ వల్ల ఇప్పటికీ నిలబడి నడవలేకపోతున్న శ్రీరామ్, సిరిల స్థానంలో సన్నీ, షణ్ను ఆడారు. ఇక ఈ గేమ్‌లో మానస్, శ్రీరామ్, సిరి, ప్రియాంక, కాజల్, సన్నీ, షణ్ముఖ్ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు. మొత్తంగా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. సన్నీ, షణ్ముఖ్లిద్దరికీ సమాన పాయింట్లు రావడంతో వీరికి మళ్లీ గేమ్ పెట్టగా ఇందులో సన్నీ గెలిచి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు. షణ్ను రేసు నుంచి వైదొలిగాడు. రేపటి ఎపిసోడ్లో మానస్, సన్నీ, షణ్ను, సిరిలకు చివరి పోటీ పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ గేమ్‌లో ఎవరు గెలిచి ఫినాలేలో మొదటగా అడుగు పెడతారో రేపటి ఎపిసోడ్లో చూడాలి! -
ట్రాన్స్‌జెండర్ అంటే రోడ్లమీద అడుక్కునేవారే గుర్తొస్తారు, కానీ..
Bigg Boss Telugu 5, Tamanna Simhadri About Priyanka Singh: తమన్నా సింహాద్రి.. బిగ్‌బాస్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమీ పేరు. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న ఆమె నటుడు రవికృష్ణతో గొడవలు పెట్టుకుని బాగా ఫేమస్ అయింది. కానీ తన విచిత్ర ప్రవర్తన వల్ల రెండు, మూడు వారాలకే హౌస్‌లో నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత బిగ్‌బాస్ షో పేరెత్తని ఈమె తాజాగా ఒకరికి తన అండ అవసరమంటూ ముందుకొచ్చింది. బిగ్‌బాస్ షోలో ప్రియాంక సింగ్‌కు మద్దతు తెలుపుతున్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. 'చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. బిగ్‌బాస్ మూడో సీజన్ ముగిసిన ఇన్నేళ్ల తర్వాత బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతున్నాను. ట్రాన్స్‌జెండర్ అనగానే చాలామందికి రోడ్ల మీద అడుక్కునేవారే గుర్తొస్తారు. కానీ అయినవాళ్లందరికీ దూరమై, ఎన్నో కష్టాలు పడే చాలామంది గౌరవంగా బతకాలని ముందుకు వస్తున్నారు. వాళ్లలో ప్రియాంక సింగ్ ఒకరు. ఆమె బిగ్‌బాస్‌కు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. హిందీ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లోని బిగ్‌బాస్ షోలలో ట్రాన్స్జెండర్లను తీసుకున్నారు. కానీ అందరూ రెండు మూడు వారాల కంటే ఎక్కువ హౌస్‌లో ఉండలేకపోయారు. అయితే ప్రియాంక మాత్రం 10 వారాల పైనే ఉంది. ఆమె ఫినాలేలో అడుగుపెట్టి గెలిస్తే అది వేరే లెవల్లో ఉంటుంది. నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను. మీరూ ఆమెకు సపోర్ట్ చేస్తే తను విజేతగా అవతరించే అవకాశం ఉంది. ఒక ట్రాన్స్‌వుమెన్ విన్నర్ అయితే అది ఇండియాలోనే రికార్డు అవుతుంది. అందరూ ప్రియాంక సింగ్‌కు ఓటేయండి' అని కోరింది తమన్నా. -
ప్రియాంక వల్ల బెడ్‌కే పరిమితమైన శ్రీరామ్!
Bigg Boss Telugu 5, Episode 87: బిగ్‌బాస్ షోలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదటి లెవల్లో ఐస్ వాటర్‌లో కాళ్లు పెట్టి తమ బకెట్లో ఉన్న బంతులు కాపాడుకుంటూనే పక్కవారి బకెట్‌లోని బాల్స్‌ను లేపేయాలి. ఈ గేమ్‌లో సన్నీ, సిరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. నన్ను కావాలనే టార్గెట్ చేసి బ్యాడ్ చేస్తోందంటూ సిరిపై చిర్రుబుర్రులాడాడు సన్నీ. అతడు తన బాల్స్ తీయడానికి కాచుకుని కూర్చుండటంతో ఐస్ వాటర్‌లో నుంచి అడుగు బయట పెట్టలేదు సిరి. ఈ క్రమంలో రవి.. ఐ మిస్ యూ అంటూ సిరి ఏడ్చేయగా, నీకోసం ఆడుతున్నా రవి అంటూ షణ్ముఖ్ గొంతెత్తి అరిచాడు. ఈ చర్యతో మిగతా వాళ్లు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. సన్నీ తనను టార్గెట్ చేయడంతో ఐస్ బకెట్లో నుంచి కాళ్లు తీయకుండా అలాగే నిల్చుండిపోయిన సిరికి కాళ్లు పట్టేసుకున్నాయి. దీంతో గేమ్ ముగియగానే మానస్ ఆమెకు సాయం అందించాడు. మరోపక్క బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు మెడికల్ రూమ్‌లోకి వైద్యం అందించారు. సిరి నడవలేని స్థితిలో ఉండటంతో మానస్ ఆమెను ఎత్తుకుని తీసుకురావడాన్ని షణ్ను తట్టుకోలేకపోయాడు. వాళ్ల సాయం ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించాడు. ఇలాగైతే నాకు ఫ్రెండ్‌గా ఉండకంటూ ఆవేశంతో ఊగిపోగా సిరి ఏడ్చేసింది. ఐస్ వాటర్ నుంచి బయటకు రాగానే వేడినీళ్లు పోయడం హానికరమని వార్నింగ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అదేమీ పట్టించుకోని ప్రియాంక... కాళ్లు తిమ్మిరెక్లిన శ్రీరామ్‌కు అర్ధరాత్రి జండూ భామ్ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్ చేసింది. దీంతో అతడికి వాపు తగ్గడం కాదు కదా నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే శ్రీరామ్‌ను మెడికల్ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు. ఐస్ వాటర్‌లో నుంచి బయటకు వచ్చాక కాళ్లపై వేడినీళ్లు పోయడం హానికరమని చెప్పినప్పటికీ పింకీ శ్రీరామ్‌కు అలా చేసిందేంటని మానస్, కాజల్ అసహనానికి లోనయ్యారు. అయితే ఇలా జరుగుతుందని ఊహించలేదని పింకీ శ్రీరామ్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఆమె చేసిన తప్పు వల్ల శ్రీరామ్ బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక అడుగు కూడా వేయలేకపోతున్న కంటెస్టెంట్ల బాధలు చూసి సన్నీ ఏడ్చేశాడు. తర్వాతి రోజు శ్రీరామ్ పాడిన 'గెలుపు తలుపులే తీసే ఆకాశమే..' సాంగ్ ప్లే చేయడంతో అతడు మనసారా ఏడ్చాడు. ఫైనల్‌గా తొలి రౌండ్లో సన్నీ ఆధిక్యంలో ఉండగా ప్రియాంక సింగ్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. తర్వాత ఫోకస్ అనే రెండో లెవల్లో బజర్ మోగినప్పుడు 29 నిమిషాలు లెక్కించి గంట కొట్టాలి. ఎవరైతే సరిగ్గా, లేదా 29 నిమిషాలకు దగ్గరలో ఉన్నప్పుడు బెల్ మోగిస్తారో వారు గెలిచినట్లు లెక్క! ఈ గేమ్‌లో సన్నీకి మానస్ సాయం కోరగా అతడు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో సన్నీ మానస్ లెక్కపెడుతున్నాడని తాపీగా కూర్చోవడమే కాదు, పదేపదే అతడి వంకే చూడసాగాడు. దీంతో అక్కడున్న మిగతా హౌస్‌మేట్స్‌కు వీరి మ్యాచ్ ఫిక్సింగ్ అర్థమైపోయింది. చివరకు సన్నీ మానస్ సైగ చేసిన వెంటనే గంట కొట్టాడు. ఆ తర్వాత సన్నీ జోకర్లా రెడీ అయి శ్రీరామ్‌ను నవ్వించాడు. అతడు నడవలేని స్థితిలో ఉండటంతో బెడ్‌పైనే ఉండి గేమ్ ఆడగా మిగతా అందరు మాత్రం గార్డెన్ ఏరియాలో ఉండి ఆడారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారమైతే ఈ రౌండ్లో ప్రియాంక, శ్రీరామ్, సిరి, షణ్ను, మానస్ ఆధిక్యంలో ఉన్నారట! అంటే సాయం తీసుకుని కూడా సన్నీ ఓడిపోయి అప్రతిష్ట మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది. -
జీవితంలో మాట్లాడను, కట్ చేస్తే కాసేపటికే హగ్గులు
Bigg Boss Telugu 5, Episode 87: ప్రియాంక.. కాజల్‌ను నామినేట్ చేయడంపై మానస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తను నిన్ను సపోర్ట్ చేసింది, కానీ నువ్వు ఆమెను ఫ్రెండ్ అనుకోలేదు కాబట్టే నామినేట్ చేశావని అసహనం వ్యక్తం చేశాడు. ముందు నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోమని చెప్తూ అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్లిపోయాడు. అతడు చెప్పాలనుకుంది చెప్పాడు, మరి తన సమాధానం కూడా వినాలి కదా! అని నిలదీసింది పింకీ. నీది మాట్లాడటం అయిపోతే వెళ్లిపోతావా? అని ఆగ్రహంతో ఊగిపోయింది. కానీ కాసేపటికే మళ్లీ మానస్ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలని చెప్పింది. అయితే అతడు మాత్రం నేనిప్పుడు మాట్లాడలేనన్నాడు. ఎవడో కోన్‌కిస్కా గొట్టం గాడు ఇలా అంటే పట్టించుకోను కానీ నువ్వంటే మాత్రం బాధపడతానని గట్టిగా అరిచేసింది పింకీ. ఎందుకు బాధపడతావని మానస్ అడగ్గానే ఒళ్లు కొవ్వెక్కి అంటూ ఏడ్చేసింది. నువ్వు నన్ను తప్పుగా ఫ్రూవ్ చేయాలని చూస్తున్నావంటూ మానస్ అనడంతో షాకైన పింకీ.. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేను జీవితంలో మాట్లాడను అని తేల్చి చెప్పింది. దీంతో మానస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రంతా మానస్- ప్రియాంక మధ్య ఈ గొడవ జరుగుతుంటే కాజల్ ఎంట్రీతో ఇది మరింత పెద్దదిగా మారింది. 'ఈ పంచాయితీలు వద్దు, నాకు నువ్వు నచ్చట్లేదు, నీతో మాట్లాడాలనుకోవడం' లేదు అంటూ మానస్ ఆమె ముఖం మీదే చెప్పాడు. అయినప్పటికీ పింకీ అతడితో మాట్లాడటానికి ఎంతగానో ప్రయత్నించగా కాజల్ అది కుదరనివ్వలేదు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ.. కాజల్‌ను షటప్ అని తిట్టి వెళ్లింది. ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవలుంటాయనేది నిజమని, రెచ్చగొట్టి ఏమీ ఎరుగనట్లు సైలెంట్‌గా కూర్చుంటుందని నానా మాటలు అంది. కట్ చేస్తే పింకీ ఇంకా భోజనం చేయలేదని తెలిసిన మానస్.. ఆమెను తినమని బతిమాలాడు. తన కోపం, ఆవేశం, ఆవేదన అంతా కలిసి దుఃఖంగా ఉప్పొంగుకురాగా అతడిని హగ్ చేసుకుని ఏడ్చేసింది. దీంతో మానస్ ఆమెను ఓదార్చాడు. మరోపక్క కాజల్‌కు ఎలా ఓట్లేస్తున్నారో అర్థం కాక షణ్ను, సిరి తల పట్టుకున్నారు. సన్నీ ఫ్యాన్స్ తనకు ఓట్లేస్తారనే కాజల్ అతడితో సన్నిహితంగా ఉందన్నాడు షణ్ను. ఇంతలో షణ్ను కెప్టెన్సీ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం బిగ్‌బాస్ ప్రతిష్టాత్మకమైన "టికెట్ టు ఫినాలే" టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో మొదటి లెవల్ 'ఎండ్యురెన్స్ టాస్క్'లో భాగంగా కంటెస్టెంట్లు వీలైనంత ఎక్కువ సేపు ఐస్ టబ్‌లో ఉండాలి. ఒక్క కాలు బయటపెట్టినా సరే ఆ సమయంలో ఇతరులు వారి టబ్‌లోని బాల్స్ తీసుకోవచ్చని తెలిపాడు. ఆట మొదలవగానే అందరూ ఐస్ వాటర్‌లో నిలబడ్డారు. కానీ సన్నీకి చెరోవైపు కాజల్, మానస్, షణ్ను పక్కన సిరి ఉండటంతో వారి బాల్స్ దొంగిలించడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఇది అర్థమైన బిగ్‌బాస్ వెంటనే రెండో లెవల్ మొదలవుతుందంటూ షణ్ను, సన్నీలను స్థానాలు మార్చుకోమని ఆదేశించాడు. దీంతో రేపటి ఎపిసోడ్లో అసలు గేమ్ మొదలైనట్లు కనిపిస్తోంది. అంతేకాదు..సిరికి, సన్నీకి మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. -
నామినేషన్స్‌లో ఐదుగురు! షాకిచ్చిన పింకీ!
Bigg Boss Telugu 5 Promo, 13th Week Nominations: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌ను వీడటంతో హౌస్‌మేట్స్‌లో గుబులు మొదలైంది. వీరి టెన్షన్‌ను రెట్టింపు చేస్తూ బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ మొదలయ్యాయి. నామినేట్ చేయాలనుకున్న ఇంటిసభ్యుల ముఖం ఉన్న బాల్‌ను కాలితో తన్ని గేటు అవతల పడేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. సన్నీ శ్రీరామ్‌ను నామినేట్ చేయగా పింకీ ఎవరిని చేయాలా అని ఆలోచనలో పడింది. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే ప్రియాంక ఏకంగా మానస్‌ను నామినేట్ చేసిందట. ఈ క్రమంలో వారిద్దరికి మధ్య కాస్త గొడవ కూడా జరిగినట్లు వినికిడి! అంతేకాకుండా గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సపోర్ట్ చేసిన కాజల్‌ను సైతం నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం సిరి, కాజల్, మానస్, శ్రీరామ్, ప్రియాంక సింగ్ నామినేషన్స్‌లో ఉన్నారు. కెప్టెన్ షణ్ముఖ్‌తో పాటు సన్నీ సైతం ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. -
రూ.50 లక్షలు గెలిస్తే అమ్మనవుతా: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక
Bigg Boss Telugu 5, Ravi Eliminated From BB Show: ఇప్పటివరకు బిగ్‌బాస్ షో విజేతలకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం దీనికి అదనంగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన భూమిని కూడా కానుకగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని మన్మథుడు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాస్ విన్నర్ రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు నాగ్. మొదటగా ప్రియాంక మాట్లాడుతూ.. 'నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా' అని చెప్పుకొచ్చింది. శ్రీరామ్ మాట్లాడుతూ.. 'తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్‌తో కలిసి ఉండాలన్నది నా కోరిక' అని చెప్పాడు. 'కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. నిర్మాణసంస్థ నెలకొల్పాన్న కోరికను నెరవేర్చుకుంటా' అని చెప్పాడు రవి. కాజల్ తనకున్న 30 లక్షల రూపాయల అప్పు తీర్చుకుంటానంది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనుకుంటున్నానని చెప్పింది. సువర్ణ కుటీర్‌లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని సెలూన్ పెడతానన్నాడు. మానస్ తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్ చేస్తానని చెప్పాడు. షణ్ముఖ్.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు 25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో 25 లక్షలిస్తానన్నాడు. సిరి శ్రీహాన్ పేరెంట్స్‌కు ఉన్న 10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని పేర్కొంది. తర్వాత షణ్ముఖ్, ప్రియాంక సేఫ్ అవగా రవి, కాజల్ మాత్రమే నామినేషన్స్‌లో మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్ చేస్తావా? అని నాగ్ సన్నీని అడిగాడు. ఆ పాస్ తనకు రావడం కోసం ఎంతగానో ఫైట్ చేసిన కాజల్‌కు వాడాడు. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఉపయోగం లేకపోయింది. రవి కోసం వాడి ఉంటే కనీసం అతడైనా సేవ్ అయ్యేవాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న రవి ఎలిమినేట్ అవడంతో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్ వోచర్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. సన్నీ మాత్రమే కాదు, ఇంటిసభ్యులెవరూ రవి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోయారు. అందరూ కన్నీటితో భారంగా ఆయనకు వీడ్కోలు పలికారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్‌బాస్ జర్నీలో ఎవరు పాస్, ఎవరు ఫెయిల్? అనే గేమ్ ఆడాడు. షణ్ను పాస్ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. లేట్‌గా కనెక్ట్ అయిన చందూలో అన్నీ పాజిటివ్సే ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెప్తూ అతడిని పాస్ చేశాడు. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. టాప్ 5లోకి రావాలని సిరిని ఎంకరేజ్ చేశాడు. మానస్‌ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యానంటూనే అతడికి ఫెయిల్ ట్యాగ్ ఇచ్చాడు. షణ్ను ఎంతకూ కన్నీళ్లను ఆపుకోలేకపోవడంతో రవి.. నేనెళ్తేనే నువ్వు గెలుస్తావంటూ ఆఖరి మాటగా చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. -
పింకీ కోసం యాంకర్ రవిని ఎలిమినేట్ చేశారా?
Bigg Boss Telugu 5: Is Anchor Ravi Eliminated : బిగ్‌బాస్ సీజన్-5లో ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తుంది.ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రవి ఎలిమినేట్ అవ్వడం ఏంటని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బ్రింగ్ బ్యాక్ రవి అంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా టాప్5లో ఉండాల్సిన రవిని బయటకు పంపించేయడం అన్యాయమని భావిస్తున్నారు. అయితే మరికొందరేమో పింకీని కాపాడటానికి రవిని కావాలనే ఎలిమినేట్ చేశారనే ప్రచారమూ జరుగుతుంది. మానస్‌తో కంటెంట్ ఇవ్వడం తప్పా కొన్ని వారాలుగా పింకీ ఆట కూడా యాక్టివ్‌గా లేదనే వాదన కూడా వినిపిస్తుంది. ఫ్యాన్ బేస్ విషయంలోనూ రవితో పోలిస్తే పింకీకి తక్కువగానే ఉందని, మరి అలాంటప్పుడు పింకీ ఎలా సేవ్ అయిందనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. సన్నీ దగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ కాజల్ కోసం వాడటం వల్ల రవి బలయ్యాడనే వార్త కూడా బయటకు వచ్చింది. మరి లీకు వీరులు చెప్పినట్లుగా నిజంగానే ఈవారం రవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడా లేదా ఇందులో మరేదైనా ట్విస్ట్ ఉందా అన్నది చూడాల్సి ఉంది. -
ఎలిమినేట్ అవుతానని బలంగా ఫిక్సయిన ప్రియాంక!
Bigg Boss Telugu 5 Unseen: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో మరో ఎలిమినేషన్ జరగబోతోంది. ఈ 12వ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. కాజల్, సిరి, ప్రియాంక సింగ్‌లలో ఎవరు హౌస్‌ను వీడనున్నారనేది రేపు తేలనుంది. అయితే ఈ వారం తాను వెళ్లిపోవడం ఖాయం అని ముందే ఫిక్సైపోయింది పింకీ. అన్‌సీన్ వీడియోలో మానస్ దగ్గరకు వెళ్లి కూర్చున్న ప్రియాంక.. ఈ వీక్ నేను వెళ్లిపోతే ప్రతిరోజూ బొట్టు పెట్టుకుని పడుకోమని సూచించింది. అలాంటి సెంటిమెంట్స్ లేవని తెలుసు కదా, ఏదో నువ్వు పెడతావని పెట్టుకుంటున్నా అంతేనని మానస్ సమాధానమివ్వగా మరి మొన్నెందుకు పెట్టుకున్నావని కూపీ లాగింది. సమయానికి భోజనం చేయు, బట్టలు ఎప్పటికప్పుడు ఉతికేసుకో, రెండు రోజులకొకసారి తలకు నూనె పెట్టుకో అని మానస్‌కు ఏమేం చేయాలో లిస్టు చెప్పుకురాసాగింది. ఆమె మాటలను మధ్యలో అడ్డుకున్న అతడు నువ్వు ఏం వెళ్లిపోవులే అని సముదాయించాడు. అయితే పింకీ మాత్రం నేను వెళ్తానని ఫిక్సయ్యాను అని కరాఖండిగా తేల్చేసింది. ఎందుకు? హౌస్‌లో ఇప్పటికే చాలా రోజులు ఎక్కువ ఉండిపోయాననుకుంటున్నావా? అని మానస్ మధ్యలో పంచ్ వేశాడు. మరి ప్రియాంక ఊహించిందే నిజమవుతుందా? ట్రోఫీ గెలవాలన్న కల కలగానే మిగిలిపోనుందా? అన్నది చూడాలి! -
ఎలిమినేషన్: ఈ ముగ్గురిలో ఒకరు అవుట్!
Bigg Boss Telugu 5, 12th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ముగింపుకు చేరుకుంటోంది. ఇప్పటివరకు 11 వారాల్లో పదకొండుమంది ఎలిమినేట్ అయ్యారు. వీరిలో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్ ఉన్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరిలో ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. మానస్ మినహా కాజల్, సిరి, రవి, షణ్ముఖ్, సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్ర నామినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అనఫీషియల్ ఓటింగ్‌లో షణ్ముఖ్, సన్నీ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. నామినేషన్స్‌లోకి వచ్చిన ప్రతిసారి వీళ్లిద్దరూ తొలి రెండు స్థానాల్లోనే కొనసాగుతుండటం విశేషం. వీళ్ల తర్వాత మూడు, నాలుగు స్థానాల కోసం యాంకర్ రవి, సింగర్ శ్రీరామ్ పోటీపడుతున్నారు. అంటే మొదటి నాలుగు స్థానాల్లో నలుగురు అబ్బాయిలే ఉండగా చివరి మూడు స్థానాల్లో అమ్మాయిలు ఉన్నారు. దీంతో ఈ వారం మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. కాజల్, సిరి, ప్రియాంక ఎవరి స్టైల్లో వారు గేమ్ ఆడుతున్నారు. స్ట్రాటజీనే నమ్ముకున్న కాజల్ అప్పడం గొడవలో సన్నీకి సపోర్ట్ చేయడంతో అతడి ఫ్యాన్స్ ఈమెకు సేవ్ చేయడానికి ఓట్లేస్తున్నారు. సిరి.. మగరాయుడిలా గేమ్స్‌లో విజృంభించి ఆడుతుంటడంతో ఆమెకు కూడా మంచి ఓట్లు పడే అవకాశం ఉంది. మిగిలింది ప్రియాంక సింగ్. మిగతా ఇద్దరి కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో వెనకబడిన పింకీకి చాలా తక్కువ ఓట్లు గుద్దుతున్నారట! మానస్ నామినేషన్స్‌లో లేకపోయినప్పటికీ అతడి అభిమానులు చాలామటుకు ఆమెకు ఓటేయడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పింకీ ఉంటే మానస్ గేమ్ దెబ్బతింటుందని, అతడు టాప్ 5కి చేరుకోవడంపై దృష్టి పెట్టలేడని అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఆమెను బయటకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లవ్ ట్రాక్ కోసమైనా ఆమెను ఉంచాలనుకుంటే మాత్రం కాజల్, సిరిలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది! -
చెంపలు వాయించుకున్న పింకీ.. సంతోషంగా ఉందన్న కాజల్ కూతురు
Bigg Boss Telugu 5, Episode 81: కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ 'నియంత మాటే శాసనం' గేమ్‌లో రవి, షణ్ముఖ్, ప్రియాంక మిగిలారు. బజర్ మోగగానే మొదటగా సింహాసనమెక్కాడు షణ్ను. దీంతో మిగిలిన ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకావం అందిపుచ్చుకున్నాడు. దీంతో ప్రియాంక.. ట్రాన్స్ కమ్యూనిటీకి తను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నానని, ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని ఉందంటూ తనను గేమ్‌లో నుంచి తొలగించవద్దని కోరింది. అయితే షణ్ను.. తాను రవికి ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేకపోయానని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అతడిని సేవ్ చేస్తున్నానని నిర్ణయాన్ని ప్రకటించాడు షణ్ను. తన కమ్యూనిటీ కోసం అయినా పింకీని సేవ్ చేయొచ్చుగా అని కాజల్ పింకీకి సపోర్ట్ చేయడంతో షణ్ను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. కమ్యూనిటీ గురించి తీయడం తప్పంటూ హెచ్చరించాడు. నేనేమైనా ఎదవలా కనిపిస్తున్నానా? ఆ పదం ఎందుకు వాడుతున్నారు? అని మండిపడ్డాడు. ఈ గొడవతో తన బుర్ర హీటెక్కిపోయిన ప్రియాంక తన చెంపలు వాయించుకుని వాష్‌రూమ్ హాల్లోకి వెళ్లి ఏడ్చేసింది. పింకీ బర్త్‌డే కాబట్టి ఆమెను సేవ్ చేయాల్సిందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ఈ గొడవతో షణ్ను సిరిని పట్టుకుని ఏడ్చేశాడు. ఫైనల్‌గా షణ్ముఖ్, రవి కెప్టెన్సీ కంటెండర్లు అవగా శ్రీరామ్ తప్ప మిగతా అందరూ షణ్నుకు ఓటేయడంతో అతడు ఈ సీజన్లో ఆఖరి కెప్టెన్‌గా నిలిచాడు. సిరి అందంగా కనిపించాలంటూ షణ్ను ఆమెకు ముక్కుపుడకిచ్చాడు. తనకు అది పెట్టుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ షణ్ను కోసం దాన్ని ధరించించిది సిరి. అనంతరం బీబీ ఎక్స్‌ప్రెస్ అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లంతా రైలు బోగీలా మారడంతో పాటు రైలులా కదలాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో అందరూ వినోదాన్ని పంచారు. అందరూ పాజ్‌లో(ఆగిపోయి) ఉన్నప్పుడు కాజల్ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చారు. తల్లిని చూడగానే కాజల్ కూతురు గుక్కపెట్టి ఏడ్చింది. కాజల్‌ను రిలీజ్ అని చెప్పగానే ఆమె తన ఫ్యామిలీని పట్టుకుని ఎమోషనల్ అయింది. భర్తపై ముద్దుల వర్షం కురిపించింది. నువ్వు ఇక్కడివరకు వస్తావనుకోలేదని కూతురు అనడంతో కాజల్ నవ్వేసింది. కనీసం టాప్ 5కి చేరుకున్నా సంతోషమే అని చెప్పింది. మమ్మీనెవరైనా నామినేట్ చేస్తే కోపమొస్తదా? అని శ్రీరామ్ అడగ్గా కాజల్ కూతురు అవునని తలూపింది. రవి, శ్రీరామ్‌ను రెండుసార్లు, యానీ మాస్టర్నైతే లెక్కలేనన్నిసార్లు తిట్టుకున్నానంది. యానీ మాస్టర్ ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉన్నానంటూనే జస్ట్ జోక్ చేశానని కవర్ చేసింది. ఈ సీన్‌తో షణ్నుకు తన ఫ్యూచర్ గురించి టెన్షన్ పట్టుకుంది. తనకోసం ఎవరు వస్తారో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. అయ్యా, నమస్కారం, ఎవరిని పంపిస్తున్నారో చెప్తే నేను ముందుగానే ప్రిపేర్ అవుతానంటూ కెమెరాకు విన్నవించాడు. -
బిగ్‌బాస్: మానస్‌కి ప్రపోజ్ చేసిన పింకీ.. నెట్టింట వైరల్
Pinky Proposes To Maanas Unseen Video Goes Viral: బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కొందరు కంటెస్టెంట్లకు సైతం అప్పటివరకు రాని గుర్తింపు బిగ్‌బాస్ ద్వారా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే వంద రోజులకు పైగా సాగే బిగ్‌బాస్ హౌస్‌లో లవ్‌ట్రాక్‌లు కూడా సహాజమే. అప్పటివరకు ఎలాంటి కనెక్టివిటి లేని వాళ్లు సైతం బెస్ట్‌ఫ్రెండ్స్‌గా మారిపోతారు. మరికొందరేమో ఆ రిలేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు. తాజాగా ప్రియాంక సింగ్(పింకీ) అలాంటి ప్రయత్నమే చేసింది. రోజురోజుకి మానస్‌పై పెంచుకుంటున్న ప్రేమను బయటపెట్టేసింది. సోమవారం(నవంబర్22)న జరిగిన ఎపిసోడ్లో పింకీ మానస్‌కి ప్రపోజ్ చేసింది. 'నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో అనిపిస్తుంది. మొదటి రోజు నుంచి నిన్ను చేస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదన్న సంగతి నాకు తెలుసు కానీ నీ విషయంలో నాకు బాగా అనిపిస్తుంది' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ఇది బిగ్‌బాస్ అన్‌సీన్‌లో ప్లే అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
యానీ ఎలిమినేషన్‌కు కారణం ఇదేనా! అదే ఆమె కొంపముంచిదా?
Reasons Behind Anne Master Eliminations From Bigg Boss Telugu 5 Show: తాజా బిగ్‌బాస్ 5 నుంచి యానీ మాస్టర్ బయటకు వచ్చింది. 11వ వారం ఎలిమినేషన్లో భాగంగా యానీ మాస్టర్ హౌజ్‌ను వీడక తప్పలేదు. చివరి వరకు ప్రియాంక, యానీ మాస్టర్ ఎలిమినేషన్ రేసులో ఉన్నారు. చివరి నిమిషంలో ప్రియాంక సేవ్ అయిపోవడంతో యానీ ఇంటిముఖం పట్టక తప్పలేదు. చెప్పాలంటే వీరిద్దరిలో యానీ మాస్టర్ స్ట్రాంగ్ ప్లేయర్. సొంతంగా తన కోసం ఆట ఆడింది. ప్రియాంక సింగ్ మాత్రం తనకంటే ఎక్కువగా మానస్‌పై ఫోకస్ పెడుతూ తన గేమ్‌ను పక్కన పెట్టింది. ఎమన్నా అంటే మానస మానస్ అంటూ జపం చేస్తూ తనకోసం గేమ్ ఆడటమే మరిచిపోయింది.ఈ విషయంలో ఆమె విమర్శలు కూడా ఎదుర్కొంది. అయినా కూడా తన ఆటతీరు మార్చుకోవడం లేదు. ఏ విషయంలో చూసిన ప్రియాంక కంటే యానీయే స్ట్రాంగ్. కానీ ఆమె ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. కాగా దీనికి ప్రధాన కారణం ఆమె నోటి దురుసు. ఏ విషయంలోనైనా తను చాలా పర్ఫెక్ట్ అనే అతి నమ్మకంతో ఉండటం కూడా ఒక కారణం. హౌజ్‌లో తనకు ఏమైన అవసరం ఉంటే చాలా నెమ్మదిగా మాట్లాడే యానీ.. పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారితే మాత్రం నోరు చించుకుంటు అందరి మీద అరుస్తుంది.‘గేమ్‌లో తేడా వస్తే చాలు హౌజ్‌లో నేను ఒక్కదానినే నిజాయితిగా ఆడాను అందరూ గ్రూపులుగా ఆడుతున్నారు’ ఏడుపు మొదలు పెడుతుంది. అదే యానీ కొంప ముంచింది అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన ఆమె నామినేషన్ నుంచి తప్పుకోవడం వల్లే ఇంతకాలం హౌజ్‌లో ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వారం యానీ నామినేషన్లో రావడం, ఎప్పుటి కంటే కూడా ఈవారం ఆమె కాస్తా ఎక్కువగా నోటి దురుసు ప్రదర్శించడంతో ప్రేక్షకుల్లో ఆమెపై నెగిటివిటి పెరిగిందంటున్నారు. ఇక అంతకంటే సహా కంటెస్టెంట్ కాజల్‌ను ఎప్పుడ తప్పుబట్టడం, తన గురించి మిగతా కంటెస్టెంట్స్ వద్ద తప్పుగా మాట్లాడటం కూడా ప్రధాన కారణం అంటున్నారు. అప్పటి వరకు ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఫైర్ టాస్క్‌లో అనీ మాస్టర్ చేసిన రచ్చతో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కంటెస్టెంట్స్ అందరిపై ఆనీ మాస్టర్ నోరు పారేసుకోవడం.. చాలా ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అవుతుండటంతో ప్రేక్షకులు ఇంటి నుంచి ఈమెను బయటికి పంపించేశారు. కచ్చితంగా వచ్చేవారం ప్రియాంక బయటికి రావడం ఖాయం అనే ప్రచారం ఇప్పటి నుంచే మొదలైంది. -
మానస్ నుంచి ఏం ఆశిస్తున్నావు? ఉలిక్కిపడ్డ ప్రియాంక
Bigg Boss Telugu 5 Promo: సండే ఫండే మాత్రమే కాదు ఎలిమినేషన్ డే కూడా అంటున్నాడు హోస్ట్ నాగార్జున. ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తో వినోదాత్మకమైన గేమ్స్ ఆడించి చివర్లో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి రెడీ అయిపోయాడు. తాజా ప్రోమోను చూస్తుంటే నాగ్.. కంటెస్టెంట్లతో ఆసక్తికర గేమ్ ఆడించినట్లు కనిపిస్తోంది. కంటెస్టెంట్లు ఇతర ఇంటిసభ్యులను అడగాలనుకున్న ప్రశ్నలను పేపర్ మీద రాసివ్వగా నాగ్ వాటిని అడుగుతున్నాడు. ఫిజికల్ టాస్క్ అనగానే సన్నీ సైడ్ చూస్తావు, తను మరీ అంత వైల్డా? అని షణ్నును క్వశ్చన్ చేయగా అతడు ఫక్కుమని నవ్వేశాడు. ఇక మానస్‌ను.. ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటని ప్రశ్నించగా దానికతడు తడుముకోకుండా ఫ్రెండ్షిప్ అని బదులిచ్చాడు. మానస్ నుంచి ఏం ఆశిస్తున్నావని ప్రియాంకను అడగ్గా ముందు ఈ తిక్క ప్రశ్న ఎవరడిగారని ఆరా తీసింది. దీంతో నాగ్.. మానసే అడిగాడు అని చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. యానీ మాస్టర్‌ను.. మీ బుర్రను వంంట చేసేటప్పుడు, రెడీ అయ్యేటప్పుడు మాత్రమే వాడతారా? అని అడగడంతో ఆమె నోరెళ్లబెట్టింది. దీనికి యానీ.. అలా ఏం లేదని ఆన్సరిచ్చింది. నీ చుట్టూ ఉన్నవాళ్లను వాడుకుని ఆడుతున్నావెందుకని నాగ్ ప్రశ్నించగా ఈ హౌస్‌లో ఉంది వాడుకోవడానికే కదా అని ఆన్సరిచ్చాడు రవి. -
మానస్‌ను వాడుకుంది చాలు, వదిలెయ్: పింకీపై నెటిజన్ల ఫైర్
Bigg Boss Telugu 5, Priyanka Stop Using Maanas: ఎప్పుడూ గొడవలతో ఊగిపోయే కంటెస్టెంట్లు సైలెంట్‌గా ఉన్నారేంటి అనుకునేలోపే హౌస్మేట్స్ అందరూ విశ్వరూపం చూపించారు. ఒక్క కెప్టెన్సీ టాస్క్‌లోనే యానీ- కాజల్, సిరి, షణ్ను- సన్నీ, రవి- మానస్ గొడవపడ్డారు. ఈ కొట్లాటల తర్వాత వీళ్లెలా ఉన్నారో తెలియదు గానీ అభిమానులు మాత్రం ఆవేశంతో ఊగిపోతున్నారు. మా అభిమాన కంటెస్టెంట్ చేసింది కరెక్ట్ అంటూ ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయడంలో తప్పు లేదు కానీ అవతలి కంటెస్టెంట్ మీద విరుచుకుపడుతూ నానా మాటలు అంటున్నారు. పింకీ వెన్నుపోటు పొడిచిందా? దీంతో నిన్నటి నుంచి సన్నీ, షణ్నుల పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. వీళ్ల ఫ్యాన్స్ ఒకరినొకరు దూషించుకుంటూ నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదిలా వుంటే నిన్నటి టాస్క్‌లో ప్రియాంక వల్ల సన్నీ కెప్టెన్సీ కోల్పోయాడని చాలామంది వాదిస్తున్నారు. ప్రియాంక చీర తగిలే రెండుసార్లు అతడి టవర్ కూలిపోయింది. దీంతో మానస్ కూడా పింకీపై అనుమానం వ్యక్తం చేశాడు. ఒకసారంటే ఏదో అనుకోకుండా జరిగిందనుకోవచ్చు, కానీ రెండుసార్లు ఎలా సాధ్యమని సందేహపడ్డాడు. తను కావాలనే చేసినట్లు అనిపిస్తోందని మానస్, సన్నీ అభిప్రాయపడ్డారు. నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఎలా? అని సన్నీ బాధపడ్డాడు. ఇక పింకీ వల్ల మానస్ గ్రాఫ్ కూడా పడిపోతుందని ఆయన ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. మానస్‌కు ఆ వీడియో చూపించాల్సిందే దీంతో మానస్‌ను వదిలెయ్ ప్రియాంక(#PriyankaStopUsingMaanas) అన్న హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో వైరల్‌గా మారింది. మానస్ ఆటను పింకీ సర్వనాశనం చేస్తోందంటూ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్‌లో కావాలనే తన తనలతో టవర్ కూలిపోయేలా చేసి సన్నీకి నమ్మకద్రోహం చేసిందని విమర్శిస్తున్నారు. ఈ వీడియోను బిగ్‌బాస్ సన్నీ, మానస్‌లకు చూపించి వారి కళ్లు తెరిపించాలని కోరుకుంటున్నారు. అయితే ప్రియాంక అభిమానులు మాత్రం మానస్‌ను ఎంతో ప్రేమించే పింకీ అతడి నమ్మకాన్ని వమ్ము చేయదంటున్నారు. అనుకోకుండా జరిగిన పొరపాటుకు ఆమెను అనుమానించి కించపరచొద్దని కోరుతున్నారు. Wow... pinky , what a gamer you are 😡.. Claps needed 👏👏👏... #BiggBossTelugu5 #PriyankaStopUsingMaanas https://t.co/ljwNn1hBR7 — Sharmila (@Sharmila_146) November 13, 2021 Pinky did on purpose it was not saree but she only lean on the Sunny's box tower & acting as if she haven't did on purpose..#Sunny may or may not have won with equation 5:3 but double side pinky spoiled his fair chance.#PriyankaStopUsingMaanas #Maanas #Sunny#BiggBossTelugu5 pic.twitter.com/xW4eTjxBXY — CommonMan 🍥 (@Truly_CommonMan) November 13, 2021 Pinky please play ur game and let #Maanas play his game @StarMaa stop pushing priyanka onto maanas #BiggBossTelugu5 #priyankastopusingmaanas https://t.co/EgzNa4hd62 — MS👑 (@viren730) November 13, 2021 -
ప్రియాంక సింగ్‌కు సపోర్ట్ చేయం: హిజ్రా ఫౌండర్
కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసిన సాయి తేజ ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు. ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకున్న అతడు తనకు వచ్చిన ఆఫర్‌ను అందిపుచ్చుకుని బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్నాడు. అయితే ప్రియాంక సింగ్ ఎవరో తనకు తెలీదని, ఆమెకు సపోర్ట్ చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ చంద్రముఖి షాకింగ్ కామెంట్స్ చేశారు. "ట్రాన్స్‌జెండర్‌గా మారడం అంటే అంత ఈజీ కాదు. నాలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని సైక్రియాట్రిస్ట్‌కు చెప్తే అతడు ఓ రెండేళ్లపాటు ఆడపిల్లలా బట్టలు వేసుకోమంటాడు. రెండేళ్లు కౌన్సిలింగ్ ఇస్తాడు. దీని తర్వాత కూడా అమ్మాయిగానే ఉండాలనిపిస్తే అప్పుడు సర్జరీ చేయించుకోమంటారు. అంతేకానీ 24 గంటలు చీర కట్టుకొని బాడీలో ఫెమినిటీని పెంచుకోవడం వేరు, పుట్టినప్పుడే ఫెమినిటీతో పుట్టడం వేరు. కొందరు ఆడపిల్ల గెటప్స్ వేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పూర్తిగా ఆడపిల్లగా మారి ఇంకా ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటారు. అక్కా నాకు ఆడపిల్లలా అవ్వాలని ఉందని ఎందరో నా సోషల్ మీడియా అకౌంట్లలో కామెంట్లు పెడుతూ ఉంటారు.సెక్స్ వర్క్ చేసో, అడుక్కునో బతకడం కన్నా ఉద్యోగం చేసి బతకమని కౌన్సెలింగ్ ఇస్తుంటాను. అలాగయితేనే జీవితంలో గౌరవంగా బతుకుతారని చెప్తాను. బిగ్‌బాస్ షోలోకి ట్రాన్స్జెండర్లను తీసుకొస్తున్నారు. గతంలో తమన్నా, ఈసారి ప్రియాంకను తెచ్చారు. అయితే ఆమె గురించి నాకు పెద్దగా తెలీదు. కేవలం టీవీలో చూడటం వరకే తెలుసు, అది కూడా సాయిగానే తెలుసు. తను ట్రాన్స్‌జెండర్ అయ్యారని నాకు తెలియదు. మా కమ్యూనిటీలో ఉండి ఉంటే మా సపోర్ట్ ఉండేది. లేదు కాబట్టి ఎటువంటి సపోర్ట్ ఉండదు. గతంలో తమన్నా బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు సపోర్ట్ చేశా. ఎందుకంటే ఆమె మా కమ్యూనిటీలో ఉంది కాబట్టి! ఇప్పటికీ తమన్నా, నేను మంచి స్నేహితులం" అని చెప్పుకొచ్చారు చంద్రముఖి. -
సీక్రెట్ రూమ్‌కు జెస్సీ, రగిలిపోయిన షణ్ముఖ్!
Bigg Boss 5 Telugu, Episode 66: జెస్సీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడి ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. నీకు మెడికల్ ట్రీట్మెంట్ అవసరమని, ఇందుకోసం బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నాడు. దీంతో జెస్సీ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ 'బిగ్‌బాస్ నా లైఫ్ అనుకున్నా, ఇంతవరకు వచ్చినందుకు హ్యాపీ' అంటూనే అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు. జెస్సీ తిరిగొస్తాడు కదూ* జెస్సీ ఉన్నఫళంగా హౌస్ వదిలి వెళ్తాడని చెప్పగానే షణ్ముఖ్, సిరి గుక్కపెట్టి ఏడ్చారు. సిరి అయితే అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తలపై ఆప్యాయంగా ముద్దు పెట్టింది. జెస్సీ వెళ్లిపోయే ముందు చివరిసారిగా హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ.. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు సన్నీ, మానస్, పింకీ, కాజల్, యానీ.. అందరూ పాంపరింగ్ చేశారంటూ బాధపడ్డాడు. తన ఫ్రెండ్స్ షణ్ను, సిరి ఇద్దరు ఉన్నంతవరకు బిగ్‌బాస్ జర్నీ చూస్తానని చెప్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు లేకపోవడంతో తీవ్రంగా దుఃఖించిన సిరి.. జెస్సీ తిరిగొస్తాడేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. మానస్ కోసమే వచ్చావా?: పింకీపై కాజల్ ఫైర్ మరోపక్క నామినేషన్స్ ఎఫెక్ట్‌తో ప్రియాంక సింగ్ మీద అలక బూనాడు మానస్. ఆమె దగ్గరవ్వాలని ప్రయత్నించేకొద్దీ అతడు తప్పించుకు తిరిగాడు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పంటూ బతిమాలినప్పటికీ మానస్ మాత్రం అసలు పట్టించుకోలేదు. దీంతో పింకీ.. మానస్ ఎందుకు మాట్లాడట్లేదో తెలియడం లేదని తెగ ఫీలైంది. ఇది విన్న కాజల్.. నువ్వు తనకోసం వచ్చావా? అని ఫైర్ అయింది. మనం గేమ్ ఆడటానికి వచ్చాం, మానసే నేరుగా వచ్చి మాట్లాడేదాకా వెయిట్ చెయ్, లేదంటే వదిలెయ్ అని సలహా ఇచ్చింది. (చదవండి: చివరి క్షణంలో బిగ్‌బాస్ ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఐదుగురు) మాట్లాడే అధికారమే కోల్పోయావు: సన్నీ పైకి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ కాజల్ బాధను దిగమింగుతోంది. నామినేషన్స్‌లో తన ఫ్రెండ్స్ సన్నీ, మానస్‌లను సేవ్ చేయనందుకు వారు మాట్లాడకపోవడంతో ఎంతగానో బాధపడింది. ఎలాగో ఈవారం ఎలిమినేట్ అవుతానని అటు కాజల్, ఇటు మానస్ ఎవరికి వారే అభిప్రాయపడ్డారు. అయితే మానస్ వెళ్లిపోతాడంటే తట్టుకోలేకపోయిన పింకీ.. అలా అనొద్దని వేడుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నువ్వు మాట్లాడే అధికారమే కోల్పోయావని తేల్చేశాడు. ఇక కాజల్ నామినేషన్స్ సమయంలో వారిని సేవ్ చేయకుండా నమ్మకాన్ని వమ్ము చేసినందుకు సారీ చెప్పింది. ఎప్పటిలా ఉందామని ఎన్నిసార్లు బతిమాలినా, ఎన్నిసార్లు సారీ చెప్పినా సన్నీ, మానస్ వినిపించుకోకపోవడంతో తను కూడా ఏడ్చేసింది. సీక్రెట్ రూమ్‌లో జెస్సీ, క్వారంటైన్ అయ్యాక హౌస్‌కు! ఇదిలా వుంటే జెస్సీని బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్‌లో ఉంచాడు బిగ్‌బాస్. శ్రీరామ్.. కాజల్ బాగా ఇన్ఫ్లూయెన్స్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. మరోపక్క మానస్.. పింకీ ఇచ్చిన వస్తువులను తిరిగిచ్చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. రవి కోసం బంటులా పని చేస్తే మాత్రం పింకీని అస్సలు నమ్మనని తెగేసి చెప్పాడు. తాను, జెస్సీ, షణ్ను ముగ్గురం కంటెండర్ అవగానే కెప్టెన్ అయ్యామని చెప్తూ ఉప్పొంగిపోయింది సిరి. కానీ నేను కంటెండర్ అవగానే నామినేట్ అవుతున్నానని రవి అనగా.. ఎలిమినేట్ మాత్రం అవడం లేదు, అదే నా బాధ అని మనసులో మాట బయటపెట్టాడు షణ్ను. నా మీదే జోకులా, నేనేంటో చూపిస్తా! తర్వాత సిరి అందరిముందే తన మీద జోకేసిందని తెగ ఫీలయ్యాడు షణ్ను. ఎవడన్నా జోకేస్తే చెప్పు తీసి కొట్టేవాడినని చిరాకుపడ్డాడు. క్లోజ్ ఫ్రెండే జోకేస్తే తీసుకోని షణ్ను రవి జోక్ చేస్తే ఊరుకుంటాడా? అందరి ముందు తన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేయడంతో బాగా హర్టయ్యాడు. ఇలాంటి వెకిలి జోకులను తాను తీసుకోలేనని ముఖం మీదే చెప్పాడు. పింకీ నన్ను గెలికింది, ఇక ఎలా ఉంటుందో చూడని సిరితో చెప్పుకొచ్చాడు. ఇలా చనువు తీసుకుని అతి చేస్తారనే మనుషుల్ని దూరం పెడతానని పేర్కొన్నాడు. (చదవండి: ఒకరి జీవితంతో ఆడుకోకండి: విశ్వ వార్నింగ్) ముద్ద వద్దు, ముద్దులే కావాలన్న మానస్ సన్నీ, మానస్‌ల పోరుతో ఆలోచనలో పడ్డ కాజల్.. షణ్నును సేవ్ చేయకుండా నన్నెందుకు సేవ్ చేశావని శ్రీరామ్‌ను అడిగింది. దీంతో అతడు మనిద్దరి మధ్య గొడవకు ముగింపు పలకడానికే చేశానని బదులిచ్చాడు. ఎట్టకేలకు మానస్ కోపాన్ని కరిగించేసింది ప్రియాంక. భోజనం ప్లేటు పట్టుకుని ముద్దు కావాలా? ముద్ద కావాలా? అని అడిగితే మానస్ ముద్దే కావాలన్నాడు. దీంతో ప్రియాంక దొరికిందే ఛాన్స్ అనుకుని ముద్దుల మీద ముద్దులిచ్చింది. -
నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో: ప్రియాంకపై సన్నీ సెటైర్లు
Bigg Boss 5 Telugu Today Promo: కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ఓ గిఫ్ట్ పంపాడు. నోరూరించే ఫుడ్ ఐటమ్‌ను పంపి ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది? అని అడిగాడు. దీంతో ఇంటిసభ్యులు దీని వెనకాల ఏమైనా మతలబు ఉందా? అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. ఇది చూసిన సన్నీ 'ఈ తొక్కలో డిస్కషన్ ఏంటో అర్థం కావడం లేదు, పోనీ నేను లటుక్కుమని తినేయనా?' అని అడిగాడు. కాజల్ అందుకు పచ్చజెండా ఊపినప్పటికీ యానీ మాస్టర్ మాత్రం వద్దని వారించింది. ఇక శ్రీరామ్ అయితే దాని చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరగా యానీ.. తాను కెప్టెన్‌ను కాబట్టి తినడానికి తనకే అర్హత ఉందని చెప్పింది. అయితే ఇంటిసభ్యుల అభిప్రాయం కూడా కనుక్కుందామని చూసింది. ఇంతలో ప్రియాంక.. నాకు మానస్‌కు ఇవ్వాలని ఉంది అనగా సన్నీ.. నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో, పో లోపలికి.. అని ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ కేక్ ఎవరు తిన్నారు? అసలు తిన్నారా? లేదా? అనేది తెలియాలంటే నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
Bigg Boss 5 Telugu: జైలులో ఆ నలుగురు.. పింకీపై షణ్ముఖ్ ఫైర్
Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు కంటెస్టెంట్స్ భయంలో వణికిపోతారు. ఆ రోజు నామినేషన్స్ ఉండడమే ఆ భయానికి కారణం. ఆ గండం నుంచి బయటపడేందుకు ఇంటిసభ్యులు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే పదోవారంలో చిన్నపాటి ట్విస్ట్‌తో నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్‌బాస్. డైరెక్ట్‌గా నలుగురిని నామినేట్ చేసే అవకాశాన్ని కెప్టెన్ యానీ మాస్టర్‌కు కల్పించాడు. అంతేకాదు ఆ నలుగురిని జైలులో కూడా పెట్టాలని ఆదేశించారు. దీంతో యానీ మాస్టర్.. మానస్, కాజల్, సన్నీ, షణ్ముఖ్‌లను నామినేట్ చేసి జైలులో పెట్టింది. అయితే వారికి నామినేషన్స్ తప్పించుకునే అవకాశం కూడా ఇచ్చాడు. బజర్ మోగిన వెంటనే లివింగ్ రూమ్‌లో ఉన్న తాళాలను ఎవరైతే దక్కించుకుంటారో వాళ్లు.. తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ని జైలు నుంచి బయటకు తీసుకురావొచ్చని మిగిలిన ఇంటి సభ్యులకు సూచించాడు. ఇందులో భాగంగా ప్రియాంక తాళం దక్కించుకొని మానస్‌ని బయటకు తీసుకొచ్చింది. బయటకు వచ్చిన మానస్.. జెస్సీ,రవిలను నామినేట్ చేశాడు. సిరి తాళం దక్కించుకొని షణ్ముఖ్‌ను కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. జెస్సీ వల్ల షణ్ముఖ్ బయటపడ్డాడు. తనకు ఒకరిని నామినేట్ చేసే చాన్స్ రావడంతో.. పింకీని ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. దీంతో బాగా హర్ట్ అయిన పింకీ.. ‘ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్ లేదని నన్ను నామినేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నా పాయింట్లో నువ్వు కరెక్ట్ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు’అంటూ అసహనం వ్యక్తం చేయగా.. ‘నా పాయింట్లో ఇదే కరెక్ట్.. నేను ఇలానే నామినేట్ చేస్తా. అది నా ఇష్టం’అంటూ షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
ప్రియాంక సింగ్‌కు పెళ్లి చేస్తా: మానస్ తల్లి
Maanas Mother Comments On Pinky Marriage: 'దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్ని' అంటూ అర్ధరాత్రి తన బాధను మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది ప్రియాంక సింగ్. రోజురోజుకీ అతడి మీద ప్రేమను పెంచుకుంటూ, అతడి గురించే ఆలోచిస్తూ కాలం గడిపేస్తోంది పింకీ. ఆమె పరిస్థితి చూసి అభిమానులు కలవరపడుతున్నారు. బిగ్‌బాస్ తర్వాత రోజూ మానస్‌తో ఉండలేవు, తరచూ మాట్లాడే అవకాశం ఉండదు, అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలీదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా వుంటే ఓ ఇంటర్వ్యూలో మానస్ తల్లి పద్మిని.. ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఆమె చాలా మంచి అమ్మాయి, నాకెంతో ఇష్టం. ఓసారి ప్రియాంక.. మానస్‌ను హజ్బెండ్ మెటీరియల్ అంది. కానీ, మానస్ ఆమె కేవలం మరదలని చెప్పాడు. బిగ్‌బాస్ అనేది 110 రోజుల ఆట. ఈ షోలో ఎంతమంది జంటలు బయటకొచ్చారు? ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు? ఏదైనా బిగ్‌బాస్ షో వరకే అని అందులో ఉన్న కంటెస్టెంట్లకు బాగా తెలుసు. కాకపోతే హౌస్‌లో ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. హౌస్‌లో మానస్‌కు ఎవరూ సెట్ కారు. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే మానస్ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ప్రియాంక సింగ్.. నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను. ఆమెను తగిన అబ్బాయిని చూపించి పెళ్లి చేస్తా. అలా ప్రియాంకకు నేను సపోర్ట్ చేస్తాను, ఏదైనా సాయం చేస్తాను అని చెప్పింది. ఇక మానస్ ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ.. అతడు చదువుతున్న సమయంలో ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోవడానికి రెడీ అయింది. దీంతో ఏం చేయాలని నన్ను అడిగాడు. నీదింకా చిన్న వయసు. కరెక్ట్‌గా సెటిల్ అవకుండా అమెరికా వెళ్లడం కరెక్ట్ కాదేమోనన్నాను. మానస్ సరేనని ఆగిపోయాడు. అలా కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు అని పేర్కొంది పద్మిని. (చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో అతడు హీరో, ఆమె విలన్!) -
బిగ్‌బాస్: హీరో అంటూనే నామం పెట్టారు! ఆవిడే విలన్!
Bigg Boss 5 Telugu, Episode 63: సిరిని ఓదార్చడానికి షణ్నుకు తల ప్రాణం తోకకొచ్చింది. 'దీనమ్మ ప్రేమేందిరాబై గిట్ల సంపుతున్నాది, పోరీ పీకినాక హ్యాంగోవర్ టార్చరున్నాది..' అంటూ ఒంటరిగా పాటందుకున్నాడు. అయినా దీపు(దీప్తి సునయన)ను భరిస్తే ఎవరినైనా భరించగలను అంటూ తనను తానే ఓదార్చుకున్నాడు. మరోపక్క పింకీ.. దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ అర్ధరాత్రి ఏడుపందుకుంది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్నని మానస్‌తో గోడు చెప్పుకుంటూ బాధపడింది. దీంతో మానస్.. ఆమెను చేరదీసి ఓదార్చాడు. కెప్టెన్‌గా షణ్నుకు 9 మార్కులు: నాగ్ కానీ మరుసటి రోజు మాత్రం పింకీకి క్లాస్ పీకాడు. 'నువ్వు కావాలని, ఏదో అనుకుని నాతో మాట్లాడుతున్నావు, నేను చిన్నపిల్లాడిని కాదు, నాకు తెలీదు అనుకోకు..' అని చురకలంటించాడు. దీంతో పింకీ సరేనని తలూపింది. కెప్టెన్సీ టాస్క్‌లో షణ్ను తమను సపోర్ట్ చేయలేదని అటు సిరి, ఇటు జెస్సీ బాగా హర్టయ్యారు. దీంతో షణ్ను వాళ్లిద్దరినీ బతిమాడలేక చచ్చిపోయాడు. నాగార్జున స్టేజీపైకి వచ్చీరావడంతోనే యానీ కెప్టెన్ అయిందంటూ ఆమెను మెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా నీకు నువ్వు ఎన్ని మార్కులిచ్చుకుంటావని నాగ్ అడగ్గా అతడు 7 అని టపీమని ఆన్సరిస్తాడు. కానీ తాను మాత్రం 9 మార్కులిస్తానని చెప్పాడు నాగ్. ఇక కొద్దిరోజులుగా దూరందూరంగా ఉంటున్న సిరి, షణ్నులను ఫ్రెండ్షిప్ సాంగ్‌తో కలిపేశాడు నాగ్. (చదవండి: Archana: ఆ హీరో వంకరగా ఆలోచించేవాడు.. అతడి నిజస్వరూపం వేరే..) కాజల్‌తో నాగిన్ జ్యూస్ తాగిపించిన యానీ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో నిన్ను చిత్రహింసలు పెట్టిన టీమ్‌లో నుంచి ఒకరిపై ప్రతీకారం తీర్చుకోమని అవకాశం ఇచ్చాడు నాగ్. దీంతో రవి.. సోయా సాస్, చిల్లీ సాస్, గుడ్డు.. అన్నీ కలిపి దానికి షణ్స్ సిర్స్ జెస్స్ కాక్టెయిల్ అని పేరుపెట్టాడు. తప్పించుకునే దారి లేక షణ్ను దాన్ని అతి కష్టం మీద దాన్ని తాగేశాడు. యానీ... కాజల్‌తో మిర్చి తినిపించి తర్వాతో నాగిన్ జ్యూస్ తాగమని చేతికందించింది. అయితే కాజల్ ఎత్తిన గ్లాసు దించకుండా తాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రియాంక ఇచ్చిన పచ్చిగుడ్డును మింగేశాడు రవి. శ్రీరామ్.. సన్నీతో మిర్చి తినిపించాడు. ఆ వెంటనే జ్యూస్‌లో ఇంకేవేవో కలపడానికి ప్రయత్నించగా మొగడా ఆగరా అంటూ విసుక్కుంటూనే మొత్తానికి తాగేశాడు సన్నీ. నేను నమ్మే ఏకైక వ్యక్తి ఇతడే: కాజల్ హౌస్‌మేట్స్‌తో నాగ్.. ఎవరు హీరో? ఎవరు విలన్? గేమ్ ఆడించాడు. ముందుగా సిరి.. షణ్ముఖ్‌కు స్టార్ బ్యాడ్జ్ పెట్టి అతడు ఎప్పుడూ హీరోనే అని చెప్తూ మురిసిపోతూ, ప్రియాంక సింగ్ తనకు విలన్ అని పేర్కొంది. ప్రియాంక.. మానస్ హీరో అని, సిరి విలన్ అని తెలిపింది. శ్రీరామ్.. విశ్వ తన హీరో అని, సిరి విలన్ అని పేర్కొన్నాడు. కాజల్.. నన్ను విలన్ అనుకుంటున్న యానీయే విలన్ అని చెప్పుకొచ్చింది. ఇక సన్నీకి హీరో బ్యాడ్జ్ పెట్టబోగా అతడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నాడు. దీంతో కాజల్ యూటర్న్ తీసుకుని మానస్‌కు స్టార్ బ్యాడ్జ్ పెట్టింది. నేను నమ్ముతున్న ఏకైక వ్యక్తి మానస్ అంటూ అతడిని హీరోను చేసింది. సన్నీ.. జెస్సీ హీరో అవ్వాలంటూ అతడికి స్టార్ బ్యాడ్జ్ పెట్టాడు. ప్రియాంకను విలన్ అని చెప్పుకొచ్చాడు. తర్వాత సిరి సేఫ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. నాకెప్పుడూ ఒకరే విలన్: షణ్ను తర్వాత రవి వంతు రాగా.. తన నమ్మకం ఎప్పుడూ వమ్ము చేయలేదని, టాస్కుల్లో 100 శాతం కష్టపడతాడంటూ విశ్వను హీరోగా పేర్కొన్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని షణ్ను విలన్ అని చెప్పాడు. ఇక షణ్ను.. తనకెప్పుడూ ఒకరే విలన్ అంటూ రవి మీద క్రాస్ గుర్తు గుద్దాడు. ఈ విలన్ లేకపోతే తాను హీరో అవలేనన్నాడు. అబ్బాయిల కంటే దారుణంగా గేమ్ ఆడే సిరి హీరో అని పొగిడాడు. యానీ.. కాజల్‌తో కంఫర్టబుల్‌గా లేనంటూ ఆమెను విలన్‌గా పేర్కొంది. మొదటి వారం నుంచి చాలా చక్కగా ఆడుతాన్నాడంటూ విశ్వకు స్టార్ బ్యాడ్జ్ ఇచ్చింది. విశ్వ.. గేమ్ ఛేంజర్ శ్రీరామ్ హీరో అని, ప్రియాంక సింగ్ విలన్ అని అభిప్రాయపడ్డాడు. పాపం సన్నీ, ఆఖరికి కమెడియన్.. జెస్సీ.. తన గురించి ఎంతో కేర్ తీసుకుంటూ, అమ్మలా చూసుకునే సిరి హీరో అని ఆకాశానికెత్తాడు. గేమ్‌లో డల్ అవుతున్న కాజల్ విలన్ అని చెప్పుకొచ్చాడు. మానస్.. ప్రియాంక తనకు హీరో అని చెప్పడంతో ఆమె ఆనంద భాష్పాలు కార్చింది. అనంతరం రవి విలన్ అని చెప్పాడు. మొత్తంగా ఈ టాస్క్‌లో విశ్వ ఈ హౌస్‌కు హీరోగా, ప్రియాంకను విలన్‌గా తేల్చేశాడు నాగ్. హీరో, విలన్ ఏ ట్యాగూ రాని సన్నీని హీరోకు, విలన్‌కు మధ్యలో ఉన్న కమెడియన్ అన్నాడు నాగ్. ఏదేమైనా విశ్వను హీరో అంటూనే హౌస్ నుంచిం పంపించి వేస్తున్నట్లు తెలుస్తోంది. ] -
బిగ్‌బాస్: ప్రియాంకకు ముద్దు పెట్టిన జెస్సీ.. పరువుతీసిన మానస్
Bigg Boss Telugu 5, Episode 62, New Captain: బిగ్‌బాస్ హౌస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్లో చాలా వింతలు జరిగాయి. ఎవరూ ఊహించని విధంగా ప్రియాంకకు ముద్దు పెట్టాడు జెస్సీ. ప్రియాంకను సిస్టర్ అని సంభోదించాడు మానస్. మరోవైపు హౌస్‌కి కొత్త కెప్టెన్ వచ్చారు. త్రిమూర్తులైన షణ్ముఖ్, జెస్సీ, సిరిల మధ్య విభేదాలు వచ్చాయి. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయంటే.. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా సూపర్ విలన్స్ Vs సూపర్ హీరోస్ మధ్య హోరా హోరి పోరు జరిగింది. ఇప్పటి వరకు జట్టుగా ఆటలు ఆడించిన బిగ్‌బాస్.. ఇప్పుడు ఒక్కొక్కరిని బరిలోకి దింపాడు. ఇరు జట్ల నుంచి ఒక్కొక్కరు ముందుకువచ్చి తమతమ ప్లాట్‌ఫామ్‌పై నిలబడి కర్రతో ఒకరినొకరు తోసుకోవాలి. మొదట ఎవరు పడిపోతే వారు ఓడినట్లు. ఇలా ఏ టీమ్ నుంచి ఎక్కువ సభ్యులు పడిపోతారు.. ఆ టీమ్ ఓడిపోతుంది. ఈ టాస్క్‌లో భాగంగా హీరోస్ టీమ్ నుంచి వచ్చిన మానస్.. విలన్స్ టీమ్ సభ్యులందరిని కిందకు నెట్టేశాడు. దీంతో ఈ టాస్క్‌లో హీరోస్ టీమ్ విజయం సాధించింది. అనంతరం కీ లాక్‌ని విలన్స్ టీమ్ దక్కించుకుంది. ఓవరాల్‌గా విలన్స్ టీమ్ ఎక్కువ పాయింట్స్ పొంది కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌కి ఎంపికైంది. ప్రియాంకకు జెస్సీ ముద్దు.. షాకైన ఇంటి సభ్యులు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌కు ఎంపికైన విలన్స్ టీమ్ సభ్యులు రవి, యానీ, సన్నీ,జెస్సీ, విశ్వ, సిరిలకు మిగతా సభ్యులు అభినందనలు తెలిపారు. సోఫాపై కూర్చున్న జెస్సీకి ప్రియాంక వెనుక నుంచి హగ్ ఇస్తుండగా.. జెస్సీ ఆమెకు ముద్దు పెట్టేశాడు. ఒక్కసారిగా తనని ముద్దాడే సరికి షాక్ అయ్యింది ప్రియాంక. ఆమెను చూసి శ్రీరామ్ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.. షణ్ముఖ్‌తో మనోడు పెట్టేశాడు.. అంటూ సెటైర్ వేశాడు. ఏంటీ ముద్దు పెట్టేశాడా? అని సన్నీ అడగ్గా.. ‘ఛీ నేను ఎందుకు పెడతాను.. వాడే పెట్టాడు.. కంగ్రాట్స్ అని కిందికి వంగాను అంతే.. ఫటుక్కున తిరిగి ముద్దు పెట్టేశాడు’అంటూ ప్రియాంక ముసిముసి నవ్వులు నవ్వింది. సిరి-షణ్ముఖ్‌ల మధ్య మళ్లీ లోదుస్తుల లొల్లి గురువారం నాటి ఎపిసోడ్లో సిరి, షణ్ముఖ్ మధ్య లోదుస్తులపై గొడవ జరిగిన విషయం తెలిసిందే. టాస్క్‌లో భాగంగా సిరి ఇంట్లోని దుస్తులన్నింటిని ఎత్తిపారేసింది.దీంతో ఇద్దరి మధ్య గొడవజరిగింది. అప్పటి నుంచి దూరం దూరంగా ఉంటున్న సిరి.. మళ్లీ షణ్ముఖ్ దగ్గరకు వచ్చి ఆ విషయంపై చర్చించింది. అరేయ్ మీరు సూపర్ విలన్స్హా..పిచ్చోళ్లా..? ఎవరైనా దుస్తులు ఎగరేస్తారా?అని సిరిపై పంచ్ వేశాడు షణ్ముఖ్. పక్కనే ఉన్న కాజల్ గట్టిగా నవ్వింది. అయితే సిరి మాత్రం తనను తాను సమర్థించుకుంది. . అది విలనిజం.. అలాగే ఉంటుంది.. నేను దుస్తులు ఎగరేశా.. అందులో లోదుస్తులు ఉన్నాయని నాకేం తెలుసు? అని చెప్పింది సిరి. కెప్టెన్‌గా ఇల్లు సరిగా పెట్టలేదని నాగార్జున గారు నాకు క్లాస్ పీకుతారు.. అందుకే అలా కోపడ్డాను అని షణ్ముఖ్ అనగా.. ఇది ఓవర్ థింకింగ్ అని సిరి చెప్పుకొచ్చింది. మానస్ సిరియస్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక మానస్ వద్దొద్దు అంటున్నా..అతని వెనకాలే తిరుగుతోంది ప్రియాంక. సిస్టర్ అని సంభోదించినా సరే.. తానంటే ఇష్టమని చెబుతోంది. దీంతో ఆమెను కాస్త దూరంపెట్టే ప్రయత్నం చేశాడు మానస్. అయినప్పటికీ.. అతని దగ్గరికి వచ్చి ప్రేమ గీతాలు మొదలెట్టింది ప్రియాంక. దీంతో చిరాకు పడ్డ మానస్.. ఏంటి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నావా అని మొఖంమీదే అడిగేశాడు. దీంతో చాలా హర్ట్ అయిన ప్రియాంక.. ‘నువ్వు అలా అంటుంటే నేను చాలా ఫీలవుతున్నా’అని చెప్పగా.. ఎందుకు అంత సీన్ చేస్తున్నావ్.. తినాలా? వెళ్లిపోవాలా ?అని మానస్ సీరియస్ అయ్యాడు. దీంతో అక్కడ నుంచి వెళ్లి బెడ్రూమ్లోకి వెళ్లిన ప్రియాంక.. సిరితో తన బాధను పంచుకుంది. అయితే సిరి మాత్రం ప్రియాంకను మరింత రెచ్చగొట్టింది. .. మీ మ్యాటర్ ఎంత వరకూ వచ్చింది.. నాకు నిన్ననే తెలిసింది.. మీ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారంట కదా.. అంటూ లవ్ సింబర్ చూపించింది. సైగ చేయకే అర్థం అయిపోతుంది అని ప్రియాంక తెగ సిగ్గుపడిపోగా.. అతనికి కూడా ఇష్టమేనంట కదా అని సిరి అన్నది. దీంతో ప్రియాంక.. నేనంటే ఇష్టం అని తెలుసు.. కానీ ఓపెన్ కాడు.. తనకి తెలుసు నేనేంటో అంటూ కనీళ్లు పెట్టుకుంది. సిరి ఆమెను ఓదారుస్తూ.. ‘ఏడ్వకు పింకీ.. మనల్ని అంటున్నారు అంటే.. మనపై చనువు ఉంటేనే అంటారు’అంటూ తన ఆశలను రెట్టింపు చేసింది. చిక్కకుండా.. దొరక్కుండా కెప్టెన్ అయిన యానీ కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘చిక్కకు దొరకకు’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా.. కెప్టెనీ పోటీదారులైన రవి, సిరి, జెస్సీ, సన్ని, విశ్వ, యానీ మాస్టర్ వెల్క్రో జాకెట్ ధరించి ఉండాలి. మిగిలన ఇంటి సభ్యులు విసిరే బంతులను తమకు అంటుకోకుండా తప్పించుకోవాలి. బజర్ మోగే సమయానికి ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉన్న బంతులు అంటుకుని ఉంటే వాళ్లు పోటీ నుంచి తప్పుకోవాలి. విసిరిన బాల్స్ నుంచి తప్పించుకొని అందరికంటే తక్కువ బాల్స్ అంటుకున్న కంటెస్టెంట్ కెప్టెన్ అవుతారు. అలా ఈ టాస్క్‌లో చివరి వరకు ఆడి యాని మాస్టర్ హౌస్ లో కొత్త కెప్టెన్ గా నిలిచింది. హౌస్ లోకి వచ్చిన దగ్గరినుంచి యాని మాస్టర్ కెప్టెన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా అవ్వలేదు. తాజాగా కెప్టెన్ అవ్వడంతో తన చిరకాల కల నెరవేరింది అని తెలిపింది. -
లోదుస్తుల చిచ్చు.. ఇది నీ క్యారెక్టర్: సిరిపై నోరు జారిన షణ్ను
Bigg Boss Telugu 5, Episode 61: కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హీరోల టీమ్ నుంచి ఒకరిని టార్గెట్ చేసే ఛాన్స్ విలన్స్‌కు వచ్చింది. దీంతో వారు అవతలి టీమ్‌లో ప్రియాంక సింగ్‌ను సెలక్ట్ చేసుకున్నారు. ఆమెతో ఐ క్విట్ అని చెప్పించడానికి ముప్పు తిప్పలు పెట్టారు. గుడ్డు అంటే పడని పింకీ పచ్చి గుడ్డు రసాన్ని గటగటా తాగేసింది. పేడనీటితో స్నానం చేసింది. వాసన చూస్తేనే వాంతింగ్ వచ్చే మరో జ్యూస్‌ను తాగింది. ఉల్లిపాయ అంటేనే నచ్చకపోయినా టాస్క్ కోసం దాన్ని కరకరా నమిలేసింది. ఇక హెయిర్ కట్ చేసుకోమని సిరి కత్తెర ఇవ్వగా.. పింకీ ఓ క్షణమాగింది. క్యాన్సర్ పేషెంట్ల కోసం తాను జుట్టు పెంచుతున్నానని, కానీ ఇప్పుడు హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా రెడీ అని చెప్పడంతో సిరి వెనకడుగు వేసింది. అనంతరం ఎగ్, పెయింట్ కలగలిపిన ద్రవాన్ని ముఖానికి పూసుకుంది. మరెన్నో టాస్కులివ్వగా ఆమె వాటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసి తను కూడా గేమ్‌లో ఉన్నానని నిరూపించింది. నాతో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్‌గా చెప్పమని షణ్నుని అడిగింది సిరి. దానికతడు కెప్టెన్ బ్యాండ్ వెళ్లిపోయాక మాట్లాడతానని బదులివ్వగా అప్పుడు నువ్వు మాట్లాడినా నాకవసరం లేదని తేల్చేసింది సిరి. మరోపక్క షణ్ను.. ఓ వైపు జెస్సీని తన టీమ్‌లోకి లాగడానికి ప్రయత్నిస్తూనే, టాస్క్‌లో గొడవలవుతాయని, దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సిరికి సూచించాడు. తర్వాత ఎప్పటిలాగే సారీ చెప్పడమే కాక 10 గుంజీలు తీశాడు. తర్వాత అందరికీ వినబడేలా సారీ అని గట్టిగా చెప్పడంతో ఆమె అలక మాయమైపోగా వెళ్లి షణ్నుని గట్టిగా హత్తుకుంది. ఇక కాజల్ గార్డెన్ ఏరియాలో పెట్టిన బాక్స్‌కు ఉన్న తాళాలు ఓపెన్ చేయడానికి వీల్లేకుండా అందులో గోధుమపిండి నింపింది. ఈ దిక్కుమాలిన ఆలోచనలు మాకు రావా? అంటూ ఫైర్ అయింది అవతలి టీమ్‌లోని సిరి. ఇరు టీమ్‌లకు బిగ్‌బాస్ ఓ బంపరాఫర్ ఇచ్చాడు. ఒకరి టీమ్‌లోని వ్యక్తిని అవతలి టీమ్ మెంబర్‌తో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. స్వాప్ అనేది ఒక అవకాశం మాత్రమేనని, ఆదేశం కాదన్నారు విలన్స్. లేదు, చేసి తీరాల్సిందేనన్నాడు షణ్ను. ఈ క్రమంలో షణ్ను, సన్నీకి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత హీరోలు.. విలన్స్ టీమ్‌లో నుంచి యానీని టార్గెట్ చేసి ఆమెకు వరుసగా మూడు డ్రింకులు ఇచ్చారు. ఘాటు మిర్చిని తినిపించారు. పెయింట్ పూసుకునేలా చేయడమే కాక పేడ కలిపిన ఐస్ వాటర్‌తో స్నానం చేయించారు. అన్నింటినీ కంప్లీట్ చేసి యానీ అదుర్స్ అనిపించింది. అందరి ముందూ సిరిపై అరుస్తున్నావని జెస్సీ షణ్నును హెచ్చరిస్తాడు. దానికతడు.. సంచాలకుడిగా అందరి మీదా అరుస్తానని, కావాలంటే నామినేట్ చేయండి, వరస్ట్ పర్ఫామర్ ఇవ్వండని చెప్తాడు. అందరి ముందూ సిరికి సారీ చెప్పాను, గుంజీలు తీశాను, అది లెక్కలోకి రాదు కదా అని ఫైర్ అయ్యాడు. నువ్వెన్ని మాటలు అన్నా పడాలి, జెన్యున్‌గా ఆడట్లేదంటే నాకెలా ఉంటుంది? ముందు నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆడు అంటూ నిప్పులు చెరిగింది సిరి. తర్వాత విలన్లు రాక్షసావతారం ఎత్తి ఇల్లంతా చిందరవందర చేశారు. సిరి బట్టలన్నీ విసిరిపారేసింది. దీంతో రంగంలోకి దిగిన కెప్టెన్ ఇన్నర్స్ ఎందుకు బయటకు తీశావని ప్రశ్నించడంతో ఆమె ఇన్నర్స్ సర్దేయడానికి ఒప్పుకుంది. కాకపోతే తన వేళ్లు పని చేయడం లేదని, 2 నిమిషాలు ఆగమని చెప్పింది. అందుకు అంగీకరించని షణ్ను.. ఆ పని ఇప్పుడే చేసి తీరాలని ఆదేశించాడు. అతడి ఆజ్ఞతో చిర్రెత్తిపోయిన సిరి.. తీయనని తేల్చి చెప్పగా ఇది నీ క్యారెక్టర్.. అని నోరు జారాడు షణ్ను. బట్టలు తీయడానికి, క్యారెక్టర్‌కు సంబంధం లేదని మండిపడుతూనే ఏడ్చేసింది సిరి. ఈ దెబ్బల కన్నా నువ్వనే మాటలే ఎక్కువ బాధగా ఉన్నాయంటూ వెక్కివెక్కి ఏడ్చింది. ఇది చూసిన పింకీ.. ఎవడు పెట్టుకోమన్నాడు అంత గ్రీజు అని సిరిపై సెటైర్లు వేసింది. దెబ్బకు షాకైన మానస్.. పింకీ, నీకు నోటిదూల ఎక్కువగా ఉంది, నిన్న నువ్వు ఏడ్చినప్పుడు కూడా అందరూ అలాగే అనుకుంటారు. నువ్వు ఆలోచించే విధానం చాలా తప్పు అని చెప్పుకొచ్చాడు. నీకేవరైనా హాని చేయాలనుకుంటే నాశనం అయిపోవాలి అని కోరుకుంటావు, అది నీ ఆలోచనా విధానం అని చెప్పడంతో పింకీ నోరెళ్ల బెట్టింది. ఎవరి బాధను కూడా జోక్ చేయొద్దని హితవు పలికాడు మానస్. -
టార్గెట్ ప్రియాంక.. షణ్నుతో అవసరం లేదన్న సిరి
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ప్రారంభమై అప్పుడే 50 రోజులు పూర్తైపోయింది. ఇప్పటివరకు పలువురు కంటెస్టెంట్లు కెప్టెన్‌గా ఎన్నికవగా కొంతమంది కెప్టెన్సీ పోటీదారుల వరకు వచ్చి ఆగిపోయారు. అలాంటివారు ఈసారి ఎలాగైనా కెప్టెన్ అయి తీరాలని గట్టి కసి మీదున్నారు. ఈ క్రమంలో రవి టాస్క్‌లో సూపర్ హీరోస్ ఇచ్చిన అరాచకమైన టాస్కులను కూడా అతి సునాయాసంగా పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఇక శ్రీరామ్ కూడా తన శక్తి మేర ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. తాజా ప్రోమో చూస్తుంటే ఈసారి ప్రియాంక వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. సూపర్ విలన్స్ టీమ్ పింకీను టార్గెట్ చేసింది. పేడస్నానం, రంగు మీద పోసుకోవడం వంటివే కాకుండా తనకు ఇష్టం లేని జ్యూస్‌లు తాగమని ఇచ్చాడు రవి. దీంతో పింకీ ఏడుపు ముఖం పెట్టింది. కానీ ఆమె మాటలు వింటుంటే దాన్ని తాగడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేను నా కోసం ఆడుతున్నాను అన్న పింకీ మాట విన్న రవి.. దీని కోసం కదా, మీ అన్నయ్యలంతా ఎదురుచూస్తోంది అన్నాడు. ఇది విన్న మానస్.. కవర్ డ్రైవ్ అని గాలి తీసేశాడు. మరోపక్క ఈ సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ టాస్క్ సిరి, షణ్నుల మధ్య అగాధాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. నాతో నీకేదైనా ప్రాబ్లమా షణ్ను? అని సిరి అడగ్గా అతడు కెప్టెన్ బ్యాండ్ వెళ్లిపోయాక మాట్లాడతాను అని చెప్పాడు. దీనికి సిరి అప్పుడు నువ్వు మాట్లాడినా నాకవసరం లేదు అని తేల్చేసింది. ఇదిలా వుంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో విలన్స్ టీమ్ గెలిచినట్లు సమాచారం! అంటే హీరోస్ టీమ్‌లో పింకీ, శ్రీరామ్ గెలిచినప్పటికీ వాళ్ల టీమ్ ఓడిపోయింది. -
మీరు నా బేబీలు.. ఇద్దరూ చెరో ముద్దివ్వొచ్చుగా: జెస్సీ
Bigg Boss Telugu 5, Episode 60: పింకీ గురించి అందరి నోటా ఒకటే మాట.. ఆమె మానస్ ధ్యాసలో పడి గేమ్ ఆడటం లేదని! తాజాగా ఇదే మాటను సన్నీ కూడా అన్నాడు. పింకీ.. నీ జోన్లో ఉందని మానస్‌తో చెప్పుకొచ్చాడు సన్నీ. నీ ఆట నువ్వాడని ఆమెకు సలహా ఇచ్చానన్నాడు. దీనిపై మానస్ స్పందిస్తూ.. 'ఆమె ఎవరి మాటా వినదు, తాను చేయాలనుకుందే చేస్తుంది. నువ్వు చెప్పినప్పుడు కూడా సరే అన్నయ్య అంటుంది కానీ ఆ వెంటనే పోరా బచ్చాగా అని లైట్ తీసుకుంటుంది' అని చెప్పుకొచ్చాడు. అయితే పింకీ గేమ్‌ను తాను డిస్టర్బ్ చేయడం లేదన్నాడు మానస్. ఇక మెడలు పట్టేసిన జెస్సీ హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఓవైపు సిరి, మరోవైపు ప్రియాంకను కూర్చోబెట్టుకుని పులిహోర కలపడం మొదలుపెట్టాడు. 'బుగ్గలు రెండు ఒకలా మాసిపోతున్నాయి. ఇద్దరూ కలిపి ఒక ముద్దు పెడితే బాగుంటుంది' అని కోరిక వెలిబుచ్చాడు. ఇది విని షాకైన సిరి కెమెరా నుంచి కాలి వచ్చి తంతుందని సెటైర్ వేసింది. ఏంటీ ముద్దులు పెట్టరా? అని మరోసారి అడగ్గా ఇద్దరూ ససేమీరా అనడంతో వాళ్లిద్దరినీ తన బేబీలని చెప్పాడు. అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్. ఇందులో ఇంటిసభ్యులు రెండు టీములుగా విడిపోయారు. రవి, జెస్సీ, యానీ, విశ్వ, సిరి, సన్నీ నల్ల గులాబీలను ఎంచుకుని సూపర్ విలన్స్ టీమ్‌గా, ఎర్ర గులాబీలను ఎంచుకున్న మిగిలిన వారంతా సూపర్ హీరోస్ టీమ్‌గా విడిపోయారు. ఇతర టీమ్‌లోని సభ్యులతో ఐ క్విట్ అని చెప్పేలా చేయడమే గేమ్. అలా చెప్పించడం కోసం ఏమైనా చేయవచ్చు! గేమ్ స్టార్ట్ అయ్యాక హీరోస్ టీమ్‌లోని కాజల్ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ తాళాలన్నీ ఓపెన్ చేసింది. ఇది చూసిన విలన్స్ టీమ్‌లోని విశ్వ వెంటనే వచ్చి తన టీమ్‌వైపు ఉన్న డోర్ తాళాలను తెరిచి హౌస్‌లోకి పరిగెత్తాడు. దీంతో ప్రియాంక అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ విశ్వ మొదటగా స్టోర్ రూమ్‌లో అడుగుపెట్టి తాళాలు అక్కడ పెట్టేశాడు. ఈ క్రమంలో తనను నెట్టేశాడని, గట్టిగా పట్టుకున్నారంటూ పింకీ చిర్రుబుర్రులాడింది. మీరు ఫిజికల్ అయితే నేను దాని అమ్మ మొగుడినవుతానని విలన్స్ టీమ్‌కు వార్నింగ్ ఇచ్చింది. మొదటి రౌండ్లో విలన్స్‌కు ఛాన్స్ రాగా వాళ్లు హీరోల టీమ్ నుంచి శ్రీరామ్‌ను సెలక్ట్ చేశారు. అతడికి పెయింట్ నెత్తిన పూసుకోవడం, విచిత్ర జ్యూస్‌లు తాగడం వంటి టాస్క్లిచ్చారు. అన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయడంతో హీరోల టీమ్‌కు ఒక పాయింట్ లభించినట్లైంది. తర్వాతి రౌండ్లో పింకీ తనను తోసిందని సిరి ఆరోపించింది. తనను అందరూ చుట్టుముట్టేస్తే తోయకుండా ఏం చేయాలంది పింకీ. ఈ ఇద్దరి వాదనలు విన్న షణ్ను.. పింకీ, సిరి ఇద్దరిదీ తప్పేనంటూ పెదరాయుడిలా తీర్పునిచ్చాడు. తర్వాతి రౌండ్లో హీరోలు.. విలన్స్ టీమ్‌లోని రవిని టార్గెట్ చేశారు. రవి తన బట్టలన్నింటికీ పేడ అంటించాలని చెప్పాడు షణ్ను. కానీ జాలేసి కేవలం ధరించిన బట్టలకు మాత్రమే పేడ అంటిస్తే సరిపోతుందన్నారు. తర్వాత అన్ని మిక్స్ చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పారు. ఆ వెంటనే స్క్వాడ్స్ చేయాలన్నారు. అయితే రవి దేనికీ జంకకుండా, వెనకడుగు వేయకుండా, తన వెన్నునొప్పిని సైతం పక్కనపెట్టి వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు రవి. మరోసారి జ్యూస్ ఇవ్వగా దాన్ని కూడా గడగడా తాగేశాడు. అయితే అతడికి బ్యాక్ ప్రాబ్లమ్ ఉందని తెలిసినా కూడా అలాంటి కష్టమైన టాస్కులు ఎలా ఇస్తారని ఫైర్ అయింది యానీ. ఇవన్నీ గుర్తుపెట్టుకుని తిరిగి మీకే ఇస్తానని చెప్పింది. అయినప్పటికీ లెక్క చేయని విలన్లు అతడితో గుండ్రంగా తిరగమని చెప్పారు. ఆ వెంటనే మరో జ్యూస్ గ్లాస్‌ను సైతం గడగడా తాగాడు. అయినప్పటికీ వారూ మరో డ్రింక్‌ను తాగమని పురమాయించగా అతడు బాగోలేదంటూనే కళ్లు మూసుకుని తాగాడు. తన టీమ్‌ను గెలిపించడం కోసం సాయశక్తులా పోరాడి అందరి మన్ననలు పొందాడు -
బిగ్‌బాస్: యానీ మాస్టర్‌కు స్పెషల్ పవర్.. సేఫ్ అయ్యేది ఎవరు?
బిగ్‌బాస్ ఇంట్లో తొమ్మిదోవారంలో 10 మంది నామినేషన్లో ఉన్నారు. కెప్టెన్ షణ్ముఖ్ మినహా.. ఇంటి సభ్యులంతా నామినేషన్లోకి వచ్చేశారు. అయితే ఆ 10 మంది నుంచి కొంతమందిని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. దీని కోసం ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఏ సభ్యుడైతే తమ ఫోటో కాకుండా.. మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగులు తీసుకొని గార్డెన్ ఏరియాలోని సేఫ్ జోన్ డోర్‌లోకి ముందుగా వెళతారో వారు సేఫ్ అవుతారు... చివరగా వెళ్లేవారితో పాటు.. వారి చేతిలో ఎవరి బ్యాగు ఉందో ఇద్దరు డేంజర్లోకి వెళ్తారు. దీంతో పాటు ఇంటి సభ్యులకు మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు బిగ్‌బాస్. గతవారం ఓ టాస్క్‌లో విజయం పొందిన యానీ మాస్టర్‌కు బిగ్‌బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ స్పెషల్ పవర్ ద్వారా ఒక కంటెస్టెంట్‌ను సేఫ్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. మరి ఆ స్పెషల్ పవర్ ద్వారా సేఫ్ అయ్యేది ఎవరో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బ్రహ్మ కాకుండా నామినేషన్లో ఉన్నది ఎవరంటే?
Bigg Boss Telugu 5 Promo, 9th Week Nominations: బిగ్‌బాస్ హౌస్ కంటెస్టెంట్ల కోపతాపాలతో భగ్గున మండుతోంది. అసలే నామినేషన్స్ డే. వారిని కూల్ చేయడం బిగ్‌బాస్ వల్ల కూడా కాదు. ఫైర్ మీదున్న హౌస్మేట్స్ మాస్క్ తీసి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రవి- మానస్‌కు, శ్రీరామ్- కాజల్‌కు, శ్రీరామ్- మానస్‌కు మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. 'నీ ఇంటి పేరు పొగరా? నీ ఇంటిపేరు పొగరుబోతా?' అని కాజల్‌ను ప్రశ్నించాడు శ్రీరామ్. దీనికి కాజల్ స్పందిస్తూ.. నీ రియాక్షన్సే నచ్చడం లేదంటూ నామినేట్ చేసింది. తర్వాత రవిని నామినేట్ చేస్తూ.. నిన్ను ఎదగకుండా ఆపడానికి ట్రై చేయలేదని.. తనే కాదు, హౌస్‌లో ఎవరూ ఆ పని చేయలేరని చెప్పింది. ఇక పింకీ వంతు రాగా రవి అన్న కంటే ఎవరూ బాగా ఆలోచించలేరంటూ నామినేట్ చేసింది. 'ప్రియాంక నీ గేమ్ నువ్వే ఆడు, వేరే గేమ్ ఆడొద్దు' అంటూ నామినేట్ చేశాడు షణ్ను. ఇలా అనేసి నామినేట్ చేసి బయటకు పంపించాక నా గేమ్ ఇంకెవరు ఆడతారు? అని ఫైర్ అయింది పింకీ. అతడు ఫోమ్ పూస్తుంటే అతడిని ఏమీ చేయలేక ఆ ప్లేటును గట్టిగా ముఖానికి కొట్టుకుంది. నువ్వు వెళ్లిపోతే నాకు ఫరాఖ్ పడదని శ్రీరామ్‌ను నామినేట్ చేశాడు మానస్. నువ్వు ఉన్నా కూడా నాకు ఫరాఖ్ పడదని రివర్స్ కౌంటరిచ్చాడు రామ్. ఇక ఈ 9వ వారం నామినేషన్లో కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మిగతా అందరూ నామినేట్ అయ్యారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే యానీ గత ఆదివారం సంపాదించిన స్పెషల్ పవర్‌తో నామినేషన్ నుంచి బయటపడుతుందా? లేదా ఆ పవర్‌ను ఇప్పుడెందుకులే! అని భద్రంగా దాచిపెట్టుకుంటుందా? అన్నది చూడాలి! -
అయ్యో పింకీ, మానస్ కోసం పరితపించిపోతుందిగా!
ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఏడుగురు ఎలిమినేట్ అవగా అందులో ఆరుగురు అమ్మాయిలే కావడం గమనార్హం. ప్రస్తుతం హౌస్‌లో లేడీ కంటెస్టెంట్లు యానీ మాస్టర్, ప్రియాంక సింగ్, కాజల్, సిరి మాత్రమే మిగిలారు. వీళ్లలో యానీ మాస్టర్ ప్రతివారం తనకు స్ట్రాంగ్ అనిపించినవాళ్లను నామినేట్ చేస్తూ వస్తోంది. ఆటలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇక కాజల్.. మాటకు ముందూవెనకా స్ట్రాటజీ అనే పదం తీయకుండా ఉండదు. ఆటలోనూ స్ట్రాటజీ ప్లే చేశానని చెప్తూ ఉంటుంది. సిరి.. షణ్ముఖ్‌తో దోస్తీతో బాగానే స్క్రీన్ స్పేస్ దక్కించుకుంటోంది. అలాగే ఆటలోనూ మిగతావారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. మిగిలిందల్లా ప్రియాంక సింగ్.. జీవితాన్ని కాచి వడబోసింది. ఇంటాబయట ఎన్నో సమస్యలను ఎదుర్కొని, వాటన్నింటినీ సమర్థవంతంగా దాటుకుని ఇక్కడిదాకా వచ్చింది. తన జీవితం ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు మార్గదర్శకంలాంటిది. కానీ ఆమె బిగ్‌బాస్ షోను సరిగా వినియోగించుకోలేకపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిగ్‌బాస్ షోలో ఆమె గురి.. ట్రోఫీ, టాప్ 5పై కాకుండా కేవలం మానస్ మీదే ఉంది. ఎంతసేపూ అతడి కోసమే ఆలోచిస్తూ, అతడి గురించే కబుర్లు చెప్తూ, అతడిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆ మధ్య ఓ టాస్క్‌లో మానస్‌ను పెళ్లాడేసి గాల్లో తేలిపోయింది. రానురానూ ఆమెకు మానస్ మీదే ప్రేమ పెరుగుతుందే తప్ప రవ్వంతైనా తగ్గడం లేదు. ఇది ఆమె గేమ్‌ను దెబ్బ తీస్తోంది. గేమ్‌ల మీద పెద్దగా దృష్టి సారించలేకపోతుంది. మొన్నామధ్య బంగారు కోడిపెట్ట టాస్కులోనూ మానస్ గుడ్లకు రక్షణగా ఉంటూ తన గేమ్ పక్కనపెట్టేసింది. రంగు పడుద్ది టాస్కులోనూ ప్రియాంక గెలుస్తుందని అంతా అనుకుంటే అనూహ్యంగా యానీ విజయాన్ని అందుకుంది. ఇక మానస్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతడికి కుంకుమ పెట్టడం, రెప్ప వాల్చకుండా అతడినే చూస్తూ తనను తాను మైమరిచిపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పింకీ మరోసారి మానస్ మీద ప్రేమను చాటుకుంది. బిగ్‌బాస్ అన్‌సీన్ వీడియోలో హౌస్మేట్స్ ఆరుబయట నిద్రించారు. తెల్లవారుతుండే సమయంలో మెలకువ వచ్చిన పింకీ మానస్‌కు ఎండ తగులుతోందని గ్రహించింది. వెంటనే అక్కడున్న దిండును అడ్డుపెట్టి ముఖానికి ఎంత తగలనీయకుండా జాగ్రత్త పడింది. తరువాత స్కార్ఫ్లాంటిది ఒకటి పట్టుకుని ఎండ నుంచి రక్షిస్తూ అక్కడే కూర్చుంది. అయితే ఇలా ఎంతసేపు ఉండాలో, ఏమో అనుకుందో ఏమో కానీ వెంటనే బట్టలు ఆరేసుకోవడానికి వినియోగించే స్టాండ్‌ను తీసుకొచ్చి మానస్ కాళ్ల దగ్గర పెట్టింది. అప్పుడుకానీ అతడికి ఎండ తగలట్లేదని అర్థమైన పింకీ హమ్మయ్య అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కేరింగ్ చూసిన నెటిజన్లు కొందరు పాపం పింకీ, ఎంతలా ప్రేమిస్తుందో అని కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం.. 'మానస్‌ను వదిలేయ్, తన గేమ్ తనను ఆడనివ్వు', 'ఈమె మానస్ కోసమే బిగ్‌బాస్‌కు వచ్చిందా?' అంటూ ఫైర్ అవుతున్నారు. -
Bigg Boss 5 Telugu: ప్రియాంక.. ముద్దుల బావలు వీళ్లే
బిగ్‌బాస్-5లో ట్రాన్స్ జెండర్ కంటెస్టెంట్‌గా పరిచయం అయినా ప్రియాంక... తన అంద చందాలతో బిగ్ బాస్ హౌస్‌లోనే గ్లామర్ బ్యూటీగా అవతరించిన ప్రియాంక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. మానస్‌తో ఆమె నడిపే లవ్‌ట్రాక్.. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వారిద్దరిపై మిగతా సభ్యులు వేసే పంచ్‌లు, జోకులు బాగా పేలుతున్నాయి. తాజా ఎపిసోడ్లో ప్రియాంక పెద్దబావ, చిన్నబావ, బుల్లిబావల విషయంలో రవి, లోబోల మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు పూయించాయి. శ్రీరామ్‌ను పెద్ద బావ, మానస్‌ను చిన్నబావ అని, జెస్సీని బుల్లి బావ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. పెద్ద బావ ఒప్పుకోవడం లేదన్న.. కట్నం కావాలని అంటున్నాడు అన్నయ్య అంటూ యాంకర్ రవితో అంటే.. రెండో అన్నయను అడుగు అంటూ లోబో వద్దకు పంపించాడు రవి. లోబో మాట్లాడుతూ పింకికి బుల్లి బావ ఎవరు అనగా.. జెస్సీ అని రవి సమాధానం ఇచ్చాడు. అయితే వాడు కూడా క్యారెక్టర్లో ఉన్నాడా అంటూ లోబో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో జెస్పీ గాడికి నేనంటే చాలా ఇష్టం అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. ‘నీ మాట వినని పెద్దబావ కాళ్లూచేతులు తీసేస్తాను’లోబో అంటే ‘అయ్యయ్యో అలా చేయవద్దు అన్నయ్య’అని ప్రియాంక రిక్వెస్ట్ చేసింది. చిన్నబావ అన్ని విషయాల్లోనూ అడ్జెస్ట్ అవుతాడు.. వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాఅని లోబో చెప్పాడు. ‘నీకు కూడా అతడే కదమ్మా కావాల్సింది’అని రవి కౌంటర్ ఇవ్వడం నవ్వులు పూయించింది. (చదవండి: బిగ్‌బాస్: ఎట్టకేలకు గెలిచిన షణ్ముఖ్.. చెమటలు కక్కిన శ్రీరామ్) -
బిగ్‌బాస్-5: టాప్ 5లో నేను, మానస్ ఉంటాం.. ప్రియాంక జోస్యం
నామినేషన్ ప్రక్రియ ముగియడంతో కంటెస్టెంట్స్ అంతా ఎప్పటిమాదిరే కలిసిపోయారు. కోపాలు, గొడవలను దూరంపెట్టి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. నేను మానస్ టాప్ 5లో ఉంటామని ప్రియాంక చెప్పగా... దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించింది. ఇక మానస్ అయితే.. అంకుల్స్ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆంటీలను బయటకు పోవాలని చెబితే.. పింకీ వెళ్తుందని సిరి నవ్వుతూ కౌంటర్ వేయగా.. మొహం పగిలిపోద్దని ప్రియాంక ఫన్నీ వార్నింగ్ ఇచ్చింది. ఇక రవి ఏమో ఎప్పటిమాదిరే.. ఇతరులను ఇన్ఫ్లూయన్స్ చేసే పనిలో పడ్డాడు. షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ చెప్పాడు. ఆ తరువాత శ్రీరామ్ 'దుర్యోధనా..' అంటూ రవిని ఆటపట్టించాడు. మరోవైపు గతవారం నామినేషన్ ప్రక్రియలో జరిగిన సంఘటలను ఇమిటేట్ చేసి చూపించారు మానస్ అండ్ సన్నీ. టవల్ రీజన్‌తో ప్రియ రవిని నామినేట్ చేసిన ఘటనను ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయించారు. రవి ఏమో.. పింకీని ఇమినేట్ చూపించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులంతా కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన ‘అభయహస్తం’అనే టాస్క్‌ని ఆడినట్లు ప్రోమోలో చూపించారు. -
నా కొడుకు నాకు పుట్టలేదు, నీ బాధ అర్థం చేసుకోగలను: సిరి
Bigg Boss Telugu 5, Episode 51: రవి లోబోకు చాలా సపోర్ట్ చేస్తాడు, కానీ అతడు మాత్రం రవికి సపోర్ట్ చేయడు, ఫ్రెండంటాడు, కానీ పదేపదే నామినేట్ చేస్తాడు అని పింకీతో చెప్పుకొచ్చింది యానీ మాస్టర్. ఇంతలో లోబో నమాజ్ చేసుకుంటూ ఏడ్చేశాడు. దీంతో రవి అతడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అడుగుపెట్టి 50 రోజులు పూర్తయిందన్న బిగ్‌బాస్.. మీకు ఎంతో ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరించాడు. కానీ.. ఏదైనా దక్కించుకోవాలంటే ఇంకేదైనా వదులుకోవాల్సి వస్తుందని నామినేషన్ గురించి హింటిచ్చాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటిసభ్యులను పవర్ రూమ్‌కు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్‌లోని రెండు లేఖల్లో ఒక్కరికి మాత్రమే లేఖ ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుంది. లెటర్ అందుకోలేనివాళ్లు నామినేట్ అయినట్లు లెక్క! నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు మొదటగా పవర్ రూమ్‌లోకి వెళ్లిన మానస్, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో మాట్లాడుతూ.. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందంటూనే పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయాడు. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి. అయితే విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. 'నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను' అంటూ విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది. ఏడ్చేసిన శ్రీరామ్, ఓదార్చుతూ ముద్దులు పెట్టిన పింకీ తర్వాత పింకీ- కాజల్‌కు యానీ మాస్టర్, మానస్‌ల లేఖలు అందాయి. యానీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు. కానీ పింకీ మాత్రం మానస్ లెటర్ ముక్కలవుతున్నందుకు ఎంతగానో బాధపడిపోయింది. విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. అయితే పెద్ద మనసు చేసుకున్న శ్రీరామ్.. రవి కోసం తన లెటర్‌ను వదులుకునేందుకు సిద్ధపడిపోయాడు. కానీ లోబో మాత్రం రవి తన ఫ్యామిలీని గుర్తు చేసుకునేందుకు బొమ్మ, టీ షర్ట్, లెటర్ ఉన్నాయి కాబట్టి శ్రీరామ్‌కే లెటర్ ఇవ్వాలన్నాడు, ఇందుకోసం రవిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. దీంతో రవి తన లెటర్‌ను చింపివేసి శ్రీరామ్‌కు వచ్చిన లేఖను చదివి వినిపించాడు. తర్వాత కాసేపటికి ఆ లేఖను పట్టుకుని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ ఇల్లు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన పింకీ అతడి కన్నీళ్లు తుడిచి, హగ్గిచ్చి, బుగ్గపై ముద్దులు పెట్టింది. అమ్మా, నువ్వే నా ఇన్స్పిరేషన్: షణ్ముఖ్ తర్వాత యానీ- సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. దీంతో మొదటిసారి కాజల్ తన కన్నీళ్లు ఆపుకోలేక గక్క్క పెట్టి ఏడ్చేసింది. ఇది చూసి కరిగిపోయిన షణ్ను కాజల్‌ను లెటర్ తీసుకోమన్నాడు. అయితే సిరి మాత్రం 'నేనెలాగో అందుకోలేకపోయాను, కనీసం నువ్వైనా తీసుకో' అంటూ ఏడ్చేసింది. కానీ షణ్ను అందుకు ఒప్పుకోకపోవడంతో అతడి లేఖ తునాతునకలైంది. ఇది చూసి దుఃఖాన్ని దిగమింగుకున్న షణ్ను.. 'అమ్మా, క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్స్పిరేషన్, నేను ఈ బాధలో నుంచి బయటపడతాను' అని చెప్పుకొచ్చాడు. కానీ లోపలకు వెళ్లి గుండెలోని భారాన్ని దించుకుంటూ గట్టిగా ఏడ్చేశాడు. జెస్సీ కోసం త్యాగానికి పూనుకున్న శ్రీరామ్.. ఇక కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. దీని ద్వారా జెస్సీ లెటర్‌ను సన్నీ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. జెస్సీకి లెటర్ ఇచ్చి సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ అయినవాళ్ల దగ్గరి నుంచి లేఖ అందుకోవాలని చెప్పాడు. దీంతో శ్రీరామ్.. జెస్సీ కోసం తన లేఖను త్యాగం చేసి నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. కానీ షణ్ను, సిరి, జెస్సీ.. శ్రీరామ్‌కు హగ్గిచ్చి దూరాన్ని చెరిపేసుకోవాలని రవి కండీషన్ పెట్టాడు. ఈ కండీషన్‌కు త్రిమూర్తులు ఒప్పుకోకపోగా మా మధ్య డిస్టబెన్స్ అంతా క్లియర్ అయిపోయిందని చెప్పడంతో రవి వెనక్కు తగ్గాడు. అలా శ్రీరామ్ నామినేషన్లోకి వెళ్లి జెస్సీని సేవ్ చేశాడు. తర్వాత కెప్టెన్ సన్నీకి లేఖ అందడంతో ఆనందంలో మునిగి తేలాడు. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తవగా రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్ నామినేట్ అయ్యారు. -
దీప్తి సునయనకు ఆ మాట చెప్తానన్న ప్రియ, దండం పెట్టిన షణ్ముఖ్
Bigg Boss 5 Telugu, 7th Week Priya Eliminated: కొన్నిసార్లు చిన్నచిన్న పొరపాట్లు కూడా పెద్ద దెబ్బ తీస్తాయి. నటి ప్రియ విషయంలో అదే జరిగింది. ఓటింగ్‌లో టాప్‌లో ఉండే ఆమె ఈ వారం ఎలిమినేట్ అవడం నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే! కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సన్నీతో పెట్టుకున్న కయ్యమే ఆమె కొంప ముంచింది. చెంప పగలగొడతానని తిట్టడం, సన్నీని టార్గెట్ చేసి రెచ్చగొట్టడం చాలామందికి నచ్చలేదు. అప్పటివరకు ఆమెకు సపోర్ట్‌గా ఉన్నవాళ్లు కూడా ఆమె ప్రవర్తన చూసి సడన్‌గా మిగతావాళ్లకు ఓటేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ గొడవ ఆమె ఎలిమినేషన్‌కు కారణమైంది. ఫలితంగా మరికొద్ది రోజులు హౌస్‌లో కొనసాగేందుకు ఆస్కారం ఉన్న ప్రియ ఏడోవారంలోనే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ ఉండాలి ఎలిమినేషన్ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ప్రియతో గేమ్ ఆడించాడు నాగ్. హౌస్‌మేట్స్‌కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ.. అతడు తనకు అర్థం కాడంటూ ఐదు మార్కులిచ్చింది. ఎవరూ హర్ట్ అవ్వకుండా, నువ్వు హర్ట్ కాకుండా గేమ్ ఆడంటూ విశ్వకు కూడా 5 మార్కులిచ్చింది. బాగా ఆడుతున్నాడంటూ రవికి 7 మార్కులు వేసింది. షణ్ముఖ్‌కు ఎనిమిదిన్నర మార్కులేస్తూ ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ ఉండాలంది. షణ్ను వండర్ఫుల్ పర్సన్ అని, అతడు బ్రెయిన్‌తో గేమ్ ఆడుతున్నాడని మెచ్చుకుంది. ఆమెను చూడటంతోనే రోజు స్టార్ట్ చేస్తాను: ప్రియ సిరికి కూడా ఎనిమిదిన్నర మార్కులిచ్చింది. రాత్రి పడుకునేటప్పుడు సిరి త్వరగా తన దగ్గరకు రాదని ఆరోపించింది. శ్రీరామ్ తనకు ఎక్కువ కనెక్ట్ అవలేదంటూనే 8 మార్కులేసింది. బయటకొచ్చాక పాట నేర్పిస్తానన్న విషయం గుర్తు చేయడంతో అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడో పాట పాడమని కోరాడు నాగ్. దీంతో శ్రీరామ్.. 'ఎందుకంటే ప్రేమంట' సినిమాలోని 'నీ చూపులే..' పాటందుకుని అక్కడున్న అందరినీ కొద్ది క్షణాలపాటు మరో ప్రపంచానికి తీసుకెళ్లాడు. తర్వాత ప్రియ.. తనకు ఎంతగానో క్లోజ్ అయిన ప్రియాంకకు పదికి 100 మార్కులు ఇచ్చేసింది. పొద్దున లేవగానే పింకీని చూస్తానని, ఆమెను చూడకుండా నిద్ర లేచిన రోజు ఏదో ఒక గొడవ జరుగుతుందని చెప్పుకొచ్చింది. నా గర్ల్‌ఫ్రెండ్‌కు అలా చెప్పొద్దు: దండం పెట్టిన షణ్ను జీవితంలో ఎన్నో చూశారు, కానీ అందరినీ నమ్మేస్తారంటూ యానీకి 10, బాగా ఆడుతున్నాడంటూ జెస్సీకి 8 మార్కులేసింది. నీ గర్ల్‌ఫ్రెండ్ దీప్తికి ఏమైనా చెప్పాలా? అని ప్రియ అడగ్గా ఆ మాట చాలంటూ సంతోషించాడు షణ్ను. అయితే దీప్తిని మర్చిపోయి హాయిగా ఉంటున్నావని ఆమెకు చెప్తానని ప్రియ ఉడికించడంతో వణికిపోయాడు షణ్ను. అలా చెప్పొద్దంటూ దండం పెట్టేశాడు. మా ఇంట్లో కూడా భయపడను, కానీ ఆ అమ్మాయికి భయపడతానన్నాడు. మానస్ బంగారుకొండ, ఆ హక్కు సన్నీకే ఉంది ముందు బాగా ఆడావు, కానీ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావో, ఏ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నావనేది ముందే పసిగడుతున్నాం, అది జరగకుండా చూస్కో అంటూ కాజల్‌కు 7 మార్కులేసింది ప్రియ. మానస్.. బంగారుకొండ అంటూ అతడికి 10 మార్క్స్ వేసింది. చిన్న వయసులోనే అతడికి చాలా మెచ్యూరిటీ ఉందని మెచ్చుకుంది. చివరగా సన్నీకి 9 మార్కులేస్తూ నా ప్లేటులో తినే రైట్, నా కప్పులో తాగే హక్కు నీకు మాత్రమే ఉందని చెప్పి వీడ్కోలు తీసుకుంది. -
ప్రియ అవుట్, కన్నీరుమున్నీరుగా విలపించిన ప్రియాంక
Bigg Boss 5 Telugu, Priya Eliminated: బిగ్‌బాస్ షోలో స్టేజీమీదకు వచ్చీరావడంతోనే నాగార్జున ఇంటిసభ్యులతో గేమ్స్ ఆడించేందుకు రెడీ అయ్యాడు. కాకపోతే ఈసారి కాస్త డిఫరెంట్‌గా గేమ్‌లో గెలిచినవారికి బిగ్‌బాస్ షీల్డ్‌తో పాటు ఓ స్పెషల్ పవర్ దక్కుతుందన్నాడు. ఇక ఈ గేమ్‌లో కొన్ని లెవల్స్ ఉంటాయని చెప్పాడు. ఫస్ట్ రౌండ్లో 'పట్టుకోండి చూద్దాం' గేమ్ ఆడించాడు. ఇందులో గుండ్రటి వలయంలో ఉన్న పిల్లోస్‌ను ఇంటిసభ్యులు దక్కించుకుని కాపాడుకోవాలి. ఈ గేమ్‌లో పిల్లో సాధించలేకపోయిన సిరి.. షణ్ను దగ్గరున్న దిండు ఇవ్వమని బతిమాలుకుంది. దొరికిందే ఛాన్స్ అనుకున్న షణ్ను.. ఆమెతో 10 సార్లు సారీ చెప్పించుకుని పిల్లో త్యాగం చేసేశాడు. చివరగా ఈ ఆటలో షణ్ను, కాజల్ ఓడిపోయారు. నీళ్లు-కన్నీళ్లు.. ఓడిపోయిన రవి, లోబో రెండో రౌండ్లో 'చలనచిత్ర వీర' గేమ్ ఆడించాడు. ఇందులో నాగ్ అడిగే సినిమా ప్రశ్నలకు ముందుగా బెల్ కొట్టి సమాధానాలు చెప్పిన వారు తర్వాతి రౌండ్‌కు అర్హులవుతారు. ఇందులో తప్పు సమాధానాలు చెప్పి జెస్సీ, ప్రియాంక, మానస్ అనర్హులవగా మిగిలినవారు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లారు. మూడో రౌండ్లో నాగ్ 'నీళ్లు-కన్నీళ్లు' గేమ్ ఆడించాడు. ఇందులో కంటెస్టెంట్లు జగ్గులు పట్టుకుని స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లను వారి క్యాన్‌లో నింపాలి. ఈ రౌండ్లో రవి, లోబో ఎలిమినేట్ అయ్యారు. అనంతరం నాగ్.. లోబో సేఫ్ అయినట్లు ప్రకటించాడు. అందరినీ బొమ్మలు చేసి ఆడించే రవి సేవ్ నాలుగో రౌండ్లో యానీ, విశ్వ, శ్రీరామ్, సన్నీ, సిరి మ్యూజికల్ చెయిర్ ఆడారు. ఇందులో సిరి, సన్నీ అవుట్ అయ్యారు. ఐదో రౌండ్ 'పట్టుపట్టు రంగే పట్టు' గేమ్‌లో నాగ్ ఏ కలర్ చెప్తే ఆ కలర్లో ఉన్న వస్తువులను హౌస్‌లో నుంచి తీసుకురావాలి. ఈ గేమ్‌లో శ్రీరామ్ అవుట్ అయ్యాడు. ఆటల పోటీలో మిగిలిన ఇద్దరిలో విశ్వకు రవి, లోబో, కాజల్, శ్రీరామ్ సపోర్ట్ చేయగా యానీకి మిగిలినవారంతా మద్దతు తెలిపారు. ఇందులో అవతలి టీమ్ విశ్వ టోపీని ముందుగా పడగొట్టడంతో అతడు ఓడిపోగా యానీ గెలిచింది. దీంతో ఆమెకు పవర్ ఉన్న బిగ్‌బాస్ షీల్డ్ దక్కింది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు నాగ్. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో మిమ్మల్ని అందరినీ బొమ్మలు చేసి ఆడించే రవి సేవ్ అయ్యాడని తెలిపాడు. అందరికీ గుడ్‌బై చెప్పిన యానీ, ప్రియ నామినేషన్స్‌లో మిగిలిన ఇద్దరు ప్రియ, యానీలను హౌస్‌మేట్స్‌కు గుడ్‌బై చెప్పమని ఆదేశించాడు నాగ్. దీంతో ఎవరికి వారు తమ ఎలిమినేషన్ ఖాయం అనుకుంటూ అందరికీ భారంగా వీడ్కోలు చెప్పారు. అనంతరం ఇద్దరూ గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్సుల్లోకి వెళ్లారు. కాసేపటికి బాక్సు తెరిచి చూడొచ్చని నాగ్ చెప్పగా ఇంటిసభ్యులు ఎంతో ఆతృతగా వాటిని ఓపెన్ చేశారు. కానీ రెండు బాక్సుల్లోని ఇద్దరూ మాయం అవడంతో అందరూ ఖంగు తిన్నారు. ఇద్దరూ ఎలిమినేట్ అవుతారేమోనని నాగ్ అనడంతో మరింత ఆందోళన చెందారు. గుక్క పెట్టి ఏడ్చిన పింకీ, ఓదార్చిన మానస్ ప్రియ వెళ్లిపోతుందేమోనని గాబరా చెందిన పింకీ గుక్కపెట్టి ఏడ్చేయగా మానస్ ఆమెను ఓదారచ్చడానికి ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ పింకీ అతడి భుజంపై వాలిపోయి ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. మరోవైపు యానీ హౌస్‌లోకి రావడంతో సన్నీ ఆమెను గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. కానీ పింకీ మాత్రం రోదిస్తూనే ఉండగా ఆమెను ఓదార్చడం మానస్ వల్ల కూడా కాలేదు. ఇక స్టేజీ మీదకు వచ్చిన ప్రియ బిగ్‌బాస్ ద్వారా ప్రపంచంలో ఏ మూలనైనా బతికేయడం నేర్చుకున్నానంది. -
ప్రియాంకతో మానస్ పెళ్లి, టెన్షన్లో యానీ!
Bigg Boss Telugu 5, Episode 49: వీజే సన్నీ.. కాజల్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకున్నాడు. తన కెప్టెన్సీని గతవారం ఎలిమినేట్ అయిన సెట్ శ్వేతకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు 'సరైన మ్యాచ్‌ను వెతకండి' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా హౌస్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాల్సి ఉంటుంది. ముందుగా శ్రీరామ్.. తనను పెళ్లాడే అమ్మాయి బబ్లీగా, దేన్నైనా అల్లుకుపోయేలా ఉండాలన్నాడు. సన్నీ.. నమ్మకం, నిజాయితీ, అర్థం చేసుకునే స్వభావం తనకు కాబోయే అమ్మాయిలో తప్పకుండా ఉండాలన్నాడు. ఎంతో కేరింగ్ చూపించే పింకీలాంటి అమ్మాయిని ఎవరు చేసుకున్నా అదృష్టవంతులేనని చెప్పుకొచ్చాడు. నా గర్ల్‌ఫ్రెండ్ నన్నే చూడాలి: షణ్ముఖ్ మానస్ తను చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తూ.. 'నేను ఎక్కువ అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి' అని తెలిపాడు. అతడు మాట్లాడుతున్నంత సేపు ప్రియాంక తెగ సిగ్గుపడిపోవడం గమనార్హం. పింకీ వంతు వచ్చేసరికి.. 'అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్ ఉండాలి. మంచివాడై ఉండాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ల ఫ్యామిలీని నా ఫ్యామిలీలా చూసుకుంటాను, నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది, అది అతడికి ఇచ్చేస్తాను' అని చెప్పుకొచ్చింది. నా గర్ల్‌ఫ్రెండ్ నన్నే చూడాలి, ఇంకెవర్నీ చూడొద్దని షణ్ముఖ్. నా దగ్గర పొగరు చూపించొద్దని సిరి వారి అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. జెస్సీ మినహా మిగతా అందరూ పింకీ-మానస్‌ను బెస్ట్ కపుల్‌గా పేర్కొన్నారు. దీంతో బిగ్‌బాస్ వారిద్దరూ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ 'గువ్వా గోరికంతో..' పాటకు జంటగా స్టెప్పులేశారు. రవి గేమ్ ఆడట్లేదు, మనతో ఆడుతున్నాడు అయితే పింకీ మానస్ ధ్యాసలో పడి తన గేమ్ కూడా పట్టించుకోవట్లేదని భయపడిపోయింది యానీ. దీంతో రవి.. నాకు మానస్ మదర్ కూడా తెలుసు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో 'బంగారు కోడిపెట్ట' టాస్క్‌లో సిరి స్టిక్కర్లు తానే తీశానని సీక్రెట్ బయటపెట్టాడు. దీంతో ప్రియ ఈ విషయాన్ని సిరి చెవిలో ఊదింది. కానీ తాను చెప్పానని మాత్రం ఎవరికీ చెప్పొద్దని సిరితో ఒట్టేయించుకుంది. ఇదిలా వుంటే రవి గేమ్ ఆడటానికి ప్రయత్నించట్లేదని, మనతో ఆడటానికి ట్రై చేస్తున్నాడని కాజల్‌తో గుసగుసలాడాడు షణ్ను. శ్రీరామ్ కూడా రవికి లొంగిపోయాడని, లోబో, విశ్వ రవి కోసమే ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. మరోపక్క రవి.. తానే స్టిక్కర్లు తీశానని నేరుగా సిరితో చెప్పేశాడు. అడ్డంగా దొరికిపోయిన రవి, ఏకిపారేసిన నాగ్ నాగార్జున.. ఈవారం వరస్ట్ పర్ఫామర్ ఎవరో చెప్పమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. రేషన్ మేనేజర్‌గా ప్రియాంక సింగ్ ఫెయిలైందని రవి ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నాగ్.. సిరి స్టిక్కర్లు దొంగతనం చేయడం సరైందే కానీ అమ్మతోడు ఎందుకు వేశావని రవిని నిలదీశాడు. దీంతో అడ్డంగా దొరికిపోయిన రవి.. అది తప్పేనని ఒప్పుకుంటూనే కావాలని చేయలేదని బుకాయించాడు. తర్వాత షణ్ముఖ్.. సిరిని వరస్ట్ పర్ఫామర్ అని తెలిపాడు. సిరి.. కాజల్‌ను, విశ్వ.. టాస్క్‌ల్లో జీరో అంటూ ప్రియాంకను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. ప్రియాంక, జెస్సీ, ప్రియ.. విశ్వను వరస్ట్ పర్ఫామర్‌గా పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెంప పగలగొడతావు?: నాగ్ చెంప పగలగొడతాను అని ఎన్నిసార్లు అంటావని ప్రియను నిలదీశాడు నాగ్. దీనికి వివరణ ఇచ్చేందుకు ప్రియ ప్రయత్నిస్తూ.. 'బుట్టలో ఎగ్స్ తీయబోతుంటే సన్నీ నన్ను నెట్టేయగా ముందుకు పడిపోయాను. అతడు నానా మాటలు అనడంతో నాతో ఫిజికల్ అయితే మాత్రం చెంప పగలగొడతాను అని తిట్టాను' అని ఒప్పుకుంది. మరీ అన్నిసార్లు తిట్టకని సుతిమెత్తగా హెచ్చరించాడు నాగ్. తర్వాత యానీ మాస్టర్.. జెస్సీని, శ్రీరామ్.. మానస్‌ను, కాజల్.. ప్రియను, మానస్.. షణ్ముఖ్‌ను వరస్ట్ పర్ఫామర్‌గా చెప్పుకొచ్చారు. చెత్త ఆటగాడిగా ఎంపికైన విశ్వ ఇక బంగారు కోడిపెట్ట టాస్క్‌లో సన్నీ గ్రూప్ సహాయం తీసుకుని ఆడినందుకు కెప్టెన్సీ రద్దైందని ప్రకటించి చిన్న ఝలుక్ ఇచ్చాడు నాగ్. ఇండివిడ్యువల్ టాస్క్ అని రాసి ఉన్నా కూడా సన్నీ- కాజల్, మానస్- ప్రియాంక కలిసి ఆడారని, దానివల్ల తాను కెప్టెన్ కాలేకపోయానని ఎమోషనల్ అయింది యానీ..సన్నీ ధైర్యం చేసుకుని ప్రియను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పాడు. దీంతో ప్రియ, సన్నీ ఒకరికొకరు గాల్లో ముద్దులు పంపుకున్నారు. ఇక మెజారిటీ సభ్యులు విశ్వను చెత్త ఆటగాడిగా పేర్కొనడంతో సోమవారం అతడిని జైల్లోకి పంపిస్తారని చెప్పాడు నాగ్. తర్వాత శ్రీరామ్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. కాజల్ లాంటి వాళ్లు నాకు నచ్చరు: లోబో బిగ్‌బాస్ హౌస్‌ను శుభ్రంగా ఉంచుకోలేదని తిట్టిపోశాడు నాగ్. హౌస్‌ను ఎంత గలీజ్ చేశారో చూడండి అంటూ కంటెస్టెంట్లకు హౌస్‌నంతా వీడియోలో చూపించాడు. తర్వాత లోబోను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన నాగ్.. 'తోపు, డూపు' గేమ్ ఆడించాడు. లోబో ముందుగా ఆరుగురు డూపుల గురించి చెప్తూ.. కాజల్ లాంటి జనాలు నాకు నచ్చరు, ఆమె ఊసరవెళ్లి అన్నాడు. ప్రియ.. వేరేవాళ్లతో అంతా చేపిస్తూ సైలెంట్‌గా కూర్చుంటది, వెనకాల ఒకమాట, ముందొకమాట మాట్లాడుతుందని చీదరించుకున్నాడు. రవికి అవసరమున్నప్పుడే ఈ లోబో గుర్తొస్తాడని బాధపడ్డాడు. యానీ.. స్మార్ట్ అని, షణ్ముఖ్ యాటిట్యూడ్ నచ్చదని, అతడు యాక్టింగ్ చేస్తున్నాడని తెలిపాడు. వీళ్లు కాకుండా మిగిలిన ఆరుగురు తోపులని చెప్పాడు. అనంతరం నాగార్జున కాజల్ సేఫ్ అని వెల్లడించాడు. ఇక ఈ వారం ప్రియ వెళ్లిపోతుందని నాగ్ కన్నా ముందే లీకువీరులు నెట్టింట ప్రచారం మొదలెట్టిన విషయం తెలిసిందే! -
నాన్న జేబులో డబ్బులు కొట్టేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయా: ప్రియాంక
Bigg Boss Telugu 5 Unseen, Priyanka story: స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి టాస్క్‌లో భాగంగా హౌస్మేట్స్ అంతా వారి జీవితాల్లో ఎదుర్కొన్న ఆటుపోట్లను పంచుకున్నారు. ఆ అడ్డంకులను దాటి చిరునవ్వుతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన విధానాన్ని వివరించారు. ఈ క్రమంలో ప్రియాంక సింగ్ తన జీవితం ఎలా మలుపు తిరిగిందో వివరించింది. 'ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచి నన్ను నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. మా ఊర్లో అందరూ నన్ను తేజు, తేజు అని పిలిచేవారు. పెరిగేకొద్దీ నా జీవితంలో సమస్యలు చుట్టుముట్టాయి. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకోవడంతో మా అమ్మ తిరిగి వచ్చినట్లైంది. పెద్దయ్యేకొద్దీ ఊర్లో నామీద ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. నా ప్రవర్తనలో మార్పు వస్తోందని నాన్నతో చెప్పేవారు. పల్లెటూర్లో మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అప్పుడు నేను అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోవాలని ఫిక్సయ్యా! మా నాన్న జేబులో నుంచి 50 రూపాయలు తీసుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. కానీ అక్కడ హైదరాబాద్‌కు టికెట్ 75 రూపాయలు అని తెలిసింది. అమ్మో, అంత డబ్బు నా దగ్గర లేదని మళ్లీ ఇంటికెళ్లాను. అక్కడ దేవుడికి ముడుపు కట్టిన డబ్బులను తీసుకుని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్‌కు వచ్చేసరికి నా దగ్గర రెండు రూపాయలు మాత్రమే మిగిలాయి. ఒక రూపాయి కాయిన్‌తో మాదాపూర్‌లో ఉన్న చిన్నక్కకు ఫోన్ చేస్తే వాళ్లు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు అనుకోకుండా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది, చేశాను. ఆ తర్వాత అప్పారావు బాబాయి నువ్వు బాగున్నావు, లేడీ గెటప్ వేస్తావా? అని అడిగాడు. అమ్మాయిగా కనిపించాలనే కోరిక కూడా తీరుతుందని వెంటనే ఓకే చెప్పాను. అలా ఒక కామెడీ షోలో కెరీర్ స్టార్ట్ చేశాను. తేజు టీవీలో కనిపిస్తున్నాడంటూ ఊరంతా ప్రచారం జరిగింది. అలా నా సంపాదన రూ. 300 నుంచి లక్షల్లో ఆర్జించడం మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చింది పింకీ. -
కోతుల ఆట కట్టించిన సన్నీ! 8 మంది నామినేట్!
Bigg Boss 5 Telugu, Episode 44: శ్వేత నామినేషన్స్‌లో లేకపోయుంటే తాను ఎలిమినేట్ అయ్యేదాన్నంటూ భయపడిపోయింది సిరి. ఎలిమినేట్ అయ్యాడుకున్న లోబో గురించి కంటెస్టెంట్లు జోకులు పేల్చారు. లోబో తన కడుపు మాత్రమే చూసుకుంటాడని, అందరి దగ్గరా ఫుడ్ లాక్కునేవాడంటూ లోబో మీద జోకులేసింది యానీ మాస్టర్. మరోవైపు రవి, కాజల్ ఇద్దరూ ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నారని జెస్సీతో చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇక మోజ్ రూమ్‌లో ఉన్న జెస్సీ, షణ్ను, సిరి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు రవి. అయితే ఇది కూడా ఇన్ఫ్లూయెన్స్ అని సెటైర్ వేశాడు షణ్ను. నిరంతం మానస్ జపం చేసే పింకీ. అతడు తనకెందుకు తినిపించడని లోలోపలే మథనపడిపోయింది. అతడికేం మాయరోగం, ఊరందరికీ తినిపిస్తాడు కదా! అంటూ మానస్ తనకు ఒక్కసారి కూడా తినిపించలేదని తెగ ఫీలైంది పింకీ. గార్డెన్ ఏరియాలో ఉన్న చెట్టుకు కంటెస్టెంట్ల ఫొటోలు ఉన్న కోతి బొమ్మలు వేలాడుతుంటాయి. డేరాలో ఉన్న ముగ్గురు వేటగాళ్లు శ్రీరామ్, సన్నీ, జెస్సీ కోతులను చంపి వారిని నామినేట్ చేయాలి. వేటగాళ్లను ఒప్పించి వేరేవాళ్లను నామినేట్ చేయడం కోతుల లక్ష్యం. ఎక్కువ కోతులను నామినేట్ చేసిన వేటగాడు సేఫ్ అవగా మిగిలిన ఇద్దరు నామినేట్ అవుతారు. జంగిల్ సౌండ్ వినిపించినప్పుడు రెండు అరటిపండ్లను పట్టుకోవాలి. అలా పట్టుకున్నవారు ఒక కోతిని చంపేందుకు వేటగాడిని ఒప్పించవచ్చు. మొదటగా జంగిల్ గౌండ్ వచ్చినప్పుడు సిరి, షణ్ముఖ్ చెరో అరటిపండును సంపాదించారు. ఈ సందర్భంగా షణ్ముఖ్, సిరి.. ఇద్దరూ యానీ మాస్టర్‌ను నామినేట్ చేయాలనుకున్నారు. ఇందుకు వేటగాడు సన్నీ అంగీకరించడంతో ఆమె నామినేట్ అయింది. అయితే సిరిని నామినేట్ చేస్తాను కానీ ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకోను అని చెప్పింది యానీ. తర్వాత అరటిపండు సంపాదించిన యానీ.. సిరిని, సిరి.. మానస్‌ను నామినేట్ చేయాలనుకున్నారు. కానీ సన్నీ.. యానీకి సపోర్ట్ చేస్తూ సిరిని నామినేట్ చేశాడు. అనంతరం సిరి, కాజల్‌కు అరటిపండు దక్కగా సిరి మరోసారి మానస్ పేరు సూచించగా, కాజల్.. ప్రియ పేరు చెప్పింది. సన్నీ.. కాజల్ చెప్పిన కారణానికి మద్దతు తెలుపుతూ ప్రియను నామినేట్ చేశాడు. ఇక రవి.. యానీ మాస్టర్ కోసం ఓ కవిత పాడి అక్కడున్న అందరినీ నవ్వించాడు. తర్వాత ప్రియ, సిరి అరటిపండ్లు సంపాదించారు. కానీ సిరి తను చెప్పిన వ్యక్తిని నామినేట్ చేయడం లేదని తన పవర్‌ను ప్రియాంకకు ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ప్రియాంక.. కాజల్‌ను నామినేట్ చేయాలనుకుంది. ప్రియ.. రవి సోఫా మీద టవల్ ఆరేయడం నచ్చలేదంది. అయితే సన్నీ.. శ్వేతను గుర్తు చేస్తూ ఆమె ఎంతో బాధతో వెళ్లిపోయిందని, తనకోసం ఈ పని చేస్తున్నానంటూ రవిని నామినేట్ చేశాడు. సన్నీ నిజస్వరూపం బయటపెట్టడానికే ఈ రీజన్ చెప్పానంటూ వ్యంగ్యంగా నవ్వింది ప్రియ. అయితే దీనివల్ల తనకు ఎఫెక్ట్ అవుతుందని ఆవేశపడిపోయాడు రవి. ఆరు వారాల నుంచి నామినేట్ అవుతూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. శ్వేత నా వల్ల వెళ్లిపోయిందా? అని ప్రశ్నిస్తూనే సన్నీని బుజ్జగించే ప్రయత్నం చేశాడు,. అటు పింకీ మాత్రం తను చెప్పిన కారణాన్ని పట్టించుకోలేదని నిప్పులు చెరిగింది. ఫేక్ పీపుల్స్‌తో ఉండలేను అంటూ ఏడ్చేసింది. కానీ తన డెసిషనే ఫైనల్ అంటూ రవిని నామినేట్ చేశాడు సన్నీ. సిల్లీ రీజన్స్ చెప్తూ నీతో ఆడుకుంటున్నారంటూ కాజల్ సన్నీకి క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో తన గేమ్ ఏంటో చూపిస్తానని సవాలు విసిరాడు సన్నీ. అనంతరం సిరి, రవి అరటిపండు సాధించారు. కానీ సిరి మరోసారి ఆ పండును పింకీకి ఇచ్చేసింది. కాజల్ నామినేషన్స్‌లోకి రావాలనుకుంటోందని రవిచెప్పగా ఆమెను నామినేషన్స్‌లోకి పంపించాడు సన్నీ. ఈ టాస్కులో సన్నీ ప్రొవోక్ అయిపోయాడని హౌస్‌మేట్స్‌తో ముచ్చట్లు పెట్టాడు షణ్ముఖ్. సన్నీ ఒంటరిగా గేమ్ ఆడితే చూడాలనుందన్నాడు. మరోవైపు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవగా... ఈ వారం కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. వీరితో పాటు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో కూడా నామినేట్ అయ్యాడు. -
బిగ్‌బాస్: కాజల్ కన్నింగ్ ప్లాన్.. ఫీలైన ప్రియాంక.. ఓదార్చిన మానస్
Bigg Boss Telugu, Episode 39 Highlights: గ్రీన్ టీం సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ బొమ్మ రూపంలో స్పెషల్ పవర్ లభించిన విషయం తెలిసిందే. దీంతో వారు మిగిలిన మూడు టీమ్‌లలో తమకు నచ్చిన టీమ్ సభ్యులు తయారు చేసిన బొమ్మలను స్వాధీనం చేసుకోవచ్చు. దీంతో యాంకర్ రవి.. స్పెషల్ పవర్ ద్వారా ఎక్కువ బొమ్మలు తయారు చేసిన యానీ మాస్టర్ టీమ్ దగ్గర ఉన్న బొమ్మల్ని తీసేసుకున్నారు. దీంతో యానీ మాస్టర్ మరో ప్లాన్ చేసింది. శ్వేత దాచిపెట్టిన బొమ్మలను లాక్కునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో శ్వేత, యాజీల మధ్య పెద్ద గొడవే జరిగింది.దీంతో బాగా హర్ట్ అయిన యానీ.. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్షిప్ నాకొద్దంటూ బయటకు వచ్చేసింది. దీంతో బెడ్‌పై పడుకొని శ్వెత కన్నీటిపర్యంతమైంది.ఇక శ్వేతపై అరిచిన యానీమాస్టర్ తినడం మానేసింది. శ్వేత కూడా తినకుండా ఆగిపోయింది. దీంతో యానీ మాస్టర్.. రా తిందాం అని అడిగింది. యాంకర్ రవిది క్రిమినల్ మైండ్: సన్నీ రవి టీమ్‌కి వచ్చిన స్పెషల్ పవర్ కారణంగా అన్ని బొమ్మలను కోల్పోయిన బ్లూ కలర్ టీమ్ సభ్యులు( మానస్, సన్నీ, యానీ మాస్టర్).. చేసేదేమి లేక మూలన కూర్చొని బాధపడ్డారు. సన్నీ, మానస్ అయితే రవి గేమ్ ప్లాన్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అందరూ బొమ్మల్ని కష్టపడి కుడుతుంటే వాళ్లు మాత్రం చాలా రిలాక్స్‌గా ఉన్నారు.. ఇంత క్రిమినల్ మైండ్ నేనెక్కడా చూడలేదని సన్నీ అన్నాడు. ఇక మానస్ మాట్లాడుతూ.. ‘యాంకర్ రవి ఆన్సర్ షీట్ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు.. రవికి ఆ బొమ్మలో స్లిప్ ఉందని ఎలా తెలుసు? అందుకే వాళ్లు మొదటి నుంచి చాలా కూల్‌గా ఉన్నారు. వాళ్లు పత్తి తీసుకుందాం బొమ్మలు కుట్టి గెలుద్దాం అని ఆడలేదు.. ఆ పవర్ ఉన్న బొమ్మ వస్తుంది.. దాన్ని గుంజుకుని.. ఎవరు ఎక్కువ బొమ్మలు చేస్తే వాళ్ల దగ్గర నుంచి తీసుకుందాం అనే ఆట ఆడారు’అన్నారు. ఫీలైన ప్రియాంక.. ఓదార్చిన మానస్ అర్థరాత్రి తర్వాత మానస్ దగ్గరకు వెళ్లిన ప్రియాంక.. కోపంగా ఉన్నావా? నీతో మాట్లాడొచ్చా అని అడిగింది. ఏం లేదు చెప్పు అన్నాడు మానస్. చెప్పాక తిట్టవు కదా అంది ప్రియాంక. తిట్టనులే చెప్పు అని మానస్ హామీ ఇవ్వడంతో.. టాస్క్‌ల్లో నేను వందశాతం ఎఫర్ట్ ఇస్తున్నానా? అని అడిగింది. హా ఇస్తున్నావ్ గా అని చెప్పాడు మానస్. దీంతో ప్రియ.. ‘నువ్ అంటుంటావ్ కదా.. నేనొక బార్డర్ పెడతా దాన్ని ఎవరూ క్రాస్ చేయలేరు అని.. నేనెప్పుడైనా అది క్రాస్ చేసినట్టు నీకు అనిపించిందా? అని అడిగింది. అదేం లేదు.. ఈ ప్రశ్న చాలాసార్లు అడుగుతున్నావ్ ఎందుకు? నేను బార్డర్ ఎందుకు పెడతా అంటే.. ఎదుటి వాళ్లు హర్ట్ అవుతారని.. ప్రతి ఒక్క రిలేషన్‌లోనూ ఎక్స్ పర్టేషన్స్ ఉంటాయి.. అది వాళ్లు రీచ్ కాలేకపోతే ఫీల్ అయిపోయినట్టు కాకుండా మంచి ఒపీనియన్ ఉండాలనే బార్డర్ పెడతా.. ఈ విషయం గురించి నన్ను పదే పదే అడిగి నువ్ ఇబ్బంది పడకు.. నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పాడు మానస్. దీంతో ప్రియాంక్ ఎమోషనల్ అయి ఏడ్చేసింది. మానస్ వెళ్లి ఓదార్చాడు. రవిని టార్గెట్ చేసిన కాజల్ తొలి నుంచి పక్కా ప్లాన్‌తో గేమ్ ఆడుతూ వస్తున్న కాజల్.. ఈ వారం ఎలాగైన కెప్టెన్ కావాలని ఫిక్స్ అయింది. తనకు పోటీ ఉండకూడదని రవిని తొలగించే ప్లాన్ వేసింది. సంచాలకురాలిగా తనకున్న అధికారాన్ని ఉపయోగించి రవికి చెక్ పెట్టే ప్లాన్ వేసింది. గతంలో చెక్ చేసి ఓకే చెప్పిన బొమ్మలను కూడా మళ్లీ పరిశీలించాలని పట్టుపట్టింది. సంచాలకులదే తుది నిర్ణయం కావడంతో.. కాజల్ చెప్పినట్టుగానే అన్ని బొమ్మలను మళ్లీ తీసుకొచ్చింది రవీ టీమ్. వాటిలో కొన్ని బొమ్మలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి కాజల్ కన్నింగ్ ప్లాన్‌ను రవి ఎలా ఎదుర్కొన్నారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
అగ్ని పరీక్ష.. ఛీ కొట్టిన పింకీ, చిందులు తొక్కిన షణ్ముఖ్
Bigg Boss Telugu, Episode 37: హమీదా వెళ్లిపోయాక శ్రీరామచంద్ర కాస్త డల్ అయిపోయినట్లు కనిపించింది. అర్ధరాత్రి నిద్రలో కూడా ఏవేవో కేకలు వేయడంతో ఇంటిసభ్యులు ఉలిక్కిపడ్డారు. పక్కనే ఉన్న విశ్వ.. అతడి పరిస్థితి అర్థమై అతడి వీపు నిమురుతూ నిద్రపుచ్చాడు. మరోపక్క నామినేషన్స్‌లో ఎలా ఫైట్ చేయాలా? సిరి, జెస్సీ, షణ్ముఖ్ చర్చించుకున్నారు. ఏదేమైనా సరే, అతడికి రివర్స్ కౌంటరివ్వు, ఏం కాదంటూ సిరిని శ్రీరామ్ మీదకు ఉసిగొల్పాడు షణ్ముఖ్. మరోపక్క కెప్టెన్, రేషన్ మేనేజర్‌కు అస్సలు పడటం లేదన్న విషయం మరోసారి స్పష్టమైంది. రేషన్ మేనేజర్‌గా నువ్వు ఫెయిలయ్యావంటూ విశ్వ ముఖం మీదే చెప్పేసింది ప్రియ. అంతేకాకుండా అందరికీ గిన్నెల్లో వేసి పెట్టిన తర్వాతే తినాలని అతడిని ఆదేశించింది. కంటెస్టెంట్లకు అగ్ని పరీక్ష అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో ఆరోవారం నామినేషన్స్ మొదలయ్యాయి. నిప్పులా ఎగసిపడుతున్న అభిప్రాయాలను 'అగ్నిపరీక్ష' టాస్క్‌లో బయటపెట్టాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా వచ్చిన సన్నీ.. రవి, జెస్సీ ఫొటోలను మంటలో వేశాడు. తర్వాత వచ్చిన విశ్వ.. ఎంతో కష్టపడి బిగ్‌బాస్‌కు వచ్చిన తనను స్ట్రాంగ్ అంటూ పదేపదే నామినేట్ చేయడం నచ్చలేదంటూ యానీ మాస్టర్ ఫొటోను నిప్పులో పడేశాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన యానీ ఉగ్రావతారం ఎత్తింది. ఇకపై తనను అక్క అని పిలవద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. తర్వాత అతడు ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. నా గేమ్ నా ఇష్టం, నాకు నీతులు చెప్పకు: సిరి శ్వేత.. సిరి, కాజల్‌ను నామినేట్ చేసింది. అనంతరం లోబో వంతు రాగా.. నమ్మకం అంటే చచ్చిపోతా, అలాంటిది తన నమ్మకాన్ని చంపారంటూ ప్రియాంక సింగ్, జెస్సీని నామినేట్ చేశాడు. దీనిపై జెస్సీ రియాక్ట్ అవుతూ.. నమ్మకంతో తనకు పని లేదని, గేమ్ ఆడటానికి వచ్చానని సమాధానమిచ్చాడు. సిరి మాట్లాడుతూ.. నీ కెప్టెన్సీలో పక్షపాతం కనిపించిందంటూ శ్రీరామచంద్రను నామినేట్ చేసింది. తర్వాత శ్వేత ఫొటోను మంటల్లో వేస్తూ.. నా గేమ్ నా ఇష్టం, ఏం చేయాలో నాకు సూక్తులు చెప్పకంటూ చిర్రెత్తిపోయింది. యాంకర్ రవి.. కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదని మానస్‌ను నామినేట్ చేశాడు. జనాలను ఎంటర్టైన్ చేయాలని తాను, లోబో బిగ్‌బాస్‌కు వచ్చామని, కానీ మా ఇద్దరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటూ సిరి ఫొటోను కాల్చి బూడిద చేశాడు. విశ్వను ఛీ కొట్టిన పింకీ, నవ్వాపుకున్న ప్రియ జెస్సీ.. శ్రీరామ్, సన్నీని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో జెస్సీ, సన్నీ మధ్య పెద్ద ఫైటే నడిచింది. నేను గేమ్ ఆడితే తట్టుకోలేవు, నా మంచితనం పోతే చాలా వరస్ట్‌గా ఉంటుంది అని హెచ్చరించాడు సన్నీ. ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. ప్రతిసారి సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేయడమే కాకుండా నమ్మకం గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ లోబో ఫొటోను నిప్పుల్లో వేసింది. విశ్వ గురించి మాట్లాడుతూ.. కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఉపయోగించాలి. ఎధవ రీజన్లు చెప్తారు.. ఛీ.. అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయింది. ఇదంతా చూసి ప్రియ నవ్వాపుకోవడం గమనార్హం. మానస్.. యాంకర్ రవి, లోబోను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్.. మరోసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌నే నామినేట్ చేస్తానంటూ షణ్ముఖ్ ఫొటోను నిప్పుల్లో పడేసింది. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకు, వెనకాల నుంచి పొడవకు అని హెచ్చరిస్తూ విశ్వ ఫొటోను కాల్చివేసింది. అందుకోసం నేను బిగ్‌బాస్‌కు రాలేదు: కాజల్ తర్వాత శ్రీరామ్ వంతురాగా.. మీ అవసరానికి తగ్గట్టు రిలేషన్షిప్ వాడుకోవద్దని సూచిస్తూ సిరిని నామినేట్ చేశాడు. ఆడినా ఆడకపోయినా షణ్ముఖ్నెవరూ నామినేట్ చేయడంలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అతడి ఫొటోను మంటల్లో వేశాడు. ఈ క్రమంలో నిప్పులు తొక్కిన షణ్ను బిగ్‌బాస్ హౌస్‌కు నువ్వు దేవుడివి, నువ్వేం చెప్తే అది చేయాలా? అని ఫైర్ అయ్యాడు. దీంతో శ్రీరామ్ అతడికి కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత కాజల్ మాట్లాడుతూ.. హమీదా నన్ను అక్కా అంటూ పిలిచింది కానీ నేను కనెక్ట్ కాలేకపోయా.. నేను నిన్ను బ్రదర్ అంటూ మాట్లాడదామని ముందుకు వస్తే నువ్వు కనెక్ట్ అవ్వలేదు. ఇదే కర్మ.. ఎమోషనల్ ఎటాచ్మెంట్ పెట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు, కేవలం గేమ్ ఆడటానికే వచ్చానని తేల్చి చెప్పింది కాజల్. తనను నామినేట్ చేసినందుకు శ్వేత ఫొటోను నిప్పుల్లో వేసింది. అందరికీ పెట్టాకే తినాలి: ప్రియ ప్రియ.. నువ్వేం మాట్లాడతావో అర్థం కాదు, టక్కున నోరు జారేస్తావు. రేషన్ మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు అందరికీ పెట్టాకే తినాలి అంటూ విశ్వను నామినేట్ చేసింది. తర్వాత సన్నీ ఫొటోను మంటల్లో వేసింది. ప్రతివారం తనను నామినేట్ చేయడమే పనిగా పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు సన్నీ. మీరున్నన్ని రోజులు మిమ్మల్నే నామినేట్ చేస్తానంటూ ప్రియను హెచ్చరించాడు. మొత్తంగా ఈ వారం షణ్ముఖ్, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. -
అబ్బాయైనా, అమ్మాయైనా.. మాకు సర్వం నువ్వే: పింకీ తండ్రి
Bigg Boss Telugu 5 Promo: అతడు ఆమెగా మారడం అంత ఈజీ కానే కాదు! ఎన్నో కష్టనష్టాల కోర్చి ఆమెగా మారినా ఈ సమాజం వారికి అక్కున ఆదరించదు, పైగా సూటిపోటి మాటలతో నిత్యం నరకం చూపిస్తుంటుంది. అయినవాళ్లకు దూరమై, ఏమీకాని వాళ్లతో మాటలు పడే ట్రాన్స్జెండర్ల వ్యథలు వర్ణణాతీతం. అయితే ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని బిగ్‌బాస్ వరకు వచ్చింది సాయితేజ అలియాస్ ప్రియాంక సింగ్. ఇప్పటివరకు తను అమ్మాయిగా మారానన్న విషయం తండ్రికి తెలియదని బిగ్‌బాస్ ప్రారంభమైన తొలినాడే స్టేజీ మీదే చెప్పి గుక్క పెట్టి ఏడ్చింది పింకీ. అలాంటి పింకీకి జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇవ్వబోతున్నాడు బిగ్‌బాస్. పింకీ అమ్మాయిగా మారడం తమకు సమ్మతమేనని తండ్రి మాట్లాడిన మాటలను వీడియో వేసి చూపించాడు. ఇది కలో, నిజమో అర్థం కాని పింకీ హౌస్‌లో తెగ ఎమోషనల్ అయింది. 'నాన్నా సాయితేజ, నువ్వు అబ్బాయైనా, అమ్మాయైనా.. మాకు సర్వం నువ్వే. నువ్వు అమ్మాయిగా మారావని మేము ఆదరించడం ఆపేస్తామని ఎప్పుడూ అనుకోకు' అని ధైర్యం చెప్పాడు. తండ్రి తనను ట్రాన్స్‌జెండర్‌గా మారడాన్ని స్వాగతించడంతో సంతోషం తట్టుకోలేకపోయింది పింకీ. ఇప్పటికీ సొంతింటికి దొంగలా వెళ్తానని, చాలాసార్లు నేనొచ్చిన విషయం పక్కింటివాళ్లకు కూడా తెలీదని చెప్పుకొచ్చింది. మా నాన్న నాలోని మార్పును యాక్సెప్ట్ చేయడం సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి లోనైంది. ఇక బిగ్‌బాస్ పింకీ బర్త్‌డే ను పురస్కరించుకుని చీర, గాజులు, పువ్వులు, స్వీట్లు పంపించాడు. దీంతో అందంగా ముస్తాబైన పింకీ.. మానస్ కాళ్ల మీద ఆశీర్వాదం అందుకుంది. మొత్తంగా పింకీ బర్త్‌డే వేడుకలతో నేటి ఎపిసోడ్ మరింత ఎమోషనల్‌గా మారేటట్లు కనిపిస్తోంది. -
బిగ్‌బాస్ గేట్లు పగలగొట్టుకుని పోదామనుకున్నా!: నటరాజ్ మాస్టర్
Bigg Boss Telugu 5, Episode 29: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఐదో వారంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా హౌస్మేట్స్ నాగ్‌కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. 'నిన్నే పెళ్లాడతా' సినిమాలోని పాటలకు కంటెస్టెంట్లు స్పెషల్ పర్ఫామెన్స్ ఇవ్వగా.. ఇంప్రెస్ అయిన నాగ్ తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చాడు. తర్వాత నాగ్ సండేను ఫండే చేసేందుకు ఇంటిసభ్యులను రెండు టీములుగా విడగొట్టాడు. శ్రీరామ్, నటరాజ్, యానీ, ప్రియ, మానస్, జెస్సీ, సిరి, రవి A టీమ్ కాగా మిగతావారు B టీమ్‌లో ఉన్నారు. షర్ట్ విప్పిన విశ్వ, పింకీ డ్యాన్స్ అరాచకం.. గేమ్‌లో భాగంగా ప్రతి టీమ్లోనుంచి ఒక్కొక్కరు బాక్స్‌లో నుంచి చీటీ తీయాలి. అందులో ఉన్న సినిమా పేరును హింట్ ఇస్తూ డ్రాయింగ్ వేయాలి. అది చూసి సదరు టీమ్ మెంబర్స్ సరైన ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేస్తే డ్రాయింగ్ వేసిన కంటెస్టెంట్ వారికి నచ్చినవాళ్లతో డ్యాన్స్ చేయొచ్చు. ఈ క్రమంలో విశ్వ- ప్రియాంక సింగ్ నరుడా.. ఓ నరుడా సాంగ్‌కు రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశారు. పింకీ విశ్వ చొక్కా విప్పేయగా.. అతడు ఆమెను ఎత్తుకుని, హత్తుకుని మరీ స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో అక్కడున్నవారితోపాటు నాగ్ కూడా ఇది వేరే లెవల్‌కు వెళ్తోందని భావించిన పాట ఆపేయండనని కోరడం విశేషం. మొత్తంగా ఈ గేమ్‌లో టీమ్ A గెలవగా, విజయానందంతో చిందులేసింది. తర్వాత యానీ మాస్టర్ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. దాక్కోదాక్కో మేక.. తర్వాత ఇంటిసభ్యులతో నాగ్ 'దాక్కోదాక్కో మేక' గేమ్ ఆడించాడు. ఇందులో ఎవరు పులి, ఎవరు మేక అని పేర్లు చెప్పిన నాగ్ 30 సెకన్లలో మేకను పట్టుకోకపోతే పులి చచ్చిపోతుందని, పులికి పనిష్మెంట్ ఉంటుందన్నాడు. ఒకవేళ మేకను పట్టుకుంటే మేక చచ్చిపోవడంతో పాటు వారికి పనిష్మెంట్ ఉంటుందని తెలిపాడు. మొదటగా పులిగా వచ్చిన శ్రీరామ్.. హమీదాను వేటాడి పట్టుకున్నాడు. దీంతో హమీదా తనకు విధించిన శిక్షలో భాగంగా డ్యాన్స్ చేసి అందరినీ పడగొట్టింది. మానస్‌ను వెంటాడి వేటాడిన ప్రియాంక.. తర్వాత జెస్సీని పట్టుకోవడంలో విఫలమైన శ్వేతను నాలుకతో ముక్కును టచ్ చేయాలన్నాడు నాగ్. కానీ శ్వేత ఎంత ప్రయత్నించినా ముక్కును అందుకోలేకపోగా సిరి చాలా ఈజీగా నాలుకతో ముక్కును తాకింది. అనంతరం పులిలా వచ్చిన ప్రియాంక.. మానస్‌ను వెంటాడి వేటాడగా అతడు చిక్కకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్‌లో పడటంతో నాగ్‌తో సహా అందరూ షాకయ్యారు. తర్వాత అతడికేమీ కాలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆటలో ఓడిపోయిన మానస్ పదిసార్లు కప్ప గెంతులు వేశాడు. సిరిని ఎత్తుకుని తిప్పిన షణ్ముఖ్ తర్వాత ప్రియ.. ఎంతకూ సన్నీని పట్టుకోలేకపోవడంతో ఆమెను హూలా హూప్తో డ్యాన్స్ చేయమన్నాడు నాగ్. హూప్‌ను తిప్పడం సాధ్యపడని ప్రియ దాంతో డ్యాన్స్ చేయడానికి ముప్పు తిప్పలు పడింది. అనంతరం సిరి.. షణ్నును పట్టేసుకోగా ఓడిపోయిన షణ్ముఖ్‌తో బెల్లీ డ్యాన్స్ చేయించాడు నాగ్. పులిలా వచ్చిన కాజల్.. లోబో మీద పంజా విసరడంతో అతడు 15 పుషప్స్ చేయక తప్పలేదు. అనంతరం రవి.. యానీ మాస్టర్‌ను ఇట్టే పట్టేసుకున్నాడు. దీంతో యానీ.. రవి చేతిలో ఓడిపోయానని డైలాగ్ చెప్తూ తీన్మార్ స్టెప్పులేసింది. తర్వాత సిరి సేవ్ అయినట్లు ప్రకటించగా సంతోషం పట్టలేకపోయిన షణ్ను సిరిని ఎత్తుకుని తిప్పాడు. నిజాయితీగా ఉండటమే నటరాజ్ చేసిన తప్పా? చివరగా బావ, బావమరుదులైన లోబో, నటరాజ్ ఇద్దరే మిగలగా.. హార్ట్ బీట్ సౌండ్‌తో టెన్షన్ పెంచేసిన నాగ్.. నటరాజ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో లోబో, యానీ, హమీదా గుక్కపెట్టి ఏడ్చేశారు. కడసారి బిగ్‌బాస్ హౌస్‌ను కళ్లారా చూసుకున్న నటరాజ్ కన్నీళ్లతో హౌస్‌కు వీడ్కోలు పలికాడు. మాస్టర్ పది మందికి పెట్టేవాడే కానీ అతడు ఇక్కడ సరిగా అన్నం కూడా తినలేదని బాధపడ్డాడు సన్నీ. నిజాయితీగా, స్ట్రిక్ట్‌గా ఉండటమే ఆయన చేసిన తప్పా? అని పింకీ ఎమోషనల్ అయింది. అనంతరం స్టేజీ మీదకు వచ్చిన నటరాజ్ బిగ్‌బాస్ హౌస్‌లో తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్‌లో నుంచి వెళ్తున్నానంటే నా భార్యకు నా అవసరం ఉందేమోనని అభిప్రాయపడ్డాడు. నిజానికి బిగ్‌బాస్ గేట్లు పగలగొట్టుకుని బయటకు పోయేటంత అంతర్మథనానికి లోనయ్యానని తెలిపాడు. దీంతో అతడిని ఓదార్చిన నాగ్.. బిగ్‌బాస్ షోకు రావడంతోనే నువ్వు సాధించేశావని ధైర్యం నూరిపోశాడు. మానస్ గాడిద, ప్రియాంక చిలక.. అనంతరం నటరాజ్.. హౌస్‌లోని కంటెస్టెంట్లకు జంతువుల పేర్లను సూచిస్తూ గేమ్ ఆడాడు. సిరి తన జోలికొస్తే కాటేసే పాము అని చెప్పాడు. లోబో ఎలుకలా దూరి కిచెన్‌లో అంతా తినేస్తాడని పేర్కొన్నాడు. విశ్వ.. ప్రతిదానికి భయపడొద్దని, వేరేవాళ్ల కోసం మంచిగా మాట్లాడొద్దని అతడిని ఊసరవెల్లితో పోల్చాడు. శ్రీరామచంద్ర మూడోవారం నుంచి అమాంతం పెరిగిపోయాడని అతడిని మొసలితో పోల్చాడు. ప్రియాంక సింగ్.. అందరికీ ప్రేమతో వడ్డించే చిలక అని చెప్పుకొచ్చాడు. సింహం.. తానేనన్న నటరాజ్.. మానస్ గాడిదలా చాకిరీ చేస్తాడన్నాడు. రవి.. యాంకరింగ్ చేసిన తెలివితో ఆడుతున్నాడని అతడే గుంటనక్క అని వెల్లడించాడు. చివర్లో హమీదా.. నాగ్ వేసుకున్న టీ షర్ట్ మీద ఆశ పడటంతో హోస్ట్ దాన్ని తప్పకుండా ఇచ్చేస్తానని హమీ ఇచ్చాడు. -
హమీదాను ఎత్తుకున్న శ్రీరామ్, ముఖం మాడ్చుకున్న ప్రియాంక!
Bigg Boss Telugu 5, Episode 27: హౌస్మేట్స్ రూల్స్ సరిగా పాటించనందుకు జెస్సీ కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ కెప్టెన్‌గా అది నీ వైఫల్యమే అంటూ హౌస్మేట్స్ అతడిని చెత్త ఆటగాడిగా నిర్ణయించారు. మరోపక్క సింగర్ శ్రీరామ్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా హమీదా కోసం లవ్ సాంగ్ పాడుతూ, ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇక సన్నీ కూడా తన యాంకరింగ్‌తో దుమ్ము దులిపేశాడు. మరి నేటి (అక్టోబర్ 1) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. అర్ధరాత్రి సైగలు, గాల్లో ముద్దులు కెప్టెన్సీ అంటే ఇమ్యూనిటీ అని, అలాంటి కెప్టెన్సీ తనకు దక్కకుండా చేసిందని కాజల్ మీద మండిపడింది శ్వేత. నువ్వు నీ మైండ్‌ను ఎక్కువగా వాడుతున్నావు, కానీ మనసును కాదని కాజల్‌ను విమర్శించింది. దీనిపై కాజల్ స్పందిస్తూ.. శ్రీరామచంద్ర గెలవాలనుకున్నా, అంతే తప్ప నీ ఫీలింగ్స్ నాకు మ్యాటరే కాదని శ్వేత ముఖం మీదే చెప్పింది. ఇదిలా వుంటే రాత్రి అందరూ పడుకున్నాక శ్రీరామ్, హమీదా సైగలు చేసుకుంటూ గాల్లో ముద్దులు పంపుకుని గుడ్‌నైట్ చెప్పుకున్నారు. వయ్యారాలు ఒలకబోసిన ప్రియాంక సింగ్ తర్వాతి రోజు నటరాజ్ మాస్టర్ మరోసారి రవి మీద పడ్డాడు. రవి టాస్క్ చేస్తున్నంతసేపు నత్తలా అనిపించాడని కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన రవి.. మాస్టర్ చాలా ఇరిటేట్ చేస్తున్నాడని చిరాకు పడ్డాడు. అసలు తన పేరు కూడా ఎత్తొద్దని ఆయనకు చెప్పంటూ లోబోకు సూచించాడు. ఇక నల్లచీర కట్టుకుని ప్రియాంక సింగ్ వయ్యారాలు పోతుంటే శ్రీరామ్ పాటతో ఆమె వెనకాల పడ్డాడు. మానస్ బెస్ట్, జెస్సీ వరస్ట్.. అనంతరం బిగ్‌బాస్.. బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ఎన్నుకోమని ఆదేశించాడు. దీంతో శ్రీరామ్-హమీదా జంట.. లోబోను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొంది. యానీ మాస్టర్-శ్వేత.. శ్రీరామ్‌ను బెస్ట్, కాజల్‌ను వరస్ట్ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు. విశ్వ-రవి జోడీ.. మానస్‌ను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా పేర్కొంది. షణ్ముఖ్-సిరి.. మానస్ బెస్ట్, లోబో వరస్ట్ అని తేల్చారు. తర్వాత వచ్చిన నటరాజ్ మాస్టర్- లోబో... మానస్‌ను బెస్ట్, జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా తెలిపారు. కాజల్-జెస్సీ.. మానస్‌ను బెస్ట్, లోబోను వరస్ట్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియ- పింకీ.. మానస్‌ను బెస్ట్, లోబో వరస్ట్ అని తెలిపారు. సన్నీ- మానస్.. లోబోను బెస్ట్ అని పేర్కొంటూ వేరేవాళ్ల నుంచి ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నావని జెస్సీని వరస్ట్ పర్ఫామర్లుగా తేల్చారు. మొత్తంగా ఈ వారం బెస్ట్ పర్ఫామర్‌గా మానస్‌ను, వరస్ట్ పర్ఫామర్‌గా జెస్సీని ప్రకటించారు. దీంతో జెస్సీ రెండోసారి జైల్లోకి వెళ్లాడు. బిగ్‌బాస్ హౌస్‌లో స్పెషల్ షో జరిగింది. ఈ షోకి సన్నీ వీజేగా వ్యవహరిస్తూ కెప్టెన్ శ్రీరామ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ క్రమంలో కాజల్ మైక్ అందుకుంటూ సిరి, హమీదాలలో ఎవరిని ఎంచుకుంటారని సింగర్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనికతడు లంచ్ టైమ్‌లో సిరి, డిన్నర్ టైమ్‌లో హమీదా అని తెలివిగా ఆన్సరిచ్చాడు. మరి టిఫిన్ టైమ్‌లో ఎవరూ లేరా? అని సన్నీ కౌంటరిచ్చాడు. మంచి అమ్మాయి కోసం వెయిటింగ్ అన్నావు, ఇక్కడున్నవారిలో ఎవరిలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావు? అని సన్నీ క్వశ్చన్ వేయగా శ్రీరామ్.. సిరి కమిటెడ్ కాకపోయుంటే తప్పకుండా ఆమెకే ట్రై చేసేవాడిని అని చెప్పాడు. దీంతో రవి.. అన్న, నీ టేస్ట్ ఇంత బ్యాడ్ అనుకోలేదని కౌంటరిచ్చాడు. గుండెల్లో ఏ అమ్మాయైనా ఉందా? అన్న ప్రశ్నకు.. గుండెలనిండా ఏ అమ్మాయినైనా నింపుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నా అంటూ ఓ ప్రియా.. ప్రియా.. పాటందుకుని ఊహల్లో తేలిపోయాడు. ఇక్కడున్నవారిలో ఎవరిని డేట్‌కు తీసుకెళ్తారన్న ప్రశ్నకు సింగర్.. హమీదా పేరు చెప్తూ పాటందుకున్నాడు. అంతేకాకుండా ఆమెను ఎత్తుకుని, హత్తుకుని డ్యాన్స్ చేశాడు. అయితే శ్రీరామ్ హమీదాకు క్లోజ్‌గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది పింకీ. ఆమెను ఎత్తుకుని తిరగడం అవసరమా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. తర్వాత లోబో, సన్నీ కలిసి హౌస్‌మేట్స్‌ను రోస్ట్ చేసి పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. -
నడుము వంక చూసిన లోబో, గగ్గోలు పెట్టిన ప్రియాంక
వరుస టాస్క్‌లతో హీటెక్కిపోయిన హౌస్‌ను చల్లార్చేందుకు హౌస్‌మేట్స్‌కు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు రెచ్చిపోయి ఆడినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నల్లచీర కట్టుకుని అందంతో ఉడికిస్తున్న ప్రియాంక సింగ్‌ను చూసి శ్రీరామ్ వాలుకనులదానా.. అని పాట అందుకున్నాడు. తర్వాత ప్రియాంక సింగ్, లోబో కలిసి ఖుషీ స్కిట్ వేశారు. ఏదో ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నట్లుగా తెగ యాక్టింగ్ చేసిన లోబో మధ్యలో ఓరగా పింకీ నడుము వంక చూశాడు. ఆ చూపులను ఇట్టే గుర్తుపట్టిన పింకీ .. నీ చూపు సరిగా లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే డైలాగులు నవ్వు పుట్టిస్తున్నాయి. ఇదిలా వుంటే నటరాజ్ మాస్టర్ మరోసారి యాంకర్ రవి మీద పడ్డాడు. టాస్క్ చేస్తున్న సమయంలో అతడిని చూస్తుంటే నత్త గుర్తొచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇక పదేపదే తన పేరు తీసి వాగుతున్నాడని రవి అసహనానికి లోనయ్యాడు. తన గురించి ఆయనకెందుకో అని చిరాకు ప్రదర్శించాడు. తర్వాత బిగ్‌బాస్ ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫామర్లను ప్రకటించమని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో శ్వేత.. కాజల్‌ను వరస్ట్ అని పేర్కొంది. మరి మెజారిటీ కంటెస్టెంట్లు ఎవరిని వరస్ట్ పర్ఫామర్‌గా అభిప్రాయపడ్డారన్నది ఆసక్తికరంగా మారింది. -
అలా చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా : నాగబాబు
మెగాబ్రాదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారంటూ పలువురు ప్రశ్నించగా..తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే మీ ముందుకు వస్తాడంటూ పేర్కొన్నారు. చదవండి : డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు ఇక మరో యూజర్.. బిగ్‌బాస్ లేదా ఐపీఎల్...ఈ రెండింట్లో ఏది ఫాలో అవుతారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా..'బిగ్‌బాస్ చూడకుండా ఐపీఎల్ చూస్తూ నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్‌కి సపోర్ట్ చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మావా' అంటూ క్రేజీగా బదులిచ్చారు నాగబాబు. దీనికి స్పందించిన ప్రియాంక సింగ్ టీం నాగబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 'మీరు ఎప్పుడు ఎవరిని ఊరికే సపోర్ట్ చేయరు ... జెన్యూన్ పర్సన్స్ ని తప్ప, ఆ జెన్యూన్ నేచర్ మన పింకీని ఇంత వరకూ తీస్కోచ్చింది ...మీకు లాగే అందరూ సపోర్ట్ చేసేలా చేస్తోంది' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే నాగబాబు బిగ్‌బాస్-5లో తనకు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారని, అయినప్పటికీ ప్రియాంక సింగ్‌కే తన మద్దతు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. కన్నడ నటి సంజన గల్రానీ సైతం ప్రియాంక సింగ్‌ను విన్నర్‌గా చూడాలనుందని పేర్కొంది. చదవండి : అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. -
హమీదాకు గోరుముద్దలు: భరించలేకపోయిన ప్రియాంక సింగ్
Bigg Boss Telugu 5, Episode 20: బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తెలుసుకున్నానన్నాడు షణ్ముఖ్. సిరి తనతో మాట్లాడమని ఎంత బతిమిలాడినా అతడు మాత్రం పట్టించుకోలేదు. బెడ్డు దగ్గరకొచ్చి బుజ్జగించినా అతడు చలించలేదు. తర్వాత బిగ్‌బాస్ అతికిందంటే అదృష్టమే అనే లగ్జరీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫుడ్ ఐటమ్స్ రాసి ఉన్న బంతులు గోడకు విసరాలి. ఏవైతే గోడకు అతుకుతాయో అవి హౌస్‌మేట్స్‌కు అందుతాయని తెలిపాడు. ఈ టాస్క్‌లో విశ్వ ఫోయిలవగా సన్నీ, రవి, శ్రీరామ్ కిందామీదా పడి పూర్తి చేశారు. కాళ్లు విరగ్గొట్టేసేవాడిని.. ఆవేశంతో ఊగిపోయిన మాస్టర్ మానస్ హమీదాకు గోరు ముద్దలు తినిపిస్తూ ఇంటి ముచ్చట్లు మాట్లాడాడు. ఈ మధ్య లహరి పొసెసివ్‌గా ప్రవర్తిస్తోందన్నాడు. మొన్న అమ్ముకు రోటీ తినిపిస్తుండగా నువ్వు కూడా తినిపించమన్నావు.. సరే, ఇద్దరికీ కలిసి తినిపిద్దాం అని అక్కడకు వెళ్లి కూర్చుందాం అంటే కుదరదు అని చెప్పేసింది, ఇక్కడే ఇంకో రోటీ తినిపించమని అని మొండిగా ప్రవర్తించిందన్నాడు. మరోపక్క నటరాజ్ మాస్టర్ దేనికో బాగా ఉడుక్కున్నాడు. 'ఎలా ఆడాలన్న బేసిక్ నాలెడ్జ్ లేదు, సెన్స్ కూడా ఉండదు. ఏమైనా అంటే ప్రొఫెషనల్ డైలాగులు.. బయటైతే కాళ్లు విరగ్గొట్టేసేవాడిని..' అంటూ ఏవేవో మాట్లాడాడు. దీంతో అక్కడున్న సన్నీ, రవి, యానీ మాస్టర్, లోబో ఎవరి గురించి అంటున్నారో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో టైం వచ్చినప్పుడు డైరెక్ట్‌గా చెప్తానన్నాడు. అయితే ఆయన అంటోంది తననే అని అటు యాంకర్ రవి, ఇటు జెస్సీ ఎవరికి వారే తెగ ఫీలయ్యారు. మాస్టర్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నాడని రవి అభిప్రాయపడ్డాడు. మానస్ జైలుకు వెళ్లడం కూడా స్ట్రాటజీనే! తర్వాత ఇంటిసభ్యులందరూ టాస్క్‌లతో పాటు ఇంట్లోని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బెస్ట్, వరస్ట్ పర్ఫామ్స్ను ఎన్నుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. కెప్టెన్ జెస్సీ.. హమీదాను; షణ్ముఖ్, హమీదా, సిరి, కాజల్, రవి, నటరాజ్ మాస్టర్, శ్రీరామచంద్ర.. మానస్‌ను; విశ్వ, లహరి.. ప్రియను; యానీ మాస్టర్.. సన్నీని; శ్వేత వర్మ.. నటరాజ్ మాస్టర్, సన్నీ.. షణ్ముఖ్లనను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు. మానస్.. తనకు తానే నచ్చలేదంటూ తన పేరు చెప్పుకున్నాడు. అది కుదరదని కెప్టెన్ వారించడంతో మానస్.. జెస్సీ పేరును సూచించాడు. మొత్తంగా ఎక్కువ ఓట్లు వచ్చిన మానస్‌ను చెత్త ఆటగాడిగా అభివర్ణిస్తూ అతడిని జైల్లో వేశారు. అయితే జైలుకు వెళ్లడం కూడా ఒక స్ట్రాటజీ అని యానీ అభిప్రాయపడింది. ఆ కోతిముఖానికి తినిపించడం అవసరమా?: పింకీ మానస్ జైల్లో ఉన్నందుకు ప్రియాంక సింగ్ ఆ జైలు దగ్గరే తచ్చాడింది. హమీదాకు తినిపించినందుకు బాగా హర్టయిన పింకీ.. నువ్వు జైల్లో ఉన్నావు కదా! మరి హమీదాకు ఎవరు తినిపిస్తారు? అని అడిగింది. అంతలోనే అందుకుంటూ ఆమెకు రెండు చేతులు బాగానే ఉన్నాయి కదా, అయినా మూడు పూటలా తినిపిస్తున్నాడు అని అక్కసు వెళ్లగక్కింది. తర్వాత మాత్రం తన జెలసీని పట్టించుకోవద్దని, అలా అని పూర్తిగా పట్టించుకోకుండా ఉండొద్దని సూచించింది. హమీదాకు తినిపిస్తుంటే ఆ కోతిముఖం దానికి అవసరమా? అన్నానని చెప్పింది. దీంతో మానస్.. ఆమె తనకు ఫ్రెండ్ అని, సిస్టర్ అనమంటే కూడా అంటానని అనడంతో సంతోషపడ్డ పింకీ.. వద్దులే, ఫ్రెండ్‌లానే ఉండమని చెప్పింది. అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు తెగేసి చెప్పింది. తప్పు హౌస్మేట్స్ది, శిక్ష కెప్టెన్‌కు! తర్వాత లోబో పట్టపగలే నిద్ర పోవడంతో కుక్కలు మొరిగాయి. దీంతో కెప్టెన్ జెస్సీ ఇంట్లోకి పరుగు తీసి లోబోను నిలదీయగా కానీ తాను నిద్రపోలేదని బుకాయించాడు. కెప్టెన్‌గా తన మాట ఎవరూ పట్టించుకోవట్లేదని ఫీలైన జెస్సీ.. ఇంట్లో చాలామంది తప్పులు చేస్తున్నారని, వారికి బదులుగా తాను శిక్ష తీసుకుంటానంటూ గుంజీలు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ ఇంట్లో సడన్‌గా పసిపాప ఏడుపులు, నవ్వులు వినిపించడంతో అందరూ షాకయ్యారు. ఎవరైనా వస్తున్నారా అని ఆతృతగా గేటు వంక చూశారు. కానీ బిగ్‌బాస్ మాత్రం ఓ బేబీ బొమ్మను పంపించాడు. పసిపాప నవ్వులు వినగానే చాలామంది వారి కన్నబిడ్డలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. భార్యను చూసి బోరుమని ఏడ్చిన నటరాజ్ ఇంతలో నటరాజ్ భార్య నీతూ సీమంతం వేడుకల వీడియోను చూపించాడు బిగ్‌బాస్. తన భార్యను చూడగానే నటరాజ్ మాస్టర్ కళ్ల వెంట నీళ్లు ధారలు కట్టాయి. 'నువ్వు రాత్రి మాట్లాడేటప్పుడు బేబీ కదిలేది కదా, ఇప్పుడు బిగ్‌బాస్‌లో నీ వాయిస్ విని నాతో డిష్యుం డిష్యుం చేస్తుంది. బేబీ బాగా కదులుతుంది. నా గురించి టెన్షన్ పడకు. సాధించే రావాలి. జాగ్రత్త' అని భార్య చెప్పిన మాటలు విని ఆయన భోరుమని ఏడ్చేశాడు. సిరి ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా షణ్నూ మాత్రం ఆమెను దూరం పెడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని కాజల్‌తో చెప్పుకుంటూ బాధపడింది సిరి. షణ్ముఖ్ తనతో ఫేక్‌గా ఉంటున్నాడని, మనస్ఫూర్తిగా లేడని వాపోయింది. జెస్సీతో డిస్కనెక్ట్ అయ్యానని తెలిపింది. మన మధ్య రిలేషన్ ఏంటి?: శ్రీరామ్ ఇక హమీదా, శ్రీరామ్ రాత్రిపూట కబుర్లాడారు. హమీదా ఏదో చెప్పడానికి ప్రయత్నించగా.. నీ మైండ్‌లో ఏముందో చెప్పేసెయ్ అన్నాడు శ్రీరామ్. నేను సన్నీని, మానస్‌ను, నిన్ను ఒకేలా చూడట్లేదని నొక్కి చెప్పింది. కొన్నిసార్లు నాకు అర్థం అవుతావు, కొన్నిసార్లు అర్థం కావని శ్రీరామ్‌ను చూసి బుంగమూతి పెట్టుకుంది. దీంతో శ్రీరామ్.. హమీదాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నీకు, మానస్‌కు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కానీ మనిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ కూడా కావచ్చు అని చెప్పాడు. మనిద్దరి రిలేషన్ క్వశ్చన్మార్క్లో ఉందని శ్రీరామ్ చెప్పడంతో ఫక్కున నవ్వేసింది హమీదా. మరి వీళ్ల మధ్య ఏ రిలేషన్ ఉందనేది ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి! -
'అమ్మ' కావడం కోసం లక్షలు పోశాను: ప్రియాంక సింగ్ కన్నీటి గాథ
అబ్బాయి- అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమకథలు చాలా విన్నాం. కానీ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ ఒక అబ్బాయిని మనసారా ఇష్టపడ్డ కథ వింటే కళ్లు చెమర్చక మానవు. తను ప్రేమించినవాడు ఛీ పొమ్మన్నా అతడు సంతోషంగా ఉంటే అదే చాలంటోంది పింకీ. బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె తన ఫస్ట్ లవ్ గురించి చెప్పిన విషాద గాథను చదివేయండి. 'ఒక ఫంక్షన్లో రవిని చూశాను. చూడటానికి చిన్నపిల్లాడిలా, అందంగా ఉంటాడు. అతడిని అబ్బాయి అని పిలిచేదాన్ని. పరిచయం అయిన తరువాత ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం.. నువ్వు అలా ఉండాలి, అందరితో కలవాలి.. అంటూ నాకు ధైర్యం చెప్పేవాడు. ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం.. దాదాపు ఆరేళ్లు రిలేషన్లో ఉన్నాం.. ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లాం. కానీ నా మనసులోని మాటను మాత్రం అతడికి ఎప్పుడూ చెప్పలేదు. తర్వాత మా సిస్టర్‌కి పెళ్లి అయ్యింది, నా ఇబ్బందులు కూడా క్లియర్ అయ్యాయి. అమ్మనాన్నల్ని నేను చూసుకోగలననే నమ్మకంతో నేను నా జెండర్‌ని ఛేంజ్ చేసుకున్నా.. ఆ తర్వాత అతడిని కలిసి నువ్వంటే నాకిష్టమని చెప్పేశా. దానికతడు నువ్వు బాగుంటావు, నీతో రిలేషన్లో ఉంటానన్నాడు. నాకు ఓ తోడు దొరికిందని సంబరపడిపోయా. (చదవండి: ‘లవ్‌స్టోరి’ మూవీ రివ్యూ) నేను పూర్తిగా అమ్మాయిగా మారాను కదా, నాకు నువ్వే ప్రపంచం, పెళ్లి చేసుకుందామా? అని అడిగాను. అతడు సరేనన్నాడు. కానీ ఒకరోజు మాత్రం ఇంటికి వచ్చి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, చేసుకుంటాను అని చెప్పాడు. నాతో పెళ్లికి ఓకే అన్నావు కదా అన్న విషయాన్ని గుర్తు చేస్తే నువ్వేమైనా అమ్మాయివా? నీకేమైనా పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావు? పెళ్లంటావేంటి? ఉన్ననాళ్లు ఉందాం. అంతేనని చిరాకు పడ్డాడు. నేను తట్టుకోలేకపోయాను. నాకూ అమ్మ కావాలని ఉంది, అందుకోసం చాలా ఆసుపత్రులు తిరిగి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. ఇలా సడన్‌గా వదిలేస్తే ఎలా? అని అతడి కాళ్లు పట్టుకుని ఏడ్చాను. అతడు వెళ్లిపోతుంటే ఆయన బండి వెనకాల పరిగెత్తాను, కానీ తన దారి తనే చూసుకున్నాడు. ఏదేమైనా అతడు హ్యాపీగా ఉంటే చాలు. అతడి సంతోషమే నాకు కావాలి. తర్వాత ఓ సారి నీతో మాట్లాడాలని ఉందంటూ అతడిని ఇంటికి రమ్మని మెసేజ్ చేశాను. 10 రోజుల నుంచి నిద్ర రావడం లేదు, అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు, షూటింగ్స్ కూడా చేయడం లేదు. ఫోన్ స్విచ్చాఫ్ చేశాను. నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు అన్నాను. దానికి అతడు నాకు పెళ్లి అని చెప్పాను కదా! మళ్లీ ఇదంతా ఏంటి? నువ్వెవరో తెలుసా? నువ్వెవరో తెలుసా? అంటూ అందరూ చిన్నప్పటినుంచి నన్ను ఏ మాట అని ఏడిపించారో అదే మాటను దాదాపు 200 సార్లు అన్నాడు. ఆ మాట అన్నిసార్లు నన్ను అని ఎవరూ బాధపెట్టలేదు. పర్లేదు, నువ్వే కదా అన్నావు! నువ్వు నన్ను ఇష్టపడకపోయినా నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నీకు ఏ కష్టం వచ్చినా ఈ పింకీ ఉంటుంది. ఐ లవ్ యూ ఫరెవర్, ఇంకెప్పుడూ నా లైఫ్‌లోకి రావొద్దు' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. -
బిగ్‌బాస్ 5 విజేత అతడే అంటున్న గూగుల్!
తెలుగులో బిగ్‌బాస్ ఐదో సీజన్ ఈ మధ్యే ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం 17 మంది ఉన్నారు. బిగ్‌బాస్ ఏ చిన్న టాస్క్ ఇచ్చినా నువ్వానేనా అన్న రీతిలో పర్ఫామ్ చేస్తున్నారు. టైటిల్ ఎలాగైనా సాధించి తీరాలని కసితో ఆడుతున్నారు. అయితే గూగుల్ మాత్రం అప్పుడే ఈ సీజన్ విజేతను ప్రకటించేసింది. షో మొదలై కేవలం రెండు వారాలే అవుతున్నప్పటికీ సింగర్ శ్రీరామచంద్ర విన్నర్ అని డిక్లేర్ చేసింది. ఇది బుల్లితెర ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తోంది. శ్రీరామ్ అభిమానులు మాత్రం గూగుల్ ఈ విషయాన్ని ముందే పసిగట్టేసింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. గూగుల్‌లో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరని టైప్ చేయగా అది శ్రీరామచంద్ర పేరును సూచిస్తోంది. శ్రీరామ్ ప్లేబ్యాక్ సింగర్, నటుడు అని, అంతేకాకుండా ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేత కూడా అంటూ అతడి వివరాలను సైతం చూపిస్తోంది. ఇక ఇదే గూగుల్‌లో బిగ్‌బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరని టైప్ చేయగా ప్రియాంక సింగ్‌ను విజేతగా చూపిస్తోంది. ఈ గూగుల్ తప్పిదాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. కాగా శ్రీరామచంద్రకు ప్రస్తుతం షోలో మంచి ఫుటేజీ దక్కుతోంది. హమీదాతో లవ్ ట్రాక్ నడుపుతుండటంతో కావాల్సినంత స్క్రీన్ స్పేస్ దొరుకుతోంది. అటు టాస్క్‌ల్లోనూ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. మరి గూగుల్ చెప్పినట్లుగా రానున్న రోజుల్లో శ్రీరామ్ లేదా ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ విజేతగా అవతరిస్తారో? లేదో? చూడాలి! View this post on Instagram A post shared by Bigg Boss Trollers 🔘 ➤(𝒴𝒶𝓈𝒽) (@biggboss.trollers) -
నేను ప్రేమించినవాడు చనిపోయాడు: సిరి బ్రేకప్ లవ్ స్టోరీ!
Bigg Boss Telugu 5 Promo: తొలి ప్రేమ ఎప్పుడూ మధురమే! అది సఫలమైనా, విఫలమైనా! తొలి ప్రేమ తాలూకు జ్ఞాపకాలను ఎప్పుడు గుర్తు చేసుకున్నా మనసులో ఏదో తెలీని అనుభూతికి లోనవుతుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా వారి తొలి ప్రేమను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో సింగర్ శ్రీరామచంద్ర తన ఫస్ట్ లవ్‌ను గుర్తు చేసుకుంటూ ఆమెకు ఇదివరకే పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారన్నాడు. దీప్తి సునయన కంటే ముందే తను ఒకరిని ప్రేమించానని ఓ సీక్రెట్ బయటపెట్టాడు షణ్ముఖ్. ఇక జెస్సీ తను ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమె సింగిల్ అయితే, తాను రెడీ టు మింగిల్ అని సిగ్నల్ ఇచ్చేశాడు. తనలో అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయని తెలిసింది తన ఫస్ట్ లవ్ వల్లేనంది శ్వేతవర్మ. ఇప్పుడు నేను మ్యారీడా? సెపరేటా? విడాకులయ్యాయా? అనేది నాకే తెలీదంటూ కుమిలిపోయింది ప్రియ. తను ప్రేమించినవాడు చనిపోయాడంటూ తన విషాద గాథ చెప్తూ కంటతడి పెట్టుకుంది సిరి. ఇక ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్.. తన ఫస్ట్ లవ్ గురించి చెప్తూ.. నేను ప్రేమించిన అబ్బాయి బండి వెళ్లిపోతుంటే ఆ బండి వెనక పరిగెత్తుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు అంటూ గుక్క పెట్టి ఏడ్చేసింది. మరి కంటెస్టెంట్ల ఫస్ట్ లవ్ స్టోరీల గురించి తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
బిగ్‌బాస్: మూడో వారం నామినేషన్స్‌లో ఐదుగురు!
Bigg Boss Telugu 5, 3rd Week Nominations: బిగ్‌బాస్ హౌస్‌లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా, నవ్వించినా, నవ్వులపాలైనా, ఏడ్చినా, ఒకరిని ఏడిపించినా, సేఫ్ గేమ్ ఆడినా, ఆడకపోయినా, ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా.. బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టాక ఎప్పుడో ఒకసారైనా ఈ గండం బారిన పడక తప్పదు. ఈ నామినేషన్స్ కంటెస్టెంట్ల బలాబలాలను నిరూపించడమే కాకుండా ప్రేక్షకులు ఎవరి వైపు నిలబడుతున్నారన్న విషయాన్ని కూడా సుస్పష్టం చేస్తాయి. 19 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకుంది. సరయు, ఉమాదేవి హౌస్‌ను వీడివెళ్లడంతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరింది. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు హౌస్‌లో నామినేషన్స్ జరిగాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక సింగ్, లహరి నామినేషన్స్‌లో ఉన్నారట! వీరిలో మానస్ మొదటి వారం, ప్రియ, ప్రియాంక సింగ్ రెండో వారం నామినేషన్లను ఎదుర్కొన్నారు. శ్రీరామచంద్ర, లహరి మాత్రం తొలిసారి నామినేషన్ జోన్లో అడుగు పెట్టారు. మరి వీరిలో ఎవరు బాగా ఆడి ఈ గండం నుంచి గట్టెక్కుతారు? ఎవరు హౌస్‌కు వీడ్కోలు పలుకుతారు? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. -
బిగ్‌బాస్ : ప్రియాంక సింగ్‌కు కన్నడ నటి మద్దతు
Sanjana Galrani Support To Bigg Boss 5 Contestant Priyanka Singh: బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-5 అదరగొడుతుంది. అప్పుడే హౌస్‌లో అలకలు, గ్రూపు రాజకీయాలు, లవ్ యాంగిల్స్ మొదలైన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్న కంటెస్టెంట్లు టాస్కుల విషయానికి వచ్చే సరికి ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తిట్టుకుంటూ హౌస్‌ను హీటెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్‌మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ట్రాన్స్ జెండర్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఇంటా, బయటా మంచి మార్కులే కొట్టేస్తుంది. ఇప్పటికే ఆమెకు ప్రేక్షకుల నుంచి భారీగానే మద్దతు లభిస్తోంది. ఇటీవలె నటుడు నాగబాబు సైతం ప్రియాంకకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. హౌస్‌లో తనకు తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నా, తన పూర్తి సపోర్ట్ మాత్రం ప్రియాంకకే అని ఇదివరకే ఆయన ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజన గల్రానీ సైతం ప్రియాంకకు తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఎప్పుడూ అబ్బాయిలు లేదా అమ్మాయిలే షోలో గెలుస్తారు. కానీ ఈసారి ఒక మార్పు తీసుకొద్దాం. ట్రాన్స్‌జెండర్స్ ఎప్పుడూ వాళ్ల జీవితం కోసం ప్రతిరోజు పోరాడుతూనే ఉంటారు. వాళ్ల మీద ఎప్పుడూ నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందుకే ప్రియాంక సింగ్ కోసం ప్రేమగా ఈ వీడియో చేస్తున్నాను. ఆమెకు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించండి' అంటూ సంజన ఇన్స్టాగ్రామ్ వేదికగా పిలుపునిచ్చింది. కన్నడ నటి అయినప్పటికీ ఒక తెలుగు షో గురించి మాట్లాడటమే కాకుండా, ఓ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుండటంపై పింకీ(ప్రియాంక సింగ్)ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తొలి వారం సరయూ ఎలిమినేట్ కాగా ఈవారం ఉమాదేవి, కాజల్, ప్రియ,నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబోలతో పాటు ప్రియాంక సింగ్‌లు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఇప్పటికే లోబో, ప్రియాంక సింగ్, ప్రియలు సేఫ్ జోన్లో ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. మరి వీరిలో ఈవారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారన్నది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. చదవండి : ఉమాపై గెలుపు, ఏడుస్తూనే ట్విస్ట్ ఇచ్చిన లోబో! టీఆర్పీ రేటింగ్‌లో సత్తా చూపిన బిగ్‌బాస్ 5, కానీ.. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
దమ్ముంటే రండంటూ ఉమ సవాలు, పోవే అంటూ ఛీ కొట్టిన పింకీ!
Bigg Boss Telugu 5, Second Week Nominations: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో రెండో వారం నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఎలిమినేషన్‌కు దారులు వేసే నామినేషన్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం? అందుకే తమను నామినేట్ చేసిన వారి మీదా, నామినేట్ చేయాలనుకునేవారి మీదా విరుచుకుపడుతున్నారు హౌస్మేట్స్. ఈ మేరకు తాజాగా మరో ప్రోమో రిలీజైంది. ఇందులో మానస్.. లోబోను నామినేట్ చేశాడు. దీన్ని సహించలేని లోబో.. నామినేట్ చేయడానికి సరైన కారణాలు చెప్పాలని హితవు పలకాడు. నువ్వు హీరో అనుకుంటున్నావు, వినడానికి కూడా రెడీగా లేవని మానస్ మీద మండిపడ్డాడు. తర్వాత కాజల్ వంతు రాగా.. గ్రూప్స్‌లో చాలామంది ఫేక్‌గా ఆడుతున్నారని అభిప్రాయపడింది. అనంతరం విశ్వను నామినేట్ చేసింది. నీ మెచ్యూరిటీ నచ్చిందంటూ శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు యాంకర్ రవి. ఇక నటి ప్రియ.. సన్నీ, నటరాజ్ మాస్టర్లను నామినేట్ చేసింది. తర్వాత ఉమాదేవి వంతురాగా.. 'దమ్ము, ధైర్యం, బుద్ధిబలం, సత్తా ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి' అని సవాలు విసిరింది. దీంతో చిర్రెత్తిన ప్రియాంక సింగ్.. పోవే ఉమా పో.. అంటూ మరోసారి నోరు జారింది. ప్రోమో చూస్తుంటే యానీ మాస్టర్, పింకీ, ఉమాదేవి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తోంది. మరి వీరి మధ్య అగ్గి రాజుకున్న గొడవ చల్లారిందా? ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
బిగ్‌బాస్: లీకైన రెండో వారం నామినేషన్ లిస్ట్!
Bigg Boss Telugu 5, Second Week Nominations: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో డేరింగ్ అండ్ డాషింగ్ కంటెస్టెంట్ సరయూ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు హౌస్‌లో 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా ఉన్నదున్నట్లు ముఖం మీదే మాట్లాడే సరయూ ఎలిమినేషన్‌తో ఇతర కంటెస్టెంట్లలో కదలిక మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంకా సైలెంట్‌గా ఓ మూలన కూర్చుంటే తొక్కేస్తారనుకుందో ఏమో కానీ శ్వేత వర్మ నేటి నామినేషన్స్‌లో విరుచుకుపడింది. దీంతో శ్వేతలో ఈ యాంగిల్ ఇంతవరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి బిగ్‌బాస్ పెట్టిన నామినేషన్ మంట హౌస్‌లో బాగానే రగులుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే ఈవారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, లోబో, ప్రియ, ఉమాదేవి, ప్రియాంక సింగ్ నామినేషన్ జోన్లోకి వచ్చారని లీకువీరులు దండోరా వేసి మరీ చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో కాజల్ మినహా అందరూ కొత్తగా నామినేషన్లోకి ఎంటరైనవారే. మరి ఈసారి నిజంగానే ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండబోతున్నారా? లేదా ఈ లిస్టులో ఏమైనా మార్పులు చోటు చేసుకోనున్నాయా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!